senior citizens
-
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడిన వారి కోసం తమ యాప్ ద్వారా తక్కువ ప్రీమియంలతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జెన్ఎస్ లైఫ్ ఫౌండర్ మీనాక్షీ మీనన్ తెలిపారు. సిల్వర్ ప్లాన్ కింద కేవలం రూ. 990కే రూ. 2.5 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ, ప్రమాదం బారిన పడి ఆస్పత్రిలో చేరితే రూ. 50 వేల నగదు లభిస్తుందని పేర్కొన్నారు.ప్రత్యేక రేట్లపై రూ. 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్లు, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీలను పొందవచ్చని తెలిపారు. ఇక గోల్డ్ ప్లాన్‌లో రూ. 4,900 వార్షిక ప్రీమియంకు రూ. 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, ఆస్పత్రిలో చేరితే రూ. 1 లక్ష నగదు, రూ. 5 లక్షల వరకు సైబర్ ఇన్సూరెన్స్ లభిస్తుందని మీనాక్షి వివరించారు. -
10 శాతం మించడానికి వీల్లేదు
ముంబై: ఆరోగ్య బీమా రంగ కంపెనీలు ఇకపై సీనియర్ సిటిజన్ల వార్షిక ప్రీమియంలో పెంపుదలను 10 శాతంలోపునకే పరిమితం చేయవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. తక్కువ ఆదాయ వనరులతో జీవించే సీనియర్ సిటిజన్లకు దీంతో ఉపశమనం లభించనుంది. వయసురీత్యా పలు కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వయసురీత్యా ఆరోగ్య పరిరక్షణ మరింత అవసరమయ్యే వీరికి పెరుగుతున్న బీమా ప్రీమియంలు ఆర్థికంగా భారమవుతున్న సంగతి తెలిసిందే. -
ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా
ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.ఆయుష్మాన్ భారత్ పథకంఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందించడం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం వల్ల వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.సీనియర్ సిటిజన్లపై ప్రభావం..ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను వర్తింపజేయాలన్న నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలా మంది వృద్ధులు వైద్య సేవలను పొందడంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు. వారికి సకాలంలో, తగిన వైద్య సంరక్షణ లభించేలా చేస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే తొలిసారిఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధతదేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందని ముర్ము నొక్కి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం, అవసరమైన మందుల లభ్యతను పెంచడం, నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముర్ము అన్నారు. -
Numaish 2025: రెక్కలు తొడిగిన ఆశలు
వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు.. చంటి పిల్లలకు ఎలా అయితే అన్నీ చూడాలని ఆశ ఉంటుందో వయస్సు పెద్దపడిన వారికి కూడా ప్రతిదానిపై ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నగరానికి చెందిన దోబారా అనే ఎన్జీవో.. వారి కోసం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని అపోలో హోంకేర్, గ్లెన్‌ఫీల్డ్ మల్లారెడ్డి తదితర ప్రైవేటు ఆస్పత్రులు, స్కూల్స్‌ను భాగం చేస్తూ నిరుపేద వృద్ధుల కోసం ప్రత్యేక నుమాయిష్ సందర్శనను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సై అన్నారు. అయితే రోజువారీ వేళల్లో అయితే పెద్ద వయసు వారికి రద్దీలో, జనం మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా 2గంటల నుంచీ సాయంత్రం రద్దీ మొదలయ్యే లోగా దీనిని పూర్తి అయేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అనాధాశ్రమాల నుంచి.. నగరవ్యాప్తంగా 89 మంది వీల్‌చైర్స్ ఉప్పల్, చిక్కడపల్లి.. ఇలా నగరంలోని 12 ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటీజన్ అసోసియేషన్లకు చెందిన సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. పెద్దలు అందరినీ కార్లలో గౌరవంగా తోడ్కొని వచ్చారు. అక్కడ నుంచి నడవలేని వారి కోసం దాదాపుగా 80కిపైగా వీల్ఛైర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా నర్సింగ్ స్కూల్స్‌కు సంబంధించిన విద్యార్థులను కూడా ఉంచారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ రైడ్స్‌ను నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల కోసం ఉచిత పార్కింగ్‌ను కూడా కలి్పంచారు. ఫుడ్ ప్యాక్స్.. పిస్తా హౌజ్, షాజ్ మహమ్మూద్ అనే వాలంటీర్ల సహకారంతో ఫుడ్ ప్యాక్స్ అందించారు. అలాగే కొందరు దాతలు ఇచి్చన సహకారంతో వృద్ధులకు ఉపయోగపడే టవల్స్ వంటివి కొనుగోలు చేసి అందించారు.పెద్దలకు ప్రత్యేకంగా.. ఏడాదికో సారి నుమాయిష్ లాంటి ప్రదర్శనను తిలకించాలని అందరూ అనుకున్నట్టే సీనియర్ సిటిజన్స్ కూడా ఆశిస్తారు. అయితే ఆశించినట్టుగా చాలా మందికి జరగకపోవచ్చు. కొందరికైనా దీన్ని సాకారం చేద్దామనే ఆలోచనతో ఈ ‘సీనియర్ సిటిజన్స్ ఎట్ నుమాయిషి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక సీనియర్ సిటిజన్‌గా పెద్దలకు సంబంధించిన జెరంటాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ చేసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ల మనసుకు ఎంత సంతోషాన్ని అందిస్తాయనేది నాకు తెలుసు. – మతీన్ అన్సారీ, వ్యవస్థాపకులు, దోబారా స్వచ్ఛంద సంస్థ -
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్‌ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
ఉచితంగా రూ.5 లక్షల బీమా.. 70 ఏళ్లు దాటినవారికి వరం!
కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వారికి పేద, ధనిక అనే తేడాలేకుండా వైద్యం కోసం ప్రత్యేక బీమా కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజెఎవై) కింద అక్టోబర్ 30 నుంచి ఆరోగ్య బీమా అవకాశం కల్పిస్తోంది.అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద కొత్త, విభిన్నమైన కార్డ్ జారీచేస్తారు. ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా... ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కేంద్రం తెలిపింది.దరఖాస్తు చేసే విధానం...ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంజేఏవై పోర్టల్ పీఎంజేఏవైజీవోవీ.ఇన్ లాగిన్ అయి 70 ప్లస్ ట్యాబ్ఫై క్లిక్ చేయాలి. దాంతో www.beneficiary.nha.gov.in అనే వెబ్ సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత ఆధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇవీ ఉపయోగాలు..● అర్హులైన సీనియర్ సిటిజన్లందరికీ ఈ పథకం కింద ఏబీ–పీఎంజేఎవై రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానెల్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 1,835 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్సలు పొందవచ్చు.● లబ్ధిదారులు నమోదు చేసుకున్న మొదటి రోజు నుంచి చికిత్సను యాక్సెస్ చేయడం ప్రారంభించవచ్చు. ఏదైనా వ్యాధి లేదా చికిత్స కోసం వేచి ఉండే కాలం ఉండదు, కాబట్టి కవరేజ్ వెంటనే ప్రారంభమవుతుంది. -
70 ఏళ్లు నిండినవారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా
-
70 ఏళ్లు దాటిన వారికి పీఎంజేఏవైతో మేలు
సాక్షి, న్యూఢిల్లీ: వయోవృద్ధుల ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం 70 ఏళ్లు దాటిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం (పీఎంజేఏవై) పరిధిలో తెలంగాణలోని దాదాపు 30 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో సుమారు 1.15 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు. అంతేగాక ఈ ఏడాది జూలై వరకున్న లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో జరిగిన 17.2 లక్షల చికిత్సలకు రూ.3,626 కోట్ల విలువైన వైద్యసేవలను లబ్ధిదారులు పొందారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో వివరించారు. పీఎంజేఏవై పథకాన్ని అప్‌గ్రేడ్ చేసి 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ రూ.5 లక్షల వరకు వైద్య బీమా అందించేందుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం.. దేశ సమగ్రాభివృద్ధిలో వయోవృద్ధుల సంక్షేమానికి సరైన ప్రాధాన్యం కలి్పంచే దిశగా తీసుకున్న చర్య అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో అదనంగా 10 లక్షల మంది 70 ఏళ్లు దాటిన వృద్ధు లు లబ్ధి పొందనున్నారని ఆయన తెలిపారు. అయితే.. ఇన్నా ళ్లుగా పీఎంజేఏవై పథకం దారి్రద్యరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే వర్తిస్తోందని, ఈ నేపథ్యంలో పథకానికి పలు మార్పులు చేసి.. పేద, ధనిక అనే తేడాల్లేకుండా 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ వర్తింపజేయాలని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు ప్రత్యేక గుర్తింపు కార్డు పీఎంజేఏవైకి అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డును అందిస్తారని, ఇందుకోసం వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేయనుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసినందుకు ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.సెప్టెంబర్ 16న వందేభారత్ షురూప్రారంభించనున్న ప్రధాని.. తెలుగు రాష్ట్రాలకు 2 రైళ్లు కేటాయించడంపై మోదీకి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినాయక నవరాత్రుల కానుక అందించనున్నారు. నాగ్‌పూర్ –సికింద్రాబాద్, విశాఖపట్నం–దుర్గ్‌ల మధ్య రెండు వందేభారత్ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే నాలుగు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది. విశాఖపట్నం– దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య కూడా మరో వందేభారత్ రైలు సేవలందించనుండగా, ఈ రెండు రైళ్లను ఈ నెల 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10 కొత్త వందేభారత్ రైళ్లను వచ్చే సోమవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే రైలు సికింద్రాబాద్ చేరుకునే సందర్భంలో స్వాగతం పలకాలంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆహా్వన పత్రం పంపించారు. వందేభారత్ రైళ్లు కేటాయించిన ప్రధానికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
కళ్లు చల్లబడ్డాయా బాబూ!
సాక్షి, అమరావతి: పింఛన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు బ్యాంకుల వెంట, ఏటీఎంల వెంట, సచివాలయాల వెంట తిరుగుతున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా చంద్రబాబు నాయుడూ? ఇప్పుడు నీ మనసు శాంతించిందా? ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లు... ఈ ఒకటి రెండు నెలల్లోనే ఓటర్లను ప్రభావితం చేసేస్తారా?ఒకవేళ ప్రభావితం చేయగలిగి ఉంటే ఇప్పటికే చేసి ఉండేవారు కదా!!. ఐదేళ్లలో లేనిది... కొత్తగా ఈ రెండు నెలల్లో మారింది.. ఏంటి చంద్రబాబు నాయుడూ నీ కుట్ర బుద్ధి తప్ప? మీరే గనక పనిగట్టుకుని కోర్టుల్లో పిటిషన్లు వేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి వలంటీర్లను ఈ కార్యక్రమానికి దూరం చేయకుండా ఉంటే అవ్వాతాతలకు ఈ కష్టాలుండేవా? వాళ్లు ఈ రెండు నెలలు కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చి ఉంటే పండుటాకులు ఇంత వేదన పడేవారా? ఇదెక్కడి రాజకీయం బాబూ? బ్యాంకుల్లో వెయ్యమన్నదీ మీరేగా? ప్రతి పథకాన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం పింఛన్లను మాత్రం ఎందుకు వేయటం లేదు? వలంటీర్లు నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి... ఆయన వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, దత్త పుత్రుడు పవన్.. వీళ్లు చెప్పినట్టల్లా ఆడే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీళ్లంతా అడిగిన ప్రశ్న ఇదే. అక్కడితో ఆగలేదు వీళ్లెవరూ. కోర్టులకెక్కారు. వలంటీర్లు పింఛన్లు ఇవ్వటానికి ఈ మూడు నెలలూ వీల్లేదన్నారు. నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే నగదు వెయ్యాలని ఎన్నికల కమిషన్‌కు నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ బహిరంగ సభల్లో కూడా ఇదే చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో వేసేలా ఈసీపై ఒత్తిడి తెచ్చారు. నిజానికి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఏమవుతుందో ప్రభుత్వానికి తెలియదా? ప్రతి పథకాన్నీ పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబి్ధదారులకే చేరుస్తున్న వైఎస్ జగన్‌కు ఇదంతా తెలియదా? కానీ పింఛన్లు తీసుకుంటున్న వాళ్లంతా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వాళ్లు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే తీసుకోవటం వాళ్లకంత సులువేమీ కాదు. బ్యాంకులు ఎక్కడో ఊళ్లకు దూరంగా ఉంటాయి. అన్ని గ్రామాల్లోనూ ఏటీఎంలు అందుబాటులో లేవు. పైపెచ్చు ఖాతాల్లోని డబ్బులు ఎలా తియ్యాలో కూడా కొందరికి తెలియదు. కొందరికి ఖాతాలే లేవు. ఇంకొందరిదైతే ఇల్లు కదల్లేని పరిస్థితి. అందుకే బ్యాంకుల్లో వేయకుండా... ఆ నగదును బ్యాంకుల్లో డ్రా చేసి నేరుగా వలంటీర్లు ఇళ్లకు పట్టుకెళ్లి వాళ్లకు ఇస్తున్నారు. ఒకరకంగా ఖాతాల్లో వేయటానికన్నా అడ్వాన్స్డ్ ప్రక్రియ ఇది. అలాంటి ప్రక్రియను నిలిపేయించడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబూ? ఖాతాల్లో వెయ్యమని చెప్పేటప్పుడు వీళ్లు ఇన్ని కష్టాలు పడతారన్న సంగతి నీకు తెలియనిది కాదు కదా? మండుటెండల్లో విలవిల్లాడుతున్న వృద్ధుల శాపాలిపుడు ఊరికే పోవు కదా? బాబు రక్షణకు ఎల్లో మీడియా... ఎండలకు విలవిల్లాడుతూ వృద్ధులు పెడుతున్న శాపనార్థాలకు తానెక్కడ కొట్టుకుపోతాడోనన్న భయం చంద్రబాబునిపుడు నిలువెల్లా వణికిస్తోంది. దీంతో పింఛన్లు ఇవ్వటానికి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని, వాళ్ల ద్వారా ఇంటింటికీ పంచాలని కథలు చెబుతున్నారు. నిజానికి సచివాలయ సిబ్బందిని కూడా మొదట్లో అడ్డుకున్నది చంద్రబాబే. పైపెచ్చు ప్రతి ఇంటినీ అడ్రస్ పట్టుకుని వెతకటం, ఆ చిరునామాలో ఉన్నవారికి ఇవ్వటం ఎవరో కొత్తవారిని చెయ్యమంటే సాధ్యం కాదు. అయితే ఈసీ ఆదేశాల మేరకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లే పింఛన్లు ఇస్తున్నారు. దారుణమేంటంటే ఇలా పింఛన్లిచ్చేటపుడు కొందరు చిరునామాలు దొరక్క వలంటీర్ల సాయం తీసుకుంటున్నారు. కానీ వారు వలంటీర్ల సాయం తీసుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ‘ఈనాడు’ దాని తోక మీడియా దౌర్భాగ్యపు రాతలు రాసి ఆయా సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేదాకా వెంటాడుతున్నాయి.చంద్రబాబు మాత్రం సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఇస్తే బాగుంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైపెచ్చు చేసిందంతా చేసి... ఇలా వృద్ధులు మండుటెండల్లో బయటకు రావటానికి ముఖ్యమంత్రి జగనే కారణమని ‘ఉల్టా చోర్...’ తరహాలో నిందిస్తున్నారు. ఈ మాటలు ఎవరూ నమ్మటం లేదని తెలిసి... ఎల్లో మీడియానూ రంగంలోకి దింపారు. ‘ఈ పాపం జగన్‌దే’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనం ఉద్దేశం చంద్రబాబును రక్షించటమే. మొదటి నుంచీ వలంటీర్లంటే కక్షే... కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఏపీ వలంటీర్ల సైన్యాన్ని ప్రశంసించని వారు లేరు. కానీ చంద్రబాబు ముఠాకు మొదటి నుంచీ ఈ వ్యవస్థంటే ఇష్టం లేదు. వలంటీర్ల సేవల కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరొస్తుండటమే దీనికి కారణం. ఈ వ్యవస్థను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వలంటీర్లంతా మగవాళ్లు లేనపుడు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వీళ్లది మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు నాయుడు నానా మాటలూ అన్నారు. ఇక ఈయన గారి దత్తపుత్రుడైతే మూడడుగులు ముందుకేసి.. వలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని, ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ తమ వాళ్లచేత కేసులూ వేయించారు. కానీ వీళ్ల పథకాలేవీ పారకపోవటంతో... తాము వలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ, తాము గెలిస్తే వారి పారితోషికాన్ని పెంచుతామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. చేసిన పనికి కూలీ ఇవ్వనివాడు ఫ్రీగా బిరియానీ పెట్టిస్తానంటే నమ్మేదెవరు బాబూ? బాబు యావ తెలియనిదెవరికి? బాబుకు పని చేయటం చేతకాదు. కానీ చేయని పనిని కూడా అందంగా చెప్పుకోవటంలో మాత్రం పెద్ద బిడ్డే. అమరావతిలో ఒకటిరెండు భవనాలు కూడా కట్టకుండానే అదో పెద్ద సింగపూర్‌లా అయిపోయినట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్న ఘనత బాబుది. నిజానికి అమరావతిని గురించి తెలిసిన వారు... బయటి వారెవరైనా ఆ ప్రాంతమెలా ఉందని అడిగితే, పేరు తప్ప అక్కడేమీ లేదని చెప్పటానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇక 2015లో గోదావరి నదిని ఈయనే కనిపెట్టినట్టు పుష్కరాల సందర్భంగా భారీ ప్రచార వీడియోను షూట్ చేయబోయి ఏకంగా 29 మంది అమాయక భక్తుల్ని బలితీసుకున్నాడు. ఏడాదిన్నర కిందట కూడా... ఎక్కువ మంది జనం వచ్చినట్లుగా చూపించుకోవాలన్న తాపత్రయంలో ఇరుకు సందులో సభ నిర్వహించి, జనాన్ని రప్పించడం కోసం తాయిలాలు కూడా ఇవ్వటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెబుతూ పోతే బాబు ప్రచారపిచ్చికి ఎంతైనా చాలదు. అప్పుడు ప్రభావితం చేస్తారా..!! వలంటీర్లను రాజకీయాలకు సంబంధం లేకుండా, అందరి వద్ద నుంచి నిర్ణీత సమయంలో దరఖాస్తులు స్వీకరించి, అధికారులు ఇంటర్వ్యూలు చేసి వారిని ఎంపిక చేశారు. అలాంటి వలంటీర్లు ఇప్పుడు పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటింటికి వెళితే, వాళ్లు అధికార పార్టీకి అనుకూలంగా లబ్దిదారులను ప్రభావితం చేస్తారనేది చంద్రబాబు అండ్ కో విపరీత బుద్ధి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే అంశంపై ఫిర్యాదు చేసి వలంటీర్లను అడ్డుకున్నారు. ‘అయినా నిత్యం ఆ 50 ఇళ్ల మధ్య ఉండే వలంటీర్లు... పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటికి వెళ్లిన పది నిమిషాలు లేదా పావుగంట సమయంలోనే రాజకీయంగా ప్రభావితం చేస్తారా? వాళ్లు గనక చెయ్యాలనుకుంటే మిగిలిన రోజులన్నీ వాళ్ల పక్కనే ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉండదా?’ అనేది పింఛనుదార్ల మాట. బాబూ... అచ్చెన్నాయుడు చేత ఫిర్యాదు చేయించలేదా? వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని చంద్రబాబు తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఈ ఏడాది మార్చి 1న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదులో.. ‘ప్రభుత్వం పింఛన్ల పంపిణీ, రేషన్ల పంపిణీలో వలంటీర్లను ఉపయోగిస్తోంది. వలంటీర్లు తమ గ్రామాల్లో, వార్డులో రాజకీయ కార్యకలాపాల్లో నిమ్నగమయ్యే అవకాశం ఉంది. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచే గౌరవ వేతనాలు చెల్లిసున్నందున సెక్షన్ 32 ఆర్పీ చట్ట ప్రకారం ప్రభుత్వ సేవకులకు వర్తించేలా శాఖపరమైన క్రమశిక్షణ, నిబంధనలను వీళ్లకూ వర్తింపజేయాలి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు వలంటీర్లపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ ఈసీని కలిసి ‘‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు పింఛను డబ్బులు వాళ్ల ఖాతాల్లోనే జమ చేయాలి’’ అని సూచించారు. ఈ విషయాన్ని ఈటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. దీంతో ఈసీ ‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. 97.91% మందికి పంపిణీ రాష్ట్రంలో 97.91 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. 65,49,864 మందికి ఈ నెల పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి 64,13,200 మందికి పెన్షన్ డబ్బులు నేరుగాను, బ్యాంకు ఖాతాల్లో జమచేయడం ద్వారాను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇవీ... వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది. గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం, డిస్ట్రబ్ చేయడం. పగలు మగవాళ్లు ఉండరు.. వలంటీర్లు పోయి తలుపులు కొడుతున్నారు. ఎంత నీచం ఇది’ – 2019, సెపె్టంబర్ 27వ తేదీన చంద్రబాబు ‘ఊళ్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటిష్ ఏజెంట్లలా వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ – 2021, అక్టోబర్ 30న కుప్పంలో చంద్రబాబు ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశి్నస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్లకేంటి సంబంధం’ – 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో చంద్రబాబు. ‘వలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ – 2023, అక్టోబర్ 7న ఏలూరులో పవన్‌కళ్యాణ్ పింఛన్ కోసం వెళ్లి 12 మంది మృతిరెండు రోజుల్లో 16 మంది మృత్యువాత సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు వికృత రాజకీయానికి రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు బలవుతున్నారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛను కార్యక్రమంపై చంద్రబాబు తన మనుషులతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పంపిణీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసి, బ్యాంకుల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అవ్వాతాతలు మండుటెండలు, వడగాడ్పుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా గురువారం పింఛను కోసం వెళ్లి వడదెబ్బకు నలుగురు మరణించగా, శుక్రవారం 12 మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం జంబుకేశవపురానికి చెందిన జి.నాగయ్య (68), పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఇంజేటి మంగతాయారు (69), గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన వితంతు మహిళ చొప్పర లక్ష్మి (49), బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువుకు చెందిన చాగంటి సుబ్బాయమ్మ (68), ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన తానికొండ రమణమ్మ (65), ఏలూరు జిల్లా పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాంకు చెందిన కె.పోలినాయుడు (70), కర్నూలు జిల్లా మాచాపురం గ్రామానికి చెందిన ఆనంద్ (61), వైఎస్సార్ జిల్లా బద్వేలులో నాగిపోగు యల్లమ్మ (64), రామయ్య (68), పల్నాడు జిల్లా చిలకలూరిపేటకి చెందిన మాట నాగేశ్వరరావు (65), అనంతపురం జిల్లా ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ఎరుకుల సుంకన్న (72) వడదెబ్బకు మృతి చెందారు. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్‌లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్‌లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్ సిటిజన్లకు తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్ సిటిజన్లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ కోతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది. వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది. -
కరోనా ఇలా కూడా ఎటాక్ చేస్తుందా? నటుడు విజయ్‌కాంత్ కూడా..
