resistance
-
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?
జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. కానీ వైద్యుల సలహా లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రమాదకరమని మీకు తెలుసా? 564 మందిపై 2023లో నిర్వహించిన సర్వేలో 43.6శాతం మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించారట. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడినా, అదేపనిగా వాడినా అనర్థాలు తప్పవని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచ పది ఆరోగ్య సంక్షోభ అంశాల్లో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మొదటి పదిలో ఒకటిగా ఉన్నట్టు పేర్కొంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే యాంటీబయాటిక్స్ కొనుగోలు చేయాలి అంటున్నారు డీఏసీ. ఏఎంఆర్ అంటే యాంటీ బయోటిక్స్‌ను అతిగా వాడడం వల్ల ఆ మందు వైరస్‌పై పనిచేయకుండా పోయే పరిస్థితి అని తెలిపింది. యాంటీ బయోటిక్స్‌ను ప్రజలు అవగాహన లేకుండా వాడటంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. యాంటీబయోటిక్స్ వాడకం అనర్థాలపై అవగాహన పెంచాలని సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 12.7 లక్షల మంది బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కారణంగా మృతి చెందినట్టు తెలిపారు. యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల బ్యాక్టీరియా రెసిస్టెంట్‌గా మారుతుందని, ఇది సూపర్‌బగ్ మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వినియోగించాలన్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రాక్షస మూక
► జమూకశ్మిర్లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్ఎఫ్? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.. టార్గెట్ కశ్మిరీ పండిట్లు.. ►జమ్మూకశ్మిర్‌కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్ఎఫ్లో చేరిపోయారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్‌లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ►టీఆర్ఎఫ్ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్ఎఫ్పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్‌ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన షేక్ సజ్జాద్ గుల్ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు. 2018 జూన్‌లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చేరవేస్తోందని వెల్లడించింది. ఎందుకు సృష్టించారు? ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్‌్కఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్ సయీద్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను సృష్టించా రు. పాకిస్తాన్ సర్కారు నేరుగా టీఆర్ఎఫ్కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది. ఉధృతంగా చేరికలు.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్‌లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్ఎఫ్లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్ఎఫ్ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు. నిషేధించిన మరుసటి రోజే ‘హిట్ లిస్ట్’.. ►భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్ లిస్ట్’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ‘సైకలాజికల్ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్ఎఫ్ జమ్మూకశ్మిర్‌లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్ఎఫ్ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్ఎఫ్ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గెలాక్సీ ఫోన్లలోవాటర్-రెసిస్టెన్స్ ఫీచర్: శాంసంగ్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్‌కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ల ఫీచర్‌కు సంబంధించి అవాస్తవాలను ప్రకటించిందంటూ ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) భారీ జరిమానా విధించింది. కొన్ని మోడళ్ల గెలాక్సీ స్మార్ట్ఫోన్లలో వాటర్-రెసిస్టెన్స్ ఫీచర్ గురించి తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని ఏసీసీసీ తేల్చింది. దీనికి గాను స్థానిక శాంసంగ్ యూనిట్‌కు 14 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 76 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించిందని ఆస్ట్రేలియా కాంపిటీషన్ రెగ్యులేటరీ గురువారం తెలిపింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలతో మార్చి 2016, అక్టోబర్ 2018 మధ్య, ఆస్ట్రేలియాలో గెలాక్సీ S7, S7 ఎడ్జ్, A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్ , ఎస్ నోట్ 8 మెడల్స్ 3.1 మిలియన్ ఫోన్లను శాంసంగ్ విక్రయించిందని పేర్కొంది. ఈ మేరకు కమిటీ చైర్ గినా కాస్-గాట్లీబ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గెలాక్సీ స్మార్ట్ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదని, లేదా నీటిలో తడిచిన తర్వాత పూర్తిగా పనిచేయడం మానేసాయంటూ వినియోగదారుల వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్లను కొలనులు లేదా సముద్రపు నీటిలో కూడా ఉపయోగించవచ్చని క్లెయిమ్ చేస్తూ, ఇన్-స్టోర్, సోషల్ మీడియా ప్రకటనలను కంపెనీ విడుదల చేసిందని రెగ్యులేటరీ ఆరోపించింది. ఈ మేరకు శాంసంగ్‌పై రెగ్యులేటరీ గతంలో దావా వేసింది. అయితే తాజా పరిణామంపై శాంసంగ్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
నిశ్శబ్ద మహమ్మారి
కోవిడ్ మహమ్మారి సృష్టించే కల్లోలం మనందరికీ తెలుసు కానీ, చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘నిశ్శబ్ద మహమ్మారి’ గురించి తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే. ఏటా 70 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ మహమ్మారి పేరు ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’. బాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు వంటి వివిధ వ్యాధికారక సూక్ష్మక్రిములను సంహరించే బ్రహ్మాస్త్రాల వంటివి యాంటీమైక్రోబియల్ ఔషధాలు. యాంటీబయోటిక్స్ వంటి అతిముఖ్యమైన ఈ ఔషధాలను తొలుత కనుగొని 80 ఏళ్లు దాటింది. సాంక్రమిక వ్యాధుల నుంచి, తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని, జంతువులను, మొక్కలను కాపాడటంలో ఈ ఔషధాలు అద్భుత పాత్రను పోషిస్తున్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, కేన్సర్ చికిత్సలను ఇవి కీలక మలుపు తిప్పాయి. అయితే, కాలక్రమంలో ఈ ఔషధాలకు కూడా కొన్ని సూక్ష్మక్రిములు లొంగకుండా మొండికేస్తున్నాయి. రోగుల ప్రాణరక్షణలో చివరి ప్రయత్నంగా చేసే చికిత్సల్లో అవకాశాలు కుంచించుకు పోతున్నాయి. దీన్నే ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’ బెడద అని పిలుస్తున్నాం. ఎ.ఎం.ఆర్. వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90% మంది ఆసియా, ఆఫ్రికా దేశాల వాసులే. ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కోటి మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్య కారణాలు బ్రహ్మాస్త్రాల్లాంటి యాంటీమైక్రోబియల్ ఔషధాలను దుర్వినియోగం చేయటం, మోతాదులకు మించి వాడటం వల్ల ఎ.ఎం.ఆర్. మహమ్మారి విజృంభిస్తోంది. మనుషులకు, పశువులకు అందించే వైద్య చికిత్సల్లో.. పాడి పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, రొయ్యలు, చేపలు వంటి ఆహారోత్పత్తులను అందించే పశుపక్ష్యాదుల పెంపకంలో.. పంటలు, పండ్ల తోటల సాగులో యాంటీమైక్రోబియల్ రసాయనిక మందులను విచ్చలవిడిగా వాడటం ఎ.ఎం.ఆర్. విజృంభణకు ముఖ్య కారణాలు. అంతేకాదు.. కర్మాగారాలు, వ్యవసాయ/ పశుపోషణ క్షేత్రాలు, జనావాసాలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, వ్యర్థ జలాలతో ఏర్పడుతున్న కాలుష్యం కూడా ఎ.ఎం.ఆర్. మహమ్మారి పెరుగుదలకు కారణమవుతోంది. కోవిడ్ కాలంలో యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం పెచ్చుమీరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. చైతన్య వారోత్సవాలు ఎ.ఎం.ఆర్. సమస్యపై ప్రచారోద్యమం ద్వారా ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, పశువైద్య నిపుణులు, విధాన నిర్ణేతలకు ఈ సమస్యపై చైతన్యం కలిగించడానికి నవంబర్ 18–24 వరకు ప్రతి ఏటా ‘వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ పేరిట వారోత్సవాలు జరుపుకొంటున్నాం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు భారత్ ఎ.ఎం.ఆర్. నియంత్రణ కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక (2017–21) చేపట్టింది. మూలికా వైద్యంతో సత్ఫలితాలు పశుపోషణలో సంప్రదాయ మూలికా చికిత్సలను ప్రాచుర్యంలోకి తేవటం ద్వారా 80% యాంటీబయోటిక్స్ వాడకాన్ని జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తగ్గించగలిగింది. రైతులు తమ ఇంటి పరసరాల్లో దొరికే ఔషధ మొక్కలతోనే పొదుగు వాపు వంటి తీవ్ర జబ్బుల్ని కూడా పూర్తిగా అరికట్టవచ్చని రుజువైందని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా అంటున్నారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్త డా. చౌహన్ క్యు పద్ధతులు అనుసరిస్తే రసాయన రహిత, దుర్గంధ రహిత కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. ఆక్వా సాగులోనూ యాంటీ బయోటిక్స్ తదితర రసాయనాల వాడకాన్ని తగ్గించటం అవశ్యం. ఆహార పంటలు, ఉద్యాన తోటల సాగులో రసాయనాల అవసరాన్ని దశలవారీగా తగ్గించుకునే మార్గాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ చైతన్యంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పూనుకోవాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (ఈ నెల 24 వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా..) -
యువతిపై లైంగికదాడికి యత్నం
సాక్షి, పెద్దపల్లి: ఇంట్లో ఒంటరిగా కనిపించిన ఓ యువతిపై లైంగికదాడికి యత్నించాడో కామాంధుడు. ఆమె ప్రతిఘటించడంతో పురుగులమందు నోట్లో పోసి ఆమె ప్రాణాలు బలి తీసుకోబోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మంథని సీఐ సతీశ్ కథనం ప్రకారం... బాధితురాలి తండ్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరేసరికి లోపలి నుంచి అరుపులు వినిపించాయి. తన కూతురును అదే గ్రామానికి చెందిన మంథని సతీశ్ బలాత్కరిస్తూ కనిపించాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో పురుగులమందు పోసేందుకు ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ఆమె తండ్రి గమనించి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా యువకుడు తప్పించుకుని పారిపోయాడు. కర్ర దెబ్బ కూతురు తలకు తాకడంతో బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని యువతిని మంథని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, తమ ఇంటి పక్కన ఉన్న కరెంటు స్తంభాల విషయమై రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయని, దీనిని మనసులో పెట్టుకునే సతీశ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాయామం
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన మంచి మార్గం మరొకటి లేదని నిపుణులు ఆది నుంచి చెబుతూనే ఉన్నారు. వ్యాయామంలో రెండు రకాలని, ఒకటి ఎరోబిక్ అయితే మరొకటి ఎనరోబిక్ వ్యాయామాలంటూ కూడా విభజన తీసుకొచ్చారు. ఎరోబిక్ అంటే గాలి ఎక్కువగా అందుబాటులో ఉండే మైదానాల్లో నడవడం, పరుగెత్తడం, ఈత కొట్టడం కాగా, ఎనరోబిక్ అంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెయిట్ లిఫ్టింగ్, జంపింగ్ లాంటివి. ఒకానొక దశలో ఈ రెండు కూడా కలసిపోయి జిమ్ముల రూపంలో వెలిశాయి. ఎరోబిక్స్‌లో డాన్యుల లాంటివి కూడా కలిసిపోయాయి. (చదవండి : కరోనా రోగులకు మరో షాక్?!) ఆరోగ్యంతో పాటు శీరర సౌష్టవం సొగసుగా ఉండాలంటే ఎరోబిక్స్ ముఖ్యమని, ఎనరోబిక్స్ కూడా ముఖ్యమని, రెండూ కూడా అవసరమనే వాదనలు తలెత్తాయి, సద్దుమణిగాయి. ప్రాణాంతక కరోనా విజంభిస్తోన్న నేటి సమయంలో వ్యాయామం ఒక్క దానితో ప్రాణాలను కాపాడు కోలేమని, పౌష్టికాహారంతోపాటు అవసరమైన విటమిన్లు మింగాల్సిందేనంటూ కొంత మంది వైద్యులు చెబుతూ వచ్చారు. విటమిన్ల వల్ల మానవ శరీరాల్లో రోగ నిరోధక శక్తి పెరగుతోందని కూడా చెప్పారు. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ల సమతౌల్యంతో పౌష్టికాహారం తీసుకుంటే సరిపోదని, ‘రెసిస్టెంట్ ఎక్సర్సైజ్’ అవసరమని డాక్టర్ మైఖేల్ మోస్లీ కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ వ్యాయామం చేసే వారికి కరోనా వ్యాక్సిన్లు కూడా బాగా పని చేస్తాయని చెప్పారు. ఈ విషయం కాలిఫోర్నియాలో వాలంటర్లీపై తాజాగా జరిపిన అధ్యయనంలో తేలిందని చెప్పారు. అంటు రోగాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను గత కొంత కాలంగా రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. (చదవండి : అందుకే లాక్డౌన్ పొడగిస్తున్నాం) పుషప్స్, ప్రెసప్స్, స్క్వాట్స్, అబ్డామన్ క్రంచెస్, లంగ్స్, ప్లాంక్ వ్యాయామాలతో శరీరంలోని ‘టీ–సెల్స్’ అభివద్ధి చెంది రోగ నిరోధక శక్తి పెరగతుందని ఆయన చెప్పారు. ఫిజియో థెరపీ కింద వాడే సాగే రిబ్బన్లను తీసుకొని 15 నిమిషాలపాటు చేతులు, భుజాల వ్యాయామం తాను కొత్తగా ప్రయోగించి చూశానని, సాగే రిబ్బన్లను లాగడం వల్ల శరీర కణాల్లో చురుకుదనం బాగా పెరగతోందని ఆయన వివరించారు. ఆయన తన అధ్యయన వివరాలను పూర్తిగా ‘స్పోర్ట్స్ అండ్ హెల్త్’ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. గుండె బాగుండాలంటే పషప్స్ ఒక్కటే సరిపోవని, శరీరాన్ని బాలెన్స్ చేస్తూ చేసే స్క్వాట్స్ ఎంతో అవసరమని డాక్టర్ మైఖేల్ తెలిపారు. వీటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతుందని డాక్టర్ చెప్పారు. మొదట కరోనా ఎదుర్కోవాలంటీ యోగా చేయాలని, ఊపిరితిత్తుల బలం కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలంటూ ఇంతవరకు ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే.(చదవండి :కరోనా దెబ్బ: తిరోగమనమే!) -
టీబీ అండ్ కరోనా
టీబీ అనగానే దాని ప్రధాన లక్షణం దగ్గడం గుర్తొస్తుంది. కరోనాలో ముఖ్య లక్షణం దగ్గే. టీబీ వ్యాధి రోగి దగ్గుతున్నప్పుడు అతడిలోనుంచి సూక్ష్మజీవులు ఆరోగ్యకరమైన వ్యక్తిని తాకుతాయి. రోగి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, రోగి శ్వాస నుంచి వచ్చిన సూక్ష్మజీవులు కూడా ఆరోగ్యవంతుడిని తాకవచ్చు. కోవిడ్–19లో కూడా అచ్చం అలాగే. కాకపోతే... ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాతో టీబీ వస్తుంది. నావల్ కరోనా వైరస్ వల్ల కోవిడ్–19 వస్తుంది. టీబీ మనిషి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కరోనా కూడా అంతే. అయితే టీబీ కేవలం ఊపిరితిత్తులనే కాదు... మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్ వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేస్తుంది. కరోనా వైరస్ మాత్రం ఊపిరితిత్తులను మాత్రమే గాక కొంతవరకు జీర్ణవ్యవస్థలోని పేగులనూ, చాలా అరుదైన సందర్భాల్లో మెదడునూ ప్రభావితం చేస్తుంది. ఇక టీబీకీ పూర్తి చికిత్స అందుబాటులోఉంది. కరోనాకు ఇంకా లేదు. కానీ లక్షణాలన్నీ ఒకేలా ఉండటంతో కొన్ని సందర్భాల్లో దేహంలో టీబీ ఉన్నప్పటికీ... ప్రస్తుత నేపథ్యంలో కోవిడ్–19ను తలపించవచ్చు. అందుకే టీబీని గురించి తెలుసుకుంటే... అది చికిత్స ఇంకా అందుబాటులో లేని కోవిడ్–19 కాదనీ... టీబీ కావచ్చని తెలుసుకోవచ్చు. టీబీ, కరోనాల పోలికలూ, తేడాల పట్ల అవగాహన పెంచుకునేందుకే ఈ కథనం. టీబీ ఎలా వ్యాప్తిచెందుతుంది..? టీబీ వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. అప్పటికే టీబీ ఉన్న వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకిన సూక్ష్మక్రిమి మొదట ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ పెరగడం మొదలుపెడుతుంది. అలాగే ఈ సూక్ష్మక్రిమి గాలి, వెలుతురు (సరైన వెంటిలేషన్) లేని చోట బాగా పెరుగుతుంది. ధారాళమైన గాలి, వెలుతురు ఉన్న చోట రోగ క్రిమి మనుగడ సాధించలేదు. (అందుకే టీబీకి మంచి మందులు కనుగొనక ముందు టీబీ రోగులను వేరు చేసి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే చోట్ల ఉంచి నయం చేసేవారు. ఆ క్షయ వ్యాధి చికిత్స కేంద్రాలను శానిటోరియమ్స్ అనేవారు). ఇక టీబీ వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ తలుపులు మూసి ఉండే ఏసీ గదుల్లో ఉంటే... వారి నుంచి అక్కడ పనిచేసే ఇతరులకూ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. కరోనా విషయంలోనూ అంతే. అది కూడా టీబీ లాగే వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం కరోనాకు మందు లేకపోవడం వల్ల ఈ రోగులు సైతం గాలీ, వెలుతురు బాగా వచ్చే (మంచి వెంటిలేషన్ ఉండే) గదిలో ఒక్కరే (ఐసోలేషన్‌లో) ఉండిపోవాలి. ల్యాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ అంటే...? మన సమాజంలో ఉన్న చాలా మందిలో టీబీ సూక్ష్మక్రిమి లోపల ఉంటుంది. కానీ వారిలో రోగలక్షణాలూ ఉండవు. పూర్తిగా ఆరోగ్యవంతుల్లా ఉంటారు. వీళ్ల నుంచి ఆరోగ్యవంతుడికి వ్యాధి వ్యాపించదు. వీళ్లకు టీబీ పరీక్ష నిర్వహించినప్పుడు టీబీ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కొందరిలో అనేక కారణాల వల్ల వాళ్లలో సహజంగా ఉండే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. (ఉదా: డయాబెటిస్, మహిళల్లో గర్భధారణ వల్ల, క్యాన్సర్, ట్రాన్స్‌ప్లాంట్ జరిగినప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు, ఎస్‌ఎల్‌ఈ లేదా హెచ్ఐవీ సోకడం వంటి కారణాల వల్ల). అలాంటి వారిలో టీబీ క్రిమి మళ్లీ క్రియాశీలం అయి, వ్యాధి బయటపడుతుంది. మన దేశంలోనైతే... ప్రత్యేకంగా వ్యాధి లక్షణాలను బయటపడ్డప్పుడే చికిత్స అవసరం. లక్షణాలు లేకపోతే మందులు అవసరం లేదు. టీబీ నిర్ధారణ... కళ్ల పరీక్ష: దగ్గినప్పుడు పడే తెమడను పరీక్షించడం ద్వారా టీబీ బ్యాసిల్లై (సూక్ష్మక్రిమి) ఉందా లేదా అని పరీక్షించి, నిర్ధారణ చేయవచ్చు. రెండు రోజుల వ్యవధిలో రోగి నుంచి రెండు కళ్లె శాంపిళ్లను సేకరించి పరీక్ష చేసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఛాతీ ఎక్స్‌రే: ఊపిరితిత్తులకు సోకిన టీబీని ఎక్స్–రే ద్వారా గుర్తించవచ్చు. అలాగని కేవలం ఎక్స్–రే ద్వారానే పూర్తి నిర్ధారణ కూడా సాధ్యం కాదు. ∙చర్మం పరీక్ష: టీబీ నిర్ధారణకు చర్మ పరీక్షను చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ఇది ల్యాటెంట్ టీబీ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అయితే నేషనల్ కాలేజ్ ఆఫ్ ఛెస్ట్ ఫిజీషియన్స్ (ఎన్‌సీసీపీ), ఐసీఎస్ (ఇండియన్ ఛెస్ట్ సొసైటీ) మార్గదర్శకాల మేరకు... లక్షణాలేమీ కనిపించని ల్యాటెంట్ టీబీకి చికిత్స అవసరం లేదు. టీబీ ఇంటర్ఫెరాన్ గామా రిలీజ్ ఎస్సే (ఐజీఆర్ఏఎస్): దీన్ని ఎక్కువగా క్వాంటిఫెరాన్ టీబీ గోల్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఇది సరికొత్త నిర్ధారణ పరీక్ష. దాంతోపాటు చర్మపు పరీక్షకంటే అధునాతనమైనది, కచ్చితమైనది. ఇక ఇది టీబీ సూక్ష్మక్రిమికి మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి ఏ మేరకు స్పందిస్తుందో అన్న విషయాలనూ తెలుపుతుంది. టీబీ సీరలాజికల్ పరీక్షలు: ఇవి రోగి రక్తాన్ని సేకరించి నిర్వహించే పరీక్షలు. కల్చర్ పరీక్ష : టీబీ సూక్ష్మజీవుల పెరుగుదలను పరీక్షించడం వల్ల టీబీ చికిత్స ప్రక్రియను ఎంపిక చేసేకునేందుకు అవకాశం ఉన్న పరీక్ష ఇది. కరోనా పరీక్ష: గొంతులో ఉన్న స్వాబ్స్ సేకరించడం ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష చేసి వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేస్తారు. టీబీ చికిత్స : టీబీని పూర్తిగా నయం చేయడానికి రోగి క్రమం తప్పకుండా ఫిజీషియన్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. మందుల క్రమం అస్సలు తప్పడానికి వీల్లేదు. కరోనా చికిత్స : ఇప్పటికైతే కరోనా వల్ల వచ్చే కోవిడ్–19కు లక్షణాల ఆధారంగానే చికిత్స ఉంది. రెమ్డిస్విర్, ఫావిపిరావిర్ లాంటి మందులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ అవి మైల్డ్‌గా, మాడరేట్‌గా ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం కాకుండా నియంత్రించేవే తప్ప... పూర్తిగా నయం చేసే మందులు కావు. అయితే టీబీకి పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. ఒకవేళ పూర్తి చికిత్స తీసుకోకపోతే ఇది అత్యంత ప్రమాదకారిగా మారవచ్చు. మృత్యువుకూ దారి తీయవచ్చు. కరోనాకు మందులేకపోయినా... ఒకవేళ మైల్డ్‌గా ఉండి మందులేమీ వాడకపోయినా తగ్గవచ్చు. అందుకే కరోనాకైనా మందులు వాడాల్సిన అవసరం ఉండదేమోగానీ...టీబీకి మాత్రం తప్పక వాడాల్సిందే. దగ్గు, జ్వరంతో వ్యాధిని కల్పించే కారకాల్లో టీబీ... బ్యాక్టీరియా వల్ల; కోవిడ్–19 కరోనా వైరస్ వల్ల వచ్చి... లక్షణాలూ, వ్యాపించే తీరు దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ టీబీ – కరోనాల విషయంలో పోలికలూ, తేడాలను గుర్తించి, రెండింటి పట్ల అవగాహన పెంచుకుని, ఇరు వ్యాధుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాప్తిలోనూ పోలికే... టీబీ సూక్ష్మక్రిమి సోకినంతనే ఆరోగ్యవంతుడు వ్యాధిబారిన పడడు. అతడిలో రోగ లక్షణాలేమీ బయటపడవు. అలాంటి వారిని ల్యాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా చెబుతారు. అయితే ఏదైనా కారణం వల్ల వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధి బయటపడుతుంది. అయితే అదృష్టవశాత్తూ ఇప్పుడు టీబీని పూర్తిగా నయం చేయగల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం... ఆ కాలపరిమితి పొడవునా తప్పనిసరిగా మందులు వాడాలి. అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులోనూ కరోనా వైరస్ సోకగానే అతడికి కోవిడ్–19 రాకపోవచ్చు. అలా లక్షణాలేమీ కనపడకుండానే కొందరిలో తగ్గిపోవచ్చు. సరికొత్త పరిశోధనల ప్రకారం ఇలా లక్షణాలేమీ లేనివారు (ఎసింప్టమ్యాటిక్) కోవిడ్–19ను వ్యాప్తి చేయలేరు. కానీ కొద్దిపాటి లక్షణాలు కనిపించడం ప్రారంభం కాగానే (ప్రి–సింప్టమ్యాటిక్) మాత్రం కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని అధ్యయనాల్లో తేలింది. టీబీ అండ్ కరోనా లక్షణాలలో పోలికలు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు టీబీ క్రిమి పెరగడం ప్రారంభిస్తుంది. అది తనను వృద్ధి చేసుకుంటూ ఉండటంతో రోగలక్షణాలు బయటపడతాయి. ఒకసారి వృద్ధి చెందడం మొదలుపెట్టాక అది వేర్వేరు కణజాలాలపై దాడి చేసి వాటిని నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేయడం మొదలుపెడితే కొందరిలో ఊపిరితిత్తులకు కన్నం పడే అవకాశం కూడా ఉంది. ఊపిరితిత్తుల్లో సూక్ష్మక్రిమి ఉన్నప్పడు... కనిపించే లక్షణాలివి... ∙విపరీతమైన దగ్గు... కనీసం మూడు వారాల పాటు ఎడతెరిపి లేకుండా దగ్గుతుంటే టీబీ కావచ్చని అనుమానించవచ్చు ∙ ఛాతీలో నొప్పి ∙బలహీనంగా ఉండటం, విపరీతమైన నీరసం ∙బరువు గణనీయంగా తగ్గడం ఆకలి లేకపోవడం ∙చలిజ్వరం ∙జ్వరం ప్రధానంగా సాయంత్రాలు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుండటం ∙రాత్రివేళల్లో చెమటలు పట్టడం. అయితే అది ఎలాంటి దగ్గు అయినప్పటికీ మూడు వారాల పాటు అదేపనిగా కనిపిస్తే తప్పక టీబీ అని అనుమానించాలి. అయితే జ్వరం అనేది టీబీ, కరోనా... ఈ రెండు జబ్బుల్లో ఉన్నప్పటికీ... కరోనా విషయంలో మాత్రం ఇలా రాత్రిళ్లు చెమటలు పట్టడం, సాయంత్రాలు మాత్రమే ఉష్ణోగ్రత పెరగడం ఉండకపోవచ్చు. -
కమ్మటి తొనలు కంటికి మేలు
పనసపండు రుచిలోనే కాదు... ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా అంతే మంచిది. దాని వల్ల ఆరోగ్యానికి సమకూరే ప్రయోజనాలు అనేకం. వాటిలో కొన్నివి. పనసలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ–రాడికల్స్‌ను నిర్మూలించి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మరీ ముఖ్యంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను నివారిస్తుంది. ∙పనసలో విటమిన్–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్–సితో వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. అందువల్ల పనస చాలా రకాల వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. పనస పండులో లోని కొన్ని పోషకాలు మంట, వాపు, నొప్పి (ఇన్ఫ్లమేషన్)ను తగ్గిస్తాయి. దెబ్బలు త్వరగా నయమయ్యేలా చూస్తాయి. పనసలోని ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాల సామర్థ్యం చాలా ఎక్కువ. అవి జీవకణాలలోని దెబ్బతిన్న డీఎన్ఏలను సైతం చక్కదిద్దగలవు. పనసలో విటమిన్–ఏ పాళ్లు ఎక్కువ. అందుకే అది కంటికి మేలు చేస్తుంది. అదీగాక క్యాటరాక్ట్, మాక్యులార్ డీ–జనరేషన్, రేచీకటి వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది. పనసలోని విటమిన్–సి మన చర్మ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. మేనిని నిగారించేలా చేస్తుంది. దాంతో వయసు పెరగడం (ఏజింగ్ ప్రక్రియ) చాలా ఆలస్యంగా జరుగుతుంది. పనసలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల అది రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది.పనస థైరాయిడ్ గ్రంథికి వచ్చే జబ్బులను నివారించడంతో పాటు థైరాయిడ్ జీవక్రియలకు అవసరమైన కాపర్‌ను సమకూరుస్తుంది. -
దళపతి ఎక్కడ?
అవినీతి నిరోధకశాఖకు డీఎస్పీ లేరు కింది స్థాయి అధికారులకు చిక్కని పెద్ద చేపలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు అనంతపురం సెంట్రల్: జిల్లాలో కీలకమైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయంలో డీఎస్పీ సీటు ఖాళీగా ఉంది. ఇదివరకు ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తొమ్మిది నెలల క్రితం డిపార్ట్మెంట్కు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నారు. ఆయన తర్వాత జిల్లాకు ఏసీబీ డీఎస్పీగా ఎవరొస్తారనే దానిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఎవరి పేర్లూ వినిపించడం లేదు. దీంతో అక్రమార్కులు, అవినీతిపరులు ఇదే అదనుగా తమ పని కానిచ్చేస్తున్నారు. దాడులు తగ్గుముఖం జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఆమ్యామ్యాలు తీసుకొని అనర్హులకు కట్టబెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రభుత్వశాఖల్లో పైసలు ఇవ్వందే ఫైలు ముందుకు కదలదు. ముఖ్యంగా రోడ్డు, రవాణా శాఖ, రిజిస్ట్రేషన్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో ఎక్కువగా ఈ పరిస్థితి నెలకొంది. కొన్ని శాఖలపై మాత్రమే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇంత వరకూ పోలీసుశాఖపై దాడులు జరిపిన చరిత్ర ఏసీబీలో లేదు. అక్కడ పనిచేస్తున్న అధికారుల మాతృసంస్థ కావడంతోనే దాడులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఏసీబీ విధుల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన విభాగానికి అధికారి లేకపోవడంతో అవినీతి చేపలు బయటపడడం లేదు. చిన్న తిమింగళాలపైనే దృష్టి జిల్లాలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఎక్కువశాతం చిన్న తిమింగళాలే పట్టుబడ్డాయి. రైతు నుంచి ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం తీసుకుంటూ లైన్మెన్లు, ఏఈలు, పాసుపుస్తకాల కోసం లంచం తీసుకుంటూ వీఆర్వోలు, తహసీల్దార్లు పట్టుబడుతున్నారు. కానీ పెద్ద తిమింగళాలు మాత్రం ఏసీబీ అధికారుల కళ్లుగప్పి తప్పించుకుతిరుగుతున్నారు. భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారు కూడా లేకపోలేదు. అయితే అత్యంత తెలివిగా వారి ఆస్తులను బినామీల పేరుతో రిజిష్టర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారు ఏసీబీ గాలానికి చిక్కడం లేదు. ఇదిలా ఉంటే పట్టుబడిన చిన్న చేపలకూ శిక్షలు పడడం లేదు. విచారణ పేరుతో సంవత్సరాలు గడుస్తోంది. చివరినిమిషంలో సాక్షులు రాజీ అవుతుండడంతో కేసులు వీగిపోతున్నాయి. ఇలా జిల్లాలో అవినీతి నిరోధకశాఖ తన కొరడా ఝుళిపించలేకపోతోంది. ఇది అక్రమార్కులకు వరంగా మారుతోంది. మూడేళ్లలో ఏసీబీ దాడులు.. ఏడాది లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులు ఆకస్మిక దాడులు 2015 6 3 2016 5 4 2017 4 2 -
వారికి ఎయిడ్స్ సోకదు!
విల్నియస్: ఎయిడ్స్.. ఇదో ప్రాణాంతక వ్యాధి. అయితే లిథువేనియా దేశానికి చెందిన కొందరికి మాత్రం ఎయిడ్స్ అంటే అస్సలు భయమే లేదు. ఎందుకంటే వారికి ఎయిడ్స్ అసలే సోకదు. హెచ్ఐవీ వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించినా కూడా వారికి ఏమీ కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. లిథువేనియా ప్రజల్లో దాదాపు 16 శాతం మందికి ఎయిడ్స్ నిరోధకత కలిగి ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారి జన్యువులు పలు పరివర్తనాలు (జీన్ మ్యుటేషన్) చెందడం వల్ల వారి నిరోధక వ్యవస్థలోకి ఎయిడ్స్ వైరస్ ప్రవేశించి నాశనం చేయలేదని వెల్లడించారు. వీరి జన్యువులను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలకు ఎయిడ్స్ వ్యాధి చికిత్స పద్ధతులు తెలుసుకునే అవకాశం కలగనుంది. -
ప్రభుత్వాలపై ప్రతిఘటన తప్పదు
ఐసీడీఎస్‌ను రక్షించాలి ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి పాల్వంచ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్లను నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బీవీ విజయలక్ష్మి హెచ్చరించారు. స్థానిక కేటీపీఎస్ ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో రెండు రోజుల పాటు జరగనున్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బాలిక సంరక్షణ, శిశు సంక్షేమం కోసం నడుపుతున్న ఐసీడీఎస్‌ను నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఐసీడీఎస్ బడ్జెట్‌ను ఏటా పెంచాల్సింది పోయి సగానికి పైగా తగ్గించారని, పౌష్టికాహారాన్ని సరఫరా చేయక పోవడంతో పేద కుటుంబాలవారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్ల అద్దెలను, వర్కర్ల, హెల్పర్ల జీతాలను సకాలంలో ఇవ్వక పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సెంటర్లను నడపాల్సి వస్తోందన్నారు. అంగన్ వాడీ సెంటర్ ఒక్కో నిర్మాణానికి కేంద్రం రూ.5 లక్షల నిధులు విడుదల చేస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం 100 గజాల స్థలం కేటాయించలేక పోతోందని, ఇప్పటికీ సొంత ఇళ్లలో, చెట్ల కింద నడిపిస్తున్న సెంటర్లు చాలా ఉన్నాయని తెలిపారు. వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఎస్ఆర్ మోహన్‌రెడ్డి, పోటు ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శింగు నర్సింహారావు, సహాయ కార్యదర్శి ప్రసాద్, వివిధ సంఘాల నేతలు దుర్గా అశోక్, సీతామహాలక్ష్మి, విశ్వనాథం, పూర్ణచందర్రావు, జమలయ్య, ఆదాం, నాగేశ్వరరావు, రాహుల్, వెంకటేశ్వర్లు, నాగమణి, పద్మజ, సమ్మయ్య, రమేష్ పాల్గొన్నారు. -
ప్రాణాధార మందుల పవర్ తగ్గుతోందా?
బలం పుంజుకుంటున్న వ్యాధి కారకాలు.. మందులకు లొంగని జబ్బులు ♦ యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకంతో ముంచుకొస్తున్న ముప్పు ♦ నిర్మూలనకు వాడాల్సిన ఔషధాలు నివారణ కోసం వినియోగం ♦ మరి మొండి జబ్బులకు, కొత్తగా వచ్చే రోగాలకు మందేది? ♦ వైద్య రంగం ముందు అతిపెద్ద సవాలు చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే సెగగడ్డలు మునుపు మామూలు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోయేవి! కానీ ఇప్పుడు ఏమాత్రం లొంగడం లేదు. గొంతు, చర్మానికి వచ్చే మామూలు ఇన్ఫెక్షన్లు ఇంతకుముందు చిన్నచిన్న మందులతోనే మటుమాయమయ్యేవి. ఇప్పుడు ఎంత ఖరీదైన మందులు వాడినా తగ్గనంటున్నాయి! హైదరాబాద్: ప్రాణాలు నిలబెట్టాల్సిన ఔషధాలన్నీ పదును కోల్పోతున్నాయి. వ్యాధికారక క్రిములు జడలు విచ్చుకుంటున్నాయి. వైరస్లు, బ్యాక్టీరియాలు మరింత శక్తిమంతం అవుతున్నాయి. వీటి బలం ముందు మందుల ‘పవర్’ దూదిపింజలా తేలిపోతోంది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో వ్యాధి కారకాలు 'డ్రగ్ రెసిస్టెన్స్' పెంచుకొని ఏ మందుకూ లొంగని స్థాయికి చేరుకున్నాయి. ఈ విపత్కర పరిణామం ఇప్పుడు వైద్య రంగానికే పెనుసవాలు విసురుతోంది! యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగం ఇకనైనా ఆపకుంటే మానవాళి మనుగడే ప్రమాదంలో పడిపోతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదో నిశ్శబ్ద విధ్వంసం దాదాపు 60 ఏళ్ల క్రితం యాంటీబయాటిక్స్ కనుగొనడం ఒక విప్లవం. ఇప్పుడు వాటి దుర్వినియోగం ఒక నిశ్శబ్ద విధ్వంసంలా సాగిపోతోంది. మామూలు గాయాలు, జబ్బులు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గని పరిస్థితి ఎవరో తెచ్చింది కాదు. ఇది మనకు మనం చేసుకుంటున్న కీడు. వ్యాధి నిర్మూలన కోసం వాడాల్సిన మందుల్ని నివారణ కోసమే యథేచ్ఛగా వాడుతున్నందున బ్యాక్టీరియా, వైరస్లు మొండిగా తయారై కూర్చుంటున్నాయి. బ్రహ్మాస్త్రంలాంటి యాంటీబయాటిక్స్‌ను పిచ్చుక వంటి చిన్నచిన్న వ్యాధులపై ప్రయోగించడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే యాంటీబయాటిక్స్ ఉన్నవన్నీ వాడేశాం. గత కొంతకాలంగా కొత్తగా కనుగొన్న యాంటీబయాటిక్స్ ఏమీ లేవు. మున్ముందు కొత్తగా రాబోతున్నవీ కనిపించడం లేదు. దీంతో రాబోయే తరానికి యాంటీబయాటిక్స్ కొరత తీవ్రంగా ఏర్పడబోతోంది. తేలిగ్గా తగ్గిపోయే జబ్బులకు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతూ, ఖరీదైన మందులు వాడడం, వాడినా లొంగని, నయం కాని దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో గడ్డం గీసుకుంటే అయ్యే గాయాలూ కూడా మానవేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న జబ్బుకూ యాంటీబయాటిక్సే.. జలుబుకు మందు లేదు. ఎందుకంటే అది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే తాత్కాలిక అసౌకర్యం. ఆవిరిపట్టడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ చాలామంది అది కూడా తట్టుకోవడం లేదు. మరికొందరు స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనన్న భయంతో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. దీంతో ట్యూబర్క్యులోసిస్ (టీబీ), క్లెబిసియెల్లా నిమోనియా కార్బపేనిమేజ్, సూడోమొనాస్ వంటి యాంటీబయాటిక్స్‌కు మామూలుగానే లొంగిపోయే సూక్ష్మక్రిములు మరింత మొండిగా మారుతున్నాయి. బలం పుంజుకుంటున్నాయిలా.. ఇ-కొలి అనే బ్యాక్టీరియా నీళ్ల విరేచనాలు కలగజేస్తుంది. సాధారణ యాంటీబయాటిక్స్‌తో ఈ బ్యాక్టీరియాతో తగ్గిపోయేది. కానీ ఆ మందులకు లొంగకపోగా ఏటేటా మరింత విస్తరిస్తోంది. 