kidambi srikanth
-
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత అగ్రశ్రేణి ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 23–21తో భారత్‌కే చెందిన ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఈ గెలుపుతో శ్రీకాంత్ ముఖాముఖి రికార్డులో 7–3తో ప్రణయ్‌పై ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రణయ్‌తో 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ గేమ్ పాయింట్లు కాపాడుకొని నెగ్గడం విశేషం. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ 21–5, 21–16తో మాగ్నుస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత ప్లేయర్లు ఆయుశ్ శెట్టి 15–21, 19–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21–18, 17–21, 10–21తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. ఇషారాణి ముందంజ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు 17–21, 19–21తో 39 నిమిషాల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. భారత్‌కే చెందిన ఇషారాణి బారువా, అనుపమ తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వాలిఫయర్ ఇషారాణి 18–21, 21–17, 22–20తో భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్‌పై, అనుపమ 21–14, 21–13తో అన్మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్ (భారత్) 22–20, 14–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, రక్షితశ్రీ (భారత్) 11–21, 17–21తో లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–16, 21–17తో అలైన్ ముల్లర్–కెల్లీ బుటెన్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీకాంత్ అర్హత
పారిస్ (ఫ్రాన్స్): ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–8, 21–14తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. అనంతరం రెండో రౌండ్లో శ్రీకాంత్ 21–11, 14–21, 21–12తో అర్నాడ్ మెర్కెల్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ మూడో గేమ్‌లో ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో శంకర్ 21–19, 19–21, 21–19తో మాగ్నుస్ జొహాన్సెన్ (డెన్మార్క్)పై, రెండో రౌండ్లో 21–18, 21–12తో భారత్‌కే చెందిన రితి్వక్ సంజీవ్ సతీశ్ కుమార్‌పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తరుణ్ 21–17, 9–21, 16–21తో జువో ఫు లియావో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ఉన్నతి, ఇషారాణి కూడా మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్స్ ఉన్నతి హుడా, ఇషారాణి బారువా కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఉన్నతి 21–12, 21–16తో సియు టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై, రెండో రౌండ్లో 21–13, 21–15తో కిసోనా (మలేసియా)పై గెలిచింది. ఇషారాణి క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 12–21, 21–10, 21–12తో జుయ్‌ఫె కి (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 25–27, 21–16, 23–21తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. -
థాయ్‌లాండ్ మాస్టర్స్.. ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్, శంకర్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై, శంకర్ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 15–21తో రచాపోల్–నాథమోన్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రతీక్–పృథ్వీ కృష్టమూర్తి రాయ్ (భారత్) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్–నారుసెట్ (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
శ్రీకాంత్ శుభారంభం
బ్యాంకాక్: కొత్త ఏడాదిలో భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి విజయం అందుకున్నాడు. థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–18తో డానిల్ దుబోవెంకో (ఇజ్రాయెల్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్ ఆరంభంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 15–15తో సమమైన దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19–15తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మూడు పాయింట్లు కోల్పోయిన శ్రీకాంత్ రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి 11–21, 15–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 15–21, 17–21తో జింగ్ హాంగ్ కోక్ (మలేసియా) చేతిలో, మిథున్ మంజునాథ్ 14–21, 13–21తో షోలే ఐదిల్ (మలేసియా) చేతిలో, సతీశ్ కుమార్ 15–21, 18–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ (భారత్) 15–21, 21–15, 21–19తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్‌లో రక్షిత శ్రీ ముందంజ వేయగా... తాన్యా హేమంత్, తారా షా, శ్రియాన్షి వలిశెట్టి తొలి రౌండ్లో ఓడిపోయారు. రక్షిత శ్రీ 21–19, 21–16తో లుయో యు వు (చైనా)పై గెలుపొందగా... తాన్యా 21–15, 11–21, 13–21తో కిసోనా సెల్వదురయ్ (మలేసియా) చేతిలో, తారా షా 15–21, 16–21తో థమనోవన్ నితిత్క్రాయ్ (థాయ్‌లాండ్) చేతిలో, శ్రియాన్షి 17–21, 13–21తో పిచమోన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారుమిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–8, 21–16తో వీరాఫట్–సరారట్ (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది. -
పెళ్లి తర్వాత తొలిసారి..
ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్...ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఘనత... బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో ఇలా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రస్తుతం పునర్వైభవం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నాడు. జకార్తా వేదికగా మంగళవారం నుంచి మొదలయ్యే సీజన్ మూడో టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ విభాగంలో పోటీపడనున్నాడు. భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టితో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 45వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ షి ఫెంగ్ లీతో తలపడే అవకాశం ఉంది. గత ఏడాది శ్రీకాంత్ 14 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిరణ్ జార్జి, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో కిరణ్ జార్జి క్వాలిఫయర్‌తో... టకుమా ఒబయాషి (జపాన్)తో లక్ష్య సేన్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రియాన్షు ఆడతారు. తొలి రోజు మంగళవారం సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు, డబుల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బరిలో పీవీ సింధుమరోవైపు... మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్‌లో ఇషారాణి బారువా, తాన్యా హేమంత్ పోటీపడనున్నారు. మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, రక్షితశ్రీ, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మిక్స్డ్ డబుల్స్‌లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. మరిన్ని క్రీడా వార్తలుహరికృష్ణ ఖాతాలో తొలి ‘డ్రా’ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ నగరంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్‌కే చెందిన లియోన్ ల్యూక్ మెండోకాతో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ రెండు స్థానాలు పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్‌లో జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ అంతర్జాతీయస్థాయిలో 30 కంటే ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంది. -
భార్య అంటే శ్రీకాంత్‌కు ఎంత ప్రేమో!.. చెప్పినట్లే విన్నాడు! వీడియో
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునబ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్సూట్లో మెరిసిపోయాడు.నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్‌కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్‌లోకి చేరుకున్నాడు.‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్‌కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుకాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.అదే విధంగా.. 2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్‌ను శ్రీకాంత్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగిన శ్రీకాంత్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ View this post on Instagram A post shared by Shravya Varma & Srikanth Kidambi (@weshranth) -
ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇది జరగ్గా.. హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)శ్రావ్య వర్మకి ఫ్యాషన్ డిజైనర్‌గా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. కీర్తి సురేశ్‌తో 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఈమె గత కొన్నేళ్లుగా ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రేమలో ఉంది. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు తమ ఇన్ స్టా స్టోరీల్లో శ్రావ్యవర్మ, కిదాంబి శ్రీకాంత్ పెళ్లి ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!) -
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
ఆర్జీవీ మేనకోడలితో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రష్మిక మందన్న (ఫొటోలు)
-
మేడమ్‌ని జాగ్రత్తగా చూసుకో !
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా తనకంటూ గుర్తింపు పొందారు. అలాగే కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ‘గుడ్ లఖ్ సఖి’ సినిమాకి సహ నిర్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం రష్మికా మందన్న లీడ్ రోల్ చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్లు రష్మికా మందన్న, వర్ష బొల్లమ్మ, శ్రావ్య వర్మల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. కాగా బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌తో శ్రావ్య త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.ఆగస్టు 10న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల శ్రావ్య వర్మ ఇచ్చిన బ్యాచిలరేట్ పార్టీకి రష్మికా మందన్న, వర్ష బొల్లమ్మ హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోని శ్రావ్య తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి,‘నా గర్ల్ గ్యాంగ్‌తో సింగిల్‌గా ఇదే నా లాస్ట్ వీకెండ్’ అని పోస్ట్ చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ..‘శ్రావ్య వర్మ మేడమ్ పెళ్లి చేసుకోనున్నారు. శ్రీకాంత్ కిదాంబి.. ఇకపై తను నీది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో. ఓకే’ అంటూ రిప్లై ఇస్తూ శ్రీకాంత్‌ని ట్యాగ్ చేశారు. ఇందుకు శ్రీకాంత్ స్పందిస్తూ ‘మహారాణిలా చూసుకుంటా’ అంటూ బదులిచ్చారు. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
మకావ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ 57వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టిపై గెలుపొందాడు. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు కొంత ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పాయింట్లు సాధించి వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌లో స్కోరు 12–10 వద్ద శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో తేరుకున్న ఆయుశ్ ఒకదశలో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి అంతరాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఆయుశ్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే శ్రీకాంత్ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఆయుశ్ రెండు పాయింట్లు సాధించినా, మరోవైపు శ్రీకాంత్ మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ తస్నిమ్ మీర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రపంచ 18వ ర్యాంకర్ తొమోకా మియజాకి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 67వ ర్యాంకర్ తస్నిమ్ 17–21, 21–13, 10–21తో పరాజయం పాలైంది. గాయత్రి–ట్రెసా జోడీ విజయం మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 21–11తో లిన్ చి చున్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 17–21, 14–21తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
శ్రీకాంత్ శుభారంభం
మకావ్: నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–15తో డానిల్ దు»ొవెంకో (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21–13, 21–5తో సహచరుడు ఆలాప్ మిశ్రాను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శంకర్ ముత్తుస్వామి (భారత్) 14–21, 21–10, 12–21తో పనిట్‌చాపోన్ (థాయ్‌లాండ్) చేతిలో, చిరాగ్ సేన్ (భారత్) 12–21, 17–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, మిథున్ (భారత్) 12–21, 15–21తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ) చేతిలో, సమీర్ వర్మ (భారత్) 21–18, 11–21, 13–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 24–22, 10–21, 21–13తో లూ బింగ్ కున్–హో లో ఈ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–23, 22–24తో రుతానాపక్–జిహెనిచా (థాయ్‌లాండ్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రుతి్వక జోడీ 17–21, 19–21తో నికోల్ చాన్–యాంగ్ చు యున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
పెళ్లి షాపింగ్ చేసిన భారత ప్రముఖ షట్లర్
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. శ్రావ్య వర్మ అనే అమ్మాయిని శ్రీకాంత్ త్వరలో మనువాడనున్నాడు. శ్రావ్య.. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తుంది. శ్రీకాంత్ ఇటీవలే కాబోయే భార్యతో కలిసి పెళ్లి షాపింగ్ చేశాడు. నగరంలోని ప్రముఖ వెడ్డింగ్ కలెక్షన్ మాల్ అయిన గౌరీ సిగ్నేచర్స్లో శ్రీకాంత్, శ్రావ్య జోడీ సందడి చేశాడు. వీరిద్దరి షాపింగ్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్.. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్నాడు. -
సెమీస్‌లో శ్రీకాంత్ పరాజయం
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. బాసెల్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 65 నిమిషాల్లో 21–15, 9–21, 18–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 16 నెలల తర్వాత ఓ టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్ చేరడం గమనార్హం. సెమీఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్.. పీవీ సింధుకు చుక్కెదురు
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు చుక్కెదురు మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్‌లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్‌లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
శ్రీకాంత్ ముందంజ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి, మిథున్ మంజునాథ్ శుభారంభం చేశారు. సమీర్ వర్మ, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 45 నిమిషాల్లో 22–20, 21–19తో ప్రపంచ 26వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... శంకర్ 21–14, 21–17తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను, మిథున్ 21–17, 21–8తో జేసన్ (హాంకాంగ్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 14–21, 18–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోగా... లె లాన్ జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి తొలి గేమ్‌ను 17–21తో కోల్పోయాక గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో అషి్మత, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... హైదరాబాద్ అమ్మాయి సామియా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అష్మిత 21–10, 21–16తో వాంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై, మాళవిక 22–20, 21–8తో ఇనెస్ (పెరూ)పై నెగ్గగా... సామియా 14–21, 18–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోని రెండో టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 22–24, 13–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీకంటే ముందు మలేసియా ఓపెన్‌లో ఆడిన శ్రీకాంత్ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాడు. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 78 నిమిషాల్లో 21–15, 19–21, 21–16తో ఫాంగ్ చి లీ–ఫాంగ్ జెన్ లీ (చైనీస్ తైపీ) జోడీపై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప (భారత్) జంట 5–21, 21–18, 11–21తో జాంగ్కోల్ఫన్–ప్రజోంగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Malaysia Open 2024: కిడాంబి శ్రీకాంత్ సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 12–21, 21–18, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తదుపరి రౌండ్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) జోడీ 21–13, 21–16తో ఫ్రాన్సెస్కా కోర్బి–అలీసన్ లీ (అమెరికా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
శ్రీకాంత్‌కు సవాల్.. నేటి నుంచి మలేసియా ఓపెన్
కౌలాలంపూర్: గత సీజన్ భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలిచి్చంది. కానీ ఇప్పుడు ఒలింపిక్ నామ సంవత్సరం కావడంతో మన బ్యాడ్మింటన్ ఆటగాళ్లంతా నూతనోత్సాహంతో కొత్త సీజన్‌కు శ్రీకారం చుట్టేపనిలో ఉన్నారు. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో శుభారంభమే లక్ష్యంగా మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్, డబుల్స్‌లో అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కోటి ఆశలతో కొత్త ఏడాదిని విజయవంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. నేడు జరిగే తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శ్రీకాంత్, వెంగ్ హాంగ్ యంగ్ (చైనా)తో లక్ష్య సేన్ తలపడతారు. -
శ్రీకాంత్ మరో పరాజయం
లక్నో: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ ఏడాది తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోతున్నాడు. సొంతగడ్డపై జరుగుతోన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలోనూ శ్రీకాంత్ ఆటకు మొదటి రౌండ్లోనే తెరపడింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21–23, 8–21తో చైనీస్ తైపీకి చెందిన చియా హవొ లీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవి చూశాడు. ఇతర మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ చిరాగ్ సేన్‌పై గెలుపొందగా, సమీర్ వర్మ 9–21, 21–7, 17–21తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రియాన్షు రజావత్ 21–17, 21–19తో డిమిట్రి పనరిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో క్లిష్టమైన డ్రా ఎదురవడంతో మాల్విక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 21–18, 17–21, 10–21తో జపాన్ స్టార్ నజొమి ఒకుహర చేతిలో ఓడిపోయింది. భారత సహచరుల మధ్య జరిగిన పోరులో ఉన్నతి హుడా 15–21, 21–19, 21–18తో ఆకర్షి కశ్యప్‌పై గెలుపొందగా, క్వాలిఫయర్ కేయూర 8–21, 16–21తో ఎనిమిదో సీడ్ సంగ్ షు యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ 21–9, 21–16తో భారత్‌కే చెందిన అపూర్వ –సాక్షి గెహ్లావత్ జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో కోన తరుణ్–శ్రీకృష్ణప్రియ జంటకు 14–21, 15–21తో నితిన్ కుమార్–నవధ మంగళం జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
BWF Championships: సింధుకు క్లిష్టమైన డ్రా.. ఆ రెండు అడ్డంకులు దాటితేనే
కౌలాలంపూర్: ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ కార్యక్రమం గురువారం జరిగింది. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి సింధు మాత్రమే బరిలో ఉంది. 16వ సీడ్‌గా బరిలోకి దిగనున్న సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఆ తర్వాత సింధుకు ప్రతి రౌండ్లో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడే చాన్స్ ఉంది. మూడో రౌండ్లో మరో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) సిద్ధంగా ఉండవచ్చు. ఈ రెండు అడ్డంకులు దాటితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడే అవకాశముంది. ఆన్ సెయంగ్‌తో ఇప్పటి వరకు సింధు ఆరుసార్లు ఆడగా ఆరుసార్లూ ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
ప్రణయ్ అద్భుత పోరాటం.. టాప్ సీడ్ షట్లర్‌కు షాక్
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రణయ్.. టాప్ సీడ్ ఆంథోని సినిసుకను, యువ షట్లర్ ప్రియాన్షు.. మాజీ వరల్డ్ నంబర్ 1, భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌ను మట్టికరిపించారు. ఇటీవలి కాలంలో సూపర్ టచ్‌లో ఉన్న వరల్డ్ నంబర్ 9 ప్లేయర్ ప్రణయ్.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 16-21, 21-17, 21-14తో ప్రత్యర్ధి ఆట కట్టించాడు. మరో క్వార్టర్స్‌లో ఓర్లీయాన్స్ మాస్టర్స్ విజేత ప్రియాన్షు.. కిదాంబి శ్రీకాంత్‌ను వరుస సెట్లలో (21-13, 21-8) ఓడించాడు.క్వార్టర్స్‌లో తమ కంటే మెరుగైన ప్రత్యర్ధులపై విజయాలు సాధించిన ప్రణయ్, ప్రియాన్షులు సెమీస్‌లో ఎదురెదురుపడనున్నారు. ఇదే టోర్నీలో మహిళల విభాగానికి వస్తే.. భారత ఏస్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. అమెరికన్ షట్లర్ బెయివెన్ జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు వరుస సెట్లలో (21-12, 21-17) ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. జాంగ్ చేతితో సింధుకు ఇది ఐదో ఓటమి. -
క్వార్టర్స్‌లో పీవీ సింధు.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్‌కు చేరుకోవడంతో ఫామ్‌లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్‌లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్‌తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్‌ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక భారత్‌కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్‌పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌తో తలపడనున్నాడు. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో? -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసిన భారత షట్లర్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు మొదటి రౌండ్లో విజయం సాధించారు. జపాన్ ఓపెన్‌లో విఫలమైన ప్రణయ్ హాంకాంగ్‌కు చెందిన చెక్ యూను చిత్తు చేశాడు. మూడు సెట్లలో జోరుగా ఆడిన భారత షట్లర్ 21-18, 16-21, 21-15తో గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ శ్రీకాంత్ జపాన్ ఆటగాడైన కెంటా నిషిమొటోపై 21-18, 21-7తో అవలీలగా గెలుపొందాడు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌కు చేరింది. 47వ ర్యాంకర్ అష్మితా చాలిహపై 21-18, 21-13తో సింధు విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె భారత్‌కే చెందిన ఆకర్షి కష్యప్‌ను ఢీ కొట్టనుంది. -
తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం..
BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్‌కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 17వ ర్యాంక్‌లో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించింది. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్‌పై ప్రణయ్‌కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్‌కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
తొలి రౌండ్లోనే ఓడిన సింధు, కిడాంబి శ్రీకాంత్
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ పీవీ సింధు 18–21, 21–10, 13–21తో 22వ ర్యాంకర్ పాయ్ యుపో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తస్నీమ్, మాళవిక, ఆకర్షి, తాన్యా, అష్మిత కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 22–24, 17–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా 12వ ఓటమి. భారత నంబర్‌వన్ ప్రణయ్ 21–13, 21–17తో జూలియన్ (బెల్జియం)పై, ప్రియాన్షు 21–15, 21–19తో చోయ్ జి హున్ (కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సిక్కి రెడ్డి జోడీ గెలుపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ 21–17, 21–17తో అలి్వన్ మోరాదా–అలీసా లియోన్ (ఫిలిప్పీన్స్)లపై గెలి చారు. సుమీత్ రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–23, 21–13, 12–21తో సాంగ్ హున్ చో–లీ జంగ్ హున్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
శ్రీకాంత్, ప్రణయ్ జోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–17, 22–20తో ప్రపంచ 20వ ర్యాంకర్, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌ను ఓడించగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ 16వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. గతంలో లక్ష్య సేన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్‌కు ఈసారి గట్టిపోటీనే లభించింది. ప్రతి పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. అయితే కీలకదశలో శ్రీకాంత్ సంయమనంతో ఆడి పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్నదశలో శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ 20–14తో విజయానికి పాయింట్ దూరంగా నిలిచాడు. అయితే లక్ష్య సేన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత యువతార ప్రియాన్షు రజావత్ 22–20, 15–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరి గిన మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ సింధు 18–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా తై జు యింగ్ చేతిలో సింధుకిది 19వ ఓటమికాగా వరుసగా తొమ్మిదో పరాజయం. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఈ చైనీస్ తైపీ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా) జంటపై గెలిచింది. -
శ్రీకాంత్ ముందుకు...
