తొలిరోజు మినహా ఆ తరువాత పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు..ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టుల్లో ఘన విజయాన్ని అందుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ గా నిష్క్రమించనప్పటికీ మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(67 నాటౌట్;54 బంతుల్లో11 ఫోర్లు,1 సిక్స్) రాణించడంతో భారత్ 20.2 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. దాంతో సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.