2010లో మన దేశంలో 5 శాతం మంది ఈ బ్యాక్టీరియాతో సతమతమైతే.. 2014 నాటికి వారి సంఖ్య 12 శాతానికి పెరిగింది. అలాగే నిమోనియాకు కారణమయ్యే క్లెబిసియెల్లా నిమోనియా కార్భపేనిమేజ్ ఇన్ఫెక్షన్తో... 2008లో మనదేశంలో 29 శాతం మంది బాధపడగా.. 2014కల్లా వారి సంఖ్య 57 శాతానికి చేరింది. ఇక హాస్పిటల్స్‌లో కనిపించే ఎమ్ఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్లు 2009లో 29 శాతం ఉంటే.. 2014కల్లా 47 శాతానికి పెరిగాయి. ఎందుకంత ప్రమాదమంటే.. మన దేహాన్ని ఆవాసం చేసుకొని అనేక రకాల బ్యాక్టీరియాలు జీవిస్తుంటాయి. అవేవీ మనిషికి హాని చేయవు. అయితే విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడేవారిలో ఈ హానిరహితమైన బ్యాక్టీరియా తగ్గిపోవడమేగాకుండా హానికారక బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. అవి చర్మం, మూత్ర వ్యవస్థను దెబ్బతీస్తాయి. యాంటీబయాటిక్స్‌ను నిర్ణీతకాలం వాడాలి. అలా కాకుండా మధ్యలోనే వదిలేయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా నిర్మూలన జరగదు.. సరికదా వ్యాధి కారక సూక్ష్మజీవులు నిరోధకతను పెంచుకుంటాయి. ఉదాహరణకు టీబీ సోకిన వ్యక్తులు తమ లక్షణాలు తగ్గగానే పూర్తి కోర్సు వాడకుండా మందులు మానేస్తుంటారు. దాంతో ఆ క్రిములు మరింత శక్తిమంతం అవుతాయి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకొని పెద్ద వయసువారిలో నీళ్ల విరేచనాలు కలగజేస్తుంది. ఇది చివరికి ప్రాణాలకే ముప్పు తేవొచ్చు. విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ ఇవే... దగ్గుకూ, జలుబుకూ అజిథ్రోమైసిన్, సెఫాక్సిమ్, సెపడోక్సిమ్, నీళ్ల విరేచనాలకు నార్ఫ్లాక్స్ట్, ఇంజెక్షన్ల ద్వారా తీసుకునే సెఫ్ట్రియాక్సోన్తోపాటు అఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, పైపర్‌సిలిన్, టాజోబ్యాక్టమ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేక రకాల యాంటీబయాటిక్ కాంబినేషన్లను వాడొద్దు. వైద్యుడు చెప్పిన మోతాదులోనే వాడాలి. కొందరు నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. డాక్టర్ సలహా లేకుండా ఇవి వాడొద్దు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఈ పరిస్థితికి అందరూ కారణమే ఈ పరిస్థితికి సొంత వైద్యం చేసుకునే రోగులు, ఔషధాల అమ్మకాలు పెంచుకునే కంపెనీలు, తెలిసీ తెలియక మందులు రాసే వైద్యులూ.. అందరూ కారణమే! ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఇప్పటికి తెలిసిన వైద్యం యాంటీబయాటిక్స్ వినియోగం మాత్రమే. వాటిని మన దేహానికి ఉన్న సహజ రోగ నిరోధక శక్తి దెబ్బతినకుండా అవసరమైన మోతాదులోనే వాడాలి. విచ్చలవిడిగా వాడితే అనేక దుష్పరిణామాలు తప్పవు. సూక్ష్మజీవులు నిరోధకతను పెంపొందించుకుంటే... వ్యాధులు తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. మామూలుగా తగ్గాల్సిన జబ్బులూ ముదిరిపోతాయి. దీంతో రోగులు హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధితోపాటు వాడాల్సిన మందులు అనేక రెట్లు పెర గవచ్చు. కొన్నిసార్లు మందులు పనిచేయక మృత్యువాత పడే ప్రమాదం ఉండవచ్చు. - డాక్టర్ కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, కిమ్స్, సికింద్రాబాద్ -
రాలని చినుకు
అయోమయంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్న వ్యవసాయాధికారులు అపరాలు, చిరుధాన్యాలు మేలు అనకాపల్లి : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. మైదానంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏజెన్సీలో అప్పుడప్పుడు చినుకులు పడుతున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో సాధారణంలో సగం కూడా వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. ఖరీఫ్‌లో గట్టెక్కగలమన్న ఆశలు రైతుల్లో అడుగంటుతున్నాయి. జిల్లాలో ఈ సమయానికి 128.8 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 39.8 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మొత్తం 2,27,400 హెక్టార్లలో సాగు లక్ష్యంగా వ్యవసాయాధికారులు నిర్దేశించారు. లక్షా 10 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో చెరకు, 25 వేల హెక్టార్లలో రాగులు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32,400 హెక్టార్లలో ఇతర పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందిం చారు. గతేడాది ఖరీఫ్ జూలై చివరి వారంలో ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు వరకు వేచి ఉండాల్సి వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అప్పటికీ వర్షాలు అనుకూలించకుంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తామంటున్నారు. జిల్లాలో భూ గర్బజాలాలూ అడుగంటుతున్నాయి. ఈ సీజన్లో సగటున 24.84 అడుగుల లోతున నీరు లభ్యం కావాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితులు కారణంగా భూగర్భజలాలు 26 అడుగుల కిందకు వెళ్లిపోయాయి. జూన్ నెలాఖరవుతున్నా వాన జాడ లేదు. రైతులతో పాటు, వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే జూన్ 15నాటికి వరి నారుపోతలు పూర్తవ్వాలి. రోజులో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైతేనే నారుమళ్లకు అవసరమైన తేమ లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో చినుకు జాడలేకపోవడంతో రైతులు జూలై, ఆగస్టు వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు. జూన్‌లో వర్షాలు అనుకూలిస్తే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, ఇంద్ర వంటి రకాలను చేపట్టవచ్చు. కానీ వర్షాలు కలిసి రాలేదు. ఇప్పుడు జూలై వర్షాలే ఆదుకోవాలి. అదే జరిగితే వసుంధర, కాటన్దొర సన్నాలు, సురేఖ రకాలు నారుగా పోసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సి.