industry
-
తీరంలో ‘భూ’ అలజడి!
ఉలవపాడు: ‘మా ఊరు దగ్గరలో పరిశ్రమ వస్తే సొంత ఇంట్లో ఉంటూ పని చేసుకోవచ్చు. పరిశ్రమ కోసం మా ఊరే లేకుండా చేస్తే ఎలా..? మా ఊరే లేకుండాపోయిన తర్వాత ఆ పరిశ్రమ వస్తే ఎంత..? రాకపోతే ఎంత...? ఉన్న భూమిని సాగు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్...’ అంటున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండల తీరప్రాంత ప్రజలు. ఉలవపాడు మండలంలో ఇటీవల కలెక్టర్ ఆనంద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయదేవ్ పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించారు. కరేడు నుంచి రామాయపట్నం వరకు తీరప్రాంత భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో గుబులు మొదలైంది. శుక్రవారం తీరప్రాంత మత్స్యకారులందరూ అలగాయపాలెంలో సమావేశమై పరిశ్రమలకు తమ భూములు ఇవ్వకూడదని తీర్మానించారు. పోలీసులు వచ్చి సమావేశాన్ని అడ్డుకున్నా కూడా మత్స్యకారులు ఐక్యంగా ఉంటూ తీర్మానం చేయడం గమనార్హం. అయితే, శనివారం కందుకూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, భూములు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని..బీపీసీఎల్ రిఫైనరీ కోసం ప్రధానంగా కరేడు చెరువు అనుకుని ఉన్న ఆయకట్టును తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సమీపంలోని సపోటా, మామిడి తోటలు కూడా సేకరించే భూముల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమికంగా కరేడు గ్రామ చెరువు నీటిని ఉపయోగించుకుని కంపెనీ నిర్మాణాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. తమ చెరువు ఆయకట్టు కింద వరి, వేరుశనగ పండించుకుని సంతోషంగా ఉన్నామని, తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నారు.కరేడుతోపాటు తీరప్రాంత గ్రామాలైన అలగాయపాలెం, టెంకాయచెట్లపాలెం, చిన్నపట్టపుపాలెం, చాకిచర్ల, పెదపట్టపుపాలెం, రామాయపట్నం, పల్లెపాలెం గ్రామాల్లో అధిక శాతం ప్రజలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని భూములు బీపీసీఎల్ కోసం తీసుకునే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 6వేల ఎకరాలను సేకరించనున్నట్లు తెలిసింది. భూములను తీసుకోవడంతోపాటు ఆయా గ్రామాలను ఖాళీ చేయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కన్నతల్లి లాంటి సొంత ఊరు.. జీవనాధారమైన భూములు... తీరం వదిలి తాము ఎక్కడికి వెళ్లాలని మత్స్యకారులు భగ్గుమంటున్నారు. ఉలవపాడు మండలంలోని కొన్ని ప్రధాన గ్రామాలను లేకుండా చేసేందుకు బడాబాబులు కుట్ర పన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమకు వెయ్యి ఎకరాలు సరిపోతుందని, అటవీ భూములను తీసుకుని పరిశ్రమ పెడితే తమకు ఉపాధి లభిస్తుందని, తమను తరిమేసి పరిశ్రమ పెడితే ఎలా..అని ప్రశ్నిస్తున్నారు.ఇవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూములను పరిశీలిస్తున్నారు. సర్వేలు చేస్తున్నారు.భూములు లాక్కోవడానికి కుట్ర పరిశ్రమ పెట్టడానికి ఆరు వేల ఎకరాలు అవసరమా? అటవీ భూమి వెయ్యి ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం పేదల భూములు లాక్కోవడానికే పరిశ్రమ పేరుతో కుట్ర పన్నారు. – మిరియం శ్రీనివాసులు, 139 కులాల జేఏసీ చైర్మన్, కరేడు భూములు ఇచ్చేది లేదు బీపీసీఎల్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేది లేదు. మండలంలో చాలా అటవీ భూములు ఉన్నాయి. పరిశ్రమల కోసం వాటిని తీసుకోవచ్చు. – వాయల అంజయ్య, అలగాయపాలెం -
ఆశల పల్లకీలో ఎంఎస్ఎంఈలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్ఎంఈ) ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల పరిధిని కొత్తగా నిర్వచించడంతోపాటు రుణ పరిమితిని రెట్టింపు చేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా రూ.లక్షన్నర కోట్లు అదనంగా రుణాలు లభించే అవకాశం ఏర్పడింది. తెలంగాణలోనూ రుణ లభ్యత పెరగడంతోపాటు కొత్తగా అనేక సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలో 2015 నాటికి 26.05లక్షల ఎంఎస్ఎంఈలు ఉండగా, టీజీ ఐపాస్ పోర్టల్‌లో నమోదవుతున్న వివరాల ప్రకారం వీటి వృద్ది రేటు 11 నుంచి 15 శాతం వరకు ఉంటోంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే 40శాతం మేర ఉన్నాయి.ఎంఎస్ఎంఈలతో సుమారు 33లక్షల మంది ఉపాధి పొందుతుండగా, సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజాధారిత పరిశ్రమల్లోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు భూమి, నిధులు, ముడి సరుకులు, కార్మికులు, సాంకేతికత, సరైన మార్కెటింగ్ వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిధుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లే ఎంఎస్ఎంఈలు కొల్లేటరల్ సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎంఎస్ఎంఈ రుణాల కోసం డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. నిర్వహణ వ్యయం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నా సరైన సమాచారం లేకపోవడం, ఇతర నిబంధనలతో సకాలంలో ఎంఎస్ఎంఈలకు నిధులు అందుబాటులోకి రావడం లేదు. కొల్లేటర్ సెక్యూరిటీ లేకుండా రుణపరిమితిని రెట్టింపు చేసి రూ.10 కోట్లకు పెంచారు.ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక అనుకూల ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ఇది. టారిఫ్ రేట్ల విధానంలో మార్పులతో దేశీయంగా తయారీ రంగానికి ఊతం లభిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్’ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి అనేక ఖనిజాలు దేశ ఆర్థిక పురోగతిలో కీలకంగా మారడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. తద్వారా లిథియం, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని ప్రోత్సహిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరం. నైపుణ్య శిక్షణ రంగానికి కూడా బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. –సురేశ్ కుమార్ సింఘాల్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు నిధుల లభ్యత పెరుగుతుంది ఎంఎస్ఎంఈల్లో సులభతర విధానాలకు బాటలు వేసేలా బడ్జెట్ ఉంది. రుణ లభ్యత పెరగడంతో రూ.5 లక్షల విలువ చేసే క్రెడిట్ కార్డులను 10 లక్షల మందికి జారీ చేయాలనే నిర్ణయాన్ని ఆహా్వనిస్తున్నాం. ఇది ఎంఎస్ఈలకు నిర్దేశిత వడ్డీపై ఎప్పుడైనా రుణ మొత్తాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతి సులభతరమవుతుంది. స్టార్టప్‌ల రుణ పరిమితి కూడా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడాన్ని ఆహా్వనిస్తున్నాం. – కొండవీటి సుదీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు -
పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలు మరింత అవసరం
దేశ వైద్య పరికరాల రంగం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన వృద్ధిని సాధించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం వంటివి ఇందుకు దోహదం చేశాయని మెరిల్ లైఫ్ సైన్సెస్‌లో కార్పొరేట్ స్ట్రాటజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ అభిప్రాయపడ్డారు. ఈ ఊపును కొనసాగించడానికి రానున్న కేంద్ర బడ్జెట్లో ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నట్లు తెలిపారు.“ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. రోగులకు మెరుగైన ఫలితాలు, అవకాశాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధునిక ఆరోగ్య సంరక్షణకు మూలస్తంభంగా మారింది. భారతదేశంలో 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లు ఎంతో పరివర్తన చెందాయి. దేశాన్ని అధిక-నాణ్యత, సరసమైన వైద్య సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా నిలిపాయి.ఈ పురోగతికి భారత ప్రభుత్వ ముందుచూపు కార్యక్రమాలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై బలమైన దృష్టి గణనీయంగా మద్దతు ఇచ్చాయి. ఈ చర్యలు మెడ్‌టెక్ తయారీలో ఆవిష్కరణ, పెట్టుబడులు, స్వావలంబనను ప్రోత్సహించాయి. కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఈ ఊపును కొనసాగించడానికి ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నాం.ప్రజల జీవితాలను మార్చే ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశ మెడ్‌టెక్ అభివృద్ధికి మెరిల్ దోహదపడుతుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో అగ్రగామిగా భారతదేశం స్థానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం” అన్నారు. -
Automobile: భారత్‌లో ఆటోమొబైల్స్ పరుగులు
ఒకరికి బతుకు బండి.. మరొకరికి హోదా.. ఇంకొందరికి వ్యాపారం.. మరి కొద్దిమందికి విహారం.. టూవీలర్, ఆటో, కారు, ట్రాక్టర్, వ్యాన్ , ట్రక్, బస్.. పేరు ఏదైనా, వాడకం ఏదైనా బండి చక్రాలు పరుగెడుతూనే ఉండాలి. ఆ పరుగే అన్నం పెడుతోంది. ఆ పరుగే వృద్ధి ‘ఇంజన్ ’ అవతారంలో భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై దూసుకెళుతోంది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్కెట్‌గా రూ.22 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచి ప్రపంచ దిగ్గజ సంస్థలను భారత్ ఊరిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల భారతావనిలో ఎన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయో తెలుసా? నిమిషానికి 49.53 యూనిట్లు. 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. 2023లో ఈ సంఖ్య 2,39,28,293 యూనిట్లు. గత ఏడాది కొత్త వాహనాల రాక 9.11 శాతం పెరిగిందని ‘వాహన్ ’ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న అవసరాలు..ఉద్యోగం, వ్యాపారం, షాపింగ్, ప్రయాణాలు, విహార యాత్రలు, డెలివరీ సేవలు.. అవసరం ఏదైనా చేతిలో బండి ఉండాల్సిందే! గడియారంలోని సెకన్ల ముల్లుతో పోటీపడుతూ పరుగు తీయాలంటే బండి రోడ్డెక్కాల్సిందే! అంతలా దైనందిన జీవితంలో వాహనం భాగమైపోయింది. అందుకే వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 2030 నాటికి మెగా సిటీల సంఖ్య 87కు చేరనుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో మెగా సిటీలో జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందన్నమాట! ఇంతమందికి సేవలు అందించడానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సిందే! అలాగే ఆరేళ్లలో వర్కింగ్ ఏజ్ గ్రూప్‌లో 100 కోట్ల మంది చేరతారని అంచనా. అంటే ఆ సమయానికి మొత్తం జనాభాలో వీరి వాటా 60 శాతం ఉంటుంది. ఈ అంశం కూడా వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేయనుంది. మారుతున్న ధోరణులుభారత మార్కెట్లో ధర అత్యంత సున్నిత అంశం. డబ్బుకు తగ్గ విలువ చూసే కస్టమర్లే అధికం. మైలేజీ ఒక్కటే సరిపోదు. డిజైన్ సైతం ఆకట్టుకోవాలి. అటు భద్రతకు పెద్దపీట వేయాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. మారుతున్న వినియోగదార్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లకు రూపకల్పన చేసేందుకు వందల కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి కంపెనీలు కసరత్తు చేస్తుంటాయి. సరికొత్త మోడళ్లే కాదు సక్సెస్ అయిన మోడల్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను, అప్‌గ్రేడ్స్‌ను ప్రవేశపెట్టాల్సిందే. హైబ్రిడ్స్, ఈవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కొత్త ట్రెండ్ ఏమంటే ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీ, యూవీల హవా నడుస్తోంది. మొత్తం పీవీల విక్రయాల్లో వీటి వాటా 60 శాతం దాటిందంటే మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. కార్ల అమ్మకాల్లో 2,02,031 యూనిట్లతో టాప్ సెల్లింగ్ మోడల్‌గా కాంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ నిలిచింది. మరోవైపు చిన్న కారు చిన్నబోతోంది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమ్ముడవుతున్న రెండు త్రిచక్ర వాహనాల్లో ఒకటి ఈ–త్రీవీలర్ ఉంటోంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీ సెగ్మెంట్నూ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. 350 సీసీ, అంత కంటే అధిక సామర్థ్యంగల ఇంజన్ ్స విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ దూసుకెళుతోంది. ఈ కంపెనీ గత ఏడాది 4.26 శాతం వృద్ధితో 8,57,378 యూనిట్లను విక్రయించి రాయల్‌గా నిలిచింది. కొత్త వ్యాపారాల రాకతో..వ్యక్తిగత అవసరాలకే కాదు.. కొత్త వ్యాపారాల రాక కూడా వాహనాల అమ్మకాలకు ఆజ్యం పోస్తోంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లు, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ–కామర్స్ సంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో తదితర క్విక్ కామర్స్ కంపెనీలు.. ఇలా ఒకటేమిటి. ఉత్పత్తుల తయారీ, డెలివరీ సేవల కంపెనీలు వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అటు సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు రుణ లభ్యత పెరిగింది. ఇంకేముంది వాయిదాలు చెల్లించగలిగే స్తోమత ఉంటే చాలు, స్థాయికి మించిన విలువైన వాహనం కొనేందుకూ కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు. లగ్జరీ.. తగ్గేదేలే!దేశంలో లగ్జరీ కార్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రూ.50 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ కార్లు 2024లో గంటకు దాదాపు ఆరు (5.83 యూనిట్లు) అమ్ముడయ్యాయి. అయిదేళ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లే రోడ్డెక్కాయంటే ప్రస్తుత భారత మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. 2024లో మొత్తం 51,200 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 50 వేల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండు డజన్లకుపైగా నూతన మోడళ్లు కొలువుదీరనున్నాయి. ఊరిస్తున్న కొత్త మోడళ్లు, సంపన్నులు పెరుగుతుండడంతో 2025లో ఈ సెగ్మెంట్లో 54,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2030 నాటికి లగ్జరీ కార్ల అమ్మకాలు ఏటా 1,00,000 దాటుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో లగ్జరీ వాటా 1 శాతంపైగా ఉంది. 2020లో 20,500 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్లు్య, ఆడి, వోల్వో, మినీ, జేఎల్ఆర్, లెక్సస్ టాప్ బ్రాండ్స్‌గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లంబోర్గీని, పోర్ష్ కార్లకూ డిమాండ్ ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 2028 నాటికి 19,908కి చేరనుంది. 2023లో ఈ సంఖ్య 13,263 ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్యలో భారత్ భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈవీతో పోటీగా సీఎన్ జీ.. ఆశ్చర్యకర విషయం ఏమంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ఆధారిత వాహనాల డిమాండ్ ఊహకు అందడం లేదు. ఈ విభాగంలో గత ఏడాది 7,15,213 కార్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి ఏకంగా 35 శాతం నమోదు కావడం విశేషం. మారుతీ సుజుకీ ఇండియా అత్యధికంగా 2024లో ఈ విభాగంలో 5,12,155 యూనిట్లతో 71.60 శాతం వాటా దక్కించుకుంది. సీఎన్జీ వాటా ప్యాసింజర్ వెహికిల్స్‌లో 18 శాతం, త్రీవీలర్స్ అమ్మకాల్లో 28 శాతం ఉంది. బజాజ్ ఆటో ఒక అడుగు ముందుకేసి దేశంలో తొలిసారిగా సీఎన్ జీ బైక్ ‘ఫ్రీడమ్’ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 5,500లకు పైగా సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్ ్స ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 8,000 దాటనుంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్ జీ వ్యయం తక్కువ కావడంతో కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. వాహన విడిభాగాలు ఇలా..2023–24లో వాహన విడిభాగాల పరిశ్రమ 9.8 శాతం వృద్ధితో 74.1 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసింది. 2017–18లో ఇది 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో భారత్ వాటా 3.5 శాతం. భారత జీడీపీలో ఈ రంగం వాటా 3.5 శాతం. తయారీ జీడీపీలో ఈ విభాగం 25 శాతం సమకూర్చింది. 50 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. విడిభాగాల ఎగుమతులతో అయిదేళ్లలో 88 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరింది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రకారం భారత వాహన విడిభాగాల పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎగుమతులు 21 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఏసీఎంఏ ధీమాగా ఉంది. ఐదేళ్లలో తొలి స్థానం..!భారత ఆటోమోటివ్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లు. దేశ జీడీపీకి ఈ రంగం 7 శాతం సమకూరుస్తోంది. మొత్తం వసూలు అవుతున్న జీఎస్టీలో 14–15 శాతం ఆటోమొబైల్ రంగం అందిస్తోందంటే ఆశ్చర్యం వేయకమానదు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానానికి చేరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయ వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని చెప్పారు. ‘రూ.78 లక్షల కోట్లతో తొలి స్థానంలో యూఎస్ఏ, రూ.47 లక్షల కోట్లతో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా చైనా నిలిచింది. ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్–1గా మార్చాలనుకుంటున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్స్ భారత్‌లో ఉండడం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటే..సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి నూతన సాంకేతికతలవైపు వాహన పరిశ్రమ మళ్లేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్ ్సడ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ రంగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌కు రూ.10,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈవీ రంగంలో విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం తివాచీ పరిచింది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రాలు నెలకొల్పే సంస్థలు పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి కుదించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. 2030 నాటికి ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ విభాగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు స్క్రాప్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలను నిర్దేశిస్తూ, తప్పనిసరి చేస్తోంది. గ్లోబల్ ఎన్ సీఏపీకి దీటుగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సీఏపీ) పరిచయం చేసింది. 2030 నాటికి కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 30 శాతం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.మీకు తెలుసా? వాహనాల తయారీ, విక్రయాల పరంగా భారత్ పేరిట పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రూ.22 లక్షల కోట్లతో భారత మార్కెట్ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధితో 2022–23లో 33.2 బిలియన్ డాలర్ల విలువైన 47.6 లక్షల యూనిట్ల వాహనాలు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 45 లక్షల యూనిట్లు దాటింది. రెండు దశాబ్దాల్లో 25 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. ఒక్క ఈవీ రంగంలోనే 2022–23లో 3.6 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చి చేరింది. వోల్వో, దైమ్లర్ వంటి 60కిపైగా దిగ్గజాలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నెలకొల్పాయి. ట్రాక్టర్ల తయారీలో మహీంద్రా, త్రీవీలర్ల ఉత్పత్తిలో బజాజ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచాయి.ఆటోమోటివ్ రంగం పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించే దిశగా వెళుతోంది. వృద్ధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రీన్ మొబిలిటీకి మారడం సవాలే. ఈవీలు, హైబ్రిడ్స్, హైడ్రోజన్ లేదా ఇతర ఇంధన విభాగాలైనా సరైన సాంకేతికతను అవలంబించడం కూడా సవాలుగానే ఉంటుంది. వృద్ధిని నిర్ధారిస్తూనే ఆటోమోటివ్ కంపెనీలు మారుతున్న పరివర్తనను ఎలా నిర్వహిస్తాయో అన్న అంశాన్ని ఈ రెండేళ్లు పరిశీలించాల్సి ఉంటుంది.∙వి.రిషి కుమార్, ఆటో ఎక్స్పర్ట్. ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 60 శాతంపైగా వాటాతో ఎస్‌యూవీలు రూల్ చేస్తున్నాయి. రియల్ సూపర్ స్టార్‌గా సీఎన్ జీ నిలిచింది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ కార్ల వాటా ప్రస్తుతం 2 శాతంలోపు వచ్చి చేరింది. ∙అరుణ్ మల్హోత్రా, మాజీ ఎండీ, నిస్సాన్ ఇండియామార్కెట్ రికవరీ, తయారీ సంస్థల నుంచి వ్యూహాత్మక మద్దతు, విధాన స్థాయి స్పష్టత.. వెరసి ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమ 2025లో మెరుగ్గా ఉంటుంది. ఈ ఏడాది వృద్ధి ఉంటుందని 66.41 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. స్థిరంగా ఉంటుందని 26.72 శాతం, తిరోగమన వృద్ధి నమోదవుతుందని 6.87 శాతం మంది డీలర్లు అభిప్రాయపడ్డారు.∙సి.ఎస్. విఘ్నేశ్వర్,,ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ్స (ఎఫ్ఏడీఏ) -
ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్.. నితిన్ గడ్కరీ
వచ్చే ఐదేళ్లలో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా, చైనాలను సైతం అవలీలగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ ఖర్చులు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.అమెజాన్ సంభవ్ సమ్మిట్ (Amazon Smbhav Summit)లో గడ్కరీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన వృద్ధిని సాధించింది. తాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానంలో చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది. భారత్ మూడో స్థానంలో (రూ. 22 లక్షల కోట్లు) ఉంది. కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలనీ, తప్పకుండా అవుతుందని గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను 2 సంవత్సరాలలోపు సింగిల్ డిజిట్‌కు తగ్గించాలనే మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని గడ్కరీ వివరించారు. మన దేశంలో లాజిస్టిక్ ధర 16 శాతం ఉంది, ఇది చైనాలో 8 శాతం, అమెరికా & యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. -
ఆయుధ పరిశ్రమ ఆదాయం రూ.53 లక్షల కోట్లు
స్టాక్‌హోం: యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ ఆయుధ పరిశ్రమ ఆదాయం 2023లో 632 బిలియన్ డాలర్లకు (రూ.53 లక్షల కోట్లు) పెరిగింది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం అధికం. ఆయుధ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, రేథియోన్ వంటి యూఎస్ ఆయుధ కంపెనీలే అధికాదాయం పొందాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం టాప్ 100 కంపెనీల్లో 41 కంపెనీలు 317 బిలియన్ డాలర్ల ఆదాయం పొందాయి. ఇది గతేడాది కంటే 2.5 శాతం ఎక్కువ. ఆయుధ పరిశ్రమలో రెండో అతి పెద్ద దేశమైన చైనా టాప్ 100 జాబితాలోని తొమ్మిది కంపెనీల నుంచి 103 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అయితే ఆర్థిక పరిమితులు, ఇతర సవాళ్లతో దాని వృద్ధి 0.7 శాతం తగ్గింది. స్వావలంబన దిశగా భారత్ భారత ఆయుధ పరిశ్రమకు 2023లో 6.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2022తో పోలిస్తే ఇది 5.8 శాతం ఎక్కువ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రయోజనం పొందాయి. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, విదేశీ ఆయుధ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం స్వయం సమృద్ధికి ఆజ్యం పోశాయి. భారత్, తుర్కియే దేశీయ ఆయుధోత్పత్తిని విస్తరించి స్వావలంబనపై దృష్టి సారించాయి. ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆయుధ ఉత్పత్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. డిమాండ్‌కు అనుగుణంగా యూరప్, అమెరికా, తుర్కియేలోని రక్షణ సంస్థలు ఆయుధ తయారీని పెంచాయి. పలు దేశాల రక్షణ సంస్థల్లో ఆయుధాల అమ్మకాలు పెరిగాయి. తుర్కియే రక్షణ సంస్థ బేకర్ ఆదాయం 25 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఎక్కువగా డ్రోన్లను ఎగుమతి చేసింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య తైవాన్ రక్షణ వ్యయాన్ని పెంచడంతో ఆ దేశ ఎన్సీఎస్ఐఎస్టీ ఆదాయం 27 శాతం పెరిగి 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యూకే సంస్థ అయిన అటా మిక్ వెపన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్ ఆదాయం 16 శాతం పెరిగి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆయుధ ఆదాయాన్ని ఎలా నడిపిస్తున్నాయో సిప్రి నివేదిక ఎత్తిచూపింది. -
మీ రుణం మాకొద్దు
సాక్షి, అమరావతి: చెప్పేదొకటి.. చేసేది మరొకటి. పైకి పరిశ్రమలు తెస్తామంటారు.. వస్తున్న పరిశ్రమలకూ మోకాలడ్డుతారు. వాటి కోసం కేటాయించిన స్థలాలను లాగేసుకోవడం ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోని కీలక నేతల కుతంత్రాలివి. ఇందుకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటున్న వైనమే ఇందుకు తార్కాణం. ఈ పరిశ్రమల కోసం రుణాలిస్తానన్న బ్యాంకుకు తమ ‘పాలసీ’మారిందని, రుణం అవసరం లేదంటూ కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. వీటికోసం జిల్లా కేంద్రాలకు సమీపంలో సేకరించిన విలువైన భూములపై టీడీపీ పెద్దలు కన్నేసినందునే ప్రభుత్వ ‘పాలసీ’ మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంట ఉత్పత్తులకు డిమాండ్ కల్పించడం ద్వరా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రూ.3,559.11 కోట్లతో 27 ఆహార శుద్ధి యూనిట్లు, రూ.65 కోట్లతో ఉమ్మడి జిల్లాకి ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తొలుత రెండు దశల్లో రూ.1,250 కోట్లతో 10 ఆహార శుద్ధి యూనిట్లు, 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం జిల్లా కేంద్రాలకు సమీపంలోనే 322.61 ఎకరాలు సమీకరణ చేసి లాండ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసింది.115 కంపెనీలు ఆసక్తిఈ పరిశ్రమల ద్వారా వచ్చే 15 ఏళ్లలో పన్ను రూపంలో రూ. 9వేల కోట్ల రాబడితో పాటు జీడీపీ 1,500 కోట్లకుపైగా పెరుగుతుందని అంచనా వేశారు. ప్రభుత్వమే స్వయంగా వీటిని నిర్మించి ఆసక్తి చూపే బహుళ జాతి సంస్థలకు 15 ఏళ్లకు లీజు పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ముడి సరుకును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల ద్వారా కొనాలని నిర్దేశించింది. తొలి దశ ప్రాజెక్టుల కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు ఆపరేటర్ల ఎంపిక కోసం టెండర్లు పిలవగా హల్దీరామ్స్, ఐటీసీ వంటి 115 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. వీరికి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఇవ్వాలని సంకల్పించింది. తొలిదశ యూనిట్ల ఏర్పాటు కోసం సిడ్బీ రూ.1,000 కోట్లు రుణం అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా విడుదల చేసింది. ఫేజ్–1లో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద రూ.72.47 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్‌తో పాటు ఒక్కొక్కటి రూ.5 కోట్ల అంచనాతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గతేడాది అక్టోబర్‌లో శ్రీకారం కూడా చుట్టారు. ఇలా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా రంగం సిద్ధమైన తరుణంలో వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. తాము ఈ పాలసీని పునః సమీక్షిస్తున్నామని, రుణం అవసరం లేదంటూ బ్యాంకుకు చెప్పేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రశ్నార్ధకంగా మారింది.రూ.1,000 కోట్ల విలువైన భూములను కొట్టేయాలన్న కుట్రతోనే..ఆహార శుద్ధి పరిశ్రమలకు జిల్లా కేంద్రాల సమీపంలో సమీకరించిన విలువైన భూములపై టీడీపీ బడా నేతల కన్ను పడినందునే వీటి ఏర్పాటును అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పీపీపీ మోడ్‌లో ఇచ్చే పేరుతో వేల కోట్ల విలువైన ఈ భూములను కొట్టేయాలని కుతంత్రం పన్నినట్లు సమాచారం. ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేయించి, బహుళ జాతి సంస్థల ద్వారా రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు తలపెట్టిన గొప్ప కార్యక్రమానికి తూట్లు పొడిచి ఆ స్థలాల్లో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.యూనిట్లు ఏర్పాటు ఇలా..తొలిదశ : ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్ల లోపువేరుశనగ – అనంతపురంకాఫీ – అరకుమామిడి తాండ్ర – కాకినాడబెల్లం అనుబంధ ఉత్పత్తుల తయారీ – అనకాపల్లి కందులు – గుంటూరు, ఒంగోలువీటితోపాటు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లురెండో దశ: ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్లకు పైబడ్చిఅరటి – పులివెందులటమాటా – నంద్యాలపండ్లు, కూరగాయలు – రాజంపేటసుగంధ ద్రవ్యాలు – నరసరావుపేట -
పుష్ప సిస్టర్స్ తగ్గేదేలే...
పూలు రోడ్డు మీద దొరుకుతాయి. కాని వాటిని స్విగ్గీలో తెప్పించుకునే కస్టమర్లు కూడా ఉంటారు అని గ్రహించారు యశోద, రియా కారుటూరి.ఈ ఇద్దరూ కలిసి ‘వూహూ ఫ్రెష్’ పేరుతోమొదలెట్టిన బ్రాండ్ ఇంతింతై ఇంతి ఇంతై అన్నట్టు సాగుతోంది. తాజాగా వీరు అగరు బత్తీల రంగంలో అడుగు పెట్టారు. బంతి, నిమ్మ, మందారం... వీరి అగర్బత్తీల పేర్లు.పూలతో 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరి ఆలోచనలు...ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా రావడమే సగం విజయం. మిగిలింది ఆచరణ మాత్రమే. ఐడియాలు అందరికీ ఎందుకు రావు? ఎవరో అన్నట్టు బుర్ర పారాచూట్ లాంటిది. తెరిచి పెడితే పని చేస్తుంది. లేదంటే ఏం ఉపయోగం. బెంగళూరులో నివాసం ఉండే ఇద్దరు అక్కచెల్లెళ్లు 2019లో తల్లి తరచూ చేసే ఫిర్యాదును వినేవారు. ‘బెంగళూరులో ఉన్నామన్న మాటేగాని పూజ చేద్దామంటే తాజా పూలే దొరకవు’ అని. ఆ అక్కచెల్లెళ్ల పేర్లు యశోద కారుటూరి, రియా కారుటూరి. యశోద వాషింగ్టన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివితే రియా స్టాన్‌ఫోర్డ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివింది. అంటే వీళ్లకు టెక్నాలజీ తెలుసు. బిజినెస్ తెలుసు. ఐడియా వెలగకుండా ఉంటుందా?పూలు తెలుసురియ, యశోదల తండ్రి వాళ్ల బాల్యంలో కెన్యా వెళ్లి గులాబీ పంట వేసి పండించేవాడు. ఒకప్పుడు కెన్యా గులాబీలకు పెద్ద మార్కెట్ ఉండేది. ఆ తర్వాత ΄ోయింది. చిన్నప్పడు ఆ తోటల్లో తిరిగిన రియ, యశోదలు అందరూ ఏవేవో వ్యాపారాలు చేస్తారు... మనం పూలతో ఎందుకు చేయకూడదు అనుకున్నారు. ఆలోచన వస్తే వెంటనే పని మొదలెట్టాలి. 2019 పూలకు ప్రాధాన్యం ఉండే ప్రేమికుల దినోత్సవం నాడు ‘వూహూ ఫ్రెష్’ అనే ఆన్లైన్ రిటైల్ బ్రాండ్ మొదలెట్టారు. ‘వూహూ’ అంటే కన్నడలో పువ్వు. తాజాపూలను కస్టమర్లకు అందించడమే లక్ష్యం.ఇంటికి చేరాలిభారతీయలకు భక్తి జాస్తి. పూలతోనే దైవారాధన చేస్తారు. కాని గుడికి పూలు తీసుకెళ్లాలంటే గుడి చుట్టూ ఉన్న అంగళ్లలో కొనాలి. లేదా రోడ్డు మీద కొనాలి. అవి ఫ్రెష్‌గా ఉండొచ్చు... లేక΄ోవచ్చు. అప్పుడు మాత్రమే కాదు శుభకార్యాలకు, అలంకరణలకు, స్త్రీలు జడల్లో ముడుచుకోవడానికి, సన్మానాలకు.. సంస్మరణలకు... ఇళ్లల్లో పెద్దల పటాలకు పూలే కావాలి. కాని ఆ పూలుపాల ΄్యాకెట్టు అందినట్టు న్యూస్‌పేపర్ అందినట్టు ఇంటికి ఎందుకు అందవు అనుకున్నారు అక్కచెల్లెళ్లు. అందేలా చేశారు. విజయం సాధించారు.చందాదారులుగా...న్యూస్‌పేపర్ చందాదారుల్లానే ‘వూహూ ఫ్రెష్’కు కూడా చందాదారులుగా చేరితే రోజంతా పూలు ఇంటికే వస్తాయి. మరి ఇవి ఫ్రెష్‌గా ఎలా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకమైన ΄్యాకింగ్ తయారు చేశారు. 3 రోజుల నుంచి 15 రోజుల వరకూ వాడకుండా ఉంటాయి. చేయి తగిలితే పూలు నలిగి΄ోతాయి కదా. అందుకే ‘జీరో టచ్’ ΄్యాకింగ్ కూడా ఉంది. డబ్బాల్లో పెట్టి పంపుతారు. స్విగ్గి, జొమాటో, అమేజాన్ ద్వారా కూడా అందే ఏర్పాటు చేశారు. పండగల్లో పబ్బాల్లో ఆ పండగలకు తగ్గ పూలు, హారాలు, పత్రి, దళాలు కలిపిన ప్రత్యేక బాక్సులు అమ్ముతారు. అవి హాట్‌కేకుల్లా అమ్ముడు΄ోతున్నాయి.రైతులతో కలిసిబెంగళూరులో కేంద్రస్థానంగా ఉంటూ ఇతర ముఖ్య నగరాల్లో విస్తరించుకుంటూ పూల సరఫరా చైన్లను రియా, యశోదలు స్థాపించారు. 500 మంది పూల రైతులతో ఒడంబడిక చేసుకుని కోసిన పూలను వీలైనంత త్వరగా ΄్యాకింగ్ కేంద్రానికి పంపే ఏర్పాటు చేశారు. ఆర్డర్లకు తగ్గ ΄్యాకింగ్ కోసం మహిళా ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం 300 ఆలయాలలో దేవుళ్లు రోజూ వీరు పంపే పూలతోనే పూజలు, హారతులు అందుకుంటున్నారు.2023 షార్క్ ట్యాంక్ షోలో రియా, యశోదాల బిజినెస్ గురించి విని అందరూ ఆశ్చర్య΄ోయారు. సంవత్సరానికి దాదాపు 8 నుంచి 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీరి బ్రాండ్ విలువ 50 కోట్లకు చేరింది. వాడి΄ోయిన పూలతో అగర్ బత్తీలు తయారు చేస్తూ ఆ రంగంలోనూ విజయం సాధించారు ఈ బెంగళూరు స్టిస్టర్స్. ఐడియా వీరిని గెలిపిస్తూనే ఉంది. -
అనకాపల్లి: సినర్జిన్ ప్రమాదంపై తలోమాట!
విశాఖపట్నం, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఘోర ప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే.. అనకాపల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అచ్యుతాపురం ఘటన తర్వాత.. పరిహార ప్రకటన, బాధిత కుటుంబాలతో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వ నేతలు తలోమాట చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎంపీ సీఎం రమేష్ ఏమన్నారంటే.. సీనియర్ కెమిస్ట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగింది. సీనియర్ కెమిస్ట్ డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. హోం మంత్రి అనిత ఏమన్నారంటే.. ఇది మరో దురదృష్టకరమైన ఘటన. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో ఉద్యోగికి.. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు సేఫ్టీ సూట్లు ఇవ్వాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.అధికారులు ఏమన్నారంటే.. మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు ఆధారంగా గుర్తించాం. వేపర్ క్లైండ్ బరస్ట్ కారణంగానే ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్సింగ్టైంలో బయటకు ఆవిరి వచ్చి పేలింది. అసలేం జరిగింది?పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్ధలో గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు, విజయనగరానికి చెందిన మరో ఉద్యోగి(సీనియర్ కెమిస్ట్) తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. హుటాహుటిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించింది. ఘటనపై ఈ ఉదయం జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. దీంతో హోం మంత్రి అనిత క్షతగాత్రుల్ని పరామర్శించారు. సినర్జిన్ ప్రమాదంలో ఒకరికి 90 శాతం గాయాలు కాగా, మరో ముగ్గురికి 60 శాతం పైగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇంకో నలుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. -
వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం
న్యూఢిల్లీ: దేశీ వైద్య పరికరాల తయారీ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ఒక పథకాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం సెక్రటరీ అరుణీష్ చావ్లా తెలిపారు. పరిశ్రమతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని రూపొందించినట్టు, దీనికి ఆర్థిక శాఖ సూతప్రాయ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వచ్చే నెలలోనే దీన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు.రెండో మెడిటెక్ స్టాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చావ్లా మాట్లాడారు. వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అవసరాలను తీర్చేదిగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాలంలో దేశీ పరిశ్రమ స్వయంసమృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. వైద్య పరికరాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇచ్చినట్టు, 20 పెద్ద ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు.కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్, డయలాసిస్ మెషిన్లు దేశీయంగా తయారవుతున్నట్టు చావ్లా తెలిపారు. గతేడాది కేంద్ర కేబినెట్ ‘నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ’కి ఆమోదం తెలపడం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి పరిశ్రమ ఎదిగేందుకు ఈ విధానం తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది. -
బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!
-
టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ జూమ్
ముంబై: టారిఫ్‌ల పెంపు టెలికం కంపెనీలకు మరింత ఆదాయన్ని తెచి్చపెట్టనుంది. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 2025–26లో దశాబ్ద గరిష్ట స్థాయి రూ.225–230కు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.182తో పోల్చి చూస్తే 25 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. అధిక లాభాలు, తక్కువ మూలధన వ్యయాలతో టెలికం కంపెనీల పరపతి సైతం మెరుగుపడుతుందని పేర్కొంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం చార్జీలను 20 శాతం మేర పెంచడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు క్రిసిల్ తన నివేదికలో గుర్తు చేసింది. అయితే, తదుపరి రీచార్జ్‌ల నుంచే పెంచిన చార్జీలు చెల్లించాల్సి వస్తుంది కనుక, దీని అసలు ప్రతిఫలం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే కనిపిస్తుందని వివరించింది. 5జీ సేవలతో డేటా వినియోగం పెరుగుతుందని, ఇది కూడా ఏఆర్పీయూ పెరిగేందుకు మద్దతుగా నిలుస్తుందని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారుతున్నట్టు క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. మూలధన వ్యయ భారం తగ్గుతుంది.. తాజా చార్జీల పెంపుతో టెలికం పరిశ్రమ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌వోసీఈ) 2023–24లో ఉన్న 7.5 శాతం నుంచి 2025–26లో 11 శాతానికి పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఆదాయంలో మూలధన వ్యయాల (పెట్టుబడులు) శాతం 2023–24లో 28 శాతంగా ఉంటే, 2025–26లో 19 శాతానికి దిగొస్తుందని తెలిపింది. చాలా వరకు టెలికం సంస్థలు 5జీ సేవలను అమల్లోకి తెచ్చాయని.. అలాగే, స్పెక్ట్రమ్‌పై అధిక వ్యయాలు 2022–23లోనే చేసినట్టు గుర్తు చేసింది. దీంతో కంపెనీల రుణ భారం 6.4 లక్షల కోట్ల నుంచి రూ.5.6 లక్షల కోట్లకు దిగొస్తుందని వివరించింది. కంపెనీలు మరో విడత రేట్లను పెంచితే, తమ తాజా అంచనాలకు ఇంకా మెరుగుపడతాయని తెలిపింది. -
పెట్టుబడులు పెంచండి.. ఆనంద్ మహీంద్రా కీలక సూచనలు
ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భారతీయ కంపెనీలు పెట్టుబడి పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఈయన.. కోవిడ్ అనంతర కాలంలో భౌగోళిక రాజకీయాలు మరియు ఆర్థిక సంబంధాల పరస్పర చర్య భారతదేశం స్థితిని బలపరిచిందని పేర్కొన్నారు.భారతదేశం వృద్ధి మరింత వేగవంతం కావాలంటే పరిశ్రమలు కూడా వృద్ధి చెందాలి. ఈ దేశం మనకు ఏమిచ్చింది అని కాకుండా.. దేశానికీ మనం ఏమి చేయగలమో ఆలోచించండి. ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమ చేయాల్సిన ముఖ్యమైన పని ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం అని ఆనంద్ మహీంద్రా అన్నారు.1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత.. ప్రైవేట్ పెట్టుబడులు జీడీపీలో 10 శాతం నుంచి 27 శాతానికి పెరిగాయి. అయితే 2011-12 నుంచి జీడీపీ శాతంగా ప్రైవేట్ పెట్టుబడులు ఆందోళనకరమైన స్థాయికి పడిపోతున్నాయని మహీంద్రా పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మనం చక్కదిద్దాలని, సమస్య వనరులకు సంబంధించినది కాదు, ఇది మనస్తత్వానికి సంబంధించినదని మహీంద్రా వెల్లడించారు. -
గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?
ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు 'గౌతమ్ అదానీ' గురించి అందరికి తెలుసు. ఆసియా సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న ఈయన.. అదానీ గ్రూపులో పనిచేసే ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే తక్కువ జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతదేశంలోని ఇతర పారిశ్రామక వేత్తల జీతాలతో పోలిస్తే.. అదానీ జీతం చాలా తక్కువ. కరోనా మహమ్మారి సమయంలో ముకేశ్ అంబానీ జీతం తీసుకోవడం మానేశారు. అంతకు ముందు ఈయన వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండేది. భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు సునీల్ భారతి మిట్టల్ 2022లో రూ. 16.7 కోట్లు వార్షిక వేతనంగా తీసుకున్నారు. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన రాజీవ్ బజాజ్, పవన్ ముంజాల్.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ జీతం కూడా అదానీ జీతం కంటే చాలా తక్కువ.అదానీ సంస్థలో పనిచేసే ఏఈఎల్ బోర్డు డైరెక్టర్‌గా పనిచేస్తున్న వినయ్ ప్రకాష్ వార్షిక వేతనంగా మొత్తం 89.37 కోట్ల రూపాయలను అందుకున్నారు. గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ వేతనం రూ.9.45 కోట్లు. దీన్ని బట్టి చూస్తే తన సంస్థలో పనిచేసేవారి జీతం కంటే.. అదానీ తక్కువ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది.2024 మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ తీసుకున్న జీతం రూ. 9.26 కోట్లు. ఈ జీతం భారతదేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తలకంటే తక్కువని తెలుస్తోంది.అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2023-24లో అదానీ తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు, దీనితో పాటు రూ. 27 లక్షల విలువైన అలవెన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద అదానీ ఎంటర్ప్రైజెస్ ఈయన తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు. అదానీ పోర్ట్స్, ఎస్ఈజెడ్ లిమిటెడ్ నుంచి రూ.6.8 కోట్లు జీతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్‌లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు. -
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్‌లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
సింగర్ సుజాత మోహన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
Adult Film Stars Serial Deaths: అదీ ఒక సినీ పరిశ్రమే.. అక్కడా చీకట్లెన్నో! (ఫొటోలు)
-
కాసులు కురిపించే కొబ్బరిపీచు
-
పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి?
మకర సంక్రాంతి పర్వదినం గుజరాత్‌కు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి కారణం గుజరాత్ అంతటా గాలిపటాలు ఎగరడమే. ఈసారి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రతినిధులు గాలిపటాలు ఎగురవేయడంపై ఆసక్తి చూపారు. మునుపెన్నడూ లేనంతగా పతంగులపై ప్రజలు ఇంత ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అంతర్జాతీయ పతంగుల పండుగలో గతానికంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక్కరోజులో హఠాత్తుగా జరిగినది కాదు. దీని వెనుక 20 ఏళ్లకు పైగా శ్రమ ఉంది. ఈ గాలిపటాల పండుగ గుజరాత్ సంస్కృతిని అందరికీ తెలిసేలా చేసింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యతనిచ్చి, ప్రపంచం గుర్తించేలా చేశారు. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గుజరాత్లో 1989 నుండి అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, 2005లో వైబ్రెంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో ఈ ఉత్సవానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గుజరాత్ పతంగులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికను 2003లో అప్పటి ముఖ్యమంత్రి మోదీ సిద్ధం చేశారు. అది గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడింది. తమిళనాడులోని గాలిపటాల పరిశ్రమలపై అధ్యయనం చేసి, స్థానికంగా గాలిపటాల పరిశ్రమ అభివృద్ధికి వ్యూహాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పటి సీఎం నరేంద్ర మోదీ అధికారులను కోరారు. 2003లో నిపుణుల బృందం గాలిపటాల పరిశ్రమలు కలిగిన అనేక ప్రదేశాలలో సమగ్ర సర్వేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రభుత్వం స్థానికంగా గాలిపటాల పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2003లో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని గాంధీ లేబర్ ఇన్స్టిట్యూట్లో గుజరాత్ కైట్ ఇండస్ట్రీ వర్క్ క్యాంప్ నిర్వహించారు. దీనిద్వారా గాలిపటాల కళాకారులు, పంపిణీదారులు, ప్రభుత్వ సంస్థలు, డిజైనర్లు, ఆర్థిక సంస్థల మధ్య కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించారు. ఈ వర్క్‌క్యాంప్‌కు భాను భాయ్ షాను కూడా ఆహ్వానించారు. భాను భాయ్ ప్రముఖ కైట్‌సర్ఫర్. 50 సంవత్సరాలుగా గాలిపటాలు సేకరించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అవసరమైన ముడి పదార్థాల లభ్యతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గాలిపటాల పరిశ్రమను మరింత సులభతరం చేయాలని మోదీ కార్పొరేట్ సంస్థలను కోరారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న లక్షకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా గాలిపటాల పరిశ్రమను మోదీ అభివృద్ది చేశారు. గాలిపటాల తయారీ అనేది 2003-04 లో కుటీర, గ్రామీణ పరిశ్రమల స్థాయికి చేరింది. ఫలితంగా గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ కొత్త మలుపు తిరిగింది. 2003-04 సంవత్సరంలో గాలిపటాల పరిశ్రమ టర్నోవర్ రూ. 15-20 కోట్లుగా ఉంది. కైట్ ఫెస్టివల్ విజయవంతం కావడంతో ఈ పరిశ్రమ పరిధి మరింత విస్తరించింది. 2007లో ఈ పరిశ్రమ టర్నోవర్‌తో రూ. 100 కోట్లకు చేరుకుంది. 2010నాటికి ఇది రూ. 400 కోట్ల పరిశ్రమగా మారింది. 2014 సంవత్సరంలో, గుజరాత్ గాలిపటాల ప్రపంచ వ్యాపారం రూ. 500 కోట్ల రూపాయలకు చేరింది. ఇది గుజరాత్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా చెబుతారు. గుజరాత్‌లోని గాలిపటాల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. మోదీ అనంతర ప్రభుత్వాలు నేటికీ గాలిపటాల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
అంతంత మాత్రంగానే ఎఫ్ఎంసీజీ వృద్ధి.. క్యూ3లో 4–5 శాతంగా అంచనా
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా తక్కువ నుంచి మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధిని చూడొచ్చని అంచనా వేస్తున్నాయి. సీక్వెన్షియల్‌గా (క్రితం త్రైమాసికం) వినియోగ డిమాండ్ ఊపందుకోవడమే ఈ అంచనాలకు కారణం. ఇప్పటికీ గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ స్తబ్దుగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో వరుసగా మూడో త్రైమాసికంలోనూ డిమాండ్ నిలకడగా కొనసాగింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ డిసెంబర్ త్రైమాసికం అప్డేట్లను పరిశీలించినప్పుడు ఈ విషయాలు తెలిశాయి. వినియోగం పుంజుకుంటుందనడానికి ఆరంభ సంకేతాలు కనిపిస్తున్నాయని, కనుక క్రమంగా వినియోగం పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో, తయారీ వ్యయాలు దిగిరావడం వల్ల స్థూల మార్జిన్లు మెరుగుపడతాయని పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు మరిన్ని ప్రకటనల ద్వారా అమ్మకాలు పెంచుకునేందుకు అనుకూల వాతావరణం నెలకొంది. ‘‘ప్రకటనలు, ప్రచారంపై వ్యయాలు పెంచడం ద్వారా అధిక శాతం స్థూల మార్జిన్ల విస్తరణకు అవకాశం ఉంది. నిర్వహణ లాభం ఆదాయం కంటే ఎక్కువ వృద్ధిని వార్షికంగా నమోదు చేయవచ్చు’’అని డాబర్ ఇండియా త్రైమాసికం వారీ అప్డేట్లో పేర్కొంది. త్రైమాసికం వారీగా చూస్తే డిమాండ్ ధోరణిలో పురోగతి కనిపించినట్టు చెప్పింది. అయినప్పటికీ పట్టణాల్లో వృద్ధితో పోలిస్తే గ్రామీణ వృద్ధి బలహీనంగానే ఉందని, కాకపోతే పుంజుకుంటున్న సంకేతాలు కనిపించాయని వెల్లడించింది. ధరల్లో వృద్ధి స్తబ్దుగానే ఉందని, డిసెంబర్ త్రైమాసికంలో ప్రధానంగా అమ్మకాల పరిమాణంలోనే వృద్ధి కనిపించినట్టు తెలిపింది. ఎఫ్అండ్బీ విభాగం అమ్మకాలు అధిక సింగిల్ డిజిట్ వృద్ధిని చూడగా, హోమ్, పర్సనల్ కేర్ విభాగం అమ్మకాలు మధ్యస్థ సింగిల్ డిజిట్‌ను చూసినట్టు పేర్కొంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతంగా ఉంటోంది. గ్రామీణం పర్వాలేదు.. డిసెంబర్ క్వార్టర్లో గ్రామీణ మార్కెట్ కొంత ఉత్సాహపూరితంగా ఉన్నట్టు మారికో తెలిపింది. స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడంతో 2024లో వినియోగం ఇంకా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. దేశీయ అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయి సింగిల్ డిజిట్ వృద్ధికి పరిమితం కావొచ్చని, ప్రధాన పోర్ట్‌ఫోలియో అమ్మకాలు త్రైమాసికం వారీగా కొంత మెరుగుపడతాయని మారికో వివరించింది. పారాచ్యూట్ కోకోనట్ అయిల్ అమ్మకాలు తక్కువ సింగిల్ డిజిట్లో పెరగ్గా, సఫోలా ఆయిల్ అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. కన్సాలిడేటెడ్‌గా డిసెంబర్ త్రైమాసికం అమ్మకాల్లో మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధిని చూసినట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రకటించింది. ‘‘దేశీయంగా నిర్వహణ వాతావరణం సెప్టెంబర్ త్రైమాసికం మాదిరే ఉంది. అయినప్పటికీ మెరుగైన అమ్మకాలతో మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధి నమోదైంది’’అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ దేశీయ ఎఫ్ఎంసీజీ అమ్మకాల వృద్ధి మధ్యస్థ సింగిల్ డిజిట్‌లోనే ఉండొచ్చని అంచనా. మారికో ఇంటర్నేషనల్ వ్యాపారం మధ్యస్థ స్థాయిలో వృద్ధి చెందగా, తమ అంతర్జాతీయ వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని డాబర్ ఇండియా తెలిపింది. -
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..
