టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనంపై దోబూచులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పిన విషయం తెలిసిందే. విలీనానికి సంబంధించి కెసిఆర్ ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆ పార్టీకి చెందిన కెటిఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. విలీనం విషయంలో కెసిఆర్ మాటతప్పితే తగిన బుద్దిచెప్పేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహం పన్నుతోంది. పలు ఆలోచనలు చేస్తోంది. 1. విలీనం కాకుంటే ఎన్నికలను ఆలస్యం చేయడం - 2. టిఆర్ఎస్ నుంచి వలసలు ప్రోత్సహించడం - 3. రాష్ట్రపతి పాలన రద్దు చేసి తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం. 4. కెసిఆర్ను ఒంటరిని చేయడం.....ఈ విధంగా తెరవెనుక పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది.