
తల్లిదండ్రులతో నవీన్(సర్కిల్లోని వ్యక్తి)
ఓ డ్యాం వద్ద సరదాగా ఈత కొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రానికి చెందిన గుజ్జ నవీన్(22) అనే ఎంబీబీఎస్ విద్యార్థి రష్యాలో మృతి చెందాడు. భువనగిరి పట్టణంలోని ఆర్‌బీనగర్‌కు చెందిన గుజ్జు హేమలత, యాదగిరి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు గుజ్జ నవీన్. నవీన్ రష్యాలోని ఓరన్‌బాగ్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. పుట్టిన రోజు జరుపుకుందామని స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు.
అందులో భాగంగా ఓ డ్యాం వద్ద సరదాగా ఈత కొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు, ఫోన్ ద్వారా నవీన్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ విషయం విని నవీన్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.