-
హైదరాబాద్‌లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్‌లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్‌బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
సంక్రాంతికి సై
సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. పండగ వసూళ్లను దండుకోవడానికి సంక్రాంతి మంచి సమయం. అందుకే ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. 2024 సంక్రాంతి పండగకి మరో నెలకు పైగా సమయం ఉన్నా అప్పుడే ఇండస్ట్రీలో సంక్రాంతి జోష్ కనిపిస్తోంది. ఈసారి పండగకి దాదాపు అరడజను స్ట్రయిట్ తెలుగు, దాదాపు ఐదు డబ్బింగ్ చిత్రాలతో సినిమాల జోరు బాగానే కనిపించనుంది. సినీ లవర్స్‌కి పండగకి దాదాపు పది చిత్రాలు రానున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్నారు నాగార్జున. ‘నా సామి రంగ’ చిత్రంతో ఈసారి మళ్లీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తారు. ఆయన మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలిష్‌గా ఉంటాయి. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్ట్ 29) సందర్భంగా విడుదల చేసిన నాగార్జున లుక్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘ఈ పండక్కి నా సామి రంగ’ అంటూ గ్లింప్స్ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ఆయన కెరీర్లో 99వ సినిమాగా ‘నా సామి రంగ’ రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ, సంక్రాంతికి రిలీజ్ పక్కా అని డుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ► ‘సైంధవ్’ సినిమాతో వెంకటేశ్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. వెంకటేశ్ కెరీర్లో ‘సైంధవ్’ 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సైంధవ్’ చిత్రాన్ని ఈ డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్రబృందం ప్రకటించడంతో సంక్రాంతి బరిలో దిగారు వెంకటేశ్. ► గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు రవితేజ. ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా వెండితెరపై కనిపించారు. సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో బరిలో దిగడానికి రెడీ అయ్యారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఆ తేదీకి విడుదలవుతుందా? వాయిదా పడుతుందా అనే చర్చ వినిపిస్తోంది. కానీ చెప్పిన తేదీకి పక్కా వస్తామంటూ రిలీజ్ కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు మేకర్స్. రవితేజ కెరీర్లోనే ‘ఈగల్’ వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని, ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్రయూనిట్ పేర్కొంది. ► ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు గుంటూరు కారం ఘాటు చూపించ డానికి ‘గుంటూరు కారం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో మహేశ్‌బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు పక్కా మాస్ లుక్‌లో కనిపించ నున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ చెబుతున్నాయి. ► ‘ఖుషి’ వంటి హిట్ సినిమా తర్వాత విజయ్ దేవర కొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ‘గీత గోవిందం’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్–పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పోటీలో నిలవనుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదనే చర్చ తాజాగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ సంక్రాంతికి విడుదల కాకపోతే మార్చిలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక తర్వాతి షెడ్యూల్ చిత్రీకరణకు అమెరికాకు బయలుదేరనుంది యూనిట్. దాదాపు నెలరోజులకు పైగా అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నారట. సంక్రాంతికి ఇంకా నెలన్నరే ఉంది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్‌కి దాదాపు అంతే సమయం పడుతుందట. అందుకే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. ► ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు దిగుతుంటే నేనూ వస్తున్నానంటున్నాడు యువ హీరో తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను–మాన్’. ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి, చివరికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డబ్బింగ్ కూడా.. పండగకి స్ట్రయిట్ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈసారి రజనీకాంత్ సినిమాతో పాటు జోరుగా బరిలో నిలవనున్న అనువాద చిత్రాలేవో తెలుసుకుందాం. ‘జైలర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రజనీకాంత్ ‘లాల్ సలాం’తో పొంగల్ (సంక్రాంతి) బరిలో దిగుతున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఆర్డీ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజవుతోంది. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. స్వీయ దర్శకత్వంలో ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో భాగంగా సుందర్ .సి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పొంగల్‌కి రిలీజ్ కానుంది. -
టయోటా కొత్త ప్లాంటుకు రూ.3,300 కోట్లు
బెంగళూరు: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో మూడవ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది. 2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. రెండు షిఫ్టులలో 1 లక్ష యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిదాడిలో ఇప్పటికే సంస్థకు రెండు యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.42 లక్షల యూనిట్లు. మల్టీ–యుటిలిటీ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్‌తోపాటు వివిధ ఇంధన సాంకేతికతలతో మోడళ్లను తయారు చేసేందుకు భవిష్యత్‌కు అవసరమయ్యే స్థాయిలో కొత్త ప్లాంట్ ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ విక్రమ్ గులాటీ తెలిపారు. కొత్త ప్లాంట్ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్లలో 11,200 మంది పని చేస్తున్నారని వివరించారు. -
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్‌కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్‌లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఏకంగా 45000 కోట్లు.. డేటా సెంటర్లలోకి పెట్టుబడుల వరద
ముంబై: దేశీయంగా డేటా సెంటర్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రూ. 45,000 కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్లు రాగలవని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో అంచనా వేసింది. పెద్ద కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. ఇక ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లు ప్రాచుర్యంలోకి వస్తున్న క్రమంలో రిటైల్ డేటా వినియోగం పెరుగుతోందని వివరించింది. గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ వార్షికంగా 45 శాతం మేర వృద్ధి చెందిందని క్రిసిల్ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ సర్వీసులతో రిటైల్ యూజర్లలో డేటా వినియోగం ఇంకా విస్తరిస్తుందని, తద్వారా ఉత్పత్తయ్యే డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల అవసరమూ పెరుగుతుందని వివరించింది. ప్రస్తుతం 780 మెగావాట్లుగా ఉన్న భారతీయ డేటా సెంటర్ల స్థాపిత సామర్ధ్యం .. 2026 మార్చి నాటికి 1,700 మెగావాట్ల స్థాయికి చేరగలదని, ఇందుకు రూ. 45,000 కోట్లు అవసరం కాగలవని క్రిసిల్ డిప్యుటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా చెప్పారు. హైదరాబాద్, చెన్నై తదితర నగరాలకూ ప్రాధాన్యం.. కొత్త పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు భాగం ఆర్థిక రాజధాని ముంబైలోను, మిగతావి హైదరాబాద్, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె వంటి ప్రాంతాల్లోను ఉండవచ్చని గుప్తా చెప్పారు. సబ్–సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అందుబాటులో ఉండటం, బడా కంపెనీలకు నెలవుగా ఉండటం, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండటం వంటి సానుకూల అంశాల కారణంగా ముంబైకి అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని క్రిసిల్ వివరించింది. తాజా పెట్టుబడులన్నీ దేశీ, అంతర్జాతీయ డేటా సెంటర్ ఆపరేటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో పాటు టెలికం, రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇంజినీరింగ్ తదితర రంగాల కంపెనీల నుంచి ఉండగలవని పేర్కొంది. -
2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఒక పక్క మెగా టోర్నమెంట్ మరోపక్క దసరా-దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్, ఇటు వ్యాపారవేత్తల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది ODI (వన్ డే ఇంటర్నేషనల్) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం సమకూరనుందని పరిశ్ర వర్గాల అంచనా. ప్రపంచ కప్ 2023 డిజిటల్ ఆదాయాలు ఈ సంవత్సరం గణనీయంగా పెరుగుతాయని, మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పెరగవచ్చట. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని అంచనా. 2019 ప్రపంచ కప్‌లో ఖర్చు చేసిన దాని కంటే రెట్టింపు ఖర్చుపెట్టనున్నారనే అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ కాలంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగు తాయని విక్రయదారులు భావిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌కు ,ఇటు ప్రకటనదారులకు పండగే 2022తో పోల్చితే 2023లో పండుగ కాలంలో ప్రకటన ఖర్చు కనీసం 10-15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ పల్ప్ స్ట్రాటజీ వ్యవస్థాపకుడు , ఎండీ అంబికా శర్మ తెలిపారు. రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వీక్షకులకు, ప్రకటనదారులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఏడాదికి మొత్తం యాడ్ ఖర్చులో 40-45 శాతం పండుగ కాలంలోనే జరుగుతుంది. క్రికెట్‌కు రోజుకు రోజుకు పెరుగుతున్న ఆదరణ, అందులోనూ ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో వస్తున్న ప్రపంచ కప్ ద్వారా టీవీ ,డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి రూ. 2,000-2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. .2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆధారిత ఆదాయం రూ. 400-రూ. 500 కోట్ల లోపే. డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా క్రికెట్‌కు భారీ క్రేజ్ క్రికెట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. డిజిటల్ ఛానెల్‌లలో తక్కువ ధరలు అనేక బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈనేపథ్యంలోనే క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చిన డిజిటల్ యాడ్స్ రెవెన్యూ దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కోసం డిజిటల్‌పై యాడ్ రేట్ వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 230-250 పరిధిలో ఉంది. 2019 ఎడిషన్‌లో ప్రతి వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 140-150తో పోలిస్తే 60 శాతం ఎక్కువ (CPM). ప్రపంచ కప్ కోసం ఈ ఏడాది టీవీలో ప్రకటనల ఖర్చు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్అంటే ఆ క్రేజే వేరు. ఇలాంటి ప్రీమియం మ్యాచ్‌ల కోసం 10 సెకనుల రేట్లు దాదాపు రూ. 30 లక్షలు. ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023లో ప్రకటనల పరిశ్రమ మొత్తం వృద్ధి రేటు 8-9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తౌరానీ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. క్యూ కట్టిన దిగ్గజ స్సాన్సర్లు అక్టోబరు 5 నుండి షురూ కానున్న ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికారిక ప్రసార భాగస్వామి, స్ట్రీమింగ్ భాగస్వామి అయిన డిస్నీ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్లు , 500 కంటే ఎక్కువ మంది ప్రకటనదారులు సైన్ అప్ చేసారు. మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, MRF టైర్స్, Dream11, Booking.com, వంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంటు-2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజా 13వ ఎడిషన్‌ను భారతదేశం హోస్ట్ చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై వచ్చే నెల(నవంబర్) 19న ముగుస్తుంది. -
జీఎస్టీ పెంపు: ఇలా అయితే డిజిటల్ ఎకానమీ ఎలా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్) ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది. కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది. -
ఉపాధికి రక్షణ కవచం!
సాక్షి, అమరావతి : పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. మరో వైపు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి మార్గాలు చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాల సముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు వేగం అందుకున్నాయి. ఐదు దశల్లో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన దశలకు సంబంధించి ఆమోదం లభించనుందని బీఈఎల్ అధికారులు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్‌లో రాడార్, మిసైల్, సబ్మెరైన్లకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేయడమే కాకుండా వీటిని పరీక్షించేలా టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశకు సంబంధించి క్షిపణుల అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను రూ.148 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బిడ్ దక్కించుకున్న సంస్థ క్షిపణుల తయారీకి సంబంధించి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డ్‌లతో పాటు ఒక ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వరద నీటి కాల్వలు, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాలు వంటి వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు మే 23లోగా బిడ్లను దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే ఈ 914 ఎకరాల చుట్టూ సుమారు రూ.50 కోట్లతో ప్రహరీ నిర్మించింది. గోడ చుట్టూ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, సొంత అవసరాల కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. చకచకా అనుమతులు గత ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి బీఈఎల్ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 2016లోనే బీఈఎల్ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టిలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా, కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బీఈఎల్ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, తొలి దశలో రూ.384 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 2025 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిఫెన్స్ హబ్‌గా ఏపీ దేశ రక్షణ అవసరాల తయారీ హబ్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర రక్షణ సంస్థ 914 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తుండగా ఏపీఐఐసీ కూడా 1,200 ఎకరాల్లో ఏపీ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ (ఏపీ–ఏడీఈ) పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరిగే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు రాష్ట్రం రక్షణ రంగ ఉత్పత్తులకు తయారీ కేంద్రంగా తయారవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా 2,800 మందికి, పరోక్షంగా 8,000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. యాంకర్ యూనిట్‌గా బీఈఎల్ భారీ ప్రాజెక్టును చేపడుతుండటంతో అనేక అనుబంధ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కానున్నాయి. -
పెట్టుబడులకు లాజిస్టిక్స్ అద్భుత అవకాశం
భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్‌ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు. సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్‌పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. మొబైల్ ఫోన్ల హబ్‌గా.. 2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్సంగ్ ఫోన్లను ఎగుమతి చేసింది. మారిన పరిస్థితులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్‌కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. నైపుణ్యాలు కీలకం యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్‌సర్‌లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్‌లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి. -
5.2 బిలియన్ డాలర్లకు.. పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ
కోల్‌కతా: దేశీయంగా పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. దీంతో వచ్చే మూడు, నాలుగేళ్లలో 5.2 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఎఫ్ఏఐ) ప్రెసిడెంట్ రిషభ్ కొఠారీ ఈ విషయాలు తెలిపారు. ‘దేశీయంగా ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇది 3.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది‘ అని ఆయన చెప్పారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు, ఇతరత్రా అంశాలపై ఖర్చు చేయగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని కొఠారీ వివరించారు. ఆహారోత్పత్తులు, పానీయాలు, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, హోమ్‌కేర్, ఫార్మా, కాస్మెటిక్స్ మొదలైన రంగాల్లో వీటిని ఎక్కువగా వినియోగి స్తుంటారు. సహజసిద్ధమైన, సేంద్రియ ఉత్పత్తులవైపు వినియోగదారులు మళ్లుతున్నందున ఆ విభాగాల్లో ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ సంస్థలకు వ్యాపార అవకాశాలు ఉన్నాయని కొఠారీ పేర్కొన్నారు. -
వెండి, బంగారం ధరలపై గుడ్‌న్యూస్: బడ్జెట్‌పై కోటి ఆశలు!
న్యూఢిల్లీ: 2023-24 కేంద్రం బడ్జెట్‌కు సంబంధించిన కేటాయింపులు, మినహాయింపులు, కోతలపై సామాన్య ప్రజానీకం నుంచి కార్పొరేట్ దాకా చాలా ఆశలు, ఊహాగానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టన్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో మరిన్ని ప్రజాకర్షక పథకాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పసిడి ధర, బంగారు ఆభరణాల ధర తగ్గుముఖం పడుతుందా? దిగుమతి సుంకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పండుగల సీజన్లో రిటైల్ అమ్మకాలను దెబ్బతీస్తూ బంగారం ధరలు రికార్డు స్థాయిలకు పెరుగుతున్న తరుణంలో, రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తారని భారతీయ ఆభరణాల విభాగం భావిస్తోంది. ప్రస్తుతం, బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్‌గా అదనంగా 2.5శాతంగా ఉంది. గత బడ్జెట్లో కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు ఈ సుంకాన్ని పెంచారు. ఫలితంగా బంగారం దిగుమతులు 2021లో 1,068 టన్నుల నుంచి 2022లో 706 టన్నులకు తగ్గిపోయాయి. సుంకం పెంపు వల్ల భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా పెరిగిందనీ, ఇది ఏడాదికి 200 టన్నులు అని అంచనా వేశామని వాస్తవానికి బంగారం రిటైల్ అమ్మకాలను ఇది ప్రభావితం చేస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బంగారం, వెండి ,ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 4 శాతంక తగ్గించాలని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) డిమాండ్ చేస్తోంది. ఈ దిగుమతి సుంకం ఎగుమతిదారుల నుండి మూలధనాన్ని హరించివేస్తోందని భావిస్తోంది. కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా ప్రకారం. దిగుమతి సుంకం తగ్గింపు ఆరోగ్యకరమైన ,మరియు పారదర్శక పరిశ్రమను కలిగి ఉండటానికి సహాయడుతుందనీ, అలాగే ఎగుమతిదారుల వర్కింగ్ క్యాపిటల్ అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్థానిక ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో కొన్ని వస్తువులు ఖరీదైనవి, మరికొన్ని చౌకగా మారనున్నట్లు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్లో, ప్రభుత్వం మొత్తం దృష్టి దేశంలో ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంపైనే ఉంటుంది. తద్వారా దేశంలోని వాణిజ్య నిల్వలను సరిచేయవచ్చు. కరెంట్ ఖాతా లోటును తగ్గించవచ్చు. దీనికి తోడు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో బంగారం చౌకగా ఉండే అవకాశం ఉందని, తద్వారా ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని తెలుస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా దేశం నుండి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. గతేడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరల సెగ కాస్త తగ్గుముఖం పట్టి..ప్రజల చేతుల్లో పుత్తడి మరింత మెరిసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంగారెడ్డి : మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
-
రష్మిక నోటి దురుసు.. సౌత్ ఇండస్ట్రీ నుండి బ్యాన్..?
-
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ, పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: నైపుణ్య ఆధారిత ఆన్లైన్ గేమింగ్‌పై ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రస్తుత 18 శాతం నుండి 28 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన పట్ల తమకు అభ్యంతరం ఏదీ లేదని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ స్థాయి పన్ను స్థూల గేమింగ్ రాబడి (జీజీఆర్) పైనే విధించాలని, పోటీకి సంబంధించిన ప్రవేశ మొత్తంపై (సీఈఏ) 28 శాతం జీఎస్టీ విధింపు సరికాదని పేర్కొంది. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ప్రవేశ మొత్తంపైనే ఈ స్థాయి పన్ను విధిస్తే, అది దాదాపు 2.2 బిలియన్ డాలర్ల విలువచేసే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. జీజీఆర్ అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ ప్లాట్‌ఫారమ్‌లోని గేమ్‌లో పాల్గొనడానికి సర్వీస్ ఛార్జీలుగా ఆయా సంస్థలు వసూలు చేసే రుసుము. అయితే పోటీ ఎంట్రీ అమౌంట్ (సీఈఏ) అనేది ప్లాట్‌ఫారమ్‌పై పోటీలో పాల్గొనడానికి ప్లేయర్ డిపాజిట్ చేసిన మొత్తం. ఆయా అంశాలు, సమస్యలపై గేమింగ్ పరిశ్రమ నిపుణులు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. (గుడ్‌న్యూస్: ఎఫ్‌ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!) నేపథ్యం ఇదీ... ఆన్లైన్ గేమింగ్ జీజీఆర్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచడంపై డిసెంబర్ 17న జరుగుతుందన్న భావిస్తున్న జీఎస్టీ మండలి ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో గేమింగ్ రంగంలో నిపుణులు కేంద్రానికి తమ కీలక సూచనలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జరగబోయే రానున్న జీఎస్టీ సమావేశంలో ప్యానెల్ క్యాసినో, రేస్ కోర్స్ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన ఎజెండాను చేపట్టవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్‌లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్‌పై నివేదిక సమర్పించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించింది. నివేదిక రూపకల్పన విషయంలో ఈ రంగానికి సంబంధించి పలు అంశాల పరిశీలనతో పాటు రాష్ట్రాల నుండి వచ్చే మరిన్ని సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) గేమ్స్ ఇవీ... నైపుణ్యాల ప్రాతిపదికన జరిగే ఆన్లైన్ గేమ్‌లలో ఇ–స్పోర్ట్స్, ఫాంటసీ గేమ్‌లు, రమ్మీ, పోకర్ లేదా చెస్ ఉన్నాయి. ఇటువంటి గేమ్‌లు ఆన్లైన్లో ఉచితంగానూ ఆడవచ్చు. లేదా ఫ్లాట్‌ఫామ్ ఫీజుల రూపంలో డబ్బు చెల్లించి ఆడే వారూ ఉంటారు. చట్టబద్ద పరిశ్రమ ప్రయోజనాలు కాపాడాలి పోటీ ప్రవేశ మొత్తంపై కాకుండా స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ విధించాలని ఒకే పరిశ్రమగా ఒకే తాటిపై మేము కోరుతున్నాము. స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ 18 శాతం నుండి 28 శాతానికి పెరగడం వలన కేంద్రానికి పన్ను రాబడి పెరుగుతుంది. పరిశ్రమ కూడా దీనిని భరించగలుగుతుంది. ఇక పోటీ ప్రవేశ మొత్తంపై పన్ను విధించడం వల్ల పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. పెరిగిన పన్ను భారాన్ని వినియోగదారులపై మోపవలసి ఉంటుంది. దీనివల్ల భారతదేశంలో ఎటువంటి పన్ను బాధ్యతలు లేని గ్రే మార్కెట్, ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆటగాళ్లు మారిపోతారు. దీనితో చట్టబద్ధమైన గేమింగ్ వ్యాపార సంస్థలు తమ కస్టమర్ బేస్‌ను కోల్పోతాయి. చివరకు చట్టబద్దమైన సంస్థలపై, ప్రభుత్వ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తుంది- త్రివిక్రమన్ థంపి, గేమ్స్ 24గీ7 కో–చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతికూల ప్రభావాలు ఎంట్రీ ఫీజుల కంటే స్థూల గేమింగ్ రాబడిపై పరిశ్రమ జీఎస్టీ విధించడం వల్ల ఫలితాలు బాగుంటాయి. ఎంట్రీ ఫీజుపై పన్ను విధింపు మాత్రం భారత్దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న గేమింగ్ రంగం వృద్ధిని నియంత్రిస్తుంది. ప్రవేశ రుసుములపై జీఎస్టీని వర్తింపజేయడం వలన ఇప్పటికే అనేక రకాల పన్నులు– రుసుములను చెల్లించే ప్లేయర్లు తీవ్రంగా నిరుత్సాహపడతారు. స్థూల గేమింగ్ రాబడిపై పన్ను విధించడం వలన ప్లేయర్లు వారి నైపుణ్యం లేదా విజయంతో సంబంధం లేకుండా, న్యాయమైన సమానమైన మార్గంలో పన్ను చెల్లింపులకు సహకరిస్తారు. ఎంట్రీ ఫీజుపై జీఎస్టీ విధింపు వల్ల కంపెనీలు లేదా ప్లేయర్లు చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ జూదం యాప్‌ల వైపు నడిచే అవకాశం ఉంది. ఇవి భారత్ చట్టాలకు అనుగుణంగాగానీ లేదా ఎకానమీకి లాభదాకంగా ఉండే అవకాశమే ఉండదు -సుమంత డే, డిజిటల్ వర్క్స్ సీనియర్ డైరెక్టర్ -
టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్
అటు పోట్లు ఎన్ని ఎదురైనా దృఢ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చు అని నటి నందిని రాయ్ నిరూపించింది. వరుస ఫ్లాప్‌లతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య గురించీ ఆలోచించింది. మళ్లీ తనకు తానే ధైర్యం చెప్పుకుని అపజయాలను చాలెంజ్‌గా తీసుకుంది. ప్రస్తుతం వరుస విజయాలు చవిచూస్తోంది. ఆ విజేత పరిచయం.. ► కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా ► పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైమ్‌లోనే అంతర్జాతీయ మోడల్‌గా పేరు సంపాదించుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకుంది. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. ► ‘040’ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ‘మాయ’, ‘ఖుషీ ఖుషీగా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజని’ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ నటించింది. అటు హిందీలో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే సినిమాలో కనిపించింది. ► బిగ్ బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. ఇటీవల సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గాలివాన’ వెబ్ సిరీస్‌లో కూడా నటించి విమర్శల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘పంచతంత్ర కథలు’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లతో వీక్షకులను అలరిస్తోంది. -
పన్నులపై సూచనలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో తగు సూచనలు చేయాలంటూ పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ అసోసియేషన్లను కోరింది. డిమాండ్లతో పాటు వాటి వెనుక గల హేతుబద్ధతను కూడా వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. సుంకాల స్వరూపం, పన్నుల రేట్లు మొదలైన వాటిల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన సిఫార్సులను పంపేందుకు నవంబర్ 5 ఆఖరు తేదీ. ప్రత్యక్ష పన్నుల రేట్లను క్రమబద్ధీకరించడంతో పాటు పన్ను ప్రోత్సాహకాలు, డిడక్షన్లు, మినహాయింపులు మొదలైనవి దశలవారీగా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
హైదరాబాద్ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పరిశ్రమకు శంకుస్థాపన
-
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. -
మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్ జీనియస్ టాయ్స్ సీఈవో నరేశ్ కుమార్ గౌతమ్ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్‌ఖట్ టాయ్స్ ప్రమోటర్ తరుణ్ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఎగుమతులు 61 శాతం అప్.. గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు. -
‘మీరు వెళ్లండి, కానీ మేం నష్టపోనివ్వకుండా చూడండి’
న్యూఢిల్లీ: విదేశీ ఆటోమొబైల్ సంస్థలు (ఓఈఎం) అకస్మాత్తుగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తుండటం వల్ల తాము భారీగా నష్టపోవాల్సి వస్తోందని ఆటోమొబైల్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిష్క్రమణల వల్ల తమను నష్టపోనివ్వకుండా తగు పరిహారం అందేలా చూడాలని కోరారు. రెండు పక్షాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు ఉండాలని ఆటోమోటివ్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆటో రిటైల్ సదస్సులో నమూనా డీలర్ ఒప్పందాన్ని (ఎండీఏ) ఆవిష్కరించింది. ‘ఓఈఎం (వాహనాల తయారీ సంస్థలు)లకు, డీలర్లకు మధ్య ప్రస్తుతం ఒప్పందాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. అవి ఓఈఎంల కోణంలోనే ఉంటున్నాయి. అలాకాకుండా వ్యాపార నిర్వహణలో మా మాటకు కూడా విలువ ఉండేలా ఒప్పందాలు ఉండాలన్నది డీలర్ల అభిప్రాయం‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. ఎండీఏతో ఇటు ఓఈఎంలు, అటు డీలర్లకు సమాన స్థాయి లభించగలదని పేర్కొన్నారు. ఒప్పందాలనేవి ఆటో పరిశ్రమ లేదా వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా ఇరు పక్షాలకు తగు పరిహారం లేదా తగిన సెటిల్మెంట్ లభించేలా ఉండాలే తప్ప ఏకపక్షంగా ఉండకూడదని సింఘానియా చెప్పారు. విదేశీ ఓఈఎంలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం కోసం అయిదేళ్ల పైగా కూడా అధ్యయనాలు చేస్తుంటాయని, కానీ తప్పుకోవాల్సి వస్తే హఠాత్తుగా నిష్క్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘దీంతో డీలర్ల దగ్గర వాహనాలు, స్పేర్ పార్టుల స్టాక్‌లు పేరుకుపోతుంటాయి. వ్యాపారం కోసం మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. విదేశీ ఓఈఎం అకస్మాత్తుగా నిష్క్రమించడం వల్ల ఆ డబ్బంతా ఇరుక్కుపోతుంది. అలా కాకుండా ఒకవేళ నిష్క్రమించాల్సి వస్తే అది ప్రణాళికాబద్ధంగా జరిగితే, డీలర్లు కూడా తమ దగ్గరున్న నిల్వలను విక్రయించి, బ్యాంకు రుణాలను తీర్చుకునేందుకు వీలవుతుంది‘ అని సింఘానియా చెప్పారు. 2017లో జనరల్ మోటర్స్, 2021లో ఫోర్డ్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించిన సందర్భాల్లో డీలర్లు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికి మించి స్వేచ్ఛా విపణిగా మారగలుగుతోందని మైండ్‌మైన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి అనంతరం భారత్ అనేక వినూత్న ప్రయోగాలను ఆవిష్కరిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది.. విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్‌పై నమ్మకంగా ఉన్నప్పుడు దేశీయంగా ప్రైవేట్ సంస్థలు తయారీలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారో తెలియడం లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. పరిశ్రమకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చించేందుకు, పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హనుమంతుడిలాగా పరిశ్రమకు తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ హనుమాన్‌లాగా మారిందా? మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం కలగడం లేదా. ఎవరైనా మీ పక్కన నిల్చుని, మీకు హనుమంతుడి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి .. ముందుకు కదలండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? అలా హనుమంతుడికి ప్రస్తుతం చెప్పేవారు ఎవరున్నారు. పరిశ్రమ కదిలి వచ్చి ఇన్వెస్ట్ చేసేందుకు ఏమేమి చేయగలదో అంతా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఎందుకు వెనుకాడుతున్నారో మీ నుంచి వినాలని ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు. -
పెన్నార్‌కు రూ.511 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ దిగ్గజం పెన్నార్ గ్రూప్ తాజాగా రూ.511 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. పెన్నార్ అనుబంధ విభాగాలు రిలయన్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, యమహా, కోనే, ఐఎఫ్బీ, హిందాల్కో, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ తదితర సంస్థల నుంచి వీటిని పొందినట్టు కంపెనీ కార్పొరేట్ స్ట్రాటజీ, ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం.సునీల్ తెలిపారు. జూలై, ఆగస్ట్‌లో ఈ ఆర్డర్లను చేజిక్కించుకున్నామని, వచ్చే రెండు త్రైమాసికాల్లో వీటిని పూర్తి చేస్తామని చెప్పారు. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా! -
బొమ్మల పరిశ్రమ సామర్థ్యం పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయ బొమ్మల పరిశ్రమ (టాయ్) విశాలంగా ఆలోచించాలని, సామర్థ్యం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ సూచించింది. తద్వారా తయారీని పెంచి, ఎగుమతుల వృద్ధికి కృషి చేయాలని కోరింది. దిగుమతులపై సుంకాలు పెంపు, నాణ్యత ప్రమాణాలను ప్రవేశపెట్టడం దిగుమతులు తగ్గేందుకు సాయపడతాయని, తయారీని ప్రోత్సహిస్తాయని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) కార్యదర్శి అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. పెద్దగా ఆలోచించడమే ఇప్పుడు పరిశ్రమ వంతుగా గుర్తు చేశారు. యూనికార్న్(బిలియన్ డాలర్ల విలువ)గాఅవతరించాలంటే మరో స్థాయికి చేరుకోవాలన్నారు. యాజమాన్యంలో వృత్తి నైపుణ్యాలు తీసుకురావాలని సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో టాయ్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వల్ల మూడేళ్ల విరామం తర్వాత ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 96 స్టాళ్లు కొలువుదీరాయి. కేంద్ర ప్రభుత్వం స్థానికంగానే బొమ్మల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో బొమ్మలపై 20 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 60 శాతానికి పెంచింది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా దిగుమతి అయ్యే బొమ్మల నాణ్యత ఉండాలని నిర్ధేశించింది. భారత్‌కు ఎగుమతి చేయాలనుకునే ఏ దేశ కంపెనీ ఉత్పత్తులకు అయినా ఇవే నిబంధనలు అమలవుతాయని నాటి ఆదేశాల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. గణనీయంగా తగ్గిన దిగుమతులు దేశంలోకి బొమ్మల దిగుమతులు 2018-19లో 304 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2021-22 నాటికి 36 మిలియన్ డాలర్లకు తగ్గినట్టు అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో మన దేశం నుంచి బొమ్మల ఎగుమతులు 109 మిలియన్ డాలర్ల నుంచి 177 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు చెప్పారు. ప్రభుత్వం చర్యలు పరిశ్రమకు సాయపడుతున్నట్టు ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. తయారీని ప్రోత్సహించడంతోపాటు, దిగుమతులు తగ్గేందుకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కావాలి. అప్పుడే పరిశ్రమ తదుపరి స్థాయికి వెళుతుంది. ఉపాధి కల్పనతోపాటు, ఎగుమతులు పెరుగుతాయి’’అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 120 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారత్ వాటా చాలా తక్కువేనన్నారు. నేషనల్ టాయ్ పాలసీ, పీఎల్ఐ పథకాల వంటికి ఈ రంగం వృద్ధికి సాయపడతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంతొ దేశంలోని బొమ్మల రంగానికి సానుకూల ఫలితాలు వచ్చాయని, గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గగా, ఎగుమతులు 61 శాతం పెరిగాయని మంగళవారం నాటి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 13వ టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ అగర్వాల్ "రీబ్రాండింగ్ ది ఇండియన్ టాయ్ స్టోరీ" పేరుతో ప్రధాని ఇచ్చిన క్లారియన్ కాల్‌ను గుర్తు చేశారు. -
రాజకీయాల్లోకి రావడంలేదు.. వారికే ప్రజలు ఓట్లు వేస్తారు: సుమన్
విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తోందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. ఆల్ ఇండియా సుమన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ధూళిపాళ్ళ దేవేంద్రరావు ఇంటి వద్ద జరిగిన ఒక కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామని చెప్పారన్నారు. పి.నైనవరంలో మాట్లాడుతున్న సినీ నటుడు సుమన్ బుల్లితెరపై వస్తున్న సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో సెక్స్ వయొలెన్స్ ఎక్కువగా ఉంటోందని, చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లలో వాటిని చూసి ఆ ప్రభావానికి లోనవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బుల్లితెర సినిమాలకు, పెద్ద సినిమాలకు సెన్సార్‌బోర్డు నిబంధనలు ఒకేలా ఉంటే బాగుంటుందన్నారు. షార్ట్ ఫిలింస్ సత్తా చాటుతున్నాయని, నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారన్నారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడంలేదని తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను చూసేవారికే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించలేరన్నారు. చదవండి: (anyas tutorial trailer: అలా భయపెట్టడం ఇష్టం) -
రాష్ట్రంలో సౌర ఫలకల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ పరికరాల తయారీ రంగంలో రాష్ట్రం కీలక ముందడు గువేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో 1.25 గిగావాట్ల సోలార్ సెల్స్, 1.25 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ (సౌర ఫలకలు) తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్, ఆజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ సంయుక్తంగా రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టాయి. మెగా ప్రాజెక్టుల విభాగం కింద ఈ పరిశ్రమ కోసం మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ సిటీ (ఈ–సిటీ)కి 20 ఎకరాలను అదనంగా కేటాయించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వచ్చే నాలుగేళ్లలో రూ. 4 వేల కోట్ల అంచనా విలువతో 2.4 గిగావాట్ల సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్‌ను ఆజూర్ పవర్‌కు సరఫరా చేసేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ సోమవారం కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆజూర్ పవర్ పరిశ్రమ విస్తరణ ద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా, అనుబంధ పరిశ్రమల స్థాపనతో 2,000 మందికి పరో క్షంగా ఉపాధి లభించనుంది. ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ద్వారా ఎలక్ట్రానిక్స్ సిటీలో అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిగిన సం స్థగా నిలవనుంది. దేశంలో సౌర విద్యుదుత్పత్తిని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రీమియర్, ఆజూర్ నుం చి పెట్టుబడులు పునరావృతం కావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నా రు. దీర్ఘకాలిక సరఫరా అవకాశాలు ఉండటంతో తమ పెట్టుబడులు సురక్షితమని నిర్ధారణకు వచ్చా మని ఆజూర్ పవర్ చైర్మన్ అలాన్ రోజ్లింగ్ తెలిపారు. తనదైన ప్రత్యేక సాంకేతికతతో అధునాతన సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియర్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తోందని, ఆ సంస్థతో భాగస్వామ్యం కుదరడం సంతోషకరమన్నారు. సోలార్ రంగం లో 27 ఏళ్ల అనుభవాన్ని తమ సంస్థ కలిగి ఉందని ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్‌పాల్ సింగ్ పేర్కొన్నారు. సోలార్ సెల్స్ కలయికతో ఏర్పడే ఫొటో వోల్టాయిక్ ప్యానెల్‌ను సోలార్ మాడ్యూల్ అంటారు. సూర్యకిరణాలను సంగ్రహించడం ద్వారా సోలార్ సెల్స్ విద్యుదుత్పత్తి చేయడం తెలిసిందే. రూ. 250 కోట్లతో మెటా4 ప్లాంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న యూఏఈకి చెందిన మెటా4 సంస్థ తెలంగాణలో రూ.250 కోట్లతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వోల్ట్‌లీ ఎనర్జీ కంపెనీ ద్వారా మెటా4 ఈ పెట్టుబడి పెడుతోంది. జహీరాబాద్ వద్ద 15 ఎకరాల్లో తయారీ కేంద్రం స్థా పించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒ ప్పందం కుదిరింది. 2023 మార్చి నాటికి తొలిదశ అందుబాటులోకి రానుంది. వార్షిక తయారీ సామర్థ్యం 40,000 యూనిట్లుకాగా.. మూడేళ్లలో లక్ష యూనిట్లకు పెంచనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించాయి. -
కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు వారి ‘వ్యాపార రహస్యం’ బట్టబయలైంది. ఏళ్లుగా సాగుతున్న గ్రానైట్ బాగోతం వెలుగుచూసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు గ్రానైట్ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. కలర్ గ్రానైట్‌ను అక్రమ తరలించడమే కాకుండా అడ్డగోలుగా విక్రయాలు జరిపారు. ఈ మొత్తం వ్యవహారం గనుల శాఖ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసింది. దీనిపై పక్కా ఆధారాలతో అధికారులు కోట»ొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదవండి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు కోటబొమ్మాళి మండలం పెద్ద బమ్మిడి గ్రామంలో సర్వే నంబర్ 106/1,104/9లో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్ పేరున శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. 2018 ఏప్రిల్ 23 నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల పాటు మినరల్ డీలర్ లైసెన్స్ తీసుకున్నారు. దీంట్లో నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావు భాగస్వాములుగా ఉన్నారు. జిల్లాలో అనేక కలర్ గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ, అచ్చెన్న కుటుంబీకులకు చెందిన ఈ ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. మే 8న వచ్చిన సమాచారం మేరకు కంచిలి మండలం భైరీపురం గ్రామంలోని రానా గ్రానైట్ అండ్ మినరల్ క్వారీ నుంచి గ్రానైట్ బ్లాక్‌లను తరలిస్తున్న వాహనాన్ని(ఏపీ30టీఎ 1089) గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి గడువు దాటిన పరి్మట్‌తో అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. మే 8వ తేదీ మ«ధ్యాహ్నం 3.11గంటల వరకే ఉన్న పర్మిట్‌ను ఆధారంగా చేసుకుని ఆ తర్వాత గ్రానైట్ బ్లాక్‌ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది స్టేట్మెంట్ తీసుకుని వాహనం సీజ్ చేశారు. ఈ సందర్భంలో తమ యాజమాన్యం చెప్పినట్టుగా వాహనం బ్రేక్ డౌన్ అయిన కారణంగా ఆలస్యమైందని, దానివల్ల గడువు సమయం దాటి రవాణా చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపారు. పలాస దగ్గర ఉన్న టోల్ ప్లాజాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా పట్టుకున్న ఏపీ 30టీఎ 1089వాహనం నిర్దేశిత ట్రాన్సిట్ గడువు సమయంలో మూడు సార్లు లోడింగ్, అన్‌లోడింగ్‌తో అటు ఇటు వెళ్లినట్టు రికార్డైంది. దీంతో ఒక ట్రాన్సిట్ ఫారంతో రెండు మూడు సార్లు గ్రానైట్ బ్లాక్‌ల అక్ర మ తరలింపు జరిగినట్టు అభిప్రాయానికొచ్చారు. దీని వెనుక గుట్టు తేల్చేందుకు ఈ గ్రానైట్ బ్లాక్‌లు రవాణా జరిగిన అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీని, అటు కంచిలిలో ఉన్న గ్రానైట్ క్వారీని పరిశీలించి, విచారణ జరిపారు. దీంతో దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ బాగోతం బయటపడింది. అ«ధికారుల విచారణను దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు గ్రానైట్ బ్లాక్‌ల నంబర్లు దిద్దుబాటు చేయడం, నంబర్ల టాంపరింగ్‌కు పాల్పడటం వంటివి చేశారు. అంతేకాకుండా ఒకే నంబర్‌తో ఉన్న వివిధ గ్రానైట్ బ్లాక్‌లను గుర్తించారు. అలాగే, ఆన్లైన్లో ఉన్నదానికి, భౌతికంగా ఉన్న బ్లాక్‌ల నిల్వల తేడాను సైతం పట్టుకున్నారు. 172.87 క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లకు సంబంధించి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రానైట్ క్వారీల నుంచి అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీని విలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. దానిని అచ్చెన్న ఫ్యామిలీ వ్యూహాత్మకంగా గండి కొట్టి దోచుకుంది. కేసు నమోదు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రభుత్వ ప్రాపర్టీ దొంగతనం, టాంపరింగ్, డూప్లికేషన్, ఉన్న స్థితిని మార్చడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్, భాగస్వాములైన నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావుపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో శ్రీకాకుళం గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. -
మైలార్‌దేవ్‌పల్లిలోని ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
దేశంలో వంట నూనెల కొరత ఉండదు!
న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల కొరత ఉండబోదని ప్రభుత్వానికి పరిశ్రమ భరోసా ఇస్తోంది. దీనిపై ఆందోళన అక్కర్లేదని సూచిస్తోంది. వంట నూనెల సరఫరాల్లో ఎటువంటి సమస్యలూ లేకుండా తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రభుత్వానికి పరిశ్రమ హామీ ఇచ్చింది. రెండు నెలల్లో ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వంట నూనెల పరిశ్రమ ప్రతినిధులు కేంద్ర ఆహార వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు హామీ ఇచ్చినట్లు శుక్రవారం ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. దీనితో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొద్దు తిరుగుడు పువ్వు నూనె భారీగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులు జరుగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రి గోయల్ ఒక కీలక సమావేశం నిర్వహించి సన్‌ఫ్లవర్ ఆయిల్సహా వంటనూనెల సరఫరాలపై సమీక్ష జరిపారు. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) సెక్రటరీ జనరల్ ఎస్పీ కమ్రా, అదానీ విల్మర్, రుచీ సొయా, మోడీ న్యాచురల్స్సహా ప్రముఖ రిఫైనర్లు, దిగుమతిదారుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సన్‌ఫ్లవర్.. తగినంత లభ్యత! సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరత లేదని సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. మార్చిలో డెలివరీ కోసం మొదటి షిప్మెంట్ 1.5 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ యుద్ధానికి ముందే ఉక్రెయిన్ నుండి బయలుదేరింది. త్వరలో ఈ షిప్మెంట్ (దిగుమతుల) భారత్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో ఒక నెలలో 18 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం జరగుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ వాటా దాదాపు 1.5–2 లక్షల టన్నులు. హార్డ్‌కోర్ వినియోగదారుల (కేవలం సన్‌ఫ్లవర్ వంట నూనె వినియోగించే వారు) డిమాండ్‌ను తీర్చడానికి లక్ష టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అవసరం. దేశంలో పొద్దుతిరుగుడు నూనెకు ఆవాలు, సోయాబీన్ నూనెల రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖకు పరిశ్రమ తెలిపిందని ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు 11 లక్షల టన్నుల కొత్త ఆవాల పంట రావడంతో వచ్చే 2–3 నెలల్లో దేశంలో సరఫరాలు తగిన స్థాయిలోనే ఉంటాయని భరోసాను ఇచ్చింది. భారతదేశం తన వంట నూనెల డిమాండ్‌లో 60 కంటే ఎక్కువ వాటా దిగుమతులదే కావడం గమనార్హం. తయారీని పెంచే మార్గాలు అన్వేషించండి: గోయల్ కాగా, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచే దిశగా తగిన మార్గాలు అన్వేషించాలని పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ పిలుపునిచ్చారు. అలాగే, టెక్నాలజీలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దే క్రమంలో 10 పరిశోధన, అభివృద్ధి ల్యాబ్‌లను లేదా నవకల్పనల కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగ వాటా 15 శాతం స్థాయిలో ఉంది. డీపీఐఐటీ వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. జీడీపీలో ఎగుమతుల వాటాను 25 శాతానికి పెంచడంపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. సర్వీసుల ఎగుమతుల్లో టాప్ మూడు దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడం, విదేశీ వాణిజ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు తోడ్పాటు అందించడం వంటి అంశాలపై కసరత్తు జరగాలని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు దేశీ కంపెనీలు మద్దతునివ్వాలని గోయల్ చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంపై పలు దేశాల్లో ఆసక్తి నెలకొందని ఆయన తెలిపారు. -
సర్కారు వారి మాట
సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లుగా కంపెనీలు నెలకొల్పని పరిశ్రమల నుంచి ప్రభుత్వ భూముల స్వాదీనానికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగం సిద్ధం చేస్తోంది. గ్రేటర్‌కు ఆనుకొని హెచ్ఎండీఏ పరిధిలో సుమారు రెండువేల ఎకరాల వరకు ఖాళీ స్థలాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాలను తిరిగి కంపెనీలు నెలకొల్పేవారికి కేటాయించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఎకరం మొదలు వంద ఎకరాలకు పైగా భూములున్న కంపెనీలుండడం గమనార్హం. ఈ ప్రాంతాల్లోనే అత్యధికం... రెండేళ్ల క్రితం టీఎస్ఐఐసీ నుంచి స్థలాలను దక్కించుకున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కంపెనీల యజమానులు ఇప్పటికీ కంపెనీలను నెలకొల్పలేదు. ఇలా నిరుపయోగంగా ఉన్నవిలువైన ప్రభుత్వ స్థలాలు.. ప్రధానంగా ర్యావిర్యాల ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్‌పార్క్, నానక్‌రామ్‌గూడలోని ఐటీపార్క్, నాచారం పారిశ్రామిక వాడ, పాశమైలారం, పటాన్చెరు ప్రాంతాలున్నాయి. గతంలో కేటాయింపులిలా.. ♦ నాలుగేళ్లుగా టీఎస్ఐఐసీ సుమారు 4,169 ఎకరాల భూములను 2,290 కంపెనీలకు కేటాయించింది. ఇందులో 95 సంస్థలు ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారివి. ఈ కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే రాష్ట్రానికి సుమారు రూ.56,597 కోట్ల పెట్టుబడుల వెల్లువతోపాటు..1.50 లక్షల మందికి ఉపాధి దక్కనుందని టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా కంపెనీలు ఏర్పాటు చేయని సంస్థల నుంచి భూములు స్వా«దీనం చేసుకొని తిరిగి ఇతర సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేయడంతో ఈ మేరకు టీఎస్ఐఐసీ కార్యాచరణ సిద్ధంచేస్తోంది. ♦ ఇప్పటికే కొన్ని కంపెనీల నుంచి భూములు స్వా«దీనం చేసుకోగా..సదరు యజమానులు కోర్టులను ఆశ్రయించడం గమనార్హం. గత ఏడేళ్లుగా టీఎస్ఐఐసీ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేయనుంది. ♦ గత ఏడేళ్లుగా 18 ప్రాంతాల్లో 19,961 ఎకరాల్లో పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దడంతోపాటు మౌలిక వసతులు కల్పించింది . మరో 15,620 ఎకరాలను పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో రావిర్యాల, మహేశ్వరంలోని హార్డ్‌వేర్ క్లస్టర్, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లున్నాయి. రాబోయే రెండేళ్లలో 80 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. -
‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!
పై నుంచి కిందికి జారే ప్రవాహధారను– నీటిబుగ్గ వద్దనే అది నలువైపులకు విస్తరించేట్టుగా దారులు సరిచేసినప్పుడు, బీడు భూములు సైతం జలాలతో తడుస్తాయి. ‘సోర్స్’గా పిలిచే ఈ నీటిబుగ్గను ఆంగ్లంలో ‘ఫౌంటెన్ హెడ్’ అంటాం. అయితే, పెట్టే చేతిని మెలివేయగలిగే శక్తి ఉన్నవారికి– ‘జల’ వద్దనే ఇవి దారులు మళ్ళించబడతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఇటువంటి మౌలిక అంశాల పట్ల స్పృహ ఉన్నప్పుడే, ‘రాజ్యం’ అందించే ఫలాల పంపిణీలో సమన్యాయం అమలవుతుంది. ఈ దృష్టి ప్రభుత్వాలకు లేనప్పుడు, నీటిబుగ్గ వద్దనే జలాలు–ఫలాలు కూడా దారులు మళ్ళించబడతాయి. ఇన్నాళ్ళు జరిగింది అదే. అయితే, అనివార్యస్థితి ఒకటి వస్తుంది. అప్పుడు జరిగే పంపిణీ న్యాయాన్ని ఎవరైనా కేవలం ప్రేక్షక పాత్రగా చూడ్డం తప్ప మరేమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఏళ్ల క్రితం– ఇకముందు వ్యవసాయం సాగదేమో? అనే అనుమానాన్ని స్వయంగా సర్కారులోని పెద్దలే వ్యక్తం చేయడం మనం చూశాం. అప్పటికే కౌలు రైతుల వెతలు పెరిగి సాగుబడి భారమయింది. భూముల సొంతదారులు ఊళ్ళను వదిలిపెట్టి, నగరాలలోనో, విదేశాలలోనో ఉంటూండటంతో రాష్ట్ర మంతా – ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్డిజం’ ఎక్కువయింది. ఆ తర్వాత – ‘జలయజ్ఞం’ మొదలై సాగునీటి వసతి పెరుగుతున్న దశలో– డాక్టర్ వైఎస్ఆర్ తాత్కాలిక ఉపశమనంగా చిన్న సన్నకారు రైతులు– పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ళు, కూరగాయల పెంపకం వంటివాటితో అదనపు ఆదాయం పెంచుకోవాలని సభల్లోనే బహి రంగంగా కోరేవారు. రాష్ట్ర విభజన తర్వాత తన తండ్రి ఆలోచన నుంచి– ఆ ‘లైన్’ స్ఫూర్తిగా తీసుకుని, గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో కొత్తగా– ‘ఫుడ్ ప్రాసె సింగ్ ఇండస్ట్రీ’ శాఖను ప్రారంభించారు. ‘కాటన్ తర్వాత భూమి...’ ఒక ఆరంభం అనుకుంటే, ‘గోదావరి మండలంలోని రెండు జిల్లాల్లోని ప్రముఖ ‘ఆగ్రో–ఇండస్ట్రీస్’ కంపెనీల కారణంగా, ఇప్పటికంటే మరింత మేలైన మానవీయ కేంద్రిత స్థిమిత స్థితిని సామాజిక పర్యావరణంగా ఒకప్పుడు ఇక్కడ చూడగలిగాము. అయితే, ‘అటోమెషన్’ ‘కంప్యూటర్ల’ ప్రవేశం తర్వాత, ఉద్యోగులు/కార్మికుల సంఖ్య నియంత్రణతో... ఉపాధి వెతుకులాట కోసం మొదలైన పట్టణాల వలసల ప్రభావం తొలుత పంటలపైన, ఆ తర్వాత ఈ పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా పైనా కనిపించింది. సంస్కరణలు తర్వాత, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల దిగుమతుల్లో కేంద్రం తీసుకున్న వైఖరితో, మన ఆగ్రో పరిశ్రమల్లో సంక్షోభం చూశాం. సహకార చక్కెర మిల్లుల మూత ఈ పరిస్థితుల పర్యవసానమే! నిజానికి – ‘వ్యవసాయం దండగ...’ అనే ముగింపునకు వచ్చినప్పుడే, తదుపరి దశ గురించి పాలకుల్లో యోచన మొదలు కావాలి. అటువంటిది లేదు కనుకనే, గత ప్రభుత్వంలో 2014 జూన్‌లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో– ‘కాటన్ ఆనకట్ట కట్టిన తర్వాత, రైస్ మిల్లులు పెట్టడం తప్ప మీరు ఏం చేశారు?’ అని అప్పటి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కానీ 1952 నాటికే తణుకులో ‘ఆంధ్ర షుగర్స్’, ఆ తర్వాత ఏలూరులో ‘అన్నపూర్ణ పల్వరైసెస్’ వంటివి మొదలయ్యాయి. రవాణాకు గ్రాండ్ ట్రంక్ రోడ్, కోరమండల్ రైల్వే లైన్, విశాఖపట్టణం, కాకినాడ పోర్టుల అందుబాటును ఈ ప్రాంత– ‘ఆంట్రప్రెన్యూర్లు’ గరిష్ట స్థాయిలో వినియోగించుకున్న కాలం ఒకటి వుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఏలూరులో జనుము ఉత్పత్తులు, తాడేపల్లి గూడెంలో వంట నూనెలు ఉత్పత్తి చేశారు. ఈ నేపథ్యమే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడానికి కారణం అయింది. (చదవండి: మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?) ఈ ప్రాంత తదుపరి దశ గనుక– ‘డిజిటలైజేషన్’ అయితే, భూమిని నమ్ముకుని దిగువన మిగిలిపోతున్న వర్గాల సాగుబడికి, వారి పిల్లల ఉపాధికి దారేది? అనే ప్రశ్నకు మాత్రం జవాబు లేకుండానే, విభజిత ఏపి తొలి ఐదేళ్ళు ముగిసింది. ఇలా ఎటువంటి దిక్సూచి లేని స్థితిలో, తన ప్రభుత్వానికి కొత్త దారులు తానే వేసుకునే తప్పనిసరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇందుకు మేలైన మానవ వనరులు అవసరం కనుక, విద్య, వైద్యం, వ్యవసాయం మీద దృష్టి తప్పలేదు. విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ఉపాధి వనరులు సృష్టించే వరకు, వివిధ వర్గాలకు తొలుత నగదు చెల్లింపు వంటి– ‘ఊతం పథకాలు’ తప్పలేదు. అయితే– ‘కరోనా’ దాన్ని అనివార్యం చేసి కొనసాగించేట్టుగా చేసింది. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) అదే సమయంలో మరో అర్ధ శతాబ్ది అవసరాలకు సరిపడిన– ‘ఎకో సిస్టం’ లక్ష్యంగా, ఈ ప్రభుత్వ ప్రణాళికలు వాగ్దానపూరితంగా కనిపిస్తున్నాయి. ఇందుకు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన– ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’ని చూడవలసి వుంటుంది. (చదవండి: మా కోరిక వికేంద్రీకరణే!) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యా -
ఆయిల్ పామ్.. పెట్టుబడుల బూమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ రంగం విస్తరించబోతోంది. ఇందుకోసం రాష్ట్ర సర్కారు మంచి ప్రణాళికలు వేస్తోంది. దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే కార్యాచరణతో ముందుకు సాగుతోంది. వచ్చే నాలుగైదేళ్లలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచి ఈ రంగంలో రూ. 3,750 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు చర్యలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 55 వేల మందికి ఉపాధి లభించనుందని ఆయిల్ ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్టరీలు, నూనె తీత తదితరాలతో ఏడాదికి రూ. 400 కోట్ల జీఎస్టీ ప్రభుత్వానికి సమకూరనుందని అంచనా. తొలుత 26 జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాల్లో.. దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తులు పేరుకుపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కొన్నాళ్లుగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగా మంచి లాభాలు పొందే అవకాశమున్న పామాయిల్ వైపు రైతులను మళ్లిస్తోంది. మున్ముందు రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని ప్రణాళిక వేసింది. తొలుత 26 జిల్లాల్లో సుమారు 9.49 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 11 ఆయిల్ పామ్ కంపెనీలకు జోన్లను కేటాయించింది. 2022–23 సంవత్సరంలో 5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టాలని కంపెనీలను ఆదేశించింది. ఆయిల్ ఫెడ్‌కు 1.80 లక్షల ఎకరాలు, ప్రీ యూనిక్ కంపెనీకి లక్ష ఎకరాలు, రుచి సోయాకు 40 వేల ఎకరాలు, ఇతర కంపెనీలకు మిగిలిన భూముల జోన్లను కేటాయించింది. ఆ ప్రకారం కంపెనీలు వచ్చే మూడు, నాలుగేళ్లలో పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ నూనె వినియోగం 4 లక్షల టన్నులు కాగా 45 వేల టన్నులే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. 5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు పెంచి ఫ్యాక్టరీలను స్థాపిస్తే రూ. 7,400 కోట్ల విలువైన 7.4 లక్షల టన్నుల పామాయిల్ ఉత్పత్తి కానుంది. దిగుమతికి బదులు ఎగమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంటుంది. 25 క్రషింగ్ యూనిట్లు.. 3,750 కోట్ల పెట్టుబడులు సర్కారు ప్రణాళికలో భాగంగా కంపెనీలు మొదట 25 క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో ఫ్యాక్టరీకి రూ. 150 కోట్ల చొప్పున రూ. 3,750 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక పామాయిల్ పంట భూముల్లో ఏకంగా 50 వేల మందికి ఉపాధి లభించనుందని. మరో 2,500 మందికి పామాయిల్ రవాణా రంగంలో ఉపాధి దొరుకుతుందని ఆయిల్ ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రైతులకు పామాయిల్ సాగుతో లక్షలాది రూపాయల ఆదాయం సమకూరనుంది. రాష్ట్రంలో ఓ రైతు 33 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నాడని, అతనికి ఏడాదికి రూ. 45 లక్షల ఆదాయం వస్తోందని ఆయిల్ ఫెడ్ చెప్పింది. రూ. 750 కోట్లతో రిఫైనరీలు పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీల్లో క్రూడాయిల్ బయటకు తీస్తారు. దాన్ని రిఫైన్ చేసి పామాయిల్ వంట నూనె తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి క్రషింగ్ ఫ్యాక్టరీ వద్ద ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీని నెలకొల్పాలి. ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీ కోసం రూ. 30 కోట్ల చొప్పున రూ. 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. అటు పెట్టుబడులు.. ఇటు ఉద్యోగాలు పామాయిల్ రంగంలో క్రషింగ్ ఫ్యాక్టరీల వల్ల వచ్చే మూడేళ్లలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇందులో ఆయిల్‌ఫెడ్ ద్వారానే రూ. 750 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నాం. దీంతో ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా భర్తీ కానున్నాయి. – సురేందర్, ఎండీ, ఆయిల్‌ఫెడ్ -
అమ్మకానికి మరో ఆరు సంస్థలు... కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల (సీపీఎస్ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకోసం డిసెంబర్–జనవరిలోగా ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం ఈ విషయాలు తెలిపారు. ‘దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఏడాది 5–6 సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ చూడబోతున్నాం. బీపీసీఎల్ మదింపు ప్రక్రియ జరుగుతోంది. దీనితో పాటు బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, ఎన్ఐఎన్ఎల్ ఆర్థిక బిడ్లను డిసెంబర్–జనవరిలోనే ఆ హ్వానించవచ్చు’ అని ఆయన వివరించారు. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఉండవచ్చని చెప్పారు. సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు. అటు విమానయాన సంస్థ ఎయిరిండియాను డిసెంబర్‌లోగా కొనుగోలుదారుకు అప్పగించడం పూర్తవుతుం దని పేర్కొన్నారు. వేలంలో సుమారు రూ. 18,000 కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ సంస్థ టాలేస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిం డియా విక్రయం పూర్తవడంతో సీపీఎస్ఈల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాగలదని పాండే చెప్పారు. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా సహకారం అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రూ.9,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ లిస్టింగ్‌పై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. రిస్కులు తీసుకోండి సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేయండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించండి పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు న్యూఢిల్లీ: కరోనాపరమైన సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిస్కులు తీసుకోవాలని, సామర్థ్యాల పెంపుపై మరింతగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను, టెక్నాలజీని ఇచ్చే భాగస్వాములతో చేతులు కలపడంలోనూ భారతీయ పరిశ్రమ మరింత జాప్యం చేయొద్దని కోరుతున్నాను’ అని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ తెలిపారు. దేశీయంగా తయారీ కోసం విడిభాగాలు, పరికరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సమస్యేమీ లేదని.. కాని పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల రిస్కులు ఉన్నందున.. దీనిపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. ‘మన దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు, కొన్ని కమోడిటీలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది, దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం సరైనదేనా? దిగుమతులకు మనం తలుపులు మూసేయడం లేదు. కానీ మొత్తం ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా. ఇలాంటి అంశాలను మనం పునరాలోచించుకోవాలి’ అని మంత్రి చెప్పారు. ఆదాయ అసమానతలు తగ్గించాలి .. ఆదాయ అసమానతలను తగ్గించేలా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫినిష్డ్ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమకు నిర్మలా సీతారా>మన్ సూచించారు. వృద్ధికి ఊతమివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశీ పరిశ్రమ మరింతగా రిస్కులు తీసుకోవాలని, దేశానికి ఏం కావాలన్నది అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన చట్టాలను తీసివేయడంతో ఆగటం కాకుండా .. పరిశ్రమకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలంటూ ప్రతి శాఖ, విభాగానికి ప్రధాని సూచించారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ భేష్.. బ్యాంకింగ్ రంగం విశేష స్థాయిలో కోలుకుందని, రికవరీలు పెరిగే కొద్దీ మొండి బాకీలు క్రమంగా తగ్గడం మొదలైందని సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాయని, ప్రభుత్వంపై ఆధారపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రోగ్రాం కింద దీపావళితో ముగిసిన మూడు వారాల్లో నాలుగైదు వర్గాల వారికి బ్యాంకులు ఏకంగా రూ. 75,000 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వర్ధమాన దేశం అత్యం వేగంగా కోలుకోవడంతో పాటు రెండంకెల స్థాయికి దగ్గర్లో వృద్ధి రేటును అందుకోవడం సాధ్యమేనంటూ ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్ చంపారన్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు. -
ఛత్రీనాక పేలుడు ఘటన: ట్విస్ట్ ఏంటంటే..
