Naveen
-
ప్రేమోన్మాది ఘాతుకం
మధురవాడ (విశాఖ)/శ్రీకాకుళం క్రైమ్/బూర్జ/వీరఘట్టం/సాక్షి, అమరావతి : పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేశాడు. తల్లి మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. సీపీ శంఖబ్రత బాగ్చి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది. ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ (26) పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం12 గంటలకు కొమ్మాది జంక్షన్ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న స్వయంకృషి నగర్లో బాధితుల ఇంటికి నవీన్ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేస్తామని చెప్పడంతో విచక్షణ కోల్పోయి వాదనకు దిగాడు. ఓ దశలో ఉన్మాదంతో ఊగిపోతూ 1.30 గంటలకు తల్లీ కూతుళ్లపై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నక్కా లక్ష్మి (47) అక్కడికక్కడే మృతి చెందగా, దీపికకు చేయి, మెడ ఇతర భాగాలపై తీవ్ర గాయాలై, స్పృహ తప్పింది. ఆ వెంటనే నిందితుడు పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన దీపిక తల్లి చలనం లేకుండా ఉండడాన్ని గమనించింది. సహాయం కోసం ఎంత ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాలేదు. మేడ మీద నుంచి అతికష్టంగా కిందికి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ చెయ్యడంతో పీఎంపాలెం ఎస్ఐ కె.భాస్కరరావు సంఘటనా స్థలికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న దీపికను ద్విచక్ర వాహనంపై దగ్గర్లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. నిందితుడు నవీన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఐదు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి, శ్రీకాకుళం జిల్లా బూర్జ నుంచి వీరఘట్టం వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మేజి్రస్టేట్ ముందు హాజరు పరుస్తామని చెప్పారు. ఉలిక్కిపడిన పనసనందివాడ ఈ ఘటనతో నవీన్ స్వగ్రామం పనసనందివాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీపికతో కొన్నేళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ, కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితో ఫోన్లో మాట్లాడినా అనుమానిస్తూ వచ్చాడు. ఓ దశలో ఆ యువతిపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా అతనితో పెళ్లి జరిపించడంపై యువతి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పది రోజులుగా అతని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు కడతేర్చేందుకు పూనుకున్నాడు. వీరఘట్టం ఎస్ఐ జి.కళాధర్ గ్రామానికి చేరుకుని నవీన్ తల్లిదండ్రులు జ్యోతి, అన్నారావుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్నందుకు పోలీసులను విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువుకూటమి సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు విశాఖపట్నంలో ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో వేదింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువక ముందే విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. -
మాజీ సీఈసీ నవీన్ చావ్లా ఇకలేరు
న్యూఢిల్లీ: మాజీ ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) నవీన్ చావ్లా(79) కన్నుమూశారు. అపొలో ఆస్పత్రిలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి తెలిపారు. పది రోజుల క్రితం కలిసినప్పుడు బ్రెయిన్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరనున్నట్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. 1969 బ్యాచ్ ఐఏఎస్ అయిన చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. అనంతరం 2009 ఏప్రిల్ నుంచి 2010 జులై వరకు సీఈసీగా పనిచేశారు. కమిషనర్‌గా ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్లు బీజేపీ ఆరోపించింది. 2006లో లోక్‌సభలో అప్పటి ప్రతిపక్ష నేత ఎల్కే అడ్వాణీ 204 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ ఆరోపణలపై 2009లో అప్పటి సీఈసీ ఎన్ గోపాలస్వామి కమిషనర్ బాధ్యతల నుంచి చావ్లాను తొలగించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేశారు. ఈ విషయమై బీజేపీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దేశ 16వ సీఈసీ నవీన్ చావ్లా హయాంలో కీలక ఎన్నికలు సంస్కరణలు అమలయ్యాయి. స్త్రీ, పురుషతోపాటు థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ‘ఇతరులు’అనే కేటగిరీని తీసుకురావడం అందులో ఒకటి. సీఈసీతో సమానంగా కమిషనర్లను అభిశంసించాలన్నా పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యేలా రాజ్యాంగ సవరణ తేవాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కాగా, నవీన్ చావ్లా 1992లో మదర్ థెరిసా జీవిత చరిత్రను రాశారు. 1997లో ప్రచురితమైన లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మదర్ థెరిసా అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు. -
నాయనమ్మ కళ్లలోఆనందం చూడాలని
సూర్యాపేటటౌన్ : ‘తన మనవరాలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె నాయనమ్మ తట్టుకోలేకపోయింది. భార్గవి భర్తను ఎలాగైనా అంతమొందించాలని తన ఇద్దరు మనవళ్లను రెచ్చగొట్టింది’అని పోలీసులు చెప్పారు. సూర్యాపేటలో జరిగిన పరువు హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆ వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి, పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్ స్నేహితులు. కృష్ణ తరచు నవీన్ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో నవీన్ చెల్లెలు అయిన భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి పెళ్లికి భార్గవి కుటుంబసభ్యులు అంగీకరించలేదు.భార్గవి, కృష్ణ గత ఏడాది ఆగస్టు 7న నార్కట్‌పల్లి మండలంలోని గోపాలాయిపల్లి గుట్టపై వివాహం చేసుకోగా, భార్గవి తల్లిదండ్రులు సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు కృష్ణ, భార్గవికి కౌన్సిలింగ్ ఇవ్వగా, తాము మేజర్లమని, ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. కృష్ణ, భార్గవిలు సూర్యాపేటలోనే కాపురం పెట్టారు. మహేశ్‌తో కృష్ణ హత్యకు పన్నాగం వడ్లకొండ కృష్ణ, సూర్యాపేటకు చెందిన బైరు మహేశ్ స్నేహితులు. దీంతో భార్గవి సోదరులు కోట్ల నవీన్, వంశీలు బైరు మహేశ్ దగ్గరకు వెళ్లారు. కృష్ణను చంపేయాలని, నువ్వే నమ్మించి ఎక్కడికైనా తీసుకురావాలని మహేశ్‌ను కోరారు. అందుకు మహేశ్ ఒప్పుకున్నాడు. కృష్ణ హత్యకు మూడుసార్లు స్కెచ్ వేయగా అది ఫెయిలైంది. ఆ తర్వాత మహేశ్, నవీన్, వంశీలు ఇటీవల కలుసుకొని.. ఈసారి ఎలాగైనా కృష్ణను చంపాలని నిర్ణయించుకున్నారు.వారి ప్లాన్‌లో భాగంగా ఈ నెల 26న ఆదివారం.. ఇద్దరం కలిసి తమ పొలం దగ్గరకు వెళ్దామని మహేశ్ చెప్పగా కృష్ణ అంగీకరించాడు. పథకం ప్రకారం మహేశ్ వెంటనే నవీన్‌కు ఫోన్ చేసి తాము వస్తున్నం.. అలర్ట్‌గా ఉండమని చెప్పాడు. కృష్ణ స్కూటీపై ఇద్దరూ పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు. అయితే, తనకు మూత్రం వస్తుందని చెప్పి మహేశ్ కొద్ది దూరం వెళ్లి నవీన్‌కు ఫోన్ చేసి, తాను కృష్ణ మెడ అందుకోగానే మీరు రావాలని నవీన్, వంశీకి చెప్పాడు. ఇంటికి వెళ్దామని కృష్ణ స్కూటీని స్టార్ట్ చేయగా, మహేశ్ స్కూటీ వెనకాల ఎక్కి కూర్చున్నాడు. కృష్ణ స్కూటీని కదిలిస్తుండగా మహేశ్.. కృష్ణ మెడ చుట్టూ చేయి వేసి గొంతు నొక్కిపట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కంప్లచెట్లలో దాక్కున్న నవీన్, వంశీ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణను హత్య చేశారు. మనవళ్లను రెచ్చగొట్టి... భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె నాయనమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొడుతూ పరోక్షంగా కృష్ణ హత్యకు ప్రేరేపించింది. కృష్ణను హత్యచేసిన తర్వాత మొదట శవాన్ని నాయనమ్మకు చూపించాలని నవీన్ అనుకున్నాడు. తన ఎర్టీగా కారు డిక్కీలో కృష్ణ శవాన్ని వేసుకొని ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేటలో ఉన్న నాయనమ్మ బుచ్చమ్మ వద్దకు వెళ్లి చూపించాడు. అక్కడి నుంచి నవీన్ నల్లగొండలోని తన స్నేహితుడు సాయిచరణ్ వద్దకు వెళ్లి కారులో ఉన్న కృష్ణ మృతదేహాన్ని చూపించగా వెంటనే చరణ్ భయంతో కారు దిగి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పిల్లలమర్రి గ్రామ శివారులో గల చెర్వుకట్ట చివరలో మూసీ కెనాల్ పక్కన కృష్ణ శవాన్ని పడేశారు. కృష్ణ స్కూటీని కూడా తీసుకొచ్చి పక్కనే పెట్టారు. అక్కడి నుంచి పాత సూర్యాపేటకు వెళ్లి కోట్ల బుచ్చమ్మ ఉన్న ఇంట్లో పడుకున్నారు. మృతుడి తండ్రి డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరిపి మొత్తం ఆరుగురు నిందితులపై అట్రాసిటీ కేసు, హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై గతంలో పలు కేసులు నిందితులైన ఏ1 నవీన్‌పై గతంలో నాలుగు కేసులు, ఏ2 బైరు మహేశ్‌పై రౌడీషీట్‌తోపాటు తొమ్మిది కేసులు ఉన్నాయి. ఏ3 అయిన నవీన్ తండ్రి కోట్ల సైదులుపై ఒక కేసు ఉండగా ఏ4 కోట్ల వంశీపై మూడు కేసులు ఉన్నాయి. ఏ5 కోట్ల బుచ్చమ్మపై రెండు కేసులు ఉన్నాయి. ఏ6 సాయిచరణ్‌పై ఒక కేసు ఉంది. హత్యకు గురైన కృష్ణ అలియాస్ మాల బంటిపై మూడు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
‘కేరాఫ్ రవీంద్రభారతి ’ హిట్ కావాలి: మామిడి హరికృష్ణ
‘తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోని ప్రతి కళాకారుడి యొక్క డ్రీమ్ డెస్టినేషన్ రవీంద్ర భారతి. గత 64 ఏళ్ల నుంచి ఓ సాహిత్య కేంద్రంగా విలసిల్లుతూ.. ఒక ప్రామాణిక ఆడిటోరియంగా ఉంది. అందుకనే ప్రతి కళాకారుడు తన జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ కళా ప్రదర్శన చేయాలని తపన పడతాడు. లక్షలాది కళాకారులకి వేదికగా నిలిచిన రవీంద్ర భారతి నేపథ్యంలో ‘కేరాఫ్ రవీంద్రభారతి ’సినిమా తెరకెక్కడం సంతోషంగా ఉంది’ అన్నారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాత గా , గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కేరాఫ్ రవీంద్రభారతి’.జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన,మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతి లో జరిగింది.తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు,మామిడి హరికృష్ణ ముఖ్య అదితి గా విచ్చేసి డైరెక్టర్ కి కథ ని అందించి, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయగా, యువ డైరెక్టర్ నటుడు తల్లాడ సాయి కృష్ణ క్లాప్ కొట్టి టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. నవీన్ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా కష్టపడే వ్యక్తి. తన మొదటి సినీమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో ఆ శ్రమ నాకు తెలుసు. ఇప్పుడు ఓ మంచి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ..మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా కేరాఫ్ రవీంద్ర భారతి సినిమా ప్రారంభోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా ను నిర్మిస్తున్న టి. గణపతిరెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. ‘మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు జీవన్. ‘ఓ మంచి కథలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అని హీరోయిన్ నవీన అన్నారు. -
సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడైన రౌడీషీటర్ నవీన్ చేతిలో హతమైన తెనాలి యువతి మధిర సహానా (25) కేసులో తాము చెప్పిన పనిని సకాలంలో చేయలేదన్న అక్కసుతో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దళితుడైన కిరణ్‌కుమార్ బదిలీ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం అయ్యిందని, నేడోరేపో బదిలీ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన నడుచుకోలేదని, సీఎంఓ కార్యాలయం నుంచి చెప్పినా వినలేదనే ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు నుంచి ఆయనను తొలగిస్తూ సీఎం కార్యాలయం ఆమోద ముద్ర వేసింది. అసలు కారణం ఇదీ..రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అ«ధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు. ఆమెకు మరుసటి రోజు ఉదయం 6గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
జీజీహెచ్ మార్చురీ వద్ద సహానా కుటుంబసభ్యుల ఆందోళన
గుంటూరు మెడికల్/తెనాలిరూరల్: తెనాలికి చెందిన సహానా మృతికి కారకులైన నిందితుల్లో ఒకరిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేసి తక్షణమే శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, దళితసంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారు బుధవారం సహానా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా గుంటూరు జీజీహెచ్ మార్చురీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేవరకు తాము ఆందోళన చేస్తామని చెప్పారు. దళిత యువతిపై దాడి జరిగినా ఎందుకు తక్షణమే స్పందించలేదని ప్రశి్నంచారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. దళిత యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగింది. ఈ ఆందోళనలో పలు దళితసంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. వీరి ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీకి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన తెనాలి ఐతానగర్‌కు చెందిన సహానా అంత్యక్రియలు బుధవారం రాత్రి ముగిశాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మృతదేహాన్ని హయ్యరుపేటలోని స్వగృహానికి తీసుకొచ్చారు. సహానా మృతదేహానికి మంత్రి నాదెండ్ల మనోహర్, సబ్‌కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చెక్కును సహానా తల్లి అరుణకుమారికి మంత్రి మనోహర్ అందజేశారు. అనంతరం ఐతానగర్ సమాధుల తోటలో సహానా అంత్యక్రియలను నిర్వహించారు. -
ఒక్కొక్కడిని ఏరి ఏరి జైల్లో పెడతా?
-
మధిర సహాన మృతిపై వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విచారం
సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్ నవీన్ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని అన్నారు. సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
రౌడీషీటర్ నవీన్ దాడి కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం
-
‘ట్యాపింగ్’ కేసులో ఎమ్మెల్సీపై ఎల్ఓసీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పోలీసులు, మీడియా సంస్థకు చెందిన వారి చుట్టూనే దీని దర్యాప్తు తిరుగుతుండగా.. తాజాగా రాజకీయ నాయకులకు ఆ మకిలి అంటింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్‌రావు పాత్రను ఈ వ్యవహారంలో రూఢీ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న నవీన్‌రావు దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావులపై ఎల్ఓసీ ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ పోలీసులు ఈ ఏడాది జూన్ 29న హైకోర్టుకు ఓ నివేదిక సమరి్పంచారు.అందులో మూడు చోట్ల ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడంతో తొలిసారిగా నవీన్‌రావు పేరు వెలుగులోకి వచి్చంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు శ్రవణ్‌రావుతో కూడా కలసి నవీన్‌రావు పని చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి అధికార పారీ్టకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు వీళ్లు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. దీనికోసం ఎస్ఐబీలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. నాటి ప్రతిపక్షంతో పాటు వివిధ విభాగాలకు చెందిన పలువురి ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడంతో పాటు సున్నితమైన డేటాను అక్రమంగా సంగ్రహించారు. వివిధ రంగాలకు చెందిన వారిని బెదిరించడం ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా ఒత్తిడి చేశారని పోలీసులు చెపుతున్నారు. హార్డ్ డిస్‌్కల ధ్వంసంలోనూ పాత్ర గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అదే సందర్భంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్‌్కలను డీఎస్పీ ప్రణీత్‌రావు తదితరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం వెనుకా ప్రభాకర్‌రావుతో పాటు నవీన్‌రావు ఉన్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్స్ అధినేత ఎస్.శ్రీధర్‌రావును బెదిరించడం, ఆయన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించడంలోనూ నవీన్‌రావు పాత్రను దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నవీన్‌రావును విచారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత కాలం కిందట ఆయనకు నోటీసులు జారీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా ప్రయతి్నంచింది.వాటి ఆధారంగా ఆయనను పిలిచి విచారించాలని భావించింది. నోటీసులతో అధికారులు నవీన్‌రావు ఇల్లు, కార్యాలయాల వద్ద కాపుకాసినా ఆయనను కలవలేక పోయారు. ఈ లోపు పోలీసుల కదలికలు తెలుసుకున్న నవీన్‌రావు దుబాయ్ వెళ్లిపోయారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే సమాచారం ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎల్ఓసీ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాల్లో రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా ఉన్న సీఐడీ ద్వారా ఎల్ఓసీని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులకు పంపారు. ఎల్ఓసీలో నవీన్‌రావు పాస్‌పోర్టు నంబర్, ఇతర వివరాలు పొందుపరిచారు. దీని ఆధారంగా ఆయన దేశంలో అడుగుపెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారని సమాచారం. -
ఈడీ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్ఎస్) 1993 బ్యాచ్.. ఇన్‌కంట్యాక్స్ కేడర్‌కు చెందిన అధికారి. రాహుల్ నవీన్‌ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్‌గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్‌గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ల సంచలన అరెస్టులు జరిగాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఎంటెక్ రాహుల్ నవీన్ బిహార్‌కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో ట్రైనీ ఐఆర్ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది. -
రోడ్డు ప్రమాదంలో.. ఇంటర్ విద్యార్థి విషాదం!
ఆదిలాబాద్: దహెగాం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై కందూరి రాజు కథనం ప్రకారం.. కుంచవెల్లికి చెందిన చిప్ప సూరజ్‌కు ఎలక్ట్రికల్ షాపు ఉంది. చౌదరి నవీన్ (17)తో కలిసి సామగ్రి కొనుగోలు కోసం బైక్‌పై కాగజ్‌నగర్‌కు వెళ్లారు.తిరిగివస్తుండగా మండల కేంద్రం మల్లన్న ఒర్రె సమీపంలోని కల్వర్టు వద్ద ఆగి ఉన్న మరో బైక్‌ను అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రైతుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్సులో కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ చౌదరి నవీన్ మృతి చెందాడు. నవీన్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి చౌదరి తిరుపతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
డ్రగ్స్‌తో జీవితం అంధకారమే
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్‌కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్ బారిన పడొద్దు..’అంటూ నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన కురుమ్‌తోత్ రాథోడ్ నవీన్ నాయక్ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్‌ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్ చేయడంతో దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్ పీఎస్‌లో నమోదైన ఎన్డీసీఎస్ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. ఒత్తిడిని అధిగమించాలివిద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్‌కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్ నాయక్ చెప్పాడు. భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు. ముగ్గురికి పాజిటివ్మాదాపూర్లోని హైటెక్స్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. దూద్ బౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్ మోటికర్ సిచి్చతానంద్ అలియాస్ సచిన్ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్‌తోత్ నవీన్ నాయక్, ప్రణీత్‌రెడ్డి, రాహుల్‌రాజ్‌ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్ పెడ్లర్ ధూల్‌పేట్‌కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్‌తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్) తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్ నంబర్లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్ జోన్ పరిధిలో డ్రగ్స్‌పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గంజాయి డాన్ నీతూ బాయ్ ఆస్తులు అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్‌బీ డీఎస్పీ రమే‹Ù, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
సూర్యాపేట: అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఎర్టిగా కారును అద్దెకు తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్‌ను కలిసేందుకు గురువారం వచ్చారు. వీరంతా బాల్యస్నేహితులు. అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్‌ను కూడా కారులో ఎక్కించుకుని కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జటంగి సాయి (17), అంతటి నవీన్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మారగోని మహేష్, కావడి శివ, అబ్బురి గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ల ధనుష్ అలియాస్ బన్ని, ఉదయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ధనుష్ కారును 170 స్పీడ్‌తో నడపడంతోనే అదుపు తప్పినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టు విరిగిపోవడమే కాకుండా కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కట్టేసి, కారం చల్లి..
కరీంనగర్ క్రైం: కుటుంబ కలహాలతో భర్తను అతికిరాతకంగా కడతేర్చిందో భార్య. తాళ్లతో కట్టేసి, కారంపొడి చల్లి, వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన తోట హేమంత్(39)కు 2012లో రోహితితో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. హేమంత్ పెట్రోల్‌బంక్‌లో పనిచేసి మానేశాడు. రోహితి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పేషెంట్ కేర్‌గా పనిచేస్తోంది. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం గొడవ తీవ్రమైంది. దీంతో రోహితి హేమంత్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆస్పత్రిలో పనిచేసే నవీన్, సాయికుమార్ సాయం కోరింది. బుధవారం రాత్రి వారిని ఇంటికి పిలిచింది. వారు ఇంటికి వచ్చి గేటు, ఇంటి తలుపులు మూసేశారు. ముగ్గురూ కలిసి హేమంత్‌ను తాళ్లతో కట్టేశారు. కళ్లలో కారం కొట్టారు. అనంతరం నవీన్, సాయికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత రోహితి హేమంత్ శరీరంపై వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణరహితంగా దాడి చేసింది. తల, మర్మాంగాలపై దాడి చేయడంతో రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో రోహితి అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. హేమంత్ తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కన్నతల్లి కళ్లెదుటే..: తన కళ్లెదుటే హేమంత్‌ను కొట్టారని, కొట్టొద్దని బ్రతిమిలాడినా వినలేదని విమల రోదించింది. వేడినీళ్లు, కారంపొడి పోస్తూ దాడి చేశారని, ముగ్గురు పిల్లలున్నారు వద్దన్నా వినకుండా చంపేశారని భోరుమంది. పథకం ప్రకారమే హేమంత్‌ను నిందితులు చంపారని బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం నుంచి నవీన్, సాయికుమార్ పలుమార్లు ఫోన్ చేశారని హేమంత్ తమకు చెప్పాడన్నారు. ఈ క్రమంలోనే రాత్రి ఇంటికి వచ్చి పథకం ప్రకారం దాడిచేసి చంపారని ఆరోపించారు. -
కొడుకు కళ్లెదుటే తండ్రి ఉరేసుకుని
కౌడిపల్లి (నర్సాపూర్): ఆర్థిక ఇబ్బందులు భరించలేక నాలుగేళ్ల కన్నకొడుకు కళ్ల ముందే తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్(34), అతని తల్లి లలిత వ్యవసాయం, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. నవీన్ భార్య.. కుమారుడు లోకేష్ పుట్టిన తర్వాత వీరికి దూరంగా వెళ్లిపోయింది. కాగా, ఇటీవల లలిత కాలుకు గాయమై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొలుత మెదక్‌లో వైద్యం చేయించారు. అక్కడ తగ్గకపోవడంతో వైద్యులు.. గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని, తొలగించాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలకు డబ్బులు లేకపోవడంతో నవీన్ అప్పులు చేశాడు. దీంతో రోజురోజుకూ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉదయం నవీన్ తన కొడుకు లోకేష్‌తో కలిసి చింతకాయలు తెంపుకొద్దామని తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో కొడుకు చూస్తుండగానే.. చింతచెట్టు ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఏడుస్తుండటంతో అటుగా వెళుతున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆమెస్థానంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ను నియమించారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆది వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాంభూక్యను ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సరీ్వసులకు తిప్పి పంపించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ► హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, ► రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగాను ► సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ కె. అశోక్‌రెడ్డిని ఉద్యానవనశాఖ డైరెక్టర్‌గా క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ, శిశు, వయోజనుల సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ, ఆమెకే ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ పోస్టును సైతం ప్రభుత్వం అప్పగించింది. ► హైదరాబాద్ జూ పార్క్ డైరెక్టర్‌గా ఉన్న విఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌కు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నియమించింది. ► వెయిటింగ్లో ఇద్దరిలో సీతాలక్ష్మిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీల కార్యదర్శిగాను, జి.ఫణీంద్రరెడ్డికి హైదరాబాద్ జిల్లా రేషనింగ్ అధికారిగా బదిలీ చేసింది. -
ఈ సినిమా నా బిడ్డలాంటిది..ఆ విషయంలో మాత్రమే బాధపడ్డా: డెవిల్ డైరెక్టర్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ డెవిల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించగా.. శ్రీకాంత్ విస్సా కథను అందించారు. అయితే ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ నవీన్ తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దర్శక-నిర్మాతగా అభిషేక్ నామా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ వివాదంపై నవీన్ మేడారం స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు క్రెడిట్ దక్కలేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. నవీన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'డెవిల్ చిత్రం కోసం దాదాపు మూడేళ్లు శ్రమించా. స్క్రిప్ట్‌తో సహా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు అనుగుణంగా తెరకెక్కించా. ఈ సినిమాను హైదరాబాద్, వైజాగ్, కారైకుడిలో షూట్ చేశాం. చిన్న చిన్న సన్నివేశాలతో సహా దాదాపు 105 రోజులు కష్టపడ్డాం. నేను అనుకున్న విధంగా ఈ చిత్రం తెరకెక్కించా. నాకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా డెవిల్ నా సినిమానే.' అని రాసుకొచ్చారు. ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. కానీ నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది. ఈ వివాదంలో చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్ ఇవ్వలేదనే బాధపడుతున్నా. నా టాలెంట్‌పై నాకు నమ్మకం ఉంది. నా కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా.' అని పోస్ట్ చేశారు. కల్యాణ్‌రామ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని.. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా. మరో కొత్త చిత్రానికి సంతకం చేశా. ఆసక్తికరమైన స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నా. త్వరలోనే వెల్లడిస్తానని నవీన్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Naveen Medaram (@naveen_medaram) -
మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం..
కరీంనగర్: ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు.. అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మలివయసులో అండగా ఉంటారనుకున్న ఇద్దరు కుమారు హఠాత్తుగా చనిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఈ విషాద సంఘటన మంథనిలో విషాదం నింపింది. పుట్టినప్నుంచి ఎంతో ఆప్యాయంగా పెరిగి వారి బంధాలు.. మరణంలోనూ ఒకటిగా కలిసే పోవడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై కిరణ్ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి నాగరాజు(42), ఆయన సోదరుడు నవీన్(35) రామగిరి మండలం బేగంపేటకు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై పనినిమిత్తం వెళ్తున్నారు. అయితే, లక్కేపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా, అతివేగం వచ్చిన ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన అక్కేపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌గా గుర్తించారు. అన్నదమ్ములను ఢీకొట్టిన ట్రాక్టర్ సమీపంలోని ప్లాట్ల వద్ద అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్లాట్లలో మట్టి పడి ఉంది. ట్రాక్టర్ బోల్తాపడిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ట్రాక్టర్‌ను సరిచేసుకొని డ్రైవర్ అక్కడి పారిపోయినట్లు భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నాగరాజుకు భార్య, కూతురు(12) ఉన్నారు. అలాగే నవీన్‌కు భార్య, సంవత్సరం, మూడేళ్ల కుమారులు ఉన్నారు. మృతులిద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కదిలించిన హృదయాలు.. మంథని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి రాధ– బాపు దంపతులకు నలుగురు కుమారులు. అనారోగ్యంతో బాపు మూడేళ్ల క్రితం మృతి చెందాడు. భర్తను కోల్పోయిన రాధ.. దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తన కుమారులను చూసుకుంటోంది. ఇందులో ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో కుమారుడు అమాయకుడు కావడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. కాగా, నాగరాజుకు కుమారుడు లేడు. దీంతో కూతురుతో చితికి నిప్పంటించారు. అలాగే నవీన్ పెద్దకుమారుడు(3)తో చితికి నిప్పు పెట్టించడంతో అక్కడున్నవారుకన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అన్నదమ్ములు ఒకేరోజు ప్రమాదంలో మృతి చెందడం విషాదం నింపింది. ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
ప్రతి సినిమాకు అదే అసలైన బలం : విశ్వక్ సేన్
‘చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదని ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్‌నుమా దాస్’ వంటి ఎన్నో చిత్రాలు నిరూపించాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలామంది. కానీ ఆ చిత్రంలో పనిచేస్తున్న వాళ్లు ఎంత ప్రతిభావంతులు అనేది చూస్తే అదే సినిమాకు అసలైన బలం. ‘రామన్న యూత్’ చిత్రానికి అలాంటి మ్యాజిక్ జరగాలి.ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్గా చేశారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడకకి విశ్వక్ సేన్, నటులు ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో తిర్వీర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. ‘నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ‘‘ప్రేక్షకులకు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనేది తెలియదు. మంచి కథ ఉంటే ఆ చిత్రాన్ని తప్పకుండా చూస్తారు. ‘రామన్న యూత్’ని థియేటర్ లో చూసి ప్రోత్సహించాలి’’ అన్నారు అభయ్ నవీన్. -
నిర్మాత కావాలన్నదే లక్ష్యం
‘‘కృష్ణ, చిరంజీవిగార్ల సినిమాలు చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీగార్ల స్ఫూర్తితో హాస్య నటుడిగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నిర్మాత కావాలన్నదే నా లక్ష్యం.. అలాగే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్మించాలన్నది నా కల’’ అని నటుడు గడ్డం నవీన్ అన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ ‘సైంధవ్’ చిత్రాలతో పాటు ‘భైరవ కోన’, ‘మిస్టరీ, ‘వృషభ’, ‘చూ మంతర్’, ‘భూతద్దం భాస్కర్’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్న ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేస్తే, వాటిలో 90 చిత్రాల్లో మంచి పాత్రలొచ్చాయి. ఈ ఏడాది సంతృప్తికరమైన ప్రయాణం సాగుతోంది’’ అన్నారు. -
యువత గెలవాలి – సిద్ధార్థ్
‘‘రామన్న యూత్’ టైటిల్ బాగుంది. అభయ్ నాకు ఇష్టమైన నటుడు. ఈ సినిమాలో ఒక కథను కాకుండా తన జీవితంలో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్లో వినోదం, భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా యువత గెలవాలి.. అలా ఈ ‘రామన్న యూత్’ కూడా గెలవాలి’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సిద్ధార్థ్ విడుదల చేశారు. అభయ్ నవీన్ మాట్లాడుతూ– ‘‘ఒక ఊరిలో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి? అనేది సినిమాలో చూపిస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో సాగే పోలిటికల్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: ఫహాద్ అబ్దుల్ మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: శివ ఎంఎస్కే. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్
చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగ ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్ స్పందించాడు. నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అనే సంగతి తెలిసిందే. 'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాపించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్.. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను. అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు, తేజ, రణ్వీర్ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం.. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.' అని నవీన్ తెలిపాడు. తేజ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా రణ్వీర్ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కానీ కుటుంబసభ్యులందరితో మంచి రిలిషన్‌షిప్ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్ షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్‌లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తండ్రి నరేశ్ అంటే ఎంతో గౌరవం అని నవీన్ తెలిపాడు. (ఇదీ చదవండి; డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) -
నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!
సీనియర్ నటుడు నరేశ్ కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతితో విబేధాలు, పవిత్ర లోకేశ్‌తో ప్రేమాయణం.. ఆపై కోర్టు కేసులు ఇలా వీటితోనే సెన్సేషనల్ అవుతూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే అతడి మొదటి భార్య తనయుడు నవీన్ మొదట్లో నటుడిగా కనిపించి సత్య అనే షార్ట్ ఫిలింతో దర్శకుడిగా మారాడు. తాజాగా అతడు తన తండ్రి గురించి మాట్లాడుతూ.. 'మా ఫ్యామిలీలో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. ఎవరి మీదా ఆధారపడరు. మొదటి నుంచీ అదే జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఎవరి గురించి నేను చెడుగా ఫీలవలేదు. జనాలు మా కుటుంబం గురించి ఏది పడితే అది వాగినా నేను పట్టించుకోలేదు. జనాలకు నచ్చినట్లు బతకలేం కదా.. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. అతడు సంతోషంగా ఉన్నాడా? లేదా? అనేదే మాకు కావాల్సింది! బయట ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతాడు. ఇది ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం. పవిత్ర లోకేశ్ నాకు ఎప్పటినుంచో తెలుసు. చాలా మంచావిడ. నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నానంటే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను. తనను పవిత్రగారు అని పిలుస్తుంటాను' అని నవీన్ చెప్పుకొచ్చాడు. చదవండి: మిస్టర్ ప్రెగ్నెంట్.. డెలివరీ అదిరిపోయింది.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే? -
గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!
గాయాలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్కోసారి అవే ప్రాణాంతకంగా మారవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. దెబ్బల తగిలిన వెంటనే సత్వరమే తగిన చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడొచ్చు అంటున్నారు. దెబ్బల రకాలు, ఎలాంటి చికిత్స తీసుకోవాలి తదితరాలు నవీన్ మాటల్లోనే చూద్దాం!. మనిషికి గాయాలు రెండు రకాలుగా జరుగుతాయి. అవి 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు. మానసిక గాయాలు : మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానుతుంది. అదే మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము మర్చిపోలేం. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియంగా మాట్లాడుట చేతకనివారు మౌనం వహించుట ముఖ్యము. అని మన పెద్దలు చెబుతుంటారు శారీరక గాయము: శరీరానికి బయట వస్తువుల నుంచి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో, వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయం అంటాం. ఒకవేళ గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును. గాయమైనచోట ఇన్ఫెక్షన్కి గురయ్యి 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి. చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్మెంట్, పౌడర్ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. శారీరక గాయాల రకాలు : బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గడ్డకట్టి గీక్కు పోయేలా ఉండే గాయము . గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును . బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము. బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట. ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. అలాంటి సమయంలో ఆయా వ్యక్తులకు ఉపశమనం పొందేలా చికిత్స అందించడం అత్యంత ముఖ్యం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు. కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి. ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి. బెణిగిన లేదా నలిగిన గాయలకు ప్రథమ చికిత్స.. ►నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి. ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి. మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది. ►తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమచికిత్స ►తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి. ►గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి. ►పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు. ►గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి ►గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి. ►ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది. ►గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి. వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి. నొప్పినివారణ మందులు : నొప్పి తగ్గించడానికి అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4 నుంచి 5 రోజులు వాడాలి. యాంటిబయోటిక్స్ : అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు. పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే, పైన పేర్కొన్న మందతుల మీకు తగిలన గాయం తీవ్రత, మీకు అంతకుముందున్న వ్యాధుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్యుని పర్యవేక్షణలోనే ఆయా మందులు వాడాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా? ఐతే దుష్ప్రభావాలు తప్పవు) -
ఆ ఇద్దరూ కలియుగంలోకి వస్తే?
నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి, హీరో తిరువీర్ విడుదల చేసి, సినిమా మంచి హిట్టవ్వాలన్నారు. శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ– ‘‘పురాణాల్లోని జయ విజయలు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు. వాళ్లు ఇప్పుడు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కాల్పనిక కథతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రంలో మంచి భావోద్వేగాలున్నాయి’’ అన్నారు దాము రెడ్డి. ‘‘టీజర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది’’ అన్నారు నవీన్ బేతిగంటి.. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు, సహనిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి. -
ధీమహి.. ఇదో డిఫరెంట్ థ్రిల్లర్!
సాహస్ పగడాల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ధీమహి’. నవీన్ కంటె మరో దర్శకుడిగా, విరాట్ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నిఖితా చోప్రా హీరోయిన్. పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘ధీమహి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
అందుకే గొడవ జరిగింది కోహ్లీతో వివాదం పై నవీన్ ఉల్ హాక్ క్లారిటీ
-
నిత్యం వంటింట్లో ఉపయోగించే వాటితో..గుండెలో బ్లాక్స్‌కి చెక్‌పెట్టండి ఇలా..
చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారినపడుతున్నారు. సినీ స్టార్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ చిన్న వయస్సులోనే గుండెజబ్బుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మారుతున్న జీవనశైలికి తోడు ఉరుకుల పరుకుల జీవనం కారణంగా.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినంత వ్యాయమం లేకపోవడం తదితర కారణాల రీత్యా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వీటికి ప్రధాన కారణం ఓబెసిటీ, స్మోకింగ్. సాధ్యమైనంత వరకు స్మోకింగ్ కు దూరంగా ఉండటమే మంచిది. గుండెకు సరఫరా అయ్యే నాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి గుండె కండరం డ్యామేజ్ అయ్యితే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ॥ Heart Attack ॥3000 years ago in our country India there was a great sage. His name was Maharishi Vagvat ji, he had written a book named Ashtang Hrudayam and in this book he had written 7000 formulas to cure diseases, this is one of them.Vagvat ji writes that whenever the… pic.twitter.com/C2E2EJ9yra— We Hindu (@SanatanTalks) June 4, 2023 అలాగే నడుస్తుంటే ఆయాసం వచ్చిన గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని గుర్తించి సకాలంలో వైద్యుల వద్ద చికిత్స తీసుకోవాలి. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో బ్లాక్‌లు ఉన్నట్లు తేలితే.. ప్రమాద తీవ్రతను బట్టి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవడం మంచిది. ఐతే ఈ బ్లాక్‌లను చక్కటి ఆయర్వేద వైద్యంతో కూడా సులభంగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు నవీన్ నడిమింటి. మనం వంటింట్లో తరుచుగా ఉపయోగించే వాటితోనే ఈ బ్లాక్‌లకు చెక్‌పెట్టొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్ నడిమింటి. అవేమిటో ఆయన మాటల్లోనే చూద్దామా.. అల్లం ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90 శాతం తగ్గించగలదు. వెల్లుల్లి రసం ఇందులో ఉండే అల్లిసిన్ మూలకం కొలస్ట్రాల్‌ని, బీపీని తగ్గిస్తుంది. దీంతో హార్ట్ బ్లాక్ ఓపెన్ అవుతుంది నిమ్మరసం ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో అన్ని నరాలను తెరుస్తాయి. అలసటను తగ్గిస్తుంది. పై వాటన్నింటితో తయారు చేసే ఔషధం రోజు ఉదయం పరగడుపున మూడు స్పూన్లు తీసుకుంటే అన్ని బ్లాక్స్ సులభంగా తొలగిపోతాయి. తయారు చేయు విధానం: నిమ్మరసం - ఒక కప్పు అల్లం రసం- ఒక కప్పు వెల్లులి రసం- ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్- ఒక కప్పు విధానం: ఆ నాలుగింటిని కలిపి సన్నని మంటపై వేడి చేయండి. మూడు కప్పులు అయ్యేంత వరకు బాగా మరిగించండి. ఆ తర్వాత చల్లారిన ఆ మిశ్రమానికి మూడు కప్పుల తేనె కలిపి ఓ సీసాలో భద్రపరుచుకోండి. దీంతో బ్లాక్‌లు సులభంగా తొలుగుతాయని, ఈ సమస్య నుంచి త్వరిత గతిన బయటపడే అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణలు నవీన్ నడిమింటి చెబుతున్నారు. (చదవండి: బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్ ఫాస్ట్‌లో వాటిని దగ్గరకు రానియ్యకండి..) -
కోహ్లీ పేరు ఫుల్ కిక్ ఇస్తుంది
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
నవీన్ ఉల్ హక్ కి చెంపపెట్టులా కోహ్లి పై LSG ట్వీట్
-
హనుకి గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం ‘సలార్’, ప్రా జెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఓ కథ ప్రభాస్‌కు నచ్చిందని, ఈ కథకు ప్రభాస్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఈ స్క్రిప్ట్‌కు హను రాఘవపూడి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ‘రాజా డీలక్స్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
మళ్ళీ కోహ్లీని కెలుకుతున్న గంభీర్, నవీన్.. BCCIకి లేఖ రాసిన కోహ్లీ
-
రైతులకు చట్టాలపై అవగాహన కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: రైతులకు భూమి, నీరు, క్రిమిసంహారక మందులు, మార్కెటింగ్ చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 176 పారా లీగల్ వలంటీర్లను నియమించిందని వెల్లడించారు. గ్రామీణ భవితకు వలంటీర్లు మార్గదర్శకులు కావాలన్నారు. సాగు చట్టాలపై వలంటీర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నల్సార్ యూనివర్సిటీలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్‌రావు మాట్లాడుతూ.. ‘దేశంలోని రైతుల్లో పేద, మధ్య తరగతి వారే ఎక్కువ. వారికి చట్టాలపై అవగాహన తక్కువ. న్యాయం పొందడం వారి హక్కే అయినా కోర్టులకు వెళ్లి దాన్ని పొందాలంటే ఆర్థిక భారంతో కూడిన పని. కోర్టు గ్రామ స్థాయికి వెళ్లి న్యాయం అందించలేని పరిస్థితి. అందుకే ఇలాంటి వారి కోసం న్యాయ సేవా సంస్థలు ఆవిర్భవించాయి. వారికి న్యాయసేవలు అందించడమే వలంటీర్ల బాధ్యత. దీని కోసం పుట్టిందే ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’. బమ్మెరలో రెండు నెలల క్రితం ప్రారంభించాం. ఇప్పుడు 67 ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు రోజుల పాటు జరిగే శిక్షణలో మీకు తెలియనివి నిపుణుల నుంచి తెలుసుకోండి. ప్రతీ చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించకుండా.. గ్రామీణ స్థాయిలో పరిష్కారం అయ్యేలా చూడాలి. మీరు పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు మండల, జిల్లా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు’అని సూచించారు. వారియర్లలా పని చేయాలి... సత్వర న్యాయం అందించేందుకు వలంటీర్లు వారియర్లలా పనిచేయాలని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీకృష్ణదేవరావు సూచించారు. పూర్వం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ‘మధ్యవర్తిత్వం’సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టాలు, పథకాలపై వలంటీర్లకు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీఎస్ఎల్ఎస్ఏ) సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విద్యుల్లత, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, రిసోర్స్ పర్స న్లు, ట్రైనీ పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
అతివేడితో బాధపడుతున్నారా? వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే..
వేసవిలో అతివేడితో బాధపడే వారికి ఆయుర్వేద వైద్యులు సూచిస్త్ను చిట్కాలివి. వేసవి తాప నివారణకు బ్రహ్మఫల చూర్ణంతో చెక్ పెట్టేయొచ్చు. పైత్య (అతి వేడి) శరీరంతో పుట్టిన వాళ్ళు తేనె రంగు శరీరంతో వుంటారు. వీళ్ళ శరీరం ఎక్కువ వేడి చేసి వుంటుంది. మొలలు వేసవి సమస్యలు మొదలగు వేడి సమస్యలతో బాధపడుతూ వుంటారు. బ్రహ్మఫల చూర్ణం ►బాగా పండిన మర్రి పండ్లను ఎండబెట్టి దంచిన పొడి---- 100 gr ►అతిమధురం పొడి ---100 gr ►కలకండ పొడి ---- 100 gr ►అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ►10 గ్రాముల పొడిని కుండలోని నీటిలో కలిపి మూడు పూటలా తాగాలి. ►దీనిని వాడడం వలన ముక్కు నుండి రక్తం కారడం, మొల్ల ద్వారా ఆసనం నుండి, మలము ద్వారా రక్తం పడడం నివారింప బడతాయి. శీఘ్ర స్ఖలన సమస్యలు, గర్భాశయ సమస్యలు, నపుంసకత్వం నివారింపబడతాయి, అదే విధంగా.. పిల్లలు వాడితే పొడవు పెరుగుతారు, వృద్ధులు వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. నడవలేని వాళ్ళు దీనిని వాడితే సమస్య నివారింపబడి నడకలో వేగం పెరుగుతుంది. 2. అతి_వేడి - నివారణ ఉష్ణము ఎక్కువైతే పైత్యం ఎక్కువవుతుంది. దీని వలన రక్తపైత్యము, అధిక రక్తపోటు చర్మ రోగాలు మొదలైనవి వస్తాయి. కావున వేడి శరీరం వున్నవాళ్ళు వేడిని తగ్గించే పదార్ధాలను వాడాలి. ముఖ్యంగా తీపిపదార్ధాలను ఎక్కువగా వాడాలి. ఆవుపాల పాయసాన్నము తినాలి. ►పొన్నగంటి కూర, బచ్చలి, పెరుగు తోటకూర, కరివేపాకు మొదలైనవి వాడుకోవాలి. ►ద్రాక్ష, బాదం, ఎండు ఖర్జూరం, కొబ్బరినీళ్ళు తరచుగా వాడాలి. ►వేడి ఎక్కువైతే పైత్యము ఎక్కువవుతుంది. దీని వలన నోటిపూత, అరిచేతుల, అరికాళ్ళ మంటలు, శరీరమంతా వేడిగా వుండడం మొదలైన లక్షణాలుంటాయి. ►కొబ్బరినూనె, ఆముదము శరీరాన్ని ఎంతో చల్లబరుస్తాయి. ఆముదాన్ని లోపలి సేవిస్తే వేడి చేస్తుంది. పై పూతగా వాడితే శరీరాన్ని చల్లబరుస్తుంది. ►చెరువులోని బంకమట్టిని తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి, నీళ్ళు పోసి పిసికి శరీరం మొత్తానికి అరికాళ్ళతో సహా పట్టిస్తే వెంటనే శరీరం చల్లబడుతుంది. ►వేడి ఎక్కువైతే మలము గట్టి పడి సమస్య ఏర్పడుతుంది. ఆహారం ►గుప్పెడు ఎండు ద్రాక్షను రాత్రి ఒక గ్లాసులో వేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. దానిని ఉదయం బాగా పిసికి పానీయం లాగా చేసి తాగాలి. దీని వలన వేడి తగ్గి ఒక గంటలో సుఖ విరేచనమవుతుంది. రక్తంలోని మలినాలు తొలగించబడతాయి. ►అలాగే ఆహారంలో మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి. ►బార్లీ నీళ్ళు, చక్కర కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు సేవిస్తే వేడి తగ్గుతుంది. ►వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది. 3. వేడి_తగ్గడానికి 1.తులసి రసం ---- ఒక టీ స్పూను నిమ్మ రసం ---- ఒక టీ స్పూను అల్లం రసం ---- ఒక టీ స్పూను చక్కెర ----- ఒకటి లేక రెండు స్పూన్లు అన్నింటిని కలుపుకొని ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు సేవిస్తే పైత్యం వలన కలిగే వాంతి, అన్నం చూస్తేనే వాంతి (అన్న ద్వేషం) ,అజీర్ణం, ఆకలి లేకపోవడం, కళ్ళు ఎర్రబడడం, గొంతులో మంట మొదలైనవి నివారంప బడతాయి. దీని వలన కఫము, వేడి రెండు తగ్గుతాయి. చిన్న పిల్లలకు మోతాదు తగ్గించి వాడాలి. 2. తులసి రసం ----- ఒక గ్లాసు నువ్వుల నూనె ---- ఒక గ్లాసు రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. తలలో పైత్యం ఎక్కువై మంటలు, చురుకు వున్నపుడు ఆ నూనెను తలకు పెట్టి సున్నితంగా మర్దన చెయ్యాలి. 4. అతి వేడి సమస్య - నివారణ అతి మధురం పొడి --- ఒక టీ స్పూను పాలు --- అర గ్లాసు కలకండ లేదా చక్కెర --- ఒక టీ స్పూను పాలు స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి, దించి వడపోసి గోరువెచ్చగా అయిన తారువాత చక్కెర గాని, కలకండ గాని, తేనె గాని కలుపుకొని తాగాలి. దీని వలన వెంటనే వేడి తగ్గుతుంది. ఇది ఇరవై రకాల వేడి సమస్యలను నివారిస్తుంది. అతి వేడి నివారణకు అమృతాహారం ►ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. ►అతి వేడి వలన కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు వుంటాయి. ►ఉల్లి ---- 50 gr ►నూనె లేక నెయ్యి ---- 50 gr ►పెరుగు ---- ఒక కప్పు ►ఉల్లి గడ్డలను సన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో పోసి నెయ్యి తో గాని నూనె తో గాని వేయించాలి. చల్లార్చి ఒక కప్పు పెరుగు కలపాలి. దీనిని ఉదయం గాని, సాయంత్రం గాని ఆహారంగా తీసుకోవాలి. వేడి ఎక్కువగా వుంటే రెండు పూటలా వాడుకోవచ్చు. శరీరంలోని అతివేడి తగ్గడానికి తంగేడు_కాఫీ తంగేడు పూల పొడి --- 100 gr పత్తి గింజల పొడి --- 50 gr ధనియాల పొడి --- 50 gr గులాబి రేకుల పొడి ---30 gr శొంటి పొడి --- 20 gr చిన్న ఏలకుల పొడి --- 20 gr సుగంధ పాల వేర్ల పొడి --10 gr తంగేడు విత్తనాల పొడ --10 gr అన్ని పదార్ధాలను కలిపితే తంగేడు కాఫీ పొడి తయారవుతుంది. కాఫీ ఫిల్టర్ లో పొడి వేసి డికాషన్ తయారు చేసి చక్కెర కలుపుకొని తాగితే శరీరం యొక్క వేడి తగ్గి, మెదడు చల్లబడుతుంది. మెదడుకు బలం చేకూరుతుంది. #అత్యుష్ణాన్నితగ్గించేపానీయం సుగంధ పాల వేళ్ళపొడి ----- అర టీ స్పూను ధనియాల పొడి ----- అర టీ స్పూను వట్టి వేర్ల పొడి ---- పావు టీ స్పూను కలకండ పొడి ----- ఒక టీ స్పూను ఒక గ్లాసు నీళ్ళలో అన్ని పొడులను వేసి మరిగించి అర గ్లాసు కషాయానికి రానివ్వాలి, వడపోసి, చల్లార్చి కలకండను కలపాలి. చల్లారిన తరువాత తాగాలి. దీని వలన పైత్య దోషము వలన వచ్చే తలనొప్పి ( లేదా అతి వేడి వలన వచ్చే తలనొప్పి ) తగ్గుతుంది. పిత్త సంహార ముద్ర దీనినే ప్రాణ ముద్ర లేక శక్తి ముద్ర అని కూడా అంటారు. ►బొటన వ్రేలి కొన, చిటికెన వ్రేలి కొన, ఉంగరపు వ్రేలి కొన లను కలిపి మిగిలిన రెండు వ్రేళ్ళను కిందికి పెట్టి ముద్ర వేసుకొని పద్మాసనంలో కూర్చోవాలి. ►దీని వలన అత్యుష్ణము వలన వచ్చే సమస్యలు, సెగ గడ్డలు, పొక్కులు, తలనొప్పులు చాలా అద్భుతంగా తగ్గుతాయి ►బార్లీ పేలాల పిండి చక్కెర.. రెండింటిని కలిపి తింటే అతి వేడి తగ్గుతుంది. ►అతి వేడి వలన శరీరలో వచ్చే మంటలు --నివారణ ►ఆవాలను మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూస్తే శరీరంలోని మంటలు తగ్గుతాయి. ►శరీరం లోని అతి వేడిని తగ్గించడానికి మృత్తికా స్నానం ►ఈ ప్రక్రియ శరీరంలోని సకల మలినాలను తొలగిస్తుంది. ►పూర్వం ఒండ్రుమట్టిని తెచ్చి పిసికి ఒంటికి తలకు మట్టి పూసేవాళ్ళు. కొంతసేపటికి తలమీద మట్టి పులిసేది. ►ఒండ్రుమట్టి 5, 10 కిలోలు తెచ్చి ఎండబెట్టి నలగగొట్టి జల్లించి పట్టుకోవాలి. ►వేపాకుపొడిని, తులసి ఆకుల పొడిని, ;పసుపు పొడిని కలిపి విడిగా కలిపి పెట్టుకోవాలి. వేపాకు పొడి --- రెండు స్పూన్లు తులసి ఆకుల పొడి --- రెండు స్పూన్లు పసుపు పొడి --- రెండు స్పూన్లు ►బాగా వేడి శరీరం వున్నవాళ్ళు కొద్దిగా ముద్దకర్పూరం కలుపుకోవచ్చు. ఈ చూర్నాల మిశ్రమాన్ని, మట్టిపొడిని తగినంత నీటితో కలిపి శరీరానికి, తలకు, ముఖానికి పట్టించి అర గంట తరువాత స్నానం చేయాలి. ►దీని వలన శరీరంలో వుండే వేడి అంతా తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -నవీన్ నడిమింటి -
కోహ్లీ, గంభీర్‌కి బిగ్ షాక్.. నవీన్‌కి కూడా దెబ్బ పడింది
-
ప్రేమ గుడ్డిదని తెలుసు.. కానీ: ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఆర్జీవీ అనగానే ఠక్కున గుర్తొచ్చే రాంగోపాల్ వర్మ. అటు బాలీవుడ్.. ఇటూ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన చేసే కామెంట్స్‌తో తరచుగా వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇండస్ట్రీలో వివాదస్పద దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు ఆర్జీవీ. తాజాగా మరోసారి ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నేనావత్ నవీన్ హత్యపై ఆయన ట్వీట్ చేశారు. నవీన్, హరిహరకృష్ణ, నిహారిక ఫోటోలను తన ఖాతాలో షేర్ చేశారు. ట్విటర్లో ఆర్జీవీ రాస్తూ..' ఈ పోటోలో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి కోసం మరో వ్యక్తిని చంపేశాడు. ప్రేమ అనేది గుడ్డిదని నాకు తెలుసు. కానీ మరీ ఇంత గుడ్డిదని నాకు తెల్వదు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. గత నెల 17న అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతంలో నవీన్‌ను హరిహరకృష్ణ కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. The guy on the left top killed the guy on left bottom for the girl on the right ..I knew that love is blind but I dint know it was this BLIND 😳😳😳 pic.twitter.com/CONDhZcesY — Ram Gopal Varma (@RGVzoomin) March 12, 2023 -
నవీన్ హత్య కేసులో కీలక అంశాలు
-
Naveen Case: నవీన్‌తో బ్రేకప్ అయ్యాకే హరి దగ్గరయ్యాడు: నిహారిక!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో ముందుకు పోయే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకు.. నిహారిక ప్రేమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ చెప్పగా, హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పలేదని.. నిందితుడికి తాము సాయపడ్డామని హరి ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్‌లు పోలీసులు ముందు ఒప్పుకున్నారు. నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక పోలీసుల ఎదుట నవీన్ నేరాన్ని అంగీకరిస్తూ.. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కస్టడీ విచారణలో హరిహర కృష్ణ చెప్పింది ఇదే.. నేను ఇంటర్ 2017-2019 మధ్య దిల్షుక్ నగర్ లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా. నవీన్ నాకు సెకండ్ ఇయర్ లో పరిచయం. అప్పటి నుంచి ఇద్దరం మంచి స్నేహితులం. వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్ చేస్తున్నప్పటికీ.. ఇద్దరం తరచూ కలుసుకునేవాళ్లం. గతంలో నవీన్, నిహారిక ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. అన్ని విషయాలు నాతో పంచుకునేవాళ్లు. అయితే.. నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి నిహారిక గొడవ పడింది. అతనితో మాట్లాడడం మానేసింది. నీహారిక అంటే నాకు కూడా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా వుండే వాడిని. వాళ్లిద్దరూ విడిపోయారని తెలిశాక.. కొన్ని నెలల కిందట ఆమెకు ప్రపోజ్ చేశా. ఆమె సరే అంది. అప్పటి నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అయితే.. నవీన్ అప్పుడప్పుడు నిహారికకు కాల్ చేసి, మెసేజ్‌లు చేసేవాడు. అది నిహారికకు నచ్చేది కాదు. ఆ విషయం నాతో చెప్పుకుని బాధపడింది. నిహారికను ఇబ్బంది పెడుతున్నాడనే కోపంతో నవీన్‌ను చంపాలని మూడు నెలల కిందటే నిర్ణయించుకున్నా. రెండు నెలల కిందట ఓ షాపింగ్ మార్ట్‌లో కత్తి కొన్నాను. అలాగే వేలి ముద్రలు పడకూడదని ప్లాస్టిక్ గ్లౌజ్‌లు కొన్నా. వాటిని ఇంట్లో సజ్జపైన ఎవరికీ కనిపించకుండా ఓ బ్యాగులో దాచా. జనవరి 16వ తేదీన.. ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాం. కుదిరితే అదే రోజు నవీన్ ను హత్య చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు అందరూ కలవడం కుదురలేదు. మళ్లీ.. ఫిబ్రవరి 17వ తేదీన నవీన్ నాకు కాల్ చేసి , హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా మరోస్నేహితుడు ఇద్దరం కలిసి ఉప్పల్‌లో సినిమాకు వెళ్లాం. ఈలోపు నవీన్ ఎల్బీ నగర్లో ఉన్నా అని కాల్ చేశాడు. నా బైక్‌పై నేను, నా ఫ్రెండ్ వెళ్లి.. నవీన్‌ను పికప్ చేసుకున్నాం. నాగోల్‌లో భోజనం చేశాక.. నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. నేను , నవీన్ మలక్ పేటలోని మా ఇంటికి వెళ్ళాం. ఆరోజు రాత్రి నవీన్ హాస్టల్ కు వెళ్తా అన్నాడు. నేను కూడా వస్తా అని చెప్పా. హత్యకు ఇదే ఛాన్స్ అనుకుని.. సజ్జపై దాచిన బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లా. ఆరోజు నా ఫోన్ నుండి నవీన్.. నీహారికకు కాల్ చేసి ఆరు నుంచి ఏడు నిముషాలు మాట్లాడాడు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు ఓఆర్ఆర్ దాటగానే.. ఈ టైం లో అంత దూరం వద్దు అనుకున్నాం. ఇద్దరం కలిసి మందు తాగాం. ఆ తర్వాత నిహారిక గురించి మాట్లాడాలని నవీన్‌తో చెప్పాను. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను నేను ప్రేమించుకుంటున్నామని, ఆమెను ఫోన్లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగా. నవీన్ కోపంతో నన్ను కొట్టాడు. నవీన్ చంపాలనే కసి మీద ఉన్న నేను.. ఆ కోపంతోనే నవీన్‌ను తోసేసి గొంతు నులిమి చంపేశా. శ్వాస ఆగిపోయిందని గుర్తించి.. కత్తితో శరీర భాగాలను వేరు చేశా. శరీర భాగాలను వేరు చేసే టైంలోనూ నాలో ఆవేశం చల్లారలేదు. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో పడేసాను. నవీన్ సెల్‌ఫోన్‌ను రోడ్డుపై పడేశా. శరీర భాగాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. ఆ బ్యాగును రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేసాను. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లిలో ఉన్న నా ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్లా. అక్కడ బట్టలు మార్చుకుని.. హసన్‌కు అసలు విషయం చెప్పా. హసన్ భయపడ్డాడు. నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. ఉదయం వెళ్లి లొంగిపోతా అని చెప్పా. రక్తంతో తడిసిన నా బట్టలను ఒక బ్యాగ్‌లో వేసి.. సాగర్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశా. ఉదయం 10 గంటలకు నిహారిక కు ఫోన్ చేసి రోడ్డు మీదకి రమ్మన్నా. అప్పుడు నవీన్‌ను చంపేశానని నిహారికతో మొత్తం జరిగింది చెప్పా. ఆమె భయపడింది.. తిట్టింది. ఆ తర్వాత బైక్ ఇంట్లో పెట్టి.. వరంగల్‌కు వెళ్లా. మా నాన్నకి విషయం చెప్పడంతో.. లొంగిపోవాలని సూచించాడు. తిరిగి 24వ తేదీ హాసన్ ఇంటికి వెళ్లా. ఇంకా ఎందుకు పోలేదు అని నిలదీశాడతను. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని .. హత్య చేసిన స్పాట్ కి వెళ్లా. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశా. ఆ తర్వాతే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ముందు లొంగిపోయా. నవీన్ దూరం అయ్యాకే.. హరి దగ్గరయ్యాడు! ఇక మరో ఇద్దరు నిందితులు హసన్, నిహారికలు సైతం నేరాన్ని అంగీకరించారు. నేరం గురించి తెలిసి కూడా భయంతో ఎవరికీ చెప్పలేదన్నారు. ఇక నవీన్ హత్య తర్వాత.. తనను హరి నాలుగుసార్లు కలిసినట్లు నిహారిక ఒప్పుకుంది. నవీన్ తాను ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే తమ బ్రేకప్ అయ్యాక హరి తనకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెప్పిందామె. నిహారిక కన్ఫెషన్ స్టేట్మెంట్.. ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్ నేను గొడవ పడితే హరిహరకృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్ తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని. నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నవీన్ నాతో మాట్లాడానికి యత్నిస్తున్నాడని హరికి చెప్పా. నవీన్ కోపంతో రగిలిపోయేవాడు. కానీ, నేను అది సరదానేమో అనుకున్నా ఒక్కోసారి.. నవీన్‌ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అనేవాడు. నేను తిడితే.. అదీ జోక్ అనేవాడు. ఒకరోజు వాళ్ల ఇంటికి తీసుకెళ్లి.. ఒక బ్యాగులో గ్లౌజులు, కత్తి చూపించాడు. నవీన్‌ను చంపేందుకే ఇవి అన్నాడు. అది నేను నమ్మలేదు. అలా మాట్లాడొద్దని తిట్టా. నవీన్‌తో మాట్లాడడం మానేశానని, ఇక అతను నన్ను మరిచిపోతాడని, మనం సంతోషంగా ఉందామని హరికి చెప్పా. హత్యకు రెండు రోజుల ముందు నుంచి ఇంటర్ ఫ్రెండ్స్ కలుస్తున్నట్లు హరి నాకు చెప్పాడు. నవీన్ గనుక ఈసారి కాల్ చేస్తే.. వేరే వాళ్లతో రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆరోజు హరి ఫోన్ నుంచే నవీన్ ఫోన్ చేశాడు. నేను హరి చెప్పినట్లే చెప్పా. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత హరి నాకు ఫోన్ చేశాడు. నవీన్ ఇంక నీతో మాట్లాడడంట అని చెప్పాడు. నేను సరే అన్నాడు. ఆ ఉదయం హరి నన్ను కలవాలని మేసేజ్ చేశాడు. పాత బట్టలతో వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీదకు వచ్చాడు. ఆ అవతారం చూసి ఏంటని అడిగా. అప్పుడు నవీన్‌ను చంపిన విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలంటే.. మనీ ఇచ్చా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని డిసైడ్ అయ్యా. ఫిబ్రవరి 20వ తేదీ రోజున నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా .. హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్ లో కలిసాడు. నవీన్‌ను చంపిన ప్రాంతాలను తిప్పి చూపించాడు. ఈలోపు నవీన్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఆరాలు తీశారు. నాకు తెలియది చెప్పా. ఆ తర్వాత హరి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన ఫోన్ చేశాడు. ఆ తర్వాత హసన్ ఫోన్ చేసి హరి మిస్సయినాడని, వాళ్ళ అక్కాబావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పాడు. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయమని సూచించాడు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హసన్ మరో ఎవరికీ ఫోన్ చేయొద్దని చెప్పించాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో హరిని చూశాం. అక్కడ చాలాసేపు మాట్లాడి.. నేను పోలీసులకు లొంగిపోతాను అని చెప్పాడు. ఆపై విడిభాగాలను చంపిన స్థలంలోనే వేయమని హసన్, హరికి సూచించాడట. ఆ పని చేశాక.. బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చాడు. నాకు ఫోన్ చేసి.. మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో హరి స్నానం చేసినాడు. మా బావ అడ్వకేట్. ఆయనతో మాట్లాడాలని.. హరి చెప్పగా, అప్పుడు నేను మా బావ భూపాల్ రెడ్డిని పిలిచి నవీన్ మర్డర్ గురించి చెప్పాం. ఇది పెద్ద కేసు వెంటనే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలని చెప్పాడు. ఆపై హరి అదే రోజున వెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులకు, నవీన్ ఫ్రెండ్స్‌కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు. హరిహరకృష్ణ చెప్పిన మాటల్ని నమ్మాను అని నిహారిక పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది. -
చంచల్‌గూడ జైలుకు నిహారిక
సాక్షి, క్రైమ్: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్‌లను ఏ2, ఏ3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హాసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్‌ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్‌ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్ఫర్ కూడా చేసింది. నవీన్‌ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది. -
నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా హరిహరకృష్ణ ప్రియురాలు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం హరిహరకృష్ణకు ప్రియురాలు డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ‘‘నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్‌కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికతో పాటు హసన్‌ను రిమాండ్‌కు తరలించాం’’ అని డీసీపీ వెల్లడించారు. ‘‘హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్ఫర్ చేసింది. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారు. నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. చదవండి: నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ -
నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు విచారణలో భాగంగా రాచకొండ పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రేమించిన ప్రియురాలు దూరం అవుతుందన్న సాకుతో ఫిబ్రవరి 17 న తోటి స్నేహితుడిని అత్యంత పాశవికంగా నిందితుడు హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం పోలీసులు గుర్తుపట్టకుండా మృతదేహాన్ని క్రూరంగా చేతి వేళ్ళు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి దహనం చేశాడు. అనంతరం దొరికిపోతాననే భయంతో తానే స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎదుట గత నెల 24న లొంగిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు హత్యకు ముందు, తర్వాత పరిణామాలను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి తెలుసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడు హరిని హత్య జరిగిన ప్రదేశం అబ్దుల్లాపూర్ మెట్ కు తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. దానికంటే ముందు నిందితుడు హరిని చర్లపల్లి జైలు నుంచి తరలించి వనస్థలిపురం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి కస్టడీ విచారణ ప్రారంభించారు. యువతితో పరిచయం, సేహితుడి మధ్య విభేదాలను ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు హరిని తిరిగి చర్లపల్లి జైలులో రిమాండుకు తరలించారు. హసన్‌తో పాటు హరి సోదరినీ విచారించిన పోలీసులు నిందితుడు హరి సోదరి మూసారాంబాగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను కూడా విచారించినట్టు తెలిసింది. హత్య గురించి ఆమెకు ముందే తెలుసునని అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిందితుడు హరి స్నేహితుడు హసన్‌ను కూడా శనివారం మరోసారి పోలీసులు విచారించినట్టు తెలిసింది. యువతికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు– రాచకొండ సీపీ చౌహాన్ అబ్దుల్లాపూర్ మెట్ హత్య కేసులో యువతి కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. హరిని విచారిస్తున్నామని అన్ని ఆధారాలూ సేకరిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసుపై ఇప్పుడే పూరిస్థాయిలో సమాచారం చెప్పలేమన్నారు. -
భయం.. తత్తరపాటు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసులో మృతుడు నవీన్ శరీర భాగాలు పోలీసులకు ఇంకా దొరకలేదు. హతుడి ఫోన్‌తో పాటు నిందితుడు హరిహరకృష్ణ సెల్ఫోన్లు సైతం ఇంకా స్వాదీనం చేసుకోలేదు. దీంతో తొలిరోజు కస్టడీలో నిందితుడు హరిని పోలీసులు ఆయా వివరాలను రాబట్టే కోణంలోనే విచారించారు. గత నెల ఫిబ్రవరి 17న ప్రేమించిన యువతి దూరమవుతుందనే అనుమానంతో మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్‌ను స్నేహితుడు హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి ముక్కలు చేశాడు. అనంతరం ఫిబ్రవరి 24న నిందితుడు హరి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడిని ఈనెల 9వ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి జైలు నుంచి నిందితుడిని తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం విచారణ చేపట్టారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎలాంటి భయం, తత్తరపాటు లేకుండా నిందితుడు సమాధానాలు ఇచ్ఛినట్లు తెలిసింది. హత్య కేసులో మరిన్ని ఆధారాలను రాబట్టేందుకు నిందితుడు హరిని హత్య జరిగిన ప్రాంతం అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సీన్–రీకన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త సెల్‌ఫోన్‌తో ఠాణాకు.. హత్య తర్వాత హరి మరొక స్నేహితుడు హసన్ ఇంట్లో ఆ రోజు రాత్రి నిద్రించి మర్నాడు ఉదయం కోదాడ, విజయవాడ, విశాఖపట్నం మీదుగా తిరిగి.. సొంతూరైన వరంగల్‌కు చేరుకున్నాడు. తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని తండ్రి సూచించడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్ఛిన హరి.. ప్రేమికురాలిని కలిసి నవీన్ హత్య గురించి వివరించారు. ఆమె సూచన మేరకు ఫిబ్రవరి 24న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అప్పటికే హరి వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి.. కొత్త సెల్‌ఫోన్ తీసుకొని దాన్ని జేబులో పెట్టుకొని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ సెల్‌ఫోన్‌నే పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో ఇది కొత్త ఫోన్ అని గుర్తించిన పోలీసులు.. హత్యకు ముందు సెల్‌ఫోన్ గురించి కస్టడీ విచారణలో పోలీసులు ఆరా తీయగా.. తాను వాడేది ఇదే ఫోన్ అని బుకాయించినట్లు తెలిసింది. -
నవీన్ హత్య కేసు: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఇతడ్ని హత్యకు సంబంధించి మరిన్ని వివారాలు అడిగేందుకు 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. అందుకు న్యాయస్థానం 7 రోజులు అనుమతి ఇచ్చింది. నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న నవీన్‌ను అతని స్నేహితుడు హరిహరకృష్ణే అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయితో నవీన్ సన్నిహితంగా ఉంటున్నాడని ఈ దారుణానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం అతని గుండెను బయటకు తీసి ఫొటోలను అమ్మాయికి పంపాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ -
మార్చి 3న ‘రిచి గాడి పెళ్లి’
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. కెఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ.. "రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య ఫోన్ లోజరిగే గేమ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఆ ఆట వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి , ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” , శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు. -
అంతా ఆమె కోసమే చేశాడా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహర కృష్ణ బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి, ఆ రోజు రాత్రి అక్కడే గడిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు హసన్‌ను విచారించారు. హత్యకు ముందు పెద్ద అంబర్‌పేటలో మద్యం తాగి.. అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతాలకు వచ్చిన తర్వాత హరి యువతితో సహజీవనం విషయాన్ని నవీన్‌కు తెలిపాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య తగాదా జరిగిందని హరే తనతో చెప్పాడని హసన్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ‘‘దీంతో ఇద్దరి మధ్య తగువులాట జరిగింది, గొడవ పెద్దది కావటం, అప్పటికే నవీన్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్న హరి మద్యం మత్తులో నవీన్ గొంతు నులుమి హత్య చేశాడు. నవీన్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత హరి పైశాచికత్వంతో శరీర భాగాలను వేరు చేయాలని భావించాడు.. నవీన్ మృతదేహాన్ని ఎవరూ గుర్తించకూడదనే ఉద్దేశంతోనే చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కత్తితో కోసి, ధ్వంసం చేసినట్లు హరి తనతో వివరించాడని’’హసన్ పోలీసులకు తెలిపాడు. యువతి సెల్ఫోన్లో కీలక ఆధారాలు.. ఈ కిరాతక హత్య కేసులో యువతి పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. యువతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు కీలక ఆధారాలను గుర్తించినట్లు సమాచారం. హత్య అనంతరం హరి.. నవీన్ శరీర భాగాలను వేరు చేసే వీడియో, ఫొటోలను యువతికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా భయానక దృశ్యాలను చూసిన యువతి అస్వస్థతతకు గురైనట్లు సమాచారం. ఆయా వివరాలను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. తొలుత నవీన్‌తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిన యువతి.. కొన్నేళ్ల తర్వాత నవీన్‌ను దూరం పెట్టింది. ఆ తర్వాత నిందితుడు హరిహర కృష్ణతో రిలేషన్షిప్ కొనసాగించింది. అయితే ఈ వ్యవహారం నవీన్‌కు తెలియకపోవటంతో.. తరుచూ యువతికి ఫోన్ చేయడం, సందేశాలు పంపించేవాడని పోలీసుల విచారణలో బయటపడింది. నవీన్ వ్యవహారాన్ని హరితో యువతి చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు గోప్యత పాటించింది? దురుద్దేశం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే హరి, నవీన్‌లు అప్పటికే స్నేహితులు. యువతితో హరి కలిసి ఉన్న క్రమంలో అమ్మాయికి నవీన్ పదే పదే ఫోన్ చేస్తుండటాన్ని గమనించిన హరి.. నవీన్ బతికి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనే అక్కసుతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. హరిని కస్టడీకి కోరిన పోలీసులు రంగారెడ్డి కోర్టులు: కేసును లోతుగా విచారించేందుకు నిందితుడు హరిని ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ మంగళవారం రంగారెడ్డి జిల్లా ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కేసుని బుధవారానికి వాయిదా వేసిందని ఏసీపీ శేరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిందితుడితో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయవలసి ఉందని, హత్యకు సంబంధించి నిందితుడికి మరెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ జరపాల్సి ఉందని ఏసీపీ చెప్పారు. మృతుడి సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకోవడంతో పాటు నిందితుడి సెల్ ఫోన్‌ని కూడా స్వాధీనపర్చుకోవాల్సి ఉందని తెలిపారు. -
నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన హసన్
-
లొంగిపోయే ముందే శరీర భాగాలు కాల్చేసి..
అబ్దుల్లాపూర్‌మెట్: తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రాణ స్నేహితుడైన నవీన్‌ను దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. హరిహరకృష్ణ లొంగిపోయిన తర్వాత వెల్లడించిన వివరాలు, తమ దర్యాప్తులో తేలిన అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ రిపోర్టుప్రకారం.. ప్రియురాలికి, తనకు అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో నవీన్‌ను అంతం చేసేందుకు హరిహరకృష్ణ 3 నెలల ముందే ప్రణాళిక రచించాడు. అందులో భాగంగానే మలక్‌పేటలోని ఓ దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు. అదును కోసం ఎదురుచూస్తూ ఈ నెల 17న ప్లాన్ అమలుకు సిద్ధమయ్యాడు. ఇంటర్ మిత్రుల గెట్ టు గెదర్ ఉందని నవీన్‌ను పిలిచాడు. మధ్యాహ్నం దాకా ఇద్దరూ కలిసి తిరిగారు. సాయంత్రం పెద్దఅంబర్ పేటలోని వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి తాగారు. గొంతు నులిమి చంపి.. ఇద్దరూ మద్యం తాగాక హరిహరకృష్ణ ప్లాన్ ప్రకారం నవీన్‌ను ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన యువతి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న హరిహరకృష్ణ.. నవీన్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ మృతదేహంపై విచక్షణారహితంగా పొడిచాడు. తల, కాళ్లు, చేతులు, గుండె, పెదాలను కోసేశాడు. ఆ భాగాలను ఓ సంచీలో వేసుకుని అర్ధరాత్రి వరకూ అక్కడే ఉన్నాడు. 18న తెల్లవారుజామున నవీన్ శరీర భాగాలున్న సంచీని తీసుకుని ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద చెట్ల పొదల్లో విసిరేశాడు. తర్వాత అదే గ్రామంలో ఉన్న స్నేహితుడు హాసన్ ఇంటికి వెళ్లాడు. స్నానం చేశాక నవీన్‌ను హత్య చేసిన విషయం అతడికి చెప్పాడు. దీనితో భయపడిన హాసన్ అక్కడి నుంచి వెళ్లిపోవాలనడంతో.. హరిహరకృష్ణ తన ప్రియురాలికి ఫోన్ చేసి, నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని చెప్పాడు. ఆమె నమ్మకపోవడంతో నవీన్ శరీర భాగాల ఫొటోలను ఆమెకు వాట్సాప్‌లో పంపించాడు. దీనిపై ఆందోళన చెందిన ప్రియురాలు.. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. పారిపోయి.. తిరిగొచ్చి కాల్చేసి.. నవీన్ ఆచూకీ కోసం అతడి కుటుంబ సభ్యు ల నుంచి ఒత్తిడి పెరగడంతో.. హరిహరకృష్ణ ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాడు. వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లి వారం తర్వాత తిరిగి వచ్చాడు. నేరుగా బ్రాహ్మణపల్లికి వెళ్లాడు. చెట్ల పొదల్లో విసిరేసిన నవీన్ శరీర భాగాలతోకూడిన బ్యాగును బయటికి తీసి, దహనం చేశాడు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు హరిహరకృష్ణను తీసుకెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 25న హయత్‌నగర్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపర్చి.. రిమాండ్ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. హరిహరకృష్ణ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్ నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను విచారించేందుకు 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మొదట హయత్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హత్యకేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదవడంతో.. పోలీసుల పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. -
3 నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్
-
నవీన్ హత్య కేసు.. ‘సాక్షి’ చేతిలో నిందితుడు హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడు రిమాండ్ రిపోర్టు సాక్షి చేతికి అందింది. హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్ వేసినట్లు తేలింది. గెట్ టు గెదర్ పేరుతో జవరి 16న హత్యకు కుట్ర చేయగా.. వీలు కాకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు వెల్లడైంది. బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్‌కు నవీన్ హత్య గురించి చెప్పి, అతని ఇంట్లోనే నిందితుడు హరిహరకృష్ణ గడిపినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా తెలిసింది. అంతేగాక ప్రియురాలిని కలిసి నవీన్ హత్య గురించి తెలపగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్ వెళ్లినట్లు వెల్లడైంది. రిమాండ్ రిపోర్టు ప్రకారం..ఈ నెల 17వ తేదీన రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్ తిరుమల వైన్స్ వద్ద నవీన్, హరిహర కృష్ణ మద్యం సేవించారు. ఎల్బీనగర్, నాగోల్, ముసారంబాగ్, సైదాబాద్, చైతన్యపురి, కొత్తపేట పప్రాంతాల్లో నవీన్‌తో కలిసి తిరిగాడు. రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పరం వాగ్వాదం జరిగింది. తొలుత గొంతు నులిమి నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. అనంతరం కత్తితో నవీన్ శరీర భాగాలను వేరుచేశాడు. బ్యాగ్‌లో తలతో సహా శరీర విడిభాగాలను తీసుకెళ్లాడు. ఫోన్ హైదరాబాద్ నివాసంలో ఉంచిన నిందితుడు.. కోదాడ, ఖమ్మం, వైజాగ్‌లో రెండు రోజులు గడిపాడు. ఈనెల 23న తిరిగి వరంగల్ చేరుకొని తండ్రికి నవీన్ హత్య గురించి చెప్పాడు. ఈనెల 24న తిరిగి బ్రహ్మణపల్లి హత్యా స్థలంలోనవీన్ శరీర భాగాలతోపాటు ఆధారాలను తగలబెట్టిన హరిహరకృష్ణ.. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా హరిహరకృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. -
నవీన్ ను హరిహర కృష్ణ ఒక్కడే హత్య చేయలేదు - హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్
-
‘నవీన్ తల్లిదండ్రులకు మా క్షమాపణలు’
సాక్షి, వరంగల్: ఒకరేమో అనుమానంతో ఉన్మాదిగా మారిపోయి నమ్మిన స్నేహితుడినే కడతేర్చాడు. మరొకరేమో.. ఆ ఘాతుకంలో ప్రాణం పొగొట్టుకున్నాడు. హరిహరకృష్ణ-నవీన్‌లు ఇద్దరూ.. కన్నవాళ్లకూ పుట్టెడు దుఃఖం మిగిల్చారు. నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ విద్యార్థి నవీన్ హత్యోదంతం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుడు హరిహరకృష్ణ తల్లిదండ్రులనూ పోలీసులు ప్రశ్నించగా.. మరోవైపు మీడియా వద్ద తండ్రి పేరాల ప్రభాకర్ తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. హరిహరకృష్ణ స్వస్థలం వరంగల్‌లోని కరీమాబాద్. తండ్రీ పేరాల ప్రభాకర్ ఆర్ఎంపీ డాక్టర్, తల్లి గృహిణి. ప్రభాకర్ స్థానికంగా ఓ క్లినిక్ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నవాడు హరిహరకృష్ణ. పెద్దకొడుకు ముఖేష్ కృష్ణ 2010లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే.. ముఖేష్ కృష్ణ 2011 జూన్ 15న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నోడు సక్రమంగా పెరగాలని ఆ తల్లిదండ్రులు భావించారు. అందుకే దూరంగా హైదరాబాద్‌లో చదివిస్తున్నారు. సుమారు 14 ఏళ్ళ నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు హరిహరకృష్ణ. ఈ క్రమంలోనే నవీన్‌తో స్నేహం ఏర్పడి.. ఇద్దరూ మంచి స్నేహితులుగా మెలిగారు. అలాంటి స్నేహితుల మధ్య అమ్మాయి కోసం వైరం ఏర్పడి.. చంపేంత దాకా వెళ్లింది!. అయితే తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని అంగీకరించిన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్.. నవీన్ తల్లిదండ్రులను క్షమించమని వేడుకుంటున్నాడు. ‘‘ఐదు నెలల క్రితమే ఐదారుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకున్నారు. అక్క ఇల్లు.. ఉండగా రూమ్ ఎందుకు తీసుకున్నావని అడిగితే అందరం కలిసి చదువుకుంటున్నామని చెప్పాడు. మహాశివరాత్రి రోజున వరంగల్ కు వచ్చాడు. ఆరోజు ఫోన్లు బాగా రావడంతో ఆందోళనకరంగా కనిపించాడు. ఏమైందని అడిగితే.. ఏమీ లేదంటూ వరంగల్ నుండి హైదరాబాద్‌కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాలేదు. అప్పటికే నవీన్ కనపడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. అందుకే మా అబ్బాయి కూడా కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాం. చివరికి.. ఈ నెల 23వ తేదీన వరంగల్ వచ్చాడు. ఏం జరిగిందని నిలదీస్తే అప్పుడు చెప్పాడు. నవీన్‌కు తనకు మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పాడు. తీవ్రంగా మందలించి.. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సూచించాను. స్థానికంగా మిల్స్ కాలనీ పోలీసుల దగ్గరకు వెళ్దామంటే.. లేదు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అలాగే చేశాడు. ఈ హత్య మా అబ్బాయి ఒక్కడే చేసినట్లు అనిపించడం లేదు. ఇంకా ఇంకొందరు ఉండవచ్చు. అమ్మాయి కోసం హత్య అంటున్నారు. కాబట్టి, ఆమెను కూడా విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మా అబ్బాయికి నేర చరిత్ర లేదు. గంజాయి తీసుకోడు. మద్యం తాగే అలవాటు ఉంది. ఆ మత్తులో హత్య చేశాడని భావిస్తున్నాను. చదువులో క్లెవర్ స్టూడెంట్. ఏదో జరిగి ఉంటుందనే అనుమానం ఉంది. పెద్ద కొడుకు ఆత్మహత్య.. చిన్న కొడుకు హత్య కేసులో జైలు పాలుకావడంతో హరిహరకృష్ణ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. -
నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్
-
క్రెడిట్ కార్డుల స్వైపింగ్‌తో రూ.5 కోట్ల మోసం
హిమాయత్‌నగర్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా క్రెడిట్ కార్డుల నుంచి దాదాపు రూ.5కోట్ల సొమ్మును స్వైప్ చేసి..ఆ మొత్తం సొమ్ముతో పరారైన దమ్మాయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడి భాగోతం కలకలం రేపుతోంది. స్వైప్ చేసి డబ్బులు ఇస్తాడని ఎదురుచూసీ చూసీ చివరికి మోసపోయామని భావించి దాదాపు 20మంది యువకులు పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులుగా సిటీ సైబర్‌క్రైం, సీసీఎస్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలిలా., మొబైల్ షోరూం స్వైప్ మిషన్ ద్వారా ఓ మొబైల్ షోరూంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న నవీన్ మొదట్లో తన స్నేహితులకు క్రెడిట్‌కార్డును స్వైప్ చేసి కమీషన్ తీసుకోకుండా క్యాష్ ఇచ్చేవాడు. ఇలా అతనిపై నమ్మకం కుదరడంతో మిత్రబృందానికి అత్యాశకలిగింది. నవీన్ తమ నుంచి కమీషన్ తీసుకోవడం లేదు కాబట్టి మనమే క్రెడిట్‌కార్డులను సేకరించి పదిశాతం కమీషన్ చొప్పున క్యాష్ కావాల్సిన వారికి ఇద్దామనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇలా సుమారు 20మంది యువకులు ఒక్కొక్కరు ఐదారు బ్యాంకుల నుంచి దాదాపు వంద క్రెడిట్‌కార్డులు సేకరించి పిన్ నంబర్లతో సహా ఒకేసారి నవీన్‌కు ఇచ్చారు. ఇన్ని కార్డులు ఒకేసారి ఇవ్వడంతో క్యాష్ ఇచ్చేందుకు అతను వారం గడువు అడిగాడు. అయితే వారం కాదు.. రెండు వారాలు గడిచినా పత్తా లేకపోవడం... ఈలోగా తమ కార్డుల నుంచి స్వైప్ చేస్తున్నట్టు ఫోన్లలో మెసేజ్‌లు రావడంతో యువకులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, తాను ఒక్కడినే రూ.కోటి డబ్బు కావాలని కార్డులు ఇచ్చినట్లు ఓ బాధితుడు రవి చెప్పుకొచ్చారంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. -
బాలుగాడి లవ్ స్టోరీ’.. టీజర్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని
ఆకుల అఖిల్, దర్శక మీనన్, ‘చిత్రం’ శ్రీను, ‘జబర్దస్త్’ గడ్డం నవీన్, ‘జబర్దస్త్’ చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాలుగాడి లవ్ స్టోరీ’. యల్. శ్రీనివాస్ తేజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం ఇది. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం టీజర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రిలీజ్ చేసి, చిత్రం యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ– ‘‘టీజర్ బాగుంది. మంచి కాన్సెప్ట్, కథ ఉన్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో వస్తున్నాం. ఈ సినిమా హిట్‌ని మా తల్లిదండ్రులకు గిప్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు ఆకుల అఖిల్. ‘‘లవ్, సస్పెన్స్ అంశాలతో కూడిన చిత్రం ఇది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్‌ను త్వరలోనే పూర్తి చేసి, మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
మన్నెగూడ కిడ్నాప్: నవీన్ రెడ్డి వీడియోపై వైశాలి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ కిడ్నాప్ కేసు సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తన తప్పేమీ లేదంటూ నిందితుడు నవీన్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో వైశాలిని సాక్షి టీవీ సంప్రదించగా కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ రెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు వైశాలి. తమకు పెళ్లి జరగలేదని తేల్చి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ‘మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రోజుకొక కొత్త విషయం చెబుతున్నాడు. నవీన్ రెడ్డిది వన్‌సైడ్ లవ్. అతడి తల్లి చెపినవన్నీ అబద్ధాలే. నవీన్ రెడ్డే నాతో పెళ్లి కాలేదని ఒప్పుకున్నాడు. గోవాకు నవీన్‌తో ఒంటరిగా వెళ్లలేదు.. ఫ్యామిలీతో కలిసి వెళ్లా. అతడిని స్నేహితుడిగా మాత్రమే చూశా. ఆరోగ్యం బాలేదని గోవాకు ఎందుకు వెళ్లాడు. జనవరిలోనే పెళ్లి చేసుకోనని చెప్పాను. నవీన్‌రెడ్డి లాంటి వారిని ఏ అమ్మాయి ఒప్పుకోదు.’ అని స్పష్టం చేసింది వైశాలి. ఇదీ చదవండి: Manneguda Kidnap Case: వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో -
పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు.. పాన్ వరల్డ్ మూవీతో సంచలనానికి రెడీ!
మన తెలుగు సినిమాలు వంద కోట్లు సంపాదిస్తేనే ఎగిరి గంతేస్తున్నాం. కానీ.. ఇంగ్లీష్ సినిమాలు వేల, లక్షల కోట్లు గడిస్తుండడం నుంచి మనం స్ఫూర్తి పొందలేకపోతున్నాం" అంటున్నాడు తెలంగాణ చిచ్చరపిడుగు నవీన్ ముళ్లంగి. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఈ పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు... తనే "హీరో కమ్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్"గా ఇంగ్లీషులో ఓ ఫీచర్ ఫిల్మ్ చేసి ట్రెండ్ సెట్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. పరస్పర విరుద్ధమైన భావజాలం కలిగిన ఓ అబ్బాయి - అమ్మాయి నడుమ నడిచే యునీక్ లవ్ స్టోరీగా "కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ - క్యాపిటలిస్ట్ బాయ్ ఫ్రెండ్" పేరుతో నవీన్ ముళ్ళంగి తీసిన ఈ చిత్రం షూటింగ్ తోపాటు... పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేసుకుంది. గంటన్నర నిడివి గల ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఓ సినిమా రూపకల్పనకు అవసరమైన పలు సాంకేతిక అంశాల్లోనూ సుశిక్షితుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్న నవీన్... ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఇంగ్లీషులో సినిమాలు తీసి... తన సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో నవీన్ సరసన శివ ప్రీతిక సుక్క హీరోయిన్గా నటిస్తోంది. -
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘కొత్త కొత్త ఆలోచనలతో యువ ప్రతిభావంతులు చిత్రపరిశ్రమకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చూసిన ఓ ఊరి కథతో రూపొందిన ‘రామన్న యూత్’ సినిమా సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. నవీన్ బేతిగంటి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్. ఫైర్ ప్లై ఆర్ట్స్‌పై రజినీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్‌ను శేఖర్ కమ్ముల విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తన కోసం కష్టపడిన వారిని ఆ నాయకుడు నిర్లక్ష్యం చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? అనే మంచి కథని తీసుకున్నప్పుడే నవీన్ సక్సెస్ అయ్యాడు’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథే ఈ చిత్రం. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది’’ అన్నారు నవీన్. నటులు శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్ గీల పాల్గొన్నారు. -
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
Health Tips: మాట్లాడేటపుడు నత్తి వస్తోందా? ఈ చిట్కాలు పాటించారంటే!
నత్తి మాట్లాడుతున్నారా? ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలున్నాయి? మనసు సరిగానే చెబుతుంది కానీ నోట్లో మాట అనుకున్నట్టు రాదు. నలుగురిలో ఉన్నపుడు నత్తి మాట్లాడే వాళ్లలో అభద్రతాభావం, మొహమాటం పెరిగిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ చెప్పాలంటే నత్తిని తగ్గించాలి. అందుకు ఆయుర్వేదంలో ఉన్న పద్ధతులు ఇవి. పద్ధతి -1 కావాల్సినవి వసకొమ్ము చిన్న ముక్క తేనె చేయాల్సిన పద్ధతి గంధపు సాన మీద నీళ్ళు చిలకరించి వస కొమ్మును చాది గంధం తీయాలి. దానికి తేనె కలిపి నత్తి వున్నవాళ్లకు రోజుకు 3 , 4 సార్లు నాలుక పై రాయాలి. ఈ విధంగా కొంత కాలం చేస్తే ఎంత కఠిన మైన పదాలనైన సులభంగా పలకగలరు . పద్ధతి - 2 కావాల్సినవి పసుపుకొమ్ము కాల్చిన పొడి పొంగించిన పటిక పొడి పసుపు పొడిని పటిక పొడిలో అద్దుకొని చప్పరించాలి. ఇది కొన్ని రోజుల పాటు చేయాలి. పద్ధతి - 3 కావాల్సినవి సరస్వతి సమూల చూర్ణం-50 గ్రాములు నానబెట్టి , ఎండబెట్టిన వస చూర్ణం -50 గ్రాములు నేతిలో వేయించిన శొంటి చూర్ణం- 50 గ్రాములు దొరగాయించిన పిప్పళ్ళ చూర్ణం- 50 గ్రాములు పటికబెల్లం- 50 గ్రాములు అన్నింటిని విడివిడిగా వస్త్రఘాలితం చేసి , కలిపి నిల్వ చేసుకోవాలి. ఉదయం , సాయంత్రం పరగడుపున తీసుకోవాలి. చిన్న పిల్లలకు చిటికెడు , పెద్ద పిల్లలకు పాటు టీ స్పూను , పెద్దవాళ్ళకు సగం టీ స్పూను తేనెతో కలిపి ఇవ్వాలి. జ్ఞాన ముద్ర లేదా సరస్వతి ముద్రను వేయాలి. 10 రోజుల లోపే ఎంతో మార్పు కనబడుతుంది. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. -
Health Tips: సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? ఇలా చేశారంటే..
మీకు సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? తలనొప్పి మరియు జలుబు తగ్గడం లేదా? ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి? సైనస్ సమస్య ఉంటే ఏకాగ్రత ఉండదు. సరైన నిద్ర ఉండదు. కొన్ని సందర్భాల్లో అయితే సరిగా గాలి కూడా పీల్చుకోలేము. శాశ్వతంగా కాదు గానీ, కొన్ని పద్దతుల ద్వారా ఉపశమనం మాత్రమే లభిస్తుంది. సైనస్... ►తరచుగా పార్శ్య తలనొప్పి ►ముక్కు కొద్దిగా వంకరగా ఉండటం ►మన రెండు కళ్ళు చూసే రెండు వేర్వేరు విషయాలను కలపడంలో మెదడు ఇబ్బంది పడడం వల్ల నొప్పి ►ముక్కు దూలం కొంచెం వంగి ఉండటం ►ముక్కులో సైనస్ గ్రంధులు దుమ్ము వల్ల ఉబ్బడం ఎలాంటి చికిత్సలున్నాయి? ►ముక్కు శస్త్ర చికిత్స ►ముక్కులో సైనస్ గ్రంధులు తొలగింపు ►ప్రాణాయామంలో అనులోమ విలోమ పద్దతి ►హోమియో లో ఎస్ ఎస్ మిక్చర్ అనే మందు రోజూ రాత్రి పూట నిద్రపోయే ముందు తీసుకోవడం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 1. వీలైనంత వరకు ఘాటైన వాసనలకు, కాలుష్యానికి దూరంగా ఉండడం 2. చలి గాలికి, వర్షంలో తడవకుండా జాగ్రత్త తీసుకోవడం 3. జీర్ణశక్తి మెరుగుపరచుకోవడం, మలమూత్రాదులు ఏ రోజుకా రోజు క్రమ పద్ధతిలో శరీరంనుంచి బయటకు పూర్తిగా వెడలిపోయేలా చూసుకోవడం. అంటే అజీర్తి అనే సమస్యను లేకుండా చేసుకోవడం. ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి? 1. వేపపొడి నీటిలో కలిపి పరగడుపున త్రాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది. తద్వారా ఇలాంటి సమస్యలు అదుపులో ఉంటాయి. 2. తుమ్ములు, జలుబు లాంటివి బాగా ఎక్కువగా ఉంటే ముక్కులో వేపనూనె ఓ రెండు చుక్కలు వేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. (కానీ వేపనూనె వల్ల కలిగే మంట కొన్ని నిముషాలు నరకం చూపిస్తుంది.) 3. నీటిలో వేపనూనె లేదా పసుపు లాంటివి వేసి, బాగా మరగబెట్టాక వచ్చే ఆవిరిని పట్టడం. దీనికి మంచి వ్యాపరైజర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 4. మందు బిళ్ళలు, యాంటీబయాటిక్ లాంటివి తక్కువగానే వాడడం మేలు. ఎందుకంటే అవి సమకూర్చే సౌకర్యాల కంటే తెచ్చిపెట్టే ఇబ్బందులే ఎక్కువ. 5. గొంతు గరగరలు ఎక్కువగా ఉంటే తేనె, కషాయం, గోరువెచ్చని నీటితో గార్గ్లింగ్ లాంటివి ఉపశమనం కలిగిస్తాయి. 6. సరిపడినంత నిద్ర, తగినంత నీరు త్రాగడం 7. పెరుగు, వేరుశనగపప్పు, కాఫీ లాంటి వాటి వాడకం తగ్గించడం 8. నిత్యం వ్యాయామం, నడక 9. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం లాంటివి చేస్తే అధికంగా తయారయ్యే మ్యూకస్ తొలగిపోయే అవకాశం ఉంది. 10. జలనేతి కూడా మంచి సాధనమే. ఒక ముక్కులోనుంచి పంపిన ఉప్పు నీరు మరో ముక్కునుంచి బయటకు వచ్చేలా చేయడం. తదనంతరం గట్టిగా గాలి వదులుతూ ముక్కులు పొడిగా అయ్యేట్లు చేయడం. ఇక్కడ ఉదహరించినవి అన్నీ స్వయంగా ప్రయత్నించి ఫలితాలను వరుసక్రమంలో బేరీజు వేసుకుని చెప్పినవే. మీరు వాడే ముందు మీ శరీర ధర్మాలను బట్టి అనుసరిస్తే మేలు. అందరికీ ఒకేలా పని చేస్తాయని చెప్పలేం కదా! ఇవేవీ శాశ్వతంగా సమస్యను దూరం చేయలేవు. కేవలం కాలంతోపాటు మన శరీర ధర్మాలు, రోగనిరోధకశక్తి మారే తీరు మాత్రమే ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించగలదు. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయర్వేద వైద్యులు చదవండి: Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే! How To Control BP: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇవి తగ్గిస్తే.. -
World Wrestling Championships: నవీన్‌కు నిరాశ
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్ 70 కేజీల విభాగంలో నవీన్ త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. ఎర్నాజర్ అక్మతలియెవ్ (కిర్గిజిస్తాన్)తో శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్లో నవీన్ 1–4 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్ ఆరంభంలో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన నవీన్ ఆ తర్వాత రెండు పాయింట్లు సమర్పించుకున్నాడు. రెండో రౌండ్లో మరో రెండు పాయింట్లు కోల్పోయిన నవీన్ తేరుకోలేకపోయాడు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో పోటీపడిన నవీన్ స్వర్ణ పతకం సాధించాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 70 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లో 1–6తో తైషి నరుకుని (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తైషి నరుకుని ఫైనల్ చేరుకోవడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం నవీన్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో నవీన్ 11–3తో సిర్బాజ్ తల్గాట్ (కజకిస్తాన్)పై నెగ్గిన నవీన్‌కు రెండో రౌండ్లో ఇలియాస్ బెక్బులతోవ్ (ఉజ్బెకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. దాంతో నవీన్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. అనూహ్య ఫలితం... మరోవైపు భారత్‌కు కచ్చితంగా పతకం అందిస్తాడని ఆశించిన స్టార్ రెజ్లర్ రవి కుమార్ రిక్త హస్తాలతో స్వదేశానికి రానున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం రష్యాలో ప్రత్యేక శిక్షణ పొందిన రవి కుమార్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్లో 10–0తో మరియన్ కొవాక్స్ (రొమేనియా)పై గెలిచిన రవి ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–10తో గులామ్జాన్ అబ్దులయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలోఓడిపోయాడు. అబ్దులయెవ్ ఫైనల్ చేరుకొని ఉంటే ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం రవి కుమార్‌కు కనీసం కాంస్యం కోసం పోటీపడేందుకు మరో అవకాశం లభించేది. కానీ అబ్దులయెవ్ క్వార్టర్ ఫైనల్లో 2–13తో జెలీమ్ఖాన్ అబకరోవ్ (అల్బేనియా) చేతిలో ఓడిపోవడంతో రవి పతకం ఆశలు ఆవిరయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన రవి గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు. 2020, 2021, 2022 ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన రవి ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకం గెలిచాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. 74 కేజీల విభాగంలో సాగర్ జగ్లాన్ క్వార్టర్ ఫైనల్లో 0–5తో కైల్ డగ్లస్ డేక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. కైల్ ఫైనల్ చేరుకోవడంతో సాగర్ నేడు కాంస్య పతకం కోసం బరిలో నిలిచాడు. రెండు బౌట్లలో సాగర్ గెలిస్తే అతనికి కాంస్యం లభిస్తుంది. -
ఆకట్టుకుంటున్న ‘చరిత కామాక్షి’ స్పెషల్ పోస్టర్
నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చరిత కామాక్షి’. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్య శ్రీపాద టైటిల్ రోల్ పోషిస్తోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దివ్య శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ చరిత కామాక్షి విడుదలైంది. చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఈ పాటలో కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు. -
Bheemeshwari- Naveen: కన్నీరు పెట్టిస్తున్న ప్రేమకథ
సాక్షి, నారాయణపేట: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పేదరికం వెంటాడుతున్నా ఇరు కుటుంబాలకు దూరంగా వెళ్లి బతుకు బండిని సాగిస్తున్నారు. అంతలోనే విధి వక్రీకరించింది. ఓ పాపకు జన్మనివ్వగానే ఆ తల్లి కన్నుమూసింది. భార్య మరణం తట్టుకోలేని భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టిన పసిబిడ్డ అనాధ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. నారాయణ పేట జిల్లా మఖ్తల్‌కు చెందిన నవీన్, అదే గ్రామానికి చెందిన భీమేశ్వరి ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్తే వారు పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా భీమేశ్వరి 2021 మేలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి రెండు నెలలకే నవీన్‌కుమార్‌తో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ కుటుంబ సభ్యులకు దూరంగా హైదరాబాద్‌లోని మౌలాలిలో ఉంటున్నారు. ఆగస్టు 18న భీమేశ్వరి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు రాత్రి ఓ పాపకు జన్మనిచ్చిన భీమేశ్వరి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సంజీవయ్య పార్కు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టిన పసిబిడ్డ అనాధగా మారింది. చదవండి: (కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం) -
Commonwealth Games 2022: భారత్ పతకాల మోత
కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 11 పతకాలతో అదరగొట్టారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉండటం విశేషం. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, మహిళల టి20 క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల రేసులో నిలిచారు. బర్మింగ్‌హామ్: ఊహించినట్టే భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు), పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో రవి దహియా 10–0తో వెల్సన్ (నైజీరియా)పై, నవీన్ 9–0తో షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలుపొందారు. మహిళల 53 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. వినేశ్ ఆడిన మూడు బౌట్లలోనూ గెలిచి విజేతగా నిలిచింది. వినేశ్ తొలి రౌండ్లో సమంతా స్టీవర్ట్ (కెనడా)పై, రెండో రౌండ్లో మెర్సీ (నైజీరియా)పై, మూడో రౌండ్లో చమోదయ కేశని (శ్రీలంక)పై గెలిచింది. కాంస్య పతక బౌట్లలో పూజా సిహాగ్ 11–0తో నయోమి బ్రున్ (ఆస్ట్రేలియా)పై, పూజా గెహ్లోత్ 12–2తో క్రిస్టెల్లీ (స్కాట్లాండ్)పై, దీపక్ 10–2తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై నెగ్గారు. హాకీలో మూడోసారి... పురుషుల హాకీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 3–2తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ (2010, 2014) చేరి రన్నరప్‌గా నిలిచింది. 2018లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. అవినాష్, ప్రియాంక అద్భుతం అథ్లెటిక్స్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్‌కిది తొమ్మిదోసారి కావడం విశేషం. తాజా ప్రదర్శనతో అవినాష్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఘనత వహించాడు. మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ క్రీడల చరిత్రలో రేస్ వాకింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. లాన్ బౌల్స్‌లో రజతం లాన్ బౌల్స్ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్’ ఈవెంట్లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. -
తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ నవీన్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ నవీన్ రావు నియమితుల య్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూ యాన్.. హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో జస్టిస్ నవీన్‌రావును నియమించారు. -
ఉక్రెయిన్‌లో వైద్య విద్యార్థి మృతి. వారినైనా కాపాడాలని తండ్రి ఆవేదన ఇదే..