కోలివుడ్‌కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్‌కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్‌గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి. అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. జ్వరం అలసట దగ్గు, గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవడం కండరాలు, శరీర నొప్పులు తలనొప్పి చలి రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్‌గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
అవ్వా తాతలకు ‘ఆత్మియుడి’ అండ
సాక్షి, అమరావతి: జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, పిల్లల కోసం ఎంతో కష్టపడి వయస్సు మీద పడిన వృద్ధులకు కావాల్సింది ఓ ఆత్మీయ పలకరింపు. అవ్వా బాగున్నావా.. తాతా బాగున్నావా.. అంటూ మలి సంధ్యలో ఉన్న వారి అవసరాలను తీరిస్తే వారికి అదే ఆనందం. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని వయో వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వమే పెద్ద భరోసా అన్నట్లుగా వారికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తున్నారు. అవ్వా.. తాతా.. అంటూ ఆత్మీయతను అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల నుంచి వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సంక్షేమంతో పాటు భద్రత, హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. గతంలోలా వృద్ధులు పింఛను కోసం మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరెవరినో బతిమాలుకోవాల్సిన పని లేకుండా వారు ఉన్న చోటుకే వచ్చి పింఛను డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు సీఎం వైఎస్ జగన్. గతంలో వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు అనేకం. సీఎం జగన్ ఆ కష్టాల నుంచి అవ్వా తాతలను గట్టెక్కించారు. ఇప్పుడు వలంటీర్లు స్వ యంగా వారు ఉన్న చోటుకు వచ్చి పింఛను డబ్బు అందిస్తున్నారు. వైద్యం కోసం ఆస్పత్రుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులే గ్రామాలకు వచ్చి, పరీక్షలు చేసి, మందులు కూడా ఇస్తున్నారు. సామాజిక భద్రతలో భాగంగా నెలకు రూ.2,750 చొప్పున వృద్ధాప్య పింఛన్లు అందిస్తోంది. గతంలో వృద్ధాప్య పింఛన్ 65 ఏళ్ల వయోపరిమితి ఉంటే దాన్ని 60 ఏళ్లకే కుదించి ఎక్కువ మందికి వైఎస్సార్ పెన్సన్ కానుక అందిస్తోంది. వృద్ధాప్య, ఇతరత్రా పింఛన్లతో మొత్తం 41,05,501 మంది వృద్ధులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి సగటున రూ.13,260.41 కోట్లు వృద్ధులకు పింఛన్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం ఏపీఎస్‌ఆరీ్టసీ బస్సుల్లో టిక్కెట్ చార్జీ పై 25 శాతం రాయితీ ఇస్తోంది. బస్సుల్లో ముందు డోర్ సమీపంలోని మూడు సీట్లు వృద్ధుల కోసం కేటాయించింది. బస్టాండ్లలో వీల్చైర్లు అందుబాటులో ఉంచింది. వృద్ధుల కోసం మచిలీపట్నం, చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం 2 వృద్ధాశ్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 68 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7 ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 47,490 మంది వృద్ధులు వీటిని ఉపయోగించుకున్నారు. వృద్ధుల సమస్యలు, అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టేందుకు 2021 డిసెంబర్ నుంచి ఎ ల్డర్ లైన్ 14567 (హెల్ప్‌లైన్) నిర్వహిస్తోంది. 26 జిల్లాల నుంచి 39,332 మంది దీని సేవలు ఉపయోగించుకున్నారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 50,08,662 మంది వృద్ధులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధుల సంక్షేమంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మలి సంధ్యలో ఎవరూ అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. వయోవృద్ధుల సమస్యలు, అవసరాలు గుర్తించి సకాలంలో చర్యలు తీసుకునేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకులు, రాష్ట్ర వయోవృద్ధులు, దివ్యాగుల సంక్షేమ శాఖ 5న వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం ఏపీ వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ట్రిబ్యునల్స్, అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల ఫిర్యాదుల పరిస్థితి, వారి వైద్య సంరక్షణ, జీవనం, వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకో వాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. -
వీల్‌చైర్ వాడేవారి కోసం రైళ్లలో ర్యాంపులు
న్యూఢిల్లీ: వీల్‌చైర్ వాడే వారు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రైళ్లలో త్వరలో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన ర్యాంపుల ఫొటోలను శనివారం ఆయన విడుదల చేశారు. ఇలాంటి వాటిని ఇప్పటికే చెన్నై రైల్వే స్టేషన్లో వినియోగించి చూశామని, ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అందిందన్నారు. త్వరలో వీటిని వందేభారత్ రైళ్లలో, ఆ తర్వాత మిగతా రైళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వీటి అవసరముందనే విషయం ప్రయాణికులు తెలిపేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామన్నారు. దాని ఆధారంగా సంబంధిత రైల్వే స్టేషన్లకు అలెర్ట్ వెళ్తుందని, దాన్ని బట్టి అక్కడి సిబ్బంది ర్యాంపును సిద్ధంగా ఉంచుతారని వివరించారు. బోగీ తలుపుల వద్ద వీటిని సునాయాసంగా ఏర్పాటు చేయొచ్చన్నారు. -
సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య బీమా భరోసా
దేశీయంగా వయస్సు పైబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీఆర్బీ గణాంకాల ప్రకారం 2050 నాటికి 14.4 కోట్ల మంది పైచిలుకు సీనియర్ సిటిజన్స్ ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పెద్దవారికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వారి అవసరాలను దృష్టిలోఉంచుకోవాలి. ఇందుకోసం అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి: ఆరోగ్యబీమా పాలసీ కవరేజీ సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెయిటింగ్ పీరియడ్, అలాగే ఎలాంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మణిపాల్ సిగ్నా అందించే ప్రైమ్ సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సీనియర్ల విభిన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా 91వ రోజు నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ అనారోగ్య పరిస్థితులకు కవరేజీని అందిస్తుంది. ► కో–పే, ఉప–పరిమితులు ఉండొద్దు: కో–పే, ఉప–పరిమితులు ఉండని హెల్త్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే సబ్–లిమిట్ ఉన్న ప్లాన్ వల్ల మళ్లీ మన జేబుపై భారం పడుతుంది. పాలసీ పరిధిలోకి రాని కొన్ని ఖర్చులను మనమే భరించాల్సి వస్తుంది. ► అపరిమితంగా సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణ: ఆరోగ్య బీమాలో పరిగణనలోకి తీసుకోతగిన మరో పెద్ద అంశం ఏమిటంటే, సమ్ ఇన్సూర్డ్‌ను అపరిమితంగా రీస్టోర్ చేసే అవకాశం. ఉదాహరణకు మీరు ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి సంబంధించిన, లేక దానికి సంబంధించని మరోదాని కోసమైనా కొత్తగా క్లెయిమ్ చేసినప్పుడు, మీ హెల్త్ ప్లాన్ తప్పకుండా సమ్ ఇన్సూర్డ్ 100 శాతం పునరుద్ధరించేటువంటిదై ఉండాలి. ► క్యుములేటివ్ బోనస్: క్లెయిమ్స్ గానీ దాఖలు చేయని పక్షంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో సమ్ ఇన్సూర్డ్కి ఏటా 10 శాతం మేర క్యుములేటివ్ బోనస్ జతవుతుంటుంది. సమ్ ఇన్సూర్డ్కి 100 శాతం స్థాయికి చేరే వరకు ఈ బోనస్ ఏటా జతవుతూనే ఉంటుంది. ఫలితంగా పదేళ్లలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కవరేజీ రెట్టింపవుతుంది. ► ప్రివెంటివ్ చెకప్: తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వయో వృద్ధులు తరచుగా వైద్యులను సంప్రదించాల్సి వస్తుంటుంది. అపాయింట్మెంట్లు లభించడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలోని డాక్టర్లు, స్పెషలిస్టులతో అపరిమిత టెలీకన్సల్టేషన్స్ (ఫోన్ లేదా చాట్ ద్వారా) సదుపాయం ఇచ్చే ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఏటా నగదురహిత హెల్త్ చెకప్ అందించేదిగా కూడా పాలసీ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, వాటి ఫీచర్లు, వ్యయాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్‌కు శారీరకంగాను, ఆర్థికంగాను ప్రయోజనకరంగా ఉండే సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవాలి. – ప్రియా గిల్భిలే, సీవోవో, మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ -
నాకు ప్రతి నెలా ఇన్కమ్ కావాలి.. ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది?
నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. అందుబాటులో ఉన్న మార్గాలు ఏవి? – నారాయణ్ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40 శాతం చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.24.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40 శాతం మేర ఉండేలా ఏడాదికోసారి పెట్టుబడులను మార్పులు (అస్సెట్ రీబ్యాలన్స్) చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? – రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విష యానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. -
వృద్ధులకు మెరుగైన పెట్టుబడి సాధనం?
వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్‌కు విడిగా కేవైసీ ఇవ్వకుండా, ఏదైనా కేంద్రీకృత ప్లాట్‌ఫామ్ ఉందా? – సమీర్ పటేల్ కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) అనేది ఇన్వెస్టర్ల గుర్తింపు, చిరునామాకు సంబంధించినది. నల్లధన నిరోధక చట్టం కింద ఇన్వెస్టర్ విధిగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం కేంద్రీకృత కేవైసీ (సీకేవైసీ) ప్లాట్‌ఫామ్ ఒకటి పనిచేస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది. ఇన్వెస్టర్ తన కేవైసీ ప్రక్రియను ఒక్కసారి పూర్తి చేస్తే చాలు. ఇన్వెస్టర్ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ కేవేసీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఇన్వెస్టర్లు పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ వద్ద నమోదైన క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తి (స్టాక్ బ్రోకర్, డీపీ)కి సమర్పించొచ్చు. ఆ సమాచారం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా కేంద్రీకృత వ్యవస్థలో నమోదు అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. నేను ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా మాదిరి వృద్ధులు ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకునేందుకు డెట్ ఫండ్ లేదా ఈక్విటీ ఫండ్ ఏది అనుకూలం? – శర్వానంద్ శివమ్ వృద్ధులు కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ముందు కొంత సమయం తీసుకుని పెట్టుబడిపై మరింత స్పష్టతను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి ఉద్దేశాలు, పెట్టబడి కాలం ఎంతన్నది తేల్చుకోవాలి. మీకు దీర్ఘకాల లక్ష్యం ఉందా? లేక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం తర్వాతే పెట్టుబడి అవసరం ఉందా? వీటికి అవును అనేది సమాధానం అయితే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సరైన ఎంపిక అవుతుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడి) లేదా లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడిలో ఏది మంచిది? అని అడిగితే.. మేము అయితే సిప్‌కు అనుకూలం. ఎందుకంటే ఇది కొనుగోలు ధరను సగటుగా మారుస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు తక్కువ ధరల్లోనూ సిప్ ద్వారా కొనుగోలు చేస్తారు. అలాగే, మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగుతాయి. డెట్ ఫండ్స్ అన్నవి స్థిరంగా ఉంటాయి. పెట్టుబడికి రక్షణ ఉద్దేశంతో కొనసాగుతాయి. మీ పెట్టుబడి ఉద్దేశాలకు అనుకూలం అనుకుంటే డెట్ ఫండ్స్‌లో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతలతో ఉంటాయి. కనుక ఈక్విటీ పథకాల్లో ఒకే విడత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే, అప్పుడు ఆ మొత్తాన్ని డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి నిర్ణీత కాలంలోపు పెట్టుబడులను బదిలీ చేసుకోండి. నా సోదరుడు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పుడు మా ఒదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? –వరుణ్ యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినీకి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు. -
సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40% టికెట్ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు. -
రంగస్థలం
లక్నో సాంస్కృతిక వైభవ మణిపూసలలో రంగస్థలం ఒకటి. ఆ వెలుగు మరింత ప్రజ్వరిల్లేలా ఔత్సాహికులు నాటకరంగంలో భాగం అవుతున్నారు. అయితే రంగస్థలం అంటే యువతరం మాత్రమేనా? ‘కానే కాదు’ అంటోంది ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ. రచనల నుంచి నటన వరకు పెద్దలలోని సృజనాత్మక శక్తులను రంగస్థలంపైకి సాదరంగా తీసుకురావడానికి ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ పేరుతో నాటకరంగ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది... థియేటర్ గ్రూప్ ‘మంచ్కీర్తి సమితి’ లక్నో (ఉత్తరప్రదేశ్)లో నిర్వహించిన ‘30 డేస్ 30 ప్లేస్’ కు అనూహ్యమైన స్పందన లభించింది. విశేషం ఏమిటంటే ఆ జామ్ ప్యాక్డ్ థియేటర్లలో ఎక్కువమంది వృద్ధులు కనిపించారు. నాటకాలు చూస్తున్నప్పుడు వారిలో వయసు భారం మాయమైపోయింది. ప్రదర్శన పూర్తయిన తరువాత టీ తాగుతూ వారు ఆ నాటకాన్ని లోతుగా విశ్లేషించుకునే దృశ్యాలు ఎన్నో కనిపించాయి... దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్నోకు చెందిన ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో సీనియర్ సిటీజన్లతో నలభైరోజుల పాటు థియేటర్ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘వారి కోసం వారి చేత’ ట్యాగ్‌లైన్‌తో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లలో రచన, నటన, దర్శకత్వం, సంగీతం... మొదలైన అంశాలలో శిక్షణ ఉంటుంది. దీంతో పాటు తమ ఏరియాలో తమ వయసు ఉన్న వ్యక్తులను సమీకరించి ‘స్టోరీ టెల్లింగ్’లాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చెబుతారు. ‘సీనియర్ సిటిజన్స్ కోసం థియేటర్ అనేది మంచి కాన్సెప్ట్. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త శక్తిని ఇస్తుంది’ అంటున్నాడు థియేటర్ డైరెక్టర్ సలీమ్ ఆరీఫ్. ‘నాటకరంగం అనేది అత్యంత ప్రభావశీలమైనది. ఈ బలమైన మాధ్యమం పెద్దల నీడలో మరింత బలం పుంజుకుంటుంది. వయసు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవ జ్ఞానం నాటకాల్లో ప్రతిఫలిస్తుంది. వృద్ధులు అనగానే ప్రేక్షకుల్లో కూర్చుని నాటకం వీక్షించడానికే పరిమితం కానవసరం లేదు. ఇప్పుడు వారిని రంగస్థలం ప్రేమగా, అభిమానంగా ఆహ్వానిస్తోంది’’ అంటున్నాడు రంగస్థల ప్రముఖుడు సంగమ్ బహుగుణ. పెద్దల చేత రూపుదిద్దుకుంటున్న నాటకాలు, పెద్దలు నటించే నాటకాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం.. ఒంటరి ఏకాంతాలు, వయసు సమస్యలు, కుటుంబ సమస్యలు... ఇలా ఏవోవో సమస్యలు ఉండబోతున్నాయా? ‘కానే కాదు’ అంటుంది పీపుల్స్ ఇన్షియేటివ్. వారు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. తాము నడిచొచ్చిన బాటను గుర్తు చేస్తూ ఈ తరానికి సానుకూలశక్తిని పంచుతారు. ఇంతకంటే కావాల్సినదేముంది! నాటకాల పాఠశాల వయసు పైబడినంత మాత్రాన అది నటనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిరూపిస్తున్న ప్రతిభావంతులలో సోహైలా కపూర్ ఒకరు. ఘనమైన ఖాన్దాన్ నుంచి వచ్చిన కపూర్ నటి, రచయిత్రి, మోడ్రన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. ఈ తరం నటులతో కలిసి రంగస్థలం, జీ థియేటర్లలో నటిస్తోంది కపూర్. ఆమెతో నటించడం అంటే ఔత్సాహిక నటులకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్నంత అదృష్టం. దిల్లీలో పుట్టిన కపూర్ హైస్కూల్ రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ‘వయసు పైబడగానే విషాదం మూర్తీభవించే పాత్రలకు మాత్రమే మహిళా నటులు పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. వృద్ధాప్యం అంటే విషాదం మాత్రమే కాదు. ఎన్నో బలమైన పాత్రలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. వోటీటీ పుణ్యమా అని సీనియర్ నటీమణులకు మూస పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలలో నటించే అవకాశం దొరుకుతుంది’ అంటోంది కపూర్. -
వృద్ధుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ స్కీమ్!
