Naveen Mullangi Made A Pan World Movie Communist Girlfriend Capitalist Boyfriend, Deets Inside - Sakshi
Sakshi News home page

పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు.. పాన్‌ వరల్డ్‌ మూవీతో సంచలనానికి రెడీ!

Published Wed, Nov 23 2022 2:37 PM | Last Updated on Wed, Nov 23 2022 7:18 PM

Naveen Mullangi Made a pan world movie Communist Girlfriend Capitalist Boyfriend - Sakshi

మన తెలుగు సినిమాలు వంద కోట్లు సంపాదిస్తేనే ఎగిరి గంతేస్తున్నాం. కానీ.. ఇంగ్లీష్ సినిమాలు వేల, లక్షల కోట్లు గడిస్తుండడం నుంచి మనం స్ఫూర్తి పొందలేకపోతున్నాం" అంటున్నాడు తెలంగాణ చిచ్చరపిడుగు నవీన్ ముళ్లంగి. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఈ పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు... తనే "హీరో కమ్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్"గా ఇంగ్లీషులో ఓ ఫీచర్ ఫిల్మ్ చేసి ట్రెండ్ సెట్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. 

 పరస్పర విరుద్ధమైన భావజాలం కలిగిన ఓ అబ్బాయి - అమ్మాయి నడుమ నడిచే యునీక్ లవ్ స్టోరీగా "కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ - క్యాపిటలిస్ట్ బాయ్ ఫ్రెండ్" పేరుతో నవీన్ ముళ్ళంగి తీసిన ఈ చిత్రం షూటింగ్ తోపాటు... పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేసుకుంది. గంటన్నర నిడివి గల ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఓ సినిమా రూపకల్పనకు అవసరమైన పలు సాంకేతిక అంశాల్లోనూ సుశిక్షితుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్న నవీన్... ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఇంగ్లీషులో సినిమాలు తీసి... తన సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో  నవీన్ సరసన శివ ప్రీతిక సుక్క హీరోయిన్‌గా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement