Cost
-
వలసదారుల విమానాలకు అంత ఖర్చా..?
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు తిప్పి పంపుతున్నారు. ఈ విమాన ప్రయాణాల కోసం అమెరికా భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.పౌర విమానాల్లో కాకుండా వలసదారులను అమెరికా ప్రత్యేక సైనిక విమానాల్లో తరలిస్తుండటంతోనే ఎక్కువగా ఖర్చవుతోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరింది. ఈ విమాన ఖర్చు గంటకు కొన్ని వేల డాలర్లని అమెరికా అధికారులు చెబుతున్నారు.వలసదారులను వెనక్కి పంపే కేంద్ర ప్రభుత్వ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.అయితే భారత్ విషయంలో మాత్రం అమెరికాకు ఇదే తొలి అడుగు.వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఔరా! ఆ పుట్టగొడుగు.. ఐదు లక్షలట!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అన్ని రంగాలతో పాటు ఆహార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా విభిన్న రకాల ఆహారానికీ నగరం కేంద్రంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నూతనంగా ప్రారంభమైన ఫుడ్‌స్టోరీస్ వేదికగా అక్షరాల రూ.5 లక్షల విలువ చేసే పుట్టగొడుగు (మష్రూమ్) అందరినీ ఔరా అనిపిస్తోంది. కాంటినెంటల్ ఫుడ్‌తో విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలకు నెలవైన నగరంలో మొట్టమొదటి సారి ఈ రిషీ మష్రూమ్ సందడి చేస్తోంది. పారిస్‌కు చెందిన ఆర్కిటెక్చరల్ ఏజెన్సీ మల్హెర్బే ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ ఫుడ్‌స్టోరీస్ దేశంలో రెండోది కావడం విశేషం. ఈ ఫుడ్‌స్టోరీస్ వేదికగా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన డియోర్, మోయెట్–హెన్నెస్సీ, పారిస్ ఏరోపోర్ట్, గివెన్చీ వంటి బ్రాండ్లు సందడి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లగ్జరీ జపనీస్ చాక్లెట్లు, గ్లోబల్ ప్యాంట్రీ, చీస్, మాంసాహార ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. ఫుడ్‌స్టోరీస్ కిచెన్ స్టూడియో ఫుడ్ లవర్స్‌ను అలరిస్తోందని సహ వ్యవస్థాపకురాలు అష్ని బియానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 వేలకు పైగా అత్యుత్తమ పదార్థాలను 4 గంటల్లోపు ఇంటికే డెలివరీ చేసే సేవలు ప్రారంభించామన్నారు. ఇదీ చదవండి: అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ -
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్‌పోర్ట్‌లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్‌గా కంఫర్టబుల్‌గా చిక్ స్టైల్‌తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్‌కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్‌ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్‌ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్‌లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్‌లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే. -
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్‌ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్‌తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
ఏడాదిలో 1,895 మందికి లేఆఫ్స్!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. ఏడాదిలో శాశ్వత ఉద్యోగుల్లో 716 మంది పురుషులు, 618 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించింది. నాన్ పర్మినెంట్ సిబ్బంది విభాగంలో 531 మంది పురుషులు, 30 మంది మహిళలకు లేఆఫ్స్ ప్రకటించింది. నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఖర్చులను సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.వేతన మార్పులుపర్మినెంట్ ఉద్యోగుల్లో 74% మంది పురుషులు కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు కంపెనీ గుర్తించింది. ఇది గతంలో 61%గా ఉండేది. ఈ కేటగిరీలోని మహిళలు 37% నుంచి 56%కి పెరిగారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగుల్లో కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదించే పురుషులు 1 శాతం నుంచి 8 శాతానికి, మహిళలు 2 శాతం నుంచి 16 శాతానికి పెరిగారని సంస్థ పేర్కొంది.ఖర్చు తగ్గింపు: ఉద్యోగాల్లో కోతలు, వారికి అందించే ప్రయోజనాలు తగ్గించుకోవడం ద్వారా ఖర్చులు 9% తగ్గి రూ.770.44 కోట్లకు చేరుకున్నాయి.ఛైర్మన్ వేతనం: కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సగటు ఉద్యోగి వేతనం కంటే 211 రెట్లు అధికంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర అలవెన్స్‌ల రూపంలో ఆయన రూ.5.4 కోట్లు అందుకున్నారు.ఆర్థిక పనితీరుకంపెనీ మొత్తం ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం క్షీణించి రూ.8496.96 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న మొత్తం విమానాల సంఖ్య 76గా ఉండేది. ఇది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 65కు తగ్గింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 60 విమానాలను నడుపుతుండగా, బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని విమానాలు నిలిచిపోయాయి.ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!నిధుల సమీకరణక్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా ఇటీవల కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. వీటితో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, టీడీఎస్ బకాయిలను చెల్లించి కీలక సెటిల్మెంట్లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. స్పైస్ జెట్ 2026 నాటికి 100 విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా..? ధరలు.. ఏ ఏరియాలో ఎంత?
సాక్షి, సిటీబ్యూరో: స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్మెంట్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది.కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. కరోనా తర్వాత విశాలమైన అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చ.అ.కు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,500 ఖర్చవుతోంది. భవనం ఎత్తును బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతూంటుంది.నోట్: అపార్ట్మెంట్ విస్తీర్ణం, వసతులు, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి విన్నారా..?. ఈ ఫ్యాబ్రిక్ ఒక మీటర్ ఖరీదే దాదాపు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. ఇది మార్కెట్లో దొరకడం కూడా కష్టమే. ఖరీదు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. ఏంటి ఈ ప్యాబ్రిక్ విశిష్టత..?. ఎందుకంత ఖరీదు అంటే..ఈ ఫ్యాబ్రిక్ ఉన్నిని దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో ఉండే వికునా అనే ఒక విధమైన ఒంటె నుంచి సేకరిస్తారట. అందువల్లే ఈ ఫ్యాబ్రిక్‌ని వికునా అని పిలుస్తారు. దీనితో టానీ అనే కోటులు డిజైన్ చేస్తారట. ఏదో గొర్రెల మాదిరి పెంపుడు జంతువుగా ఈ ఒంటెలను పెంచడం సాధ్యం కాదట. అలాగే ఈ ఒంటె నుంచి ఉన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సేకరించగలరట.అలాగే ఇవి తక్కువ ఉన్నినే ఉత్పత్తి చేస్తాయట. ఆండియాన్ ఎత్తైన పర్వతాల్లో ఉండే చలి నుంచి రక్షణగా ఆ ఒంటెలపై ఈ మృదువైన ఉన్ని ఉంటుందట. ఇది గాలిని ఏ మాత్రం చొరబడనీయకుండా శరీరానికి హత్తుకుపోయేల వెచ్చగా ఉంచుతుందట. అలాగే వికునాల నుంచి ఉన్నిని సేకరించడానికి చాలా సమయం పడుతుందట కూడా. అత్యంత జాగ్రత్తలు తీసుకుని చాలా ఓపికతో ఆ జంతువు నుంచి ఉన్నిని సేకరించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఎవరు ధరిస్తారంటే..రాయల్టీకి చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్‌ని ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు ధరిస్తారు. అయితే ప్రస్తుతం స్పానిష్ ఆక్రమణతో ఈ జంతువుల అంతరించిపోయే జంతువులు జాబితాలో చేరిపోయిందని చెబుతున్నారు ప్యాషన్ నిపుణులు. అదీగాక ఈ జంతువుల పెంపకం సాధ్యం కానీ పని అయితే వాటి నుంచి ఉన్నిని సేకరించడం అనేది కూడా అత్యంత క్లిష్టమైన పని అందువల్లే ఈ ఉన్ని ఒక మీటరు ముక్క ధర సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందని చెబుతున్నారు ఫ్యాషన్ ఔత్సాహికులు.ఇప్పటి వరకు అత్యం లగ్జరియస్ ఫ్యాబ్రిక్‌లు అయిన మెరినో, కష్మెరె వంటి ఉన్ని దుస్తులు కంటే ఇదే అత్యంత ఖరీదైనది. అయితే మెరినో, కష్మెరె వంటివి అందుబాటులో ఉన్నంత ఈజీగా ఈ వికునా ఫ్యాబ్రిక్ ఉన్ని దొరకడం బహు కష్టం. ఈ ఉన్నితో చేసిన కోటు ధర రూ. 17 లక్షలకు పైనే ఉంటుందట. లోరో పియానా, బ్రియోని, కిటాన్తో సహా పలు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ హౌస్‌ల్లో ఈ వికునా కలెక్షన్స్ ఉంటాయట.(చదవండి: మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!) -
ఏం ఉందబ్బా హ్యాండ్‌బ్యాగ్ డిజైన్..! అచ్చం ఆకుకూరలా..
ఎన్నో రకాల బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగ్‌లు చూసుంటారు. అందాల భామలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించే అత్యంత లగ్జరియస్ బ్యాగ్‌లను ఎన్నో రకాలు చూశాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా అత్యంత వెరైటీ బ్యాగ్‌ని రూపొందించింది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ మోస్చినో. ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్లు అత్యంత హాస్యస్పదమైన రీతిలో బ్యాగ్‌లు డిజైన్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఈ లగ్జరీ బ్రాండ్ మోస్చినో కూడా చేరిపోయిందా అనిపిస్తుంది ఈ బ్యాగ్ డిజైన్ చూస్తే..ఎలా ఉందంటే..మోస్చినో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ హ్యండ్ బ్యాగ్ అచ్చం కొత్తిమీర కట్టలా కనిపిస్తుంది. అలా రూపొందించాలనే క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అచ్చం ఆకుకూర మాదిరిగా చక్కగా డిజైన్ చేశారు. ఇది డిజిటల్ ప్రింట్‌తో కూడిన కొత్తిమీర ఆకృతిలో ఉన్న పర్సు. ఇది త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్‌తో కనిపిస్తుంది. ఆ పర్సుపై కనిపించే ఆకులు కూడా సహజత్వం ఉట్టిపడేలా చాలా అద్భతంగా డిజైన్ చేశారు. దీని ధర వింటే మాత్రం అంత ఖరీదు అవసరమా అనే ఫీల్ తప్పక వస్తుంది. కొత్తిమీర ఆకృతిలో ఉన్న ఈ హ్యండ్‌బ్యాగ్ ధర అక్షరాల రూ. 3 లక్షలు పైనే ఉంటుందట. హైరేంజ్ ఫ్యాషన్ అంటే ఇదేనేమో. ఏం బ్రాండ్‌లో ఏమో..! క్రియేటివిటీలో మేటర్ నిల్ ధరలు మాత్రం వామ్మో.. అనేలా ఉన్నాయి కదూ..!.(చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
‘నా ఉద్యోగం పోయింది, పీడా పోయింది’ : మహిళా టెకీ ఆనందం
దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారయ్యాయి ఉద్యోగుల జీవితాలు. ఎపుడు, ఎందుకు, ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ముఖ్యంగా సంక్షోభంలో చిక్కుకున్న ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఇక మహిళా ఉద్యోగుల పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. కానీ ఒక మహిళా టెకీ మాత్రం ఆ తొక్కలో ఉద్యోగం పోతే పోయింది అంటోంది. ఏడాదికి రూ. 76 లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోయినా చాలా సంతోషంగా ఉన్నా అంటోంది 24 ఏళ్ల యాక్చురియల్ అనలిస్ట్ . స్టోరీ ఏంటంటే..!మనీ కంట్రోల్ కథనం ప్రకారం చికాగోలోని డెలాయిట్ కంపెనీలో అననిష్ట్గా పనిచేది సియెర్రా డెస్మరాట్టి. ఏడాది రూ. 76 లక్షల వేతనంతో 2022లో ఉద్యోగంలో చేరింది. అయితే ఐటీ రంగ సంక్షోభం,కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. మామూలుగా అయితే నా ఉద్యోగం పోయింది అని అందరం డీలా పడిపోదాం, ఏడ్చి గగ్గోలు పెడతాం కదా, కానీ సియెర్రా మాత్రం ఎగిరి గంతేసిందట. దాదాపు సంవత్సరం కాలం తరువాత ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. జీవితంలో ఏం జరిగినా మన మంచికే అను సానుకూల ధోరణే తన సంతోషానికి కారణమని చెప్పుకొచ్చింది. జీవితంలో తనకేదైనా మంచి జరిగిందంటే, అది ఉద్యోగం పోవడమేనని తెలిపింది. ‘‘రోజంతా కుర్చీలో కూర్చొని కూర్చొని వెన్నునొప్పి వచ్చింది. తొమ్మిది కిలోల బరువు పెరిగా, పొట్టి బట్టలేసుకుని తోటి ఉద్యోగుల ముందు నడవం నా వల్ల కాలే...’’ అంటూ తన ఇబ్బందులను ఏకరువు పెట్టింది. 11 గంటల పనితో, మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురయ్యానని పేర్కొంది. రూ. 76 లక్షల జీతం గురించి కూడా ఆమె పెద్దగా బెంగపడలేదు. జీతమే జీవితంకాదు. పొద్దుపు చేసిన డబ్బుతో కొన్నాళ్లు గడిపి, తరువాత ట్రాన్స్‌అమెరికాకు చెందిన కంపెనీలో యాక్చురియల్ అనలిస్ట్‌గా రిమోట్ ఉద్యోగాన్ని సాధించి ఇపుడు నేను చాలా హ్యాపీ అంటోంది సియెర్రా. కొత్త ఉద్యోగం పాతదిలాగే ఉన్నప్పటికీ పని సంస్కృతి చాలా భిన్నంగా ఉందట. కొత్త వర్క్‌ప్లేస్‌లోని ఉన్నతాధికారులు డ్యూటీ ముగియగానే ఆఫీసు నుంచి వెళ్లిపోవచ్చంటారట. దీంతో తనకు కొంత సమయం మిగిలుతోందని చెప్పింది ఆనందంగా.సో..అదన్నమాట..! పోయినదాని గురించి బాధపడుతూ కూచుంటే ప్రయోజనం ఉండదు. ఇదీ మన మంచికే అనుకొని మరో కొత్త అవకాశాన్ని వెదుక్కోవడమే. మనసుంటే మార్గం ఉంటుంది.. కాదు కాదు.. టాలెంట్ ఉంటే కొలువు వెతుక్కుంటూ వస్తుంది!ఇదీ చదవండి: కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి! -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!
పురుగే కదా అని తీసిపారేయ్యకండి. ఎందుకంటే..? కొన్ని పురుగులు మనం ఊహించనంత ఖరీదైనవిగా కూడా ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ కీటకం. ఈ పురుగు ధర వింటే నోరెళ్లబెడతారు. అంత ధర ఎందుకంటే..?ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో 'స్టాగ్ బీటిల్' ఒకటి. ఒక స్టాగ్ బీటిల్ విలువ ఏకంగా రూ. 75 లక్షలు. ఎందుకుంటే దీన్ని అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారట. ఈ కీటకాన్ని ఉంచుకుంటే ఒక్క రోజులనే లక్షాధికారి అవుతారని నమ్ముతారట. ఈ కీటకాలు చెక్కలపై ఆధారపడి జీవించే జీవి. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్ ఆధారిత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం.. ఈ కీటకాలు 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. సగటు జీవితకాలం 3 నుంచి 7 ఏళ్లు. మగవారి పొడవు 35 నుంచి 75 మిమీ అయితే, ఆడవారు 30 నుంచి 50 మిమీ పొడవు. వీటిని ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు.అవి ఎక్కడ ఉంటాయంటే?స్టాగ్ బీటిల్స్ వెచ్చని, ఉష్ణమండల వాతావరణంలో వృద్ధి చెందుతాయి. చల్లని ఉష్ణోగ్రతలు వీటికి పడదు. ఇవి సహజంగా అడవులలో నివసిస్తాయి. ఎక్కువగా ముళ్లపొదలు, సాంప్రదాయ తోటలు, పార్కులు, తోటలు వంటి పట్టణ ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. ఇవి చనిపోయిన వృక్ష కలపను ఆవాసంగా చేసుకుని జీవిస్తాయి. ఏమి తింటాయంటే..?అడల్ట్ స్టాగ్ బీటిల్స్ ప్రధానంగా చెట్ల సాప్ ద్రవాన్ని, కుళ్ళిన పండ్ల నుండి వచ్చే రసం వంటి తీపి ద్రవాలను తింటాయి. లార్వాదశలో ఇవి తీసుకొన్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. కేవలం చనిపోయిన మొక్కల కలపనే తింటాయి. అయితే చక్కటి వృక్ష సంపదకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకొంటాయి.(చదవండి: మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!) -
బొమ్మరిల్లు ముద్దుగుమ్మ జెనిలియా డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు ‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్ ఎంతమంది అబ్బాయిల మైండ్స్‌లో నాటుకుపోయిందో! ‘బొమ్మరిల్లు’లో అలా అడిగిన హ..హ..హాసిని.. జెనీలియా కూడా ఎంతమంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిందో! ఇప్పటికీ ఆమె పట్ల అదే క్రేజ్ చిన్న నుంచి పెద్ద వరకు. ఆమె గ్లామర్‌కీ అదే గ్రేస్..ఆడవాళ్లకు మెరిసే ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు. నా దృష్టిలో ఆడవాళ్ల జ్యూలరీలో ముక్కుపుడకను మించింది లేదు. అలాగే చీరకట్టును బీట్ చేసే ట్రెడిషనల్ వేర్ లేదు! అని అంటోంది జెనీలియా. ఇక ఆమె ట్రెడిషనల్ వేర్లో అయినా.. మోడర్న్ డ్రెస్‌లో అయినా! దేన్నయినా ఫ్యాషన్‌గా మలచుకోగల స్టయిల్ జెనీలియాది!. ఆ స్టయిల్ కోసం జెనీలియా ఈ బ్రాండ్స్‌నీ కన్సిడర్ చేస్తుంది. ఒసా బై ఆదర్శ్ వెడ్డింగ్ కలెక్షన్స్‌కి కేరాఫ్ ఇది. దీని స్థాపకుడు ఆదర్శ్ మఖ్రియా. దేశంలోని సంప్రదాయ వస్త్రరీతులన్నిటికీ తన బ్రాండ్‌ని పడుగు.. పేకలుగా మార్చాడు. ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్‌లతో పెళ్లి వస్త్రాలకు కొత్త కళను అద్దుతాడు. అందుకే ఈ డిజైన్స్‌కి డిమాండ్ ఎక్కువ. కోల్‌కతా, ఢిల్లీల్లో స్టోర్స్ ఉన్నాయి. మల్టీడిజైనర్ స్టోర్స్‌లోనూ ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. ధర మాత్రం సామాన్యులకు అందేలా ఉండదు. .జెనిలియా ధరించిన ఒసా బై ఆదర్శ్ డ్రెస్ ధర రూ. 1,77,555 నారాయణ్ జ్యూలర్స్ 80 ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ ఇది. సంప్రదాయ నగలు.. ఆధునిక ఆభరణాలు.. రెండిటికీ పెట్టింది పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజీలేని నాణ్యత.. కల్తీకాని నమ్మకానికి పర్యాయపదం ఈ జ్యూలర్స్. ధర.. ఆభరణాల డిజైన్, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ద పింక్ పోట్లీ ఇది ముంబై బ్రాండ్. హ్యాండీ క్రాఫ్ట్స్ బ్యాగ్స్, పోట్లీలు, బట్వాలకు ప్రసిద్ధి. దీపా, ప్రణతి అనే తల్లీకూతుళ్ల ఆవిష్కార ఈ పింక్ పోట్లీ. ప్రొడక్షన్ విషయాలు దీపా చూసుకుంటే బ్రాండింగ్, మార్కెటింగ్, బిజినెస్ వ్యవహారాలు ప్రణతి చూసుకుంటుంది. ఆలియా భట్, కరీనా కపూర్, సోనం కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలెందరో దీనికి హాట్ ఫేవరేట్స్. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. జ్యూలరీ బ్రాండ్: నారాయణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే..!) -
తన ప్రత్యేకత సిల్వర్ స్క్రీనే కాదు.. ఇన్‌స్టా ప్యాషన్ కూడా..
ప్రియంకా మోహన్.. నటించబోయే నెక్స్›్ట మూవీ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో.. సోషల్ మీడియాలో ఆమె నెక్స్›్ట ఫొటో కోసమూ అంతేమంది వేచి చూస్తుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు స్టోరీస్ సెలెక్షన్లో ప్రియంకా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో! సిల్వర్ స్క్రీన్ కథే కాదు.. ఇన్‌స్టాలోని ఫ్యాషన్ స్టోరీనూ! ఆ స్టోరీ టెల్లింగ్‌లో ఈ బ్రాండ్స్ కూడా పార్ట్‌నర్సే! అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్‌కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆ క్రేజే ఈ బ్రాండ్‌ను సెలబ్రిటీలకూ దగ్గర చేస్తోంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే వీలుంది. దేవ్నాగరి.. అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమ్మమ్మ స్ఫూర్తితో చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర బ్రాండ్: దేవ్నాగరి, రూ. 57,000 జ్యూలరీ బ్రాండ్: అకోయ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవి చదవండి: Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా! -
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్‌కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్‌నాథ్, సోనాలి, ఎఫ్‌ఎఫ్‌జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
'హలో' మూవీ భామ చీర ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!
దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్గా రాణిస్తోంది. నటిగా గుర్తింపులో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు.. ఆమె అభినయం తోడవుతుంటే.. హీరోయిన్గా రాణించడానికి మాత్రం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ అండ్ స్టయిలే హెల్ప్ అవుతున్నాయి. అలా హెల్ప్ అవుతున్న బ్రాండ్స్‌లో కొన్నిటి గురించి.. దీప్తి.. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రాయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్ ను బట్టే ధరలు ఉంటాయి.. వేల నుంచి లక్షల్లో! ఆన్ లైన్ లోనూ లభ్యం. కళ్యాణ్ జ్యూలర్స్.. టాప్–100 విలాసవంతమైన బ్రాండ్స్‌లో కల్యాణ్ జ్యూలర్స్ ఒకటి. 1908లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో మొత్తం 150 బ్రాంచ్‌లున్నాయి. సరికొత్త డిజైన్సే దీని బ్రాండ్ వాల్యూ అయితే కొనుగోలుదారుల నమ్మకం ఈ బ్రాండ్‌కి యాడెడ్ వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: కల్యాణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర డిజైనర్: దీప్తి (రూ.52,800) కంఫర్ట్ జోన్లో గ్రోత్ ఉండదు. గ్రోత్ జోన్లో కంఫర్ట్ ఉండదు. నేను ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. అందుకే అప్పుడప్పుడు.. ఎంచుకునే పాత్రల్లో, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేస్తుంటా! – కల్యాణీ ప్రియదర్శన్. ఇవి చదవండి: హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్! -
అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ...
భూమిమీద బతికే మనిషికి అన్నీ సమస్యలే... ఇంటి రెంట్ మొదలుకొని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్లో బతకడం అంటూ తేల్చిపారేస్తున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు. క్రూయిజ్ షిప్లో నివసించడం అంటూ మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. క్రూయిజ్ షిప్లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు. రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్‌లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు..‘ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని క్రెడిట్ కార్టు మా దగ్గర ఉన్నాయి. ఇకపై మేము ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, యుటిలిటీ బిల్లులు... ఇలా పెద్ద జాబితాను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ దంపతులు పేర్కొన్నారు. ఈ దంపతులు త్వరలో రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు. దానిలో వారు క్యాబిన్‌ను కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ‘విల్లా వీ’ని ఎంచుకున్నారు. ఇది శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్‌లలో ఒకటి. దీనిలోని ప్రయాణికులలో 30శాతం మంది పూర్తి సమయం దీనిలోనే ఉంటారు. మిగిలిన 85శాతం ప్రయాణికులు యూఎస్ పౌరులు. ఈ క్రూయిజ్ షిప్‌లోని క్యాబిన్ ధర 99 వేల డాలర్లు(ఒక డాలర్ రూ. 83). సీ వ్యూ కలిగిన బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్లలో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్‌లో పుల్ డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ ఛార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా ఆన్‌బోర్డ్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది. ‘విల్లా వీ’ సీఈఓ మైకేల్ పెటర్సన్ మీడియాతో మాట్లాడుతూ తమ షిప్‌లోని దాదాపు సగం క్యాబిన్లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారన్నారు. కాగా జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్‌లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారు. ఈ భారీ షిప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూగోళాన్ని చుట్టుముడుతుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా ఇలా క్రూయిజ్ షిప్లో బతకడమే చౌకైనదని, అదే ఉత్తమమని సలహా ఇస్తుంటారు. ఇది కూడా చదవండి: పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు! -
పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..
రితు వర్మకు నటన ఒక ప్యాషన్. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ విషయంలో కూడా స్టయిల్ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్‌ను పర్ఫెక్ట్గా మెయిన్టేన్ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్‌గా ఫీలయ్యే బ్రాండ్స్‌లో ఓ రెండిటి గురించి.. మద్దిన్ మధురిత దత్తా, స్తాంజిన్ డాజిస్.. బిజినెస్ పార్ట్‌నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ముంబైలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్‌లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్ వేర్ ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. శీతల్ జవేరి జ్యూయెల్స్.. నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో శీతల్ జవేరి జ్యూయెల్స్ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్ డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఈ శీతల్ జవేరి జ్యూయెల్స్ బ్రాండ్ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: క్యూట్‌లుక్‌తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..) -
హైదరాబాద్ టూ అమెరికా: ఇలా చేస్తే తక్కువ ధరకే విమాన టికెట్లు!
అమెరికా వెళ్లే ప్రయాణికులు కాస్త ముందస్తు ప్లానింగ్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అమెరికా ప్రయాణం చేయొచ్చు. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి అమెరికాకు ప్రయాణం చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మాములుగా అమెరికా వెళ్లే ప్రయాణికులు ఆన్ లైన్ లో తమకు నచ్చిన వెబ్ సైట్ లో అమెరికా వెళ్లేందుకు టికెట్ రేట్ ఎంత ఉందో ప్రయాణానికి కొన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకుంటారు. మరికొంత మంది అయితే ఎక్కువ స్టాప్స్ ఉండే ఫ్లైట్ లను ఎంచుకుంటే తక్కువ ధర లో టికెట్ దొరుకుతుందని వెదుకుతారు. అలా సాధారణంగా ట్రై చేయకుండా మేం చెప్పే విధంగా ట్రై చేస్తే మీరు తక్కువ ఖర్చుతోనే అమెరికా వెళ్లొచ్చు. సాధారణంగా అయితే అమెరికా లోని న్యూయార్క్ నగరానికి వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబై వరకు డొమెస్టిక్ ఫ్లైట్ లో తీసుకువెళ్లి అక్కడి నుండి ఇస్తాంబుల్ వరకు ఇంటర్ నేషనల్ ఫ్లైట్ తీసుకువెళ్లి మళ్లి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ లో న్యూయార్క్ కి చేరుకుంటారు. ఇలా అయితే సాధారణ ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకుంటే ఇండిగో ఎయిర్ లైన్స్ అయితే సుమారు లక్ష రూపాయల నుండి లక్షన్నర వరకు టికెట్ చార్జ్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, బోలెడంత డబ్బు ఆదా హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి కొన్ని ప్రయోగాలు చేస్తే మీరు చాలా తక్కువ ఖర్చుతో నే అమెరికా వెళ్లొచ్చు. అది ఎలా అంటే మొదట హైదరాబాద్ నుండి నేరుగా దుబాయ్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక ప్రయాణికునికి ఒక నెల ముందు టికెట్ తీసుకుంటే సుమారు 10వేల నుండి 12వేల వరకు ఛార్జ్ అవుతుంది. దుబాయ్ నుండి న్యూయార్క్ కి టికెట్ సెపరేట్ గా బుక్ చేసుకుంటే సుమారు 43వేల నుండి 48 వేలల్లోనే టికెట్ లభిస్తుంది. మొత్తం కలిపితే రూ. 60 వేలు మాత్రమే అవుతుంది. దీంతో హైదరాబాద్ నుండి ముంబై మీదుగా ఇస్తాంబుల్ నుండి న్యూయార్క్ వెళితే ఒకలక్ష 25వేల నుండి లక్షన్నర వరకు అయ్యే ఖర్చు… అదే దుబాయ్ వెళ్లి అక్కడి నుండి న్యూయార్క్ కి బుక్ చేసుకుంటే కేవలం 60 వేల నుండి 70వేల తక్కువ ధరతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. ఇలా చేయడంతో వెయిటింగ్ పీరియడ్ తప్పడంతో పాటు ఇతర దేశాలను చూసే వీలు కూడా ఉంటుంది. కాకపోతే అరైవల్ ఆన్ వీసా ఉన్న దేశాలకు అయితే మీకు సులంభంగా అవుతుంంది. లేకుంటే వీసా దేశాలు అయితే మళ్లీ వీసా కోసం సెపరేట్ గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరొక విధంగా ట్రై చేయాలనుంటే అమెరికాలోని న్యూయార్క్ వెళ్లానుకుంటే ముందుగా హైదరాబాద్ నుండి శ్రీలంక దేశ రాజధాని కొలంబోకు టికెట్ బుక్ చేసుకుంటే ఒక వ్యక్తికి సుమారు 11వేల రూపాయల్లో టికెట్ వస్తుంది. కొలంబో నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే సుమారు 56వేల రూపాయాల్లోనే టికెట్ దొరుకుతుంది. అంటే సుమారు 67వేల రూపాయలతో అమెరికాలోని న్యూయార్క్ కి చేరుకోవచ్చు. అదేవిధంగా శ్రీలంక దేశం కూడా చూసినట్లవుతుంది. కాబట్టి కొంచెం ట్రిక్కులు ప్లే చేస్తే ఇతర దేశాలను చూసినట్లుంటుంది తక్కువ ఖర్చుతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. -మంగ వెంకన్న, సాక్షి టీవీ -
ఇండియా పేరు 'భారత్'గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే?
గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరుని భారత్‌గా మార్చాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని కోసం 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 31న ప్రకటించారు. అయితే ఇండియా పేరు భారత్‌గా మారిస్తే.. ఎలాంటి ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఔట్లుక్ బిజినెస్ నివేదికల ప్రకారం, ఇండియా భారత్‌గా మారాలంటే ఏకంగా రూ. 14 వేలకోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కొన్ని దేశాలు పేర్లు మార్చుకోవడం వల్ల ఎంత ఖర్చయింది అనే వివరాల ఆధారంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2018లో ఆఫ్రికాలోని స్వాజిల్యాండ్ దేశం పేరుని ఎస్వంటిని (Eswantini)గా మార్చడానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు ప్రముఖ న్యాయవాది 'డారెన్ అలివర్' గణాంకాలు వెల్లడించాయి. అంతే కాకుండా ఈయన ప్రకారం ఒక పెద్ద దేశం సగటు మార్కెటింగ్ బడ్జెట్ దాని మొత్తం ఆదాయంలో దాదాపు 6 శాతం వరకు ఉంటుంది. కాగా రీబ్రాండింగ్ కోసం మొత్తం మార్కెటింగ్ బడ్జెట్లో 10 శాతం వరకు ఖర్చవుతుంది. అలివర్ సూత్రం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆదాయం మొత్తం రూ.23.84 లక్షల కోట్లు. కావున అలివర్ (Oliver) సూత్రం ప్రకారం రూ. 23.84 లక్షల కోట్లు × 0.006 = రూ. 14,304 కోట్లు (రీబ్రాండింగ్ మొత్తం). ఈ విధంగా భారత్ పేరుగా ఇండియా స్థిరపడాలంటే వేలకోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇండియా అన్న పేరుని భారత్‌గా మార్చితే.. ఇండియా పేరు ఉన్న ప్రతి చోటా (కరెన్సీ నోట్ల మీద, ఆధార్, పాన్, ప్రభుత్వ సంస్థలు ఇలా) భారత్ అనే పదం చేర్చాలి వస్తుందని, ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఇలా అయితే ఎలా గురూ.. కేవలం 48 గంటల్లో అన్నీ బుక్కయిపోయాయ్! ఇప్పటికే భారతదేశంలోని కొన్ని నగరాల పేర్లు కూడా మార్చడం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం ఛత్రపతి శంభాజీనగర్‌గా.. హోషంగాబాద్ 2021లో నర్మదాపురంగా, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరం 2018లో ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చింది. అలహాబాద్ పేరు మార్చడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 300 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు ఇండియా టుడే గతంలో నివేదించింది. ఈ లెక్క ప్రకారం ఇండియా.. భారత్‌గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. -
అందాల భామ ఆలియా ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్‌లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్‌లో పార్ట్నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మనీష్ మల్హోత్రా.. డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/- ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్‌ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్లైన్ మార్కెట్టూ విస్తృతమే. (చదవండి: స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..) -
అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!
సెలబ్రెటీలు ధరించే డ్రెస్‌లు ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. వాటి ధర కూడా ఖరీదుగానే ఉంటాయి. క్రికెటర్లనే పెళ్లి చేసుకున్న భాలీవుడ్ భామలు ఇద్దరూ ఒకేలాంటి స్లీవ్లె్లెస్ టాప్‌లు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్‌ని గత నెలలో పెళ్లిబంధంలో ఒక్కటయ్యారు. ఇక అనుష్కా క్రికెటర్ విరాట్‌ని కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి వామిక అను కూతురు కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు ఒకే బ్రాండ్ మాలీకి చెందిన దుస్తులు ధరించారు. అందులో ఇద్దరు తమ అందంతో చూపురులను కట్టిపడేశారు. అయితే వారు ధరించి ఆ షార్ట్ టాప్ల ధర వింటే షాకవ్వడం ఖాయం. సెలబ్రెటీలు దరించేవి చాలా ఖరీదైనవే అయినప్పటికీ..కొన్ని దుస్తులుకు ఇంతపెట్టారా అనే ఫీల్ వస్తుంది. అది సహజం. ఏ చీర లేదా లెహంగా అంత ధర ఉందంటే ఓకే చిన్న షార్ట్ లాంటి టాప్ ఏకంగా రూ. 18000/ అంటే నిజమేనా? అనిపిస్తుంది కదా! కానీ బ్రాండ్లకు పెట్టింది పేరు అయిన మలై బ్రాండ్ ధరలు ఎక్కువనే చెప్పాలి. ఆయా ఫ్యాషన్ కాస్ట్యూమ్‌లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అతియా శెట్టి గూలాబీ రంగు స్లీవ్‌లెస్ టాప్, జీన్స్ ఫ్యాంట్లో అదర్సు అన్నట్లు ఉంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) చక్కటి ఈయర్ రింగ్స్, మ్యాచింగ్ లిప్‌స్టిక్‌తో మంచి లుక్‌తో ట్రెండీగా ఉంది అతియా. ఇక అనుష్క శర్మ కూడా సేమ్ అదే మాదిరి పసుపు రంగు టాప్‌లో చూడచక్కగా ఉంది. కంఫర్ట్ దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చే అనుష్క రెండు నెలల క్రితం ఈ టాప్‌ని ధరించిన ఫోటోని నెట్టింట షేర్ చేసింది. ఇప్పుడూ అతియా అదే టాప్ వేసుకోవడంతో నెలక్రితం నాటి అనుష్క ఫోటోతో కలిపి అతియా ఫోటో నెట్టింట సందడి చేయడం. దీంతో నెటిజన్లు మీ భుజాలను కవర్ చేసేలా డ్రస్‌లు వేయకూడదనుకుంటున్నారా అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్ట్‌లు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) (చదవండి: పండుగ వేళ ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!) -
చంద్రునిపైకి ఒక వాటర్ బాటిల్ పంపాలంటే.. అదానీ, అంబానీలే ఆలోచించాలి!
చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ కోసం భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్ కోసం భారత్ రూ.615 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇతర దేశాలు ఇటువంటి మిషన్ల కోసం ఇంతకన్నా ఎక్కువ మొత్తమే ఖర్చు చేస్తాయి. ఏ దేశమైనా ఒక వ్యక్తిని లేదా ఏదైనా వస్తువును చంద్రునిపైకి పంపాలనుకుంటే అందుకు అయ్యే వ్యయం అధికంగా ఉంటుంది. ఏ దేశమైనా చంద్రునిపైకి వాటర్ బాటిల్ పంపాలనుకుంటే, దానికి ఎంత వ్యయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రునిపైకి మనిషిని పంపడానికి అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. 1972వ సంవత్సరంలో యూజీన్ సెర్నాన్ చంద్రుని ఉపరితలంపై నడిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రుని ఉపరితలంపైకి ఒక వ్యక్తి చేరుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. నిజానికి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు.. చంద్రునిపైకి మనిషిని పంపాలని అమెరికా ప్లాన్ చేసింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసినప్పుడు 104,000 అమెరికా డాలర్లు ఖర్చవుతుందని తేలింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గింది. చంద్రునిపైకి మనిషిని పంపడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చవుతుందని తేలినప్పుడు ఒక వాటర్ బాటిల్ పంపాలంటే ఎంత ఖర్చవుతుందనే విషయానికి వద్దాం. నిజానికి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగం జరగలేదు. అయితే ఒక వాటర్ బాటిల్‌ను సురక్షితంగా పంపడానికి, అంతరిక్ష నౌకలో ఉపయోగించే భద్రత, సాంకేతికత ఒక వ్యక్తిని చంద్రునిపైకి పంపిన రీతిలోనే ఉంటుంది. అయితే మనిషిని పంపడానికి అయ్యే వ్యయం కన్నా కాస్త తక్కువ ఉండవచ్చు. అయినా ఈ మొత్తం అధికంగానే ఉంటుంది. ఇంతమొత్తం ఖర్చు చేసేందుకు మన దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలే ఆలోచించాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
డీజే టిల్లు ఫేమ్ నేహా ధరించిన అల్లికల చీర ధర ఎంతంటే..!
‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా..’ పాటలో ఇటీవల డాన్స్‌తో అదరగొట్టిన నటి నేహా శెట్టి... ఫ్యాషన్‌లోనూ అంతే రీతిలో అదరగొడుతోంది.. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో! చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా. పౌల్మీ అండ్ హర్ష్ ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి వీరి డిజైన్స్. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్ లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. నేహా శెట్టి ధరించిన పౌల్మీ అండ్ హర్ష్ బ్రాండ్ చీర ధర రూ. 42,800/- అభిలాష ఫైన్ జ్యూయల్స్ పదేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. అభిలాష. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తనకున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. --దీపిక కొండి (చదవండి: అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే!) -
ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?
ఆసియాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి చెందిన బిజినెస్ ఉమెన్ ఇషా అంబానీ వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బిలియనీర్ ముఖేష అంబానీ కుమార్తెగానే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అందేకాదు ఫ్యాషన్ ఐకాన్‌గా తన ఫ్యాన్స్నుఆకట్టుకుంటూనే ఉంటుంది. చూడచక్కని లెహంగా, ముచ్చటైన చీరలు, రాయల్ జ్యువెలరీ, అంతకుమించిన ఫ్యాషన్ అండ్ క్లాసీ స్టైల్‌తో అందర్నీ మెస్మరైజ్ చేయడం ఇషా స్పెషాల్టీ. ఈ నేపథ్యంలో 165 కోట్ల అన్‌కట్ డైమండ్ నెక్లెస్ వార్తల్లో నిలిచింది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) ఇషా అంబానీ ఖరీదైన వస్తువులలో డైమండ్ నెక్లెస్ స్పెషల్‌గా నిలుస్తోంది. ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ కూడా ఒకటి. దీని ధర ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆభరణాలు, వజ్రాల నిపుణుల ప్రకారం, 20 మిలియన్ల డాలర్లు (సుమారుగా రూ. 165 కోట్లు) ఉంటుందని అంచనా. ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్‌స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్‌ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్‌కట్ నెక్లెస్‌లో 50 పెద్ద అన్‌కట్ డైమండ్లతో చాలా స్పెషల్‌గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్‌ను గ్రాండ్ ఈవెంట్ సందర్బంగా ఇషా అదే నెక్లెస్‌ను ధరించింది. ఈవెంట్లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్‌తో అందమైన రెడ్ కలర్ వాలెంటినో గౌను ధరించింది. కాగా 2008లో ఫోర్బ్స్ 'యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు' జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. యేల్ యూనివర్శిటీ సైకాలజీ , సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టా పొందిన ఇషా రిలయన్స్కుచెందిన టెలికాం, రీటైల్ బిజినెస్‌లో దూసుకు పోతోంది. డిసెంబర్ 12, 2018న బిలియనీర్, అజయ్ పిరమల్, స్వాతి పిరమల్‌ల కుమారుడు, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్‌తో వివాహైంది. ఇషాకు ఇద్దరు పిల్లలు (ట్విన్స్) ఉన్నారు. -
మెహందీ కలర్ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్..ధర ఎంతంటే..
అను ఇమ్మాన్యుయేల్.. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ స్టార్ ఫ్యాషన్‌కి ఓ స్టయిల్ని క్రియేట్ చేసిన బ్రాండ్స్‌లో కొన్నింటిని చూద్దాం.. నలుపు రంగు దుస్తులు, డెనిమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి బయటకెళ్లినపుడు సేఫ్టీ పిన్స్ అవసరం. నా పర్సులో ఎప్పుడూ ఉంటాయి. బ్రాండ్ వాల్యూ: ఐకేయా ఐకేయా అంటే సంస్కృతంలో ‘నా గుర్తింపు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్లాసిక్, టైమ్‌లెస్ ఫ్యాషన్ డిజన్స్కి ప్రత్యేకం ఈ బ్రాండ్. ఢిల్లీకి చెందిన డిజైనర్ ఇషా ధింగ్రా.. 2013లో దీనిని ప్రారంభించారు. మూస డిజైన్స్‌కి చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ధరలు కాస్త ఎక్కువే. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్ ధరించి చీర బ్రాండ్ ఐకేయా రూ. 74,500/- హౌస్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కి కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అందుకే బిజినెస్ మేనేజ్‌మెంజ్ కోర్సు పూర్తయిన వెంటనే 2014లో ‘హౌస్ ఆఫ్ శిఖా’ను ప్రారంభించారు. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి పాముఖ్యతనివ్వడంతో.. డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ లేబుల్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అను ధరించిన జ్యూలరీ బ్రాండ్ ధర రూ. 6,000 – అను ఇమ్మాన్యుయేల్ --దీపిక కొండి (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్‌కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్‌లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్‌కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్‌ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్‌బాటిల్‌కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
ఆలస్యం వల్ల రూ. 4.80 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. ఫలితంగా వీటి నిర్మాణ వ్యయం మే నాటికి రూ.4.80 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదికను పరిశీలించినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. రూ.150 కోట్లు, అంతకుమించిన వ్యయంతో కూడిన ప్రాజెక్టులను ప్రణాళికా శాఖ పర్యవేక్షిస్తుంటుంది. మొత్తం 1,681 ప్రాజెక్టులకు గాను 814 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 408 ప్రాజెక్టులు నిర్మాణ వ్యయం పెరిగిపోయినట్టు నివేదించాయి. 1,681 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.24,16,872 కోట్లు కాగా, వీటిని పూర్తి చేయడానికి రూ.28,96,947 కోట్లు వ్యయం అవుతుందని ప్రణాళిక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే రూ.4,80,075 కోట్ల మేర నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలుస్తోంది. 2023 మే నాటికి ఈ ప్రాజెక్టులపై రూ.15,23,957 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అంచనా వ్యయంలో 52.61 శాతం మేర ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. మొత్తం ఆలస్యంగా నడుస్తున్న 814 ప్రాజెక్టుల్లో 200 వరకు ఒకటి నుంచి 12 నెలల ఆలస్యంతో నడుస్తుంటే, 183 ప్రాజెక్టులు 13–24 నెలలు, 300 ప్రాజెక్టులు 25–60 నెలలు, 131 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా ఆలస్యం అయ్యాయి. -
ఈ గుడ్ల ధరలు తెలిస్తే.. గుడ్లు తేలేస్తారు!
చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. గుడ్లతో ప్రతీరోజూ వంటకాలు చేసుకునేవారు ఉన్నారు. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? వాటికి అంత ధర ఎందుకు ఉంటుందో తెలిస్తే ఎవరూ ఒక పట్టాన నమ్మలేరు. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా తినే ఆహారాలలో గుడ్డు ఒకటి. సాధారణంగా అందరూ తెల్లని గుడ్లు తింటారు. వీటి ధర రూ.5 నుంచి రూ.10 మధ్య ఉంటుంది. అయితే కాస్త డబ్బులు అధికంగా ఉండేవారు దేశీ గుడ్లను తింటుంటారు. ఇవి కాస్త గులాబీరంగులో ఉంటాయి. వీటి ధర రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. మరికొందరు వివిధ పక్షుల గుడ్లను కూడా తింటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు.. రోత్స్చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ గుడ్లు. ఈ గుడ్డు ధర రూ. 9.6 మిలియన్ డాలర్లు. దీని ధర భారత కరెన్సీలో చూస్తే రూ. 78 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వికీపీడియాలోని సమాచారం మేరకు ఈ గుడ్డుపై పూర్తిస్థాయిలో వజ్రాలను పొదిగారు. ఇది బంగారు కవర్ కలిగివుంటుంది. అయితే ఈ గుడ్డు తినేందుకు కాదు. అలంకరణ కోసం తీర్చిదిద్దారు. పైగా ఇది ఆర్టిఫిషియల్ గుడ్డు. ఖరీదైన గుడ్ల పరంగా చూస్తే రెండవ స్థానంలో మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ధర 8.4 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీనిని చూస్తే రూ. 69 కోట్లకు సమానం. 18 కేరెట్ల బంగారంతో రూపొందించిన ఈ గుడ్డును వేయి వజ్రాలతో అలంకరించారు. ఈ గుడ్డును చూసే వారికి అది గుడ్డు సైజులో ఉన్న వజ్రం అని అనిపిస్తుంది. మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ఖరీదు సుమారు రూ. 82 లక్షలు. ఈ గుడ్డు 65 సెంటీమీటర్ల పొడవు కలిగివుంటుంది. ఈ గుడ్డునుకొనాలంటే మీ కున్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. ఈ గుడ్డు చూసేందుకు చాక్లెట్ మాదిరిగా ఉంటుంది. ఈ గుడ్డు పైభాగంలో వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు దీనిని బంగారంతో రూపొందించారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం... నిర్మాణ సంస్థ ఇదే.. భారత పార్లమెంట్ నూతన భవనాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్‌తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది. రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ. ఇదీ చదవండి: రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి.. -
అంబానీనా మజాకా...కార్ రేటు తెలిస్తే కళ్ళు తిరుగుతాయి
-
బర్త్‌డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నాడు. మార్చి 27తో చరణ్ 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సోమవారం రాత్రి జరిగిన చరణ్ బర్త్‌డే పార్టీలో టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్స్ పాల్గొని సందడి చేశారు. ఇక చరణ్ బర్త్‌డే సందర్భంగా RC15 నుంచి వరుస అప్డేట్స్ వదిలారు మేకర్స్. చదవండి: బిగ్‌బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడిని ముద్దాడుతూ ఓ ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం స్వయంగా ఇంటికి వెళ్లి చరణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చరణ్ ధరించిన లైట్ బ్లూ షర్ట్‌పై అందరి దృష్టి పడింది. బర్త్‌డే సందర్భంగా చరణ్ వేసుకున్న ఆ షర్ట్ స్పెషాలిటీ, బ్రాండ్ ఏంటి? అని ఫ్యాన్స్ ఆరా తీయగా దాని ధర తెలిసి అంతా అవాక్కవుతున్నారు. చదవండి: తొలిసారి బేబీ బంప్‌తో ఉపాసన.. ఫొటోలు వైరల్ దీంతో చరణ్ షర్ట్ కాస్ట్ వైరల్‌గా మారింది. కాగా ఈ షర్ట్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేయగా ఇది ఫార్ ఫేచ్ అనే ఫారిన్ షాపింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కనిపించింది. జాన్యా వటనాబి ప్యాచ్ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ షర్ట్‌ను డీటైల్ అని పిలుస్తారు. ఇక ఈ వెబ్ సైట్ ప్రకారం.. ఈ షర్ట్ ధర 983 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 80,961 రూపాయలు. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. -
నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు అన్ని కోట్లా!
అక్కినేని నాగచైతన్య ఇటీవల కొత్త ఇల్లు కొన్న విషయం దాదాపు అందరికి తెలిసింది. అత్యంత విలాసవంతమైన సదుపాయాలు కలిగిన ఈ ఇంటిలోకి గృహప్రవేశం కూడా చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు & వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నాగచైతన్య కొన్న కొత్త ఇల్లు ఖరీదు చాలామందికి ఇంకా ప్రశ్నర్థకంగానే మిగిలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాగ చైతన్య కొత్త ఇంటి ధర సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ ఇంటిని తన అభిరుచికి తగినట్లుగా, లగ్జరీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. తన సన్నిహితులకు దగ్గరగా ఉండాలన్న కారణంగా కుటుంబీకులకు సమీపంలోని నిర్మించుకున్నాడు. (ఇదీ చదవండి: ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు) నాగ చైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఇంట్లో ఉండేవారు. అయితే వారి విడాకుల తరువాత వారిద్దరూ ఆ ఇంటిని వదిలేసారు. కొన్ని నెలల పాటు తండ్రితోనే ఉన్న ఇతడు ఇటీవలే కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. నాగ చైతన్య వద్ద అత్యంత ఖరీదైన 'ఫెరారీ 488జీటీబీ' కారుతో పాటు బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ, నిస్సాన్ జిటి-ఆర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ కూడా ఉన్నాయి. అంతే కాకుండా MV అగస్టా, బీఎండబ్ల్యూ 9RT వంటి అరుదైన బైకులు ఉన్నాయి. -
అట్లుంటది మరి.. రూ.6 లక్షల మేకపోతు!
సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న మేకపోతు బరువు 110 కిలోలు, వయసు 3 ఏళ్లు. నల్లమచ్చ లేని ఈ జమునాపారి మేకపోతు రాజస్తాన్‌కు చెందినది. శంకర్ కిచర్ అనే రైతు పెంచుతున్న దీని విలువ అక్షరాలా రూ. 6 లక్షలు! ఉత్తరప్రదేశ్‌లోని మథుర సమీపంలో ఉన్న నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ (ఎన్ఎస్ఐఎఫ్ఆర్జీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్’లో బరువు విభాగంలో ఈ మేకపోతు ప్రథమ బహుమతి పొందింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి గొర్రె, మేకపోతులు ఈ ప్రదర్శనకు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా ‘ఇండస్ట్రీ సైంటిస్ట్ ఫార్మర్స్ ఇంటర్ఫేస్’ పేరిట నిర్వహించిన ఒకరోజు సదస్సుకు రాష్ట్రం నుంచి పలువురు గోట్ఫామ్స్ యజమానులు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో జీవాల సంపద పెరిగినందున వాటిపై పరిశోధనల కోసం జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పేర్కొన్నారు. -
తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవే..
-
వామ్మో.. చిరు వాడే వాచ్ అంత కాస్ట్లీనా! ధరెంతో తెలుసా?
సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్ టాపిక్‌గా మారుతుంది. ఇటు అభిమానులు సైతం తాము ఇష్టపడే స్టార్ల లైఫ్‌స్టైల్‌ను ఇంట్రెస్ట్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారు వాడే కార్లు, దుస్తులు, వాచ్ బ్రాండ్లను, వాటి ధరల గురించి సెర్చ్ చేస్తుంటారు. ఇక ఎక్కువ బ్రాండ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తరచూ వార్తల్లో నిలస్తుంటాడు. ఇక రామ్ చరణ్‌కు వాచ్‌లు అంటే పిచ్చి.. ఇప్పటికే రకరకాల టాప్ బ్రాండ్ వాచ్‌లను తన కలెక్షన్స్‌లో చేర్చేశాడు. చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట! ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర హాట్‌టాపిక్‌గా మారింది. రీసెంట్గా చిరు నటించిన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఆయన తరచూ మూవీ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి రకరకాల బ్రాండ్ వాచ్‌లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కన్ను వాటిపై పడింది. దీంతో మెగాస్టార్ వాడుతున్న ఆ వాచీల బ్రాండ్స్, వాటి ధర గురించి ఆరా తీస్తున్నారు. దీంతో చిరు వాచ్ ధరలను చూసి అభిమానులంతా నోరేళ్ల బెడుతున్నారట. చిరు దగ్గర ఎన్నో బ్రాండ్ వాచీలు ఉన్నాయట. చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! ట్వీట్‌కి లైక్ కొడతావా? అంటూ ఫైర్ అందులో రోలేక్ వాచ్ అత్యంత కాస్ట్లీ అని తెలుస్తోంది. రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధర అక్షరాలా 1 కోటీ 86 లక్షల 91 వేలకు పైనే ఉంటుందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి వాడే మరో వాచ్ కూడా ఉంది. ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్.. లాంగే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర దాదాపు రూ. 33 లక్షల 77వేల పైనే ఉంటుందట. దీంతో చిరు వాచీల ధరలను చూసి అంతా అవాక్కావుతున్నారట. ఆయన ఒక్క వాచీ జీవితమంత లగ్జరీగా బతికేయచ్చంటూ నెటిజన్లు ఫన్నిగా కామెంట్స్ చేస్తున్నారు. -
అక్కడ ఉల్లి ధర వింటే..కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం!
మన దేశంలో ఎప్పుడైన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక అనావృష్టి సమయాల్లోనో ధరలు అధికమవుతాయి. అప్పుడే మనకు ఉల్లి ధర ఆకాశన్నంటుతుంది. పైగా అది కూడా మహా అయితే కేజి 30 నుంచి 70 మధ్యలో పెరుగుతుంది. దానికే మనవాళ్లు చేసే హడావిడి అంతా ఇంతకాదు. ఇదే అదనుగా రెస్టారెంట్ నుంచి చిన్న కాక హోటల్ వరకు రేట్లు పెంచేయడం, ఉల్లి లేని వంటకాలు అందించడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దేశంలోని ఉల్లి పాయాల ధర వింటే అమ్మ బాబోయ్ అంటారు. కచ్చితంగా కొనేందుకు ముందుకు రావడానికి కూడా జంకుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వివరాల్లోకెళ్తే...ఫిలిప్పీన్స్‌లో ఉల్లిపాయాల ధర చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా కేజీ ఉల్లిపాయాలు సుమారు వెయ్యి రూపాయాలు వరకు పలుకుతోంది. అక్కడ ప్రస్తుతం ఉల్లి చాలా విలాసవంతమైన వస్తువుగా మారింది. ఇంతకు మునుపు అక్కడ ప్రజలు మూడు నుంచి నాలుగు కేజీల ఉల్లిపాయాలు కొనేవారు. ప్రస్తుతం అక్కడ ఎంతో అవసరం అనుకుంటే గానీ, అదికూడా కేవలం అరకేజీనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత మూడు నెలల నుంచే ఈ దారుణమైన ధర పలుకుతోందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్ వాసులు ఆహారంలో ప్రధానంగా ఉల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వారంతా దాని ప్లేస్‌లో మరోదాన్ని జోడించి తినాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు అక్కడ వ్యవసాయ కార్యదర్శి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ పెరుగతున్న ఆహార ధరల పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఆయన ఉత్పత్తిని పెంచే దిశగా పలు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్ రెండు భారీ తుపాన్లను ఎదుర్కొంది. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. అక్కడ ప్రజలు పెళ్లిళ్లకు ఉపయోగించే డెకరేషన్లో ఉల్లిని ఉపయోగించాలని చూస్తున్నారు కొందరూ. ఎందుకంటే ఆ తతంగం తర్వాత ఆ ఉల్లిపాయాలు కొందరూ పేద ప్రజలకు ఉపయోగపడతాయని, అదే పూలు అయితే వాడిపోతాయి ఉపయోగం ఉండదు అనేది వారి ఆలోచన. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అక్కడి ప్రభుత్వం సైతం ప్రజలకు భారం తగ్గించేలా...ధరల పెరుగుదలను నియంత్రించటానికి నానా అగచాట్లు పడుతోంది. (చదవండి: పాక్‌లో భూకంపం) -
మ్యూజిక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్.. సగం ధరకే యాపిల్ ఎయిర్‌పాడ్స్!
యాపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఉత్పత్తులుకు డిమాండ్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఐఫోన్, ఎయిర్‌పాడ్స్, ఐప్యాడ్ ఇలా ఏదైనా టూ కాస్ట్లీగా ఉంటాయి. అయినా కూడా ఇవి సేల్స్ పరంగా దుమ్ము దులుపుతుంటాయి. అందుకు ఈ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఇందులో ఉపయోగిస్తున్న టెక్నాలజీ కారణమనే చెప్పాలి. అయితే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ధరలు కూడా భారీ స్థాయిలో ధరలు ఉండడంతో, మిగిలిన ఉత్పత్తులతో పాలిస్తే ఇవి వినియోగదారులను అంతగా ఆకట్టుకోకపోతున్నామని యాపిల్ భావిస్తోంది. అందుకే తక్కువ ధరలో ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఆడియో మార్కెట్‌పై కన్ను... రూ.8 వేలకే సమాచారం ప్రకారం.. యాపిల్ సరసమైన ధరలలో ఎయిర్‌పాడ్స్ తీసుకురావడం మాత్రమే కాకుండా, కొత్త తరం ఎయిర్‌పాడ్స్ మాక్స్( AirPods Max)పై కూడా పనిచేస్తోంది.సరసమైన ఎయిర్‌పాడ్స్ ధర 99 డాలర్లు(ఇది భారతదేశంలో కరెన్సీ ప్రకారం దాదాపు రూ.8000) ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎయిర్‌పాడ్స్ సరఫరాదారులను కూడా మార్చాలని కంపెనీ చూస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ధరలో యాపిల్ ఎయిర్‌పాడ్స్ అందుబాటులోకి వస్తే సేల్స్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే, బడ్జెట్లో వచ్చే ఎయిర్‌పాడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండకపోవచ్చని అనలిస్టులు చెబుతున్నారు. ఎయిర్‌పాడ్స్‌ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా ఆడియో మార్కెట్లోనూ తమ సేల్స్పెంచుకోవాలన్నది యాపిల్ లక్ష్యంగా తెలుస్తోంది. ఒకవేళ రూ.8వేల ధరలో తీసుకొస్తే యాపిల్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఎయిర్‌పాడ్స్ (Airpods) కొనాలంటే కనీసం రూ.15వేలు వెచ్చించాల్సిందే. చదవండి: అమెజాన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కొత్త ప్లాన్, ప్రైమ్ కంటే చవక! -
చూపులో సైకిల్.. రేటులో బుల్లెట్
సాక్షి, ఫిఠాపురం: చూడటానికి అది సైకిలే కానీ రేటులో మాత్రం బుల్లెట్‌తో పోటీ పడుతోంది. సామాన్యుడి వాహనం సైకిల్ అసామాన్యంగా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి తన కుమారుడు చైతన్య కోసం ఏకంగా విదేశాల నుంచి సైకిల్ కొనుగోలు చేశారు. ఇటలీకి చెందిన ఈ సైకిల్ రేటు అక్షరాలా రూ.1.40 లక్షలు. మోటారు సైకిల్ మాదిరిగా రిజిస్ట్రేషన్ నంబరుతో పాటు లైసెన్సు కలిపి అంత ధర అయ్యిందని చెబుతున్నారు. చూడటానికి మామూలు సైకిల్లానే ఉన్నా నిర్మాణంలో కొత్తదనం కనిపిస్తోంది. బుల్లెట్ బండి రేటుతో పోటీ పడుతున్న ఈ సైకిల్ ప్రస్తుతం పిఠాపురం రోడ్డులో ఆకర్షణగా నిలుస్తోంది. (చదవండి: రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..) -
ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో విదేశాల్లో అధికారిక పర్యటనలు చేపట్టారు. తాజాగా గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను పార్లమెంట్లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లుకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సన్నిహత సంబంధాలను పెంపొందించుకోవటం, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించటమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతో పాటు విదేశాఘ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పర్యటనలు ఎంతో ముఖ్యం.’ అని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్. మోదీ విదేశీ పర్యటన వివరాలు.. ► ఇటీవల జీ20 సమ్మిట్ కోసం పీఎం మోదీ ఇండోనేసియాకు వెళ్లారు. దాని ఖర్చు రూ.32,09,760గా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతకు ముందు సెప్టెంబర్ 26-28 మధ్య జపాన్ పర్యటనకు వెళ్లగా అప్పడు రూ.23,86,536 అయింది. ► 2022 తొలినాళ్లలో యూరప్ పర్యటనకు రూ.2,15,61,304, 2019 సెప్టెంబర్ 21-28 మధ్య అమెరికా వెళ్లగా రూ.23,27,09,000 అయింది. ► గడిచిన ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది. ► 2017లో తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీకి వెళ్లారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు కాగా.. అందులో అమెరికా వెళ్లినప్పుడు అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చు అయింది. ఇదీ చదవండి: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు -
బ్రహ్మస్త్ర ప్రమోషన్లో ఆలియా ధరించిన డ్రెస్ ధరెంతో తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇటీవల విడుదలైన గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్ సినిమాల విజయంతో హుషారు మీద ఉన్న ఈ భామ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా చేస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్‌కు దగ్గర పడుతున్నవేళ ఆలియా తన భర్తతో కలిసి ప్రమోషన్లో పాల్గొంది. ఇప్పుడు ఆలియా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయినా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషన్లో పాల్గొంటుంది. తాజాగా.. ఈ నటి బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. గూచీ బ్రాండ్‌కు చెందిన పింక్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్ కోట్తో స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చదవండి: Samantha: సమంత ఎక్కడ? ఎందుకు సైలెంట్‌గా ఉంది? కారణం ఇదేనా! అయితే ఆలియా ధరించిన ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా? దీని గురించి ఏకంగా నెట్టింట్లో చర్చే జరుగుతోంది. పింక్ కలర్ చిఫాన్ రఫుల్ టాప్ ధర గూచీ అధికారిక వెబ్సైట్లో 4,100 డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3,27,883 రూపాయలన్న మాట. ఒక్క డ్రెస్‌కు ఆలియా అంత ఖర్చు పెట్టడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. త్వరలో భారత్‌లో తయారయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం మొబైల్స్‌లో వినియోగించే ఇన్ పుట్స్పై (ఫోన్లో వినియోగించే విడి భాగాలు) కస్టమ్ డ్యూటీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త కస్టమ్ ఛార్జీలు అమల్లోకి వస్తే .. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు పెరిగిన ధరల్ని కొనుగోలు దారులకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో దేశీయంగా తయారయ్యే స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. పలు నివేదికల ప్రకారం..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (cbic) విభాగంగా ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ల డిస్ప్లే అసెంబ్లీ దిగుమతిపై 10శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ విధిస్తుంది. ఆ కస్టమ్ డ్యూటీని మరో 5 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. "సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లయిడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్మెంట్, వాల్యూమ్, పవర్, సెన్సార్లు, స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ మొదలైన వాటి కోసం ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్లు (ఎఫ్పీసీ), ఇతర వస్తువులు డిస్ప్లే అసెంబ్లీతో దిగుమతి చేసుకుంటే 15శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ అమలవుతుందని సీబీఐసీ తెలిపింది. నో క్లారిటీ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో,ఒప్పోలతో పాటు ఇతర కంపెనీలు కస్టమ్ డ్యూటీ ఎగవేతకు పాల్పడ్డాయని సీబీఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై.. ఫోన్ల విడిభాగాల్ని దిగుమతి చేసుకుంటే ఎంత కస్టమ్ డ్యూటీ చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదని, అందుకే సీబీఐసీ అధికారులు నోటీసులు అందించినట్లు పలు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ స్పష్టం చేశాయి. ఈ తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అధికారులు ఫోన్ల విడి భాగాలపై విధించే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలనే అంశంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
ఎంత మోసమో?..నెటిజన్ పోస్ట్‌కు కామెంట్ల వరద, స్పందించిన జొమాటో!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లుల వివాదంపై జొమాటో స్పందించింది. రాహుల్ కాబ్రా ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ధరను జొమాటో డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్ ధరను పోల్చుతూ పోస్ట్ చేశాడు. ఆఫ్‌లైన్‌లో ఉన్న ధర కంటే జొమాటో పెద్ద మొత్తంలో కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తుందని ఆరోపించాడు.ఆ ఆరోపణలపై జొమాటో రిప్లయి ఇచ్చింది. కస్టమర్లకు,రెస్టారెంట్ల మధ్య జొమాటో అనుసంధానంగా పనిచేస్తుంది.ఆఫ్‌లైన్‌లో అందించే ధరలకు జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే కాబ్రా పోస్ట్‌పై స్పందిస్తూ.. కస్టమర్ ఫిర్యాదుల్ని రెస్టారెంట్ల దృష్టికి తీసుకొని వెళ్తామని వెల్లడించింది. కామెంట్ల వరద రాహుల్ కాబ్రా ఓ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు. అయితే రెండు మూడు రోజుల క్రితం రాహుల్‌కు బాగా ఆకలి వేయడంతో ఆఫ్‌లైన్‌లో చెక్ చేసి వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలను ఆర్డర్ పెట్టాడు. ఫుడ్‌తో పాటు,ఇతర అదనపు ట్యాక్స్‌లు అన్నీ కలుపుకొని బిల్లు రూ.512 అయ్యింది. జొమాటోలో చెక్ చేస్తే ఆ ధర కాస్త రూ.75 డిస్కౌంట్ తీసేస్తే రూ.689.90గా ఉండడంతో కంగుతిన్నాడు. అంతా మోసం, దగా జొమాటో కస్టమర్ల దగ్గరనుంచి ఎంత మొత్తం వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ తాను ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ బిల్స్‌ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆఫ్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌పై ఉన్న ధర కంటే జోమాటో ఎక్కువగానే 34.76% శాతంతో 690-512 =రూ.178 వసూలు చేసినట్లు రాహుల్ మండిపడ్డాడు. ఫుడ్ ఆర్డర్‌పై ఇక రాహుల్ పెట్టిన లింక్డ్ఇన్ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది.ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ల నుంచి జొమాటో ఎంత వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ బిల్స్‌కు సంబంధించిన బిల్స్‌ను సైతం షేర్ చేశాడు. వీటిపై స్పందించిన నెటిజన్లు ఈ దిగ్గజ ఫుడ్ ఆగ్రిగ్రేటర్పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలా ఇప్పటి వరకు కాబ్రా పెట్టిన పోస్ట్‌కు 2వేల కామెంట్లు, 12వేలకు మందికి పైగా నెటిజన్లు అతనికి సపోర్ట్ చేస్తూ లైక్ కొట్టారు. -
రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్‌ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్‌ఏవోబీ (నేవల్ ఆల్టర్నేనేటివ్ బేస్)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ) -
అత్యంత ఖరీదైన వెజిటేబుల్ ఇదే...ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే
ప్రభుత్వం కాస్త ధరలు పెంచితే చాలు ధరలు ఆకాశాన్నంటాయి.. సామాన్యుడి నడ్డి విరిచేశారంటూ మనం గగ్గోలు పెట్టేస్తాం. వాస్తవానికి చౌకగా దొరికే కాయగూరలు సైతం ఒక్కోసారి కొనేందకు భారంగా ఉండే విధంగా ధర పలుకుతుంటాయి. అధిక వర్షాల కారణంగానో లేక పెట్రోల్ ధరలు పెరగడం వల్లనో కాయగూరల ధరలు పెరిగిపోతుంటాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడే కాకుండా ఓ మోస్తారుగా డబ్బున్నవాడు సైతం కాస్త వెనకడుగు వేస్తాడు. అయిన కాయగూరలు మహా అయితే కిలో సుమారు రూ.50 నుంచి 100లోపే పలుకుతుంది. కానీ ఇక్కడొక కాయగూర ధర వింటే కచ్చితంగా నోరెళ్ల బడతారు. వివర్లాకెళ్తే...ఈ కాయగూరని కొనాలంటే.. ఒక కిలోకి సుమారు రూ.లక్ష రూపాయాల పైనే వెచ్చించాల్సిందే. వాస్తవానికి ఇంత ఖరీదైన కాయగూరలు గురించి ఇప్పటి వరకు ఎవరు విని ఉండే అవకాశం లేదు. ఇంత ధర పలికే కాయగూర సామాన్యుడే కాదు ధనవంతుడు కూడా కొనేందుకు ఆలోచిస్తాడు. ఇంతకీ ఏంటి ఈ కాయగూరలో ఉన్న ప్రత్యేకత? ఎందుకింత ధర అంటే...ఈ కాయగూర పేరు "హాప్ షూట్స్". ఈ కాయగూరల పువ్వులను హాప్ కోన్స్ అంటారు. వీటిని బీర్ తయారీలో ఉపయోగిస్తారు. మిగిలిని కొమ్మలను కూరగాయాలుగా వాడుకుంటారు.ఈ కాయగూర మొక్క కాండాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవలే ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ కాయగూరని బిహార్‌లోని ఒక యువకుడు పండిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్ షూట్స్‌ని భారత్‌లోని బిహార్‌కి చెందిన తొలి యువ రైతు అమ్రేష్ సింగ్ దీన్ని సాగు చేస్తుండటం విశేషం. (చదవండి: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్) -
ధర ఎక్కువైంది బాస్.. కొంచెం తగ్గిస్తే బెటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజురోజుకీ అధికం అవుతున్న ఇంధన భారాన్ని తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇంకేముంది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ కొనుగోలుదార్లకు సబ్సిడీలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ రంగంలోకి కొత్త కంపెనీలూ పుట్టుకొస్తున్నాయి. పరిశోధన, తయారీ అనుభవం లేకుండా మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్లు అగ్నికి ఆహుతై ప్రాణాలనూ బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది. జనాభిప్రాయం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వే నిర్వహించింది. ఈ–టూ వీలర్లు సురక్షితం కాదన్న అభిప్రాయాన్ని అత్యధికులు వెల్లడించారు. ఈ వాహనాలు ఖరీదైనవని, తక్కువ ధరలో లభిస్తే కొనుగోలుకు సిద్ధమన్న సంకేతాలను ఇస్తూనే అధిక దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉండాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,50,886 మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 92.5 శాతం ఉండడం గమనార్హం. భవిష్యత్ ఈవీలదే.. ఎలక్ట్రిక్ టూ వీలర్లు సురక్షితం కాదని 57 శాతం మంది తేల్చి చెప్పారు. ఈ వాహనాల అగ్ని ప్రమాదాలు దీర్ఘకాలంలో వాటి అమ్మకాలపై ప్రభావం చూపుతాయని 1.14 లక్షల మంది (75.9 శాతం) స్పష్టం చేశారు. భవిష్యత్ మాత్రం ఎలక్ట్రిక్‌దేనని మూడింట రెండొంతుల మంది వెల్లడించారు. కొత్త కంపెనీకి బదులు ఇప్పటికే ద్విచక్ర వాహన రంగం లో ఉన్న సంస్థ నుంచి ఈవీ కొనుగోలుకు 55 శాతం పైగా ఆసక్తి చూపారు. ధర ఎక్కువ ఈ–స్కూటర్లు ఖరీదైనవని మూడింట రెండొంతుల మంది అభిప్రాయపడ్డారు. తక్కువ ధరలో లభించే మోడళ్లకే అత్యధికులు మొగ్గు చూపారు. రూ.50 వేల లోపు ధర కలిగిన ఈ–టూ వీలర్ కొనుగోలుకు 71 వేల మంది ఆసక్తి కనబరిచారు. వాహనం ఫుల్ చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉండాలని 66 వేల మంది అభిప్రాయపడ్డారు. దేశంలో ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల అమ్మకాలు సుమారు 1 శాతం తగ్గి 49,166 యూనిట్లకు చేరుకున్నాయి. చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్లు తగలబడటానికి కారణాలు ఇవి .. -
రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ షాక్!
సాక్షి, హైదరాబాద్: అధిక రుణాలు, నిధుల లేమిలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలాగా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు గత ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది. టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయని కొల్లియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయని వివరించారు. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయాల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండస్ట్రియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు. ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితని పేర్కొన్నారు. -
ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్‌గా మార్పు! ఇక నుంచి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సు వచ్చింది. అయితే ఇది కొత్త బస్సు కాదు. డీజిల్ భారం నుంచి బయటపడేం దుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగంలో భాగంగా రూపుదిద్దుకున్న బస్సు. అంటే డీజిల్‌తో నడిచే బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారన్న మాట. ఈ బస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపోకు చేరుకుంది. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది, డీజిల్‌తో పోలిస్తే ఎంత ఆదా చేస్తుంది, నిర్వహణ వ్యయం ఎంత తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీలో ఎలా నడుస్తుందన్న అంశాలను బేరీజు వేసుకుని మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అయితే అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికే సేవలందిస్తున్నాయి. వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఖర్చు తగ్గింపే లక్ష్యం ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాల తర్వాత అంత భారీ వ్యయం డీజిల్ కోసం అవుతోంది. ఒక్కో బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు ఖర్చు అవుతోంది. జీతాలను తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ డీజిల్ ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు ఉండటంతో ఆర్టీసీ ఆ దిశగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఎలక్ట్రిక్ బస్సుకు కి.మీ.కు కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే డీజిల్ బస్సుతో పోల్చితే ప్రతి కి.మీ.పై రూ.14కు పైగా మిగులుతుందన్నమాట. కానీ ఒక్కో కొత్త ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నర పైమాటే. అంత వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి (కన్వర్షన్) చేసేందుకు ఉన్న అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.65 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుండటం కూడా ఆర్టీసీని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎలక్ట్రిక్ రైలు లోకోమోటివ్‌లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ అంగీకరించడంతో ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఓ డీజిల్ బస్సును ఇవ్వగా దాన్ని ఎలక్ట్రిక్ బస్సుగా కన్వర్ట్ చేసిన సదరు సంస్థ శుక్రవారం ఆర్టీసీకి అప్పగించింది. దీంతో దాని పనితీరును నెల రోజుల పాటు పరిశీలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు! ప్రస్తుతం కన్వర్షన్ ఖర్చును కూడా ఆర్టీసీ భరించలేదు. దీంతో బస్సును కన్వర్ట్ చేసిన తర్వాత నిర్ధారిత కాలం పాటు ఆ సంస్థే బస్సులను నిర్వహించుకుని, అద్దె వసూలు చేసుకుని, నిర్ధారిత కాలం తర్వాత బస్సులను ఆర్టీసీకి అప్పగించే విధానంపై ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
వైట్ టీ షర్ట్‌లో అదిరిపోయిన సమంత.. టీ షర్ట్ ధరెంతంటే ?
స్టార్ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అందం, అభినయం, ఫిట్నెస్తో సినీ ప్రేక్షకుల్నీ అలరిస్తోంది. సమంత ఉంటే సినిమాకు మంచి ఫలితమే దక్కుతుందని దర్శకనిర్మాతలు ఆమె వెంట క్యూ కడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల వంటి ప్రాజెక్టులతో సామ్ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫిట్నెస్, మోటివేషనల్ పోస్ట్‌తో యాక్టివ్‌గా ఉంటుంది. సమంతకు ఫిట్నెస్తో పాటు డ్రెస్సింగ్ స్టైల్‌పై కూడా ప్రత్యేక అవగాహన ఉంది. విభిన్నమైన డ్రైస్సింగ్ స్టైల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది సామ్. తాజాగా సమంత ముంబైలోని ఓ సెలూన్ నుంచి బయటకు వస్తూ కెమెరా కళ్లకు చిక్కింది. ప్రస్తుతం ఆ ఫొటోల్లో సమంత వేసుకున్న వైట్ టీ షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా సామ్ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు గురించి. ఎందుకంటే సామ్ వేసుకున్న ఆ 'ఆర్13 వైట్ టీ షర్ట్' ధర సుమారు రూ. 17,000 ఉంటుందట. వైట్ రిప్డ్ టీతో జత చేసిన బేసిక్ బ్లాక్ జీన్స్, వైట్ స్పోర్ట్స్ షూలు ధరించి మాస్క్ పెట్టుకుని ఆకట్టుకుంది సామ్ లుక్. త్వరలో ఈ స్టైల్‌ను ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి మరీ. -
వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్
వినియోగదారులకు గృహోపకరణ సంస్థలు భారీ షాకివవ్వనున్నాయి. జనవరి ఫెస్టివల్ సీజన్ నుంచి మార్చి ఈ మూడు నెలల మధ్య కాలంలో ఫ్రిజ్, ఏసీల ధరలు భారీగా పెంచనున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్ సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రకారం..ముడి సరకుతో పాటు సరుకు రవాణా పెరగడంతో కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్‌ను 5 నుంచి 10 శాతం వరకు పెంచేందుకు ఆయా కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. కమోడిటీస్, గ్లోబల్ ఫ్రైట్, ముడి సరుకు పెరుగుదలతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను 3 నుండి 5 శాతం వరకు పెంచడానికి చర్యలు తీసుకున్నామని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు. ఇప్పటికే ఏసీల ధరలను 8శాతం వరకు పెంచిన పానాసోనిక్, మరింత పెంచే ఆలోచనలో ఉందని, అందుకే గృహోపకరణాల ధరల పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ కండీషనర్లు ఇప్పటికే దాదాపు 8 శాతం పెరిగాయి.పెరుగుతున్న వస్తువులు, సప్లయ్ చైన్ ధరల్ని బట్టి వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, గృహోపకరణాల ధరల పెరగొచ్చని పానాసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. కాగా, భారత్‌లో రూ.75 వేల కోట్లున్న ఇండియన్ అప్లయన్స్ మార్కెట్ కోవిడ్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. లాక్డౌన్, చిప్ కొరతతో పాటు ఉత్పత్తులు తగ్గి పోవడం,అదే సమయంలో డిమాండ్లు పెరగడంతో పలు కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..!
సాక్షి, హైదరాబాద్: దుబారాను నియంత్రించటంలో ఆర్టీసీ బరాబర్ అశ్రద్ధ వహిస్తోంది. ఫలితంగా అప్పులకుప్పగా మారిన రుణాలపై ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాని పక్షంలో ప్రైవేటీకరించటానికి వెనకాడనని సీఎం కేసీఆర్ హెచ్చరించారంటూ రెండు రోజుల కింద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దుబారా అంశం చర్చకు వచ్చింది. డీజిల్ ఖర్చు, జీతాలు, విడిభాగాల వ్యయం తప్పనిసరిగా భరించాల్సినవే. కానీ, దుబారాను అరికట్టడం అధికారుల చేతుల్లో పని. దుబారా ఇలా.. హైదరాబాద్–3 డిపోలో 27 గరుడ బస్సులున్నాయి. వీటి కోసం డ్రైవర్లు, కండక్టర్లు పోను 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. డిపో కరెంటు బిల్లు నెలకు రూ.70 వేల వరకు వస్తోంది. ఈ డిపోలో ఉన్నవన్నీ దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులే. ఇవి డిపోల వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవు. 15 కి.మీ. నుంచి 30 కి.మీ.మేర ఖాళీగా ప్రయాణించి బీహెచ్ఈఎల్, మియాపూర్, ఇమ్లీబన్ బస్స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. నిత్యం బస్స్టేషన్ల వరకు ఖాళీగా వెళ్లటం, అక్కడి నుంచి ఖాళీగా తిరిగి రావటంతో ఒక్కో బస్సు అనవసరంగా రూ.2 వేలకుపైచిలుకు డీజిల్‌ను కాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బస్సులను మియాపూర్, బీహెచ్ఈఎల్ లాంటి డిపోలకే కేటాయిస్తే వృథా వ్యయాన్ని అరికట్టవచ్చు. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ పక్కనే పికెట్ డిపో ఉంటుంది. ఈ డిపోలో ఆర్టీసీ సొంత బస్సులు 30, అద్దె బస్సులు 40 ఉన్నాయి. అద్దె బస్సుల నిర్వహణ వాటి యజమానులదే అయినందున డిపోలోకి అవి రావు. సొంతంగా ఉన్న 30 బస్సుల కోసం ఓ పెద్ద భవనం, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇలా డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. భవనానికి కరెంటు బిల్లు నెలకు రూ.80 వేల వరకు వస్తోంది. హైదరాబాద్–2 డిపోలో సొంత బస్సులు 39 ఉంటే 42 అద్దె బస్సులు న్నాయి. ఈ బస్సులకు డ్రైవర్లు, కండ క్టర్లు పోను 50 మంది సిబ్బంది ఉన్నారు. కరెంటు బిల్లు రూ.80 వేలు వస్తోంది. ఇలాంటి చిన్న డిపోలను ఎత్తేసి ఆ బస్సులను వేరే డిపో ల్లో కలిపేస్తే ఈ వృథా వ్యయం ఉండదు. ఈ డిపోలు లేకపోతే వాటిల్లోని పెద్ద పోస్టులు రద్దవుతాయి. జీతాలు, కరెంటు బిల్లు వంటి భారాలు ఉండవు. డిపో భవనాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తే ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుంది. అనవసరపు ట్రిప్పులతో.. రాష్ట్రంలోని కొన్ని చిన్న పట్టణాల నుంచి హైదరా బాద్‌కు 45 నిమిషాలకో బస్సు తిప్పు తున్నారు. కానీ, ఆయా బస్సులు సిటీ చేరేటప్పటికీ 90% మేర ఖాళీగా ఉంటున్నాయి. అలాంటప్పుడు సిటీ ట్రిప్పులను గంటన్నరకు ఒకటి చొప్పున పెడితే ఈ ఖాళీ ట్రిప్పుల దుబారా ఉండదు. కరీం నగర్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కొత్త గూడెం, నిజామాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్, కల్వకుర్తి, నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాల్లో ఈ సమస్య ఉంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు కరీంనగర్, వరంగల్ లాంటి బస్టాండ్లలో ఒకేసారి పలు డిపోల బస్సులు వచ్చి ప్లాట్‌ఫారమ్‌లలో నిలబడుతున్నాయి. ఇవన్నీ 70 శాతం లోపు ఆక్యుపెన్సీ రేషియోతోనే నడుస్తున్నాయి. నాన్‌స్టాప్ బస్సుల్లో అయితే ఇక సిటీకి వచ్చే వరకు మధ్యలో ఎక్కడా ప్రయాణికులు ఎక్కే వీలు ఉండటం లేదు. ఇది ప్రస్తుతం ఆర్టీసీలో పెద్ద దుబారాగా మారింది. పండగలు లాంటి ప్రత్యేక సందర్భాలు, వారాంతాల్లో తప్ప మిగతారోజుల్లో ఈ ట్రిప్పులకు డిమాండ్ ఉండటం లేదు. అయినా అనవసరంగా తిప్పుతున్నారు. -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్‌వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్‌ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్‌పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఆ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మేకిన్ ఇన్ ఇండియా కాన్సెప్టు క్రమంగా ప్రభావం చూపుతోంది. మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల విడుదలైన ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ వివిధ అంశాలపై ప్రతీ ఏడు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ ఏడు నిర్వహించిన సర్వేలో ఇండియా సానుకూల ప్రగతిని సాధించినట్టు ఈ సర్వే ప్రకటించింది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో ఇండియా పరిస్థితి మెరుగైంది. ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యంత అనుకూలమైన దేశాల్లో రెండో స్థానం సాధించింది. ఇంతకు ముందు ఈ స్థానంలో అమెరికా ఉండేది. యూఎస్ఏను వెనక్కి నెట్టి ఇండియా ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇక ఎప్పటిలాగే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో చైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియాకు అనుకూలించేనా ? ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల్లో సింహభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇటీవల చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలించే యోచనలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా కంపెనీలకు ఏషియాలో తయారీ హబ్‌గా చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదిగేందుకు అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ అంశంలో ఇండియాకు ఇండోనేషియా, తైవాన్, వియత్నాంల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వ్యయ నియంత్రణలో వెనుకబాటు తయారీ రంగంలో ఇండియా పరిస్థితి మెరుగైనప్పటికీ వ్యయ నియంత్రణలో ఇండియా వెనుకడుగు వేసినట్టు ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే ప్రకటించింది. గతంలో కాస్ట్ సినారియోలో ఇండియా ద్వితీయ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా ఇండోనేషియా ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు థాయ్‌లాండ్ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చి చేరింది. వ్యయ నియంత్రణలో ఇండియాకు తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక కాస్ట్ విషయంలో కూడా ప్రథమ స్థానంలో చైనానే ఉంది. ఇండియాలో రిస్క్ ఎక్కువ బిజినెస్ రిస్క్‌కు సంబంధించి ఇండియాకు ప్రతికూల ఫలితాలే ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా పాలసీలు, పొలిటికల్ ప్రెషర్లను పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించగా ఇండియా టాప్ దేశాల సరసన కాకుండా రిస్క్ ఎక్కువగా ఉన్న మలేషియా, బెల్జియం, ఇండోనేషియా, బల్గేరియా, రోమేనియా, థాయ్‌లాండ్, హంగరీ, కొలంబియా, ఇటలీ, పేరు, వియత్నాంల సరసన నిలిచింది. ఈ విభాగంలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా కెనడా, అమెరికా, ఫిన్లాండ్, చెక్ రిప్లబిక్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మెరుగుపడాల్సిందే తయారీ యూనిట్‌కు కావాల్సిన స్థలం, మానవ వనరులు విషయంలో ఇండియా స్థానం మెరుగైనా పొలిటికల్ ప్రెషర్, పాలసీల విషయంలో వెనుకబడే ఉంది. ఇక కాస్ట్ విషయంలో తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. చదవండి : సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్ -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
కేంద్రమే ఏదో ఒకటి చేయాలి, కార్ల ధరలపై మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: కార్ల కొనుగోలు వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ తగ్గుతున్నట్టు మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌లో కార్లపై గరిష్ట స్థాయిలోని జీఎస్టీ, తదితర కారణాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు ఈ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే పరిశ్రమ సరైన వృద్ధిని చూడలేదని అభిప్రాయపడ్డారు. మారుతి సుజుకీ వార్షిక నివేదికలో వాటాదారులకు ఆయన తన సందేశం ఇచ్చారు. ‘‘కార్లపై జీఎస్టీ అంతకుముందు ఎక్సైజ్ సుంకం ఆధారంగా ఉంది. ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే జీఎస్టీ ఎంతో ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు తగ్గించేందుకు ముందుకు రాకపోతే చక్కని వృద్ధి సాధ్యపడదు’’ అని ఆయన వివరించారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా మహమ్మారి గణనీయమైన ప్రభావం చూపిందంటూ.. వచ్చే మూడు త్రైమాసికాల్లో పనితీరు అన్నది ప్రధానంగా ప్రజలు తీసుకునే వ్యాక్సిన్లు, రక్షణ చర్యలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ‘‘ఈ ఏడాది మార్చిలో 2021–22 ఆర్థిక సంవత్సరంపై ఎంతో ఆశావహంగా ఉన్నాం. కరోనా మహమ్మారి ఒక్కసారిగా తీవ్రంగా విరుచుకుపడడం అందరినీ ఆశ్చర్యపరించింది. ఇది దేశవ్యాప్తంగా లాక్డౌన్లు, ఆంక్షలకు దారితీసింది. దీంతో ఉత్పత్తి, విక్రయాలు పడిపోయాయి. అంతకుముందు త్రైమాసికంలో కోలుకున్న డిమాండ్ మళ్లీ పడిపోయింది. దీంతో క్యూ1లో విక్రయాలు 3,53,600 యూనిట్లకే పరిమితమయ్యాయి’’ అని భార్గవ పేర్కొన్నారు. వైరస్ ప్రభావంపైనే భవిష్యత్తు విక్రయాలు ఆధారపడి ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ విస్తృత ప్రాతిపదికన జరగాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ దిశలో తగిన చర్యలు అవసరమన్నారు. -
కరీనా కపూర్ ధరించిన మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ముంబై :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలె రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. డెలీవరీ అయిన నెలరోజుల్లోనే తిరిగి వర్క్మూడ్లోకి వచ్చేసేంది కరీనా కపూర్. జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసత్య ప్రచారాలు నమ్మకండి..మాస్క్ ధరించండి అంటూ కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. ఇందులో కరీనా ధరించన ఈ మాస్క్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. సాధారణంగానే సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని కాస్ట్లీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఆ జాబితాలోకి మాస్క్ కూడా వచ్చి చేరింది. ఇప్పుడుమాస్క్ లేనిదే అడుగు బయటపెట్టే పరిస్థితి లేనందున సెలబ్రిటీలు వాటిని మరింత స్టైలిష్‌గా డిజైన్ చేయించుకుంటున్నారు. తాజాగా కరీనా కపూర్ ధరించిన మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆమె ధరించిన మాస్క్ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందింది. నలుపు రంగులో ఉన్న ఈ మాస్క్‌పై 'ఎల్వి' సింబల్‌తో వైట్ కలర్ ఎంబ్రాడయిరీ చేసి ఉంది. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) దీంతో ఈ మాస్క్ ధర తెలుసుకుందామని సెర్చ్ చేసిన నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే దీని ధర అక్షరాలా $355 (26వేలకు పైమాటే). ఇక గతంలోనూ ఇదే బ్రాండ్ మాస్క్‌ను దీపికా పదుకొణె, రణబీర్ కపూర్, సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించారు. దీంతో ఈ మాస్క్ గురించి సోషల్‌మీడియాలో చర్చ నడుస్తుంది. మీరు కూడా ఇలాంటి మాస్క్ కొనాలనుకుంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఈ బ్రాండ్ మాస్క్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. చదవండి : ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధరెంతో తెలుసా? కరీనా రెండో కొడుకు ఫోటో షేర్ చేసిన రణ్‌ధీర్ -
తెలంగాణలో ‘ప్రైవేట్’ టీకా రేటెంతో..?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాకు ఎంత ధర ఖరారు చేస్తారన్న దానిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ వర్గాలకు చెందినవారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 236 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా టీకా వేయించుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తప్ప ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు అనుమతి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాలని తెలిపాయి. అంతమాత్రాన వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి వచ్చినట్లుగా భావించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా ధర ఎంత ఉండవచ్చనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రూ.300 నుంచి రూ.400 మధ్య ఉండే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై నేడో రేపో స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కనుసన్నల్లోనే ప్రైవేట్ వ్యాక్సినేషన్! ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్ నుంచే టీకాలు సరఫరా అవుతాయా లేక నేరుగా కంపెనీల నుంచే వెళతాయా అన్నదానిపైనా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోవిన్ యాప్‌ను ఆధునీకరించే పనిలో ఉంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, కొన్ని మార్పులు చేర్పులతో కోవిన్ యాప్ రెండో వెర్షన్‌ను తీసుకురానుంది. అది నేడో రేపో అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వారికి సరఫరా అయిన వ్యాక్సిన్ వివరాలు తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేశాకే టీకా వేయాలి. అలాగే ఏరోజు ఎన్ని టీకాలు వేశారో ఇంకెన్ని మిగిలాయో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రైవేట్‌లోనూ పకడ్బందీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, దీన్ని పర్యవేక్షించేందుకు కొందరు అధికారులను నియమిస్తామని కూడా ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీకా వేసే సిబ్బందికి ఈ మేరకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. టీకా ఉచితంగా తీసుకోండి ప్రైవేట్‌లో డబ్బులకు కరోనా టీకా వేస్తారు కాబట్టి, లబ్ధిదారులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేసే టీకాలనే తీసుకోవాలి. కిందిస్థాయి పీహెచ్‌సీలు మొదలు గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాసుపత్రుల వరకు దాదాపు 1,250కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా అందుబాటులో ఉంది. మున్ముందు రాష్ట్రంలో దాదాపు 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా అందుబాటులో ఉంచుతాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు -
రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాధేశ్యామ్‌లో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని, కేవలం ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసమే నిర్మాతలు 6కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిజైనర్ టీం పని చేసిందని, ప్రభాస్ కెరియర్లోనే అత్యంత కాస్ట్లీ కాస్టూమ్స్ ఇవేనని సమాచారం. యూరప్ నేపథ్యంలో వింటేజ్ పిరియాడికల్ కథకు తగ్గట్లు ప్రభాస్ లుక్ కోసం చాలా జాగ్రత్తలు పాటించారట మూవీ టీం. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన పది రోజులకే అంటే ఆగస్టు 11న ప్రభాస్ మరో చిత్రం ఆదిపురుష్ విడుదల కానుండటం గమనార్హం. చదవండి : (ప్రేమ కోసం చచ్చే టైప్ కాదంటున్న ప్రభాస్) (‘సలార్’ స్పెషల్ సాంగ్‌లో ప్రియాంక చోప్రా!) -
ధరలు చూసి ‘బోరు’మనాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: నీటి సమస్యను అధిగమించేందుకు ఇంట్లోనో... పొలం దగ్గరో బోరు వేయాలనుకుంటున్నారా.. అయితే కనీసం రెండు, మూడు లక్షలు సిద్ధం చేసుకోవల్సిందే. ఎందుకంటే బోరు తవ్వకం చార్జీలు భారీ పెరిగాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ధరలు సగటున యాభై శాతానికిపైగా పెరిగిపోయాయి. లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు, డీజిల్ ధరలు, లేబర్ చార్జీల పెరుగుదల తదితర అంశాలను చూపుతూ రిగ్ ఓనర్ల సంఘం బోరు తవ్వకం ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారీగా ధరల్లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ... మొత్తంగా ధరల పెంపు భారీగా ఉండడంతో బోరు తవ్వించాలనున్న వాళ్లు ధరలు చూసి బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెయ్యి ఫీట్లకు రూ.2లక్షల పైమాటే.... బోరు తవ్వేందుకు చార్జీల తీరు స్లాబుల ఆధారంగా ఉంటుంది. భూమిలోకి డ్రిల్ చేసే ప్రతి వంద ఫీట్లకు ఒక్కో ధర ఉంటుంది. లోతుకు వెళ్తున్న కొద్ది బోర్వెల్ మిషన్‌పై ఒత్తిడి పెరగడంతో ధరలను క్రమంగా పెంచుతారు. రంగారెడ్డి జిల్లాలో కోవిడ్–19కు ముందు బోరు తవ్వేందుకు ప్రారంభంలో తొలి వంద ఫీట్లకు (అడుగులు) ఫీట్‌కు రూ.45 చొప్పున ఉండేది. క్రమంగా ప్రతి వంద ఫీట్లకు రూ.10 చొప్పున, 500 ఫీట్లు దాటిన తర్వాత రూ.20 చొప్పున, 800 ఫీట్లు దాటిన తర్వాత రూ.50 చొప్పున ధరలు పెంచేవాళ్లు. ప్రస్తుతం ఈ ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రారంభంలో తొలి వంద ఫీట్ల వరకు ఫీట్‌కు రూ.70గా నిర్ధారించగా... ఆ తర్వాత వందకు రూ.80 చొప్పున తర్వాతి వంద ఫీట్లపై రూ.100... ఇలా పెంచుతూ 900–1000 ఫీట్లలోతు తవ్వేందుకు ధర రూ.360గా ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. 2019లో 900–1000 ఫీట్ల లోతు తవ్వేందుకు ధర రూ.200 చొప్పున మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.160 పెంచేశారు. మొత్తంగా వెయ్యి ఫీట్ల లోతుకు బోరు తవ్వేందుకు ఏడాదిన్నర క్రితం గరిష్టంగా 1.25 లక్షలు (కేసింగ్, చార్జీలన్నీ కలిపి) కాగా... ప్రస్తుతం రూ.2.30 లక్షలు అవుతోంది. డీజిల్, కూలీల ధరలు పెరగడం వల్లే.. డీజిల్ ధరలు ఏడాదిన్నర క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అదేవిధంగా లాక్డౌన్ తర్వాత లేబర్ షార్టేజీతో కూలీల ధరలు కూడా పెరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే బోరు తవ్వకం ధరలు పెంచాం. – జె.గంగారెడ్డి, బోర్వెల్ నిర్వాహకుడు, బీఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్ రెండేళ్లలో డబుల్ ఖర్చయ్యింది నాకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో రెండేళ్ల క్రితం బోరు తవ్వించా. దాదాపు 900 ఫీట్లు వేశారు. అప్పుడు రూ.80 వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు పూర్తిగా వరి వేయాలను కోవడంతో ఒక్క బోరు సరిపోదని 15 రోజుల క్రితం మరొకటి తవ్వించా. ఇదివరకు తవ్విన వ్యక్తే 950 ఫీట్లు తవ్వి రూ.1.92 లక్షల బిల్లు చేతిలో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో డబుల్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. – డి.లక్ష్మణరావు, రైతు, మాల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా -
58 దేశాలు, రూ. 517 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 నుండి ఇప్పటివరకూ మొత్తం 58 దేశాలను సందర్శించారు. ఈ మొత్తం వ్యయం 517 కోట్ల రూపాయలని మంగళవారం రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం తెలిపింది. విపక్ష సభ్యుల కోరిక మేరకు మోదీ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంటు ముందుంచారు. ప్రధాని మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్లు మురళీధరన్ తెలిపారు. ప్రధానమంత్రి సందర్శించిన ఇతర దేశాలలో సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శ్రీలంక ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు ఒకసారి చైనాలో పర్యటించారు. ఈ నెల ప్రారంభంలో థాయ్‌లాండ్‌ను కూడా మోదీ సందర్శించారు. అయితే కరోనా, ప్రపంచవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మోదీ విదేశీ పర్యటనకు వెళ్లలేదని వివరించారు. చివరిగా గతేడాది నవంబర్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లినట్లు ఆయన చెప్పారు. వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విదేశీ పర్యటనలు సహాయపడ్డాయన్నారు. తద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాలపై ఇతర దేశాలలో అవగాహనను పెంచిందని మురళీధరన్ చెప్పారు. (ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!) కాగా 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు మోదీ విదేశీ పర్యటనలకు రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్లు 2018 డిసెంబర్లో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి వికె సింగ్ ప్రకటించిన డేటా ప్రకారం జూన్ 15, 2014, డిసెంబర్ 2018 మధ్య కాలంలో ప్రధానమంత్రి విమానాల నిర్వహణ ఖర్చు 1,583.18 కోట్లు, చార్టర్డ్ విమానాల కోసం 429.25 కోట్లు ఖర్చు చేశారు. హాట్‌లైన్ వసతుల కోసం మొత్తం ఖర్చు 9.11 కోట్లుగా ప్రకటించారు. మోదీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్ష పార్టీల విసుర్లు, ప్రధానంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జాతీయ ఎన్నికలకు ముందు, వ్యవసాయ రంగంలో సంక్షోభ సమయంలో విదేశీ పర్యటనలు అవసరమా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. -
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. చార్టర్డ్ విమానాలతో కలిపి ఇంత మొత్తం ఖర్చయిందని లోక్‌సభలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఓ ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు. ఇక 2015-16లో రూ 121.85 కోట్లు, 2016-17లో రూ 78.52 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు. 2017-18లో ఈ వ్యయం రూ 99.90 కోట్లు కాగా, 2018-19లో రూ 100 కోట్లు, 2019-20లో రూ 46.43 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ఖర్చయిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై భారీగా ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం. చదవండి : హోలీ వేడుకలకు దూరంగా ఉందాం! -
సంక్షేమంలో సర్దుపాట్లు..