ముంబై: వృద్ధులకు ఆర్థికంగా మరింత రక్షణ అవసరం కావడంతో, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘శుభ్ ఆరంభ్ డిపాజిట్’ స్కీమ్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం తీసుకొచ్చిన ఈ డిపాజిట్ పథకంలో అదనంగా 0.50 శాతం రేటును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. 80 ఏళ్లు నిండిన వారికి 0.65 శాతం అదనంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. 501 రోజుల ఈ డిపాజిట్ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ రేటు 7.65 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.80 శాతం లభిస్తుంది. ఇక 7 - 10 ఏళ్ల కాల వ్యవధుల డిపాజిట్లపైనా ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. -
కోటక్ మహీంద్ర బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాల వ్యవధిలోని ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు సోమవారం( ఏప్రిల్ 10, 2023)నుంచి అమల్లోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 2.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ రేటును కోటక్ మహీంద్రా బ్యాంకు చెల్లిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుండి 7.70 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోల్చితే, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అలాగే 390 రోజుల నుంచి రెండేళ్ల లోపు ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు గరిష్టంగా 7.20 శాతం, అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!) ఎఫ్డీలపై కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు 2 నుంచి మూడేళ్ల లోపు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం 3 నుంచి నాలుగేళ్ల లోపు పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం 4- 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం 5 - 10 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.20 శాతం వడ్డీ రేటును బ్యాంకు చెల్లిస్తుంది. -
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఆధార్ నమోదు
సాక్షి, అమరావతి: వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులకు తమ ఇంటి వద్దే ఆధార్ నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ విధానాన్ని బుధవారం నుంచే ఆందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు, ఇతర అవసరాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులు తమ సమాచారాన్ని ఈ–మెయిల్ ద్వారా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రీజనల్, రాష్ట్ర కార్యాలయాలకు అందిస్తే ఏడు పనిదినాల్లో వారి ఇంటికే వెళ్లి ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంటికే వెళ్లి ఆధార్ నమోదు చేసినందుకు అదనపు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తారు. ఒక అడ్రెస్ ఉన్న ఇంటిలో మొదటి వ్యక్తికి రూ.700, ఆ తర్వాత ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి రూ.350 చొప్పున జీఎస్టీతో కలిపి సేవా రుసుం వసూలు చేస్తారు. యూఐడీఏఐ ప్రాంతీయ, రాష్ట్ర కార్యాలయాలను https://www.uidai.gov.in/en/ contact&support/regional&offices. html అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించాలని సూచించింది. -
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. వందేభారత్ రైళ్ల ఉత్పత్తిపై ఆందోళన వందేభారత్ రైళ్ల తయారీ మందగమనంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2022–23లో 35 రైళ్లు తయారవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 8 రైళ్లే సిద్ధమయ్యాయి. లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, రైలు ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరాలన్నా వందేభారత్ రైలు ఇంజన్లు, బోగీల తయారీ వేగాన్ని ముమ్మరం చేయాలి. ఇందుకోసం పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేశాఖ సాంకేతిక తోడ్పాటు అందించాలి’’ అని సూచించింది. -
సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీనియర్ సిటిజన్స్ కోసం మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ప్రైమ్ సీనియర్ పేరిట ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టింది. తక్కువ వెయిటింగ్ పీరియడ్, పాలసీ తీసుకున్న 91వ రోజు నుంచీ ప్రీ–ఎగ్జిస్టింగ్ (అప్పటికే ఉన్న) అనారోగ్య సమస్యలకు కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఈ పాలసీలో ఉన్నట్లు సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. కో–పే, ఉప–పరిమితులు, పాలసీ తీసుకునే ముందు తప్పనిసరి మెడికల్ చెకప్ వంటి బాదరబందీలేమీ ఇందులో ఉండవని వివరించారు. నాన్–మెడికల్ ఐటమ్లకు కూడా కవరేజీ లభిస్తుందని, అపరిమిత టెలీ కన్సల్టేషన్, హెల్త్ చెకప్‌లు వంటి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇది ప్రైమ్ సీనియర్ క్లాసిక్, ప్రైమ్ సీనియర్ ఎలీట్ అని రెండు వేరియంట్లలో ఉంటుందని వివరించారు. (ఇదీ చదవండి: ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?) -
రైళ్లలో వృద్ధులకు రాయితీలు ఇప్పుడే కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: రైల్వేలపై ఖర్చుల భారం విపరీతంగా పెరిగిపోతోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతేడాది ప్యాసింజర్ సేవలకు రూ.59,000 కోట్ల రాయితీలు ఇచ్చామని, పెన్షన్లు, జీతాల బిల్లు భారీగానే ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని పరోక్షంగా చెప్పారు. వాటిని కరోనా సమయంలో రద్దు చేయడం తెలిసిందే. ‘‘ప్రయాణికుల సేవలకు ఏటా రూ.59,000 కోట్ల రాయితీలివ్వడం మామూలు విషయం కాదు. పైగా రూ.60,000 కోట్ల పెన్షన్ బిల్లు, రూ.97,000 కోట్ల జీతాల బిల్లు, రూ.40,000 కోట్ల ఇంధన ఖర్చు భరించాల్సి వస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు రైల్వేల ఆర్థిక పరిస్థితినీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ -
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ భారీ షాక్!
సీనియర్ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ భారీ షాకిచ్చింది. గతేడాది రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సుమారు రూ.59 వేల కోట్లు రాయితీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం రాయితీని పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌కు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు రాయితీలను ఎప్పుడు పునరుద్ధరిస్తున్నారంటూ మహరాష్ట్ర ఎంపీ నవనీత్ (రాణా) కౌర్ అశ్వినీ వైష్ణవ్‌ను ప్రశ్నించారు. నవనీత్ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. రైల్వేలో పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు అధికంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో సీనియర్లకు రాయతీని పునరుద్ధరించడం ఇప్పట్లో వీలుకాదని పేర్కొన్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే..రాయితీని అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే సీనియర్ల రాయితీని తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ రైల్వే పరిస్థితిని కూడా చూడాలని కోరారు. -
రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య భారీగా తగ్గుతోంది!
కరోనా మహ్మమారి రాకతో దాదాపు అన్నీ రంగాల ఆదాయాలకు గండి పడింది. ఇటీవలే దీని నుంచి బయట పడుతూ కొన్ని పుంజుకుంటుండుగా, మరి కొన్ని డీలా పడిపోయాయి. ఈ వైరస్ దెబ్బకు ఇండియన్ రైల్వేస్ ఆదాయానికి కూడా చాలా వరకే గండిపడింది. ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ ఈ దెబ్బ నుంచి కోలుకుంటోంది. అయితే తాజాగా ట్రైన్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెప్తున్నాయి. కరోనా పరిస్థితులతో పాటు, గతంలో పలు కారణాల వల్ల టికెట్‌పై ఇచ్చే రాయితీని నిలిపేయడంతో రైళ్లలో వయోవృద్ధల ప్రయాణాలు ఈ ఏడాది 24 శాతం తగ్గాయని వెల్లడయ్యింది. 2018-2019లో 7.1 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించగా, 2019-20లో ఈ సంఖ్య 7.2 కోట్లకు పెరిగింది. అయితే, 2021-22లో దాదాపు 5.5 కోట్ల మంది మాత్రమే రైలులో ప్రయాణించారు. ఈ విభాగం ప్రయాణీకుల సంఖ్య తగ్గుదల కారణంగా, రైల్వే శాఖ ఆదాయం గతంలో పోలిస్తే 13 శాతం క్షీణించింది. ఆర్బీఐ తెలిపిన సమాచారం ప్రకారం.. 2018-2019లో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల నుంచి వచ్చిన మొత్తం రూ. 2,920 కోట్లు, 2019-2020లో రూ. 3,010 కోట్లు, 2020-21లో రూ. 875 కోట్లు, 2021-22లో రూ. 2,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చదవండి: అమెజాన్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో మరో బిజినెస్ మూసివేత! -
పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వృద్ధుల కోసం అధిక వడ్డీ రేటుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన ఎవరైనా కానీ 600 రోజుల కాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 7.85 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇక వృద్ధులు కాకుండా ఇతరులకు 600 రోజుల డిపాజిట్‌పై (ఎప్పుడైనా ఉపసంహరించుకోతగిన) 7 శాతం వడ్డీ రేటు, కాలవ్యవధి వరకు ఉపసంహరణకు వీల్లేని 600 రోజుల డిపాజిట్‌పై 7.05 శాతం వడ్డీని ఇస్తున్నట్టు పీఎన్బీ తెలిపింది. -
దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (ఏపీడీఏఎస్‌సీఏసీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులు. కనీసం పదో తరగతి పాసవ్వాలి. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు. గతంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం, దివ్యాంగుల పూర్తి ఫొటోను పాస్‌పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు ఏపీడీఏఎస్‌సీఏసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా' -
ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!
హైదరాబాద్: ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను తన కస్టమర్ల కోసం ప్రకటించింది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల వరకు పెంచి తన ఖాతాదారులకు ఈ ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ అందించింది. కెనరా బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం సవరించిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. (మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!) 666 రోజుల కాల వ్యవధికి డిపాజిట్ చేస్తే 7 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇదే డిపాజిట్‌పై అర శాతం అధికంగా 7.50 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. రూ.2 కోట్లలోపు ఉండే డిపాజిట్లకు ఇది వర్తిస్తుందని కెనరా బ్యాంకు ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకు నుంచి ఇది అత్యధిక రేటుగా పేర్కొంది. (సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం) ఇదీ చదవండి : హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు -
యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నిన్న (మంగళవారం, సెప్టెంబర్ 20) నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన రేట్లు వర్తిస్తాయి. వివిధ డిపాజిట్లపై సాధారణ పౌరులకు అందించే వడ్డీ 2.75 శాతం నుంచి 5.75 మధ్య ఉండనుంది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అందించే వడ్డీ 2.75 శాతం నుండి 6.50 శాతం వరకు ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 11 రోజుల నుండి 1 సంవత్సరం, 25 రోజులు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలకు 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే అత్యధిక వడ్డీ. 7 రోజులు నుంచి 29 రోజుల కాలవ్యవధికి, బ్యాంక్ 2.75 శాతం అందిస్తుంది; 7 రోజుల నుండి 14 రోజుల వరకు, సాధారణ ప్రజలకు 2.75 శాతంఅందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతం రేటు వర్తిస్తుంది. 30 నెలల నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం అందిస్తుంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకుగాను సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం. అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీని అందిస్తుంది. -
ఆ ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు 30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది. 60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 180 బీపీఎస్ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. -
ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 6 శాతం వరకూ అత్యధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తూ, ‘బరోడా తిరంగా డిపాజిట్ పథకం’ పేరుతో ప్రత్యేక రిటైల్ టర్మ్ ప్లాన్‌ను ఆఫర్ చేసింది. అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వినియోగదారులకు అధిక వడ్డీరేటుతో తిరంగా డిపాజిట్ స్కీమ్ అందించడం సంతోషంగా ఉందనీ, అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో బీఓబీ ఒకటని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కె. ఖురానా ప్రకటనలో తెలిపారు. (ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!) 2022 డిసెంబర్ 31 వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. తిరంగా డిపాజిట్ స్కీమ్ వివరాల ప్రకారం, 555 రోజుల కాలవ్యవధికి డిపాజిట్‌పై 6.15శాతం వడ్డీని పొందవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు 0.5శాతం అదనపు వడ్డీని, నాన్-కాలబుల్ డిపాజిట్లకు 0.15 శాతం అదనపు వడ్డీని అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద నాన్-కాలబుల్ 555 రోజుల డిపాజిట్ పై 6.65 శాతం వరకూ వరకు వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం 555 రోజులకు రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 1.26 లక్షల కంటే ఎక్కువే పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్లకు మెచ్యూరిటీ మొత్తం రూ. 1.28 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. -
సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంకక్షోభ సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే రాయితీ పొందే తరుణం రానుంది. ఈ మేరకు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధవర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీ ఛార్జీల రాయితీ పునరుద్ధరణపై ఆలోచించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. వారికి స్లీపర్ క్లాస్, ఏసీ-3 కేటగిరీల్లో మొత్తం ఛార్జీలో 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీని అందించాలని సిఫార్సు చేసింది. గతవారం ఆగస్టు 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఈ మేరకు పేర్కొంది. అయితే రాయితీ పునరుద్ధరణపై రైల్వే శాఖ అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సీనియర్ సిటిజన్లు,జర్నలిస్టులకు అందించే రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్‌సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
రైళ్ళలో రాయితీలను పునరుద్ధరించాలి
కోవిడ్ మహమ్మారి దేశంపై విరుచుకుపడేంతవరకూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రైళ్ళలో రాయితీ అమలులో ఉంది. కోవిడ్ బూచి చూపించి రైళ్లను రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించిన తర్వాత... అనేక వర్గాలకు టిక్కెట్ ధరలను పూర్వ విధానంలోనే ఉంచి, 53 కేటగిరీలుగా ఉన్న రాయితీలను 11 కేటగిరీలకు మాత్రమే పరిమితం చేశారు. రోగులకు, దివ్యాంగులకు, మరికొందరికి మాత్రమే పునరుద్ధరిం చారు. అవకాశం దొరికిందని వృద్ధులకిచ్చే రాయితీ సైతం రద్దుచేశారు. దీంతో వృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఒక కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని అందులో తేల్చి చెప్పారు. వృద్ధులకు, సౌకర్యాలు, గౌరవం కల్పించడం భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణం. అటువంటిది కేంద్రం వృద్ధులకిచ్చే రైల్వే టికెట్ రాయితీని రద్దు చేయడం ద్వారా మన సాంస్కృతిక విలువలను తుంగలో తొక్కు తోంది. పెద్దవాళ్లు చేసే తీర్థయాత్రలు, తప్పనిసరి ప్రయాణాలను ప్రభుత్వ నిర్ణయం భారంగా మార్చింది. (క్లిక్: ఎంత ఖర్చుకు ఎంత ప్రయోజనం?) దేశ వ్యాప్తంగా వెల్లడవుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 70 ఏళ్లు పైబడినవారికి రాయితీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. కానీ ఈ కంటి తుడుపు చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కరోనా మహమ్మారికి ముందు ఉన్నట్లే 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు రాయితీ వర్తింప జేయాలి. (క్లిక్: వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?) – డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు -
తోడొకరుండిన అదే భాగ్యమూ.. ఆరోగ్యమూ..
ప్రభుత్వోద్యోగిగా రిటైరైన ఎఎస్‌రావు నగర్ వాసి ప్రహ్లాదరావు, కొన్నాళ్ల క్రితం భార్యను కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని డయాబెటిస్, బీపీ వగైరాలు చుట్టుముట్టాయి. ఇటీవల ఆయన తన వయసుకు తగ్గ తోడును వెదుక్కుని మళ్లీ ఓ జంటవారయ్యారు. కొన్ని నెలల్లోనే ఆయన ఆరోగ్య సమస్యలూ నియంత్రణలోకి వచ్చాయి. పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శైలజ (55) ఇటీవలే తనలాగే ఒంటరిగా ఉంటున్న స్నేహితుడితో కలిసి జీవించడం ప్రారంభించారు. విచిత్రంగా ఆమెను వేధించిన డిప్రెషన్, నిద్రలేమి తదితర సమస్యలన్నీ మాయమయ్యాయి. ‘ఏ వయసులోనైనా తోడు అనేది ఒక తప్పనిసరి. అది మనిషిని మానసికంగా సేదతీర్చి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సలా పనిచేస్తుంది’ అని నగరానికి చెందిన ఫిజిషియన్ డా.శంకర్ చెప్పారు. సాక్షి, హైదరాబాద్ : ఒంటరి జీవితం ఏ వయసులోనైనా దుర్భరమే అయినప్పటికీ.. మరే రకమైన వ్యాపకం లేని వృద్ధులకు అది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితిలోనే అనేక రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకు వారు గురవుతారు. అప్పటిదాకా లేని జబ్బులు వారిని చుట్టుముడతాయి. ‘‘మానసిక వేదన, నిరాశా నిస్పృహలు, తాము అప్ర«దాన వ్యక్తులుగా మారామనే భావన...రోగ నిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దాగి ఉన్న వ్యాధులు విజృంభించేలా చేస్తాయి’’ అని సైకాలజిస్ట్ ప్రవీణ్ చెప్పారు నిద్రలేమి, బీపీ తగ్గాయి.. ఒంటరిగా ఉన్నప్పుడు రక్తపోటు, చక్కెర వ్యాధి, నిద్రలేమి వంటి సమస్యలు వేధించేవి. నిత్యం మందులు వాడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో టైమ్‌కి మందులవీ ఇచ్చి నా బాగోగులు చూసుకునేందుకు ఒకరు ఉంటే బాగుండని రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటే... తనే నా పాలిట మెడిసిన్‌గా మారింది. ఇప్పుడు నిద్రలేమి పోయింది.. మందుల అవసరం తగ్గిపోయింది. –కోటేశ్వరరావు ఆ‘పరేషాన్’ తీరింది... వ్యక్తిగతంగా నేనూ 60ఏళ్ల వయసులో పునర్వివాహం చేసుకున్నాను. ఆ పెళ్లి నాతో పాటు నా భర్త ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగయ్యేలా చేసింది. తోడు నీడ స్థాపించడానికి అదో కారణం. మా సంస్థ ద్వారా కొన్ని వందల మంది సీనియర్ సిటిజన్స్‌ని పెళ్లిళ్లు/లివిన్ రిలేషన్ షిప్స్ ల ద్వారా జంటలుగా మార్చాం. అది అనేకమందికి అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపింది. ఒంటరిగా ఉన్న ఓ పెద్దావిడ ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చిన మోకాలి చిప్ప ఆపరేషన్ ను పెళ్లయిన వెంటనే చేయించుకోగలిగారనేది దానికో చిన్న ఉదాహరణ మాత్రమే. –రాజేశ్వరి, నిర్వాహకులు తోడు నీడ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం (చదవండి: ‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు) -
'వాళ్ల కోసం నింగి నుంచి నక్షత్రాలైనా తెస్తారు..కానీ ప్రజలకు మాత్రం'
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇకపై సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించిన మరునాడే ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'ప్రకటనల కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రధానికి కొత్త విమానం కొనుక్కోవడానికి డబ్బులుంటాయి. పారిశ్రామిక రంగంలోని స్నేహితులకు పన్ను రాయితీలు చేస్తున్న ప్రభుత్వం వద్ద దేశంలోని సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ కోసం 1500 కోట్లు లేవా? కేంద్రం తన స్నేహితుల కోసం ఆకాశం నుంచి నక్షత్రాలైనా తీసుకొస్తుంది కానీ ప్రజలను మాత్రం రూపాయి కోసం కష్టపడేలా చేస్తుంది' అని రాహుల్ ధ్వజమెత్తారు. विज्ञापनों का ख़र्च: ₹911 Cr नया हवाई जहाज़: ₹8,400 Cr पूंजीपति मित्रों के टैक्स में छूट: ₹1,45,000 Cr/साल लेकिन सरकार के पास बुज़ुर्गों को रेल टिकट में छूट देने के लिए ₹1500 करोड़ नहीं हैं। मित्रों के लिए तारे तक तोड़ कर लाएंगे, मगर जनता को कौड़ी-कौड़ी के लिए तरसाएंगे। — Rahul Gandhi (@RahulGandhi) July 22, 2022 2020 వరకు సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో 50శాతం వరకు రాయితీ ఇచ్చేది కేంద్రం. కానీ కరోనా కారణంగా దాన్ని నిలిపివేసింది. అయితే ఇకపై కూడా రాయితీ ఇచ్చే ఆలోచన లేదని బుధవారం పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అలా చేస్తే రైల్వేకు నష్టాలు వస్తాయని తెలిపింది. క్రీడాకారులకు కూడా ఇకపై రాయితీ ఉండబోదని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. చదవండి: సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్ -
సీనియర్లు అయితే హెల్త్ క్లెయిమ్ ఆలస్యం
న్యూఢిల్లీ: వృద్ధులు (60 ఏళ్లు దాటిన వారు) హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు. 60 ఏళ్లలోపు వారితో పోలిస్తే వారం ఆలస్యంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు ‘సెక్యూర్ నౌ’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఆస్పత్రిలో చేరినా కానీ, తమ చికిత్స గురించి బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో వారు జాప్యం చేస్తున్నారు. నగదు రహిత చికిత్సను వృద్ధులు ఎంపిక చేసుకోపోతే, వారు క్లెయిమ్‌లను కచ్చితత్వంతో దాఖలు చేసేందుకు ఆస్పత్రులు, బీమా సంస్థలు, మధ్యవర్తులు సాయం అందించాలని మెహతా సూచించారు. 60 ఏళ్లలోపు వారికి క్లెయిమ్ పరిష్కారం అయ్యేందుకు 23 రోజుల సయం పడుతోంది. అదే సీనియర్ సిటిజన్లు అయితే 28 రోజుల సమయం తీసుకుంటోంది. ఇతరులతో పోలిస్తే వృద్ధులు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారన్న విషయాన్ని మెహతా గుర్తు చేశారు. 30 ఏళ్ల వ్యక్తికి ప్రీమియం రూ.10,365గా ఉంటే, 45 ఏళ్లకు ఇది రూ.15,239, 60 ఏళ్లకు రూ.31,905 అవుతున్నట్టు చెప్పారు. ఇక 75 ఏళ్ల వయసులో వీరు రూ.66,368 చెల్లించాల్సి వస్తుందన్నారు. డయేరియా, కేన్సర్, ప్రొస్టేట్ పెరుగుదల సమస్య, కరోనరీ గుండె జబ్బులకు క్లెయిమ్ నిష్పత్తి (వృద్ధులకు) తక్కువగా ఉంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. -
సీనియర్ సిటిజన్ల ఆరోగ్య సంరక్షణ అలక్ష్యం
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్–19 సమయంలో భారత్‌లోని దాదాపు 70 శాతం మంది సీనియర్ సిటిజన్లకు సరైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేవని మ్యాక్స్ గ్రూప్ సంస్థ.. అంటారా సర్వే వెల్లడించింది. దాదాపు 57 శాతం మంది ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు కూడా సర్వే తెలిపింది. సర్వే ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 60 సంవత్సరాలు పైబడిన 2,100 మంది వృద్ధుల అభిప్రాయాలతో సర్వే వెలువడింది. ► సర్వే ప్రకారం, మహమ్మారి వృద్ధుల జీవన విధానాలను, ప్రాధాన్యతలను మార్చింది. అలాగే సాంకేతికత వినియోగంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ► వ్యాధి సోకుతుందనే భయం 65 శాతాన్ని వెంటాడింది. 58 శాతం మంది సీనియర్ సిటిజన్లు కఠినమైన మార్గదర్శకాల ఫలితంగా సామాజిక ఒంటరితనంపై ఆందోళన చెందారు. ► తీవ్ర అనారోగ్య సమస్యల బారి పడకుండా ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే అంశాలపై వృద్ధులు దృష్టి పెట్టారు. దాదాపు 72 శాతం మంది వృద్ధులు స్వీయ పర్యవేక్షణ, సమతుల్య ఆహారాన్ని ఎంచుకున్నారు. 55 శాతం మంది బయటి వైద్య సహాయం కోరే బదులు ఇంటి ఆరోగ్య సంరక్షణా విధానాలపై మొగ్గు చూపారు. ► వృద్ధాప్య జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, మెరుగైన ఆయుర్దాయం వంటి అంశాలు భారతదేశంలో అనుబంధ ఆరోగ్య సంరక్షణ సేవలకు డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నట్లు అంటారా పేర్కొంది. -
అలాంటిదేమీ లేదు...దంచుడు దంచుడే!
సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే శాఖ అందించే రాయితీలను తిరిగి ప్రారంభించనున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జూలై 1 నుండి సీనియర్ సిటిజన్స్ రాయితీలు తిరిగి పొందవచ్చు అనేవార్త వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్ అంటూ ఈ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ దివ్యాంగులు, రోగులతోపాటు, కొంతమంది విద్యార్థులకు మాత్రమే రాయితీలు ఇస్తోందని పునరుద్ఘాటించింది. అలాగే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ“ఫ్యాక్ట్ చెక్” హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో ఇక నైనా తమకు చార్జీల భారంనుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వయో వృద్ధులకు తీరని నిరాశే మిగిలింది. త్వరలోనే రాయితీ తిరిగి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనాకి ముందు రైల్వేలో ప్రత్యేక రాయితీల ద్వారా 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ ప్యాసెంజర్లకు 40 శాతం రాయితీ అమలయ్యేది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో రూ.3464 కోట్ల రూపాయలు, ఇందులో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేదని ఇటీవలి ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది. అలాగే కరోనా కారణంగా 2020 మార్చిలో వయోవృద్ధుల రాయితీలను తొలగించిన మంత్రిత్వ శాఖకు వాటిని పునరుద్ధరించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు తెలియజేశారు. A #Fake media report is claiming that the Indian Railways will resume concessions for senior citizens from July 1, 2022 ▶️ No such announcement has been made by @RailMinIndia ▶️ Indian Railways is currently providing concessions to divyangjans, patients & students only pic.twitter.com/ePoctCRu3A — PIB Fact Check (@PIBFactCheck) June 16, 2022 -
అమెరికాలో మరో భారతీయుని అరెస్టు
వాషింగ్టన్: అమెరికాలో సీనియర్ సిటిజన్ల ఖాతాలను దోచేసిన కేసులో తాజాగా మరో భారతీయుడు అరెస్టయ్యాడు. వర్జీనియాకు చెందిన అనిరుధ్ కల్‌కోటెను (24) శుక్రవారం హూస్టన్‌లో కోర్టులో హాజరుపరిచారు. సీనియర్ సిటిజన్ల నుంచి డబ్బులు దోచేందుకు వారికి కొందరు బెదిరింపు మెయిల్స్ పంపడం, ఇవ్వకుంటే దాడులకు దిగుతామని హెచ్చరించడం వంటివి చేశారు. హూస్టన్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కొందరు భారతీయులు ముఠాగా ఏర్పడి వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్మిటర్ బిజినెస్‌ల లింకులు పంపి వృద్ధుల ఖాతాల్లోని సొమ్ము కాజేశారు. మహమ్మద్ ఆజాద్ (25) అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడన్నది అనిరుధ్‌పై అభియోగం. ఆజాద్‌ను 2020లోనే అరెస్టు చేశారు. నేరాలు రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడొచ్చు. -
సీనియర్ సిటిజన్ల ముక్కుపిండి రూ.1500 కోట్లు వసూలు
కరోనా సంక్షోభం మొదలు రైల్వేశాఖ బాదుడు మొదలైంది. సాధారణ రైళ్లకే ప్రత్యేకం పేరు పెట్టి అదనపు ఛార్జీలు వసూలు చేసింది. తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్లను ఎడాపెడా రద్దు చేసి పారేసింది. ఆఖరికి సామాజిక బాధ్యతగా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీలను ఏకపక్షంగా ఎత్తేసింది. ఆఖరికి సీనియర్ సిటిజన్లపై కూడా కనికరం చూపలేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. గడిచిన రెండేళ్లుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు ఎత్తి వేయడం ద్వారా రైల్వేశాఖ వృద్ధ ప్రయాణికుల నుంచి అదనంగా రూ. 1500 కోట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. రాయితీలు బంద్ కరోనా కారణంగా 2020 మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత క్రమంగా రైళ్లను పట్టాలెక్కించింది, అయితే అవన్ని ప్రత్యేక రైళ్లుగా పేర్కొంటూ.. అప్పటి వరకు అందిస్తూ వచ్చిన అన్ని రకాల రాయితీలను రైల్వేశాఖ ఎత్తేసింది. ఇందులో సీనియర్ సిటిజన్లు ఇచ్చే ప్రయాణ రాయితీ కూడా ఉంది. సీనియర్ సిటిజన్స్ రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ వాళ్లకు టిక్కెట్టు ధరలో 40 శాతం రాయితీ ఉంది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. దీనికి సంబంధించిన సమాచారం ఆర్టీఐ ద్వారా సేకరించారు. 7.31 కోట్ల మంది ప్రయాణం 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ రైళ్లలో 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ప్రయాణం చేశారు. ఇందులో 4.46 కోట్ల మంది పురుషులు, 2.84 కోట్ల మంది స్త్రీలు, 8,310 మంది థర్డ్ జెండర్ వాళ్లు ఉన్నారు. వీళ్లకు ఈ రెండేళ్ల కాలంలో ఎటువంటి రాయితీ కల్పించలేదు. దీంతో వీళ్ల ప్రయాణాల ద్వారా రైల్వేకు రూ.3464 కోట్ల ఆదాయం సమకూరింది. రూ. 1500 కోట్లు గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో చేరిన రూ.3464 కోట్ల రూపాయల్లో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేది. ఈ డబ్బు వారి కనీస అవసరాలు, మందులు మాకులకు పనికి వచ్చేవి. కానీ కరోనా కష్ట సమయంలోనూ వృద్ధులపై దయ చూపేందుకు రైల్వేశాఖ ససేమిరా అంది. ప్రతీ ప్రయాణంలోనూ వారి వద్ద నుంచి ఫుల్ ఛార్జీ వసూలు చేస్తూ తన బొక్కసం నింపుకుంది. బాధ్యత మరిచిన రైల్వే రైల్వేశాఖలో వృద్ధులు, సైనికులు, రోగులు, మాజీ ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు ఇలా మొత్తం 53 రకాల రాయితీలను అందిస్తోంది, వీటి వల్ల రైల్వే ఆదాయానికి ఏటా సగటున రూ.2000 కోట్లు తూటు పడుతోంది. అయితే ఆ మేరకు సామాజిక భద్రత లభిస్తోంది. అయితే లాభాలే ముఖ్యం సామాజిక భద్రత మా బాధ్యత కాదన్నట్టుగా ఇటీవల రైల్వే వ్యవహరిస్తుండటంతో గత రెండేళ్లుగా ఈ రాయితీలేవీ అమలు కావడం లేదు. చదవండి: తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం! -
వృద్ధులకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయ మార్గాలివే!
నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం నాకు ఉన్న మార్గాలు ఏంటి? – నారాయణ్ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40 శాతం చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్‌స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.34.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40 శాతం మేర ఉండేలా ఏడాదికోసారి పెట్టుబడులను మార్పులు చేసుకోవాలి. డైనమిక్ బాండ్ ఫండ్స్ ఎన్ఏవీ పతనం అవుతుంటే నిశ్చితంగా ఉండొచ్చా? – గాయత్రి డైనమిక్ బాండ్ ఫండ్స్ అన్నవి వాటి నిర్వహణలోని పెట్టుబడులను దీర్ఘకాలం నుంచి స్వల్ప కాలానికి, స్వల్ప కాలం నుంచి దీర్ఘకాలానికి మార్చుకోగల సౌలభ్యంతో ఉంటాయి. ఈ పథకాలు ఎక్కువగా మధ్య కాలం నుంచి దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల పత్రాలను నిర్వహిస్తుంటాయి. కనుక వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో ఈ పథకాలపై ప్రభావం పడుతుంది. ఇది ఎన్ఏవీ క్షీణించడానికి దారితీస్తుంది. ఈల్డ్స్ ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశమే ఉంది. వడ్డీ రేట్లను అన్ని సమయాల్లోనూ ఊహించడం కష్టం. కనుక ఇన్వెస్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుకోవాలి. స్థిరాదాయ పథకాల్లో కొద్ది తేడాతో ఇంటరెస్ట్ రేట్ కాల్స్‌ను తీసుకునే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ కాల వ్యవధుల మధ్య పెట్టుబడులు మారుస్తూ ఎక్కువ రాబడులకు ప్రయత్నించే పథకాల కంటే.. అక్రూయల్ ఇన్‌కమ్‌పై ఆధారపడే నాణ్యమైన పోర్ట్‌ఫోలియోకు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా సందర్భాల్లో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి డైనమిక్ బాండ్ ఫండ్స్ కంటే మెరుగ్గా పనిచేస్తుంటాయి. ఈ రెండింటి మధ్య 2010 నుంచి ఐదేళ్ల రోలింగ్ రాబడులను పోల్చి చూస్తే ఇదే తెలుస్తుంది. మీరు ఒకవేళ డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటే అవి రాబడులు ఇచ్చినా కానీ, ఫండ్ మేనేజర్ పెట్టుబడుల నిర్వహణకు అనుగుణంగా ఆటుపోట్లతో ఉంటాయి. తక్కువ ఆటుపోట్లతో స్థిరమైన రాబడులు కోరుకునే వారు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. -
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!
ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. "గోల్డెన్ ఇయర్స్" అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో వృద్దులు పెట్టుబడి పెట్టేందుకు గడువును పొడిగించింది. ఈ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ గడువు తేదీని 8 ఏప్రిల్ 2022 వరకు పొడిగించింది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పథకం కింద బ్యాంకు వృద్ధులకు సంవత్సరానికి వడ్డీని 0.50 శాతం అదనంగా అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకాలలో నిర్ణీత కాలానికి ముందు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, వారు మరింత వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 20, 2022 నాటి నుంచి అమల్లోకి వచ్చాయి.డిపాజిట్ మొత్తం రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అన్ని ఇతర టర్మ్ డిపాజిట్ ప్రయోజనాలు, నియమ నిబంధనలు కూడా ఈ పథకానికి వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలలో డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మరోవైపు, అదే కాలానికి గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ కింద సీనియర్ సిటిజన్లు 6.35 శాతం వడ్డీ రేటును లభిస్తుంది. సాధారణ ప్రజలకు వార్షికంగా లభిస్తున్న వడ్డీ రేటు కంటే 0.75 శాతం అదనం. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డి స్కీమ్‌లో ఉన్న డిపాజిట్‌ను ముందుగానే విత్‌డ్రా చేస్తే లేదా 5 సంవత్సరాల 1 రోజు లేదా తర్వాత మూసివేసినట్లయితే పెనాల్టీ రేటు 1.25 శాతం ఉంటుందని సీనియర్ సిటిజన్లు తెలుసుకోవాలి. ఈ పథకం కింద తెరిచిన ఖాతా 5 సంవత్సరాల 1 రోజులోపు విత్‌డ్రా చేయబడినా లేదా మూసివేయబడినా బ్యాంకు ఉపసంహరణ నియమాలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఎస్బీఐ వీకేర్ గడువును పొడిగించింది. బ్యాంక్ ఎస్బీఐ వీకేర్ స్కీమ్ గడువును 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!) -
పెద్దవారికి పన్ను ఉపశమనం..
వృద్ధాప్యంలో పన్ను నిబంధనలు చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించారు. 75 ఏళ్లు నిండిన వారు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కాకపొతే ఈ విషయంలో కొన్ని పరిమితులను కూడా నిర్దేశించారు. ఇందుకు సంబంధించి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ పత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలు విషయంలోనే కాకుండా పలు ఇతర వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ వరకు పొడిగించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే.. 75 ఏళ్లు నిండిన వారికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇకమీదట తప్పనిసరి కాదు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే 2022–23 అసెట్‌మెంట్ సంవత్సరం నుంచి అమలవుతుంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. పెన్షన్ ఆదాయం, డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు. పెన్షన్ ఖాతాలోనే డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం వస్తున్నవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉండి, మరో బ్యాంకులో డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం అందుకునే వారికి రిటర్నుల దాఖలు మినహాయింపు లభించదని అర్థం చేసుకోవాలి. ఒకే బ్యాంకులో పెన్షన్, వడ్డీ ఆదాయం కలిగి ఉన్న వారు డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు సంబంధిత వ్యక్తి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బ్యాంకు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది. ఇలా పన్నును గుణించేటప్పుడు చాప్టర్ 6ఏ కింద మినహాయింపులను బ్యాంకు అమలు చేస్తుంది. ప్రతీ ఏడాది 12బీబీఏ అనే పత్రాన్ని (డిక్లరేషన్) 75 ఏళ్లు నిండిన వారు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. తమకు సంబంధిత బ్యాంకు శాఖలోనే పెన్షన్, వడ్డీ ఆదాయం తప్పించి మరే ఇతర ఆదాయం లేదన్న ధ్రువీకరణే ఇది. పేరు, చిరునామా, పాన్, పుట్టిన తేదీ, సంవత్సరం (75ఏళ్లు నిండినట్టు తెలియజేయడం) వివరాలను ఫామ్ 12బీబీఏలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెన్షన్ ఖాతా బ్యాంకు వివరాలు, పెన్షన్ ఎవరి నుంచి అందుకుంటున్నారనే వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు, 75ఏళ్లలోపు వారు ఎప్పటి మాదిరే ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర రూపాల్లో ఆదాయం ఉన్న వారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. ఆయా అంశాలపై సమగ్రంగా నిపుణుల సూచనలు తీసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు.. వ్యక్తులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే.. ముందస్తుగానే (అడ్వాన్స్ ట్యాక్స్) ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020–21లో రూ.15,000 పన్ను చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు ఆగకూడదు. నిబంధనల ప్రకారం పన్ను మొత్తాన్ని అంచనా వేసుకుని నాలుగు వాయిదాల రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించడం.. ఒకవేళ ముందుగానే ఎక్కువ జమ చేసి ఉంటే ఆ మేరకు రిఫండ్ కోరడం చేయవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే.. సెక్షన్ 234బీ, 234సీ కింద వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ప్రతీ నెలా (ఆలస్యమైన అన్ని నెలలకు) ఒక శాతం చొప్పున (ప్రతీ సెక్షన్‌కు కూడా) ఉంటుంది. అయితే 60ఏళ్లు నిండిన వారు వ్యాపారం లేదా వృత్తి రూపంలో లాభాలు, ఆదాయం లేనట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇతర మినహాయింపులు.. పన్ను చెల్లింపుదారులు.. తనకు, తన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు.. ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. అయితే 60ఏళ్లు పైబడిన వారికి ఈ మొత్తం రూ.50,000 పరిమితిగా ఉంది. దీనికితోడు సెక్షన్ 80డీడీబీ కింద తనకు, తనపై ఆధారపడిన వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్సా వ్యయాలు రూ.40,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు (60ఏళ్లలోపువారికి) లభిస్తుంది. 11డీడీలో ఈ వ్యాధుల వివరాలు లభిస్తాయి. ప్రాణాంతక కేన్సర్లు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, పార్కిన్సన్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఈ జాబితాలోనివే. 60ఏళ్లు నిండిన వారు ఈ వ్యాధుల కోసం చేసే చికిత్సా వ్యయాలు ఒక రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై (సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపైనా వృద్ధులకు పన్ను లేదు. కోపరేటివ్ బ్యాంకులు, పోస్టల్ డిపాజిట్లకూ సెక్షన్ 80టీటీబీ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. 60ఏళ్లలోపు వారికి అయితే ఈ పరిమితి రూ.10,000గానే (సెక్షన్80టీటీఏ) ఉంది. బ్యాంకులు, కోపరేటివ్‌లు, పోస్టాఫీసుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40,000 మించితే 10 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)ను మినహాయిస్తారు. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. తమ ఆదాయం పన్ను చెల్లించాల్సినంత లేనప్పుడు బ్యాంకులకు ఫామ్ 15హెచ్ సమరి్పంచినట్టయితే టీడీఎస్‌ను మినహాయించకుండా చూసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు నిండి, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారికి కూడా టీడీఎస్ నిబంధనలు వర్తించవు. వేర్వేరు పన్ను శ్లాబులు 60ఏళ్లు పైబడినవారు ఒక ఆర్థిక సంవత్స రంలో రూ.3లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3–5 లక్షల ఆదాయంపై 5%, రూ.5–10 లక్షల ఆదాయంపై 20 %, రూ.10లక్షలు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమలవుతుంది. అదే 80ఏళ్లు నిండిన వారు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయంపై 20%, అంతకుమించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సెస్సు, సర్‌చార్జ్ అన్నవి పన్ను చెల్లింపుదారులు అందరికీ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఐచ్చికంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. నూతన విధానాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈ తరహా వయసు ఆధారంగా పన్ను రేట్లలో మార్పులనేవి ఉండవు. అందరికీ ఒకవిధమైన పన్ను రేట్లు అమలవుతాయి. పైగా పాత విధానంలో ఎన్నో రకాల పన్ను మినహాయింపులన్నవి నూతన విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కనుక నూతన విధానానికి మారే ముందు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అయితే నూతన పన్ను విధానంలోనూ రూ.5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రూ.12,500 పన్ను రాయితీని పొందొచ్చు. -
పెన్షనర్లకు ఎస్బీఐ శుభవార్త!