హైదరాబాద్: ఛత్రీనాక పీఎస్ పరిధి కందికల్ గేట్ వద్ద గురువారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బెంగాల్‌కు చెందిన విష్ణు,జగన్నాథ్‌లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులని పోలీసులు తెలిపారు. అయితే, ఈ పేలుడులో కొత్తకోణం బయటపడింది. యువకులు గుంతలో టపాసులతోపాటు కెమికల్స్‌ను పెట్టి కాల్చడం వల్ల పేలుడు సంభవించిందని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణాసంచా కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని ఏసీపీ మజీద్ తెలిపారు. -
ఊరంతా ఉపాధి.. ఇత్తడి ఖజానా అజ్జరం
టంగ్.. టంగ్.. టక్కుంటక్కుం.. అంటూ లయబద్ధంగా వినిపించే శబ్దాలు.. ఏ ఇంటి ముంగిట చూసిన ఇత్తడి సామగ్రి, కళాకృతుల మెరుపులు.. అజ్జరం ప్రత్యేకం.. సాధారణంగా ఏ ఊరిలోనైనా వర్ణాలను అనుసరించి వృత్తులు చేయడం పరిపాటి. అయితే ఈ గ్రామంలో మాత్రం అన్ని వర్ణాల వారూ కలిసి ఇత్తడి సామాన్ల తయారీని వందల ఏళ్లుగా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దీంతో అజ్జరం ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. గంటల తయారీలో ప్రత్యేకతతో ప్రతి ఆలయంలోనూ ‘అజ్జరం గంట’ మోగాల్సిందే అన్నట్టుగా నిలిచిపోయింది. పెరవలి: దాదాపు 200 ఏళ్ల నుంచి అజ్జరంలో ఇత్తడి సామగ్రి పరిశ్రమ ఉంది. నాడు చేతి పనిముట్లతో వస్తువులు తయారు చేయగా ప్రస్తుతం యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ ఆలయాల్లో మార్మోగుతున్నాయి. గ్రామ జనాభా 2,957 మంది కాగా 2,500 మంది ఇత్తడి సామాన్ల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఇత్తడి పని తప్ప మరే పని తెలియదంటే అతిశయోక్తి కాదు. తరతరాలుగా సామగ్రి, కళాకృతుల తయారీలో వీరు నైపుణ్యం కనబరుస్తుండటంతో గ్రామంలో ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. అజ్జరంలోని ఇత్తడి పరిశ్రమలో బిందెలను తయారుచేస్తున్న కార్మికులు గంటలు ప్రత్యేకం ఇత్తడితో పలురకాల సామగ్రిని తయారుచేస్తున్నా ఆలయాల్లో గంటల తయారీతో వీరి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను వీరు తయారు చేసి రికార్డు సృష్టించారు. ఇత్తడి గంటల తయారీలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇత్తడి అంటే అజ్జరం.. అజ్జరం అంటే ఇత్తడి.. అన్నట్టుగా పేరు సంపాదించారు. పట్టణాల్లో దుకాణదారులు ‘అజ్జరం వారి ఇత్తడి షాపు’ అని పేరు పెట్టుకుని వ్యాపారులు సాగిస్తున్నారు. మెరుగులు దిద్దుతూ.. 200 ఏళ్ల అనుబంధం అజ్జరానికి ఇత్తడితో అనుబంధం 200 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో ముడిసరుకులను కలకత్తా, మద్రాసు నుంచి తీసుకువచ్చి ఇక్కడ వస్తువులు తయారుచేసేవారు. ప్రస్తుతం ఇక్కడే ఇత్తడి రేకులు తయారుచేసి రాష్ట్ర నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా పనులు చేస్తున్నారు. వేకువజామున పని మొదలుపెట్టి రాత్రి వరకూ పనులు చేస్తూనే ఉంటారు. ఇత్తడి బిందెలు, బకెట్లు, పల్లెం, చెంబు, గంగాళా, డేగిసా, పప్పు గిన్నెలు తదితర పెళ్లి సామగ్రి కోసం రాష్ట్ర నలుమూలల నుంచి అజ్జరం వస్తుంటారు. దీంతో గ్రామ ఖ్యాతి దశదిశలా విస్తరించింది. తరతరాలుగా.. మా తాత పేరలింగం, తండ్రి సాంబమూర్తి ఇదే పనిచేసేవారు. నేనూ ఇదే పనిలో ఉన్నాను. 20 ఏళ్ల క్రితం చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ పనికి వచ్చేవారు. తర్వాత కాలంలో చిన్న పిల్లలు పనికిరాకపోవడంతో పనినేర్చుకునే వారు తగ్గారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను ప్రత్యేకంగా తయారుచేస్తున్నాం. ఈ గంటలు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు అందించాం. అమెరికా కూడా పంపించాం. ఈ మధ్య కాలంలో యంత్రాలపైన తయారీ ఎక్కువయ్యింది. – బొప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని చిన్నప్పటి నుంచీ.. పుట్టినప్పటి నుంచి ఈ పనిలోనే ఉన్నాను. పని పూర్తిగా ఉండటంతో కుటుం బాన్ని ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇటీవల మిషన్లు రావటంతో పనికి డిమాండ్ తగ్గింది. దీని వలన కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. – పాటి సత్యనారాయణ, వర్కర్ తండ్రి ద్వారా.. నా తండ్రి ద్వారా ఈ పని అబ్బింది. పనిని ఇష్టంగా చేస్తాం. మా వద్దకు వచ్చిన కస్టమర్లు మా పనిచూసి ఎంతో అందంగా ఉందని ప్రశంసించినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈ పనిలోనే హాయి ఉంది. – నున్న వీరవెంకట సత్యనారాయణ, వర్కర్ ఇదే జీవనోపాధి మేము నాయీబ్రాహ్మణులమైనా ఇత్తడి పనినే జీవనోపాధిగా ఎంచుకున్నాం. మిషన్లు రావటంతో పని నేర్చుకునేవారు తక్కువైపోయారు. దీంతో ఈ పని మా తరంతోనే అంతరించిపోతుందేమోనని అనిపిస్తోంది. – బొజ్జొరి బాలరాజు, వర్కర్ 40 ఏళ్లుగా.. 40 ఏళ్లుగా ఈ పనిచేస్తు న్నా. గ్రామంలో అందరూ ఇదే పని చేస్తుంటాం. ఇతర వ్యాపారాలు ఏమీ తెలియవు. ఇటీవల యంత్రాల రాకతో పని నేర్చుకునేవారు తగ్గారు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియలేదు. – యడ్ల పోతురాజు, వర్కర్ -
సినిమా పరివార్!
‘ఇండస్ట్రీ’ అంతా మా కుటుంబమే అని చెబుతుంటారు సినిమా వాళ్లు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఉద్ఘాటన చేస్తూనే ఉంటారు. అదొక సంఘీభావం. మంచిదే. ఈ సినిమా కుటుం బంలో సభ్యులెవరు? దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు వగైరా వగైరా. వీళ్లు గాక సినీ నిర్మాణం కోసం ‘లైట్లెత్తే’ బాయ్స్ సహా చాలామంది శ్రమజీవులుంటారు. వీళ్లందర్నీ 24 క్రాఫ్టుల ‘బంగారం’గా గుర్తించి కుటుంబ సభ్యత్వం కల్పించిన వ్యక్తి దాసరి నారాయణరావు. సినిమా పరివారం ఎల్లలు ఇంతవరకేనా? ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన మైలురాళ్లను దాటి విస్తరించిన కుటుంబం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధిం చినంతవరకైతే తెలుగు ప్రేక్షకులందరూ సినిమా కుటుంబ సభ్యులే. ఎదుగుతున్న నాటక రంగాన్ని బలిపెట్టి మరీ సినిమా రంగాన్ని పోషించింది తెలుగు సమాజం. ఈ రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఉత్తర భారత దేశమంతటా కలిపి ఎన్ని థియేటర్లున్నాయో ఈ రెండు రాష్ట్రా ల్లోనే అన్ని ఉన్నాయట. సినిమా అభిమానం బాగా ఎక్కువ నుకునే తమిళనాడుతో పోల్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వెయ్యి సినిమా హాళ్లు ఎక్కువుండేవి. ఇతర రాష్ట్రాల్లో నాటక రంగం ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడో ఒకసారి చిన్న మూలుగు వినిపి స్తుంది, అంతే. తెలుగు ప్రజలకున్న అపార సినిమా అభిమానం అందుకు కారణం. కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు గదా! పెంచి పోషించిన తల్లి దండ్రులు కూడా కుటుంబ సభ్యులే. అలాగే ప్రత్యేక శ్రద్ధతో తెలుగు సినిమాను పెంచి పోషించిన ప్రేక్షకులంతా సినిమా పరివారమే. మన సినిమా ఒక విస్తారమైన కుటుంబమని గుర్తిస్తే, సభ్యులైన ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గణించుకోవాలి. కొన్ని వేలమందికి అన్నం పెట్టే ‘పరిశ్రమ’ కనుక, సినిమాను ఒక వ్యాపారం అనుకుందామా? అయితే ఈ వ్యాపారంలో మేజర్ స్టేక్హోల్డర్లు ప్రేక్షకులు. వారిపై ఏకపక్షంగా రుద్దజూసే నిర్ణయాలు చెల్లవు. సినిమాను ఒక కళగా మాత్రమే భావిద్దామా? కళ కళ కోసమే తప్ప కాసుకోసం కాదని చాలామంది కళాస్రష్టలు భావిస్తారు. జగత్ ప్రసిద్ధ ఫిలిమ్ మేకర్ వాల్డ్డిస్నీ ఒక మాటన్నారు. ‘నేను డబ్బులు సంపాదించడం కోసం సినిమా తీయను. సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదిస్తా’. సినిమాను కళగా భావించే వారికి ఇదొక సందేశం. సినిమాపై డిస్నీ సంతకం ఇంకెన్నాళ్లకయినా చెరిగి పోతుందా? కాసుల పొడ సోకనీయని శుద్ధ సృజనాత్మక ఆలోచనలు మన వాళ్లలోనూ ఉండేవి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూనే బమ్మెర పోతన కవి ‘ఆంధ్ర మహాభాగవత’ కావ్యాన్ని పూర్తి చేశారు. రాజులకు అంకితం ఇస్తే దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చని సన్నిహితులు సలహా ఇస్తారు. కానీ, పోతన ససేమిరా అంటాడు. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజిం చుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల కౌ / ద్దాలికులైననేమి? నిజ దార సుతోదర పోషణా ర్థమై’ అని ఈసడించుకుంటాడు. కోమలమైన మహాభాగవత కావ్యాన్ని దుర్మార్గులైన రాజులకు అంకితం చేయడం కంటే వ్యవసాయం చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించడం మేలంటాడు పోతన. ఇదీ విశుద్ధ కళా ప్రకటన, భక్తి భావన. ఆనాటికి తెలుగు ప్రాంతాల్లో ఉన్న నాటక సమాజాలన్నీ వరసకట్టి మరీ నటీనటులనూ, రచయితలనూ, దర్శకులనూ, గాయకులను సినీరంగ ప్రవేశం చేయించాయి. వాటిలో ప్రముఖ మైనది ‘ప్రజానాట్యమండలి’. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనేది ఈ సంస్థ సిద్ధాంతం. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా నిర్మించి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎన్టీరామారావు కూడా సినిమాల్లోకి రాకముందు ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ అనే పేరుతో నాటకాలు వేసేవారు. సంస్థ పేరులోనే జాతీయ భావం ఇమిడి వున్నది. సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన ఇదే పేరుతో ప్రారంభించారు. అభ్యుదయ భావాలతో నాటకాలు వేసి, సినీరంగంలో ప్రవేశించిన వారి ప్రభావం ఫలితంగా తొలి రోజుల్లో అనేక సందేశాత్మక, కళాత్మక విలువలున్న తెలుగు సినిమాలు తయారయ్యాయి. ఇవి వాణిజ్యపరంగా కూడా ఘన విజయాలను నమోదు చేశాయి. 1950వ, 60వ దశకాలను తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చాలామంది భావిస్తుంటారు. ఆర్థికంగా నష్టపోయే సినిమాల శాతం ఇప్పటికంటే చాలా తక్కువ. నిర్మాణ వ్యయం అదుపులో ఉండేది. సినిమా తారాగణం, కథాబలం, దర్శకుడు, బ్యానర్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు వసూలు చేయగలదో అంచనా వేసుకునేవారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ వ్యయం ఉండేది. అప్పట్లో సూపర్‌స్టార్స్‌గా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ల పారితోషికాలు కూడా నిర్మాణ వ్యయంలో ఐదు నుంచి పది శాతంలోపే ఉండేవని చెబుతారు. ఈ తరహా పొదుపు బడ్జె ట్లతోనే నాటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ తెలుగు సినిమా ఏది? అప్పటికీ, ఇప్పటికీ మార్కెట్‌నూ, డబ్బు విలు వనూ బేరీజు వేసుకొని చూస్తే ‘లవకుశ’ను మించిన పెద్ద హిట్ లేదట. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల జనాభా ఇప్పటి జనాభాలో సుమారు 40 శాతం లోపే. రవాణా సౌకర్యాలు లేవు. రహదారులు చాలా తక్కువ. దూరంగా ఉండే టౌన్లకే సినిమా హాళ్లు పరిమితం. అయినా కూడా అప్పటి జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ సినిమాను చూశారని అంచనాలున్నాయి. పావలా నేల టికెట్ దగ్గర్నుంచి రూపాయి సోఫా టికెట్ దాకా అన్ని తరగతుల చిల్లర శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించింది. ఎక్కువ శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం ఈ స్వర్ణయుగం ప్రత్యేకత. 1963లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 13 సినిమాలు విడుదలైతే అందులో 7 శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. శతదినోత్సవం జరుపుకోవడం అంటే సినిమా సూపర్ హిట్ అయినట్టు! ఇదే ట్రెండ్ కొన్నేళ్ళు కొనసాగింది. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత దిగ్గజ దర్శకులైనా, వారు ఎంత గొప్ప విజయాలను సాధించినా కూడా అడ్డగోలు పారి తోషికాలను డిమాండ్ చేయలేదు. ఫలితంగా నిర్మాణ వ్యయం అదుపులో ఉండి లాభాలు గడించిన కారణంగా తెలుగు సినిమా వేలాదిమందికి ఆశ్రయం కల్పించి ‘ఇండస్ట్రీగా’ గుర్తింపు పొందింది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. టాప్ ఫైవ్ తెలుగు సినిమాల పేర్లు చెప్పమని ఏ తెలుగువాణ్ణి అడిగినా అందులో కచ్చితంగా చెప్పే పేరు – ‘మాయాబజార్’. ఆ జనరంజక చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా స్వర్ణయుగ వైతాళికుల్లో ఒకరు. ఈ సినిమా కంటే ముందే అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా ‘పాతాళభైరవి’ని ఆయన మలిచారు. దాదాపు ఒక డజన్ అపురూప దృశ్యకావ్యాలు ఆయన అందిం చారు. సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత తన కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించవలసిన సందర్భం వచ్చింది. అందుకయ్యే ఖర్చు కోసం ఆయన ఇబ్బంది పడ్డారట. విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు తాను సర్దుబాటు చేయడానికి ముందుకొచ్చారు. ‘నీకు తెలుసు కదా రామారావ్, నేను ఎవరి దగ్గరా ఊరికే తీసుకోను’ అని కేవీ రెడ్డి తిరస్క రించారు. ‘ఊరికే వద్దు నాకో సినిమా తీసిపెట్టండ’ని ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చారు. అలా వచ్చింది ‘శ్రీకృష్ణ సత్య’. దర్శకుడిగా కేవీ రెడ్డి కమిట్మెంట్నూ, ఫోకస్‌ను చెప్ప డానికి, సినిమా బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండే ఆనాటి పారితోషికాలను గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. నటులైనా, దర్శకులైనా డబ్బులు సంపాదించకుండా ఇబ్బం దులు పడాలని కాదు. అయితే నిర్మాణ వ్యయం అదుపు తప్పని విధంగా ఏదో రకమైన బ్యాలెన్స్‌ను పాటించడం తప్పనిసరి.ఆ బ్యాలెన్స్ లేనప్పుడే ప్రేక్షకుల మీద అదనపు భారం మోప డమనే అవాంఛనీయ ఆలోచనలు ముందుకొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి వంటి నటులకూ, కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, కేఎస్ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, ‘విక్టరీ’ మధుసూదనరావు, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులకు జనంలో ఎంతో ఇమేజ్ వుండేది. ఆ ఇమేజ్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అప్పట్లో చేయలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా టికెట్ల వసూళ్ళపై వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కలెక్షన్లపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనే అనుమానంతో ఈ పద్ధతిని తీసు కొచ్చారు. ఈ పద్ధతి సినిమా వ్యాపారాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఓపెనింగ్స్ బాగా వుంటేనే సినిమా బతికి బట్టకట్టే పరిస్థితి వచ్చింది. ఓపెనింగ్స్ లేకపోయినా కథాబలంతో నోటి మాట ద్వారా పుంజుకునే అవకాశం ఉండే సినిమాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ‘శంకరాభరణం’ సినిమాయే శ్లాబ్ పద్ధతి తర్వాత విడుదలై ఉంటే ఏమయ్యేదో! శ్లాబ్ పద్ధతి చిరంజీవికి బాగా కలిసొచ్చింది. అప్పుడప్పుడే యువ ప్రేక్షకుల అభిమా నాన్ని చూరగొంటున్న చిరంజీవి బంపర్ ఓపెనింగ్స్‌తో దూసుకొని పోయాడు. ‘మెగాస్టార్’ అని పిలిచేంత వరకూ వెనక్కు చూడలేదు. ఇప్పటికీ అడపాదడపా చిరంజీవి నటిస్తూనే ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ల కాలాన్ని పోస్ట్ చిరంజీవి దశగానే పరిగ ణించాలి. ఈ దశలోనే నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. ఐదారు మంది దర్శకులు ఫిలిమ్ మేకింగ్‌లో కొత్త పుంతలు తొక్కారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, కొరటాల శివ తదితరులకు నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతులు తోడవుతున్నారు. మార్కెట్ విస్తరణకు తెలుగు సినిమా నడుం కట్టింది. ఇంత వరకూ స్వాగతిద్దాం. కానీ నిర్మాణవ్యయం పట్టాలు తప్పింది. ఆర్థికంగా విజయాలు సాధిస్తున్న సినిమాలు ఏటా పది శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ప్రీ–కోవిడ్ లెక్క. సినిమా రంగం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఒక అరడజను మంది స్టార్ హీరోలున్నారు మనకు. మరో అరడజను మంది పెద్ద డైరెక్టర్లున్నారు. వీళ్ల సినిమాలన్నీ తెలుగు మార్కెట్ తట్టుకోలేనంత భారీ బడ్జెట్ సినిమాలే. ఈ బడ్జెట్లో యాభై శాతానికిపైగా హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషనే! మిగతా బడ్జెట్లో ఒక పావలా ఇతరుల రెమ్యునరేషన్.ఒక పావలా నిర్మాణవ్యయం. షూటింగ్ జరిగే ప్రదేశంలో ఆరేడు క్యారవాన్ బస్సులుండటం పరిపాటి. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ముఖ్యులం దరికీ ఈ సౌకర్యం ఉండాలి. ఇదొక స్టేటస్ సింబల్. షూటింగ్ విరామంలో స్టార్లు ఈ ఏసీ బస్సుల్లో విశ్రాంతి తీసుకుంటారు. షూటింగ్ జరిగే భవంతుల్లో ఏసీ గదులున్నాసరే ఈ క్యారవాన్లు ఉండి తీరాల్సిందే. పెద్ద నటీనటుల వెంట వారి బంధుమిత్ర పరివారం కూడా ఉంటుంది. వారందరికీ అతి«థి సేవలు తప్పనిసరి. ఈ పరివారానికి స్టార్ హోటళ్ల నుంచి క్యారియర్లు తెప్పించాలి. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇమేజ్ను పెంచడం కోసం, దర్శకుని ప్రతిభను చాటడం కోసం తీసే కొన్ని సీన్లుంటాయి. ఇవి లేకున్నా కథనంలో ఏ లోపం ఉండదు. కానీ ఉంటాయి. ఈ దుబారా ఖర్చునంతా వసూలు చేసుకోవడానికి నిర్మాతలు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే విడుదలవడం మొద టిది. చిన్న సినిమాలు విడుదలవడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది– జనం మీద అడ్డగోలు బాదుడు! మొదటి వారం రోజులపాటు అదనపు షోలు నడిపించి ప్రేక్షకుల దగ్గర ఐదింతల నుంచి పదింతల వరకు వసూలు చేయడం! ఒకప్పుడు థియేటర్ల బైట బ్లాక్టికెట్లమ్మే వ్యవస్థ, పోలీసు అరెస్టులుండేవి. కానీ, ఇప్పుడు అనధికారిక అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు అంటే, ఏకంగా థియేటర్లలో బుకింగ్‌లోనే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్టు లెక్క! చూడదలుచుకున్న ప్రేక్షకులంతా వారం లోపే చూసెయ్యాలి. లేదంటే సదరు సినిమా ఎన్నాళ్లు ఆడు తుందో గ్యారంటీ లేదు. థియేటర్లన్నీ కొద్దిమంది గుత్తాధి పత్యంలో ఉన్నందువల్ల స్టార్ హీరోల సినిమాలకే వాటిని అంకితం చేస్తున్నారు. చిన్న సినిమాలు తీసినవారు ఆ సినిమాల విడుదల కోసం పడుతున్న బాధలు దేవుడెరుగు. స్టార్ పరివారాల క్యారవాన్ల కోసం, భోజనం క్యారియర్ల కోసం, సినిమా ప్రొడక్షన్ దుబారా కోసం, హీరోల భారీ పారి తోషికం కోసం సామాన్య ప్రజలు చందాలివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీద ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఒక లాజికల్ ముగింపునకు చేరుకునేంత వరకు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వ నియంత్రణలో ‘ఆన్లైన్ టికెటింగ్’ అనే అంశం ముందుకొచ్చింది. అట్లాగే ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. పాత విధానాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ సంస్కరణలు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. పవన్ కల్యాణ్‌కు కూడా అందుకే కోపం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ ప్రభుత్వంలోని మంత్రులు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. అది వేరే కథ. స్టార్ అంటే నక్షత్రం. అది వెలుగునివ్వాలి. నక్షత్రకుడంటే వెంటపడేవారు, వేధించేవాడు. స్టార్స్ వెలుగులు వెదజల్లు తుంటే నవీన్ పొలిశెట్టి లాంటి నటులు పదుల సంఖ్యలో వస్తారు. ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం, పలాస, పెళ్లిచూపులు’ వంటి సినిమాలు ప్రవాహంలో వచ్చి పడి తెలుగు సినిమాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయి. ఒకవేళ స్టార్లు నక్షత్రకులుగా మారితే... ‘స్టార్స్’ను వెలిగించిన ప్రేక్షకులే నక్షత్రకులను వదిలించుకుంటారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బతుకు చిత్రం :పాదరక్షల తయారీ పరిశ్రమల్లో వేలాదిమందికి ఉపాధి
-
ప్రభుత్వం – పరిశ్రమ మధ్య విశ్వాసం ఉండాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి పరిస్థితుల్లో తెరపైకి వచి్చన కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. ప్రభుత్వం, పరిశ్రమ మధ్య నమ్మకం కీలకమైన అంశంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు టీకాల ప్రక్రియను వేగవంతం చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగం తోడ్పాటుతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు సహా అన్ని చోట్లా ఆరోగ్య సంబంధ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంని ఆమె చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అండ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ మొదలైనవి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించగలవని ఆమె తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ యథాప్రకారం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ఫిక్కీతో సమావేశం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వాణిజ్య మండలి ఫిక్కీతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఇందులో 50 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఎన్నో అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇండియా సిమెంట్స్ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. చైనా తర్వాత సిమెంట్ తయారీలో భారత్ అతిపెద్ద దేశంగా ఉందని గుర్తు చేశారు. భారత్‌లో సగం మేర సిమెంట్ దక్షిణాదిలోనే తయారవుతోందని.. మౌలిక సదుపాయాల రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టనున్న దృష్ట్యా దేశంలోని ఇతర ప్రాంతాలకూ సిమెంట్ తయారీ విస్తరణ అవసరాన్ని ప్రస్తావించారు. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధర గణనీయంగా పెరిగిపోవడాన్ని చర్చకు తీసుకువచ్చారు. తోలు పరిశ్రమలో ఎంఎస్ఎంఈలే ఎక్కువగా ఉన్నందున.. వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్ తర్వాత కూడా కొనసాగించాలని ఫిక్కీ తమిళనాడు ఎగ్జిమ్ ప్యానెల్ కన్వీనర్ ఇర్షద్ మెక్కా కోరారు. దీంతో అన్ని అంశాలపైనా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్
ముంబై: ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మంచి వృద్ధిని చూస్తుందని.. కంపెనీల ఆదాయం 20–23 శాతం పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీ ఆటోమొబైల్ రంగం కోలుకోవడానికి తోడు, ఎగుమతులు సైతం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది. అయితే, కీలక ముడి సరుకుల ధరలు అధికంగా ఉండడం, సెమీ కండక్టర్ల కొరత పరిశ్రమను వేధిస్తున్న అంశాలుగా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆటో విడిభాగాల పరిశ్రమ మంచి రికవరీని చూసినట్టు వివరించింది. ప్రయాణికుల వాహనాలు (పీవీ), ట్రాక్టర్లకు డిమాండ్ బలంగా ఉందని.. కరోనా ముందస్తు నాటి డిమాండ్ స్థాయికి చేరుకున్నట్టు నివేదికలో పేర్కొంది. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహనాల విభాగాలు సైతం కోలుకుంటున్న సంకేతాలను ఇస్తున్నాయని తెలిపింది. పెరిగిన ముడి పదార్థాల ధరలను బదలాయించినట్టయితే ఇది కూడా ఆదాయ వృద్ధికి తోడ్పడే అంశమేనని పేర్కొంది. పరిశ్రమ స్థూల మార్జిన్లు 2021–22 మొదటి మూడు నెలల్లో సీక్వెన్షియల్‌గా (మార్చి త్రైమాసికం నుంచి) మెరుగుపడినట్టు.. నివేదికలో వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే... చదవండి : ఫేస్బుక్ సమర్పించు....వరల్డ్రూమ్ ♦పరిశీలనలోకి తీసుకున్న 50 ఆటో పరికరాల విభాగాలను తీసుకుంటే, వార్షికంగా క్యూ1లో పటిష్ట స్థాయిలో 140 శాతం వృద్ధి నమోదయ్యింది. లో–బేస్ ఎఫెక్ట్ నామమాత్రంగా ఉంది. ♦సీక్వెన్షెయల్గా చూస్తే, (మార్చి త్రైమాసికంతో పోల్చి) సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, క్షీణత 19 శాతానికి పరిమితమైంది. అంచనాలు 30 నుంచి 35 శాతం క్షీణతకన్నా ఇది ఎంతో తక్కువ. ♦త్రైమాసికంగా 19 శాతం క్షీణతలోనూ టైర్లు, బ్యాటరీలు వంటి విడిభాగాల క్షీణత కేవలం 13కే పరిమితమైంది. ♦ కీలక ముడిపదార్థాలు, కమోడిటీ ధరలు తీవ్రంగా ఉండడం ప్రస్తుతం ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాలు. ♦గ్లోబల్ సెమీ కండక్టర్ డిమాండ్‌లో భారత్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ వాటా 11 శాతం. అయితే ఇప్పుడు వీటి కొరత పరిశ్రమకు సవాలుగా మారింది. ఈ విభాగంలో ఊహించినదానికన్నా పటిష్ట రికవరీ, కొన్ని సెమీ–కండక్టర్ తయారీ సంస్థల్లో సరఫరాల సమస్యలు, అంతర్జాతీయంగా పెరిగిన చిప్ కొరత సవాళ్లు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ♦పరిశ్రమలో సరఫరాల సవాళ్లు తొలగిపోలేదు. కొన్ని మోడళ్లు, వేరియెంట్లకు సంబంధించి సరఫరాలు నాలుగు నెలలకుపైగా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. డిమాండ్ పటిష్టంగా ఉన్నప్పటికీ సరఫరాలు అందుకు తగిన విధంగా లేవు. 2021 క్యాలెండర్ ఇయర్ వరకూ ఈ పరిస్థితి కొనసాగుతునందని పరిశ్రమ ప్రతినిధులు అంచనావేస్తున్నారు. ♦పరిశ్రమ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న అంశమిది. ♦కోవిడ్–19 సెకండ్‌వేవ్ వల్ల ఆటో విడిభాగాల సరఫరాదారుల్లో మెజారిటీ భాగం ఆపరేటింగ్ మార్జిన్లు తగ్గాయి. -
బాలానగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ పారిశ్రామికవాడలో గల ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రేరణి ఇండస్ట్రీస్ ప్లైవుడ్ గోదాములో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. -
దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఈ పరిశ్రమ నాలుగు రెట్లు పెరిగి రూ.1,100 కోట్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. క్రీడాకారుల్లో నైపుణ్యం, కోవిడ్‌తో ఇంటికే ఎక్కువ సమయం పరిమితం అవటం, మొబైల్ వినియోగం పెరగడం వంటివి పరిశ్రమ వృద్ధికి కారణాలని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఈ–స్పోర్ట్స్ పరిశ్రమ రూ.250 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా 46 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ మాదిరిగా కాకుండా ఈ–స్పోర్ట్స్ అనేది నైపుణ్యం కలిగిన ఆన్లైన్ ఆటలుగా పరిగణిస్తారు. జట్లుగా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీల రూపంలో టోర్నమెంట్లు, లీగ్‌లు ఆడి టైటిల్స్‌ను గెలుచుకుంటారు. 2025 నాటికి దేశీయ ఈ–స్పోర్ట్స్ పరిశ్రమలో క్రీడాకారుల సంఖ్య 15 లక్షలకు, 2.50 లక్షల జట్లకు చేరుతుందని తెలిపింది. ప్రస్తుతం 1.50 లక్షల మంది ప్లేయర్లు, 60 వేల బృందాలున్నాయి. ఇదే సమయంలో భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ ఏటా 66 శాతం వృద్ధి రేటుతో రూ.100 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ ప్రైజ్ మనీ భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ 0.6 శాతమే ఉందని.. 2025 నాటికి 2 శాతానికి చేరుతుందని తెలిపింది. ప్రేక్షకులు, ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ల సం ఖ్య పెరగడంతో ప్రకటనదారులు, ఏజెన్సీలు వ్యూ యర్షిప్ను చేరుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నా యని తెలిపారు. ఈ–స్పోర్ట్స్ ఆదాయంలో మెజారిటీ వాటా అయిన ప్రకటనల విభాగం 2025 నాటికి ప్రకటనల ఆదాయం నాలుగు రెట్ల వృద్ధితో రూ.650 కోట్లకు చేరుతుంది. టోర్నమెంట్ స్పాన్సర్షిప్, సిండికేషన్ విభాగాల ఆదాయం ఏటా 45 శాతం వృద్ధి రేటుతో రూ.350 కోట్లకు చేరుతుందని ఈవై ఇండియా పార్టనర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లీడర్ ఆశీష్ ఫెర్వానీ తెలిపారు. చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
ఇక్కడి బొమ్మలే కొందాం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయులు స్థానిక బొమ్మలపై మక్కువ పెంచుకోవాలని, ఈ రంగంలోని వారంతా దేశీయ బొమ్మలకు ‘గొంతుక’ కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో వినియోగిస్తున్న బొమ్మల్లో దాదాపు 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటున్నామని, వీటినే కొనడంతో వేలకోట్ల ధనం విదేశాలకు తరలిపోతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.7.5 లక్షల కోట్ల విలువైన ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ వాటా కేవలం రూ.11 వేల కోట్లమేరకే ఉందని ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వర్చువల్ వేదికగా జరిగిన టాయ్‌కాథాన్–2021లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. బొమ్మల ఆర్థిక వ్యవస్థ(టాయ్ ఎకానమీ–టాయ్‌కానమీ)లో భారత స్థానం మరింతగా మెరుగుపడాలని ఆయన అభిలషించారు. ఆట వస్తువుల తయారీ, గేమింగ్ పరిశ్రమల్లో ప్రపంచ విపణిలో భారత్ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఈ పరిశ్రమ దేశీయంగా వృద్ధిచెందితే సమాజంలో ఈ రంగంపై ఆధారపడ్డ వర్గాలకు మేలు జరుగుతుంది. గ్రామీణులు, దళితులు, పేద ప్రజలు, గిరిజనుల భాగస్వామ్యంతో దేశీయంగా చిన్నతరహా ఆట వస్తువుల పరిశ్రమ కొనసాగుతోంది. ఈ రంగంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. వీరందరి జీవితాలు మరింతగా వృద్ధిలోకిరావాలంటే మనందరం స్థానిక బొమ్మలనే కొందాం’అని మోదీ పిలుపునిచ్చారు. చదవండి: Narendra Modi: సహకారంతోనే సంస్కరణలు రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త! -
మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా ఉచితంగా కోవిడ్-19 టీకా ఇప్పించనున్నామని మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నామని చిరంజీవి తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండాలంటూ ఒక వీడియో సందేశాన్ని చిరంజీవి షేర్ చేశారు. 45 ఏళ్లు దాటిన వారిన సినీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మూడు నెలల పాలు అపోలో ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్యులను సంప్రదించే అవకాశంతోపాటు, మందులను కూడా రాయితీ ధరలకు అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చిరంజీవి తెలిపారు. గతేడాది కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరు దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. (రెమిడెసివిర్ అడిగిన దర్శకుడు: ఊహించని స్పందన) తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd — Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021 -
బొల్లారం అగ్ని ప్రమాదం: అదుపులోకి మంటలు
సాక్షి, హైదరాబాద్: వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలం నుండి వెళ్లిపోయిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లిపోగా, పరిశ్రమలో రెండు ఫైర్ బృందాలను అందుబాటులో ఉంచారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 3 బ్లాకులు కాగా, మొదటి బ్లాక్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ కావడంతో భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. (చదవండి: ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం) ప్రొడక్షన్ యూనిట్లో ఉన్నవారికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 8 మంది గాయపడగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 50 కి పైగా రీయాక్టర్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలో వివిధ ప్రముఖ కంపెనీల రా మెటీరియల్ తీసుకొని బల్క్ డ్రగ్స్ తయారు చేస్తారు. ప్రమాదంపై పోలీసులు, రెవెన్యూ, కెమికల్ ఇండ్రస్టీస్ ఇన్స్పెక్షన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇక హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్.. అయితే..) -
యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం అందిస్తాం
-
ఏపీలో సమగ్ర పరిశ్రమ సర్వే: గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేశామని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు కేంద్ర సంస్థలు అంగీకరించాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని అభినందించారని తెలిపారు. 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని ఆయన చెప్పారని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. (చదవండి: 3 ప్రముఖ సంస్థలతో ‘స్కిల్స్’పై ఒప్పందాలు) ‘‘డిసెంబర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్క్‌ని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. డిసెంబర్ 15 నాటికి భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు ప్రారంభిస్తామని’’తెలిపారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరల్డ్ క్లౌడ్ సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వర్క్ ఫ్రం హోమ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని’’ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: బాబోయ్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషనా..!) -
ఒకప్పటి స్టార్స్..ఇప్పుడు యాచిస్తూ..దయనీయంగా
చిత్ర పరిశ్రమ అనేది ఓ మాయా ప్రపంచం. బయటినుంచి చూసేవాళ్లకి అదో రంగులలోకం. ఏమీ లేని స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొందరుంటే ఎక్కడినుంచి మొదలు పెట్టారో తిరిగి అక్కడికే చేరేవాళ్లు మరికొందరుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్లు అయినవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవాలంటే మాత్రం కఠోర శ్రమ, గ్లామర్, అదృష్టం..ఇలా అన్నీ కలిసిరావాలి లేదంటే ఇండస్ట్రీలో నెగ్గుకురావడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్లుగా చలామణి అయినవాళ్లు ప్రస్తుతం చాలా సాదాసీధాగా జీవనం గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారి పేర్లు కనుమరుగైనట్లే ప్రస్తుతం ఎక్కడో దిక్కుతోచని, దయనీయమైన పరిస్థితుల్లో జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. అలనాటి బాలీవుడ్ స్టార్ల జీవితాలపై సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఓపీ నాయర్ మద్యం.. మనుషుల్ని, బంధుత్వాన్ని కూడా దూరం చేయగలదు. అలాంటి కోవలోకే వస్తారు. సంగీత దర్శకుడు ఓపీ నాయర్. మత్తుకు బానిసై కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు పనిచేసి ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపిన నాయర్ ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోహ్రాబ్రీన్ సినిమా ప్రపంచం అనగానే నిజంగానే సినిమాల్లో చూపించిన విధంగానే వాళ్లు కుటుంబాలతో సంతోషంగా ఉంటారనుకుంటాం. కానీ అది చాలా కొద్ది మందికే సాధ్యం. చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన జోహ్రాబ్రీన్ను ఆమె కొడుకు, కూతురు అనాధలా వదిలేశారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడి ప్రతీ పైసా పోగుచేసింది. చివరికి ఆమె చివరి క్షణాల్లో సైతం కుటుంబ సభ్యులు ఎవరూ చేరదీయలేదు. దీంతో అనాథ శవంలానే చనిపోయింది. పర్వీన్ బాబీ బాలీవుడ్ పరిశ్రమలో తన అందంతో అలరించిన నటి పర్వీన్ బాబీ. తీవ్రమైన డిప్రెషన్‌తో జనవరి 22,2005లో ముంబైలోని తన ఫ్లాట్‌లో కన్నుమూసింది. దారుణమేంటంటే.. ఆమె అంత్యక్రియలు జరపడానికి రెండు రోజుల వరకు కుటుంబసభ్యులు కానీ ఆత్మీయులు ఎవరూ రాలేదు. దీంతో చివరికి నిర్మాత మహేష్ భట్ ఆమె అంత్యక్రియలు జరిపించే బాధ్యతను తీసుకున్నాడు. మీనాకుమారి భారత చిత్ర పరిశ్రమలో ట్రాజెడీ క్వీన్‌గా పిలిచే మీనాకుమారి..తన జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో జీవితాన్ని ముగించింది. పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మీనా కుమారి మాత్రం తను ప్రేమించిన కమల్ అమ్రోహినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత భర్త వేరే మహిళలతో అక్రమ సంబంధాలు తెలిసి మీనా కుమారి గుండె పగిలేలా రోదించింది. చివరికి మద్యానికి బానిసై చనిపోయింది. రాజ్‌కిరణ్ కార్జ్ చిత్రంంలో రిషికపూర్‌తో పాటు నటించిన హీరో రాజ్‌కిరణ్‌కి కూడా మంచి పాపులారిటినే ఉండేది. అయితే తర్వాత కొన్నేళ్లకు ఆయన ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించకపోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాడేమో అనుకున్నారు. అయితే 2010లో అట్లాంటాలో మతిస్థిమితిం లేని వ్యక్తిలా కనిపించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ స్థితిలో ఆయన్ను చూసింది రిషికపూరే. మితాలి శర్మ భోజ్‌పురి నటిగా ఎంతో ప్రజాదరణ పొందిన నటి మితాలి శర్మ. ఇటీవల ముంబై వీధిల్లో యాచకురాలిగా కనిపించింది. అంతేకాకుండా దొంగతనాలకు పొల్పడుతూ రెండు సార్లు పోలీసులకు చిక్కింది. ఒకప్పుడు అగ్ర హీరోల పక్కన నటించిన మితాలి ఇప్పుడు యాచకురాలిగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. సినిమా ఆఫర్లను కొన్ని రిజెక్ట్ చేయడంతో మొత్తానికే ఆఫర్లు రావడం ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో కుంగిపోయింది. భగవాన్ దాదా ఖరీదైన కార్లు, బంగళాలు ఉన్న స్టార్ భగవాన్ దాదా పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఆయన నటించిన జమేలా, లాబెలా వంటి సినిమాలు దారుణంగా పరాజయం కావడంతో బంగ్లా నుంచి ముంబై మురికివాడలకు మారాల్సి వచ్చింది. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచారు. భరత్ భూషణ్ ఉత్తమ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన భరత్ భూషణ్ మీనాకుమారి లాంటి హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపారు. తర్వాత కొన్ని సంఘటనల ద్వారా విడిపోయారు. ఆ తర్వాత చివరికి ఆఫర్లు లేక ఫిల్మ్ స్టూడియోలో గేట్ కీపర్‌గానూ పనిచేశాడు. చివరకు అద్దె కట్టుకోలేక అదే ఇంట్లో మరణించాడు. గీతాంజలి నాగ్‌పాల్ ఎంతో మంది స్టార్లకు డిజైనింగ్ చేసిన సుప్రసిద్ధ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ గీతాంజలి నాగ్‌పాల్ ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ స్థాయికి ఎదిగింది. చివరికి డ్రగ్స్, మద్యానికి బానిసై ఆస్తులన్నీ కుప్పకూలిపోయాయి. దీంతో ఢిల్లీ వీధుల్లో యాచిస్తూ బతుకుతుంది. కొన్ని ఇళ్లలో పనిమనిషిగానూ పనిచేసింది. జగదీష్ మాలి ప్రముఖ ఫోటోగ్రాఫర్, నటి ఆండ్రామాలి తండ్రి జగదీష్ మాలి యాచిస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒకప్పుడు ఆయన తీసిన ఫోటోలకు తెగ క్రేజ్ ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల ఫోటో స్టూడియోను సైతం అమ్ముకొని యాచిస్తూ కనిపించాడు. ఈ స్థితిలో చూసిన నటుడు సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయం అందించాడు. -
పటిష్టంగా దేశ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో గత ఆరేళ్లుగా కేంద్రం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన వెబినార్‌లో పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: మంత్రి మాండవీయ నౌకాశ్రయాల్లో కార్గో హ్యాండ్లింగ్‌కు ఉపయోగపడే క్రేన్లు మొదలైన కీలక ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దేశీ కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అలాగే, ఔషధాల తయారీలో ప్రధానమైన ముడి పదార్థాల ఉత్పత్తి కూడా దేశీయంగా పెంచాలని, తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాంత సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
కరోనా; పెళ్లి పరిశ్రమకు అపార నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్డౌన్, దేశంలోని ఐదువేల కోట్ల డాలర్ల ‘పెళ్లి పరిశ్రమ’పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్డౌన్ కారణంగా దేశంలో ఎక్కువ పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. నామమాత్రపు ఏర్పాట్లు, పరిమిత కుటుంబ సభ్యులతో కొన్ని పెళ్లిళ్లు తూతూ మంత్రంగా కొనసాగాయి. మరికొన్ని పెళ్ళిళ్లు ఆన్లైన్ ద్వారా జరిగాయి, జరుగుతున్నాయి. పర్యవసానంగా పెళ్లిళ్లపై ఆధారపడి సగటు దినసరి కూలీల నుంచి మ్యారేజ్ హాళ్ల యజమానులు, ఈవెంట్ మేనేజర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరర్స్, పెళ్లి పందిళ్లను అలంకరించే కళాకారుల వరకు అందరు నష్టపోయారు. ‘కరోనా ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి వాయిదా పడిన పెళ్లిళ్లు హంగామా లేకుండా నామమాత్రపు ఖర్చులతో జరగవచ్చు. లాక్డౌన్ సందర్భంగా భౌతిక దూరం పాటించడం ద్వారా కలిగిన వెలితిని పూడ్చుకోవడం కోసం మరింత వైభవంగా పెళ్లిళ్లు చేసుకునేందుకు ధనిక కుటుంబాలు ప్రయత్నించవచ్చు’ అని ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ సహా దాదాపు 400 మంది పెళ్లి కుమారులు, పెళ్లి కూతుళ్లను కస్టమర్లుగా కలిగిన ‘వెడ్డింగ్ ఫొటోగ్రఫీ కంపెనీ’ యజమాని జోసఫ్ రాదిక్ తెలిపారు. భారీ ఎత్తున అలంకరించాల్సిన నాలుగు పెళ్లిళ్లు, 50 మంది అతిథులకు పరిమితమైన రెండు చిన్న పెళ్లిళ్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయని టుస్కానీలో జరిగిన అనుష్క శర్మ పెళ్లికి అంగరంగ వైభవంగా అలంకరణలు చేసిన వెడ్డిండ్ ప్లానర్ దేవికా నారాయణ్ తెలిపారు. పెళ్లి కూతురికి కరోనా రావడం వల్ల 50 మంది అతిథులకు పరిమితమైన ఓ పెళ్లి వాయిదా పడగా, సమీప బంధువుల్లో ఒకరికి కరోనా రావడం వల్ల 50 మందికి పరిమితమైన మరో పెళ్లి కూడా వాయిదా పడిందని చెప్పారు. మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, ఆ తర్వాత ఏం అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. (గుడ్‌న్యూస్: మరింత పెరిగిన రికవరీ రేటు) ఇక ముందు పెళ్లిళ్ల కూడా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంటే తనలాంటి వెడ్డింగ్ ప్లానర్స్ అవసరమే ఎక్కువ ఉంటుందని, సాధారణ టెంట్ సరఫరాదారులకు ఆ అవగాహన ఉండదని దేవిక ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన ఐదువేల కోట్ల డాలర్ల పెళ్లి పరిశ్రమలో కరోనా కారణంగా మూడువేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగి ఉంటుందని ఓ అంచనా. (బ్రీతింగ్ వ్యాయామంతో వైరస్‌లకు చెక్!) -
మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు!
