దేశాన్ని కుదిపేస్తున్న కొత్త కరెన్సీ కథ కొంతమందికి ముందే తెలిసిందా? పై స్థాయి రాజకీయ, వ్యాపారవర్గాలకు అది ముందుగానే లీక్ అయిందా? కొత్త రూకల వ్యవహారం రాజకోట రహస్యమనీ, అది మూడో కంటికి తెలియదనీ, అలా తెలియకూడదనే ఆకస్మిక నిర్ణయం ప్రకటించామనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నా వాస్తవ'చిత్రం' మాత్రం దానికి భిన్నంగా ఉంది. బ్లాక్ మనీపై 'సర్జికల్ స్ట్రైక్' గా అంతా అభివర్ణించిన ఈ చర్య సామాన్యుల పాలిట పిడుగుపాటుగా పరిణమించగా, నల్లబాబులు మాత్రం ముందుగానే ఇల్లు చక్కబెట్టుకున్నారేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.