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత క్రీడాకారులు ముందంజ వేశారు. కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ప్రియాన్షు రజావత్‌కు ప్రపంచ మూడో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) నుంచి వాకోవర్ లభించడంతో అతను కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ గ్వాంజ్ జు లూ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–13, 21–19తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు ప్రతిఘటన ఎదురైంది. అయితే స్కోరు 19–19 వద్ద శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు గ్వాంజ్ జు లూపై వరుసగా ఐదో విజయాన్ని సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్, ఆసియా చాంపియన్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–17, 21–13తో గెలిచాడు. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో స్కోరు 17–17 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 5–3 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 12–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్‌నకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ ఆకర్షి తొలి రౌండ్లో 10–21, 4–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్య సేన్‌తో శ్రీకాంత్; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (వియత్నాం)తో ప్రణయ్; ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రియాన్షు రజావత్; తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు. -
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్‌లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్‌లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్‌కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Malaysia Masters: సెమీస్‌లో సింధు, ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్
కౌలాలంపూర్: తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 74 నిమిషాల్లో 21–16, 13–21, 22–20తో యి మన్ జాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రణయ్ 91 నిమిషాల్లో 25–23, 18–21, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించాడు. అయితే భారత మరో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. 57 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–16, 16–21, 11–21తో ప్రపంచ 57వ ర్యాంకర్ క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో గ్రెగోరియా టున్‌జంగ్ (ఇండోనేసియా)తో సింధు; అడినాటాతో ప్రణయ్ తలపడతారు. -
Malaysia Masters: ప్రపంచ ఐదో ర్యాంకర్‌కు షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్
కౌలాలంపూర్: వ్యక్తిగత విదేశీ కోచ్‌ను నియమించుకున్న తర్వాత భారత స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆటతీరులో మార్పు కనిపిస్తోంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 5వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–19, 21–19తో అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకున్నాడు. కున్లావుత్‌పై శ్రీకాంత్‌కిదే తొలి గెలుపు కావడం విశేషం. గతంలో కున్లావుత్‌తో ఆడిన మూడుసార్లూ శ్రీకాంత్ వరుస గేముల్లో ఓడిపోవడం గమనార్హం. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌పై నెగ్గిన ప్రణయ్ భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ను ఓడించిన ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 11వ ర్యాంకర్ షి ఫెంగ్ లీని బోల్తా కొట్టించాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–16, 21–11తో షి ఫెంగ్ లీపై గెలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 7–5తో వద్ద ప్రణయ్ వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 16–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్ 14–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు వరుసగా 13వసారి... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ సింధు 21–16, 21–11తో ప్రపంచ 28వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. తొలి గేమ్‌లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. రెండో గేమ్‌లోనూ ఆమెదే పైచేయిగా నిలిచింది. ఒహోరిపై సింధుకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో జాంగ్ యి మాన్ (చైనా)తో సింధు; నిషిమోటో (జపాన్)తో ప్రణయ్; క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా)తో శ్రీకాంత్ తలపడతారు. -
Badminton Asia Championships 2023: అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత షట్లర్లు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. దుబాయ్‌లో నేడు మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 61 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్ మూడు కాంస్య పతకాలు (2010, 2016, 2018), పీవీ సింధు (2014, 2022) రెండు కాంస్య పతకాలు సాధించారు. అయితే ఈ ఏడాది సైనా నెహ్వాల్ బరిలోకి దిగడంలేదు. -
Madrid Spain Masters: క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
మాడ్రిడ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో ప్రపంచ 38వ ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)పై 36 నిమిషాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో గత వారం స్విస్ ఓపెన్‌లో కుసుమ వర్దిని చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత్‌కే చెందిన అష్మిత చాలిహా 15–21, 15–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... గాయం కారణంగా మాళవిక బన్సోద్ తన ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)కు వాకోవర్ ఇచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–15, 21–12తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి 17–21, 12–21తో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14–21, 15–21తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సమీర్ వర్మ 15–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ఆరతి (భారత్) జోడీ 12–21, 13–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జంట 16–21, 20–22తో షున్టారో మెజకి–హరుయ నిషిద (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
అతికష్టం మీద గట్టెక్కిన శ్రీకాంత్.. సింధు శుభారంభం
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–11, 25–27, 23–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ సితికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం గమనార్హం. 19–15తో ఆధిక్యంలో నిలిచిన శ్రీకాంత్ ఒక్కసారిగా వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకోవడంతో థమాసిన్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే శ్రీకాంత్ స్కోరును 20–20తో స్కోరును సమం చేశాడు. ఆ వెంటనే థమాసిన్ మరో పాయింట్ సాధించి 21–20తో ఆధిక్యంలోకి వచ్చాడు. కానీ శ్రీకాంత్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 23–21తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ (భారత్) 21–16, 18–21, 21–12తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్)పై, ప్రియాన్షు రజావత్ (భారత్) 18–21, 21–16, 21–11తో విక్టర్ స్వెండ్స్న్ (డెన్మార్క్)పై, కిరణ్ జార్జి (భారత్) 21–16, 21–14తో మిథున్ మంజునాథ్ (భారత్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అయాటో ఎండో–యుటా టకె (జపాన్)లతో జరిగిన తొలి రౌండ్లో సాతి్వక్–చిరాగ్ తొలి గేమ్‌లో 9–11తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగారు. సింధు శుభారంభం మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధుతోపాటు వర్ధమాన క్రీడాకారిణిలు ఆకర్షి కశ్యప్, మాళవిక, అషి్మత ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–10, 21–14తో జెన్జిరా స్టాడెల్మన్ (స్విట్జర్లాండ్)పై, ఆకర్షి 12–21, 21–15, 21–18తో ఆరో సీడ్ మిచెల్లి లీ (కెనడా)పై, మాళవిక 21–19, 16–21, 21–9తో కిసోనా సెల్వదురై (మలేసియా)పై, అష్మిత 21–12, 22–20తో లియోనైస్ హ్యుట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 18–21, 16–21తో రెనా మియారా–అయాకో సకురమాటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
All England Badminton Tourney: సీడింగ్ లేకుండానే బరిలోకి భారత ఆటగాళ్లు
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నేడు (మార్చి 14) బర్మింగ్‌హామ్‌లో మొదలుకానుంది. 2001లో పుల్లెల గోపీచంద్ తర్వాత మరో భారత ప్లేయర్ ఈ టోర్నీ టైటిల్‌ను సాధించలేకపోయాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ టైటిల్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2009 తర్వాత తొలిసారి భారత క్రీడాకారులెవరికీ సీడింగ్ లభించలేదు. -
సెమీఫైనల్లో శ్రీకాంత్
పుణే: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ శ్రీకాంత్ 21–10, 18–21, 21–16 స్కోరుతో కార్తికేయ కుమార్‌పై విజయం సాధించాడు. ఇతర పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, హర్షీల్ దాని, మిథున్ మంజునాథ్ కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ జంట సెమీస్‌లోకి అడుగు పెట్టింది. క్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా 21–16, 21–12 తేడాతో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్పపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అస్మిత చలీహ సెమీస్ చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో హేమనాగేంద్ర–కనికా కన్వాల్ జోడి సెమీస్ చేరుకుంది. ఇషాన్ భట్నాగర్ –తనీషా క్రాస్టో జంట వీరికి వాకోవర్ ఇచ్చింది. -
India Open 2023: శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 14–21, 19–21తో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్‌కిది పదో పరాజయం కావడం గమనార్హం. 2017లో డెన్మార్క్ ఓపెన్‌లో చివరిసారి అక్సెల్సన్ను ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ డెన్మార్క్ ప్లేయర్ చేతిలో వరుసగా ఏడోసారి ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక (భారత్) 17–21, 12–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో... ఆకర్షి 15–21, 12– 21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని –శిఖా (భారత్) 8–21, 11–21తో పియర్లీ తాన్–థినా (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయంపాలయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సింగపూర్‌కు చెందిన ఏడో సీడ్ లో కీన్ యూ 21–13, 21–15 స్కోరుతో శ్రీకాంత్‌ను ఓడించాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఏపీ షట్లర్ శ్రీకాంత్ తగిన పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాడు. అయితే మరో భారత ప్లేయర్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్య 21–9, 21–18 స్కోరుతో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌ను చిత్తు చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో ప్రణయ్ చేతిలో ఓడిన సేన్ ఈ సారి పదునైన ఆటతో చెలరేగి 39 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. గాయత్రి–ట్రెసా జోడి ఓటమి... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ భారత షట్లర్లు 21–14, 2–16తో ఇండోనేసియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ – బగాస్ మౌలానాలను ఓడించారు. అయితే మహిళల డబుల్స్‌లో భారత జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీకి చుక్కెదురైంది. థాయిలాండ్‌కు చెందిన జొంగొల్ఫాన్ కిటిథారకుల్ – రవీంద ప్రజొంగ్‌జాయ్ ద్వయం 23–21, 21–13 స్కోరుతో గాయత్రి–ట్రెసాపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ భట్నాగర్ – తనీషా క్రాస్టో 16–21, 10–21 తేడాతో యుటా వతనబె – అరిసా హిగాషినో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: World Shooting Championship: భారత షూటర్ల జోరు -
ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు
జపాన్ ఓపెన్-2022 సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం దాదాపుగా ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే స్టార్ షట్లర్లంతా ఇంటిముఖం పట్టగా.. గురువారం కిదాంబి శ్రీకాంత్ పోరాటం సైతం ముగిసింది. భారత్ తరఫున హెచ్ఎస్ ప్రణయ్ మాత్రమే ఈ టోర్నీ బరిలో మిగిలాడు. పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో శ్రీకాంత్.. జపాన్‌కు చెందిన కంటే సునేయమ చేతిలో 10-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. అంతకుముందు శ్రీకాంత్ తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ 4 ఆటగాడు లీ జీ జియాకు షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. ఇక టోర్నీ బరిలో నిలిచిన ఏకైక భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ విషయానికొస్తే.. ఈ మాజీ వరల్డ్ నంబర్ 8 షట్లర్ ప్రీక్వార్టర్స్‌లో సింగపూర్ ఆటగాడు, మాజీ వరల్డ్ ఛాంపియన్ లో కియాన్ యును వరుస సెట్లలో (22-20 21-19) ఖంగుతినిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రణయ్ తదుపరి రౌండ్లో తైపీ షట్లర్ చౌ టెన్ చెన్ను ఢీకొట్టాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీ బరిలో భారత తురుపు ముక్క పీవీ సింధు బరిలో దిగని విషయం తెలిసిందే. చదవండి: వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్ -
వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్
జపాన్ ఓపెన్ 2022లో బుధవారం భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా, కిదాంబి శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ 4 ఆటగాడికి షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. బుధవారం శ్రీకాంత్ ఒక్కడే తొలి రౌండ్ గండాన్ని అధిగమించాడు. శ్రీకాంత్.. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్.. ఈ గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. మిగతా గేమ్‌ల్లో లక్ష్యసేన్.. జపాన్‌కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో, సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 తేడాతో ఓడారు. పురుషుల డబుల్స్‌లో అర్జున్-కపిల ద్వయం.. చోయ్-కిమ్ చేతిలో, మహిళల డబుల్స్‌లో జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. కిటితరకుల్-ప్రజోంగజ్ చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రసాద్-దేవాంగన్ జంట.. జెంగ్-హుయాంగ్ చేతిలో ఓటమి చవిచూశాయి. కాగా, ఈ టోర్నీలో మంగళవారం హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్ -
ఒకే పార్శ్వంలో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్
టోక్యో: గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకం అందించారు. అయితే ఈసారి మాత్రం భారత్‌కు మళ్లీ రెండు పతకాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల 22 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ఒకే పార్శ్వంలో ఉండటమే దీనికి కారణం. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. మరో పార్శ్వంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ ఉన్నాడు. సాయిప్రణీత్కూ కఠినమైన ‘డ్రా’నే పడింది. తొలి రౌండ్లో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; విటింగస్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్; లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో ప్రణయ్; నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ తలపడతారు. చౌ తియెన్ చెన్‌తో ఇప్పటివరకు ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోయాడు. తొలి రౌండ్ అడ్డంకి దాటితే రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. మూడో రౌండ్లో మొమోటా లేదా ప్రణయ్‌లతో లక్ష్య సేన్ ఆడే అవకాశముంది. మరోవైపు శ్రీకాంత్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జావో జున్ పెంగ్.తో ఆడతాడు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడో రౌండ్లో ఐదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు లక్ష్య సేన్ లేదా ప్రణయ్ లేదా మొమోటాలలో ఒకరు ఎదురుపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో హాన్ యు (చైనా) లేదా కి జుయ్‌ఫె (నెదర్లాండ్స్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరియా స్టార్ ఆన్ సె యంగ్ ఎదురుకానుంది. భారత్‌కే చెందిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో... లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో మాళవిక తలపడతారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
కాంస్యంతో సరిపెట్టుకున్న శ్రీకాంత్.. సింధుకు ‘స్వర్ణా’వకాశం
కామన్వెల్త్ గేమ్స్‌లో తెలుగు తేజం సింధు ఖాతాలో సింగిల్స్ విభాగం పసిడి పతకమే బాకీ ఉంది. గత ఈవెంట్లో స్వర్ణం గెలిచినప్పటికీ అది మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వచ్చింది. సింగిల్స్‌లో గ్లాస్గో (2014) లో కాంస్యం, గోల్డ్‌కోస్ట్ (2018)లో రజతం నెగ్గిన ఆమెకు ఇప్పుడు స్వర్ణావకాశం మళ్లీ వచ్చింది. బర్మింగ్‌హామ్ ఈవెంట్లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆమె 21–19, 21–17తో యో జియా మిన్ (సింగపూర్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సంపాదించింది. పురుషుల సింగిల్స్‌లో స్టార్ లక్ష్య సేన్ కూడా పసిడి వేటకు సిద్ధమవగా... కిడాంబి శ్రీకాంత్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 21–18తో జియా హెంగ్ తె (సింగపూర్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ కాంస్యంతో భారత పతకాల సంఖ్య 51కి చేరింది. సెమీఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 18–21, 21–16తో జియా హెంగ్ టె (సింగపూర్)పై గెలుపొందగా, శ్రీకాంత్ 21–13, 19–21, 10–21తో తే యంగ్ ఎంజ్ (మలేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–6, 21–15తో చెంగ్ పెంగ్ సున్–టియాన్ కియన్ మెన్ (మలేసియా) జంటపై గెలిచి పసిడి పోరుకు సిద్ధమైంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 13–21, 18–21తో తాన్ కూంగ్ పియర్లీ–థినా మురళీధరన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచింది. -
Commonwealth Games 2022: సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌లో సింధు... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 19–21, 21–14, 21–18తో గో వె జిన్ (మలేసియా)పై, శ్రీకాంత్ 21–19, 21–17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై, లక్ష్య సేన్ 21–12, 21–11తో జూలియన్ (మారిషస్)పై గెలిచారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 21–8, 21–6తో తాలియా–కేథరిన్ (జమైకా) జంటపై గెలిచింది. -
స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు స్వర్ణ పతకం లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మహిళల సింగల్స్‌లో సింధు, పురుషుల సింగల్స్‌లో శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వీరిద్దరు తమ తొలి రౌండ్లలో ప్రత్యర్ధులపై సునాయస విజయాలు సాధించి ముందడుగు వేశారు. సింధు.. ఒలింపిక్ పతక విజేత, మాల్దీవులకు చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్‌పై 21-4, 21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా, శ్రీకాంత్.. ఉగాండాకు చెందిన డేనియల్ వానగాలియాపై 21-9, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని సాధించాడు. గత కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు గెలిచిన సింధు, శ్రీకాంత్‌లు.. ఈ సారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. చదవండి: భారత రిలే జట్టుకు రజతం -
కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి సత్తా చాటుతున్నారు. ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. భారత్ సాధించిన ఈ పతకాలలో 9 వెయిట్ లిఫ్టింగ్లోనే సాధించినవి కాగా, మిగతా 5 మెడల్స్.. జూడో (2), లాన్స్ బౌల్స్ (1), టేబుల్ టెన్నిస్ (1), బ్యాడ్మింటన్ (1) క్రీడల్లో గెలిచినవి. ఇదిలా ఉంటే, క్రీడల ఐదో రోజు బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ సాధించిన సిల్వర్ మెడల్‌పై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతుంది. ఈ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో మలేషియా చేతిలో దారుణంగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. భారత్ ఆడిన నాలుగు గేమ్‌ల్లో ఒక్క పీవీ సింధు మాత్రమే విజయం సాధించింది. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ కూడా ఫైనల్లో ఓటమిపాలై భారత్ బంగారు ఆశలను నీరుగార్చారు. అయితే ఓటమి అనంతరం కిదాంబి శ్రీకాంత్ కంటతడి పెట్టిన వైనం భారత అభిమానులను చాలా బాధించింది. శ్రీకాంత్.. తన వల్లే భారత్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని సహచరుడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మీడియాకు తెలిపాడు. శ్రీకాంత్ అలా ఏడవడం చూస్తే చాలా బాధ అనిపించిందని, అతన్ని ఆ పరిస్థితిలో చూడటం అదే మొదటిసారి అని సాత్విక్ అన్నాడు. చదవండి: కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం -
కిదాంబి శ్రీకాంత్‌కు షాక్.. క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ఇవాళ (జులై 14) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్‌కు భారత్‌కే చెందిన మరో షట్లర్ మిథున్ మంజునాథ్ షాకివ్వగా, హెచ్ఎస్ ప్రణయ్.. ప్రపంచ నెం.4 ఆటగాడు చో టెన్ చెన్పై సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ గండాన్ని అధిగమించి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. మరో మ్యాచ్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మిథున్ మంజునాథ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ పోరాడి (17-21, 21-15, 18-21) ఓడగా.. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్, చైనీస్ తైపీకి చెందిన చో టెన్ చెన్పై 14-21, 22-20, 21-18తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విషయానికొస్తే.. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్లో వియత్నాంకి చెందిన వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌పై 19-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించగా.. వెటరన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో అశ్మిత చాలిహా వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్ చేతిలో పరాజయం పాలైంది. చదవండి: World Cup 2022: అసలైన మ్యాచ్‌లలో చేతులెత్తేశారు! జపాన్‌తో పోరులో.. -
తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్, లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్, ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–23, 10–21తో ప్రపంచ 41వ ర్యాంకర్బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోగా... భారత్‌కే చెందిన ప్రపంచ 23వ ర్యాంకర్ ప్రణయ్ 21–10, 21–9తో లక్ష్య సేన్‌ను బోల్తా కొట్టించాడు. గతంలో లెవెర్డెజ్తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. లక్ష్య సేన్‌పై ప్రణయ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ జోడీ 27–25, 18–21, 21–19తో మత్సుయ్–టెకుచి (జపాన్) జంటపై గెలిచింది. చదవండి: Asia Cup Qualifiers: సునీల్ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో -
క్వార్టర్ ఫైనల్లో సింధు .. శ్రీకాంత్ వాకోవర్