వి. రామారావు సూచిస్తున్నారు. జూలైలో కూడా వరుణుడు కరుణించకుంటే ఆగస్టులో స్వల్ప కాలిక వంగడాలను నేరుగా ఎదజల్లే పద్ధతిలో నాట్లు వేసుకోవాలన్నారు. అప్పుడు ఎంటీయూ 1001,ఎంటీయూ 1010 వంగడాలను వినియోగిస్తే మేలు. వీటిని డ్రమ్‌సీడర్ ద్వారా లేదా నేరుగా ఎదజల్లే పద్ధతిలో వేస్తే రైతులకు ప్రయోజకరంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు సూచించడంతో వరి సాగుని తగ్గించి, మెట్టపంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు పేర్కొం టున్నారు. నీటి వనరులు అధికంగా అవసరమయ్యే వరి విస్తీర్ణాన్ని తగ్గించి అపరాలు, చిరుధాన్యాలు, జోన్న వంటి పంటలను చేపట్టాలని చెబుతున్నారు. -
ఖరీఫ్‌పై నిర్లక్ష్యం...!
పంపిణీకి నోచుకోని పచ్చిరొట్ట విత్తనాలు 15 రోజుల్లో రానున్న రుతుపవనాలు అయోమయంలో రైతన్నలు నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సాగు విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల నిర్వహణలో తలమునకలైన ప్రభుత్వంతో పాటు అధికారులు ఉండటం వల్ల ప్రణాళిక రూపొందించడంలో ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో రైతులు ఖరీఫ్ సాగు ఎలా చేయాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. నర్సీపట్నం డివిజన్లో వరితోబాటు అపరాలు, ఇతర పంటలు చేస్తారు. రుతువపనాలు ప్రారంభమైన నాటి నుంచే రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతారు. దీంతో బాటు ప్రధానంగా తాండవ ఆయకట్టు పరిధిలో సుమారుగా 25వేల ఎకరాల్లో రైతులు వరి వేస్తారు. అదేవిధంగా రబీ అనంతరం వరి సాగుచేసిన భూముల్లో సారం పెంచేందుకని పచ్చిరొట్ట సాగు చేపడుతుంటారు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు ఏటా సీజనుకు ముందుగానే విత్తనాలు సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచేవారు. గత మూడు నెలలుగా అధికారులంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. దీంతో పాటు రాష్ట్ర విభజన జరగడం, విత్తనాలు అమ్మకాలు మీసేవల్లో చేప్టటాలని గత ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ విధంగా ప్రణాళికలు చేయాలనే దానిపై ఇంకా అధికారులు ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో ఈ ఏడాది రబీ సాగు అనంతరం చేపట్టే పచ్చిరొట్ట సాగుకు రాయితీపై ప్రభుత్వం విత్తనాలు విక్రయించలేదు. దీంతో రైతులంతా విత్తనాల కోసం బయట వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరు నుంచి రుతువపనాలు రానున్నాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో అడపా, దడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దుక్కులు చేసి ఖరీఫ్ సాగునకు సన్నద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధమైన పరిస్థితులున్నా వ్యవసాయశాఖ మాత్రం విత్తనాలుపై ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. -
రైతుకు ‘బ్లాంక్’ బోర్డులు!
రైతులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2003లో ప్రవేశపెట్టిన బ్లాక్ బోర్డు పథకం జిల్లాలో బ్లాంక్ బోర్డుగా మారిపోయింది. పథకం ప్రారంభమై 12 ఏళ్లు గడుస్తున్నా నేటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ పథకం గురించి జిల్లాలోని చాలామంది వ్యవసాయాధికారులకే తెలియదంటే అతిశయోక్తికాదు. మదనపల్లె, న్యూస్‌లైన్: రైతులకు దిశానిర్దేశం చేస్తుందనుకున్న బ్లాక్ బోర్డు పథకం జిల్లాలో చతికిలపడింది. ఈ పథకం ప్రారంభమై దశాబ్దం దాటినా ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు కాని పరి స్థితి. 12 ఏళ్ల క్రితం జిల్లాలోని 1,381 పంచాయతీ కార్యాల యాల వద్ద సుమారు రూ.15 లక్షల వ్యయంతో బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా మండలాలు, ప్రాంతాల వ్యవసాయాధికారుల వివరాలు పొందుపరిచా రు. వారు ఎక్కడికెళ్తున్నారు.. పర్యటనల వివరాలు రాయా లి. అక్కడి వాతారణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఏ పంట సాగు చేయాలి, చీడపీడల నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించాలి. భూసార పరీక్షల వివరాలు రాయా లి. బ్లాక్ బోర్డు నిర్వహణకు మొదటి సంవత్సరం మాత్రమే నిధులిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది. వ్యవసాయాధికారులు ఈ బోర్డుల గురించి పట్టిం చుకోవడమే మానేశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా అధికారుల వద్దా లేకపోవడం గమనార్హం. ఏఈవోలు చూస్తున్నారు బ్లాక్ బోర్డు పథకం అమలు విషయమై ఏడీ ఓబులేష్నాయక్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. 2003 తర్వాత నిధులు మంజూరు కాలేవడం లేదని చెప్పారు. బ్లాక్ బోర్డ్‌ల నిర్వహణ ఏఈవోలు చూసుకుంటున్నారని తెలిపారు. బోర్డుల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నింపుతున్నట్టు వెల్లడించా రు. కొన్నిచోట్ల మాత్రం సమయాభావం వల్ల రాయలేకపోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.