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, క్యుకి డిజిటల్ మీడియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ బంగారా (46) ఆకస్మిక మరణం వ్యాపార వర్గాలను విభ్రాంతికి గురిచేసింది. ముంబై శివారు ప్రాంతంలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బంగారా కన్నుమూశారు. ఆయన అకాల మరణంపై కంపెనీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ విషాదవార్తతో షాక్ లో వున్నామని క్యుకి మరో కో-ఫౌండర్ సీవోవో సాగర్ గోఖలే ఉద్యోగులకు పంపిన ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ లోటును వర్ణించడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో మనమంతా ఆయన కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. అలాగే కరోనా మహమ్మారి కాలంలో అందరూ ఇంటినుంచే బంగారాకు నివాళులర్పించాలన్నారు. అటు సమీర్ బంగారా మరణంపై బాలీవుడ్ ప్రముఖులు విశాల్ దాడ్లాని, అర్మాన్ మాలిక్, కుబ్రా సైట్, అదితీ సింగ్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. తన స్నేహితుడు, సమీర్ ఇక లేడన్న భయంకరమైన, హృదయ విదారక వార్త తెలిసి చాలా బాధపడుతున్నా అన్నారు. జీవితంలో ఎంతోమందికి సాయం చేసిన మంచి వ్యక్తి అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది విషాదాలను తలుచుకుంటూ 2020 ఇక చాలు దయచేసి..అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Just heard that @samirbangara is no more. Horrible, heartbreaking news. Man's been a friend for a long time. Such a good guy, so straight-up. Helped so many people build careers out of nothing! His legacy will remain. Much love & strength to the family. 🙏🏼 2020, enough please! — VISHAL DADLANI (@VishalDadlani) June 14, 2020 Really very sad to wake up to the news that @samirbangara is no more. He was a great guy with a drive and passion like no other. Shocking and heartbreaking. Sincere condolences, strength and prayers to his immediate family & the @MyQyuki family... — ARMAAN MALIK (@ArmaanMalik22) June 14, 2020 -
కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగర శివారు జీడిమెట్లలో పారిశ్రామిక కాలుష్య కట్డడికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలు కలుషితం అవుతుంటే పీసీబీ చర్యలు ఆశాజనకంగా లేవని పేర్కొంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే గత నాలుగేళ్లల్లో 45 కేసులు మాత్రమే నమోదవడం పీసీబీ పనితీరును తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది. జీడిమెట్లలో భూగర్భ జలాలు కలుషితంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. 799 ఫార్మా కంపెనీలు ఉంటే వాటిలో 708కే అనుమతి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ చెప్పారు. 24 కంపెనీలకు నోటీసులు, 2 కంపెనీలను మూసివేయాలని, అలాగే పలు కంపెనీలపై 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గత ఆరు నెలల్లోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే కోర్టులో కేసు దాఖలైన తర్వాతే పీసీబీ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోందని తప్పుబట్టింది. శివారుల్లోని 220 బల్క్ డ్రగ్స్ యూనిట్స్‌లో చేసిన తనిఖీల నివేదికలను ఎందుకు వివరించలేదని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. -
రేడియో పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి
న్యూఢిల్లీ: కోరోనా దెబ్బకు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేడియో పరిశ్రమ ప్రతినిధులు సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు. రేడియో ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎమ్ చానెల్స్ ప్రతినిధులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖలో వివరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులను సంవత్సరం పాటు మినహాయించాలని లేఖలో ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ లేఖపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులను వడ్డీ లేకుండా మూడు నెలలు పొడిగించనున్నట్లు తెలిపింది. కోరోనా కారణంగా రేడియా పరిశ్రమ ఏప్రిల్‌లో 80శాతం నష్టపోగా.. మే నెలలో 90శాతం నష్టపోయిందని ప్రతినిధులు వాపోయారు. లక్షలాది మందికి ఉపాధి కల్సిస్తున్న రంగంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం పరిశ్రమ 200కోట్ల నష్టాలను చవిచూసిందని.. సెప్టెంబర్ నాటికి 600 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చదవండి: జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలి : కేంద్ర మంత్రి -
భద్రతపై దృష్టి సారించాలి:కలెక్టర్ నివాస్
సాక్షి, శ్రీకాకుళం: పరిశ్రమల భద్రత, సురక్షిత అంశాలను పరిశీలించాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల భద్రతపై తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకర రసాయనాలు కలిగిన కర్మాగారాలను పరిశీలించాలని తెలిపారు. ప్రమాదకరమైన విష వాయువులు, రసాయన వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అగ్నిమాపక కోణంలో కూడా తనిఖీ చేయాలని..పరిశ్రమలు విధిగా అన్ని సురక్షిత, భద్రతా చర్యలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పరిశ్రమల్లో సిబ్బంది మాస్కులు కలిగి ఉండాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు,ఫోమ్,నీటితో నియంత్రణ చేసే పరికరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. -
అన్ని పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక కార్యకలాపాలు అధిక స్థాయిల్లో ఉండే అన్ని జిల్లాల్లోనూ తక్షణమే అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్డౌన్ జోన్లుగా గుర్తించే విషయంలో జిల్లాల ఆర్థిక ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెడ్‌జోన్ ప్రాంతాల్లోనూ ఉన్నత స్థాయి భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలియజేసింది. -
కోవిడ్-19 : కొలువులను కాపాడాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవడంతో కీలక రంగాలు ప్రభుత్వాల చేయూత కోసం వేచిచూస్తున్నాయి. కోట్లాది కొలువులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలతో కీలక రంగాలను ఆదుకోవాల్సి ఉంది. అత్యధిక ఉపాధిని సమకూర్చే పరిశ్రమలు, సంస్ధల మనుగడకు ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించి ప్రభుత్వం చేయూత ఇవ్వకుంటే పెద్దసంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం నెలకొంది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలు ప్రాణాంతక వైరస్ ధాటికి కుప్పకూలుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ భారీ మాంద్యంలోకి జారుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకానమీని కాపాడుకుంటూ కోట్లాది ఉద్యోగాలను నిలబెట్టేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో భారత్‌లో నిరుద్యోగ రేటు భారీగా ఎగబాకిందని సీఎంఐఈ గణాంకాలు వెల్లడించాయి. మరికొద్ది నెలలు ఇదే పరిస్ధితి కొనసాగే పరిస్ధితి కనిపిస్తోంది. మాంద్య మేఘాలు ముసురుకున్న క్రమంలో దేశంలో ఐదు కీలక రంగాలకు ప్రభుత్వ ఊతం అవసరమని భావిస్తున్నారు. ఎంఎస్ఎంఈకి భరోసా ఇక భారత ఆర్థిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలిచి కోట్లాది ఉద్యోగాలను కల్పిస్తున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ను ప్రకటించాలనే డిమాండ్ ముందుకొస్తోంది. దేశ జీడీపీకి మూలస్తంభాలైన తయారీ, ఎగుమతి రంగంలో నిమగ్నమైన ఎంఎస్ఎంఈ రంగం కోవిడ్-19 ప్రభావంతో విలవిలలాడుతోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్ధితుల్లో ఆయా పరిశ్రమలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశ జీడీపీలో 30 శాతంపైగా సమకూరుస్తున్న ఈ రంగానికి భారీ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరతున్నారు. సత్వరమే ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించని పక్షంలో పలు చిన్న యూనిట్లు మూతపడే ప్రమాదం నెలకొంది. చదవండి : డబ్ల్యూహెచ్ఓకు చైనా భారీ సాయం! సంక్షోభంలో ఆతిథ్యం.. కోవిడ్-19 ప్రభావంతో ఆతిథ్య, పర్యాటక రంగాలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వైరస్ వ్యాప్తి భయాలు, లాక్డౌన్ ఫలితంగా పర్యాటకుల రాకపోకలు నిలిచిపోయి ఈ రంగాలు కుదేలయ్యాయి. దేశంలో టూరిజం, ఆతిథ్య రంగం 3.8 కోట్ల ఉద్యోగాలను కోల్పోయిందని కేపీఎంజీ నివేదిక స్పష్టం చేసింది. మే 3వరకూ లాక్డౌన్ పొడిగించడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక టూరిజం రంగమూ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఒక్క పౌరవిమానయాన రంగానికే రూ 5 లక్షల నష్టం వాటిల్లడంతో పాటు పర్యాటక రంగంలో 4 నుంచి 5 కోట్ల ఉద్యోగాలు దెబ్బతిన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సత్వరమే ప్రోత్సాహక చర్యలు ప్రకటించాలి. విమానయాన, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలకు ఊతం.. ఈ రెండు ప్రధాన రంగాలతో పాటు కరోనా మహమ్మారితో కుదేలైన విమానయానం, ఆటోమొబైల్, రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. పరిశ్రమలను కాపాడుకునేందుకు చొరవచూపితేనే కోవిడ్-19 ఎఫెక్ట్‌తో కళ్లముందు కనిపించే మహా పతనాన్ని కొంతమేర నివారించవచ్చు. -
మహమ్మారి ఎఫెక్ట్ : పతనం అంచున పరిశ్రమ
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని పరిశ్రమ సంస్థ ఫిక్కీ సర్వేలో వెల్లడైంది. గత కొద్దివారాలుగా మహమ్మారి ప్రభావంతో అంచనాలకు మించి ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, భవిష్యత్‌లోనూ వ్యాపారాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై కోవిడ్-19 ప్రభావంపై అనిశ్చితి నెలకొందని ఫిక్కీ-ధ్రువ సర్వే తేల్చిచెప్పింది. కరోనా మహమ్మారి తమ వ్యాపారాలపై అధిక నుంచి అత్యధిక స్ధాయి ప్రభావాన్ని చూపతోందని సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపారాలకు సానుకూల డిమాండ్ నెలకొనే పరిస్ధితి లేదని కూడా సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు భారీగా పడిపోతాయని 70 శాతం మంది వెల్లడించారు. కరోనా మహమ్మారితో తమ వ్యాపారంలో నగదు ప్రవాహాలు కుచించుకుపోవడంతో పాటు ఆర్డర్లు గణనీయంగా తగ్గుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్ధిష్ట ఆర్థిక ప్యాకేజ్‌తో సత్వరమే ముందుకురాని పక్షంలో పరిశ్రమ గడ్డుపరిస్ధితిని ఎదుర్కొంటుందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. తమ సంస్ధల్లో సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నామని సర్వే పలుకరించిన వారిలో నాలుగింట మూడొంతుల మంది వెల్లడించడంతో రాబోయే నెలల్లో ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. చదవండి : కరోనాపై అంతుచిక్కని అంశాలు వ్యాపారాల విస్తరణకు పలు సంస్ధలు చేపట్టిన ప్రణాళికలూ కోవిడ్ మహమ్మారితో అటకెక్కాయని సర్వేలో వెల్లడైంది. ఇక ఫిక్కీ-ధ్రువ చేపట్టిన ఈ సర్వేలో పలు రంగాలకు చెందిన 380 కంపెనీలు పాలుపంచుకున్నాయి. కోవిడ్-19 ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించిందని, దశాబ్ధాలుగా పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్ధ సాధించిన ప్రయోజనాలను హరించివేసిందని ఫిక్కీ ప్రెసిడెంట్ డాక్టర్ సంగీతా రెడ్డి అన్నారు. ప్రజలు, ఉద్యోగాలు, సంస్ధలను కాపాడేందుకు పరిశ్రమను ఆదుకునేలా ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అవసరమని పేర్కొన్నారు. వ్యాపారాలు సజావుగా సాగేందుకు సత్వరమే ద్రవ్య సరఫరా పెంచాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేలా డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్రవ్య ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించడంతో పాటు లిక్విడిటీని పెంచడం, ట్యాక్స్ రిఫండ్లు, తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలని ధ్రువ అడ్వైజర్స్ సీఈఓ దినేష్ కనబర్ కోరారు. -
ఫుడ్ పార్కుల్లో పెట్టుబడుల వేట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ద్వారానే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం సాధ్యమవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగు విస్తీర్ణం పెరగడం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరిగే అవకాశముందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రైతులకు భరోసాతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులతో దేశంలోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం అమలుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం పరిశ్రమల శాఖ సిద్ధం చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై కసరత్తు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పాలసీ’విధి విధానాలపై పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాలను 21 క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో సాగయ్యే ప్రధాన, ఇతర పంటల వివరాలను సేకరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే పంటల వివరాలతో ‘స్టేట్ ఫుడ్ మ్యాప్’కూడా సిద్ధం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణలో ఇతర రాష్ట్రాల నుంచి ఎదురయ్యే పోటీకి సంబంధించిన నివేదికలు కూడా పరిశ్రమల శాఖ గతంలో రూపొందించింది. రాష్ట్రంలో నాలుగు మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు గతంలో కేంద్రం ఆమోదం తెలిపింది. నిజామాబాద్‌లో రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ప్రైవేటు మెగా ఫుడ్‌పార్కుకు 2018లో శంకుస్థాపన జరగ్గా, పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే రూ.14 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతో పాటు 50 వేల మంది యువతకు ఉపాధి దక్కడమే కాకుండా సుమారు లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఫుడ్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్‌లో ఫుడ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. బుగ్గపాడులో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బుగ్గపాడు సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)లో డ్రైవేర్ హౌజ్, డీప్ ఫ్రీజ్, సబ్ జీరో కోల్డ్ స్టోరేజీ ఛాంబర్ తదితరాల నిర్మాణం పూర్తయింది. బుగ్గపాడు సీపీసీకి అనుబంధంగా వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మంలో టీఎస్ఐఐసీ ద్వారా ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల (సీపీసీ) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ శివారులోని దండు మల్కాపూర్ పారిశ్రామిక పార్కుకు అనుబంధంగా సుమారు వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫుడ్ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణపై పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. రాష్ట్రం వైపు భారీ పరిశ్రమల చూపు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయి. మనోహరాబాద్‌లో ఐటీసీ రూ.800 కోట్లు, బండ తిమ్మాపూర్‌లో ఆర్పీఎస్జీ సంస్థ రూ.200 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించాయి. సంగారెడ్డి జిల్లా గోవింద్‌పూర్‌లో రూ.207 కోట్ల పెట్టుబడితో హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ ప్లాంటు అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది. దీంతో పాటు డీఎక్స్ఎన్, కోకాకోలా, లులు గ్రూప్ తదితర సంస్థలు కూడా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని బుగ్గపాడు, బండ మైలారం, బండ తిమ్మాపూర్ తదితర ఫుడ్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలతో త్వరలో సమావేశం అయ్యేందుకు పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
చిన్నపరిశ్రమ ఆశలకు గండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో బడ్జెట్‌ని మొదటిసారి పరికిస్తే, ఆర్థిక వ్యవస్థ అనే వృషభాన్ని లొంగదీసుకుని ఇప్పుడున్న ఆర్థిక మందగమనాన్ని నిలువరించి, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. దీర్ఘకాలం ఆర్థికమాంద్యం కొనసాగితే అది మరింత పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. ఆదాయ పన్ను రేటును తగ్గించడం, భారీ పెట్టుబడులు అవసరమయ్యే ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రయత్నించడం, రైతులపై దృష్టిపెట్టి, రైతుల ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేస్తామని నొక్కి చెప్పడం వంటి చర్యల ద్వారా ప్రజలకు మరింతగా నగదును అందజేయడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రయత్నించారు. ఆమె చేసిన ప్రతిపాదనలను ఎవరూ తప్పుపట్టలేరు. ఇటీవలి కాలం వరకు దేశంలో ఆర్థిక సంక్షోభం ఉందని అంగీకరించడానికి కూడా కేంద్రప్రభుత్వం సిద్ధపడలేదు. అయితే గత కొద్దినెలలుగా ఆర్థిక వ్యవస్థ సజావుగా లేదని నెమ్మదిగా అర్థం చేసుకోవడంతో తాజా బడ్జెట్‌ను ప్రభుత్వం సరైన దిశలో తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ స్వస్థతను పునరుద్ధరించడం కోసం ఆమె పూనుకున్న చికిత్సకు వివిధ దృక్ప«థాలకు చెందిన ఆర్థికవేత్తల సూచనలే ప్రాతిపదిక అని అర్థమవుతోంది. కానీ సంక్షోభం పరిమాణం, దాని లోతు బట్టి చూస్తే ఆర్థిక మంత్రి ప్రయత్నం ఫలితాలను ఇవ్వనుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. తాజా బడ్జెట్ వృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ కుప్పగూలడాన్ని చూస్తే నిర్మల బడ్జెట్ అంచనాలను అందుకోలేదని తెలుస్తుంది. వివిధ వాణిజ్యమండళ్లు, లాబీ గ్రూపులు ఈ బడ్జెట్‌ని స్వాగతించినా, వాటి సభ్యులు మాత్రం అంతర్గతంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా లేదన్నది వారి అభిప్రాయం. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించడంతో బడ్జెట్‌కు ముందే తాము కోరుకున్నది పొందామని బడా పరిశ్రమ వర్గాలు సంతృప్తి చెందాయి. కానీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ బడ్జెట్‌వల్ల బాగా ఆశాభంగం చెందాయి. కార్పొరేట్ వర్గాలకు మల్లే తమకు కూడా కార్పొరేట్ పన్నును మినహాయిస్తారని వీరు ఆశలు పెంచుకున్నారు కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశం స్థూల ఆదాయంలో 32 శాతం వరకు దోహదపడుతున్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 11 కోట్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశ ఎగుమతుల్లో దాదాపు సగభాగం వీటి నుంచే జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ సమగ్ర సంక్షేమానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుద్ధరణ కీలకమైనదని మనకు సులభంగా అర్థమవుతుంది. ప్రత్యేకించి 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ కలిగించిన ప్రకంపనలతో ఈ రంగానికి ఊపిరాడటం లేదు. తాము కోల్పోయిన వైభవాన్ని ఇవి ఇంకా సాధించడం లేదు. ఆనాటి నుంచి వందలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి కూడా. పన్ను వివాదాలు, వివాదాస్పదంగా మారిన పన్ను చెల్లింపు మొత్తాలకు సంబంధించి ప్రభుత్వ సహా యాన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కోరుకుంటూ ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక మంత్రి పన్ను వివాద పరిష్కార పథకాన్ని ప్రారంభించారు కానీ 2020 మార్చి 31లోగా చెల్లించని బకాయిలపై అపరాధరుసుం, వడ్డీరేటును తగ్గిస్తానని హామీ ఇవ్వడం తప్పితే మరే ఇతర రాయితీలనూ ఇవ్వడానికి తిరస్కరించారు. ఈ సంవత్సరం మార్చి 31 తర్వాత చెల్లించే బకాయిలకు ఈ రంగం య«థాప్రకారం అపరాధరుసుం, వడ్డీరేటును చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం కూడా జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది. అందుకే చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఈ షరతుపట్ల తీవ్రంగా ఆశాభంగం చెందిఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ వివాదాలు మరొక శిరోభారంగా మారాయి. రాబడి ఫైలింగ్ వ్యవధిని మరో సంవత్సరం పాటు ప్రభుత్వం పొడిగించిందంటే, ప్రారంభించి రెండున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికీ నూతన పన్ను వ్యవస్థ ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని స్పష్టమవుతోంది. ఈ ఏప్రిల్ నుంచి ఆదాయ రిటర్నులను మరింత సరళీకరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటిం చారు. అంటే జీఎస్టీ వ్యవస్థలో తలెత్తిన పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదనే అర్థం. పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్లను సకాలంలో పొందనట్లయితే అది నిరుపయోగమే అవుతుంది. పన్నుల రూపంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించడం స్వాగతించదగినదే. పన్నువసూళ్ల రంగంలోని పాలనాధికారులను ఆమె కట్టడి చేసినట్లయితే దేశం మొత్తానికి పెద్ద సేవ చేసినవారవుతారు. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్‌కి సంబంధించిందే అయినప్పటికీ బడ్జెట్లో పేర్కొన్నట్లుగా దాని హేతుబద్దీకరణ సాధ్యం కావడంలేదు. పాత, కొత్త పన్నుల వ్యవస్థ పక్కపక్కనే కొనసాగించడం వల్ల మరింత గందరగోళం పెరిగి కల్లోలానికి దారి తీస్తోంది. ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంచడం, 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదనీ, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను చెల్లించాలని, రూ. 5–7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు ఉంటుందని, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు ఉంటుందని, రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలని ఆదాయపన్నులో మినహాయింపు ఇవ్వడం కాస్త ఊరటనిచ్చేదే. పైగా ఆర్థిక వ్యవస్థలో డిమాండును ఇది ప్రోత్సహిస్తుంది కూడా. లక్ష్మణ వెంకట్ కూచి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కార్పొరేట్ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించాలి
న్యూఢిల్లీ: వివిధ కార్పొరేట్ ట్యాక్స్ రేట్లన్నింటినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా 15 శాతం స్థాయికి హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. 2023 ఏప్రిల్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా రాబోయే బడ్జెట్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఇంకా ఆశించిన స్థాయిలో తగ్గుదల లేదని తెలిపారు. తయారీ, సేవా రంగాల పన్ను రేట్లలో అసమానతలు నెలకొనడమే ఇందుకు కారణమని వివరించారు. తగ్గుతున్న శాతాలు... 1991–92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 22 శాతానికి చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తగ్గించింది. అయితే, కంపెనీలు దీన్ని వినియోగించుకోవాలంటే పన్ను మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలను వదులుకోవాల్సి ఉంటుంది. 2023 మార్చి 31లోగా ఉత్పత్తి ప్రారంభించే తయారీ సంస్థలు, 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటైన సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే ఉంటుంది. సర్‌చార్జీ, సెస్సు దీనికి అదనం. పలు దేశాలకు దీటుగా పోటీపడేందుకు దేశీ సంస్థలకు .. తాజా రేట్ల కోత తోడ్పడనుంది. క్రమేపీ పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఊతమిచ్చేందుకు తక్కువ స్థాయి కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు దోహదపడనున్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించింది. -
రబ్బర్‌వుడ్ రంగంలో థాయ్‌లాండ్ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రబ్బర్‌వుడ్ పరిశ్రమ రంగంలో థాయ్‌లాండ్ భారీ పెట్టుబడులు పెట్టనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి థాయ్‌లాండ్ ప్రభుత్వాన్ని కోరారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమ న్నారు. థాయ్‌లాండ్‌తో భారత్‌కు చాలా దగ్గరి సంబంధాలున్నాయని, రెండు దేశాల మధ్య వాణిజ్య రంగంలో మంచి అవకాశాలున్నాయన్నారు. తెలంగాణలో థాయ్‌లాండ్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం సంతోష కరమన్నారు. మాదాపూర్‌లో శనివారం ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగిన ఇండియా–థాయ్‌లాండ్ బిజినెస్ మ్యాచింగ్ అండ్ నెట్వర్కింగ్ సెమినార్లో థాయ్‌లాండ్ ఉప ప్రధాని జురిన్ లక్సనావిసిత్‌తో కలసి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి థాయ్ ప్రతినిధులకు వివరించారు. రబ్బర్‌వుడ్ పరిశ్రమలో థాయ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకోవటం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. థాయ్‌లాండ్ ఉప ప్రధాని భారత్ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందన్నారు. రవాణా రాయితీ కల్పిస్తాం: మంత్రి కేటీఆర్ రబ్బర్ వుడ్, టింబర్ వుడ్ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా థాయ్ కంపెనీలకు అందిస్తామని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, దేశవృద్ధిరేటు కంటే ఎక్కువ అభివృద్ధిని రాష్ట్రం నమోదు చేసిందని తెలిపారు. సమాచారం, లైఫ్ సైన్సెస్ సహా ఇతరప్రముఖ రంగాలకు హైదరాబాద్ వేదికగా మారిం దన్నారు. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించ గలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ అత్యున్నత స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ– థాయ్‌లాండ్ మధ్య వాణిజ్య పరంగా అపార అవకాశాలున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన పథకాల వల్ల సరిపోయేంత సాగునీరు వ్యవసాయానికి అందటం వల్ల రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని, తద్వారా ఆగ్రో బేస్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక అవకాశాలు కలుగుతున్నాయని చెప్పారు. బ్యాంకాక్–హైదరాబాద్ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఈ విషయంలో థాయ్‌లాండ్ సహకారంతో తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. వివిధ రంగాల్లో ఇరువురం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ థాయ్‌లాండ్ ఉప ప్రధాని జరీన్ లక్సనావిత్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సెమినార్లో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు 30 మందితో కూడిన థాయ్ ప్రభుత్వ వాణిజ్య విభాగం ప్రతినిధుల బృందం పాల్గొంది. -
‘కార్వీ’ ఉదంతంతో కన్సాలిడేషన్ వేగవంతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ ఉదంతంతో బ్రోకింగ్ పరిశ్రమలో కన్సాలిడేషన్ మరింత వేగవంతమయ్యే అవకాశముందని కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం హెడ్) రష్మిక్ ఓఝా అంచనా వేశారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో క్లయింట్స్.. క్రమంగా చిన్న సంస్థల నుంచి పటిష్టమైన, పెద్ద సంస్థల వైపు మళ్లే అవకాశాలున్నాయని మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. క్లయింట్ల సెక్యూరిటీలను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వచ్చే ఏడాది ఆఖరు నాటికి నిఫ్టీ 13,400 పాయింట్లు, సెన్సెక్స్ 45,500 పాయింట్లకు చేరవచ్చని కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నట్లు ఓఝా చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు నిరాశావహంగా కనిపిస్తున్నప్పటికీ.. మార్కెట్ మాత్రం సానుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల రాకతో పాటు దేశీయంగా సిప్ రూపంలో పెట్టుబడులు వస్తుండటం మార్కెట్లకు దోహదపడుతోందని ఓఝా తెలిపారు. మార్కెట్లు, ఎకానమీ మధ్య వైరుధ్యాలు మరికొంత కాలం కొనసాగవచ్చని, బడ్జెట్లో తాయిలాలపై ఆశలతో మార్కెట్లు అధిక స్థాయిలోనే ఉండవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ వంటి అంశాలు వచ్చే ఏడాది కీలకంగా ఉండగలవని చెప్పారు. మందగమనం, ఆదాయాల్లో పెద్దగా మార్పులు లేకపోవడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత మొదలైనవి దేశీ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఓఝా చెప్పారు. ఆకర్షణీయంగా ఈ రంగాలు.. కార్పొరేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (పటిష్టమైన మాతృసంస్థల మద్దతున్నవి), ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ, హెల్త్‌కేర్, అగ్రోకెమికల్స్ రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని ఓఝా పేర్కొన్నారు. సిమెంటు, ఫార్మా రంగాల్లో మిడ్ క్యాప్ కంపెనీలు కూడా పరిశీలించవచ్చని తెలిపారు. -
పల్లెల నుంచే ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్:ఆవిష్కరణలు నగరాలు కేంద్రంగా జరగవని, ఎక్కడో మారుమూల ప్రాంతా ల నుంచే వస్తాయని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన ఆవిష్కరణలతో వస్తే.. పరిశ్రమలకు తాము సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉ న్నత విద్యను పరిశ్రమలతో అనుసంధానిస్తే.. ఉత్పత్తి రంగంలో నైపుణ్యమున్న మానవ వనరు లు సృష్టించి, నూతన ఆవిష్కరణలకు బీజం వేసిన వారిమవుతామన్నారు. శుక్రవారం మాదాపూర్‌లో ని హెచ్ఐసీసీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ అవార్డ్స్ –2019’కార్యక్రమానికి కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి బహుమతులు గెలుచుకున్న ఆవిష్కరణలకు శుభాకాంక్షలు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సీఐఐకి కృతజ్ఞతలు.. తె లంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన టీఎస్ ఐపాస్‌కు వచ్చే నవంబర్‌లో ఐదేళ్లు పూర్తవనున్నాయి. ఇప్పటికే ఐపాస్ ద్వారా 11 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చాం. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 13 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించగలిగాం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్రం 14.9 వృద్ధిరేటు (జీఎస్డీపీ)తో ముందుకు సాగుతుండటం ఆనందకరం. లైఫ్‌సైన్సెస్, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ తదితర ఉత్పత్తుల రంగాలకు తెలంగాణ..ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఆవిష్కరణలంటే హైదరాబాద్ లాంటి నగరాల నుంచే వస్తారని అనుకోను. మారుమూల ప్రాంతాలనుం చి చక్కటి ఆవిష్కరణలు వస్తుండటమే ఇందుకు ని దర్శనం. మహబూబ్‌నగర్‌లోని మారుమూల ప్రాంతమైన ఐజ, ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని తిర్యానీ, కరీంనగర్ నుంచి ఉన్నారు..’అని చెప్పారు. కేంద్రం తరహాలోనే ప్రోత్సాహం.. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించిన తరహాలోనే తెలంగాణ కూడా ప్రోత్సహిస్తోందని కేటీఆర్ అన్నారు. ‘మీకు అత్యంత అద్భుతమైన వేదిక కల్పిస్తున్నాం. అన్నిరకాల చేయూతనందిస్తున్నాం. ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఆవిష్కరణలతోనే యువ ఎంటర్ప్రెన్యూర్లు వీటిని అందిపుచ్చుకోవాలి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో వినూత్న పారిశ్రామిక ఆవిష్కరణల తో ప్రపంచదేశాలను ఆకర్షించేందుకు కృషి చేయాలి. తెలంగాణ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి స్వర్గధామం. తెలంగాణలో మైక్రో మ్యాక్స్ మూడే ళ్ల కిందపని ప్రారంభించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించింది. ఫ్రెంచ్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సాఫ్రన్ తెలంగాణలో పారిశ్రామిక విధా నం నచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం వద్ద పరిమిత ఉపాధి వనరులున్నాయి. ప్రభుత్వం–పారిశ్రామికరంగం కలిస్తే.. కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించగలం. టాస్క్ ద్వా రా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు శిక్షణ ఇస్తున్నాం..’ అని అన్నారు. సీఐఐకి మరోసారి విజ్ఞప్తి.. కాలేజీలను స్థానిక పరిశ్రమలను అనుసంధానించాలని కేటీఆర్ చెప్పారు. అప్పుడే నైపుణ్యమున్న మానవ వనరులను సృష్టించగలమన్నారు. జర్మనీలాంటి దేశాల నుంచి కొత్త పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలని సీఐఐకి మరోసారి విజ్ఞప్తి చేస్తు న్నా. అత్యధిక వృద్ధిరేటు సాధించిన మహీంద్రా కంపెనీకి శుభాకాంక్షలు. కార్పొరేట్ కంపెనీలన్నీ సామాజిక సేవలో మరింత భాగస్వామ్యం కావా లని విన్నవిస్తున్నా. జేకే గ్రూపు సాయంతో ప్రభు త్వ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించగలిగాం. ఇదేవిధంగా మిగిలిన కంపెనీలు కూడా ముందుకు రావాలని కోరుతున్నా..’అని ముగించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఐఐ చైర్మన్ డి.రాజు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందుకే అప్పుడు బరువు పెరిగాను : నమిత
నమిత అభిమానులకు శుభవార్త!ఆమె బోలెడంత లాస్ అయ్యారు! కంగారు పడకండి. నమిత లాస్ అయింది డబ్బు కాదు. వెయిట్ లాస్!! బరువు తగ్గి, మెరుపుతీగ అయ్యారు నమిత. తారలు వెయిట్ తగ్గితే.. ఇండస్ట్రీలో వెయిట్ పెరుగుతుంది. ‘సొంతం’తో ఎంట్రీ ఇచ్చి.. ‘సింహా’ తర్వాత కొంచెం ఒళ్లు చేసిన నమిత సన్నబడి, మళ్లీ ఇప్పుడు సౌత్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు.. ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్..! రెండేళ్ల క్రితం పెళ్లప్పుడు బొద్దుగా ఉన్నారు. ఈ మధ్య బరువు తగ్గారు. సినిమాల కోసమా? నమిత: బరువు తగ్గడానికి ముఖ్య కారణం కొన్ని పెద్ద సినిమాలు అంగీకరించడమే. వచ్చే ఏడాది మేలో ఈ సినిమాలు ఆరంభమవుతాయనుకుంటున్నాను. అందుకే టైమ్ తీసుకొని బరువు తగ్గుతున్నాను. ప్రతి రోజూ ఉదయాన్నే ఐదున్నరకే నిద్ర లేస్తున్నాను. రోజు మార్చి రోజు యోగా, జిమ్ చేస్తున్నాను. వారానికి ఆరు రోజులు చేస్తున్నాను. ఒక్క రోజు సెలవు తీసుకుంటున్నాను. బరువు తగ్గడానికి మరో కారణం ఆరోగ్య సమస్యలు. నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఓవర్ వెయిట్‌ని ఎంజాయ్ చేయలేదు. ఉన్నట్లుండి ఎందుకు బరువు పెరిగారు? ఆడవాళ్లకు హార్మోన్స్ సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యల వల్లే నేను విపరీతంగా బరువు పెరిగాను. మన సమస్యలను మనం తెలుసుకోగలగాలి. నేను, నా భర్త (వీర్) నా శరీరంలోని సమస్యకు మూలం ఏంటి? అనే దగ్గర నుంచి వర్కౌట్ చేయడం మొదలుపెట్టాం. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తాం. కానీ మేం శాశ్వత పరిష్కారం కావాలనుకున్నాం. ఈ ఏడాది జనవరి నుంచి జిమ్, యోగా మొదలుపెట్టాను. కొత్త డైట్‌ని ఫాలో అవుతున్నాను. 2011 నుంచి 2016 వరకూ డిప్రెషన్లో ఉన్నాను. 2017లో నార్మల్ అయ్యాను. డిప్రెషన్లో ఉన్నప్పుడు మద్యానికి బానిస కావొచ్చు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మానసికంగా వేరే స్థితికి వెళ్లొచ్చు. లక్కీగా నేను ఆధ్యాత్మికం వైపు వెళ్లాను. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అలాంటి సమయంలో వీర్ నా జీవితంలోకి వచ్చాడు. తను నా బ్యాక్‌బోన్‌లా మారిపోయాడు. నాలో చాలా స్ఫూర్తి నింపాడు. వీర్ లైఫ్ స్టయిల్ చాలా నేచురల్‌గా ఉంటుంది. అన్నీ ఆర్గానిక్, హెర్బల్స్ని తీసుకుంటాడు. ఇంగ్లీష్ మెడిసిన్‌ని ఇష్టపడడు. కెమికల్స్ ఎక్కువ ఉండవు. నన్ను కరెక్ట్ దారిలో పెట్టాడు. డాక్టర్స్‌ను సంప్రదించాం. సహజమైన పద్ధతిలో బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టా. ఈ బరువు తగ్గే విషయంలో మిగతా స్త్రీలకు ఉపయోగపడే టిప్స్ ఏమైనా? ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. నాకు పీసీఓడి, థైరాయిడ్ సమస్యలున్నాయి. వంశపారంపర్యం కూడా ఉంది. వీటన్నింటికి తోడు డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ సమయంలో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం అనే దాని మీద శ్రద్ధే ఉండదు. అలా బరువు పెరిగాను. వీర్ సపోర్ట్‌తో నా ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ సమస్యని తెలుపుకోవాలి. బయటకు చెప్పడానికి మొహమాటపడకూడదు. డాక్టర్ దగ్గరికెళ్లడానికి సిగ్గుపడకూడదు. అప్పుడే మన సమస్యను మనం అధిగమించగలుగుతాం. ఎంత బరువు తగ్గారు? మీ డైలీ డైట్ ఏంటి? పది కిలోలు తగ్గాను. ఇంకో 7 కిలోలు తగ్గాలనుకుంటున్నాను. మేం రాగి, జొన్నలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నాం. వీటి ప్రభావం లాంగ్ రన్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను ఉదయం నిద్ర లేవగానే ములక్కాడ ఆకుల రసం తీసుకుంటాను. ములక్కాడ ఆకుల రసానికి తేనె, నిమ్మరసం కలుపుతాను. 20 నిమిషాల తర్వాత జీలకర్ర వాటర్ తాగుతాను. రాత్రి మొత్తం జీరాను నానబెట్టి ఉదయాన్నే వేడి చేసి, తాగుతాను. మిగిలిన జీరాను నమిలేయాలి. కొంత సేపటి తర్వాత ఒక యాపిల్ తింటాను. జిమ్ లేదా యోగా నుంచి తిరిగొచ్చాక బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ముస్లీ, డ్రై ఫ్రూట్స్, మిల్క్ లేదా పెరుగు తింటాను. లంచ్‌లో రాగి ఇడ్లీ, రాగి దోశె లేదా రాగి పనియారమ్ తింటాను. బ్రౌన్ రైస్ తీసుకుంటాను. రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ కొబ్బరినీళ్లు తాగుతాను. రోజు మొత్తంలో సుమారు 6 నుంచి 7 లీటర్ల నీళ్లు తాగుతాను. రాత్రి డిన్నర్లో వెజిటేబుల్ సూప్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ బాగా ఆకలనిపిస్తే మా కుక్‌ను రాగి పనియారం చేయమంటాను. పూండు చట్నీ (వెల్లుల్లిపాయ చట్నీ), కొబ్బరి చట్నీతో తింటాను. పల్లీల చట్నీ అంటే నాకు బాగా ఇష్టం కానీ డైట్లో వద్దన్నారు. అందుకే పదిరోజులకోసారి పల్లీ చట్నీ తింటాను. ఈ డైట్‌ని ఎవరు చెప్పారు? నా డైట్ మొత్తం నా డైటీషియన్, వీర్ కలíసి ప్లాన్ చేశారు. ప్రస్తుతం మనందరం చాలా కాలుష్యంలో ఉంటున్నాం. దానివల్ల మనకు కావాల్సిన విటమిన్లు సరిగ్గా అందే అవకాశాలు తక్కువ. అందుకే ఒక్కోసారి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటుంటాను. ఇవన్నీ డాక్టర్ల సూచన మేరకే వాడతాను. ఇదే డైట్‌ను ఎప్పటికీ కొనసాగిస్తారా? కొనసాగించాలనుకుంటున్నాను. అయితే ఒక సంవత్సరానికి మించి ఇదే డైట్‌ని ఫాలో అవ్వలేననిపిస్తోంది. స్వీట్స్ మానేశాను. మధ్యలో కీటో డైట్ కూడా పాటించాను. అది నాకు సరిగ్గా వర్కౌట్ కాలేదు. మా కజిన్ ఒకామెకు బాగా వర్కౌట్ అయింది. నో చాక్లెట్, నో స్వీట్స్ అంటే కష్టమేమో? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నాకు తీపి తినాలనే ధ్యాస పెద్దగా ఉండట్లేదు. లేకపోతే ప్రతి రోజూ డిన్నర్ తర్వాత ఏదో ఒక స్వీట్ తినాల్సిందే. ఇప్పుడు అలా లేదు. మిస్ అయినట్టే లేదు. నేనేనా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. డైట్ మొదలుపెట్టిన మూడునెలల తర్వాత మా ఊరికి వెళ్లాను. మా అమ్మగారు హల్వా తయారు చేశారు. మూడు నెలలకు తిన్న స్వీట్ అది. బరువు తగ్గాక శారీరకంగా చాలా మార్పు వచ్చింది. మరి మానసికంగా? ధ్యానం నన్ను ప్రశాంతంగా మార్చేసింది. నా ఆలోచనల్లో మెచ్యూర్టీ వచ్చింది. మనుషులను, వాళ్ల మనస్తత్వాలను ఇంతకు ముందుకన్నా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎవరి ముందు ఏం మాట్లాడాలి? ఎవరి ముందు ఏం మాట్లాడకూడదు అని తెలుసుకుంటున్నాను. అవన్నీ మెల్లిమెల్లిగా అర్థం అవుతున్నాయి. ఈ మధ్యనే మా చుట్టాల ఇంటికి వెళ్లాను. అందరూ ‘భలే మెరిసిపోతున్నావు’ అన్నారు. నీలో సంతోషం మాత్రమే కనిపిస్తోంది అన్నారు. నా టెంపర్ పోయింది. రిలాక్డ్స్‌గా ఉంటున్నాను. కాన్ఫిడెంట్‌గా మారాను. ఈ మార్పు మొత్తం వీర్ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే. తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు? నా కెరీర్‌ను తెలుగు సినిమాతోనే ప్రారంభించాను. తెలుగు పరిశ్రమకు రుణపడి ఉంటాను. మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ మధ్య స్టార్స్ అందరూ వెబ్ సిరీస్‌లో కూడా కనిపిస్తున్నారు. మీక్కూడా ఇంట్రెస్ట్ ఉందా? కథ బావుంటే ఏదైనా ఓకే. మీకు తెలుసో లేదో నేను కవితలు రాస్తుంటాను. నేను, వీర్ కలసి కొన్ని స్క్రిప్ట్స్ రాశాం. ఆ కథలను సినిమాగా అయినా, వెబ్ సిరీస్‌గా అయినా తీయొచ్చు. ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాలనుకుంటున్నాం. పర్సనల్ లైఫ్‌లోకి వస్తే పిల్లలెప్పుడు? పెళ్లి సమయంలోనే ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాం. మా తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మా అత్తామామలైతే ‘డైమండ్’ అనొచ్చు. చాలా స్వీట్‌గా ఉంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలెప్పుడు అని కంగారు పెట్టరు. తెలుగింటి కోడులుగా ఉండటం ఎలా ఉంది? వీర్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు తెలుగు సంప్రదాయ ప్రకారం పెళ్లి జరగాలా? మా గుజరాతీ స్టయిల్ వెడ్డింగ్ కావాలా అనేది నన్నే నిర్ణయించుకోమన్నాడు. చిన్నప్పటినుంచి గుజరాతీ పెళ్లిళ్లు చాలా చూశా. అవి బావుంటాయి. తెలుగు సంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తెలుగు స్టయిల్లో చేసుకున్నాం. వీర్ వాళ్ల అమ్మానాన్నలకు కూడా మా అబ్బాయికి పెళ్ళి అయింది అనే ఫీలింగ్ ఉండాలి కదా. నేను ఎప్పుడూ వినని, తెలియని సంప్రదాయాలను చూశాను. మీ ఫ్యాన్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలుగు ఫ్యాన్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాంగ్‌తో తిరిగొస్తాను. నాలుగైదు డిఫరెంట్ గెటప్స్‌లో నన్ను చూడబోతున్నారు. ఇకపై విభిన్నమైన రోల్స్ చేయనున్నాను. ‘నమిత ఈజ్ బ్యాక్’ అనేలా మంచి క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటాను. అవునూ... మీ భర్తను ‘స్వామీ’ అని పిలుస్తారట? ఇంతకుముందు వీర్ అని పిలిచేదాన్ని. ఆ మధ్యలో వీర్ అయ్యప్ప మాల వేసుకున్నాడు. అప్పుడు స్వామీ అని పిలుస్తాం కదా. అలా పిలవడం నాకు బాగా అనిపించింది. అందుకే ఎప్పటికీ ‘స్వామీ’ అని పిలవాలని డిసైడ్ అయిపోయాను. మీ భర్త సపోర్ట్ వల్లే మీరు బరువు తగ్గగలిగారా? అవును. అయితే ప్రాబ్లమ్ ఎక్కడ అంటే.. సన్నగా అవ్వాలనే ఆసక్తి భార్యకు కూడా ఉండాలి. భర్త డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా భార్య రాననడం నేను చాలా సందర్భాల్లో చూశాను. లావుగా ఉండడంవల్ల ఎక్కువ వయసున్నట్లు కనిపిస్తారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లని భర్తలు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ల నాన్నలను అడగాలి. వినకపోతే రెండుమూడుసార్లు అడగాలి. లేకపోతే వాళ్లంతట వాళ్లే డాక్టర్ని సంప్రదించాలి. ఇంట్రెస్ట్ వాళ్లకే ఉండాలి. నా వల్ల కాదు, నాకు అక్కర్లేదు అనుకుంటే ఎవరు ఎంత సపోర్ట్ చేసినా ఉపయోగం ఉండదు. తన మార్పు మిగతావాళ్లకు ప్రేర ణ కలిగించాలి. నమితట్రాన్స్ఫర్మేషన్ వెనక ఉన్న కారణాలు రెండు. ఒకటి సినిమా. రెండోది వేరేవాళ్లు తనపై చూపించిన ఆసక్తి. ‘ఇంత బరువు పెరిగారు ఏంటి?’ అని అడిగేవాళ్లు. స్త్రీలు బరువు పెరిగితే వంద సమస్యలు ఉంటాయి. కానీ బయటకు చెప్పలేరు. ఎవరికైనా చెప్పినా పెళ్లయ్యాక పెరుగుతారులే అని కొట్టిపారేస్తారు. తగ్గడానికి ప్రయత్నించరు. వాళ్లకు స్ఫూర్తిగా నమిత ఉండాలన్నది నా ఉద్దేశం.తను సడన్‌గా ఎందుకు లావు అవుతోంది? ఎందుకు తగ్గుతోంది అనే ఆలోచనలో పడ్డాను. మనం తినేదాంట్లో సగం కూడా తినడం లేదు.. మరి ఎలా లావు అవుతోంది? అనుకున్నా. తను ఆరేళ్లు డిప్రెషన్లో ఉంది. దాంతో సిస్టమ్ దెబ్బతింది. డాక్టర్లను సంప్రదించి ఈ కోర్స్ మొదలుపెట్టాం. అందరూ లావు తగ్గటం పెద్ద టాస్క్ అనుకోకూడదు. అనుకుంటే తగ్గుతారు. –వీర్, నమిత భర్త – డి.జి.భవాని -
ఏపీ వైపు.. పారిశ్రామిక వేత్తల చూపు
సాక్షి, బెంగళూరు: పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషిచేస్తోందని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం బెంగళూరులోని కాన్రాడ్ హోటల్లో నిర్వహించిన బిజినెస్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్‌లో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో వాణిజ్య విస్తరణ దిశగా ఐటీ దిగ్గజం టీసీఎస్ సంస్థ ప్రతినిధులు సునీల్ దేశ్ పాండే, నీత మంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని సానుకూలతలు, పెట్టుబడుల అవకాశాలను బట్టి మరిన్ని పెట్టుబడులు ఏపీలో పెట్టాలని, వ్యాపారాన్ని విస్తరించవలసిందిగా టీసీఎస్ ప్రతినిధులను మంత్రి మేకపాటి కోరారు. ఏపీ వైపు పారిశ్రామిక వేత్తల చూపు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నవరత్నాల అమలు, అవినీతి రహిత పాలన, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తూ కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందని మంత్రి వెల్లడించారు. సుపరిపాలన, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన సాగుతుండడంతో ఏపీవైపు పారిశ్రామికవేత్తల చూపు మళ్లిందని సంస్థల ప్రతినిధులతో మంత్రి అన్నారు. ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం.. ప్రపంచమంతటా అన్ని సంస్థలు, రంగాలలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన 3 నెలలోనే 5 లక్షల మందికి ఉద్యోగాలివ్వడం ముఖ్యమంత్రి జగన్ నాయకత్వ పటిమకు నిదర్శనమన్నారు. ఏపీలో అనంతపురం, విశాఖపట్నం కేంద్రంగా భవిష్యత్తులో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి తెలిపారు. అనంతరం అక్టోబజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరిపారు. ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు గల ఇండస్ట్రి, ఐటీ పాలసీ ప్రతిపాదనలపై పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ కూపర్స్) సంస్థ ప్రతినిధులు రాకేశ్, శ్రీరామ్‌లతో సమాలోచనలు చేశారు. పెట్టుబడులకు సుముఖం.. సౌకర్యాలు, సేవలందించే పేరున్న హోటల్ హిల్టన్ ప్రతినిధి మంత్రితో సమావేశమయ్యారు. ఏపీలో హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలను, ఆంధ్రప్రదేశ్ విశిష్ఠతను మంత్రి వివరించారు. కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఆ సంస్థ ప్రతినిధి మంత్రితో అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో విశ్వ అపెరల్ గార్మెంట్ ఎక్స్ పోర్టర్ సంస్థ ప్రతినిధులు కూడా మంత్రి మేకపాటితో భేటీ అయ్యారు. ఎగుమతులు, వాణిజ్యం తదితర అంశాలపై ఆ సంస్థ ప్రతినిధి మైథిలి మంత్రితో చర్చించారు. -
కార్పొరేట్ పన్నుకోత : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్నురేటు తగ్గింపు నిర్ణయంపై స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్నినింపింది. ఏకంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 2250 పాయింట్లు ఎగిసింది. అటు దేశీయ వ్యాపార దిగ్గజాలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది చాలా ఉన్నతమైన చర్య అని అభివర్ణించారు. పన్ను తగ్గింపు వల్ల ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ముఖ్యంగా వృద్ధి చర్యలు లోపించాయని ట్విటర్లో బహిరంగంగా విమర్శించిన బయోకాన్ ఎండీ, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఆర్థికమంత్రి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ఆర్థిక వృద్ధితోపాటు పెట్టుబడులను పునరుద్ధరిస్తుందన్నారు. ఇది గొప్ప చర్య. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆమెకు నా హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు. కార్పొరేట్ పన్ను రేటును 25 శాతానికి తగ్గించే నిర్ణయం ధైర్యమైన, ప్రగతిశీల అడుగు. ఇదో బిగ్ బ్యాంగ్ సంస్కరణ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి భారతీయ కంపెనీలకు ఊతమిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతానిస్తోందన్నారు. పిరమల్ ఎంటర్ప్రైజ్ చైర్మన్ అజయ్ పిరమల్ మాట్లాడుతూ దీనికోసమే తామంతా ఎదురుచూస్తున్నామన్నారు. ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసినందుకు ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి అభినందనలు తెలిపారు. ఇది ఉత్పాదక రంగానికి పునరుజ్జీవనమిచ్చే నిర్ణయమని ఫిక్కీ చైర్మన్ సందీప్ సోమనీ తెలిపారు. ఈ ప్రకటన కార్పొరేట్ భారతానికి మంచి ఊతం, ముఖ్యంగా కష్టతరమైన దశలో ఉన్న ఉత్పాదక రంగాన్ని కొత్త శక్తి వస్తుందన్నారు. కార్పొరేట్లపై ఆదాయపు పన్నును తగ్గించాలని తాము చాలాకాలంగా అభ్యర్థిస్తున్నామని గుర్తు చేశారు. కేపీఎంజీ కొర్పొరేట్ హెడ్ హితేష్ డి గజారియా స్పందిస్తూ ఇది చాలా సానుకూల దశ, మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్థికమంత్రి ఎట్టకేలకు బలమైన చర్యలు తీసుకున్నారని రెలిగేర్ బ్రోకింగ్‌లోని విపి రీసెర్చ్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత కొన్ని త్రైమాసికాలలో కార్పొరేట్ ఆదాయాలు దిగజారిపోయాయి, ప్రధానంగా కొనసాగుతున్న మందగమనం కారణంగా కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు అంటే కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకమే. మరోవైపు కార్పొరేట్ పన్నుకోత నిర్ణయంపై కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఇది హౌడీమోదీ ఈవెంట్ కోసం తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందే అయినప్పటికీ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న కునారిల్లుతున్న ఆర్థికవ్యవస్థను రానున్న పెట్టుబడులు పునరుద్ధరాస్తాయా అనేది సందేహమేనని ఆయన ట్వీట్ చేశారు. అటు ఆర్థికమంత్రి ఇంటిముందు కాంగ్రెస్శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. Timing of FM announcement dictated by #HowdyModi event. PM can now say, "I have come to Texas promising lower Taxes". Is this his 'trump card'? — Jairam Ramesh (@Jairam_Ramesh) September 20, 2019 దేశీయ సంస్థలకు, కొత్త దేశీయ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తామని, కొత్త తయారీ సంస్థలకు ప్రస్తుతం ఉన్న రేట్లు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అభిమానులకు షాకిచ్చిన గాయని
ప్రముఖ అమెరికన్ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(36) తన అభిమానులకు షాకిచ్చింది. ఇంకపై సంగీత ప్రపంచం నుంచి దూరంగా వుంటాలనుకుంటున్నానని వెల్లడించారు. నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించగానే కోట్లాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక పై తాను కుటుంబ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు నిక్కీ తెలిపారు. సంగీత పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇకపై తాను కుటుంబ జీవితం గడపాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే తన తాను చనిపోయేంతవరకు అభిమానులు తనను అభిమానిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 2 కోట్ల అభిమానులను సంపాదించుకున్న నిక్కీ మినాజ్ తన బాయ్ ఫ్రెండ్ జూ పెటీని రహస్యంగా పెళ్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ట్విటర్ అకౌంట్ పేరును మిసెస్ పెటీగా మార్చుకోవడం విశేషం. పెటీని పెళ్లాడబోతున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, ఆరు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకున్నారు. I’ve decided to retire & have my family. I know you guys are happy now. To my fans, keep reppin me, do it til da death of me, ❌ in the box- cuz ain’t nobody checkin me. ✅ Love you for LIFE 😘♥️🦄 — Mrs. Petty (@NICKIMINAJ) September 5, 2019 -
కువైట్‌లోని 92 కంపెనీలపై నిషేధం
కువైట్‌లో నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా కార్మికులను రోడ్డున పడేస్తున్న కంపెనీలను భారత విదేశాంగ శాఖ నిషేధించింది. ఈ కంపెనీలు కార్మికులకు పని కల్పించే పేరిట వీసాలను జారీచేసి కువైట్‌కు చేరిన తరువాత కార్మికులను పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ విధమైన 92 కంపెనీలను గుర్తించి వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ కంపెనీల జాబితాను అధికారులు విదేశాంగ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కువైట్‌లో ఉపాధి, ఉద్యోగం పొందాలనుకునేవారు తమకు వీసా జారీ చేసిన కంపెనీ విదేశాంగ శాఖ బ్లాక్‌లిస్టులో ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సి ఉంది. వీసా పొందిన వారికి ఒప్పందం ప్రకారం పని కల్పించకపోవడం, సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో కార్మికులు ఇబ్బందులు పడు తున్నారు. కువైట్ రావడానికి చేసిన అప్పులు తీరకపోవడం.. స్వదేశానికి వెళ్లినా అక్కడ ఏమి చేయాలో తెలియక కార్మికులు అక్కడే ఉండిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఖల్లివెల్లిగా (అక్రమ నివాసులు) మారుతున్నారు. కొంతమంది కార్మికులు గత ఏడాది కువైట్ ప్రభుత్వం అమలు చేసిన క్షమాభిక్షతో ఇంటికి చేరుకున్నారు. -ఎన్. చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) వీసాల దందా... కార్మికులు తక్కువ మంది అవసరమైనప్పటికీ కొన్ని కంపెనీలు లెక్కలేనన్ని వీసాలను జారీచేసి కార్మికులను పెద్ద సంఖ్యలో రప్పించుకుంటున్నాయి. ఫలితంగా నైపుణ్యం ఉన్నవారికి ఆ నైపుణ్యానికి అనుగుణంగా పని లభించకపోవడం, నైపుణ్యం లేని వారికి శక్తికి మించి పని లభించడంతో గందరగోళ పరిస్థితి ఎదురవుతోంది. వీసాల దందాను అరికట్టడానికి డొల్ల కంపెనీలను గుర్తించి మన విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులు వెబ్సైట్లో జాబితా పెట్టారు. కాగా, ఈ కంపెనీలను మన దేశం నిషేధించి నప్పటికీ ఇతర దేశాల నుంచి కార్మికులు వస్తునే ఉన్నారు. విదేశాంగ శాఖ వెల్లడించిన కంపెనీల జాబితా ఇదీ.. 1. అల్ బ్లాసీమ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 2. అషీ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 3. జెర్సెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 4. అల్ వెలియా ట్రావెల్ అండ్ టూరిజం 5. అల్ అతీక్ కంపెనీ 6. అల్ అమేర్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్ 7. సదా మసూద్ 8.అల్ సక్లవీ ఇంటర్నేషనల్ కంపెనీ 9. లండన్ గ్రూప్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ 10. ఆజాద్ అరేబియన్ జనరల్ ట్రేడింగ్అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 11.సాద్ ముత్లక్ డఖాన్ ఫర్ హోమ్ కేర్ సర్వీసెస్ కంపెనీ 12. నేషనల్ కాంట్రాక్టింగ్ కంపెనీ 13.కువైట్ ఇండస్ట్రీయల్ రిఫైనరీ మెయింటనెన్స్అండ్ ఇంజనీరింగ్ కంపెనీ (క్రేమెన్కో) 14.అల్ హజీమ్ కార్ ఎస్ట్ 15.తలాల్ ఎస్ఎఫ్ ఆల్ అలీ క్లీనిక్ 16.అల్ సబా ఫర్నీచర్ 17.వతానియా ఆఫ్టికల్స్ కంపెనీ 18.ఫస్ట్ ల్యాండ్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 19.బైత్ అల్ అకావత్ జనరల్ ట్రేడింగ్ 20.వరల్డ్ ఆఫ్ డిజైన్ కంపెనీ 21.ఇంటర్నేషనల్ సిటీ కార్ప్ కంపెనీ ఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ 22.మర్తయార్ అల్ అస్రార్ అల్ ఖాబందీ బిల్లింగ్నౌల్ స్కూల్ 23.ఎలైట్ యూనివర్సల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 24.అల్ ముస్తాస్హార్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 25.బాబర్ నసీర్ హజీ షహరాన్ అల్ ట్రేడ్ మార్క్ 26.జెంట్స్ మాస్టర్ హ్యాండ్ టైలర్స్ 27.అల్ అబ్రాక్ ట్రేడింగ్ కంపెనీ 28.అల్ అబ్రాజ్ క్లీనింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 29.అల్ ఖాందక్ సెక్యూరిటీ కంపెనీ 30.జనరల్ ట్రేడింగ్ కంపెనీ(జీటీసీ) 31.కువైట్ అల్ సాకూర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ 32.అరబ్ సెంటర్ ఫర్ కమర్షియల్ అండ్రియల్ ఎస్టెట్ కంపెనీ 33.అహ్మద్ గౌహులమ్ రెధా అష్ఖానాని కోఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ డబ్ల్యూ.ఐ.ఐ 34.టీజీఎం ఇంజనీరింగ్ కంపెనీ 35.అల్ మిషైల్ సెంటర్ ఫర్ క్లోక్స్ 36.జౌహారా డోరైన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 37.గల్ఫ్ కార్ రెంటల్ కంపెనీ 38.అల్ మసా సెంటర్ లాండ్రీ కో. 39.సఫేర్ అల్ నిదా కో. 40.వాఎల్ అల్ నుసీఫ్ ట్రేడింగ్ కో. 41.బాస్కో ఇంటర్నేషనల్ కో. జనరల్ అండ్ కాంట్రాక్టింగ్ 42.ఫస్ట్ కువైట్ జనరల్ ట్రేడింగ్ కో. 43.షబా ఇంటర్నేషనల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ 44.ఆక్సిజన్ హార్డ్ లైన్ కో. 45.అల్ తన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ అండ్ ఇట్స్ అసోసియేట్ మ్యాన్ టెక్ సర్వీసెస్ 46.సహారాస్ అల్ రోలా జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ కంపెనీ 47.అల్ అబ్రాజ్ క్లీనింగ్ కంపెనీ అండ్ సిటీస్ కాంట్రాక్టింగ్ కంపెనీ 48.అల్ ముదీర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ 49.అఖీలా ఫుడ్‌స్టఫ్ కంపెనీ 50.అల్ లయాలీ కార్గో ట్రాన్స్పోర్ట్ కో. 51.బ్రోన్జియా ప్రాజెక్ట్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 52.అల్ కహాల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఈస్ట్. 53.మషాల్ లైలుబీ వాల్ బాషూట్ 54.ఖరాఫీ నేషనల్ కేఎస్సీ 55.ఖరాఫీ నేషనల్ కేఎస్సీ (మూసివేయబడినది) 56.జనరల్ ట్రేడింగ్ 57.బయాన్ నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 58.అల్ బహార్ మెడికల్ సర్వీసెస్ కో. 59.తరీఖ్ కో. డబ్యూ.ఐ.ఐ 60.ఎస్కేఎస్ గ్రూప్ జనరల్ ట్రేడ్ అండ్ కన్‌స్ట్రక్టింగ్ కో. డబ్ల్యూ.ఐ.ఐ 61.అల్ మనార్ ఫ్యాక్టరీ ఫర్ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ సిమెంట్ 62.సబీక్ గ్లోబల్ ఫ్యాక్టరీ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ 63.అల్ తఖీబ్ ట్రేడింగ్ కో. అల్ తఖీబ్ చాక్లేట్ కో. 64.అల్ మిషల్ కో. అబయా అండ్ బీషూట్ వర్క్‌షాప్ సెంటర్ 65.బిన్ హమ్జా జనరల్ ట్రేడింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కో. అల్ సబీల్ అల్ అలామియా ఫర్ ద రిపేయిర్ ఆఫ్ జ్యూవెలరీ అండ్ సిల్వర్ 66.ఫహాద్ అల్ సలీమ్ సన్స్ అండ్ పార్ట్నర్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 67.యూఎన్ఐ సిగ్న్ అడ్వర్టైజింగ్ కో. 68.అల్ ఫూటూత ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్అండ్ కన్‌స్ట్రక్టింగ్ కంపెనీ 69.గాజ్వాన్ ట్రేడింగ్ అండ్ కన్‌స్ట్రక్టింగ్ కంపెనీ 70.ఫస్ట్ ప్రాజెక్టస్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 71.కేర్ సర్వీసెస్ (అల్ రియా కంపెనీ ఫర్ బిల్డర్స్అండ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్) 72.అల్ రువాడీ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ కంపెనీ 73.అల్ రియా కంపెనీ ఫర్ బిల్డింగ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్ 74.అల ఎస్సా మెడికల్ అండ్ సైంటిఫిక్ ఎక్యూప్మెంట్ కో. 75.నసర్ గోల్డెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ గ్రూప్ 76.నేషనల్ రెడీమిక్స్ కాంక్రీట్ కంపెనీ 77.అల్ రకీబ్ జనరల్ బిల్డింగ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 78.రవ్నాక్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. తయాబా కిచెన్ ఫ్రమ్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ 79.హమీద్ మజ్యాద్ అలీ అల్ద్వానీ 80.నెస్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీ డబ్ల్యూ.ఎల్.ఎల్ 81.ఎనాస్కో జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీడబ్ల్యూ.ఎల్.ఎల్ 82.క్రిస్టియల్ హౌజ్ జనరల్ ట్రేడింగ్ కో. 83.అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీ(ఏటీసీ) 84.స్విస్ మెడికల్ సర్వీసెస్ 85.అబ్దుల్లా యూసుఫ్ అల్ రాద్వాన్ జనరల్ ట్రేడింగ్అండ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 86.స్పీడ్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్. కో. 87.హైతమ్ రెస్టారెంట్ 88.అల్ అల్మియా ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెంపర్డ్ గ్లాస్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 89.లాబ్‌స్టర్ లేక్ రెస్టారెంట్ 90.సకీనా బుక్ స్టాల్ సకినా ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్ కో. 91.ఖుదాస్ అల్ అహిలియా కో. జనరల్ ట్రేడింగ్ 92.అల్ అహిలా జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. తెలంగాణ కార్మికులకు విదేశాంగ శాఖ చేయూత గల్ఫ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇరుక్కుపోయిన తెలంగాణ కార్మికులను భారత విదేశాంగ శాఖ ఆదుకుంది. జెఅండ్పి కంపెనీ సౌదీ ఆరేబియాలో భవన నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఆ కంపెనీలో ఉపాధికి వెళ్లారు. అయితే, గత సంవత్సరం ఏప్రిల్ వరకు వేతనాలు చెల్లించిన కంపెనీ యజమాన్యం ఆ తరువాత నిలిపివేసింది. అంతేకాకుండా అకామ(గుర్తింపు)ను రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు అక్కడే ఉండిపోయారు. దీని కారణంగా కార్మికులు బయట పనిచేయలేకపోయారు. అలాగే స్వదేశానికి రావాలన్నా వారిని పంపించేందుకు కంపెనీ యాజ మాన్యం అంగీకరించలేదు. దీంతో కార్మికులకు సౌదీ ఆరేబియాలోని మన విదేశాంగ శాఖ అధికారులతో పాటు లేబర్కోర్టును ఆశ్రయించడంతో సౌదీ ప్రభుత్వం స్పందించింది. లేబర్‌కోర్టు సూచన మేరకు సౌదీ ప్రభుత్వం భారత్‌కు వెళ్లే కార్మికులకు విమాన టికెట్లు సమకూర్చింది. 56 మంది తెలంగాణ కార్మికుల్లో ఇప్పటికే కొంతమంది స్వదేశానికి రాగా.. మరికొంత మంది ఈనెల 17న రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దాదాపు 8 నెలలకు సంబంధించి వేతనాలు కార్మికులకు అందాల్సి ఉంది. ఆ బకాయిలు త్వరలో కార్మికులకు అందనున్నాయి. విదేశాంగ శాఖ చొరవ చూపడం.. లేబర్‌కోర్టు సానుకూలంగా స్పందించడంతో తమకు న్యాయం జరిగిందని కార్మికులు చెప్పారు. -
తయారీరంగంలో ఇది మన మార్కు!