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత టాప్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ మ్యాచ్ ఆడకుండానే ‘వాకోవర్’ ఇవ్వడంతో అతని ప్రత్యర్థి ఎన్‌హట్ గుహెన్ (ఐర్లాండ్) ముందంజ వేశాడు. శ్రీకాంత్ పొత్తి కండరాలు పట్టేయడంతో కోర్టులోకి దిగక ముందే తప్పుకున్నాడు. లెవెర్డెజ్తో జరిగిన తొలి రౌండ్లోనూ అతను ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నా...ఎలాగోలా మ్యాచ్‌ను ముగించగలిగాడు. ఇతర మ్యాచ్‌లలో భారత షట్లర్ల ఆట ముగిసింది. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్, మహిళల డబుల్స్‌లో అశ్విని భట్–శిఖా గౌతమ్ జోడి, మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రస్టో జంట ఓడారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ప్రణయ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సైనా నెహ్వాల్, అష్మిత, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకాంత్ 18–21, 21–10, 21–16తో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. సౌరభ్ వర్మ 20–22, 12–21తో తోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సాయిప్రణీత్ 12–21, 13–21తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్) చేతిలో, ప్రణయ్ 17–21, 21–15, 15–21తో డారెన్ లూ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–19, 18– 21, 21–18తో లారెన్ లామ్ (అమెరికా)పై... మాళవిక 17–21, 21–15, 21–11తో ఉలితినా (ఉక్రెయిన్) పై నెగ్గగా.. సైనా 21–11, 15–21, 17–21తో కిమ్ గా ఉన్ (కొరియా) చేతిలో, ఆకర్షి 13–21, 18–21 తో మిచెల్లి (కెనడా) చేతిలో, అష్మిత 10–21, 15– 21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు. -
చరిత్రాత్మక విజయం
చరిత్రాత్మక ఘట్టం. చిరస్మరణీయ సందర్భం. భారత బ్యాడ్మింటన్‌లో సువర్ణాక్షర లిఖిత విజయం. ఇలాంటి విశేషణాలు ఎన్ని వాడినా తక్కువే. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌గా పేరున్న ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో ఆదివారం భారత పురుషుల జట్టు సాధించిన గెలుపు అలాంటిది మరి. 73 ఏళ్ళ థామస్ కప్, ఉబర్ కప్‌ల చరిత్రలో భారత్‌కు తొలిసారి దక్కిన విజయం ఇది. అందులోనూ 14 పర్యాయాలు విజేతగా నిలిచిన ఇండొనేషియా జట్టును 3–0 తేడాతో ఓడించడం అనూహ్యం. ఈ విజయానికి దేశమంతటా అపూర్వ స్పందన లభిస్తున్నదంటే కారణం అదే. ఈ విజయం సాధించిపెట్టినవారిలో షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ పుల్లెల గోపీచంద్ వంటి తెలుగు తేజాలు ఉండడం మరింత గర్వకారణం. ఇప్పటి దాకా కేవలం ప్రాతినిధ్యానికే తప్ప పతకానికి నోచుకోని పురుషుల టీమ్ టోర్నమెంట్ థామస్ కప్‌లో భారత విజయం ఇప్పుడిక కొన్ని తరాల పాటు చెప్పుకొనే కథ. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్లలో మన విజయాలు గాలివాటువేమో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఫైనల్లో మన ఆటగాళ్ళు 3 వరుస విజయాలతో మునుపటి ఛాంపియన్ ఇండొనేషియాను ఓడించి, దేశానికి బంగారు పతకం తెచ్చారు. 43 ఏళ్ళ క్రితం ప్రకాశ్ పదుకోనే, సయ్యద్ మోదీ లాంటి దిగ్గజాలతో కూడిన భారత షట్లర్ల జట్టు సెమీస్ దాకా వెళ్ళి, డెన్మార్క్ చేతిలో ఓడింది. ఈసారి సెమీఫైనల్లో అదే డెన్మార్క్‌పై గెలిచి ఫైనల్‌కు చేరడం గమ్మల్తైన కాకతాళీయం. యువ షట్లర్ లక్ష్యసేన్ మొదటి సింగిల్స్‌లో తొలి గేమ్ ఓడినా, పుంజుకొని వరల్డ్ నంబర్ 5 ఆటగాణ్ణి మట్టికరిపించారు. డబుల్స్‌లో సాయిరాజ్, చిరాక్ షెట్టి సైతం మొదటి గేమ్ ఓడినా, తరువాత రెండు గేమ్‌లలో సత్తా చాటి, గెలుపు అందించారు. కీలకమైన రెండో సింగిల్స్‌లో మన తెలుగు బిడ్డ శ్రీకాంత్ ఆచితూచి ఆడారు. ఆసియా క్రీడోత్సవాల విజేత జొనాథన్ క్రిస్టీని ఓడించి, సువర్ణాధ్యాయం లిఖించారు. 1975లో హాకీ వరల్డ్ కప్... 1983లో క్రికెట్ వరల్డ్ కప్... ఈ 2022లో ప్రపంచ బ్యాడ్మింటన్ కప్ లాంటి థామస్ కప్... మూడు వేర్వేరు ఆటలు... మూడు వేర్వేరు సందర్భాలు... మూడింటా సమష్టి కృషితో భారత జట్లే విజేతలు. బ్యాంకాక్‌లోని ఇంప్యాక్ ఎరీనాలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడిన ఈ ఘట్టాన్ని – 39 ఏళ్ళ క్రితం 1983 క్రికెట్ వరల్డ్ కప్‌లో కపిల్ సేన సాధించిన విజయంతో ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, 73 ఏళ్ళ చరిత్రను తిరగరాసిన తాజా గెలుపు, 1983 నాటి విజయం కన్నా మించినదని గోపీచంద్ లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. ఆ వరల్డ్ కప్ క్రికెట్లోనూ, ఇప్పుడీ థామస్ కప్ బ్యాడ్మింటన్‌లోనూ భారత జట్టుపై ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. రెండు సందర్భాల్లోనూ భారత జట్టు విజేతగా నిలుస్తుందన్న ఊహా లేదు. కానీ, ఇంగ్లండ్‌లో ఆనాటి భారత క్రికెటర్లు, ఇప్పుడు బ్యాంకాక్‌లో మన బ్యాడ్మింటన్ క్రీడాకారులు కలసికట్టుగా ఆడితే, అసాధ్యం కూడా సుసాధ్యమేనని నిరూపించారు. బ్యాడ్మింటన్ ప్రధానంగా వ్యక్తిగత ప్రతిభాపాటవాలకు గీటురాయిగా నిలిచే క్రీడ. వ్యక్తిగత ప్రతిభతో ఆ రంగంలో పతకాలు సాధించడం గొప్పే. కానీ, సమష్టి కృషితో ఒక టీమ్ ఈవెంట్లో విజయం సాధించడం మరీ గొప్ప. థామస్ కప్ ప్రాథమికంగా టీమ్ ఈవెంట్ గనక జట్టులోని ప్రతి సభ్యుడూ టోర్నమెంట్ పొడుగూతా విజయ ప్రదర్శనలే ఇవ్వాల్సి ఉంటుంది. పైగా, టీమ్ ఈవెంట్లలో మన డబుల్స్ జోడీలు ఆట్టే రాణించకపోవడం భారత షటిల్ బ్యాడ్మింటన్‌ను చిరకాలంగా వేధిస్తున్న సమస్య. దాన్ని అధిగమించి, అపూర్వమైన ఆట తీరుతో దక్కిన ఈ థామస్ కప్ ప్రత్యేకమైనదని కోచ్ గోపీచంద్ భావిస్తున్నది అందుకే! ఈ అపూర్వ విజయాన్ని ఏ ఒక్కరి ఖాతాలోనో పూర్తిగా వేసెయ్యలేం. భారత బ్యాడ్మింటన్‌లో వ్యక్తిగత ప్రతిభతో పాటు కలసికట్టుగా ఆడే ఓ బృంద స్ఫూర్తి వికసిస్తోందనడానికి ఈ విజయం ఓ తార్కాణం. బంగారు భవితకు బలమైన పునాది. గతంలో వరల్డ్ ఛాంపియన్ షిప్, ఒలింపిక్ పతకాలు, ఇప్పుడు థామస్ కప్ – ఇవన్నీ బ్యాడ్మింటన్‌లో భారత్ అంచెలంచెల శిఖరారోహణకు సాక్ష్యాలు. ఇండొనేషియా, మలేసియా లాంటి బలమైన జట్లను థామస్ కప్‌లో ఓడించి, స్వర్ణాన్ని సాధించడం రాకెట్ వేగంతో మారుతున్న మన షటిల్ క్రీడా ముఖచిత్రానికి ప్రతీక. ‘కుbŒ∙భీ హో... జీత్నా హై’ అనే లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో సాగితే ఏదీ అసాధ్యం కాదని షట్లర్లు నిరూపించారు. పదిమంది జట్టూ ప్రత్యేక వాట్సప్ గ్రూప్‌లో నిర్మొహమాటంగా భావావేశాలు పంచుకుంటూ సాగిన వైనం మరో విజయసూత్రం. 1980లో ప్రకాశ్ పదుకోనే, 2001లో పుల్లెల గోపీచంద్, 2010లో సైనా నెహ్వాల్, ఆ పైన పీవీ సింధు... ఇలా ఎప్పటికప్పుడు బ్యాడ్మింటన్ తారలు ఉద్భవిస్తూనే ఉన్నారు. అయితే, గ్రామాల నుంచి ఆకలితో వచ్చిన ఆటగాళ్ళతో ప్రస్తుత భారత బ్యాడ్మింటన్ జట్టు మునుపెన్నడూ లేనంత పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇది ఒక శుభపరిణామం. పారుపల్లి కాశ్యప్, సాయి ప్రణీత్ లాంటి ఆటగాళ్ళ తర్వాత కిడాంబి శ్రీకాంత్ లాంటి వాళ్ళ అడుగుజాడల్లో లక్ష్యసేన్ లాంటి యువ షట్లర్లు తయారవుతుండడం భవితపై మరిన్ని ఆశలు రేపుతోంది. ఈ కొత్త తరాన్ని తయారు చేయడంలో గోపీచంద్, ఆయన అకాడెమీ లాంటివి నిరంతరం చేస్తున్న కృషి గణనీయం. జూలైలో కామన్వెల్త్, ఆగస్టులో వరల్డ్ ఛాంపియన్షిప్ – ఇలా మరెన్నో ప్రపంచ శ్రేణి పోటీలు రానున్న వేళ తాజా విజయం మన షట్లర్లకు పెద్ద ఉత్ప్రేరకం. ఆటకూ, ఆశకూ ఇప్పుడిక ఆకాశమే హద్దు. -
Thomas Cup 2022: షటిల్ కింగ్స్
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రపంచ షటిల్ సామ్రాజ్యంలో మన జెండా ఎగిరింది. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్ కప్‌లో ఒకప్పుడు మనం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాం. ఒకట్రెండుసార్లు మెరిపించినా ఏనాడూ పతకం అందుకోలేకపోయాం. కానీ ఈసారి అందరి అంచనాలను పటాపంచలు చేశాం. ఏకంగా విజేతగా అవతరించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాకు విశ్వరూపమే చూపించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ఆఖరి మ్యాచ్‌లో ఫలితం తేలగా... టైటిల్ సమరంలో వరుసగా మూడు విజయాలతో ఇండోనేసియా కథను ముగించి మువ్వన్నెలు రెపరెపలాడించాం. భారత చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలు కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు. బ్యాంకాక్: ఇన్నాళ్లూ వ్యక్తిగత విజయాలతో మురిసిపోయిన భారత బ్యాడ్మింటన్ ఇప్పుడు టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టింది. 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో తొలిసారి భారత్ చాంపియన్‌గా అవతరించింది. ప్రకాశ్ పడుకోన్, సయ్యద్ మోడీ, విమల్ కుమార్, పుల్లెల గోపీచంద్‌లాంటి స్టార్స్ గతంలో థామస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వాళ్లే. కానీ ఏనాడూ వారు ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఎట్టకేలకు వీరందరి కలలు నిజమయ్యాయి. అసాధారణ ఆటతీరుతో ఈసారి భారత జట్టు థామస్ కప్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను చిత్తు చేసి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఇండోనేసియాకు షాక్ ఇచ్చింది. శుభారంభం... తొలిసారి థామస్ కప్ ఫైనల్ ఆడిన భారత్‌కు శుభారంభం లభించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్‌తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్‌లో తడబడిన లక్ష్య సేన్ ఆ తర్వాత చెలరేగి ఆంథోనీ ఆట కట్టించాడు. డబుల్స్ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా ప్రపంచ నంబర్‌వన్ కెవిన్ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్ మొహమ్మద్ అహసాన్‌లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్ జంటను బోల్తా కొట్టించి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో సింగిల్స్‌లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జొనాథాన్ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 23–21తో గెలుపొంది భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ ఈ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో ఒకదశలో 13–16తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ స్కోరును సమం చేశాడు. అనంతరం 20–21తో వెనుకబడ్డ దశలో మళ్లీ కోలుకొని వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయా న్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. మనం గెలిచాం ఇలా... లీగ్ దశ: గ్రూప్ ‘సి’లో భారత జట్టు వరుసగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీపై 5–0తో... కెనడాపై 5–0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడి గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్: ఐదుసార్లు చాంపియన్ మలేసియాపై భారత్ 3–2తో గెలిచింది. 1979 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి ప్రవేశించి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్: 2016 విజేత డెన్మార్క్‌పై భారత్ 3–2తో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. గెలుపు వీరుల బృందం... థామస్ కప్‌లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. నా అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. వ్యక్తిగత టోర్నీలతో పోలిస్తే టీమ్ ఈవెంట్లలో ఆడే అవకాశం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ఘనతను అందుకోవడం నిజంగా గొప్ప ఘనతగా భావిస్తున్నా. మేం సాధించామని నమ్మేందుకు కూడా కొంత సమయం పట్టింది. జట్టులో ప్రతీ ఒక్కరు బాగా ఆడారు. ఏ ఒక్కరో కాకుండా పది మంది సాధించిన విజయమిది. టీమ్ విజయాల్లో ఉండే సంతృప్తే అది. –కిడాంబి శ్రీకాంత్ ‘అభినందనల జల్లు’ థామస్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. ‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ గెలుపుపై దేశమంతా హర్షిస్తోంది. మన జట్టుకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ గెలుపు వర్ధమాన ఆటగాళ్లకు స్ఫూర్తినందిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా తొలిసారి థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. తొలిసారి థామస్ కప్ గెలవడం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక క్షణం. విజయం సాధించే వరకు పట్టు వదలకుండా, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కిడాంబి శ్రీకాంత్, భారత బృందానికి అభినందనలు. ప్రతిష్ట, సమష్టితత్వం కలగలిస్తేనే విజయం. చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, ప్రణయ్‌లకు కూడా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి ఈ గెలుపు గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్లపై కొంత ఆశలు ఉన్నా ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదు. భారత క్రికెట్‌కు 1983 ప్రపంచకప్ ఎలాంటిదో ఇప్పుడు బ్యాడ్మింటన్‌కు ఈ టోర్నీ విజయం అలాంటిది. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ థామస్ కప్ విజయం చాలా పెద్దది. జనం దీని గురించి మున్ముందు చాలా కాలం మాట్లాడుకుంటారు. భారత బ్యాడ్మింటన్ గర్వపడే క్షణమిది. ఇకపై మన టీమ్ గురించి ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు వ్యక్తిగత పతకాలు గెలవడం కలగా ఉండేది. ప్రిక్వార్టర్స్ చేరినా గొప్పగా అనిపించేది. ఇది వాటికి మించిన ఘనత. దానిని బట్టి చూస్తే ఈ టీమ్ ఎంత గొప్పగా ఆడిందో అర్థమవుతుంది. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ రూ. 2 కోట్ల నజరానా థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1 కోటి, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి రూ. 1 కోటి జట్టు సభ్యులకు ఇవ్వనున్నారు. -
భళా.. కిడాంబి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయాన్ని భారత జట్టు గెలుపొందడం, అందులో గుంటూరుకు చెందిన షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించడంతో ఆదివారం క్రీడాభిమానులు, సహచరులు, కోచ్‌లు ఉద్వేగానికి లోనయ్యారు. శభాష్ శ్రీకాంత్.. అంటూ ప్రశంసలు కురిపించారు. 2018లో ప్రపంచ నంబర్ వన్ స్థానం పొందిన తర్వాత అనేక విజయాలు నమోదు చేసినా, భారత చిరకాల వాంఛ అయిన థామస్ కప్ గెలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. థామస్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ తనదైన శైలిలో ప్రత్యర్థి ఇండోనేషియా ఆటగాడు, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21–15, 23–21 స్ట్రెయిట్ సెట్స్‌లో మట్టికరిపించి తెలుగోడి సత్తా చాటాడు. గుంటూరులో ఉన్న శ్రీకాంత్ తండ్రి కృష్ణను షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సంపత్ కుమార్, డి.శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుంటూరులోనే ఓనమాలు ఏడేళ్ల వయసులో శ్రీకాంత్ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వేసవి శిక్షణకు సరదాగా వచ్చాడు. అప్పుడే అతనిలోని వేగాన్ని గుర్తించిన శిక్షకులు, సీనియర్ ఆటగాళ్లు తల్లిదండ్రులు కృష్ణ, రాధలకు మరింత ఉత్తమ శిక్షణ ఇప్పించాలని సలహా ఇవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్ తల్లిదండ్రులు గుంటూరుతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అడపాదడపా శ్రీకాంత్ గుంటూరుకు రావడం, పాత మిత్రులను కలవడం జరుగుతోంది. ఈ దేశం గర్విస్తోంది.. థామస్ కప్‌లో నా కుమారుడు శ్రీకాంత్ విజయాన్ని దేశం సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో సాధన చేశాడు. దీని కోసం ఎన్నో సరదాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ విశ్రమించకుండా సాధన చేస్తునే ఉంటాడు. శ్రీకాంత్‌ను చూసి మరింత మంది ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను. – కిడాంబి కృష్ణ, శ్రీకాంత్ తండ్రి అద్భుత వేగం అతని సొంతం ఎన్టీఆర్ స్టేడియంలో తొలి నాళ్లలో శ్రీకాంత్ సాధన చేయడం చూశాను. అద్భుత వేగం అతని సొంతం. తోటి పిల్లలతో సరదాగా ఉండడంతో పాటు, ఆట సమయంలో వేరే ధ్యాస లేకుండా దృష్టి సారించే వాడు. విజయం సాధించాలంటే ఏమి చేయాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం చేసేదంతా క్రమశిక్షణతో చేసేవాడు. ఈ రోజు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. క్వార్టర్ ఫైనల్స్ నుంచి మ్యాచ్‌లు గమనిస్తే భారత బృందం కొత్త దూకుడు విధానాన్ని అనుసరించింది. ప్రత్యర్థులు ఇది తెలుసుకునే లోపే విజయం భారత్ సొంతమయ్యింది. – షేక్ అన్వర్ బాషా, షటిల్ కోచ్ ఇదొక చరిత్రే భారత జట్టులోని ఐదుగురిలో నలుగురు తెలుగువారు. అందులో మన గుంటూరు షట్లర్ శ్రీకాంత్ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. అటువంటి క్రీడాకారుడ్ని పొందిన రాష్ట్రం, దేశం గర్వపడుతోంది. మా ముందు ఓనమాలు నేర్చుకున్న పిల్లాడు ఈ రోజు ప్రపంచం మెచ్చే ప్లేయర్‌గా గుర్తింపు పొందడం పట్ల అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులం గర్వంగా ఫీల్ అవుతున్నాం. – సంపత్ కుమార్, షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి -
థామస్ ఉబర్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్
-
చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
బ్యాంకాక్: పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీ 73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు. The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons. — Narendra Modi (@narendramodi) May 15, 2022 "భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. -
నాకౌట్ దశకు భారత్ అర్హత
బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా సోమవారం కెనడా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్ (నాకౌట్ దశ)కు అర్హత పొందింది. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ 5–0తో జర్మనీని ఓడించి భారత్‌తోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్, చైనీస్ తైపీ మధ్య బుధవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. కెనడాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 20–22, 21–11, 21–15తో ప్రపంచ 29వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్‌ను 52 నిమిషాల్లో ఓడించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–12, 21–11తో జేసన్ ఆంథోనీ–కెవిన్ లీ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–15, 21–12తో సంకీర్త్‌ను ఓడించి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని ఇవ్వడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో గారగ కృష్ణప్రసాద్–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–15, 21–11తో డాంగ్ ఆడమ్–ని యకూరా జంటపై నెగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 21–13, 20–22, 21–14తో విక్టర్ లాయ్‌పై గెలవడంతో భారత్ 5–0తో కెనడాను క్లీన్‌స్వీప్ చేసింది. ఉబెర్ కప్‌లో భాగంగా నేడు భారత మహిళల జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో అమెరికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. -
థామస్ కప్–ఉబెర్ కప్‌లో భారత జట్లు శుభారంభం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 5–0తో జర్మనీపై నెగ్గగా... ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 4–1తో కెనడా జట్టును ఓడించింది. జర్మనీతో పోటీలో తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–16, 21–13తో మాక్స్ వీస్కిర్చెన్ను ఓడించగా... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–15, 10–21, 21–13తో జోన్స్ రాల్ఫీ–మార్విన్ సీడెల్ జోడీపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–9, 21–11తో కాయ్ ష్కాఫెర్పై గెలిచి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో అర్జున్ –ధ్రువ్ జోడీ... ఐదో మ్యాచ్‌లో ప్రణయ్ కూడా నెగ్గ డంతో భారత్ 5–0తో జర్మనీని క్లీన్‌స్వీప్ చేసింది. సింధు అలవోకగా... కెనడాతో జరిగిన పోటీలో తొలి సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–17, 21–10తో 11వ ర్యాంకర్ మిచెల్లి లీపై 33 నిమిషాల్లో గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో శ్రుతి మిశ్రా–సిమ్రన్ సింగ్ జంట ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో ఆకర్షి కశ్యప్ ... తనీషా–ట్రెసా జాలీ జంట... అష్మిత నెగ్గడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
సింధు, శ్రీకాంత్‌లకు కాంస్యం.. వ్రిత్తికి రజతం.. ఇంకా...
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 14–21, 17–21తో ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 19–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. సెమీఫైనల్లో ఓడిన సింధు, శ్రీకాంత్‌లకు 5,220 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. ఇతర క్రీడా వార్తలు.. వ్రిత్తి అగర్వాల్‌కు రజతం సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజతం పతకం సాధించింది. అండర్–16 బాలికల ఫ్రీస్టయిల్ 1500 మీటర్ల విభాగం ఫైనల్ రేసును వ్రిత్తి 18 నిమిషాల 06.40 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ‘షూటౌట్’లో భారత్ ఓటమి భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సవిత కెప్టెన్సీలోని భారత జట్టు ‘షూటౌట్’లో 1–3తో ఓడిపోయింది. ఆట తొలి నిమిషంలో రజ్విందర్ కౌర్ గోల్‌తో భారత్ ఖాతా తెరువగా... 53వ నిమిషంలో కెప్టెన్ జాన్సెన్ యిబ్బి గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున నవనీత్ కౌర్ మాత్రమే సఫలంకాగా రజ్విందర్, నేహా, జ్యోతి విఫలమయ్యారు. నెదర్లాండ్స్ జట్టు తరఫున మరాంటె, ఫోర్టిన్ కిరా, జాన్సెన్ సఫలంకాగా... ఫియోనా విఫలమైంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం! -
Korea Open: సింధు, శ్రీకాంత్ జోరు
సన్‌చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 17వ విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–12, 18–21, 21–12తో సన్ వాన్ హో (కొరియా) పై గెలిచాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీ 20–22, 21–18, 20–22తో కాంగ్ మిన్‌హుక్–సియో సెయుంగ్‌జె (కొరియా) జంట చేతిలో... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 19–21, 17–21తో ఎమ్ హై వన్–బో రియోంగ్ కిమ్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయాయి. -
Korea Open: అదరగొట్టిన సింధు, శ్రీకాంత్
సన్‌చెయోన్: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సత్తా చాటుతున్నారు. వీరిద్దరు అలవోక విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే రైజింగ్ స్టార్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. డబుల్స్‌లో ఒక్క సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ తప్ప అంతా ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–15, 21–10తో అయ ఒహొరి (జపాన్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో మాల్విక బన్సోద్ 8–21, 14–21తో ఆరోసీడ్ పొర్న్‌పవీ చొచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–18, 21–6తో మిశా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. ఆరో సీడ్ లక్ష్యసేన్ 20–22, 9–21తో షెసర్ హిరెన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి–అశ్విన్ పొన్నప్ప జంట 20–22, 21–18, 14–21తో ఐదో సీడ్ ఒయు జువాన్ యి–హువాంగ్ య కియంగ్ (చైనా) ద్వయంతో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–15, 21–19తో హి యాంగ్–లో కియాన్ హీన్ (సింగపూర్) జంటపై గెలుపొందగా, రెండో సీడ్ మొహమ్మద్ అసాన్–హెండ్రా సెతియాన్ (ఇండోనేసియా)తో జరిగిన పోరులో అర్జున్–ధ్రువ్ కపిల 8–5 స్కోరు వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. చదవండి: IPL 2022: 150 కిమీ వేగంతో బంతి.. కళ్లు చెదిరే సిక్స్; డికాక్ ఊహించి ఉండడు -
సింధు, శ్రీకాంత్ సులువుగా...