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా ఖర్చులు తగ్గించుకుంటూ ప్రాధాన్యత కార్యక్రమాలకు అనుగుణం గా నిధులు వెచ్చించాలని సూచిస్తోంది. ఈ మేరకు సంక్షేమ శాఖలు, అనుబంధ విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు పంపింది. ఇటీవల సంక్షేమ శాఖ ల వారీగా ఆర్థిక శాఖ సమీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో 2019–20 బడ్జెట్ కేటాయింపులపై చర్చించడంతోపాటు సంక్షేమ శాఖల వారీగా అవసరాలను ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే శాఖల వినతులను పరిశీలిస్తూనే.. నిధుల సర్దుబాటుపై పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ట్రెజరీ ద్వారా చెల్లింపుల ప్రక్రియ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుండగా.. ప్రభుత్వ శాఖలే నేరుగా చెల్లించే అంశాలపై పలు రకాల మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. సంక్షేమ శాఖ సంచాలక కార్యాలయాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఖజానా శాఖకు అనుసంధానం కాగా.. కార్పొరేషన్లు, సొసైటీలు, ఫెడరేషన్లకు సంబంధించి మాత్రం నేరుగా చెల్లింపులు చేసే వీలుంది. ఇందుకు ఆయా శాఖలకు పీడీ ఖాతాలతోపాటు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, వాటిపై వచ్చే వడ్డీని వినియోగించుకునే అధికారం ఉంది. ప్రభుత్వ అనుమతితోనే ఇవన్నీ నిర్వహించినప్పటికీ.. నిధుల వినియోగంలో స్వతంత్రత ఉంటుంది. తాజాగా వాటికి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల ని ప్రభుత్వం పరోక్ష ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాల్లో నిల్వలెన్ని... రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు సంబంధించి కార్పొరేషన్లు, సొసైటీలకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలుంటాయి. డిపాజిట్లు చేసేందుకు కూడా ప్రత్యేక ఖాతా లుంటాయి. వీటితో పాటు ఇంజనీరింగ్ విభాగాలున్న శాఖలకు వేరుగా పీడీ ఖాతాలుంటాయి. కొన్ని శాఖలకు రెండు, అంతకంటే ఎక్కువ ఖాతాలు న్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఖాతాల్లో నిల్వలపై త్వరలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఆచితూచి ఖర్చు చేయండి వ్యయ కుదింపు చర్యలపైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ప్రాధాన్యత అంశాలకే ఖర్చులు చేయాలని, నిర్మాణ పనులు వద్దని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలల్లో, వసతి గృహాల్లో, ఇతర విద్యాసంస్థల్లో మరమ్మతు పనులను జాగ్రత్తగా చేయాలని, అత్యవసరమైన వాటికే ఖర్చు లు చేయాలని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీలు ప్రతిపాదనలు సమర్పించగా.. సున్నితంగా తిరస్కరించడం గమనార్హం. -
సేవకో రేటు!
సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కొందరు సిబ్బంది.. సేవలకు రేటు కట్టారు. ఒక్కోసేవకు రేటు ఫిక్స్ చేసి ఇక్కడికొచ్చేవారి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేదలమని డబ్బులివ్వకపోతే...నోటికి పని చెబుతారు. అందరిముందే దుర్భాషలాడుతూ పరుపుతీస్తారు. అందుకే ధర్మాస్పత్రికి వచ్చేందుకే జనం జంకుతున్నారు. సిబ్బందితోనే... ఇబ్బంది సర్వజనాస్పత్రిలోని గైనిక్, లేబర్ వార్డు సిబ్బంది (వైద్యులు, స్టాఫ్‌నర్సులు కాదు) తీరుతో ఇక్కడికి ప్రసవాలకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే పురిటి నొప్పుల కంటే ఇక్కడి సిబ్బంది పెట్టే టార్చరే ఎక్కువగా ఉంటుందని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. బాలింతలకు ‘జనని సురక్ష యోజన’ కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా ముందే సిబ్బందికి రూ.1,500 వరకు ముట్టజెప్పాల్సి వస్తోందంటున్నారు. రూ.500 సరిపోదమ్మా ‘‘సిజేరియన్ చేసిన వెంటనే బాబును శుభ్రం చేశాం. మరీ రూ.500 ఇస్తే ఏం సరిపోతుంది. మేము చాలా మందిమి ఉన్నాం...’’ అని వైద్యసిబ్బంది డిమాండ్ చేస్తున్నారని రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లికి చెందిన బాలింత సునీత వాపోయింది. ఆమెకు జూన్ 25న ఆస్పత్రిలోని లేబర్ వార్డులో సిజేరియన్ చేయగా...ఇక్కడి సిబ్బంది డబ్బుకోసం ఇబ్బంది పెట్టారని చెబుతోంది. ఇక స్ట్రెచ్చర్ నుంచి గైనిక్ వార్డుకి తీసుకొచ్చినందుకు రూ 100, చీర మార్చినందుకు రూ 100, కుట్లు శుభ్రం చేస్తున్నందుకూ రూ.50 తీసుకుంటున్నారని సునీత తల్లి సుశీల చెబుతున్నారు. ప్రసవం అయ్యాక శిశువును శుభ్రం చేయాలంటే.. రూ.500 బాలింతను స్ట్రెచ్చర్‌పై గైనిక్ వార్డుకు తీసుకొస్తే.. రూ 100 చీర మార్చినందుకు.. రూ 100 కుట్లు శుభ్రం చేస్తున్నందుకు.. రూ.50 కుట్లు విప్పేందుకు.. రూ. 200 వీల్‌చైర్‌లో అంబులెన్స్ వరకూ తీసుకెళ్తే.. రూ.100 ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవలకు చేసే చార్జ్ కాదు.. మన సర్వజనాస్పత్రిలోనే రోగుల నుంచి సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్న మొత్తం. అడిగినంత ఇవ్వకపోతే ఇక బూతులే. డబ్బులివ్వకపోతే నరకమే! సర్వజనాస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలే. అందకూ కూలినాలి పనులు చేసుకునేవారే. అలాంటి వారినీ ఆస్పత్రిలోని లేబర్, గైనిక్ విభాగంలోని సిబ్బంది పీడిస్తున్నారు. ఆస్పత్రిలోని లేబర్‌వార్డులో రోజూ 30 నుంచి 40 ప్రసవాలు జరుగుతుండగా... వీటితో 10 నుంచి 12 సిజేరియన్లు ఉంటాయి. సిజేరియన్ అయిన వారి నుంచి సిబ్బంది భారీగా వసూలు చేస్తున్నారు. పైగా ఆమాత్రం ఇవ్వలేనోళ్లు కడుపెందుకు తెచ్చుకోవాలని నీచంగా మాట్లాడుతున్నట్లు గర్భిణులు వాపోతున్నారు. చీర మారిస్తే రూ.50 ప్రతి దానికి యాభైలు, వందలు. మేము యాడనుంచి తీసుకురావాలి. మా కోడలు అశ్వినికి పొద్దున్నే డ్రస్ మార్చాలంటే రూ.50 ఇస్తేనే చేస్తామంటారు. ఆ డబ్బుల్లేకనే గదా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చింది. ఉన్నోళ్లుంటారు.. పూట గడవనోళ్లు ఉంటారు... లేనోళ్లను ఇబ్బంది పెట్టకండయ్యా. మీకు దండం పెడతాం. – ఆదెమ్మ, దంతలూరు, బీకేఎస్ మగబిడ్డ పుట్టాడు కదా... ఆ మాత్రం ఇవ్వలేవా..? ‘‘మగ బిడ్డ పుట్టాడు కదా...? ప్రసవమైనప్పుడు ఏమీ ఇవ్వలేదు. కనీసం బిడ్డను శుభ్రం చేసిన దానికి, యూరిన్ పైప్ వేసినందుకైనా డబ్బులివ్వు’’ అని అడుగుతున్నారని కూడేరు మండలం కలగళ్ల గ్రామానికి చెందిన బాలింత ఆదిలక్ష్మి వాపోయింది. ఆమె జూన్ 25న ప్రసవం కాగా..డబ్బుకోసం సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కన్నీటిపర్యంతమయ్యింది. డబ్బులివ్వకుంటే అందరి ముందే దూషిస్తున్నారని, పరువు పోతుందని భావించి డబ్బులిస్తున్నామని చెబుతోంది. కూలి పనులు చేసుకునే తమ లాంటి పేదోళ్లతో ఇలా డబ్బులు తీసుకోవడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో వైద్య సేవలన్నీ ఉచితం. ఇక్కడ సిబ్బందికి చిల్లిగవ్వ ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే గైనిక్, లేబర్ తదితర విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెడతాం. – డాక్టర్ బాబూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నాడు 6 పైసలు.. నేడు రూ.46
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంటే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. మొదటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగాయి. అభ్యర్థులూ పెరిగారు. దాంతో పాటే ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతోంది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి రూ.10 కోట్లు ఖర్చయ్యాయి. అంటే ఒక ఓటరుకు 6 పైసలు ఖర్చయినట్టు. అదే 2014 నాటికి ఎన్నికల వ్యయం రూ.3,870 కోట్లకు చేరింది. అంటే ఒక ఓటరుపై రూ.46 వెచ్చిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఒక ఓటరుపై రూ.15 ఖర్చు చేసింది. అభ్యర్థుల ప్రచార వ్యయం, భద్రతా ఏర్పాట్ల ఖర్చు మినహా మిగతా ఖర్చు ఇది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రచారం చేపట్టడం, దాని కోసం భారీగా ప్రకటనలు జారీ చేయడం, ఎన్నికల జాబితాలను డిజిటలైజ్ చేయడం వంటి చర్యలతో ఇటీవల ఎన్నికల వ్యయం బాగా పెరిగింది. అలాగే, ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న గౌరవ భృతి పెరగడం, వారికి శిక్షణ నివ్వడానికి రాకపోకల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీల ప్రచారాన్ని, పోలింగ్ సరళిని వీడియో తీస్తున్నారు. దీని ఖర్చు కూడా ఎన్నికల సంఘం ఖాతాలోకే వెళుతుంది. అమెరికా కంటే ఎక్కువ దేశంలో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకుందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. 2019 ఎన్నికల వ్యయం దేశ చరిత్రలోనే అత్యధికంగా ఉండవచ్చని, బహుశా ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంత ఖర్చు ఉండదని వారంటున్నారు. 2016లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్ ఎన్నికలు కలిపి జరిగాయి. వీటికి మొత్తం 650 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 2014లో మన దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు 500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయని అంచనా. 2019 ఎన్నికల వ్యయం దీన్ని మించిపోతుందని కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ థింక్ ట్యాంక్‌కు చెందిన మిలన్ వైష్ణవ్ చెప్పారు. -
నన్ను కట్టుకో
‘‘అబ్బ.. ఎంత బాగుందోనే ఈ చీర...’’ కళ్లల్లో మెరుపుతో కాంప్లిమెంట్ ఇచ్చింది మందాకిని.‘‘కదా... అందుకే.. బడ్జెట్ కంటే ఎక్కువైనా కొనేసుకున్నా ...’’ అపురూపంగా చీరను హత్తుకుంటూ తార. ‘‘ఊ... చాలాబాగుందే..’’ మందాకిని మనసంతా చీరమీదే ఉంది. ‘‘ఎక్కడ కొన్నావ్?’’ ఆదుర్దాగా అడిగింది .‘‘అదృశ్యపట్టులో’’ ఉత్సాహంగా తార. ‘‘ అయితే.. నా పెళ్లి షాపింగ్ కూడా అక్కడే చేస్తా...’’ మందాకిని. పదిహేను రోజుల్లో తార పెళ్లి. ఫార్మాసిస్ట్. ప్రాక్టికల్‌గా ఉండే మనిషి. అనవసర ఖర్చులకు దూరం. అందుకే పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరగాలని పెళ్లికొడుకు వాళ్లతో ఒప్పించింది. కట్నం ముచ్చటేరానివ్వలేదు. కాని ఈ పెళ్లి చీర పట్లే ఎందుకో విపరీతమైన కాంక్షను కనబరిచింది. వందల చీరల్లో ఈ చీరే ఆకర్షించింది ఆమెను. ఎన్ని సార్లు దాన్ని చూడొద్దనుకున్నా.. దానివైపే మనసు లాగింది. దాని ధర చూశాక గుండె గుభేల్మనడంతో పక్కన పడేసింది కూడా. అయినా అది తననే చూస్తున్నట్టు.. నన్ను తీసుకో అంటూ అభ్యర్థించినట్టూ.. వెంటాడినట్టూ అనిపించింది తారకు. దాంతో ఆ చీరనే తీసుకుంది. తార తల్లి, మేనత్తకు ఆశ్చర్యమేసింది...పీనాసిగా ముద్రేసుకున్న తార.. పెళ్లి చీర విషయంలో ఇంత ఉదారంగా ఉందేంటని! ‘‘ ఇంకా వారమే ఉందే. బ్లౌజ్ కుట్టడానికి ఇవ్వనేలేదు. చీరకు ఫాల్ కూడా వేయాలి. ఎప్పుడిస్తావ్?’’ కేకలేసింది తార మేనత్త పెళ్లి సరంజామా అంతా సర్దుతూ.‘‘ఇస్తాలే అత్తా...’’ నీరసంగా తార ..కాఫీ కప్‌తో మేనత్త పక్కనే కూర్చుంటూ.‘‘ఇంకెప్పుడూ?’’ అంది పసుపు కొమ్ముల మూట విప్పుతూ మేనత్త. ‘‘అబ్బా.. అది మూటకట్టేసేయత్తా’’ చిరాగ్గా తార. ‘‘ఏమైందే? శుభమాని పసుపు మూట విప్పుతూంటే కట్టేయమంటావ్’’ మేనకోడలి ప్రవర్తనకు విస్తు పోతూ.‘‘ తీసేయ్ ’’ అని అరుస్తూ ఆ మూటను కాలుతో విసిరికొట్టింది తార.అవాక్కయి నోరెళ్లబెట్టింది మేనత్త. ఎంత కోపన్నయినా బ్యాలెన్స్ చేసుకునే పిల్ల.. ఇలా అకారణంగా చిరాకుపడడం.. ఇదే మొదటిసారి. కొంపదీసి ఈ పెళ్లిగాని ఇష్టంలేదా ఏంటీ? ఒక్క క్షణంలోనే రకరకాల ఆలోచనలు మేనత్తకు. ‘‘అత్తా.. పసుకొమ్ముల మూటేంటి? అలా గిరాటేశారు?’’ అమాయకంగా తార.. షాక్ మేనత్తకు. ‘‘అత్తా..నిన్నే అడుగుతోంది? ’’చేష్టలుడిగిన మేనత్త భుజం పట్టి ఊపుతూ తార.‘‘ ఎవరు గిరాటేసారో నీకు తెలీదా’’ అయోమయంగా అడిగింది మేనత్త. ‘‘ నాకేం తెలుసత్తా? నేనిప్పుడే కదా వచ్చింది ’’ అంటూ నేల మీద గొంతుక్కూర్చుని పసుపు కొమ్ములన్నీ ఏరసాగింది. మతిపోయింది మేనత్తకు. వంగి.. తార గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తుతూ.. ‘‘ఏమే... వీటిని ఎవరు విసిరికొట్టారో నిజంగానే నీకు తెలీదా?’’ అడిగింది.‘‘ఏమైందత్తా నీకు?’’ గాబరాగా తార. తల పట్టుక్కూలబడ్డది మేనత్త. మధ్యాహ్నం భోజనాలప్పుడు.. ఎంత వడ్డిస్తున్నా వద్దనడం లేదు తార. వంచిన తలెత్తకుండా తింటూనే ఉంది. ఉదయం జరిగిన సంఘటనతో ఇంకా తేరుకోని మేనత్త.. తార తింటున్న తీరుతో మరింత గందరగోళంలో పడిపోయింది. ఇంట్లో వాళ్లందరికీ వింతగానే ఉంది. తారను అలా వదిలేసి మౌనంగా వేరే గదిలోకి వెళ్లిపోయారు వాళ్లు ఏమీ అర్థంకాక. మేనత్త కూడా మళ్లీ మళ్లీ తిరిగి చూస్తూ భయం భయంగానే అక్కడి నుంచి కదిలింది. లోపల గదిలో ఉన్న తార తల్లిదండ్రులకు పొద్దున జరిగిన విషయం చెప్పింది ఆమె. కారణం కనుక్కొనే యోచనలో పడ్డారంతా. ఇంతలోకే వగరుస్తూ ఆ గదిలోకి వచ్చింది తార.. ‘‘అమ్మా.. ఆకలేస్తోందే. అన్నం పెట్టవా? మందాకిని వస్తానంది. తినేసి పార్లర్‌కు, అక్కడి నుంచి టైలర్ దగ్గరకూ వెళ్లాలి.. బ్లౌజ్ ఇవ్వాలి.. ఫాల్ కుట్టించాలి.. అమ్మో.. టెన్షన్ వచ్చేస్తుంది’’ అంది ఫోన్లో ఏదో నంబర్ కలుపుతూమేనత్తకైతే మొహంలో నెత్తురు చుక్కలేదు.. మిగతా వాళ్లది ఉదయం మేనత్తకు ఎదురైన అనుభవమే!తార తండ్రి.. మెల్లగా భార్య వెనకాలకు వచ్చి.. మోచేత్తో పొడిచాడు.. ‘‘వెళ్లి పిల్లకు అన్నం పెట్టు’’ అన్నట్టుగా!కన్ఫ్యూజన్ స్టేట్‌లోనే తార తల్లి డైనింగ్ హాల్లోకి వెళ్లింది ‘‘రామ్మా.. అన్నం పెడతాను’’ అని కూతురిని పిలుస్తూ!‘‘ఆ.. ఆ..’’ అని తల్లికి సమాధానమిస్తూ ఫోన్లోంచి తల పైకెత్తింది. కళ్లు పెద్దవి చేస్తూ అందరూ తననే చూస్తూండే సరికి.. ‘‘ఏమైంది’’ అడిగింది . ఏమీ కాలేదన్నట్టుగా తలలూపారు అందరూ! ‘‘మరెందుకలా చూస్తున్నారంతా?’’ ఈసారి ఆశ్చర్యం తారది. సేమ్ ఓల్డ్ ఎక్స్ప్రెషన్లో ఫ్యామిలీ మెంబర్స్.ఏంటో అన్నట్టుగా భూజాలెగరేస్తూ నడిచింది తార భోజనాల గదిలోకి. పెళ్లికి మూడు రోజుల ముందు.... ఉదయం ఏడైంది.. దగ్గరి చుట్టాలతో తారా వాళ్లిల్లంతా సందడిగా ఉంది. వదినామరదళ్ల పరాచికాలు.. బావామరదుల వేళాకోళాలు.. అత్తాకోడళ్ల సరదాలతో కళకళలాడుతోంది. కాని అసలు మనుషుల మొహాల్లో సంతోషం కనపడ్డం లేదు. బయటికి నవ్వు నటిస్తున్నారు కాని లోపలంతా తెలియని భయం... పూటపూటకూ మారుతున్న తార బిహేవియర్ గురించి. పెళ్లి కూతురుని చేయడానికి పీట మీద కూర్చోబెట్టారు తారను. అమ్మమ్మ, నానమ్మతోపాటు అత్త వరస, పిన్ని వరస, అక్క వరస అయ్యేవాళ్లంతా ఒక్కొక్కళ్లే వచ్చి బొట్టు పెడ్తున్నారు...తార తల్లి,మేనత్త ఉగ్గబట్టుకుంటున్నారు.. తార ఎప్పుడు ఎలా.. రియాక్ట్ అవుతుందోనని!వాళ్ల అంచానాలను తారుమారు చేస్తూ ... తార .. చక్కగా నవ్వుతూ.. సిగ్గు పడుతూ కూర్చుంది. పసుపు రాస్తున్నారు.. నలుగు పెడ్తున్నారు.. మంగళ వాద్యాలు మోగుతున్నాయి.. పెరట్లో ఆరుబయట ఆనవాయితీగా మంగళ స్నానం చేయించాక.. షాంపూతో తలంటుకొమ్మని పెరట్లోనే ఉన్న బాత్రూమ్లోకి పంపించారుతారను.టిఫిన్ పని చూసేందుకు వాళ్లంతా వంటింట్లోకి వెళ్లబోతుంటే తార ఎదురు పడింది. నిశ్చేష్టులయ్యారంతా. అసంకల్పితంగానే వెనక్కి తిరిగి చూశారు బాత్రూమ్ వైపు. తలుపు వేసే ఉంది. మళ్లీ తార ౖవైపు తిరిగారు. ‘‘సారీ.. అమ్మా.. అలారం మోగినా మెలకువ రాలేదు. ముహూర్తం ఎనిమిదిలోపు ఎప్పుడైనా అన్నారు కదా?’’అంది తార. యాంత్రికంగా తలూపింది తార తల్లి. ‘‘బ్రష్చేసుకొని వస్తానుండండి’’ అంటూ పెరట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. మతి పోయినంత పనైంది అందరికీ! వీళ్ల స్థితి ఇలా ఉండగా.. తార అన్నయ్యకు ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘సర్.. మీరు ఈ మధ్యఅదృశ్యపట్టులో ఏమైనా షాపింగ్ చేశారా?’’‘‘అవును’’‘‘అక్కడ బిల్ డిటైల్స్‌లో మీ నంబర్ తీసుకుని ఫోన్ చేస్తున్నా సర్.. ఒకవేళ పెళ్లి చీర కొంటే మాత్రం అది కట్టుకోవద్దని చెప్పండి. కొనే వరకు నన్నుతీసుకో అని.. కొన్నాక నన్ను కట్టుకో అంటూ కలలో కూడా వెంటాడుతుంది ఆ చీర. మా చెల్లి ఆ షాప్‌లోనే పనిచేసేది. పెళ్లి కుదిరాక అక్కడే పెళ్లి చీర కొనుక్కుంది. పెళ్లికొడుక్కి ఇదివరకే పెళ్లయిందని తెలిసి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మా చెల్లి ఆ చీరతోనే ఉరేసుకుంది సర్’’ఫోన్ డిస్కనెక్ట్ చేసి గబగబా తల్లి దగ్గరకు పరిగెత్తాడు తార వాళ్ల అన్నయ్య. - సరస్వతి రమ -
రూపాయి నాణెం = రూ.1.11?
సాక్షి,ముంబై: రూపాయి నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.1.11. అవునా... అని ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఆర్బీఐ అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ఒక రూపాయి నాణెం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాలా రూపాయి పదకొండు పైసలు. అంటే దాని మార్కెట్ వాల్యూ కంటే అధికంగా ఖర్చు అవుతోందన్న మాట. ఆర్టీఐ ద్వారా ఇండియా టుడే అడిగిన ప్రశ్నను వివిధ ప్రభుత్వ నాణేల ముద్రణా కార్యాలను పంపించింది రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా. అయితే నాణేల ఉత్పత్తి కయ్యే మొత్తం వ్యయం వివరాలను అందించేందుకు ఇండియన్ గవర్నమెంట్ మింట్ (ఐజీఎం) నిరాకరించింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 8 (1) (డీ) ప్రకారం వాణిజ్య రహస్యమని పేర్కొంది. మింట్ అందించిన సమాచారం ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన ఖర్చు ఇటీవలకాలంలో భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో నాణేల తయారీని భారీగా తగ్గించి వేసింది మింట్. 2016-17లో 2201 మిలియన్ల నాణేలను తయారుచేసిన మింట్..2015-16లో 2151 మిలియన్లుగా ఉన్నాయి. వీటిలో రూపాయి నాణేల 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గించింది. హైదరాబాద్ మింట్ కూడా గత నాలుగు సంవత్సరాల గణాంకాల సమాచారాన్ని అందించింది. ముంబైతోపాటు హైదరాబాద్‌లలో ఉన్న మింట్ కేంద్రాల్లో రూ.10, రూ.5, రూ.2. రూ.1 నాణేలు తయారవుతున్నాయని మింట్ తెలిపింది. ఖర్చులు పెరిగినప్పటికీ నాణేల తయారీని నిలిపివేసే అవకాశాలు లేవని మింట్ ప్రకటించింది. అయితే రూపాయి నాణెంతో పోలిస్తే మిగిలిన నాణేల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ. 2 నాణెం తయారవుతుండగా, 5 రూ. నాణేనికి రూ.3.69, 10 రూపాయల నాణేనికి రూ. 5.54 ఖర్చు అవుతోంది. -
పెద్ద లక్ష్యం
లక్ష్యం ఏమిటో నిర్థారించుకున్నాక దాని కోసం చేయవలసిన కష్టమంతా చేయాల్సిందే. అతనిదొక ఎగువ మధ్యతరగతి కుటుంబం. తన వాటాగా తండ్రి ఇచ్చిన డబ్బుకు మరికాస్త అప్పు చేసి ఆ వచ్చిన డబ్బుతో కాస్త పెద్ద హోటల్ పెట్టాలనుకున్నాడు. లక్ష్యం నిర్ణయించుకున్నాడు కాబట్టి దానిని నెరవేర్చుకోవడం కోసం ముందు ఏదయినా హోటల్లో పనిచేసి కొంత అనుభవం గడించాలనుకున్నాడు. ఓ హోటల్‌కు వెళ్లి లెక్కలు రాసే పని అడిగాడు. తన దగ్గర పనేమీ లేదు పొమ్మని చెప్పి లోపల ఏదో పని చూసుకుని కొద్దిసేపటి తర్వాత వచ్చాడు యజమాని. ఆ యువకుడు అక్కడే ఉండటం చూసి ఇంకా ఎందుకున్నావని అడిగాడు. ‘‘సార్, నాకు ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి, మీరు ఏ పని చెప్పినా చేస్తాను. బజారుకు వెళ్లి హోటల్‌కి కావలసిన సరుకులు తీసుకు వస్తాను, వచ్చిన కష్టమర్లను రిసీవ్ చేసుకుని వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటాను. మీరు జీతం ఎంత ఇచ్చినా ఫరవాలేదు’’ అని ప్రాధేయపడ్డాడు. ఆ యజమానికి జాలేసి, వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. ఈ యువకుడు హోటల్లోకి అవసరమైన సరుకులు, కూరగాయలు మధ్యవర్తులతో పని లేకుండా స్వయంగా తనే వెళ్లి కొనడం దగ్గర నుంచి çహోటల్‌ను శుభ్రంగా ఉంచడం, వచ్చిన వారికి మర్యాద చేయడం వంటి పనులతో హోటల్‌కు ఖర్చులు తగ్గించి, రాబడి పెంచాడు. తన మంచితనంతో, సామర్థ్యంతో తొందరలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా, ఆ తర్వాత మేనేజర్‌గా ఉద్యోగోన్నతి పొందాడు. కొద్దికాలానికి ఆ పెద్దాయన పొరుగు దేశంలో స్థిరపడదలచి ఈ యువకుడికి నామమాత్రపు ధరకే ఆ హోటల్‌ను విక్రయించాడు. ఆ యువకుడు తాను పని చేసే హోటల్‌కు యజమాని అయ్యాడు. అలా మొదలైన ఆ యువకుడి ప్రస్థానం అంతటితో ఆగలేదు. ఎన్నో హోటల్స్‌ను స్థాపించాడు. ఎందరో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రేరణ అయ్యాడు. ఆనాటి ఆ యువకుడే మోహన్ సింగ్ ఒబెరాయ్. స్టార్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసిన ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయ్యాడు. పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోగానే సరిపోదు, అది స్పష్టంగానూ, అర్థవంతంగానూ ఉండాలి. దానిని ఎలాగైనా నెరవేర్చుకునే తపన, వచ్చిన చిన్న అవకాశాలని కూడా అందిపుచ్చుకునే ఓర్పూ నేర్పూ ఉండాలి. – డి.వి.ఆర్. -
రూపాయితో... పండుగ చేసుకునేదెలా?
‘‘ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని పండుగ చేస్కో...!’’ జగన్నాథ్ దర్జాగా చెప్పాడు కృష్ణతో. కానీ, కృష్ణ ముఖం వెలిగి పోలేదు. బక్కచిక్కిన రూపాయి ఒక్కసారిగా తన కళ్లలో మెదలడంతో అతడి ముఖంపై ఆందోళన కనిపించింది. దీంతో ‘‘ఏమైంది కృష్ణా...?’’ అంటూ జగన్నాథ్ ప్రశ్నించాడు. ‘‘రూ.వెయ్యితో పండుగ చేసుకోవడం కాదు... అది నాకు దండగే. దీంతో 15 డాలర్లు కూడా రావు. ఓ జత డ్రెస్ కూడా కొనలేను..’’ అంటూ ఓ మంత్ర దండకం వినిపించటంతో అది విని జగన్నాథ్ ముఖంలోనూ మార్పు కనిపించింది. నిజానికి ఈ బక్క రూపాయి ఇప్పుడు సామాన్యుడి కొనుగోళ్లపై పెద్ద భారాన్నే మోపబోతోంది. పండుగల సీజన్‌కు ముందు రూపాయి దెబ్బను తలచుకుని అటు కంపెనీలు, ఇటు సగటు వినియోగదారులు కూడా నిట్టూర్చే పరిస్థితి. ఎందుకంటే రూపాయి కారణంగా పడే ప్రభావాన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతూ కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కార్ల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇంత వరకూ పండగ సమయంలో కొందామని వేచి చూసిన వారిని తాజా పరిణామాలు పునరాలోచనలో పడేస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72కు సమీపంలోకి వచ్చేసింది. ఇది అటు కంపెనీలు, ఇటు వినియోగదారులకూ రుచించనిదే. రూపాయి ఈ ఏడాది పండుగ అమ్మకాలకు గండికొట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అయితే ఉంది. రూపాయి క్షీణతతో పెరిగిన ముడి సరుకుల (లోహాలు, ప్లాస్టిక్) ధరలతో కంపెనీలకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ విడిభాగాల ధరలకు ప్రామాణికం డాలరే. ఈ నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి ధరల భారాన్ని దింపుకునేందుకు కంపెనీలు ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్జీ, హాయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ 3–5 శాతం స్థాయిలో ఈ నెల్లోనే ధరల్ని పెంచేశాయి. ప్యానాసోనిక్ ఇండియా కూడా 2–3 శాతం వరకు ధరల్ని అతి త్వరలోనే పెంచనుందని అంచనా. కార్ల కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ, పలు రకాల మోడళ్ల ధరలను రూ.6,100 వరకు పెంచింది. రూపాయి క్షీణత భారాన్ని ఇలా దింపుకుంది. అలాగే, టయోటా కిర్లోస్కర్ కూడా ధరల్ని ఈ నెల్లోనే 2–3 శాతం వరకు పెంచేసింది. డిమాండ్‌కు దెబ్బ అయితే, ఈ ధరల పెంపు డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కంపెనీలు ఎక్కువగా అమ్మకాలను నమోదు చేసుకునే పండుగల సీజన్ డిమాండ్‌పై ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. విక్రయాలు 5–10 శాతం వరకు తగ్గొచ్చని కన్జూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల విక్రేతల అంచనా. రూపాయి విలువ ఇంకా పడితే, కంపెనీలు మరింత ధరల్ని పెంచితే ఈ డిమాండ్ ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా జరగాల్సింది కాదు... ‘‘రూపాయి క్షీణత అన్నది అనువుగాని సమయంలో జరుగుతోంది. జూలైలో జీఎస్టీ రేట్లు 10 శాతం తగ్గించడంతో పండుగల విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాం. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేశాం. కానీ, ప్రస్తుత ధరల పెంపుతో పండుగల డిమాండ్‌పై గణనీయ ప్రభావమే పడనుంది’’ అని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. వినియోగదారుల వెనకడుగు ‘‘పరిశ్రమ కొంత కాలం పాటు సింగిల్ డిజిట్ వృద్ధినే చూసింది. జీఎస్టీ రేట్ల కోతతో పరిస్థితి మారుతుందని ఆశించాం. కానీ, వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది’’ అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. ఓ స్థాయికి మించి పెంచలేం ‘‘దీర్ఘకాలంలో రూపాయి స్థిరపడుతుందని భావించడం లేదు. రూపాయి డాలర్‌తో ఏటా 6 శాతం మేర క్షీణిస్తుందన్న దానికి సిద్ధపడ్డాం. 2–3 శాతం ధరల పెంపు పడుతున్న రూపాయి ప్రభావాన్ని కొంతవరకే అడ్డుకోగలదు. కానీ, ఓ స్థాయికి మించి ధరలను పెంచలేం. ఎందుకంటే ఇది అమ్మకాలపై ఒత్తిడికి దారితీస్తుంది’’ అని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. టీవీల ధరలకూ రెక్కలు ఇక టీవీలు కూడా రూపాయి కారణంగా ఖరీదవుతున్నాయి. కొన్ని టీవీల కంపెనీలు ఈ నెల మధ్య నుంచే ధరల్ని పెంచనున్నాయి. థామ్సన్, కొడాక్ టీవీల తయారీ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే ధరల్ని పెంచేసింది. ఆగస్ట్‌లో ఒకసారి, సెప్టెంబర్‌లో మరోసారి ధరల్ని పెంచడం జరిగిందని, 12 శాతం మేర ధరలు పెరిగినట్టు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్‌సింగ్ మార్వా తెలిపారు. -
గిట్టుబాటు ధరలేక ఉల్లిరైతు విలవిల
-
బొమ్మ కొనివ్వు నాన్నా
ఒకరోజు ఒక పిల్లాడు తన తండ్రితో కలిసి జాతరకు వెళ్లాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని తండ్రి తపన. జాతరలో బోల్డన్ని బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించుకుని మురిసిపోవాలని కొడుకు ఆలోచన. పిల్లవాడికి కబుర్లు చెబుతూ మెల్లగా నడుస్తున్నాడు తండ్రి. ఇంకా తనకి బొమ్మలేమీ కొనిపెట్టలేదని ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చింది. ఆ బొమ్మ కొనిమ్మన్నాడు. ఆ బొమ్మవంకా, దాని పైన ఉన్న ధర వంకా చూశాడు తండ్రి. ఆ తర్వాత జేబులో ఉన్న డబ్బును చూసుకున్నాడు.‘‘ఇది వద్దులే’’ అంటూ ముందుకు నడిపించాడు కొడుకుని. డబ్బంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో భార్య తీసుకుని రమ్మని చెప్పిన సరుకుల మాటేమిటి అని ఆలోచిస్తూనే, ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలనుకున్నాడు తండ్రి. ఇంతలో ఎవరో తండ్రిని పలకరించారు. కొడుకు చేయి వదిలి వారితో మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు తండ్రిని గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. కాసేపయ్యాక వెనక్కి తిరిగి చూస్తే తండ్రి కనిపించలేదు. భయమేసింది. దిగులుతో ఏడుపు మొదలైంది. ఏడుస్తున్న ఆ పిల్లాణ్ణి చూసి అందరూ పోగయ్యారు. ‘‘నీకు బోలెడన్ని బొమ్మలిస్తాము. ఏడవకు’’ అన్నారెవరో.‘‘నాకు నాన్న కావాలి’’ అన్నాడు పిల్లాడు వెక్కుతూ. ఇంకెవరో రకరకాల తినుబండారాలు తీసుకొచ్చి పిల్లాడి చేతిలో పెట్టారు. ‘‘నాకు నాన్న కావాలి’’ అని వెక్కిళ్లు పెట్టాడు. ఆశ్చర్యం! ఆ పిల్లాడికిప్పుడు బొమ్మల గురించిన ఆలోచనే లేదు. ‘నాన్న కావాలి’ అంతే! ఇంతలో కొడుకును వెదుక్కుంటూ అక్కడికొచ్చాడు నాన్న. వెలిగిపోతున్న ముఖంతో తండ్రిని అతుక్కుపోయాడు ఆ పిల్లాడు.తెలిసిన వాళ్లెవరో కనిపిస్తే చేబదులు తీసుకొచ్చిన తండ్రి ‘‘బొమ్మలు కొందాం పద’’ అన్నాడు.‘‘నాకు బొమ్మలేమీ వద్దు. ఇంటికెళదాం’’ అన్నాడు కొడుకు! దేవుణ్ణి అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకుంటాం. అడిగిందల్లా ఇవ్వలేదని బాధపడతాం. ఇంతలో ఏదో జరుగుతుంది. అప్పుడు మనమే వేడుకుంటాం దేవుణ్ణి.. కనీసం ఇలాగైనా ఉంచు స్వామీ’’ అని. దేవుడు గీసిన పెద్దగీత ముందు మన కోరికలనే చిన్న గీతలు చిన్నబోతాయన్నమాట. – డి.వి.ఆర్. -
కొఠియాలో వారపు సంత ప్రారంభం
సాలూరు రూరల్ : వివాదాస్పద ఆంధ్ర–ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లో ప్రజలను తమ వైపునకు తిప్పుకునే అన్ని ప్రయత్నాలు ఒడిశా ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కొఠియా గ్రామంలో ఒడిశా ఆధ్వర్యంలో వారపు సంతను బుధవారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా ప్రజలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు, నాయకులు మాట్లాడుతూ కొఠియా గ్రూప్ గ్రామాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవేనని స్పష్టం చేశారు. ప్రతి బుధవారం ఇక్కడ వారపు సంత జరుగుతుందని ప్రభుత్వ నిధులతో సంతను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు విత్తనాలు మార్కెట్ ధరకే అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలోనే ప్రతి బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రాపై ఆధారపడవద్దని సూచించారు. ఈ గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో ర్యాలి నిర్వహించారు. ఇంతవరకూ కొఠియా గ్రూప్ గ్రామాల ప్రజలు ప్రతి మంగళవారం ఆంధ్రా రాష్ట్రంలోని సారిక పంచాయతీ నేరెళ్లవలసలో జరిగే వారపు సంతకు వచ్చేవారు. ప్రస్తుతం కొఠియాలోనే ఒడిశా ప్రభుత్వం వారపు సంతను ఏర్పాటు చేయడంతో వారికి సంత అందుబాటులోకి వచ్చినట్టయింది. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కృషి బాస్‌రౌత్, ఎమ్మెల్యే ప్రఫుల్ కుమార్ పంగి, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, పొట్టంగి మాజీ ఎంపీ జయరాం పంగి, పొట్టంగి బ్లాక్ ఛైర్మన్ జగజ్జిత్ పంగి తదితరులు పాల్గొన్నారు. -
నెయిల్ పాలిష్ ధర వింటే.. గుండె ఆగుతుంది?!
