అమర వీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, మావోయిస్టు మాజీనేత గంటి ప్రసాదంపై దాడి జరిగింది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు వచ్చిన ఆయనపై గురువారం హత్యాయత్నం చేశారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముందుగా మూడు రౌండ్లతో కాల్పులు జరిపి అనంతరం వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన గంటి ప్రసాదం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఒంగోలులో ఎస్పీ లడ్హాపై దాడి ఘటనలో గంటి ప్రసాదం హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులే ఈ దాడికి పాల్పడి ఉంటారని విరసం నేత వరవరరావు ఆరోపించారు.