రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం పైడిపాలెం రిజర్వాయర్‌ను రైతులతో కలిసి వైఎస్‌ఆర్‌కు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ 90శాతం పనులను వైఎస్‌ఆరే పూర్తి చేశారన్నారు. కేవలం రూ.24 కోట్లు ఖర్చు చేసి... అంతా తామే చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరు ఎత్తితేనే రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్‌ఆర్ గుర్తుకు రావడం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.