సాక్షి, హైదరాబాద్: మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన శరవేగంగా సాగుతోంది. వైద్య ఉపకరణాల తయారీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో ‘మెడికల్ డివైజెస్ పార్కు’ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమలకు భూకేటాయింపులు కూడా జరిగాయి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. పార్కు నిర్మాణానికి వీలుగా సుల్తాన్పూర్ పరిధిలోని 174, 70 సర్వే నంబర్ల పరిధిలో 557.32 ఎకరాలను కేటాయించింది. ఔటర్‌రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను టీఎస్ఐఐసీ చేపట్టింది. 2017 జూన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్కును రెండు దశల్లో ఏ, బీ బ్లాకులుగా అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి పార్కు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.9 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు పార్కులో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.35 కోట్ల మేర ఖర్చు చేసింది. రూ.20 కోట్లతో పార్కు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొండలను పిండి చేసి.. పార్కు ఆవరణలో ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తుండటంతో 272 ఎకరాల్లో మెడికల్ డివైజెస్, 226 ఎకరాల్లో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేలా డీపీఆర్‌లో అధికారులు మార్పులు చేశారు. మరో 47 ఎకరాలను మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్’కు కేటాయించారు. వంద, 60 అడుగుల వెడల్పుతో 5.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, హై టెన్షన్ విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ట్రాన్స్‌కో విభాగం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. నీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయిం చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఐఐసీ ప్రతి పాదనలు సమర్పించింది. పార్కుకు కేటాయించిన ప్రాంతంలో 150 ఎకరాలు మాత్రమే చదునుగా ఉండగా, మిగతా భూమి కొండలు, గుట్టలతో నిండి ఉంది. దీంతో కొండలను పిండి చేయాల్సి రావ డంతో ఖర్చు కూడా పెరుగుతున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. రెండంకెల వృద్ధి రేటు లక్ష్యంగా... దేశంలో వైద్య ఉపకరణాల తయారీ రంగం శైశవదశలో ఉన్న నేపథ్యంలో బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. దేశంలో మూడు బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు జరుగుతుండగా రెండంకెల వృద్ధి రేటుతో 2023 నాటికి 11 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో స్థానికంగా వైద్య ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘లైఫ్ సైన్సెస్ పాలసీ 2015–2020’లో భాగంగా మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇప్పటివరకు మెడికల్ డివైజెస్ పార్కులో 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమకు భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమల ద్వారా రూ.3,631.97 కోట్ల పెట్టుబడులతోపాటు 1,588 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2019 చివరిలోగా భూ కేటాయింపు పొందిన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించే భఃవిధంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. క్రషర్ల తొలగింపునకు నోటీసులు మెడికల్ డివైజెస్ పార్కుకు కేటాయించిన సర్వే నంబరు 174లో గతంలో నాలుగు మైనింగ్ కంపెనీలకు క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం పార్కులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నా, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఖాళీ చేసేందుకు క్రషర్ల యజమానులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రెండు యూనిట్లను మూసివేయించిన టీఎస్ఐఐసీ.. మరో రెండు యూనిట్ల మూసివేతకు కూడా నోటీసులు జారీ చేసింది. -
చిన్న పరిశ్రమ వృద్ధిపై ఆర్బీఐ దృష్టి
ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరింత దృష్టి సారిస్తోంది. ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రంగం ప్రతినిధులతో వచ్చేవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సమావేశం కానున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) ప్రతినిధులతో కూడా తాను వచ్చేవారం సమావేశం కానున్నట్లు శక్తికాంత్ దాస్ ట్వీట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే... ∙ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలు చేయడానికి ఆర్బీఐ బుధవారం ఒక అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వం వహిస్తారు. ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ, 2019 జూన్ నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతపై, ఇందుకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి పెడుతుంది. దేశం మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ వాటా 40%కాగా, తయారీ రంగంలోఈ విభాగం వాటా 45 శాతం.∙ఆర్బీఐ మంగళవారం చిన్న పరిశ్రమలకు భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలోనే ఈ రంగానికి సంబంధించి తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం– రూ. 25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్వ్యవస్థీకరించడానికి ఆర్బీఐ అనుమతించింది. అయితే సంస్థ రుణం పునర్వ్యవస్థీకరించే నాటికి, ఆ సంస్థ జీఎస్టీలో నమోదై ఉండాలి. అయితే జీఎస్టీ నమోదు అవసరం లేదని మినహాయింపు పొందిన ఎంఎస్ఎంఈలకు ఇది వర్తించదు. ఎన్బీఎఫ్సీ ప్రతినిధులతో దాస్ సమావేశం మరో ముఖ్య విశేషం. దేశంలోని అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో పలు ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. లిక్విడిటీ, చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. రుణ పునర్వ్యవస్థీకరణ స్కీమ్‌పై ఎంఎస్ఎంఈ డిమాండ్ ఇదిలావుండగా, ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇంకా రిజిస్టర్ కాని కంపెనీలకూ వర్తింపజేయాలని ఎంఎస్ఎంఈ డిమాండ్ చేసింది. సంబంధిత సంస్థల రుణాలనూ ప్రాధాన్యతా రంగానికి ఇస్తున్న రుణాలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. -
వాహనాలకు ‘ఎలక్ట్రిక్’ షాక్!
న్యూఢిల్లీ: ఇప్పటికే అధిక ధరలతో బెంబేలెత్తుతున్న వాహన కొనుగోలుదారుల నెత్తిన త్వరలో మరింత పన్ను పోటుకు రంగం సిద్ధమవుతోంది. దేశీయంగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా.. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక సెస్సు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ద్విచక్రవాహనాలు మొదలుకుని కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాణిజ్య వాహనాల దాకా అన్నింటిపై సుమారు రూ. 500– రూ. 25,000 దాకా ఈ సెస్సు భారం పడనుంది. ఈ వివాదాస్పద ప్రతిపాదన సహా పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించేందుకు గురువారం కేంద్ర ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా సారథ్యంలో కార్యదర్శుల కమిటీ భేటీలో నీతి ఆయోగ్ చేసిన ‘ఫీబేట్’ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు వివరించాయి. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో పాటు భారీ పరిశ్రమలు, విద్యుత్, ఆర్థిక సర్వీసులు, రెవెన్యూ, పెట్రోలియం తదితర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఇందులో పాల్గొననున్నారు. కాలుష్య కారక వాహనాలపై సెస్సు విధించడం, పర్యావరణ అనుకూల వాహనాలకు (ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు) సబ్సిడీ అందించడం ఈ ఫీబేట్ ప్రతిపాదన ఉద్దేశం. దీని ప్రకారం ఉద్గారాలు వెలువరించే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ)తో పని చేసే ద్విచక్ర వాహనాలపై సగటున రు. 500 మేర ఫీబేట్ విధించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, త్రిచక్ర వాహనాలపై రూ. 1,000, కార్ల వంటి నాలుగు చక్రాల వాహనాలపై రూ. 12,000, బస్సులు.. ట్రక్కులు తదితర వాణిజ్య వాహనాలపై రూ. 25,000 మేర ఫీబేట్ విధించాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లుపేర్కొన్నాయి. రూ. 7,646 కోట్ల సమీకరణ.. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించగలిగే దిశగా తొలి ఏడాది లో అదనపు ఆదాయ మార్గాల ద్వారా రూ. 7,646 కోట్లు సమీకరించేలా నీతి ఆయోగ్ ప్రతిపాదనలు ఉన్నాయి. 2019 ఏప్రిల్‌లో ప్రారంభమై ఆ తర్వాత అయిదేళ్ల వ్యవధిలో ఐసీఈ వాహనాలపై సెస్సు రూ. 7,646 కోట్ల నుంచి క్రమంగా రూ. 43,034 కోట్ల దాకా చేరొచ్చని సంబంధిత వర్గాల అంచనా. ఇలా ఫీబేట్ ద్వారా సమీకరించిన నిధులను ఫేమ్ ఇండియా స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగించనున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ అభ్యంతరాలు ఇలా ఎలక్ట్రిక్ వాహనదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సాంప్రదాయ వాహనాలపై సెస్సులు విధించడం సరికాదని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎక్కువగా చిన్న కార్లు వినియోగించే భారత్ వంటి దేశంలో సబ్సిడీలతో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలమయంగా చేయాలన్న ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నది కాగలదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. ‘సబ్సిడీల ప్రాతిపదికన చిన్న కార్ల ఎలక్ట్రిఫికేషన్ సాధ్యపడుతుందని వ్యక్తిగతంగా నేనైతే భావించడం లేదు. ఇందుకోసం టెక్నాలజీ అవసరం అంతే తప్ప. సబ్సిడీలివ్వడమనేది లాభసాటి మార్గమని అనుకోవడం లేదు. సబ్సిడీలతో పెద్ద కార్లున్న సంపన్నులే లాభపడతారు తప్ప.. లక్ష్యం నెరవేరదు’అని ఆయన అభిప్రాయపడ్డారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలొక్కటే మార్గం కాదని.. ఇతరత్రా హైబ్రీడ్, బయోఫ్యుయల్స్, సీఎన్జీ వాహనాలను కూడా ప్రోత్సహించే అంశం పరిశీలించవచ్చన్నారు. ఈవీలపై రూ. 50 వేల దాకా సబ్సిడీ.. నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం ఫీబేట్ అమలు చేసే తొలి ఏడాదిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రూ. 25,000, త్రిచక్ర వాహనాలకు రూ. 40,000, ఎలక్ట్రిక్ కారుకు రూ. 50,000 దాకా సబ్సిడీ అందించనున్నారు. ఇది నేరుగా నగదు బదిలీ రూపంలో ఉంటుంది. కాలుష్యకారక వాహనాలపై సెస్సు విధించి, పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసేవారికి రిబేటునిచ్చే విధానాన్నే ఫీబేట్గా వ్యవహరిస్తా రు. నార్వే, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే, దేశీయంగా భారీ స్థాయిలో ఉండే ద్విచక్ర వాహనదారులపై ఫీబేట్ విధించడం వారిపై మరింత భారం మోపడమే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనపై గతంలో భారీ పరిశ్రమల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
వెంకీ... ఖుష్బూ@ 32
వెంకటేశ్ ఐదు పదుల వయసు దాటేసిన విషయం తెలిసిందే. కానీ తన వయసు ఇంకా 32 ఏళ్లే అంటున్నారాయన. వెంకీ అబద్ధం చెప్పడం లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. యాక్టర్‌గా 32 ఇయర్స్ అని ఆయన అంటున్నారు. ‘‘14 ఆగస్టు 1986లో నేను హీరోగా నటించిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలైంది. మంగళవారంతో నాకు ఇండస్ట్రీలో 32 ఏళ్లు ముగిశాయి. ఈ ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేయడంతో పాటు అభిమానించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని వెంకీ అన్నారు. ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యేందుకు వెంకీ ఫొటో షేరింగ్ యాప్ ‘ఇన్స్టాగ్రామ్’లో జాయిన్ అయ్యారు. ‘‘సౌత్‌లో హీరోయిన్గా నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలై అప్పుడే 32 ఏళ్లు కంప్లీట్ అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలాను చూశా. అండగా ఉన్నవారికి థ్యాంక్స్’’ అన్నారు ఖుష్బూ. -
కందకాల ద్వారా పరిశ్రమకు, తోటకు నీటి భద్రత!
ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షం కురవకపోయినా.. సంగారెడ్డి జిల్లా పసలవాది గ్రామ పరిధిలో ఒక పరిశ్రమకు, దాని పక్కనే ఉన్న మామిడి తోట, వరి పొలానికి నీటి కొరత లేదు! ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది నిజం. ఇందులో మాయ మంత్రాలేమీ లేవు. ఇది కేవలం కందకాల మహత్మ్యం! అది 13.5 ఎకరాల భూమి. అందులో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన పెద్ద ఇండస్ట్రియల్ షెడ్ ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం దీన్ని వత్సవాయి కేశవరాజు కొనుగోలు చేశారు. అప్పటికి ఒకటే బోరు ఉంది. మరో 4, 5 చోట్ల బోరు వేశారు. చుక్క నీరు పడలేదు. ఇక ఉన్న బోరే దిక్కయింది. స్టెయిన్లెస్ స్టీల్ పైపుల తయారీ పరిశ్రమ అది. పరిశ్రమకు నీరు అవసరం ఉంటుంది. ఆరు ఎకరాల్లో మామిడి మొక్కలు నాటారు. మిగతా భూమిలో కంది తదితర పంటలు పండించే వారు. ఎండాకాలంలో బోరుకు నీరు తగినంత అందేది కాదు. ఆగి, ఆగి పోసేది. అటువంటి పరిస్థితుల్లో మిత్రుడు ప్రకాశ్‌రెడ్డి సూచన మేరకు వాన నీటి సంరక్షణ చేపట్టి నీటి భద్రత పొందాలన్న ఆలోచన కలిగింది. కందకాలతో స్వల్ప ఖర్చుతోనే నీటి భద్రత పొందవచ్చని ‘సాక్షి’ దినపత్రిక ద్వారా తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(984 956 6009)ని సంప్రదించి, ఆయన పర్యవేక్షణలో 2015లో కందకాలు తవ్వించారు. ఇండస్ట్రియల్ షెడ్‌పై నుంచి పడే వర్షపు నీరు మొత్తం అంతకు ముందు వృథాగా బయటకు వెళ్లిపోయేది. ఆ నీటిని మొత్తాన్నీ భూమిలోకి ఇంకేలా చంద్రమౌళి దగ్గరుండి మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. కందకాలు నిండినా నీరు బయటకు పోకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకుతూ ఉన్నది. ఫలితంగా నీటికి వెతుక్కోవాల్సిన పని లేకుండాపోయిందని కేశవరాజు ‘సాగుబడి’కి తెలిపారు.పరిశ్రమకు, డ్రిప్‌తో పెరుగుతున్న మామిడి తోటకు ఈ మూడేళ్లలో ఎటువంటి నీటి కొరతా రాలేదన్నారు. మామిడితోపాటు జామ, బత్తాయి మొక్కలు సైతం నాటామని, సేంద్రియ పద్ధతుల్లో జీవామృతం తదితరాలతోనే సాగు చేస్తున్నామన్నారు. కందకాలు తవ్వి చుక్క నీరు వృథాగా పోకుండా ఇంకింపజేయడం వల్ల నీటికి కొరత లేకుండా పనులు సాఫీగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఇంతవరకు చెప్పుకోదగ్గ వర్షం పడకపోయినప్పటికీ.. నీటి కొరత లేని కారణంగా.. రెండెకరాల్లో తెలంగాణ సోనా వరి సాగు చేస్తున్నామని కేశవరాజు (98489 90129) సంతోషంగా చెప్పారు. -
కార్పొరేట్లపై విశ్వాసానికి ఊతం..
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న పారిశ్రామికవేత్తలతో కలిసి తిరగడానికి తాను భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. వ్యాపారవర్గాలపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఇవి దోహదపడగలవని ఆశాభావం వ్యక్తం చేశాయి. ‘ఒకానొక దురదృష్టకర పార్శ్వం కారణంగా పరిశ్రమపై విముఖత పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని వ్యాఖ్యలు విశ్వాసాన్ని పెంపొందించేవిగా ఉన్నాయి‘ అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇటు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తానని భరోసానిస్తూనే.. అటు దేశానికి, ఎకానమీకి హానిచేసే వ్యాపారవేత్తలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. పరిశ్రమపై ప్రజలకు దురభిప్రాయాలేవైనా ఉంటే వాటిని తొలగించేందుకు, ప్రైవేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా చెప్పారు. రైతులు, కార్మికులు, బ్యాంకర్లలాగే వ్యాపారవేత్తలు కూడా దేశాభివృద్ధికి తోడ్పడ్డారని, వారితో కలిసి కనిపించడానికి తానేమీ సంకోచించబోనని ఆదివారం లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. -
కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రోత్సాహం
పటాన్చెరు: రాష్ట్రంలో కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారంలో పరిశ్రమల వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పారిశ్రామిక పెట్టుబడులను స్వాగతిస్తున్నాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామికాభివృద్ధిని కాంక్షిస్తోందన్నారు. అయితే తమ ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పారిశ్రామికవాడలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న పరిశ్రమలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. 1,120 పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల తరలింపుపై అధ్యయనం చేయాల్సిందిగా ఈపీటీఆర్ఐ సంస్థకు సూచించినట్లు తెలిపారు. సంస్థ నివేదిక ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్, జహీరాబాద్‌లోని బూచనెల్లి, పటాన్‌చెరులోని లక్డారం, పాశమైలారం, సిద్దిపేటలోని వెల్దుర్తి, రంగారెడ్డిలోని నవాబ్‌పేట, హుస్సేన్‌బాద్, అరకట్ల, రాకంచర్ల ప్రాంతాలకు ఓఆర్ఆర్ లోపలున్న పరిశ్రమలను తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఆ పారిశ్రామికవాడలకు వెళ్లాలని హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని పారిశ్రామికవేత్తలకు సూచిస్తామన్నారు. కాలుష్య నివారణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసివేస్తామని తెలిపారు. కొందరు కాలుష్య వ్యర్థాలను పాడైన బోరు బావుల గొట్టాల ద్వారా భూమి పొరల్లోకి పంపిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాశమైలారంలో ఉన్న అన్ని కాలుష్య పరిశ్రమలకు చెందిన ఘన, ద్రవ వ్యర్థాలను ట్రీట్ చేసే జీరో డిశ్చార్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను రూ.104 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాల మల్లు తదితరులు పాల్గొన్నారు. రెండు విచిత్రాలు.. భాష విషయంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒకటి కాదు.. రెండు విచిత్రాలు. కొందరేమో తెలుగువారై ఉండీ తెలుగులో మాట్లాడలేరు. తెలుగు మాతృభాష కాని వారు వచ్చి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతు న్నారు. మరొకటి.. మనవాళ్లు దుబాయ్, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. కానీ, హైదరాబాద్‌లో ఏ పెద్ద భవంతి నిర్మాణం పను ల్లోనైనా చూడండి.. అంతా ఇతర రాష్ట్రాల వారే. కనీసం 70 శాతం మంది బయటి వాళ్లే. మన వాళ్లే మో విదేశాల్లో ఒళ్లు వంచి పనిచేస్తారు. ఇక్కడ మాత్రం చేయరు’ అని వ్యాఖ్యానించారు. -
వేతన జీవులకు మరో బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు లేదా వేతన జీవులకు మరో షాకింగ్ న్యూస్. ఫ్యాక్టరీలు లేదా ఆఫీసు క్యాంటీనల్లో అందించే కేటరింగ్ సర్వీసులపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ఈ విషయాన్ని గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) తెలిపింది. సర్వీసులపై జీఎస్టీ పెంపును ఏఏఆర్ ప్రతిపాదించిన అనంతరం ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటీన్లలో అందించే కేటరింగ్ సర్వీసులపై 18 శాతం రేటు అమల్లోకి వస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. 28.06.2017 నాటి సెంట్రల్ ట్యాక్స్ నోటిఫికేషన్ నెం.11/2017 ప్రకారం అవుట్డోర్ కేటరింగ్ సర్వీసుల కింద ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటిన్లకు అందించే కేటరింగ్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలని ఏఏఆర్ ప్రతిపాదించింది. దీంతో క్యాంటీన్ సర్వీసులు అందజేసే రేష్మి హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్డోర్ కేటరింగ్ సర్వీసుల కింద 18 శాతం జీఎస్టీని విధిస్తోంది. దీనిపై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కేటరింగ్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలా? లేదా 5 శాతం జీఎస్టీ విధించాలా? అనే వివాదం చెలరేగింది. ఈ వివాదం నేపథ్యంలో ఏఏఆర్ పలు అంశాలను పరిశీలించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. జీఎస్టీ నిబంధనల కింద అవుట్డోర్ కేటరింగ్ అనే పదమే లేదని, అంతకముందు సర్వీసు పన్ను పాలనపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, కొన్ని కీలక పాయింట్లను పరిగణలోకి తీసుకుంటే, ఆఫీసు లేదా ఇండస్ట్రీ ఫ్యాక్టరీలలో అందజేసేవి క్యాంటీన్ సర్వీసులే కాదని తేల్చి చెప్పింది. వీటిపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. అవుట్డోర్ కేటరింగ్ ఈ సర్వీసులను అందజేస్తున్నాడని, ఈ నేపథ్యంలో 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. -
‘నిర్లక్ష్యపు’ నిప్పు
జిన్నారం(పటాన్చెరు): రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కోట్ల రూపాయల ఆస్థి నష్టంతో పాటు, కొన్ని సార్లు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పరిశ్రమల యజమానులు కనీస నియమనిబంధనలను కూడా పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నయాన్న విమర్శలు ఉన్నాన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు మరింతా పెరిగే ప్రమాదం ఉంది. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని ఖజీపల్లి, బొల్లారం, గడ్డపోతారం, గుమ్మడిదల, అనంతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో దాదాపు 200 రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 50 శాతానికి పైగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్ ప్రొడక్టులను తయారు చేస్తుంటారు. తగిన రక్షణ పరికరాలు లేకపోవటంతో తరచూ వీటిలోనే అధికంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన పరిశ్రమలకు అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదం జరుగుతున్న సమయంలో సైతం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు సంఘటనా స్థలానికి రాకుండా, ప్రమాదం జరిగిన తరువాత రోజు వచ్చి పరిశీలించటం ఆనవాయితీగా మారింది. ప్రమాదం జరుగతున్న సమయంలో తీవ్రత తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి అధికారులు అందుబాటులో ఉండడం లేదు. పరిశ్రమల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టరీస్ అధికారులు సూచించిన మేర రక్షణ చర్యలు ఉండాలి. ఈ విషయాన్ని అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇటీవల జరిగిన ప్రమాదాలు.. - గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో నెల రోజుల క్రితం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. - బొల్లారంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు నెలల క్రితం కార్మికులు రసాయనాలను కలుపుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది - బొంతపల్లిలోని మరో పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో కార్మికులకు గాయాలయ్యాయి. పరిశ్రమ పూర్తిగా దగ్ధం కావడంతో తీవ్ర ఆస్థినష్టం జరిగింది. - అనంతారంలోని మరో చిన్నతరహా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులుతీవ్రంగా గాయపడగా, భారీ ఆస్థి నష్టం జరిగింది. - ఇటీవల గుమ్మడిదలోని మహాసాయి రసాయన పరిశ్రమలో రసాయనాలను దింపుతుండగా స్పార్క్ వచ్చి ప్రమాదం జరిడంతో రూ. 30 కోట్ల వరకు ఆస్థినష్టం జరిగింది. పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. నిపుణులైన కార్మికులు లేకే..? రియాక్టర్ల వద్ద అనుభవం ఉన్న నిపుణులైన కార్మికులతో పనులు చేయించాల్సి ఉంటుంది. వీరికి అధిక మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యాలను అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. రసాయనాలను కలపడం, దిగుమతి చేస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎండాకాలం మరింత జాగ్రత్త అవసరం.. ఎండాకాలంలో రసాయన ప్రతి చర్యలు అధికంగా జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏటా పారిశ్రామిక వాడల్లో దాదాపు 30 ప్రమాదాలు జరిగితే అందులో 20 వరకు ఎండాకాలంలో జరిగినవే ఉంటాయి. అగ్నిమాపక కేంద్రం లేక.. పారిశ్రామిక వాడల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవటంతో ప్రమాదం జరిగిన సమయంలో ఆస్థినష్టం అధికమవుతోంది. గుమ్మడిదల, జిన్నారం మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో ఎమైనా ప్రమాదాలు జరిగితే పటాన్చెరు, జీడిమెట్ల, నర్సాపూర్, బీహెచ్ఈఎల్ల నుంచి అగ్నిమాపక వాహనాలు రావాల్సిన పరిస్థితి. గడ్డపోతారం పారిశ్రామిక వాడకు హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా విషయం కార్యరూపం దాల్చలేదు. తెలియని ప్రమాదాలు ఎన్నో.. మల్టీనేషన్ కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాల విషయం బయటకు రావటం లేదు. వాటిల్లో ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు మంటలను ఆర్పివేసేలా విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో కార్మికులు మృతి చెందినా విషయం బయటకు రానివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటున్నాం రసాయన పరిశ్రమల్లో అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకునేలా యజమాన్యాలకు సూచనలు చేస్తున్నాం. నిబంధనలను పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంతో పాటు, నోటీసులు అందిస్తున్నాం. ఇటీవల గుమ్మడిదలలో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. – రాజ్‌గోపాల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ప్యాక్టరీస్ అధికారి -
ఒడిదుడుకుల్లో లేసు పరిశ్రమ
నరసాపురం: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేతికళల్లో లేసు అల్లికలు ప్రాముఖ్యమైనవి. లేసు అల్లికలు ఎగుమతుల్లో నరసాపురం ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో ఈ ప్రాంతం వారికి పరిచయమైన లేసు అల్లికలు తరువాత కాలంలో ఇక్కడ ఓ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. ఇప్పుడంటే లేసు అల్లికలు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి సాగుతున్నాయి కానీ, గడిచిన ఐదు దశాబ్దాలుగా అమెరికాతో సహా పలు యూరప్ దేశాల్లో లేసు అల్లికలు అంటే నరసాపురం ప్రాంతానివే. నరసాపురం కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి లేసు ఉత్పత్తుల విదేశీ ఎగుమతులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక్కడి మహిళలు గమ్మత్తుగా గాలిలో చేతులు తిప్పుతూ రూపొందించే అల్లికలకు ఇప్పటికీ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవల ఈ పరిశ్రమ ఒడిదుడుకుల్లో సాగుతోంది. చైనా నుంచి వస్తున్న అధిక పోటీ, ఇక దేశీయంగా ప్రభుత్వాలు తోడ్పాటు ఇవ్వకపోవడంతో లేసు ఎగుమతిదార్లు నష్టాలు చవిచూస్తున్నారు. ఏటా సుమారు రూ.200 కోట్ల వరకూ విదేశీ మారకద్రవ్యాన్ని దేశానికి తెప్పిస్తున్న ఈ పరిశ్రమలో కీలకమైన అల్లికలలో మహిళలు శ్రమదోపిడీకి గురవుతూనే ఉన్నారు. కళ్లు పొడుచుకుని రాత్రి, పగలూ తేడాలేకుండా శ్రమించినా వారికి పనికి, కష్టానికి తగ్గ సొమ్ము దక్కడంలేదు. ప్రపంచ వినువీధిని కనువిందు చేస్తున్న లేసు పరిశ్రమలోని ప్రస్తుత స్థితిపై పరిచయమే ఈ కథనం. బ్రిటీష్ హయాంలో పరిచయం లేసు అల్లికల కళ విదేశాల నుంచి మన దేశానికి వచ్చింది. కానీ ప్రస్తుతం మనదేశం నుంచి విదేశాలకు లేసు అల్లికలు ఎగుమతి అవుతుండటం విశేషం. బ్రిటీష్ హయంలో జల రవాణా బాగా జరిగే కాలంలో నరసాపురం వ్యాపారకేంద్రంగా ఉండేది. ఇదే సందర్భంలో మత ప్రచారం, సహాయ కార్యక్రమాల నిమిత్తం కొన్ని మిషనరీలు ఇక్కడకు చేరుకున్నాయి. సుమారు 200 సంవత్సరాల క్రితం స్వీడన్ మిషనరీ సంస్థలు ఇక్కడకు వచ్చి, స్థానిక మహిళలతో పరిచయాలు పెంచుకోవడంలో భాగంగా లేసు అల్లికలను పరిచయం చేశారు. తరువాత కాలంలో పెద్ద పరిశ్రమగా మారింది. పురుషులు చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో, ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం చేయని మహిళలు ఈ లేసు అల్లికపై దృష్టి సారిస్తారు. భర్తకు ఆర్థికంగా తోడుగా నిలవాలనే మహిళల త్యాగపూరిత ఆలోచన కారణంగా అబ్బుర పరిచే డిజైన్లలో లేసు అల్లికలు సాక్షాత్కారమవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని అగ్రవర్ణ కుటుంబాల్లోని పేద, మధ్య తరగతి మహిళలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పని, ఉద్యోగం అంటూ బయటకు రారు. ఇలాంటి మహిళలు అందరూ లేసు అల్లికల్లో ఉంటారు. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రావులపాలెం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో 250 గ్రామాల్లో 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు సాగిస్తున్నట్టు అంచనా. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 10 వేల కుటంబాలవారు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదార్లు నరసాపురం ప్రాంతంలో 50 మంది వరకూ ఉన్నారు. యూపీలో మరో 25 మంది ఉంటారని సమాచారం. ఇక దేశంలో లేసు ఎగుమతులు ఎక్కడి నుంచీ జరగకపోవడం విశేషం. అబ్బుర పరిచే డిజైన్లు.. అంతర్జాతీయంగా డిమాండ్ విదేశీ సంపన్న కుటుంబాలవారి ఇళ్లలో దిండ్లపైనా, సోఫాసెట్, డైనింగ్ టేబుల్స్, డోర్కర్టెన్స్ పైనా ఈ ప్రాంతం నుంచి ఎగుమతి అయ్యే లేసు అల్లికలు దర్శనమిస్తాయి. ఇక విదేశీయులు ధరించే దుస్తులుగా కూడా లేసు అల్లికలకు ప్రాధాన్యం ఉంది. యూరప్ దేశాల్లో లేసు గార్మెంట్స్ అంటే ఓ క్రేజ్. దీంతో అనేక అబ్బుర పరిచే డిజైన్స్‌లో వీటిని తయారు చేస్తారు. అమెరికా, బ్రిటన్, హాలెండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ తదితర దేశాలకు లేసు అల్లికలు ఎగుమతి అవుతాయి. అక్కడ వీటికి మంచి డిమాండ్. కేంద్ర హస్తకళలు, జౌళిశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్ నెలల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తారు. నరసాపురం నుంచి, ఇటు యూపీ నుంచి అంతర్జాతీయ లేసు ఎగుమతిదార్లు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చిన వివిధ దేశాల వ్యాపారులు ఆర్డర్స్ ఇస్తారు. వారిచ్చిన ఆర్డర్ మేరకు ఎగుమతిదార్లు ఇక్కడ మహిళలచేత వాటిని తయారు చేయిస్తారు. విదేశాల్లో జరిగే ఎగ్జిబిషన్లకు ఇక్కడి ఎగుమతిదార్లు వెళ్లి స్టాల్స్‌లో ప్రదర్శనలు ఇస్తారు. ఇక్కడ సరుకు తయారు చేయడంలో మధ్యస్థంగా రెండు, మూడు వ్యవస్థలు ఉంటాయి. కమీషన్‌కు ఈ డిజైన్‌కు ఇంత అని వేరే వారికి పని అప్పగిస్తారు. మళ్లీ వారు లేసు అల్లే మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి దారాలు అవీ ఇచ్చి, ఏ డిజైన్‌లో అల్లిక కావాలో చెప్పి కుట్టించుకుంటారు. చైనా దెబ్బతో విలవిల దేశం నుంచి ఎగుమతి అవుతున్న లేస్ ఉత్పత్తులకు గత దశాబ్దకాలంగా చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో లేసు పరిశ్రమ ఓ మేరకు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చైనాలో లేసు అల్లికలకు సంబంధించిన ముడిసరుకు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అక్కడి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ముఖ్యంగా చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లలో, నాణ్యతతో కూడిన సరుకు లభ్యమవుతుంది. దీంతో మన ఎగుమతులకు పోటీ ఎక్కువైంది. మనవద్ద కూడా యంత్రాల ద్వారా తయారీ ఉన్నప్పటికీ చైనాతో పోటీపడే స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చైనా అందించినంత తక్కువ ధరకు మన ఎగుమతిదార్లు సరుకును ఇవ్వలేకపోతున్నారు. తాజాగా లేసు ఎగుమతులపై జీఎస్టీ కూడా 5 శాతం విధించారు. దీంతో వ్యాపారం ఇబ్బందికరంగా మారిందనేది లేసు ఎగుమతిదార్ల ఆవేదన. పైగా మన ప్రభుత్వం నుంచి ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితమే ఏటా రూ.100 కోట్ల మేర లేసు ఉత్పత్తులు ఎగుమతులు సాగేవి. ప్రస్తుతం కూడా రూ.150 నుంచి రూ. 200 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. శ్రమదోపిడీకి గురవుతున్న మహిళలు కళా నైపుణ్యంతో విశ్వఖ్యాతిని ఆర్జించిన లేసు పరిశ్రమలో కష్టం మొత్తం మహిళలదే. వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. లేసు పరిశ్రమ బాగున్న ఆ రోజుల్లోనూ, కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న ఈ రోజుల్లో కూడా ఆరుగాలం శ్రమించే మహిళలకు కష్టానికి తగ్గ ఫలితం దక్కడంలేదు. కుట్టు కుట్టే మహిళలు పొద్దు పొడవక ముందే లేచి ఇంటి పనులు ముగించుకుని, పిల్లలను స్కూళ్లకు, భర్తను బయటకు పంపంచి, వంట పూర్తిచేసి అల్లికల పనిలో పడతారు. టీవీ చూస్తున్నా కూడా చేతిలో సూది కదులుతూనే ఉంటుంది. -
ఈ సారైనా.. వచ్చేనా?
రాజంపేట: రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుపై ఆశలు నెమ్మదిగా ఆవిరవుతున్నాయి. స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను పాలకలకు చూపిస్తూ రైల్వేపరంగా నందలూరుకు ఉన్న ప్రాముఖ్యతను తెలియచేసేందుకు స్ధానిక నేతలకు ఉపయోగపడింది. ఇక అదికూడా రైల్వే యాజమాన్యం లేకుండా చేసింది. వందేళ్ల కిందటి స్టీమ్లోకోషెడ్ బ్రిటీషు రైల్వేపాలకుల చరిత్రకు ఇన్నాళ్లు ఆనవాళ్లుగా నిలిచింది. ఇప్పుడు ఈ షెడ్‌ను రైల్వే స్క్రాప్ కింద వేలం పెట్టి తొలిగించేసింది.ఈ షెడ్ ఉంటే నందలూరు రైల్వేపరిశ్రమ ఏర్పాటు ప్రస్తావన కొనసాగుతూనే ఉంటుందనే భావనతో తొలగించినట్లు ఉందని ఉద్యమకారులు పెదవివిరిస్తున్నారు. ఫలించని పోరాటలు.. ఉద్యమాలు నందలూరు రైల్వేకేంద్రంలో 1880 ప్రాంతంలో బ్రిటీషు రైల్వేపాలకులు స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి చెన్నై, గుంతకల్ వరకు రైలింజన్లతో ప్యాసింజరు, గూడ్స్‌రైళ్లను నడిపించేవారు. వందలాది క్వార్టర్స్, నివాసగృహాలతో వైభవంగా వెలుగొందింది నందలూరు. కాలానుగుణంగా ఆధునికసాంకేతికలో మార్పులు రావడంతో డీజల్, కరెంటు రైలింజన్లు రావడంతో షెడ్డ్లో ఉన్న 20 బొగ్గు ఇంజన్లను స్క్రాప్ కింద వేలంవేశారు. నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని పదేళ్ల కిందట అన్ని రాజకీయపక్షాలకు చెందిన నాయకులు రైల్వే ఐక్య పోరాటసమితిగా ఏర్పడ్డారు. 70రోజుల పాటు రిలేదీక్షలు, రాస్తారోకోలు, చేశారు. యూపీఏ ప్రభుత్వహయాంలో రైల్వేమంత్రి లాలుప్రసాద్ వద్దకు వెళ్లారు. ఆయన లోక్‌సభలో వ్యాగిన్ రిపేరువర్క్‌షాపు లేదా ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ పెడతామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజకీయదిగ్గజాలు నందలూరును సందర్శించారు. తమ ప్ర«భుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా రైల్వేపరిశ్రమను తీసుకొస్తామని హామీలు ఇచ్చారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు వెంకయ్యనాయుడు, పురందేశ్వరి, కేంద్రమంత్రులు సందర్శించివెళ్లారు. సర్వే, స్ధలనివేదికలు బుట్టదా ఖాలా అయ్యాయి. ఎంపీ మిథున్‌రెడ్డి అలుపెరగని కృషి.. నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తన శక్తిమేరకు కృషిచేస్తూనే ఉన్నారు. అనేక మార్లు రైల్వేమంత్రులను కలిసి వినతులు సమర్పించారు. సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, తమ ప్రాంతా లకు రైల్వేపరిశ్రమను తీసుకెళ్లేం దుకు జరుగుతున్న పరిణామాల్లోనే నందలూరుకు రైల్వేపరిశ్రమ రాని వ్వకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
టీడీపీ నేతల గుప్పెట్లో పండ్ల పరిశ్రమ
‘సార్..! జిల్లాలో సహకార డెయిరీని ఎలాగైతే మూసేసి హెరిటేజ్‌ను డెవలప్ చేసుకున్నారో.. ఇప్పుడు మామిడి రైతుల్ని అలాగే దోచేస్తా ఉండారు. టీడీపీకి చెందిన గల్లా అరుణకుమారి, సత్యప్రభతో పాటు చంద్రబాబు కంపెనీలు రూ.కోట్లు గడిస్తా ఉండాయి. రైతుకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఈ దోపిడీని అరికట్టాలి..’ అంటూ తిరుపతికి చెందిన బుజ్జమ్మ బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. పాదిరేడు వద్ద ప్రజా సంకల్పయాత్రలో ఆమె మాట్లాడుతూ మామిడి పంటను దోచుకుంటున్న ప్రైవేటు కంపెనీలకు ముకుతాడు వేయాలంటే రైతుల సహకార రంగం కిందికి మామిడి గుజ్జు పరిశ్రమను తీసుకురావాలని కోరారు. -
ఖాయిలా పరిశ్రమలకు చేయూతనివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఖాయిలా పడిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ (ఎంఎస్ఈ)ల పునరుద్ధరణకు బ్యాంకర్లు ముందుకు రావాలని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పిలుపునిచ్చారు. ట్రిపుల్ ఆర్ (రెక్టిఫికేషన్, రీ స్ట్రక్చరింగ్, రికవరీ) సూత్రాన్ని అమలు చేసి ఎంఎస్ఈలకు చేయూతనివ్వాలని కోరారు. పరిశ్రమల సమస్యలు గుర్తించి, పరిష్కారం చూపి.. రుణాలు పునరుద్ధరించి తమ రుణా లు రికవరీ చేసుకోవాలని సూచించారు. తక్కువ మొత్తంలోని రుణాలను పునరుద్ధరిస్తే అనేక చిన్న తరహా పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. గురు వారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎంఎస్ఈల సమస్యలు తెలుసుకోడానికి లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి నెలా జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్ సమా వేశాలు ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయిం చారు. మంత్రి కేటీఆర్ మాట్లా డుతూ.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమా లతో ముందుకు పోతోందని.. వాటికి సాయం అందించేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో బ్యాంకర్లు భాగస్వాములు కావాలన్నారు. నేతన్నకు ముద్ర రుణాలివ్వండి.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిలో బ్యాంకుల సహకారాన్ని గుర్తిస్తున్నామన్న మంత్రి.. రుణాలు, బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైతే మొండి బకాయిల జాబితాలో చేర్చకుండా కొంత సమయవివ్వాలన్నారు. వృత్తుల ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లలోని యూనిట్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని.. మహిళా పెట్టుబడిదా రులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు ముద్ర రుణాలివ్వలన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామాల్లో పరిశ్రమలు నెలకొల్పే వారికి అదనపు ప్రోత్సాహ కాలు ఇస్తామని కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అలాగే అన్ని జిల్లాల్లో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా సీఐఐ దృష్టి పెట్టాలని కోరారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రూపొందించిన ‘వరంగల్ విజన్ డాక్యుమెంట్ 2028’ను మంత్రి ఆవిష్కరిం చారు. రాష్ట్ర ప్రభుత్వం సీఐఐని విలువైన భాగస్వామిగా భావిస్తోందని కేటీఆర్ అన్నా రు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సీఐఐ తెలంగాణ చైర్మన్ వి.రాజన్న చెప్పారు. -
అక్టోబర్‌లో ‘మౌలిక’ వృద్ధి 4.7%
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమ రంగాల పనితీరు అక్టోబర్‌లో మందగించింది. ఉత్పాదకత వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 7.1 శాతంగా ఉంది. ప్రధానంగా సిమెంట్, స్టీల్, రిఫైనరీ ఉత్పత్తుల పేలవ పనితీరు మౌలిక రంగం మందగమనానికి ప్రధాన కారణంగా నిలిచింది. మరోపక్క, సెప్టెంబర్ నెల వృద్ధి రేటును పరిశ్రమల శాఖ 5.2 శాతం నుంచి తాజాగా 4.7 శాతానికి సవరించింది. ముఖ్యాంశాలివీ... ∙అక్టోబర్‌లో సిమెంట్ ఉత్పాదకత 2.7 శాతం క్షీణించింది. గతేడాది ఇదే నెలలో వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది. ∙స్టీల్ రంగంఉత్పాదకత వృద్ధి 17.4 శాతం నుంచి 8.4 శాతానికి దిగజారింది. ∙రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి కూడా గతేడాది అక్టోబర్‌లో 12.6 శాతం నుంచి ఈ అక్టోబర్‌లో 7.5 శాతానికి పడిపోయింది. ∙బొగ్గు రంగం మాత్రం కాస్త మెరుగ్గా 1.9 శాతం క్షీణత నుంచి 3.9 శాతానికి వృద్ధి చెందింది. ∙ఎరువుల రంగం వృద్ధి 0.7 శాతం నుంచి 3 శాతానికి ఎగబాకింది. ∙ఇక విద్యుత్ ఉత్పాదకత స్వల్పంగా 3 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గింది. ∙ ముడిచమురు ఉత్పత్తి 3.2 శాతం క్షీణత నుంచి 0.4 శాతం క్షీణతకు కాస్త మెరుగుపడింది. ∙సహజవాయువు ఉత్పాదకత 1.5% క్షీణత నుంచి 2.8% వృద్ధి బాటకు పురోగమించింది. ఏప్రిల్–అక్టోబర్ కాలానికి చూస్తే... ఈ ఆర్థిక సంవత్సరం 7 నెలల కాలానికి.. మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు 3.5%కి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 5.6%గా నమోదైంది. ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమలకు మొత్తం పారిశామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 40.27 శాతం వెయిటేజీ ఉంది. -
‘ఆమె’ చేతిలో 93 వేల పరిశ్రమలు
అమెరికా నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘అమెరికాలో 93 వేలకు పైగా పరిశ్రమలను నడుపుతోంది ప్రవాస భారతీయ మహిళలే. కానీ వీళ్ల రెవెన్యూ వాటా 2.9 శాతం మాత్రమే. అమెరికాలో మొత్తం 36 శాతం మహిళా పారిశ్రామికవేత్తలున్నారు. అయితే వీళ్లకు దక్కుతున్న కాంట్రాక్టులు చాలా తక్కువ..’’అని అమెరికా విమెన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో, సహ వ్యవస్థాపకురాలు మార్గట్ డార్ఫ్మన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 28 నుంచి జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో వాషింగ్టన్‌లోని ఫారిన్ప్రెస్ బిల్డింగ్‌లో ఆమె తాజాగా భారత మీడియా బృందంతో మాట్లాడారు. అమెరికా ప్రభుత్వం నుంచి మహిళా పారిశ్రామికవేత్తలకు అందుతున్న కాంట్రాక్టులు ఐదు శాతం కూడా లేవని చెప్పారు. ‘‘నిజానికి మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వాలని 2000లో ఓ బిల్లు కూడా పాసయింది. కానీ దాన్ని అమలు చేయడంలో పాలనా విభాగం విఫలమైంది. దాంతో మేం కోర్టులో ఓ పిటిషన్ వేసి 2005లో విజయం సాధించాం. అయినా కాంట్రాక్టులు అంతంత మాత్రమే దక్కుతున్నాయి. వారికి ఎక్కువ కాంట్రాక్టులు దక్కేలా ఇంకా కృషి చేస్తున్నాం. మా సంస్థ ఏర్పాటు లక్ష్యం కూడా అదే..’’అని ఆమె వివరించారు. కాంట్రాక్టులు, స్టార్టప్స్‌లకు పెట్టుబడులు కల్పించడం, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ శాఖలను సంప్రదించే వీలు కల్పించడం, స్త్రీ విద్య, కెరీర్ ప్రమోషన్స్ వాటిపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. ఏ దేశానికి చెందిన మహిళలకైనా తమ సహకారం ఉంటుందని, పెట్టుబడులను సమకూర్చడం నుంచి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందే దాకా అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు. ‘ఫెమిగ్రెంట్స్’నడుపుతోంది మన హైదరాబాదీనే యూఎస్ విమెన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మాదిరే మహిళా పారిశ్రామికవేత్తల కోసం పనిచేసే ఇతర సంస్థలు కూడా అమెరికాలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫెమిగ్రెంట్స్. దీన్ని ఇకా అలీవియాతో కలసి మన హైదరాబాద్‌కు చెందిన లావణ్య పోరెడ్డి నిర్వహిస్తున్నారు. ఇది కాక సిలీకాన్ వ్యాలీలోనే విమెన్ స్టార్టప్ ల్యాబ్ ఒకటి ఉంది. దీనికి జపాన్‌కు చెందిన అరి హోరీ సీఈఓగా ఉన్నారు. ‘‘సిలికాన్ వ్యాలీలో మనీ, పవర్ అన్నిటినీ కంట్రోల్ చేసేది పురుషులే. ఇక్కడున్న వెంచర్ కాపిటలిస్టుల్లో 90 శాతం మంది పురుషులే’’అని హోరీ పేర్కొన్నారు. -
ఇనుపరాడ్డు గుచ్చుకుని..