సీనియర్ సీటిజన్ ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సీనియర్ సీటిజన్ ఖాతాదారుల కోసం ప్రత్యేక కొత్త పెన్షన్ సేవలను ప్రవేశపెట్టింది. పెన్షన్ తీసుకునే వారి కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్(https://www.pensionseva.sbi) తీసుకొనివచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సీనియర్ సీటిజన్ ఖాతాదారులు అన్ని రకాల పెన్షన్ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. ముందుగా అవసరమైన సమాచారం అందించి, పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత సేవలు సులభంగా పొందొచ్చని ఎస్బీఐ వివరించింది.(చదవండి: ఈ 4 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!) Good news for all Pensioners! We have revamped our PensionSeva website for you to manage all your pension related services with ease. Click here: https://t.co/pM0XAgtzuc#PensionSeva #Pension #SBI pic.twitter.com/xioULTSMKC — State Bank of India (@TheOfficialSBI) September 11, 2021 పోర్టల్ ద్వారా ఏ ఏ సేవలు పొందొచ్చంటే.. బకాయిల లెక్కింపు షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ స్లిప్ లేదా ఫారం-16ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ లాభం వివరాల సమాచారాన్ని చూడవచ్చు. మీ పెట్టుబడులను తనిఖీ చేయవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక మీ ఫోన్లో పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించి అలర్ట్‌లు వస్తాయి. అలాగే లైఫ్ సర్టిఫికేషన్ సదుపాయం మీ దగ్గరల్లో ఉన్న బ్రాంచీవద్ద లభిస్తుంది. మీ ఈ-మెయిల్ కు పెన్షన్ స్లిప్ వస్తుంది. ఇకపోతే మీ పేరు పోర్టల్‌లో రిజిస్టర్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు support.pensionseva@sbi.co.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. అలాగే 'ఎస్ఎమ్ఎస్ అన్ హ్యాపీ' టైప్ చేసి 8008202020కు ఎస్ఎమ్ఎస్ చేయవచ్చు లేదా 18004253800/1800112211 లేదా 08026599990 కాల్ చేయవచ్చు. -
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
సీనియర్ సిటిజన్లకు శుభవార్త. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ (ఎస్ఈఎస్ఎస్) ను విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ ఇకపై పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనౌన్స్ చేసింది. సాధారణంగా పీపీఎఫ్, ఎస్ఈఎస్ఎస్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు నిర్వహించని అకౌంట్లు, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో అకౌంట్లను క్లోజ్ చేయాలంటే పోస్టాఫీసులకు రావాల్సి వచ్చేది. దీంతో 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు వయస్సు రిత్యా పోస్టాఫీస్‌లకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ఇండియన్ పోస్ట్ సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చింది. ఈ రెండు స్కీమ్ లలో నుంచి మనీ విత్ డ్రా, అకౌంట్లను క్లోజ్ చేయడం చేసుకోవాలంటే అకౌంట్ హోల్డర్స్ పోస్టాఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, వారి బదులు కుటుంబ సభ్యులు ఉంటే సరిపోతుందని వెల్లడించింది. అకౌంట్లను క్లోజ్ చేయడంతో పాటు మనీ విత్ డ్రాల్ వారి కుటుంబ సభ్యులు చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు విత్ డ్రా చేసిన నగదును చెక్కుద్వారా, అకౌంట్ హోల్డర్ భద్రత కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా, బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపింది. పోస్టాఫీస్‌కు వెళ్లకుండా నగదుని ఎలా డ్రా చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ నుండి PPF లేదా SCSS నిధుల్ని సేకరించేలా కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చేందుకు ఈ రూల్స్ పాటించాల్సి ఉంది. ►వయస్సు రిత్యా తాము పోస్టాఫీస్‌కు వెళ్లలేకపోతున్నామని, తనకు బదులు మనీ విత్ డ్రాల్ చేసే హక్కు భార్య లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు హక్కు ఉందని నిర్ధారిస్తూ పోస్ట్ ఆఫీస్‌లో ఫారమ్ SB-12 పై సీనియర్ సిటిజన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ►వీటితో పాటు అకౌంట్ హోల్డర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేందుకు, పాక్షిక నగదు ఉపసంహరణ(partial withdrawal).SB-7ఫారమ్ పై,SB-7B form పై సంతకం చేయాల్సి ఉంటుంది. ►సీనియర్ సిటిజన్ ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు సీనియర్ సిటిజన్ కుటుంబ సభ్యుడి వివరాలను తెలుపుతూ అటాచ్ చేయాల్సి ఉంది. ►నిధులను ఉపసంహరించుకోవడానికి వ్యక్తి పాస్ బుక్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ►లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ముందు అకౌంట్ హోల్డర్ సంతకాల్ని పోస్టాఫీసులో సంబంధిత అధికారులు చెక్ చేస్తారు. అనంతరం నగదు విత్ డ్రా చేసేందుకు అనుమతిస్తారు. -
75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు
న్యూఢిల్లీ: వచ్చే ఆరి్థక సంవత్సరం నుంచి 75 ఏళ్లు నిండిన వృద్ధులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపు డిక్లరేషన్ ఫారమ్ ‘12బీబీఏ’ (వెల్లడి పత్రాలు)ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. 2021–22 ఆరి్థక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం 2022–23) సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపులను పొందే వృద్ధులు ఈ డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకులకు సమరి్పంచాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నిర్ణయం వెలువడింది. -
సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే
ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇంటస్ట్ర్ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రేట్లు తగ్గుతున్నప్పటికీ కొన్ని బ్యాంక్ లు మాత్రం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం ఇంట్రస్ట్ ను చెల్లిస్తున్నట్లు 'బ్యాంక్ బజార్' తన డేటాలో వెల్లడించింది. . ఇప్పుడు మనం ఎఫ్డీపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్స్ కోసం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష రూపాయల మొత్తం మూడు సంవత్సరాలలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ.1,000. డీసీబీ బ్యాంక్, ఎస్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7 శాతం వడ్డీని అందిస్తాయి. రూ .1 లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.23 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ. 10,000. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. ఆర్బిఎల్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు కోసం మూడు సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. -
వృద్ధులకు, పింఛనుదారులకు గుడ్ న్యూస్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు అని ప్రకటించింది. తాజా నిర్ణయంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ భారీ ఉపశమనం లభించింది. సాంకేతికపరిజ్ఞానం లేని వృద్దులు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం వారు బ్యాంకులను సందర్శించాల్సి వచ్చేది. అక్కడ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. "ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. సమీప పోస్టాఫీసులో ఉండే సీఎస్సీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి" అని పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది. తాజా నిర్ణయం వల్ల కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యుటీలు) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ది జీవన్ ప్రమాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందడానికి పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి లేదా పింఛనుదారుడు ఇంతకు ముందు పనిచేసిన అథారిటీ ద్వారా జారీ చేయబడ్డ లైఫ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడుఆ వారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. అలాగే, మీ దగ్గరలో గనుక జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే దాని ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలలో వారు మీ ఆధార్ బయో మెట్రిక్ తీసుకుంటారు. वरिष्ठ नागरिक अब सरलता से नज़दीकी डाकघर के सीएससी काउंटर पर जीवन प्रमाण सेवाओं का लाभ उठा सकते हैं। #AapkaDostIndiaPost Senior citizens can now easily avail the benefit of Jeevan Praman services at the nearest post office CSC counter.#AapkaDostIndiaPost pic.twitter.com/tKrzifc6yc — India Post (@IndiaPostOffice) July 15, 2021 -
ఎఫ్‌డీల వడ్డీరేట్లను సవరించిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. అలాగే సీనియర్ సిటిజెన్ కేర్ ఎఫ్డి పథకం కింది సాధారణ ప్రజల కంటే 75 బీపీఎస్ పాయింట్ల అధిక వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తుంది. మే 21 నుంచి ఈ సవరించిన వడ్డీరేట్లు అమలు చేయనుంది. 7 నుండి 29 రోజుల కాల పరిమితి గల డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీని, 30 నుండి 90 రోజుల డిపాజిట్లపై 3 శాతం వడ్డీని అందిస్తుంది. ఇక 91 రోజుల నుండి 6 నెలల వరకు 3.5 శాతం, 6 నెలల 1 రోజు నుండి 4.4 శాతం, ఒక సంవత్సరం ఎఫ్‌డిలపై 4.9 శాతం వడ్డీని అందిస్తుంది. 2 నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై వడ్డీ 5.15 శాతం, 3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై 5.30 శాతం, 5 -10 సంవత్సరాల డిపాజిట్లు 5.50 శాతం వడ్డీని వర్తింప జేస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్స్ ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ లభిస్తుంది. ఇతర డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను సీనియర్ సిటిజనులకు ఆఫర్ చేస్తోంది. -
ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే..
వయస్సులో ఊన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లేదా భూమి మీద ఇన్వెస్ట్ చేయడం లేదా ఇతరులకు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాం. ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ తట్టుకునే శక్తి అప్పుడు ఉంటుంది. కానీ, 60 ఏళ్లు దాటాక అంతా రిస్క్ తీసుకోలేరు కాబట్టి తమ దగ్గర ఉన్న నగదును ప్రధాన మంత్రి వయ వందన యోజన(పీఎమ్‌వీవీవై) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల కొత్త మొత్తం నగదును పెన్షన్ రూపంలో పొందవచ్చు. 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్దుల కోసమే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వయో వృద్దులకు ఆర్దిక భరోసా దీనిలో చేరాలంటే 60 సంవత్సరాలు పైబడిన వారు అర్హులు. ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా వయో వృదూలకు ఆర్దిక భరోసా లభిస్తుంది. 10ఏళ్ల పాటు ఫింఛనుకు హామీ ఉంటుంది. పీఎమ్‌వీవీవైను లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండేది కానీ ప్రస్తుతం కేంద్రం గడువును మార్చి 2023 వరకు పొడగించింది. ఇందులో చేరాలనుకునే వారు ఆన్లైన్లో ఎల్ఐసీ వెబ్సైట్ ద్వారా గానీ, దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి ఆఫ్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయవచ్చు. పీఎమ్‌వీవీవై నిర్దేశించిన వడ్డీరేటు ప్రకారం 10 ఏళ్లపాటు ఖచ్చితమైన పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం డెత్‌బెనిఫిట్‌ని కూడా అందిస్తుంది. పాలసీ కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారడు జీవించి వుంటే… ఎంత ప్రీమియంకైతే కొన్నామో అంతే మొత్తం పది ఏళ్ల తర్వాత తిరిగి మొత్తం చెల్లిస్తారు. దీంతో పాటు పింఛను చివరి వాయిదాను కూడా పొందుతారు. పాలసీదారుకు/ పింఛనుదారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు. పీఎమ్‌వీవీవై ప్రీమియం ఒక్కసారే ప్రీమియం చెల్లించి దీనిలో చేరాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ, బ్యాంకర్స్ చెక్కు ద్వారా కనీసం రూ.1.5 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షలు నగదు చెల్లించి పాలసీ కొనుగోలు చేయవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన రూ.1.5లక్షల నుంచి రూ. 15లక్షల నగదుపై ప్రతి నెల నెలకు రూ.1000 నుంచి దాదాపు రూ.10వేల దాకా వడ్డీని అందిస్తారు. ప్రస్తుతం వడ్డీ 7.4శాతంగా నిర్ణయించారు. నెల నెలా వద్దనుకుంటే మూడు మాసాలకు, ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి పింఛను అందుకునే వెసులుబాటు ఉంది. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్(ఈసీఎస్) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే పింఛను జమ అవుతుంది. చదవండి: ప్రతి రోజు రూ.7 పొదుపుతో.. నెలకు రూ.5 వేల పెన్షన్ -
వృద్దుల కోసం ఉత్తమమైన పొదుపు పథకాలు!
బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీతో హామినిచ్చే కొన్ని పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొంత మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెల లేదా ఏడాదికి వడ్డీ రూపంలో నగదు లభిస్తుంది. ఈ వయస్సులో వారికి ఇలాంటి పథకాలు ఆర్థిక చేయూతను ఇస్తాయి. ఎస్బీఐతో సహా కొన్ని అగ్ర బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 6.2 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే, బ్యాంక్‌ల కన్నా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అధిక వడ్డీని అందిస్తాయి. సీనియర్ సిటిజన్లుకు ఆర్థిక చేయూతను ఇచ్చే కొన్ని పెట్టుబడి పథకాల గురుంచి తెలుసుకుందాం.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్( ఎస్సిఎస్ఎస్ ) అనేది ప్రభుత్వం నడుపుతున్న చిన్న పొదుపు పథకం. దీనిలో చేరిన వారికీ ప్రస్తుతం సంవత్సరానికి 7.40 శాతం అందిస్తుంది. ఎస్సీఎస్ఎస్కు ఐదేళ్ల కాలపరిమితి ఉంది. దీనిని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. అయితే, ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడులు పెట్టడానికి గరిష్టపరిమితి రూ.15 లక్షలు. త్రైమాసిక ప్రాతిపదికన అధిక స్థిర రాబడి మరియు సాధారణ ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఎస్సిఎస్ఎస్ మంచి ఆదాయ వనరు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సి కింద ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడులు ద్వారా వచ్చిన నగదుపై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డి) పథకం చాలా మంది సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ ఒక మంచి ఎంపిక. బ్యాంక్ ఎఫ్‌డిలు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వడ్డీ రేటు చెల్లింపులను అందిస్తాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిపాజిట్లపై 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రత్యేక ఎఫ్‌డిలు 30 జూన్ 2021 వరకు అమలులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 6 శాతం నుంచి 7 శాతంపైన వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తున్నాయి. ప్రధాన్ మంత్రి వయా వందన యోజన(పీఎంవీవీవై) పీఎంవీవీవై(ప్రధాన్ మంత్రి వయా వందన యోజన) అనేది సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. పిఎమ్‌వివివై పథకం 2023 మార్చి 31 వరకు పొడిగించబడింది. ప్రస్తుతం, ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన నగదుపై ప్రతి నెలకు సంవత్సరానికి 7.40 శాతం చొప్పున పెన్షన్‌ను అందిస్తోంది. కాల పరిమితి 10 సంవత్సరాలు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఆదాయ పథకం(పీఓఎంఐఎస్) పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్) కింద 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే గడువు కాలం ముగిసే వరకు వడ్డీ రేటు అలాగే ఉంటుంది. ప్రస్తుతం, జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో వడ్డీ రేటు సంవత్సరానికి 6.6 శాతంగా ఉంది. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. వృద్ధులకు కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ 'ఎస్బీఐ వీకేర్' రిటైల్ టర్మ్ డిపాజిట్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధుల కోసం ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను 2020 మేలో ఎస్బీఐ తీసుకొచ్చింది. మొదట సెప్టెంబర్ వరకు విధించిన గడువును డిసెంబర్ వరకు ఓసారి, 2021 మార్చి 31 వరకు మరోసారి పొడిగించింది. ఈ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది. కాబట్టి సీనియర్ సిటిజన్లు 'ఎస్బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. 'ఎస్బీఐ వీకేర్' అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వృద్ధులకు వేరుగా ఉంటాయి. దీనిలో చేరితే సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 80 బేసిస్ పాయింట్స్ అంటే 0.8 శాతం వడ్డీ ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ ప్రజలు ఐదేళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5.40 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల కాలానికి డిపాజిట్ మొత్తంపై 6.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో చేరాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే 0.30 శాతం వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండవు. చదవండి: శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు -
తెలుగు వాళ్లూ కలిసి పరిగెత్తారు
మొన్నటి 67వ జాతీయ అవార్డుల హడావిడిలో ఒక బక్కచిక్కిన ముసలమ్మ, ఇద్దరు కరీంనగర్ కుర్రాళ్లు పత్రికలలో స్థలాభావం వల్ల కనపడకుండా పోయారు. ఆ అవార్డులలో వీరికీ స్థానం ఉంది. భర్త గుండె పరీక్షల కోసం 67 ఏళ్ల వయసులో మహరాష్ట్రలో మారథాన్ చేసిన ‘లతా భగవాన్ కరే’ జీవితాన్ని ఆమెతోనే సినిమా తీశారు దర్శకుడు నవీన్ దేశబోయిన, నిర్మాత అర్రబోతు కృష్ణ. 2020లో మరాఠీలో రిలీజ్ చేస్తే ఇప్పుడు దానికి జాతీయ ఉత్తమ చిత్రం (ప్రత్యేక ప్రస్తావన) దక్కింది. ఆమె విజయమూ వారి విజయమూ మనకు బాగా కనపడాలి... వినపడాలి. ‘నా దృష్టిలో ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అనేవి లేవు. కథను నిజాయితీగా చెప్పే సినిమాయే ఉంది. కమర్షియల్‌గా కొలతలు వేసుకుని సినిమాలు తీస్తే అవన్నీ హిట్ అవ్వాలి కదా. నూటికి ఒకటో రెండో మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయి?’ అంటారు దర్శకుడు నవీన్ దేశబోయిన. ఈ కరీంనగర్ సృజనశీలి ఇప్పుడు జాతీయస్థాయిలో తన ప్రతిభ చాటుకున్నాడు. మొన్న ప్రకటితమైన జాతీయ సినిమా అవార్డులలో ఇతను దర్శకత్వం వహించిన ‘లతా భగవాన్ కారే’ మరాఠీ సినిమాకు ఉత్తమ చిత్రం (స్పెషల్ మెన్షన్) అవార్డు దక్కింది. నిజానికి ఇది ఒక తెలుగువాడికి దక్కిన గౌరవం. దాంతో పాటు ఒక సామాన్యురాలి పట్టుదలకు దక్కిన గౌరవం కూడా. ఎవరా సామాన్యురాలు? అంత అసమాన్యమైన పని ఏమి చేసింది? 2013లో పరుగు లతా కారేది మహారాష్ట్రలోని బారామతి. ఆమె భర్త భగవాన్ సెక్యూరిటీ గార్డు. వారికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురి పెళ్లిళ్లు చేసే సరికి వారి దగ్గర ఉన్న చివరి రూపాయి అయిపోయింది. ఆ సమయంలోనే భగవాన్‌కు గుండె జబ్బు పట్టుకుంది. డాక్టర్లు స్కానింగ్‌లు ఇతర పరీక్షలు చేయాలి అందుకు 5 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆ సమయానికి లతా కారే వయసు 60 సంవత్సరాలు. ఏదో గుట్టుగా బతికిందే తప్ప ఒకరి దగ్గర చేయి చాపింది లేదు. కాని భర్త కోసం ప్రయత్నాలు చేస్తే ఏమీ సాయం దక్కలేదు. ఆ సమయంలోనే ఒక కాలేజీ కుర్రాడి ద్వారా బారామతిలో ‘సీనియర్ సిటిజెన్స్ మారథాన్’ జరగనుందని తెలిసింది. అందులో గెలిచిన వారికి 5 వేల రూపాయలు ఇస్తారని కూడా తెలిసింది. భర్త ప్రాణాల కోసం ఆ 5 వేల రూపాయలు గెలవాలని నిశ్చయించుకుందామె. 9 గజాల చీరలో పోటీ సంగతి తెలిసిన నాటి నుంచి లతా కారే తెల్లవారు జామునే లేచి ఊళ్లో ఎవరూ చూడకుండా పరిగెత్తడం మొదలెట్టింది. చాలాసార్లు కింద పడింది. అయినా సరే పట్టుదలగా సాధన చేసింది. పోటీ రోజు స్లిప్పర్లు వేసుకుని 9 గజాల చీర కట్టుకుని వచ్చిన ఆమెను అందరూ వింతగా చూశారు. మిగిలిన వారు ట్రాక్సూట్లలో, షూలలో ఉండేసరికి ఆమె కూడా కంగారు పడింది. నిర్వాహకులు మొదట అభ్యంతరం చెప్పినా తర్వాత ఆమె పరిస్థితి తెలుసుకుని అనుమతి ఇచ్చారు. 3 కిలోమీటర్ల మారథాన్ అది. అందరూ పరిగెత్తడం మొదలెట్టారు. లతా కారే కూడా పరిగెత్తింది. వెంటనే ఒక స్లిప్పర్ తెగిపోయింది. ఆమె రెండో స్లిప్పర్ కూడా వదిలిపెట్టి పరుగు అందుకుంది. కొద్ది సేపటిలోనే పోటీదారులంతా వెనుకపడ్డారు. జనం కరతాళధ్వనుల మధ్య ఆమె గెలుపు సాధించింది. అయితే ఆమె ఏ కారణం చేత పరిగెత్తిందో తెలుసున్న జనం పెద్ద ఎత్తున సాయం చేశారు. సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకున్నాయి. భర్త ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ఇప్పుడు నిశ్చింతగా ఉంది. ఆ తర్వాత 2014లో, 2016లో కూడా ఆమె మారథాన్లు గెలిచింది. సినిమాగా ఈ వార్తను టీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న నవీన్ దేశబోయిన చూసి 2017లో ఆమెను సంప్రదించి తన తొలిసినిమాగా ఆమె కథను 2019లో తీశారు. ఆమె పాత్రను ఆమె చేతే పోషింప చేయడానికి ఆమెను ఒప్పించారు. మరాఠీలో తయారైన ఈ సినిమా ‘లతా భగవాన్ కారే’ పేరుతో 2020 జనవరిలో విడుదల అయ్యింది. కారే జీవితాన్ని సినిమాగా తీసేందుకు నవీన్ మిత్రుడు కరీంనగర్ వాసి అర్రబోతు కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తెలుగువారి ప్రయత్నం లతా కారేను వెండి తెర మీద శాశ్వతం చేసింది. ఇప్పుడు జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ తెలంగాణ మిత్రులు ఇద్దరూ మరాఠి, తెలుగు భాషల్లో లతా కారే జీవితాన్ని సీక్వెల్‌గా తీస్తున్నారు. ఆ సినిమా కూడా ఇలానే ప్రశంసలు పొందాలని ఆశిద్దాం. -
సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా ఆఫర్
ముంబై, సాక్షి: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్‌ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా 60 ఏళ్లు లేదా అంతకు పైబడిన వయసుగలవారికి టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది ఎకానమీ క్లాస్‌కు మాత్రమే వర్తించనుంది. బేస్ ధరలో 50 శాతం చెల్లించడం ద్వారా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని పొందగోరే వ్యక్తులు వయసును నిర్ధరించే వోటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లేదా ఏ ఇతర ఐడెంటిటీ కార్డ్‌ను కలిగి ఉండాలి. దేశంలో ఏ ప్రాంతానికైనా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా వర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. ప్రయాణ సమయానికి(డిపార్చర్‌కు) కనీసం వారం రోజుల ముందువరకూ ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు వీలుంటుందని వెల్లడించాయి. పిల్లలకూ రెండేళ్ల వయసులోపు పిల్లలకు సైతం టికెట్ ధరలో తగ్గింపు అమలుకానున్నట్లు ఎయిర్ ఇండియ వర్గాలు వెల్లడించాయి. అయితే ఒక బిడ్డకు మాత్రమే అదికూడా రూ. 1,250 కూపన్, పన్నులు వర్తిస్తాయని తెలియజేశాయి. ఎయిర్ ఇండియా నిర్వాహక విమానాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నాయి. మిగిలిన పూర్తి వివరాలకు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించమని తెలియజేశాయి. కాగా.. బేస్ ధరకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని, ఫ్యూయల్ సర్‌చార్జీ, సర్వీస్ ఫీజు తదితరాలలో తగ్గింపు లభించకపోవచ్చని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. -
సీనియర్ సిటిజన్లను కాపాడిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : వరదల్లో చిక్కుకున్న వృద్ధుల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు తెగువ చూపించారు. ప్రాణాలకు తెగించి మరీ వారికి సహాయం చేశారు. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివేకానంద నగర్లోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఓ ఇద్దరు వృద్ధులు వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని తమ ఇంట్లో చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లలేక, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ( హైదరాబాద్ వరదలు: వైరల్ వీడియోలు ) ఈ విషయం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు వారిని రక్షించటానికి రంగంలోకి దిగారు. ఎస్ఐ రవికుమార్ జేసీబీ సహాయంతో ఇంటి పైకి ఎక్కి వాళ్లిద్దర్ని కిందకు తీసుకువచ్చాడు. అనంతరం అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. వృద్ధలను కాపాడటంలో చొరవ చూపిన ఇన్స్పెక్టర్ సీతారాం, ఎస్ఐ రవి కుమార్‌లను జనం కొనియాడుతున్నారు. -
ఇంటి నుంచి ఓటేయాలంటే..
