కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ‘ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్)-2016’ వివరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎలా తెలిశాయి? ఈ వివరాలు బయటకు పొక్కవని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో నిగూఢమైన ఈ అంశాలు తనకు తెలిసినట్లు చంద్రబాబు ఎలా చెప్పగలుగుతున్నారు? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రహస్యమైన ఆ సమాచారం కచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే... ఆ ఆదాయాన్ని ప్రకటించిన వ్యక్తి చంద్రబాబుకు బినామీ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజా ప్రయోజనాల రీత్యా ఐడీఎస్ వివరాల జాబితాను ప్రజల ముందుంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిమాండ్ చేశారు. అంతేకాక కొంతకాలం క్రితం చంద్రబాబు అవినీతిపై సాక్ష్యాలతో సహా తాము సమర్పించిన పుస్తకంలోని అంశాలపై విచారణ జరిపించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక లేఖను రాశారు. లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.