జిల్లాలోని వేర్వేరు చోట్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. బనగానపల్లె మండలం పలుకూరులో విద్యుదాఘాతంతో ఒకరు, ఆదోని మండలం బైచిగేరి సమీపంలోని రాజానగర్ వద్ద లారీ ఢీకొని మరొకరు, పాములపాడు మండలం బానకచెర్ల వద్ద బైక్ అదుపు తప్పి ఇంకొకరు మృతి చెందారు. అలాగే జూపాడుబంగ్లాలో నీటిలో పడిన గొర్రెను రక్షించేందుకు వెళ్లి ఓ యువకుడు, కర్నూలు నగర శివారులో భారీయంత్రం మధ్య ఇరుక్కుని ఓ యువకుడు దుర్మరణం చెందారు. కల్లూరు : నగర శివారు భారత్ గ్యాస్‌కు ఎదురుగా ఉన్న జితేష్ ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు వివరాల మేరకు..లక్ష్మీపురం గ్రామానికి చెందిన సీతన్న, సోమేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు బోయ మండ్ల యల్లప్ప (22) ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం బాటిల్స్ మూతలు తయారుచేసే యంత్రం చెడిపోయింది. ఆ యంత్రానికి మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా యంత్రాన్ని బయటకు తరలిస్తుండగా ఎల్లప్ప ఉన్న వైపు యంత్రం ఒరిగిపోయి ముందుకు కదలింది. ఈక్రమంలో ఎల్లప్ప గోడకు యంత్రానికి మధ్య ఇరుక్కుపోయాడు. యంత్రానికి ఉన్న పొడవైన ఇనుప రాడ్ అతడి ఛాతిలోకి దిగింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందాడు. తోటి కార్మికులు వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, ఉలిందకొండ పోలీసులకు సమాచారం అందించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో.. ఆదోని టౌన్: ఆదోని మండలం బైచిగేరి సమీపంలోని రాజానగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ గోపీకృష్ణ(42) దుర్మరణం పాలయ్యాడు. తాలూకా ఎస్ఐ సునీల్‌కుమార్ వివరాల మేరకు.. పట్టణంలోని ఎల్‌ఐజీలో నివాసముంటున్న హెడీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ పని నిమిత్తం ఎమ్మిగనూరుకు బైక్‌పై బయలుదేరాడు. రాజానగర్ క్యాంప్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య అంజనా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గోపికృష్ణ భార్య, తల్లి, బంధువులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో.. బనగానపల్లెరూరల్ : పలుకూరులో విద్యుదాఘాతంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. అవుకు గ్రామానికి చెందిన ఎం.పాండురంగ(44)కు పలుకూరుకు చెందిన దస్తగిరమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. దస్తగిరిమ్మ తమ్ముడికి ఈనెల 23, 24 తేదీల్లో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పాండురంగ భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంట్లో నీటి కోసం వినియోగించే విద్యుత్ మోటర్ ప్లగ్ తీసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. బావమరిది పెళ్లి చేసేందుకు వచ్చిన పాండురంగ ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.నందివర్గం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్య దస్తగిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెను కాపాడేందుకు వెళ్లి.. జూపాడుబంగ్లా: నీటిగుంతలో పడిన గొర్రెను కాపాడేందుకు వెళ్లిన ఓ యవకుడు నీటిగుంతలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం జూపాడుబంగ్లాలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన రహంతుల్లా, మైమున్ని దంపతులకు నలుగురు సంతానం. వారిలో రెండోవాడు షేక్ బషీర్ అహమ్మద్ (22) తండ్రితోపాటు గొర్రెలను మోపేందుకు వెళ్లేవాడు. ఉదయం జైన్ఇరిగేషన్ కంపెనీ పరిసరాల ప్రాంతాల్లోని బీడుపొలాల్లో మేతకోసం గొర్రెలను తీసుకెళ్లారు. దాహంతో ఓ గొర్రె కుంటలోని నీటిని తాగేందుకు వెళ్లి అందులో పడింది. గమనించిన బషీర్ అహమ్మద్ గొర్రెను కాపాడేందుకు కుంటలోకి దిగి నీటిలో మునిగి మృతి చెందాడు. గమనించిన తండ్రి రహంతుల్లా గ్రామస్తులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతుడికి ఆరు మాసాల క్రితం వివాహం కాగా భార్య మూడు నెలలు గర్భంతో ఉన్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న బషీర్ అకాల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బైక్ అదుపు తప్పి.. పాములపాడు: మండలంలోని బానకచెర్ల– వేంపెంట మధ్య బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం, చాపలమడుగు గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్వర్లు(28) బావకు పక్షవాతం రావడంతో పొలం పనుల్లో సాయం చేసేందుకు రెండు నెలల క్రితం బానకచెర్ల వచ్చాడు. ఇటీవల పంట తొలగించి బానకచెర్ల– వేంపెంట మధ్య వీబీఆర్ కాలువపై మొక్కజొన్న ధాన్యం ఆరబోశారు. ధాన్యం వద్ద కాపాలా ఉండేందుకు వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి సమీప బంధువైన శ్రీనువాస్ బైక్‌ను తీసుకుని బయలుదేరాడు. కాలువ ర్యాంపు వద్ద మలుపులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్ఐ సుధాకరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి అనే రమణమ్మ అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి కృషి
సంగారెడ్డిఅర్బన్ : గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్ మహ్మద్ యూసుఫ్ బీన్ జాయిద్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంతకుముందు ఆయనను రీజినల్ కోఆర్డినేటర్ పి.పాండురంగారెడ్డి ఆ«ధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ యూనిట్లను నెలకొల్పేందుకు బీసీలకు 10 శాతం మార్జిన్ మనీ ఉండగా ఇతరులకు ఐదు శాతం ఉందన్నారు. మిగతా సబ్సిడీని బ్యాంకుల ద్వారా ఇస్తామన్నారు. మాంసంతో ముడిపడిన పరి«శ్రమ, పొగాకు, మద్యం, వాహనాలకు తప్ప మిగతా వాటికి సబ్సిడీ లోన్లు ఇస్తామన్నారు. గ్రామీణ ఉత్పత్తి పథకం కింద రూ.25 వేల నుంచి రూ.25 లక్షల వరకు రుణాలను అందజేస్తామన్నారు. స్ఫూర్తి ప్రోగ్రాంతో క్లస్టర్లవారీగా ఉమ్మడి జిల్లాలో రుణాలు ఇవ్వడానికి ఖాదీ బోర్డు సిద్ధంగా ఉందన్నారు. గ్రామ యూనిట్ గా గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. కోటి వరకు రుణా లు ఇస్తామన్నారు. త్వరలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల విభాగాల్లో ని«ధులు పుష్కలంగా ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం, బ్యాంకర్లు సహకరించకపోవడం, రాజకీయ కారణాలతో అర్హులైన వారు సబ్సిడీ రుణాలు పొందేందుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలోని ఔత్సాహికులు జిల్లా కేంద్ర కార్యాలయాల్లో సంప్రదించి సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు జావేద్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రియానుభవాలు
పదిహేనేళ్లు ఇండస్ట్రీ. వితౌట్ సింగిల్ బ్రేక్! మినిమమ్ పదిహేను మంది హీరోలతో చేసింది. వితౌట్ బ్రేక్! రోజుకో గాసిప్ పుట్టే ఇండస్ట్రీలో.. పదిహేను వసంతాలు. అన్ని క్యారెక్టర్లూ చేసింది. ఇంత క్యారెక్టర్ కూడా పోగొట్టుకోలేదు. ఇవిగోండి.. శ్రియానుభవాలు. హాయ్ శ్రియాగారూ.. పదేళ్ల క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు.. సీక్రెట్? మా అమ్మ నాన్నల జీన్స్ వల్లే ఇలా ఉన్నా. వాళ్లిద్దరూ స్లిమ్‌గా ఉంటారు. ఎంత తిన్నా బరువు పెరగను. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. యోగా చేస్తాను. నేను కథక్ డ్యాన్సర్‌ని. వీలున్నప్పు డల్లా ఇంట్లో కథక్ ప్రాక్టీస్ చేస్తాను. జిమ్ కంపల్సరీ. డైటింగ్ చేయను కానీ, ఏం తింటున్నాం అనే విషయంలో మాత్రం కేర్ తీసుకుంటాను. రైట్ ఫుడ్ తింటాను. రైట్ ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో రైట్ టైమ్‌కి ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే... త్వరలో రిలీజ్ కాబోతున్న ‘పైసా వసూల్’లో మీ క్యారెక్టర్ గురించి చెబుతారా? ఇందులో నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ని. స్వీట్ అండ్ సింపుల్ క్యారెక్టర్. ఒక మహిళా జర్నలిస్ట్ అంకితభావంతో పనిచేయాల్సి రావడం, అనుకున్నది సాధించాలన్న పట్టుదల వంటి అంశాలు నచ్చాయి. అందుకే ఈ పాత్రను ఎంజాయ్ చేశాను. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చేసిన పాత్రకు భిన్నమైనది ‘పైసా వసూల్’ పాత్ర. ఈ ట్రాన్స్ఫార్మేషన్ గురించి? ‘గౌతమిపుత్ర...’లో యువరాణిని. ‘పైసా వసూల్’లో నేటి తరం అమ్మాయిని. జర్నలిస్ట్‌ని. వెంట వెంటనే ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని క్యారెక్టర్స్ చేయడం థ్రిల్ అనిపించింది. ఏ ఆర్టిస్ట్‌కైనా ఇలా చేయడం ఓ చాలెంజ్. ఇలాంటి సవాళ్లు ఎన్ని వస్తే అంత హ్యాపీగా ఉంటా. పూరి జగన్నాథ్‌గారితో నాకిది ఫస్ట్ మూవీ. ఆయన టేకింగ్‌ని ఎంజాయ్ చేశాను. పదిహేనేళ్లుగా సినిమాలు చేస్తున్నారు.. ఇప్పుడు తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ. ఏమనిపిస్తోంది? వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనందపడే విషయాలు చాలా ఉన్నాయి. యాక్టింగ్‌ని ప్రేమిస్తాను. అయితే కెమేరా ముందు మాత్రమే. చేసే పని మీద ప్రేమ ఉన్నప్పుడు ఎన్నేళ్లుగా పని చేస్తున్నాం అనే లెక్కలు వేసుకోం. మీ కెరీర్‌ని ఎనలైజ్ చేస్తే, ఇండిపెండెంట్‌గా ఎదిగినట్లు అనిపిస్తుంది.. మీ అమ్మానాన్న ఎప్పుడూ మీ పక్కనే ఉంటూ గైడ్ చేయలేదు? మా అమ్మగారు కొన్నిసార్లు నా షూటింగ్ డేట్స్ చూశారు. అయితే మీరన్నట్లు అదే పనిగా పెట్టుకుని నన్ను గైడ్ చేయలేదు. నన్ను నమ్మారు. కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తూ డేట్స్ మేనేజ్ చేయడం కష్టం. నాకు మేనేజర్ ఉన్నారు. ఇంకా హెల్ప్ చేయడానికి నా చుట్టూ మనుషులు ఉన్నారు. ఏదేమైనా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఉంది. అందరి మీదా ఆధారపడి పైకి రావడం కన్నా ‘సెల్ఫ్ మేడ్’ అనిపించుకోవడంలో ఓ తృప్తి ఉంటుంది. ఈ జర్నీలో చేదు అనుభవాలు? హరిద్వార్‌లో సింపుల్ ఫ్యామిలీలో పుట్టాను. ఢిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజీలో బీఏ చేశాను. సినిమాలనేది నేను ఊహించలేదు. సడన్‌గా ఈ ప్రపంచంలోకి వచ్చాను. ముందు కొంచెం తికమకగానే అనిపించింది. లక్కీగా నాకెలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురవ్వలేదు. ఇప్పటివరకూ నేను పని చేసిన హీరోలు, డైరెక్టర్లు... అందరూ నాకు బాగానే సపోర్ట్ చేశారు. దాంతో ఇబ్బంది అనిపించలేదు. ఒకవేళ ఒక చిన్న చేదు అనుభవం ఎదురైనా అందులోంచి బయటకు రావడానికి కొంచెం టైమ్ పట్టేది. ఈ లాంగ్ జర్నీలో అలాంటి ‘టైమ్’ రాకపోవడం నా లక్. అఫ్కోర్స్ కొన్ని చిన్ని చిన్ని చేదు అనుభవాలు ఉన్నాయనుకోండి. ఏది ఏమైనా ఆ దేవుడు చల్లగా చూస్తున్నాడనుకుంటున్నా. చేదు అనుభవాలు అన్నారు... ఉదాహరణకు? కెరీర్లో ‘ఫ్లాప్’కి మించిన చేదు అనుభవం మరొకటి ఉండదు. ఫ్లాప్ మూవీస్ నా లిస్టులో చాలానే ఉన్నాయి. మొదట్లో తేరుకోవడానికి టైమ్ పట్టేది. రాను రాను హిట్టూ ఫ్లాప్స్కి అతీతంగా రియాక్ట్ అవ్వడం మొదలైంది. చెప్పిన టైమ్‌కి శ్రియ షూటింగ్‌కి రాలేదు... ఫలానా హీరోతో ఎఫైర్ అనే వార్తలు రాలేదు. గాసిప్స్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏమీ చేయనప్పుడు ఎందుకు మేనేజ్ చేయాలి? టైమింగ్స్ వైజ్‌గా పర్ఫెక్ట్గా ఉంటాను. షూటింగ్ స్పాట్లో ఇబ్బంది పెట్టను. ఎవరితోనూ ఎఫైర్లు లేవు. అందుకే నా గురించి వార్తలు రావు. అలాగే సినిమాల్లో చేసే క్యారెక్టర్ని బట్టి ఆ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ‘ఇలా ఉంటుంది’ అని కొందరు ఎనలైజ్ చేస్తుంటారు.. దాని గురించి? అది నిజమే. సినిమాల్లో వెస్ట్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తే... విడిగా అలాంటివే వేసుకుంటామని అనుకుంటారు. ప్రతిరోజూ పార్టీకి వెళతామని ఫిక్స్ అయిపోతారు. ఒకవేళ చీరల్లో కనిపిస్తే సాధ్వి అంటారు. సినిమాల్లో ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు ప్రవర్తిస్తాం. రియల్‌గా మేం వేరేలా ఉంటాం. ఆన్ స్క్రీన్ మమ్మల్ని చూసి, ఆఫ్ ది స్క్రీన్ కూడా అలానే ఉంటామని ఊహించు కునేవాళ్ల ఆలోచనా విధానం మారాలి. ఈ ప్రపంచంలోనే మీరెక్కువగా ఇష్పడే వ్యక్తి? మా అమ్మగారు. నన్ను పెంచి, పెద్ద చేసి, నేనింతవరకూ రావడానికి కారణం తను. కూతురి జీవితం బాగుండాలని తపన పడింది. అమ్మ గురించి మాట్లాడ్డానికి రోజులు చాలవు. నేను చదువుకునేటప్పుడు తనూ స్టూడెంట్ అయింది. నా మానాన నన్ను వదిలేయకుండా పక్కనే కూర్చుని చదివించేది. నాతో పాటు డ్యాన్స్ స్కూల్‌కి వచ్చేది. హీరోయిన్ అయినప్పుడు తోడుగా షూటింగ్ స్పాట్‌కి వచ్చింది. ‘స్పా’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ మొదలుపెడతానన్నప్పుడు సపోర్ట్ చేసింది. నేనివాళ ఇలా ఉన్నానంటే తనే కారణం. ఇప్పటివరకూ మీ ‘మిస్టర్ రైట్’ మీకు తారసపడలేదా? (నవ్వుతూ). తక్కువ టైమ్‌లోనే తను నా లైఫ్‌లోకి వస్తాడన్న నమ్మకం ఉంది. ఎలాంటి లక్షణాలున్న అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నారు? అతను నాకు మంచి ఫ్రెండ్‌లా ఉండాలి. అతనితో నా మిగతా జీవితాన్ని సాఫీగా గడప గలగాలి. మానసికంగా, ఆధ్యాత్మికంగానూ అతనితో నా ప్రయాణం బాగుండాలి. ఫైనల్లీ... పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? మహిళల జీవితంలో పెళ్లి, పిల్లలు అనేది చాలా ముఖ్యమైన విషయం. జరగాల్సి నప్పుడు తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతానికి చేసే పనిని నేను లవ్ చేస్తున్నాను. సెప్టెంబర్ 11న మీ బర్త్‌డే.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? (నవ్వుతూ). ఇంకా చాలా టైమ్ ఉంది. ఏమీ అనుకోలేదు. అయితే ఒకటి మాత్రం నమ్ముతాను. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అనేది చాలా ముఖ్యమైనది. నా గత పుట్టినరోజున మా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు. పోయిన ఏడాది సెప్టెంబర్ 5న వినాయక చవితి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. నా బర్త్‌డే నాడు మా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు. అందుకని ఆ రోజున గణపతికి పూజ చేశాను. ఇప్పటివరకూ జరుపుకున్న వాటిలో బెస్ట్ బర్త్‌డే? నా చిన్ననాటి పుట్టినరోజులు బెస్ట్. ఎందుకంటే అమ్మ చాలా హడావిడి చేసేది. కేక్ కట్ చేయించేది. నాకు శాండ్విచెస్ ఇష్టం. బర్త్‌డే నాడు తప్పనిసరిగా అవి చేసేది. నా స్నేహితులు మా ఇంటికి వచ్చేవారు. సింపుల్‌గా చేసినా బాగా అనిపించింది. ఇప్పుడూ అమ్మ హడావిడి చేస్తుంది కానీ, చిన్నప్పుడు ఉన్నంత ఎగ్జయిట్మెంట్ ఉండదు కదా. సమాజంలో మద్యం, డ్రగ్స్, సిగరెట్స్ అంటూ.. చెడు వీరవిహారం చేస్తోంది... పిల్లలకు మీరిచ్చే సలహా? జీవితానికి హాని చేసేవాటి పట్ల ఎట్రాక్ట్ కావడం మంచిది కాదు. చదువు మీద ఏకాగ్రత చూపించాలి. కెరీర్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ కెరీర్ పట్ల బాధ్యతగా ఉండాలి. కుటుంబంలో ఒక్కరు చెడు అలవాట్లకు బానిస అయినా అందరూ బాధపడాల్సి వస్తుంది. చెడు అలవాట్లు ఉంటే... వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయినా దూరం కాలేకపోతున్నారంటే... డాక్టర్ని సంప్రదించాలి. ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నింటికన్నా జీవితం ముఖ్యమైనది. వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ పండగకి సంబంధించిన చిన్నప్పటి గుర్తులేమైనా ఉన్నాయా? ఒకే ఒక్క ఇన్సిడెంట్ అంటే చెప్పలేను. వినాయక చవితి అంటే మా ఇంట్లో సందడిగా ఉంటుంది. హరిద్వార్, ఢిల్లీ, ఆ తర్వాత ముంబైలో... ఇలా ఎక్కడ ఉన్నా పండగ చేసుకోవడం అలవాటు. స్వాతంత్య్రం రాక ముందు ప్రజలు స్వాతంత్య్ర సాధన కోసం బోల్డన్ని చర్చా వేదికలు పెట్టుకునేవాళ్లు. అందరూ కలసి మంచీ చెడూ మాట్లాడుకునేవాళ్లు. స్వాతంత్య్రం సాధించాక అలాంటి మీటింగ్స్ తగ్గాయి. క్రమంగా ఎవరి దారిన వాళ్లు బతకడం మొదలైంది. కానీ, ఇలాంటి పండగలు అందర్నీ కలుపుతాయి. గణేశుణ్ణి ప్రతిష్టించి, భారీ పందిళ్లు వేసి, ఏడు, తొమ్మిది రోజులు వైభవంగా పూజలు జరిపి, నిమజ్జనం చేసేవరకూ.. అందరూ కలుస్తారు. ప్రసాదాలు పంచుతారు. మనుషులను దగ్గర చేసే ఈ పండగ అంటే ఇష్టం. మట్టి గణేశుడినే పూజించారా? పర్యావరణానికి హాని కలిగించకూడదు. అందుకే మట్టి గణపతిని పూజించా. మా ఇంట్లో ఉన్న వాటర్ ఫౌంటెన్‌లో నిమజ్జనం చేయడం అలవాటు. నాగార్జునగారు ఫస్ట్ సూపర్ స్టార్ మీ సెకండ్ సినిమా (‘సంతోషం’)కే నాగార్జునగారి సరసన నటించారు. ఆ తర్వాత ఆయనతో ‘నేనున్నాను’, ‘మనం’ సినిమాల్లో జతకట్టారు.. ‘ఊపిరి’లోనూ నాగ్‌తో కాసేపు కనిపించారు..ఈ 29న ఆయన బర్త్‌డే. నాగ్ గురించి కొన్ని విశేషాలు? నా ఫస్ట్ సూపర్‌స్టార్ నాగార్జునగారే. ఆయన సినిమాలు చూస్తూ పెరిగినదాన్ని. సౌత్ మూవీస్ హిందీలో రిలీజయ్యేవి. అలా ‘శివ’ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు చాలా చిన్నపిల్లని. భవిష్యత్తు గురించి ఎలాంటి ఊహలు లేవు. కట్ చేస్తే... ఆయన పక్కన హీరోయిన్గా నటించగలిగాను. అది కూడా నా సెకండ్ సినిమాకే. ‘సంతోషం’ నా కెరీర్‌కి సంతోషాన్నిచ్చిన మూవీ. ఆ సినిమా తర్వాత నేను ఫుల్ బిజీ. నాగ్ వైఫ్ అమలగారితో మీ ఈక్వేషన్? అమలగారు లవ్లీ. నాతో సన్నిహితంగా ఉంటారు. ఆమె సలహా మేరకే నేను విపశ్శన యోగ చేశాను. నా లైఫ్‌లో నేను అందుకున్న మంచి సలహాలలో అమలగారి నుంచి ఈ సలహా ఒకటి. విపశ్శన ధ్యానం చేశాక నేను మారాను. అంతకు ముందు కన్నా ప్రశాంతంగా ఉంటోంది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగు తున్నాను. నాగార్జునగారి పక్కన నటించినప్పుడు సినిమాల వైజ్‌గా మీరు కిడ్. ఎలా అనిపించింది? భయం అనిపించలేదు. ఎందుకంటే, నాగార్జునగారు తానో స్టార్ అనే ఫీలింగ్‌తో మాట్లాడేవారు కాదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. యూనిట్ మొత్తం అలానే ఉండేది. దాంతో సంతోషంగా పని చేశా. నా కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నాగ్ సార్‌తో చేసిన సినిమాలు ఉన్నాయి. ఆయనకు ‘సాక్షి’ ద్వారా మనస్ఫూర్తిగా బర్త్‌డే విషెస్ చెబుతున్నా. – డి.జి. భవాని -
లైసెన్స్ రాజ్ ఆన్లైన్ రాజ్
వాణిజ్య భారతం ‘‘ఎంత అప్పు తీసుకోవాలో... ఎన్ని షేర్లు ఏ రేటుకివ్వాలో నేను నిర్ణయించలేను. బోనస్, డివిడెండ్, ఆఖరికి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు ఎంత జీతమివ్వాలో కూడా నేను నిర్ణయించలేను. ఎందుకంటే వాటన్నిటికీ ప్రభుత్వం అనుమతి కావాలి’’ – జేఆర్డీ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇష్టమైనవారంతా ‘జే’గా పిలిచే జేఆర్డీ మాటలు వింటే చాలు. స్వాత్రంత్యం వచ్చిన తొలినాళ్లలో మన ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఇట్టే అర్థమయిపోతాయి. ఎందుకంటే డిమాండ్ ఉండి... మరిన్ని వాహనాలు కావాల్సి ఉన్నా... ఉత్పత్తి సామర్థ్యం కూడా ఉన్నా... ఉత్పత్తి పెంచాలంటే మాత్రం కంపెనీకి లైసెన్సు కావాలి. వెయ్యి స్కూటర్లు ఉఉ్పత్తి చేసే కంపెనీ మరో వెయ్యి ఉత్పత్తి చేయాలంటే... దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అదీ... తొలినాళ్లలో మన లైసెన్స్ రాజ్!!. ఏ ఉత్పత్తికైనా ఇదే పరిస్థితి. ‘‘జే! నాతో ఎప్పుడూ లాభం గురించి మాట్లాడొద్దు. అదో పనికిమాలిన మాట’’– ఒకానొక సందర్భంలో ప్రభుత్వ కంపెనీలు కూడా లాభాల్లోకి రావాలని జేఆర్డీ టాటా సూచించినపుడు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలివి. ఈ మాటలు చూస్తే... లైసెన్స్ రాజ్ ఎందుకన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం అప్పట్లో భారీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలపై ఏకకాలంలో దృష్టిపెట్టింది. భారీ పరిశ్రమలు వీలైనన్ని రావాలని, వాటిద్వారా సాధ్యమైనంత మందికి ఉపాధి దొరకాలన్నది ప్రభుత్వ సంకల్పం. మరి ఒకే కంపెనీ భారీగా ఉత్పత్తి చేసి డిమాండ్‌ను తీర్చేస్తే మిగిలిన కంపెనీలు ఏం చేస్తాయి? ఈ ఉద్దేశంతోనే లాభాల ఊసు పక్కనబెట్టి కంపెనీల ఉత్పత్తిని నియంత్రించిందన్నది ఆర్థిక నిపుణుల మాట. కాలం ఒక్కో అడుగూ వేస్తూ వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే... ఈ 70 ఏళ్లలో ఎన్నెన్నో పరిణామాలు. 1950ల మధ్యలో... బ్యాంకుల నుంచి భారీ ప్రయివేటు సంస్థలన్నీ జాతీయమయ్యాయి. అంటే! ప్రభుత్వ పరమయ్యాయి. ఆ చర్యలతో ఇండియావైపు చూడటానికే విదేశీ సంస్థలు భయపడ్డాయి. పాతికేళ్ల కిందటి వరకూ ఇదే పరిస్థితి. 1991లో అప్పటి ప్రధాని, ఆర్థికవేత్త పీవీ నరసింహరావు హయాంలో కీలక ఆర్థిక సంస్కరణలకు తెర తీయటంతో... విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం మళ్లీ మొదలయ్యింది. చాలావరకూ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్లోనే అనుమతి పొందే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితం... టెలిఫోన్ల కోసం, వాహనాల కోసం, గ్యాస్ సిలెండ్ల కోసం ఏళ్లకేళ్లు వేచి చూసే పరిస్థితి తప్పిపోయింది. అడిగిన వెంటనే కంపెనీలు ఎగబడి మరీ టెలిఫోన్లు, వాహనాలు, గ్యాస్ సిలెండర్లు సమకూర్చే మార్కెట్ ఆధారిత వ్యవస్థ సాకారమయ్యింది. అంతేకాదు!! అనూహ్యంగా వచ్చిన డిజిటల్ విప్లవంతో కంపెనీల చెంతకు తిరగాల్సిన పరిస్థితీ తప్పింది. ఇంట్లో కూర్చుని కంప్యూటర్లోనో... ప్రయాణంలో ఉండి కూడా చేతిలోని మొబైల్లోనో ఆర్డర్ చేస్తే చాలు!! కావాల్సినవన్నీ ఇంటికే తరలివస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే... ఇదీ మన 70 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక ప్రస్థానం. ఆ ప్రయాణంలో... ఎన్నెన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుళ్లు. వాటినొక్కసారి పరికించే ప్రయత్నమే ఇది... స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నడిచిన లైసెన్స్ రాజ్‌పై ఎన్నో విమర్శలొచ్చాయి. కాకపోతే... యువతరం ఉద్యోగాల కోసం డిగ్రీలు చేతబట్టి కాళ్లరిగేలా తిరుగుతున్న ఆ సమయానికది అనువైన నిర్ణయం.1950ల మధ్యలో జరిగిన పరిశ్రమల జాతీయకరణ, 1969 నాటి బ్యాంకుల జాతీయీకరణపైనా విమర్శలున్నాయి. కానీ... కోట్ల మంది ప్రజలకు ఈ కంపెనీలు, బ్యాంకులు ఉపయోగపడటానికి నాటి నిర్ణయం సరైనదేనన్నది నిపుణుల మాట.1965 నాటి హరిత విప్లవం చిరకాలం కొనసాగేది కాదనే విమర్శలొచ్చాయి. కానీ ఈ హరిత విప్లవం ఆహార కొరతను అధిగమించేందుకు ఉపకరించిందన్నది కాదనలేం. 1947 తరవాత ఓ మూడు దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ‘హిందూ వృద్ధి రేటు’గా వర్ణించాయి పాశ్చాత్య దేశాలు. కారణమేంటంటే ఇతర ఆసియా దేశాల వృద్ధితో మనకు ఏమాత్రం పోలిక లేకపోవటం!!. ఇక 1991లో ఆర్థిక సంస్కరణలకు తెరతీశాక వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం కళ్లముందు కనిపిస్తున్న మార్పులన్నీ... ఆ సంస్కరణల ఫలితాలే. అవి వేగం అందుకుంటున్న కొద్దీ... మార్పులు మరింత స్పష్టమవుతున్నాయి. జీడీపీ: 10వేల కోట్ల నుంచి కోటి కోట్లకు! ప్రస్తుత ధరలను బట్టి చూస్తే... 1950లో మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.10 వేల కోట్ల రూపాయలు. ఇప్పుడది ఏకంగా 1.04 కోట్ల కోట్లు. అంటే ఈ 70 ఏళ్లలో అది వెయ్యి రెట్లకు పైగా పెరిగిందన్న మాట.ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ప్రపంచబ్యాంకు) లెక్కల ప్రకారం చూస్తే 1980లో వాస్తవిక రేటు ప్రకారం మన జీడీపీ 189.44 బిలియన్ డాలర్లు. కానీ ఇప్పుడది ఏకంగా 2457.75 బిలియన్ డాలర్లు. ఇక కొనుగోలు శక్తి తారతమ్యాల (పీపీపీ) ప్రాతిపదికన చూస్తే 1950లో మన జీడీపీ 381.96 బిలియన్ డాలర్లు. ఇప్పుడు మాత్రం అది 14,187.08 బిలియన్ డాలర్లు. అదీ మన వృద్ధి. స్వాతంత్య్రానంతరం స్వల్ప వృద్ధికి కూడా కటకటలాడిన ఆర్థిక వ్యవస్థ... 2005–06లో రెండంకెల వృద్ధిని చేరినా... 2008 సంక్షోభం తరవాత నెమ్మదించింది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా 7 శాతం వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్ అవతరించగలిగింది. ఈ 70 ఏళ్లలో వార్షిక తలసరి ఆదాయం రూ.247 నుంచి రూ.1.03 లక్షలకు పెరిగింది. 1950లో రిజర్వుబ్యాంకు వద్ద కేవలం 2 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలుండగా, అవిప్పుడు 350 బిలియన్ డాలర్లకు చేరాయి మరి. చెల్లింపుల సంక్షోభాల్ని దాటాం ఇలా... 1966, 1981, 1991... ఇవి మన ఆర్థిక చరిత్రలో గుర్తుండిపోయే సంవత్సరాలే!! విదేశాలకు చేయాల్సిన చెల్లింపులు చేయలేక... దివాళా దేశంగా ముద్రపడే ప్రమాదం తలెత్తింది ఇప్పుడే. ప్రపంచబ్యాంకు (ఐఎంఎఫ్) ముందుకొచ్చి డాలర్లలో రుణాలిచ్చి సర్దుబాటు చేయటంతో పరిస్థితి సర్దుమణిగినప్పటికీ... 1991లో ఆర్బీఐ దగ్గరున్న 67 టన్నుల బంగారాన్ని ఐఎంఎఫ్ వద్ద తనఖా పెట్టాల్సి వచ్చింది. 1966లోనైతే రూపాయి విలువను దారుణంగా తగ్గించాల్సి వచ్చింది. 1991లో ఈ సంక్షోభం ఫలితంగానే ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. కానీ... ఆ తరవాత మళ్లీ సంక్షోభాలు తాకలేదు. 2008లో ప్రపంచంలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సైతం ఇండియా తట్టుకోగలిగింది. ఐదేళ్లూ... ఒకో థీమ్!! దేశ ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపడానికి 1951లో పంచవర్ష ప్రణాళికలు మొదలయ్యాయి. వీటిలో ఒకసారి సాగుపై ఫోకస్ పెడితే... మరోసారి పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చారు. ఇలా... ఒకోసారి ఒకో రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలు అమలయ్యాయి. ఇవి అమలు కాని 1967– 68 సంవత్సరాల్ని మినహాయిస్తే... ఇపుడు 2012–2017 ప్రణాళిక 12వది. ఈ ప్రణాళికలో 8.2 శాతం ఆర్థికాభివృద్ధి లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకోగా, అంతర్జాతీయ మందగమనం వల్ల అది సాధ్యంకాలేదు. రూపాయి విలువ మూడుసార్లు తగ్గించాం!! 1992లో రూపాయి విలువను ఒకే నెలలో మూడుసార్లు తగ్గించడం ద్వారా మొదలైన ఆర్థిక సంస్కరణలు ...పలు కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం ద్వారా బాగా విస్తరించాయి. కొన్ని కీలక రంగాలు మినహా ఐటీ నుంచి టెలికం వరకూ నూరు శాతం విదేశీ పెట్టుబడులకు ప్రస్తుతం అనుమతి ఉంది. చాలావరకూ పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్లోనే అనుమతి లభిస్తోంది కూడా. 1969... బ్యాంకులు ప్రభుత్వం చేతికి! అప్పట్లో ప్రయివేటు బ్యాంకులదే హవా. రెతులకు, ఇతర చిన్న వ్యాపారులకూ రుణాలు దొరకని పరిస్థితి. దీంతో 85 శాతం డిపాజిట్లున్న 14 వాణిజ్య బ్యాంకుల్ని ప్రభుత్వ పరం చేస్తూ 1969లో ఓ ఆర్డినెన్స్ జారీ అయింది. ఆ ఏడాది జులై 19 అర్ధరాత్రి నుంచీ సదరు బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులైపోయాయి. మరో 6 బ్యాంకుల్ని 1980లో జాతీయం చేయడం ద్వారా... 91 శాతం డిపాజిట్లున్న బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తెచ్చుకుంది. సంస్కరణల ఫలితంగా ఆయా బ్యాంకుల్లో వాటాను ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తోంది. తరవాత మళ్లీ ప్రయివేటు బ్యాంకులొచ్చాయి. ప్రభుత్వ బ్యాంకుల్ని తలదన్నేలా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజాలు బ్యాంకులుగా అవతరించాయి. ఇపుడు చిన్నచిన్న బ్యాంకులు... ఆఖరికి చెల్లింపులు మాత్రమే చేసే పేమెంట్ బ్యాంకులూ వచ్చేశాయి. అంతేకాదు! స్టార్టప్ సంస్థలు వాలెట్ల పేరిట డిజిటల్ బ్యాంకింగ్ సేవల్లోకి దిగాయి. అందుకే! ఇపుడు చేతిలో మొబైల్ ఉంటే బ్యాంకు ఖాతా, మనీ పర్సు అన్నీ అందులో ఉన్నట్టే!! 125 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్! సంస్కరణల ప్రభావంతో భారత్ క్యాపిటల్ మార్కెట్ శరవేగంగా వృద్ధిచెందింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.125 లక్షల కోట్లకు చేరింది. తద్వారా అంతర్జాతీయంగా మన షేర్ మార్కెట్ 14వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించింది. ఆసియాలో 6వ స్థానం మనది. విదేశీ కరెన్సీకి కటకట కాబట్టే... సంస్కరణలతో తేడా వచ్చేసింది...ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పెద్దఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివస్తున్నాయి. టెలికం, సాఫ్ట్వేర్, ఫార్మా, ఆటోమొబైల్స్ తదితర రంగాల్లో అనువైన పరిస్థితులు, నైపుణ్యం ఉండటంతో 2000–2010 మధ్యకాలంలో 138 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కు తరలివచ్చాయి.గత 25 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 500 డాలర్ల నుంచి 1600 డాలర్లకు పెరిగింది. ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం రానున్న 25 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 10,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా.దారిద్య్రరేఖకు దిగువనున్న జనాభా శాతం 45 నుంచి 21.9కి తగ్గింది (2011 గణాంకాలు) పట్టణాల మురికివాడల్లో నివసించే జనాభా శాతం 55 నుంచి 24కు తగ్గింది. (2014 గణాంకాలు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒకప్పుడు చేతిలో విదేశీ కరెన్సీ లేక విదేశాల నుంచి విడిభాగాలు కూడా తేలేని పరిస్థితి. అందుకే ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తిపై నియంత్రణల్ని కేంద్రం అత్యంత కఠినంగా కొనసాగించింది. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ విడిభాగాలు కావాలి కదా!! వాటికి అధికంగా విదేశీ కరెన్సీ చెల్లింపులు చేయాలి కదా!!అంతేకాదు!! వైద్యానికైనా, విహారానికైనా, వ్యాపారానికైనా విదేశాలకు వెళ్లాలంటే అవసరమైన విదేశీ మారక ద్రవ్యం కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తప్పనిసరి అయ్యేది. ఆర్బీఐ దగ్గర తగిన డాలర్లు లేకపోవడంతో పరిమిత విదేశీ ద్రవ్యానికే అనుమతినిచ్చేది.ఇక విదేశాల నుంచి కారు, కంప్యూటర్, కనీసం వైద్య పరికరాన్ని దిగుమతి చేసుకోవాలన్నా భారీగా 200, 300 శాతం వరకూ దిగుమతి సుంకాలుండేవి. మన క్రీడాకారులు కూడా విదేశాల్లో వచ్చిన బహుమతుల్ని దేశంలోకి తీసుకురావాలంటే భారీ భారీ సుంకాలు చెల్లించాల్సి వచ్చేది కొందరు క్రీడాకారులు తమ బహుమతుల్ని అక్కడే వదిలేసిన సందర్భాలూ ఉన్నాయి! -
ఆర్థిక సహకారంపై చిగురించిన విశ్వాసం
ట్రంప్, మోదీ భేటీపై పరిశ్రమ వర్గాల సంతోషం న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య జరిగిన తొలి భేటీలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలన్న నిర్ణయానికి రావడం పట్ల దేశీయ పరిశ్రమ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. రెండు దేశాల ద్వైపాక్షిక బంధంపై తిరిగి విశ్వాసం నెలకొన్నట్టు పేర్కొన్నాయి. ట్రంప్, మోదీ భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను అసోచామ్ స్వాగతించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మార్కెట్ అవకాశాలను పెంపొందించుకోవాలని నిర్ణయించడం 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ పరిశ్రమకు అత్యంత సానుకూలమని వ్యాఖ్యానించింది. పారిశ్రామిక రంగాల్లో అదనపు ఉత్పత్తి విషయమై రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించడం మరో సానుకూలమైన చర్యగా అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. నియంత్రణ పరమైన అంశాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించుకోవడం భారత ఫార్మా పరిశ్రమకు సానుకూలమన్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు యూఎస్ఫ్డీఏ నుంచి తనిఖీలు, అభ్యంతరాల పేరుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో మోదీ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విశ్వాసం వ్యక్తం కావడం, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ముందుకు తీసుకెళ్లాలని అంగీకారం కుదరడం సంతోషకరమని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ అన్నారు. రక్షణ, ఇంధన రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇరు దేశాలూ కలసి పనిచేయాలని అభిలషించారు. -
కర్మాగారంలో కార్మికుడి మృతి
తాడిపత్రి టౌన్ : అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని ఎస్జేకే స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్(కార్మికుడు)గా పని చేసే కర్నూలుకు చెందిన షెక్షావలి(40) గురువారం రాత్రి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. అవివాహితుడైన షెక్షావలి తాడిపత్రిలో వడ్లపాలెంలో అద్దె ఇంట్లో ఉంటూ కర్మాగారానికి వెళ్లొచ్చేవాడన్నారు. నరాల బలహీనతో బాధపడేవాడని, ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటిలో ఉన్న పళంగా కిందపడటంతో రాయిపై తలపడటంతో తీవ్ర గాయమైందన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్థిక ఆంక్షల సెగ
కొనుగోళ్లకు వెనుకడుగేస్తున్న ట్రేడర్లు, చిరు వ్యాపారులు స్థానిక ఎగుమతులపై ప్రభావం పౌల్ట్రీల్లో పేరుకుపోతున్న గుడ్లు రూ.2.55కు పతనమైన రైతు ధర రోజుకు రూ.77 లక్షల మేర నష్టం ఆందోళనలో కోళ్ల రైతులు మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజ¯ŒSలో గుడ్డు ధర తీవ్రంగా నిరాశపరచగా.. తాజాగా ఆర్థిక ఆంక్షలు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వేసవి ఎండలకు తోడు ఆర్థిక ఆంక్షలతో గుడ్ల కొనుగోళ్లకు, ఎగుమతులకు ట్రేడర్లు, చిరు వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతుండగా.. రైతు వద్ద ధర నానాటికీ పతనమవుతోంది. ఇప్పటికే రూ.2.55కు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు రోజుకు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మున్ముందు మరింతగా పెరగనున్న ఎండలతో పరిశ్రమకు మరిన్ని కష్టాలు తప్పవని కోళ్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. 40 శాతం గుడ్లు స్థానికంగా వినియోగమవుతుండగా, మిగిలినవి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. చలి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల ఎగుమతులకు డిమాండ్ పెరిగి, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్డు ధర ఆశాజనకంగా ఉంటుంది. అయితే నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో ఈ ఏడాది సీజ¯ŒSలో రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. పరిశ్రమకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇటీవల లారీల సమ్మెతో గుడ్ల ఎగుమతి స్తంభించిపోయింది. ఆ సమ్మె ముగిసినా, ఆర్థిక ఆంక్షలు, ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో లావాదేవీలన్నీ చెక్కుల రూపంలోనే నిర్వహించాల్సి రావడం వ్యాపారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. చెల్లింపులు జరిపిన చెక్కులకు సమాధానం చెప్పాల్సి రావడం, ఆర్థిక ఆంక్షలకు సంబంధించి వ్యాపారులు, కోళ్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. లావాదేవీల్లో ఏ చిన్నపాటి లోపం చోటుచేసుకున్నా రూ.లక్షల్లో జరిమానాలు చెల్లించాల్సి రావడంతో ట్రేడర్స్‌తో పాటు స్థానిక వ్యాపారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఎండల ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం తగ్గుముఖం పడుతోంది. ఈ కారణాలతో పది రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు, స్థానిక వినియోగం సగం వరకు తగ్గిపోగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతున్నాయి. సాధారణంగా జిల్లా నుంచి రోజుకు సుమారు 50 లారీల గుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అది 25 లారీలకు పడిపోయింది. స్థానిక వినియోగం కూడా తగ్గిపోవడంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పెరిగిపోతున్నాయని కోళ్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. నెక్ ప్రకటిత ధర కూడా అందని దుస్థితిలో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో గుడ్డు రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత రైతు ధర రూ.2.55 ఉండగా, రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 70 పైసల వరకూ కోళ్ల రైతులు కోల్పోవాల్సి వస్తోంది. దీని ప్రకారం పరిశ్రమకు రోజుకు సుమారు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు చెబుతున్నారు. మున్ముందు వేసవి ఎండలు, వడగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోతుందని, దీంతోపాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వస్త్ర ఉత్పత్తిలో నాణ్యత పెరగాలి
⇒ వస్త్రోత్పత్తిదారుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ⇒ సిరిసిల్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ⇒ వారంలోగా పార్క్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి సిరిసిల్ల: ‘ఉత్పత్తులు పెరగాలి.. వస్త్రం నాణ్యంగా ఉండాలి.. అప్పుడే మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడగలం.. వస్త్రం ఎగుమతులను సాధించగలం’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్‌ను ఆయన శనివారం సందర్శించారు. అనంతరం వస్త్రోత్పత్తిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘నేతన్నలు ప్రపంచస్థాయికి చేరాలి.. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌గా వస్త్రోత్పత్తి రంగం అభివృద్ధి సాధించాలి’ అని అన్నారు. టెక్స్టైల్పార్క్తోపాటు సిరిసిల్లలోనూ కామన్ ఫెసిలిటీ సెంటర్ల(సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధునికమైన సైజింగ్, వార్పిన్ యంత్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. టెక్స్టైల్ పార్క్‌లో 220 పరిశ్రమలు స్థాపించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 110 పరిశ్రమలే వస్త్రోత్పత్తిని ప్రారంభించాయని, వాటి స్థాపనకు ప్లాట్లు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేసి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూడాలని, లేకుంటే వాటిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటాయించాలని అధికారులకు సూచిం చారు. వారం రోజుల్లోగా వస్త్రోత్పత్తిదారు లు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కమిటీని వేసుకోవాలని, లేకుంటే ప్రభుత్వమే కమిటీ వేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి వస్తున్నాడని తెలిసినా పార్క్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అంతా చెత్త పేరుకుపోయిందని, పార్క్ దుస్థితి ఇదా అని ఏడీ అశోక్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్రవ్యాపారులు తిరుపూర్‌కు అధ్యయన యాత్రకు వెళ్లి రావాలని మంత్రి సూచించారు. ‘నేను మంత్రిగా ఉన్నా.. కొత్తపరిశ్రమల స్థాపనకు, ప్రభుత్వ సాయం పొందేందుకు ఇదే మంచి తరుణం’ అని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహిస్తే.. కార్మికులతో సమావేశం పెట్టరా అని కొందరు నెగటివ్‌గా మాట్లాడుతున్నారని, ముందు యజమానులను ఒప్పించాలని వారితో సమావేశం నిర్వహించామని చెప్పారు. శివరాత్రి జాతర ఏర్పాట్లు వేములవాడలో మహాశివరాత్రి ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. టెక్స్టైల్ పార్క్‌ను గాడిలో పెట్టాలని, నీటి వసతి కల్పించాలని, ఇందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, సౌత్ ఇండియా మిల్స్ అధ్యక్షుడు సెంథల్‌కుమార్, ఐఎల్ఎఫ్ఎస్ అధ్యక్షుడు అక్షయపటేల్, సెల్వరాజ్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొన్నారు. -
28న ఐటీ ప్రిన్సిపల్ కమిషనర్ కర్నూలు రాక
కర్నూలు(రాజ్‌విహార్) : ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.జగదీష్ బాబు ఈనెల 28వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ పి.సత్యప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాణిజ్య, వ్యాపారవేత్తలు, చాంబర్ ఆఫ్ కామర్స్, ట్యాక్స్ బార్, పరిశ్రమల పారిశ్రామికవేత్తలతో అశోక్‌నగర్‌లో నిర్వహించే సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొంటారన్నారు. -
జియో తాజా ప్రకటన వారికి ఉపశమనం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తాజా ప్రకటనపై సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) హర్షం వ్యక్తం చేసింది. రిలయన్స్ జియో ఉచిత సేవలకు గుడ్ బై చెప్పి టారిఫ్ వార్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై సంస్థ పాజిటివ్‌గా స్పందించింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 , 2017 నుంచి అమలు కానున్న టారిఫ్‌లను ప్రకటించడంతో టెలికాం ఇండస్ట్రీకి ఊరట లభించినట్టు పేర్కొంది. ఉచిత సేవలస్థానంలో సేవలకు ధరలను ప్రతిపాదించడం పరిశ్రమకు గుడ్ న్యూస్ అని వ్యాఖ్యానించింది ఉచిత సేవలకు టాటా చెపుతూ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించడంపై టెలికాం సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉన్నప్పటికీ , పరిశ్రమ పరిశీలకుడిగా, జియో ప్రకటనతో పరిశ్రమ ఉపశమనంగా ఉంటుందని చెప్పగలననికాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పీటీఐకి తెలిపారు. ఇప్పటికైనా చార్జీల వసూళ్లను ప్రారంభించడం తనకు సంతోషం కలిగించిందన్నారు. జియో మంగళవారం ప్రకటించిన రూ.99, రూ.303 ప్లాన్స్ మంచివే అన్నారు. యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ రూ.180 నుంచి రూ.300గా నిలవనుందని తెలిపారు. కాగా ముంబైలో నేడు ప్రెస్ మీట్ నిర్వహించిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తన టెలికాం వెంచర్ జియో కేవలం 170 రోజుల్లో 100 మిలియన్ చందాదారులు మైలురాయిని ప్రకటించారు. జియో ఎంట్రీతో యూజర్లను డిజిటల్‌గా, బ్యూటిఫుల్ మార్చేసామన్నారు. దీంతోపాటు ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రాంను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 1, 2017 నుంచి అమలయ్యే కొత్త టారిఫ్‌లను వెల్లడించారు. రూ 99 , రూ 303 నెలకు రుసుముగా వన్ టైం పేమెంట్ ద్వారా జియో మార్చి 31, 2017 తరువాత కూడా తన ప్రస్తుత చందాదారులు మరియు కొత్త వినియోగదారులు, మరో సంవత్సరం దాని 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' అపరిమిత ప్రయోజనాలు కొనసాగుతాయని ప్రకటించారు. మార్చి 31, 2018 వరకు ఉచిత కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సమస్యలకు సెల్యూట్!
జీవితంలో సమస్యలు, సంతోషాలు సహజం. అయితే ఈ రెంటినీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు. కొందరు ఎంత పెద్ద సమస్యనైనా లైట్ తీసుకుంటారు. కొందరు చిన్న సమస్యకు కూడా నానా హైరానా పడిపోతారు. కానీ, సమస్యలకు సెల్యూట్ చెప్పేవాళ్లు ఉంటారా? కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది చెబుతారు. గత బుధవారంతో ఈ బ్యూటీ తెరపై కనిపించి పదేళ్లవుతోంది. తెలుగు పరిశ్రమకు కాజల్ కథానాయికగా పరిచయమైన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం 2007 ఫిబ్రవరి 15న విడుదలైంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయిన సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘ఇన్నేళ్ల కెరీర్లో నాకు ఎదురైన సమస్యలకు సెల్యూట్. అలా ఎందుకంటున్నానంటే అవి లేకపోతే నాలో పరిణతి వచ్చేది కాదు. నేను స్ట్రాంగ్ గాళ్‌ని అయ్యేదాన్ని కాదు. ఇన్నేళ్లల్లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్, డల్ మూమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే డల్ మూమెంట్స్ పాఠాలు నేర్పిస్తాయి. అందుకే నాకెదురైన హ్యాపీ మూమెంట్స్‌కి కాకుండా స్ట్రగుల్స్కి థ్యాంక్స్ చెబుతున్నా’’ అన్నారు. -
ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యం
- సీఎం చేతులమీదుగా ఫిబ్రవరిలో జైన్ పరిశ్రమకు శంకుస్థాపన తంగెడంచ(జూపాడుబంగ్లా): జూపాడుబంగ్లాలో స్థాపించనున్న పరిశ్రమల్లో నందికొట్కూరు నియోజకవర్గ నిరుద్యోగులకే ప్రాధాన్యం ఇస్తామని కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన తంగెడంచ ఫారంభూముల్లో స్థాపించనున్న జైన్ ఇరిగేషన్ పరిశ్రమ, గుజరాత్ అంబుజా రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పరిశ్రమలకు అనువైన రహదారి నిర్మాణ పనులను నెలాఖరులోగా పూర్తిచేయించాలని ఏపీఐఐసీ జడ్‌ఎం గోపాలకృష్ణకు సూచించారు. కమిటీ చైర్మన్‌గా తానే ఉన్నందునా పరిశ్రమల్లో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నిరుద్యోగుల తర్వాతే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తంగెడంచ గ్రామంలో సిమెంటు రహదారులు, డ్రైనేజీలను నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న సుద్దవాగును పూడ్చేందుకు రైతులు చేసిన విజ్ఞప్తిని కలెక్టర్ అంగీకరించారు. గుజరాత్ అంబుజా పరిశ్రమకు 200 ఎకరాలు, జైన్ పరిశ్రమకు 634 ఎకరాలను కేటాయించామన్నారు. వీటిలో 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జైన్ ఇరిగేషన్ కంపెనీ సీఈఓ షమీర్‌శర్మ, తహసీల్దారు జాకీర్‌హుసేన్, ఆర్ఐ సుధీంద్ర, వీఆర్వో జగదీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల జలదీక్ష
మొగల్తూరు : తుందుర్రు ఆక్వా పరిశ్రమను మూసివేయాలని చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని మత్య్సకార నాయకులు హెచ్చరించారు. ఆదివారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరులో జలదీక్ష చేసి మత్స్యకారులు పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ అనేక ఉద్యమాలు చేశామని, అయినా ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయడంలేదని, తమ పొట్టకొట్టేందుకు సిద్ధమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి శ్రీనువాస్, వైదాని మహలక్షి్మరావు, కొల్లాటి నాగరాజు, ఎస్.కలకంఠేశ్వరరావు, గిరిబాబు, సింహాద్రి, పోతురాజు, వాటాల నర్సింహరావు, అద్దంకి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పారిశ్రామిక సంక్షోభం!