న్యూఢిల్లీ: 80 సంవత్సరాలు దాటిన వారు, దివ్యాంగులు ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు వేసేందుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ ద్వారా సూచించింది. ఇందులో భాగంగా ఇంటి నుంచి ఓటు వేసే వారికి బూతు స్థాయి అధికారి 12డీ దరఖాస్తు అందిస్తారు. నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోగా దాన్ని నింపాలి. నింపిన దరఖాస్తును బీఎల్ఓ బూతు స్థాయి అధికారి తీసుకొని రిటర్నింగ్ అధికారికి అందిస్తారు. ఈ ప్రక్రియ అన్ని రకాల సాధారణ ఎన్నికలకు, ఉపఎన్నికలకు, లోక్ సభ సీటుకు జరగనున్న ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. ఈ నెల 28 నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ‘పీడబ్ల్యూడీ’ యాప్‌ను ఎన్నికల సంఘం తయారు చేసింది. 80 సంవత్సరాలు దాటిన వారు, దివ్యాంగులు ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అక్టోబర్ 28 నుంచి జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీంతో పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. చదవండి: అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చు. ఇందుకోసం వైద్య బీమా తీసుకోవడంతోపాటు ఇతరత్రా చర్యలు కూడా అవసరమేనని సూచించే కథనమే ఇది. ఆరోగ్య అత్యవసర నిధి 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు పాలసీలు అన్నింటిలోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఒక్కసారి నిధిని సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేసుకోవడం ద్వారా ప్రీమియం భారం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం పాటు కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానివేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన కవరేజీ.. వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికమవుతుంది. ‘‘మెట్రో నగరంలోనా లేక చిన్న పట్టణంలో నివసిస్తున్నారా?, మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. వీటి ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. కఠిన నిబంధనలు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు పాలసీల్లో రెండు రకాల వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఒకటి. పాలసీ తీసుకున్న అనంతరం రెండు నుంచి నాలుగేళ్లు గడిచిన తర్వాతే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్న అనంతరం రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాలి. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు పాలసీల్లో ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం చేస్తాయి. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే ఆ మొత్తాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. ఈ పరిమితులతో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ► 18 శాతం తల్లిదండ్రులకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ► 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతులు మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ► 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. కొన్ని పాలసీలను చూస్తే... బీమా కంపెనీ ప్లాన్ పేరు వార్షిక ప్రీమియం రెలిగేర్ హెల్త్ కేర్ సీనియర్ రూ.39,374 స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్ రెడ్‌కార్పెట్ రూ.43,135 ఆదిత్యబిర్లాహెల్త్ యాక్టివ్కేర్స్టాండర్డ్ రూ.55,598 అపోలోమ్యునిక్హెల్త్ ఆప్టిమారీస్టోర్ రూ.61,312 హెడీఎఫ్సీ ఎర్గో హెల్త్సురక్షా గోల్డ్స్మార్ట్ రూ.65,785 నోట్: మెట్రోలో నివసించే 63 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల ఆయన జీవిత భాగస్వామికి రూ.10 లక్షల కవరేజీ కోసం ప్రీమియం వివరాలు ఇవి.. కో పేమెంట్ ఎంత..? పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కో పేమెంట్ ఆప్షన్ ఉంటోంది. అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30% మధ్య ఉండొచ్చు. -
కోదాడలో సీనియర్ సిటిజన్లకు పరీక్షలు చేయండి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో కేరళ రెవెన్యూ కాలనీలోని సీనియర్ సిటిజన్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో సి.విద్యాధర భట్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఓరల్ టెస్టింగ్ ల్యాబ్స్’ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ఈ అంశంపై ఆదేశాలివ్వాలంటూ ఆర్టీఐ, సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదును విచారించి పై విధంగా స్పందించారు. కోవిడ్–19 పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి స్పందించవచ్చునని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు కోరినట్టుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. -
పెన్షన్ల పండుగ
-
సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్
ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న పెన్షన్ పథకమే ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై). ఇందులో చేసిన పెట్టుబడులపై పదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ తీసుకున్న వారికి.. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న మెరుగైన పథకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలుత ఏడాది పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఈ గడువును 2020 మార్చి వరకు పొడిగించారు. తాజాగా దీనిని మరో మూడేళ్ల పాటు 2023 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కనుక ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వారికి మరో మూడేళ్ల పాటు ఇది అందుబాటులో ఉన్నట్టే. 60 ఏళ్లు, అంతకుపైన వయసున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అర్హులే. ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధి 10 ఏళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు. గడువు తీరిన తర్వాత పెట్టుబడి మొత్తం(చార్జీలు పోను) తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో మరణం చోటు చేసుకుంటే నామినికీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి కానీ, లేదా ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్ నుంచి కానీ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెన్షన్ చెల్లింపులు ఇలా.. ఇన్వెస్ట్ చేసి, ప్రతీ నెలా నిర్ణీత మొత్తం పెన్షన్‌గా అందుకోవాలని ఆశించే వారి ముందున్న స్థిరాదాయ పథకాల్లో.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌తోపాటు పీఎంవీవీవై కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై 2020–21 ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000. గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.10,000. త్రైమాసికం వారీగా అయితే కనీసం రూ.3,000, గరిష్టంగా రూ.30,000, ఆరు నెలలకోసారి అయితే కనీసం రూ.6,000, గరిష్టంగా రూ.60,000.. వార్షికంగా అయితే కనీసం రూ.12,000, గరిష్టంగా రూ.1,20,000 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది. నెలవారీగా కనీసం రూ.1,000 పెన్షన్ తీసుకోవాలని భావిస్తే చేయాల్సిన పెట్టుబడి రూ.1,62,162. వార్షికంగా ఒకే విడత రూ.12,000 పెన్షన్ కోసం రూ.1,56,658ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.15లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు. రాబడులు.. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం పీఎంవీవీవైపైనా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 8 శాతం రాబడి రేటు ఉండగా, దీనికి 7.40 శాతానికి కేంద్రం తగ్గించింది. పైగా 2020–21 సంవత్సరానికే ఈ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో సంబంధిత సంవత్సరానికి రేటును నిర్ణయిస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే పీఎంవీవీవై పథకం రేట్లను కూడా సవరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడం గమనార్హం. పైగా గరిష్ట రేటు 7.75 శాతానికే పరిమితం చేశారు. ఈ ఏడాది మార్చి వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.6 శాతం వడ్డీ రేటుతో అత్యంత ఆకర్షణీయమైన సాధనంగా ఉండేది. కానీ, ఇటీవలే కేంద్రం ఈ రేటును 7.4 శాతానికి తగ్గించేసింది. దీనికి తగినట్టుగానే పీఎంవీవీవై పథకంలో రేటును గతంలో ఉన్న 8 శాతం నుంచి 7.4 శాతానికి సవరించినట్టు అర్థం చేసుకోవాలి. దీంతో రాబడుల పరంగా రెండు పథకాల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. పీఎంవీవీవైతో పోలిస్తే తక్కువ కాల వ్యవధి ఉండడం ఇందులోని సౌలభ్యం. పన్ను బాధ్యతలు.. పీఎంవీవీవైలో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో అయినా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయినా అందుకునే రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎవరికి వారే తమ వ్యక్తిగత ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే అందుకునే ఆదాయం మొత్తం రూ.50వేలు మించకపోతే సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు పెట్టుబడుల్లో రూ.1.50 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ రెండింటిలో ఏ పథకంలో అయినా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలుగానే ఉంది. కనుక ఒక పథకంలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, ఇంకా అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రెండో పథకాన్ని ఎంచుకోవచ్చు. ముందుగా వైదొలగాలంటే.. పీఎంవీవీవై పదేళ్ల కాల వ్యవధి పథకం. అసాధారణ పరిస్థితుల్లో పదేళ్లకు ముందుగానే పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు.. ప్రాణాంతక, తీవ్ర వ్యాధుల్లో చికిత్సల కోసం పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పాలసీదారు, ఆమె లేదా అతని జీవిత భాగస్వామి చికిత్సల ఖర్చుల కోసం ఇం దుకు అనుమతిస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 98% సరెండర్ వ్యా ల్యూగా లభిస్తుంది. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి మొత్తం విలువలో 75% వరకు రుణ అర్హత ఉంటుంది. ఎల్ఐసీయే రుణ సదుపాయం కల్పిస్తుంది. ఇచ్చిన రుణానికి చెల్లించాల్సిన మొ త్తాన్ని పెన్షన్ చెల్లింపుల నుంచి మినహాయించుకుంటుంది. గడువు తీరే వరకు ఆ రుణం బకాయిలు మిగిలి ఉంటే.. చివరిగా చేసే చెల్లిం పుల మొత్తం నుంచి ఆ మేరకు మినహాయించుకోవడం జరుగుతుంది. లుకప్ పీరియడ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన వారు తమకు పథకం వివరాలు నచ్చకపోతే 15 రోజుల్లోపు (ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసిన వారికి 30 రోజులు) వెనక్కిచ్చేయవచ్చు. దీన్నే లుకప్ పీరియడ్‌గా పేర్కొంటారు. స్టాంప్ చార్జీల మేరకు నష్టపోవాల్సి వస్తుంది. చార్జీలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో పెట్టుబడులపై తొలి ఏడాది 0.50 శాతాన్ని వ్యయాల కింద కోసుకునేందుకు వీలుంది. రెండో ఏడాది నుంచి తదుపరి తొమ్మిదేళ్లు ఈ చార్జీ 0.3 శాతంగా అమలవుతుంది. అయితే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఈ విధమైన చార్జీలు ఏవీ ఉండవు. కనుక రెండింటిలో ఒకటే కోరుకునేట్టు అయితే.. మూడు నెలలకు ఓసారి పెన్షన్ వచ్చినా ఇబ్బంది లేదనుకునే వారికి.. పీఎంవీవీవైతో పోలిస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పూర్తి భద్రత.. ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులకు పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. -
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ శుభవార్త
సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు వృద్ధులకు శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్ల కోసం 'ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ' అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాన్ని గురువారం ప్రవేశపెట్టింది.ఈ డిపాజిట్లపై అదనంగా 0.80 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే సీనియర్ సిటిజన్లకు చెల్లిస్తున్నది 0.50 శాతం అధికం మాత్రమే. 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు వార్షికంగా 6.55 శాతం వడ్డీ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ పథకం సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే వృద్ధులకు ప్రధాన ఆదాయవనరని తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారిమీద ఉన్న గౌరవంతో కొత్త పథకం ద్వారా వారికి అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నామని ఐసీఐసీఐ లయబిలిటీస్ గ్రూప్ అధిపతి ప్రణవ్ మిశ్రా తెలిపారు. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) సీనియర్ సిటిజన్స్ ప్రత్యేక ఎఫ్డి పథకం ఐదు విషయాలు ఈ పథకం 2020 మే 20 నుండి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో వుంటుంది. ఇది ఒకే డిపాజిట్ మొత్తానికి , కాలానికి సాధారణ ప్రజలకు వర్తించే దానికంటే 80 బేసిస్ పాయింట్లను ఎక్కువ అందిస్తుంది. రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు కొత్త ఎఫ్‌డీల ద్వారా పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. లేదా పాత ఎఫ్‌డిలను పునరుద్ధరించుకోవచ్చు. రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు రూ. 2 కోట్లు లోపు ఎఫ్డీలపై 6.55 శాతం అధిక వడ్డీ రేటును 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో పొందుతారు. ప్రిన్సిపల్ మొత్తం, లేదా అక్రూడ్ వడ్డీపై 90 శాతం రుణాన్ని కస్టమర్లు పొందవచ్చు. ఎఫ్డీ మీద క్రెడిట్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు చెల్లించే వడ్డీని పెంచిన విషయం తెలిసిందే. మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్ -
ఎస్బీఐ గుడ్ న్యూస్, వారికి ప్రత్యేక పథకం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు ను తగ్గించింది. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది. అన్ని రకాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా సవరింపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి దిగి వచ్చింది. ఈ రేట్లు మే 10వ తేదీనుంచి అమల్లోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది. అలాగే మూడేళ్ల కాల పరిమితిగల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లను మార్చి 12వ తేదీనుంచి అమలు చేయనుంది. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో 'ఎస్బీఐ fవీకేర్ డిపాజిట్' పథకాన్ని లాంచ్ చేసింది. 5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వ్యవధిలో ఈ డిపాజిట్లను అందుబాటులో ఉంచనుంది. వీటిపై అదనంగా 30 బీపీఎస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని అందించనుంది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అందుబాటులో వుంటుందని ఎస్బీఐ తెలిపింది. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్జీ కెమ్ స్పందన) -
ముందుగానే 3 నెలల పింఛను
న్యూఢిల్లీ: కరోనా ‘లాక్డౌన్’ నేపథ్యంలో వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ సామాజిక చేయూత పథకం(ఎన్ఎస్ఏపీ) కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోని సుమారు 2.98 కోట్ల మంది పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛను పంపిణీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారంలో మూడు నెలల పింఛను మొత్తాన్ని ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఎన్ఎస్ఏపీ కింద 60–79 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. 79 ఏళ్ల వ రకు ఉన్న దివ్యాంగులకైతే రూ.300, 80 ఆపై వ యస్సు వారికి రూ.500, వితంతువులు 40–79 ఏళ్ల వారికి రూ.300, 80 ఆపై వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. దీంతోపాటు కరోనా ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదనంగా రెండు విడతల్లో కలిపి రూ.1,000 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకు వైద్య బీమాతో పాటు ఇతరత్రా తీసుకోతగిన చర్యలు సూచించే కథనమే ఇది. 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు అన్ని పాలసీల్లోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఇంటి నుంచే నర్సింగ్, చికిత్సల సేవలను పొందాల్సి వస్తే అయ్యే వ్యయాలు ఎక్కువగానే ఉంటాయి. అత్యవసర నిధి ఉంటే దాన్నుంచి వీటికి చెల్లింపులు చేసుకోవచ్చు. ఒక్కసారి అత్యవసర నిధి సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెద్దలకు చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేస్తే ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం హెడ్ అమిత్ ఛబ్రా పేర్కొన్నారు. అవసరమైనంత కవరేజీ తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం ఎంతో అవసరం. ‘‘మీరు నివసించే ప్రాంతం, జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. ఆలస్యం చేయవద్దు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. కోపేమెంట్ ఎంత..? సీనియర్ సిటిజన్ పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కోపేమెంట్ ఆప్షన్ ఉంటోంది. కోపేమెంట్ అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30 శాతం మధ్య ఉండొచ్చు. క్లెయిమ్ మొత్తంలో ఈ మేరకు పాలసీదారులు భరించగా, మిగిలినది బీమా కంపెనీలు చెల్లిస్తాయి. కనుక కోపేమెంట్ క్లాజ్ లేని పాలసీ తీసుకోవాలి. లేదంటే పాలసీదారుని వాటా తక్కువగా ఉండేదానిని ఎంచుకోవడం మంచిది. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం కావొచ్చు. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే దాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. వీటితో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందుగానే వీటన్నింటినీ తెలుసుకోవాలి. వేచి ఉండే కాలం సీనియర్ సిటిజన్ పాలసీల్లో రెండు రకాల వేచి ఉండే కాలావధి (వెయిటింగ్ పీరియడ్) ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు వర్తించేది ఒకటి. పాలసీ తీసుకున్నాకా రెండు నుంచి నాలుగేళ్లు Výæడిచాకే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర (కొంత కాలానికి వ్యాప్తి చెందేవి) చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్నాక రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ నిబంధనలు ఉంటున్నాయి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ♦ 18% తల్లిదండ్రులకే హెల్త్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ♦ 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతుల మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ♦ 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. -
వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
సాక్షి, విజయనగరం: వయో వృద్ధుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా ఏరియా ఆసుపత్రిలో వృద్ధుల వార్డును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలుగా చేయూతనందించే దిశగా చర్యలను చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ఇస్తున్న పింఛను మొత్తాలను పెంచడంతో పాటుగా.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలను అందించనున్నామని వెల్లడించారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వార్డులో వయో వృద్ధులకు ప్రత్యేకంగా పడకలను కేటాయించి అవసరమైన చికిత్సలను అందిస్తామని తెలిపారు. సేవలను సీనియర్ సిటిజన్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, అధికారులు పాల్గొన్నారు -
‘సీనియర్స్’ కోసం..
రోబో నడిపిస్తుంది.. ఒకప్పుడు వృద్ధులకు ఊతకర్రలే సాయంగా ఉండేవి. ఇప్పుడు వృద్ధుల కోసం ఆధునిక టెక్నాలజీతో ఒక రోబోటిక్ కర్ర అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన భారతీయుడు సునీల్ అగర్వాల్ నేతృత్వం లోని ఓ బృందం ఈ రోబో కర్ర తయారు చేసింది. ఈ రోబోటిక్ కేన్ ద్వారా వృద్ధులు సునాయాసంగా నడక సాగించే వీలు కలుగుతుంది. ఈ కేన్‌ను పట్టుకుని నడిస్తే.. వారు ఎలా అడుగులు వేస్తున్నారు..ఒక్కో అడుగు వేసేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు.. వంటి విషయాలను దీనిలోని సెన్సర్లు అంచనా వేస్తాయి. తర్వాత దానంతట అదే ఆ కర్ర కదులుతుంది.మొబైల్ రోబోకు ఇది అనుసంధానంగా పనిచేస్తుందని అగర్వాల్ పేర్కొన్నారు. దీన్ని పట్టుకుని నడిస్తే పక్కన ఓ వ్యక్తి ఉండి వారిని నడిపించినట్లే ఉంటుందని చెప్పారు. ఈ యాప్ చెప్పేస్తుంది.. ఒంటరిగా ఉండే వృద్ధులను అనుక్షణం గమనిస్తుండాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. దీని కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులు ఛ్చిట్ఛ4u అనే మొబైల్ యాప్ రూపొందించారు. వృద్ధులకు ఇది సంరక్షకురాలిగా పనిచేస్తుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇంట్లో ఉన్న వృద్ధులు, వారి పిల్లల ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేస్తే చాలు చాలా పనులు చేసేస్తుంది. దీని ద్వారా చాటింగ్, కాల్స్ చేయొచ్చు. క్యాబ్‌లు బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో ఒకసారి ఫీడ్ చేస్తే చాలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది. వారు ఎప్పుడైనా కిందపడితే వెంటనే దానికి అనుసంధానం చేసిన వారి నంబర్‌కు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. వృద్ధులు ఉన్న లొకేషన్ షేర్ చేస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఇది పనిచేసేలా డిజైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారు 5.8 కోట్లు. అంటే ప్రతి సెకనుకు ఇద్దరు వ్యక్తులకు 60 ఏళ్లు నిండుతున్నాయి. చైనా తర్వాత అత్యధిక మంది వృద్ధులు ఉన్న దేశం మనదే. 2050 నాటికి ప్రపంచంలో 15 ఏళ్ల పిల్లలకన్నా వృద్ధులే అధికంగా ఉంటారట. మన దేశంలో 2026 నాటికి వృద్ధుల జనాభా 17.3 కోట్లకు పెరగనుంది. భారత్‌లో కేరళలో వయోధికులు 12.6 శాతం మంది ఉన్నారు. గోవాలో 11.2 శాతం, తమిళనాడులో 10.4 శాతం, పంజాబ్‌లో 10.3 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 10.2 శాతం ఉన్నారు. అతి తక్కువ మంది వృద్ధులున్న రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ 4.6 శాతం మంది ఉన్నారు. మేఘాలయలో 4.7 శాతం. నాగాలాండ్‌లో 5.2 శాతం. మిజోరంలో 6.3 శాతం.. సిక్కింలో 6.7 శాతం మంది వృద్ధులు ఉన్నారు. (నేడు సీనియర్ సిటిజన్ డే) -
పెద్దలకూ హెల్త్ పాలసీ
చెన్నైకి చెందిన సుమీత్ (60) ఇటీవలే పదవీ విరమణ చేశాడు. ప్రైవేటు రంగంలో పనిచేసినంత కాలం సంస్థ తరఫున గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అతడి కుటుంబ సభ్యుల అవసరాలను ఆదుకుంది. కానీ, ఉద్యోగానికి విరామం తీసుకోవడంతో ఇకపై తనకు హెల్త్ కవరేజీ ఉండదన్న విషయం తెలుసుకుని అతడు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. పోనీ, ఈ వయసులో హెల్త్ పాలసీ తీసుకుందామనుకున్నా... అతి సాధ్యమేనా? అన్నది అతడి సందేహం. అప్పటికే సుమీత్కు అధిక రక్తపోటు సమస్య కూడా ఉంది. ఈ పరిస్థితి సుమీత్ ఒక్కడికే కాదు... ఎంతో మందికి ఎదురయ్యేదే. కానీ, పరిస్థితులు మారాయి. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ పాలసీలను నేడు ఎన్నో కంపెనీలు అందిస్తున్నాయి. కాకపోతే, ఏ పాలసీ తీసుకోవాలన్నది తేల్చుకోవాలంటే, వాటికి సంబంధించి అన్ని అంశాలనూ తెలుసుకోవాలి. వాటిని తెలియజేసే ఆరోగ్య కథనమే ఇది. ఖరీదైనా సరే... సాధారణ పాలసీలు అయితే వయసురీత్యా ప్రవేశానికి పరిమితులు ఉంటున్నాయి. ఈ పాలసీలను 60–65 ఏళ్ల తర్వాత తీసుకోవడం కష్టమే. అదే సీనియర్ సిటిజన్ పాలసీలు అయితే, ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. ‘‘మా సీనియర్ సిటిజన్ పాలసీ చాలా పెద్ద వయసులో అంటే 65–74 మధ్యనున్న వారు కూడా తీసుకోవచ్చు’’ అని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ జాయింట్ ఎండీ ఎస్.ప్రకాష్ తెలిపారు. అయితే, పెద్ద వయసులో లభించే హెల్త్ పాలసీల ప్రీమియం చౌకగా మాత్రం ఉండదు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ‘‘కాస్త చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం లభిస్తుంది. ముందస్తు వ్యాధుల కవరేజీ కోసం వారు వేచి ఉండాల్సిన ఇబ్బంది తప్పుతుంది’’ అని జేఎల్టీ ఇండిపెండెంట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లీడ్ పార్ట్నర్ అర్హత్గోటడ్కే తెలిపారు. అయితే, ప్రీమియం ఎక్కువైనా కానీ సీనియర్ సిటిజన్లు అనారోగ్యం కారణంగా ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండేందుకు హెల్త్ పాలసీ తీసుకోడమే సరైనదన్నది నిపుణులు ఇచ్చే సలహా. ప్రీమియం రూ.25,000– 30,000 ఖరీదుగా భావించొచ్చు. అత్యవసర నిధి కలిగి ఉన్న వారు సైతం హెల్త్ పాలసీ తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఏదైనా పెద్ద వ్యాధి బారిన పడితే మీ మొత్తం నిధి అంతా కరిగిపోవచ్చు. అందువల్ల పెద్దలకు పాలసీనే ఎంతో శ్రేయస్కరమని నిపుణుల సూచన. అపోహలు అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు హెల్త్ పాలసీలు లభించడం కష్టమని చాలా మంది భావిస్తుంటారు. కష్టమైనా కానీ, హెల్త్ కవరేజీ పొందడం అసాధ్యమేమీ కాదని బ్యాంక్ బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ చందాని అన్నారు. వేతన జీవుల్లో ఎక్కువ మంది సాధారణంగా తమ వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకోరు. గ్రూపు హెల్త్ పాలసీలో వారికి కూడా కవరేజీ ఉండడం వల్లే అలా చేస్తుంటారు. ‘‘కార్పొరేట్ హెల్త్ కవరేజీ రూ.2–5 లక్షలకు మించదు. కనుక ఇది సరిపోదు. ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా లేక ఉద్యోగం వీడి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏం చేస్తారు?’’ అని ప్రశ్నించారు బత్వాల్. అలాగే, వృద్ధులు తమ దృష్టికి వచ్చిన హెల్త్‌పాలసీ తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. అయితే, అలా చేయడానికి ముందు అందులో ఉన్న ప్రయోజనాలు, మినహాయింపులు అన్నింటినీ తెలుసుకోవాలన్నది నిపుణుల సూచన. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయని, అన్నింటినీ పరిశీలించిన తర్వాతే తమకు అనువైన పాలసీని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పెద్ద వయసులో తీసుకునే పాలసీలో ముఖ్యంగా చూడాల్సినది బీమా కవరేజీ మొత్తం పెంచుకోవడానికి అవకాశం ఉందా? అని. పైలట్ పాలసీ కాకుండా పూర్తి స్థాయి పాలసీ తీసుకోవాలి. అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి ఎంత కాలం వేచి ఉండాలన్నది కూడా పరిశీలించాలి. ‘‘ఇది 18 నెలల నుంచి నాలుగేళ్ల వరకు ఉంటుంది. తక్కువ వెయిటేజీ పీరియడ్ ఉన్న పాలసీని ఎంచుకోవాలి’’ అని సింబో ఇన్సూరెన్స్ సీఈవో అనిక్ జైన్ సూచించారు. ఇక సీనియర్ సిటిజన్ పాలసీల్లో కోపేమెంట్ (క్లెయిమ్‌లో పాలసీదారులు తమ వంతు వెచ్చించాల్సిన మొత్తం) ఎక్కువగా ఉంటుంది. ‘‘10 శాతం కోపేమెంట్ అయితే ఫర్వాలేదు. 30 శాతం అయితే చాలా కష్టమవుతుంది’’ అని జైన్ అన్నారు. అన్ని వివరాలు వెల్లడించడమే మేలు హెల్త్ పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఓ పేపర్‌పై మీకున్న ఆరోగ్య సమస్యల వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత హెల్త్‌పాలసీ ప్రపోజల్ ఫామ్‌లో ఆ వివరాలన్నింటినీ వెల్లడించడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడించకపోవడం క్లెయిమ్‌లు తిరస్కరణకు కారణమవుతున్న వాటిల్లో ముఖ్యమైనది. పాలసీ పత్రంలోని అన్ని నియమ, నిబంధనలు, షరతులను పూర్తిగా చదవడం మంచిది. ప్రపోజల్ తిరస్కరణ సీనియర్ సిటిజన్ పాలసీల్లో ప్రపోజల్ తిరస్కరణ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఒక కంపెనీ పాలసీ ప్రపోజల్‌ను తిరస్కరిస్తే, మరో కంపెనీ నుంచి పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ, ఈ వయసులో రాదులేనన్న అపోహతో ఆగిపోవద్దు. ఎందుకంటే ఒక్కో కంపెనీకి భిన్నమైన అండర్‌రైటింగ్ విధానాలు ఉండొచ్చు. ఒక కంపెనీ రిస్కీ ప్రపోజల్‌ను కాదనుకుంటే, మరో బీమా కంపెనీ అదే తరహా రిస్కీ కేసులకు పాలసీలను జారీ చేయవచ్చు. ఒకవేళ విడిగా పాలసీ పొందలేకపోతే, అప్పుడు బ్యాంకు ఖాతాదారునిగా గ్రూపు హెల్త్ పాలసీ కోసం ప్రయత్నించొచ్చని జైన్ సూచించారు. ఏ మార్గంలోనూ పాలసీ లభించని వారి ముందున్న మార్గం వైద్య అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమే. -
వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్ మినహాయింపు
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ మినహాయింపు విషయంలో వృద్ధులకు సంతోషాన్నిచ్చే నిర్ణయం వెలువడింది. ఇకపై రూ.5 లక్షల వరకు వార్షిక పన్ను ఆదాయం కలిగిన వృద్ధులు బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్) నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికే ఈ అవకాశం ఉంది. 2019–20 మధ్యంతర బడ్జెట్లో రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రాయితీని కేంద్రం ప్రకటించిన విషయం గమనార్హం. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఫామ్ 15హెచ్‌ను సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద అన్ని రకాల రాయితీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ఆదాయం పన్ను పరిధిలో లేని వారి నుంచి ఫామ్15 హెచ్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్వీకరించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారు తమ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ నుంచి టీడీఎస్ కోయకుండా, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఫామ్15 హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. -
సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచి 60 ఏళ్లు పైబడిన భారత పౌరులు బుక్ చేసుకునే ప్రతి ఎకానమీ క్లాస్ టికెట్‌పైనా 50 శాతం వరకూ రాయితీని ఆఫర్ చేయనున్నారు. 60 సంవత్సరాలు మించిన సీనియర్ సిటిజన్లు వయసును ధ్రువీకరించేందుకు ప్రభుత్వం గుర్తించిన సరైన గుర్తింపు కార్డులను చూపి ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణ తేదీకి వారం రోజుల ముందు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు చిన్నారులతో ప్రయాణించే సీనియర్ సిటిజన్‌కు రూ 1000ల ప్రత్యేక డిస్కౌంట్‌ను కూడా ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్‌తో దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. -
ఆన్లైన్ ఒడిలో ఆలన లాలన సీనియర్ సిటిజన్స్
దేశంలో యువజనుల సంఖ్య మాత్రమే కాదు, వయోజనుల సంఖ్య కూడా పెరుగుతోంది. పెరుగుతున్న వైద్య ప్రమాణాలతో సగటు జీవిత కాలం కూడా మెరుగవుతూ సీనియర్ సిటిజన్స్ సంఖ్య అంతకంతకూ హెచ్చుతోంది. మరోవైపు పెద్దల్ని పట్టించుకునే తీరిక లేని వేగవంతమైన జీవనశైలి పిల్లలకు అనివార్యమవుతోంది. ఈ నేప«థ్యంలో సీనియర్స్‌ను ఆన్లైన్ దగ్గరకు తీసుకుంటోంది. సామాజిక మాధ్యమాలు సన్నిహితం అవుతున్నాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో పెద్దలు మెళకువగా ఉండాలి అంటోంది ‘ఉన్ముక్త్’. సామాజిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతున్నారు. మహిళలూ పనుల్లో కూరుకుపోతున్నారు. దీనితో వయోవృద్ధులు స్వంతంగా తమకై తాము జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ రిపోర్ట్ ప్రకారం.. 2050 కల్లా భారతీయ జనాభాలోని ప్రతి 5గురిలో ఒకరు 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తయి ఉంటారు. అందుకోసమే... భారత్‌లో పెద్ద వయసు వ్యక్తుల ఎంచుకోదగిన జీవనశైలికి సంబంధించిన పలు అంశాలను వివరిస్తోంది సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన భారతదేశపు అతిపెద్ద సంస్థ.. ఉన్ముక్త్. హైదరాబాద్‌లో ఉన్ముక్త్ నిర్వహిస్తోన్న వర్క్‌షాపులలో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటూ వయోజనులు అనుసరించాల్సిన జీవనశైలిపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల వారు ‘ఆన్లైన్ సేఫ్టీ ఫర్ సీనియర్ సిటిజన్స్’ అనే అంశంపై ప్రజెంటేషన్‌ను సమర్పించారు. పెద్దలూ... ఆన్లైన్ వయసులో పెద్దవాళ్లు టెక్నాలజీని బాగా వినియోగించుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. అందుకే చాలామంది సీనియర్లు టెక్ సావీలుగా మారుతున్నారు. స్కైపింగ్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి ట్రావెల్ చేస్తున్నారు. వాట్సాప్‌లో చర్చలు, వాదోపవాదాలు సాగిస్తున్నారు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ‘‘తమ ఈ–కామర్స్ పోర్టల్‌లో 60 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులే అతిపెద్ద కొనుగోలు దారులని ఈ వర్క్‌షాప్‌కు హాజరైన ఒక ఇ కామర్స్ పోర్టల్ యజమాని చెప్పారు. తమ íసీనియారిటీ డాట్ ఇన్ సైట్‌ని ప్రతి నెలా 2 లక్షల మంది సందర్శిస్తారని తెలిపారు. అపరిచితులతో అప్రమత్తంసాంకేతిక పరిజ్ఞానం ఎంతగా మన పనుల్ని సులభతరం చేసిందో అంతే స్థాయిలో మోసాల్ని కూడా అవలీలగా చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఎవరితో ఏ సమాచారం ఎందుకు షేర్ చేస్తున్నారనేది సీనియర్స్‌కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరోవైపు వ్యక్తిగత, ఆర్థ్ధిక లావాదేవీల వివరాలు తెలుసుకోవడానికి ఆన్లైన్ స్కామర్స్ విభిన్న రకాల మెళకువలు ఉపయోగిస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి అనేదానికి అవసరమైతే సంబంధిత నిపుణులను ముందుగా సంప్రదించాలి. సైబర్ బుల్లీయింగ్‌కు గురి అవుతున్నట్లు తెలిస్తే వెంటనే సదరు అకౌంట్‌ను మ్యూట్ లేదా బ్లాక్ చేయాలి. సంబంధిత ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేయాలి. వీలున్నంత వరకూ ఆన్లైన్ సంభాషణలు పాజిటివ్‌గా, మర్యాద పూర్వకంగా ఉండేలా చూడాలి. సేఫ్టీ గైడ్ వచ్చిందిహిందీ ఇంగ్లీషు భాషల్లో రూపొందించిన ఆన్లైన్ సేఫ్టీ గైడ్ ఫర్ సీనియర్ సిటిజన్స్‌ను గూగుల్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ రిసెర్చ్ అండ్ అవుట్ రీచ్ లీడ్ సుజాతా ముఖర్జీ ఉన్ముక్త్ వర్క్‌షాప్స్‌లో ఆవిష్కరించారు. ఈ గైడ్ సీనియర్స్‌కు సులభంగా అర్ధమయ్యే భాషలో దీనిలో ప్రొటెక్టింగ్ ఆన్లైన్ అక్కౌంట్స్, ఎక్సర్సైజింగ్ కేర్, స్కామ్స్ గుర్తింపు, నిరోధించడం... తదితర విశేషాలను అందిస్తుంది. త్వరలోనే తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. – ఎస్.సత్యబాబు ఆన్లైన్... కేర్... వయసు పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ కుంచించుకుపోతుంటుంది. మన వయసు 40 దాటాక పదేళ్లకు 5శాతం చొప్పున మెదడు తరిగిపోతుంటుందని వైద్యులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి సమస్యలు సాధారణం కాబట్టి పెద్దలు తమ పాస్ వర్డ్స్‌ని జాగ్రత్తగా అమర్చుకోవాలి. లోయర్ అప్పర్ లెటర్స్‌ని, నెంబర్స్, సింబల్స్‌ని కలిపి కనీసం 8 లేదా 9 మిక్స్డ్ క్యారెక్టర్స్ వినియోగించాలి.ఉదాహరణకు ఇంట్లో టామ్ అండ్ జెర్రీ పేరుతో పిల్లులు ఉన్నాయనుకోండి. అప్పుడు ప్రతి పదం తాలూకు తొలి అక్షరాన్ని తీసుకుని లోయర్ కేస్, అప్పర్‌కేస్ అక్షరాలు ఉపయోగిస్తూ ఐజ్టిఛ్చిజిnఖ్చీఒ అని పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇందులోని అక్షరాలనే నంబర్స్, సింబల్స్‌తో మారుస్తూ పాస్ వర్డ్‌ని ఐజి2ఛిఃజిnఖీ–ఒ లా పెట్టుకోవాలి. అలాగే గుర్తు పెట్టుకోవాల్సిన పాస్వర్డ్స్ ఎక్కువగా ఉంటే పాస్వర్డ్ మేనేజర్ని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 2 మైళ్లు నడిచేవారికి డిమెన్షియా సమస్య రాదని పరిశోధనలు తేల్చాయి. మానసికంగా చురుకుగా ఉండడానికి క్రాస్‌వర్డ్స్ సాల్వ్ చేయడం, సుడోకు చేయడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం వంటివి జ్ఞాపకశక్తి తగ్గకుండా, డిమెన్షియా ఆలస్యం అయ్యేలా సహకరిస్తాయి. -
అరవైలో ఇరవై!