సన్‌చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 40 నిమిషాల్లో 21–15, 21–14తో లౌరెన్ లామ్ (అమెరికా)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 40 నిమిషాల్లో 22–20, 21–11తో డారెన్ లూ (మలేసియా)ను ఓడించాడు. గతంలో డారెన్‌తో ఆడిన మూడుసార్లూ ఓడిన శ్రీకాంత్ నాలుగో ప్రయత్నంలో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ 5–21, 13–21తో రెండో సీడ్ ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–16, 21–15తో తె యాంగ్ షిన్–వాంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21–19, 21–18తో జున్ లియాంగ్ ఆండీ క్వెక్–యుజియా జిన్ (సింగపూర్) జంటపై నెగ్గింది. -
క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
బాసెల్: భారత అగ్రశ్రేణి షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్‌లు కూడా క్వార్టర్స్ చేరగా... వెటరన్ స్టార్ సైన నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21–19, 21–14తో నెస్లిహన్ యిగిట్ (టర్కీ)పై గెలుపొందగా, సైనా నెహ్వాల్ 21–17, 13–21, 13–21తో మలేసియా షట్లర్ కిసొన సెల్వదురై చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 13–21, 25–23, 21–11తో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపొవ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సీనియర్ షట్లర్ కశ్యప్‌కు అదృష్టం కలిసొచ్చి వాకోవర్‌తో ముందంజ వేశాడు. ప్రపంచ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్తో తలపడాల్సిన పోరులో ప్రత్యర్థి బరిలోకి దిగలేదు. దీంతో ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత కశ్యప్ ఒక టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 19–21, 21–13, 21–9తో కలే కోల్జొనెన్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట 19–21, 20–22తో ప్రముద్య కుసుమవర్దన–యెరెమియా రంబితన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై, ప్రణయ్ 25–23, 21–16తో సాయిప్రణీత్ (భారత్)పై, కశ్యప్ 21–17, 21–9తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ (భారత్) 21–8, 21–13తో యెలీ హోయాక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
PV Sindhu: ఏడో ర్యాంకులోనే సింధు.. ఇక సైనా మాత్రం
PV Sindhu- Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఆమె నిలకడగా ఏడో ర్యాంకులోనే కొనసాగుతోంది. గాయాలతో సుదీర్ఘ కాలంగా సతమతమవుతున్న సైనా ఇటీవల బరిలోకి దిగుతోంది. ఈ సీనియర్ షట్లర్ 28వ ర్యాంకులో కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరాడు. అందువల్లే ర్యాంకు మెరుగువుతోంది. కాగా... కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు. సాయిప్రణీత్ 19వ ర్యాంకుకు దిగజారాడు. హెచ్.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మలు వరుసగా 24, 26వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19వ ర్యాంకులో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాయి. చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
జర్మన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ల దూకుడు
జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో వీరిరువురు ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ ఆగ్‌బమ్‌రుగ్ఫన్‌ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు 21-8, 21-7తో ప్రత్యర్ధిని చిత్తు చేసింది. 𝐀𝐚𝐫𝐚𝐦𝐛𝐡 🔥🏸⏰ 2:30 pm IST onwards (Tentative)#GermanOpen2022#Badminton pic.twitter.com/X1K1kP9owX— BAI Media (@BAI_Media) March 8, 2022 పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్.. ఫ్రాన్స్ షట్లర్ బ్రిస్ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇదే టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. స్పెయిన్ అమ్మాయి క్లారా అజుర్మెండితో సైనా.. హాంగ్‌కాంగ్ షట్లర్ ఆంగుస్ కా లాంగ్‌తో ప్రణయ్ పోటీపడాల్సి ఉంది. చదవండి: PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..! -
పుడమితో చెలిమి.. సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నా
సమస్త జీవులకు ఆధారమైన పుడమి, సంక్షోభంలోకి జారుతోంది. పర్యావరణ సమస్యలతో ప్రకృతి తల్లడిల్లిపోతోంది. దీనంతటికీ కారణమైన మనిషి, మేల్కొని ఈ దురవస్థను చక్కదిద్దుకోవాల్సిన అత్యయిక పరిస్థితి ముంచుకొచ్చింది. అందుకే, బాధ్యత కలిగిన సాక్షి మీడియా గ్రూప్ ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పుడమి సాక్షిగా! ‘వాతావరణ మార్పు’ ప్రమాద పరిస్థితులు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవశ్యకత, పర్యావరణ సమతుల్యత సాధనలో ప్రభుత్వాల, కార్పోరేట్ల, పౌర సమాజాల, గ్రామాల, కుటుంబాల, వ్యక్తుల బాధ్యతలేమిటో అవగాహన కల్పించేలా‘పుడమి సాక్షిగా’ రెండో ఎడిషన్ (2022) నిర్వహించాం. ఈ కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రముఖులు, పరిశోధకులు, పర్యావరణవేత్తలు, విధాన నిర్ణేతలు, సినీ నటులు, కవి–గాయకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ, పత్రిక, వెబ్సైట్ వేదికలుగా... గత కొద్ది రోజులుగా మెగా క్యాంపెయిన్ రూపంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 8 గంటల ‘మెగా టాకాథన్’ జరిగింది. నాలుగు ప్రధాన అంశాలు గాలి, నీరు, నేల, శక్తిపై లోతైన చర్చలు ప్రత్యేక ఆకర్షణ! పుడమి సమస్యలు, తీవ్రత, ప్రతికూల ప్రభావాలు, పరిష్కారాలు... ఈ కృషిలో ఆదర్శంగా నిలుస్తోన్న వ్యక్తులు, వ్యవస్థలను ఇందులో ప్రస్తావించారు. అంతులేని కాలుష్యాలు, పాలనా వైఫల్యాలు, పౌర సమాజ నిర్లక్ష్యం వంటి లోపాలను ఎత్తి చూపారు, ప్రకృతిని కాపాడే ఆదర్శ విధానాలు, పద్ధతులను ఎలుగెత్తి చాటారు. అన్ని స్థాయుల్లో ఎవరు... ఏం చేస్తే... పుడమిని కాపాడుకోవచ్చో... విలువైన సమాచారం, ప్రేరణ, స్ఫూర్తి...‘పుడమి సాక్షిగా’ మీ కోసం. ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి.. పుడమి సాక్షిగా పేరుతో సాక్షి మీడియా గ్రూప్ చేపడుతున్న పర్యావరణ కార్యక్రమం హర్షించదగింది. సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ప్రకృతిని మనం ఇప్పుడు కాపాడకపోతే.. భవిష్యత్తు తరాలకు దాన్ని స్వచ్ఛంగా అందించలేం. బాధ్యతాయుతమైన పౌరులుగా భూమాతను కాపాడుకునే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మనందరం ప్రతి సందర్భంలో మొక్కలు నాటితే.. అవి మనకు స్వచ్ఛమైన గాలిని, ఆహారాన్ని ఇస్తాయి. ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి. – బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్, ఏపీ. పుడమిని కాపాడేందుకు సాక్షి మీడియా గ్రూప్ చక్కటి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మన వంతుగా పాల్గొందాం. మూడు సులభమైన మార్గాలను ఎంచుకుందాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ప్రకృతి వనరులను ఇబ్బంది పెట్టకుండా జీవించడం నేర్చుకోవాలి. నీటి వృథాను నివారించడంతోపాటు వర్షపు నీటిని కాపాడుకోవాలి. అలాగే విద్యుత్తును కూడా. చెట్లు మనకెంతో మేలు చేస్తాయి. వాటిని కాపాడుకోవాలి. మరిన్ని చెట్లను పెంచాలి. – పద్మభూషణ్ పి.వి.సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణ పరిరక్షణ. దీన్ని గ్లోబల్ అల్టిమేటంగా చూడాల్సిందే. రాష్ట్రానికి పరిశ్రమలు అవసరమే కానీ దానికోసం భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టొద్దని మా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. మా రాష్ట్రంలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. అది ప్రకృతికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడతామని తెలియజేస్తున్నాను. పెరిగిపోతున్న జనాభా, తరిగి పోతున్న వనరులు, మనిషిలో నిర్లక్ష్యం.. ఇవన్నీ పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం వల్లే. అందుకే పర్యావరణాన్ని పాఠశాల విద్యలో భాగం చేస్తున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి , ఏపీ అందరూ ఈ ఉద్యమంలో కలిసి వస్తే అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను వద్దని చెబితే.. ఎంతో మేలు జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. – శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు పర్యావరణ కాలుష్యం పై ప్రజలకు అవగాహన పెంచడానికి ‘పుడమి సాక్షిగా’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సాక్షి యాజమాన్యానికి అభినందనలు. ప్రకృతిలో జీవిద్దాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఏసీ వినియోగాన్ని తగ్గిద్దాం. చెట్లు నాటితే అవి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. ఫలాలను ఇవ్వడంతోపాటు ఆక్సిజన్‌నూ అందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు పుడమి సాక్షిగా ముందుకు కదులుదాం. – శ్రీకాంత్ కిడాంబి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఒకవైపు అభివృద్ధి, మరో వైపు పర్యావరణం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత తీసుకు రావాలన్న సీఎం ఆశయంలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రీస్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాం. సామాజిక స్పృహకలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దని చెబుతున్నాం. ప్రజలలో అవగాహన కల్పించేందుకు సాక్షి మీడియా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. -విజయ్‌కుమార్, మెంబర్ సెక్రటరీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ -
India Open: ఏడుగురు ప్లేయర్లకు కరోనా.. టోర్నీ నుంచి అవుట్
India Open Badminton 7 Players Test Covid Positive: భారత బ్యాడ్మింటన్ శిబిరంలో కరోనా కలకలం రేగింది. ఇండియా ఓపెన్- 2022 పోటీల్లో పాల్గొనే ఏడుగురు షట్లర్లకు కోవిడ్ సోకింది. వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ సహా పలువురికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కాగా.. ‘‘నిబంధనల్లో భాగంగా నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ టెస్టులో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది’’ అని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ కారణంగా వీళ్లంతా టోర్నీ నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లను పక్కకుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా కథనం ప్రచురించింది. కాగా బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్రీడల పోటీల్లో పాల్గొనే వారందరికీ ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి టెస్టింగ్ ప్రోటోకాల్‌లు అమలు చేశారు. ఇక ఇండియా ఓపెన్ రెండో రౌండ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో వీరిద్దరూ తొలి రౌండ్లో అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 21–10తో సిరిల్ వర్మ (భారత్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–5, 21–16తో కుదరవల్లి శ్రీకృష్ణప్రియ (భారత్)పై గెలిచింది. భారత్‌కే చెందిన అష్మిత చాలియా 24–22, 21–16తో ఐదో సీడ్ ఎవగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)పై సంచలన విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ (భారత్) జంట 21–12, 21–10తో ప్రొజొరోవా–రుదకోవా (ఉక్రెయిన్) జోడీపై నెగ్గి ముందంజ వేసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–సాయిప్రతీక్ (భారత్) ద్వయం 21–16, 16–21, 21–17తో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీపై... సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట 21–11, 21–11తో చిరాగ్ అరోరా–నిషు రాప్రియా (భారత్) ద్వయంపై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. -
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ షురూ.. బరిలో సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: రెండేళ్లుగా కోవిడ్ పడగ విప్పడంతో రద్దయిన ‘ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్–500’ టోర్నమెంట్ ఈ ఏడాది నిర్వహణకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ మేటి ఈవెంట్లో సత్తా చాటేందుకు మాజీ చాంపియన్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సహా పలువురు స్టార్లు సై అంటున్నారు. అయితే భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ క్రియాశీలం కావడంతో థర్ట్ వేవ్ (కోవిడ్ మూడో ముప్పు) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కఠిన ప్రొటోకాల్ ప్రకారం పకడ్బందీగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఆర్గనైజర్లు గట్టి చర్యలు చేపట్టారు. కోర్టుల్లో ఆటగాళ్లు, కోర్టు వెలుపల సిబ్బంది తప్ప ప్రేక్షకుల స్టాండ్లలో ఎవరూ కనిపించరు. టీవీల్లో తప్ప వేదిక వద్ద చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ భారత స్టార్లు సహా విదేశీ టాప్ స్టార్లు, ప్రపంచ చాంపియన్ షట్లర్లు ఇండియా ఓపెన్ ఆడేందుకు ఇది వరకే భారత్ చేరుకున్నారు. ప్రపంచ పురుషుల చాంపియన్ లో కియన్ వీ (సింగపూర్), మలేసియా టాప్‌స్టార్స్ ఒంగ్ వి సిన్, టియో యియి, ఇండోనేసియా చాంపియన్లు మొహమ్మద్ అసాన్, హెండ్రా సెతివాన్ తదితరుల ఆటతో ఇందిరా గాంధీ స్టేడియం కళకళలాడనుంది. 2017 ఇండియా ఓపెన్ విజేత అయిన సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన ఉత్సాహంతో ఉండగా, 2015 చాంపియన్ శ్రీకాంత్ ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరు మరోసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాలనే పట్టు దలతో ఉన్నారు. సింధు తొలి రౌండ్లో సహచర క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియతో, పురుషుల టాప్ సీడ్ శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లో భారత సహచరుడు సిరిల్ వర్మతో తలపడనున్నాడు. -
సీఎం జగన్ సహకారం మరువలేనిది..
తిరుపతి మంగళం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ చెప్పారు. శుక్రవారం తిరుపతికి వచ్చిన ఆయన ఎంపీ గురుమూర్తిని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు ఎంపీ గురుమూర్తి సహకారంతో తిరుపతిలో ఐదెకరాల స్థలాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించడం అభినందనీయమన్నారు. తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలా యువతను చాంపియన్స్‌గా తీర్చిదిద్దుతానన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించేందుకు పట్టుదలతో కృషి చేస్తానని శ్రీకాంత్ చెప్పారు. -
స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్ సత్కారం
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో.. 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అమూల్‌లో పాలు పోసే రైతులే యజమానులు -
షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్ సత్కారం
-
సిరిల్ వర్మతో శ్రీకాంత్ తొలి పోరు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు జరిగే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ తన తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌కు చెందిన సిరిల్ వర్మ (భారత్)తో ఆడతాడు. సెమీఫైనల్ వరకు చేరుకోవడం శ్రీకాంత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీఫైనల్లో శ్రీకాంత్‌కు ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్) ఎదురవుతాడు. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో లో కీన్ యు చేతిలోనే శ్రీకాంత్ ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. మరో భారత షట్లర్ సాయిప్రణీత్ తన తొలి మ్యాచ్‌లో లూయిస్ ఎన్రిక్ (స్పెయిన్)తో ఆడనున్నాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్న తెలుగు తేజం పీవీ సింధుకు సులువైన ‘డ్రా’ లభించింది. భారత్‌కే చెందిన శ్రీ కృష్ణప్రియతో సింధు తన తొలి మ్యాచ్ ను ఆడుతుంది. ఈ ఏడాది మొత్తం గాయాలతో ఇబ్బంది పడ్డ సైనా నెహ్వాల్... ఆరంభ మ్యాచ్‌లో ఐరిస్ వాంగ్ (అమెరికా)తో ఆడుతుంది. చదవండి: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్ -
అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..!
Kidambi Srikanth Returns To Top 10 World Rankings: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం, మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. రెండేళ్ల తర్వాత తిరిగి టాప్-10లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని పదో ర్యాంక్‌లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మరో భారత షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంక్(17)ను అందుకోగా, హెచ్ఎస్ ప్రణయ్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 𝗥𝗔𝗡𝗞𝗜𝗡𝗚 𝗨𝗣𝗗𝗔𝗧𝗘𝗦 😍🔥@srikidambi entered 🔝 10 after 2 years@lakshya_sen achieved career high ranking@P9Ashwini & @sikkireddy entered top 20@PRANNOYHSPRI moved 6 ranks 🆙 Keep up the good work guys! 👊#IndiaontheRise#Badminton 📸 Badminton Photo pic.twitter.com/UOHHIRi96W — BAI Media (@BAI_Media) December 21, 2021 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కి జోడీ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 20వ స్థానంలో నిలిచింది. కాగా, తాజాగా జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు చేరుకొని రజత పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు మరో భారత షట్లర్ లక్ష్యసేన్ సైతం సెమీస్‌కు చేరుకుని కాంస్య పతకం గెలిచాడు. చదవండి: హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు కాంస్యం -
తప్పులు సరిదిద్దుకోవాలి: గోపీచంద్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్‌పై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకుని వరుస మ్యాచ్‌లలో విజయం సాధించడం శుభపరిణామం అన్నాడు. అయితే, ఈ ఏడాది ఆరంభంలో శ్రీకాంత్‌లో ఆత్మవిశ్వాసం తక్కువగా కనిపించిందన్న గోపీచంద్.. టోర్నీలు ఆడుతున్నకొద్దీ ఆట మెరుగు కావడంతో తనపై తనకు నమ్మకం పెరిగిందని తెలిపాడు. సరైన సమయంలో చెలరేగి విజయం సాధించాడని... అయితే వచ్చే ఏడాది మరిన్ని టోర్నీలు గెలవాలంటే శ్రీకాంత్ తాను చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని గోపీచంద్ సూచించాడు. ఏదేమైనా ఈ టోర్నీలో శ్రీకాంత్‌తో పాటు లక్ష్య సేన్, ప్రణయ్‌ల ప్రదర్శన పట్ల కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించగా.. లక్ష్యసేన్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! Kidambi Srikanth 🇮🇳 and Loh Kean Yew 🇸🇬 are as cool as cucumbers in this spectacular rally.#TotalEnergiesBadminton #BWFWorldChampionships #Huelva2021 pic.twitter.com/0FS7OzBCb1 — BWF (@bwfmedia) December 20, 2021 -
"వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధిస్తా"
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇకపై కూడా ఇదే జోరు కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. స్పెయిన్ నుంచి స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతకంపై... ఎవరికైనా ప్రపంచ చాంపియన్‌షిప్ విజయం ఎంతో ప్రత్యేకం. నాకూ చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయి పెద్ద టోర్నీలో విజయం అంత సులువుగా దక్కదు. విజేతగా నిలవకపోయినా ఫైనల్ ఆడటం కూడా ఎంతో గొప్ప ఘనతగా భావిస్తున్నా. 2017లోనే పతకం గెలుస్తానని భావించినా అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడం కూడా మేలు చేసింది. వచ్చే ఏడాది ప్రణాళికలపై... విజయాల జోరు కొనసాగించడంతో పాటు అవసరమైన చోట లోపాలు సరిదిద్దుకొని ఆటను మరింత మెరుగుపర్చుకోవడం ముఖ్యం. రాబోయే 8–10 నెలలు నా కెరీర్లో ఎంతో కీలకం. జనవరి 10 నుంచి జరిగే ఇండియా ఓపెన్‌తో 2022లో మళ్లీ టైటిల్స్ వేటలో పడతా. అనంతరం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రాణించడం ముఖ్యం. ఆపై కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లు ఉన్నాయి. నా గాయాల బాధ పూర్తిగా తప్పినట్లే. నేనిప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఒలింపిక్స్ ఆడలేకపోవడంపై... టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కరోనా కారణంగా కనీసం తొమ్మిది క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు రద్దు కావడం దెబ్బ తీసింది. ఆరంభ టోర్నీల్లో గాయం కారణంగా ఆడలేకపోగా, కోలుకొని కోర్టులో దిగే సరికి కోవిడ్ వచ్చేసింది. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. అయితే ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినంత మాత్రాన ప్రపంచం ముగిసిపోలేదని భావించా. ఇకపై ఎలా ఆడాలనే దానిపైనే దృష్టి పెట్టి మంచి ఫలితం సాధించా -
కిడాంబి శ్రీకాంత్‌కు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో రజతం నెగ్గిన స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్‌కు అభినందనలు. రజతంతో చరిత్రకెక్కావు. నీ విజయం మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to @srikidambi for winning a historic Silver Medal. This win will inspire several sportspersons and further interest in badminton. https://t.co/rxxkBDAwkP— Narendra Modi (@narendramodi) December 20, 2021 కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
World Badminton Championship: భారత్‌కు రజత, కాంస్యాలు.. ప్రైజ్‌మనీ మాత్రం ఉండదు!
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు లక్ష్య సేన్. అయితే, తన ప్రదర్శన పట్ల మాత్రం సంతృప్తిగా లేనని, వచ్చే ఏడాది స్వర్ణ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ పసిడి గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోగా... సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్) కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లోభారత్ ఖాతాలో ఒకేసారి రజత, కాంస్య పతకాలు చేరాయి. ఇలా జరగడం ఇది రెండోసారి. అంతకుముందు... 2017లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్ కాంస్యం సాధించారు. ఈసారి పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పతకాలు సాధించారు. కాగా ఈ మెగా టోర్నీలో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్‌మనీ ఉండదు. సంతోషమే.. కానీ.. పతకం గెలిచిన లక్ష్య సేన్ మాట్లాడుతూ... ‘చరిత్ర సృష్టించడానికి చేరువగా వచ్చి సెమీఫైనల్లో ఓడటం బాధగా ఉంది. ఏదైతేనేం... నాకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం దక్కింది. అయితే నేను ఈ పతకంతో సంతృప్తి చెందడంలేదు. ఓవరాల్‌గా టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఆడుతున్నప్పటికీ... కాంస్యం సాధించి నా గురువు ప్రకాశ్ పదుకొనే సరసన నిలవడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని పేర్కొన్నాడు. -
వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన తొలి భారత ఆటగాడు..
‘స్వర్ణ ప్రపంచాన్ని’ అందుకోవాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చివరకు రజత సంబరం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ విశ్వవిజేతగా అవతరించలేకపోయాడు. సింగపూర్‌కు చెందిన 24 ఏళ్ల లో కీన్ యుతో జరిగిన తుది పోరులో శ్రీకాంత్ ఓటమి రుచి చూసి రన్నరప్‌గా నిలిచాడు. శ్రీకాంత్ ఆటలో అడపాదడపా మెరుపులు కనిపించినా కీలకదశలో అనవసర తప్పిదాలు అతడిని పసిడి పతకానికి దూరం చేశాయి. హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ తుది మెట్టుపై తడబడ్డాడు. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో శ్రీకాంత్ రజత పతకం సొంతం చేసుకోగా... లో కీన్ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్), ఆంటోన్సెన్ (డెన్మార్క్)లకు కాంస్య పతకాలు లభించాయి. ఆధిక్యంలోకి వెళ్లి... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో లో కీన్ యుపై వరుస గేముల్లో గెలిచిన 28 ఏళ్ల శ్రీకాంత్ ఈసారి కూడా గెలుపు రుచి చూస్తాడనిపించింది. ఆరంభంలో జంపింగ్ స్మాష్‌లు, నెట్ ఫ్లిక్ షాట్లతో అలరించిన శ్రీకాంత్ 9–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే గత నాలుగేళ్లలో ఎంతో మెరుగుపడ్డ లో కీన్ యు ఈసారి శ్రీకాంత్ ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించింది. 3–9తో వెనుకబడ్డా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా నిగ్రహంతో ఆడిన లో కీన్ యు నెమ్మదిగా గాడిలో పడ్డాడు. శ్రీకాంత్ సంధించిన స్మాష్‌లను లో కీన్ యు అద్భుతంగా డిఫెండ్ చేశాడు. శ్రీకాంత్ కూడా అనవసర తప్పిదాలు చేయడం సింగపూర్ షట్లర్‌కి కలిసి వచ్చింది. నిలకడగా పాయింట్లు స్కోరు చేసిన లో కీన్ యు ఎట్టకేలకు 11–11తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లో కీన్ యు జోరు పెంచగా శ్రీకాంత్ ఒత్తిడికి లోనై చాలా షాట్లు నెట్‌పైకి, బయటకు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. దాంతో లో కీన్ యు తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. తప్పిదాలతో మూల్యం... రెండో గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ దశలో శ్రీకాంత్ 9–6తో ముందంజ వేసినా ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ స్కోరు వద్ద లో కీన్ యు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు శ్రీకాంత్ ఆధిక్యంలోకి రావడం... అంతలోనే చేసిన అనవసర తప్పిదాలతో లో కీన్ యు మళ్లీ పుంజుకోవడం జరిగింది. ఈ క్రమంలో లో కీన్ యు 20–18తో ముందంజ వేశాడు. శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేశాడు. అయితే వెంటనే లో కీన్ యు రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ప్రపంచ చాంపియన్ అయ్యాడు. సూపర్ ఫినిష్... మలేసియాలోని పెనాంగ్ నగరంలో పుట్టిన లో కీన్ యు తన 13వ యేట కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో సింగపూర్ బృందానికి పతాకధారిగా వ్యవహరించిన లో కీన్ యు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన తొలి సింగపూర్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న లో కీన్ యు విశ్వవిజేతగా నిలిచిన క్రమంలో అద్భుత విజయాలు అందుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించిన లో కీన్ యు సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై, ఫైనల్లో మాజీ వరల్డ్ నంబర్‌వన్ శ్రీకాంత్‌పై గెలిచి తన విజయం గాలివాటం కాదని నిరూపించాడు. టైటిల్ గెలిచే క్రమంలో లో కీన్ యు తన ప్రత్యర్థులకు కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. ఈ వారం అద్భుతంగా గడిచింది. ఫైనల్లో రెండు గేముల్లోనూ నేను మంచి స్థితిలో ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఈ ఓటమితో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తాను. పాజిటివ్‌గా ఆడాలనే ఆలోచనతో బరిలోకి దిగాను. అనవసర తప్పిదాలతో చికాకు కలిగింది. అయితే మ్యాచ్ అన్నాక ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. నాలుగేళ్ల క్రితం చివరిసారి లో కీన్ యుతో తలపడ్డాను. అప్పటికి ఇప్పటికి అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. వాస్తవానికి నేను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడతానో లేదోననే అనుమానం కలిగింది. ఈనెల 12న టోర్నీ మొదలవ్వగా 6వ తేదీ వరకు నాకు వీసా లభించలేదు. ఈ ఏడాది ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఉన్నాయి. ఈ అనుభవంతో వచ్చే ఏడాది మంచి ఫలితాలు సాధిస్తానని విశ్వాసంతో ఉన్నాను. –కిడాంబి శ్రీకాంత్ -
కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,అమరావతి: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సింగిల్స్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడిగా కిడాంబి శ్రీకాంత్ సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశం గర్విస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఉజ్వలమైన కెరీర్‌తో పాటు మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. Many congratulations to our Telugu shutler @srikidambi on winning historic silver after a hard-fought final in BWF World Championship 2021. Wishing him all the best for a bright career and many more laurels in the future. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 19, 2021 గవర్నర్ అభినందనలు బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కిడాంబి శ్రీకాంత్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి : శభాష్ శ్రీకాంత్... -
BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్..