ప్రతి మనిషి జీవితంలో తన స్థాయిలో లగ్జరీని కోరుకుంటున్నాడు. వస్తువు ఎలాంటిది అయినా.. దాని ఖరీదు మాత్రం తన స్థాయికన్నా అధికంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతి వస్తువును తయారీదారులు అదే స్థాయిలో రూపొందించిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తేన్న నెయిల్ పాలిష్ కూడా అటువంటిదే. దీనిని ప్రపంచంలోని కోటీశ్వరుల్లో చాలాతక్కువ మంది మాత్రమే ఉపయోగించలరు. లగ్జరీకి పరాకాష్టగా కూడాదీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఖరీదు. కేవలం కోటీ 63 లక్షల 66 వేల రూపాయలు మాత్రమే. దీనిని దిగుమతి చేసుకోవాలంటే అదనంగా మరో పది లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఇంతటి ఖరీదైన నెయిల్ పాలిష్‌ని లాస ఏంజెల్స్‌లోని లగ్జరీ సౌందర్య సాధానాల తయారీ సంస్థ అజాతురే రూపొందించింది. ఈ నెయిల్ పాలిష్‌లో 267 కేరట్ల బ్లాక్ డైమండ్‌ను ఉపయోగించారు. అందుకే ఇంత ఖరీదు అని సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను కేవలం ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తామని చెప్పారు. -
ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్
ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. బ్యాటరీ లోపాలు, కొరతతో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లు ఇకమీదట ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్మెంట్ తొందరగానే సాధించవచ్చు. అదీ కూడా చాల తక్కువ ధరకే. సుమారు 2 వేల రూపాయలు (అన్ని కలుపుకొని) కే లభించనుంది. తాజాగా బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖరీదు అంతర్జాతీయంగా 29 డాలర్లుగా ఉండగా, మన దేశానికి సంబంధించి దీని ధర పన్నులతో కలిపి దాదాపు 2600రూపాయలకు లభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్ కేంద్రాల్లో ఈ తగ్గింపు ధర వర్తించనుంది. సవరించిన రేట్లకు పాత ఐఫోన్ మోడళ్లకు బ్యాటరీ అందుబాటులో ఉన్నట్టు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో ఆపిల్ కేంద్రాలు ధృవీకరించాయి. చాలా పాత ఐ ఫోన్లతోపాటు, ఐ ఫోన్ 6, 6ప్లస్, 6ఎస్, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ తదితర మిగిలిన మోడళ్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దీని రూ . 6,500గా ఉండడంతో పాటు...బ్యాటరీ కోసం దీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఆపిల్ అధీకృత సేవా కేంద్రాల దగ్గర సంబంధిత ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌కు అర్హత ఉందా , లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాగా ఇటీవల పాత ఐ ఫోన్ బ్యాటరీ లోపం కారణంగా ఐ ఫోన్ స్లో కావడం, లేదా షట్ డౌన్ కావడం వివాదం రేపింది. దీంతో ఐఫోన్ మేకర్ ఆపిల్ గత నెలలో బ్యాటరీ రీప్లేస్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది. -
పెరిగిన ‘విద్యుత్’ వ్యయం!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యయం ఏటికేటికి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది (2018–19) రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం రూ.35,714 కోట్లు అవసరమని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా నివేదించాయి. ఇందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.27,903 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. శుక్రవారం 2018–19కి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్)ను డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. వచ్చేఏడాది రాష్ట్రంలో అమలు చేసే విద్యుత్ చార్జీల పట్టిక లేకుండా ఈ ప్రతిపాదనలు సమర్పించడంతో 2018–19లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా లేక యథాతథంగా ఉంటాయా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. గతేడాదిలాగే చార్జీల వివరాలను మరికొన్ని రోజుల తర్వాత ఈఆర్సీకి డిస్కంలు ప్రత్యేకంగా ప్రతిపాదించను న్నాయి. అప్పుడే చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. 2019లో జరిగే ఎన్నికల నేపథ్యం లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం కేసీఆర్ డిస్కంలను ఆదేశించినా.. డిస్కంలు చార్జీల అంశాన్ని సస్పెన్స్‌లో పెట్టడం గమనార్హం. యూనిట్‌కు రూ.6.42 వ్యయం.. డిస్కంలు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సగటున యూనిట్‌కు రూ.6.42 వ్యయం కానుంది. 2018–19 కోసం డిస్కంలు 67,573 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఒప్పందాల రూపంలో ముందస్తుగా సమీకరించి పెట్టుకోగా.. వాస్తవ విద్యుత్ డిమాండ్ 64,291 మిలియన్ యూనిట్లే ఉండనుంది. -
అమ్మా.. నాన్నా... అలవాట్లు!!
► అప్పు తీర్చటం నుంచి బీమా దాకా వారే గురువులు ► మనీ మేనేజిమెంట్‌లో తల్లిదండ్రుల ప్రభావమే అధికం మనం ఏం నేర్చుకున్నా దాన్లో తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. పొదుపు, ఖర్చు అలవాట్లు కూడా వచ్చేది వారి నుంచే. నిజం చెప్పొద్దూ!! ఎవరైనా తమ కలల్ని, జీవిత లక్ష్యాల్ని సాకారం చేసుకోవటానికి ఆర్థిక విషయాలు తెలిసి ఉండటమనేది అత్యంత కీలకం. అందుకని మనకు సంక్రమించిన ఖర్చు, పొదుపు అలవాట్లను విశ్లేషించుకోవటంలో తప్పు లేదు. చక్కని జీవితానికి చక్కని అలవాట్లే పునాది. దాన్లో చెడు ఉంటే గనక... ఆదిలోనే తుంచేయాలి. సదరు అలవాట్ల సింçహావలోకనమే ఈ ప్రయత్నం. రుణాల చెల్లింపులెలా ఉన్నాయ్? ఆ మధ్య కోపెన్హెగన్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఓ ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 50 లక్షల మందికి చెందిన 3 కోట్ల రుణాలను విశ్లేషించారు. 2011– 2014 మధ్య తీసుకున్న రుణాలవి. వాళ్లు కనుక్కున్నదేమిటంటే... తల్లిదండ్రులు గనక రుణాలు తిరిగి చెల్లించటంలో డీఫాల్ట్ అయితే... వారి పిల్లలూ డీఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని. ఇవి ఎంత ఎక్కువంటే... డీఫాల్ట్ కాని తల్లిదండ్రుల పిల్లలకంటే దాదాపు నాలుగు రెట్లు!!. కుటుంబ ఆదాయాలు, తెలివితేటలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలూ ఇలాగే ఉండటం గమనార్హం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే... మీ తల్లిదండ్రులు రుణాల చెల్లింపులు ఎలా చేశారో తెలుసుకోవటమే కాదు. రుణాల విషయంలో మీ వైఖరినీ విశ్లేషించుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి!! తీసుకున్న అప్పును తిరిగి చెల్లించటమనేది నైతికంగా, చట్టపరంగా మీ బాధ్యత. అదేకాదు! చక్కని చెల్లింపు అలవాట్లు మీ క్రెడిట్ స్కోరునూ పెంచుతాయి. తద్వారా తక్కువ వడ్డీకే కొత్త రుణాలు దొరుకుతాయి. సంప్రదాయ పాలసీలను కొనొద్దు... ఓ తెలిసిన బంధువో, మిత్రుడో వచ్చి గ్యారంటీ లాభాలుంటాయంటూ సంప్రదాయ బీమా పాలసీలను అంటగట్టడం మనకు కొత్తేమీ కాదు. దీర్ఘకాలంలో ఇవన్నీ అర్థంలేని పాలసీలుగా మిగిలిపోతాయి. ఇలాంటి బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయటమనేది ఓ సమస్య కూడా. ఎందుకంటే ఈ ప్లాన్లలోని తప్పనిసరి లాకిన్ పీరియడ్ మిమ్మల్ని వాటి నుంచి బయటపడకుండా చేస్తుంది. ఒక వాటిపై వచ్చే రాబడి అత్యంత తక్కువ. దాని బదులు తగినంత కవరేజీ ఉండేలా టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ల వంటి ఎక్కువ రాబడినిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయటం తెలివైన పని. తగినంత కవరేజీ ఉందా? భారతీయుల్లో చాలామంది జీవిత బీమాను తీసుకునేది పన్నుల నుంచి బయటపడటానికే. కొందరు దాన్నో ఇన్వెస్ట్మెంట్లా కూడా చూస్తుంటారు. బీమా ఉన్న వ్యక్తి ఒకవేళ మరణించినా, ఆసుపత్రిలో ఉన్నా ఆ కుటుంబానికి వాస్తవంగా ఎంత రక్షణ కావాలన్నది మాత్రం వారు చూడరు. మీ కుటుంబ సభ్యులు కనక మీపై ఆధారపడి ఉంటే... మీపై ఆధారపడ్డ భార్య/భర్త తాలూకు ఆదాయ అవసరాలు, రుణ చెల్లింపులు, పిల్లల చదువు ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు, ఇతర రోజువారీ అవసరాల వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అందుకు తగినంత బీమాను టర్మ్ ప్లాన్ రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మీపై ఆధారపడ్డ వారిని అలా వదిలేయలేరు కదా!! ఆరోగ్య బీమా లేదా? చాలామంది ఆరోగ్య బీమా లేకుండానే తమ జీవితంలో చివరి మజిలీని చేరుకుని ఉంటారు. ఆ సమయంలో వారి ఆరోగ్యం చాలా ఒడిదుడుకులకు గురవుతుంటుంది. మరోవంక బీమా ఉండదు. ఆ సమయంలో ఆరోగ్య బీమా కొనుగోలు చేయటం కూడా చాలా కష్టం. పొరపాటున ఆసుపత్రి పాలయితే కుటుంబ పొదుపు, పెట్టుబడులు ఠక్కున ఆవిరయిపోతుంటాయి. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే యుక్త వయసు నుంచే చక్కని ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవటంతో పాటు దాన్ని చిరకాలం కొనసాగించాలి. తెలివైన పెట్టుబడి సాధనాలున్నాయ్ మీకు కావాల్సినప్పుడు మీ డబ్బు మీ చేతికిరావాలి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చాలావరకూ ఒక మోస్తరు రాబడినిస్తాయి కానీ పన్ను పరంగా అంత సమర్థమైనవి కావు. ఎండోమెంట్ బీమా పాలసీలంటే తక్కువ రాబడితో పాటు లాకిన్లూ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. కానీ పన్ను తప్పదు. అందుకని మెరుగైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు వెతుక్కోవాలి. వీటన్నిటికీ జవాబిచ్చే మ్యూచువల్ ఫండ్లలో గడిచిన రెండేళ్లుగా ఇన్వెస్ట్మెంట్లు బాగా పెరుగుతున్నాయి. వాటిలో పన్ను ఆదాతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించొచ్చు... బయటపడొచ్చు కూడా. రిస్కును బట్టే రాబడులుంటాయి. నెలకు రూ.500 నుంచి మొదలుపెట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పుత్తడి ఎల్లవేళలా మెరవదు... సంప్రదాయంగా బంగారం కూడా పెట్టుబడి సాధనంగా వస్తోంది. దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఈ లోహాన్ని కావాల్సినట్టు మార్చుకోవచ్చు. పాడైపోదు. ఆభరణంగానూ వాడొచ్చు. కానీ పెట్టుబడిగా వచ్చేసరికి ప్యూరిటీ, మార్కెట్ రాబడి, దాచుకోవటమనే సమస్యలు దీనికీ ఉన్నాయి. ఆభరణంగా వాడుకోవాలంటే ‘బంగారం’లా కొనుక్కోవచ్చు. కానీ పెట్టుబడిగా అయితే మాత్రం మీ పోర్టుఫోలియోలో దాన్ని కొంతవరకే పరిమితం చేయాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ సావరిన్ బాండ్ల వంటి సాధనాలను పరిశీలించొచ్చు. -
దిగొచ్చిన వెల్లుల్లి ధర
తాడేపల్లిగూడెం : వెల్లుల్లిపాయల ధర భారీగా తగ్గింది. పంట దిగుబడులు పెరగడంతో ధర దిగొచ్చింది. కొంతకాలం క్రితం వరకు కిలో రూ.120 పలికింది. దీంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌కు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రోజుకు మూడు, నాలుగు లారీల సరుకు వస్తోంది. అయితే కొనే వ్యాపారులు కరువయ్యారు. 50 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.1,100 నుంచి 2,150 వరకు ఉంది. గతంలో ఇదే బస్తా రూ.6 వేల వరకు పలకడం గమనార్హం. -
చుక్కల్లోనే కూరగాయల ధరలు
తాడేపల్లిగూడెం : టమాటాల ధర బాటలో వంకాయలు పయనిస్తున్నాయి. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో వంకాయలు ధరకు రెక్కలు వచ్చాయి. నల్ల వంకాయల ధర కిలో రూ.40కి ఎగబాకింది. తెల్లవంకాయల ధర రూ.50 పలికింది. క్యాప్సికం ధర కెవ్వుమనిపించి కిలో రూ.80కి చేరుకుంది. బీన్స్ సెంచరీ మార్కుకు చేరాయి. కీరా కూడా కిలో రూ.50కి చేరుకుంది. దొండకాయలు కిలో రూ.30, బెండకాయలు రూ.30, బీర రూ.40, దోసకాయలు రూ.24, కంద రూ.40, క్యాబేజీ రూ.20, క్యారెట్ రూ.40, బీట్రూట్ రూ.30, బీన్స్ రూ.90 ధర పలికాయి. చామ రూ.40, మిర్చి రూ.40కి అమ్మారు. మామిడికాయ ఒకటీ రూ.10, ములగకాడలు జత రూ.12 చేసి విక్రయించారు. టమాటాలు కాస్త కనికరం చూపించాయి. గుత్తగా 25 కిలోల ట్రే రూ.1,800 నుంచి రూ.1,600కి తగ్గింది. రిౖటైల్గా మాత్రం కిలో రూ.80 అమ్మారు. -
మీరు ఖర్చు మనుషులా?
సెల్ఫ్ చెక్ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది సామెత. అగ్రరాజ్యానికైనా, బిల్గేట్స్కైనా ఇదే సూత్రం. మీరు సరదాలకు పోయి ఇంటిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారా? లేక ఆదా చేసి ఆదాయాన్ని కూడ బెడుతున్నారా? మీరెటు పయనిస్తున్నారో తెలుసుకోవాలంటే స్వయంగా చెక్ చేసుకోండి. 1. మీరు ఓ ఎగ్జిబిషన్‌కి వెళ్లినప్పుడు ఖరీదైన కళాఖండాలు కనిపిస్తే వాటివల్ల ఉపయోగం లేకపోయినా కొనేస్తారు. ఎ. కాదు బి. అవును 2. ఇప్పటి వరకు మీ నెలసరి బడ్జెట్‌కంటే ఎక్కువ మీరు ఖర్చు చేయలేదు. ఎ. అవును బి. కాదు 3. మీ రొటీన్ ఉద్యోగంతో పాటు ఆదాయం పెంచుకోవడానికి పార్ట్ టైమ్ వర్క్ కూడా చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 4. బ్యాంక్‌లో సేవింగ్స్ చేయటం లేదు. ఎ. కాదు బి. అవును 5. మీ పర్స్ సహకరించకపోయినా సరే క్యాబ్‌లలోనే ప్రయాణిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మీకు నచ్చదు. ఎ. కాదు బి. అవును 6. తరచూ కొత్త డ్రస్‌లు కొంటూనే ఉంటారు. ఎ. కాదు బి. అవును 7. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు అవుతున్నప్పుడు విలాసాలను తగ్గించుకోవడంలో కొంత కఠినంగానే ఉంటారు. ఎ. అవును బి. కాదు 8. అప్పు చేసి అయినా సరే మీ సరదాలు తీర్చుకుంటారు. ఎ. కాదు బి. అవును ‘ఎ’ సమాధానాలు 6 దాటితే మీరు సంసారాన్ని సజావుగా నడిపిస్తున్నారని అర్థం. అనవసర ఖర్చులకు పోకుండా డబ్బు జాగ్రత్త చేస్తుంటారు. ‘బి’ సమాధానాలు 6 కంటే ఎక్కువ వస్తే మీకు డబ్బంటే జాగ్రత్త లేదని అర్థం. అనవసర డాబులకు పోయి అప్పుడప్పుడు బోర్లాపడుతుంటారు. -
తగ్గని టమోత
రిటైల్‌లో కిలో రూ.80 కిలో చిక్కుడుకాయలు రూ.120 చుక్కలనంటిన కూరగాయలు తాడేపల్లిగూడెం : ట’మోత’ ఇంకా తగ్గలేదు. కొండెక్కిన టమాటాల ధర దిగిరానంటోంది. డిమాండ్‌కు తగిన సరుకు సరఫరా లేకపోవడంతో ధరలు తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో వీటి ధర 25 కిలోల ట్రే రూ.1,800 పలికింది. విడిగా కిలో రూ.80కి మార్కెట్లో టమాటాలు దొరికాయి. వీటికి తోడు అన్నట్టుగా చిక్కుడుకాయలు సై అన్నాయి. నల్లజర్ల మండలం ఆవపాడు నుంచి మార్కెట్‌కు వచ్చే చిక్కుడుకాయలు ధర పదికిలోలు రూ.800 పలికింది. విడిగా మార్కెట్లో కిలో రూ.120కి చేరింది. క్యారెట్ 40, బీట్రూట్ రూ.40కు విక్రయించారు. క్యాప్సికం, బీన్స్ కిలో రూ.80కు విక్రయించారు. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు కిలో రూ.40 లభించాయి. బీరకాయల ధర మాత్రం కిలో రూ.40 నుంచి రూ.30కి పడిపోయింది. దొండకాయలు కిలో రూ.20, బెండకాయలు రూ.24, కంద రూ.40, చామ రూ.40, చిలకడదుంపలు రూ.30, దోసకాయలు రూ.16, క్యాబేజీ రూ.16, గోరుచిక్కుళ్లు రూ.24లకు లభించాయి. ములగకాడలు జత రూ.12 చేసి అమ్మారు. మామిడికాయలు జతకు రూ.20 విక్రయించారు. ఘాటెక్కించిన కొత్తిమిర ధర కాస్త దిగివచ్చింది. కిలో రూ.50 లభించగా, విడిగా కట్ట పదిరూపాయలకు విక్రయించారు. పచ్చిమిరప కూడా ఘాటు తగ్గించుకుంది. కిలో విడిగా రూ.50కి దొరికింది. బంగాళాదుంపలు. ఉల్లిపాయలు సాధారణ ధరలకే దొరికాయి. -
ధర రాక... దరి లేక..
►అంతరాష్ట్రీయంగా డిమాండ్ ►ఒడిదుడుకుల్లో కొబ్బరి రైతు తగ్గిపోతున్న తోటల విస్తీర్ణం ►గిట్టుబాటు కాని ధరలు కాయకు రూ.3 నుంచి రూ.5లు ►మార్కెట్లో మాత్రం అధిక రేటు విదేశాలకూ ఎగుమతులు ►కొత్తగా జీఎస్టీ తలపోటు నరసాపురం: జిల్లా పేరు చెపితే వరి తరువాత గుర్తుకు వచ్చేది కొబ్బరి. దేశంలో కేరళ తరువాత ఎక్కువ స్థాయిలో కొబ్బరి ఎగుమతులు సాగించేది మన రాష్ట్రమే. రాష్ట్రంలో కూడా గోదావరి జిల్లాల నుంచే కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా సాగుతుంటాయి. ఇందులో మన జిల్లా స్థానం ప్రత్యేకమైనది. కొడుకును నమ్ముకునే బదులు ఓ కొబ్బరి చెట్టును పెంచుకుంటే మేలనే నానుడి జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది. కొబ్బరి చెట్టు ఆర్ధికంగా ఆసరాగా ఉంటుందనే భరోసా అందరిలో ఉంటుంది. అలాంటి కొబ్బరి పరిశ్రమ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో పడింది. బయట మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ. 15లు నుంచి రూ. 20లు వరకూ కొబ్బరి కాయధర పలుకుతోంది. అదే రైతుకు మాత్రం రూ. 3 నుంచి రూ. 5లు వరకూ మాత్రమే దక్కుతోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రైతుకు మరో అర్ధ రూపాయో, రూపాయో పెరుగుతుంది అంతే. కేవలం రైతులే కాదు కొబ్బరి దింపు, వలుపు, లారీల్లోకి, ట్రాక్టర్లలోకి ఎగుమతి, దిగుమతి.. ఇలా జిల్లాలో కొబ్బరి పరిశ్రమపై ఆధాపరడి వేల కుటంబాలు జీవిస్తున్నాయి. ఇంకోవైపు జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం ప్రతీ ఏటా తగ్గుతోంది. చెరువుల సాగు పెరగడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ కొబ్బరి ఎగుమతులపై ఎలాంటి పన్నులు లేవు. అయితే కొత్తగా జీఎస్టీ పరిధిలోకి కొబ్బరిని పరోక్షంగా తీసుకొచ్చారు. దీంతో జిల్లాలో కొబ్బరి ఎగుమతులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి కూడా. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో కొబ్బరిసాగు, పరిశ్రమ కూడా సంక్షభంలోకి వెళుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. డిమాండ్ ఫుల్.. రైతుకు నిల్.. జిల్లాలో పాలకొల్లు కేంద్రంగా కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి విస్తృతంగా సాగుతుంది. రోజుకు 50 లారీలు తక్కువ కాకుండా ప్రతీరోజూ ఎగుమతి అవుతుంటాయి. అంటే జిల్లా నుంచి రోజుకు రూ. 1 కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకూ కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి జరుగుతుంది. జార్ఖండ్, హర్యానా, చత్తీస్గడ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఉత్తర భారతదేశంలోని 14 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతాయి. కోఫ్రా (పైచెక్క తొలగించిన కురిడి), ఇడిబుల్ కోఫ్రా (ఆయిల్‌కు వినియోగించే విధంగా ముక్కలు చేసినవి), కోఫ్రా స్లైస్ (తరుము) రింగ్స్అండ్స్లైసెస్ (కురిడికాయను చిన్నచిన్న ముక్కలుగా చేసినవి) విదేశాలకు ఎగుమతి అవుతాయి. కొబ్బరికి ఇంత డిమాండ్ ఉంది. అయితే కొబ్బరి రైతులకు డిమాండ్‌కు అనుగుణంగా ధర దక్కడం లేదు. గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో కాయ ధర రూ. 15లు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల్లో అయితే రూ. 20లు నుంచి రూ. 25లు వరకూ ఉంది. ఇక్కడి రైతుకు రూ. 5లు మాత్రమే దక్కుతుంది. రైతు వద్ద తీసుకున్న కాయ బయట ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగురెట్లు పలుకుతుందన్నమాట. ప్రస్తుతం జాతీయంగా కొబ్బరికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కాయ ఒక్కింటికి రైతుకు రూ. 5ల నుంచి రూ. 7లు వరకూ సైజును బట్టి ముట్టజెపుతున్నారు. కొబ్బరి బొండాలదీ ఇదే పరిస్థితి. రైతులు చాలా కాలంగా దారుణంగా నష్టపోతున్నారు. జిల్లాలో తగ్గుతున్న విస్తీర్ణం.. జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వాసాగు పెరగడంతో భూములు అన్నీ చెరువులుగా మారడం ఒక కారణమైతే, కొత్తగా కొబ్బరిసాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో 22 మండలాల్లో కొబ్బరిసాగు విస్తృతంగా సాగుతోంది. నరసాపురం, పాలకొల్లు, ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో విపరీతంగా సాగవుతోంది. కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, పెదవేగి, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, భీమడోలు, నల్లజర్ల మండలాల్లో కూడా సాగు ఎక్కువగా ఉంది. డెల్టాలో అయితే చేను గట్ల మధ్య కొబ్బరి మొక్కలు పెంచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. మెట్టలో మాత్రం తోటల పెంపకం ఎక్కువగా జరుగుతుంది. డెల్టాలో చెరువులు ఎక్కువగా తవ్వుతుండటంతో కొబ్బరి చెట్లను భారీగా నరికి వేస్తున్నారు. తుఫాన్ల ప్రభావంతో చెట్లు పడిపోవడం, కొత్తగా కొబ్బరి మొక్కలు నాటక పోవడం కూడా జరుగుతోంది. దీంతో విస్తీర్ణం తగ్గిపోతోంది. జిల్లాలో ప్రస్తుతం 98 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. చెరువుగట్లపైనా, రోడ్ల పక్కనా ఉన్నవాటితో కలుపుకుని. పదేళ్ల క్రితం అయితే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరితోటలు ఉండేవి. చెరువుల తవ్వకాలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో 20వేల ఎకరాలుపైనే కొబ్బరి చెట్లు మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు అన్నం పెట్టడమే కాకుండా కొబ్బరి పరిశ్రమ జిల్లాలో వేల మందికి ఉపాధి చూపిస్తోంది. కొబ్బరి ఎగుమతులకు సంబంధించి ఒలుపు, లోడింగ్, ట్రాన్స్పోర్ట్, వ్యాపారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రంగంపై జిల్లాలో 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొబ్బరి సాగు సంక్షోభంలోకి వెళితే వీరందరకీ గడ్డు పరిస్థితి తప్పదు. జీఎస్టీ తలపోటు... కొత్తగా జీఎస్టీ తలనొప్పి కొబ్బరి ఎగుమతులకు పట్టుకుంది. ప్రస్తుతం కొబ్బరి ఎగుమతులకు ఎలాంటి వాణిజ్య పన్నులు లేవు. ప్రస్తుతం జీఎస్టీలోకి కొబ్బరి ఎగుమతులను ప్రత్యక్షంగా చేర్చనప్పటికీ, పరోక్షంగా భారం వేశారు. కొబ్బరిలోడు లారీ ఎగుమతికి సంబంధించి హమాలీ లోడింగ్ చార్జీలు, గన్నీ సంచుల చార్జీలు, దళారీ కమీషన్, లారీ కిరాయి వీటన్నిటినీ ఎగుమతి దారులు బిల్లులో పొందు పరుస్తారు. వీటికి సర్వీస్టాక్స్ నిమిత్తం ఇప్పుడు జీఎస్టీలో 18శాతం విధించారు. అంటే ఒకలారీ లోడుకు అదనంగా ఇప్పుడు జీఎస్టీ క్రింద రూ. 20 నుంచి రూ 25వేల వరకూ ఖర్చవుతుంది. దీంతో ఎగుమతి దారులు గత 10 రోజులుగా ఎగుమతులు నిలిపివేశారు. మొత్తంగా రెండు రోజుల నుంచి ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే జీఎస్టీ విధానంలో స్పష్టతలేక పోవడంతో ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. రూ. 5లు మించి ధర ఉండదు చిలకా సత్యనారాయణ, మర్రితిప్ప, నరసాపురం మండలం, కొబ్బరి రైతు కొబ్బరి పువ్వు నుంచి కాయగా మారడానికి 40 రోజులు పడుతుంది. చెట్టును పెంచాలంటే పదేళ్లు పైనే పడుతుంది. కాయకి ప్రస్తుతం రూ. 5లు ఇచ్చి మా దగ్గర కొంటున్నారు. మేమే ఏదైనా గుడి దగ్గర కాయ కొనుక్కోవాలంటే రూ. 15లు పెట్టాలి. మాకు ఎప్పుడూ రూ. 5లు, రూ. 6లు మించి ఇవ్వరు. ధరలేని రోజుల్లో అయితే కాయ ఓ రూపాయి, రాపాయిన్నరకు కూడా కొంటారు. ఎరువులు అవీ వేసి పెంచే పని లేదు కాబట్టి , ఏదో అలా వెళ్లిపోతుంది. మా పరిస్థితి మాత్రం దారుణం. కొబ్బరి చెట్ల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి ప్రాంతాల నుంచి గతంలో వచ్చినంత దిగుబడి రావడం లేదు. గత మూడేళ్లలో అయితే మరీ దారుణంగా ఉంది. చెట్ల సంఖ్య తగ్గిపోవడమే కారణం. చేల గట్ల మధ్య ఇక్కడ ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉండేవి. ఇప్పుడు చెరువులు తవ్వేస్తున్నారు. మొగల్తూరు లాంటి ప్రాంతాల్లో తోటలు కూడా తవ్వేసి చెరువులు చేసేస్తున్నారు. 20 ఏళ్లుగా కొబ్బరి వలుపు పని చేస్తున్నాను. ఇప్పుడు 100 కాయలు ఒలిస్తే రూ. 70లు ఇస్తున్నారు. ఈ మధ్యనే కూలి పెరిగింది. మొన్నటి వరకూ కాయకు అర్ధ రూపాయి ఇచ్చేవారు. కాపుబాగా కాస్తే మాకు పని ఉంటుంది. ధరలేక పోయినా, ఎగుమతులు లేక పోయినా పని ఉండదు. ఈ పని చేసేవాళ్లం మరో పని చేయలేము. కొబ్బరి ఎగుమతులపై గతంలో వాణిజ్య పన్నులు ఉండేవి. అయితే 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రద్దు చేశారు. ప్రస్తుతం ఎలాంటి పన్నులు లేవు. అయితే కిరాయి, హమాలి చార్జీలు వాటిపై 18శాతం జీఎస్టీ ఉందని అంటున్నారు. కొంతమంది లేదంటున్నారు. ఈ విషయంలో స్పష్టతలేదు. అందుకే కొన్ని రోజులు ఎగుమతులు కూడా నిలిపివేశారు. కొబ్బరి ఎగుమతులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదు. -
పాతాళానికి చేరిన ఉల్లి ధరలు
-
జీఎస్టీతో వంటగ్యాస్ చౌక!
తగ్గనున్న నిత్యావసర వస్తువుల బడ్జెట్ న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ), నోట్ పుస్తకాలు, ఇన్సులిన్, అల్యూమినియం ఫాయిల్స్, అగర్బత్తి ఇలా నిత్యావసర వస్తువుల్లో చాలా వాటి ధరలు జీఎస్టీ అమలు కారణంగా జూలై 1 నుంచి చౌకగా లభించనున్నాయి. ఎందుకంటే వీటిపై ప్రస్తుతమున్న వివిధ రకాల పన్నుల కంటే తక్కువ పన్నునే జీఎస్టీ మండలి ఖరారు చేసింది. ఇలా పన్ను తగ్గే వాటిలో పాలపొడి, పెరుగు, మజ్జిగ, బ్రాండ్ పేరు లేని తేనె, డైరీ ఉత్పత్తులు, జున్ను, మసాలా దినుసులు, టీ, గోధుమలు, బియ్యం, గోధుమ, మైదా పిండి, కొబ్బరి నూనె, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, ఆవనూనె, పంచదార, చక్కెరతో చేసిన మిఠాయిలు, పాస్తా, నూడుల్స్, పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, మురబ్బా, కెచప్, సాస్‌లు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, మినరల్ వాటర్, ఐస్, సిమెంట్, బొగ్గు, కిరోసిన్ (పీడీఎస్), పళ్ల పొడి, సబ్బులు, ఎక్స్‌రే ఫిల్మ్, మెడికల్ డయాగ్నస్టిక్ కిట్లు ఉన్నాయి. ప్రస్తుతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నులు తగ్గే వాటి వివరాలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అలాగే, డ్రాయింగ్ పుస్తకాలు, సిల్క్, వూలె న్, కాటన్ వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాలు, రూ.500లోపున్న పాద రక్షలు, హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్, కళ్లద్దాలు, చెంచాలు, ఫోర్క్‌లు కూడా ధరలు తగ్గనున్నాయి. -
రోజుకు ఐదు సిగరెట్ల ఖర్చు కోటి రూపాయలు..
న్యూఢిల్లీ : పొగతాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రతిఒక్కరికీ తెలుసు. స్మోకర్లకూ ఈ విషయంపై ఇంకా బాగా అవగాహన ఉంటుంది. అయినా కూడా పొగరాయుళ్లు మాత్రం సిగరెట్ ను వదిలిపెట్టరు. గుప్పుగుప్పుమని పొగవదులుతూనే ఉంటారు. కానీ మీకు తెలియని మరో విషయమేమిటంటే.. స్మోకింగ్ మీరు ఊహించదానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆర్థికంగా కుంగదీస్తుంది. వరల్డ్ నో-టుబాకో డేగా సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ ఆరోగ్యానికి స్మోకింగ్ కలుగజేసే ముప్పుతో పాటు ఆర్థికంగా ఏమేర దెబ్బతీస్తుందో గణాంకాలతో సహా వివరించింది. ఒకవేళ మీకు 30 ఏళ్ల వయసు ఉండి రోజుకు ఐదు సిగరెట్లు కాల్చకుండా ఉండలేకపోతున్నారనుకుంటే... రిటైర్మెంట్ వయసు 60ఏళ్లకు వచ్చేసరికి మీరు కోటికి పైగా రూపాయలకు పైగా కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఆ కోటి రూపాయలతో పాటు, పరోక్షంగా మరింత మొత్తాన్ని కోల్పోతారని ఎకనామిక్ టైమ్స్ అంచనావేసింది. సిగరెట్లపై చేసే వ్యయం... సిగరెట్లపై చేసే పొగరాయుళ్లు చేసే వ్యయం ఆర్థికంగా భారీగా దెబ్బకొడుతోంది. ఒక్కో సిగరెట్ ధర రూ.10-15 మధ్యలో ఉంటే, రోజుకు ఐదు సిగరెట్లను కాల్చితే వాటితో 60రూపాయల మేర ఖర్చవుతుంది. అంటే నెలకు 1800 రూపాయల పైననే సిగరెట్ల కోసం వెచ్చిస్తారు. నెలకు ఖర్చు ఏడాదికి వీటిపై పెంపు 30 ఏళ్లలో సిగరెట్లపై చేసే వ్యయం రూ.1800 8 శాతం రూ.24.47 లక్షలు ఒకవేళ ఆ మొత్తాన్ని సిగరెట్లపై కాకుండా.. పెట్టుబడులుగా పెట్టి ఉంటే, 9 శాతం వడ్డీతో రూ.69.23 లక్షలు పొదుపు చేస్తారు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. పొగాకు ఉత్పత్తులపై పన్నులు విపరీతంగా పెరుగుతుంటాయి. దీంతో సిగరెట్ ధరలు ప్రతేడాది గణనీయంగా పైకి ఎగుస్తూ ఉంటాయి. గత నాలుగేళ్లలో ప్రతేడాది సగటున 20 శాతం మేర సిగరెట్ ధరలు పెరిగాయి. గత నాలుగేళ్లలో సిగరెట్ ధరలు రెండింతలు కంటే ఎక్కువగా పైకి ఎగిశాయి. గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ ప్యాకెట్ ధరలు సిగరెట్ తాగడం వల్ల అయ్యే వైద్య ఖర్చులు... నెలకు అయ్యే ఖర్చు వార్షిక పెంపు 30 ఏళ్లలో ఖర్చు 400 రూపాయలు 12 శాతం రూ.11.59 లక్షలు ఒకవేళ ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే 9 శాతం వడ్డీతో రూ.26.7 లక్షలవుతాయి. అయితే వినియోగదారుల ద్రవ్యోల్బణంతో పోలిస్తే వైద్య ద్రవ్యోల్బణం చాలా అధికంగా ఉంటుంది. డ్రగ్స్ ధరలు, డాక్టర్ల కన్సల్టేషన్ ఛార్జీలు, డయాగ్నోస్టిక్ ఛార్జీలు సగటున 15 శాతం మేర పెరిగాయి. ఏడాదికి 12 శాతం పెంపుతోనే వీటిని గణించింది ఎకనామిక్ టైమ్స్. ఇన్సూరెన్స్ వ్యయాలు... లైఫ్ ఇన్సూరర్స్ స్మోకర్ల నుంచి ఎక్కువ ప్రీమియంలు వసూలు చేస్తాయి. కోటి రూపాయల బీమా కవర్ చేయాలంటే 30ఏళ్ల వ్యక్తి ప్రతినెలా రూ.460 ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన... నెలవారీ ఖర్చు వార్షిక పెంపు 30ఏళ్లలో ఖర్చు రూ.460 నిల్ రూ.1.65 లక్షలు ఈ మొత్తాన్ని కూడా 9శాతంతో ఇన్వెస్ట్ చేస్తే అది రూ.7.52 లక్షలవుతుంది. సిగరెట్ల ఖర్చు మెడికల్ వ్యయాలు ఇన్సూరెన్స్ ఖర్చు రూ.69.23 లక్షలు + రూ.26.70 లక్షలు + రూ.7.52 లక్షలు ఈ మొత్తం కలిపితే రూ.1.03 కోట్లవుతుంది. -
పత్తివిత్తులో 'దేశీ'విప్లవం
-
పత్తివిత్తులో 'దేశీ'విప్లవం
బీటీ టెక్నాలజీతో విత్తనాల అభివృద్ధి - సగానికి సగం తగ్గనున్న ధర - వచ్చిన పంట నుంచే మళ్లీ విత్తనాలు వాడుకునే అవకాశం - బీటీ–1, బీటీ–2లకు దీటుగా చీడపీడలను తట్టుకునే సామర్థ్యం - దేశీయ విత్తనాలను అభివృద్ధి చేసిన పంజాబ్ వ్యవసాయ వర్సిటీ - ఖరీఫ్ నాటికి మార్కెట్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు - ఇక బీటీ విత్తన కంపెనీల ఆగడాలకు చెక్ సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఇకపై ఈ విత్తనం కోసం రైతులు వేలకు వేలు ధారపోయనక్కర్లేదు! కంపెనీలు ఎంత చెబితే అంత రేటుకే కొనుక్కోనక్కర్లేదు. ధర సగానికి సగం తగ్గబోతోంది. అంతేకాదు.. చేనులో పండిన పత్తి నుంచి వచ్చిన విత్తనాలనే మళ్లీ వాడుకోవచ్చు. బీటీ–1, బీటీ–2 పత్తి విత్తనాల మాదిరే చీడపీడలను తట్టుకునే సామర్థ్యంతోపాటు వాటికన్నా తక్కువ ధరకే దేశీయ విత్తనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు సుదీర్ఘ పరిశోధనల తర్వాత ఈ బీటీ పత్తి విత్తనాలను అభివృద్ధి చేశారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విత్తన కంపెనీల గుత్తాధిపత్యానికి కళ్లెం పడటంతోపాటు పత్తి విత్తనంలో ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాదికి ఈ విత్తనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయని, ఈ ఏడాది కొన్ని ప్రాంతాలకు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా ఇప్పటికే పంజాబ్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ఈ విత్తనాల ద్వారా పంట పండించి మంచి ఫలితాలు సాధించారని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బీటీ పత్తి విత్తన రకాలన్నీ హైబ్రీడ్లోనే వచ్చాయి. కానీ పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధారణ రకాల్లోనే బీటీ టెక్నాలజీని ఉపయోగించి ఈ విత్తనాలను తయారు చేసింది. దీనివల్ల ఈ విత్తనం వేసిన రైతు పంట పండాక తిరిగి దాన్నే విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే విత్తనం తక్కువ ధరకు లభించడంతోపాటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం బోల్‌గార్డ్ (బీజీ)–1 పత్తి విత్తన ధర రూ.635గా.. బీజీ–2 విత్తన ధర రూ.800గా ఉంది. అయితే పంజాబ్ విశ్వవిద్యాలయం తయారు చేసిన పత్తి విత్తన వెరైటీ ఆ ధరలో సగానికే లభించనుంది. ఇదీ బీటీ కథా కమామిషు.. బీటీ పత్తి విత్తనం రాకముందు.. (2002కు మందు) హైబ్రీడ్ విత్తనాలే వాడేవారు. ఈ విత్తనానికి కాయతొలిచే పురుగు ఎక్కువగా ఆశించేది. ఎన్ని రకాల మందులు వేసినా తగ్గేది కాదు. దీంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు పడేవారు. దీనికి విరుడుగా బీటీ టెక్నాలజీతో సరికొత్త విత్తనాలు తయారయ్యాయి. బహుళ జాతి కంపెనీ మోన్శాంటో.. మహారాష్ట్ర హైబ్రిడ్ కంపెనీ (మైకో)తో కలసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ–1 పత్తి విత్తన వ్యాపారం ప్రారంభించింది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఏ ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం కొనసాగించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బీటీ–1కు కూడా చీడపీడలను తట్టుకునే శక్తి పోవడంతో 2006లో బీటీ–2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. దానికి ఆ కంపెనీ పేటెంట్ రాయల్టీ వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రాయల్టీపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాయల్టీపై పోరాడారు. ఆయన పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రాయల్టీని అమాంతం తగ్గించింది. బీటీ–2తో నష్టపోయిన రైతులు ప్రస్తుతం రైతులు ఎక్కువగా బీటీ–2 పత్తి విత్తన రకాన్ని వాడుతున్నారు. అయితే దీనికి కూడా పురుగును తట్టుకునే శక్తి తగ్గింది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల గులాబీ రంగు పురుగు వ్యాపించింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మోన్శాంటో టెక్నాలజీకి కాలం చెల్లిందన్న ప్రచారం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా జాతీయ విత్తన కంపెనీలు స్వర్ణభారత్ కన్సార్టియంగా ఏర్పడి బీటీ–3 తరహాలో కొత్త వంగడాన్ని తయారుచేశాయి. దీనికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి ఉందని తేలిందని అంటున్నారు. బీటీ టెక్నాలజీలోని ఇతర జన్యువుతో దీన్ని తయారుచేశారు. కానీ దాన్ని మోన్శాంటో అడ్డుకోవడంతో ఇన్నాళ్లుగా అది రైతుల వద్దకు చేరుకోలేకపోయిందని విత్తన సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన సాధారణ సూటి పత్తి విత్తనంతో మోన్శాంటో గుత్తాధిపత్యానికి గండి పడుతుందని అంటున్నారు. మనకు లాభమే.. పంజాబ్ వ్యవసాయ వర్సిటీ నిపుణులు తయారు చేసిన పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. తెలంగాణలో ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు. ఇతర అన్ని పంటల కంటే పత్తి సాగే అధికం. 2015–16లో పత్తి ధర గణనీయంగా తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, సోయాబీన్ పంటలను ప్రోత్సహించింది. దీంతో 2016–17 ఖరీఫ్‌లో పత్తి 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. అయితే ఈసారి పత్తికి అధిక ధర పెరగడంతో రైతులు తిరిగి పత్తి వైపే చూస్తున్నారు. దీంతో ఈసారి రాష్ట్రంలో కోటి పత్తి విత్తన ప్యాకెట్లు అమ్ముడుపోయే అవకాశముంది. ధర తగ్గుతుంది పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన పత్తి విత్తనం హైబ్రీడ్ రకం కాదు. కాబట్టి దీన్ని ఒకసారి విత్తనంగా ఉపయోగించిన రైతులు తర్వాత తాను పండించి మళ్లీ విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ధర కూడా గణనీయంగా తగ్గుతుంది. - కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ బీటీ టెక్నాలజీ విఫలమైంది బీటీ టెక్నాలజీనే విఫలమైంది. అలాంటిది పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన బీటీ పత్తి సూటి రకం విత్తనం వల్ల ప్రయోజనం ఏముంటుంది? సూటి రకమైనా బీటీ చొప్పించాక అది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అంతర్గత పరిశోధన వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంటుంది. అంతేకాదు వారు తయారుచేసిన బీటీ సూటి రకం పత్తి విత్తనంపై స్వచ్ఛంద సంస్థ ద్వారా పరిశీలన చేసిన తర్వాతే దీనిపై మాట్లాడొచ్చు. - డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
ఆశలు ఆవిరి
మామిడి రైతుల డీలా తగ్గుతున్న దిగుబడులు ధరదీ అదే దారి మందుల పిచికారీనే కారణం! తాడేపల్లిగూడెం : మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దిగుబడులు తగ్గుతున్నాయి. ధర కూడా ఆశాజనకంగా లేదు. దీంతో రైతులు డీలాపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 6,820 హెక్టర్లలో మామిడి సాగు జరిగింది. వాస్తవానికి ఆదిలో సాగుకు వాతావరణం అనుకూలించింది. పూత ఆశాజనకంగా రావడంతో తమ కష్టం ఫలిస్తుందని రైతులు సంబరపడ్డారు. పూత నిలిచేందుకు రైతులు శాస్త్రవేత్తలు వారిస్తున్నా.. వినకుండా విచ్చలవిడిగా 12, 13 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. ఈ ప్రభావం ప్రస్తుతం దిగుబడిపై పడినట్టు కనబడుతోంది. రెండు, మూడు వారాలుగా తొలి కోతలు ప్రారంభమయ్యాయి. తొలుత ఎకరానికి 8 టన్నుల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే ప్రస్తుతం 40శాతం పడిపోయే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులతో నష్టం జిల్లాలో ఈ ఏడాది బంగినపల్లి, తోతాపురి(కలెక్టర్), రసాలు, ఇతర దేశవాళీ రకాలను రైతులు సాగు చేశారు. ఆదిలో వాతావరణం బాగానే ఉన్నా.. ఆ తర్వాత పూత నిలవడం కోసం రైతులు పురుగుమందులు పిచికారీ చేయం దిగుబడులను తగ్గించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న వాతావరణ మార్పులతో కాయ రాలడం ప్రారంభమైంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రిపూట పడిపోవడంతో భారీగా కాయలు రాలడం ప్రారంభమయ్యాయి. ఈ దశలో తొలి కోతలు ప్రారంభమయ్యాయి. తొలుత ఎంత తక్కువనుకున్నా ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడులు వస్తాయని రైతులు ఆశించారు. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ధర డీలా ప్రస్తుతం మార్కెట్లో మామిడి ధరలు పడిపోయాయి. ముక్కల కోసం వినియోగించే తోతాపురి రకం (కలెక్టర్) టన్ను ధర రూ.ఏడు వేల నుంచి రూ. పది వేల వరకు ఉంది. బంగినపల్లి రకం టన్ను రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది. వాస్తవానికి టన్ను ధర రూ.35 వేల వరకు ఉండాల్సిన ప్రస్తుత తరుణంలో ఇలా నేలచూపు చూడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ద్వారకాతిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, చింతలపూడి మండలాలతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతం నుంచి ప్రస్తుతం మామిడి కాయలు ఇక్కడి మార్కెట్లకు వస్తున్నాయి. వీటిని ఒడిశా, కోల్‌కతా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మింగిన మంగు తెల్లపూత వచ్చిన సమయంలో మామిడిపై రసాయనాలు పిచికారీ చేయకూడదు. అలాంటిది నిండుగా వచ్చిన పూత అంతా నిలబడాలని రైతులు శాస్త్రవేత్తల మాటలను పెడచెవినపెట్టి 1213 మందును పూతపై పిచికారీ చేశారు. దీంతో మామిడి కాయలు తయారైన సమయంలో మామిడిని మంగు(కాయపై సపోటా రంగులో మచ్చ రావడం) మింగేసింది. ఈ ప్రభావంతో మామిడి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఆర్.రాజ్యలక్ష్మి, శాస్త్రవేత్త, నూజివీడు మామిడి పరిశోధనాస్థానం -
ఒక్కో బడ్జెట్ కాపీ ఖర్చెంతో తెలుసా?
