యుద్ధాల నేపథ్యంలో 4 శాతం పెరుగుదల
ఆయుధ మార్కెట్‌పై అమెరికాదే ఆధిపత్యం
2023లో 317 బిలియన్ డాలర్ల ఆర్జన
స్టాక్‌హోం: యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ ఆయుధ పరిశ్రమ ఆదాయం 2023లో 632 బిలియన్ డాలర్లకు (రూ.53 లక్షల కోట్లు) పెరిగింది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం అధికం. ఆయుధ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, రేథియోన్ వంటి యూఎస్ ఆయుధ కంపెనీలే అధికాదాయం పొందాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం టాప్ 100 కంపెనీల్లో 41 కంపెనీలు 317 బిలియన్ డాలర్ల ఆదాయం పొందాయి. ఇది గతేడాది కంటే 2.5 శాతం ఎక్కువ. ఆయుధ పరిశ్రమలో రెండో అతి పెద్ద దేశమైన చైనా టాప్ 100 జాబితాలోని తొమ్మిది కంపెనీల నుంచి 103 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అయితే ఆర్థిక పరిమితులు, ఇతర సవాళ్లతో దాని వృద్ధి 0.7 శాతం తగ్గింది.
స్వావలంబన దిశగా భారత్
భారత ఆయుధ పరిశ్రమకు 2023లో 6.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2022తో పోలిస్తే ఇది 5.8 శాతం ఎక్కువ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రయోజనం పొందాయి. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, విదేశీ ఆయుధ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం స్వయం సమృద్ధికి ఆజ్యం పోశాయి. భారత్, తుర్కియే దేశీయ ఆయుధోత్పత్తిని విస్తరించి స్వావలంబనపై దృష్టి సారించాయి.
ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆయుధ ఉత్పత్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. డిమాండ్‌కు అనుగుణంగా యూరప్, అమెరికా, తుర్కియేలోని రక్షణ సంస్థలు ఆయుధ తయారీని పెంచాయి. పలు దేశాల రక్షణ సంస్థల్లో ఆయుధాల అమ్మకాలు పెరిగాయి. తుర్కియే రక్షణ సంస్థ బేకర్ ఆదాయం 25 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఎక్కువగా డ్రోన్లను ఎగుమతి చేసింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య తైవాన్ రక్షణ వ్యయాన్ని పెంచడంతో ఆ దేశ ఎన్సీఎస్‌ఐఎస్టీ ఆదాయం 27 శాతం పెరిగి 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యూకే సంస్థ అయిన అటా మిక్ వెపన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్ ఆదాయం 16 శాతం పెరిగి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆయుధ ఆదాయాన్ని ఎలా నడిపిస్తున్నాయో సిప్రి నివేదిక ఎత్తిచూపింది.
Comments
Please login to add a commentAdd a comment