రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఐదేళ్లు చంద్రబాబు నాయుడుకి సమయం ఇచ్చినా ఉపయోగించుకోలేపోయారని వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ విమర్శించారు. శాసనమండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆమె ప్రసంగించారు. మండలిపై చంద్రబాబు తొలినుంచి రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే చంద్రబాబుకు శాసనమండలి బంగారుబాతులా కనిపించిందని, కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.