– జిల్లాలో 500 పరిశ్రమలకు తాళాలు – ఇందులో పది పెద్దతరహా పరిశ్రమలు – 300 ఆయిల్, 150 రైస్ మిల్లులు బంద్ – ఉపాధి దూరమైన వేలాది మంది కార్మికులు – కొత్త పరిశ్రమలు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం – టెక్స్టైల్ పార్కు ఊసే ఎత్తని ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేస్తున్నారు. కొత్త పరిశ్రమలంటూ వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కుంటున్నారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేక..యాజమాన్యాల వైఖరితో జిల్లాలో దాదాపు 500 పరిశ్రమలు మూతపడ్డాయి. ఏళ్లుగా వీటికి తాళాలు ఉన్నా తెరిపించే నాథుడు కరువయ్యాడు. ఎన్నికల సమయంలో వీటిని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తామని టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, డోన్, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 150 నుంచి 5 వేల మందికి ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఆయా యాజమాన్యాల వైఖరి, ప్రభుత్వ ప్రోత్సాహం కరువడంతో చాలా చోట్లా పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో వెయ్యి నుంచి 2 వేలకు పైగా కార్మికులకు ఉపాధిని కల్పించే పరిశ్రమలు పదికిపైగా ఉన్నాయి. మూతపడిన (2006లో) రాయలసీమ పేపర్ మిల్ పరిశ్రమలో ఐదు వేల మంది కార్మికులు పనిచేసేవారు. ఇది కేవలం యాజమాన్యం వైఖరి కారణంగా మూతపడినట్లు కార్మికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక కర్నూలుకు సమీపంలోని కార్బైడ్ ఫ్యాక్టరీ రాజకీయా కారణాలతో బంద్ అయింది. ఈ పరిశ్రమ నిర్వహణకు పూర్తిగా కరెంట్ వినియోగమే అధికం. అయితే రాయితీపై కరెంట్ సరఫరాను నిలిపివేయడంతో పరిశ్రమకు తాళాలు వేయడంతో వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వీటితోపాటు ఆదోనిలో కొఠారి స్పిన్నింగ్ మిల్లులో మూతపడడంతో 1200 మంది, రాయలసీమ స్పిన్నింగ్ మిల్, బంద్‌కావడంతో 1500 మంది, ఏటీ ఆయిల్ ఫ్యాక్టరీ నడవకపోవడంతో 700 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇక ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు స్పిన్నింగ్ మిల్స్, నంద్యాలలో కోపరేటివ్ స్పిన్నింగ్ మిల్, కో పరేటివ్ చక్కెర కర్మాగారం మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఉపాధి కోల్పోయిన కార్మికులు పదేళ్ల క్రితం జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర ప్రాంతాల్లో వెయ్యికిపైగా నూనె, రైస్ మిల్లులు ఉండేవి. అంతేకాక బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో క్రస్సర్ మిషన్లు, బండల ఫ్యాక్టరీలు ఉండేవి. డోన్‌లో సున్నపు ఫ్యాక్టరీలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం అక్కడ ఒక్క సున్నపు ఫ్యాక్టరీ కూడా కనిపించడంలేదు. ప్రస్తుతం వీటిలో సగానికిపైగా మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కొత్త పరిశ్రమలంటూ హడావుడి.. ప్రస్తుతం జిల్లాలో కొత్త పరిశ్రల స్థాపన అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకొని ఓర్వకల్లు సమీపంలో పరిశ్రమల హబ్ స్థాపనకు చర్యలు తీసుకొంటోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడంలేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కూడా కనిపించడంలేదు. ఈనేపథ్యంలో మూత పడిన పరిశ్రమలను తెరిపించాలనే వాదన బలపడుతోంది. టెక్స్టైల్ పార్కు ఊసే లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఆగస్టు 15వ తేదీన కర్నూలులో జరిగిన స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొని జిల్లాకు పలు హామీలు ఇచ్చారు. అందులో టెక్స్టైల్ పరిశ్రమ ఒక్కటి. ఈ హామీకి రెండేళ్లు వచ్చినా ఆచరణలో మాత్రం ఊసే కనిపించడంలేదు. దీంతో కార్మిక లోకం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. -
హామీలతో ఏమార్చారు
- హామీలు మరచిన చంద్రబాబు సర్కారు - పరిశ్రమల్లేవు.. ఉద్యోగాల ఊసులేదు - ఇప్పట్లో వెలిగొండ పూర్తయ్యే పరిస్థితీ లేదు - చేనేత కార్మికులకు రుణమాఫీ లేదు - నష్టపోరుున రైతులకు చేయూత కరువు - ప్రజల్ని మాటలతో మభ్యపెడుతున్న పాలకులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు సర్కారు రెండున్నరేళ్ల పాలనలో జిల్లాకిచ్చిన హామీల అమలు ప్రశ్నార్థకంగా మారింది. కోట్లాది రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం... లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.. అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. నేటికీ ఒక్క పరిశ్రమ ర్పాటు కాలేదు. ఒక్క ఉద్యోగం రాలేదు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో వేగం లేదు. రాబోయే రెండున్నరేళ్లలో నీళ్లొచ్చే పరిస్థితి లేదు. సోమశిల నుంచి రాళ్ళపాడుకు ఉత్తర కాలువ తవ్వేస్తున్నామన్నారు. దాని ఊసే లేదు. నాలుగేళ్లుగా జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. దాదాపు 40 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు. నకిలీ మిరప విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోరుునా స్పందించలేదు. 143 జీవోను తెరపైకి తెచ్చి, సుబాబుల్, జామాయిల్ రైతులను వంచించారు. అసలు నీళ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టు లేకుండా పరిశ్రమలు నెలకొలే పరిస్థితి లేదని పారిశ్రామిక వేత్తలు తేల్చి చెబుతున్నా.. కనిగిరిలో నిమ్జ్.. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌లో పరిశ్రమల వెల్లువ అంటూ పాలకులు మాత్రం ప్రకటనలిస్తూనే ఉన్నారు. ప్రజల్ని ఏమార్చుతూనే ఉన్నారు. మాటలతో మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన అమలుకాని హామీలపై అవలోకన ం..జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు సర్కారు వందలాది హామీలను గుప్పించింది. కానీ వీటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. ఒంగోలు : ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ స్థాయిలో ఒంగోలులో శిల్పారామన్ అన్నారు. వీటి ఊసే లేదు. వెటర్నరీ యూనివర్సిటీ ఇస్తామని చెప్పినా అది నెరవేరలేదు. మైనింగ్ యూనివర్సిటీ హామీ నీటి మూటగా మారింది. దర్శి : దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటించిన ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. తాళ్ళూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పారు. తాళ్ళూరు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తిలకు దీని ద్వారా తాగు, సాగు నీరు ఇస్తామన్నారు. ఇంత వరకు అతీగతి లేదు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మహిళా జూనియర్ కాలేజీ ఇస్తామని చెప్పారు. తాళ్ళూరు, ముండ్లమూరు ప్రాంతంలో సాగర్ కాలువల ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పినా అదీ నెరవేరలేదు. అద్దంకి : అద్దంకిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు ఆ హామీని నెరవేర్చలేదు. మేదరమెట్ల, అద్దంకి రహదారుల్లో 210 కి.మీ. రోడ్డు పరిధిలో చాలా చోట్ల రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తామని చెప్పిన అవి నెరవేరలేదు. భవనాశి రిజర్వాయర్ అభివృద్ధి పనులు బల్లికురవ మండలంలో పెండింగ్‌లో ఉన్నాయి. యర్రం చినపోలిరెడ్డి రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదు. చీరాల : చీరాలలో 25 వేల చేనేత మగ్గాల పరిధిలో 50 వేల మందికిపైగా చేనేత కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. చేనేత రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.50 కోట్ల మేర రుణాలు చెల్లించలేక చేనేతలు లబోదిబోమంటున్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు పైసా మాఫీ చేయలేదు. యర్రగొండపాలెం : వెలిగొండ పనులు పూర్తయితే నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలకు తాగు, సాగు నీరు అందుతుంది. కానీ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికి పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. గిద్దలూరు : గిద్దలూరు పట్టణానికి దూపాడు ప్రాజెక్టు నుంచి రూ.350 కోట్లతో పనులు పూర్తి చేసి నీళ్ళిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చింది. ఇంత వరకు దాని ఊసే లేదు. నల్లమల్ల అడవుల్లోని బైరేనిగుండాలు ద్వారా గిద్దలూరు పరిధిలోని 14 గ్రామాలకు నీళ్లిస్తామని చెప్పిన అది నెరవేరలేదు. ముండ్లమూరు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గిద్దలూరుకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. అటవీ అనుమతుల్లేక బేస్తవారిపేట మండలం కోనపల్లి టు ఉదయగిరి, రాచర్ల మండలం ఆరవేటికోట టు అర్థవీడు మండలం పాపినేనిపల్లి వరకు రోడ్డు పనులు నిలిచిపోయాయి. కందుకూరు : సోమశిల ఉత్తర కాలువ రాళ్ళపాడు ప్రాజెక్టు వరకు తవ్వాల్సి ఉంది. తద్వారా ప్రాజెక్టు రాళ్ళపాడుకు నీళ్ళిస్తామన్నారు. నీళ్ళిస్తామన్న బాబు సర్కారు దాన్ని పట్టించుకోలేదు. ఇక రామాయపట్నం పోర్టు, రాళ్ళపాడు ఎడమ కాలువ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అవి అమలుకు నోచుకోలేదు. కనిగిరి : కనిగిరి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వాడ (నిమ్జ్)ను 12,500 ఎకరాల్లో ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆ పనులు ముందుకు సాగడం లేదు. ఇక అదే ప్రాంతంలో సోలార్ హబ్ అని ప్రకటించిన ఆ పనులు జరగడం లేదు. కొండపి : కొండపలోని సంగమేశ్వరం ప్రాజెక్టును రూ.50.50 కోట్లతో పూర్తి చేసి తద్వారా 9,500 ఎకరాలకు సాగు నీరు, 4 మండలాల పరిధిలో తాగునీరు అందిస్తామన్నారు. దీంతో పాటు కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు ప్రాంతాల్లో 50 గ్రామాలకు నీరందిస్తామన్నారు. టంగుటూరు నుంచి కొండపి, జరుగుమల్లి టు టంగుటూరు రింగ్‌రోడ్డును పూర్తి చేస్తామని చెప్పారు. పొన్నలూరు మండలం ముక్కరాజుపాలెం టు కనిగిరిలో అలవలపాడు గ్రామం రూ.14 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మిస్తామని చెప్పిన ఆ హామీ నెరవేరలేదు. మార్కాపురం : నియోజకవర్గ పరిధిలో వెలిగొండ పూర్తి చేసి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. పొదిలిలో ఫైర్స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. పర్చూరు : శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటు సాగర్ కాలువ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పిన అవి ముందుకు సాగడం లేదు. నియోజకవర్గంలో కౌలు రైతులకు రుణమాఫీ చేయలేదు. సంతనూతలపాడు : నియోజకవర్గంలో పేదలందరికీ పక్కా గృహాలు అందిస్తామన్నారు. కానీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. -
మెడికల్ టెక్నాలజీ పరిశ్రమలు స్థాపించండి
అడ్వా మెడ్-2016 సమావేశంలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల సులభ నిర్వహణ సూచీలో భారతదేశంలోనే తెలంగాణ తొలి ర్యాంక్‌లో నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మెడికల్ టెక్నాలజీ పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనువైన పెట్టుబడుల కేంద్రంగా ఉందని తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం ప్రతిష్టాత్మకమైన అడ్వా మెడ్-2016 సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలోనే అత్యుత్తమ హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైదరాబాద్ ముందుందని, మెడికల్ టూరిజమ్‌కు అనువైన గమ్యస్థానంగా ఉందని చెప్పారు. వివిధ రంగాలకు సంబంధించి నిర్వహించిన ప్రధాన సర్వేల్లో హైదరాబాద్ అత్యున్నత ర్యాంకును సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ సమీపంలో ఫార్మాసిటీ, మెడికల్ డివైస్ పార్కులను ఏర్పాటు చేస్తున్నందున రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమెరికాలోని వైద్య సాంకేతిక సంస్థలను కోరారు. హెల్త్‌కేర్, ఫార్మా, మెడికల్ డివైస్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో క్లియరెన్స్, సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి అంశాలను ప్రస్తావించారు. జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్ గారీ ప్రుడెన్, మెడ్రానిక్ మెడికల్ టెక్నాలజీ చైర్మన్ ఒమర్ ఇష్రాక్, టెలిఫ్లెక్స్ చైర్మన్, సీఈవో బెన్సన్ స్మిత్, స్ట్రైకర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో కెవిన్ లోబో తదితరులతో కేటీఆర్ సుధీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
భెల్ పూర్తయితే 4వేల మందికి ఉపాధి
చిత్తూరు(కార్పొరేషన్) : జిల్లాలోని మన్నవరం వద్ద నిర్మిస్తున్న భెల్ పరిశ్రమను త్వరగా పూర్తి చెయ్యాలని ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. శుక్రవారం ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. భెల్ పరిశ్రమ వల్ల జిల్లాలో దాదాపు నాలుగువేల మందికి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. మన జిల్లాలో ఆలస్యమవుతున్న పరిశ్రమలను వెంటనే పూర్తి చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే బాధ ఉండదన్నారు. భెల్ పరిశ్రమ త్వరగా పూర్తిచెయ్యాలని ఈనెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు. -
‘భెల్’.. మన్నవరం టు మహారాష్ట్ర
– మన్నవరం నుంచి మహారాష్ట్రకు తరలిపోనున్న భారీ ప్రాజెక్ట్ – రెండేళ్ల నుంచి నిలిచిపోయిన పరిశ్రమ పనులు – నిధులు కేటాయించని కేంద్రం – పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం – వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడవడమే లక్ష్యం శ్రీకాళహస్తి రూరల్: ‘మన్నవరం భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ పరిశ్రమ.. బతికున్నంతకాలం ఈ పరిశ్రమ తన ‘గుండెకాయ’ అంటూ ఆత్మభావాన్ని ఆవిష్కరించేవారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆ గుండెకాయను నిలువునా చీల్చి ఇతర రాష్ట్రాల ప్రయోజనాల కోసం తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల పన్నాగాన్ని రచిస్తోంది. తాము బలంగా ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రాజెక్టులోని సింహ భాగాన్ని తీసుకెళ్లే దిశగా చర్యలను వేగవంతం చేసింది. దీంతో పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిరుద్యోగుల ఆశలు కుప్పకూలాయి. ఇంతజరుగుతున్నా రాష్ట్రంలోని పాలకులు నోరుమెదపకపోవడం వారి మనసును మరింత గాయపరుస్తోంది. చిత్తూరు జిల్లా ఎంతో వెనుకబాటుకు గురైందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6 వేల కోట్లతో ఎన్టీపీసీ–భెల్ ప్రాజెక్ట్‌ను స్థాపించేందుకు మన్నవరాన్ని ఎంచుకున్నారు. 753 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నాడు కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తన సొంత రాష్ట్రం తమిళనాడులో స్థాపించాలని, మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్‌సింగ్, మహారాష్ట్ర మంత్రులు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్ తమ రాష్ట్రానికి ‘భెల్’ పరిశ్రమ కావాలని పట్టుబట్టారు. అయితే వైఎస్ఆర్ భెల్ పరిశ్రమ తమ రాష్ట్రానికి కావాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో ఏపీలో నెలకొల్పడానికి కేంద్రం సిద్ధమైంది. అనంతరం 2009 సంవత్సరంలో వైఎస్ఆర్ అకాల మరణం పాలయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఎట్టకేలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, నాటి ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్ర, రాష్ట్ర మంత్రులు వైఎస్ఆర్ ప్రథమ వర్ధంతి(2010 సెప్టెంబర్1)న ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ 2014 నాటికి నాలుగు దశల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తులు వచ్చేలా చూడడం ప్రాజెక్టు లక్ష్యమని అన్నారు. ఇక్కడ ప్రాజెక్టు ఏర్పడడంతో దివంగత వైఎస్ఆర్ కల నెరవేరుతుందని తెలిపారు. దీనివలన ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. 2012లో ఢిల్లీలో ఉన్న (ఎన్బీపీపీఎల్) ప్రధాన కార్యాలయాన్ని మన్నవరంలోని వైఎస్ఆర్ పురానికి మార్చారు. కక్షగట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు భెల్ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తే దివంగత నేత వైఎస్ఆర్కు పేరు వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. జిల్లావాసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడంతో ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలు ఆశపడ్డారు. పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రంతో చర్చించిన దాఖలాలు లేవు. పరిశ్రమ కోసం ఇప్పటి వరకు ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు ప్రాజెక్టు పనులు ఆగిపోవడంతో నిరాశే మిగిలింది. ప్రస్తుతం పరిశ్రమనే ఇతర రాష్ట్రాలకు తరలించాలనే యోచనలో కేంద్రం ఉందనే వార్తలు వస్తుండడం సీమవాసులను అయోమయానికి గురి చేస్తోంది. ప్రాజెక్టు తరలింపనకు యత్నిస్తే సీమవ్యాప్తం భారీ ఉద్యమం తప్పదనే భావన జనంలో వ్యక్తమవుతోంది. పరిశ్రమను తరలిస్తే ఊరుకోం మన్నవరం నుంచి భెల్ పరిశ్రమను తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుటిల పన్నాగం విరమించుకోవాలి. లేకపోతే పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజలు, నిరుద్యోగ యువతతో కలసి ఆందోళనలు చేపడుతాం. రాయలసీమ వ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపడుతాం. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటాం. – బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త, శ్రీకాళహస్తి రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతోనే కేంద్ర ప్రభుత్వం మన్నవరం ప్రాజెక్టును తరలించడానికి ప్రయత్నాలు చేసుకుంటోంది. ఈ ప్రయత్నాన్ని వెంటనే నిలుపుదల చేసేటట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉద్యమాలు తప్పవు. – జనమాల గురవయ్య, సీపీఐ ఏరియా కార్యదర్శి, శ్రీకాళహస్తి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మన్నవరంలో భెల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పటికి çపూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవటంతో నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి పరిశ్రమ తరలించడానికి ప్రయత్నించడం బాధగా ఉంది. వైఎస్ఆర్ బతికి ఉంటే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకునేవి కాదు. – పవన్‌కుమార్‌రెడ్డి, ఎంబీఏ, గొల్లపల్లి -
చిన్న పరిశ్రమలపై చిన్నచూపు తగదు
జీడిమెట్ల: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ వేస్తూ చిన్న చిన్న పరిశ్రమలపై వివక్ష చూపుతోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం షాపూర్‌నగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఐఎఫ్టీయూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 727ను వెంటనే రద్దు చేసి జీవో నెంబర్ 41ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవనభృతి ఇవ్వాలని కోరారు. కార్మికుల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. చిన్న పరిశ్రమలను పోత్సహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు జేఏసీ పోరాడుతుందనిన్నారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుతరావు, శేణు, రాజ్యలక్ష్మి, జీవన్, పద్మ, శోభారాణి, వజ్రమణి, శోభ, నాగమణి, పుష్ప, భారతి, ప్రమీల, అంజమ్మ, జన్నిబాయి తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
కొత్త రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, యువత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌కాలనీలో సిమ్సన్ లైఫ్ సెన్సైస్ డెవలప్, రీసెర్చ్ సెంటర్‌ను ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యానిచ్చే మందులను రీసెర్చ్‌లో కనుగొన్నాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కావాలని, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిసిఏ అసిస్టెంట్ డెరైక్టర్ యోగానందం, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమీషనర్ సురేంద్రమోహన్, కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లిసత్యనారాయణ, సంస్థ ఎండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు ప్రజాపోరాటాలు
రాజంపేటః వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాపోరాటలే శరణ్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి అన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలంటూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రాజంపేటలో ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ టీడీపీ పాలన రెండేళ్లలో జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. జిల్లాకు ఏమైనా చేయాలంటే అది ఒక్క వైఎస్సార్సీపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాతే సాధ్యపడుతుందని తెలిపారు. సీఎం తనయుడు లోకోష్ డైరక్షన్లో కార్పొరేట్ పాలిట్రిక్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధి లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని పరిస్థితిలో ఉందన్నారు. 2007లో దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో బ్రహ్మిణి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరగడంతో సీమవాసుల ఆశలు చిగురించాయని, ఆ ఆశలు నేడు నీరుగారాయని పేర్కొన్నారు. పంచాయతీ, మండలపరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఎంపీ, ఎమ్మెల్యేలు జిల్లాలో తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి శంకుస్థాపన చేయాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సహాయకార్యదర్శి టీ.రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీసిటీ పరిశ్రమలకు అనువుగా
కృష్ణపట్నం పోర్టు సేవలు... సత్యవేడు: శ్రీసిటీలోని పరిశ్రమలకు అత్యంత అనువుగా కృష్ణపట్నం పోర్టు సేవలు లభిస్తాయని కృష్ణపట్నం పోర్టు కంపెనీ (కేపీసీటీ) సీఈవో, డెరైక్టర్ అనిల్ యెండ్లూరి శ్రీసిటీలోని పరిశ్రమల యాజమాన్యాలకు చెప్పారు. బుధవారం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో పోర్టు యాజమాన్యం నిర్వహించిన శ్రీసిటీ కస్టమర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు పోర్టు సేవలను వివరించారు. రోడ్డు, రైలు కనెక్టివిటీ, తక్కువ చార్జీలు, నిర్ణీత సమయానికి సరఫరా ఇంకా పలు అంశాల తమ ప్రత్యేకతలుగా ఆయన పేర్కొన్నారు. రాష్టంలో నేడు అత్యంత చెప్పుకోదగ్గ ప్రాజెక్టులుగా శ్రీసిటీ, కేపీసీటీలని అభివర్ణించారు. ఈ రెండూ ప్రాజెక్టులూ 8 ఏళ్ళక్రితం ప్రస్ధానం ప్రారంభించి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రతిష్టాత్మకంగా ఎదిగాయన్నారు. ఈకార్యక్రమంలో సెజ్ డెవలప్ మెంట్ కమిషనర్ ఎస్కె సమల్, శ్రీసిటీ ప్రెసిడెంట్(వర్క్స్) సతీష్కామత్, పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చెప్పింది వినాల్సిందే!
► ఆక్వా ఫుడ్ పార్క్‌ను అడ్డుకోవద్దన్న సీఎం చంద్రబాబు ►‘ఏరువాక’లో రైతులకు వాత పెట్టేలా ప్రసంగం ► ప్రజల మనోభావాలకు పాతర ►కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ► పరిశ్రమల్ని అడ్డుకుంటే ఎలాగని నిలదీత సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘రైతన్న సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తాం. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రైతులు సాగు ప్రారంభించింది మొదలు పంటలను మార్కెట్లో విక్రయించే వరకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది..’ అంటూ రైతులను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ధాన్యానికి మద్దతు ధర పెంచే విషయంలో మాత్రం నోరు మెదపలేదు. కనీసం మద్దతు ధరపై రాష్ట్రం తరఫున బోనస్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించలేదు. ధాన్యం పంట ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీపై స్పందించలేదు. పైగా తాను చెప్పిందే వేదమన్నట్టు.. ఏది చెబితే అది రైతు లు వినాల్సిందే అన్నట్టు అన్నదాతల నెత్తిన ఆక్వా పార్క్ పిడుగు వేశారు. పంటల్ని మింగేసే ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తుందుర్రులో చేపట్టవద్దని.. తప్పదంటే సముద్ర తీరంలో భూములు కేటాయించి అక్కడకు తరలించాలని రైతులు కోరుతుంటే.. ‘తప్పదు భరించాల్సిందే’నంటూ హితబోధ చేశారు. భారీ ఉద్యమం సాగినా.. డెల్టా ప్రాంతంలో భారీ ఉద్యమానికి కారణమైన ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుకూలంగా ముఖ్యమంత్రి మరోసారి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. రూ. 200 కోట్ల వ్యయంతో భీమవరం మండలం తుందుర్రు గ్రామ పరిసరాల్లో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు, ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటూ గతంలో ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటన చేయగా, ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజలు మరోసారి ఉద్యమాలకు పూనుకున్నారు. తాత్కాలికంగా పనులు నిలిచిపోవడంతో ప్రజలు కొంత శాంతించారు. ఈ నేపథ్యంలో సోమవారం నరసాపురం మండలం చిట్టవరంలో ఏరువాక కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మళ్లీ ఫుడ్‌పార్క్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందాలని, పరిశ్రమలు వస్తే అడ్డుకోవడం తగదని హితబోధ చేశారు. ‘కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుందాం. అందులో వచ్చిన నీటిని ప్రాసెసింగ్ చేసి నేరుగా సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకుందాం. దీన్ని అడ్డుకోవద్దు’ అని సీఎం కోరారు. లక్షలాది ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ పరిశ్రమపై ముఖ్యమంత్రి అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జనం ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. గ్రామాల మధ్య ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల జల, వాయు కాలుష్యాలు అధికమై తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల రైతులు, ప్రజలు ఏడాది కాలంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. భీమవరం మండలం తుందుర్రులో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పనులకు టీడీపీకి చెందిన కొందరు నేతలు గత ఏడాది శ్రీకారం చుట్టారు. ప్రజల జీవనానికి తీవ్ర విఘాతం కల్పించే ఆక్వా ఫుడ్‌పార్క్‌ను నిలిపివేయాలని, గ్రామాలకు దూరంగా దీనిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల డిమాండ్‌ను పార్క్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో తుందుర్రుతోపాటు జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల ప్రజలతోపాటు భీమవరం, నరసాపు రం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని సుమారు 40గ్రామాల ప్రజలు పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. పార్క్ అవసరాలకు నీటిని విపరీతంగా వినియోగిం చడం వల్ల పరిసర ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని, రొయ్యల శుభ్రతకు ఉపయోగించే కలుషిత నీరు డ్రెయిన్స్‌లో కలవడం వల్ల అందులో ఉండే చేపలు చనిపోయి మత్య్సకారులకు ఇబ్బందులు ఏర్పడతాయనేది వారి ఆందోళన. ఫుడ్ పార్క్‌లో నిత్యం టన్నులకొద్దీ అమోనియా వాడతారని, దానిని నీటిలోకి వదలడం వల్ల జల వనరులు ఎందుకూ పనికిరావని ఆ ప్రాంత ప్రజ లు చెబుతున్నారు. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ప్రేరణ ఫౌండేషన్ మాన వ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిం చింది. దీనిని ఆపడం కోసం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గతంలో సీఎంను కలిసి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాధవనాయుడి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరడం చర్చనీయాంశం అయ్యింది. -
రంజాన్ కు ఎయిర్ సెల్ స్పెషల్ ఆఫర్స్
న్యూఢిల్లీ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎయిర్ సెల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్పెషల్ రంజాన్ ప్యాక్ కింద టాక్ టైమ్ లాభాలతో పాటు రాత్రిపూట వాయిస్ కాలింగ్ లో అత్యధిక రాయితీ టారిఫ్ లను కస్టమర్లకు ఆఫర్ చేయనున్నట్టు ఎయిర్ సెల్ తెలిపింది. ఢిల్లీలో ఎయిర్ సెల్ కొత్త ప్రొడక్ట్ కింద రూ.86 రీచార్జ్ కు రూ.86 ఫుల్ టాక్ టైమ్ ఆఫర్ ను అందిస్తోంది. దీంతో పాటు లోకల్, ఎస్ టీడీ కాలింగ్ కు రాత్రి 12 నుంచి ఉదయం 6గంటల వరకు నిమిషానికి 30 పైసల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ 12 రోజుల పాటు వాలిడిటీలో ఉంచింది. ఐఎస్ డీ కాలింగ్ కూడా రంజాన్ ప్యాక్ కింద ఆఫర్లను ప్రకటించింది. యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియాలకు సెకన్ కు 16 పైసలు, బంగ్లాదేశ్ కు సెకన్ కు 4పైసలు మాత్రమే చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. ఇఫ్తార్ అనంతరం, అదేవిధంగా తెల్లవారుజామున లోకల్, ఎస్ టీడీ, ఐఎస్ డీ కాల్స్ కోసం యూజర్లు అత్యధికంగా వాడుతుంటారని, వారికోసం స్పెషల్ గా రంజాన్ ప్యాక్ ను తీసుకొచ్చినట్టు ఎయిర్ సెల్ చెప్పింది. తమ కస్టమర్లకు రంజాన్ స్పెషల్ నెల అని, భారత్ లో, విదేశాల్లో స్నేహితులతో, కుటుంబసభ్యులతో వారు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారని ఎయిర్ సెల్ నార్త్ రీజనల్ బిజినెస్ హెడ్ హరీష్ శర్మ చెప్పారు. ఈ నెలలో రాత్రిపూట ఎక్కువగా కాల్స్ డేటా నమోదవుతుందని పేర్కొన్నారు. ఈ అవర్స్ లో చాలా రిటైల్ అవుట్ లెట్లు మూసేస్తారని, దానివల్ల బ్యాలెన్స్ అయిపోయి కస్టమర్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు సౌకర్యవంతంగా రంజాన్ ప్యాక్ కింద ఈ ఆఫర్లు ప్రకటించామని హరీష్ అన్నారు. -
కాటన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ వద్ద ఉన్న భద్రకాళీ కాటన్ పరిశ్రమలో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 500 పత్తిబేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.కోటి ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
విద్యుత్ధరలే మూతకు కారణం
సర్కారు అనుసరిస్తున్న విధానాలవల్లే పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమలు మూత పడటానికి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణం. దీనికి తోడు రాయితీలు లేకపోవడం, అంతర్జాయ మార్కెట్లో ఫెర్రోక్రోమ్ ధరలు తగ్గిపోవటం, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫెర్రోక్రోమ్ ధాటికి దేశీయపరిశ్రమలు తట్టులేకపోవటం రెండో కారణంగా ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ముడిసరకు కొరత కూడా మరో కారణంగా కనిపిస్తోంది. జూట్ పరిశ్రమలు కూడా విద్యుత్ ధరల పెంపుదల, నార కొరతవల్ల మూతపడుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టక పోవటం, ప్రభుత్వ రాయితీలు, వీటికి మార్కెట్ కల్పించక పోవటం వంటి కారణాలతో వేలాది కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నవి మూతపడుతుంటే కొత్త పరిశ్రమలకోసం ప్రభుత్వభూములు కట్టబెట్టేందుకు సర్వేలు చేపట్టడం అందరినీ విస్మయపరుస్తోంది. -
నా సలహా అదొక్కటే!
‘‘ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ అంటారు కానీ, నాకు ఎప్పుడూ ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. నేనెప్పుడూ అలా ఫీలవలేదు కూడా! నేను ఎప్పుడైనా పని గురించే ఆలోచిస్తాను కానీ మేలా, ఫిమేలా అనే ఆలోచనే కూడా రాదు. ప్రస్తుతం నేను ‘మౌనం’, ‘వల్లి’ చిత్రాలకు సంగీతం అంది స్తున్నా. ఏ రంగంలో అయినా పోటీ అనేది తప్ప కుండా ఉంటుంది. అప్పుడే మనం ఏమిటో నిరూపించుకుంటే ప్రత్యేక గుర్తింపుంటుంది. మహిళ లకు నేనిచ్చే సలహా ఒక్కటే.... అందరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అదేంటో తెలుసుకుని దాన్ని చేరుకు నేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు - ఎం.ఎం. శ్రీలేఖ, సంగీత దర్శకురాలు -
మేకప్ పై పెరుగుతున్న వ్యామోహం..!
భారత్ లో సంప్రదాయ వివాహాల్లో ఇటీవల మేకప్ పై తీవ్ర వ్యామోహం పెరుగుతున్నట్లు మేకప్ పరిశ్రమ నిపుణులు పనాజీ వెల్లడించారు. దేశంలో మేకప్ ఇండస్ట్రీరీ ప్రతి సంవత్సరం ఇరవై శాతం చొప్పున అభివృద్ధి చెందేందుకు ఈ వివాహాలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రజలు సౌందర్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా భారత వివాహాలు పరిశ్రమకు మంచి అభివృద్ధి సాధకాలుగా మారుతున్నాయని, ముంబైలోని బాలీవుడ్, హాలీవుడ్ ఇంటర్నేషనల్(BHI), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ అకాడమీ నిపుణుడు వివేక్ భారతీ వివరించారు. ముంబైలో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ వర్క్ షాప్ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈ విషయాన్ని వెల్లడించారు. హాలీవుడ్ ప్రముఖ మేకప్ కళాకారుడు డోనాల్డ్ సిమ్ రాక్ ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అభివృద్ధి చెందిన, అత్యంత సంపన్నదేశమైన అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహ సందర్భాల్లో మేకప్ కు సుమారు 150 నుంచి 200 డాలర్లను ఖర్చు పెడుతుంటే... ఇండియాలో మాత్రం బ్రైడల్ మేకప్ కు సుమారు 14 నుంచి 15 వేల రూపాయలు దాకా ఖర్చు చేయడం పెద్ద విషయంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రత్యేక వివాహ వేడుకల్లో లక్షలకొద్దీ మేకప్ కోసం ఖర్చుచేసిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయ వేడుకగా జరుపుకునేందుకు భారతీయులు ఎంతో ఖర్చు పెడతారని ఈ సందర్భంగా భారతీ వివరించారు. వివాహం అనేది భారత కుటుంబాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమం అని, ఇందులో వధువు దుస్తులతోపాటు, అలంకరణ, మేకప్ ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారని భారతీ అన్నారు. పెళ్ళి సందర్భంలో వధువు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుందని, ఆ సన్నివేశంలోని చిత్రాలను తరతరాలపాటు భద్రపరచుకొంటారని సూచించారు. బ్యూటీ ఇండ్రస్ట్రీ సంవత్సరానికి ఇరవై శాతం అభివృద్ధి చెందుతుండగా మేకప్ పై జనంలో ఏభైశాతం అవగాహన కూడ పెరుగిందని అయన తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ అభివృద్ధి భారతీయ సెలూన్లలో చూస్తే తెలుస్తుందని, గతంలో బ్యూటీ ఇండస్ల్రీపై అవగాహన అంతగా ఉండేది కాదని, నిరక్షరాస్యులే ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చేవారని అన్నారు. ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు బ్యూటీ పరిశ్రమలో అడుగిడి, దాన్ని ఉద్యోగంగా మార్చుకుంటున్నారన్నారు. అంతేకాక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు పొందే ఉద్యోగంగా మేకప్ ఉద్యోగం మారుతోందని, మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సంపాదిస్తున్నాడని ఆయన వివరించారు. -
ధరల బాదుడుకు రాచబాట
విశ్లేషణ జీఎస్టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్టకుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించి తీరాలి. సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటికి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి. మా పొరుగింటాయన తన ఇంటిని కూలగొట్టి, అత్యాధునికంగా పునర్నిర్మించుకొని ఆ నిర్మాణ వ్యయం బిల్లులను నాకు పంపితే ఎలా ఉంటుంది? ‘వినూత్నమైనది’, ‘చరిత్రాత్మకమైనది’, ‘నేటి పరిస్థితిని పూర్తిగా మార్చేసేది’ అంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పై జరుగుతున్న చర్చ సరిగ్గా దీన్నే విస్మరిస్తోంది. భారత కార్పొరేట్ రంగానికి సంబంధించి జీఎస్టీ సమూల మార్పును తెస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పదేపదే చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వాట్), లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరాలన్నిటి స్థానంలో జీఎస్టీ అమల్లోకి వస్తుంది. పన్నుల దొంతర ఫలితంగా వృద్ధి కుంటు పడడాన్ని ఇది చాలా వరకు తగ్గిస్తుందని ఆశిస్తున్నారు. తద్వారా స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 0.9 నుంచి 1.7 శాతం పెరుగుతుందని భావిస్తు న్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలో రకరకాల పన్నులను లేదా కొందరు అనేట్టు పన్ను మీద పన్ను విధించడం మాత్రమేగాక, ఇది పన్నుల వసూలులోని ప్రతి దశలోనూ విచ్చలవిడి అవినీతిని అనుమతించింది. అందుకు కారణాలు ఏవైనా, చివరికి రిటైల్ ధరలను చెల్లించే కొనుగోలు దారులే ఈ అధిక పన్నుల భారాన్నంతా మోయాల్సి వస్తోంది. కార్పొరేట్ల సౌఖ్యానికి సామాన్యునిపై భారం జీఎస్టీ, వస్తుసేవల ఉత్పత్తిదారులకు ఏ ప్రయాసాలేని పన్నుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. పలు చోట్ల పలు రకాల పన్నులను చెల్లించాల్సి రావడానికి బదులుగా వారు ఇప్పుడు ఒకే ఒక్క పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇంతా చేసి అది వృద్ధి రేటును పెంపొందింపజేస్తుందా, లేదా? అనే విషయాన్ని పక్కన పెడదాం. అంతకంటే ముఖ్యంగా అది వ్యాపారం సులువుగా సాగే అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బాగానే ఉంది గానీ, చివరికి ఈ సంస్కరణకు అయ్యే వ్యయ భారాన్ని వినియోగదారులు ఎందుకు భరించాలో అంతుబట్టడం లేదు. జీఎస్టీ సరిగ్గా మా పొరుగింటాయన కథ లాంటిదే. ఇంటి పునర్నిర్మాణం చేపట్టినవారే ఆ వ్యయాన్ని భరించాలి. అలాగే ఈ పన్నుల సంస్కరణ ఎవరి కోసమో వారే దీని భారాన్ని భరించాలి. దీనివల్ల లబ్ధి పొందేది మన కార్పొరేట్ రంగమే. ఆ వ్యయాన్ని చెల్లించాలని వారినే అడగాల్సింది పోయి, దాన్ని వినియోగదారులపైకి నెట్టారు. ఈ అధిక జీఎస్టీ రేటు వినియోగదారులకు మింగుడుపడేలా చేయాలనే అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్లో సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతా నికి పెంచారు. 2015-16లో సామాన్యుల జేబుల నుంచి ఇలా ఎంత గుం జారో 2016 బడ్జెట్ నాటికిగానీ తెలియదు. అయితే గత ఏడాది సర్వీస్ ట్యాక్స్ ద్వారా మాత్రమే ప్రభుత్వానికి రూ. 50,000 కోట్లు అదనపు రాబడి వచ్చిందనే దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. సర్వీసు ట్యాక్స్ క్రమంగా పెరుగుతూ పోవడాన్ని బట్టి రేపు 18 శాతం ప్రామాణిక రేటు చొప్పున జీఎస్టీ అమల్లోకి వచ్చాక అమాయక ప్రజాబాహుళ్యం దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నా అంచనా. మరోవిధంగా చెప్పాలంటే, జీఎస్టీ సంస్కరణలకు అయ్యే వ్యయ భారాన్నంతటినీ భరించాల్సింది వినియోగదారులే. కాగా, దాని ఏకైక లబ్ధిదారైన కార్పొరేట్ రంగం మాత్రం ఏమీ చెల్లించదు. జీఎస్టీ అంటే ఒకే పన్ను రేటు కాబట్టి సర్వీసు ట్యాక్స్ కూడా అందులోనే కలిసిపోయి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్’ (ఆర్ఎన్ఆర్) పద్ధతిలోనే పన్నుల వసూలు జరగడానికి హామీ ఉండ టం, అది ఇప్పటికంటే పడిపోకుండా ఉండటం ఆవశ్యకం కావచ్చు. ప్రస్తుతం ఉన్న పలు దొంతరల పన్నుల విధానంలో కంటే జీఎస్టీ వల్ల ప్రభుత్వ రాబడి పడిపోతుంది. ఆ లోటును భర్తీచేసుకునే ఉత్తమ మార్గం సామాన్యుల పైన భారాన్ని మరింత పెంచడమేనని ప్రభుత్వం భావిస్తోంది. ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రేట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’పై నియమించిన అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఉద్దేశపూర్వకంగానే పన్నుల వసూళ్ళు అధిక రేటులో ఉండేందుకు కృషి చేసిందని దాని నివేదికే తెలిపింది. అది సగటున 15-15.5 శాతం ఆర్ఎన్ఆర్ రేటునూ, రెండు రకాల పన్నుల విధానాన్నీ సూచించింది. కొన్ని వస్తువులకు 12 శాతాన్ని, మిగతా వాటికి 17-18% ప్రామాణిక రేటును సూచించింది. పదాల గారడీయే ధరల తగ్గుదలా? వ్యాట్ కూడా ఒక విధమైన జీఎస్టీనే. వ్యాట్‌ను ప్రవేశపెట్టిన 165 దేశాల్లో చాలా వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నాయని కూడా అది చెప్పింది. ఒకే జీఎస్టీ రేటును లేదా రెండు రేట్లను ప్రవేశపెట్టినాగానీ ప్రవేశపెట్టినాగానీ అది ఒక సవాలే. ఫెడరల్ వ్యవస్థను కలిగిన పెద్ద ఆర్థికవ్యవస్థలు ఉన్న యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేసియా వంటి దేశాలు సైతం ఈ పన్నుల విధానం అమలులో తీవ్ర సమస్యలను ఎదు ర్కోవాల్సి వచ్చింది. ఆ సాధకబాధకాలను గురించి నేను మాట్లాడటం లేదు. దానివల్ల సామాన్యునిపై పడుతున్న అదనపు భారాన్ని గురించి మాత్రమే చర్చిస్తున్నా. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో జీఎస్టీ అమలు ఫలితంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని ఆ నివేదికే పేర్కొంది. ఆ దేశాలలో జరిగి నట్లుగానే ఇక్కడ కూడా మొదట ధరలు పెరిగినా, తరువాత తగ్గుతాయనడం ఆర్థిక పద మాయాజాలంతప్ప మరేం కాదు. పప్పుల ధరలనే తీసుకుందాం. జూన్-అక్టోబర్ మధ్య సామాన్యులు వాడే కందిపప్పు ధర రూ.70 నుంచి రూ.170-200కు పెరిగింది. ప్రస్తుతం అది రూ. 120 కి తగ్గిందనుకుంటే, మూల ధర రూ. 70 స్థాయి నుంచి చూస్తే కచ్చితంగా ద్రవ్యోల్బణం తగ్గినట్టే. కానీ వాస్తవంలో ధర రూ.70 నుంచి పెరిగి రూ. 120 వద్ద నిలిచినట్టే. వచ్చే ఏడాది తిరిగి పప్పుధర పెరిగితే ఆ పెరుగుదలను కిలోకు రూ. 70 నుంచి గాక, రూ.120 ప్రాతిపదికన లెక్కగడతారు. దీనికితోడు సర్వీస్ ట్యాక్స్ పెరగడం ఒక్కదానివల్లనే ధరలు గణనీయంగా పెరుగుతాయని ఆశించ వచ్చు. 24 సేవలను ఈ జాబితాలో చేర్చారు. ఈ పన్నుల భారానికి తోడు పెరిగే ద్రవ్యోల్బణం ప్రజలపై అదనంగా మోపే పరోక్ష పన్ను అవుతుంది. అంటే ఆచరణలో మీపై రెండుసార్లు పన్ను విధిస్తారు. కట్టెకు నూనె రాసి కొట్టడం అంటే ఇదే పెట్రోలియం (తొలి కొన్నేళ్లు మాత్రమే), విద్యుత్తు, రియల్ ఎస్టేట్, ఆల్క హాల్ జీఎస్టీ పరిధికి వెలుపలే ఉన్నాయి. పెట్రోలియం, ఆల్కహాల్ రాష్ట్రా లకు అతిపెద్ద రాబడి వనరనీ, వాటి మొత్తం పరోక్షపన్నుల రాబడిలో 29 శాతమనీ, రాష్ట్రాల మొత్తం రాబడిలో 41.8 శాతం జీఎస్టీలో కలిసిపో తుందనీ ఆ నివేదికే తెలిపింది. జీఎస్టీ రెండంతస్తుల పన్నుల వ్యవస్థ. కేంద్రం (సీజీఎస్టీ), రాష్ట్రాలు (ఎస్జీఎస్టీ) ఇలా రెండుసార్లు పన్ను విధిం చడం వల్లనే జీఎస్టీ వల్ల కలుగుతుందంటున్న ప్రయోజనంలో అత్యధిక భాగం హరించుకుపోతుంది. ప్రామాణికమైన పన్ను స్లాబు గరిష్టంగా 18 శాతం ఉంటుందని ఇంత వరకు చెబుతున్నారు. కానీ దాన్ని రాజ్యాంగబద్ధమైన పరిమితిగా చేయ డానికి ఆర్థికమంత్రి అంగీకరించడం లేదు. అంటే గరిష్ట పరిమితి పెంచడానికి అవకాశాన్ని తెరచి ఉంచినట్టే. జీఎస్టీ రేటుకు రెండు అంతస్తుల రేట్లతో పూర్తి పొందికను సాధించాక, కనిష్ట రేటును 12 శాతంగా, గరిష్ట రేటును 22 శాతంగా నిర్ణయిస్తారని నిపుణుల విశ్వాసం. అంటే సర్వీస్ ట్యాక్స్‌ను 22 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టే. అందుకే గరిష్ట పరిమితిపై అవధి విధింపునకు అంగీకరించడం లేదు. సర్వీసు ట్యాక్స్‌ను 12.36 నుంచి 14 శాతానికి ఈ ఏడాది పెంచినప్పుడు ఎవరూ గగ్గోలు పెట్టలేదు. పైగా దానిపైన 0.5 శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను కూడా విధించారు. ఈ విధంగా క్రమక్రమంగా, దశలవారీ పద్ధతిలో ఎప్పటికప్పుడు సర్వీస్ ట్యాక్స్‌ను పెంచ డం వల్ల అదనపు పన్నుల భారం వినియోగదారులకు తేలికగా మింగుడు పడుతుంది. కట్టెకి నూనె రాసి కొట్టడం అంటే ఇదే. అందువలన జీఎస్టీ సంస్కరణ భారాన్ని వినియోగదారులపైకి నెట్ట కుండా ఉండడం ముఖ్యం. పార్లమెంటులోనూ, ఇప్పుడు సన్నద్ధం చేస్తున్న జీఎస్టీ నమూనా చట్టంలోనూ ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంది. సర్వీస్ ట్యాక్స్‌పై గరిష్టపరిమితికి అవధిని నిర్ణయించడం మాత్రమే అందుకు మార్గం. మన దేశం రెండు రేట్ల విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది కాబట్టి, సర్వీస్ ట్యాక్స్‌ను కనిష్ట స్థాయి రేటైన 12 శాతానికి పరిమితం చేయాలని నా సూచన. ప్రామాణిక రేటు 18 శాతం, బహుశా హెచ్చుతగ్గులకు వీలైనది. కానీ దాని కనిష్ట స్థాయి 12 శాతానికి మించి పెరగడాన్ని అనుమతించరాదు. కార్పొరేట్ రంగానికి ఏటా ఇంచుమించు జీడీపీలో 2.7 శాతం మేరకు పన్ను మినహాయింపులను ఇస్తున్నారు. వాటి కి స్వస్తి పలకడం ద్వారా ప్రభుత్వం పన్నుల పునాదిని విస్తరింపజేసుకోవాలి. వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు : దేవిందర్ శర్మ(hunger55@gmail.com) -
భారీ వర్షాలకు కూలిన గోడ
-
సింగరేణి.. వెలుగుల బొగ్గు
- మన రాష్ర్టంతో పాటు ఇతర రాష్ట్రాలకూ సరఫరా - విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమల అవసరాలకు రవాణా - ఈ ఏడాది నుంచి ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచిన యాజమాన్యం రుద్రంపూర్ : సింగరేణి కార్మికులు ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణలోని పరిశ్రమలకే గాక వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలకు సరఫరా అవుతోంది. 2014-15 సంవత్సరంలో 526 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి వివిధ పరిశ్రమలకు రవాణా చేసింది. ఇందులో 392.6 లక్షల టన్నులు విద్యుత్ కర్మాగారాలకు సరఫరా చేశారు. వీటి లో తెలంగాణలోని విద్యుత్ సంస్థలతో పాటు మహారా ష్ర్ట, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, కేరళ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఉన్నారుు. ఈ బొగ్గుతో సుమారు 9000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అరుు్యంది. ఇక రా ష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల సిమెంట్ కంపెనీలకు దా దాపు 46.40 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశారు. ఒప్పందాల కన్నా ఎక్కువ సరఫరా తెలంగాణ రాష్ట్రంలోని జెన్కోకు ఎఫ్ఎస్ఏ(ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్)ప్రకారం 83.60 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా 127.89 లక్షల టన్నులు స రఫరా చేశారు. ఇందులో కేటీపీఎస్(పాల్వంచ)కు 59 లక్షల టన్నులకు గాను 93.55 లక్షల టన్నులు, కేటీపీపీ(భూపాలపెల్లి) 21.60 లక్షల టన్నులకు 33.09 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నా యి. దీంతో ఎండాకాలంలో కూడా బొగ్గు కొరత తీరి.. విద్యుత్ కర్మాగారాలు సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్ప త్తి చేసి ప్రజలకు అందించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు.. మహాజెన్‌కో(పర్లి-మహారాష్ట్ర)కు 19.98 లక్షల టన్ను లు, కేపీసీఎల్(రాయచూర్- కర్ణాటక)కు 28.45 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కోకు(మద్దనూరు- ఆంధ్రప్రదేశ్)కు 39.38 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేశారు. ఇంకా ఎస్ఎస్పీసీఎల్(భిలాయ్-చత్తీస్‌గఢ్), కేపీసీఎల్(బల్లారి-కర్ణాటక), మహాజెన్‌కో(చంద్రాపూర్-మహారాష్ట్ర), ఐజీపీపీపీ(ఆరావళి-హర్యానా), డాక్ట ర్ ఎన్టీపీపీ(విజయవాడ-ఆంధ్రప్రదేశ్)కి కలిపి సు మారు 51,30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ రవాణా చేసింది. 36 కేటగిరీల పరిశ్రమలకు.. విద్యుత్ పరిశ్రమలతోపాటు మరో 36 కేటగిరీల పరిశ్రమలకు కలిపి సుమారు 750 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ సరఫరా చేసింది.వీటిలో ప్రధానంగా పేపర్‌మిల్స్, పల్ప్ పరిశ్రమ, సిరామిక్ పైపులు, మం దుల పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, ఇటుక, సున్నం, పొగాకు, ఆయిల్, వస్త్రపరిశ్రమలతోపాటు మరికొన్ని పరిశ్రమలకు బొగ్గును రవాణా చేయడం ద్వారా వాటి ఉత్పత్తిని కొనసాగించేందుకు దోహదపడింది. రాబోయే కాలంలో సింగరేణిపై మరింత భారం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికు లు కీలకపాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర సింగరేణి కార్మికులపై ఉం ది. తెలంగాణలో రానున్న పదేళ్ల కాలంలో 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అనేక విద్యుత్ థర్మ ల్ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రస్తు తం సింగరేణి సంస్థ అందిస్తున్న బొగ్గు కంటే అదనంగా ఏడాదికి మరో 40 మిలియన్ టన్నుల బొగ్గు అవసరముంటుంది. ప్రస్తుతం సాధించిన 52 మిలియన్ టన్ను ల నుంచి 90-100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వా ర్షిక లక్ష్యాన్ని 60 మిలియన్ టన్నులకు యాజమాన్యం పెంచింది. దీని సాధించటానికి యాజమాన్యం నెల రో జులుగా ప్రణాళికలను తయారుచేసి అందుకు కావాల్సి న పనులను వేగవంతం చేస్తోంది. అలాగే, లక్ష్యసాధ నకు కార్మికులు జూన్ నుంచి కసరత్తు చేస్తున్నారు. రికార్డు స్థారుులో బొగ్గురవాణా ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సింగరేణి సంస్థ అన్ని ఏరి యూల్లో కలిపి కలిపి 126.34 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. గత ఏడాది ఈ నెలల్లో 60%శాతం రావాణాను కూడా చేయని పరిస్థితి. సింగరేణి చైర్మన్ చొరవతో ఏరియాల అధికారులు ముందుకు వచ్చి రవాణాను రికార్డు స్థాయికి చేర్చారు. -
నిర్ణయాల్లో అవినీతి, తప్పిదం వేర్వేరు
న్యూఢిల్లీ: నిర్ణయాల్లో తప్పిదాలు, అవినీతిని వేరువేరుగా చూడాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన ఇండస్ట్రీ చాంబర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) సదస్సులో పాల్గొన్న ఆయన కొందరు పారిశ్రామిక వేత్తల అవినీతి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వాధికారుల లంఛం కేసుల దర్యాప్తు విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పలు నిర్ణయాలు తీసుకోకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిరోధించగలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాల్సిందిగా లా కమిషన్ కూడా ఇప్పటికే పలు సూచనలు తెలియజేసినట్లు వివరించారు. తీసుకునే నిర్ణయాల్లో లోపాలు, తప్పిదాలు ఉండకుండా ఉండేందుకు ఆ తీసుకునే నిర్ణయంపై ముందుగానే పరి విధాలా చర్చలు జరిపేలా పరిశ్రమలన్నీ కూడా వర్కింగ్ గ్రూపులను ఏర్పాటుచేసుకోవాలని, వాటిని బాధ్యతాయుత సంస్థలుగా మార్చాలని సూచించారు. -
రెండేళ్లలో 24 x 7 విద్యుత్
తెలంగాణలో సైతం ‘పవర్ ఫర్ ఆల్ ’ అమలు! సీఎం కేసీఆర్ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూల స్పందన రాష్ట్రంలో కేంద్ర విద్యుత్ శాఖ బృందం పర్యటన రాష్ట్ర విద్యుత్ అధికారులతో ప్రాథమిక చర్చలు 2017-18 నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌కు హామీ తొలి విడత కింద ఇప్పటికే ఎంపికైన ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ సాక్షి, హైదరాబాద్: అంతరాయమే లేకుండా 24 x 7 విద్యుత్ సరఫరా. రెప్పపాటు కూడా విద్యుత్ కోతలుండవు. పల్లె, పట్నం.. గృహ, వాణిజ్య, వ్యవసాయం, పరిశ్రమలు అనే తేడాల్లేకుండా అందరికీ విద్యుత్. మరో రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఈ మైలురాయిని అందుకోనుంది. నిరంతర (24 x 7 ) విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ కార్యక్రమం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 2017-18 నుంచి తెలంగాణలో సైతం అమలు కానుంది. ఈ కార్యక్రమం తొలి విడత కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఎంపిక కాగా, త్వరలో ఈ జాబితాలో రాష్ట్రం సైతం చేరనుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి స్పష్టమైన హామీ లభించింది. ‘అందరికీ విద్యుత్’ కింద తెలంగాణను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ఢిల్లీ పర్యటనలో చేసిన విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. కేంద్ర విద్యుత్ శాఖ నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం సోమవారం విద్యుత్ సౌధలో రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో సమావేశమై రాష్ట్రంలో ‘అందరికీ విద్యుత్’ అమలుపై ప్రాథమిక చర్చలు జరిపింది. కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా నేతృత్వం వహించిన ఈ బృందంలో 11 మంది అధికారులున్నారు. రాష్ట్రంలో 24 x 7 విద్యుత్ కోసం చేపట్టాల్సిన చర్యలు, వనరులు, నిధులపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు నివేదించారు. రాష్ట్రం 4,320 మెగావాట్ల విద్యుదుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. మరో 6,680 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటికితోడు మరో 2,500 మెగావాట్లను సమకూర్చుకుంటే నిరంతర విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. దీనికి తగ్గట్లు విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.15 వేల కోట్ల నిధులు అవసరమని చెప్పారు. ఈ మేరకు అదనపు విద్యుత్, నిధులను సమకూర్చాలని ప్రతిపాదించారు. కొత్తగా నిర్మిస్తున్న థర్మల్ ప్రాజెక్టులకు కావాల్సిన బొగ్గు కేటాయింపులతో పాటు పాత ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర బృందం సైతం సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణను సైతం ‘అందరికీ విద్యుత్’ కార్యక్రమం కింద ఎంపిక చేస్తామని కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా స్పష్టమైన హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్) సమర్పిస్తే నిర్ణయం తీసుకుంటామని సూచించారు. అనంతరం కేంద్ర బృందం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలసి ఆయనతో సమావేశమైంది. -
అప్పటి నుంచి... సలహాలివ్వడం మానేశా!
