రైతుకు ‘బ్లాంక్’ బోర్డులు!
రైతులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2003లో ప్రవేశపెట్టిన బ్లాక్ బోర్డు పథకం జిల్లాలో బ్లాంక్ బోర్డుగా మారిపోయింది. పథకం ప్రారంభమై 12 ఏళ్లు గడుస్తున్నా నేటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ పథకం గురించి జిల్లాలోని చాలామంది వ్యవసాయాధికారులకే తెలియదంటే అతిశయోక్తికాదు.
మదనపల్లె, న్యూస్‌లైన్: రైతులకు దిశానిర్దేశం చేస్తుందనుకున్న బ్లాక్ బోర్డు పథకం జిల్లాలో చతికిలపడింది. ఈ పథకం ప్రారంభమై దశాబ్దం దాటినా ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు కాని పరి స్థితి. 12 ఏళ్ల క్రితం జిల్లాలోని 1,381 పంచాయతీ కార్యాల యాల వద్ద సుమారు రూ.15 లక్షల వ్యయంతో బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా మండలాలు, ప్రాంతాల వ్యవసాయాధికారుల వివరాలు పొందుపరిచా రు.
వారు ఎక్కడికెళ్తున్నారు.. పర్యటనల వివరాలు రాయా లి. అక్కడి వాతారణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఏ పంట సాగు చేయాలి, చీడపీడల నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించాలి. భూసార పరీక్షల వివరాలు రాయా లి. బ్లాక్ బోర్డు నిర్వహణకు మొదటి సంవత్సరం మాత్రమే నిధులిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది. వ్యవసాయాధికారులు ఈ బోర్డుల గురించి పట్టిం చుకోవడమే మానేశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా అధికారుల వద్దా లేకపోవడం గమనార్హం.
ఏఈవోలు చూస్తున్నారు
బ్లాక్ బోర్డు పథకం అమలు విషయమై ఏడీ ఓబులేష్‌నాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. 2003 తర్వాత నిధులు మంజూరు కాలేవడం లేదని చెప్పారు. బ్లాక్ బోర్డ్‌ల నిర్వహణ ఏఈవోలు చూసుకుంటున్నారని తెలిపారు. బోర్డుల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నింపుతున్నట్టు వెల్లడించా రు. కొన్నిచోట్ల మాత్రం సమయాభావం వల్ల రాయలేకపోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.