రైల్వే పద్దును సాధారణ బడ్జెట్లో కలుపుతూ చరిత్రాత్మకమైన కేంద్ర బడ్జెట్‌ను నేడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌తో పాటు కీలకమైన యూపీ లాంటి ఐదు రాష్ట్రాలకు త్వరలోనే ఎన్నికలు జరుగబోతుండటం దీని ప్రాధాన్యత. జనవరి 19న ప్రారంభమైన హల్వా సెర్మనీతో ఈ బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ షురూ అయింది. ఎంతో పకడ్బందీగా జరిగిన ఈ ప్రతుల ప్రింటింగ్, మొత్తం 788 బడ్జెట్ కాపీలను ముద్రించినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కాపీని ముద్రించడానికి రూ.3450 ఖర్చు అయిందని తెలుస్తోంది.. పార్లమెంట్‌లోని ఎంపీలకు, పలువురు అధికారులకు మాత్రమే బడ్జెట్ ప్రతులను అందించనున్నారు. బయటి వ్యక్తులకు మాత్రం డిజిటల్ ప్రతులనే పంపనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. -
కొంటే ఏముంది? రెంటే బాగుంది!!
కొనుక్కునే బదులు అద్దెకు తీసుకుంటే మేలు గృహోపకరణాల నుంచి వ్యవసాయ పరికరాలు అందుబాటులో దుస్తులు, పుస్తకాలు, ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బొమ్మలు అద్దెకు అవసరం తీరుతుంది; ఖర్చు ఆదా అవుతుంది తరచూ కొత్తవి మార్చుకోవచ్చు కూడా.. దేశంలో రూ.10,200 కోట్లకు చేరిన అద్దె విపణి ఉద్యోగాల బదిలీ, ప్రీమియం ఉత్పత్తులపై కోరికే వృద్ధికి కారణం: విశ్లేషకులు రమేష్, సునీత భార్యాభర్తలు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ నెల్లో దాదాపు నాలుగు ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలి. అన్నీ దాదాపు బంధువులవే. ఇంట్లో బ్రాండెడ్ నుంచి డిజైనర్ దుస్తులదాకా చాలానే ఉన్నా... అన్నీ ఒకసారైనా వేసుకున్నవి కావటంతో ఫంక్షన్లకు కొత్తవి కొనాల్సిందే అనుకున్నారు. కానీ నాలుగు ఫంక్షన్లకీ కొత్తవి కొనాలంటే..? అమ్మో!! అనుకున్నారు. ఇంతలో రమేష్ స్నేహితుడు శేఖర్ వచ్చాడు. వీళ్ల సమస్య విని... ‘‘మంచి డిజైనర్ వేర్‌ను అద్దెకు తీసుకోవచ్చు కదా?’’ అంటూ సలహా ఇచ్చాడు. ‘‘నిజమా!! కార్లు, బైకులు అద్దెకిస్తారని తెలుసు కానీ... దుస్తులు కూడా ఇస్తారా?’’ అంటూ ఆశ్చర్యపోయాడు రమేష్. ‘‘అవేకాదు. జ్యుయలరీ, ఫర్నిచర్, బొమ్మలు... ఆఖరికి మీరో ఆఫీసు పెట్టి పది రోజులకు ఉద్యోగులు కావాలంటే కూడా పంపిస్తారు’’ అని వివరించాడు శేఖర్. ఇకనేం!! రమేష్, సునీత సమస్యకు పరిష్కారం దొరికింది. మీకూ ఆ పరిష్కారం కావాలా? దుస్తులు, ఆభరణాలు, వంటింటి సామగ్రి... ఇలా కావాల్సిన వస్తువులన్నీ ఎంచక్కా అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక కథనం.. అద్దెకు వస్తువులు తీసుకోవటమంటే ఒకప్పుడు ఇల్లు మాత్రమే. తరవాత కార్లు, బైకులు అద్దె వ్యాపారంలోకి వచ్చాయి. కానీ ఇపుడు వంటింట్లోని సామగ్రి నుంచి వ్యవసాయ పరికరాల వరకూ అన్నీ అద్దె మార్కెట్లోకి వచ్చేశాయి. దీన్నే కాస్త స్టైల్‌గా ‘షేరింగ్ ఎకానమీ’ అని పిలుస్తూ అంతా షేరింగ్ బాట పడుతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలకు దారులు తెరుస్తున్నారు. నిజానికి ఈ రెంటల్ వ్యాపారంలో కస్టమర్ ఒక వస్తువును అద్దెకు తీసుకుని... దాన్ని వినియోగించుకున్నాక తిరిగి కంపెనీకి ఇచ్చేస్తాడు. కంపెనీ దాన్ని రీఫర్బిష్ చేసి తిరిగి కొత్తదానిలా మారుస్తుంది. అద్దెకు సిద్ధం చేస్తుంది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను అద్దెకివ్వటానికి మూడు మార్గాల్ని అనుసరిస్తున్నాయి. అవి... కొన్ని సంస్థలు ముందుగా ఉత్పత్తులను కొనేసి... వాటిని తమ వెబ్సైట్లో లిస్ట్ చేసి కస్టమర్లకు అద్దెకిస్తున్నాయి. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఇంటీరియర్ ఈ విభాగంలో ఈ ధోరణి ఎక్కువ. కానీ ఈ వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. వస్తువుల తయారీ సంస్థలు, వెండర్లు, వ్యక్తులు ఇతరత్రా మార్గాల ద్వారా అగ్రిమెంట్, లీజు మీద ఆయా సంస్థలు ఉత్పత్తులను సమీకరిస్తాయి. వాటిని తమ వెబ్సైట్లలో పెట్టి అద్దెకిస్తున్నాయి. బైకులు, కార్ల వంటివి ఈ విభాగంలో ఎక్కువ. ఈ వ్యాపారానికి మొదటి రకం మాదిరి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. చాలామంది తమ దగ్గరున్న, అప్పటికి అవసరం లేని వస్తువులను ఇతరులకు అద్దెకివ్వాలనుకుంటారు. అలాంటి వారు ఉపయోగించుకోవటానికి రెంటల్ వెబ్‌సైట్లున్నాయి. ఒకరకంగా రెంటల్ అగ్రిగేటర్లన్న మాట. వారు ఈ వెబ్సైట్లలో తమ ఉత్పత్తులను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అవసరమున్న కస్టమర్ నేరుగా వస్తువు యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకుంటాడు. ఈ వ్యాపారంలో వస్తువుల నాణ్యత, బాధ్యత విషయంలో సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. దుస్తులు: 3 గంటల నుంచి 3 రోజుల వరకూ దుస్తుల విషయానికొచ్చేసరికి ఫ్లైరోబ్, స్విష్‌లిస్ట్, వ్రాప్డ్, లైబ్ రెంట్, క్లోజీ, ది క్లాతింగ్ రెంటల్, ది సైటల్ డోర్, స్టేజ్3 వంటి సంస్థలు ఆన్లైన్ లో అద్దెకిస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల నుంచి డిజైనర్ వేర్స్ వరకూ అన్నింటినీ వీటి సాయంతో అద్దెకు తీసుకునే వీలుంది. పిల్లలు, మహిళలు, పురుషులు... ఇలా అన్ని విభాగాల్లోనూ ఇవి దుస్తులను అద్దెకిస్తున్నాయి. అద్దె గరిష్టంగా 3 గంటల నుంచి 3 రోజుల వరకు తీసుకునే వీలుంది. ఎఫ్‌సీయూకే, ఫరెవర్ న్యూ, అసూస్, మ్యాంగో, క్విర్క్బాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. రీతు కుమార్, మసాబా గుప్తా, సమ్మంత్ చౌహాన్, సెహ్లాఖాన్, సురేంద్రి వంటి ప్రముఖ డిజైనర్స్ కలెక్షన్స్ కూడా వీటిలో దొరుకుతున్నాయి. అయితే హైస్ట్రీట్ బ్రాండ్లకు మాత్రం ఎలాంటి ముందస్తు డిపాజిట్ అవసరం లేదు. డిజైనర్ దుస్తులకైతే 20 శాతం సొమ్మును డిపాజిట్‌గా ముందు చెల్లించాల్సి ఉంటుంది. ఫర్నిచర్: ఫ్రీ డెలివరీ, పికప్ ఫర్నిచర్‌ను అద్దెకివ్వటానికి ఫ్యూర్లెన్కో, రెన్టొమొజో, గ్యారెంటెడ్, రెంటల్వాలా తదితర సంస్థలున్నాయి. తరచుగా ఉద్యోగ బదిలీ కారణంగా మారిన ప్రతి చోటా కొత్త ఫర్నిచర్ కొనుక్కోవటమంటే చాలా కష్టం. పోనీ అప్పటికే ఉన్న ఫర్నిచర్‌ను మారిన చోటికి తీసుకెళదామంటే రవాణా ఖర్చులు మామూలుగా ఉండవు. వాటి బదులు కొత్తవి కొనుక్కోవటమే బెటరనిపిస్తుంది. ఫర్నిచర్ రెంటల్ కంపెనీలకు ఊపిరి పోసింది ఈ అంశమే. అయితే ఈ సంస్థలు ఫర్నీచర్‌తో పాటూ హోం అప్లయెన్సెస్, గేమింగ్, కెమెరా, వైఫై, స్మార్ట్ డోర్ లాక్స్ వంటి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువునూ అద్దెకిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ ఉచితంగా డెలివరీ, పికప్ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిని ఎన్నాళ్లయినా అద్దెకు వాడుకోవచ్చు. కాకపోతే కాలం పెరుగుతున్న కొద్దీ అద్దె కూడా పెరుగుతుంది. అదీ కథ. బొమ్మలు: మెట్రోల్లోనే ఎక్కువ పిల్లల కోసం ఆడుకునే బొమ్మలు ఒకసారి కొంటాం. నాలుగైదు సార్లు ఆడగానే... అది బోర్‌కొట్టి కొత్త బొమ్మ కావాలంటారు వాళ్లు. మరి పాత బొమ్మ సంగతో? అందుకే ఫన్ స్టేషన్, కిలోనేవాలా, రెంట్టాయ్స్, టాయ్ఎక్స్ప్రెస్, ఫ్రెండ్లీటాయ్స్ వంటి సంస్థలు బొమ్మలు అద్దెకిస్తున్నాయి. చాలా కంపెనీల సేవలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, అహ్మదాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బొమ్మల వినియోగం తక్కువని, నాణ్యత కాసింత తక్కువని ఫన్ స్టేషన్ ఫౌండర్ కశ్యప్ షా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. బొమ్మల అద్దెలు వారం రోజుల నుంచి నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. 2014లో ప్రారంభమైన ఫన్స్టేషన్లో 500 మంది రిజిస్టర్ యూజర్లున్నారని.. 400 లెగో సెట్స్ అద్దెకిచ్చామని ఆయన తెలియజేవారు. వ్యవ‘సాయం’: అవసరమైతేనే ట్రాక్టర్ మిగతా ఆన్ లైన్ రెంటల్ కంపెనీలతో పోలిస్తే మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కాస్త డిఫరెంటేనని చెప్పాలి. ఎందుకంటే ఇది ట్రింగో పేరిట సరికొత్త వ్యాపారానికి తెరతీసింది. ఓలా, ఉబెర్ సంస్థలు ఎలాగైతే కార్లను అద్దెకిస్తున్నాయో అదే తరహాలో ట్రింగో వేదికగా ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను అద్దెకు తీసుకోవచ్చన్నమాట. ‘‘మనది వ్యవసాయ ఆధారిత దేశం. 80శాతం మంది రైతులకు ట్రాక్టర్లు కొనాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించట్లేదు. దీంతో చాలా మంది రైతులు పశువుల మీద ఆధారపడి పొలాన్ని దున్నిస్తున్నారు. చాలా సమయం వృథా అవుతోంది. దీనికి పరిష్కారం చూపించేందుకే గతేడాది రూ.10 కోట్ల పెట్టుబడితో ట్రింగోను ప్రారంభించాం’’ అని సంస్థ సీఈఓ అరవింద్ కుమార్ చెప్పారు. 3 వేల మంది రైతుల వినియోగం.. ట్రింగో ఫిజికల్, డిజిటల్ ఇలా రెండు విధాలుగా పనిచేస్తుంది. ఫిజికల్ విధానంలో.. ఫ్రాంచైజీ సెంటర్లుంటాయి. ఈ స్టోర్లలో ట్రాక్టర్లు, పరికరాలు ఉంటాయి. వీటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులూ అందుబాటులో ఉంటారు. డిజిటల్ విధానంలో కాల్ సెంటర్, యాప్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ట్రింగో కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 13 సెంటర్ల ద్వారా సేవలందిస్తుంది. సుమారు 3 వేల మంది రైతులు వినియోగించుకున్నారు. త్వరలోనే రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ట్రింగో సేవలను ప్రారంభించనున్నట్లు అరవింద్ తెలిపారు. బుక్స్: ఆధునిక టెక్నాలజీతో ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో’ అనేది ఒకనాటి మాట. రెంటల్ కంపెనీలిపుడు ‘పుస్తకం కొనుక్కోవడమెందుకు అద్దెకు తీసుకో’ అని దీన్ని మార్చేశాయి. దేశంలో ఇండియారీడ్స్, డోర్‌స్టెప్స్ బుక్స్, లైబ్రరీవాలా, ఐరెంట్ షేర్, జస్ట్బుక్స్ వంటి పలు సంస్థలు పుస్తకాలను అద్దెకిస్తున్నాయి. ఇందులో క్రీడ, ఆధ్యాత్మిక, సామాజిక, కాల్పనిక, సాహిత్యం, టెక్నాలజీ ఇలా అన్ని పుస్తకాలూ అందించటం వీటి ప్రత్యేకత. బెంగళూరు ఐఐఎంలో ఏర్పాౖటెన జస్ట్ బుక్స్ హైదరాబాద్‌లో కూడా పలు బ్రాంచిలు ఏర్పాటు చేసింది. అద్దెకు తీసుకెళ్లిన బుక్స్‌ను గుర్తించడానికి బార్ కోడ్ రీడర్ల వంటి టెక్నాలజీని కూడా ఇది ఉపయోగిస్తోంది. ఆభరణాలు: వారమైతే ఓకే! ఈవ్స్ 24, రెంట్ జ్యుయలరీ, లక్సీపిక్, రెంటల్వాలా, ఫ్లైరోబ్ వంటి సంస్థలు బంగారు, వజ్రాల ఆభరణాలతో ఇమిటేషన్ జ్యుయలరీని అద్దెకు ఇస్తున్నాయి. ఒక రోజు నుంచి 7 రోజుల వరకు అద్దెకు తీసుకోవచ్చు. ముందుగా కస్టమర్ ఆయా సంస్థల కేవైసీని పూర్తి చేసి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. ఈవ్స్24 వంటి కొన్ని సంస్థలైతే అద్దెతో పాటూ కస్టమర్లు కావాలంటే ఆయా నగలను నెలసరి వాయిదా పద్ధతుల్లో విక్రయిస్తాయి కూడా. ఒకసారి కస్టమర్ ఆభరణాలను వినియోగించుకొని తిరిగి ఇచ్చేశాక ఆయా నగలను శుద్ధి చేసి తిరిగి అద్దెకు రెడీగా ఉంచుతారని ఈ పరిశ్రమలోని వర్గాలు పేర్కొన్నాయి. కార్లు, బైకులు, సైకిళ్లు: దూసుకుపో.. సొంత కారైతే నెలవారీ ఈఎంఐ, నిర్వహణ, బీమా వంటివి ఉంటాయి. ఏటా కారు విలువ కూడా తగ్గిపోతుంటుంది. అదే అద్దె కారైతే నచ్చిన కారులో షికారు చేయొచ్చు. ఇదే సెల్ఫ్ డ్రైవ్ కారు పరిశ్రమకు ఊతమిస్తుందనేది రేవ్ కో–ఫౌండర్ కరణ్ జైన్ మాట. ప్రస్తుతం దేశంలో మైల్స్, జూమ్‌కార్, కార్ క్లబ్, మైకార్, ఆటో రైడర్స్, ఈకో, రెంట్ ఏ కార్, లెట్ మి డ్రైవ్, జస్ట్ రైడ్, రేవ్, ఓలర్, డ్రివెన్ వంటి సంస్థలు బైకులు, కార్లు, సైకిళ్లను అద్దెకిస్తున్నాయి. నానో నుంచి మొదలుపెడితే స్విఫ్ట్, హోండా, ఆడి, ఫోర్డ్, బెంజ్, ఫార్చునర్, డస్టర్ వాహనాలన్నీ అద్దెకు తీసుకోవచ్చు. ధరలు రోజుకు సెడన్ వాహనాలైతే రూ.2,000–2,500, ఎస్యూవీ రూ.3,000–4,000 వరకున్నాయి. 25 ఏళ్ల వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నవారే కారు అద్దెకు తీసుకోవటానికి అర్హులు. వీల్స్ట్రీట్లో బైక్స్.. గేర్, గేర్‌లెస్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అద్దెకివ్వటం వీల్‌స్ట్రీట్ ప్రత్యేకత. అపాచి, షైన్, యాక్టివా, జూపిటర్, కరిజ్మా, ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్సన్ , సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్ వంటి 50కి పైగా సూపర్ బైక్స్ ఉన్నాయి. బైకు అద్దె రోజుకు ప్రారంభ ధర రూ.300. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని నెలకు 1000 బుకింగ్స్ అవుతున్నాయని వీల్‌స్ట్రీట్ కో–ఫౌండర్ మోక్షా శ్రీవాస్తవ చెప్పారు. సొంత వాహనాలతో పాటు డీలర్ల నుంచి, బైక్ ఓనర్ల నుంచి లీజు రూపంలో బైకులను అద్దెకు తీసుకుంటామని, ఇటీవలే ఆర్అండ్బీ పార్టనర్స్ నుంచి రూ.10 లక్షల నిధులను సమీకరించామని చెప్పారు. వస్తువులే కాదు ఉద్యోగులు కూడా.. వస్తువులే కాదు నిపుణులను కూడా అద్దెకిచ్చే సంస్థ ఒకటుంది. అదే డెవలపర్ ఆన్ రెంట్. ఇది రిటైల్, ఈ–కామర్స్, హెల్త్‌కేర్, టెలికం, రియల్ ఎస్టేట్, ట్రావెల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ వంటి అన్ని రంగాల్లో నిపుణులను అద్దెకిస్తుంది. పీహెచ్‌పీ, పైథాన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, యాంగ్లర్ జేఎస్, మీన్ స్టాక్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, హెచ్‌టీఎంఎల్ 5, ఐఓటీ, మాజెంటో, వర్డ్ ప్రాసెస్ వంటి అన్ని రకాల టెక్నాలజీల్లోనూ వీరు సేవలందిస్తారని సంస్థ ఫౌండర్ కపిల్ మెహతా తెలిపారు. ఇప్పటివరకు జస్ట్ డయల్, శుభ్‌కార్ట్, ఆటోమోబీ, స్కిల్ స్పీడ్, పిట్టిగ్రూప్, స్లాటర్ కన్సల్టింగ్, సెంతిక్ వంటి 50కి పైగా కంపెనీలు మా నిపుణుల్ని అద్దెకు తీసుకున్నాయని పేర్కొన్నారు. అనుభవం, పని కాలం ప్రాతిపదికన చెల్లింపులుంటాయి. రూ.10,200 కోట్లకు అద్దె పరిశ్రమ.. ప్రస్తుతం దేశంలో 300 వరకు ప్రధానమైన ఆన్ లైన్ రెంటల్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షేరింగ్ ఎకానమీ రూ.7,82,000 కోట్లుగా ఉందని.. 2025 నాటికి ఇది రూ.22,78,000 కోట్లకు చేరుతుందని ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్ తాజా నివేదికలో వెల్లడించింది. మన దేశంలో విభాగాల వారీగా అద్దె విపణి గణాంకాలను పరిశీలిస్తే.. ఫర్నిచర్ రూ.5,400 కోట్లు, ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ రూ. 3,400 కోట్లు, కార్లు, బైకుల మార్కెట్ రూ. 2,040 కోట్లు, బొమ్మలు రూ.800 కోట్లుగా ఉంటుందని తెలిపింది. మొత్తంగా మన దేశంలో అద్దె విపణి రూ.10,200 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోనూ జోరే.. నిధుల సమీకరణలోనూ రెంటల్ కంపెనీలు జోరుమీదున్నాయి. ముంబై కేంద్రంగా పనిచేసే ఫర్నిచర్ రెంటల్ సంస్థ ఫ్లైరోబ్ రెండు రౌండ్లలో 46 మిలియ న్ డాలర్లు సమీకరించింది. సెకోయా క్యాపిటల్, ఐడీజీ వెంచర్స్, జీఆర్ఈఈ వెంచర్స్‌తో పాటూ మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. మరో ఫర్నిచర్ కంపెనీ రెన్ టొమొజో.. ఐడీజీ వెంచర్స్, యాక్సెల్ పార్టనర్స్ నుంచి గతేడాది నవంబర్‌లో 2 మిలియన్ డాలర్లను, ఫ్యూర్లెన్ కో సంస్థ లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి 6 మిలియన్ డాలర్లను సేకరించాయి. సెల్ఫ్ డ్రైవ్ కార్ పరిశ్రమలో 70 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకున్న జూమ్‌కార్ ఇప్పటివరకు 45 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. కి.మీ. చొప్పున కాకుండా గంటల వారీగా కార్లను అద్దెకిచ్చే రేవ్ సంస్థలో మెకెన్సీ సంస్థకు చెందిన పలువురు 1.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో అద్దె మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నది విశ్లేషకుల మాట. – సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
’బెంగా’రం
రూ.30 వేలకు చేరువైన పసిడి ధర నాలుగు రోజుల్లో 10 గ్రాములపై రూ.2 వేల వరకు పెరుగుదల కిలో రూ.40 వేల మార్క్ దాటిన వెండి నరసాపురం : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అన్ని ధరలూ తగ్గిపోతాయనే ప్రచారం వెల్లువలా సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే ఈ తరహా ప్రచారం హద్దులు దాటుతోంది. అందుకు భిన్నంగా.. నోట్ల రద్దు తరువాత ఇప్పటికే రెండుసార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకుల ధరలు ఏమాత్రం తగ్గలేదు. భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి ధరాఘాతాల నుంచి నుంచి జనం తేరుకోకుండానే.. బంగారం ధరలు సామాన్య, మధ్య తరగతి వారిని భయపెట్టే విధంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ పసిడి ధరలు నేల చూపులు చూశాయి. త్వరలోనే కాసు బంగారం ధర రూ.15 వేలకు పడిపోతుందనే ప్రచారం సాగింది. ఇప్పుడు అదికాస్తా రివర్స్ అయ్యింది. బంగారం ధరలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.30 వేలకు చేరువైంది. గడచిన నాలుగు రోజుల్లో రూ.2 వేల వరకు పెరిగింది. వెండి సైతం అదే బాటలో పయనిస్తూ కిలో రూ.40 వేల మార్కును మళ్లీ దాటేసింది. శనివారం ట్రేడింగ్ ముగిసేసరికి నరసాపురం హోల్‌సేల్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.29,500, 22 క్యారెట్ల 916 ఆభరణాల బంగారం ధర 10 గ్రాములు రూ 27,500కు పెరిగాయి. అంటే కాసు (8 గ్రాములు)బంగారం రూ.22 వేలకు చేరింది. కిలో వెండి 41,700 వద్ద ట్రేడయ్యింది. ధరలు దిగిపోతాయని ఊహించిన వారందరికీ షాక్ తగిలింది. అమెరికా «అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్టించడం, షేర్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో మదుపరులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గడం వంటి కారణాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమ్మకాలు డౌన్ ట్రెండ్ నోట్ల రద్దు దెబ్బతో అమ్మకాలు లేక వెలవెలబోతున్న ఆభరణాల దుకాణాలు ధరల పెరుగుదల కారణంగా ఈగలు తోలుకునే పరిస్థితి వచ్చింది. సంక్రాంతి సీజన్లోనూ వ్యాపారం అంతంత మాత్రంగానే సాగింది. నగదు లభ్యతలేక పోవడంతో అమ్మకాలు పూర్తిగా పడకేశాయి. ఈ నెలాఖరు నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. ధరలు పెరుగుతుండటంతో కొనుగోళ్లు పెద్ద ఆశాజనకంగా ఉండకపోవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇదేవిధంగా కొనసాగితే పేద, మధ్య తరగతి వర్గాలు బంగారం జోలికి వెళ్లే పరిస్థితి ఉండదంటున్నారు. ఆభరణాల అమ్మకాలు తగ్గడంతో ఆ ప్రభావం స్వర్ణకారులపైనా పడుతోంది. జిల్లాలో ఒకప్పుడు రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ బంగారం అమ్మకాలు ఉండేవి. ప్రస్తుతం రూ.2 కోట్ల మేర కూడా ఉండటం లేదని చెబుతున్నారు. కొందరికి ఊరట బంగారం ధరలు పెరుగుతుండటం జిల్లాలో కొందరికి ఊరటనిస్తోంది. నోట్ల రద్దుకు ముందు అధిక ధరకు బంగారం కొనుగోలు చేసిన వారు ధరలు పడిపోవడంతో నష్టపోయారు. జిల్లాలో ఈ రకమైన నష్టం రూ.వందలాది కోట్లలోనే ఉండొచ్చని అంచనా కట్టారు. ధరలు పెరుగుతుండటంతో వారికి కాస్త ఊరట లభించింది. ఇదిలావుంటే.. నోట్ల రద్దు అనందరం నల్లధనాన్ని అప్పుటికప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ వెచ్చింది కొనుగోలు చేసేసారు. ఆ తరువాత ధరలు పడిపోవడంతో చాలావరకూ నష్టపోయామని బెంగపడ్డారు. ఇప్పుడు వారంతా ఆనందంతో ఉన్నారు. ధరల తగ్గుదల తాత్కాలికమని తేలిపోయింది బంగారం ధరల తగ్గుదల ఎప్పుడూ తాత్కాలికమే అని మరోసారి తేలిపోయింది. 10 గ్రాముల బంగారం రూ.30 వేలు దాటే అవకాశం కనిపిస్తోంది. బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడే. ప్రస్తుతం ధరలు పెరగడంతో మా వ్యాపారంపై ప్రభావం ఎక్కువగా ఉంది. నోట్ల రద్దుతో ఇప్పటికే వ్యాపారం దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఈ అమ్మకాలు కూడా జరిగేట్టు కనిపించడం లేదు. అజిత్‌కుమార్ జైన్, జ్యూయలరీ వ్యాపారి అయోమయంగా ఉంది బంగారం ధరలు అయోమయానికి గురి చేస్తున్నాయి. కొనాలో వద్దో అర్థం కావడంలేదు. మొన్నటివరకూ ధరలు తగ్గిపోయాయి. ఇంకా చాలా వరకూ ధరలు తగ్గిపోతాయన్నారు. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. కాసు, అరకాసు కొనే మాలాంటి వాళ్లకి ఏమీ అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం అర్థమవుతోంది. ఏ ధరలూ తగ్గవని.. పెరుగుతూనే ఉంటాయనే నిజం తెలిసి వచ్చింది. అనంతపల్లి మహేశ్వరి, గృహిణి, నరసాపురం -
ప్రధాని వరాల విలువ ఎంతో తెలుసా?
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం రోజు దేశ ప్రజలకు అందించిన వరాల విలువ ఏంతో తెలుసా? డీమానిటైజేషన్ తరువాత దేశ ప్రజలనుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రధాని ప్రకటించిన పథకాల భారం సుమారు రూ.3,500 కోట్లని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వం అదనపు బడ్జెటరీ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించినమోదీ ప్రకటించిన పలు సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా వ్యవసాయ రుణాలపై రూ.1,300 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ.1,000కోట్లు, గర్భిణిల పథకానికి రూ.1,200 కోట్ల ఆర్ధిక భారం పడనున్నట్టు లెక్కలు వేసింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్31 న బహుళ లబ్దిదారుల పథకాలను, సంక్షేమ చర్యల్ని మోదీ ప్రకటించారు. గ్రామీణులు గృహ రుణ సదుపాయం, పేద, గర్భిణీ స్త్రీలు మరియు రైతులు, వృద్ధులకు అందించిన ఈ ప్రథకాల కోసం ఆర్థిక సంవత్సరానికి రూ.3,500 కోట్లుఖర్చు కానుందని ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా రీసెర్చ్ మంగళవారం నివేదించింది. చిన్నపాటి బడ్జెట్ ప్రసంగంలా సాగిన మోదీ తాజా ప్రసంగంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కోసం నిర్మించిన ఇళ్ళు సంఖ్యను 33 శాతం పెంచారు. నూతన గృహ రుణాలు లేదా విస్తరణ కోసం రూ.2 లక్షల రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ అందుకుంటారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రెండు కొత్త పథకాలు ప్రకటించారు. కొత్త సంవత్సరంలో తీసుకున్న రూ.9 లక్షల రుణ శాతం 4 వడ్డీ రాయితీ,రూ. 12 లక్షల 3 శాతం వడ్డీ మాఫీ, వైద్య అవసరాల నిమిత్తం గర్భిణీలు నెలకు రూ. 6 వేలు సహాయం పొందుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బియ్యం ఫుల్.. ఎగుమతులు డల్
ధర పతనమే కారణం పాకిస్తాన్, వియత్నాం నుంచి పెరిగిన పోటీ ఉప్పుడు బియ్యం ఎగుమతులూ అంతంతే తాడేపల్లిగూడెం : జిల్లాలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా.. ఎగుమతులు డీలాపడ్డాయి. ధర లేకపోవడమే ఇందుకు కారణమైంది. విదేశాలకు ఎగుమతుల నిమిత్తం కాకినాడ పోర్టుకు బియ్యాన్ని పంపిస్తే.. క్వింటాల్‌కు చేరా (రవాణా చార్జీలతో కలిపి) రూ.2,020 మాత్రమే ధర లభిస్తోంది. ఫలితంగా ఎగుమతుల వైపు మిల్లర్లు, వ్యాపారులు మొగ్గు చూపడం లేదు. పోనీ.. వ్యాపార లావాదేవీలు నడిచేందుకు ఎగుమతులు చేద్దామన్నా.. మార్కెట్లో ధాన్యం ధర పెరిగింది. కనీస మద్దతు ధరకంటే క్వింటాల్‌కు రూ.65 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఏదో రకంగా ధాన్యం కొని మరాడించే సరికి బియ్యం ధర బాగా పెరుగుతోంది. క్వింటాల్ ధాన్యం ఆడిస్తే 58 నుంచి 62 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయి. క్వింటాల్ బియ్యం రావడానికి 170 కిలోల ధాన్యం మరపట్టించాలి. 170 కిలోల ధాన్యానికి రూ.2,604 వెచ్చించాల్సి వస్తోంది. ఆ బియ్యాన్ని ఎగుమతి చేస్తే క్వింటాల్‌కు వచ్చేది రూ.2,020 మాత్రమే. తవుడు, చిట్టు, ఊక ద్వారా ఇచ్చే ఆదాయం కలుపుకున్నా క్వింటాల్‌కు సగటున రూ.400 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మిల్లర్లు, వ్యాపారులు ఎగుమతులపై దృష్టి సారించడం లేదు. రిటైల్ మార్కెట్లో మాత్రం బియ్యం ధరలు జోరుగా ఉన్నాయి. బ్రాండెడ్ పేరుతో విక్రయాలు సాగిస్తున్న 25 కిలోల బస్తా బియ్యం ధర రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఉంది. దీంతో మిల్లర్లు, వ్యాపారులు స్థానిక మార్కెట్లపైనే ఆధారపడి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్, వియత్నాం నుంచి పోటీ గోదావరి జిల్లాలో పండే ముతక రకం బియ్యానికి దక్షిణాఫ్రికాలోని కొండ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కాకినాడ పోర్టు ద్వారా ఓడల్లో బియ్యం రవాణా జరిగేది. ఎగుమతి సంస్థల తరఫున కమీషన్‌దారులు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లను స్థానిక వ్యాపారులకు, మిల్లర్లకు ఇచ్చేవారు. అయితే, ఇదే రకం బియ్యం ఎగుమతుల విషయంలో పాకిస్తాన్, వియత్నాం దేశాల నుంచి పోటీ ఎక్కువైంది. ఇక్కడి వ్యాపారుల కంటే తక్కువ ధరకు ఆ రెండు దేశాలు ఎగుమతులు చేస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. ఉప్పుడు బియ్యానికీ డిమాండ్ అంతంతే బాయిల్డ్ రైస్‌గా పిలిచే ఉప్పుడు బియ్యానికి సైతం డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంది. మన ప్రాంతం నుంచి కేరళ రాష్ట్రానికి అధికంగా ఉప్పుడు బియ్యం ఎగుమతి అయ్యేవి. అయితే, ఇక్కడి వ్యాపారులకు ఆ రాష్ట్రంలోని కొనుగోలుదారులు భారీ మొత్తాలను బకాయిపడ్డారు. ఇటీవల కొంత మొత్తాలను చెల్లించడంతో ఎగుమతులు కొంతమేర పుంజుకున్నాయి. జిల్లా నుంచి రోజుకు రెండుమూడు లారీల సరుకు వెళుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్రధాన కంపెనీలు ఉప్పుడు బియ్యం ఎగుమతిలో జోరుగా ఉన్నాయి. పడిపోయిన ఉప ఉత్పత్తుల ధరలు ధాన్యం మరాడించగా వచ్చే ఉప ఉత్పత్తుల ధర ఏమంత ఆశాజనకంగా లేవు. నూకల ధర క్వింటాల్ రూ.1,700 నుంచి రూ.1,500కు పడిపోయింది. తవుడు ధర క్వింటాల్ ధర రూ.1,700 నుంచి రూ.200 తగ్గి రూ.1,500 పలుకుతోంది. గిట్టుబాటు కావడం లేదు బియ్యం ఎగుమతులు ఆశాజనకంగా లేవు. కాకినాడ పోర్టుకు బియ్యం పంపినా క్వింటాల్‌కు రూ.2,020కి మించి రావడం లేదు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరకు ధాన్యం కొని మిల్లు ఆడించి బియ్యం ఎగుమతి చేస్తే సొమ్ములు నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ కారణంగానే బియ్యం ఎగుమతులు మానుకోవాల్సి వచ్చింది. బూరాడ శ్రీనివాస్, రైస్ మిల్లర్, తాడేపల్లిగూడెం -
’పెట్రో’ వాత
డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో జిల్లాపై నెలకు రూ.12.70 కోట్ల భారం ఏలూరు సిటీ : పెద్దనోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మరో భారం మోపింది. నల్లధనాన్ని వెలికితీయటం ద్వారా పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గిస్తుందనే అంచనాలకు తారుమారు చేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటరుకు రూ.2.21, డీజిల్‌పై రూ.1.79 పెంచింది. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్ ధర లీటర్ రూ.71.86 ఉండగా, తాజా పెంపు రూ.2.21, పన్ను సుమారు రూ.40 పైసలు కలిపి లీటర్ ధర రూ.74.47 వరకు పెరిగింది. జిల్లాలో డీజిల్ లీటర్ ధర రూ.61.35 కాగా, తాజాగా పెరిగిన రూ.1.79, పన్ను సుమారు రూ.40 పైసలు కలిపి రూ.63.35 వరకు ఉంది. జిల్లా వాసులపై నెలకు రూ.12.70 కోట్ల భారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో జిల్లా వాసులపై నెలకు రూ.12.70 కోట్ల అదనపు భారం పడనుంది. జిల్లాలో పెట్రోల్‌పై పన్నులతో కలుపుకుని లీటరుకు రూ.2.61 అదనపు భారం పడుతోంది. జిల్లాలో రోజుకు 7 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండగా, ధర పెరగడంతో అదనంగా రూ.18.27 లక్షలు, నెలకు రూ.5.48 కోట్లు మేర అదనపు భారం పడనుందని అంచనా. జిల్లాలో రోజుకు 11 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధర పన్నులతో కలుపుకుని రూ.2.19 కాగా, వినియోగదారులపై సుమారు రూ.24 లక్షలు, నెలకు రూ.7.22 కోట్లు మేర అదనపు భారం పడనుంది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు సుమారు 5లక్షల వరకు ఉండగా, ట్రక్ ఆటోలు 26,415, కార్లు 32 వేలు ఉన్నాయి. జిల్లాలో హెచ్పీసీ పెట్రోల్ బంకులు 44, బీపీసీ బంకులు 47, ఐఓసీ 101, ఇతర కంపెనీలకు చెందిన బంకులు 16 వరకు ఉన్నాయి. బాలిక, నాయనమ్మ, హిందూ సంప్రదాయం టి.నరసాపురం : ఎవరైనా మరణిస్తే కుమారుడు తలకొరివి పెట్టడం హిందూ సంప్రదాయం. వారసులు ఎవరూ లేకపోవడంతో నాయనమ్ మృతదేహానికి మనుమరాలే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బందంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వీరంకి వెంకాయమ్మ (48) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. వెంకాయమ్మ భర్త గతంలోనే చనిపోయారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, కుమారుడు మధు 2002లో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికి అతని భార్య రాధ గర్భిణి. తండ్రి మరణానంతరం జన్మించిన కుమార్తెకు హిమశ్రీగా నామకరణం చేశారు. హిమశ్రీ, ఆమె తల్లి రాధ బొర్రంపాలెంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. హిమశ్రీ అదే గ్రామంలో 9వ తరగతి చదువుతోంది. బాలిక నాయనమ్మ వెంకాయమ్మ శుక్రవారం మరణించగా, వారసులెవరూ లేకపోవడంతో ఆమె మనుమరాలు హిమశ్రీ ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపించింది. -
ఎఫ్-35 జెట్లపై ట్రంప్ గగ్గోలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవికి ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ సోమవారం మరో రక్షణ శాఖ అంశంపై విమర్శలు గుప్పించారు. దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తూ మార్పులు చేసుకుంటూ వస్తున్న ఎఫ్-35 జెట్ల వ్యయం రోజు రోజుకూ పెరిగిపోతోందని ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఎఫ్-35 ప్రోగ్రామ్ వ్యయం చేయి దాటి పోతోందని, జనవరి 20 తర్వాత బిలియన్ల డాలర్లను వృథా కానివ్వనని అన్నారు. ట్రంప్ ట్వీట్ తో ఏరోస్పేస్ మార్కెట్ ఒక్కసారిగా 2.6శాతం కుప్పకూలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-35లకు 6.1 బిలియన్ డాలర్లను అమెరికా ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ అమెరికా రక్షణ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. The F-35 program and cost is out of control. Billions of dollars can and will be saved on military (and other) purchases after January 20th. — Donald J. Trump (@realDonaldTrump) December 12, 2016 -
పెళ్ళి చేసి చూడు!