హుఎల్వా (స్పెయిన్): వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ -
శభాష్ శ్రీకాంత్...
ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విశ్వకిరీటాన్ని అందుకునేందుకు విజయం దూరంలో నిలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం అద్వితీయ ఆటతీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ సమరంలో తుదకు అనుభవజ్ఞుడైన శ్రీకాంత్‌దే పైచేయిగా నిలిచింది. లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్రకాశ్ పదుకొనే (1983), సాయిప్రణీత్ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. హుఎల్వా (స్పెయిన్): ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ అందర్నీ అలరించింది. 69 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 21–14, 21–17తో భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఘనత వహించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడా లోటును తీర్చుకోవడానికి అతడు కేవలం విజయం దూరంలో నిలిచాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యె (సింగపూర్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్ ఫైనల్ నేటి సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే అవకాశముంది. అన్ని విభాగాల ఫైనల్స్‌ను స్టార్ స్పోర్ట్స్–3, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హోరాహోరీగా... అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి శ్రీకాంత్, లక్ష్య సేన్ తలపడగా... ప్రతీ పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా శ్రీకాంత్ కళ్లు చెదిరే రీతిలో స్మాష్‌లు సంధించాడు. అయితే శ్రీకాంత్ సంధించిన స్మాష్‌లకు అంతే చాణక్యంగా లక్ష్య సేన్ తిప్పి కొట్టాడు. 17 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతోనే లక్ష్య సేన్ ఖాతాలో ఎక్కువ పాయింట్లు చేరాయి. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ అలసిపోయినట్లు కనిపించాడు. రెండో గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 6–9తో వెనుకబడినా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. డ్రాప్ షాట్లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన శ్రీకాంత్ 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ రెండో గేమ్‌ను 21 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. తుదకు ఈ సుదీర్ఘ ర్యాలీలకు కళ్లు చెదిరే షాట్లతో ముగింపు ఇస్తూ వీరిద్దరు తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. చివరి గేమ్‌లో రెండుసార్లు శ్రీకాంత్ వెనుకంజ వేసినా వెంటనే తేరుకొని స్కోర్లను సమం చేశాడు. స్కోరు 16–16 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఒత్తిడికి లోనైన లక్ష్య సేన్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీకాంత్ రిటర్న్ షాట్‌ను లక్ష్య సేన్ నెట్‌కు కొట్టడంతో గేమ్‌తోపాటు మ్యాచ్ శ్రీకాంత్ వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన మూడో భారతీయ ప్లేయర్ శ్రీకాంత్. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడుసార్లు (2017, 2018–రన్నరప్; 2019–విన్నర్), సైనా నెహ్వాల్ ఒకసారి (2015–రన్నరప్) ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు. -
44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర...
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్‌లో తొలిసారి భారత ప్లేయర్ ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్‌లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది. హుఎల్వా (స్పెయిన్): రెండు నెలల క్రితం థామస్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ టోర్నీ మ్యాచ్‌లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడతారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచాడు. జున్ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ ప్రణయ్ కూడా గెలిచి ఉంటే భారత్‌కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్ ఫైనల్లో కీన్ యియు (సింగపూర్) 21–14, 21–12 తో ప్రణయ్‌ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో పోరుకు సిద్ధమయ్యాడు. సింధుకు నిరాశ... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్ పదుకొనే (1983లో), సాయిప్రణీత్ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్‌లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే, సాయిప్రణీత్ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు. -
కిడాంబి శ్రీకాంత్ రిటర్న్స్..!
సాక్షి క్రీడా విభాగం: నాలుగేళ్ల క్రితం... కిడాంబి శ్రీకాంత్ కొట్టిందే స్మాష్... గెలిచిందే టైటిల్! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో 2017లో అతను ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్... ఈ నాలుగు ఫైనల్ మ్యాచ్‌లలో కూడా సంపూర్ణ ఆధిపత్యం... ఏ ప్రత్యర్థి చేతిలోనూ ఒక్క గేమ్ కూడా ఓడకుండా శ్రీకాంత్ ఈ విజయాలు సాధించాడు. ఇలాంటి ప్రదర్శన ఫలితంగానే 2018 ఏప్రిల్‌లో వారం రోజుల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా అతను నిలిచాడు. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆట లయ తప్పింది... పేలవ ప్రదర్శనతో అన్సీడెడ్లు, అనామకుల చేతిలో వరుస పరాజయాలు, మధ్యలో ఇబ్బంది పెట్టిన మోకాలి గాయం, టైటిల్ సంగతి తర్వాత, ఆరంభ రౌండ్లు దాటితే చాలనే పరిస్థితి ఒకదశలో కనిపించింది. గత నాలుగేళ్లలో ఒకే ఒక టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అతను అర్హత సాధించలేకపోయాడు. ఒక రకంగా మళ్లీ ‘సున్నా’ నుంచి మొదలు పెట్టాల్సిన స్థితిలో శ్రీకాంత్ నిలిచాడు. అయితే అతను వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో సత్తా చాటి మళ్లీ పైకి లేచాడు. ఒక్కో టోర్నీకి తన ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం సాధించి తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. నవంబర్‌లో హైలో ఓపెన్ (జర్మనీ)లో శ్రీకాంత్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గత రెండేళ్లలో అతనికి ఇదే తొలి సూపర్–500 సెమీఫైనల్. మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఎన్నో ఏళ్ల క్రితం నేను తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినప్పుడు కలిగిన భావనే ఇప్పుడూ వచ్చింది. మళ్లీ కొత్తగా మొదలు పెడుతున్నట్లుంది’ అని వ్యాఖ్యానించడం ఈ ప్రదర్శన విలువేమిటో చెబుతుంది. మోకాలి గాయంతో 2019లో శ్రీకాంత్ ప్రదర్శన ఆశించిన రీతిలో సాగలేదు. అతని బలమైన అటాకింగ్ గేమ్ కూడా బాగా దెబ్బతింది. ఆ ఏడాది ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచినా, ఓవరాల్‌గా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. దాంతో గాయానికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు శ్రీకాంత్ సిద్ధమయ్యాడు. సర్జరీ తర్వాత మళ్లీ ఆటను మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రపంచాన్ని కరోనా చుట్టేసింది. తాను కోరుకున్నా ఆడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రీహాబిలిటేషన్పైనే దృష్టి పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ షట్లర్ 2020 అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్‌తో మళ్లీ బరిలోకి దిగి క్వార్టర్ ఫైనల్ చేరగలిగాడు. అయితే మోకాలు మాత్రం భయపెడుతూనే ఉంది. ‘గాయం నుంచి కోలుకున్నా సరే, ‘స్మాష్’కు ప్రయత్నిస్తే మళ్లీ ఏమైనా జరగవచ్చేమో అనే సందేహం శ్రీకాంత్ మనసులో ఏదో ఓ మూల వెంటాడుతూనే ఉంది. అందుకే తన శైలికి భిన్నమైన డిఫెన్స్ తరహా ఆటకు కూడా అతను ప్రయత్నించాడు. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2021లో ఆడిన తొలి ఆరు టోర్నీలలోనూ ఇది కనిపించింది’ అని భారత జట్టు కోచ్‌లలో ఒకడైన సియాదతుల్లా చెప్పాడు. స్పెయిన్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ పతకం ఖరారైనా... ఈ సెప్టెంబర్‌లో మొదలైన యూరోపియన్ సర్క్యూట్‌తోనే శ్రీకాంత్ ఆట ఒక్కసారిగా మారింది. 2021లో అతని ఆటను రెండుగా విభజించి చూస్తే రెండో దశలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు ఆరు నెలల విరామం తర్వాత సాగిన ఈ కొత్త ప్రయాణంలో శ్రీకాంత్ ఆట కూడా కొత్తగా కనిపించింది. ఇన్నాళ్లూ వేధించిన గాయం సమస్యను అతను అధిగమించి పూర్తి ఫిట్‌గా ఒకప్పటి శ్రీకాంత్‌ను గుర్తుకు తెచ్చాడు. డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్లలో వరుసగా రెండుసార్లు వరల్డ్ నంబర్‌వన్ మొమొటా చేతిలో ఓడినా శ్రీకాంత్ ఆట మాత్రం గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా కనిపించింది. ఫ్రెంచ్ ఓపెన్లోనైతే రెండు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని, ఆపై వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి మ్యాచ్‌ను మూడో గేమ్ వరకు తీసుకెళ్లడంతో అతనిలో ఆత్మవిశ్వాసం కూడా ఎంతో పెరిగింది. హైలో ఓపెన్‌లో లాంగ్ ఆంగస్‌పై గెలిచిన తీరు నిజంగా సూపర్. ఆపై బాలిలో జరిగిన మూడు టోర్నీల్లో మరింత స్వేచ్ఛగా ఆడాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గ్వాంగ్ జుతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లోనే శ్రీకాంత్ దూకుడు కనిపించగా, క్వార్టర్స్‌లో కాల్జూను ఓడించిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. శ్రీకాంత్ తాజా ప్రదర్శన భవిష్యత్తులో అతను మరిన్ని ప్రతిష్టాత్మక విజయాలు సాధించగలడనే నమ్మకాన్ని కలిగించడం శుభపరిణామం! -
సెమీస్ కు చేరిన కిదాంబి శ్రీకాంత్.. పతకం ఖాయం!
స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో కిదాంబి శ్రీకాంత్.. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన డచ్ ఆటగాడు మార్క్ కల్జౌను 21-8, 21-7 తేడాతో ఓడించాడు. కేవలం 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ చిత్తు చేశాడు. దీంతో సెమీస్ కు చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. కాగా అంతకుముందు మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో పీవీ సింధు.. తైపీ షట్లర్ తైజుయింగ్ చేతిలో 21-17, 21-13 తేడాతో ఓటమి చెందింది. చదవండి: Rohit Sharma: యువ క్రికెటర్లకు రోహిత్ పాఠాలు.. ఫోటోలు వైరల్! -
సింధు, శ్రీకాంత్ ముందుకు...
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ వేటను భారత స్టార్ పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ తెలుగు తేజం మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 21–7, 21–9తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై అలవోకగా గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సింధు కేవలం 24 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి కథను ముగించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ ర్యాంక్‌లో ఉన్న రెపిస్కా కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించింది. తొలి గేమ్‌లో స్కోరు 5–4 వద్ద సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా 12 పాయింట్లు గెలిచి 17–4తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో గేమ్‌లోనూ ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తన జోరు కొనసాగించింది. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ముందంజ వేసిన సింధు అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ చోచువోంగ్ (థాయ్ లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 4–3తో ఆధిక్యంలో ఉంది. చెమటోడ్చి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, భారత యువతార లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చోటు సంపాదించారు. రెండో రౌండ్ అడ్డంకిని దాటడానికి వీరిద్దరూ తీవ్రంగా శ్రమించారు. ప్రపంచ 63వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–18, 21–17తో గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయి రెండో గేమ్‌లో ఒకదశలో 6–9తో వెనుకంజలో ఉన్నాడు. ఈ దశలో శ్రీకాంత్ చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అదే ఉత్సాహంలో శ్రీకాంత్ రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 10–13తో వెనుకబడిన దశలో మళ్లీ విజృంభించాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–13తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గట్టెక్కాడు. 82 నిమిషాల్లో... ప్రపంచ 17వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 15–21, 21–18తో విజయం సాధించాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 13–10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని లక్ష్య సేన్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లూ గ్వాంగ్ జు (ౖచైనా)తో శ్రీకాంత్; కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)తో లక్ష్య సేన్ తలపడతారు. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సాత్విక్–చిరాగ్ ద్వయం 43 నిమిషాల్లో 27–25, 21–17తో లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో అనుష్క పారిఖ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 8–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
శ్రీకాంత్ శుభారంభం.. తొలి రౌండ్లోనే సాయిప్రణీత్‌కు షాక్
World Badminton Championship: Kidambi Srikanth Wins First Round (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–12, 21–16తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 7–21, 18–21తో 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 16–21, 15–21తో జోయెల్ ఎల్పీ–రస్ముస్ జార్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. చదవండి: KS Bharat Century: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ భారీ ధర కన్ఫర్మ్ -
PV Sindhu: అందని ద్రాక్ష.. సింధు సాధించేనా!
BWF World Tour Finals PV Sindhu Handed Good Draw Eyes On Semis: ఈ ఏడాది అందని ద్రాక్షగా ఉన్న అంతర్జాతీయ టైటిల్ కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి ప్రయత్నించనుంది. డిసెంబరు 1 నుంచి మొదలయ్యే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ సింధుకు సులువైన ‘డ్రా’నే పడింది. ఆమె తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్ చేరుకోవడం ఖాయమే. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిది మంది క్రీడాకారిణులను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో సింధు, పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్), లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్), వైవన్ లీ (జర్మనీ)... గ్రూప్ ‘బి’లో అకానె యామగుచి (జపాన్), బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్), ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా), జియా మిన్ యె (సింగపూర్) ఉన్నారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. తొలి మ్యాచ్‌లో లైన్ క్రిస్టోఫర్సన్తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప పోటీపడనున్నారు. చదవండి: IPL Retention: ఈ 27 మంది ఓకే.. మరి ఆ ఆరు స్థానాలు.. వార్నర్, రాహుల్, రషీద్, గిల్ ఇంకా -
PV Sindhu: సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం...
Indonesia Open- PV Sindhu Kidambi Srikanth Sai Praneeth Enters 2nd Round: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ శుభారంభం చేశారు. బుధవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టోర్నీ మూడో సీడ్ సింధు 17–21, 21–17, 21–17తో జపాన్ షట్లర్ అయా ఒహోరిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–15, 19–21, 21–12తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై, సాయి ప్రణీత్ 21–19, 21–18తో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి ద్వయం 27–29, 18–21తో గ్యాబ్రియెల్ స్టొయెవా– స్టిఫాని స్టొయెవా (బల్గేరియా) జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్–అశ్విని పొన్నప్ప (భారత్) 24–22, 12–21, 19–21తో టకురో హోకి– నమి మత్సుయమ (జపాన్) చేతిలో, ధ్రువ్ కపిల–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 7–21, 12–21తో యమషిటా–నరు షినోయ (జపాన్) జంట చేతిలో ఓడారు. చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునేది వీళ్లనే..! -
Indonesia Masters Super-750: సింధు, శ్రీకాంత్ ఓటమి
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ సింధు కేవలం 32 నిమిషాల్లో 13–21, 9–21తో ఓటమి చవిచూసింది. యామగుచి చేతిలో సింధు ఓడటం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత సింధు ఆడిన మూడో టోర్నీలోనూ సెమీఫైనల్ దశ దాటలేదు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 41 నిమిషాలపాటు జరిగిన జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ శ్రీకాంత్ 14–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. సెమీస్‌లో ఓడిన సింధు, శ్రీకాంత్‌లకు 8,400 డాలర్ల (రూ. 6 లక్షల 23 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
Kidambi Srikanth: సెమీఫైనల్లో శ్రీకాంత్
Kidambi Srikanth: హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–11, 12–21, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడతాడు. ఆకాశ్‌కు కాంస్యం బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్ 0–5తో మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన ఆకాశ్‌కు 25 వేల డాలర్ల (రూ. 18 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్
Kidambi Srikanth.. హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 15వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–10తో43వ ర్యాంకర్ కొకి వతనాబె (జపాన్)పై గెలిచాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) 21–16, 17–21, 7–21తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయాడు. -
సింధు శుభారంభం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు (భారత్) 21–12, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై నెగ్గగా... సమీర్ వర్మ 21–17, 21–14తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 14–21, 21–17, 21–18తో ప్రపంచ 25వ ర్యాంక్ జోడీ హూ పాంగ్ రోన్–చె యి సీ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 23–21, 21–15తో హెమింగ్ –స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్)లపై, అర్జున్–ధ్రువ్ 21–19, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 11–21తో గోసెఫె –నూరు జుద్దీన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
స్పెయిన్‌తో మహిళలు... నెదర్లాండ్స్‌తో పురుషులు...
అర్హస్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. థామస్ కప్‌లో పురుషుల జట్టు... ఉబెర్ కప్‌లో మహిళల జట్టు మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యాయి. నేడు జరిగే తమ ఆరంభ పోటీల్లో గూప్ ‘సి’లో ఉన్న భారత పురుషుల టీమ్ నెదర్లాండ్స్‌తో... గ్రూప్ ’బి’లో ఉన్న మహిళల జట్టు స్పెయిన్‌తో తలపడనున్నాయి. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టిలతో కూడిన భారత పురుషుల టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో పటిష్ట చైనా ఉన్నప్పటికీ... నెదర్లాండ్స్, తాహిటిలపై గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పోటీలో ఉండగా... వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లోనూ టాప్–2లో నిలిచిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. మహిళల టోర్నీ ఉబెర్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్ ప్రత్యర్థులు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీకి దూరమవ్వడం మహిళల జట్టుకు ప్రతికూల అంశం. సైనా నెహ్వాల్, గాయత్రి గోపిచంద్, డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిల ఆటతీరుపైనే మహిళల జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. -
ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు
చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత మహిళా చెస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌లోనూ టైటిల్ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్’ ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి, లెరాయ్ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్ బాబు, మురళీధరన్ పేర్లను ‘బాయ్’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది. -
'ఖేల్‌రత్న' రేసులో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌ల పేర్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) ప్రతిపాదించింది. అలాగే మరో ముగ్గురు షట్లర్ల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ జెర్రీ చోప్రా, సమీర్ వర్మలను అర్జున అవార్డు బరిలో నిలిపింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్ మురళీధరన్, పీయూ భాస్కర్ల పేర్లను కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. వీరిలో మురళీధరన్‌కు ఇప్పటికే ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే, 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్.. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వాలిఫై అయిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ విషయానికొస్తే.. ఈ స్టార్ షట్లర్ ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అతను టోక్యో బెర్తు కూడా సాధించలేకపోయాడు. కిదాంబి శ్రీకాంత్ చివరిసారిగా 2017లో నాలుగు టైటిల్స్ సాధించాడు. కాగా, ఈ అవార్డు కోసం క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, రవిచంద్రన్ అశ్విన్ నామినేట్ కాగా, ఆర్చరీలో వన్నెం జ్యోతి సురేఖ, ఫుట్‌బాల్‌లో సునీల్ ఛెత్రీ, టీటీలో శరత్ కమల్, జావలీన్ త్రోలో నీరజ్ చోప్రా తదితరులు నామినేట్ అయ్యారు. -
Saina Nehwal, Kidambi Srikanth: సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టోక్యో ఒలిం పిక్స్‌కు అర్హత పొందలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యేలోపు ఎలాంటి క్వాలిఫయింగ్ టోర్నీలు నిర్వహించడంలేదని... జూన్ 15వ తేదీ ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్‌లు ఖరారు చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో... శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. దాంతో భారత్ నుంచి సింధు, సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల డబుల్స్‌లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్ ఖరారయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో ఉండగా... శ్రీకాంత్ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్‌కు టోక్యో బెర్త్ ఖాయమైంది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరగా... 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన శ్రీకాంత్ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్!