శివాజీనగర(తమిళనాడు): తనయుడు డాక్టర్ అయి తిరిగి వస్తాడని అనుకుంటే విగతజీవిగా మారడంతో కుటుంబం తల్లిడిల్లిపోతోంది. కడసారి చూడాలని తపిస్తోంది. ఉక్రెయిన్‌లో క్షిపణి దాడిలో మరణించిన హావేరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ గ్యానగౌడర్ (22) కుటుంబానికి వెల్లువలా పరామర్శించారు. బుధవారం రాణి బెన్నూరు తాలూకా చళగేరి గ్రామంలో ఉన్న నవీన్ ఇంట్లో విషాద మౌనం ఆవరించింది. కుమారుడిని కోల్పోయి దిక్కు తోచక తండ్రి శేఖరగౌడ కూర్చొన్నారు. బంధుమిత్రులు పెద్దసంఖ్యలో ఇంటికి చేరుకొన్నారు. ఇంటి ముందు నవీన్ ఫోటోను ఏర్పాటు చేయగా ప్రజలు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఇతర విద్యార్థులనైనా కాపాడండి: తండ్రి.. తండ్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ, ప్రముఖులు తనతో మాట్లాడారని, తన కొడుకు ప్రాణాలతో రాలేదు, కనీసం ఇతర విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని తాను మోదీని వేడుకొన్నట్లు చెప్పారు. మరణానికి ముందు తన కుమారుడు ఫోన్లో మాట్లాడేవాడని బంకర్లో ఉండడం కష్టం, బయటికి వచ్చినా కష్టమని చెప్పాడని, యుద్ధం జరగదని, ధైర్యంగా ఉండాలని కాలేజీవారు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడి రాజకీయం, రిజర్వేషన్, విద్యా విధానాలు సరిగా లేక తమ కుమారుడు ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి వచ్చిందని విలపించారు. భోజనాలకు తన వద్ద డబ్బు లేదు. డబ్బు వేయాలని కోరాడు, అదే ఆఖరి మాటైందని స్నేహితుడు శ్రీకాంత్ ఓ టీవీ చానల్‌కు తెలిపారు. భౌతికకాయం తరలింపునకు చర్యలు: సీఎం.. ప్రస్తుతం ఖార్కివ్ నగరంలో నవీన్ మృతదేహం ఉండగా, అక్కడ నుండి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ కుటుంబానికి పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై చెప్పారు. భౌతికకాయాన్ని తీసుకురావడం ప్రథమ కర్తవ్యమని అన్నారు. కాగా మిగిలిన కన్నడిగులను వేగంగా వెనక్కి రప్పిస్తామని చెప్పారు. నా సోదరుడు రావడం లేదు.. సమాజానికి ఏదో ఒకటి చేయాలని తన తమ్ముడు కలలు కన్నాడని, అతని వెంట వెళ్లినవారంతా వెనుతిరిగి ప్రాణాలతో వస్తున్నారు. అయితే తన తమ్ముడు రావడం లేదని మృతుడు నవీన్ సోదరుడు హర్ష రోదించారు. పేదల కలలపై నీట్ పిడుగు: కుమార పేద, మధ్యతరగతి వర్గాల మెడిసిన్ కలను నీట్ భగ్నం చేస్తోందని, ఇదే విద్యార్థుల, తల్లిదండ్రుల పాలిట మరణశాసనమైనదని మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఉన్నత విద్యను సంపన్నులకు రిజర్వు చేసి పేదలకు వట్టి చేయి చూపుతున్నారని నవీన్ మరణాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు. కూతురు ఎలా ఉందో శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని సాగరకు చె ందిన ఎంబీబీఎస్ విద్యార్థిని మనీషా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. సాగర పట్టణం అణలెకొప్పలో ఉంటున్న జాన్ లోబో, త్రిజా లోబో దంపతుల కుమార్తె మనీషా కీవ్ నగరంలో ఎంబీబీఎస్ చదువుతోంది. అక్కడ బంకర్లో తలదాచుకున్నట్లు మనీషా తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపింది. తమ కూతురు ఎలా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొడగు విద్యార్థిని తిరిగి రాక.. దొడ్డబళ్లాపురం: ఉక్రెయిన్‌లో కొడగుకు చెందిన 16 మంది విద్యార్థులు చిక్కుకుపోగా గోణికొప్పలు గ్రామానికి చెందిన మదీనా (21) అనే విద్యారి్థని బుధవారం ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రుల సంతోషం అవధులు దాటింది. అలాగే 19 మంది బెళగావి జిల్లాకు చెందిన విద్యార్థుల్లో ఇద్దరు స్వదేశానికి తిరిగి వచ్చారు. మొత్తంగా కర్ణాటక విద్యార్థుల్లో 9 మంది బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీలో దిగిన విద్యార్థులు సాయంత్రం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకూ 64 మంది కర్ణాటకవాసులు తిరిగి వచ్చారు. ఉక్రెయిన్‌లో మొత్తం 693మంది కన్నడిగ విద్యార్థులు చిక్కుకున్నారని సమాచారం. -
సక్సెస్ స్టోరీ: యూత్‌ఫుల్ రాకెట్
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరి పోతే నిబిడాశ్చర్యంతో వీరు’ అన్న మహాకవి పలుకులలో ‘నిబిడాశ్చర్యం’ స్థానంలో ‘మహా ఆనందం’ చేర్చితే సరిగ్గా వీరే. చిన్న వయసులోనే పెద్ద ఘనతలో వాటా పంచుకున్న యువకులు. భవిష్యత్ ఆశాదీపాలు... ‘ఆరంభం అదిరిపోయింది’ అనే మాటను ఇప్పుడు బ్రహ్మాండంగా వాడవచ్చు. మొన్న మన ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఆర్ఐశాట్–1, ఐఎన్ఎస్–2టిడి, ఇన్‌స్పైర్‌శాట్–1 అనే మూడు ఉపగ్రహలను వాహకనౌక ‘పీఎస్ఎల్వి’ ద్వారా విజయవంతంగా రాకెట్కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మొదటి ఉపగ్రహనికి ఐఎన్ఎస్–2టిడి, ఇన్‌స్పైర్‌శాట్–1లను కో–ప్యాసింజర్లుగా అభివర్ణిస్తున్నారు. ఈ సహప్రయాణికులలో మనం కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇన్‌స్పైర్‌శాట్–1 శాటిలైట్ గురించి! దీన్ని యూత్‌ఫుల్ శాటిలైట్ అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉపగ్రహ రూపకల్పనలో స్టూడెంట్స్ కీలకపాత్ర పోషించారు. మన దేశంతో సహా కెనడా నుంచి సింగపూర్ వరకు పలు యూనివర్శిటీల స్టూడెంట్స్ ఇందులో పాలుపంచుకున్నారు. చిన్నప్పటి భౌగోళికశాస్త్ర పాఠాల్లో ‘అయానోస్పియర్’ గురించి చదువుకున్నాం కదా! ఒక్కసారి ఆ జ్ఞాపకాల్లోకి అలా వెళితే... ‘అయానోస్పియర్... భూమి ఎగువ వాతావరణంలోని అయోనైజ్డ్ భాగం’ ‘అయానోస్పియర్లో ఆకస్మిక మార్పులు వైర్లెస్ కమ్యూనికేషన్‌కు అవరోధాలు కలిగిస్తాయి’ తాజా విషయానికి వస్తే అట్టి ‘అయానోస్పియర్’ గురించి అధ్యయనం చేయడానికి రూపొందించిందే ఇన్‌స్పైర్‌శాట్–1. దీని బరువు 8.1 కిలోలు. తక్కువ భూకక్ష్యలో ఉండే దీని జీవితకాలం ఏడాది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్టీ), తిరువనంతపురం విద్యార్థులు అమన్ నవీన్, ధృవ అనంత్ దత్తా, దేవాషిష్ భల్లా, ఆరోషిష్ ప్రియదర్శన్... ప్రొఫెసర్ ప్రియదర్శన్ హరి ఆధ్వర్యంలో ‘ఇన్స్పైర్’ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. ఇందులో అమన్ నవీన్ (సికింద్రాబాద్), ధృవ అనంతదత్తా (విజయవాడ) మన తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లు. ‘చిన్న వయసులోనే ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అంటున్నాడు నవీన్. పిల్లల కష్టం పెద్దలకు ముచ్చటవేస్తుంది. నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ‘మా విద్యార్థులు చాలా కష్టపడి పనిచేశారు. వారిలో మంచి సృజనాత్మకశక్తి ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం వారికి లభించింది’ అంటున్నారు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ది మిషన్ ప్రియదర్శన్ హరి. ఎన్నో పరీక్షలలో విజయవంతమై నింగిలోకి దూసుకెళ్లిన ‘ఇన్‌స్పైర్‌శాట్–1’... టెంపరేచర్, కంపోజిషన్, సాంద్రత, గమనవేగం... ఇలా అయానోస్పియర్ డైనమిక్స్‌ను మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపకరించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం భిన్నమైన వాతావరణం, సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులు కలిసి పనిచేశారు. ‘క్రాస్–కల్చరల్ ఎక్స్పీరియన్స్’ ను చవిచూశారు. పని ఒత్తిడిలో వారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు. అయితే ఆటల ద్వారా, ప్రాంతీయవంటకాల రుచులను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా ఉల్లాసవంతమైన శక్తితో ముందుకునడిచారు. ‘ఇన్‌స్పైర్‌శాట్–1’ శాటిలైట్ నిర్మాణంలో యువత శక్తిసామర్థ్యాలకు గట్టి సాక్ష్యం. ఆ యువబృందానికి మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిద్దాం. -
ఓ వినూత్న వరం పొందిన యువకుడి ప్రేమ కథే ‘బ్రహ్మ రాసిన కథ’
లారెన్స్ నరేష్-శ్రీలయ జంటగా నవీన్ సంకు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బ్రహ్మ రాసిన కథ’. ఓ రేంజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డైనమిక్ లేడి సింధు నాయుడు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. సాక్షాత్తూ సరస్వతీదేవి సిఫార్సుతో బ్రహ్మదేవుడి నుంచి ఓ వినూత్నమైన వరం పొందిన ఓ యువకుడి ప్రేమకథలో చోటుచేసుకునే చిత్రవిచిత్రమైన ట్విస్టుల సమాహారంగా ‘బ్రహ్మ రాసిన కథ’ను తెరకెక్కించామని, ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఈ మూవీ ఆవిష్కరిస్తుందని నిర్మాత సింధు నాయుడు తెలిపారు. నవీన్ సంకు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని, దర్శకుడిగా అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని సింధు నాయుడు పేర్కొన్నారు. హీరోహీరోయిన్లు లారెన్స్ నరేష్-శ్రీలయలకు కూడా చాలా మంచి పేరు వస్తుందని, ఇద్దరూ పోటాపోటీగా నటించారని ఆమె అన్నారు. వంశీ, కల్యాణి, భార్గవ్ నాయక్, రితిక దేశ్ ముఖ్, లక్షిత, సుధీర్ కె.వంశీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సన్నీ సకురు; ఎడిటింగ్ & డిఐ: జగ సి.హెచ్. -
Afg Vs Nam: అఫ్గన్ జోరు.. మరో భారీ విజయం.. ఏకంగా...
Afghanistan Beat Namibia By 62 Runs: టి20 ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్ జట్టు తన జోరును కనబరుస్తోంది. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై దాదాపుగా గెలిచినంత పని చేసిన అఫ్గాన్... ఈసారి నమీబియాపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. సూపర్–12లో భాగంగా గ్రూప్–2లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 62 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు మొహమ్మద్ షహజాద్ (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హజ్రతుల్లా (27 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన అస్గర్ అఫ్గాన్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మొహమ్మద్ నబీ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో మెరుపులు మెరిపించారు. ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు చేసి ఓడింది. హమీద్ హసన్ (3/9), నవీన్ ఉల్ హక్ (3/26) నమీబియా పని పట్టారు. డేవిడ్ వీస్ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ల శుభారంభం టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌కు ఓపెనర్లు షహజాద్, హజ్రతుల్లా శుభారంభం చేశారు. ముఖ్యంగా హజ్రతుల్లా ధనాధన్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. వీరి ధాటికి పవర్‌ప్లేలో అఫ్గాన్ సరిగ్గా 50 పరుగులకు చేరుకుంది. ప్రమాదకారిగా కనిపించిన హజ్రతుల్లాను స్మిత్ పెవిలియన్‌కు చేర్చాడు. మరికాసేపటికే రహ్మనుల్లా (4)కూడా డగౌట్‌కు చేరాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న షహజాద్, నజీబుల్లా జద్రాన్ (7) వెంట వెంటనే అవుటవ్వడంతో అఫ్గాన్ 150 మార్కును దాటడం కష్టంగా కనిపించింది. అయితే ఈ దశలో జతకలిసిన అస్గర్, నబీ జట్టును ఆదుకున్నారు. భారీ షాట్లతో నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో అఫ్గానిస్తాన్ గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. చివరి ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ 51 పరుగులు సాధించింది. హడలెత్తించిన నవీన్, హమీద్ ఛేజింగ్ ఆరంభించిన నమీబియాను అఫ్గాన్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్ హడలెత్తించారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న నవీన్ ఇక్కడ కూడా మెరిశాడు. ఓపెనర్లు విలియమ్స్ (1), వాన్ లింజెన్ (11)లతో పాటు జాన్ ఫ్రైలింక్ (6) వికెట్లను నవీన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టోరీ్నలో తొలి మ్యాచ్ ఆడుతున్న హమీద్ కూడా చెలరేగడంతో నమీబియా లైనప్ కకావికలమైంది. ఎరాస్మస్ (12), స్మిత్ (0) వికెట్లతో పాటు ఫర్వాలేదనిపించిన డేవిడ్ వీస్ (26; 2 ఫోర్లు) వికెట్లను హమీద్ తీశాడు. వీరిద్దరికి తోడుగా గుల్బదిన్ రెండు... రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసి నమీబియాను 100లోపే కట్టడి చేశారు. కీలక వికెట్లు తీసిన నవీన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో అఫ్గాన్ సీనియర్ ఆటగాడు అస్గర్ అఫ్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. స్కోరు వివరాలు: అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: హజ్రతుల్లా (సి) వాన్ లింజెన్ (బి) స్మిత్ 33; షహజాద్ (సి) బెర్నార్డ్ (బి) రూబెన్ 45; రహ్మనుల్లా (ఎల్బీ) (బి) లోఫ్టీ 4; అస్గర్ (సి) వాన్ లింజెన్ (బి) రూబెన్ 31; నజీబుల్లా (ఎల్బీ) (బి) లోఫ్టీ 7; నబీ (నాటౌట్) 32; గుల్బదిన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–53, 2–68, 3–89, 4–113, 5–148. బౌలింగ్: రూబెన్ 4–0–34–2, స్మిత్ 3–0–22–1, వీస్ 4–0–33–0, ఫ్రైలింక్ 3–0–34–0, లోఫ్టీ 4–0–21–2, బెర్నార్డ్ 1–0–8–0, ఎరాస్మస్ 1–0–7–0. నమీబియా ఇన్నింగ్స్: విలియమ్స్ (సి) (సబ్) ఉస్మాన్ (బి) నవీన్ 1; వాన్ లింజెన్ (సి) హమీద్ (బి) నవీన్ 11; లోఫ్టీ (బి) గుల్బదిన్ 14; ఎరాస్మస్ (బి) హమీద్ 12; గ్రీన్ (బి) రషీద్ ఖాన్ 1; వీస్ (బి) హమీద్ 26; స్మిత్ (సి) షహజాద్ (బి) హమీద్ 0; ఫ్రైలింక్ (సి) నబీ (బి) నవీన్ 6; ఫ్రాన్స్ (సి) అండ్ (బి) గుల్బదిన్ 3; రూబెన్ (నాటౌట్) 12; బెర్నార్డ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–29, 4–36, 5–56, 6–56, 7–69, 8–77, 9–80. బౌలింగ్: నవీన్ 4–0–26–3, నబీ 2–0–17–0, హమీద్ 4–0–9–3, గుల్బదిన్ 4–1–19–2, కరీమ్ 2–0–11–0, రషీద్ ఖాన్ 4–0–14–1. చదవండి: T20 World Cup 2021: వరుసగా రెండో పరాజయం.. ఇక ఇంటికేనా? -
రూ.లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు ఇస్తాం
నల్లగొండ క్రైం: ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తుతెలియని యువతితో చాటింగ్ చేసిన ఓ యువకుడు మోసపోవడం తో ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడెంకు చెందిన గోగికార్ నవీన్ అలియాస్ చింటు (23)కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. తాను నడిపే బిజినెస్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు వస్తాయని యువకుడిని నమ్మించింది. దీంతో నవీన్ ఆమె ఆన్లైన్ ఖాతాలో రూ. లక్ష చెల్లించాడు. ఆ తర్వాత ఆ యువతిని రూ.3 లక్షల కోసం అడగగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేసింది. దీంతో నెల రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించడంతో కాపాడగలిగారు. అదే బాధలో ఉన్న నవీన్ శనివారం పట్టణం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు !
సాక్షి, చిలకలగూడ: క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు.. సీతాఫల్మండి డివిజన్ మధురానగర్‌కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో 20వ తేదీన తనపై తప్పుడు కథనాలు ప్రచురించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 22న పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపేస్తా -
కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న, పల్లా!
► ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీన్మార్ మల్లన్న లెక్కలు సేకరించే పనిలో నిమగ్నమయ్యా డు. తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ ►కౌంటింగ్ కేంద్రం వద్ద ఎండ వేడికి మజ్జిగ తాగుతున్న పల్లా నిద్ర సుఖమెరుగదు.. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రెండు రోజులుగా ఎఫ్‌సీఐ గోదాములో హమాలీలు 24 గంటలు అలుపెరుగక బాక్సులు మోశారు. కంటికి నిద్ర లేకపోవడంతో ఇలా కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్లు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమా వాళ్లకు సైబర్ కేటుగాళ్ల ముప్పు తప్పడం లేదు. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే వాటిని ఆన్లైన్లో లీక్ చేసి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఆన్లైన్లో చక్కర్లు కొట్టగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాయింట్ బ్లాంక్' సినిమాను ఇలాగే లీకైంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన 'పాయింట్ బ్లాంక్'. సాయి పవన్ సంగీతం సమకూర్చగా.. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుండగా.. ఇంతలో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. విడుదలకు ముందే ఈ సినిమాను పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అప్లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి తమ ఫిర్యాదు నమోదు చేశారు. ఎంతో కష్టపడి తీసిన తమకు తెలియకుండానే ఇలా ఆన్లైన్లో లీక్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ ప్రింట్ ఆన్లైన్లో తీసేయాలని పోలీసులను కోరారు. -
తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు..
సాక్షి, హైదరాబాద్: తన యూట్యూబ్ చానల్లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. పంజాగుట్ట కేసులో ఓ మహిళను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అన్ని రకాల హద్దులు దాటాడని అరుణ కుమారి ఆరోపించారు.(చదవండి: 139 మంది అత్యాచారం: ‘భూమి’కి న్యాయం చేయండి) తన ఇంటర్వ్యూలో సభ్యసమాజం తలదించుకునే విధంగా బాధితురాలికి ప్రశ్నలు వేశాడని మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం ఏంటని, అతను సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గతేడాది జరిగిన ‘దిశ’ ఎన్కౌంటర్ ఫేక్ అంటూ మల్లన్న వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో నవీన్ సుప్రీంకోర్టుతో పాటు ‘నిర్భయ’ చట్ట నిబంధనలను అతిక్రమించాడని, అతడిపై తగినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ కిడ్నాప్.. విడుదల! దుండిగల్: ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అనుమానాస్పద స్థితిలో కిడ్నాప్ అయ్యాడు. దుండిగల్ సీఐ వెంకటేశం తెలిపిన మేరకు..న్యూషాపూర్‌నగర్‌కు చెందిన హజ్మత్ అలీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్. మంగళవారం రాత్రి మరో యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సలీం.. అలీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే అనుమానంతో కైసర్‌నగర్ చౌరస్తా లోని బాచుపల్లి రోడ్డు వరకు ఓ ఆటోను వెంబడించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వారు అందుకు ఒప్పుకోకుండా ఆటోను మియాపూర్ వైపు పోనిచ్చారు. ఈ క్రమంలో సదరు ఆటోను బాచుపల్లి పోలీసులు కోకకోలా చౌరస్తాలో పట్టుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న రేషన్ బియ్యం తరలింపు ముఠా సభ్యులు ఇన్నోవా కారులో వచ్చి సలీంను ఎత్తుకెళ్లడానికి యత్నించగా అతను తప్పించుకోవడంతో హజ్మత్ అలీని తమ వెంటకు తీసుకువెళ్లారు. దీంతో హజ్మత్ అలీ కుటుంబ సభ్యు బుధవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హజ్మత్ అలీ దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. తనను కిడ్నాపర్లు వదిలేశారని, బస్సులో ఇంటికి చేరుకున్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని పోలీసులు రేషన్ బియ్యం ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ నవీన్ కోరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పిటిషన్లో కోరారు. పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిటిషన్ విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఆరోగ్య వివరాలను ఆరా తీయాలని వేసిన ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకోలేమని మొట్టికాయలు వేసింది. ముఖ్యమంత్రి కనిపించక పోతే హెబియస్ కార్పస్ ధాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. (చదవండి: ప్రగతి భవన్ వద్ద యువకుడి మెరుపు నిరసన) (ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన) -
‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది
‘‘ఊరంతా అనుకుంటున్నారు’ ట్రైలర్ చూస్తే నవీన్ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విజయనిర్మలకు అంకితం ఇస్తున్నారు. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నవీన్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలి’’ అని నటుడు కృష్ణ అన్నారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజి సానల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇకపై గ్యాప్ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘విజయ నిర్మలగారికి నవీన్ మంచి నటుడు కావాలని ఉండేది. ఆమె అనుకున్నట్లే ‘నందిని నర్సింగ్ హోమ్’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఊరంతా అనుకుంటున్నారు’తో నవీన్ కుటుంబ ప్రేక్షుకులకు దగ్గరవుతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు నరేశ్ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘నా కథకి నవీన్ అయితేనే న్యాయం చేయగలడు అనిపించింది’’ అన్నారు బాలాజి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలి’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రీహరి మంగళంపల్లి అన్నారు. -
సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’
తరుణ్ తేజ్, లావణ్య హీరోహీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఉండి పోరాదే'. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్ నాయని దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా యూ/ ఏ సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబర్ 6న సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత డా. లింగేశ్వర్ మాట్లాడుతూ - ‘మా ఉండి పోరాదే చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూశాం అని.. నన్ను మా టీమ్‌ను అభినందించారు. నేను గతంలో చెప్పినట్టు సినిమా 100పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. లాస్ట్ 20 మినిట్స్ లో మన పక్కన ఉన్నవారిని కూడా మర్చి పోయేలా సినిమా ఉంటుంది. అందరూ థియేటర్ లో సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను’అన్నారు. దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ... ‘ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వర్ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానికన్నా హార్ట్ టచింగ్‌గా వచ్చింది. సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ 100పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 6న మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. -
కాళ్లపారాణి ఆరకముందే నూరేళ్లు
కర్ణాటక, కృష్ణరాజపురం : భర్తతో కలిసి ఏడు అడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి ప్రవేశించి ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన నవ వధువు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారింది. ఈ ఘటన గురువారం కోణనకుంటెలో చోటు చేసుకుంది.కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన పల్లవి(24)కి నవీన్ అనే వ్యక్తితో నెలన్నర క్రితం వివాహమైంది. నవీన్ బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్యతో కలిసి కోణనకుంటెలో నివాసం ఉంటున్నాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో ఏమో కాని పల్లవి గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. మృతురాలి తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని పల్లవి మృతదేహాన్ని పరిశీలించారు. నవీన్ వేధింపులు తాళలేకే పల్లవి ఆత్మహత్య చేసుకుందని కోణనకుంటె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
విశాఖ సరిహద్దులో కాల్పుల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : విశాఖ జిల్లా సరిహద్దులో కాల్పుల కలకల చోటు చేసుకుంది. బుధవారం తూర్పుగోదావరి - విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలోని గుమ్మరేవుల దగ్గర మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో మావోయిస్టు కీలక నాయకుడు నవీన్ తప్పించుకున్నాడు. సంఘటన స్థలం నుంచి పోలీసులు మూడు 303 రైఫిల్స్‌ను, 15 కిట్ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకన్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా కె.నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వి.నర్సింహాచార్యులు ప్రకటించారు.నవీన్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.హెచ్.మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కె.పి.వివేకానంద్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం నవీన్ గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ‘ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావుకు ధన్యవాదాలు.. నాపై నమ్మకంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. టీఆర్ఎస్ ప్రతిష్ట పెంపొందించేందుకు ఎమ్మెల్సీగా నా వంతుగా బాధ్యతతో, అంకితభావంతో పనిచేస్తా. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’అని నవీన్ అన్నారు. నవీన్‌రావుకు సీఎం కేసీఆర్ అభినందనలు కాగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుర్మయ్యగారి నవీన్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నవీన్‌రావుకు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు మంత్రి చామకూర మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. -
శ్రీధరణి హత్యకేసు : బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, ఏలూరు : శ్రీధరణి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పొట్లూరి రాజు అనే నిందితుడు తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి ఈ నేరాన్ని చేశారని తెలిపారు. నవీన్‌పై మొదటగా కర్రతో దాడి చేశారని.. అనంతరం ధరణిపై అత్యాచారం చేసి.. ఆమెను కూడా కర్రతో కొట్టి చంపారని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ గ్యాంగ్ వరుసగా అత్యాచారాలు చేసిందని, ఒంటరిగా తిరిగే యువతులు, జంటలే లక్ష్యంగా చేసుకునే ఈ గ్యాంగ్.. ఇప్పటివరకు 32 నేరాలు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రతి నేరం ముందు మూడు రోజుల పాటు ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించేదన్నారు. ప్రధానంగా ఆదివారం ఒంటరిగా వచ్చే ప్రేమ జంటల్నే ఈ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుంటూ నేరాలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటివరకు ముగ్గురు యువకులు, ఓ యువతిని హత్య చేశారన్నారు. ఖమ్మం, నూజివీడు, ఇబ్రహీంపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. చదవండి : శ్రీధరణి హత్య.. నవీన్ పైనే అనుమానంగా ఉంది ప్రేమికులే వాడి టార్గెట్ ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ -
శ్రీధరణి హత్య కేసు: వెలుగులోకి సంచలన నిజాలు
-
శ్రీధరణి హత్య.. నవీన్ పైనే అనుమానంగా ఉంది
సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద శ్రీధరణి అనే యువతి ఆదివారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. యువతితో పాటు ఉన్న ఆమె స్నేహితుడు దౌలూరి నవీన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో నవీన్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పనితీరుపై మండిపడ్డారు. (ప్రేమికులే వాడి టార్గెట్) శ్రీధరణి హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి హత్య కేసులో ఆమె ప్రియుడు నవీన్ పాత్రపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. శ్రీధరణిని బయటికి తీసుకెళ్లాడు గనుక నవీన్ కూడా నిందితుడేనని అభిప్రాయపడ్డారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వారికీ ఈ అఘాయిత్యంలో పాత్ర ఉందా?
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం/కామవరపుకోట: శ్రీధరణి హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమవారం పకడ్బందీ పోలీసు బందోబస్తుతో శ్రీధరణి మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలమైన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధ గుహల ప్రాంతంలో పోలీసులు ఆధారాల కోసం జల్లెడపట్టారు. శ్రీధరణి, నవీన్‌లకు చెందిన సెల్ ఫోన్ల సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులు కనుగొన్నట్టు విశ్వసనీయ సమాచారం. బౌద్ధ గుహల సందర్శన కోసం వచ్చిన ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆధారాలు సేకరించిన క్లూస్‌టీమ్ బౌద్ధ గుహల ప్రాంతంలో ఏఎస్పీ ఈశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, సీఐ చవాన్, టి.నరసాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఎస్సైలు రాంబాబు, రామకృష్ణ, ఎ.దుర్గారావు క్లూస్ కోసం జల్లెడ పట్టారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. వేలిముద్ర నిపుణులు ఘటనా ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు. పోలీసు జాగిలం (డాన్)తో ఆ ప్రాంత మంతా పరిశీలన జరిపారు. భీముని పాదం ప్రాంతం అంతా ముళ్ల పొదలతో నిండిన నిర్జన ప్రదేశం. ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి నలుగురు సభ్యుల బృందం, వీఆర్వోలు జి.నాగరాణి, ఎం.ఆంజనేయులు ఆధ్వర్యంలో రక్త నమూనాలు, తలవెంట్రుకలు సేకరించారు. ఘటనా స్థలంలో పురుషులకు సంబంధించిన నాలుగు రకాల తల వెంట్రుకలను సేకరించారు. అంటే ఈ వెంట్రుకలు నలుగురివిగా భావిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులు? ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొంత పురోగతి సాధించినట్టు సమాచారం. ఆదివారం ఆ ప్రాం తాల్లో సంచరించిన వ్యక్తుల మొబైల్ నెంబర్ల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. మొబైల్ డంప్ టెక్నాలజీ ద్వారా ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎన్ని నెట్వర్క్ సిగ్నల్స్ ఉన్నాయి. ఎంత మంది సెల్ఫోన్లు ఉపయోగించారు అనేది ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మొబైల్ డంప్ టెక్నాలజీలో నిపుణుడైన తడికలపూడి ఎస్సై సతీష్‌కుమార్ ద్వారా నిందితుల అన్వేషణ కొనసాగిస్తున్నారు. భీమడోలు, ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో ఒంటిమీద గాయాలతో ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ యువకుడు ఒక సెల్‌ఫోన్ మెకానిక్ అని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కేసును పూర్తిగా ఛేదిస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పేర్కొన్నారు. శ్రీధరణి హత్య కేసులో ఘటనా ప్రాంతాలు పరిశీలిస్తున్న పోలీసు అధికారులు క్లూస్ టీమ్ సేకరించిన తలవెంట్రుకలు గతంలో కూడా.....? గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పలు ప్రేమ జంటలపై దాడులు జరిగినా వెలుగులోని రాలేదు. తాము అల్లరవుతామనే భయంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేక పోవడంతో ఆ ఘటనలు వెలుగులోకి రాలేదు. బౌద్ధ గుహల విస్తీర్ణం ఎక్కువ కావడం, దీనిని ఆనుకుని నిర్జన ప్రదేశం ఉండటంతో ఇటువంటి ఘటనలకు దుండగులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీకి కూడా తలకు మించిన భారంగా మారుతోంది. న్యాయం చేయండి: శ్రీధరణి తల్లిదండ్రులు ఏలూరు (టూటౌన్): శ్రీధరణి మృతదేహానికి సోమవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్పత్రికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బం«ధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంతం దద్దరిల్లింది. బాధితులను వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీధరణి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలలో నిశ్చితార్థం కానున్న తమ కుమార్తెను భీమడోలు మండలం అర్జావారిగూడెంకు చెందిన దవులూరి నవీన్ హత్య చేశాడని ధరణి తల్లిదండ్రులు ఆరోపించారు. మరో వైపు మృతురాలి కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే నవీన్‌పై దాడి చేశారంటూ అతని కుటుంబ సభ్యులు పరస్పర ఆరోపణ చేశారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు ద్వారకాతిరుమల: శ్రీధరణి హత్య కేసులో ప్రధాన నిందితుడ్ని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మైదుకూరు మండలం చంద్రాల గ్రామానికి చెం దిన పొట్లూరి రాజును ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఏం జరిగుంటుంది.. జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తెను కృష్ణాజిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నెల నుంచి అతను జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నాడు. పక్షులు, అడవి పందులు వంటివి వేటాడేందుకు అతడు రోజూ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళుతున్నాడు. అయితే శ్రీధరణి హత్య కేసుకు సంబంధించి అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వేటకని వెళ్లిన అతడికి బౌద్ధారామాల వద్ద శ్రీధరణి, భీమడోలు మండలం అర్జావారిగూడెంకు చెందిన దౌలూరి నవీన్ తారసపడి ఉండవచ్చని, ఆ సమయంలో అతడు శ్రీధరణిపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీన్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన నవీన్‌పై అతడు దాడిచేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దాడి తరువాత శ్రీధరణి, నవీన్ మృతిచెంది ఉంటారని భావించి, ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడని భావిస్తున్నారు. దాడిచేసిన వ్యక్తి పక్కన మరెవరైనా ఉన్నారా? వారికీ ఈ అఘాయిత్యంలో పాత్ర ఉందా? అన్నదానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దాడి జరిగిన రోజున 108లో నవీన్‌ను పోలీసులు ప్రశ్నించగా, శ్రీధరణి తనతో రాలేదని చెప్పాడు. అందరూ తనపై దాడిచేశారని.. వారు మావాళ్లేనని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మళ్లీ దాడిచేసిన వారెవరో తనకు తెలియదని చెప్పడం పోలీసులను తికమక పెట్టింది. -
ప్రేమజంటపై దాడి : తెరపైకి కొత్త అనుమానాలు
సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారంలో తెరపైకి కొత్త అనుమానాలు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి బౌద్ధారామం కొండపైకి వెళ్లిన శ్రీధరణి ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనలో శరీరంపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడికే మృతిచెందగా, గాయాలతో ప్రేమికుడు నవీన్ బయటపడ్డారు. కాగా సోమవారం శ్రీధరణి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. యువతిపై ఎటువంటి అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టంలో వెల్లడేనట్లు తెలుస్తోంది. యువతి తలపై బలంగా కర్రతో కొట్టడం వల్లే చనిపోయిందని నిర్ధారించారు. ప్రేమికుడు నవీన్ తల వెనుకభాగంలో ఐదు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ కూర్చొని ఉండగా దుడ్డుకర్రతో వెనుకవైపు నుంచి వచ్చి కొట్టి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. (కలకలం రేపిన యువతి హత్య) ఇది ముమ్మాటికి పరువు హత్యే శ్రీధరణిది ముమ్మాటికి పరువు హత్యేనని నవీన్ తరపు గ్రామస్థులు చెబుతున్నారు. నవీన్, శ్రీధరణిలు ప్రేమించుకోవడం అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, వారి బంధువులే ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. నవీన్ చాలా అమాయకుడు. శ్రీధరణి, నవీన్‌లు ప్రేమించుకోవడం అమ్మాయి కుటుంబ సభ్యలకు ఇష్టం లేదు. త్వరలోనే అమ్మాయికి సొంత బావతో వివాహం చేయాలని శ్రీధరణి కుటుంబ సభ్యులు భావించారు. అమ్మాయికి ఇష్టంలేదని చెప్పి.. తాను నవీన్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇది ఇష్టం లేకనే అమ్మాయి బావ, మామ ఇద్దరూ కిరాయి ముఠాతో ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నాం’ అని నవీన్ గ్రామస్తులు ఆరోపించారు. అమ్మాయి బంధువులను అదుపులోకి తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ వ్యవహార తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో అతను పొంతనలేని సమాధానం చెప్తుండడంతో మరింతో లోతుగా విచారిస్తున్నారు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్.. ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ముగ్గరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.(ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం) -
ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం
-
శ్రీధరణిని హతమార్చింది ప్రేమికుడేనా?
