న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ విజయం సాధించిన తర్వాత జట్టు తరుఫున పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఖలీల్.. పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చే సమయంలో ఆందోళనకు గురయ్యాడు. ఈ క‍్రమంలోనే కోహ్లి గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఖలీల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అది చాలా సింపుల్ ప‍్రశ్న అయినప్పటికీ ఖలీల్ మాత్రం ఏమి చెబితే ఏమి అవుతుందో అనే సందిగ్ధంలో తటపటాయించాడు. ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ‘ మీరు(జట్టు సభ్యులు) విరాట్ కోహ్లిని మిస్సవుతున్నారా’ అని అడగ్గా ఖలీల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అందుకు సమాధానం పూర్తిగా ఇవ్వకుండానే ‘నెక్స్ క్వశ్చన్ ప్లీజ్’ అంటూ అడగడం ఖలీల్ తడబాటుకు అద్దం పడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.