కౌలాలంపూర్: మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో భాగమైన మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే. మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోరింది. -
క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా 18–21, 21–15, 21–10తో మరీ బటోమెనె (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గింది. 51 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా... అనంతరం పుంజుకొని తర్వాతి రెండు గేముల్లోనూ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఐరా శర్మ (భారత్) 21–18, 21–13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై గెలిచి క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 22–20తో చెమ్ జునే వీ (మలేసియా)పై గెలిచాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ పోరుల్లో అర్జున్– ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–11, 21–12తో రోరీ ఇస్టోన్–జాక్ రస్ జంట (ఇంగ్లండ్)పై, కృష్ణ ప్రసాద్– విష్ణువర్ధన్ (భారత్) జోడీ 21–7, 21–13తో క్రిస్టియన్ క్రెమర్–మార్కస్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–12, 21–18తో కాల మ్ హెమ్మింగ్–విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్ చేరింది. సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 7–21తో నిక్లాస్ నోర్– అమలీ మెగెలండ్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడింది. -
శ్రీకాంత్, కశ్యప్ ఇంటిముఖం
బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ (భారత్) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 11–21, 21–15, 12–21తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) చేతిలో... కశ్యప్ 13–21, 20–22తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. సింధు 21–11, 21–17తో సోనియా (మలేసియా)పై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–14, 21–12 తో బెన్యాప–నుంతకామ్ (థాయ్‌లాండ్) జోడీపై... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–10తో నిఖర్ గార్గ్ (ఇంగ్లండ్)–అనిరుధ (భారత్) జంటపై గెలిచాయి. టోర్నీకి ముందు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో ముగ్గురు భారత ఆటగాళ్లకు, సహాయక సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రాగా... మంగళవారం మళ్లీ నిర్వహించిన పరీక్షలలో అందరికీ నెగెటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. -
సింధు, శ్రీకాంత్ జోరు
బాసెల్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే దిశగా భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ మరో అడుగు వేశారు. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్పన్ (థాయ్‌లాండ్)తో 59 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 23–21తో గెలిచింది. బుసానన్‌పై సింధుకిది 12వ విజయం కావడం విశేషం. కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో నెగ్గాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాళ్లు సాయిప్రణీత్ 14–21, 17–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... అజయ్ జయరామ్ 9–21, 6–21తో కున్లావుత్ విదిత్సరన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు; విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ ఆడతారు. డబుల్స్ సెమీస్‌లో సాత్విక్ జంట పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 12–21, 21–19, 21–12తో ఒంగ్ యెవ్ సిన్–తియో ఈ యి (మలేసియా) జోడీపై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 17–21, 21–16, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశం -
మళ్లీ ఓడిన సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నిరాశ పరిచారు. సీజన్‌కు సంబంధించిన ఈ ముగింపు టోర్నీలో లీగ్ దశతోనే సరిపెట్టుకున్నారు. ప్రపంచ చాంపియన్ సింధు, మాజీ ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో వీరిద్దరు సెమీస్ చేరుకునే అవకాశాలు గల్లంతయ్యాయి. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి సింధు 18–21, 13–21తో మాజీ ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. గత వారం ఇదే ప్రత్యర్థి చేతిలో థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఓడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు ఈ మ్యాచ్‌లోనూ తన ఆటతీరును, ఫలితాన్ని మార్చుకోలేకపోయింది. ప్రపంచ చాంపియన్‌పై మూడో సీడ్ రచనోక్‌కు ఇది ఆరో విజయం. వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటివరకు పది సార్లు తలపడితే సింధు 4 సార్లు మాత్రమే గెలిచింది. తొలి గేమ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభంలో అయితే సింధు దూకుడుగా ఆడటంతో 4–2తో మొదలైన ఆమె ఆధిక్యం 14–11 దాకా కొనసాగింది. ఈ దశలో రచనోక్ వరుసగా మూడు పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. క్రమంగా సింధుపై తన ఆధిపత్యం చలాయిస్తూ 21–18తో గేమ్ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సింధు పట్టు కోల్పోయింది. ఇదే అదనుగా రచనోక్ 9–8 స్కోరు వద్ద వరుసగా మూడు పాయింట్లు గెలుచుకుంది. వెంటనే సింధు కూడా మూడు పాయింట్లు చేసినప్పటికీ తర్వాత థాయ్‌లాండ్ స్టార్... సింధుకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగి ఆడింది. దీంతో ఈ గేమ్, మ్యాచ్ గెలిచేందుకు ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. పరాజయంపై సింధు మాట్లాడుతూ ‘ఈ రోజు నాది కాదు. నాకేం కలిసిరాలేదు. తొలి గేమ్ ఓడిపోవడం... తర్వాత నేను వెనుకబడటంతో మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు’ అని పేర్కొంది. పురుషుల ఈవెంట్ గ్రూప్ ‘బి’లో భారత స్టార్ శ్రీకాంత్ 21–19, 9–21, 19–21తో నాలుగో సీడ్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. వాంగ్ జుపై శ్రీకాంత్‌కు 3–0తో మంచి రికార్డే ఉంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్ తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. కానీ రెండో గేమ్‌ను చిత్తుగా కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ పోరాటం చేసినప్పటికీ వాంగ్ జు ఆ అవకాశం ఇవ్వలేదు. గంటా 18 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. నేటి నామ మాత్రమైన మ్యాచ్‌లో సింధు... పోర్న్‌పవి (థాయ్‌లాండ్)తో, శ్రీకాంత్... క లంగ్ అంగుస్ (హాంకాంగ్)తో తలపడతారు. -
ఓటమితో మొదలు...
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు శుభారంభం లభించలేదు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో మహిళల, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఇద్దరికీ ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ సింధు 21–19, 12–21, 17–21తో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–15, 16–21, 18–21తో 77 నిమిషాల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. తై జు యింగ్ చేతిలో సింధుకిది 13వ ఓటమికాగా... ఆంటోన్సెన్ చేతిలో శ్రీకాంత్‌కు రెండో పరాజయం. నేడు జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు... వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతారు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌ల్లో సింధు, శ్రీకాంత్ గెలవాల్సి ఉంటుంది. తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్ లో గెలిచినా ఆ తర్వాత అదే జోరు కనబర్చలేకపోయింది. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి 0–5 తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరు ప్రతి పాయింట్ కోసం పోరాడటంతో ఆట హోరాహోరీగా సాగింది. ఒకదశలో సింధు 13–14తో తై జు యింగ్ ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. ఈ దశలోనే తై జు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తై జు యింగ్ విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘మ్యాచ్ బాగా జరిగింది. ఏ పాయింట్ కూడా సులువుగా రాలేదు. మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య పాయింట్ల అంతరం ఒక పాయింట్‌కు చేరుకుంది కూడా. అయితే ర్యాలీల సందర్భంగా రెండుసార్లు నా రాకెట్ స్ట్రింగ్స్ దెబ్బతినడం తుది ఫలితంపై ప్రభావం చూపింది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆంటోన్సెన్తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కీలకదశలో తప్పిదాలు చేశాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 17–16తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకొని తేరుకోలేకపోయాడు. -
శ్రీకాంత్ ఆరో‘సారీ’...
ఒడెన్స్: ఏడు నెలల తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 22–20, 13–21, 16–21తో ఓడిపోయాడు. చౌ తియెన్ చెన్ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. శ్రీకాంత్ ఏకైకసారి 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్పై గెలిచాడు. ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో తలపడిన ఆరుసార్లూ (2015 వరల్డ్ సూపర్‌సిరీస్ ఫైనల్స్; 2017 వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్; 2018 చైనా ఓపెన్; 2019 ఫ్రెంచ్ ఓపెన్; 2020 మలేసియా మాస్టర్స్ టోర్నీ; 2020 డెన్మార్క్ ఓపెన్) శ్రీకాంత్‌ను పరాజయమే పలకరించింది. 62 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... రెండో గేమ్ నుంచి ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ తడబడ్డాడు. ఒకదశలో 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. నిర్ణాయక మూడో గేమ్ లోనూ తియెన్ చెన్ పైచేయి సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 4,125 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీకాంత్ జోరు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత అగ్రశ్రేణి షట్లర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా... లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–15, 21–14తో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–15, 7–21, 17–21తో హాన్స్ క్రిస్టియాన్ సోల్బెర్గ్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. దూకుడే మంత్రంగా... 33 నిమిషాల పాటు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌లోనే 9–4తో జోరు కనబరిచిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు 11–8తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 17–9తో దూసుకెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆరంభంలో శ్రీకాం త్ 5–8తో వెనుకబడ్డాడు. ఈ దశలో పుంజుకున్న అతను వరుసగా 6 పాయింట్లు స్కోర్ చేసి 11–8తో రేసులోకి వచ్చాడు. జేసన్ 10–11తో శ్రీకాంత్‌ను సమీపించాడు. మరోసారి ధాటిగా ఆడిన శ్రీకాంత్ 15–11... 19–11తో ప్రత్యర్థిపై దాడి చేసి విజయా న్ని దక్కించుకున్నాడు. నేడు జరుగనున్న క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్–2 ఆటగాడు చౌ టియాన్ చెన్ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్ తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్
ఒడెన్స్: దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు శుభారంభం లభించింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–18తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో కాస్త పోటీ లభించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌లో ఉన్న శ్రీకాంత్ ముఖాముఖి కెరీర్లో టోబీ పెంటీపై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు వీరిద్దరు 2013 థాయ్‌లాండ్ ఓపెన్‌లో తలపడగా... శ్రీకాంత్ వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)తో శ్రీకాంత్ తలపడతాడు. తొలి రౌండ్లో జేసన్ 21–13, 21–18తో భారత్‌కు చెందిన శుభాంకర్ డేను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. మూడో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 12–21, 14–21తో పరాజయం పాలయ్యాడు. ‘తొలి గేమ్‌లో చక్కగా ఆడాను. రెండో గేమ్‌లో టోబీ పుంజుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టి కోర్టులో అడుగుపెట్టాను. ఇదో సాహసకార్యంలా అనిపిస్తోంది. గతంలో ఏనాడూ నేనింతకాలం మ్యాచ్‌లు ఆడకుండా విరామం తీసుకోలేదు. మొత్తానికి శుభారంభం చేసినందుకు ఆనందంగా ఉంది. కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. నా అత్యుత్తమ ఫామ్‌ను అందుకోవాలంటే కొంత సమయం పడుతుంది. చివరిసారి నేను మార్చిలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడి తొలి రౌండ్లోనే ఓడిపోయాను. డెన్మార్క్ ఓపెన్ తర్వాత ఈ సీజన్లో మరే టోర్నీలోనూ ఆడటంలేదు. కరోనా సమయంలో లభించిన విరామాన్ని ఆస్వాదించాను. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే గడిపాను. ఆ తర్వాత ఆగస్టు తొలివారంలో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాను. ఈ టోర్నీలో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తా. జనవరి నుంచి తాజాగా సీజన్‌ను మొదలుపెడతా’ అని గుంటూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. -
బ్యాడ్మింటన్‌కు వేళాయె!
ఒడెన్స్ (డెన్మార్క్): కరోనా వైరస్ కారణంగా మార్చి నెల రెండో వారం నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సందడి మొదలుకానుంది. నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ జరగనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు లక్ష్య సేన్, అజయ్ జయరామ్, శుభాంకర్ డే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సరైన సన్నాహాలు లేని కారణంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టోబీ పెంటీ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; జేసన్ ఆంథోనీ (కెనడా)తో శుభాంకర్; అండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో అజయ్ జయరామ్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో లక్ష్య సేన్ ఆడనున్నారు. -
సారథులుగా శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనే 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. పురుషుల జట్టును ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3నుంచి 11వరకు జరుగనున్న ఈ టోర్నీలో కశ్యప్, లక్ష్యసేన్, శుభాంకర్, సిరిల్ వర్మ, మను అత్రి, సుమీత్ రెడ్డి, అర్జున్, ధ్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మోకాలి గాయం కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డిలతో పాటు మాల్విక బన్సోద్, ఆకర్షి కశ్యప్, పూజ, సంజన సంతోష్, పూర్వీషా రామ్, జక్కంపూడి మేఘన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మేరకు సెప్టెంబర్ 3–27 వరకు శిబిరం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో అకాడమీలోనే ఉంటూ ప్రాక్టీస్ చేసేందుకు కొందరు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. పైగా క్యాంప్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటీన్ తప్పనిసరి కావడంతో అంత సమయం లేదని భావించిన ‘బాయ్’ మొత్తం శిబిరాన్నే రద్దు చేసింది. థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ అనంతరం జరుగనున్న డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 13–18), డెన్మార్క్ మాస్టర్స్ (అక్టోబర్ 20–25) టోర్నీల్లోనూ శ్రీకాంత్, లక్ష్యసేన్, సింధు, సైనా, అశ్విని, సిక్కిరెడ్డి ఆడనున్నారు. -
శ్రీకాంత్‌పై అనుగ్రహం.. ప్రణయ్‌పై ఆగ్రహం
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) శుక్రవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ షట్లర్, ప్రపంచ 12వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ పేరును ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం సిఫారసు చేసింది. మరోవైపు ‘అర్జున’ అవార్డు కోసం తన పేరును పంపకపోవడం పట్ల బహిరంగ విమర్శ చేసిన కేరళ ఆటగాడు, ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తప్పును అంగీకరించిన శ్రీకాంత్... గత ఫిబ్రవరిలో మనీలాలో జరిగిన ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్ మ్యాచ్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ చివరి నిమిషంలో తప్పుకొని బార్సిలోనాలో మరో టోర్నీ ఆడేందుకు వెళ్లిపోయారు. భారత్ సెమీస్‌లో పరాజయం పాలై పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. దీనిని క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తూ ‘బాయ్’ అవార్డుల కోసం వీరిద్దరి పేర్లను పరిశీలించకుండా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు ‘బాయ్’ అతడిని క్షమించేసింది. ‘శ్రీకాంత్ తన తప్పు ఒప్పుకుంటూ మాకు మెయిల్ పంపించాడు. భవిష్యత్తులో మళ్లీ ఇలా చేయనని హామీ ఇచ్చాడు. అతని ప్రతిభ, ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఖేల్‌రత్నకు అతని పేరును ప్రతిపాదించాం’ అని ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. మరోవైపు ప్రణయ్ మాత్రం పదే పదే ‘బాయ్’పై విమర్శలకు దిగుతున్నాడని ఆయన అన్నారు. అర్జున అవార్డుకు తనను కాకుండా సమీర్ వర్మ పేరును ప్రతిపాదించడంతో అసంతృప్తి చెందిన ప్రణయ్ ‘మళ్లీ అదే పాత కథ’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ప్రణయ్‌ను వివరణ కోరినట్లు సింఘానియా చెప్పారు. ‘గతంలోనూ ప్రణయ్ ఇలాగే చేశాడు. కానీ మేం చూసీ చూడనట్లు వదిలేశాం. ఈసారి మాత్రం అతని ప్రవర్తన మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే షోకాజ్ నోటీసు జారీ చేశాం. సంతృప్తికర సమాధానం ఇస్తే సరి. లేదంటే అతనిపై గట్టి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
శ్రీకాంత్ ఆట ముగిసె...
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ పూసర్ల వెంకట సింధు ముందంజ వేసింది. పురుషుల కేటగిరీలో శ్రీకాంత్ ఆట తొలి రౌండ్‌తోనే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో స్టార్ షట్లర్, ఆరో సీడ్ సింధు 21–14, 21–17తో బీవెన్ జాంగ్ (అమెరికా)పై గెలుపొందింది. ఈ పోరులో సింధు నిలకడైన ఆటతీరు కనబరిచింది. ఆఖరి దాకా పైచేయి సాధించిన భారత స్టార్ వరుస గేముల్లో 42 నిమిషాల్లో ఈ ఆటను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 15–21, 16–21తో చైనాకు చెందిన మూడో సీడ్ చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జెర్రి చోప్రా ద్వయం 13–21, 21–11, 17–21తో చైనా టాప్ సీడ్ ద్వయం జెంగ్ సి వీ– హ్యుయంగ్ య కియోంగ్ చేతిలో పరాజయం పాలైంది. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం సిక్కి–అశ్విని పొన్నప్ప జంట ముందంజ వేసింది. భారత జోడీ 5–4తో ఆధిక్యంలో ఉన్న దశలో జెన్నీ మూర్–విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) జంట రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకుంది. -
శ్రీకాంత్‌కు షాకిచ్చిన జయరామ్
బార్సిలోనా: కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ తడబడ్డాడు. బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ 68వ ర్యాంకర్ అజయ్ జయరామ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 28 నిమిషాల్లో 6–21, 17–21తో ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ (భారత్) 21–14, 16–21, 21–15తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహా్వల్ (భారత్) 21–10, 21–19తో మరియా ఉలిటినా (ఉక్రెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశి్వని (భారత్) జంట 18–21, 14–21తో గాబ్రియెలా–స్టెఫానీ (బల్గేరియా) జోడీ చేతిలో... మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 16–21, 21–16, 13–21తో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయాయి. -
సైనా, శ్రీకాంత్ శుభారంభం
బార్సిలోనా (స్పెయిన్): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్... బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21–16, 21–14తో వైవోని లి (జర్మనీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 23–21, 21–18తో శుభాంకర్ డే (భారత్)ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 18–21, 15–21తో డారెన్ లియు (మలేసియా) చేతిలో ఓడిపోగా... వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ మూడో గేమ్‌లో 12–14 స్కోరు వద్ద గాయంతో వైదొలిగాడు. జయరామ్ 21–14, 21–12తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) పై, సమీర్ వర్మ 21–12, 21–9తో క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 10–21, 21–16, 21–17తో క్రిస్టియాన్సెన్–బోయె (డెన్మార్క్) జోడీపై గెలిచింది. -
సైనా, శ్రీకాంత్‌లకు సవాల్
బార్సిలోనా (స్పెయిన్): ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ల కోసం పోరాడుతున్న భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బార్సిలోనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచిన వీరిద్దరూ... 2020 సీజన్‌ను కూడా వరుస వైఫల్యాలతో ఆరంభించారు. సైనా నెహ్వాల్ ఈ ఏడాది ఆడిన మూడు టోర్నీల్లో ఒక్కసారి మాత్రమే తొలి రౌండ్ అడ్డంకిని దాటగా... శ్రీకాంత్ ఆడిన మూడు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడాడు. ప్రస్తుతం ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో సైనా 22వ స్థానంలో ఉండగా... శ్రీకాంత్ 26వ స్థానంలో ఉన్నాడు. అయితే క్వాలిఫయింగ్ గడువు ఏప్రిల్‌తో ముగియనుండటంతో... వీరిద్దరూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే గడువు తేదీ నాటికి టాప్–16లో చేరాల్సిన అవసరం ఉంది. దాంతో ఈ టోర్నీతో పాటు తర్వాత జరిగే మరో ఆరు టోర్నీలలో సైనా, శ్రీకాంత్‌లు మెరుగైన ప్రదర్శన చేసి తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. మహిళల విభాగంలో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో వైన్నె లీ (జర్మనీ)తో ఐదో సీడ్ సైనా; పురుషుల తొలి రౌండ్ మ్యాచ్‌లో శుభాంకర్ డే (భారత్)తో శ్రీకాంత్ తలపడతారు. రెండో సీడ్‌గా బరిలో దిగాల్సిన ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మిషా జిల్బెర్‌మ్యాన్ (ఇజ్రాయిల్)తో సౌరభ్ వర్మ (భారత్); వైగోర్ కొయెల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్ (భారత్); లియూ డారెన్ (మలేసియా)తో హెచ్ఎస్ ప్రణయ్ ఆడతారు. -
బ్యాంకాక్ వెళ్లారు...తొలి రౌండ్లో ఓడేందుకు!
బ్యాంకాక్: భారత అగ్రశ్రేణి షట్లర్లు సహా అందరూ థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నీలో నిరాశపరిచారు. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. దీంతో టోర్నీ మెయిన్ ‘డ్రా’ మొదలైన రోజే భారత్ కథ ముగిసింది. మెరుగైన ర్యాంకింగ్ ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఆ స్థాయి ఆటతీరేమీ పోటీల్లో కనబర్చలేదు. ఇలా వెళ్లారు... అలా ఓడారు... అన్నట్లు తమ మ్యాచ్‌ల్ని ముగించుకొని కోర్టుల నుంచి బయట పడ్డారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్, ఐదో సీడ్ సైనా 13–21, 21–17, 15–21తో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లైన్ హోజ్మార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) చేతిలో తొలిసారి ఓడిపోయింది. గతంలో జార్స్‌ఫెల్డ్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఒక్క రెండో గేమ్‌లో మాత్రమే చక్కగా ఆడగలిగింది. మిగతా రెండు గేముల్లో చేతులెత్తేసింది. గతవారం జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ ఈవెంట్లోనూ ఆమె తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత్ స్టార్ శ్రీకాంత్ 21–12, 14–21, 12–21తో షెసర్ హెరెన్ రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్లోనే చుక్కెదురవడం ఐదో సీడ్ తెలుగు షట్లర్‌కు వరుసగా ఇది మూడోసారి. మలేసియా, ఇండోనేసియా టోరీ్నల్లోనూ అతను మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. సమీర్ 16–21, 15–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ని్రష్కమించాడు. ప్రణయ్ 17–21, 22–20, 19–21తో ల్యూ డారెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ఒక దేశం నుంచి ఇద్దరు షట్లర్లు అర్హత పొందాలంటే ఒలింపిక్ ర్యాంకింగ్స్‌లో ఆ ఇద్దరు టాప్–16లో ఉండాలి. ప్రస్తుతం భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో సింధు... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ మాత్రమే ‘టోక్యో’ దారిలో ఉన్నారు. -
పీబీఎల్‌కు వేళాయె...