సాక్షి, పశ్చిమ గోదావరి: కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారంలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియుడితో కలిసి బౌద్ధారామం కొండపైకి వెళ్లిన శ్రీధరణి నిన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనలో శరీరంపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడికే మృతిచెందగా, గాయాలతో బయటపడిన ప్రేమికుడు నవీన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. యువతి తలపై దుడ్డుకర్రతో బలంగా మోదడం వల్లనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సంఘటలను (జ్యోతి ఘటన) దృష్టిలో ఉంచుకుని పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తున్నారు. ( ప్రేమజంటపై దాడి.. యువతి మృతి) ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ వ్యవహార తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో అతను పొంతనలేని సమాధానం చెప్తుండడంతో మరింతో లోతుగా విచారిస్తున్నారు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్.. ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ తలవెనుక భాగంలో బలమైన గాయలు అయినట్లు వైద్యలు వెల్లడించారు. కాగా హత్యకు గురైన శ్రీధరణికి మార్చి9న దగ్గరి బందువు అబ్బాయితో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. యువతి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గుడ్ బై నవీన్!
మృత్యువు ఒక అజ్ఞాత మిత్రుడు. హఠాత్తుగా వచ్చి కౌగిలించుకుంటుంది. అప్పుడు మనం విడిపించుకోలేం. ఈ భూమిని ఒక శాశ్వత విడిదిగా భావించి నిరంతరం లావాదేవీల్లో మునిగి తేలే నవీన్‌కుమార్ చనిపోయాడు. వాట్సప్‌లో మెసేజ్ చూసి ఒక్కక్షణం షాక్ తిన్నాను. వెంటనే తేరుకుని లెక్కలేసుకున్న. ఇరవై కిలోమీటర్ల దూరం క్యాబ్‌లో వెళ్లి రావాలంటే కనీసం వెయ్యి ఖర్చు. హాఫ్ డే టైం. నవీన్‌తో పనేముంది? చనిపోయిన వాడి గుడ్‌లుక్స్ అవసరమా? వెళితే ఎవరైనా పాత ఫ్రెండ్స్ తగలొచ్చు. ఈ నగరాల్లో మన మొహమే మనం సరిగా చూసుకోం. ఫ్రెండ్స్‌ని చూసుకోవాలంటే ఎవడైనా చావాలి, ‘‘ఏరావస్తున్నావా?’’ ధీరజ్ ఫోన్.‘‘అదే ఆలోచిస్తున్నా’’‘‘ఏంట్రా ఆలోచించేది. ఏం రైటర్విరా నువ్వు. ఫ్రెండ్‌షిప్‌డే గురించి వ్యాసాలు రాయమంటే రాస్తావు. ఫ్రెండ్ చచ్చిపోతే ఆలోచిస్తా అంటావ్. ఏం తీసుకుపోతార్రా మీరంతా. వీడు చూడు నవీన్. లంకంత కొంప కట్టుకున్నాడు. ఈ నైట్ ఆరడుగుల గుంతలో నిద్రపోతాడు’’‘‘కొంచెం ఆపరా బాబూ, జర్నలిస్ట్ ఉద్యోగాల్లో మనం చస్తే కూడా సెలవివ్వరు తెలుసా’’‘‘సరే, నువ్వొస్తానంటే నా కారులో పికప్ చేసుకుంటా’’అయితే, క్యాబ్ ఖర్చు మిగిలిందన్న మాట. వెళితే సరి, ఫ్రెండ్‌ని ఆఖరిసారి చూసినట్టుంటుంది. ‘గున్న గున్న మామిడి..’’ పాటకి కారు కూడా ఊగుతోంది. ‘‘మనం వెళ్లేది చావుకి, పెళ్లికి కాదు... పాట మారుస్తావా’’ చిరాగ్గా అన్నాను.ధీరజ్ నా వైపు సీరియస్‌గా చూశాడు.‘‘డ్రైవింగ్, షేవింగ్ జాగ్రత్తగా చేయాలి. లేదంటే బ్లడ్డే’’ అన్నాడు.‘‘ఇప్పుడీ కొటేషన్ అవసరమా?’’‘‘డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అర్థం. అయినా వాడు నవీన్ చచ్చిపోతే ఈ ప్రపంచమేమన్నా ఆగిపోయిందా? ఈ నైట్ మనంభోంచేయమా, మందు కొట్టమా?’’‘‘కొంచెం డీసెన్సీ అక్కరలేదా?’’‘‘ఏంట్రా డీసెన్సీ? లైఫ్‌లో పైకెదగాలని వాడెన్నెన్ని ఘోరాలు చేశాడో తెలియదా నీకు? ఇప్పుడు కూడా వాడి డెడ్‌బాడీ దగ్గరకెళ్లి, ‘అరె, నీకు ప్రమోషన్ వచ్చింది లే’ అంటే లేచి కూచుంటాడు. కావాలంటే పందెం’’పకపక నవ్వాడు.‘‘చనిపోయిన వాళ్ల మీద సెటైర్లు అవసరమా?’’‘‘ఏం రేపు నువ్వు చచ్చిపోవా? నేను చచ్చిపోనా? అప్పుడు బతికున్నోళ్లంతా మన మీద జోకులేసుకోరా? నీలాంటి వాళ్లంతా నెగటివ్ ఎనర్జీ. రెండురోజులు మీతోవుంటే మెంటలొస్తుంది. నన్ను చూడు, బ్లడ్‌గ్రూప్‌తో సహా బీ పాజిటివ్’’‘‘నవీన్ ఇల్లొచ్చేసింది. కొంచెం సీరియస్‌గా వుండు’’‘‘ఇప్పుడు నువ్వక్కడ చేసే యాక్టింగ్‌కి నంది అవార్డ్ ఇచ్చేయొచ్చు కదా.. ఫేక్ న్యూస్‌లు రాసిరాసి మనిషే ఫేక్ అయిపోయావ్’’‘‘మూసుకుని రా, పొలిటీషియన్లు కూడా నీ అంత చెత్తగా మాట్లాడరు.’’ నవీన్‌ది ఇండిపెండెంట్ హౌస్. గేటెడ్ కమ్యూనిటీ. ఇంటి ముందు షామియానా, కుర్చీలు. భగవద్గీత వినిపిస్తోంది. వాడి కారు మిలమిల మెరుస్తోంది. దాని మీద కాసింత దుమ్ము పడనిచ్చేవాడు కాదు.డ్రైవర్ని చెడామడా తిట్టేవాడు. సాయంత్రం వాడి మీద అందరూ తలా ఇంత గుప్పెడు మట్టి చల్లుతారు. కోట్లు లెక్కపెట్టి అలసిపోయిన చేతుల మీద మట్టి రేణువులు పరుచుకుంటాయి. సూక్ష్మజీవులు శరీరాన్ని తినేస్తాయి.ఎవరో అటూ ఇటూ తిరుగుతున్నారు. చావు దగ్గర ఎలా వుండాలో నాకు తెలియదు. బర్త్‌డేలు, పెళ్లిళ్లయితే నవ్వుతూ వెళ్లి పలకరిస్తాం. ఇక్కడేమో అంతా గంభీరంగా వుంటారు.సంతోషాన్ని షేర్ చేసుకోవచ్చు. కన్నీళ్లతోనే సమస్య. ఈ మధ్య ఒకరింటికెళితే, ఆవిడ నన్ను పట్టుకుని భోరుమని ఏడ్చింది. నాకేమో ఏడుపు రాదు. కళ్లు వుత్తుత్తిగా తుడుచుకున్నా. ఆ తర్వాత నెలరోజులకి నేనో బ్యూటీషియన్ ఇంటర్వ్యూ కోసం వెళితే అక్కడ ఆమె కనిపించింది. అన్నీ మరచిపోయి ప్రశాంతంగా కనిపించింది. ఆరోజు ఆమె ఏడుపు చూసి, పోయిన మొగుడితో పాటు ఈమె కూడాపోతుందేమో అనిపించింది. ఏదీ ఆగదు. పోయేవాళ్లు పోతూనే ఉంటారు.ఇంట్లోకెళ్లాం. నవీన్ వైఫ్ ప్రశాంతి నన్ను చూసి కళ్లు తుడుచుకుంది. ఫ్రీజర్ బాక్స్‌లో నవీన్ నిద్రపోతున్నాడు. వాడికి ఐస్క్యూబ్లంటే ఇష్టం.విస్కీ తాగితే సోడా, వాటర్ ఏదీ తీసుకోడు. ఓన్లీ ఐస్‌క్యూబ్స్. ఒక పెగ్గు మందు గ్లాసులో పోసుకుని ఫుల్‌గా ఐస్‌క్యూబ్స్‌తో నింపేవాడు. ఇప్పుడు చల్లగా.. ఆ బాక్స్‌లో.‘‘ఉదయం ఆఫీస్కెళుతుండగా గుండెపోటు వచ్చింది... హాస్పిటల్‌కి తీసుకెళ్లే టైం కూడా లేదు’’ ప్రశాంతి చెబుతూ వుంది.‘‘వాడికి గుండె కూడా వుందంటావా... నిచ్చెనలెక్కడానికి ఎందర్ని ఫినిష్ చేశాడో వీడు’’ ఈధీరజ్గాడు తాగినా తాక్కపోయినా కుక్కలా ఏదో ఒకటి మొరుగుతూ వుంటాడు. వాడికి రావాల్సిన ప్రమోషన్ ఆ నవీన్ కొట్టేశాడు. అప్పట్నుంచి కడుపుమంట.వీళ్లంతా నాకు ఎంబీఏలో క్లాస్మేట్స్.జర్నలిజం మీద పిచ్చికొద్దీ నేను రిపోర్టర్నయ్యా. కంపెనీల్లో చేరి వాళ్లు ఇళ్లు కట్టుకున్నారు. నేను అద్దె ఇంట్లో వుంటున్నా. ఈ దేహమే ఒక అద్దె ఇల్లు. నవీన్ ఖాళీ చేశాడు. ఏదో ఒకరోజు మేమూ ఖాళీ చేస్తాం.ఎవరెవరో వస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు.‘‘ఇప్పుడంతా ప్యాకేజీ సిస్టం. పుట్టడానికి, బతకడానికి, చావడానికి అన్నీ ప్యాకేజీలే. క్రిమేషన్ వరకు ప్యాకేజీనే. పంతులు ఖర్చులు కూడా ఇన్‌క్లూడెడ్’’ నవీన్ బంధువు ఎవరో మాట్లాడుతున్నారు.‘‘చాలా ఎక్కువ చెబుతున్నాడు. నీ ఇన్ఫ్లుయెన్స్ వుపయోగించి చూడు. తగ్గిస్తారు’’‘‘ఏం తగ్గిస్తారు? మన బాధ వాళ్లకి వ్యాపారం.’’‘ఈ ప్రపంచంలో ప్రతిదీ వ్యాపారమే. మనల్ని మనం అమ్ముకుంటాం. లేదా ఎవరో ఒకర్ని కొంటూ వుంటాం. లాభనష్టాలు అనే పదాలపై ఈ లోకం నడుస్తుంది. ఎమోషన్స్, రిలేషన్స్ అన్నీ ఇవే నడిపిస్తాయి.’’అనేవాడు.ప్పుడు వాడి చివరి ప్రయాణంతో వ్యాపారం జరుగుతోంది. మనం ఎదుటివాళ్ల వ్యాపారాన్ని గుర్తిస్తాం కానీ, మన వ్యాపారాన్ని గుర్తించం. ఇరవై ఏళ్లుగా పరిచయమున్న నవీన్ చనిపోతే నాకు దుఃఖం రాలేదు. క్యాబ్ ఖర్చుల గురించి ఆలోచించాను.ఘంటసాల గొంతు వినిపిస్తోంది.చావు ఇంట్లో ఈ భగవద్గీత వినిపించాలని మొదట ఎవడు కనిపెట్టాడో? భగవద్గీత వినపడగానే ఎవడో పోయాడని అర్థమైపోతుంది.ప్రశాంతి కళ్లు తుడుచుకుంటోంది.నిజంగా ప్రశాంతి నవీన్‌ని ప్రేమించిందా? లేదంటే ఇక్కడ దుఃఖం ఒక అనివార్యత మాత్రమేనా?‘జీవితం ఒక గేమ్. ఫౌల్ ఆడయినా సరే గెలవాలి. నాకు సెంటిమెంట్స్ లేవు. మనం గెలవాలంటే ఎవడో ఒకడు ఓడాలి’నవీన్ ఫిలాసఫీ ఇది.నవీన్ గెలిచాడా.. ఓడాడా?లేత పసుపురంగులోకి మారింది మొహం. చివరి క్షణాల్లో బాధని అనుభవించాడా? మృత్యువు ఎదురైనప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?కలలన్నీ సునామీలో కొట్టుకుపోతున్నప్పుడు, ఏడుస్తూ వాటి వెంట పరుగెత్తాడా? పైసా ఖర్చు లేకుండా గుండెల నిండా పీల్చుకునే గాలి, కోట్ల రూపాయలిచ్చినా హృదయాన్ని తాకకుండా వుక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడుఏ మనిషయినా ఏం చేస్తాడు?జీవితంలో ప్రతిదీ ప్లాన్ చేశాడు. కానీ చావు వాడి కోసం వేసిన ప్లాన్‌ని కనుక్కోలేకపోయాడు.‘దేవుడు మన కోసం బ్లాంక్ పేపర్ని వదిలేస్తాడు. ప్రతిదీ మనమే రాసుకోవాలి. ఒకవేళ దేవుడు తప్పుడు రాత రాసినా సరే, మనమే కరెక్ట్ చేసుకోవాలి’ మిడిల్‌క్లాస్‌లో పుట్టిన నవీన్ ఇలాగే మాట్లాడి, ఇలాగే జీవించాడు. నిజానికతను చాలా సిస్టమాటిక్.తెల్లారి నాలుగుకి లేచేవాడు. వాకింగ్, యోగా, ధ్యానం, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ ఆరుగంటల లోపే. ఏడు గంటల వరకు పేపర్ రీడింగ్, ముఖ్యంగా బిజినెస్ పేజీలు. సెవెన్ టు ఎయిట్ ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్. ఎయిట్‌కి ఆఫీస్‌కి బయలుదేరితే వన్ అవర్ జర్నీ.తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆఫీస్. రోజుకి పన్నెండు గంటలు పనిచేసేవాళ్లని ప్రతి సంస్థ ఇష్టపడుతుంది. తొమ్మిదికి బయలుదేరి, మధ్యలో ఒక పెగ్గు విస్కీ. పదకొండు గంటలకి ఇల్లు, నిద్ర, వీలైతే రోమాన్స్. శని, ఆదివారాలు ఏం చేయాలో నెల ముందే ఫిక్సయిపోతాయి.ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు వరకు డ్రైవర్ డ్యూటీలోనే వుంటాడు. అతను భోంచేశాడో లేదో ఏనాడూ అడిగేవాడు కాదు. నిజానికి ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న డ్రైవర్ పూర్తి పేరేంటో కూడా తెలియదు. కష్టాలు వినడం ప్రారంభిస్తే ప్రతివాడు టన్నుల కొద్దీ కష్టాల్ని మన మీద మోపుతాడు. ఆ బరువుకి ఇక పైకి లేవలేం. సుఖపడ్డానికే ఈ భూమ్మీదకొచ్చాం. సుఖపడాలి అంతే. ఎవరూ కష్టపడకపోతే మనమెలాసుఖపడతాం?నిచ్చెన ఎక్కుతున్నప్పుడు చూపు పై మెట్టు మీదే ఉండాలి. కాలి కింద నలుగుతున్న మెట్టు మీద కాదు.అతనికి ఫిక్షన్ చదివే అలవాటు లేదు. కెరీర్ మేనేజ్మెంట్ పుస్తకాలే చదివేవాడు. నచ్చిన వాక్యాల్ని అండర్లైన్ చేసుకునేవాడు.ఇదంతా పులి మేక ఆట. నువ్వు పులివో, మేకవో నిర్ణయించుకో. పులివైతే మేకని తిను. వేటగాడి నుంచి కాపాడుకో.ఇలాంటి వాక్యాలు బాగా ఇష్టం.నవీన్ కొలీగ్స్ చాలామంది వస్తున్నారు. గంభీరంగా కళ్లు తుడుచుకుంటున్నారు. చనిపోయింది తాము కాదనే రిలీఫ్. వాళ్లలో ఒక అందమైన అమ్మాయి వెక్కివెక్కి ఏడ్చింది.ప్రశాంతి ఒక్క క్షణం చిరాగ్గా, అనుమానంగా చూసింది.ఇక్కణ్ణుంచి వెళ్లిపోగానే అందరూ చర్చించే విషయం ఒకటే. నవీన్ ప్లేస్‌లో వచ్చే అదృష్టవంతుడెవడురా అని!ఈపాటికి పైరవీలు ప్రారంభమై వుంటాయి.నవీన్ చాలా కలలు కన్నాడు. ఇది కలలు లేని నిద్ర.ప్రతి ఆరునెలలకోసారి అన్ని టెస్ట్‌లు చేయించుకునేవాడు. డైట్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవాడు. ఎగ్ ఎల్లో తినేవాడు కాదు. అది కొలెస్ట్రాల్. ఆయిలీ ఫుడ్స్ నిషిద్ధం. ఇష్టాలన్నీ అణచేసేవాడు.పురోహితుడొచ్చాడు. జరగాల్సిన కార్యక్రమాన్ని వివరించాడు.శవాన్ని బాక్స్‌లోంచి బయటికి తీశారు. ప్రశాంతి వెక్కివెక్కి ఏడుస్తోంది. వాళ్లకి పిల్లలు లేరు. ప్లానింగ్‌లో భాగంగా, ఇల్లు తర్వాతే పిల్లలు.ఈ భూగోళానికి మనం అతిథులు మాత్రమే.. ఈ వాక్యాన్ని నేనే రాశాను. వృత్తిలో భాగంగా రోజూ ఏదో ఒకటి రాయాలి. మనం చదివే పుస్తకాలు, వినే ప్రవచనాలు దేన్నీ జీవితానికి అన్వయించుకోం.వాస్తవంలోకి వస్తే మళ్లీ పేడపురుగులా జీవితాన్ని దొర్లిస్తూ వుంటాం. నవీనంటే నాకు అసూయ. వాడికి ఇల్లుంది. నాకు లేదు. నాకంటే జీతమెక్కువ. నా జీతం నాకు చాలదు. వాడికి లగ్జరీకారుంది.వైకుంఠరథం ఆగింది. ఏవేవో శ్లోకాలు, కొటేషన్లు దాని మీద రాశారు. డ్రైవర్ నిర్వికారంగా దిగాడు.‘‘స్నానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వన్ అవర్‌లో వెళ్లిపోదాం’’ చెప్పారెవరో.నవీన్ బాడీని నలుగురు పట్టుకున్నారు. తెల్లటి బనీను, పంచె. మెడలో గోల్డ్‌చైన్. నున్నగా షేవ్ చేసిన గడ్డం. ఎక్కడా కొవ్వు లేకుండా ఫిట్‌గా ఉన్న బాడీ. చాలాకాలం బతకాల్సినోడు.వేలికున్నఉంగరాలు,మెడలోని గొలుసు తీసేశారు. ఇంటి ముందు ఆవరణలో ఒక కుర్చీలో బాడీని వుంచి ఇరువైపులా పట్టుకున్నారు. రెండు బకెట్లతో గోరువెచ్చని నీళ్లొచ్చాయి. ఒకచెంబులోకుంకుడురసం. నవీన్ తండ్రి రెండేళ్ల క్రితం పోయాడు. హార్ట్ పేషెంట్. డబ్బులు ఖర్చవుతాయని ఆయనకి సరైన వైద్యం చేయించలేదని అంటారు. ఆ తర్వాత ఆరునెలలకి తల్లి కూడా పోయింది. వాళ్ల కోసం పెద్దగా దుఃఖించినట్టుగా కూడా లేడు. తల్లి పోయిన మరుసటి రోజే బోర్డ్ మీటింగ్‌కి అటెండయ్యాడు.‘ఎమోషన్స్ వుంటే లైఫ్‌లో ప్రమోషన్స్ రావు’– ఇది కూడా అతని కొటేషనే.నేనూ, ధీరజ్, ప్రశాంతి,నవీన్ నలుగురం ఎంబీఏలో క్లాస్మేట్స్. ధీరజ్‌తో ప్రశాంతి చాలా క్లోజ్. ఒకరకంగా లవ్. ఒకర్నొకరు దిలేవాళ్లు కాదు. చదువు తర్వాత నేను జర్నలిజం వైపు వచ్చాను. నవీన్‌కి మంచి కంపెనీలో జాబ్‌వచ్చింది. ధీరజ్ ఇంకా ట్రయల్స్‌లో వుండేవాడు.ఒకరోజు నన్ను కాఫీషాప్‌కి రమ్మంది ప్రశాంతి. కూచున్న వెంటనే ఏడవడం స్టార్ట్ చేసింది.‘ధీరజ్ చాలా పొసెసివ్‌గా మారిపోతున్నాడు. నవీన్ నాకు ఇప్పిస్తానంటే వద్దంటున్నాడు. అసలు నవీన్‌తో మాట్లాడితేనే మండిపోతున్నాడు.’’ ఇవే వాక్యాల్ని అటు ఇటు తిప్పి చాలాసేపు మాట్లాడి వెళ్లిపోయింది.తర్వాత ధీరజ్ నుంచి ఒకరోజు ఫోన్.‘‘ప్రశాంతి జాబ్‌లో చేరింది. ఆ నవీన్ ఆఫీస్‌లో’’‘‘అయితే ఏంటి?’’‘‘ఇప్పుడు దానికి నాకంటే వాడే ఎక్కువ’’‘‘అది ఇదని అమ్మాయిల్ని చీప్‌గా మాట్లాడకు. జాబ్ లేదని నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’’‘‘జాబ్ లేదనే నన్నొదిలేసింది. నవీన్‌కి మేనేజర్ పోస్టుంది. పైగా సేమ్ క్యాస్ట్. ఇంట్లో ప్రెషర్స్ ఉండవు. షికార్లకు నేను, పెళ్లికి వాడు...’’‘‘సైకోలాగా మాట్లాడకు’’‘ప్రేమిస్తే తెలిసేది నా పెయినేంటో’’ వెక్కిళ్లతో ఫోన్ పెట్టేశాడు.నెలరోజుల తర్వాత ప్రశాంతి,ధీరజ్ కొంచెం దూరంలో నిలబడి ప్రశాంతిని చూస్తున్నాడు. అసలు వాడు నవీన్‌ని చూడ్డానికొచ్చాడా? ప్రశాంతి కళ్లలో బాధని చూడ్డానికొచ్చాడా? లోపల వాడిలో శాడిస్టిక్ హ్యాపీనెస్ వుందా? ఏమోబయటపడ్డం లేదు. మనుషులంతా ఇంతే, లోపల ఏంఆలోచిస్తుంటారో . ఆలోచనలు మదపుటేనుగుల్లాంటివి. అవి మనల్ని తొక్కిపడేస్తాయి.వైకుంఠరథం నుంచి పాడెని దింపారు. నవీన్‌ని అందులోపడుకోబెట్టారు. మా ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలో కూచోడానికే ఇబ్బందిపడేవాడు. కుషన్ లేకపోతే వాడి వల్ల కాదు.వెదురుబద్దలపై కాసింత గడ్డి, పాడెలోని అసౌఖ్యం తెలిసే అవకాశం లేదు.‘గోవిందా’ అని అరుస్తూ పాడెని ఎత్తారు. ప్రశాంతి కుప్పకూలిపోయింది.‘‘శ్మశానానికి వెళదామంటావా?’’ అడిగాడు ధీరజ్.‘‘నేను వైకుంఠరథంలో వస్తా’’‘‘ఎందుకు కారుందిగా’’‘నువ్వు కారులో రా, శ్మశానం నుంచి కారులో వెళ్లిపోదాం’’నేను వైకుంఠరథంలో కూచున్నాను. చుట్టూ కొంతమంది గంభీరంగా, భావరహితంగా వున్నారు. ప్రశాంతితో పాటు చాలామంది కార్లలో బయలుదేరారు. రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్.వైకుంఠరథాన్నిభయంగా చూస్తున్నారు. చనిపోయింది తాము కాదనే ఆనందంతో పాటు, ఎప్పటికైనా తాము కూడా చనిపోవాల్సిందే అనే భయం వాళ్ల కళ్లలో కనిపిస్తోంది.హరిశ్చంద్ర వాటికలో రథం ఆగింది. కారులో నుంచి ప్రశాంతి దిగింది. కలలో నడుస్తున్నట్టుగా వుంది. జరుగుతున్నదంతా నిజం కాకపోతే బాగుండు అన్నట్టు చూస్తోంది.నిన్న రాత్రి వాళ్లు చాలా కబుర్లు చెప్పుకుని వుంటారు. ఈ సమ్మర్లో వెళ్లేయూరోప్ ట్రిప్ ప్లానింగ్ గురించి మాట్లాడి వుంటారు. నిద్రలేచే సరికి జీవితం మారిపోయింది.దహనవాటికల్లో ఒకదాని మీద నవీన్‌కుమార్ పేరు రాశారు.‘‘అదేంటి మీ ఆచారం దహనం కాదు కదా?’’ ఎవర్నో అడుగుతున్నాడు ధీరజ్.‘‘సిటీల్లో అవన్నీ ఎక్కడ కుదురుతాయి సార్, ఖననమంటే ప్లేస్ లేదంటున్నారు. కాదు కూడదంటే కాస్టీ›్ల చెబుతున్నారు. అందుకే ఇలా... ఖర్చుకి వెనుకాడకుండా గంధపుచెక్కలు కూడా తెప్పించాం.’’‘‘రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అని పడి చచ్చాడు. చివరికి ఆరడుగుల నేల కూడా దక్కలేదు వీడికి. గాలిలో కలిసిపోతున్నాడు’’ అన్నాడు ధీరజ్.ఎవరికి మాత్రం ఏం దక్కుతుంది? మార్కుల కోసం ప్రొఫెసర్లని కాకా పట్టినవాడు.. ఎందర్నో ఉద్యోగాల్లోంచి తీసేసినవాడు.. సాటివాడు ఒక మనిషేనని గుర్తించలేనివాడు... అంతా శాశ్వతమని నమ్మినవాడు... కట్టెలపై నిద్రపోతున్నాడు. శవం చుట్టూ అందరూ తిరుగుతున్నారు. బంధువులెవరో నిప్పుపెట్టారు. చిన్నగా మంట... మొదట నెయ్యి, తర్వాత కిరోసిన్. మంటని ఎగదోశారు.అపురూపంగా చూసుకున్న శరీరం కాలిపోతోంది. జీవుడేమయ్యాడు? చిటపటమని చితిమంటలు. ప్రశాంతి నిర్వికారంగా చూస్తూ వుంది. రాబోయే ఇరవయ్యేళ్లకి సరిపడా ప్లాన్ చేశారు. పిల్లల్ని ఎప్పుడు కనాలి.. ఎలా పెంచాలి.. ప్లేస్కూల్ ఎక్కడ చేర్చాలి...స్కూలింగ్ తర్వాత కెరీర్ ఏంటి... ఇరవయ్యేళ్ల తర్వాత ఏ కంట్రీలో అవకాశాలు ఎక్కువుంటాయి..టప్మని శబ్దం.‘కపాలమోక్షం’ అంటున్నారెవరో..దహనవాటికకి కొంచెం దూరంలో ఎవరో ముసలమ్మ.. చేతిలో గిన్నె ఆడిస్తోంది. పురాతన బండరాళ్లలో కనిపించే ముడుతలు ఆమె మొహంలో. జీవితం కంటే మృత్యువునే ఎక్కువ చూసుంటుంది.‘‘దానం చేయకుండా వెళ్లకూడదు బాబూ..’’స్నేహితుడు చచ్చిపోతే క్యాబ్ ఖర్చుల గురించి ఆలోచించాను.. క్రూరత్వం నాలో వుందా? నగర జీవితంలో వుందా?పర్స్ తీసి రెండు ఐదువందల నోట్లు వెళ్లతో పట్టుకున్నా... ముసలమ్మ ఆశ్చర్యంగా చూసింది.గిన్నెలో వేశాను. శ్మశాన వైరాగ్యమంటే ఇదేనేమో!ధీరజ్ కారు తీశాడు.‘‘నేను రాను, నడిచి వెళతా’’ అన్నాను.‘‘నడిచా.. మీ ఇల్లెంత దూరమో తెలుసా’’‘‘నేను వెళ్లేది ఇంటికి కాదు.’’‘‘మరి’’దూరంగా మంటలు కనిపిస్తున్నాయి.గమ్యం అర్థమైంది. గమ్యం లేకుండా కాసేపు నడవాలనిపించింది. శ్మశానం కాంపౌండ్ గోడ దాటి వెనక్కి తిరిగి చూశాను.ఇల్లు ఇక్కడుంటే.. మనుషులంతా ఎక్కడెక్కడో వెతుకుతూ వుంటారు. ∙జి.ఆర్.మహర్షి -
అనగనగా...
చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు తమ మనమ సంతానానికి కథలు చెప్పాలంటే ‘అనగనగా ఓ రాజకుమారుడు’ ఉండేవాడట అని ప్రారంభించేవారు. ఇప్పుడు అదే టైటిల్‌తో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై పి.వి. రాఘవులు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా రాజకుమారుడు’. నవీన్ బాబు, సంజన జంటగా నటిస్తున్నారు. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాటలను తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు విడుదల చేశారు. షేర్ మాట్లాడుతూ– ‘‘చిన్న మెసేజ్‌తో పాటు యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్తో మా చిత్రం ఉంటుంది. హీరో హీరోయిన్లు చక్కగా నటించడంతో పాటు రాఘవులుగారు రాజీ పడక పోవడంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘నేటి యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమాను తీశాం. దర్శకుడు చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు రాఘవులు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మన ‘నరైన్’
ఒంగోలు టౌన్: వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ చేస్తే క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సింపుల్‌గా బౌలింగ్ చేస్తాడు. క్రీజ్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఉన్నప్పటికీ తన స్పిన్ మాయాజాలంతో బోల్తా కొట్టిస్తాడు. చివరకు మ్యాచ్ రూపురేఖలనే మార్చేస్తాడు. పొట్టి ఫార్మాట్ అయిన టీ–20లో అయితే నరైన్ బాల్‌తో చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. నాలుగు ఓవర్లతో తాను ప్రాతినిధ్యం వహించే జట్టువైపు మ్యాచ్ తిరిగేలా చేస్తాడు. సునీల్ నరైన్ లాంటి బౌలర్ మన దగ్గరా ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ప్రకాశం జట్టు బరిలోకి దిగితే ఆ బౌలర్ తప్పకుండా ఉండాల్సిందే. ప్రత్యర్థి జట్టులో భీకరమైన ఫామ్ కొనసాగించే బ్యాట్స్‌మన్ ఉన్నా ఆ బౌలర్ కూల్‌గా బోల్తా కొట్టించి మ్యాచ్‌ను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జట్టు వైపు తిప్పుతూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. అతనే పాశం నవీన్. స్టేట్ ప్రాబబుల్స్‌కు ఎంపిక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా తరఫున ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీశాడంటే నవీన్ బౌలింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జట్టు లీగ్ స్థాయి నుంచి ఫైనల్స్‌కు చేరడంలో నవీన్ కీలకంగా వ్యవహరించాడు. నెల్లూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో దురదృష్టవశాత్తు నవీన్ గాయపడి మ్యాచ్‌కు దూరమవడంతో అతని విలువేమిటో జట్టు మొత్తానికి తెలిసొచ్చింది. ఫైనల్స్‌లో నవీన్ బరిలోకి దిగకపోవడం, నెల్లూరు జట్టు దూకుడుకు పగ్గాలు వేసే బౌలర్ లేకపోవడంతో ప్రకాశం జట్టు రన్నరప్‌తో సరిపుచ్చుకోవలసి వచ్చింది. ఆ మ్యాచ్‌లో నవీన్ ఆడి ఉంటే ప్రకాశం జట్టు విజయం సాధించి ఉండేదని జిల్లాకు చెందిన సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానించడం చూస్తే ఆ బౌలర్ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నేపథ్యం లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన నవీన్ బౌలింగ్‌కు దిగితే అతని ఖాతాలో వికెట్లు పడాల్సిందే. అంతగా తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. ఒంగోలుకు చెందిన నవీన్ తండ్రి పాశం సుదర్శన్ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి అనూరాధ గృహిణి. స్థానిక రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ విజయనగరంలోని చింతలవలసలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అప్పటి వరకు గల్లీ క్రికెట్ ఆడుతూ వచ్చిన నవీన్ జిల్లాకు చెందిన సీనియర్ క్రికెటర్ల దృష్టిలో పడ్డాడు. బరిలోకి దిగితే వికెట్లు పడాల్సిందే.. 2014 నుంచి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీఎస్ ప్రసాద్, కె.సుధాకర్, బి.చంద్రశేఖర్ కోచింగ్‌లో రోజురోజుకూ రాటుదేలుతూ 2015లో ప్రకాశం అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. 2016లో జరిగిన అంతర్ జిల్లాల మ్యాచ్‌లో చిత్తూరుపై ఏడు వికెట్లు, తూర్పుగోదావరిపై మూడు వికెట్లు, విశాఖపట్నంపై మూడు వికెట్లు తీసిన నవీన్ అండర్–14 రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించాడు. 2017లో జరిగిన అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అనంతపురంపై ఎనిమిది వికెట్లు, కర్నూలు జట్టుపై పదకొండు వికెట్లు, కడప జట్టుపై 11 వికెట్లు, గుంటూరు జిల్లాపై ఏడు వికెట్లు తీశాడు. మొత్తం 38 వికెట్లు తీసిన నవీన్ అండర్–16 స్టేట్ ప్రాబబుల్స్ జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల నిర్వహించిన అండర్–16 ప్లేట్ గ్రూప్ అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్‌లో శ్రీకాకుళంపై మూడు వికెట్లు, గుంటూరుపై ఎనిమిది వికెట్లు, నెల్లూరుపై రెండు వికెట్లు, పశ్చిమ గోదావరిపై తొమ్మిది వికెట్లు, విజయనగరంపై ఏడు వికెట్లు తీశాడు. విశాఖతో జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. తన ప్రతిభను గుర్తించిన కోచ్‌లు, సహకరించిన క్రికెట్ ప్రకాశం కార్యదర్శి చింతపల్లి ప్రతాప్కుమార్కు నవీన్ కృతజ్ఞతలు తెలిపాడు. భారత జట్టు ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌తో.. క్రికెటే నా ఊపిరి క్రికెట్ అంటే నాకు ప్రాణం. ముందుగా రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాలి. ఆ తర్వాత రంజీ ట్రోఫీ, టీ–20 మ్యాచ్‌లు ఆడాలని ఉంది. మంచి ప్రతిభ కనబరచి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలన్నదే నా లక్ష్యం. – నవీన్ -
మూవీ ఫ్రెండ్స్
హీరో విజయ్ దేవరకొండతో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... నాని, నిఖిల్‌తో సత్య... రానా, రాజ్ తరుణ్‌తో నవీన్... వీరందరిప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. తెరపై నవ్వులు పూయిస్తున్నారు. ప్రతి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రల్లో ఒకప్పుడు సీనియర్ నటులు రాణించగా... ఇప్పుడు నయా ఆర్టిస్టులు దూసుకొచ్చారు. అలాంటి కొందరు మూవీ ఫ్రెండ్స్ గురించి.. శ్రీనగర్‌కాలనీ: ఓ హీరోయిన్.. ఓ హీరో.. ఓ ఫ్రెండ్.. ఈ ట్రాక్ సినిమాల్లో సూపర్ హిట్. మూవీస్‌లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఓ ట్రెండ్ సెట్టర్. అప్పట్లో నటుడు చంద్రమోహన్ ఫ్రెండ్‌గా నటిస్తే చిత్రాలు హిట్ అనే అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్ లిస్టులో అలీ, వేణుమాధవ్, సునీల్, రాజీవ్ కనకాల, ఉత్తేజ్ చేరారు. వీరి తర్వాత శ్రీనివాసరెడ్డి, వేణు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, గిరిధర్, చిత్రం శ్రీను, సప్తగిరి తదితరులు ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు కొన్ని కొత్త ముఖాలు తెరపైకనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో పాపులర్ అయినకొంతమంది ఆర్టిస్టుల పరిచయమిది... ♦ అభినవ్ గోమటం థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే షార్ట్ఫిలిమ్స్ కూడా చేశాడీ హైదరాబాదీ కుర్రాడు. జగన్నాటకం అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీరావా’లో మంచి పాత్ర చేశాడు. తరుణ్‌భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కామెడీ టచ్ ఉన్న పాత్ర ఇవ్వడంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. దర్శకుడు తేజ, ఆది సాయికిరణ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ ప్రియదర్శి ప్రియదర్శి పక్కా హైదరాబాదీ. 20కి పైగా షార్ట్‌ఫిల్మ్స్ చేశాడు. బైపాస్ రోడ్ మూవీతో సినీ జర్నీ ప్రారంభించగా... మూడో చిత్రం ‘పెళ్లిచూపులు’తో బ్రేకొచ్చింది. ‘నా చావు నేను చస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. టైమింగ్‌తో కూడిన పంచ్‌లతో ప్రియదర్శి హీరో ఫ్రెండ్‌గా అదరగొడుతూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్, వెంకటేష్–వరుణ్‌తేజ్, సుధీర్‌బాబు చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ రాహుల్ రామకృష్ణ ‘సైన్మా’ షార్ట్‌ఫిల్మ్‌తో కెరీర్ ప్రారంభించాడు. అర్జున్‌రెడ్డి సినిమాతో అందరికీ సుపరిచితుడయ్యాడు. తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘గీత గోవిందం’లోనూ రాహుల్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం రాజశేఖర్, శ్రీవిష్ణు, సందీప్‌కిషన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ సత్య అక్కల హావభావాలతోనే కామెడీ రక్తికట్టిస్తాడు. తూర్పుగోదావరి అమలాపురానికి చెందిన సత్య అక్కల అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ‘పిల్ల జమిందార్’ చిత్రానికి అసిస్టెంట్ డెరెక్టర్‌గా చేస్తూ నటించాడు. అనంతరం ‘స్వామిరారా’తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రౌడీఫెల్లో, కార్తికేయ, జైలవకుశ, ఎక్కడికిపోతావు చిన్నవాడా, రంగస్థలం తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’, నిఖిల్ ‘ముద్ర’, నాగార్జున–నానిల ‘దేవదాస్’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ నవీన్ నవీన్‌ది రాజమండ్రి. 100 పర్సంట్ లవ్ చిత్రంలో పాపులర్ అయ్యాడు. ‘5డేస్ ఇన్ హైదరాబాద్’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించాడు. అనంతరం పిల్ల జమిందార్, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, నేనే రాజు నేనే మంత్రి, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో ఫ్రెండ్‌గా తనదైన ముద్ర వేశాడు. ఆకతాయిగా ఉంటూ సరదాగా కామెడీ పండిస్తాడు. ఇప్పుడు సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, మారుతి దర్శకత్వంలోని చిత్రాలతో పాటు మరోదాంట్లో లీడ్‌రోల్ చేస్తున్నాడు. ♦ సుదర్శన్‌రెడ్డి ‘మచ్చా’ అంటూ చిత్తూరు యాసతో అరదగొడతాడు సుదర్శన్‌రెడ్డి. బీటెక్ పూర్తయ్యాక యూఎస్ ప్లాన్స్ కోసం సిటీకొచ్చిన మనోడు... ‘నాకు కోపం వచ్చింది’, ‘ఇదిగో ప్రియాంక’ లాంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత రన్ రాజా రన్, పటాస్, కుమార్ 21ఎఫ్, చలో, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు చేశాడు. ప్రస్తుతం శర్వానంద్, రామ్, నాగచైతన్య చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ మహేష్ విట్టా ఎంబీఏ పూర్తి చేసి, ఉద్యోగం చేయమని తల్లిండ్రులు చెబితే... నేను నటుడు, డెరెక్టర్ అవుతానంటూ హైదరాబాద్ వచ్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేష్... రాయలసీమ యాసతో షార్ట్‌ఫిల్మ్స్, ఫన్ బకెట్లో పాపులర్ అయ్యాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి... కృష్ణార్జున యుద్ధం, చలో, విజేత, నా నువ్వే సినిమాల్లో చేశాడు. పేపర్‌బోయ్, పడి పడి లేచె మనసు చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ వెన్నెలకంటి రాకెందుమౌళి రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకెందుమౌళి. పాటలు, మాటల రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్, డ్యాన్సర్‌గా సుపరిచితుడు. షార్ట్‌ఫిల్మ్స్, వెబ్ సీరిస్‌లలో నటించాడు. చాలా చిత్రాలకు డబ్బింగ్ చెప్పడంతో పాటు పాటలు రాశాడు. నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్ పార్టీ చిత్రాల్లో నటించాడు. పల్లెవాసి, మైడియర్ మార్తాండం, బియాండ్‌లైఫ్ చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు. ♦ అభయ్ బేతిగంటి సిద్దిపేటకు చెందిన అభయ్ ‘సోడాబుడ్డి భాస్కర్’, ‘లగ్గం’ షార్ట్‌ఫిల్మ్స్ చేశాడు. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. పక్కింటి కుర్రాడిలా ఉంటూ కామెడీని పండిస్తున్నాడు. ప్రస్తుతం జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న జార్జిరెడ్డి, నాగశౌర్య చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ వైవా రాఘవ వైజాగ్‌కు చెందిన రాఘం వైవా షార్ట్‌ఫిల్మ్స్‌తో సోషల్ మీడియాలో వైవా రాఘవగా పరిచయమయ్యాడు. గలగల మాట్లాడుతూ అల్లరి పిల్లోడిగా కనిపిస్తాడు. రాజా ది గ్రేట్, కిరాక్ పార్టీ సినిమాల్లో నటించాడు. శివాజీరాజా కుమారుడి చిత్రం, నర్తనశాల, ఫన్ అండ్ ఫస్ట్రేషన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. -
రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రానికి చెందిన గుజ్జ నవీన్(22) అనే ఎంబీబీఎస్ విద్యార్థి రష్యాలో మృతి చెందాడు. భువనగిరి పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన గుజ్జు హేమలత, యాదగిరి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు గుజ్జ నవీన్. నవీన్ రష్యాలోని ఓరన్‌బాగ్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. పుట్టిన రోజు జరుపుకుందామని స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అందులో భాగంగా ఓ డ్యాం వద్ద సరదాగా ఈత కొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు, ఫోన్ ద్వారా నవీన్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ విషయం విని నవీన్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
కుక్క కోసం... దొంగ వేషం
అల్వాల్: డబ్బులు సంపాదించాలనే దురాశతో ఇద్దరు యువకులు ఏకంగా ఖరీదైన శునకాన్నే దొంగిలించారు. దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయని భావించి వారు ఈ దుశ్చర్యకు పాల్పడగా... సీసీ కెమెరాలో చిక్కడంతో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మచ్చ బొల్లారంలో నివసించే అంబిక అనే మహిళ ఇంట్లో హైబ్రిడ్ శునకాన్ని(స్మార్టీ) పెంచుకుంటోంది. నెల రోజుల క్రితం స్థానికంగా నివసించే పవన్, శరత్‌చంద్రలు ఆ శునకాన్ని దొంగిలించారు. దాన్ని మరో కుక్కతో క్రాసింగ్ చేయించారు. స్మార్టీకి పుట్టిన పిల్లల్ని, తల్లిని అమ్మి సొమ్ము చేసుకుందామని భావించారు. అయితే తమ స్మార్టీ కన్పించకపోవడంతో యజమానురాలు అంబిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. కుక్కే కదా ఏమవుతుంది అనుకున్న యువకులు చివరకు కటకటాలపాలయ్యారు. ఇదిలా ఉండగా తన స్మార్టీకి క్రాసింగ్ చేయడం కూడా నేరమని పోలీసులతో అంబిక వాగ్వివాదానికి దిగింది. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాన్ని నిందితులు అనారోగ్యానికి గురయ్యేలా చేశారని, దీనికి పూర్తి బాధ్యత వారిదేనని ఆరోపించింది. పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శునకాన్ని యజమానురాలికి అప్పగించారు. (పోలీస్ స్టేషన్ వద్ద కుక్క కోసం పంచాయితీ) -
మళ్ళీరావా బ్యానర్లో మరో సినిమా
మళ్ళీరావా లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్. తొలి సినిమాతోనే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి రెండో ప్రయత్నంగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు రాహుల్. ‘మళ్ళీరావా తర్వాత ఎన్నో కథలు విన్నాను,నూతన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్ జే చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాం. యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఆల్ ఇండియా బక్చోద్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాం. మెంటల్ మదిలో చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం.‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’ అని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు. -
ఆ తాళి కట్టింది ఎవరో తెలిసిపోయింది..!
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): వచ్చేనెల పెళ్లి పీటలు ఎక్కవలసిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఒక్కో చిక్కుముడి వీడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడితో గడిపిన ఆమెకు ఓ ఫోన్ రావడం, దానిపై అతడు ఆమెను అనుమానించడంతో ఇద్దరి మధ్య జరిగిన వివాదం ప్రియురాలి ప్రాణాల మీదకు వచ్చింది. నగరం లోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన ప్రజ్ఞ వివాహం వచ్చేనెల 6న జరగా ల్సి ఉంది. ఇందుకు కుటుంబ సభ్యులు పనులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో పెళ్లి కూతురు ప్రజ్ఞ ఆత్మహత్యపై అనేక అనుమానాలకు తావిచ్చింది. బీటెక్, ఎంబీఏ చదివిన ప్రజ్ఞకు హైదరాబాద్‌లో నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ప్రజ్ఞతో ప్రేమలో ఉండగానే నవీన్‌కు మరొకరితో వివాహమైంది. అయినా ప్రజ్ఞ అతడిని మరవలేదు. అతడికి పెళ్లి అయినా అతనే కావాలని కో రుకుంది. కూతురు జీవితం బాగుండాలని కోరుకున్న తల్లిదండ్రులు, చెల్లెలు మొదటి శుభలేఖను వేంకటేశ్వరుడి పాదాల వద్ద పెట్టేందుకు తల్లిదండ్రులు తిరుపతికి వెళ్లారు. అదే రోజు ఇంట్లో ఎవరూ లేక ప్రజ్ఞ తన ప్రియుడు నవీన్‌ను నిజామాబాద్‌కు రావాలని చెప్పటంతో అత ను వచ్చాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, గదిలో అప్పటికప్పుడు ప సుపు కొమ్ముతో తాళి సిద్ధం చేసి అతడితో మెడలో కట్టించుకుంది. అనంతరం ప్రజ్ఞకు ఓ స్నేహితురాలు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆమెను పూర్తి పేరుతో కాకుండా నిక్ నేముతో పలకరించింది. ఫోన్ మాట్లాడాక నవీన్ ‘ఎవరూ ఫోన్ చేసిందని’ అని అడిగాడు. దాం తో ఆమె తన స్నేహితురాలు అని చెప్పింది. మరి మగ పేరుతో ఎందు కు పిలిచావని నవీన్ మరోసారి ప్రజ్ఞను అడగటంతో ఇద్దరి మధ్య స్వల్పంగా గొడవ జరిగింది. దాంతో నవీన్ హైదరాబాద్ వెళ్తాను అం టూ బయటకు వచ్చాడు. అతడి వెనుకే ఆమె కూడా వచ్చి నువ్వు తిరి గి రాకపోతే చనిపోతానంటూ చెప్పింది. అతను నీ ఇష్టం అనడంతో ఆమె కోపంతో తిరిగి ఇంటికి వచ్చి చున్నితో ఉరేసుకుంది. కాస్సేపటి కి నవీన్ ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇంటికి వెళ్లి కిటికీ నుంచి చూడగా బెడ్‌పై పడి ఉండటంతో అతను వెంటనే ప్రజ్ఞ చెల్లెలు కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు. అనంతరం నవీన్ అక్కడి నుంచి జారుకున్నాడు. మంగళవారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటన స్థలానికి వచ్చి కేసును చేధించినట్లు సమాచా రం. నవీన్‌ను శుక్రవారం రాత్రి పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలి పారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సంబంధిత వార్త : పెళ్లి కాకుండానే మెడలో పసుపు తాళి -
నవీన్‌ను ఆదుకుంటాం
తిరుమలాయపాలెం: దీనావస్థలో ఉన్న మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన యువకుడు గండమల్ల నవీన్‌ను ఆదుకుంటామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. నవీన్ దీనస్థితిపై సోమవారం ‘సాక్షి’లో ‘అప్పుడు ఉద్యమం..ఇప్పుడు అచేతనం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో భోజన విరామ సమయంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధుసూదన్, ప్రముఖ న్యాయవాది ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహకారంతో నవీన్ తల్లిదండ్రులు మంగమ్మ, నర్సయ్యలు మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. దీంతో అక్కడే ఉన్న ప్రముఖ వైద్యులతో నవీన్‌కి శస్త్రచికిత్సలపై మంత్రి మాట్లాడారు. శస్త్రచికిత్సలు చేసిన ఫలితం లేదని డాక్టర్లు తెలపడంతో నవీన్ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతలు చూసుకోవాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు. రెక్కాడితే డొక్కాడని తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఎంత బిజీగా ఉన్నా తమతో మాట్లాడి భరోసా ఇవ్వడం పట్ల నవీన్ తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆరోగ్యశ్రీ అధికారులు కూడా సుబ్లేడు వెళ్లి నవీన్‌ని కలిసి హాస్పిటల్ రికార్డులను పరిశీలించారు. -
ప్రేమ వ్యవహారంలో హెచ్చరించాడనే...
యశవంతపుర: బీబీఎంపీ ఛలవాదిపాళ్యం బీజేపీ కార్పొరేటర్ రేఖ భర్త కదిరేశ్ (49) హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ ప్రేమ విషయంలో తల దూర్చినందుకే సినీ ఫక్కీలో హత్య చేసినట్లు ప్రచా రం జరుగుతోంది. బుధవారం సాయంత్రం జరిగిన హత్య కేసుకు సంబంధించి... దగ్గర సంబంధం యువతితో నిందితుడు నవీన్ కొద్ది కాలంగా ప్రేమ వ్యవహా రం నడుపుతున్నాడు. యువతిని దొంగపెళ్లి చేసుకో వాలని భావించాడు. విషయం తెలుసుకున్న కదిరేశన్ ఇటీవల నవీన్‌తోపాటు అతని స్నేహితులను ఇంటికి పిలిపించుకుని తనదైన శైలిలో హెచ్చరించి పంపాడు. ఇది కదిరేశ్, నవీన్‌ల మధ్య ఘర్షణకు దారితీసింది. దీని వెనుక పాతరౌడీ పీటర్ హస్తం ఉన్నట్లు సమాచారం. జై లు నుండి స్కెచ్ వేసి కదిరేశ్‌ను హతమార్చినట్లు తెలు స్తోంది. తన స్నేహితుడు వినయ్‌ను తీసుకొచ్చి ఒక్కసారిగా గొంతుపై చాకుతో పొడిచి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. బుధవారం రాత్రి మృతదేహనికి విక్టోరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. హంతకుల అరెస్టుకు నాలుగు బృందాలు: హోంమంత్రి రామలింగారెడ్డి బీజేపీ నాయకుడు కదిరేశ్ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి విక్టోరియా ఆస్పత్రిలో మృతదేహన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చామరాజపేటలో కదిరేశ్ ఇంటి వద్దనే హత్య జరిగిందని ఇందులో నవీన్, వినయ్‌లు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో బయట పడిందన్నారు. కదిరేశ్ హత్య కేసు నిందితులను త్వరగా అరెస్టు చేస్తామని పశ్చిమ విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ బీకే సింగ్ తెలిపారు. -
శతమానం భవతి
కోరుకున్నవాణ్ణి పెళ్లి చేసుకోవటమే కదా ఏ ఆడపిల్లైనా ఆశపడేది. అది సాధారణ అమ్మాయి అయినా సరే హీరోయిన్ అయినా సరే. ఇప్పుడు భావన ఆ ఆనందంలోనే ఉన్నారు. ‘ఒంటరి, మహాత్మ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ కుట్టి తన ప్రేమికుడు నవీన్‌తో ఏడడుగులు వేశారు. నిన్న ఉదయం కేరళ త్రిస్సూర్‌లో ‘నవీన్’ను కేరళ స్టైల్లో పెళ్లి చేసుకున్నారు భావన. నవీన్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాత. వధూవరుల కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా కొద్దిమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. భావన ఫ్రెండ్స్, కథానాయికలు రమ్య నంబీసన్, నవ్య నాయర్, భామ ఈ పెళ్లిలో సందడి చేశారు. ఈ కొత్త జంటకు ఇండస్ట్రీకు చెందిన పలువురు సెలబ్రిటీలు ‘శతమానం భవతి’ అని శుభాకాంక్షలు తెలిపారు. త్రిస్సూర్‌లోని లూలూ కన్వెన్షన్ సెంటర్లో ఇండస్ట్రీ మరియు ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. -
ఘనంగా హీరోయిన్ భావన వివాహం
-
ఒక్కటైన భావన, నవీన్
హీరోయిన్ భావన్, నిర్మాత నవీన్ ల వివాహం ఈరోజు ఉదయం కేరళలోని త్రిసూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులు బందు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన భావన ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. భావన హీరోయిన్ గా నటించిన ఓ సినిమాను నవీన్ నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డా ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. భావన తెలుగులోనూ మహాత్మా, ఒంటరి లాంటి సినిమాలతో అలరించింది. -
నటి పెళ్లి సందడి మొదలైంది.. వైరల్
సాక్షి, త్రిసూర్: దక్షిణాది నటి భావన మరికొన్ని గంటల్లో చిరకాల మిత్రుడు, శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌ను వివాహం చేసుకోనున్నారు. నటి కుటుంబంలో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి రెండు రోజుల ముందు కొందరు సన్నిహితుల సమక్షంలో శనివారం భావన మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు దుస్తుల్లో మేలిమి బంగారంలా భావన ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతేడాది మార్చి 9న నవీన్, భావనల ఎంగేజ్మెంట్ జగిన సంగతి విదితమే. కాగా చాలాకాలం తర్వాత కేరళలోని త్రిసూర్ లో 'లులు కన్వెన్షన్ సెంటర్'లో రేపు (జనవరి 22న) వీరి వివాహం జరిపేందుకు అంతా సిద్ధం చేశారు. వీరి మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా త్రిసూరు చేరుకుంటున్నారు. మెహందీ ఫంక్షన్ నటి భావన స్వగృహంలో చేసినట్లు సమాచారం. సోమవారం భావన వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొందరిని మాత్రమే వివాహానికి ఆహ్వానించామని, చాలా సింపుల్‌గా శుభకార్యం నిర్వహించనున్నట్లు నటి కుటుంసభ్యులు తెలిపారు. -
సంచలనం రేపుతున్న నారాయణ సంస్థల ఆడియో
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వివాదస్పదమైన నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆ సంస్థలకు చెందిన ఆడియో టేప్ వైరల్‌గా మారింది. నారాయణ సంస్థల్లో జరుగుతున్న అనైతికక కార్యక్రమాలు ఆ ఆడియో ద్వారా బయటకు వెల్లడి కావడం మరోసారి చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగుల సంభాషణ... ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌కు చెందిన వైస్ ప్రిన్సిపల్ నవీన్ .. అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపాల్ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన సంభాషణలు బయటపడ్డాయి. డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్‌మనీని నారాయణ యాజమాన్యం వైట్‌మనీగా ఎలా మార్చిందో వీరిద్దరూ ఆ వీడియోలో చర్చించుకున్నారు. అలాగే యాజమాన్యంలోని కీలక వ్యక్తికి ...మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ సంభాషణల్లో వెల్లడి అయింది. హయత్‌నగర్ నారాయణ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటో కూడా....ఈ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారుతోంది. వనస్థలీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని...ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. నారాయణ సంస్థలకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చ జరిగిన ఈ ఆడియో టేపు.....ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఆడియో వ్యవహారంపై నారాయణ యాజమాన్యం ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడియో కలకలం రేపుతోంది. అలాగే ఆడియో టేపులను బహిర్గతం చేశాడన్న అనుమానంతో వైస్ ప్రిన్సిపల్ నవీన్‌పై నారాయణ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు నవీన్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. బయటపడ్డ ఆ ఆడియోతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపాడు. అయినా తనపై అకారణంగా దాడి చేశారని, తనకేమీ జరిగినా నారాయణదే బాధ్యత అని నవీన్ అన్నారు. నారాయణ నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తన అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా నారాయణ ఉద్యోగుల ఆడియో సంభాషణ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. నారాయణలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై.....విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. నారాయణగూడలోని నారాయణ కాలేజీపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నీచర్ అంతా ధ్వంసం చేశారు. అడ్డగోలుగా చెలామణి అవుతోన్న నారాయణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ -
యువకుడి ఆత్మహత్య
టీ.నగర్: తిరువొత్తియూరులో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువొత్తియూరు సమీపాన గల పళవేతొట్టికుప్పం ప్రాంతానికి చెందిన నరేష్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి పక్కింటి యువకుడు నవీన్(18)తో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య మళ్లీ తగాదా ఏర్పడింది. ఆ సమయంలో నవీన్ అతని స్నేహితులు కలిసి నరేష్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలిసింది. దీన్ని అవమానంగా భావించిన నరేష్ తన ఇంటి సమీపాన ఉన్న మర్రిచెట్టుకు సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
న్యుమోనియాతో చిన్నారి మృతి
చెన్నేకొత్తపల్లి(రామగిరి): చెన్నేకొత్తపల్లి మండలం చందమూరు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు నవీన్ (9) న్యుమోనియాతో గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ధర్మవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న నవీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు చెన్నేకొత్తపల్లి, ధర్మవరం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బెంగుళూరుకు తరలించారు. వైద్యపరీక్షల్లో న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఫిరాయింపు దారునికే పట్టం!
జెడ్పీ చైర్మన్‌గా నవీన్ ఎంపిక సాంప్రదాయాన్ని మంటకలిపిన టీడీపీ ఎన్నిక విధానాన్ని తప్పుపట్టిన ప్రతిపక్షం ప్రజాస్వామ్యం ఖూనీకి గురైందని ఆవేదన భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజల నమ్మకాన్నే పదవి కోసం తాకట్టుపెట్టిన జ్యోతుల నవీన్ తీరు చర్చనీయాంశమైంది. ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తనయుడు నవీన్ జెడ్పీ చైర్మన్‌గా అధికారిక ఎన్నికల ద్వారా బాధ్యతలు చేపట్టారు. ప్రతిపాదనలకే పరిమితమైన పేరాబత్తుల గత నెల 21న జెడ్పీ చైర్మన్‌గా నామనను తప్పించి జ్యోతుల నవీన్‌కు పదవిని కట్టబెడుతూ జీవో వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ప్రిసైండింగ్ అధికారిగా నియమించి బుధవారం ఉదయం 11 గంటలకు జెడ్పీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన జ్యోతుల నవీన్‌ను చైర్మన్‌గా ఎన్నికచేశారు. ఈ ఎన్నికలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2015 లో జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల అనంతరం నామనకు పోటీగా నిలిచిన ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ పార్టీ అదేశాలతో పోటీ నుంచి వైదొలిగి అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో నామనను స్వయంగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఫిరాయింపు దారునికి పదవేంటని, నామనను తప్పించేందుకు వీల్లేదని వాదించారు. గతంలో భంగపడ్డ ఆయన, ఇప్పుడు మరోసారి నవీన్ ఎన్నికను వ్యతిరేకించి మరోసారి డీలాపడ్డారు. ఇలా రెండుసార్లూ చైర్మన్ ఎంపిక ప్రతిపాదన తానే చేయడం సభలో ఆసక్తిగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం నవీన్‌ను చైర్మన్‌గా పేరాబత్తుల ప్రతిపాదించగా కాట్రేనికొన జెడ్పీటీసీ సభ్యుడు నాగిడి నాగేశ్వరరావు బలపర్చారు. వైస్ చైర్మన్‌గా రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్ పేరును రాజానగరం జెడ్పీటీసీ సభ్యులు పల్లం రత్నం ప్రతిపాదించగా కూనవరం జెడ్పీటీసీ సభ్యులు వై.కన్యకాపరమేశ్వరి బలపర్చారు. ఎన్నికల సమయంలో ఎటవంటి అభ్యంతరాలు రాకపోవడంతో చైర్మన్‌గా జ్యోతుల నవీన్, వైస్‌చైర్మన్‌గా పెండ్యాల నళినీ కాంత్‌లను ఖరారు చేస్తూ ప్రిసైండింగ్ అధికారి కార్తికేయ మిశ్రా ప్రమాణం చేయించి, నియామక పత్రాలను అందించారు. 47 మంది సభ్యుల హాజరు. ప్రస్తుతం ముంపు మండలాలతో కలిపి 60 మంది జెడ్పీటీసీ సభ్యులున్న పరిషత్ ఎన్నికలకు 47మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులు సమావేశానికి హాజరై అధికార పార్టీకి అనుకూలంగా ఓటువేశారు. 48 మంది టీడీపీ సభ్యుల్లో 7 గురు సమావేశానికి హాజరుకాలేదు. పూర్వపు జెడ్పీచైర్మన్ నామన రాంబాబు సైతం సమావేశానికి హాజరుకాలేదు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పద్మ, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వరుపుల, జ్యోతుల, పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : ప్రతిపక్ష నేత సాకా జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ జెడ్పీచైర్మన్ ఎన్నికల నియామవళిని సభ్యులకు అందివ్వకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని, ఈ ఎన్నికను తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీకి కేవలం పదవికోసం ఫిరాయించడం నీచమన్నారు. తమ సభ్యులు సమావేశానికి హాజరుకాకుండానే ఎన్నిక నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి తీరును వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పదవులను అనుభవించినా నేడు రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో చేసిన తప్పులకు అధికార పార్టీ, ఫిరాయింపుదారులు తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సత్తి సూత్యనారాయణరెడ్డి పి.భారతి, సోయం అరుణ, మట్టా రాణి పాల్గొన్నారు. -
భయం లేదు
‘‘డేర్’ ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. నవీన్ కొత్త కుర్రాడైనా బాగా నటించాడు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా నటించడంతో మంచి అవుట్‌పుట్ వచ్చింది. పాటలు, ఫైట్స్ హైలైట్. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని దర్శకుడు కె.కృష్ణప్రసాద్ అన్నారు. నవీన్, పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ఎస్. కరణ్ రెడ్డి సమర్పణలో ఎస్. రామారావు నిర్మించిన సినిమా ‘డేర్’. జి.ఆర్. నరేన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ విడుదల చేసి, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్‌కు అందించారు. నిర్మాత ఎస్.రామారావు మాట్లాడుతూ– ‘‘కథానుగుణంగా సదా చంద్ర మంచి పాటలు రాశారు. వాటికి నరేన్ తనదైన స్టైల్లో అందర్నీ ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. సినిమాకు పాటలు పెద్ద ఎస్సెట్’’ అన్నారు. ‘‘మా టీమ్ కష్టపడి, ఇష్టపడి పనిచేశాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుందని డేర్‌గా చెప్పగలను’’ అన్నారు నవీన్. పల్లవి, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్. -
హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!
