దేవరకద్ర పాలసెంటర్ సమీపంలో సర్పంచ్ అభ్యర్థి భర్తను గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కాల్చిచంపారు. ధర్మవరం మండలం చిన్నచింతకుంట సర్పంచి అభ్యర్థి భర్త జగన్ హత్య వెనుక జడ్చర్ల టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హస్తం ఉందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎర్ర శేఖర్ భార్య చిన్నచింతకుంట సర్పించిగా పోటీచేస్తున్నారు. ఎర్రశేఖర్ భార్యపై జగన్ భార్య పోటీకి దిగారు. నామినేషన్ ఉపసంహరించుకోమని కొన్నిరోజులుగా వారు జగన్‌పై ఒత్తిడి తెస్తున్నారని బంధువులు తెలిపారు. లేకుంటే చంపుతామని ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బెదిరించారని వారు చెప్పారు.