చెన్నై: భారత స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ గైర్హాజరీలో... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్‌కు సోమవారం తెర లేవనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సభ్యురాలిగా ఉన్న హైదరాబాద్ హంటర్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌స్టార్స్ జట్టు తలపడుతుంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రితో పీవీ సింధు తలపడుతుంది. మొత్తం రూ. ఆరు కోట్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో అవధ్ వారియర్స్, బెంగళూరు రాప్టర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్, పుణే సెవెన్ ఏసెస్ జట్లు టైటిల్ కోసం బరిలో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ తరఫున హైదరాబాద్ ప్లేయర్, ప్రపంచ చాంపియన్íÙప్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ పోటీపడుతున్నాడు. ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌తో లీగ్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. -
సాయిప్రణీత్, శ్రీకాంత్ ఇంటిముఖం
కౌలాలంపూర్: టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ కొత్త సీజన్‌ను పరాజయంతో ప్రారంభించారు. మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో సాయిప్రణీత్, శ్రీకాంత్‌లతోపాటు మరో తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 11–21, 15–21తో ప్రపంచ 19వ ర్యాంకర్ రస్ముస్ జెమ్కె (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 17–21, 5–21తో రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్ కశ్యప్ 17–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. రస్‌ముస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. గతేడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండు గేముల్లోనూ ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయి ఆ తర్వాత కోలుకోలేకపోయాడు. మరోవైపు చౌ తియెన్ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కేవలం 30 నిమిషాల్లో చేతులెత్తేశాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రం కేవలం ఐదు పాయింట్లు సాధించాడు. అయితే భారత్‌కే చెందిన సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 21–16, 21–15తో వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై... ప్రణయ్ 21–9, 21–17తో కాంటా సునెయామ (జపాన్)పై గెలిచారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెంటో మొమోటాతో ప్రణయ్; లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహా్వల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–15, 21–13తో ఎవ్‌గెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై... సైనా 21–15, 21–17తో లియాన్ తాన్ (బెల్జియం)పై విజయం సాధించారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సైనా పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 10–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
గుంటూరుకు రుణపడి ఉంటా
గుంటూరు వెస్ట్: బంగారు భవిష్యత్ ఇచ్చిన గుంటూరుకు రుణపడి ఉంటానని అంతర్జాతీయ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్–2019 ప్రదానం చేశారు. ఈ సందరర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తన క్రీడా ప్రస్థానం ఇక్కడే ప్రారంభమైందన్నారు. జిల్లాకు తప్పకుండా ఏదొకటి చేస్తానని ప్రకటించారు. జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు దేశానికి పేరు తెచ్చారన్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు స్పాన్సర్స్ సహకారమందించాలని సూచించారు. రోటరీ క్లబ్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అనంతరం శ్రీకాంత్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు వెంకట శేషకృష్ణ, రాధా ముకుందలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మీడియా ఇన్చార్జ్ కోయ సుబ్బారావు, రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షుడు జీ సుధాకర్, కార్యదర్శి షేక్ కాలేషావలి, కోశాధికారి పీ శివప్రసాద్, సాంబశివరావు పాల్గొన్నారు. -
రెండో రౌండ్లోనే ఇంటిముఖం..
గ్వాంగ్జు(కొరియా): భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నమెంట్లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో శ్రీకాంత్ 14-21, 19-21 తేడాతో కంటా సునేయామా(జపాన్)చేతిలో పరాజయం చవిచూశాడు. సునేయామాతో తొలిసారి తలపడిన శ్రీకాంత్ ఎటువంటి వరుస రెండు గేమ్‌లు సమర్పించుకుని ఓటమి పాలయ్యాడు. కేవలం 37 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు. తొలి గేమ్‌ను దారుణగా కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్ చివర్లో కాస్త ప్రతిఘటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన శ్రీకాంత్.. అప్పట్నుంచీ తిరిగి గాడిలో పడటానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం నమోదు చేయడం లేదు. ఇక భారత షట్లర్ సమీర్ వర్మ కథ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. దక్షిణకొరియాకు చెందిన కిమ్ డాంగన్ చేతిలో సమీర్ పరాజయం చెందాడు. డాంగన్ 21-19, 21-12 తేడాతో సమీర్‌ను బోల్తా కొట్టించాడు. -
శ్రీకాంత్ శుభారంభం
గ్వాంగ్జు (కొరియా): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–18, 21–17తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్’ సమీర్, సౌరభ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సకాయ్ కజుమసా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో సమీర్ వర్మ తొలి గేమ్‌లో 11–8తో ఆధిక్యంలో ఉన్న దశలో కజుమసా గాయంతో వైదొలిగాడు. జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 12–21, 13–21తో కిమ్ డాంగ్‌హున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
అయ్యో...శ్రీకాంత్!
హాంకాంగ్: తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) నుంచి వాకోవర్ లభించడం... కీలక క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) గాయంతో వైదొలగడం... వెరసి ఎనిమిది నెలల తర్వాత ఓ టోర్నీ లో సెమీఫైనల్ చేరే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ భారంగా నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 23–25తో ప్రపంచ 27వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి గేమ్‌లోనైతే పూర్తిగా గతి తప్పిన అతను రెండో గేమ్‌లో తేరుకున్నాడు. నిలకడగా ఆడుతూ ఒకదశలో 20–15తో ఐదు గేమ్ పాయింట్లను సంపాదించాడు. మరో పాయింట్ గెలిస్తే మ్యాచ్‌లో నిలిచే స్థితిలో తీవ్ర ఒత్తిడికి లోనైన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకున్నాడు. స్కోరు 20–20తో సమమైన దశలో శ్రీకాంత్ మళ్లీ పాయింట్ గెలిచి 21–20తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 21–21తో స్కోరు మళ్లీ సమమయ్యాక శ్రీకాంత్ మరో పాయింట్ గెలిచి 22–21తో ఏడోసారి గేమ్ పాయింట్ సంపాదించాడు. అయితే లీ చెయుక్ పట్టుదలతో పోరాడి స్కోరును 22–22తో, ఆ తర్వాత 23–23తో సమం చేశాడు. ఈ దశలో లీ చెయుక్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌కు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది 14 టోర్నమెంట్లలో పాల్గొన్న శ్రీకాంత్... ఐదు టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్‌కు, మూడు టోరీ్నల్లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, ఒక టోరీ్నలో ఫైనల్‌కు, మరో టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరుకొని నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్లో ని్రష్కమించాడు. ఈ సీజన్లో మరో రెండు టోరీ్నలకు శ్రీకాంత్ ఎంట్రీలను పంపించాడు. ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే కొరియా మాస్టర్స్ టోర్నీలో, ఈనెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే సయ్యద్ మోడీ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ బరిలోకి దిగుతాడు. -
శ్రీకాంత్‌కు నిరాశ
పారిస్: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 7–21, 14–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... కశ్యప్ 11–21, 9–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 84 నిమిషాల్లో 22–20, 18–21, 18–21తో నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయారు. సైనా శుభారంభం... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహా్వల్ 23–21, 21–17తో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా 13–21, 18–21తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా అడ్కాక్ (ఇంగ్లండ్) చేతిలో... అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–చే యుజుంగ్ (కొరియా) చేతిలో పరాయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 21–14తో జెలీ మాస్–రాబిన్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 19–21, 22–20, 15–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–16, 13–21, 17–21తో లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సైనా, శ్రీకాంత్‌లకు షాక్
ఒడెన్స్: ఈ సీజన్లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు మరోసారి నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ ఇద్దరు మాజీ చాంపియన్స్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 15–21, 21–23తో సయాక తకహాషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్ టోరీ్నల్లో బరిలోకి దిగని శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 14–21, 18–21తో నాలుగో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. 2017 ప్రపంచ చాంపియన్íÙప్లో ఆంటోన్సెన్పై ఇదే స్కోరుతో శ్రీకాంత్ గెలుపొందడం విశేషం. గత రెండేళ్లలో ఆంటోన్సెన్ ఆటతీరులో ఎంతో పురోగతి కనిపించింది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్, బార్సిలోనా మాస్టర్స్, యూరోపియన్ గేమ్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన ఆంటోన్సెన్ ప్రపంచ చాంపియన్íÙప్లో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ సమీర్ వర్మ 21–11, 21–11తో సునెయామ (జపాన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 21–16, 21–11తో మారి్వన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై నెగ్గింది. రెండో సీడ్ వాంగ్ యి లియు–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి సాతి్వక్ సాయిరాజ్–అశి్వని పొన్నప్ప జంట వాకోవర్ ఇచి్చంది. -
మొదలైంది వేట
గత ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు పతకాలు అందించిన స్టార్ క్రీడాకారిణులు పూసర్ల వెంకట (పీవీ) సింధు, సైనా నెహ్వాల్ మరోసారి పతకాల వేట ప్రారంభించారు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సింధు, సైనా అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. మరోవైపు డబుల్స్ విభాగంలో భారత జోడీల పోరాటం ముగిసింది. బాసెల్ (స్విట్జర్లాండ్): అందని ద్రాక్షగా ఉన్న పసిడి పతకం అందుకోవాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఐదో సీడ్ పీవీ సింధు, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–14, 21–15తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై... సైనా 21–10, 21–11తో సొరాయ డివిష్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్‌లో సింధుకు అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలో 11–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది. రెండో గేమ్‌లో పాయ్ యు పో తేరుకునే ప్రయత్నం చేసినా సింధు దూకుడు పెంచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు; 12వ సీడ్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) 16–21, 19–21తో హాన్ చెంగ్ కాయ్–హావో డాంగ్ జౌ (చైనా) చేతిలో... అర్జున్–శ్లోక్ 14–21, 13–21తో లియు చెంగ్–నాన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని 20–22, 16–21తో ఏడో సీడ్ డు యువె–లిన్ యిన్ హుయ్ (చైనా) చేతిలో... మేఘన–పూర్వీషా 8–21, 18–21తో షిహో తనాక–కొహారు (జపాన్) చేతిలో ఓడారు. శ్రీకాంత్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ శ్రీకాంత్ (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)తో జరిగిన రెండో రౌండ్లో శ్రీకాంత్ 13–21, 21–13, 21–16తో నెగ్గాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్; ఆంథోని (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; కాంతాపోన్(థాయ్‌లాండ్)తో శ్రీకాంత్ పోటీపడతారు. -
శ్రమించి... శుభారంభం
పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణ తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలి రౌండ్ అడ్డంకిని శ్రమించి అధిగమించారు. శ్రీకాంత్, ప్రణయ్ ఒక్కో గేమ్ కోల్పోయి విజయాన్ని అందుకోగా... సాయిప్రణీత్ వరుస గేముల్లో గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకదశలో ఊహించని ఫలితం వస్తుందేమోననే అనుమానం కలిగినా... సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చిన భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా దాటారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత పదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 19వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్, ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఈ మెగా ఈవెంట్లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 66 నిమిషాల్లో 17–21, 21–16, 21–6తో ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై... సాయిప్రణీత్ 40 నిమిషాల్లో 21–17, 21–16తో 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో–షుయె (కెనడా)పై... ప్రణయ్ 59 నిమిషాల్లో 17–21, 21–10, 21–11తో 93వ ర్యాంకర్ ఈటూ హీనో (ఫిన్లాండ్)పై విజయం సాధించారు. గత ప్రపంచ చాంపియన్‌షిప్ తొలి రౌండ్లోనూ ఎన్‌హట్ ఎన్గుయెన్‌తోనే ఆడిన శ్రీకాంత్ నాడు రెండు గేముల్లో గెలుపొందగా... ఈసారి మాత్రం మూడు గేముల్లో గట్టెక్కాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. అయితే స్కోరు 17–16 వద్ద ఒక్కసారిగా విజృంభించిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కోచ్ పుల్లెల గోపీచంద్ తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడాలని శ్రీకాంత్‌కు సూచించాడు. తొలి పాయింట్ కోల్పోయాక... శ్రీకాంత్ తన జోరు పెంచాడు. స్మాష్‌లతో చెలరేగిపోయాడు. ఫలితంగా వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), చైనా దిగ్గజం లిన్ డాన్, నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), ఆరో సీడ్ ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా), ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా (భారత్) జంట 21–10, 21–18తో డయానా–నిక్తె సోటోమేయర్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. -
ప్రణీత్ ఒక్కడే క్వార్టర్స్‌కు
బ్యాంకాక్: టైటిల్ వేటలో భారత షట్లర్ల ఆటలు థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ సాగడంలేదు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే కంగుతిన్నారు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500’ టోర్నమెంట్లో ఇప్పుడు భారత్ ఆశలన్నీ భమిడిపాటి సాయిప్రణీత్‌పైనే ఉన్నాయి. ఈ అన్‌సీడెడ్ షట్లర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి చుక్కెదురైంది. సాయి ప్రణీత్ అలవోక విజయం మిగతా భారత షట్లర్లకు విదేశీ ఆటగాళ్లు ఎదురుకాగా... సాయిప్రణీత్‌తో సహచరుడు శుభాంకర్ డే తలపడ్డాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను వరుస గేముల్లో 21–18, 21–19తో శుభాంకర్‌పై గెలుపొందాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శుభాంకర్ ప్రతీ గేమ్‌లోనూ పోరాడాడు. కానీ అతనికంటే మేటి ఆటగాడైన ప్రణీత్ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–11, 16–21, 12–21తో స్థానిక ఆటగాడు కొసిట్ ఫెప్రదబ్ చేతిలో కంగుతిన్నాడు. మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ధాటికి 21–9, 21–14తో పారుపల్లి కశ్యప్ నిలువలేకపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ ఆటను జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటో వరుస గేముల్లోనే ముగించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరోసీడ్ నిషిమోటో 21–17, 21–10తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు. సైనా పోరాటం సరిపోలేదు మహిళల సింగిల్స్‌లో సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ విజయంతో టచ్‌లోకి వచ్చింది. తర్వాత గేమ్‌లలో పోరాడే ప్రయత్నం చేసినా... జపాన్ ప్రత్యర్థి సయాక తకహాషి జోరు ముందు అదేమాత్రం సరిపోలేదు. చివరకు ఏడో సీడ్ భారత స్టార్ 21–16, 11–21, 14–21తో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–17, 21–19తో ఆరోసీడ్ ఫజర్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–19తో అల్ఫియాన్–మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. సిక్కిరెడ్డి–ప్రణవ్ జోడీ 16–21, 11–21తో ఎనిమిదో సీడ్ తంగ్చన్ మన్– సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్
ఈ ఏడాది తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తోన్న భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో కష్టమ్మీద తొలి రౌండ్ గట్టెక్కారు. పురుషుల సింగిల్స్‌లో ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగగా... ఐదుగురు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో ఇద్దరు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బ్యాంకాక్: తొలి రౌండ్లోనే గట్టిపోటీ ఎదుర్కొన్నా... కీలక దశలో పైచేయి సాధించిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్’ సౌరభ్, సమీర్‌లకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–13, 17–21, 21–19తో రెన్ పెంగ్ బో (చైనా)పై, సాయిప్రణీత్ 17–21, 21–17, 21–15తో కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)పై, కశ్యప్ 18–21, 21–8, 21–14తో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)పై, ప్రణయ్ 21–16, 22–20తో వింగ్ వోంగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించారు. సౌరభ్ వర్మ 21–23, 19–21, 21–5తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... సమీర్ వర్మ 23–21, 11–21, 5–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సైనా నెహ్వాల్ 21–17, 21–19తో ఫిత్యాపోర్న్ చైవన్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... సాయి ఉత్తేజిత 17–21, 7–21తో చెన్ జియో జిన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. సిక్కి రెడ్డి జంట ముందంజ... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–16, 21–13తో కొహి గోండో–అయానె కురిహారా (జపాన్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–18, 18–21, 21–17తో ఐదో సీడ్ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) జోడీని ఓడించి ముందంజ వేసింది. -
టాప్ టెన్‌లో సింధు, సైనా
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌ను మంగళవారం ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు 5వ స్థానాన్ని కైవసం చేసుకోగా, సైనా నెహ్వాల్ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. వీరిద్దరూ గత స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ముగ్ధ అగ్రే, రితుపర్న దాస్ వారి స్థానాలను మెరుగుపరుచుకుని 62, 65వ స్థానాలకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి రెండు స్థానాలు దిగజారి 24 ర్యాంక్‌కు పడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రనవ్ జెర్రీ చోప్రా- సిక్కి రెడ్డి 22వ స్థానంలో, పొన్నప్ప- రాంకిరెడ్డి జోడీ 23వ స్థానంలో స్థిరపడ్డారు. కాగా పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మలు 10, 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. జపాన్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో కెంటో మొమొటా చేతిలో ఓడిపోయిన సాయి ప్రణీత్ నాలుగు స్థానాలు ఎగబాకి పురుషుల సింగిల్స్‌లో 20వ స్థానానికి చేరుకున్నాడు. హెచ్ఎస్ ప్రణయ్(31), పారుపల్లి కశ్యప్(35), శుభంకర్‌దే(41), సౌరభ్, వర్మ(44) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 67వ స్థానంలో ఉండగా లక్షయ్ సెన్ 69వ స్థానంలో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి రెండు స్థానాలు ఎగబాకి 16వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మను అత్రి-సుమిత్ రెడ్డిలు 25వ స్థానంలో ఉన్నారు. -
సింధు ముందుకు... శ్రీకాంత్ ఇంటికి
టోక్యో: ఈ సీజన్లో తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 11–21, 20–22తో భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీకాంత్ చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ప్రణయ్ ఈసారి మాత్రం సంచలన ప్రదర్శన చేసి తన సహచరుడికి షాక్ ఇచ్చాడు. 2011లో ఏకైకసారి శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణయ్ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అతడిపై గెలుపొందడం విశేషం. మరో సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 17–21, 12–21తో ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 21–9, 21–17తో హాన్ యుయె (చైనా)పై గెలిచింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 11–21, 14–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 14–21తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–16, 21–17తో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; కాంటా సునెయామ (జపాన్)తో సాయిప్రణీత్; రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. -
మనోళ్ల సత్తాకు పరీక్ష
టోక్యో : ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేడు మొదలయ్యే జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పదో ర్యాంకర్ కెంటో నిషిమోటా (జపాన్)తో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ ఆడనున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మార్విన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప తలపడతారు. బుధవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో హాన్ యుయె (చైనా)తో పీవీ సింధు; ప్రణయ్‌తో శ్రీకాంత్; ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడతారు. గతవారం ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన సింధుకు ఈ టోర్నీలో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) లేదా అయా ఒహోరి (జపాన్)తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సింధుకు క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియా ఓపెన్ విజేత అకానె యామగుచి (జపాన్), సెమీఫైనల్లో రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ప్రత్యర్థులుగా ఎదురు కావొచ్చు. -
క్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం 62 నిమిషాల పాటు సాగిన మహిళల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) పై గెలిచింది. మ్యాచ్‌ను డెన్మార్క్ షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధుపై మొదటి గేమ్‌లో 6–3తో ఆధిక్యంలో వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన సింధు సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించి మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌ను మియా గెలవడంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు 21–11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గతంలో ఇండియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో సింధు ఆమెను మట్టికరిపించింది. పురుషుల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి 15–21, 14–21తో టోర్నీ టాప్ సీడ్ మార్కస్ గిడియోన్ – కెవిన్ సంజయ(ఇండోనేషియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 11–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైయ్యారు. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు పోటీ పడనుంది. వీరిద్దరూ 14 సార్లు తలపడగా.. చెరో ఏడు సార్లు గెలిచి సమంగా ఉన్నారు. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