-
హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!
ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు హైందవి మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైందవి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని నవీన్ గమనించారు. దాంతో శుక్రవారం మధ్యాహ్నం వాళ్లింటికి వచ్చిన అతడు...హైందవిపై అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు, తన గుట్టు బయటపడుతుందనే భయంతో నవీన్ ...ఆమెను దారుణంగా హతమార్చాడు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు దోపిడీ దొంగలే ఈ ఘటనకు పాల్పడినట్లు హైందవి వంటిపై బంగారు ఆభరణాలతో పాటు, స్కూటీతో పరారయ్యాడు. -
అంతా అనుకున్నట్టే....
– ‘సాక్షి’ చెప్పినట్టే జరిగింది – జ్యోతుల నవీన్‌కు తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు – నామన, నళినీకాంత్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు జారీ – ఈ నెల 15న తాత్కాలిక బాధ్యతలు స్వీకరణ – ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనంతరం అధికారిక ఎన్నిక – నిశ్చేష్టులైన జెడ్పీటీసీ సభ్యులు – జీర్ణించుకోలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనుకున్నట్టే జరిగింది. సాక్షి చెప్పినట్టే అయింది. జిల్లా పరిషత్ తాత్కాలిక చైర్మన్‌గా జ్యోతుల నవీన్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఆదివారం రాజీనామా చేయించిన ప్రభుత్వ పెద్దలు సోమవారం తాత్కాలిక చైర్మన్‌గా నవీన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నెల 15వ తేదీన తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ విషయాన్ని సాక్షి గత వారం రోజులుగా వరుస కథనాలు ఇస్తూ వచ్చింది. ఈ నెల 7వ తేదీన ‘యనమల విలవిల ... జ్యోతుల మిలమిల’ శీర్షికతో ఇద్దరి నేతల మధ్య కోల్డ్‌వార్‌ను బయటపెట్టగా ఈ నెల 8వ తేదీన మొదటి పేజీలో ’నైస్‌గా వైఎస్‌కు ఎసరు శీర్షికతో, 9న ’ఇదేమి బలిదానం శీర్షికన టీడీపీలో మారుతున్న రాజకీయ పరిణామలపై వరుస కథనాలను ఇచ్చింది. చివరికి ఆ దిశగానే 9వ తేదీన చైర్మెన్ పదవితోపాటు వైస్ చైర్మన్ పదవికీ రాజీనామాలు సమర్పించి వలస వాదులకు బాటను సుగమం చేశారు. మారిన ఉత్తర్వులు సాధారణంగా జెడ్పీ చైర్మన్ రాజీనామా చేస్తే...వైస్ చైర్మన్ ఆపద్ధర్మ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్ కూడా రాజీనామా చేస్తే అధికార పార్టీలోని జెడ్పీటీసీకి తాత్కాలిక చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ ఇక్కడ సీన్ మారింది. అధికార పార్టీ జెడ్పీటీసీకి కాకుండా వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన జెడ్పీటీసీకి పట్టం కడుతోంది. జెడ్పీటీసీలు ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించి జంప్ జిలానీని కూర్చోబెడుతోంది. వ్యూహాత్మకమే... ఫిరాయింపు సమయంలో చేసుకున్న ఒప్పందాలు, చేతులు మారిన ప్యాకేజీల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, జిల్లాలో మారిన సమీకరణలు, యనమల రామకృష్ణుడు తదితర నేతల నుంచి ఎదురైన వ్యతిరేకతతో జ్యోతులకు మొండి చేయి చూపించారు. ఈ నేపథ్యంలో పార్టీలోకి తీసుకొచ్చి కాపులకు అన్యాయం చేశారనే వాదన తెరపైకి రావడంతో చంద్రబాబు నివారణ చర్యలు చేపట్టారు. ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో జెడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇష్టం లేకపోయినప్పటికీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించి జెడ్పీ చైర్మన్ పదవిని వదులుకునేలా నామన రాంబాబుపై ఒత్తిడి చేసింది. దీంతో కొన్ని రోజులు రాంబాబు ససేమిరా అనడంతో పార్టీలో ఉత్కంఠ నెలకుంది. చివరికి అధిష్టానం ఒత్తిడి ... వ్యూహాత్మకంగా పావులు కదడపడంతో నామన తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేస్తానని అంగీకరించారు. చైర్మన్ రాజీనామాతో ఆగని పార్టీ పెద్దలు వైస్ చైర్మన్‌పైన కూడా ఒత్తిడి పెంచారు. చైర్మన్ రాజీనామాతో వైస్ చైర్మన్ ఆపద్ధర్మ చైర్మన్ అవుతారని, ఈలోపు ఏదైనా జరిగిపోతుందేమోనన్న భయంతో ఆపద్ధర్మ అవకాశాన్ని ఇవ్వకుండా వైస్ చైర్మన్ నళినీకాంత్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. దీనికి నళినీకాంత్ తటపటాయించినా ‘మళ్లీ నువ్వే వైస్ చైర్మన్’ అవుతావని పెద్దలు భరోసా ఇవ్వడంతో ఆపద్ధర్మ ఛాన్స్‌ను వదులుకుని రాజీనామాకు సై అన్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం దూతల ఆదేశాల మేరకు ఆదివారం చైర్మన్, వైస్ చైర్మన్లు ఇద్దరి చేత రాజీనామా చేయించి, ఆ లేఖలను కలెక్టర్‌కు అందజేయించారు. ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక...హుటాహుటిన పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు చైర్మన్, వైస్ చైర్మన్లు రాజీనామా లేఖలు ఇవ్వడమే తరువాయి కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రెండు పదవులు ఖాళీ అయ్యాయని, తాత్కాలిక చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరిగింది. ఇంకేముంది అధిష్టానం అడిన డ్రామాలో భాగంగా రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే పంచాయతీరాజ్ శాఖ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక చైర్మన్‌గా జ్యోతుల నవీన్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ముందస్తుగా ఖరారైన ముహూర్తం ప్రకారం ఈ నెల 15న తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అధికారిక చైర్మన్‌గా ఎన్నికవుతారు. మొత్తానికి అధిష్టానం ఆడిన నాటకంలో చైర్మన్ నామన రాంబాబు సమిధయ్యారు. పార్టీ జెండా మోసి, డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచిన వారిని కాదని వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన వారికి జెడ్పీ పీఠం కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
యాక్షన్ థ్రిల్లర్
నవీన్, జీవా, మధు, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డేర్’. ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్. సీనియర్ నటులతో పాటు కొత్తవారూ నటించారు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్ నరేన్, సమర్పణ: ఎన్. కరుణాకర్ రెడ్డి. -
లవ్..యాక్షన్..కామెడీ
కె.కృష్ణప్రసాద్ దర్శకత్వంలో ఎన్.ఆర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డేర్’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నరేన్ సంగీత దర్శకుడు. నవీన్ హీరో. జీవ, మధు, పల్లవి, సుహాసిని ఇతర ముఖ్య తారాగణం. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, కామెడీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నరేన్ మంచి సంగీతం అందించారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాఘవ, పాటలు: సదాచంద్ర. -
భావన పెళ్లికి ముహూర్తం కుదిరింది
తమిళసినిమా: నటి భావన పెళ్లి తేదీ ఖారరైంది. ఇటీవల తన కారు డ్రైవర్ సహా కొందరు ఆమెపై లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్ర వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. అయితే భావన డ్రైవర్ సహా మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి. కాగా ఆ తరువాత కొన్ని వారాలకే తన ప్రేమికుడు నవీన్‌తో నటి భావనకు వివాహ నిశ్చితార్థం జరిగింది. అప్పుడు పెళ్లి ఎప్పుడన్నది నిర్ణయం కాలేదు. తాజాగా భావన వివాహ ముహూర్తం తేదీ ఖారారైంది. అక్టోబర్ 27న నటి భావన, నవీన్‌ల పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని నటి భావన తల్లి పుష్ప వెల్లడించారు. దీని గురించి ఆమె తెలుపుతూ భావన పెళ్లి తమ సొంత ఊరు తిరుచ్చూరిలో జరగనుందన్నారు. అయితే పెద్దగా ఆర్భాటాలేమీ లేకుండా నిరాడంబరంగా పెళ్లి తంతు నిర్వహించనున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానించాలన్నది భావననే నిర్ణయించుకుంటుందన్నారు. ప్రస్తుతం తను స్విట్జర్లాండ్ వెళ్లిందని, అక్కడ నుంచి రాగానే ఎవరిని ఆహ్వానించాలన్నది నిర్ణయించుకుంటుందని చెప్పారు. -
బస్సు-బైక్ ఢీ: టెన్త్ విద్యార్థి మృతి
నల్లగొండ: జిల్లాలోని మునుగోడు మండల కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. కిష్టాపురానికి చెందిన నవీన్, వేణు అనే ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాసి బైక్‌పై తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్సు వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వేణు తీవ్రంగా గాయపడ్డాడు. కొనఊపిరితో ఉన్న వేణును ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం...
-
కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం...
మలయాళ నటి భావనను కారు డ్రైవర్లు వేధింపులకు గురి చేయడం, ఆమె పోలీసు లకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒక చేదు అనుభవం ఎదుర్కొన్న భావన ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. కన్నడ నిర్మాత నవీన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. గురువారం కేరళలోని కొచ్చిలో జరిగిన ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరు లో వివాహం జరుగుతుందట. 2012లో భావనతో నవీన్ ‘రోమియో’ అనే సినిమా తీశారు. అప్పుడే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. -
రంగు పొర
చూపుకు రంగుంటుంది. నలుపు.. తెలుపు.. ఎరుపు.. నీలం. చూపుకు రంగేంటి?! తెలుపంటే... పవిత్రం. నలుపంటే... మలినం. ఎరుపంటే... విప్లవం. నీలం అంటే... ఆకాశమంత. మగవాడి చూపులో కూడా ఇన్ని రంగులు ఉంటాయి! రంగులను బట్టి కూడా మగవాడి చూపు ఉంటుంది!! ఆ రంగుల్లో కొన్ని... ‘పొర’ల్లా పరుచుకుంటాయి. ఆ పొరలు విడిపోవాలి. నోరు మంచిదైతే... ఊరు మంచిదవుతుంది. కన్ను మంచిదైతే... కాపురం బాగుంటుంది. తొలిరాత్రి ముగిసింది.. ‘రజనీ! ప్లీజ్ ఆ చీర మార్చుకొని హాయిగా నైటీ వేసుకోవచ్చు కదా!’ అప్పటికి అయిదోసారి బతిమాలుతున్నాడు నవీన్. ‘అరే.. నేను చీరలో ఉండడం వల్ల నీకేంటి ఇబ్బంది? ఎందుకంత ఫీలవుతున్నావ్ నవీన్?’ భర్త ప్రవర్తన వింత అనిపించడంతో ఆశ్చర్యంగా అడిగింది రజని. ‘నాకేం ఇబ్బంది. ఆ తెల్ల చీరతో నువ్వే ఇబ్బంది పడ్తున్నావేమో.. నైట్‌వేర్‌లో అయితే ఫ్రీగా ఉంటావ్ కదా అని అంతే..’ అన్నాడు భుజాలెగరేస్తూ! తన మాట కాదని నొప్పించడమెందుకని ‘సరేలే.. మార్చుకుంటా’ అంటూ వాష్‌రూమ్‌కి వెళ్లి నైటీ వేసుకొని వచ్చింది రజని. రజని ఇలా గదిలోకి రాగానే నవీన్ అలా వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. నవ్వుకుంది ఆమె. అయిదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు పాలిపోయిన మొహంతో. తేడా గమనించింది. ‘స్టమక్ అప్సెట్ ఏమో’ అనుకొని ఊరుకుంది. తన చిన్నప్పటి కబుర్లేవో చెబుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. రజని చెప్పింది యాంత్రికంగా విన్నాడే కాని అతని మనసు మనసులో లేదు. నిద్రపోయిన భార్య మొహాన్ని తదేకంగా చూస్తున్నాడు. ‘ఎంత అమాయకంగా కనపడుతోంది.. నన్ను మోసం చేస్తోందా? తాను నిజంగానే మోసపోయాడా? అందుకే ఫస్ట్‌నైట్ అంత స్మూత్‌గా జరిగిపోయిందా? గాడ్.. అయితే బ్యాచ్లర్స్ పార్టీ రోజు తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నిజమేనా? నిజమే..’ నవీన్‌కి తలలో బాంబు పేలినట్టయింది. విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఎలా అడగాలి? ఏమని మొదలుపెట్టాలి? ఈ ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు.. రజని చాలా క్యాజువల్‌గా... హ్యాపీగా కనపడుతోంది. రొమాంటిక్ జోక్స్ వేస్తూ ఉడికిస్తోంది. ‘ఏమీ తెలీనట్టు ఎంతలా నటిస్తోంది? రెండోరాత్రికే ఈ కవ్వింపు జోక్స్ఏంటో.. ఆ ఎక్స్‌పీరియెన్స్ అంతకు ముందు లేకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయ్? జాణ.. ’ కసిగా అనుకున్నాడు నవీన్ మనసులో.అనుమానం అతణ్ణి మనిషిలా ఉండనివ్వట్లేదు. ఉచ్చనీచాలు మరిచేలా చేస్తోంది. చేసింది. ఆ రాత్రే ఆమెకు టార్చర్ మొదలుపెట్టింది అతని మైండ్‌లో తిష్ఠ వేసి. ‘ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా?’ అద్భుతంగా నటించాడు. ‘మా మేనత్త పెట్టిన చీర. రెండో రాత్రి కట్టుకోమని చెప్పింది’ సిగ్గుపడుతూ. ‘నేనొకటి అడగనా?’ అన్నాడు. ‘ఊ.. అడుగు’ గారంగా అన్నది. ‘కో ఎడ్యుకేషన్ కాలేజ్‌లో చదివావ్ కదా..’ ఆగాడు. ‘అవును..పీజీ కూడా కో-ఎడ్డే. క్లాస్మేట్స్ అందరం కలిసి గోవా టూర్ కూడా వెళ్లామని చెప్పాను కదా. ఫోటోలు కూడా చూశారు కదా. వండర్ఫుల్డేస్.. భలే ఎంజాయ్ చేసేవాళ్లం.’ ఒక్క క్షణం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లింది రజని. ‘అదే.... ఆ టైమ్‌లో ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉ...న్నా..’ రజని కళ్లల్లోకి చూస్తూ ఆగాడు. చాలా మామూలుగా.. హాయిగా నవ్వింది రజని. ‘మా క్లాస్‌లో ఉన్న అబ్బాయిలంతా నాకు బాయ్‌ఫ్రెండ్సే..’ నవ్వుతూనే అనేసి బాల్కనీలోకి వెళ్లిపోయింది. తనకు కావాల్సిన సమాధానం కాదు అది. కొంపదీసి తన మనసులో ఉన్నది అర్థమైందా ఏంటీ ఆమెకు. అర్థంకానీ.. అసలు విషయం బయటపడుతుంది అనుకున్నాడు. బాల్కనీలో ఉన్న రజని కళ్లల్లో సన్నటి నీటి పొర. ఆ సంఘర్షణ, అనుమానాలతో నాలుగు రోజులకే హానీమూన్ ట్రిప్ ముగించుకొని ముభావంగా ఇంటికి బయలుదేరింది ఆ జంట. మూడు నెలలు గడిచాయి... ఇంట్లో వాతావరణాన్ని, తమ మధ్య కమ్యూనికేషన్‌ను నార్మల్‌గా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తోంది రజని. కానీ కుదరనివ్వట్లేదు నవీన్. ఆమె ప్రతి కదలికను అనుమానంగానే చూస్తున్నాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడి టీ ఇవ్వబోతుంటే మొహం తిప్పుకొని వెళ్లిపోతాడు. లేదంటే ఆమె వ్యక్తిగతానికి సంబంధించి ఆరా తీస్తాడు. ఈ వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయే కానీ తగ్గడం లేదు. అవి ఎంతలా శ్రుతిమించాయంటే కాలేజ్ డేస్‌లో ఆమె ప్రవర్తన గురించి ఎంక్వయిరీ చేసేంతనగా. ఆమె ఫ్రెండ్స్‌కే ఫోన్ చేసి ఆమె క్యారెక్టర్ గురించి కూపీ లాగుతున్నాడు. అయినా సహిస్తోంది. పెళ్లికి ముందు తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరనీ... తనకెవరితో ఎలాంటి ఫిజికల్ రిలేషన్స్ లేవనీ ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. బతిమాలుతోంది. సంసారాన్ని నరకం చేయొద్దని ప్రాథేయపడింది. చివరకు అతని అనుమానం పోవడానికి ఏం చేయమన్నా చేస్తానంది. ‘అయితే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్దాం.. రా’ అన్నాడు స్థిరంగా. ఆ మాటకు షాక్ అయింది రజని. కోపం, అసహ్యం, బాధ, తన మీద తనకు జాలి.. కలిగాయి. గుండె పగిలేంత దుఃఖం పొంగుకొస్తున్నా తమాయించుకొని ‘వెళదాం పద’ అంది. అయితే... పరీక్ష చేయడానికి డాక్టర్ ససేమిరా అంది. పైగా నవీన్‌ను చెడామడా తిట్టింది. అమ్మాయికి పెళ్లికి ముందు సెక్సువల్ రిలేషన్ లేదు అనడానికి మొదటి రాత్రి రక్తస్రావం కావడం ఏ రకంగా ప్రామాణికం అని నిలదీసింది. చదువుకున్న వాడివి నీ సంస్కారం ఇదేనా? అంటూ గడ్డిపెట్టింది. హైమన్ (కన్నెపొర) ఎంత సున్నితంగా ఉంటుందో? ఏయే సందర్భాల్లో చిరిగిపోయే అవకాశాలుంటాయో వివరించింది. భార్యాభర్తల దాంపత్యానికి నమ్మకం పునాది.. అనుబంధానికి అండర్స్టాండింగ్ ఉండాలి అంటూ క్లాస్ తీసుకొని పంపించింది. ఇంటికొచ్చాక... గదిలోకి వెళ్లిపోయి.. సూట్‌కేస్‌తో బయటకు వచ్చింది రజని. హతాశుడయ్యాడు నవీన్. ‘ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావ్ రజనీ?’ ఈసారి నవీన్ షాక్ అయ్యాడు. ‘నీ అనుమానంతో నేనింకా అవమానపడదల్చుకోలేదు. నీకు తెలియని ఇంకో విషయం... స్కూల్ డేస్ నుంచి కూడా నేను సైక్లింగ్ చాంపియన్ని’అంటూ బయటకు నడిచింది రజని. నేపథ్యం రజని, నవీన్... ఇద్దరూ చదువుకున్న వాళ్లే. ఆమె ఎంబీఏ. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దలు కుదిర్చిన పెళ్లి. చక్కటి ఈడూజోడు.. అన్ని విధాలా తగిన సంబంధం అని రెండు కుటుంబాల వాళ్లూ అనుకొని ఘనంగా పెళ్లిచేశారు. పెళ్లికి ముందు బ్యాచ్లర్స్ పార్టీలో తన భార్య గురించి, తన అత్తగారింటి వైభోగం గురించి చెబుతూ నవీన్ మురిసిపోతుంటే అసూయపడ్డ అతని స్నేహితుడొకడు.. ‘ఒరేయ్.. అంత సోషల్మూవింగ్ ఉన్న అమ్మాయి పెళ్లికి ముందే అన్ని చేసుంటుంది జాగ్రత్తరోయ్’ అని కూశాడు. ‘ఎలా తెలుస్తుందిరా’ అని అడిగాడు అమాయకంగా. వాడు చెప్పాడు. అందుకే ఫస్ట్‌నైట్ అయ్యాక వాష్‌రూమ్‌లోకి వెళ్లి చీర చూశాడు నవీన్. రజని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు. జీవనసహచరిని దూరం చేసుకున్నాడు. అదో పెద్ద మూఢనమ్మకం! మన సమాజంలో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకం... మొదటి రాత్రి తెల్లచీర ధరించాలని, మరునాడు దాన్ని పరీక్షించాలని, మరక ఉంటే ఆమె వర్జిన్ అనీ, లేకుంటే కాదని! నేటికీ చాలామంది మగవాళ్ల మెదళ్లను తొలుస్తున్న పురుగు ఇది. ప్రతిదానికీ సైన్స్ రీజన్ చెప్తున్నా అర్థం కావట్లేదు.. చేసుకోవట్లేదు. నవీన్ ఇందుకు అతీతుడేం కాదు. నవీన్ చేసిన పని మెంటల్ క్రూయల్టీ. హిందూ వివాహచట్టం ప్రకారం భార్య శీలాన్ని శంకించడం, ఆమె శీలవతి కాదని ప్రచారం చేయడం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం వంటివన్నీ మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తాయి. అలాంటి వ్యక్తి నుంచి విడాకులు తీసుకోవచ్చు. ఐపీసీ 498ఏ కింద కేస్ కూడా నమోదు చేయవచ్చు.- ఇ.పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ - సరస్వతి రమ -
ఐటీఐ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
రాజంపేట టౌన్: విధులకు సక్రమంగా హాజరు కాని రాజంపేట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావుతో విధులకు సక్రమంగా హాజరు కాని ప్రసాద్, నవీన్‌లను సస్పెండ్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం ప్రభుత్వ ఐటీఐ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నెలకు ఐదు రోజులు కూడా ఐటీఐకి రాడని, అలాగే ప్రసాద్, నవీన్‌లు కూడా ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం 3 గంటలకు ఇంటికి వెళుతున్నారని ఆరోపించారు. ఇందువల్ల విద్యార్థుల సరైన బోధన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు ఆరోపించారు. అంతేకాక ఐటీఐ అంటే ప్రాక్టికల్స్‌లో ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని, అయితే ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పరికరాలు పూర్తిస్థాయిలో లేక పోవడంతో విద్యార్థులు ఐటీఐ ఉత్తీర్ణులైనా బయటికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలను పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి ఫలితం లేదన్నారు. వెంటనే పై సమస్యలను పరిష్కరించకుంటే డిసెంబర్ 4వ తేదీ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరసింహ, లక్ష్మీనారాయణ, టీ.ప్రసాంత్, విజయ్, గంగిరెడ్డి, గురు, బాలక్రిష్ణ, రెడ్డయ్య, భాను తదితరులు పాల్గొన్నారు. -
లైంగికంగా వేధించారంటూ నటి ఫిర్యాదు
బెంగళూరు : లైంగిక వేధింపులపై కన్నడ బుల్లితెర నటి మేఘన పోలీసుల్ని ఆశ్రయించింది. తన ఇంట్లోకి నలుగురు యువకులు చొరబడి దాడి చేసి లైంగికంగా వేధించారంటూ ఆమె శుక్రవారం రాజరాజేశ్వరినగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితం తన ఇంటికి దర్శన్, నవీన్, పృధ్వీ, వినూతన్ అనే నలుగురు యువకులు ప్రవేశించి లైంగికంగా వేధించి అనంతరం విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని మేఘన తన ఫిర్యాదులో తెలిపింది. కాగా కొద్దినెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన బుల్లితెర నటుడు హరీశ్ తో కొన్నేళ్లుగా మేఘన సహజీవనం చేసింది. అయితే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతుండగా హరీశ్ మృతి చెందాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరీశ్‌ను చూసేందుకు కూడా మేఘన రాకపోవడంతో అతడి సోదరుడు నవీన్ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల మేఘన ఇంటికి వచ్చిన నవీన్...తన అన్న కారు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కారుతో పాటు కొంత నగదును మేఘన నవీన్‌కు పంపించింది. ఈ నేపథ్యంలో తన ఇంటిపై దాడి చేసి వేధించారంటూ మేఘన చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సినిమా చూశాక ఆయన కంట్లో నీళ్లొచ్చాయి
‘‘సినిమా విడుదల ముందు వరకూ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ ఉండేది. సినిమా విడుదలయ్యాక చాలా బాగుందని, స్క్రీన్‌ప్లే ఇంకా బావుందని ప్రేక్షకులు అంటుంటే ఆనందం వేసింది’’ అని దర్శకుడు పీవీ గిరి చెప్పారు. నవీన్ విజయ్‌కృష్ణ, నిత్య, శ్రావ్య ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాధాకిషోర్. జి, బిక్షమయ్య సంగం నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ ఇటీవల విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈవీవీ సత్యనారాయణగారు, జనార్ధన మహర్షి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ‘బెండు అప్పారావ్’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రాలకు కథ అందించా. నిర్మాత రాధాకిషోర్ నా కజిన్. ‘నందిని నర్సింగ్ హోమ్’ కథ, ఆ కథను నేను న్యారేట్ చేసిన విధానం నిర్మాతలకు నచ్చడంతో నన్నే దర్శకత్వం చేయమన్నారు. కథ విన్న సీనియర్ నరేశ్‌గారు, వారబ్బాయి నవీన్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఈ చిత్రం మొదటి ఆట చూసిన తర్వాత నరేష్‌గారి కళ్లలో నీళ్లొచ్చాయి. ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలు అడుగుతున్నారు. నా తదుపరి చిత్రం కథ సిద్ధంగా ఉంది. త్వరలో ఆ వివరాలు చెబుతా’’ అన్నారు. -
బాల్యవ్యసనమే ‘బంగారు’ పతకానికి మూలం
ఆలమూరు : బడిలో చదువుకునేటప్పుడు ఆటవిడుపు వేళల్లో ఏమీ తోచక రాళ్లు ‘త్రో’ (విసిరిన) చేసిన అలవాటే అతడు జాతీయస్థాయిలో విజేతగా నిలవడానికి మూలమైంది. అతడే జావెలి¯ŒS త్రోలో స్వర్ణపతకం సాధించిన.. ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన నాగిరెడ్డి నవీ¯ŒS. గుజరాత్‌లోని వడోదరాలో జరిగిన పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి, పతకం సాధించి జిల్లాకు పేరుతెచ్చి పెట్టాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ స్థానిక శ్రీషిర్డీసాయి విద్యానికేత¯ŒSలో, ఇంటర్మీడియట్ రాజమహేంద్రవరం శ్రీచైతన్య కళాశాలలో చదివిన నవీ¯ŒS ప్రస్తుతం నరసాపురంలోని శ్రీస్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. నవీ¯ŒS క్రీడాప్రతిభను గుర్తించిన శ్రీషిర్డీసాయి యాజమాన్యం 2012లో రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాలలో నిర్వహించిన జోనల్ పోటీలకు పంపింది. సెంట్రల్ జో¯ŒS స్థాయిలో జావెలి¯ŒS త్రో విభాగంలో ప్రథమ స్థానం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాధనకు విరామమొచ్చినా సాధించాడు.. అయితే ఇంటర్మీడియట్లో క్రీడల్లో సాధనకు అవకాశం లేకపోయింది. మళ్లీ ఇంజనీరింగ్‌లో చేరాక సాధనను కొనసాగించాడు. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడానికి తోడు స్నేహితులు ప్రోత్సహించడంతో గత మూడేళ్ల నుంచి జావెలి¯ŒS త్రోలో నిర్విరామంగా కఠోరశ్రమతో సాధన చేశాడు. ఈ ఏడాది మేలో ధవళేశ్వరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో, సెప్టెంబర్‌లో నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్టూడెంట్ ఒలింపిక్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. జావెలి¯ŒS త్రోతో పాటు ఒలింపిక్ క్రీడల్లో కబడ్డీ పోటీల్లో మడికికి చెందిన విద్యార్థులతో కలిసి జిల్లాజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. జావెలి¯ŒS త్రోలో సత్తా వడోదరా పోటీల్లో నవీ¯ŒS జావెలి¯ŒS త్రోలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించి, ఈ ఏడాది డిసెంబర్లో మలేషియా లేదా శ్రీలంకలో నిర్వహించనున్న ఏసియ¯ŒS స్టూడెంట్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. కబడ్టీ పోటీల్లోనూ నవీ¯ŒS ఏపీ–ఏ తరఫున మెరుగైన ఆట తీరును ప్రదర్శించినా ఆ జట్టు నాకౌట్ దశలోనే ఏపీ–బీపై పోరాడి ఓటమి పొందింది. రాష్ట్రానికి గుర్తింపు తెస్తా.. ఏసియ¯ŒS గేమ్స్‌లో ప్రథమ స్థానం సంపాదించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు నవీ¯ŒS తెలిపాడు. 56 దేశాలు పాల్గొనే ఈ పోటీల్లో రాష్ట్రానికి తగిన గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానన్నాడు. తన తొలి ప్రాధాన్యం జావెలి¯ŒS త్రో, మలి ప్రాధాన్యం కబడ్డీ అని చెప్పాడు. -
లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరి మృతి
తాడేపల్లి(గుంటూరు): రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పాత టోల్గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విజయవాడ రామప్పాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్‌పై గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నారు. 45వ నంబర్ జాతీయ రహదారిపై పాత టోల్గేట్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద లభించిన లైసెన్స్ ఆధారంగా ఓ విద్యార్థి పేరు నవీన్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీటెక్ విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధిలో నివాసం ఉండే చలపతి, నాగమణి దంపతుల కుమారుడు నవీన్. ఇతడు చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ నెల 5వ తేది అతడి పుట్టిన రోజు. అయితే అతడు ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లాడు. అతడు ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందని అతడి తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేశారు. ఫలితం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం కాలేజీ సమీపంలోని నీటిగుంతలో శవమై పడి ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది... కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగానే స్నేహితులే తమ కుమారుడిని కొట్టి హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడు ఎలా నటించాలో తెలియదు!
‘‘యాభై సంవత్సరాల క్రితం ‘తేనె మనసులు’ చిత్రంలో నటించాను. నాతోపాటు చాలామంది కొత్తవాళ్లతో ఆదుర్తి సుబ్బారావుగారు ఆ చిత్రం తీసి, హిట్ చేశారు. ఆ చిత్రానికి నేను సెలక్ట్ అయినప్పుడు డ్యాన్స్, ఫైట్స్, ఎలా నటించాలో కూడా తెలియదు. నాలుగైదు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమా తీశారు. కానీ, ఈ తరం వారు రెండు మూడేళ్లు అన్ని రంగాల్లో శిక్షణ తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. నవీన్ కూడా శిక్షణ తీసుకున్నాడు. తనకు మీ ఆశీర్వాదం (అభిమానులు) ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నందిని నర్సింగ్ హోమ్’. శ్రావ్య, నిత్య హీరోయిన్లు. పీవీ గిరి దర్శకత్వంలో రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం నిర్మించారు. అచ్చు స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని హీరో మహేశ్‌బాబు విడుదల చేసి కృష్ణకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ- ‘‘నవీన్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ‘అతడు’, ‘పోకిరి’ చిత్రాలప్పుడు ఎక్కువగా కలిసేవాళ్లం. నా చిత్రాలకు ఫైట్స్ కూడా ఎడిటింగ్ చేశాడు. ‘ఏమవుదామనుకుంటున్నావ్’ అని ఓ సందర్భంలో అడిగితే ‘యాక్టర్ అవుతాను అన్నా!’ అన్నాడు. అప్పుడు తను జోక్ చేస్తున్నాడా? అనిపించింది నాకు. ఎందుకంటే నవీన్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. ఏడాది తర్వాత తనని కలిస్తే బాగా సన్నబడటంతో పాటు సిక్స్‌ప్యాక్ బాడీలో కనిపించాడు. అప్పుడే తన డెడికేషన్ ఏంటో అర్థమైంది. మనం హార్డ్‌వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని నమ్ముతాను’’ అన్నారు. ‘‘కథ నచ్చడంతో మొదటి సిట్టింగ్‌లోనే నవీన్ నటించేందుకు ఒప్పుకున్నారు. క్లయిమాక్స్‌లో నవీన్ నటనకు మహేశ్ గుర్తుకొచ్చారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు పీవీ గిరి పేర్కొన్నారు. ఈ వేడుకలో నటి విజయనిర్మల, సీనియర్ నటుడు నరేశ్, దర్శకులు బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు ఎమ్మెస్ రాజు, రాజ్ కందుకూరి, హీరోలు సుధీర్‌బాబు, సాయిధరమ్ తేజ్, సంగీత దర్శకుడు కోటి, హీరోయిన్లు శ్రావ్య, నిత్య పాల్గొన్నారు. -
కాలువలో ఇద్దరు యువకుల గల్లంతు
ముసునూరు మండలం లోపూడి గ్రామం వద్ద తమ్మిలేరు కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు లోపూడి గ్రామానికి చెందిన చాట్ల విజయ్‌కుమార్(18), వలసపల్లికి చెందిన గొల్లపల్లి నవీన్(15)గా గుర్తించారు. విద్యార్థుల మృతికి ఇసుక గుంటలే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గణేశ్ నిమజ్జనోత్సవంలో ఇద్దరి మృతి
నిజామాబాద్ క్రైం / మోర్తాడ్ : గణేశ్ నిమజ్జనోత్సవాల్లో జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. విద్యుత్ షాక్ కారణంగా నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన నవీన్(29), మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన మలావత్ శేఖర్(25) ప్రాణాలు విడిచారు. ఎల్లమ్మగుట్ట మెహర్‌బాబా కాలనీకి చెందిన మేకల నారాయణ, లక్ష్మిల కుమారుడు నవీన్ మెడికల్ రిప్రజెంటేటీవ్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం లారీలో తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో అక్కడి విధులు నిర్వహిస్తున్న నాల్గవ టౌన్ ఏఎస్సె ముందుకెళ్లాలని మండిపడ్డాడు. లారీ ముందుకు కదిలిన క్రమంలో విద్యుత్ వైర్ ఒకటి గణేశ్ విగ్రహానికి తగిలి తెగి పడింది. అక్కడే ఉన్న నవీన్ ఆ వైర్‌ను పక్కన పెట్టేందుకు చేతితో ముట్టాడు. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సహచరులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నాల్గవ టౌన్ ఎస్సై మధు, సీఐ నర్సింగ్‌యాదవ్, డీఎస్పీ ఆనంద్‌కుమార్ అక్కడకు చేరుకున్నారు. నవీన్ మృతికి కారణమైన ఏఎస్సైను సస్పెండ్ చేసేంతవరకు తాము ఇక్కడి నుంచి కదలబోమని స్థానికులు రోడ్డుపైనే బైఠాయించారు. ఏఎస్సై ఆగ్రహంతో ఊగిపోతూ కర్రతో చితకబాదాడని, ఆ తొందరలోనే విద్యుత్ వైర్లు తెగి నవీన్ మృతికి కారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు కిందకు ఉన్నాయని, వాటిని సరిచేయని విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని అన్నారు. ఉదయం 8 గంటల వరకు ఆందోళనను కొనసాగించారు. సుంకెట్ గ్రామంలో వినాయకుని విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసే సమయంలో గురువారం రాత్రి మలావత్ శేఖర్(25) విద్యుత్ తీగెలు తగిలి షాక్‌తో మృతి చెందాడు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని..
