రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయనం నేపథ్యంలో రవీంద్రనాథ్ అధ్యక్షతన ఏపీలోని 13 జిల్లాలో కమిటీ పర్యటిస్తుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందివ్వనుంది. కాగా, ఆ నివేదికలోనే రాజధాని అంశం కూడా ఇమిడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని పేరుతో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటామని తెలిపారు.