• కరెన్సీ కష్టాలు ‘ఇల్లు కట్టి చూడు’ అన్న మాటేమో కానీ... ఇప్పుడు కష్టం తెలియాలంటే... కచ్చితంగా ‘పెళ్ళి చేసి’ చూడాలి. ఉన్న పెద్ద నోటు చెల్లదు... చెల్లే పెద్ద నోటు చేతికి రాదు! బ్యాంకులో డబ్బుంది... చేతిలోనే డబ్బు లేదు! అందుకే, ఆడపిల్ల పెళ్ళితో మధ్యతరగతి తండ్రి కష్టాలకు అంతు లేదు. తరగని ఏ.టి.ఎం. క్యూలు... దొరకని కరెన్సీ సాక్షిగా... ఇప్పుడన్నీ ‘క్యాష్’ లెస్ మ్యారేజ్లు... కరెన్సీ కష్టాలతో ‘జోష్’ లెస్ మ్యారేజ్లు! డిసెంబర్ 9... ప్రవీణ్కీ, రమ్యకీ పెళ్ళి. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకుంటున్నారు. మూడేళ్ళ ప్రేమ ఫలిస్తున్నందుకు నిజానికి ఇద్దరూ చాలా సంతోషంగా ఉండాలి. కానీ, ఇద్దరూ చాలా టెన్షన్‌గా ఉన్నారు. పెళ్ళి దగ్గర పడుతోందన్న ఉత్సాహం కన్నా, తేదీ దగ్గర కొస్తోందన్న టెన్షన్ వాళ్ళ ముఖాల్లో కనపడుతోంది. కారణం... కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 8వ తేదీ రాత్రి కేంద్ర సర్కారు హఠాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వాళ్ళకు ఒక్కసారిగా టెన్షన్ తెచ్చి పెట్టింది. పెళ్ళి ఖర్చుల కోసం అప్పటికే పెద్ద మొత్తంలో డ్రా చేసిన డబ్బు బయట తీసుకొనేవాళ్ళు లేరు. బ్యాంకులో ఆ మొత్తం మళ్ళీ డిపాజిట్ చేయడానికి చిక్కులు... కొత్త కరెన్సీ కోసం తిప్పలు... ఈ ఇబ్బందులతో వాళ్ళు ఇప్పుడు తమ పెళ్ళిని ముందు అనుకున్నట్లు ఘనంగా కాకుండా, తక్కువ మంది అతిథుల మధ్య సింపుల్‌గా చేసుకొనే పనిలో పడ్డారు. మీకు తెలుసా? ఇవాళ ఇండియాలో పెళ్ళి ఖర్చు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దాదాపు రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల దాకా అవుతోందని అంచనా సగటు భారతీయులు తమ జీవితకాలంలో పోగు చేసుకొనే సంపదలో దాదాపు 5వ వంతు పెళ్ళి ఖర్చుకే పెడుతుంటారట! మన దేశంలో ఏటా బంగారానికి ఉండే డిమాండ్‌లో దాదాపు 50 శాతం పెళ్ళిళ్ళకు ఉండేదే! బ్యాంకులో ఉంది... చేతికి రాదు! ఒక్క ఈ జంటే కాదు... దేశం మొత్తం మీద ఇలా పాత నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న పెళ్ళిళ్ళు కొన్ని వేలు ఉన్నాయి. అందులోనూ ఆడపిల్ల తల్లితండ్రుల అవస్థలైతే చెప్పనే అక్కర్లేదు. విజయవాడలో పుట్టి, సినీ పరిశ్రమకు దగ్గరగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రసాద్ దంపతులు అందుకు ఓ ఉదాహరణ. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి! కట్నకానుకలు అడగని మగపెళ్ళివాళ్ళు అడిగిందల్లా - పెళ్ళి కాస్తంత ఘనంగా చేయమని! అందుకు ప్రసాద్ దంపతులు ఆనందంగా సిద్ధపడ్డారు. ఏర్పాట్లు కూడా చేసుకుంటూ వచ్చారు. అన్నీ కుదుర్చుకొని, పెళ్ళి శుభలేఖలు కూడా కొట్టించి, పంచుతున్న సమయంలో ‘పెద్ద నోట్ల రద్దు’ వార్త వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న మోడీ గారి ‘డీమానిటైజేషన్’ సినిమాతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్యాంకు నుంచి అప్పటికే ఈ ఆడపెళ్ళివారు తెచ్చుకున్న పెద్ద నోట్లు చెల్లవు. అక్టోబర్‌లోనే పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోవడంతో, పెళ్ళి ఖర్చుల కోసం బ్యాంకు నుంచి ముందే డబ్బు తీసి పెట్టుకున్న ప్రసాద్ లాంటి వాళ్ళ పాట్లు అన్నీ ఇన్నీ కావు. వాటిని బ్యాంకులో వేసేసినా, అంత మొత్తం కొత్త నోట్లివ్వరు. ఇంట్లో క్యాష్ లేదు. ఏ.టి.ఎం.లో కరెన్సీ రాదు. ఆలస్యంగా కళ్ళు తెరిచిన ప్రభుత్వం పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు బ్యాంకు నుంచి కొత్తగా రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని అనుమతించింది. అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) పెట్టిన సవాలక్ష షరతులతో అదీ చాలా కష్టంగా మారింది. ‘పెద్ద నోట్ల ఉపసంహరణ’ కన్నా ముందే బ్యాంకు ఖాతాలో అంత మొత్తం ఉంటేనే, ఈ రెండున్నర లక్షలు విత్ డ్రా చేయడానికి అనుమతిస్తారు. లేదంటే కుదరదు. అందుకే, పారితోషికం డబ్బు ఇవ్వాల్సినవాళ్ళు చెక్ రూపంలో ఇప్పుడు ఇచ్చినా, ఆ మొత్తం నవంబర్ 8 కన్నా ముందరే ప్రసాద్ బ్యాంకు ఖాతాలో లేదు కాబట్టి, పెళ్ళి ఖర్చుకు రూ. 2.5 లక్షల లెక్కలో ఆ మొత్తం విత్ డ్రా చేయలేని పరిస్థితి ఆ మధ్యతరగతి మనిషికి తలెత్తింది. పిల్ల పెళ్ళి కోసం ఇప్పుడా ఆడపిల్ల తండ్రి తల తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు. బడాబాబులు, రాజకీయ నాయకుల ఇళ్ళల్లోని పెళ్ళిళ్ళకు మాత్రం ఈ కరెన్సీ కష్టాలేవీ అంటలేదు. గత నాలుగు వారాల్లో పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఆర్భాటంగా జరిగిన ఆడంబర వివాహాలు, మీడియాలో వచ్చిన వాటి వార్తలే అందుకు ఉదాహరణ. కుటుంబమంతా క్యూలోనే! బ్యాంకు ఖాతాలో డబ్బున్నా, వారానికి 24 వేల రూపాయలకు మించి విత్‌డ్రా చేయడానికి వీలు లేదన్న బ్యాంకు నిబంధన. దాంతో, పెళ్ళిళ్ళు ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇంట్లో ఎవరెవరికి ఖాతా ఉంటే, వారంతా వారం వారం క్యూలో నిలబడి డబ్బులు తెస్తున్న సంఘటనలూ ఉన్నాయి. అమ్మాయి పెళ్ళి పెట్టుకున్న విశాఖపట్నంలోని ప్రభుత్వోద్యోగి నవీన్ కుటుంబం ఇప్పుడు ఆ పనే చేస్తోంది. సీతమ్మధారలోని బ్యాంక్ బ్రాంచ్ చుట్టూ తిరగడం, క్యూలో గడపడం నిత్యకృత్యమైపోయింది. మ్యారేజ్... ఓ మెగా ఇండస్ట్రీ! దేశంలో ఇవాళ వివాహాలు, దాని చుట్టూ జరిగే ఖర్చులు, కొనుగోళ్ళు, వగైరా అంతా ఓ అతి పెద్ద ఇండస్ట్రీ. మన ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ పరిమాణం దాదాపు రూ. 1 లక్ష కోట్ల నుంచి 1.25 లక్షల కోట్లని అంచనా ఈ పరిశ్రమ ఏటా 25 నుంచి 30 శాతం మేర పెరుగుతోంది ఇవాళ మన భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది 29 ఏళ్ళ లోపు వయసు వాళ్ళే! అంటే, రాగల అయిదు నుంచి పదేళ్ళలో ఈ మ్యారేజ్ మార్కెట్ సైజు ఇంకా ఇంకా పెరుగుతుంది పెళ్ళిళ్ళ సీజన్లో... ఏటా 3 లక్షల పైగా ఉద్యోగాలు, ఉపాధి వస్తాయట! పెళ్ళికి పెద్ద అప్పు మిగిలింది! పెద్ద నోట్ల ఉపసంహరణ దెబ్బ మధ్యతరగతి వాళ్ళ ఇంటిలో పెళ్ళిళ్ళ మీదే కాదు... దిగువ శ్రేణి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళపైనా పడింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లల పెళ్ళిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశించిన సంక్షేమ పథకాల డబ్బులు కూడా ఇప్పుడు బ్యాంకుల్లో ఇరుక్కుపోయాయి. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాలు (ఓ.బి.సిలు), ముస్లిమ్ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్ళి జరుగుతుంటే, వాళ్ళ తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి లక్షన్నర రూపాయల లోపు అయితే, ‘షాదీ ముబారక్’, ‘కల్యాణ లక్ష్మి’ పథకాల ద్వారా రూ. 51 వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది. దళారుల ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఆ డబ్బుల్ని ఆన్లైన్లో చెల్లిస్తుంటుంది. సర్వసాధారణంగా సరిగ్గా పెళ్ళికి కొద్ది రోజుల ముందే లబ్ధిదారులు ఈ డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి లబ్ధిదారుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ బ్యాంకుల్లో నగదు నిల్వలే తక్కువ. ఉన్న డబ్బులు, కొత్త కరెన్సీ వచ్చినంత వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ఏ.టి.ఎం.లు ఏ మాత్రం పనిచేస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో, దిగువ తరగతి వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఖర్చు తడిసిమోపెడు! చెక్కులు, డిజిటల్ చెల్లింపుల ద్వారా కల్యాణం కథ నడిపించవచ్చుగా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కానీ, ఇవాళ్టికీ మన దేశంలో పెళ్ళిళ్ళు అంటే, దాదాపు 70 - 75 శాతం చెల్లింపులు నగదు రూపంలోనే జరుగుతాయి. కల్యాణ మండపాల సంగతికొస్తే - నగరంలో ఉన్న ప్రాంతాన్ని బట్టి వాటికి 14 నుంచి 30 శాతం దాకా పన్ను పడుతుంది. అందుకే, అవి నిర్ణీత రుసుములో కొంత వరకే చెక్కు రూపంలో తీసుకొని, మిగతాది నగదు రూపంలో తీసుకుంటూ వచ్చాయి. తీరా ఇప్పుడు అంతా చెక్కుగా తీసుకోవాల్సి వచ్చేసరికి, వాటికి అదనంగా పన్ను పడుతోంది. అందుకే, అవి కొత్తగా పడుతున్న ఆ అదనపు భారం కూడా పెళ్ళివారే భరించాలంటూ, అదనపు రుసుము డిమాండ్ చేస్తున్నాయి. అసలే చేతిలో డబ్బుకు కటకటలాడుతున్న పెళ్ళింటివాళ్ళకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి ఇబ్బందులు పడలేక... కేంద్ర సర్కారు వారి హఠాత్ నిర్ణయంతో చాలామంది తమ ఇంట్లో పెళ్ళిళ్ళను జనవరి, ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. ఆడంబరానికి అనుకోని బ్రేక్! అనుకోకుండా వచ్చిన కరెన్సీ కష్టాలతో అక్కడక్కడా ఊహించని కొంత మంచి కూడా జరుగుతున్నట్లుంది. సంగీత్‌లు, రిసెప్షన్లు అంటూ ఇటీవల ఒకటికి మూడు రోజుల పాటు ఆడంబరంగా చేస్తున్న వేడుకల జోరుకు తాజా దెబ్బతో కొంత బ్రేక్ పడింది. వంద రకాల వెరైటీలతో తినేవాళ్ళ కన్నా వేస్టేజ్ ఎక్కువగా సాగుతున్న విందుల విషయంలో వధూవరుల కుటుంబాలు ఆగి, ఆలోచించడం మొదలుపెట్టాయి. సర్వసాధారణంగా అతి భారీ ఖర్చుతో సాగే పంజాబీ పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు ఆదా బాట పట్టాయి. మధ్యతరగతి కుటుంబాలు తమ ఇంటి పెళ్ళిళ్ళను హోటళ్ళ నుంచి గురుద్వారాలకూ, మందిర్లకూ మార్చేస్తున్నాయి. పనిలో పనిగా, ‘షాగన్లు (బహుమానంగా డబ్బు ఉంచిన కవర్లు) వద్దు’ అంటూ శుభలేఖలతో పాటు చిన్న కాగితం కూడా పెట్టేస్తున్నారు. అతిథుల జాబితాను కుదిస్తున్నారు. అలంకరణలు తగ్గిస్తున్నారు. అలా ఖర్చు దాదాపు 20 నుంచి 40 శాతం దాకా తగ్గించుకుంటున్నట్లు ఒక అంచనా. కొత్త రకం మ్యారేజ్ ట్రెండ్స్! మారిన పరిస్థితులకు తగ్గట్లు కొన్ని పెళ్ళిళ్ళలో పద్ధతులూ చకచకా మారుతున్నాయి. శుభలేఖల ప్రింటింగ్ ఖర్చు లేకుండా ‘ఇ-కార్డులు’గా మెయిల్, వాట్సప్ చేస్తున్నారు. ఒకవేళ శుభలేఖలు ప్రింట్ కొట్టించినా, ‘పే టి.ఎం’, ‘అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లు’, ‘సోడెక్సో’ల ద్వారా, ఆన్లైన్ లావాదేవీల ద్వారా కానుకల్ని స్వీకరిస్తామంటూ శుభలేఖల్లోనే ‘గమనిక’ రాయడం లేటెస్ట్ ట్రెండ్. కొన్ని పెళ్ళి మండపాల్లో నగదు గిఫ్ట్స్ తీసుకోవడానికి స్వైప్ మిషన్లు వెలిశాయి. మండపంలో స్వైప్ మిషన్ చేత పట్టుకొని కూర్చొన్న వధూవరుల ఫోటోలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. పెళ్ళిళ్ళలో ఆన్లైన్లో కానుకలు ఇవ్వడమనే ట్రెండ్ విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి నగరాల్లో క్రమంగా ఊపందుకుంటోంది. అయితే, ప్లాస్టిక్ మనీ, ఇ-వ్యాలెట్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటివి పెద్దగా అలవాటు లేని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెళ్ళి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దేశంలోని బ్యాంకుల్లో దాదాపు 38 శాతమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ మాటకొస్తే, బ్యాంకులు దండిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో చాలామంది జనానికి కూడా ఇప్పటికీ మొబైల్ పేమెంట్స్ లాంటివీ తెలీవు. కెన్యా లాంటి దేశంలో కూడా నూటికి 53 మందికి మొబైల్ పేమెంట్స్ గురించి అవగాహన ఉంటే, మన దేశంలో నూటికి 12 మందికే దాని గురించి తెలుసు. కెన్యాలో 31 శాతం మంది ఆ రకం చెల్లింపుల విధానం పాటిస్తుంటే, మన దగ్గర కేవలం 5 శాతం మందే మొబైల్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ వాస్తవ పరిస్థితుల నేపథ్యం, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉన్న నగదు కొరత మూలంగా... ఇప్పుడు ‘పెళ్ళి చేసి చూడు’ అన్నది అసలు సిసలు సవాలుగా మారింది. ఇంట్లో పెళ్ళితో ఆనందం కన్నా, ఆందోళన పెరిగింది. క్యాష్ లెస్ పెళ్ళి... జోష్ లెస్ మ్యారేజ్ అయింది. - రెంటాల జయదేవ -
నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
-
టపాసుల వ్యాపారుల్లో కనపడని దీపావళి వెలుగు
-
ప్రజల నెత్తిన శనగ బాంబు
తాడేపల్లిగూడెం: ప్రజల నెత్తిన శనగపప్పు ధరల బాంబు పడింది. ఏకంగా కిలో ధర రిటైల్ మార్కెట్లో 150 రూపాయలకు చేరింది., గత ఏడాది అక్టోబరులో కిలో శనగపప్పు ధర 70 రూపాయలు మాత్రమే ఉంది. పప్పుల ధరలు వినియోగదారులతో దోబూచులాడుతూ ఉన్నాయి. ప్యూచర్ ట్రేడింగ్ పుణ్యాన సిండికేట్‌గా ఏర్పడిన గుత్త వ్యాపారులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కేంద్రంగా అపరాల మార్కెట్‌ను శాసిస్తున్నారు. వారు చెప్పింది ధర అన్నట్టుగా హవా సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 28 వ తేదీన పప్పుల మార్కెట్లో 30 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ధరలు తగ్గి ప్రకంపనలు సష్టించాయి. మార్కెట్ బద్దలు కావడంతో కొందరు వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. కిలోకు ఏకంగా 20 నుంచి 30 రూపాయలు గుత్త మార్కెట్లో ధరలు తగ్గి మార్కెట్ పతనమైంది. ఆ ప్రభావం రిటైల్మార్కెట్లో కనపడలేదు. యధారీతిగా చిన్న వ్యాపారులు వినియోగదారులను దోచుకున్నారు. అపరాల మార్కెట్ మరింతపతనమవుతుందని అప్పట్లో వ్యాపార వర్గాలు భావించాయి. దీనికి భిన్నంగా గత 15 రోజులుగా శనగపప్పు ధర ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తుంది. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు శనగపప్పు అవసరాలను తీరుస్తాయి. డిమాండ్ మేరకు ఈ పప్పును వ్యాపారులు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటారు. వాతావరణ అననుకూల పరిస్ధితుల నేపధ్యంలో ఈ ఏడాది శనగల దిగుబడులు 50 శాతం పడిపోయాయి. ఇదే ఆసరాగా గుత్త వ్యాపారులు విజంభించారు. క్వింటాలు 1350 రూపాయలు చెల్లిస్తేనే . పప్పు డెలివరీ అంటూ కూర్చున్నారు. వచ్చేది దీపావళి పండుగ, కార్తీక మాసం. పండుగలు రావడంతో పాటుగా వివాహాలు జరుగుతున్నాయి. దీంతో శనగపప్పుకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో శనగపప్పు ఆకాశానికి ఎగబాకింది. కిలో గుత్త మార్కెట్లో 110 రూపాయలకు చేరింది. అక్కడి నుంచి 115 రూపాయలకు పెరిగింది. అక్కడి నుంచి 120 , అక్కడి నుంచి ఏకంగా 135 రూపాయలకు చేరుకుంది. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో 150 రూపాయలకు శనగపప్పు అమ్ముతున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఏడాది వ్యవ«ధిలో శనగపప్పు ధర ఏకంగా వంద శాతానికి పైగా పెరిగింది. రానున్న రోజుల్లో ఈ పప్పు ధర మరింతపెరిగే సూచనలు కనపడుతున్నాయి. కందిపప్పు విషయానికొస్తే నాగపూర్ కందిపప్పు కిలో 130 రూపాయలకు రిటైల్ మార్కెట్లో ఉంది. గుత్త మార్కెట్లో 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. సాధారణ రకం కందిపప్పు కిలో గుత్త మార్కెట్లో వంద రూపాయలు ఉండగా, విడిగా కిలో 110 రూపాయలకుఅమ్ముతున్నారు. గుంటూరు. మాచర్ల, వినుకొండ ప్రాంతాల నుంచి రకరకాల బ్రాండ్ల పేర్లతో మినపప్పు మార్కెట్లోకి వస్తుంది. నాణ్యతలో ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటంతో వినియోగదారులు ఈ పప్పులను కొంటున్నారు. గుత్త మార్కెట్లో కిలో 95 రూపాయలుండగా, విడిగా కిలో 100 నుంచి 110 రూపాయలకు అమ్ముతున్నారు. బొబ్బరపప్పు మషాలావడలు వేసుకోమన్నట్టుగా చౌకగా దొరుకుతుంది. గుత్త మార్కెట్లో కిలో 70 రూపాయలుండగా, విడిగా 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. మిగిలిన పప్పులు, గోధుమ ఆధారిత ఉత్పత్తుల ధరలు స్దిరంగా ఉన్నాయి. -
ఉల్లి రైతుల గోడు పట్టదా?
-
ధర తగ్గి.. బతుకు బుగ్గి!
టమాట ధర పతనం – ముందస్తు వర్షాలతో భారీగా పెరిగిన సాగు – ఒకేసారి మార్కెట్లోకి దిగుబడులు – ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి – 28 కిలోల బాక్కు ధర హోల్‌సేల్‌గా రూ.30 – రవాణా చార్జీలు, కూలి ఖర్చులకూ గిట్టని వైనం – పొలంలోనే వదిలేస్తున్న రైతులు – మార్కెటింగ్ శాఖ చర్యలు శూన్యం కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత టమాట అత్యధికంగా సాగయ్యే జిల్లా కర్నూలు. ఖరీఫ్‌లో జిల్లా సాధారణ సాగు 6,500 హెక్టార్లు ఉండగా.. దాదాపు 6,800 హెక్టార్లలో సాగయింది. అయితే జిల్లాలో టమాట ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా అమలుకు నోచుకోని పరిస్థితి. ఫలితంగా యేటా టమాట ధర పడిపోతుండటంతో రైతుల శ్రమ మట్టిలో కలుస్తోంది. కనీసం రైతులను గట్టెక్కించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేకపోతోంది. ఏటా టమాట ధర జనవరి, ఫిబ్రవరి నెలల్లో పడిపోతుంటుంది. ఈసారి ముందస్తుగానే ఆ పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈనేపథ్యంలో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి టమాట దిగుబడులను సేకరించి ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలించి విక్రయించే ఏర్పాటు చేయాలి. అయితే ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. జిల్లాతో పాటు చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ టమాట సాగు పెరగడం, దిగుబడులు ఒకేసారి రావడంతో ధర పతమయినట్లు తెలుస్తోంది. ముందస్తు వర్షాలతోనే.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా.. అంటే జూన్‌లోనే వర్షాలు కురవడంతో టమాట సాగు మొదలయింది. జూలై నెల చివరి వరకు వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులు మార్కెట్‌కు చేరడం ప్రారంభమయింది. సరిగ్గా 45 రోజుల క్రితం కిలో టమాట ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది. ఊహించని విధంగా సాగు పెరగడం, అన్ని ప్రాంతాల్లో పంట ఒకేసారి రావడంతో ధర పతనమయింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కూరగాయల హోల్‌సేల్ మార్కెట్లో 28 కిలోల బాక్స్ ధర రూ.30 నుంచి రూ.60 మాత్రమే పలుకుతోంది. అంటే కిలో ధర రూ.1 నుంచి రూ.2లు మాత్రమే. కొద్ది రోజులుగా ధరలు ఇదే స్థాయిలో ఉండటంతో రైతులకు పెట్టుబడులు కాదు గదా.. టమాటను తెంపడానికి, రవాణా చార్జీలకూ సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు నష్టాలను భరించలేక టమాటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కదు టమాట సాగులో ఎకరాకు రూ.12వేల నుంచి రూ.16 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడులు పెడితే కొంత ఊరట లభిస్తుంది. దిగుబడి పెరిగినా పంట మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ధరలు పడిపోవడంతో పెట్టుడబడిలో 50 శాతం కూడా దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ధర రూ.200లోపే ఉండటంతో రూ.6వేల వరకే వస్తోంది. ఇందులో కోత, రవాణా చార్జీలు తీసేస్తే ఎకరాకు రూ.3వేలు కూడా దక్కట్లేదు. మార్కెట్లను ముంచెత్తుతున్న టమాట జిల్లాలోని మార్కెట్లను టమాట ముంచెత్తుతోంది. కర్నూలులోని సి,క్యాంపు రైతుబజార్‌కు రోజూ 160 క్వింటాళ్లు వస్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని కూరగాయల మార్కెట్‌కు 500 క్వింటాళ్ల వరకు వస్తోంది. జిల్లాలో పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి మండలాల్లో టమాట మార్కెట్లు ఉన్నాయి. వీటికి సైతం భారీగా వస్తోంది. డిమాండ్ పడిపోవడం, సరఫరా పెరగడంతో ధరలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించాల్సిన ప్రభుత్వం మౌనం వహించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పొలంలోనే వదిలేసినా ఈసారి జూన్‌లోనే వర్షాలు పడటంతో అదే నెల మూడెకరాల్లో టమాట పెట్టిన్యాం. వర్షాదారం కింద కొంత, నీటి ఆధారం కింద కొంత వేసిన్యాం. ఎకరాకు పెట్టుబడి రూ.13వేల నుంచి రూ.15 వేల వరకు అయినాది. పంట బానే వచ్చినా ఎప్పుడూ లేనట్ల ధర పడిపోయినాది. పెట్టుబడిల 20శాతం కూడా వస్తలేదు. టమాటలు తెంపనీక రోజుకు మనిషికి రూ.100 పైనే ఇయ్యాల. మార్కెట్‌కి తీసుకపోనీక గంపకు రూ.30 పైనే అడుగుతారు. గిట్టుబాటు కాదని పొలంలోనే వదిలేసినా. – బద్రిస్వామి, గిరిగెట్ల, తుగ్గలి మండలం రూ.30వేల పెట్టుబడికి రూ.10వేలు బోరు కింద ఒకటిన్నర ఎకరాల్లో టమాట సాగు చేసినా. పెట్టుబడి దాదాపు రూ.30 వేలు అయింది. దిగుబడి బాగాన్నా ధర పూర్తిగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో కిలో ధర రూ.15 వరకు ఉండింది. ఈ సారి 25 కిలోల గంపకు రూ.50 కూడా వస్తలేదు. 10 గంపలు మార్కెట్‌కు తరలిస్తే కూలి, రవాణా ఖర్చులు కూడా రావు. నష్టాలను భరించలేక టమాటలు తెంపడమే మానేసినా. ఇట్టాంటి పరిస్థితి యానాడు లేకుండె. – గోపాల్, అరికెర, ఆలూరు మండలం టమాట అత్యధికంగా సాగయ్యే మండలాలు: ఆదోని డివిజన్: ఆస్పరి, దేవనకొండ, పత్తికొండ, మద్దికెర, పెద్దకడుబూరు, తుగ్గలి, కౌతాళం, హాలహర్వి ఆలూరు కర్నూలు డివిజన్: డోన్, ప్యాపిలి, వెల్దుర్తి, కష్ణగిరి, ఓర్వకల్లు, కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, బేతంచెర్ల, గూడూరు -
ఖర్చు తప్ప ఆధ్యాత్మిక భావన ఏదీ?
పుష్కరాల ఏర్పాట్లపై కమలానంద భారతి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు గుమ్మరించినా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను నింపలేకపోయిందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. పుష్కరాల ఏర్పాట్లంటూ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఆలయాలను కూల్చడం ప్రభావం చూపుతోందని, మున్ముందు ఇదే ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉంటుందన్నారు. పుష్కరాల సందర్భంగా కమలానంద భారతి, బీజేపీ రాష్ట్ర నాయకుడు సీహెచ్ బుచ్చిరాజు తదితరులతో కలసి మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించినట్టు పీఠం బుధవారం ఇక్కడ ప్రకటన విడుదల చేసింది. గోదావరి పుష్కరాలకు వెళ్లిన భక్తులు పడిన ఇక్కట్లను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలా మంది ఈసారి ఘాట్లకు రావడానికి వెనుకాడుతున్నారని కమలానంద పేర్కొన్నారు. -
అంత వీజీ కాదు
ఒలింపిక్స్ నిర్వహణ ఓ పెద్ద తలనొప్పి అంచనాలను మించుతున్న ఖర్చు క్రీడల తర్వాత ఆర్థిక సంక్షోభం ఒకరిని మించి మరొకరు... ఒకరితో పోటీ పడి మరొకరు... నాలుగేళ్ల తర్వాత ఈ మాత్రం ఖర్చు పెరగదా అన్నట్లుగా ప్రతీ సారి కొండలా పెరిగిపోతున్న బడ్జెట్... ఒలింపిక్స్‌కు బిడ్ వేసిన నాటినుంచి క్రీడలు నిర్వహించే వరకు ప్రతీ చోటా అతి. అడగడుగునా హంగూ, ఆర్భాటం... వీటికి తోడు పారదర్శకత లేకపోవడం, అవినీతితో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ ఆయా నగరాలకు తలకు మించిన భారంగా మారుతోంది. బిడ్ సమయంలో కనిపించిన ఉత్సాహం, క్రీడలు ముగిశాక ఆవేదనగా మారుతోంది. ఒలింపిక్స్ నిర్వహించిన నగరాలు, దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. గతంలో నగరాలు ఈవెంట్ ముగిశాక లెక్కా పద్దులపై ఆందోళన చెందితే... ఇప్పుడు రియో పోటీలకు ముందే గుండెలు బాదుకుంటోంది. బ్రెజిల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో క్రీడల నిర్వహణ దేశానికి మరింత భారంగా మారి, అది ఆందోళనగా రూపాంతరం చెందింది. సాక్షి క్రీడా విభాగం ‘మాకొద్దీ ఒలింపిక్స్... అదేమైనా మా జీవితాలు మారుస్తుందా, మా నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు చాలు, కొత్తగా వచ్చేదేమీ లేదు, పర్యాటకులు రాకపోయినా పర్వాలేదు’... ఇదేదో అభివృద్ధి చెందుతున్న దేశమో, ఆర్థికంగా గొప్పగా లేని దేశంనుంచో వస్తున్న మాట కాదు. అమెరికాలోని బ్రిస్టల్, జర్మనీ నగరం హాంబర్గ్, నార్వే (ఓస్లో), స్వీడన్ (స్టాక్‌హోం) దేశాలు... గత కొన్నేళ్లలో ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆరంభంలో పోటీ పడి ఆ తర్వాత మా వల్ల కాదంటూ ముందే చేతులెత్తేశాయి. ఇవన్నీ ఓటింగ్ ద్వారా ప్రజల అభిప్రాయం తెలుసుకొని మరీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. తమ నగరంలో జరుగుతున్నాయని పక్షం రోజుల సంబరం తప్ప దాని వల్ల ఎలాంటి లాభమూ లేదని, తర్వాతి కాలంలో మరింత సమస్యలు వస్తాయని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. 2012 లండన్ ఒలింపిక్స్ నిర్వహణ అంచనా వ్యయం 2.4 బిలియన్ పౌండ్లు అయితే ముగిసే సరికి అసలు ఖర్చు 8.92 బిలియన్ పౌండ్లుగా తేలడం ఆయా దేశాలను భయపెట్టేసింది. బ్రెజిల్ అత్యుత్సాహం ‘మా దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అసలు నిరుద్యోగం అనేదే లేదు. రియో సముద్ర తీరంలో పెద్ద మొత్తంలో కొత్తగా బయటపడ్డ ఆయిల్ నిక్షేపాలతో మా ఆదాయానికి తిరుగు లేదు. ఇప్పటికే ఫుట్‌బాల్ ప్రపంచ కప్ హక్కులు దక్కించుకున్నాం. ఇక ఒలింపిక్స్‌తో మా కీర్తి మరింత పెరుగుతుంది. మేం బాగా నిర్వహించగలమనే నమ్మకం ఉంది’... 2009లో రియోకు ఒలింపిక్స్ కేటాయించినప్పుడు ఐఓసీ ముందు బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు మెరెలెస్ చేసిన భారీ ఉపన్యాసం ఇది. 2016 ఒలింపిక్స్ నిర్వహణ కోసం 2009లో బిడ్డింగ్ జరిగింది. ప్రాథమిక వడపోతలో చికాగో, టోక్యో తప్పుకోగా, మాడ్రిడ్‌తో పోటీ పడి రియో డి జనీరో అవకాశం దక్కించుకుంది. నాడు కోపకబానా బీచ్‌లోకి వచ్చి భారీగా సంబరాలు చేసుకున్న జనం ఇప్పుడు భోరుమంటున్నారు. మారిన సీన్ గత ఏడేళ్లలో బ్రెజిల్లో పరిస్థితి బాగా మారిపోయింది. ఒక్కసారిగా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టు ముట్టింది. 1990 తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దేశాధ్యక్షుడిపై తిరుగుబాటు జరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతంలో ఎన్నడూ నామమాత్రంగా కూడా లేని మౌలిక సౌకర్యాలను కల్పించే ప్రయత్నంలో భారీగా డబ్బు ఖర్చు చేశారు. విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండే రియో నగరంలో నిరంతర విద్యుత్ కోసం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. పైగా వీటి కాంట్రాక్ట్‌ల విషయంలో అవినీతి అమితంగా పెరిగిపోయింది. ఫలితంగా ప్రజల్లో ఒలింపిక్స్ సెంటిమెంట్ తగ్గిపోవడంతో పాటు అసహనం పెరిగింది. దాంతో జనం రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేయడం మొదలు పెట్టారు. ఒలింపిక్స్ తేదీలు ఇంత దగ్గరగా వచ్చినా నిధుల లేమి కారణంగా ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. అయితే బ్రెజిల్ అధికారులు, ఐఓసీ మాత్రం అంతా బాగుందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఐఓసీ అత్యాశ ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా చూసేవారి కన్నా టీవీ రేటింగ్‌ల వల్ల వచ్చే ఆదాయమే భారీగా ఉంటుంది. ఈ మెగా ఈవెంట్‌కు ఉండే క్రేజ్ వల్ల ఇది ఎలాగూ తగ్గదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జేబులోకే ఇదంతా వెళుతుంది. ఐఓసీ అథ్లెట్లకు డబ్బులు చెల్లించదు. తమ ఆదాయాన్ని సభ్య దేశాలతో పంచుకోదు. అథ్లెట్లను పంపినందుకు కూడా ఆయా దేశాలకు ఏమీ ఇవ్వదు. మౌలిక సౌకర్యాల కల్పన గానీ, ప్రాధమిక పెట్టుబడి కానీ ఏమీ పెట్టదు. చివరకు పన్నులు కూడా చెల్లించదు. రూపాయి ఖర్చు లేకుండా తమ నియంత్రణ ఉండాలని కోరుకుంటుంది. పైగా ఐఓసీ అవినీతికి అడ్డాగా మారడం కూడా నిర్వహణా వ్యయాన్ని పెంచేస్తోంది. బిడ్డింగ్ చేయడం, ఆ తర్వాత దానికి ప్రచారం కల్పించడం భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఇక హక్కులు దక్కించుకున్న నగరానికి ప్రతీ సారి నిబంధనలు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సరిపోదు, ఇంకా బాగుండాలి అంటూ సవాలక్ష ఒత్తిడులు. దేనికీ సంతృప్తి చెందకుండా వంకలు పెట్టడంతో మరింత బాగా చేయాలంటూ ఆతిథ్య దేశాలు ఇబ్బందుల్లో పడిపోతున్నాయి. ఒలింపిక్స్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కొత్త నగరాల కోసం చూస్తున్నామంటూ ఐఓసీ చెప్పే మాటలు బూటకమే. ఇలాంటి స్థితిలో మున్ముందు ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఏ దేశమైనా ముందుకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే రియోలో ఒలింపిక్స్ జరిగిపోవచ్చు కానీ నిర్వహణ అనంతర పరిణామాల గురించి ఆలోచన వస్తేనే ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. -
భారత్ లో అదే అత్యంత చౌక నగరం!
కోల్ కతాః ప్రవాసితులు నివసించేందుకు వీలుగా, ఇండియలోని మిగిలిన నగరాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ఒకప్పుడు సామాన్యులు సైతం బతికేందుకు వీలుగా, చౌకగా ఉండే నగరంగా పేరొందిన ముంబై ప్రస్తుతం ఆస్థానాన్ని కోల్పోయి అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయిందని సర్వేల్లో తేలింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ప్రస్తుతం కోల్ కతా అతి చౌక నగరంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో హాంకాంగ్ అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందిన కొద్ది రోజుల్లోనే ముంబైలోని అద్దెలు ఢిల్లీతో పోలిస్తే సుమారు 18 శాతం పెరిగిపోయినట్లు సర్వేలద్వారా తెలుస్తోంది. భారతదేశంలో సామాన్యులకు, ప్రవాసితులకు అందుబాటులో, తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ నిర్వహించిన సంవత్సరాంతపు సర్వేల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరు విదేశీయులకు అందుబాటులో ఉంటుందని, అతి తక్కువ ఖర్చుతో కోల్ కతాలో సామాన్యులు సైతం జీవించేందుకు వీలుందని సర్వే చెప్తోంది. మెర్సర్స్ 2016 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఖర్చు ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో టాప్ ర్యాంక్ లో నిలువగా, రెండో స్థానంలో లువాండా, అంగోలా రాజధాని మోపడం లు ఉన్నాయి. జురిచ్, సింగపూర్ లు మూడు, నాలుగు స్థానాల్లో నిలువగా, గతేడాది ఆరోస్థానంలో ఉన్న టోక్యో ఈసారి ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఎక్కువ ఖర్చుగల నగరాల్లో మొదటిస్థానాన్ని 82 వ ర్యాంకుతో ముంబై ఆక్రమించింది. ఆ తర్వాత ర్యాంకులు 130 ఢిల్లీ, 158 చెన్నై ఆక్రమించగా... కోల్ కతా 194, బెంగళూరు 180 ర్యాంకులతో తక్కువ ఖర్చుగల నగరాలుగా గుర్తింపు పొందాయి. మెర్సర్స్ సంస్థ ప్రతియేటా మార్చి నెల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పై సర్వే నిర్వహించి, మే, జూన్ ప్రాంతాల్లో ర్యాంకులను వెల్లడిస్తుంది. ఏ నగరంలోనైనా వస్తువులు మరియు సేవలు, హౌసింగ్ ఆధారంగానే జీవన వ్యయాన్ని అంచనావేస్తామని, మూడేళ్ళుగా ముంబై, ఢిల్లీకన్నా ఐదు కేటగిరీల్లో అత్యంత ఖరీదైన నగరంగా ఉంటోందని మెర్సర్ సంస్థ గ్లోబల్ మొబిలిటీలో.. ప్రిన్సిపాల్ ఇండియా ప్రాక్టీస్ లీడర్ గా పనిచేస్తున్న రుచికా పాల్ తెలిపారు. -
డ్రెస్సు మూరెడు... రేటు బారెడు!
‘చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప..’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిన్న గౌనులో కనువిందు చేసిన రమ్యకృష్ణను కూడా అంత సులువుగా మర్చిపోలేం. ‘అదిరేటి డ్రెస్సు మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ పాట గుర్తు రాగానే వయ్యారంగా నర్తించిన ఊర్మిళ కళ్ల ముందు మెదలకుండా ఉండదు. ఇక్కడ పేర్కొన్న రెండు డ్రెస్సులూ సినిమాల్లోవి. నేటి తరం నాయికలు కూడా ఇలా సినిమాల్లో అదిరేటి డ్రెస్సులతో అదరగొడుతున్నారు. అయితే విడిగా కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్‌లోనే దర్శనాలిచ్చి మతులు పోగొడుతున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలకు తారలు వస్తున్న తీరు చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని చూసేవాళ్లు అంటున్నారు. ఎంతైనా మన కథానాయికల మనసు చాలా విశాలమైనదనీ, ఏదీ పెద్దగా దాచుకోరనీ జోకేసేవాళ్లూ ఉన్నారనుకోండి. ప్రతిదానికీ బడ్జెట్ చెక్ చేసుకునేవాళ్లు మాత్రం ‘ఎంతైనా అమ్మాయిలకు రూపాయంటే చాలా జాగ్రత్త. బట్టల ఖర్చు తక్కువే’ అంటారు. కానీ, పెద్ద గౌనుకి ఎంత అవుతుందో చిన్న గౌనుకీ అంతే ఖర్చవుతుందట! చిన్న డ్రెస్సు మొత్తం మూడు మీటర్లు ఉండదేమో.. రేటు మాత్రం వేలల్లోనే! పొడవాటి డ్రెస్సులకి 70వేల నుంచి లక్ష వరకూ ఖర్చు పెడుతుంటే.. పొట్టి డ్రెస్సులకు కాస్తంత తక్కువగా అంతే ఖర్చుపెడుతున్నారు. అందాల తారలు వేసుకునే డ్రెస్సుల ఖరీదు ఓ సామాన్య ఉద్యోగి నెల జీతంకన్నా కొంచెం ఎక్కువే అంటే అతిశయోక్తి కాదు. ఇంత ఖర్చుపెట్టడం అవసరమే. ఎందుకంటే ఉండేది గ్లామర్ ఫీల్డ్‌లో. ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించాలి. లేకపోతే ‘ఎందుకోగానీ ఆ హీరోయిన్ ఈ మధ్య అంత బాగుండట్లేదు’ అని స్టాంప్ వేసేస్తారు. అలా అనిపించుకోవడంకన్నా ఉన్న అందం ఎంతో కొంత కనపడేలా డ్రెస్సులేసుకోవడం మేలు. అందుకే తారలందరూ సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా రెచ్చిపోతున్నారు. పైగా.. ఆ మధ్య ఎండలు దంచేశాయ్ కదా. అందుకే గత రెండు, మూడు నెలల్లో తారలందరూ దాదాపు పొట్టి గౌన్లూ, మినీ స్కర్టులే బెస్ట్ అనుకున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్లుగా దర్శనమిచ్చారు. అదిరేటి డ్రెస్సులు వీళ్లేస్తే చూసేవాళ్లకి దడ పుట్టకుండా ఉంటుందా? -
ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గం
కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం: హరీశ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గేది లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఒక్క భక్తునికి కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సాగర్‌లో మూడు చోట్ల పుష్కరఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల నిర్వహణలో తెలంగాణకు దేశంలోనే మంచి పేరు వచ్చిందని, అదే రీతిలో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 86 పుష్కర ఘాట్లను 4,852 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తామని, పుష్కరాల కోసం రూ. 212 కోట్లు కేటాయించామని చెప్పారు. పుష్కరాల ప్రారంభానికి కేవలం రెండున్నర నెలలు మాత్రమే సమయం ఉన్నందున పనులను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. వర్షాకాలంలో పుష్కరాలు జరగనున్నందున కృష్ణా నదిలో ఎన్ని నీళ్లు వచ్చినా ఇబ్బంది లేకుండా ఘాట్లను నిర్మిస్తామన్నారు. ఈ పర్యటనలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఖర్చు చేస్తే ఆదా అవుతుంది
కాస్త జాగ్రత్త పడితే వాహన బీమాలోనూ ఆదా గత మూడేళ్లుగా ప్రీమియం ధరలు చూస్తే.. కారు బీమా ప్రీమియంలు 20 శాతం వరకు, ద్విచక్ర వాహనాలకైతే 15 శాతం వరకూ పెరిగాయి. అందుకే బీమా ప్రీమియం నుంచి కొంతైన ఉపశమనం పొందాలంటే కాసింత అప్రమత్తంగా... తెలివిగా వ్యవహరించాలి. * మనం బీమా కట్టేదే వాహనానికి ఏదైనా జరిగితే క్లెయిమ్ చేయడానికే. ఇందులో మరో మాట లేదు. కాకపోతే క్లెయిమ్ చేసే ముందు కొంత ముందు చూపు అవసరం. అదేంటంటే.. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే సంబంధిత బీమా సంస్థ మరుసటి ఏడాది ప్రీమియంలో ఎంత మొత్తాన్ని తగ్గిస్తుందనేది ముందుగా తెలుసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే.. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కంటే తక్కువగా ఉందనుకోండి. మీరు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది కదా!!. అదీ మ్యాటర్. * మీ కారు కనక ఐదేళ్లకు మించిందనుకోండి... నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ అనే యాడ్ కవర్‌ను తీసుకోవటం మరింత మంచిది. దీంతో క్లెయిమ్ చేసినా కూడా మీ నో క్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. అదెలాగంటే.. మీ పాలసీపై 40 శాతం వరకు ఎన్సీబీ ఉందనుకుందాం. కానీ, మీరు క్లెయిమ్ చేశారనుకోండి. దీంతో వాస్తవానికి మీ ఎన్సీబీ మొత్తం పోవాలి. కానీ, మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉండటంతో మీ దగ్గరున్న 40 శాతం ఎన్సీబీలోంచి 10 శాతం పోయి మీ దగ్గర 30 శాతం ఎన్సీబీ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉంది... పెపైచ్చు క్లెయిమ్ కూడా చేయలేదనుకుందాం. ఇప్పుడేమవుతుందంటే.. మీ దగ్గరున్న ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్సీబీలో మరో 10 శాతం అదనంగా కలుస్తుంది. అంటే అప్పుడు మీ ఎన్సీబీ 50 శాతానికి చేరుతుందన్నమాట. * ఒక్క ముక్కలో చెప్పాలంటే మన దగ్గర ఎంత ఎన్సీబీ ఉంటే ప్రీమియం అంత తగ్గుతుందన్నమాట. అయితే ఎంత తగ్గుతుందనేది మాత్రం ఏడాదిలో ఎన్నిసార్లు వాహనాన్ని క్లెయిమ్ చేశామనేదాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చిన్న చిన్న రిపేర్లు, డ్యామేజీల వంటివి సాధ్యమైనంత వరకు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది. జేబులోంచి కొంత ఖర్చు చేస్తేనే బెటర్. కారు డ్యామేజీ అయితే ముందుగా మీరు చేయాల్సిన పనేంటంటే.. కారు రిపేరుకు ఎంత ఖర్చువతుందో అంచనా వేయాలి. స్థానికంగా ఉండే రిపేరింగ్ సెంటర్లలో చేయించొచ్చేమో చూడండి. దీంతో దాదాపు 20 శాతం వరకు రిపేరింగ్ ఖర్చులు తక్కువయ్యే అవకాశముంది. రూ. 5 వేల బిల్లు అయితే మీరు బేరసారాలు ఆడి కొంతలో కొంతైన తగ్గించుకునే అవకాశముంటుంది. * చాలా వెబ్సైట్ల ద్వారా ఏ బీమా సంస్థ ఎంత ప్రీమియం ఉందో తెలుసుకునే వీలుంది. ఆయా బీమా సంస్థల క్లెయిమ్‌ల ఆధారంగా కంపెనీ కంపెనీకి మధ్య ప్రీమియంలో తేడాలుంటాయి మరి. అందుకే ముందుగా తెలుసుకోవటం మంచిది. ఏడాది బీమా పాలసీలు కాకుండా లాంగ్ టర్మ్ పాలసీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలకు రెండు మూడేళ్ల పాలసీతో పాటూ 24ఇంటు7 రోడ్ అసిస్టెన్స్ సేవలందిస్తున్నాయి కొన్ని కంపెనీలు. సింగిల్ ప్రీమియంలతో పోల్చుకుంటే వీటి ఖర్చు తక్కువగా ఉంటుంది. పెపైచ్చు 20-35 శాతం వరకూ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. మరోవైపు ప్రతి ఏటా పాలసీని రెన్యూవల్ చేయించాలనే టెన్షనూ ఉండదు. * మీరు వాహనాన్ని విక్రయిస్తున్నప్పుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్సీబీ సర్టిఫికెట్‌ను తీసుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్సీబీ జతపడింతో తెలుస్తుంది. వాహనాలకు యాంటీ థెఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవ కాశం ఉంది. - విజయ్‌కుమార్ చీఫ్ మోటార్ టెక్నికల్ ఆఫీసర్, బజాజ్ అలయెంజ్ -
ఈ ఫోన్ రేటు చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
జెరుసలేం: మనకు తెలిసిన మామూలు ఫోన్ల రేట్లు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. మరి సోలారిన్ పేరుతో విడుదలకు సిద్ధమైన ఈ ఫోన్ రేటు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే... ఈ మొబైల్ ఖరీదు అక్షరాల 20 వేల డాలర్లు(13.3 లక్షలు) ఇంత రేటు కలిగిన మొబైల్స్ సాధారణంగా వజ్రాలు, బంగారంతో డిజైన్లు చేసి ఉంటాయనుకుంటున్నారా? అయితే సోలారిన్ ... సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ మాదిరిగానే ఉండబోతోందని కంపెనీ తెలిపింది. ఇంతకీ ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటా..? అని అనుకుంటున్నారా....ఈ మొబైల్‌ను తయారు చేస్తున్న బ్రిటీష్, ఇజ్రాయెల్‌లకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ... ఉద్యోగ నిపుణులను దృష్టిలో ఉంచుకుని తామీ ఫోన్ తయారు చేస్తున్నట్లు తెలిపింది. కాస్త రేటు ఎక్కువగా అనిపించినా సోలారిన్ మిలటరీ గ్రేడ్ సెక్యూరిటీతో వినియోగదారులకు లభిస్తుందనీ, దీనివల్ల సమాచారాన్ని హ్యాక్ కాకుండా కాపాడుకునేందుకు ఎక్కువ వెచ్చించాల్సిన పని లేదని కంపెనీ వివరించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టెక్నాలజీకి ఈ ఫోన్ ఫీచర్స్ మూడు సంవత్సరాల ముందుకు ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు చెప్పారు. యూరప్, అమెరికా దేశాల్లో హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవాలని చూసే వారందరూ ఈ మొబైల్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతారని వారు వివరించారు. ప్రస్తుతం ప్రపంచ లగ్జరీ ఫోన్ల మార్కెట్ విలువ 1.1 బిలియన్ డాలర్లుగా ఉందని వారు తెలిపారు. -
పోలవరం అంచనా వ్యయం మళ్లీ పెంపు!