సినీ రంగంలో ఆయన ఎవరికీ వారసుడిగా రాలేదు... ఎవరినీ వారసులు గానూ తీసుకురాలేదు. తొలి చిత్రమైన బి.ఎన్. రెడ్డి గారి ‘రంగుల రాట్నం’ నుంచి ఇప్పటి దాకా ఈ 50 ఏళ్లలో ఆయన హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా... వందల సినిమాలు చేశారు. వందల రోజుల సినిమాల నటుడిగా ప్రజాదరణ పొందారు. ఆరడుగుల ఆజానుబాహుడు కాకపోయినా, పక్కన నటించిన ప్రతి హీరోయిన్నూ తారాపథానికి చేర్చిన సెంటిమెంటున్న ఆ వెర్సటైల్ ఆర్టిస్ట్ - చంద్రమోహన్. సినీ దిగ్గజాలు కె. విశ్వనాథ్, ఎస్పీబీలకు బంధువు. మధ్యతరగతి మల్లంపల్లి చంద్ర శేఖరరావు నుంచి ఈ స్థాయికి ఎదిగిన ఆయన మామూలుగా మీడియాకు దూరం. ఇంటర్వ్యూలకు ఇంకా... దూరం. సినీరంగానికొచ్చి 50వ ఏట అడుగిడిన చంద్రమోహన్ చాలా కాలం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మనసు విప్పి పంచుకున్న మాటలు... తెలియని కోణాలు... చేదు నిజాలు... తీపి కబుర్లు... ఈ ఆదివారం ‘సాక్షి ఫ్యామిలీ’ గిఫ్ట్. పులగం చిన్నారాయణ ఎలా ఉన్నారండీ? కులాసాగా ఉన్నా. గత నెల కొంత ఇబ్బందై, ఆసుపత్రిలో చేరా. మీడియాలో ఏవేవో వార్తలొచ్చాయి. అవన్నీ తప్పు. అయావ్‌ు ఆల్రైట్. మళ్ళీ ఉత్సాహంగా మేకప్‌తో కెమేరా ముందుకొచ్చా. మీరు ఫస్ట్ మేకప్ వేసుకుంది 1966 మార్చి 16న. అంటే, యాక్టర్‌గా 50వ ఏట ప్రవేశించారన్నమాట. (నవ్వేస్తూ...) అవును. నిజమే. సినీరంగానికొచ్చి, అప్పుడే 50 ఏళ్ళయిందా అనిపిస్తోంది. మేకప్ వేసుకున్న తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటారా? నటుణ్ణి కావాలని నేనెప్పుడూ కలలు కనలేదు. కనీసం ప్రయత్నం చేయలేదు. రంగస్థలం మీద ఒక పాత్ర కూడా చేయలేదు. సినిమా రంగంలోకి అనుకోకుండానే ప్రవేశించా. నటుడు ముదిగొండ లింగమూర్తి గారికి మా బావ గారు బాగా తెలుసు. దర్శక - నిర్మాత బి.ఎన్. రెడ్డి గారు కొత్తవాళ్ళతో సినిమా ప్లాన్ చేస్తున్నారని లింగమూర్తి గారి ద్వారా మా బావ గారికి తెలిసి, నా ఫోటోలు ఇచ్చారు. అలా రెడ్డి గారికి నా గురించి తెలిసి, మద్రాసు రమ్మన్నారు. స్క్రీన్ టెస్ట్ చేసి, సెలక్ట్ చేశారు. అన్నీ ఒకదాని వెంట ఒకటి కాకతాళీయంగా జరిగిపోయాయి. కాకతాళీయంగా మొదలైనా కొన్ని వందల సినిమాలు విజయవంతంగా చేశారు. కానీ, ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేసినట్టున్నారు? అవును. రెస్పెక్ట్ ప్రాబ్లమ్... రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్. నాకే కాదు, నా లాంటి సీనియర్లు అందరిదీ ఇదే పరిస్థితి. అందుకే సినిమాలు తగ్గించుకోవడం ఉత్తమం అనిపించింది. ఓ జీవితం చూసేశాం. మిగిలిన కాలాన్ని సొంతానికి ఉపయోగించుకోవడం ఉత్తమమనిపించింది. ఒకప్పుడు చాలా బిజీగా ఉండి, ఇప్పుడు ఖాళీగా ఉండడమంటే కష్టం కాదా? ఆస్తుల వ్యవహారాలు, అకౌంట్స్ అన్నీ స్వయంగా చూసుకుంటా. వాటిల్లో పడి మధ్యాహ్నం నిద్ర పోవడానికి కూడా తీరిక దొరకడం లేదు. షూటింగ్స్ ఉంటేనే హైదరాబాద్ వస్తా. లేకపోతే నేను చెన్నైలో బిజీనే! మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? నా సతీమణి జలంధర. ఆమె గురించి తెలుగు వాళ్లందరికీ తెలుసు. చాలా మంచి రచయిత్రి. ఎన్నో కథలు, నవలలు రాసింది. మా పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. నాకు కోపమెంత ఎక్కువో, ఆమెకు సహనం అంత ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది, నా కోపాన్ని తగ్గించడానికేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. హ్యాపీ లైఫ్. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు. ఈ పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఇంటి వ్యవహారాలు - అన్నీ నా భార్యే చూసుకుంది. అందుకే నా కెరీర్ హ్యాపీగా సాగిపోయింది. బంధువుల ఫంక్షన్లకు కూడా మా ఆవిడే వెళ్లేది. మరి ఇప్పుడైనా ఫంక్షన్లకు మీరు వెళ్తున్నారా? అప్పట్లో ఎక్కువ అవుడ్డోర్ షూటింగ్స్‌లో ఉండేవాణ్ణి కాబట్టి, ఫంక్షన్లకు వెళ్లడం కుదిరేది కాదు. ఇప్పుడు వెళ్తున్నాను. అలాగే జలంధరకు గుళ్లకూ, గోపురాలకూ వెళ్లడం ఇష్టం. నాకు పెద్ద ఆసక్తి ఉండదు. అయితే, ఆమె కోసం అప్పుడప్పుడూ వెళ్తుంటాను. మీ సొంత ఊరు పమిడిముక్కల (కృష్ణా జిల్లా) వెళుతుంటారా? అప్పుడప్పుడూ వెళుతుంటా. నాకో తమ్ముడున్నాడు. ఊళ్లో వ్యవసాయం చేస్తుంటాడు. వాడు కాక నాకు ఆరుగురు అక్కయ్యలు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. అందులో ఇప్పుడు నలుగురే మిగిలారు. అసలు... మీ కుటుంబంలో ఎవరైనా నటులున్నారా? నా ముందెవరూ లేదు. నా తర్వాతా లేరు. శోభన్‌బాబు, నేను, మురళీమోహన్... మేం ముగ్గురం ఒకటే టైప్. మా ఫ్యామిలీల నుంచి ఎవరూ సినిమా వారసులు రాలేదు. శోభన్‌బాబు, మురళీ మోహన్‌లు వాళ్లబ్బాయిల్ని హీరోలుగా చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి. నాకు మగ పిల్లలు లేరు కానీ, ఉన్నా వాళ్ళకు ఆసక్తి లేకపోతే రానిచ్చేవాణ్ణి కాదు. నటన మా ఫ్యామిలీలో నాతో మొదలైంది. నాతోనే ముగుస్తుంది! ఇంటర్వ్యూలివ్వడానికి ఎందుకని ఆసక్తి చూపించరు? కెరీర్ ప్రారంభంలో అయితే వాటి వల్ల కొంత హెల్ప్ ఉండేది. ఇప్పుడైతే అస్సలు అవసరం లేదు. వాటివల్ల ప్రపంచానికి కొత్తగా మా గురించి తెలిసేదీ లేదు. నాకు ఉపయోగం లేని పని నేనెప్పుడూ చేయను! పబ్లిక్ ఫంక్షన్లకూ వెళ్లను. మాట్లాడలేక కాదు. మాట్లాడితే నిజాలు మాట్లాడు కోవాలి. అది ఎవరూ భరించలేరు. ఎందుకు ఒకరినొకరు పొగుడుకోవడానికి వేదికలెక్కడం?! సినీసీమలో హిపోక్రసీ ఎక్కువ. మీరేమో అన్నీ మొహం మీదే.. దానివల్ల ఇబ్బంది పడ్డా. ముందొక మాట, వెనుక ఒక మాట మాట్లాడడం నాకు ఇష్టముండదు. ‘ఆ చెప్పేదేదో లౌక్యంగా చెప్పొచ్చుగా’ అని ఇంట్లో అనేవాళ్లు. కొన్నాళ్లు ట్రై చేసి, ఫెయిలయ్యా. మీపై కోపిష్ఠి అనే బ్రాండ్ కూడా ఉంది! అవును. నాకు చాలా టెంపర్ ఎక్కువ. అయితే ఆ కోపం అనవసరంగా రాదు. అకారణంగా రాదు. నా మంచితనాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటేనే కోపం వస్తుంది. అయినా నన్ను అర్థం చేసుకున్నవాళ్లు... నా కోపాన్నీ అర్థం చేసుకుంటారు. కొంచెం హైట్ ఉంటే బావుండేదని అనుకున్నారా? హీరోయిన్స్ పక్కన పొట్టిగా కనబడడం వల్ల కొన్ని అవకాశాలు కూడా పోయాయి. మొదట్లో ఫీలయ్యాను కానీ, తర్వాత దాని గురించి ఆలోచించడం మానేశా. ఎవరికి రావాల్సిన అవకాశాలు వాళ్లకు వస్తాయి. బేసిక్‌గా ఈ హైట్ నన్ను ఒక ఇమేజ్‌కి పరిమితం కాకుండా చూసింది. ‘శంకరాభరణం’ నాటికి మీరు పాపులర్ హీరో అయినా గెస్ట్‌గా చేశారేం? ‘శంకరాభరణం’లో నేను, ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే. మొదట నా పాత్రకు కొత్త కుర్రాణ్ణే అనుకున్నారు. కానీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు మాత్రం ఆ పాత్రను నాతో చేయించాలని ఉంది. నేను చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది. దానికి తోడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అప్పటికే నేను ‘ఓ సీత కథ’, ‘సిరిసిరి మువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘శుభోదయం’ సినిమాలు చేశాను. అన్నీ హిట్లే. అందుకే మా కాంబినేషన్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని నిర్మాత ఆశ. కె.విశ్వనాథ్ గారేమో కొత్తవాడయితేనే కరెక్ట్. ఇతను చేస్తే మైనస్ అవుతుందన్నారాయన. కానీ నిర్మాత బలవంతంగా ఒప్పించారు. నన్ననుకున్న తర్వాత ఐదారు సీన్లు పెంచారు. మళ్లీ విశ్వనాథ్ దర్శకత్వంలో చేయలేదెందుకని? ఈ ప్రశ్న మీరు విశ్వనాథ్‌ని అడగాలి. ‘స్వాతి ముత్యం’ మొదట నాతోనే చేద్దామనుకున్నారు. లైన్ కూడా చెప్పారు. అందులో నా పాత్రకి తోడుగా ఓ ఉడత కూడా ఉంటుంద న్నారు. నా బాధలన్నీ నేను ఉడతతో పంచుకుంటానన్న మాట. దాని కోసం నేను ఒక అడవి ఉడతను పెంచుకున్నాను కూడా! తర్వాత ఆ సినిమా కమల్ హాసన్‌తో తీశారు. అందులో హీరోకి కోపం వస్తే చెయ్యెత్తి కొట్టినట్టుగా ఓ మేనరిజం ఉంటుందిగా. అది నా ఆలోచనే. మా కజిన్‌కి ఆ అలవాటుంది. కథ చెబితే, ఈ మేనరిజమ్ నేనే చెప్పా... కానీ, కమల్ అద్భుతంగా చేశాడు. మీ పక్కన చేస్తే కథానాయికలు తారాపథానికి చేరుకుంటారని...! అవును. మొదట్లో సెంటిమెంట్, తర్వాత అలవాటుగా మారింది. వాణిశ్రీ, లక్ష్మి, చంద్రకళ, జయప్రద, శ్రీదేవి, రాధిక, జయసుధ, విజయశాంతి, రాధ, తులసి, పూర్ణిమ... ఇలా ఎందరో నా పక్కన నటించి, ఆ తర్వాత నాకే అందనంత ఎదిగిపోయారు. మీ కెరీర్లో ఎక్కడా గ్యాప్ రానట్టుంది? అవును. 50 ఏళ్లుగా నిర్విరామంగా నటిస్తున్నా. అప్పట్లో హీరో వేషాలు వేశా. ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తున్నా. ఈవీవీ గారి ‘ఆమె’లో ముగ్గురు పిల్లల తండ్రిగా చేశా. అప్పటికి నాకు హీరో వేషాలొస్తున్నాయి. కానీ నా పొజిషన్, నా మార్కెట్ గురించి నాకు అవగాహన ఉంది. గుమ్మడిగారు, కైకాల సత్యనారాయణగారు అప్పటికే పెద్దవాళ్లయి పోయారు. తండ్రి పాత్రలకు స్లాట్ ఖాళీగా ఉంది. శోభన్‌బాబు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కృష్ణ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఇక మిగిలింది నేను. మార్పు అవసరమని అర్థమైంది. మొదట ఇలాంటి ఆఫరిచ్చింది ముత్యాల సుబ్బయ్యగారు ‘కలికాలం’లో. తర్వాత ‘ఆమె’. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక ఏమైనా మార్పులు కనిపెట్టారా? మా తరానికీ ఈ తరానికీ చాలా తేడాలున్నాయి. అప్పట్లో మేమంతా మా సీనియర్లను గౌరవించేవాళ్లం. ఇప్పుడలా లేదు. హీరోకి ఏమైనా సలహా ఇస్తే ‘నీ పని నువ్వు చూసుకోవయ్యా’ అంటున్నారు. ఒకసారి నాకలాంటి సందర్భం ఎదురైంది. అప్పట్నుంచీ సలహాలివ్వడం మానేశా. మీకు పారితోషికాలు ఎగ్గొట్టిన సందర్భాలున్నాయా? ఎగ్గొట్టేవాళ్లు కొందరైతే, మధ్యలో నొక్కేసేవాళ్లు మరికొందరు. అందుకే డబ్బులిస్తేనే చేస్తానని ముందే చెప్పేస్తుంటా. కొన్ని నేను మాత్రమే చేసేవి ఉంటాయి. అలాంటి వాటికి డబ్బు తక్కువైనా చేస్తాను. ఫైనల్‌గా సినిమా ఇండస్ట్రీలో డబ్బుకే ప్రాధాన్యం అంటారు? నేనేంటి... ప్రపంచమంతా అదే చెబుతుంది! కాంతారావుగారు ఎంత గ్రేట్ ఆర్టిస్టు! అలాంటాయన ఆఖరి స్టేజ్ ఎలా గడిచిందో తెలుసు కదా! ఓసారి కీసరగుట్టలో షూటింగ్ జరుగుతోంది. ఆయనకూ వేషం ఉంది. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు కానీ, ప్రొడక్షన్ వాళ్లు పట్టించుకోలేదు. చివరకు నా రూమ్‌లో కూర్చోబెట్టుకున్నా. అలాగే నాగయ్యగారి ఉత్థాన పతనాలు చూశా. ఒకప్పుడు లక్ష రూపాయలు తీసుకున్న హీరో ఆయన. చివరకు 500 రూపాయలక్కూడా వేషం వేసేవారు. రాజనాల, పద్మనాభం... ఇలా చాలామందిని చూశా. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఉండాలి. ఇక్కడ వేషం ఉంటేనే డబ్బు. ప్రతిరోజూ పోరాడాలి. పెన్షనూ రాదు. గ్యారంటీ లేని లైఫ్. ఏ అసోసియేషనూ పట్టించుకోదు. కొంతమంది దహన సంస్కారాలకు చందాలేసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు వాళ్ల ఆటో గ్రాఫ్‌ల కోసం ఎంతోమంది ఎగబడి ఉంటారు. అంటే, ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. కన్నాంబ, భానుమతి, ఎస్వీఆర్లను మించిన ఆర్టిస్టులున్నారా? వాళ్ల గురించి ఈ తరానికి తెలియదు. మా మనవరాళ్లకి నేనే సినిమా ఆర్టిస్టునని తెలియదు. అవార్డుల విషయంలో మీకు అన్యాయమే జరిగినట్టుంది? ‘పద్మశ్రీ’ ఎప్పుడైతే సావిత్రి, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, కైకాలను వదిలేసి జూనియర్స్‌కి ఇచ్చారో అప్పుడే వాటి గురించి ఆలోచించడం మానేశా. మీ ఫేవరెట్ యాక్టర్లు ఎవరు? శివాజీ గణేశన్‌గారి యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో కలిసి ‘అండమాన్ కాదలి’ అనే సినిమా చేయగలగడం నా అదృష్టం. తెలుగులో ఈ సినిమాను ఏయన్నార్గాను ‘అండమాన్ అమ్మాయి’గా చేశారు. రెండింటిలోనూ నాది కొడుకు పాత్రే. శివాజీ గణేశన్‌గారితో కలిసి సీన్లు చేసినప్పుడు కొంత భయం వేసింది. తెలుగు లిపిలో తమిళ డైలాగులు రాసిస్తే చెప్పాను. ‘శ్రీ షిర్డీసాయిబాబా మహాత్మ్యం’లో నేను చేసిన నానావలి పాత్ర చూసి ‘ఊర్వశి’ శారద గారు ‘‘నీలో శివాజీ గణేశన్ కనిపిస్తున్నాడు’’ అన్నారు. ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ అచ్చం అలాగే అనిపించాయట. నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ అనిపిం చింది. అది నాకు తెలియకుండానే వచ్చేసిన ట్టుంది. ఇమిటేట్ మాత్రం చేయలేదు. ఎమ్.జి. రామచంద్రన్ గారితో ఆయన తమ్ముడిగా ‘నాళై నమదే’లో చేశా. కన్నడంలో, మలయాళంలో ఒక్కో సినిమా చేశా. హిందీ చెయ్యలేదు. మీరు మంచి భోజన ప్రియులట? సినిమా ఫీల్డ్కొచ్చాకనే భోజన ప్రియుణ్ణి అయ్యా. ఇంట్లో అయితే ఒకటి, రెండు కూరలే ఉంటాయి. అదే షూటింగ్స్‌లో అయితే రకరకాలు పెడుతుంటారు. నేను ఇంట్లో నాన్ వెజ్ తినను కానీ, బయట తింటాను. ఫుడ్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. ఇది తినాలి, ఇది తినకూడదనే నిబంధనలు ఎప్పుడూ లేవు. ఓసారి ఏయన్నార్‌గారు ‘‘ఈ తిండికి లావు అవ్వాలి. ఇలా బాడీ ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు?’’ అనడిగారు. ఎంత తిన్నా అప్పట్లో బాడీ పెరగలేదు. ఎపుడైనా నిర్మాత అవ్వాలనే ఆలోచన రాలేదా? రాలేదు... రాబోదు. చాలామంది నిర్మాతల పరిస్థితి చూశా కదా. మీ ఫేవరెట్ యాక్టర్లు ఎవరు? శివాజీ గణేశన్‌గారి యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో కలిసి ‘అండమాన్ కాదలి’ అనే సినిమా చేయగలగడం నా అదృష్టం. తెలుగులో ఈ సినిమాను ఏయన్నార్గాను ‘అండమాన్ అమ్మాయి’గా చేశారు. రెండింటిలోనూ నాది కొడుకు పాత్రే. శివాజీ గణేశన్‌గారితో కలిసి సీన్లు చేసినప్పుడు కొంత భయం వేసింది. తెలుగు లిపిలో తమిళ డైలాగులు రాసిస్తే చెప్పాను. ‘శ్రీ షిర్డీసాయిబాబా మహాత్మ్యం’లో నేను చేసిన నానావలి పాత్ర చూసి ‘ఊర్వశి’ శారద గారు ‘‘నీలో శివాజీ గణేశన్ కనిపిస్తున్నాడు’’ అన్నారు. ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ అచ్చం అలాగే అనిపించాయట. నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ అనిపిం చింది. అది నాకు తెలియకుండానే వచ్చేసిన ట్టుంది. ఇమిటేట్ మాత్రం చేయలేదు. ఎమ్.జి. రామచంద్రన్ గారితో ఆయన తమ్ముడిగా ‘నాళై నమదే’లో చేశా. కన్నడంలో, మలయాళంలో ఒక్కో సినిమా చేశా. హిందీ చెయ్యలేదు. మీరు మంచి భోజన ప్రియులట? సినిమా ఫీల్డ్కొచ్చాకనే భోజన ప్రియుణ్ణి అయ్యా. ఇంట్లో అయితే ఒకటి, రెండు కూరలే ఉంటాయి. అదే షూటింగ్స్‌లో అయితే రకరకాలు పెడుతుంటారు. నేను ఇంట్లో నాన్ వెజ్ తినను కానీ, బయట తింటాను. ఫుడ్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. ఇది తినాలి, ఇది తినకూడదనే నిబంధనలు ఎప్పుడూ లేవు. ఓసారి ఏయన్నార్‌గారు ‘‘ఈ తిండికి లావు అవ్వాలి. ఇలా బాడీ ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు?’’ అనడిగారు. ఎంత తిన్నా అప్పట్లో బాడీ పెరగలేదు. ఎపుడైనా నిర్మాత అవ్వాలనే ఆలోచన రాలేదా? రాలేదు... రాబోదు. చాలామంది నిర్మాతల పరిస్థితి చూశా కదా. -
పదహారు పద్దులకు ఆమోదం
రాత్రి తొమ్మిది వరకు నిరాఘాటంగా కొనసాగిన సభ అర్థవంతమైన చర్చ కోసమే: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌కు సంబంధించి శాసనసభ పదహారు పద్దులకు ఆమోదం తెలిపింది. పురపాలన -పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, భారీ, మధ్యతరహా నీటిపారుదల, చిన్నతరహా నీటిపారుదల, ఇంధనం, రెవెన్యూ రిజిస్ట్రేషన్ సహాయం, ఆబ్కారీ నిర్వహణ, వాణిజ్య పన్నుల నిర్వహణ, రవాణా నిర్వహణ, హోం పాలన, వ్యవసాయం, పశుసంవర్ధన, మత్స్యాగారాలు, సహకారం, పౌర సరఫరాల నిర్వహణ పద్దులకు సభ ఆమోదం తెలిపింది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు నిర్విరామంగా ఈ పద్దులపై చర్చ కొనసాగింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయని ప్రకటించిన స్పీకర్ రాత్రి తొమ్మిదింటికి ఆయా పద్దులు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందించాలి: హరీశ్‌రావు ప్రజా సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని, దానికి ప్రస్తుతం సభ జరుగుతున్న తీరే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి పద్దులపై చర్చ అనంతరం ఆయన సభలో మాట్లాడారు. గతంలో ఇలా సభను నిర్వహిం చిన దాఖలాలు లేవని, కనీవినీ ఎరుగని రీతిలో తాము పద్దులపై అర్ధవంతమైన చర్చకు అవకాశం కల్పించామన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా టీడీఎల్పీ తరహాలో అధికారపక్షం సభను నిర్వహిస్తోందని, దాన్ని గమనించి తెలంగాణ సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందిస్తాయని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణకు కమిటీలు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఇతర జలవనరులపై చర్చించడానికి త్వరలోనే అఖిలపక్షంతో సమావేశం కానున్నట్టుగా హరీశ్‌రావు వెల్లడించారు. మిషన్ కాకతీయకు ఇది మొదటి సంవత్సరం కాబట్టి ప్రాథమిక సమస్యలుంటాయని, అన్నింటిపై సమగ్రంగా చర్చించడానికి అన్ని పార్టీలతో సీఎం సమావేశం అవుతారన్నారు. భూముల రీ-సర్వే: మహమూద్ అలీ త్వరలో భూములను రీసర్వే చేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భూములను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. గీతదాటే వైన్స్‌లపై వేటు: పద్మారావు నిబంధనలను ఉల్లంఘించిన కల్లు, వైన్స్ దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు స్పష్టంచేశారు. ప్రార్థనామందిరాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 100 మీటర్లలోపు వైన్స్‌లు ఉన్నాయని సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మూసేస్తామన్నారు. కల్లుగీత వృత్తిలో ఇతర కులాలకు కొన్ని ప్రాంతాల్లో లెసైన్సులు ఇచ్చామన్నారు. పన్నులు పెంచేది లేదు: తలసాని వాణిజ్య పన్నులు పెంచాలని, టెక్స్టైల్ వంటివాటికి పన్నును విస్తరించాలనే యోచన ప్రభుత్వానికి లేదని వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బస్టాపుల్లో టాయిలెట్లు: మహేందర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న బస్టాపుల్లోనూ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు రోడ్డు, రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో 500 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి నడిపించడానికి 100 ఏసీ బస్సులు, గ్రామీణ ప్రాంతాల్లో నడిపించడానికి 400 పల్లెవెలుగు కోసం కేటాయించినట్టు వెల్లడించారు. వ్యవసాయానికి పదేళ్ల యాక్షన్ ప్లాన్: చెన్నమనేని అంతకు ముందు పద్దులపై సుదీర్ఘ చర్చ జరిగింది. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అన్నారు. ‘సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు అని సరైన ప్రాధాన్యతలనే ప్రభుత్వం నిర్ణయించుకుంది. వ్యవసాయానికి సంబంధించి తక్కువ దిగుబడి, ఎక్కువ వ్యయం అనేది సమస్యగా ఉంది. దీనిని అధిగమించేందుకు పదేళ్ల కాలానికి వ్యవసాయ పర్స్పెక్టివ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటే ఉత్పాదకతను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. జానా బాగుందంటున్నారు..ఎమ్మెల్యేలు బాలేదంటున్నారు బడ్జెట్ బాగా ఉందని ప్రతిపక్షనేత జానారెడ్డి మెచ్చుకుంటే, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాగా లేదంటూ విమర్శిస్తున్నారని టీఆర్ఎస్ సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యానిం చారు. ‘పనికి ఆహారపథకాన్ని సిమెంట్ పనులు, మిషన్ కాకతీయకు, చెరువుల పూడికతీత ఇతర పనులకు మళ్లించాలి’ అని కోరారు. విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలి: చింతల రామచంద్రారెడ్డి విశ్వనగరంలో హైదరాబాద్‌ను పేర్కొంటున్నా అంతర్గతంగా పరిస్థితి భయంకరంగా ఉంది. విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ‘వీసా గడువు ముగిసిన విదేశీయులు ఎంత మంది ఇక్కడ ఉన్నారో లెక్కలు తీయాలి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ట్రాఫిక్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలి’ అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పర్మిట్‌రూమ్‌ల వల్ల ఆగడాలు: ఖాద్రీ మద్యం దుకాణాల పక్కనే పర్మిట్‌రూమ్‌లకు అనుమతినివ్వడం వల్ల రోడ్లపై ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని ఖాద్రీ (ఎంఐఎం) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. -
పరిశ్రమలకు తయారీ బూస్ట్
- జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2.6 శాతం - ఏప్రిల్-జనవరి మధ్య ఈ రేటు 2.5 శాతం న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి 2015 జనవరిలో 2.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అంటే 2014 జనవరితో పోల్చితే తాజాగా జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 2.6 శాతం పెరిగిందన్నమాట. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటును లెక్కిస్తారు. సూచీలో దాదాపు 75 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం పనితీరు బాగుండడం తాజా సానుకూల ఫలితానికి ఒక కారణం. డిమాండ్‌కు ప్రతిబింబంగా భావించే భారీ యంత్రపరికరాల (క్యాపిటల్ గూడ్స్) ఉత్పత్తి మెరుగ్గా ఉండడం కూడా ఊరటనిచ్చే వృద్ధి రేటుకు కారణం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ గడచిన 10 నెలల కాలంలో ఈ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 0.1 శాతం. 2014 జనవరిలో ఈ వృద్ధి రేటు 1.1 శాతం. 2014 డిసెంబర్లో 3.23 శాతం. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 1.7 శాతంగా ఉన్నా... తాజాగా దీనిని 3.23 శాతంగా సవరించారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజా లెక్కలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును చూస్తే... - జనవరిలో తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 0.3% నుంచి 3.3 శాతానికి ఎగసింది. మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 14 సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 1.7 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 0.3 శాతం క్షీణించింది (మైనస్). - కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి కూడా 3.9 క్షీణ దశ నుంచి 12.8 శాతం వృద్ధి బాటకు మళ్లింది. 10 నెలల కాలంలో కూడా ఉత్పత్తి -0.8 శాతం (క్షీణత) నుంచి 5.7 శాతం వృద్ధికి నడిచింది. - విద్యుత్ ఉత్పాదకత వృద్ధి రేటు 6.5% నుంచి 2.7 శాతానికి తగ్గింది. 10 నెలల్లో మాత్రం ఈ వృద్ధి రేటు 5.7% నుంచి 9.3%కి ఎగసింది. - మైనింగ్ రంగం కూడా 2.7 శాతం వృద్ధి నుంచి 2.8 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో మాత్రం ఈ రంగం ఉత్పత్తి 1.1 శాతం క్షీణత నుంచి 1.3 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువుల రంగం నిరాశ... వినియోగ వస్తువుల ఉత్పత్తి 0.5 శాతం క్షీణత లోంచి మరింతగా 1.9 శాతం క్షీణతలోకి జారింది. 10 నెలల కాలంలో కూడా 2.7 శాతం క్షీణత మరింతగా 4.7 శాతం క్షీణతలోకి పడింది. ఇందులో ఒక భాగమైన దీర్ఘకాలిక వినియోగ వస్తువుల ఉత్పత్తి సైతం జనవరిలో క్షీణతలోనే ఉంది. అయితే క్షీణత 8.3 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. 10 నెలల కాలంలో సైతం క్షీణత 12.5 శాతం నుంచి 14.2 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక వినియోగ వస్తువుల విభాగంలో 4.5 శాతం వృద్ధి 0.1 శాతం క్షీణతలోకి పడింది. 10 నెలల కాలంలో చూస్తే వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 1.9 శాతానికి దిగింది. -
బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాల్లో మిశ్రమస్పందన!
-
వాటే చాన్స్!
అదృష్టమంటే కుర్ర హీరో వరుణ్ధావన్దే అనుకుంటున్నారు బీ-టౌన్ ప్రజలు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఒకే సినిమాలో నలుగురు భామలతో రొమాన్స్ చేసే సూపర్ చాన్స్ కొట్టేశాడనేది వారి బాధ. అదీ హాట్ గాళ్స్ యామీ గౌతమ్, హుమా ఖురేషి, దివ్యాదత్తా, రాధికా ఆప్టేలతో. సీన్లు కూడా కెమిస్ట్రీ తెగ వర్కవుటయ్యి, ఎంతో సహజంగా వచ్చాయనేది టాక్! సినిమా పేరు ‘బదలాపూర్’. ఇందులో మనోడైతే బాగా వయెలెంట్‌గా కనిపిస్తూ బరువైన పాత్రలో జీవిస్తున్నాడట. అదే సమయంలో అంతే సహజంగా శృంగార సన్నివేశాలనూ పండిస్తున్నాడట! మొత్తానికి ఈ లవర్‌బాయ్ సినిమా రిలీజ్‌కు ముందే అటు బాలీవుడ్లో, ఇటు అభిమానుల్లో మాంచి క్రేజ్ సంపాదించేసుకున్నాడు! -
హైదరాబాదు పవర్ చూడు!
హైదరాబాద్‌కూ... చింతచెట్టుకూ ఏదో దగ్గరి సంబంధం ఉంది. అందుకే చింతచెట్ల పేరిట వెలసినన్ని కాలనీలూ, బస్తీలూ, ప్రాంతాలు మరే చెట్టు పేరుతోనూ లేవు. ఒకవైపు ఖైరతాబాద్ మరో వైపు బంజారాహిల్స్‌కు మధ్యనున్న చింతల్బస్తీని చూస్తే అటు నగరంలా... ఇటు పల్లెలా డబుల్రోల్ చేస్తుంటుంది. ఒక జీవి పుట్టి... గిట్టే వరకూ తినేవీ, తాగేవీ, అవసరమైనవీ, ఉపయోగించేవీ... అన్నీ మన చింతల్‌బస్తీలో దొరుకుతాయి. ఇక బాలానగర్- జీడిమెట్ల మధ్యనున్న ‘చింతల్’ అనే ప్రాంతం ప్రశాంతత అంటే అర్థమేమిటో చెబుతుంది. మరోవైపున ఎల్బీనగర్కు దగ్గర్లోని ‘చింతల్‌కుంట’నే తీసుకోండి... కష్టజీవులూ, శ్రమజీవులూ, పరిశ్రమ జీవులూ వర్థిల్లుతుంటారక్కడ. ఇలా హైదరాబాద్‌లో నలువైపులా చింతల్‌బస్తీ, చింతల్, చింతల్‌కుంట ఉన్నాయేమిటని ఆశ్చర్యపోతుంటామా!... మరో అంశం మనల్ని సంభ్రమపరుస్తుంది. అదేమిటంటే... అప్పట్లో హైదరాబాద్ మెయిన్ బస్ స్టేషన్ లోహ నిర్మితమైన ఒక డోమ్ ఆకారంలో ఉండేదన్న విషయం మనకు తెలిసిందే. దీన్నే మనం గౌలీగూడ స్టేషన్ అనే వాళ్లం. ఇంతలో నగరం విస్తృతంగా పెరిగి ఈ డోమ్ బాగా ఇరుకైపోయింది. దాంతో హైదరాబాద్‌లో... ఆసియాలోనే అతి పెద్ద బస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు స్థలం వెతుకుతుంటే కనబడ్డ ప్రదేశం... మళ్లీ ‘ఇమ్లీబన్’యే. అంటే ‘చింత చెట్ల’ వనం. నిర్మాణం పూర్తయ్యాక దానికి సాక్షాత్తూ మన జాతిపిత మహాత్మాగాంధీగారి పేరు పెట్టారు. అయినా అక్కడి చెట్ల పేరిటే ఇమ్లీబన్ బస్‌స్టేషన్ అన్న మాటకే ప్రతీతి ఎక్కువ. ఎందుకు? ఎందుకిలా ఈ ‘చింత’కూ హైదరాబాద్‌కూ లంకె కుదిరింది. దీనివెనకున్న ఆంతర్యమేమిటి అని లోతుగా పరిశీలిస్తే మనకు తోచే అంశాలు ఎన్నెన్నో! దగ్గు మందు అంటే దగ్గును పెంచే మందు అని కాదు కదా అర్థం. అలాగే చింత... అంటే చింతలను తీసుకొచ్చేది, చింతను పెంచేదీ అని కాదు, చింతలను తీర్చేదనీ అర్థం. అందుకే హైదరాబాద్ వాసులు బస్తీ పేర్లు విషయంలో చింతను విశేషంగా, విశేషణంగా వాడుకున్నారు. పైన పేర్కొన్న బస్తీలూ, కాలనీల రూపంలో నగరవాసులకు ఆవాస ‘చింతదీర్చి’ నివేశన వరములిచ్చిన చెట్టది. ప్రశాంత చింతలవనంలో బస్సు కోసం నిరీక్షిస్తూ తపస్సు చేసుకునేందుకు మన తపస్సు పక్వానికి రాగానే దేవుడిలా ప్రత్యక్షమవుతుంది బస్సు. అందుకు అనువైన అడవే ఇమ్లీబన్. చింత విషయంలో పులుపు చావనట్లే... మన నగరం విషయంలో ఇక్కడి ప్రజల్లో చేవ చావదు. శ్రమణకుడంటే బౌద్ధంలో అర్థం ఏమిటో నాకంతగా తెలియదు. కానీ... వాస్తవానికి మన నగరంలోని శ్రమజీవులంతా చింతలబస్తీ, చింతల్‌కుంట, చింతల్, ఇమ్లీబన్లోనూ శ్రమ చేస్తుంటారు కాబట్టి వారినే ‘శ్రమ’ణుకులంటూ పిలవడం సబబేమో. ఎందుకంటే శ్రమణకులకు సన్యాసం స్వీకరించాక జ్ఞానం తప్ప మరో ప్రాపంచిక అంశం పట్టనట్లు... ఈ చింతల పేరిట ఉన్న బస్తీల్లో, ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు శ్రమను నమ్ముకున్న ఆయొక్క చింతన తప్ప మరో అంశం తెలియదు. అందుకే చింతలో చిగురూ... ఆ చిరుగులో పులుపూ ఉన్నంతవరకూ హైదరాబాద్ ప్రజల్లో శ్రమా, ఆ శ్రమ తాలూకు పవరూ ఉంటుంది. - యాసీన్ -
జనంపై విద్యుత్ చార్జీల మోత!
భారం రూ.1,261 కోట్లు ఏపీఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీ ఆమోదమే తరువాయి.. ఏప్రిల్ నుంచే అమలు! సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చింది. వారిపై భారీ ఎత్తున విద్యుత్ చార్జీల భారాన్ని వేసేందుకు సిద్ధపడింది. గృహ వినియోగదారులు మొదలుకుని పరిశ్రమల వరకూ అన్నింటిపైనా చార్జీల మోత మోగించింది. పేదలపై భారం పడనివ్వబోమని పైకి చెబుతూనే.. డిమాండ్ చార్జీల పేరుతో దొంగదెబ్బ సైతం తీసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు గురువారం ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్సీ)కు సమర్పించాయి. వీటికి కమిషన్ అనుమతినివ్వడమే ఆలస్యం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రజలు మోయకతప్పదు. ఈ మొత్తం విలువ రూ.1,261 కోట్లు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరేళ్లపాలనలో ఏనాడూ ఒక్కపైసా విద్యుత్ చార్జీలు పెరగలేదు. ప్రస్తుతం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిది నెలలకే జనం జేబుకు చిల్లు పెట్టడం విశేషం. వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులపై కనికరం చూపించామని చెబుతున్న సర్కారు, ఆపైబడిన వినియోగదారులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. వందకు ఒక్క యూనిట్ దాటినా, 50 యూనిట్ల నుంచే పెరిగిన భారాన్ని మీద వేసే పథక రచన చేసింది. మధ్యతరగతి, వాణిజ్య వర్గాలు, పారిశ్రామిక, చేతివృత్తులను చావుదెబ్బ కొట్టింది. చేనేతలను ఉద్ధరిస్తానని చెప్పిన సర్కారు.. మరమగ్గాలకు చార్జీల పెంపును బహుమతిగా ఇచ్చింది. పెనుభారాన్ని వేసి చేనేత చితికిపోయేలా చేసింది. కాటేజీ ఇండస్ట్రీపై ఏకంగా కోటి రూపాయలు దండుకోవాలనుకుంది. నిధుల కోతతో అల్లాడుతున్న పంచాయతీలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. వీధి దీపాలకయ్యే ఖర్చును అమాంతం రూ.25 కోట్లకు పెంచింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న ఔత్సాహికులను తీవ్రంగా నిరాశ పరిచింది. నష్టాల ఊబిలో ఉన్న పరిశ్రమలపై చార్జీల భారం మోపి భయపెట్టింది. ఈ రంగం నుంచి ఏకంగా రూ.645 కోట్లు దండుకోవాలని నిర్ణయించింది. వాణిజ్య వర్గాల వెన్నువిరిచేలా రూ.71 కోట్ల భారాన్ని మోపింది. వీటిపై వేసిన భారం ఏకంగా రూ.81 కోట్లు. గృహ వినియోగదారులపై పెను భారం.. 100 యూనిట్లు దాటిన వినియోగదారులు(ఎల్టీ-సీ, డీ కేటగిరీలు) దాదాపు 25 లక్షల మందిపై విద్యుత్ చార్జీల భారం పడింది. ప్రతిపాదిత చార్జీలనే అమలు చేస్తే గృహ వినియోగదారులు మరో రూ.144 కోట్లు చెల్లించాలి. ఎప్పుడో కాలం చెల్లిన ఎఫ్‌ఎస్‌ఏలనూ పేరు మార్చి ట్రూ-అప్ చార్జీలుగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీని పరిధిలోకి 99 లక్షలమంది వస్తారు. యూనిట్‌కు 16 పైసలతో మొదలైన పెంపు, కేటగిరీ వారీగా పెరుగుతూ వచ్చింది. 500 వందల యూనిట్ల పైబడి వాడితే, ఏకంగా రూ.300 వరకూ అదనంగా బిల్లు చేతికొచ్చే వీలుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసర నివేదికలను మాత్రమే తమకు సమర్పించాయని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ తెలిపారు. దీనిపై ఈ నెల 23, 24న విశాఖపట్నంలో, 25న కాకినాడ, వచ్చేనెల 4న హైదరాబాద్‌లో విచారణ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 26న గుంటూరు, 27, 28న తిరుపతిలో విచారణ చేపడతామన్నారు. -
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ మూసివేత
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌ను శుక్రవారం మూసివేశారు. పార్క్‌లోని 114 యూనిట్లకు తాళం వేసిన పారిశ్రామిక వేత్తలు సమ్మెకు దిగారు. ఈ టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమలు స్థాపించే వారికి పెట్టుబడిలో 20 శాతం కేంద్రం, మరో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ మంజూరు చేయాల్సి ఉంది. కేంద్ర జౌళి శాఖ ద్వారా 20 శాతం సబ్సిడీ ‘టఫ్’ పథకంలో విడుదల కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 20 శాతం సబ్సిడీ విడుదల కావడం లేదు. రూ.7 కోట్ల మేరకు సబ్సిడీ మంజూరు కావాల్సి ఉంది. మరోవైపు టెక్స్టైల్ పార్క్‌లోని పరిశ్రమకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలవుతుండగా.. పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఇవ్వడంలేదు. ఈ క్రమంలో పార్క్‌లోని పరిశ్రమలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇవ్వాలని, సబ్సిడీలను విడుదల చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పారిశ్రామిక వేత్తలు సమ్మెకు దిగారు. దీంతో పార్క్‌లో మొత్తం 114 యూనిట్లు, 1,432 ఆధునిక మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోగా, రెండు వేలమంది కార్మికుల ఉపాధికి విఘాతం కలిగింది. పార్క్‌లో సమ్మె కొనసాగితే సిరిసిల్లలో కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. -
మూగజీవాలను కాటేస్తున్న లెడ్
కొందుర్గు: పరిశ్రమల నుంచి విచ్చల విడిగా బయటకు వెలువడుతున్న లెడ్ మూగజీవాలను కాటేస్తోంది. సమీపంలోని పచ్చికను తిని నీళ్లు తాగిన పశువులు మృ త్యువాతపడుతున్నాయి. ఈ క్రమం లో ఈనెల 1వ తేదీన సమీప పొలాల రైతులకు చెందిన ఏడు పశువులు మృతి చెం దాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అ నుమతులు లేకున్నా మండలంలోని జి ల్లేడ్ గ్రామశివారులో ఓ పరిశ్రమ కొనసాగుతోంది. ఇక్కడ కర్బన పదార్థాలను మరిగించి లెడ్ను తయారుచేస్తున్నారు. పరిశ్రమ సమీపంలోని పొలాల్లో మేత మే యడంతో ఎల్కగూడాలో గతంలోనే ఏడు పశువులు మృతిచెందాయి. గుట్టుచప్పు డు కాకుండా జిల్లేడ్లో చెట్లపొదల మా టున లెడ్ తయారీకి మరో పరిశ్రమను నడుపుతున్నారు. ఈ పరిశ్రమ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. లెడ్ తయారీ ఇలా.. వాహనాల్లోని కాలిపోయిన బ్యాటరీల్లో ఉండే వ్యర్థపదార్థం, రాక్పౌడర్, బొగ్గు, ఇనుమును బాగా మరిగించి లెడ్ను తయారుచేస్తున్నారు. దీన్ని రాత్రికిరాత్రే హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పరిశ్రమలోని ఒక్కో బట్టీలో 25కిలోల బరువు ఉన్న మూడు లెడ్ కడ్డీలను తయారుచేస్తారు. ఇక్కడి నుంచి విషరసాయనాలు సమీపంలోని చెరువులు, బోరుబావుల్లోని నీళ్లల్లో ఇంకిపోతున్నాయి. ఈ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ పరిశ్రమ నిర్వహణ కోసం ట్రాన్స్‌కో అధికారులు ఓ సింగిల్‌ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అమర్చారు. అంతేగాక వ్యవసాయబోరు నుంచి పరిశ్రమకు నీటిని వాడుకుంటున్నారు. ఇటు గ్రామపంచాయతీ, రెవె న్యూ, పరిశ్రమల శాఖ, అటు కాలుష్యం నియంత్రణ మండలి అధికారులు ప ట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా కా లుష్యం వెదజల్లుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. యజమానిపై చర్యలు తీసుకుని పరిశ్రమను సీజ్‌చేయాలని సమీప పొలాల రైతులు కోరుతున్నారు. మిల్లులో నమూనాల సేకరణ పర్యావరణ ఇంజనీర్ శ్రీలక్ష్మి నేతృత్వంలోని అధికారుల బృందం గద్వాల మండలం వీరాపురం స్టేజీ వద్ద ఉన్న మిల్లులను పరిశీలించింది. అక్కడి నుంచి నేరుగా కొండపల్లి క్రాస్‌రోడ్డులో ఉన్న రమ్య జిన్నింగ్ మిల్లుకు చేరుకున్నారు. ఫ్యాక్టరీలోకి వెళ్లిన అధికారుల బృందం జిన్నింగ్ మిల్లులో డీలింటింగ్ ప్రాసెస్ యూనిట్ల వద్దకు చేరుకొని అక్కడి నీటిలో నమూనాలు సేకరించారు. ఇదే సమయంలో ఫ్యాక్టరీలోకి మునిసిపల్ చైర్పర్సన్ బృందం వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా గొడవ ప్రారంభం కావడంతో అధికారులు ఫ్యాక్టరీ ముందుకు వచ్చేశారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న డీలింటింగ్కు సంబంధించిన నమూనాలపై నివేదికలు సిద్ధంచేశారు. సంతకాల కోసం మిల్లు యజమానిని పిలిచినా రాకపోవడంతో అధికారులు ఉన్నతాధికారులకు వాస్తవాలను నివేదిస్తామంటూ వెళ్లిపోయారు. -
‘సిరిసిల్ల టెక్స్టైల్’లో సంక్షోభం
16 నుంచి మూసివేతకు పారిశ్రామికవేత్తల నిర్ణయం సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ సంక్షోభం లో పడింది. పార్క్ ఏర్పాటు సమయంలో ఇస్తామన్న రాయితీలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలు మూసివేయాలని పారిశ్రామికవేత్తలు నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ యూనిట్ రూ.4 ఉం డగా, ఇక్కడ ఎఫ్‌ఎస్‌ఏతో కలిపి రూ.8 వసూలు చేస్తున్నారు. పైగా బ్యాంకు రుణాలు పేరుకుపోవడంతో పరిశ్రమల వేలా నికి బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో ప్రస్తుతం 130 యూనిట్లలో రెండువేల మంది కార్మికులు పనిచేస్తూ, ఆధునిక మగ్గాలపై వస్త్రం ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమలను మూసివేతపై కలెక్టర్, జౌళి శాఖ కమిషనర్, లేబర్ అధికారులకు సమాచారం అందించామని పార్క్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమలు మూతబడితే రెండువేల మందికి ఉపాధి కరువవుతుంది. -
నీరుగారుతున్న పరిశ్రమ
పీఎన్ కాలనీ : హుద్‌హుద్ తుపాను విధ్వంసం సృష్టించి రెండు నెలలు దాటినా తుపానుకు దెబ్బతిన్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపశమనం లభించలేదు. తుపాను దాటికి జిల్లాలో మొత్తం 64 పరిశ్రమలకు రూ.168.68 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు నిర్థారించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు. పరిశ్రమలు మూతపడకుండా, కార్మికులు ఉపాధి కోల్పోకుండా ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఉపశమనం కలిగిస్తుందని ఆశించిన యజమానులకు నిరాశే మిగిలింది. నివేదిక అందిన కొన్ని రోజులకే నష్టపోయిన పరిశ్రమలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదనిపరిశ్రమల యజ మానులు నిస్పృహ చెందుతున్నారు. తుపాను దాటికి జరిగిన నష్టంతోపాటు రోజుల తరబడి విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు పనిచేయక పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అప్పుల్లో కూరుకుపోయాయి. కొన్ని పరిశ్రమలు ఏకం గా మూతపడ్డాయి. బీమా సౌకర్యం ఉన్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఇన్సూరెన్సు కంపెనీలు ఇచ్చిన బీమా పరిహారంతో ఉత్పత్తిని పునరుద్ధరించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత కొద్దిరోజుల వ్యవధి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పలు కమిటీలు, బృందాలు వచ్చి పరిశీలిం చినా ఎటువంటి సాయం ఇస్తారన్నదే ఇప్పటికీ స్పష్టం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన వైఖరి స్పష్టం చేయాలని పరిశ్రమల యజమానులు, కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ వద్ద ప్రస్తావించగా తుపాను నష్టాల నిర్థారణకు ప్రభుత్వం కమిటీని వేసిందన్నారు. ఈ కమిటీ సూచనల ఆధారంగా నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. జిల్లాలో పరిశ్రమలకు వాటిల్లిన నష్టాలపై సమర్పించిన నివేదికకు స్పందనగానే ప్రభుత్వం ఈ కమిటీని వేసిందన్నారు. -
ఫర్ యువర్ ఇయర్స్ ఓన్లీ..
ఇయర్‌కి ఒకసారి ఒక స్టైల్‌ని భుజానికి ఎత్తుకోవడం ఫ్యాషన్ ఇండస్ట్రీకి అలవాటు. ఇప్పుడు చెవికి చేసే అలంకారం వంతు వచ్చింది. చెవిని కేంద్రంగా చేసుకుంది. దీంతో ఈ ఏడాది మధ్య కాలం నుంచి ఇయర్ యాక్సెసరీస్‌కి డిమాండ్ పెరిగింది. ఇయర్ కఫ్స్‌కి ఎక్కడాలేని ప్రాచుర్యం వచ్చేసింది. సిటీలో ఫ్యాషన్ పరంగా అప్డేట్గా ఉండే మహిళల చెవులకు వన్నెలద్దుతూ కలర్‌ఫుల్ అండ్ చూడబుల్‌గా మారుతున్నాయి. కాదే భాగమూ అలంకరణకు అనర్హం అన్నట్టు.. ఒళ్లంతా కమ్మేస్తున్న ఫ్యాషన్.. ఇప్పుడు ‘ఇయర్’తో హియర్, హియర్ అంటోంది. నిన్నమొన్నటి దాకా చెవి దిద్దులు, హ్యాంగింగ్స్ అంటూ కాస్త లిమిట్స్‌లోనే వీనులకు విందు చేసిన మోడ్రన్ ప్రపంచం ఇప్పుడు వాటి కోసం ఫంకీ జ్యువెలరీని మోసుకొచ్చేసింది. సినిమా ‘చూపింది’... చాలా ట్రెండ్స్‌ను అందించిన బాలీవుడ్ చెవి యాక్సెసరీస్ విషయంలోనూ ఓ దారి చూపింది. దీపిక పదుకునే తను నటించిన పలు సినిమాల్లో ఇయర్కఫ్స్ను డిఫరెంట్‌గా ప్రదర్శించడం సిటీలో మహిళలను ఇన్స్పైర్ చేసింది. ‘దీపిక పదుకునే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఫ్యాషన్స్‌ను క్యారీ చేసే తీరు చాలా బాగుంటుంది’ అని కార్పొరేట్ ఉద్యోగిని శ్రావణి చెప్పడం దీనికో ఉదాహరణ. దీపిక డ్రెస్సుల్ని, యాక్సెసరీస్‌ను సైతం మక్కీకి మక్కీ అనుసరించే సిటీ మహిళలు.. ఈ ఇయర్‌కఫ్స్ ట్రెండ్‌కు ఊపందిస్తున్నారు. చెవి‘నిల్లు’గా.. ఫుల్లుగా.. ఈ ఏడాది ఫ్యాషన్‌ను చెవికి అనుసంధానించడంతో.. మార్కెట్లో రకరకాల ఇయర్‌కఫ్స్ వెల్లువెత్తుతున్నాయి. విభిన్న రకాల హ్యాంగింగ్స్ తర్వాత చెవిని పూర్తిగా కవర్ చేసేసి, సగం వరకూ లేదా టాప్‌ను మాత్రమే లేదా అంచుల్ని.. అదీ కాకుంటే చెవిని పూర్తిగా తమలో పూర్తిగా ఇముడ్చుకునే కఫ్స్‌కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చింది. సిల్వర్‌తో పాటు విభిన్న రకాల మెటల్స్‌తో ఇవి రూపొందిస్తున్నారు. రూ.200 నుంచి మొదలుకుని రూ.5,000ల దాకా ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇట్స్ది ఇయరాఫ్ ఇయర్... ఫ్యాషన్‌కు ఏ బాడీ పార్ట్‌నైనా గ్లామరస్‌గా మెరిపించే శక్తి ఉంది. ఈ ఏడాది చెవికి సంబంధించిన యాక్సెసరీస్ బాగా వచ్చాయి. హ్యాంగింగ్స్, ఇయర్‌కఫ్స్ వెరైటీలు మార్కెట్లో బాగా లభిస్తున్నాయి. చెవి సైజ్‌కు, స్కిన్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా డిఫరెంట్ కఫ్స్ వచ్చేశాయి. వీటిని వినియోగించడం ద్వారా ఫ్యాషనబుల్ పర్సన్‌గా అనే స్టేట్మెంట్ని చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. లాంగ్ మ్యాక్సీ డ్రస్‌లకు కాంబినేషన్‌గా వీటిని ధరిస్తే లుక్ సూపర్బ్. - గీతికా చద్దా, ఫ్యాషన్ డిజైనర్ సినిమా ‘చూపింది’... చాలా ట్రెండ్స్‌ను అందించిన బాలీవుడ్ చెవి యాక్సెసరీస్ విషయంలోనూ ఓ దారి చూపింది.దీపిక పదుకునే తను నటించిన పలు సినిమాల్లో ఇయర్కఫ్స్ను డిఫరెంట్‌గా ప్రదర్శించడం సిటీలో మహిళలను ఇన్స్పైర్ చేసింది. ‘‘దీపికా పదుకునే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఫ్యాషన్స్‌ను క్యారీ చేసే తీరు చాలా బాగుంటుంది’’ అని కార్పొరేట్ ఉద్యోగిని శ్రావణి చెప్పడం దీనికో ఉదాహరణ. దీపిక డ్రెస్సుల్ని యాక్సెసరీస్‌ను సైతం మక్కీకి మక్కీ అనుసరించే సిటీ మహిళలు... ఈ ఇయర్‌కఫ్స్ ట్రెండ్‌కు ఊపందిస్తున్నారు. - ఎస్.సత్యబాబు