ఇల్లందు: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్టేషన్‌బస్తీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివామసముంటున్న పొన్నెకంటి నవీన్(24)కు ఏడాది క్రితం వివాహం అయింది. దంపతుల మధ్య వివాదాలు తలత్తెడంతో.. భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతున్న యవకుడి మృతి
బొమ్మలరామారం :రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందాడు. వివరాలు.. మండలంలోని మాచన్‌పల్లి గ్రామ సమీపంలోని నాయకుని తండా చౌరస్తా వద్ద ఆదివారం డీసీఎం బైక్ ఢీ కొన్న ఘటనలో పులిమామిడి నవీన్ చారి(22) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నవీన్ చారి సోమవారం రాత్రి మతిచెందాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి'
తిరుపతి: తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించిన ఓ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రిక అనే ఇంటర్ విద్యార్థినిని ఓ ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించసాగారు. యశ్వంత్, నవీన్ అనే ఇద్దరు యువకులు ప్రతిరోజూ ఆమెను ప్రేమిస్తున్నామంటూ వేధిస్తూ వెంటబడేవారు. ఈ క్రమంలో వారి మాట వినలేదని ఆమెను బైక్‌తో ఢీకొట్టించారు. దాంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పుడా ఆ విద్యార్థిని మంచానికే పరిమితమైంది. వాళ్లు చాలా అమానుషంగా వ్యవహరించారని బాధితురాలు చంద్రిక వాపోయింది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో చంద్రిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తిరుపతి పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. బాధితురాలు చంద్రిక డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ అంజూ యాదవ్‌లకు జరిగిన విషయాన్ని అంతా వివరించింది. చంద్రిక స్టేట్మెంట్ ను డీఎస్పీ రికార్డు చేశారు. తమకు న్యాయం చేయాలని చంద్రిక తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. యశ్వంత్, నవీన్ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిని వేధించిన నవీన్, యశ్వంత్‌లను పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ఆ నవల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు!
- రచయిత ‘అంపశయ్య’ నవీన్ తెలుగు సాహితీ చరిత్రలో ‘అంపశయ్య’ ఓ సంచలనం. 1969లో వచ్చిన ఈ నవలతో రచయిత నవీన్ ఇంటిపేరు ‘అంపశయ్య’గా మారిపోయింది. ఈ నవలకు తెర రూపమే ‘క్యాంపస్ అంపశయ్య’. ప్రభాకర్ జైని నటించి, దర్శకత్వం వహించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్‌కుమార్, పావని కీలక పాత్రల్లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించి, హిందీలోకి అనువ దించారు. సోమవారం ఈ చిత్రం హిందీ పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అంపశయ్య’ నవీన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చాలా మంది జీవితాలకు గమ్యంగా మారింది. ఈ నవల వచ్చి 47 ఏళ్లయినా దీని ప్రభావం ఇంకా తగ్గలేదు. మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ- ‘‘క్యాంపస్‌లో చదివే ప్రతి విద్యార్థి అంపశయ్య స్టేజ్ నుంచి దాటి వచ్చినవాడే. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. -
ప్రేమ వ్యవహారం...యువకుడి ఆత్మహత్య
ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ యువకుడు బలవ్మనరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొగుళ్ల నవీన్(18) పొరుగునే ఉన్న ముత్యంపేట గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సోమవారం నవీన్‌తోపాటు అతని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలపించి, కౌన్సెలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని, ఆత్మహత్య చే సుకున్నాడు. -
వడదెబ్బతో యువకుడు మృతి
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో ఓ యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. కంసాని నవీన్ (26) ఆదివారం పని ఉందని బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే మృతి చెందాడు. -
వర్మ ఏం చెప్పారంటే..
చిత్రం: ఎటాక్, తారాగణం: మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్, మంజుభార్గవి, రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, కెమేరా: అంజి, సంగీతం: రవిశంకర్, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు, కథ-స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ దర్శకుడెవరన్నదాన్ని బట్టి సిన్మా ఎలా ఉంటుందో ఒక ఊహ, అంచనా వస్తాయి. అందుకే, ‘ఎటాక్’ సిన్మాపై ఆసక్తి. కథగా - ‘ఎటాక్’ చాలా చిన్న పాయింట్! ఒక కుటుంబం లోని పెద్దపై జరిగిన ఎటాక్‌కు అతని కుమారుడు ప్రతీకారం తీర్చుకోవడం! వివరంగా చెప్పాలంటే... గురురాజ్ (ప్రకాశ్‌రాజ్) ఒకప్పుడు రౌడీలీడర్. కానీ, ఆ తరువాత అవన్నీ వదిలేసి, భవన నిర్మాణ రంగంలో గడుపుతుంటాడు. అతనికి భార్య (మంజుభార్గవి), ముగ్గురు కొడుకులు - కాళీ (జగపతి బాబు), గోపి (వడ్డే నవీన్), రాధాకృష్ణ (మంచు మనోజ్). ఒక స్థలం విషయంలో వచ్చిన తగాదా నేపథ్యంలో గుడి నుంచి వస్తున్న గురురాజ్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేయించారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతీకారానికి దిగిన అతని పెద్దకొడుకూ చనిపోతాడు. ఈ వ్యవహారంలో రౌడీ గ్యాంగ్ (అభిమన్యు సింగ్, పూనవ్ు కౌర్) చురుకుగా పాల్గొంటారు. స్థలం తగాదా ఉన్నవాళ్ళే ఈ హత్యలు చేశారా, మరొకరా అన్నది సస్పెన్స. దాన్ని హీరో ఎలా కనిపెట్టా డనేది పెద్దగా లేకున్నా, ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ. హాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’తో బాగా ప్రభా వితమైన వర్మకు ఇలాంటి గ్యాంగ్ వార్లు, పగలు, ప్రతీకారాలు ఇష్టమైన ముడి సరుకులు. వాటినెలా వండి వడ్డించాలన్నది ఆయనకు అనుభవైకవేద్యం. ‘గాయం’ రోజుల నుంచి ‘సర్కార్’ మీదుగా నిన్నటి మోహన్‌బాబు ‘రౌడీ’ దాకా ఆ ఫార్ములా వీలైనంత వాడారు. చాలాసార్లు సక్సెసూ సాధించారు. ఈసారి ఫ్లైకామ్ లాంటి ఆధునిక కెమేరా జ్ఞానం, ‘రక్తచరిత్ర’ నుంచి అందుకున్న చిత్రమైన నేపథ్య సంగీతం, పాటలతో తెరకెక్కించారు. మంచితనానికీ, చెడ్డతనానికీ మధ్య తేడా వివరిస్తూ, ‘దానవీరశూర కర్ణ’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి సిన్మాల సీన్లతో, పాటతో ‘ఎటాక్’ మొదలవుతుంది. ఆరంభంలోనే వచ్చే ప్రకాశ్‌రాజ్ హత్య ఘట్టం చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. ‘నాన్న గారు ఏం చెప్పారంటే...’ అంటూ పదే పదే ఫ్లాష్‌బ్యాక్ సీన్సకి వెళుతూ కథ సాగుతుంది. క్రమంగా 107 నిమిషాల నిడివిలో ‘నేరాలు- ఘోరాలు’ ఎపిసోడ్ చూసిన భావన కలుగు తుంది. ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, వడ్డే నవీన్ లాంటి సీజన్డ ఆర్టిస్టులున్నారు. వారిని మరింత ఉపయోగించుకొనే సీన్స ఇంకా ఉండాలనిపిస్తుంది. మనోజ్ చేసినపాత్ర సెకండాఫ్‌లో విజృంభిస్తుంది. వెరసి, ఇది వర్మ మార్క ‘ఎటాక్’. -
విద్యుదాఘాతంతో బిహార్ విద్యార్థి మృతి
శామీర్‌పేట: రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఓ విద్యార్థి మృతిచెందగా..మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలో ఉన్న గురుకుల వేద పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో ఉన్న ఓ సంపులో ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు స్నానానికి దిగారు. వీరిద్దరికి ప్రమాదవశాత్తూ కరెంటుషాక్ తగలడంతో నవీన్ (15) అనే విద్యార్థి మరణించగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. సంపునకు కరెంటు ఎలా సరఫరా అయిందనే విషయం తెలియరాలేదు. ప్రమాదానికి గురైన ఇద్దరు విద్యార్థులు బిహార్‌కు చెందినవారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన నవీన్ క్షేమం
-
పక్కింటి మహిళే కిడ్నాప్ సూత్రధారి?
-
హయత్‌నగర్‌లో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానికంగా ఉండే నరసింహా దంపతుల కొడుకు నవీన్ (7) కుంట్లూరులో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్న నవీన్ ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అపహరించుకుపోయారు. ఎక్కడ వెతికినా లాభం లేకపోవడంతో బుధవారం ఉదయం నవీన్ తల్లిదండ్రులు హయత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హయత్‌నగర్‌లో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్
-
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం(అనంతపురం): బుక్కరాయ సముద్రం మండల పరిదిలోని వడియంపేట గ్రామంలో ఓ వ్యక్తి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు వడియంపేట గ్రామంలో టీడిపి నాయకులు మాజీ ఎంపీటీసీ క్రాంతి కుమారుడు నవీన్(28) మగ్గం వేసుకుంటూ జీవనం గడుపుతుండేవాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. శనివారం సాయంత్రం గ్రామ శివారుల్లో వున్న రైలు పట్టాల మీద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిలో నవీన్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి వుంది. విషయం తెలుసుకున్న మండల ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి సంఘటణా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీ. జాగృతి సమితి ప్రతినిధి అరెస్టు
హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన కేసులో తెలంగాణ జాగృతి సమితికి చెందిన ప్రతినిధిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన నవీన్ గౌడ్ అనే వ్యక్తి మరో వ్యక్తి సహాయంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాల విషయం తేలకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు నవీన్ గౌడ్‌ను అరెస్టు చేశారు. నవీన్ కు సహాయ పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
పెద్ద శంకరంపేట (రంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్‌గౌడ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఈర పోచయ్య, జగదాంబలకు నలుగురు కుమారులు. రెండో కుమారుడైన నవీన్ (23) రెండు రోజుల క్రితం సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి పెద్దశంకరంపేట వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుకులాట ప్రారంభించారు. చివరికి మల్లన్నగుట్టపై శవమై కనిపించాడు. అతడి నోటి నుంచి రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. కాగా, అతడికి ఏడాది క్రితం పుల్కల్ మండలం పోసానిపల్లి గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. ప్రస్తుతం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
భార్యా పిల్లల్ని హతమార్చిన భర్త
-
భార్యా పిల్లల్ని హతమార్చాడు
బొబ్బిలి (విజయనగరం): కన్నతండ్రే తన భార్య, పిల్లలను కత్తితో పీక కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతనూ చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లిసీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గండి వెంకటరమణ (40) కు భార్య గంగ(36), కుమారులు నాగప్రవీణ్ (14), నవీన్ (12) లు ఉన్నారు. గత కొంత కాలంగా కుటుంబ కలహాలు జరుగుతుండటంతో వెంకటరమణ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలకు తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చాడు. వారు మత్తులోకి వెళ్లగానే కత్తితో ముగ్గురు పీకలు కోసి అనంతరం ఇంటి వద్ద ఉన్న చెట్టుకు అతడూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, పెద్ద కొడుకు నాగ ప్రవీణ్‌కు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మత్తు వదిలి మెలుకువ రావడంతో మాట్లాడలేని స్థితిలో వెళ్లి పక్కింటి వారిని నిద్రలేపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను గ్రామస్తులు వైజాగ్‌కు తరలించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామస్తులు సమీపంలోని పోలీసుకుల సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్‌హెచ్ - 9
‘‘హైదరాబాద్ చాలా మారిపోయింది ఈ పదేళ్లలో! ఎక్కడ చూసినా మాల్సు, ఎత్తయిన బిల్డింగులు, వీధి నిండా కార్లు!’’ నవ్వుతూ అన్నాను. ‘‘ఇదొక్కటే కాదు. హైదరాబాద్, విజయవాడ మధ్య రోడ్డు చూసి తీరాలి. నీకు గుర్తుందా? ఇరవయ్యేళ్ల క్రితం రాత్రి పదింటికి విజయవాడలో ఎక్కితే తెల్లారితే కాని హైదరాబాద్ వచ్చేవాళ్లం కాదు. అలాంటిది ఇప్పుడు నాలుగ్గంటల్లో వచ్చేస్తాం! తినబోతూ రుచెందుకు? నువ్వే చూద్దువు గాని!’’నవ్వుతూ అన్నాడు నవీన్. పజరో కారు ఔటర్ రింగురోడ్డు మీదకు ఎక్కింది. నవీన్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఔటర్ రింగురోడ్డు చాలా బావుంది. ఉదయాన్నే బయల్దేరడం వలన అంతగా ట్రాఫిక్ లేదు. నవీన్ నా కజిన్! ఇద్దరం రాజమండ్రి బయల్దేరాం. వాడికీ రాజమండ్రిలో పనుందంటూ వాడూ నాతో వస్తానన్నాడు. ముందు రాజమండ్రి విమానంలో వెళదామనుకున్నాను. నవీన్ ప్లానంతా మార్చేశాడు. నవీన్, నేను చిన్నప్పటినుండీ కలిసి పెరిగాం. వాడు చాలా కష్టపడి పైకొచ్చాడు. నాలుగు లైన్ల విశాలమైన రోడ్డు చూడగానే నాకు అమెరికా గుర్తొచ్చింది. అదే అన్నాను నవీన్‌తో! ‘‘చెప్పాగా! సూపర్బ్ రోడ్స్!’’ అంటూ పజరో స్పీడ్ పెంచాడు. మా సంభాషణ అంతా అమెరికా రోడ్ల గురించి, అక్కడి ట్రాఫిక్ గురించి సాగింది. నవీన్ ఆరేళ్ల క్రితం ఒకసారి అమెరికా వచ్చాడు. అక్కడి రోడ్లు, నిబంధనలూ వాడికి పరిచయమే! వెలుతురు వచ్చాక ఇద్దరం ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న సెవెన్ రెస్టారెంట్ దగ్గర ఆగాం కాఫీ తాగడానికి. ‘‘ఉన్నవాటిలో ఇది చాలా బెటర్! కాస్త నీటుగా ఉంటుంది!’’ అన్నాడు. ఎక్స్‌ప్రెస్ వే పక్కనే ఉండటం వల్ల ఉదయాన్నే చాలా కార్లున్నాయి అక్కడ. లోపలికి వెళ్లగానే చాలా పెద్ద లైనుంది. నేను క్యూలో నిల్చున్నాను. నవీన్ బాత్రూమ్కి వెళ్లి వచ్చాడు. ఈలోగా ఒకతను నన్ను దాటుకుంటూ క్యూలో ముందుకి వెళ్లడం చూసి నవీన్ అతన్ని నిలవరించాడు. ‘‘ఏయ్ మిస్టర్! వెనక్కి రండి. మేం ఇందాకణ్నుండి వెయిట్ చేస్తున్నాం. కనిపించడం లేదూ?’’ అని గట్టిగా అనడంతో అతను వెనక్కి మళ్లుతూ, ‘‘పాపకి... పాలు’’ అని నసుక్కుంటూ వెనక్కి వెళ్లి నించున్నాడు. ‘‘ఈ దేశంలో ఇంతే! అమెరికాలో అయితే, ఎక్కడ చూసినా క్యూలో నిల్చుంటారు. ఇక్కడలా కాదు. ప్రతివాడికీ వాడి పని ముందైపోవాలి’’ అని నవీన్ అనడంతో నవ్వేశాను. తన కంపెనీలో తనెంత స్ట్రిక్టుగా ఉంటాడు, తనన్నా, తన పద్ధతులన్నా అందరికీ హడలని చెప్పాడు. కాఫీ తాగి బయల్దేరాం. వెలుగొచ్చాక కార్ల సందడి పెరిగింది. ఒకదాన్ని మించిన వేగంతో మరో కారు దూసుకుపోతున్నాయి. మధ్యమధ్యలో ఊళ్లు తగిలినప్పుడు అస్తవ్యస్తమైన ట్రాఫిక్ చూసి నవీన్ విసుక్కున్నాడు. హఠాత్తుగా హైవే మీద ఒకతను రోడ్డు దాటుతూ కనిపించాడు. ఒక్కసారి గట్టిగా అరిచాను. నవీన్ ఒక్కసారి సడన్ బ్రేక్ వేసి, ‘‘యూ ఈడియట్! లం... కొడకా చస్తావురా!’’ అంటూ గట్టిగా అరిచాడు. అది ఆ వ్యక్తికి వినిపించకపోయుండవచ్చు! నాకైతే చచ్చేటంత భయం వేసింది. రోడ్డు దాటిన అతనూ భయపడినట్లున్నాడు. నవీన్ కారాపి అతన్ని చూసి నాలుగు చీవాట్లేశాడు. ఆ వ్యక్తికి యాభయ్యేళ్లు దాటుండచ్చు. చింపిరి జుట్టుతో నల్లగా రివటలా ఉన్నాడు. మాకేసి తప్పయిపోయిందన్నట్లు చూశాడు. అతనికేసి చూస్తూ తప్పన్నట్లు తలాడించాను. నా కళ్లలోకి చూసి తప్పయిందన్నట్లు చేతులు జోడించి గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ‘‘చూశావుగా! ఆ రాస్కెల్‌కి ప్రాణభయం లేదు. వీళ్లంతే! రోడ్డంటే సొంత బెడ్రూమ్లాగా ఫీలవుతూ నడుస్తారు. ఈడియట్స్! అసలు సివిక్ సెన్స్ ఉండదు. అమెరికాలో చూశాగా, ఎంత సివిలైజ్డ్ ట్రాఫిక్ ఉంటుందో?’’ అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు. ‘‘వాళ్లననుకొని ఏం లాభం? వాళ్లకి చదువు లేదు. గ్రామాల్లో తిరగడం అలవాటైనవాళ్లకి ఈ రోడ్లు ఇంకా అలవాటు పడినట్లుండలేదు. దీనికంతటికీ కారణం ఎడ్యుకేషన్! అదే చాలా సమస్యలకి కారణం. అయినా ఇంత పెద్ద పెద్ద రోడ్లు వేసినవాళ్లు, ఊళ్లొచ్చాక ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టచ్చు కదా! వీళ్లకైతే చదువు రాదు. రోడ్లు వేసేవాళ్లకి ఆ మాత్రం తెలియదా?’’ నవ్వుతూ అన్నాను. ‘‘అంత సీను లేదు. అయినా ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? వీళ్లకి చావంటే అస్సలు భయం లేదు. రూల్సూ అవీ పట్టించుకోరు. ఈ దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు’’ నవీన్ చికాకంతా అతని మాటల్లో కనిపిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ చూశాను. అదీ అంతే! ఇంతకంటే అధ్వానం. ఎవరికీ పక్కవాడి గురించి పట్టదు. ముఖ్యంగా రోడ్డుమీద. విజయవాడ చేరేలోగా దారిలో రెండు మూడు యాక్సిడెంట్లు చూశాం. ఒకచోటయితే కారు తిరగబడిపోయింది. ఒకరిద్దరి ప్రాణాలు కూడా పోయుంటాయి. కోదాడ దాటాక మధ్యలో ఎక్స్‌ప్రెస్ వేకి పక్కగా ఒకచోట పజరో ఆపాడు నవీన్, ఒంటేలు పోసుకోవడానికి. నన్నూ అడిగాడు. అవసరం లేదన్నట్లు తలూపాను. పదింటికల్లా విజయవాడ చేరాం. విజయవాడలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపమని అడిగాను. దారి పొడుగునా బిగపెట్టుకొని కూర్చున్నాను. హోటల్లోకి వెళ్లీవెళ్లగానే బాత్రూం వైపు పరిగెత్తాను. ‘‘ఇందాకణ్నుంచీ ఉగ్గ పెట్టుక్కూర్చున్నాను! హమ్మయ్య!’’ అంటూ కాఫీ కప్పు తీసుకుంటూ అన్నాను. ‘‘మధ్యలో ఆపేవాణ్ని కదా? చెప్పాల్సింది!’’ అన్నాడు నవీన్. పర్లేదన్నట్లు నవ్వేశాను. రాజమండ్రి చేరేసరికి పన్నెండయ్యింది. బంధువుల్ని కలిసి ఆ రాత్రికి అక్కడే బస చేశాం. మర్నాడు ఉదయం బయల్దేరి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం చేశాం. ఇంతకుముందులాగే మా సంభాషణలు కార్ల గురించి, విదేశాల్లో రోడ్ల గురించి సాగింది. నవీన్‌కి కార్ల పిచ్చి. కొంత దూరం వెళ్లాక, ఒకచోట పెద్ద యాక్సిడెంట్ అయ్యి, ట్రాఫిక్ ఆగిపోయింది. అవతల లైన్లో వాహనాలన్నీ స్తంభించిపోయాయి. యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికొచ్చాక నవీన్ పజరో స్లో చేశాడు. ఒక పిల్లాడు, మరో ఇద్దరు ఆడవాళ్లు కారు కిందపడి, నుజ్జు నుజ్జు అయిపోయారు. దూరంగా అతని బంధువులాగుంది, గుండెలు బాదుకుంటూ ఒకతను కనిపించాడు. అతన్ని చూడగానే స్థాణువయ్యాను. అతనెవరో కాదు, క్రితంసారి మా కారు కింద పడబోయి నవీన్ చేత తిట్లు తిన్న వ్యక్తి. నవీన్ అతన్ని గుర్తించినట్లు లేదు. నాకైతే అతని వాలకం బాగానే గుర్తుంది. ఇంతకుముందు మా కారు కింద పడబోయిన వ్యక్తి తాలూకు వాళ్లే అని నవీన్‌కి చెబుదామని అనుకుంటూ ఆగిపోయాను. పైకి అనలేదు. ‘‘చూశావుగా! ఇలాగే ఉంటుంది, ప్రతిరోజూ! కనీసం నాలుగైదు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. రోడ్డు క్రాస్ చేసేవాళ్లకి ప్రాణం అంటే లెక్కలేదు! ఈడియట్స్!’’ అంటూ గట్టిగా తిట్టాడు. ‘‘ఇలా రూల్సు అతిక్రమించేవాళ్లని జైల్లో పడేయాలి’’ నేను జవాబివ్వకపోయేసరికి మరలా తనే అన్నాడు. నాకెందుకో నవీన్‌తో వాదించే ఓపిక, మనసు లేకపోయింది యాక్సిడెంటు వాతావరణం చూశాక! కొంతసేపయ్యాక నేను వేరే టాపిక్ మార్చేశాను. ఈ యాక్సిడెంట్ల గురించి మాట్లాడటం ఇష్టం లేక. ఇంతలో నవీన్‌కి ఫోన్ కాల్ వచ్చింది. సంభాషణ బట్టి అతని కంపెనీవాళ్లు కాల్ చేశారని గ్రహించాను. నవీన్ ఆ కంపెనీలో ఒక విభాగానికి వైస్ ప్రెసిడెంట్! ‘‘అలాగా! ఆర్డరు రావడం కష్టమా? మన కోట్ ఎక్కువన్నాడా? ఓ పని చెయ్. వాడికి ఓ యాభై వేలు ముట్టజెప్పు. మరీ చేస్తే ఓ లక్ష పడెయ్యి. ఈ ఆర్డరు మనకి చాలా ఇంపార్టెంట్.’’ నవీన్ అవతలవాళ్లతో ఫోన్ పెట్టేశాక, నావైపు తిరిగి, ‘‘ఇక్కడ బిజినెస్ నడపడం మీ అమెరికాలో అంత ఈజీ కాదు. అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తారు’’ అన్నాడు. ‘‘ఏ దేశంలో కష్టాలు ఆ దేశానికుంటాయి. పైకి కనిపించేదంతా నిజం కాదు’’ అనేసి ఊరుకున్నాను. తన కంపెనీలో ఉండే కష్టాలు, వ్యక్తుల గురించి నవీన్ చెప్పడం ప్రారంభించాడు. రెండింటికల్లా హైదరాబాద్ దగ్గరికి వచ్చాం. ఆదివారం కావడం వలన ఔటర్ రింగురోడ్డులో అంతగా ట్రాఫిక్ లేదు. నాలుగు పెద్ద పెద్ద లైన్లలో రోడ్డు చాలా బాగుంది. ఒక్కసారిగా నవీన్ కారు స్పీడు పెంచాడు. స్పీడు నూట నలభై అయ్యింది. ‘‘ఎందుకంత స్పీడు?’’ తగ్గించమన్నట్లు చూస్తూ అన్నాను. ‘‘ఈ రోడ్లు చూస్తుంటే స్పీడుగా వెళ్లాలనిపిస్తుంది. ఈ హై స్పీడులో కారు డ్రైవింగ్ ఎంత బావుందో కదా? ఐ లైక్ ఇట్!’’ ‘‘ఈ రోడ్ల మీద పోలీసులు ఉండరా? అయినా స్పీడ్ లిమిట్ ఉండదా?’’ ‘‘స్పీడు లిమిటా? అయినా ఇక్కడ ఏ పోలీసు లేడు కదా? మీ అమెరికాలోలాగ మాకు టిక్కెట్లు ఇవ్వరు. ఒకవేళ ఉన్నా ఓ వెయ్యి పడేస్తే వాడే వదిలేస్తాడు’’ గట్టిగా నవ్వేశాడు నవీన్. నేనేం మాట్లాడలేదు. నాకొక్కసారి యాక్సిడెంట్ దగ్గర శవాలు, ఆ గడ్డం వ్యక్తి గుర్తుకొచ్చారు. మనసంతా అదోలా అయిపోయింది. నవీన్ కారు మితిమీరిన వేగంతోనే నడుపుతున్నాడు. ఔటర్ రింగురోడ్డు దాటాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంటికొచ్చాక నవీన్ భార్య ఏడుస్తూ మాకెదురొచ్చింది. ‘‘ఇవాళ మన రోజు బావుంది. వాడెవడో వెధవ పాప ట్యూషన్‌కెళ్లిన చోట రోడ్ క్రాస్ చేస్తూంటే స్పీడుగా కారు పోనిచ్చాడు. అక్కడే ఉన్న ఒక ముష్టాడు చూసి వెంటనే పాపని పక్కకి లాగడంతో బతికిపోయింది. లేదంటే...’’ అంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యింది. నవీన్ కూతురు కూడా భయపడినట్లుంది. తండ్రిని చూడగానే ఒక్కసారి కావలించుకుంది. నవీన్ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ‘‘అయినా మన డ్రైవర్ వెధవ ఎక్కడ చచ్చాడు?’’ కారు రోడ్డుకి అవతలవైపే ఆపాడని, వాణ్ని చూడగానే పాప అటుగా వెళ్లిందని (కథ తరువాయి భాగం) నవీన్ భార్య చెప్పింది. ‘‘ఈడియట్స్! ఏ ఒక్క వెధవకీ స్పీడ్ కంట్రోల్ లేదు. రోడ్డంటే వాడి బాబు సొత్తులా ఫీల్ అవుతారు. సిటీలో అంత స్పీడుగా నడపాలా? ట్రాఫిక్ పోలీసెవడూ లేడా? వెధవలు డ్యూటీ చేసి చావరు’’ అంటూ గట్టిగా తిట్టుకున్నాడు. ‘‘చూశావట్రా? ఇవాళ మా అదృష్టం బావుండి బతికిపోయాం. ఈ దేశం చచ్చినా బాగుపడదు.’’ పాప బిక్కుబిక్కుమంటూ నాకేసి చూసింది. తండ్రి కోపాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. నేను నా కోపాన్ని దిగమింగుకోలేకపోయాను. సాయంత్రం వరకూ చికాకు తగ్గలేదు. ఆ సాయంత్రం పాపని తీసుకొని పార్కుకి వెళ్ళాను. పార్కుకి ఓ పక్క చిన్న కొలను... ఒక బాతు పిల్లలతో కలిసి కొలను వైపు వెళ్ళడం చూసి వాటిని పట్టుకుందామని పాప ఒక్క ఉదుటన అటుగా పరిగెత్తింది. పాప పరుగుకి భయపడి బాతూ, పిల్లలూ వెనక్కి వెళ్ళిపోయాయి. చటుక్కున వెళ్ళి పాపని వారించి, కళ్ళెర్ర జేశాను. పాప వెనక్కి తగ్గింది. చేయి పట్టుకొని నాతో పాటే తీసుకెళ్ళాను. కొంత దూరం నడిచాక పాప వెనక్కి తిరిగి చూసి ఆగిపోయింది. నేను వెనక్కి తిరిగి ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆ కాలిబాటన - ముందు తల్లి బాతు! ఒకే వరుసలో వయ్యారంగా పిల్ల బాతులు!! -
మృత్యు గుమ్మి
గాదెగుమ్మిలో అసిస్టెంట్ సేల్స్‌మేనేజర్ గల్లంతు మొత్తం 39 మందిని మింగేసిన జలపాతం {పమాదాల నివారణకు ముందస్తు చర్యలు శూన్యం కొయ్యూరు: గాదెగుమ్మి మరొకరిని బలితీసుకుంది. సరదాగా ఇక్కడ గడిపేందుకు వచ్చేవారు ప్రమాదానికి గురై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ జలపాతం వద్ద గడిపేందుకు వచ్చిన యువకుడు గురువారం సాయంత్రం ఇందులో గల్లంతయ్యాడు. అతడు మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ప్రవాహం తక్కువగా ఉన్నా..లోతు ఎక్కువ కావడంతో అందులో పడి గల్లంతయ్యాడు. విశాఖపట్నానికి చెందిన నవీన్(28) నర్సీపట్నం జయభేరి కార్ల షోరూంలో అసిస్టెంట్ సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం నవీన్ ,అతని స్నేహితులు అనంత్, ఎమ్డీ జఫరుల్లా విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి ముగ్గురూ గాదేగుమ్మి జలపాతం వద్దకు వచ్చారు. ఇక్కడ గంటల తరబడి సరదాగా గడిపారు. ఫొటోలు తీసుకుంటుండగా కాలు జారి నవీన్ జలపాతంలో పడిపోయాడు. ఇలా జలపాతంలో పడి మరణించిన వారి సంఖ్య 39కి చేరింది. కార్తీక మాసంలో ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతం పిక్నిక్కు ప్రసిద్ధి. ఎక్కెడెక్కడి నుంచో ఇక్కడి అందాలను తిలకించేందుకు వచ్చి ప్రమాదానికి గురవుతున్నారు. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాము తెలిపారు. గాలించినప్పటికీ ఫలితం లేకపోవడం, చీకడిపడిపోవడంతో శుక్రవారం కొనసాగిస్తామన్నారు. ఇందులో మునిగినవారు అడుగుభాగంలో ఉన్న రాయికిందికి వెళ్లిపోతున్నారు. వినయ్‌చంద్ ఐటీడీఏ పీవోగా ఉన్నప్పుడు రూ.లక్షతో ఈ రాయిని పగులగొట్టే పనులు చేపట్టారు. పూర్తి చేయకపోవడంతో జలపాతంలో పడిన ఎవరైనా వెంటనే బయటకు రాలేక చనిపోతున్నారు. -
కట్న దాహానికి నవవధువు బలి
హత్య చేసి, ఆపై నిప్పంటించిన భర్త? రాజేంద్రనగర్: కట్నం దాహానికి నవవధువు బలైపోయింది. భర్తే ఆమెను హత్య చేసి, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు విషయం తెలుస్తుందంటున్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... మొయినాబాద్‌కు చెందిన వనజ (21)కు ఖానాపూర్‌కు చెందిన నవీన్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ. 50 వేల నగదు, 10 తులాల బంగారం, 20 తులాల వెండి, బైక్, ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చారు. కాగా, పెళ్లైనప్పటి నుంచి లక్ష రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలని వనజను నవీన్ వేధిస్తున్నాడు. జులాయిగా తిరిగే అతను కొన్ని రోజులుగా తాగివచ్చి చితక బాదుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నవీన్ ఇంటి నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు తలుపుతీసి చూడగా వనజ మంటల్లో కాలిపోతూ కనిపించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వనజ మృతి చెందింది. ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, మధ్యాహ్నాం బయట నుంచి తలుపు గొళ్లెంపెట్టి నవీన్ బయటకు వెళ్లాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడే ముందుగా భార్యను హత్య చేసి, తర్వాత మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.