* మాకెంత? మీకెంత? * కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దల మధ్య తేలని ముడుపుల లెక్కలు * మరో రూ. 1000 కోట్లు పెంపునకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముడుపుల పంచాయితీలో చిక్కుకుంది. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం మరోసారి పెంచి పంచుకోవడం ద్వారా ముడుపుల పంచాయితీకి తెర దించడానికి రంగం సిద్ధమయింది. అంచనా వ్యయం రూ. మూడు వేల కోట్లు పెంచిన నేపథ్యంలో.. ముడుపులు ఎవరికెంత అనే విషయంలో ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో.. అంచనా వ్యయాన్ని మరింతగా పెంచి పంచుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టు సంస్థలు కలిసి కొల్లగొట్టడానికి వీలుగా పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ. 4050 కోట్ల నుంచి రూ. 6,961.70 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. మరోసారి అంచనా వ్యయాన్ని సవరించి రూ. ఎనిమిది వేల కోట్లకు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల సమచారం. సబ్ కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు.. : అంచనా వ్యయం పెంచిన తర్వాతే అసలు కథ మొదలయింది. దీనికి ముందు మాట్లాడుకున్న విధంగా ప్రభుత్వ పెద్దలకు ముడుపులు పంపిణీకి ట్రాన్స్ట్రాయ్ నిరాకరించింది. మొత్తం ప్రాజెక్టు పనులన్నీ తమ కంపెనీ ద్వారానే జరుగుతాయనే ఉద్దేశంతో భారీగా ముడుపులు ఇవ్వడానికి సిద్ధమయ్యామని, ఎస్క్రో ఖాతాలు తెరిచి సబ్ కాంట్రాక్టర్లుగా రంగంలోకి దిగిన బావర్, ఎల్అండ్టీకి నేరుగా చెల్లింపులు చేస్తే తమకు భారీగా సొమ్ము మిగలదని, ముడుపులు కూడా ఇవ్వనని ట్రాన్స్ట్రాయ్ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలకు తేల్చి చెప్పారు. సబ్ కాంట్రాక్టర్లు కూడా భారీగా ముడుపులు ముట్టజెప్పాలంటే.. ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అంచనా వ్యయాన్ని మరో రూ. 1000 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. -
కన్నపేగుకు ఖరీదు..?
♦ పసికందు రూ. 2 లక్షలకు విక్రయం.. ♦ ఎట్టకేలకు శిశువిహార్‌కు తరలించిన అధికారులు మంచాల: పోషణ భారమనుకున్నారో.. లేక ఆడపిల్ల అనుకున్నారో ఏమో ఆ తల్లిదండ్రులు తమ కన్నపేగుకు ఖరీదు కట్టి విక్రయించారు. ఎట్టకేలకు ఐసీడీఎస్ అధికారులు శిశువును శిశు విహార్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్‌లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండలేమూర్కు చెందిన పద్మకు ఆరేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చింతపల్లి పరిధిలోని బండకింది తండాకు చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈక్రమంలో గత జనవరి 1న పద్మ తిరిగి ఆడపిల్లను ప్రసవించింది. పాప పుట్టిన నాలుగు రోజులకే రూ. 2 లక్షలకు ఘట్కేసర్ మండలం అన్నోజీగూడకు చెందిన వెంకన్నకు విక్రయించారు. అయితే, స్వగ్రామంలో ఎవరికీ అనుమానం రాకుండా పద్మ తన పుట్టిల్లు బండలేమూర్ వచ్చింది. గతంలో కూడా పద్మ, రాజు దంపతులు తమ మూడో కూతురును అప్పట్లో రూ.70 వేలకు విక్రయించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పాపను శిశు విహార్‌కు తరలించారు. అయితే తిరిగి పద్మ ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఆమెపై ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అయినా పద్మ తన పుట్టింటికి వచ్చి శిశువును విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న చింతపల్లి ఐసీడీఎస్ అధికారి లావణ్య, సూపర్వైజర్లు సత్యమ్మ, సుగుణ ఇబ్రహీంపట్నం ఐసీడీ ఎస్ అధికారుల సహకారంతో విచారణ మొదలు పెట్టగా పుట్టిన నాలుగోరోజునే పాపను విక్రయించినట్లు తేలింది. దీంతో పద్మ, రాజు దంపతులతోపాటు వారి కుటుంబీకులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. తాము శిశువును విక్రయించలేదని, కేవలం పెంచుకోవడానికి మాత్రమే ఇచ్చామని దంపతులు అన్నోజిగూడకు చెందిన వెంకన్న అడ్రస్ ఇచ్చారు. పోలీసుల సహకారంతో అధికారులు ఆ పాపను తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు నగరంలోని శిశు విహార్‌కు తరలించారు. అయితే, తాను పాపను కొనుగోలు చేయలేదని, పెంచుకోవడానికి మాత్రమే తీసుకున్నానని మల్లయ్య అధికారులకు తెలిపాడు. -
ఎన్నికల్లో నేనే ఖర్చుపెడతా నేనే గెలిపిస్తా..
పార్టీ నేతలకు చంద్రబాబు హామీ ♦ అన్ని పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుంటా.. ♦ ఇకపై ఎన్నికలన్నీ ఏకపక్షంగా జరగాలి ♦ వలసలను ప్రోత్సహిద్దాం, చేరేవారితో సమన్వయం చేసుకోండి సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖర్చు గురించి పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ఆలోచించవద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతా తానే చూసుకుంటానని వారికి హామీనిచ్చారు. తానే ఖర్చుచేసి తానే గెలిపిస్తానన్నారు. గురువారం సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నాలుగు గంటలపాటు సమావేశమయ్యారు. రాష్ర్టంలో రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల వారిని టీడీపీలో చేర్చుకుంటానని, ఎవ్వరూ అడ్డు చెప్పొద్దని, కొత్తగా పార్టీలో చేరిన వారితో సమన్వయంగా ముందుకు వెళ్లాలని తన పార్టీవారికి హితబోధ చేశారు. రాష్ర్టంలో సింగపూర్ తరహా రాజకీయం రావాలని, ఎన్నికలు ఏకపక్షంగా జరిగి అన్నింటిలో తామే గెలవాలని ఆశించారు. ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలి కాబట్టి ఒకటి, రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండాలని చంద్రబాబు చెప్పారని టీడీపీ వర్గాల సమాచారం. రాష్ర్టంలో రెండో పార్టీ మనుగడ సాధించకూడదనే లక్ష్యంతో అందరూ పని చేయాలని సూచించారు. సింగపూర్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఒకే పార్టీ ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఉండాలనే ఉద్దేశంతో సింగపూర్‌లో రెండు, మూడు సీట్లను విపక్షాలకు కేటాయిస్తారని, ఇక్కడ కూడా అలానే చేసే పరిస్థితి రావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి 50 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 మండలి స్థానాలు పెరుగుతాయని, పార్టీలో ఉన్న, చేరే వారిలో అప్పటికి సమర్థులు ఎవరో గుర్తించి టిక్కెట్లు ఇప్పించి గెలిపిస్తానన్నారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమన్వయంతో పని చేసుకోవాలని, రెండు వారాలకో మారు సమావేశమై జిల్లాల్లో రాజకీయ, ఇతర పరిస్థితులను సమీక్షించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతి మూడు నెలలకోమారు అంచనా వేసి టిక్కెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రన్నవాడ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఏప్రిల్ 14న ప్రారంభించే గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేస్తామని అయితే కేటాయింపులు మాత్రం వారి వాటా చెల్లించిన వెంటనే చేస్తామన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీకి పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 1,800 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తారని, అందులో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. మనుమడి పుట్టిన రోజు సందర్భంగా విందు ఏప్రిల్ 8న(ఉగాది) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో 1,500 మందికి విందు ఇవ్వనున్నట్లు చెప్పారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీస్ అధికారులు పాల్గొననున్నారు. సీఎంను కలిసిన నిమ్మగడ్డ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కానున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రీస్కూళ్లుగా అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను తక్షణమే ప్రీస్కూళ్లుగా మార్చాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రీస్కూళ్ల కోసం ఈ ఏడాది ఐదు వేల సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అన్ని విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. -
భలే చాన్సులే..
సీసీ రోడ్ల పేరిట స్వాహాకు రంగం సిద్ధం..! ఏప్రిల్ 20లోగా పనులు పూర్తి చేయాలంటూ సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్న అధికారులు రూ.కోట్లు పక్కదారిపట్టే అవకాశం ఏటా మామూలే అంటున్న ఇంజినీరింగ్ అధికారులు వ్యయంలో వైఫల్యంతో ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఏటా రూ. కోట్లు మురిగిపోతుంటాయి. కానీ ఈసారి ఆర్థిక సంఘం నిధులను జోడించి చేపట్టిన సీసీరోడ్ల ద్వారా ఇవి మురిగి పోకుండా చేపట్టిన ప్రయోగం టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు కాసులు కురిపిస్తోంది. రూ. కోట్ల ప్రజాధనం దర్జాగా జేబుల్లో వేసుకునేందుకు మార్గం సుగమమైంది. విశాఖపట్నం: కేంద్రం 14వ ఆర్థికసంఘం నిధులు ఈ ఏడాది నేరుగా పంచాయతీలకు కేటాయించింది. వీటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రూ.69.27 కోట్లతో 2291 పనులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 800 పనులు మాత్రమే పూర్తి కాగా.. ఇంకా 200 పనులు ప్రారంభమే కాలేదు. మరో పక్క ఇంకా ఉపాధిహామీ పథకంలో మెటిరియల్ కాంపొనెంట్ నిధులు రూ.256 కోట్లు మిగిలిపోయాయి. అవి మురిగిపోకుండా, పది శాతం నిధులిస్తే 90 శాతం ఉపాధిహామీ నిధులిస్తామని.. వీటితో గ్రామాల్లో మరిన్ని సీసీ రోడ్లు నిర్మించుకోవచ్చంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆశతో కొన్ని పంచాయతీలు రూ.6.93 కోట్లు ఇచ్చేందుకు ముందుకురాగా వాటికి 62.35కోట్లు ఉపాధి నిధులు(90శాతం) జత చేసి సీసీరోడ్లకు శాంక్షన్ ఇచ్చారు. ఇంకా రూ.249.38కోట్లున్నాయి. జిల్లాలో ఇంకా రూ.249.38కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ నిధులున్నాయి. పంచాయతీల్లో అందుబాటులో ఉన్న రూ.27.71కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇస్తే గ్రామాల్లో మట్టిరోడ్డు అంటూ లేకుండా చేసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు పదేపదే చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడే ఓ మెలిక పెట్టారు. ఇప్పటి వరకు మంజూరు చేసిన పనులేకాదు. 10ః90 నిష్పత్తి లో ఆర్థికసంఘం-ఉపాధి నిధులతో చేపట్టే సీసీ రోడ్లన్నీ ఏప్రిల్ 20 లోగా పూర్తి చేస్తేనే బిల్లులు మంజూరవుతాయంటూ స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఇలా... ఎం-30 స్టాండర్డ్(ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక) ప్రకారం రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో, వాటర్ ప్యూరింగ్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25వేల చొప్పున కోత పెట్టొచ్చు..పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంచనాలు.. సాంకేతిక,పరిపాలనా ఆమోదాలకు కనీసం పదిరోజులు పడుతుంది. గైడ్‌లైన్స్ ప్రకారం రూ.లక్షకు 35మీటర్లకు మించి సీసీ రోడ్డు నిర్మించడానికి వీల్లేదు. 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తే రోజుకు 40 మీటర్లకు మించి రహదారి నిర్మాణం జరిగే అవకాశం లేదు. ఈ లెక్కన కిలోమీటర్ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తవ్వాలంటే సుమారు 20 రోజుల పడుతుంది, కనీసం 28 రోజుల పాటువాటరింగ్ చేయాలి. ఆ తర్వాత సాంకేతిక బృందం ఆమోద ముద్ర వేస్తే కానీ బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉండదు. 40 రోజుల్లో ఎలా సాధ్యం వాస్తవాలు ఇలా ఉంటే..ఇన్ని వందల కిలోమీటర్ల రహదారులు కేవలం 40 రోజుల్లో పూర్తి చేయడం..బిల్లులు డ్రా చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని..అంచనాలు రూపొందించి మొక్కు బడిగా పనులు చేపట్టడం, ఆ తర్వాత పూర్తికాకుండానే మమా అనిపించి స్వాహా చేయాలన్న ఎత్తుగడ కనిపిస్తోందన్న వాదన ఉంది. పర్సంటేజీల కోసం కక్కుర్తిపడే అధికారులు వీరికి అడ్డగోలుగా అండదండలందజేస్తున్నారు. ఇదే విషయమై పీఆర్ అధికారులను వద్ద ప్రస్తావిస్తే ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఇలా హడావుడిగా పనులు చేయడం..బిల్లులు డ్రా చేయడం మామూలేనని తేల్చిపారేశారు. చేసిన పనులకే బిల్లులు లేవు మా గ్రామంలో 2లక్షల పంచాయతీ నిధులిస్తే రూ.2లక్షల ఉపాధి నిధుల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామన్నారు. పనులు పూర్తయి రెండునెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు 10 శాతం నిధులిస్తే 90 శాతం నిధులు ఇస్తామంటున్నారు. పైగా ఏప్రిల్ 20లోగా పూర్తి చేయాలని మెలిక పెట్టారు. ఇది సాధ్యం కాదు. ఈలోగా పూర్తి చేయకపోతే మా పరిస్థితి ఏమిటి. -మడిసి వెంకటలక్ష్మి, సర్పంచ్, జి.అగ్రహారం -
ఇక ఆ రోజు నుంచి...
పెద్దల మాట చద్ది మూట...అంటారు. నేను మాత్రం చద్ది మూట కాదు.... చాదస్తపు మూట అనుకునేవాడిని. ఎవరు ఏది చెప్పినా పెద్దగా ఖాతరు చేసేవాడిని కాదు. నాకు విపరీతంగా ఖర్చు చేసే అలవాటు ఉండేది. కేవలం ఆడంబరం కోసం, హడావిడి కోసం అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు చేసేవాడిని. ఈ అలవాటు ఎంత ముదిరిపోయిందంటే... ‘ఛీ... ఇవ్వాళ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు’ అంటూ అవసరం లేకపో యినా ఏదో ఒక వస్తువు కొనేసేంతగా. నా ఫ్రెండ్స్‌లో శ్రీను అని ఉండేవాడు. వాడేమో ఆచి తూచి ఖర్చు చేసే టైప్. దాంతో వాడిని బాగా ఆటపట్టించేవాడిని. ‘‘జీవితం అంటేనే ఆనందం. నీ పీనాసి తనంతో ఆ ఆనందాన్ని కోల్పోతున్నావ్. నీ లైఫ్ వేస్ట్’’ అంటూ ఉండేవాడిని. ‘‘అనరా అను. ఏదో ఒకరోజు నీకు డబ్బు విలువ తప్పకుండా తెలుస్తుంది’’ అనేవాడు శ్రీను. ఆ మాట నిజమైంది. నా విచ్చలవిడి తనానికి మా ఆస్తి హారతయ్యింది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి వచ్చింది. దాంతో హైదరాబాద్ చేరుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను. కానీ అప్పటికీ నాలోని విలాస పురుషుడు బుద్ధి తెచ్చు కోలేదు. జీతం చేతిలో పడగానే ఆకర్షణలు లాగేసేవి. దాంతో జీతం సరిపోయేది కాదు. అయిదేళ్లు గిర్రున తిరిగాయి. సంక్రాంతి పండక్కి చాలా కాలం తరు వాత సొంత ఊరికి వెళ్లాను. వీధిలో శ్రీను కనిపించాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అది తన సొంత ఇల్లట. ఎంత బాగా కట్టుకున్నాడో! ‘‘ఏరా నిధి ఏమైనా దొరి కిందా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘అవును... ఆ నిధి పేరు పొదుపు. నువ్వు కూడా పొదుపు విలువ తెలుసుకొని ఉంటే ఇలాం టివి నాలుగిళ్లు కట్టేవాడివి’’ అన్నాడు. మనసు చివుక్కుమంది. నిజమే. నేనేమీ సంపాదించుకోలేదు సరికదా కనీ పెంచిన అమ్మా నాన్నలకు కూడా ఒక్క రూపాయి పెట్టలేదు. కానీ శ్రీను.. తన ఇంట్లో తన తల్లిదండ్రుల్ని పెట్టుకుని సేవ చేస్తున్నాడు. ఇక ఆ రోజు నుంచి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. డబ్బు విలువ తెలుసుకున్నాను. పొదుపు చేస్తున్నాను. ఇప్పుడు జీతం సరిపోవడమే కాదు... మిగులుతోంది కూడా. వాటిలో కొంత దాస్తున్నాను. కొంత అమ్మానాన్నలకు పంపుతున్నాను. ఏదో తృప్తి. ఒక రూపాయి ఖర్చు చేయకపోతే...ఒక రూపాయిని సంపాదించినట్లే కదా! - వి.ఉమామహేశ్వర్రావు, నెల్లూరు -
కొబ్బరికాయ @ రూ.2.50
భారీగా పడిపోయిన ధరలు లబోదిబోమంటున్న రైతులు కృత్తివెన్ను : కొబ్బరికాయ కంటే కోడిగుడ్డే అధిక ధర పలుకుతుంది. గుడ్డు విలువ రెండు కొబ్బరి కాయల ధరకు సమానంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి కాయ ధర భారీగా పడిపోయింది. రెండు నెలలుగా కొబ్బరి ధరలు రోజురోజుకూ తగ్గుతూ ప్రస్తుతం ముదురు కొబ్బరి కాయ రూ. రెండు నుంచి 2.50 పైసలకు చేరింది. మార్కెట్లో రూ. 5లు చేస్తున్న కోడిగుడ్డుతో పోల్చుకుని కొబ్బరి రైతులు లబోదిబో మంటున్నారు. కొబ్బరి బొండాల ధర కూడా అదే స్థాయికి దిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కొన్ని నెలలు క్రితం కొబ్బరికి ఎనలేని డిమాండ్ ఉంది. టెంకాయ పది రూపాయలు పైచిలుకు పలుకగా నేడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తగ్గిన కొబ్బరి బొండాల ఎగుమతులు కోస్తా కోనసీమగా పేరుగాంచిన కృత్తివెన్ను మండలంలో చినగొల్లపాలెం దీవిలో కొబ్బరిని ప్రధాన పంటగా నాలుగు వేల ఎకరాల్లో పండిస్తున్నారు. పంటపొలాలు, చేపల చెరువుల గ ట్లపైన పెద్ద ఎత్తున కొబ్బరి చెట్ల పెంపకం సాగుతోంది. గతంలో ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల వరకు కొబ్బరి బొండాలు మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్‌లతో పాటు హైదరాబాద్‌కు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం దిగుబడి ఉన్నా కొనగోలుదారులు లేకపోవడంతో వారానికి కనీసం 20 వేల కాయలు కూడా ఎగుమతి కావడం లేదు. బెంగుళూరు, తమిళనాడులతో పాటు రావులపాలెం ఈతకోట నుంచి నాణ్యమైన కొబ్బరి కాయలు దిగుమతి కూడా ఇక్కడి కాయలు కొనుగోలుపై ప్రభావం చూపుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ముదురు కాయలకు కూడా సరైన ధరలేక రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. -
ఆ సర్ప్రైజ్ మేకప్ ఖర్చు ఎంతో తెలుసా?
అలనాటి బాలీవుడ్ హీరో రిషీ కపూర్ తన తాజా సినిమా 'కపూర్ అండ్ సన్స్'లో సరికొత్త లుక్‌తో అభిమానులను విస్మయపరిచారు. ఈ వెటరన్ నటుడు ముఖంపై ముడతలు పడిన కురువృద్ధుడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన మేకప్ కోసం అక్షరాల రూ. 2 కోట్లు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ రిషీ కపూరే వెల్లడించాడు. 'టైటానిక్', 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' వంటి సినిమాలకు పనిచేసిన అమెరికన్ మేకప్ ఆర్టిస్ట్ గ్రెగ్ కానమ్ సినిమాలో తనకీ ఈ కొత్త రూపును ఇచ్చినట్టు తెలిపాడు. 'నిజానికి నేనే షాక్ తిన్నాను. ఆశ్చర్యపోయాను. ఇదేమంత పెద్ద బడ్జెట్ సినిమా కాదు. నా ముఖాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడానికి భారీగా ఖర్చు అయింది. దీనికితోడు మేకప్ ఆర్టిస్ట్ ప్రయాణ, బస ఖర్చులు అన్ని కలిపి రూ. 2 కోట్లు వరకు అయింది. రిషీ కపూర్‌కు మేకప్ వేయించడానికి ఏ నిర్మాత అయినా ఇంత ఖర్చు పెడతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది అసాధ్యమైన విషయం. అయితే ఇటీవలికాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా మారుతోంది. ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. అందులో నేను భాగం కావడం ఆనందం కలిగిస్తోంది' అని రిషీ చెప్పాడు. 'కపూర్ అండ్ సన్స్' నిర్మాత కరణ్ జోహర్దే ఈ క్రెడిట్ అంతా అని ఆయన ప్రశంసల్లో ముంచెత్తాడు. -
కారు చౌకగా కాకినాడ పోర్టు భూములు
-
మళ్లీ విద్యుత్ చార్జీల మోత!
-
ధర ఎందుకు తగ్గలేదు?
-
ఇంటి ధర పెంచుకుందాం!
కొనేటప్పుడు కాస్త తక్కువకు రావాలి. అమ్మేటపుడు బాగా ఎక్కువకు పోవాలి!! ఇలా అనుకునేది ఒక్క రియల్టీ విషయంలోనే. ప్రస్తుతం మార్కెట్లో అంత బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే... ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి విక్రయం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీ ఇంటికి విలువ జోడించటం ఎలా? దాన్ని ఆకర్షణీయంగా తయారు చేయటం ఎలా? ఇదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... * కొంచెం నేర్పు.. కాసింత ఖర్చు పెడితే చాలు * ప్రతికూలంలోనూ స్థిరాస్తి అమ్మకం కష్టం కాదు * ఏరియా, సౌకర్యాలు, నిర్వహణ... అన్నీ ముఖ్యమే సదరు స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర... ఇవే ఇంటి ధరను ప్రధానంగా నిర్ణయిస్తాయి. అలాగని పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయిస్తాయని అనుకుంటే పొరపాటే. ధరపై అత్యధిక ప్రభావం చూపించేది నిజానికి మార్కెట్ సెంటిమెంటే. అప్పుడు బూమ్ బాగా ఉంటే ఎక్కువ ధరకు కూడా అమ్ముడుపోతుంటాయి. అదే డీలా పడ్డ పరిస్థితుల్లో ధర తగ్గించినా అమ్ముడుపోవటం కష్టం. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం కూడా ఉండాలని, అప్పుడే ఇంటి విలువ రెట్టింపవుతుందని చెబుతున్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి. ‘‘సొసైటీ మెంబర్లు సక్రమంగా ఉండాలి. ప్రతి పైసా ఖర్చుకూ లెక్కలుండాలి. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది’’ అని చెప్పారాయన. రిపేర్ల విషయంలో నాణ్యమైన వస్తువులనే వినియోగించాలంటూ... ఇంటి విలువ అనేది కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదని, అందులోని సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారాయన. ఈ మధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులు కూడా ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోందని తెలియజేశారు. ఫుల్లీ ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్లకు ఇంకాస్త ఎక్కువరేటొస్తుందని చెప్పారు. చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలున్నా సరే! ఒక్క విషయంలో చిన్నపాటి తేడా ఉంటే కొనుగోలుదారులు ముందుకురారని గుర్తుంచుకోవాలి. అదే లీగల్ సమస్యలు. మీరు విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందడగు వేస్తాడని గుర్తుంచుకోండి. సౌకర్యాలే ముఖ్యం కాదు.. అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ-మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరం కావచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉండాలనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి. వసతులు చాలా కీలకం... ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా నిర్ణయిస్తారు. మొదటిది... ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? అనేది చూసి. రెండోది... ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? అనేది చూసి. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్ సదుపాయాలు కూడా కీలకమే. -
APPకీ కహానీ...
స్పెండింగ్ ట్రాకర్ మీకు వచ్చే జీతంలో మీరు ప్రతి నెల ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అలాగే మీ ఖర్చులను వేటి కోసం అధికంగా చేస్తున్నారో ట్రాక్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి తికమక, గందరగోళం లేకుండా సులభంగా మీ ఆర్థిక లావాదేవీలపై పట్టు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారా? అయితే ఇంకేం.. ‘స్పెండింగ్ ట్రాకర్’ అనే పర్సనల్ ఫైనాన్స్ యాప్‌ను ఉపయోగించి చూడండి. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈ స్పెండింగ్ ట్రాకర్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు * సులభ, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్. * యాప్‌ను ఓపెన్ చేయగానే టాప్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆదాయ వ్యయాలను వారం, నెల వారీగా, సంవత్సరం వారీగా తెలుసుకోవచ్చు. * యాప్‌లో ప్రధానంగా స్పెండింగ్, ట్రాన్సాక్షన్స్, కేటగిరీస్, అకౌంట్స్ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. స్పెండింగ్‌లో మీ ఆదాయ, వ్యయాల వివరాలను యాడ్ చేసుకోవచ్చు. వీటికి నోట్స్ రాసుకోవచ్చు. * ట్రాన్సాక్షన్లో మీ ఆర్థిక లావాదేవీలు కనిపిస్తాయి. కేటగిరీస్‌లో మీరు ఏ ఏ వాటిపై ఖర్చు చేస్తున్నారో..ఏ మార్గంలో ఆదాయం వస్తుందో.. తెలియజేసే అంశాలు ఉం టాయి. వీటికి ఐకాన్స్ సెట్ చేసుకోవచ్చు. * ట్యాబ్లెట్స్ కోసం ప్రత్యేకమైన లేఔట్ డిజైన్ * మీరు ఏ ఏ అంశాలపై ఎంత మొత్తంలో ఖర్చు చేశారో చూసుకోవచ్చు. * ప్రతిసారీ చెల్లించాల్సిన బకాయిలను రిమైండర్లో పెట్టుకోవచ్చు. * సేవింగ్స్, బిజినెస్, పర్సనల్ వంటి తదితర అకౌంట్లను రూపొందించుకోవచ్చు. * ఆదాయ వ్యయాలను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూసుకోవచ్చు. * ఆటో బ్యాక్అప్ ఫీచర్ ఉంది. -
గోదావరి జిల్లాల్లో నోరూరించే పులసచేపలు
-
మాడ పగులుతోంది..
గొంతు ఎండుతోంది దంచికొడుతున్న ఎండలు తారుమారైన పరిస్థితులు అక్కరకు రాని ఏర్పాట్లు ఒక ఘాట్ మూసివేత.. మరో ఘాట్‌కు బస్సులు కరువు మంగపేటలో పుణ్యస్నానాలకు కిలోమీటర్ మేర కాలినడక మహా పుష్కరాల్లో భక్తులకు తప్పని పాట్లు హన్మకొండ : జిల్లాలో గోదావరి పుష్కర ఏర్పాట్ల కోసం వివిధ ప్రభుత్వ విభాగాలు దాదాపు రూ.35 కోట్లు వ్యయం చేశాయి. మారిన పరిస్థితులతో ఇంకొన్ని నిధులు వెచ్చించాల్సి ఉన్నా సంశయంలో పడింది. ఫలితంగా నిలువ నీడలేక, తాగేందుకు మంచినీరు లభించక, చివరకు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సరిపడా సౌకర్యాలు లేక భక్తులు నానాపాట్లు పడుతున్నారు. రామ.. రామ.. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద స్నానఘట్టాలు, దుస్తు లు మార్చుకునేందుకు షెడ్లు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ తదితర ఏర్పాట్ల కోసం రూ.1.4 కోట్లు ఖర్చు చేశారు. సుమారు 700 మంది సిబ్బంది భక్తుల సేవలో నిమగ్నమయ్యూరు. అరుుతే, భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే ప్రాంతంలో అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి నీటి నిల్వలు ఉన్న ప్రాంతంలో భక్తులు స్నానం చేసి వస్తున్నారు. ఇలా వెళ్లే వారి కోసం ఇసుక బస్తాలతో దారి ఏర్పాటు చేశారు. నాలుగు షామియానాలు నిర్మించినా ఇతర ఏర్పాట్లేవీ చేయలేదు. వీటిలో రెండు గాలిధాటికి కూలిపోరుు రెండురోజులైనా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఉదయం 10-సాయంత్రం 5గంటల వరకు సుమారు 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్త్తున్నాయి. ‘ముళ్ల’కట్ట ఘాట్ రూ.4.5 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ముల్లకట్టఘాట్ భక్తుల పాలిట శాపంగా మారింది. కొత్తవంతెనపై నుంచి వాహనాల రాకపోకలు నిషేధించడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలినకన వెళ్లి ఖమ్మం జిల్లాలోని అవతలివైపు గోదావరి ఒడ్డున భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. పేరుకే ఖమ్మం జిల్లా అయినా.. వరంగల్ జిల్లా భక్తులే అధిక సంఖ్యలో అక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలే చేపట్టకపోగా.. అటుగా వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏర్పాట్లు ఇక్కడ.. స్నానాలు అక్కడ.. ముల్లకట్ట పుష్కరఘాట్‌కు వెళ్లొద్దని అధికారులు చెబుతు న్నా.. రామన్నగూడెం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు రద్దు చేశా రు. దీంతో భక్తులు మంగపేట పుష్కరఘాట్‌కు చేరుకుంటున్నారు. శుక్రవారం మంగపేట ఘాట్‌లో అంచనాకు మించి వచ్చిన భక్తులను తరలించేందుకు కేవలం పది మినీ బస్సు లు, మేజిక్ వాహనాలు సమకూర్చారు. వాహనాల కోసం నిరీక్షించలేక చాలామంది మూడు కిలోమీటర్ల ఎండలో కా లినడకన నదిలోకి వెళ్లి పుష్కర స్ననాలు చేశారు. -
పొదుపు బాటలో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎట్టకేలకు పొదుపుబాట పట్టింది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఖర్చులను నియంత్రించుకోవటంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అంతర్గత సామర్థ్యానికి పదును పెట్టాలన్న సీఎం ఆదేశంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. దీంతో తొలుత ఇంధన రూపంలో అవుతున్న ఖర్చును ఆదా చేయటంతో ఆయ న మాటలను అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి బయో డీజిల్ వాడకాన్ని ప్రారంభించబోతోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంధనంలో 10 శాతం మేర బయోడీజిల్‌ను వాడబోతోంది. సాధారణ డీజిల్‌తో పోలిస్తే బయో డీజిల్ ధర లీటరుకు రూ.8 మేర తక్కువగా ఉన్నందు న నిత్యం రూ.అరకోటి వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్కలేస్తున్నా రు. వెరసి ప్రతినెలా రూ.15 కోట్ల మేర ఇంధన రూపంలో ఖర్చు తగ్గనుంది. గతంలోనే నిపుణుల సూచన ధర పరంగా డీజిల్ కంటే బయో డీజిల్ చవకైంది కావటంతోపాటు వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే ఉద్గారాలనూ నియంత్రిస్తుంది. ఆర్టీసీ కూడా దీన్ని వినియోగిస్తే ఖర్చు తగ్గుతుందని చాలాకాలం క్రితమే నిపుణులు సూచించారు. దీంతో ఆ దిశగా ఆర్టీసీ కూడా అప్పట్లో చర్యలు చేపట్టింది. కానీ రాష్ట్ర విభజన ఉద్యమాల నేపథ్యంలో అంతర్గతంగా సరైన పరిస్థితులు లేకపోవటంతో అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో కొన్నిసారి టెండర్లు పిలిచినా దాన్ని అమలులోకి తేలేకపోయారు. ఓసారి గట్టిగానే ప్రయత్నించినా... దాని ధర ఎక్కువే ఉందన్న కారణాన్ని పేర్కొంటూ ప్రతిపాదనను అటకెక్కించారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లీటరు డీజిల్‌తో పోలిస్తే రూ.8 వరకు బయోడీజిల్ ధర తక్కువగా ఉంది. ఆ ఇంధనాన్ని సరఫరా చేసే సంస్థలు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నిత్యం 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఈ రూపంలో రోజూ అవుతున్న ఖర్చు రూ.3.5 కోట్లు. ఇందులో 10 శాతం వరకు బయోడీజిల్‌ను ఇంధనంగా వాడాలనేది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం మార్కెట్లో బయో డీజిల్ ధర లీటర్‌కు రూ.51 వరకు ఉంది. ఇది డీజిల్ కంటే రూ.8 వరకు తక్కువ. ఈలెక్కన ప్రతి లీటరు ఇంధనం వ్యయంలో అంతమేర ఆదా చేస్తే నిత్యం రూ.అరకోటి వరకు ఖర్చు తగ్గుతుంది. రాష్ట్రంలో తొలుత వెయ్యి బస్సులతో ప్రారంభించే యోచనలో అధికారులున్నారు. దాని ఫలి తాల ఆధారంగా ఆ ఇంధనాన్ని మిగతా బస్సులకు కూ డా విస్తరించనున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
గ్రీన్హౌస్ వ్యయం ఎకరాకు రూ.2 లక్షలు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ (పాలీహౌస్) నిర్మించుకునే రైతులకు శుభవార్త. గ్రీన్హౌస్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తగ్గించాలని సర్కారు యోచిస్తోంది. దీనిపై ఏర్పాటైన కమిటీ పలు సూచనలు చేసింది. గ్రీన్హౌస్ ఎత్తును 7.5 మీటర్ల నుంచి 6.5 మీటర్లకు తగ్గించడంతో నిర్మాణ పరికరాలు తక్కువ అవసరమవుతాయని.. తద్వారా వ్యయం తగ్గుతుందని కమిటీ పేర్కొంది. దీనివల్ల ఎకరాకురూ. 2 లక్షల వరకు భారం తగ్గుతుందని తెలిపింది. దీంతో 75 శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వానికి రూ.1.5 లక్షలు, 25 శాతం చెల్లించే రైతుకు రూ.50 వేల మేరకు ధర తగ్గుతుందని ప్రతిపాదించింది. దీన్ని పరిశీలించి త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. మందకొడిగా సాగుతున్నందునే... ప్రభుత్వం గత ఏడాది నుంచి గ్రీన్హౌస్ ప్రాజెక్టును చేపట్టింది. అందుకోసం రూ. 250 కోట్లు కేటాయించింది. దీనిద్వారా వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌస్ సాగును ప్రోత్సహించాలని లక్ష్యం గా పెట్టుకుంది. గ్రీన్హౌస్ నిర్మించుకునే రైతులకు 75 శాతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లోనూ అంతే మొత్తంలో నిధులు కేటాయించింది. దాంతోపాటు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల పరిధిని ఎత్తివేసి రాష్ట్రంలో ఎక్కడైనా గ్రీన్హౌస్ విధానంలో సాగు చేసేందుకు రైతులకు అనుమతించింది. అయినా నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న కారణంతో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. పైగా యూనిట్ ధర అధికంగా ఉండటంతో రైతులు కూడా ఆసక్తి కనబరచడంలేదు. దీంతో ఇప్పటివరకు ఎక్కడా గ్రీన్హౌస్ నిర్మాణం పూర్తయి సాగు జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నిబంధనల్లో అనేక సడలింపులు చేయాలని సర్కారు యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రీన్హౌస్ ఎత్తు 6.5 మీటర్లు ఉండగా, రాష్ట్రంలో అది 7.5 మీటర్లు ఉండాలని నిర్ణయించారు. దీంతో పొడవైన పరికరాలు కూడా అందుబాటులో ఉండటంలేదు. వ్యయం అధికం, పరికరాలు అందుబాటులో ఉండని కారణంగా ఎత్తును 6.5 మీటర్లకు తగ్గించాలని సాంకేతిక కమిటీ తాజాగా ప్రతిపాదించింది. దీనివల్ల నిర్మాణ వ్యయం ఎకరాకురూ. 2 లక్షలు తగ్గుతుందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఎకరాకు నిర్మాణ వ్యయం రూ. 33.76 లక్షలుండగా, మొక్కలు, ఇతరత్రా మెటీరియల్ ధర రూ. 5.60 లక్షలు ఉంది. మొత్తంగా ఎకరాకు రూ. 39.36 లక్షలవుతోంది. కొత్త ప్రతిపాదన ప్రకారం రూ.2 లక్షలు తగ్గిస్తే అదికాస్తా రూ.37.36 లక్షలు అవుతుంది. దీంతోపాటు మరికొన్ని నిబంధనలనూ సడలించాలని యోచిస్తోంది. ఏదేమైనా గ్రీన్‌హౌస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ఉద్యానశాఖ చెబుతోంది. -
పెరిగిన ‘కృష్ణపట్నం’ వ్యయం
రూ.5 వేల కోట్లకుపైగా అదనం తప్పుబట్టిన కాగ్ హైదరాబాద్: ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఖర్చుపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వివరణ కోరినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యయా న్ని పెంచారన్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించిన నేపథ్యంలో ఏపీఈఆర్సీ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరణ ఇచ్చేందుకు ఏపీ జెన్కో మల్లగుల్లాలు పడుతోంది. వాస్తవానికి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్స్ మెగావాట్‌కు రూ. 5.5 కోట్లకు మించి వ్యయం కాకూడదు. కానీ కృష్ణపట్నం ప్రాజెక్టులో ఇందుకు విరుద్ధంగా ఖర్చు పెట్టారు.మెగావాట్‌కు రూ.8 కోట్ల వ్యయం చేశారు. ఇలా ప్రాజెక్టు వ్యయం రూ.12,850 కోట్లకు చేరినట్టు సమాచారం. అనుమతి తీసుకున్నారా? అనూహ్యంగా ప్రాజెక్టు వ్యయం పెరిగినప్పుడు విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఎందుకు పాటించలేదని ఏపీఈఆర్సీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏపీ జెన్కో ఎండీ చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టును రూ. 10,450 కోట్లతో ప్రతిపాదించారు. 2011లో దీని వ్యయం ఏకంగా 12 వేల కోట్లకు చేరింది. గత ఏడాది మార్చి వరకూ రూ. 10,780 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది ఇంకా ఆడిట్ పూర్తి కాలేదు. పాత లెక్కల ప్రకారం లెక్కిస్తే ఇప్పుడది 12,850 కోట్లకుపైగానే ఉండే వీలుంది. కాగ్ తాజా నివేదికలో దీన్నే ప్రస్తావించింది. మెగావాట్‌కు ఏకంగా 3.3 కోట్ల మేర ఎక్కువ ఖర్చు చేశారు. ఈ లెక్కన 1,600 మెగావాట్లకు రూ.5,200 కోట్లు ఎక్కువగా వెచ్చించినట్టు తెలుస్తోంది. దీనికి నిర్ధిష్టమైన కారణాలు చూపాలని ఏపీఈఆర్సీ కోరుతోంది. ఏకంగా రూ 5వేల కోట్లకుపైగా ప్రాజెక్టు వ్యయం పెరగడాన్ని కాగ్ ఆక్షేపించింది. -
ప్రయాణంలో ఖర్చు తగ్గించాలంటే...
ట్రావెల్ టిప్స్ తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలు చూడటానికి వెళ్లినప్పుడు డబ్బు చేయి దాటిపోతుంటుంది. అందుకే చాలా మంది పర్యటనలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ప్రయాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలంటే... ఒక నీళ్ల బాటిల్‌ను (500 ఎం.ఎల్) ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. సురక్షితమైన తాగునీరు లభించే చోట తిరిగి, ఆ బాటిల్‌ను నింపుకోవాలి. లేదంటే దాహమైన ప్రతీసారి నీళ్లబాటిల్ను కొనుగోలు చేయడం వల్ల, వాటికే సగం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రదేశాల చిరునామాలు తెలియవు. దీంతో ఇబ్బందితో పాటు, చిన్న చిన్న లోకల్ ప్రయాణ సాధనాలకు ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అందుకని బస్, రైల్వేస్టేషన్, ఎయిర్పోర్ట్ వంటి వివరాలతో పాటు హోటల్ గదులు, దేవాలయాలు, ఇతర చూడదగిన ప్రదేశాల గురించి అక్కడ ప్రాంత వాసులనే అడిగితే సమయం, డబ్బు ఆదా అవుతాయి.బస్సులో లేదా రైలులో మీ పక్క సీటులో ఉన్న వ్యక్తితో మాటలు కదిపితే అక్కడి ప్రాంత విశేషాలు మరిన్ని తెలుసుకునే అవకాశం సులువవుతుంది. కొత్త ప్రదేశాల్లో వస్తువులను కొనుగోలు చేసేముందు మన ప్రాంతంలోనూ ఆ వస్తువులు దొరుకుతున్నాయా అనే గమనింపు అవసరం. దర్శనీయ ప్రాంతానికే ప్రత్యేకమైన వస్తువులు, ఇతర అలంకరణ వస్తువులు మినహా ఇతరత్రా ఖరీదైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండటం మంచిది. {పయాణం సులువుగా ముగించడానికి ఇప్పుడు అన్నింటికీ ఏరియా మ్యాప్స్ లభిస్తున్నాయి. వాటిని దగ్గర ఉంచుకొని, వాటిలో సూచనలను అనుసరిస్తూ వెళ్లడం మంచిది. -
రైల్వే బడ్జెట్లో కేటాయింపులు అరకొర
రైల్వే బడ్జెట్ ఈసారి కూడా నిరాశకు గురిచేసింది. పాత ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు అరకొరే కాగా కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఏటా ఆశించడం ప్రజలు వంతుకాగా.. ఉసూరుమనిపించడం కేంద్రం బాధ్యతగా మారింది. గురువారం రైల్వే మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో జిల్లా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ప్రసంగ పాఠాన్ని వినడానికి ఆసక్తి కనబరిచారు. జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టారు. అక్కన్నపేట, మనోహరాబాద్ మార్గాలకు అరకొర ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌కు రూ.20 కోట్లు, అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.5 కోట్లు కేటాయించడంపై పెదవి విరిచారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం పనులు చేపడతామంటున్నారు. మరిన్ని నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తామంటున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌కు రూ.20 కోట్లు ⇒అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.5 కోట్లు ⇒మొక్కుబడి నిధులపై జిల్లా వాసుల పెదవి విరుపు ⇒పనులు ప్రారంభిస్తామంటున్న ప్రజాప్రతినిధులు మెదక్: వ్యయం కొండంత... మంజూరు గోరంత అన్నట్లుంది అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్‌కు కేటాయించిన బడ్జెట్. గురువారం కేంద్ర రైల్వేమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం రూ.5 కోట్లు విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లకే ఎక్కువ బడ్జెట్ వస్తుందన్న ఆశతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మొక్కుబడిగా రూ.5 కోట్లు మాత్రమే నిధులు కేటాయించడంతో రైల్వేలైన్ పనులు ఏ మేరకు ముందుకు కదులుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కన్నపేట-మెదక్‌కు 17.2 కిలో మీటర్ల మేర రైల్వేలైన్ మంజూరు చేస్తూ 2012-13 బడ్జెట్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు గాను మొత్తం రూ.129.32 కోట్లు అవసరమని నిర్ణయించారు. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ... ఉచితంగా భూ సేకరణ చేసివ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 19 జనవరి 2014న రైల్వేలైన్‌కు అప్పటి ఎంపీ విజయశాంతి, మంత్రి సునీతారెడ్డిలు శంకుస్థాపన చేశారు. 2012-13లో రూ.కోటి, 2013-14లో రూ.1.10 కోట్లు, 2014-15లో రూ.10 కోట్లు కలిసి మొత్తం రూ.12.10 కోట్లు మంజూరయ్యాయి. కాగా రాష్ట్ర వాటాకింద 2012-13లో రూ.కోటి, 2012-14లో రూ.75 లక్షలు కలిపి మొత్తం రూ.1.75 కోట్లు మంజూరయ్యాయి. గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.25.26 కోట్లు, భూ సేకరణ కోసం రూ.10 కోట్లు తన వాటా కింద మంజూరు చేసింది. దీంతో భూ సేకరణ పోనూ రైల్వేలైన్ పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.24.60 కోట్లు మంజూరు చేసినట్లయింది. అయితే ఇంతవరకు భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈసారైనా కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందని ఆశపడ్డప్పటికీ కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడంతో మెదక్ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కల నెరవేరుతుంది.. అక్కన్నపేట-మెదక్, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ల ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కల. ఉద్యమ సమయం నుంచి ఆయన రైల్వేలైన్ల ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కన్నపేట-మెదక్‌కు రూ.5 కోట్లు, కొత్తపల్లి-మనోహరబాద్‌కు రూ.20 కోట్లు మంజూరు చేయడం సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి నిధులు మంజూరయ్యాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో వేసిన రైల్వేలైన్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిధులతో రైల్వేలైన్ పనులు ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో అధిక కేటాయింపులు జరిగేలా కృషి చేస్తా. - కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రాజెక్టులు సాధించుకుంటాం.. రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ పర్చింది. కేవలం పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత నిచ్చి, కొత్త వాటి ఊసెత్తక పోవడం సరికాదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా రైల్వే కొత్త ప్రాజెక్టులను సాధించుకుంటాం. జహీరాబాద్-సికింద్రాబాద్, బోధన్-బీదర్ మధ్య కొత్త రైలు మార్గాల ఏర్పాటుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని కోరుతా. కొత్త ప్రాజెక్టులకు మంజూరు లభిస్తుందనే నమ్మకముంది. - బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ పనులు ప్రారంభిస్తాం.. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనుల కోసం బడ్జెట్లో కేటాయించింది రూ.5 కోట్లే. ఇది చాలా తక్కువ. మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. అయినా పనులు ప్రారంభిస్తాం. రైల్వేలైన్ పనులు ప్రారంభించే అంశంపై చర్చించేందుకు మార్చి 3న సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి, అటవీశాఖ చీఫ్ సెక్రెటరీ, రైల్వేబోర్డు ప్రతినిధి, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఉన్న నిధులతో భూ సేకరణ పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతాం. కేంద్రమిచ్చిన రూ.5 కోట్లకు రాష్ట్ర వాటా కింద మరో రూ.5 కోట్లు మంజూరు చేయాలని సీఎంను కోరతాం. - పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ (మెదక్ ఎమ్మెల్యే) వైఎస్ హయాంలోనే రాష్ట్ర వాటాకు సంసిద్ధత అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లోనే ఎంతో చొరవ తీసుకున్నారు. ఇందులో సగం వాటాను రాష్ట్రం తరఫున భరించేందుకు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ లైన్ కోసం వైఎస్‌కు విజ్ఞప్తి చేశా. ఈ మేరకు రూ.120 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందాయి. ప్రస్తుత బడ్జెట్లో మంజూరు చేసిన రూ.5 కోట్లు ఏ పనికి కొరగావు. ఇప్పటివరకు భూ సర్వే, సేకరణ పూర్తి కాలేదు. పూర్తిస్థాయి సర్వేకూడా జరగలేదు. గత మూడేళ్లుగా మంజూరైన నిధులు కూడా అరకొరే. కనుక పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిధులను అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులకు మళ్లించాలి. - పి.శశిధర్‌రెడ్డి, పీసీసీ అధికారి ప్రతినిధి -
ఇవ్వాళ్ట్టి జేబు చిల్లు...! రేపటికి గుండెకు గండి...!!