జకార్తా: అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తూ భారత అగ్రశ్రేణి సింగిల్స్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 11–21, 21–15, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం కాగా... నిషిమోటోపై శ్రీకాంత్‌కిది ఐదో గెలుపు. మరోవైపు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌ల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సాయిప్రణీత్ 15–21, 21–13, 10–21తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో... ప్రణయ్ 21–19, 18–21, 20–22తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 13–21, 11–21తో తొంతోవి అహ్మద్–విన్నీ కండౌ (ఇండోనేసియా) జంట చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీ 11–21, 17–21తో లియావో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. గురువారం జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) శ్రీకాంత్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మార్కస్ గిడియోన్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జోడీతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట తలపడతాయి. ప్రతీసారి ఆటగాళ్లతో వెళ్లడం కుదరదు! అలా చేస్తే కొత్తవాళ్లను తయారు చేయలేం భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మేజర్ టోర్నీ బరిలోకి దిగినా దాదాపు ప్రతీసారి వారి వెంట చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కనిపించేవారు. కోర్టు పక్కన కోచ్ స్థానం లో కూర్చొని ఆయన ఇచ్చే అమూల్య సలహాలతో షట్లర్లు అద్భుత ఫలితాలు సాధించారు. అయితే ఇటీవల గోపీచంద్ వారితో తరచుగా ప్రయాణించడం లేదు. ఈ ఏడాది అయితే గోపీ ఎక్కువగా అకాడమీలో శిక్షణకే పరిమితమయ్యారు. దీనిపై స్పందిస్తూ ఆయన... ఆటగాళ్లతో ప్రతీ టోర్నీకి వెళ్లడం సాధ్యం కాదని, ప్రణాళిక ప్రకారమే తన ప్రయాణాలు తగ్గించానని స్పష్టం చేశారు. ‘నేను టాప్ క్రీడాకారులతో టోర్నీలకు వెళుతుంటే వారి తర్వాతి స్థాయిలో ఉన్న ఇతర షట్లర్ల పరిస్థితి ఏమవుతుంది? టోర్నీల కోసం ప్రయాణించడమే పనిగా పెట్టుకుంటే ఒక సింధు వెలుగులోకి వచ్చేదా? వాస్తవానికి మనకు ఎక్కువ కోచ్‌ల అవసరం ఉంది. నేను ఒక్కడినే అన్నీ చేయలేను. నాకు ఇతరత్రా సహాయం, మద్దతు అవసరం’ అని గోపీచంద్ స్పష్టం చేశారు. గత పదేళ్లుగా కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ ఉన్న ఏడాదిలోనే తాను ఆటగాళ్లతో కలిసి టోర్నీలకు వెళ్లానని ఆయన గుర్తు చేశారు. ‘ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా సూచనలు తీసుకోవాలని, నేను వారికి ఎక్కువ సేపు కోచింగ్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ అది ప్రతీసారి సాధ్యం కాదు. నేను అక్కడ లేను కాబట్టి తాము ఓడామని, ఉంటే గెలిచేవాళ్లమని కొందరు షట్లర్లు చెబుతూనే ఉంటారు’ అని గోపీచంద్ వివరించారు. 2019 చివరి వరకు ఆటగాళ్లతో ప్రయాణించే ఆలోచన లేదని... వచ్చే ఏడాది మాత్రం ఒలింపిక్స్ ఉండటంతో కొన్ని టోర్నీలకు వెళ్లి తన ప్రణాళికను రూపొందించుకుంటానని గోపీ వెల్లడించారు. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
జకార్తా: ఇండోనేషియాలో ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 11–21, 21–15, 21–15 అయా ఒహొరి(జపాన్)పై చెమటోడ్చి నెగ్గింది. ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని బరిలోకి దిగిన సింధుకు తొలి సెట్లో ప్రత్యర్థి షాక్ ఇచ్చింది. అనంతరం పుంజుకున్న సింధు రెండు, మూడు సెట్లతోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్, వరల్డ్ నెం.9 శ్రీకాంత్ 21–14, 21–13 కెంటా నిషి మోటో(జపాన్)ను చిత్తుచే శాడు. 38 నిమిషాల్లో్లనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ ధాటికి ప్రత్యర్థి తేలిపోయాడు. కాగా, మరో ఇద్దరు భారత ఆట గాళ్లు హెచ్ఎస్ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్ టోర్నీ నుంచి నిష్క్రమిం చారు. వరల్డ్ నెం.23 సాయిప్రణీత్ 15–21, 21–13, 10–21తో ప్రపంచ 37వ ర్యాంకర్ వాంగ్ వింగ్ కి విన్సెంట్(హాంగ్‌కాంగ్) చేతిలో చిత్తవగా, వరల్డ్ నెం.32 ప్రణయ్ 21–19, 18–21, 20–22తో ప్రపంచ నెం.2 షి యుకి(చైనా) చేతిలో పోరాడి ఓడాడు. అలాగే మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి– అశ్విని పొన్నప్ప(భారత్) జోడీ 13–21, 11–21తో టొంటొవి అహ్మద్–విన్నీ ఒక్తవిన కండౌ(ఇండోనేషియా) చేతిలో ఓడింది. -
సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు
జకార్తా: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్ నేటి నుంచి మొదలయ్యే ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సీజన్లో ఆరు టోర్నీల్లో ఆడిన సింధు ఒక్క దాంట్లోనూ ఫైనల్ చేరలేకపోయింది. గాయంతో బాధపడుతున్న సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో భారత్ ఆశలన్నీ సింధుపైనే ఉన్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు ఆడుతుంది. సింధు పార్శ్వంలోనే ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో అతను కెంటో నిషిమోటో (జపాన్)తో ఆడతాడు. వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. -
‘టాప్’ పథకంలోకి కోచ్ సియాదత్
ముంబై: భారత బ్యాడ్మింటన్ అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ సియాదతుల్లాకు కూడా ఇక నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం వర్తించనుంది. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మల కోరిక మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) హైదరాబాద్‌కు చెందిన సియాదత్‌ను ‘టాప్’ పథకంలో చేర్చింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ముఖ్యమైన టోర్నీల్లో కోచ్ సియాదత్ తమతో ఉండటం ముఖ్యమని భావించిన ఈ ముగ్గురు ఆటగాళ్లు సియాదత్‌ను ‘టాప్’ పరిధిలోకి తీసుకురావాలంటూ ‘సాయ్’ని విజ్ఞప్తి చేశారు. సియాదత్‌తో పాటు ఫిజికల్ ట్రెయినర్ ఎస్ఆర్ గణేశ్‌కు ఈ పథకాన్ని వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఆటగాళ్ల వినతిపై సానుకూలంగా స్పందించిన సాయ్ సియాదత్‌ను టాప్స్‌లో చేర్చింది. ‘కోచ్‌ల బృందంలో సియాదత్ ముఖ్యమైనవాడు. గత రెండేళ్లుగా అతను మా గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ప్రతీ మేజర్ టోర్నీకి హాజరవ్వడం గోపీ సర్‌కు కుదరదు. దీంతో సియాదత్ ప్రతీ టోర్నమెంట్‌కూ మాతో పాటు ప్రయాణిస్తాడు. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల కోసం మేం ఈ ఏడాది చాలా తిరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాతో పాటు కోచ్ ఉంటే బాగుంటుంది. అదే సమయంలో నిధులు కూడా అవసరం. కోచ్ సియాదత్కు ‘టాప్’ పథకం వర్తింపజేస్తే అతనితో పాటు మాకు మేలు జరుగుతుంది’ అని ప్రణయ్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల సియాదత్ 2004 నుంచి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నారు. 2010 నుంచి భారత జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
తప్పుడు నిర్ణయం... తగిన మూల్యం
నానింగ్ (చైనా): ప్రత్యర్థి ర్యాంక్ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసి... విజయం సాధిస్తామనే ధీమాతో తప్పుడు నిర్ణయం తీసుకుంటే... తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత బ్యాడ్మింటన్ కోచ్‌ల బృందానికి తెలిసొచ్చింది. ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో భాగంగా గ్రూప్–1‘డి’లో మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–3తో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌ను కాదని... సమీర్ వర్మను ఆడించాలని కోచ్‌లు తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 16–21, 21–17, 24–22తో గో సూన్ హువాట్–లై షెవోన్ జెమీ (మలేసియా)లను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించారు. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ సమీర్ వర్మ 13–21, 15–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ పీవీ సింధు 21–12, 21–8తో గో జి వె (మలేసియా)పై నెగ్గడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 24వ ర్యాంక్ జోడీ సుమీత్ రెడ్డి–మను అత్రి 20–22, 19–21తో ప్రపంచ 1394 ర్యాంక్ జంట ఆరోన్ చియా–తియో ఈ యి (మలేసియా) చేతిలో ఓడిపోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 1394వ స్థానంలో ఉన్నప్పటికీ ఆరోన్–తియో జోడీ పట్టుదలతో పోరాడి మలేసియాను నిలబెట్టింది. ఇక చివరి మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో ప్రపంచ 25వ ర్యాంక్ ద్వయం సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 11–21, 19–21తో ప్రపంచ 13వ ర్యాంక్ జోడీ చౌ మె కువాన్–లీ మెంగ్ యీన్ (మలేసియా) చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత్ పరాజయం ఖాయమైంది. ఒకవేళ శ్రీకాంత్‌ను పురుషుల సింగిల్స్‌లో ఆడించి ఉంటే, అతను గెలిచి ఉంటే భారత్ విజయం డబుల్స్ మ్యాచ్లకంటే ముందుగానే 3–0తో ఖాయమయ్యేది. కానీ శ్రీకాంత్కంటే సమీర్ వర్మపైనే కోచ్‌లు ఎక్కువ నమ్మకం ఉంచారు. కానీ వారి నిర్ణయం బెడిసికొట్టింది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే పదిసార్లు చాంపియన్ చైనాతో నేడు జరిగే మ్యాచ్‌లో భారత్ తప్పకుండా గెలవాలి. -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారుడి చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు టోర్నీల్లో ఆడిన శ్రీకాంత్ ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, మిగతా ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయాడు. వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో రెండో రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే చేతులెత్తేయగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రపంచ 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 20–22తో ఓడిపోయాడు. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్‌కిది రెండో పరాజయం కావడం విశేషం. వీరిద్దరూ ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తలపడగా అప్పుడు కూడా రుస్తావిటో పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–13, 17–21, 21–18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సింధు 21–14, 21–7తో సయాక తకహాషి (జపాన్)పై కేవలం 28 నిమిషాల్లో నెగ్గగా... ఏడో సీడ్ సైనా 12–21, 21–11, 21–17తో హాన్ యువె (చైనా)పై శ్రమించి విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) 13–21, 16–21తో జాంగ్ కొల్ఫాన్–రవింద (థాయ్‌లాండ్) చేతిలో; దండు పూజ–సంజన సంతోష్ (భారత్) 13–21, 21–12, 12–21తో ప్రమోదిక–కవిది (శ్రీలంక) చేతిలో; అపర్ణ బాలన్–శ్రుతి (భారత్) 12–21, 10–21తో యుజియా జిన్–మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18–21, 15–21తో హి జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
సింధు మిగిలింది!
సింగపూర్: సింగపూర్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ లో పీవీ సింధు ఆట మాత్రమే మిగిలింది. ఈ నాలుగో సీడ్ తెలుగుతేజం మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఇంకా టైటిల్ బోణీ కొట్టని సింధు ఇప్పుడు ఆ వేటలో రెండడుగుల దూరంలో ఉంది. ఆమె మినహా మిగతా భారత షట్లర్లు శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లోనే కంగుతిన్నారు. మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్‌తో పాటు పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ పరాజయం చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ కూడా ఓడిపోయింది. శ్రమించి సెమీస్‌కు... భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధుకు ప్రపంచ 18వ ర్యాంకర్ కై యన్యన్ (చైనా) గట్టిపోటీనిచ్చింది. దీంతో మ్యాచ్ గెలిచేందుకు నాలుగో సీడ్ సింధు చెమటోడ్చాల్సివచ్చింది. గంటపాటు జరిగిన ఈ పోరులో చివరకు 21–13, 17–21, 21–14తో చైనా ప్రత్యర్థిని కంగుతినిపించింది. మరో క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సైనా నెహ్వాల్ 8–21, 13–21తో రెండో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. నేడు (శనివారం) జరిగే సెమీఫైనల్లో సింధు... ఈ మాజీ ప్రపంచ చాంపియన్ ఒకుహరతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 18–21, 21–19, 9–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో, సమీర్ వర్మ 10–21, 21–15, 15–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 14–21, 16–21తో మూడో సీడ్ డెచపొల్ పువరనుక్రొ–సప్సిరి టెరతనచయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో కంగుతింది. -
సింధు సింగపూర్‌లో సాధించేనా..!
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్లో నిరాశపరిచింది. ఆల్ ఇంగ్లండ్ సహా పలు ఈవెంట్లలో బరిలోకి దిగిన ఆమె ఇంకా టైటిల్ బోణీనే కొట్టలేదు. ట్రోఫీల వెలతి వేధిస్తున్న ఈ ఒలింపిక్ రన్నరప్ తాజాగా సింగపూర్ ఓపెన్‌లో సత్తాచాటాలని ఆశిస్తోంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో టైటిలే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల సింగిల్స్‌లో సింధు నాలుగో సీడ్‌గా, సైనా నెహ్వాల్ ఆరో సీడ్‌గా తమ ఆట ప్రారంభిస్తారు. నిరీక్షణ ముగిసేనా... గత డిసెంబర్లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తెలుగుతేజం సింధుకు కొత్త సంవత్సరం ఇప్పటిదాకా కలిసిరాలేదు. ఇండోనేసియా ఓపెన్‌లో క్వార్టర్స్‌లో ఓడిన ఆమె... ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో అయితే తొలిరౌండ్లోనే కంగుతింది. ఇండియా ఓపెన్‌లో సెమీస్ చేరికే ఇప్పటివరకు ఆమె ఉత్తమ ప్రదర్శన కాగా... ఆదివారమే ముగిసిన మలేసియా ఓపెన్‌లో రెండో రౌండ్లోనే పరాజయం చవిచూసింది. నాలుగో సీడ్ సింధు ఈ టోర్నీలో తన నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది. బుధవారం జరిగే తొలిరౌండ్లో ఆమె ఇండోనేసియాకు చెందిన లియాని అలెసాండ్రా మయినకితో తలపడుతుంది. ఈ సీజన్లో టైటిల్ సాధించిన ఏకైక భారత షట్లర్ సైనా నెహ్వాల్. 29 ఏళ్ల హైదరాబాదీ వెటరన్ స్టార్ ఇండోనేసియా ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో మారిన్ గాయంతో వైదొలగడంతో హైదరాబాదీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆల్ ఇంగ్లండ్‌లో క్వార్టర్స్ చేరిన ఆమె అనారోగ్య కారణాలతో స్విస్, ఇండియా ఓపెన్లకు దూరంగా ఉంది. తిరిగి మలేసియా ఈవెంట్లో ఆడినప్పటికీ తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. ఆరో సీడ్ సైనా తొలిరౌండ్లో లిన్ హొజ్మర్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో తలపడుతుంది. క్వాలిఫయర్‌తో శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ టచ్‌లోకి వచ్చాడు. ఇండియా ఓపెన్‌లో ఫైనల్ చేరడం ద్వారా 17 నెలల అనంతరం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మలేసియా ఓపెన్‌లో ఈ భారత షట్లర్ క్వార్టర్స్ చేరాడు. ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న శ్రీకాంత్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో పోటీపడనున్నాడు. భమిడిపాటి సాయిప్రణీత్‌కు తొలిరౌండ్లోనే క్లిష్టమైన పోటీ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ కెంటో మొమొట (జపాన్)తో అతను తలపడనున్నాడు. హెచ్.ఎస్. ప్రణయ్‌కి బ్రిస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) ఎదురయ్యాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్ మలేసియాకు చెందిన చిమ్ జున్ వీతో ఆడతాడు. వీరితో పాటు పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి, ఎం.ఆర్.అర్జున్– శ్లోక్ రామచంద్రన్, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్, మనీషా–అర్జున్, అనుష్క–సౌరభ్ వర్మ జోడీలు ఈ టోర్నీ బరిలో ఉన్నాయి. -
శ్రీకాంత్ ఓటమి
కౌలాలంపూర్: తొలిరోజేమో సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్... రెండో రోజు సైనా నెహ్వాల్... మూడో రోజు పీవీ సింధు... ఇలా మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మొదలైన రోజు నుంచి ప్రతీ రౌండ్లో ఒకరిద్దరు భారత షట్లర్లు ఓడుతూ వచ్చారు. నేడు కిడాంబి శ్రీకాంత్ ఓటమితో భారత్ పోరాటం ముగిసింది. బరిలో మిగిలివున్న ఒకే ఒక్క తెలుగుతేజం క్వార్టర్ ఫైనల్లో కంగుతిన్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 18–21, 19–21తో ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలిగేమ్ ఆరంభంలో 6–3తో జోరు పెంచిన శ్రీకాంత్ ఒక్కసారి మినహా 16–15స్కోరు దాకా ఆధిక్యంలోనే కొనసాగాడు. కానీ ఒలింపిక్ చాంపియన్ ఆఖర్లో జాగ్రత్తగా ఆడటం, ఏపీ ఆటగాడు అనవసర తప్పిదాలు చేయడం గేమ్‌ను చేజార్చింది. రెండో గేమ్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 7–8 వరకు చక్కగా పోరాడిన తెలుగు షట్లర్... చెన్ లాంగ్ జోరు పెంచడంతో 8–16తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకున్న శ్రీకాంత్ వరుసగా పాయింట్లు గెలిచి 18–18తో ప్రత్యర్థిని నిలువరించాడు. చివర్లో మళ్లీ చైనా ఆటగాడు వరుసగా స్కోరు చేయడంతో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. వీళ్లిద్దరు ఇప్పటి వరకు ఏడు సార్లు ముఖాముఖీగా తలపడ్డారు. భారత స్టార్ ఒకే ఒక్కసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2017)లో గెలిచాడు. ఇది మినహా నేటి మ్యాచ్ సహా ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ ఆటగాడికి ఓటమి ఎదురైంది. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్ ఓటమి
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ శ్రీకాంత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో శ్రీకాంత్ 18-21, 19-21 తేడాతో ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో శ్రీకాంత్ ఒత్తిడిని అధిగమించలేక ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను మూడు పాయింట్ల తేడాతో కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను రెండు పాయింట్ల తేడాతో వదులుకున్నాడు. ఫలితంగా టోర్నీ నుంచి శ్రీకాంత్ నిష్క్రమించాడు. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ –750 మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఒక్కడి పోరాటమే మిగిలింది. ఈ టోర్నీలో 8వ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట కూడా నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ శ్రీకాంత్ 21–11, 21–15తో థాయ్‌లాండ్‌కు చెందిన కోసిట్ ఫెట్ప్రదబ్ను వరుస గేముల్లో ఓడించాడు. 32 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత స్టార్ జోరుకు ఎదురులేకుండా పోయింది. థాయ్ ప్రత్యర్థిపై అతను అలవోక విజయం సాధించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్... ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఎదుర్కొంటాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 18–21, 7–21తో çసుంగ్ జీ హ్యున్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో 13–10తో ఆధిక్యంలో ఉన్న సింధు అనూహ్యంగా వెనుకబడింది. ఇక రెండో గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు తలవంచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–15, 17–21, 13–21తో తన్ కియన్ మెంగ్– లై పై జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడింది. -
మలేసియా ఓపెన్: సింధు ఔట్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో భాగంగా రెండో రౌండ్లో సింధు 18-21, 7-21 తేడాతో సుంగ్ జీ హ్యూన్( దక్షిణా కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్‌లో కనీసం పోరాటం చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా గేమ్‌తో మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరొవైపు పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్ పోరులో శ్రీకాంత్ 21-11, 21-15 తేడాతో కొసిట్ ఫెట్‌ప్రదబ్ ( థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త కష్టపడి విజయం సాధించాడు. -
సైనాకు తొలిరౌండ్లోనే షాక్
కౌలాలంపూర్: భారత వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. గత వారం ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన హెచ్.ఎస్.ప్రణయ్ ఈ టోర్నీలో తొలిరౌండ్ దాటలేకపోయాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 22–20, 15–21, 10–21తో పొర్న్‌పవీ చొచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతింది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ థాయ్ ప్రత్యర్థిపై గెలిచిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా తొలిసారి తనకన్నా తక్కువ ర్యాంకులో ఉన్న పొర్న్‌పవీ (21 ర్యాంకు) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 22–20, 21–12తో జపాన్‌కు చెందిన అయ ఒహొరిపై గెలుపొందింది. ఆమెపై సింధుకిది ఆరో విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–18, 21–16తో ఇసాన్ మౌలాన ముస్తఫా (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–12, 16–21, 14–21తో సితికొమ్ తమసిన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున సింధు, శ్రీకాంత్‌లే మిగిలారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి ద్వయం 16–21, 6–21తో ఏడో సీడ్ హన్ చెంగ్‌కై–జౌ హొడాంగ్ (చైనా) జంట చేతిలో చిత్తుగా ఓడింది. నేడు జరిగే మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ మలేసియాకు చెందిన తన్ కిన్ మెంగ్–లై పి జింగ్ జంటతో తలపడుతుంది. సింగిల్స్‌లో సింధు కొరియాకు చెందిన సుంగ్ జీ హ్యూన్తో, శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఆటగాడు కొసిట్ ఫెట్‌ప్రదబ్‌తో పోటీ పడతారు. -
రన్నరప్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: చాన్నాళ్ల తర్వాత టైటిల్ బాట పట్టాలనుకున్న భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆశలపై విక్టర్ అక్సెల్సన్ నీళ్లుచల్లాడు. దీంతో ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో మాజీ చాంపియన్ శ్రీకాంత్ 7–21, 20–22తో డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్ అక్సెల్సన్ చేతిలో పరాజయం చవి చూశాడు. 17 నెలల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్లో ఫైనల్ చేరిన మూడో సీడ్ శ్రీకాంత్ టైటిల్ వేటలో చతికిలబడ్డాడు. తొలి గేమ్‌లో లెక్కలేనన్ని అనవసర తప్పిదాలు చేయడంతో పాటు ప్రత్యర్థి జోరుకు తలవంచాడు. 11–7తో భారత ఆటగాడిపై ఆధిక్యం కనబరిచిన అక్సెల్సన్ అదే ఊపుతో వరుసగా పాయింట్లు సాధించాడు. ఈ గేమ్‌లో రిటర్న్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు నేర్పుగా ఆడటంలో శ్రీకాంత్ విఫలమయ్యాడు. ఇదే అదనుగా డెన్మార్క్ స్టార్ 21–7తో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో మాత్రం శ్రీకాంత్ పుంజుకున్నాడు. ఒక దశలో ఆరంభంలో 1–5తో వెనుకబడినా... తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి టచ్‌లోకి వచ్చాడు. విరామ సమయానికి 9–11తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో 12–12 వద్ద స్కోరు సమం చేసిన భారత ఆటగాడు 14–13తో అక్సెల్సన్పై ఆధిక్యంలోకి వచ్చాడు. స్మాష్‌లతో మరో రెండు పాయింట్లు సాధించాడు. అయితే రిటర్న్ షాట్లను నేర్పుగా ఆడగలిగే అక్సెల్సన్ మరో గేమ్‌దాకా పొడిగించకుండానే వరుస పాయింట్లతో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) గెలుచుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ రచనోక్ 21–15, 21–14తో మూడో సీడ్ హి బింగ్ జియావో (చైనా)పై విజయం సాధించింది. -
ఫైనల్‌కు శ్రీకాంత్
న్యూఢిల్లీ: తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ ఒక మేజర్ టోర్నీలో ఎట్టకేలకు ఫైనల్ చేరాడు. 17 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత తాజా ఇండియా ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. 2017 అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక మరే ఇతర బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఫైనల్ చేరలేకపోయాడు. గతేడాది కామన్వెల్త్గేమ్స్లో ఫైనల్లోకి అడుగుపెట్టి రజతంతో సరిపెట్టుకున్నాడు. మరో వైపు భారత టాప్‌స్టార్, రెండో సీడ్ పీవీ సింధుతో పాటు పారుపల్లి కశ్యప్‌కు సెమీ ఫైనల్లోనే చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 14–21 21–16, 21–19తో చైనాగోడ హువాంగ్ యుజియంగ్‌ను దాటేశాడు. మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ పోరులో మూడో సీడ్ శ్రీకాంత్‌కు గట్టి పోటీ ఎదురైంది. ప్రత్యర్థి జోరుతో తొలి గేమ్‌ను కోల్పోయిన ఏపీ ఆటగాడు రెండో సెట్లో పట్టుదలగా శ్రమించాడు. ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని చాటాడు. 8–4తో ఆధిక్యంలోకి వచ్చిన 26 ఏళ్ల శ్రీకాంత్ స్మాష్, క్రాస్‌కోర్ట్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. హువాంగ్ను అదేస్కోరుపై నిలువరించి 11–4తో దూసుకెళ్లాడు. రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ హోరాహోరీగా జరిగింది. దీంతో స్కోరు 18–18తో సమమైంది. ఈ దశలో ప్రత్యర్థి పొరపాట్ల నుంచి లబ్దిపొందిన శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో భారత ఆటగాడు... డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో సెమీఫైనల్లో అక్సెల్సన్ వరుస గేముల్లో పారుపల్లి కశ్యప్‌ను ఇంటిదారి పట్టించాడు. భారత ఆటగాడు 11–21, 17–21తో విక్టర్ అక్సెల్సన్ ధాటికి తలవంచాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ పూసర్ల వెంకట సింధు పోరాడి ఓడింది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో ఆమె 21–23, 18–21తో మూడో సీడ్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓటమి పాలైంది.