సరదాగా... ‘‘ఈమధ్య మీ ఖర్చు చాలా పెరిగింది. గొంతు చిల్లులు పడినట్లు నేను చెబుతున్నా, జేబుకు చిల్లులు పడినట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు. అర్జెంటైతే తప్ప ఆఫీసు నుంచి ఇంటికీ ఇంటి నుంచి ఆఫీసుకూ బస్సులోనే వెళ్తుండండి’’ అన్నాను. శ్రీవారికి ఓ అలవాటుంది. నేను దేన్నైనా తప్పు అంటే చాలు, అదే రైటని సమర్థించడానికి ప్రయత్నిస్తుంటారు. ‘‘ఆదాయానికి కాస్త చిల్లు ఉండాలోయ్. అప్పుడే అన్ని వర్గాలకూ సంపద చేరుతుంది. ఆటోలో వచ్చాననుకో... అప్పుడు ఆటోవాడూ, నీసాటిదే అయిన వాడి పెళ్లాం, మన చిన్నారుల్లాంటి... వాడి పిల్లలూ.. అంతా నాలుక్కాలాలుంటారు. నాలుక్కూరలు తింటారు. అందుకే అప్పుడప్పుడూ తెగించి జేబుకు కాస్త చిల్లు వేస్తుండాలి’’ అన్నారాయన. ఆయనకు ఇష్టమైన మిస్సమ్మ పాటలో చెప్పాలంటే... ఆయనదంతా ‘తనమతమేదో తనదీ... మనమతమసలే పడని’ రెటమతం. ఈ మగాళ్లు ఏదో అంటారుగానీ....‘ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే‘ అనే టైపు వాళ్లదే. అందుకే మళ్లీ చిల్లు గొప్పదనం చెప్పడం మొదలుపెట్టారు. ‘‘మొదట్లో అట్లకాడనే బోలుగా చేసి ఆ గరిటతోనే నూనెలోంచి వడలూ, గారెలు తీసేవారట. కానీ నూనెంతా దాంట్లోనే నిలిచిపోతూ ఉండేదట. మిస్సమ్మలో చెప్పినట్లు ‘తైలం’ చాలా విలువైనది కాబట్టి తైలాన్ని రక్షించుకోడానికి చిల్లు పెట్టి దాన్ని జల్లిగంటె చేశారట. ఇవాళ్టి మన జేబుకు చిల్లు సాటి పేదలకు వరాల జల్లు’’ అంటూ ఓ ఇన్స్టాంట్ ఉపన్యాసం ఇచ్చారు. ‘‘అందుకే అప్పట్లో మీకు ఈసీజీ తీయిస్తే గ్రాఫు హెచ్చుతగ్గులుండాల్సిన చోట సమసమాజం, సామ్యవాదం అనే పదాలు పడ్డాయట. దాంతో కంగారు పడ్డ డాక్టర్లు మీ తలకాయకు సీటీ స్కాన్ చేయిస్తే అందులో ఏమీ కనిపించలేదట... పరోపకారం అనే అక్షరాలు తప్ప. అలాగే ఎక్స్‌రేలో మీ చేతికి ఎముక కనపడలేదట. మీ పరోపకారం కుటుంబానికి కారం, జేబుకు భారం కాకూడదు. అదీ నేను చెప్పేది’’ అంటూ ఏదో చెప్పబోయా. కానీ చిల్లు గొప్పదనాన్ని చెప్పడం మానలేదు. దాంతో ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి చెప్పా. ‘‘అప్పట్లో ఒకసారి మీ పేగుకు చిల్లు పడితే అర్జెంటుగా దాన్ని మూసేందుకు ఆపరేషన్ చేసేసి మిమ్మల్ని రక్షించారంటూ మీరే చెప్పలా.గుండెను రక్షిస్తూ ఉండే పెరికార్డియమ్ పొరకు మరింత రక్షణగా ఉండే పై పొరే జేబు. ఇవ్వాళ్టి జేబుకు చిల్లే... రేపటికి గుండె వరకూ గండిగా మారవచ్చు. పేగుకు పడితేనే చిల్లు - పెరిగిందంతగా హాస్పిటల్ బిల్లు. ఇక గుండెకు గండి పడితేనో? అందుకే ఇకనైనా పొదుపుగా ఉండండి’’ అంటూ ఉపదేశించా. దాంతో ఆయనిక సెలైంటైపోక తప్పలేదు. సెలైంటైనా తప్పులేదు. -
ఒక టీచర్... ముగ్గురు విద్యార్థులు
- రెడ్డిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఇదీ పరిస్థితి.. - పాఠశాలపై దృష్టిసారించని అధికారులు ఆమదాలవలస : ఆ పాఠశాలకు ఓ గొప్పదనం ఉంది. ఏంటి అవార్డులు ఏమైనా వచ్చాయనుకుంటున్నారా ఏంటి కానేకాదు. ఆ పాఠశాలలో కేవలం ముగ్గురంటే ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు రెడ్డిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో... ఉండేది ముగ్గురు విద్యార్థులే అయినే వారికోసం ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయూలు వ్యయం చేస్తోంది. సుమారు మూడు ఏళ్లుగా ఈ పాఠశాలలో ఇదేతంతు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ దీనిపై సరైన దృష్టి పెట్టలేదు. ఈ పాఠశాలకు ఒక వంట భవనం, తాగునీటి బోరు, వంట పనివారు మిగతా అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా : ఉపాధ్యాయుడు ఈ విషయంపై పాఠశాలలో పనిచేస్తున్నా ఏకైక ఉపాధ్యాయుడు విశ్వేశ్వరరావును సాక్షి ప్రతినిధి ప్రశ్నించగా ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. 2011లో నేను ఈ పాఠశాలలో చేరినపుడు 14 మంది పిల్లలే ఉన్నారు. క్రమేపి పిల్లల సంఖ్య తగ్గింది. పక్క పాఠశాలకు విద్యార్థులను మార్చుతాం : ఎంఈవో ఈ విషయమై ఎంఈవో ఈశ్వరరావును ప్రశ్నించగా ఈ విషయం కమిషనర్ నూకేశ్వరరావు దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పాఠశాలలో విద్యార్థులను సమీప గ్రామమైన సొట్టవానిపేటలోని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. -
మా ఆవిడ ఒకప్పుడు విపరీతంగా ఖర్చు చేసేది...
మా ఆవిడకు సౌందర్య స్పృహ కాస్త ఎక్కువ. దీంతో విపరీతంగా ఖర్చు చేసేది. మార్కెట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా కొనాల్సిందే. కొన్న వస్తువుల గురించి గంటల కొద్దీ తన ఫ్రెండ్స్‌తో మాట్లాడేది. ఇల్లు గడవడానికి పూర్తిగా నా జీతం డబ్బులే ఆధారం. వేరే ఆదాయ వనరులేవీ లేవు. ఇదేమీ గ్రహించకుండా తన ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేసి నా చేతి చమురు వదిలించేది. ఆమె డబ్బు అడగ్గానే- ‘‘ఎందుకు? ఏమిటి?’’ అని అడిగే సాహసం చేయలేకపోయేవాడిని. ఒకసారి ఇలా అడిగిన పాపానికి పెద్ద గొడవ అయింది. అందుకే ఆమె ఎంత డబ్బు అడిగినా కిమ్మనకుండా ఇచ్చేవాడిని. ఆమె ఖర్చుల పుణ్యమా అని నేను అప్పులు కూడా చేయడం ప్రారంభించాను. ఒకరోజు మా ఆవిడతో సున్నితంగా చెప్పాను - ‘‘నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ అనసవరపు ఖర్చు ఎందుకు చెప్పు?’’ అని. ‘‘నువ్వు రోజూ తినడం ఎందుకు? వారానికి ఒక్కరోజు తింటే సరిపోతుంది కదా. చాలా డబ్బులు మిగులుతాయి’’ అన్నది వ్యంగ్యంగా. సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కాలేదు. మరోవైపు ఆమె ఖర్చుల పుణ్యమా అని నా అప్పుల జాబితా అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఓపిక పట్టే శక్తిని పూర్తిగా కోల్పోయాను. ఒకరోజు మాత్రం పెద్ద ఎత్తున మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారం రోజుల పాటు మా మధ్య మాటలు లేవు. హోటల్లోనే తినేవాడిని. పరిస్థితి విషమిస్తోందని తెలిసి, నా ఫ్రెండ్ మా ఇద్దరినీ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. అక్కడికి విడివిడిగా వెళ్లాం. విందు తరువాత మా ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని డబ్బు విలువ గురించి చెప్పాడు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే డబ్బు లేనప్పుడు ఎలా ఇబ్బంది పడాల్సి వస్తుందో తన సొంత అనుభవాల్లో నుంచి చెప్పాడు. అప్పటి నుంచి ఆమెలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తోంది. అనవర ఖర్చులు తగ్గించి పొదుపు చేయడం నేర్చుకుంది! - సిడిఆర్, విశాఖపట్టణం -
టౌన్‌హాల్‌కు మహర్దశ...
అభివృద్ధి పనులు ప్రారంభం రూ. ఐదు కోట్లతో అత్యాధునికంగా నవీకరణ పనులు ప్రారంభించిన కట్టె పేరు మార్చాలని మనవి బెంగళూరు : నగరంలో ప్రసిద్ది చెందిన పుట్టణ్ణచెట్టి పురభవన (టౌన్‌హాల్) మరమ్మతులకు బుధవారం శ్రీకారం చుట్టారు. రూ. ఐదు కోట్ల వ్యయంతో పురభవనను అత్యాధునికంగా తీర్చిదిద్ది ప్రజలకు అంకితం చేస్తామని బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ అన్నారు. బుధవారం పురభవనలో ప్రత్యేక పూజలు చే సి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నగరంలో ప్రఖ్యాతి గాంచిన కట్టడాలలో పుట్టణ్ణ చెట్టి పురభవనం ఒకటి అని అన్నారు. అనివార్య కారణాల వల్ల, నిధులు లేక ఇంత కాలం ఈ పురభవనం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అన్నారు. బీబీఎంపీ నిధులతో పనులు చేపట్టామని, త్వరలో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. నగరంలోని ప్రసిద్ధి చెందిన కట్టడాలను తాకట్టు పెట్టినట్లు పాలికెపై ఉన్న చెడ్డపేరును తుడిచి పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. టౌన్‌హాల్ పేరు మార్చండి బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పుట్టణ్ణశెట్టి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టణ్ణ శెట్టి మనుమడు విశ్వనాథ్ మాట్లాడుతూ ‘మా తాత పేరు పుట్టణ్ట శెట్టి... అయితే పుట్టణ్ణ చెట్టి అని పెట్టారు. దయచేసి టౌన్‌హాల్‌కు మరోసారి పుట్టణ్ణ శెట్టి పురభవన అని నామకరణం చేయండి’ అని మనవి చేశారు. ఇందుకు మేయర్ అంగీకరించారు. 15 రోజులకు ఒక సారి పనుల పరిశీలన బీబీఎంపీ వార్డు భారీ పనుల స్థాయీ సంఘం అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ టౌన్‌హాల్ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పనుల పరిశీలనకు 15 రోజులకు ఒకసారి మా స్థాయీ సంఘం సభ్యులు, అధికారులు వచ్చి వెళుతుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, డిప్యూటీ మేయర్ ఇందిరా, పాలన విభాగం నాయకులు అశ్వత్థ నారాయణగౌడ, స్థాయి సంఘం అధ్యక్షులు గౌరమ్మ, రేఖా కదిరేషన్ పాల్గొన్నారు. -
పంచాయతీ @ ఆన్లైన్
విశాఖ రూరల్ : జిల్లాలో 925 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం కార్యకలాపాలన్నీ పేపర్లు, రికార్డులు ఆధారంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎంత వ్యయం జరిగింది, చేపట్టిన కార్యక్రమాలను వెంటనే తెలుసుకొనే అవకాశం లేకుండా ఉంది. అలాగే ప్రజలకు అవసరమైన సేవలకు కూడా తాత్సారం జరుగుతోంది. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడంతో పాటు ఆన్లైన్ ద్వారా ఎక్కడ నుంచైనా పంచాయతీ కార్యకలాపాలను సులువుగా తెలుసుకొనేందుకు వీలుగా కంప్యూటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వనరులకు నిధులు మంజూరు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాని పక్షంలో మున్ముందు 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసేది లేదని ఆంక్షలు విధించింది. అయితే బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ మోడంలు రాకపోవడంతో ఈ ప్రక్రియకు జాప్యం జరుగుతోంది. 150 కంప్యూటర్లు సిద్ధం : తొలి దశలో జిల్లాకు 150 కంప్యూటర్లను మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న 925 పంచాయతీలను 565 కస్టర్లుగా విభజించారు. దీని ప్రకారం ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో కంప్యూటర్ను కేటాయించనున్నారు. అలాగే ప్రస్తుతానికి 60 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. వీరి నియామక బాధ్యతలను కేంద్రం ప్రైవేటు ఏజెన్సీ సంస్థ కార్వీకి అప్పగించింది. కంప్యూటరీకరణకు అవసరమైన ఇంటర్నెట్ మోడం కోసం ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అన్ని సంఖ్యలో మోడంలు లేవని చెప్పడంతో ఈ ప్రక్రియకు జాప్యం జరుగుతోంది. మోడంలు వచ్చిన వెంటనే కంప్యూటరీకరణ పనులు ప్రారంభించనున్నారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులు, వాటి వినియోగం, చేపట్టిన కార్యకలాపాలు, పన్నుల రాబడులతో పాటు ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇలా పంచాయతీ పరిధిలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ కంప్యూటరీకరణ ద్వారా పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, ఖర్చులు ఆధారంగా భవిష్యత్తులో కేటాయింపులు చేయడానికి అవకాశముంటుందని కేంద్రం భావిస్తోంది. మీ-సేవతో అనుసంధానం కంప్యూటరీకరణ పూర్తయిన వెంటనే మీ-సేవతో అనుసంధానం చేయనున్నారు. దీంతో ప్రజలు పంచాయతీల ద్వారా పొందాల్సిన అన్ని సేవలను కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ-సేవ కేంద్రాల ద్వారానే పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయని పక్షంలో భవిష్యత్తులో 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయని కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో మోడంలు వచ్చిన వెంటనే కంప్యూటరీకరణను ప్రారంభించాలని అధికారులు భావి స్తున్నారు. -
లంచమిస్తే బిల్లు.. లేదంటే నిల్!
ఐటీడీఏలో అవినీతి రాజ్యం కాంట్రాక్టర్ల బిల్లులు నెలల తరబడి ఆలస్యం బిల్లు అడిగితే.. మెజర్మెంట్ బుక్ పోరుుందని సమాధానం చేయి తడిపిన వారికి వెంటనే మంజూరు నిబంధనలు సైతం బేఖాతరు అర్హత లేని సిబ్బందికి అదనపు బాధ్యతలు సాక్షి, హన్మకొండ: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనాభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం.. ఉపాధి హామీ, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ తదితర పథకాల ద్వారా ఏటా సగటున 100 కోట్ల రూపాయల పనులను చేపడుతోంది. ఈ పనులు నాణ్యతతో.. సకాలంలో జరిగేలా చూడటం అధికారుల బాధ్యత. కానీ, ఈ విభాగంలోని కార్యనిర్వహణాధికారి మాత్రం అసలు పనులను గాలికొదిలేసి.. అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే పనులు కట్టబెడుతున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న నిబంధనలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. ఈ తరహా పనులు చేసేందుకు సదరు అధికారి.. ఉద్యోగుల్లో తనదైన వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు విధులు అప్పగించకుండా అర్హత లేని సిబ్బందికి అదనపు బాధ్యతలు కట్టబెట్టడం చూస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. రెగ్యులర్‌కు నో.. ప్రస్తుతం ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు మరో ఇద్దరు రెగ్యులర్ అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నారు. ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్ల ద్వారా పనులను పర్యవేక్షించాల్సిన ఈఈ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులను పక్కన పెట్టారు. రెగ్యులర్ ఉద్యోగులకు అప్రధాన్య పోస్టులకు పంపించడంతో పాటు నెలల తరబడి ఒక్కటంటే.. ఒక్క పనీ అప్పగించలేదు. ఆఖరికి మేడారం జాతర సందర్భంగా ఇతర జిల్లాలో ఉన్న ఉద్యోగులు వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తే... సదరు అధికారికి ఇక్కడ పని లేకుండా పోయింది. దీనిపై ఆ ఉద్యోగి కాళ్లకు చెప్పులరిగేలా తిరిగి చివరికి క్వాలిటీ కంట్రోల్‌కు మారిపోయారు. మరో అధికారికి ఇప్పటికీ సరైన పనిలేదు. రెగ్యులర్ ఉద్యోగులు చేయాల్సిన విధులను నిబంధనల విరుద్ధంగా నాన్ మస్టర్ రోల్(ఎన్ఎంఆర్)లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జాతర పనులతో పాటు ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల పర్యవేక్షణ, మెజర్మెంట్ బాధ్యతలను అదనంగా కట్టబెట్టారు. ఎన్ఎంఆర్లదే రాజ్యం తమకు కీలక బాధ్యతలు అప్పజెప్పడంతో ఎన్ఎమ్ఆర్(నాన్‌మస్టర్ మస్టర్ రోల్) ఉద్యోగులు నిబంధనలను తుంగలో తొక్కి స్వలాభమే పరమావధిగా పని చేస్తున్నారు. వారు చెప్పినట్లుగా వినని కాంట్రాక్టర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. సకాలంలో బిల్లులు డ్రా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు సంబంధించి ఎంతో కీలకమైన మెజర్మెంట్ బుక్ రికార్డులను సైతం తారుమారు చేస్తున్నారు. తాడ్వాయి మండలంలో బోర్లు వేసిన ఓ కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకుండా ఆరు నెలలుగా తిప్పుకుంటున్నారు. ఇదేమని అడిగితే.. నీ మెజర్మెంట్ బుక్ పోయిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అప్పులు తెచ్చి లక్షలాది రూపాయల వ్యయంతో బోర్లు వేశానని, నెలల తరబడి బిల్లు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోతున్నదని, తన కుటుంబం వీధిన పడుతుందంటూ సదరు కాంట్రాక్టరు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలా చాలా మంది కాంట్రాక్టర్లు బాధితులుగా మారారు. జంగాలపల్లి, లక్నవరం వద్ద రోడ్డు పనులు నిర్వహించిన కాంట్రాక్టరుకు రూ.14 లక్షల బిల్లులు ఏడాది కాలంగా ఆగిపోయాయి. ఇదేమని అడిగితే.. ఆయనకు కూడా నీ మెజర్మెంట్ బుక్ పోయింది అంటూ సమాధానం చెప్పారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేశాం. గట్టిగా అడిగితే ఆ డబ్బులు ఆగిపోతాయేమోననే భయంతో కాంట్రాక్టర్లు మిన్నకుండిపోతున్నారు. ఇల్లే.. ఆఫీసు కార్యాలయంలో చేపట్టిన పనులను సదరు అధికారిణి ఇంటి నుంచి చక్కబెడుతుండడం వల్లే ఫైళ్లు మాయం అవుతున్నాయని సంస్థలో పనిచేసే ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. ఎన్ఎంఆర్ ఉద్యోగులు అన్ని ఫైళ్లను ఏటూరునాగారం కార్యాలయం నుంచి హన్మకొండలో ఉన్న సదరు అధికారి ఇంటికి తీసుకురావడం, అక్కడే చేతులు తడిపే పనులు చక్కబెట్టడం జరుగుతోంది. ఇందుకు సహకరించని పక్షంలో వారి మెజర్మెంట్ బుక్స్ మాయమైందంటూ కాంట్రాక్టర్లను నెలల తరబడి బిల్లుల కోసం తిప్పుకుంటున్నారు. కీలకమైన మెజర్మెంట్ బుక్స్ పోవడంపై కార్యనిర్వాణాధికారికే నేరుగా ఫిర్యాదు చేసినా ఇసుమంతైనా చలనం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. అధికారుల స్వార్థపూరిత వైఖరి కారణంగా ఇంజనీరింగ్ విభాగంలో పనులు సకాలంలో జరగడం లేదు. అంతేకాదు గిరిజనుల అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఇప్పటికే లోకాయుక్త విచారణ ప్రారంభమైనందున... కలెక్టర్, ఐటీడీఏ పీఓ సైతం ఈ అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
కంపెనీల సేవలో పార్టీలు
విరాళాల కోసం కార్పొరేట్లకు సాగిలపాటు పార్టీ ప్రధాన ఆదాయ వనరు కంపెనీల విరాళాలే ఎన్నికల్లో డబ్బు చూపే ప్రభావం అంతాఇంత కాదు. కోట్లు ఖర్చయ్యే ఎన్నికలను భరించాలంటే రాజకీయ పార్టీలకు డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎన్నికల రణరంగంలో పెద్ద పార్టీల ఖర్చులే వేల కోట్లలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కానీ అంత ఖర్చు చేశామని అవి చెప్పవు. ఆయా పార్టీలకు ఇంతింత మొత్తాల్లో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎందుకిస్తారు? ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించి ఇవి కీలక ప్రశ్నలు. సాధారణంగా పెద్ద పెద్ద కార్పొరేషన్లు, కంపెనీలు రాజకీయ పార్టీలకు భారీ మొత్తాల్లో విరాళాలు ఇస్తుంటాయి. కానీ అవి అంత భారీ విరాళాలను ఊరికే ఇవ్వవు. లక్షల రూపాయలు విరాళాలిచ్చి, కోట్ల రూపాయలు లబ్ధిగా పొందే ఉద్దేశంతోనే అవి విరాళాలిస్తుంటాయి. కార్పొరేట్ విరాళాలు 2004 -2011 మధ్య కాలంలో రూ.2008 కోట్ల ఆదాయం వచ్చిందని కాంగ్రెస్, రూ.994 కోట్ల రాబడి ఉందని బీజేపీ ప్రకటించాయి. ఈ రెండు పార్టీల ఆదాయం ఏటేటా పెరుగుతూనే వచ్చిం దని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్), ఎన్ఈడబ్ల్యూ (నేషనల్ ఎలక్షన్ వాచ్) సంస్థలు విశ్లేషించాయి. కార్పొరేట్ విరాళాలే రాజకీయ పార్టీలకు ప్రధాన ఆదాయ వనరులని ఆ సంస్థలు తెలిపాయి. ఇతరత్రా ఆదాయాలు కాంగ్రెస్ పార్టీ 2007-09 మధ్య కూపన్లు అమ్మడం ద్వారా రూ. 598 కోట్లను, ఇతర విరాళాల ద్వారా రూ. 72 కోట్లను, వీటిమీద వడ్డీ ద్వారా రూ. 38 కోట్లను సంపాదించింది. బీజేపీ రూ. 297 కోట్లు విరాళాల ద్వారా, రూ. 21 కోట్లు వడ్దీ ద్వారా సంపాదించింది. ఇవి చూస్తుంటే ఈ పార్టీల ఆదాయం ఇంతేనా అనిఆశ్చర్యమేస్తుంది. కాంగ్రెస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పార్టీ ఎన్నికల మీద (ఈ ఎన్నికలు కాదు) కేవలం రూ. 215 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. పబ్లిసిటీకి రూ. 58 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇతరులకు రూ.56 కోట్లు ఇచ్చింది(ఆ ఇతరులు అంటే ఎవరో చెప్పలేదు). ఇక బీజేపీ తెలిపిన వ్యయ వివరాలు చూస్తే.. ఆ పార్టీ అంత పొదుపరా అనిపించక మానదు. బీజేపీ ప్రచారం మీద చేసిన వ్యయం రూ. 89.16 కోట్లు మాత్రమే. వివరాలు లేని విరాళాలు 2004-2012 మధ్య జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 87% కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిందని ఏడీఆర్ తేల్చింది. ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం.. ఈ పార్టీలు 75 శాతం ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడిస్తాయి. కానీ ఆ పార్టీలకు తెలియని మార్గాల ద్వారా వచ్చే డబ్బు 25 శాతం దాకా ఉంటుంది. బీజేపీకి 1334 కార్పొరేట్ వ్యాపార వర్గాల నుంచి రూ. 192.47 కోట్లు వస్తే, కాంగ్రెస్‌కు 418 కార్పొరేట్ వర్గాల నుంచి రూ. 172.25 కోట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఆదాయంలో 92 శాతం, బీజేపీకి 85 శాతం ఆదాయం కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చింది. ఈ పార్టీలకు ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలు (రూ.99.71 కోట్లు) అత్యధికంగా విరాళాలిచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం (రూ. 24.1 కోట్లు) తరువాతి స్థానంలో ఉంది. కమ్యూనికేషన్ రంగం నుంచి రూ. 13.26 కోట్లు, షిప్పింగ్ రంగం నుంచి రూ. 3.67 కోట్లు జాతీయ పార్టీలకు అందాయి. కాంగ్రెస్‌కు ట్రస్ట్స్ అండ్ గ్రూప్ కంపెనీల నుంచి రూ. 70.28 కోట్లు అందితే, బీజేపీకి ఎక్కువగా ఉత్పత్తి రంగం నుంచి రూ. 58.18 కోట్లు అందింది. జాతీయ పార్టీలకు రూ.25.28 కోట్లు విరాళంగా ఇచ్చిన 301 మంది దాతలు విరాళాల పత్రంలో తమ పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్), చిరునామా, ఇతర వివరాలివ్వలేదు. వివరాలు చెప్పకుండా రూ. 22.53 కోట్ల రూపాయల గుప్తదానాలు చేసిన వారిలో 273 మంది బీజేపీకి ఇచ్చిన వారే. విదేశీ కంపెనీల నుంచి, భారతదేశంలో కంపెనీలను అదుపు చేసే విదేశీ కంపెనీల నుంచి పార్టీలు విరాళాలు తీసుకునే వీల్లేదు. కానీ 2003-12 మధ్య కాలంలో కాంగ్రెస్, బీజేపీలు రూ. 29.26 కోట్లను విదేశీ సంస్థల నుంచి విరాళంగా తీసుకున్నాయి. సీపీఐకి రూ. 11 లక్షలే కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటిద్వారా ఇస్తాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ. 36.41 కోట్లు ఇచ్చింది. భారతీ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భార్తీ గ్రూపు రూ.11 కోట్లు ఇచ్చింది. టోరెంట్ పవర్ లిమిటెడ్ వారు రూ. 11.85 కోట్లు ఇచ్చారు. బీజేపీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ. 26.57కోట్లను, టోరెంట్ పవర్ లిమిటెడ్ రూ. 13 కోట్లను, ఆసియా నెట్ హోల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 10 కోట్లను ఇచ్చారు. మూడు కార్పొరేట్ కంపెనీల నుంచి సీపీఐకి రూ. 11 లక్షలు, 108 కార్పొరేట్ కంపెనీలు సీపీఎంకు రూ. 1.76 కోట్లు ఇచ్చాయి. రాజకీయ పార్టీలు వార్షిక చందాలు, సభ్యత్వ రుసుము ద్వారా ఎక్కువ మంది నుంచి విరాళాలు స్వీకరిస్తూ జనానికి జవాబుదారీగా ఉంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ గుప్పెడు కంపెనీలు ఇచ్చే భారీ విరాళాలకు ప్రలోభపడితే ప్రజా ప్రయోజనాలను పక్కన బెట్టి ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే పనిచేయాల్సి వస్తుంది. విరాళాల కోసం పార్టీలు కార్పొరేట్లకు దాసోహం అంటే.. ప్రజాస్వామ్య భారతదేశం కార్పొరేట్ పాలనలోకి వెళ్లే ప్రమాదముంది. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ -
లిమిట్ పెరిగితే స్కోరు పెంచుకోవచ్చు..
క్రెడిట్ కార్డులను సక్రమంగా వాడుతూ, సమయానికి చెల్లించేస్తున్న పక్షంలో బ్యాంకులు మధ్య మధ్యలో క్రెడిట్ పరిమితిని పెంచుతుంటాయి. దీంతో ఖర్చు చేసుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది. అదే సమయంలో క్రెడిట్ స్కోరునూ పెంచుకునేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. అదెలాగంటే.. మీరు క్రెడిట్‌ని ఉపయోగించుకోవడంలో పెద్దగా మార్పులు లేకున్నా .. రుణ పరిమితి పెరిగితే దాని ఫలితంగా మీ క్రెడిట్ స్కోరునూ మెరుగుపర్చుకోవచ్చు. ఉదాహరణకు.. మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ రూ. లక్ష ఉన్నా మీరు ప్రతి నెలా రూ. 50,000 మాత్రమే ఖర్చు చేస్తున్నారనుకుందాం. దీనర్థం మీ క్రెడిట్ విని యోగం 50%గా ఉన్నట్లు లెక్క. అదే క్రెడిట్ లిమిట్‌ని రూ. 1.5 లక్షలకు పెంచినా మీరు రూ. 50,000 మాత్రమే ఉపయోగించుకుంటున్నారంటే క్రెడిట్ వినియోగ నిష్పత్తి 33 శాతానికి తగ్గిపోతుంది. అంటే.. మీ దగ్గర వాడుకోవడానికి డబ్బు ఎక్కువగానే ఉన్నా.. మీరు ఖర్చు చేసేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలియజేస్తుంది. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తుంది. దానికి అనుగుణంగా సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో మీకు మరింత మెరుగైన స్కోరు లభించే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అండగా.. సాధారణంగా అత్యవసర పరిస్థితుల కోసం ఆరు నెలల ఆదాయాన్ని పక్కన పెట్టుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తుంటారు. కానీ, అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటప్పుడు... అధిక క్రెడిట్ లిమిట్ అక్కరకొస్తుంది. ఎమర్జెన్సీలో అండగా నిలవగలదు. ఇక, మరో విషయం.. బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి కదా అని ఎడాపెడా క్రెడిట్ కార్డులను తీసేసుకోకుండా కొంత సంయమనం పాటించాలి. ఒకే కార్డుపై అత్యధిక లిమిట్ లభిస్తున్న పక్షంలో మరిన్ని కార్డులను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు మీ ఖర్చులు రూ. 50,000 ఉండగా.. రూ. 5,00,000 దాకా క్రెడిట్ లిమిట్ లభిస్తుంటే దానికే కట్టుబడి ఉంటే మంచిది. దీని వల్ల అనేక కార్డుల వాడకం, చెల్లింపుల గురించి గందరగోళం ఉండదు. ఏదేమైనా.. ఒక్కటి గుర్తుంచుకోవాలి. లిమిట్ పెరగడంతో మరింత వాడుకునేందుకు స్వేచ్ఛ లభిస్తుంది. కానీ దీన్ని దుర్వినియోగం చేస్తే.. కష్టాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. కనుక.. స్తోమతకి తగ్గట్లే వాడుకుంటూ, క్రెడిట్ వినియోగ నిష్పత్తి తక్కువ స్థాయిలోనే ఉండేలా చూసుకుంటూ, బాకీలను సమయానికి కట్టేస్తుంటే మంచిది. దీంతో స్కోరు మెరుగుపడి, భవిష్యత్‌లో తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశమూ లభిస్తుంది. -
‘సార్వత్రిక ’ఖర్చులకూ లెక్కుంది...!
సాక్షి, నల్లగొండ : జిల్లాలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయా అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను ఐ అండ్ పీఆర్ రేట్లకు అనుగుణంగానే లెక్కించనున్నారు. ఈ బాధ్యత ఎన్నికల వ్యయ పరిశీలకులపై ఉంది. ఇందుకు జిల్లా అధికారులు ప్రచార ఖర్చులను ఏ విధంగా లెక్కించాలో ఓ ప్రణాళికను రూపొం దించి ఎన్నికల వ్యయ పరిశీలకులకు అందజేశారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నాలుగైదు రోజులు గడుస్తుండడంతో వివిధ రాజకీయ పార్టీల అధినేతలు జిల్లాలో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. అయితే.. ఈ సభ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోనున్నారు. లెక్కప్రకారం ఆయా అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను సేకరిస్తారు. ఈ లెక్కని వ్యయ పరిశీలకులు రిజిష్ట్రర్‌లో నమోదు చేసి జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు తెలియజేస్తారు. స్థానిక అభ్యర్థుల ఖర్చులను కూడా ఇలాగే లెక్కిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆయా అభ్యర్థుల ప్రచార ఖర్చును ఈ కింది విధంగా లెక్కిస్తారు. టెంట్‌హౌస్ వస్తువులు.. షామియానాకు రూ.150 నుంచి ఆయా సైజ్‌లను బట్టి రూ.1800 ఉంటుంది. ఫ్యాన్ రోజుకు రూ.100, రెడ్‌కార్పెట్ రోజుకు రూ.50 నుంచి రూ.80 వరకు.. కూలర్‌కు రూ.350, ఒక్కో కుర్చీకి రోజుకు రూ.7, వీఐపీ కుర్చీకి రూ.70. సోఫాసెట్‌కు రూ.550 నుంచి రూ.700 వరకు.. లైటింగ్ వస్తువులు.. మైక్రోఫోన్‌తో కూడిన 100 వాట్ల అహూజా ఆంప్లిఫయర్కు రూ.1100.. మైక్రోఫోన్‌తో కూడిన 250 వాట్ల అహూజా ఆంప్లిఫయర్కు రూ.2500.. మైక్రోఫోన్‌తో కూడిన 400 వాట్ల అహూజా ఆంప్లిఫయర్, రెండు లౌడ్ స్పీకర్లకు రూ.3,800 ఆయా వాట్లను, లౌడ్ స్పీకర్లను బట్టి రూ.1,25,000 వరకు ఉంది. ఆడియో క్యాసెట్‌కు రూ. 50.. వెయ్యి మందితో ఓ హాలులో సమావేశం నిర్వహిస్తే రూ. 2500.. 20 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే రూ.39 వేలు, రెండు లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తే రూ.1.50 లక్షలు. ఫోకస్ లైట్‌కు రూ.80, పగలు వెలిగే లైట్‌కు రూ.250 నుంచి రూ.300 టిఫిన్ వాటర్ బ్యారెల్ రూ.30, పులిహోరా ప్యాకెట్ రూ.15, పెద్ద సమోసా రూ.11, ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా రూ.20, ఎగ్ బిర్యానీ రూ.80, చికెన్ బిర్యానీ రూ.110, మటన్ బిర్యానీ రూ.185, కాఫీ రూ.8, లీటర్ వాటర్ బాటిల్ రూ.20. హోటల్ రూంలు.. స్టాండెడ్ రూం ఏసీతో రూ.1400, సాధారణ రూం రూ.650.. ఎగ్జిక్యూటివ్ రూం ఏసీతో రూ.2100, సాధారణ రూం రూ.1400.. సైట్ రూమ్‌కు ఏసీతో రూ.3 వేలు, సాధారణ రూం రూ.1800.. డెకొరేషన్ వస్తువులు.. సభ ప్రాంగణానికి రూ.వెయ్యి నుంచి రూ. 1500. ఒక్కో జెండాకు రూ.30, ప్లాస్టిక్ జెండాకు రూ.40, పోస్టర్‌కు రూ.30. అద్దె వస్తువులు.. డీవీడీకి రూ.20, సీడీకి రూ.10, జీబు, మ్యాక్స్‌కు రూ.వెయ్యి, డ్రైవర్‌కు రూ.200. సుమో, క్వాలీస్‌కు 1300, డ్రైవర్‌కు రూ.300, కారు రూ.900, ఇన్నోవాకు రూ.2 వేలు.. బస్‌కు రూ.5 వేలు, చిన్న బస్సుకు రూ.3,500, లారీకి రూ.3 వేలు, ఐషర్‌కు రూ.2500, లేబర్ చార్జి రోజుకు రూ.238, మిల్స్ ప్లేట్‌కు రూ.40. -
కొండెక్కనున్న కూరగాయలు
ముంబై: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చే పరిస్థితి కనబడుతోంది. వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురవడంతో కూరగాయలు, పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో వీటి ధరలు 30 శాతంమేర పెరిగే అవకాశముందని వాషిలో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) డెరైక్టర్ సంజయ్ పాన్సారే పేర్కొన్నారు. మరో 8 నుంచి 10 రోజుల్లో ధరలు పెరుగుతాయన్నారు. ‘నగరానికి వచ్చే పంట నాణ్యత కూడా తక్కువగా ఉంది. వేసవిలో ఎంతో డిమాండ్ ఉన్న ప్రఖ్యాతి చెందిన ‘కేసర్’ మామిడికి కూడా ఈ ఏడాది నష్టం వాటిల్లింద’ని వివరించారు. ద్రాక్ష, అరటి, దానిమ్మ పండ్లు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో తాము కూరగాయలు, పండ్లపై 30 శాతం ధరను పెంచాలని నిశ్చయించామన్నారు. అయితే ఎంతమేర ధర పెంచనున్నామో మరో ఎనిమిది నుంచి పది రోజుల్లో నిర్ధారిస్తామన్నారు. అయితే వేసవి కాలంలో చాలామంది పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. వీటి ధరలు పెంచడంతో నగరవాసులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అకాల వర్షం కారణంగా ‘కేసర్’ మామిడి పండ్లపై ఈ ఏడాది తీవ్ర ప్రభావం చూపనుంది. ఔరంగాబాద్, లాతూర్ నుంచి పది టన్నుల వరకు ఈ మామిడి పండ్లు హోల్‌సేల్ మార్కెట్‌కి వస్తాయి. అయితే కోతకు వచ్చిన పండ్లపై వడగండ్ల వర్షం కురవడంతో పండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయ’ని ఆయన పేర్కొన్నారు. లాతూర్ నుంచి టమాటాలు సరఫరా అవుతాయనీ, కీర దోసకాయలను షోలాపూర్ నుంచి, ఆకు కూరలు నాసిక్ నుంచి సరఫరా అవుతాయని కూరగాయల మార్కెట్ డెరైక్టర్ శంకర్ పింగ్లే అన్నారు. అకాల వర్షం ఆకుకూరలు, కూరగాయలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. మరో పది రోజుల్లో వీటి ధరలు పెరుగుతాయని ఆయన తెలిపారు. అయితే కూరగాయలను జారీ చేసే టెంపోలు, ట్రక్కుల సంఖ్య తగ్గేదాన్నిబట్టి వీటి ధరలను నిర్ణయిస్తామన్నారు. ఇదిలావుండగా తక్కువ నాణ్యత గల కూరగాయలు, పండ్లు మార్కెట్లోకి రావడంతో ప్రముఖ వ్యాపారస్తులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై వాషిలోని ఏపీఎంసీకి చెందిన వ్యాపారి అజిత్ భోరే మాట్లాడుతూ...హోల్ సేల్‌లో ప్రస్తుతం టమాటాలు కిలో రూ.6లకు విక్రయిస్తున్నామన్నారు. అయితే మార్కెట్లో వీటికి డిమాండ్ ఉండడంతో త్వరలోనే వీటికి కొరత ఏర్పడనుందన్నారు. దీంతో ధరలు పెరుగుతాయన్నారు. రీటైల్ మార్కెట్లో ప్రస్తుతం కూరగాయల ధరలు కిలో చొప్పున (రూ.లలో) ఉల్లిగడ్డ 16 ఆలు 20 టమాట 15 నిమ్మ (ఒక్కటి) 2 క్యాప్సికమ్ 60 క్యాబేజ్ 20 కాలిఫ్లవర్ 20 వంకాయలు 20 కీర దోసకాయ 20 క్యారెట్ 16 సోరకాయ 20 పచ్చి బఠాణి 30 బీట్రూట్ 30 అల్లం 100 మిరప 40 కాకరకాయ 40 బెండకాయ 40 చిక్కుడు 40 -
వ్యయంపై నిఘా నేత్రం
ఇదే తొలిసారి.. పెద్ద ఎత్తున పర్యవేక్షకులు ప్రత్యేక కమిటీలు.. విస్తృత స్థాయిలో వీడియో రికార్డింగ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఇదే తొలిసారిగా అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల కమిషన్ అపూర్వ స్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. అడుగడుగునా నిఘా పెట్టి, అభ్యర్థులు చేపట్టే ప్రతి ఖర్చును లెక్కించి, వారు ఉల్లంఘనలకు పాల్పడ్డారేమో నిర్ణయించనుంది. తొలిసారిగా అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించడానికి అధికారులు పర్యవేక్షకులను రంగంలోకి దించుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ రెండు, మూడు సెగ్మెంట్లకు ఒక ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిని వేయనున్నారు. అలాగే ప్రతీ ఒక్క నియోజకవర్గానికి సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడిని నియమించనున్నారు. వీరితో పాటు వీడియో సర్వైలెన్స్ టీమ్‌ను పెట్టనున్నారు. ఇందులో ఒక అధికారి, వీడియోగ్రాఫర్ ఉంటారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఈ నెల 12న నోటిఫికేషన్ వచ్చే వరకు అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును పార్టీల ఖర్చుగా పరిగణిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వారు చేసే ఖర్చులను అభ్యర్థులకు సంబంధించినవిగా గుర్తిస్తారు. అభ్యర్థులు నిర్వహించే సమావేశాలు, ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలను ఈ టీమ్‌లు రికార్డ్ చేస్తాయి. ముందుగా ఆయా రాజకీయ కార్యక్రమాలను రికార్డు చేస్తున్నట్లు మైక్‌లో ప్రకటించి అనంతరం ర్యాలీ లేదా సమావేశాల్లో ఏయే సామాగ్రి ఉపయోగించారు, ఎన్ని వాహనాలు, క్యాప్‌లు, జెండాలు, మైక్‌లు ఇలా ప్రతీ అంశాన్ని రికార్డు చేయనున్నాయి. రికార్డు చేసిన విషయాలను వీడియో వ్యూయింగ్ బృందం పరిశీలిస్తుంది. ప్రచార సామాగ్రికి సంబంధించి ప్రతీ దానికి ఒక ధరను ముందుగానే నిర్ధారించే రేటు చార్టును రూపొందించారు. దాని ప్రకారం అభ్యర్థులు వినియోగించే వాటికి లెక్కలు కడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్న ‘క్యూ’ షీట్ అనే ఒక ఫార్మాట్‌ను తయారు చేశారు. ఒక్కో అభ్యర్థికి సంబంధించిన ఖర్చులను, ప్రచారాల్లో వినియోగించే సామాగ్రి వివరాలను ఈ క్యూషీట్లో పొందుపరుస్తారు. ఆ క్యూ షీట్ పరిశీలనకు అకౌంటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్ ఒక్కో అభ్యర్థికి సంబంధించి షాడో ఎక్స్పెండిచర్ రిజిస్టర్‌ను నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు తప్పుగా సమర్పిస్తే.. ఈ క్యూ షీట్ ద్వారా ఎంత ఖర్చు చేశారో అధికారులు గుర్తించి వారిపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమిస్తారు. -
రైతుకు ‘బ్లాంక్’ బోర్డులు!
రైతులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2003లో ప్రవేశపెట్టిన బ్లాక్ బోర్డు పథకం జిల్లాలో బ్లాంక్ బోర్డుగా మారిపోయింది. పథకం ప్రారంభమై 12 ఏళ్లు గడుస్తున్నా నేటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ పథకం గురించి జిల్లాలోని చాలామంది వ్యవసాయాధికారులకే తెలియదంటే అతిశయోక్తికాదు. మదనపల్లె, న్యూస్‌లైన్: రైతులకు దిశానిర్దేశం చేస్తుందనుకున్న బ్లాక్ బోర్డు పథకం జిల్లాలో చతికిలపడింది. ఈ పథకం ప్రారంభమై దశాబ్దం దాటినా ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు కాని పరి స్థితి. 12 ఏళ్ల క్రితం జిల్లాలోని 1,381 పంచాయతీ కార్యాల యాల వద్ద సుమారు రూ.15 లక్షల వ్యయంతో బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా మండలాలు, ప్రాంతాల వ్యవసాయాధికారుల వివరాలు పొందుపరిచా రు. వారు ఎక్కడికెళ్తున్నారు.. పర్యటనల వివరాలు రాయా లి. అక్కడి వాతారణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఏ పంట సాగు చేయాలి, చీడపీడల నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించాలి. భూసార పరీక్షల వివరాలు రాయా లి. బ్లాక్ బోర్డు నిర్వహణకు మొదటి సంవత్సరం మాత్రమే నిధులిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది. వ్యవసాయాధికారులు ఈ బోర్డుల గురించి పట్టిం చుకోవడమే మానేశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా అధికారుల వద్దా లేకపోవడం గమనార్హం. ఏఈవోలు చూస్తున్నారు బ్లాక్ బోర్డు పథకం అమలు విషయమై ఏడీ ఓబులేష్నాయక్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. 2003 తర్వాత నిధులు మంజూరు కాలేవడం లేదని చెప్పారు. బ్లాక్ బోర్డ్‌ల నిర్వహణ ఏఈవోలు చూసుకుంటున్నారని తెలిపారు. బోర్డుల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నింపుతున్నట్టు వెల్లడించా రు. కొన్నిచోట్ల మాత్రం సమయాభావం వల్ల రాయలేకపోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.