కొందరు యువకులు పుట్టుకతోనే వృద్ధులేమో కానీ.. ఈ వృద్ధుల్లో మాత్రం వయసు మీదపడినా ఉత్సాహమే ఉత్సాహం. కృష్ణా రామా అంటూ ఓ దగ్గర కూర్చోవడం వాళ్ల చేత కాదు. సాటి పండుటాకుల్లో మనో స్థైర్యాన్ని నింపడమే వారి పని. అదే వాళ్లకు కొండంత బలం. అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్‌గా ఐక్యరాజ్య సమితి జరుపుతోంది. భారత్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వృద్ధులంటే ఇలా ఉండాలి అంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చెన్నైకి చెందిన ఉధవి అనే స్వచ్ఛంద సంస్థ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఐదేళ్ల కింద మొదలైంది. అక్కడ వలంటీర్లంతా 75 ఏళ్ల పైబడిన వారే ఉండటం ఈ సంస్థ ప్రత్యేకత. వృద్ధులైతేనే సాటి వారి కష్టాలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సీనియర్ సిటిజన్లనే వలంటీర్లుగా నియమించింది ఆ సంస్థ. ఇప్పుడు వారే ఒక సైన్యంగా మారారు. తమని తాము ఉత్తేజంగా ఉంచడమే కాదు, ఆపదలో ఉన్న తోటివారికి అండదండగా ఉంటున్నారు. అటు నుంచి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. ఏడుపు, బాధిస్తున్న ఒంటరితనం, ఏం చేయాలో తెలియని నిస్సహాయత, ఒక్కోసారి ఆత్మహత్యవైపు ప్రేరేపించే ఆలోచనలు. అయినవాళ్లు పట్టించుకోకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు. ఆ బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి. అలాంటి ఫోన్ రాగానే 76 ఏళ్ల వయసున్న సుందర గోపాలన్ అనే వలంటీర్ రెక్కలు కట్టుకొని ఆ బాధితుల దగ్గరకి వెళ్లిపోతారు. వాళ్లతో కబుర్లు చెబుతారు. నవ్విస్తారు. కాసేపు పార్కుకి తీసుకెళ్లి చల్లగాలిలో వాకింగ్ చేస్తారు. 76 ఏళ్ల వయసులో కూడా తాను ఎంత హాయిగా ఉన్నానో వాళ్లకి చెబుతారు. అలా ఏదో ఒక్కసారి కాదు. వారంలో రెండు, మూడు సార్లు వాళ్ల దగ్గరికి వెళ్లి వస్తుంటారు. మళ్లీ వారి ముఖం మీద చిరునవ్వు వచ్చేవరకు కౌన్సెలింగ్ ఇస్తారు. ‘ఒంటరితనం మనిషిని చంపేస్తుంది. నా భర్త చనిపోయినప్పుడు అదెంత బాధిస్తుందో నాకు తెలిసొచ్చింది. అలాంటి బాధలో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీవితం ముందుకు వెళ్లేలా వారికి అన్ని విధాలుగా సాయపడగలను’ అని సుందర గోపాలన్ వివరించారు. వేదవల్లి శ్రీనివాస గోపాలన్. ఆమె వయసు 85. ఈ వయసులో కూడా స్వెట్టర్లు అల్లుతారు. హ్యాండ్‌బ్యాగ్స్ తయారు చేస్తారు. వాటిని ఇరుగుపొరుగు వాళ్లకి, స్నేహితులకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న వృద్ధులకి ఇస్తూ ఉంటారు. ‘మా అమ్మ ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటుంది. తనని తాను కష్టపెట్టుకుంటుంది. ఆ పని వద్దన్నా వినిపించుకోదు. ఎంత ఎక్కువ మందికి సాయపడితే తనకు అంత తృప్తి అంటుంది. కానీ మాకు ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనన్న ఆందోళన ఉంటుంది‘అని వేదవల్లి కుమార్తె కృష్ణవేణి చెప్పుకొచ్చారు. ఉధవి సంస్థ వ్యవస్థాపకురాలు సబితా రాధాకృష్ణన్. ఆమె వయసు 75 ఏళ్లు. అయినవాళ్లు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడే వృద్ధుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆమె ఈ సంస్థ స్థాపించారు. చిన్న చిన్న అవసరాలైనా నేనున్నానంటూ తీరుస్తారు. గుళ్లు గోపురాలు తిప్పడం, షాపింగ్‌కు తోడు వెళ్లడం, రెస్టారెంట్లకి తీసుకువెళ్లడం, బ్యాంకు పనుల్లో సాయపడడం వంటివి చేస్తూ ఉంటారు. ‘సీనియర్ సిటిజన్ల దైనందిన కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఒంటరితనాన్ని పోగొట్టడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. వలంటీర్లు అదే వయసు వారు ఉంటే వారి మధ్య వేవ్ లెంగ్త్ బాగా ఉంటుందని సీనియర్‌సిటిజన్లనే వలంటీర్లుగా నియమిస్తున్నాం‘అని సబిత వెల్లడించారు. ఇలాంటి సంస్థల అవసరం ఉంది మన దేశంలో సీనియర్ సిటిజన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో వారి సంఖ్య పెరిగిపోతోంది. -
వాళ్లంతా అరవైలో ఇరవై
కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులేమో కానీ, ఆ వృద్ధుల్లో మాత్రం వయసు మీదపడినా ఉత్సాహమే ఉత్సాహం. కాటికి కాళ్లు చాపుకునే వయసులో కృష్ణా రామా అంటూ మూల కూర్చోవడం వాళ్ల పని కాదు. జీవిత చరమాంకంలో ఏం చెయ్యాలి, సమయాన్ని ఎలా గడపాలి అంటూ కుంగిపోయే జీవితం వాళ్లది కానే కాదు. సాటి పండుటాకుల్లో మనోస్థైర్యాన్ని నింపడమే వారి పని. అదే వాళ్లకు కొండంత బలం. అది చెన్నైకి చెందిన ఉధవి అనే స్వచ్ఛంద సంస్థ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో అయిదేళ్ల క్రితమే మొదలైంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ వాలంటీర్లు అందరూ కూడా డెబ్బయి ఏళ్ల పైబడిన వారే. వృద్ధులైతేనే సాటి వారి కష్టాలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సీనియర్ సిటిజన్లనే వాలంటీర్లుగా నియమించింది. ఇప్పుడు వారే ఒక సైన్యంగా మారారు. తమని తాము ఉత్తేజంగా ఉంచడమే కాదు, ఆపదలో ఉన్న తోటివారికి అండదండగా ఉంటున్నారు. సూపర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు. అటు నుంచి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. సన్నటి ఏడుపు, బాధిస్తున్న ఒంటరితనం, ఏం చెయ్యాలో సమయాన్ని ఎలా గడపాలో తెలీని నిస్సహాయత, ఒక్కోసారి ఆత్మహత్యవైపు ప్రేరేపించే ఆలోచనలు. కాటికి కాళ్లు చాపుకునే వయసులో అయినవాళ్లు పట్టించుకోకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు. ఆ బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి. అలాంటి ఫోన్ రాగానే 76 ఏళ్ల వయసున్న సుందర గోపాలన్ అనే వాలంటీర్ రెక్కలు కట్టుకొని ఆ బాధితుల దగ్గరకి వెళ్లిపోతారు. వాళ్లతో కబుర్లు చెబుతారు. జోకులు వేస్తారు. నవ్విస్తారు. కాసేపు అలా పార్కుకి తీసుకెళ్లి చల్లగాలిలో కలిసి వాకింగ్ చేస్తారు. డెబ్బయి ఆరేళ్ల వయసులో కూడా తాను ఎంత హాయిగా ఉన్నానో వాళ్లకి చెబుతారు. అలా ఏదో ఒక్కసారి కాదు. వారంలో రెండు, మూడు సార్లు వాళ్ల దగ్గరికి వెళ్లి వస్తుంటారు. అలా నెల రోజుల పాటు ఆ బాధితులతో టచ్‌లో ఉంటారు. మళ్లీ వారి ముఖం మీద చిరునవ్వు వచ్చేవరకు కౌన్సెలింగ్ ఇస్తారు. ‘ఒంటరితనం మనిషిని చంపేస్తుంది. నా భర్త చనిపోయినప్పుడు అదెంత బా«ధిస్తుందో నాకు తెలిసివచ్చింది.. అలాంటి బాధలో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీవితం ముందుకు వెళ్లేలా వారికి అన్ని విధాలుగా సాయపడగలను‘ అని సుందర గోపాలన్ వివరించారు. వేదవల్లి శ్రీనివాస గోపాలన్. ఆమె వయసు 85. ఈ వయసులో కూడా స్వెట్టర్లు అల్లుతారు. హ్యాండ్‌బ్యాగ్స్ తయారు చేస్తారు. వాటిని ఇరుగుపొరుగు వాళ్లకి, స్నేహితులకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న వృద్ధులకి ఇస్తూ ఉంటారు. ‘ మా అమ్మ ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటుంది. తనని తాను కష్టపెట్టుకుంటుంది. ఆ పని వద్దన్నా వినిపించుకోదు. ఎంత ఎక్కువ మందికి సాయపడితే తనకు అంత తృప్తి అంటుంది. కానీ మాకు ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనన్న ఆందోళన ఉంటుంది‘ అని వేదవల్లి కుమార్తె కృష్ణవేణి చెప్పుకొచ్చారు. ఉధవి సంస్థ వ్యవస్థాపకురాలు సబితా రాధాకృష్ణన్, ఆమె వయసు 75 ఏళ్లు. అయినవాళ్లు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడే వృద్ధుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆమె ఈ సంస్థ స్థాపించారు. చిన్న చిన్న అవసరాలైనా నేనున్నానంటూ తీరుస్తారు. గుళ్లు గోపురాలు తిప్పడం, షాపింగ్‌కు తోడు వెళ్లడం, రెస్టారెంట్లకి తీసుకువెళ్లడం, బ్యాంకు పనుల్లో సాయ పడడం వంటివి చేస్తూ ఉంటారు. ‘సీనియర్ సిటిజన్ల దైనిందిన కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఒంటరితనాన్ని పోగొట్టడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. వాలంటీర్లు అదే వయసు వారు ఉంటే వారి మధ్య వేవ్ లెంగ్త్ బాగా ఉంటుందని సీనియర్‌సిటిజన్లనే వాలంటరీర్లుగా నియమిస్తున్నాం‘ అని సబిత వెల్లడించారు. అంతేకాదు సీనియర్ సిటిజన్లు నిరంతరం పనిలో ఉంటేనే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వాలంటీర్‌గా పని చేస్తున్న వృద్ధుల్లో చలాకీతనం బాగా పెరిగిందని సబిత చెప్పారు. ఇలాంటి సంస్థల అవసరం ఉంది మన దేశంలో సీనియర్ సిటిజన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో వారి సంఖ్య పెరిగిపోతోంది. మన దేశంలో 60ఏళ్లపై బడినవారు 13 కోట్ల మంది ఉన్నారు. వారిలో 63శాతం మంది దారిద్య్ర రేఖకి దిగువన నివసిస్తున్నారు. అనారోగ్యంతో మంచానపడితే చూసే దిక్కులేనివారు 62% , ఇక కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులు 54%. మరో ఎనిమిదేళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య 17.3 కోట్లకు చేరుకోవచ్చు. ఇక 2050 నాటికి జనాభాలో 20 శాతం మంది వృద్ధులే ఉంటారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, హెల్పేజ్ ఇండియా సంస్థలు అంచనా వేశాయి. వృద్ధుల సంక్షేమం కోసమే ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 1వ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్‌గా ప్రకటించింది. నానాటికి పెరిగిపోతున్న వృద్ధుల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సంస్థల అవసరమూ భవిష్యత్‌లో పెరుగుతుంది. అందుకే ఉధవి సంస్థ చేస్తున్న సేవల్ని అందరూ భేష్ అంటూ కొనియాడుతున్నారు. కాలక్షేపంలో వృద్ధులు -
అందరూ ఉన్న 'అనాథలు'!
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ రేతిఫైల్ బస్‌స్టేషన్ వద్ద ఓ పెద్దాయన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వయసు 75 పైనే ఉంటుంది. ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ఆరా తీయగా.. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలిసింది. ఒక కొడుకు ఖమ్మంలో, మరో ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారికి సమాచారం ఇవ్వగా.. ఎవరూ రాలేదు. గాంధీలో చికిత్స పొందుతూనే ఆ పెద్దాయన కన్నుమూశాడు. అందరూ ఉండి కూడా ఓ అనాథగా లోకాన్ని విడిచి వెళ్లాడు. ఒక రిటైర్డ్ అధికారి, ఆయన భార్య మల్కాజిగిరిలో ఉంటున్నారు. ఇద్దరు కొడుకులూ అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల అనారోగ్యంతో రిటైర్డ్ అధికారి భార్య కన్నుమూసింది. ఓ కొడుకు మాత్రమే వచ్చాడు. రాను, పోను విమానం టికెట్లు బుక్ చేసుకుని మరీ వచ్చాడు. తల్లి చితికి నిప్పంటించేందుకు అంగీకరించలేదు. చివరికి ఆ పెద్దాయనే భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు. అదే రోజు రాత్రి ఆ కొడుకు అమెరికాకు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఓ సుపుత్రుడు తన 80 ఏళ్ల తల్లిని అడిక్‌మెట్ బస్టాపులో వదిలేసి వెళ్లాడు. అప్పటికే తీవ్రమైన డిమెన్షియాతో బాధపడుతున్న ఆ పెద్దావిడ.. తన వివరాలను కూడా మరిచిపోయింది. ఒక స్వచ్ఛంద సంస్థ గుర్తించి ఆమెను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించింది. తర్వాత తెలిసిన వివరాల ప్రకారం ఇద్దరు కొడుకులు ఆమెను నెలకొకరు చొప్పున పోషించారు. ఇటీవల ఆమెకు డిమెన్షియా రావడంతో నగలు, నగదు అన్నీ తీసుకొని బస్టాపులో వదిలి వెళ్లారు. చికిత్స అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులే ఆమెను ఒక వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఇలా వీరే కాదు.. హైదరాబాద్‌లో ఎంతోమంది వృద్ధుల పరిస్థితి ఇదే. జీవిత చరమాంకంలో పిల్లల నిరాదరణకే గురై అనాథల్లా బతుకుతున్నారు. కొడుకులు, కోడళ్ల వేధింపులను భరించలేక కొందరు ఇళ్లను వదిలేసి వీధుల్లోకి వస్తున్నారు. మరికొందరిని తమ పుత్రరత్నాలే వీధుల్లో వదిలేసి వెళ్తున్నారు. కాలధర్మం చేసిన కన్నవాళ్లకు అంత్యక్రియలు చేయాల్సిన నైతిక ధర్మాన్ని కూడా కొందరు విస్మరిస్తున్నారు. ఒంటరి వృద్ధులకు దినదినగండం.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 15 లక్షల మందికి పైగా సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు అంచనా. వారిలో కనీసం 2 లక్షల మంది ఒంటరిగానే ఉంటున్నారు. ఎలాంటి ఆధారం లేక, అయిన వాళ్ల పలకరింపులు లేక బిక్కుబిక్కుమంటూ బతికేస్తున్నారు. ఇదే అదనుగా వృద్ధులు ఒంటరిగా ఉండే ఇళ్లల్లో దొంగలు దాడులకు దిగుతున్నారు. హత్యలకు పాల్పడుతున్నారు. నగలు, డబ్బు దోచుకెళ్తున్నారు. చట్టం ఏం చెబుతోంది... - వృద్ధుల సంక్షేమ చట్టంలోని 6వ సెక్షన్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యత పోలీసులదే. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒంటరిగా ఉన్న వయోధికుల జాబితాను రూపొందించాలి. - వారానికి రెండు సార్లు బీట్ కానిస్టేబుళ్లు వాళ్ల ఇళ్లకు వెళ్లి పలకరించాలి. రిజిస్టర్లో సంతకం తీసుకోవాలి. వారి యోగక్షేమాలను కనుక్కోవాలి. - కాలనీ కమిటీల తరహాలోనే స్థానికంగా యూత్ కమిటీలను ఏర్పాటు చేయాలి. రాత్రిపూట వృద్ధులకు మందులు, వైద్యం వంటి సహాయాన్ని అందజేసే బాధ్యతను ఈ కమిటీల ద్వారా నిర్వహించాలి. కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ పోలీసులు పాటించడం లేదు. నెలకు 15 మంది వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలను రూపొందించినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇక పెద్దల బాధ్యతను కొడుకులు, కూతుళ్లు భారంగా భావిస్తున్నారు. ఆస్తులను తమ పేరిట బదలాయించుకుని.. తర్వాత వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొందరైతే నిర్దాక్షిణ్యంగా బస్టాపుల్లో, పుణ్యక్షేత్రాల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇలా ప్రతి నెలా 10 నుంచి 15 మంది సీనియర్ సిటిజన్స్ అనాథల్లా చనిపోతున్నట్లు హెల్పేజ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వృద్ధాశ్రమాల్లో చనిపోయిన వాళ్లకు ఆశ్రమ నిర్వాహకులు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ వంటి సంస్థలే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి శ్యామ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. హెల్పేజ్ ఇండియా నిర్వహిస్తున్న సహాయ కేంద్రానికి సీనియర్ సిటిజన్స్ నుంచి ప్రతి నెలా వచ్చే 300 ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం కొడుకులు, కోడళ్లు, కుటుంబ సభ్యుల వేధింపులకు సంబంధించినవే కావడం గమనార్హం. మరోవైపు పోలీస్ స్టేషన్లకు వెళ్లే వృద్ధులను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్లను మనుషులుగా కూడా గుర్తించడం లేదని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల తీరు మారాలి.. వృద్ధుల సంరక్షణ చట్టం బలంగానే ఉంది. కానీ అమలు కావట్లేదు. గ్రేటర్లో ఒంటరిగా ఉండే వృద్ధుల రక్షణ గురించి 2007లో అప్పుటి కమిషనర్, ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీనియర్ల జాబితాను రూపొందించి, రక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – వుప్పల గోపాల్‌రావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వైద్యులకు చిన్నచూపేల? అనారోగ్యంతో ఉన్న వృద్ధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం చేయించడం సవాల్‌గా మారుతోంది. సహాయకులు, పోలీసులు ఉంటే తప్ప వైద్యం చేయబోమని వైద్యులు అంటున్నారు. కొడుకులు, కోడళ్లు తరిమేస్తే బయటకు వచ్చిన వాళ్లకు ఎవరు సహాయకులుగా ఉంటారు. కొన్నిసార్లు 108 సిబ్బంది కూడా ఇబ్బంది పెడుతున్నారు. – శ్యామ్‌కుమార్, హెల్పేజ్ ఇండియా -
ఆఖరి మజిలీలోనూ ‘ఆకలి బాధలు’
గుంటూరు, ప్రత్తిపాడు: ‘వయస్సు మీద పడింది. ఆకలి కష్టాలు తప్పడం లేదు. కడుపు నింపలేని ప్రకటనలు, ఆకలి తీర్చలేని నిబంధనలు మాకేందుకు. ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రాణం పోయేలా తిరుగుతున్నాం. వేలిముద్రలంటూ సర్కారు తెచ్చిన రూలు కడుపునకు నాలుగు రూకలు పెట్టలేకపోతుంది. మలి వయస్సులో అరిగిన చేతి వేళ్లే ముద్ద నోటిలోనికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి’ అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక పోలిస్ స్టేషన్లో నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ అవగాహన సదస్సులో వృద్ధులు ఏళ్ల తరబడి తాము పడుతున్న బాధలను డిప్యూటీ తహసీల్దార్ రాఘవయ్య ఎదుట ఏకరువు పెట్టారు. రెండేళ్లుగా బియ్యం రావడం లేదు.. రెండేళ్లుగా రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. వెళ్లినప్పుడల్లా వేలిముద్రలు పడటం లేదని చెబుతున్నారు. తిరిగి తిరిగి విసుగొస్తోంది. కనీసం బియ్యం కూడా ఇవ్వకపోతే ఎలాగయ్యా.. కొంచెమైనా కనికరం చూపించండి సారూ.– షేక్ చాంద్‌బి,ప్రత్తిపాడు మిషన్లు పెట్టిన దగ్గర్నుంచి.. వేలిముద్రల మిషన్లు పెట్టిన దగ్గర నుంచి బియ్యం కోసం కోటాల చుట్టూ తిరుగుతున్నా. వేలిముద్రల పడటం లేదంటారు. ఇవ్వరు. ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగానో. పట్టించుకున్నోళ్లు లేరు. వీఆర్వో వత్తారు. బియ్యం ఇత్తారు అంటారు. కానీ ఎప్పుడిచ్చిన పాపాన పోలేదు.–దూపాటి సుందరరావు, తూర్పుపాలెం దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం.. రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నా. వేలిముద్రలు పడటం లేదంటారు. మళ్లీ రమ్మంటారు. బియ్యం మాత్రం ఇవ్వరు. ఒకసారి ఆధార్‌లో మార్చుకోమంటారు. –గింజుపల్లి బాలాత్రిపురసుందరి,ప్రత్తిపాడు -
వృద్ధుల డే కేర్..
మంచిర్యాల నుంచి బన్నా ఉపేందర్ : వారంతా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నవారే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం, మరొకరు ప్రైవేటు, మరొకరు వ్యవసాయం, వ్యాపారం.. ఇలా రకరకాలుగా అలుపెరగని జీవిత పోరాటం చేసి నేడు అలసిసొలసిన వృద్ధులు. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే ఏం తోచదు. బయటకు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇక తమ కష్టసుఖాలను నలుగురితో పంచుకుందామంటే, ఎవరు అందుబాటులో ఉన్నారో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న వృద్ధులకోసం ఏర్పాటైందే వృద్ధుల డే కేర్ సెంటర్. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ చక్కటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహకారం తీసుకుని స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే దారిలోని కాలేజీరోడ్డులో ఉన్న ఓ పాత భవనాన్ని రూ. 20 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించి ఈ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భవన ఆవరణను అందమైన మొక్కలతో ముస్తాబు చేయించారు. గదిలో టీవీ, ఆడుకునేందుకు వస్తువులు, కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు, ఫిజియోథెరపీ పరికరాలు ఇలా అనేకం సమకూర్చారు. ఈ డే కేర్ సెంటర్‌కు మహిళలు, పురుషులు ఎవరైనా ప్రతి రోజూ వచ్చి వెళ్లొచ్చు. ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదు. అన్ని రకాల సేవలను ఉచితంగా పొందొచ్చు. ఈ సెంటర్ చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో, పచ్చని గార్డెనింగ్‌ను ఏర్పాటు చేసి, కేంద్రానికి వచ్చే వృద్ధులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నారు. రాష్ట్రంలోనే మొదటిది.. తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా వృద్ధు లకు కాలక్షేపంతోపాటు, ఆరోగ్యాన్ని అందిం చేలా వైద్య పరీక్షలు, ఉల్లాసం, ఉత్సాహం నింపే లా ఆట వస్తువులు, వినోదం అందించేందుకు టీవీ, దినపత్రికలతో మంచిర్యాలలో వృద్ధుల డే కేర్ సెంటర్ ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చొరవతో ఏర్పాటైన దీనికి ‘సన్‌షైన్ వృద్ధుల డేకేర్ సెంటర్’ అని పేరు పెట్టారు. డే కేర్ సెంటర్ ఉద్దేశం.. వృద్ధుల్లో మనోధైర్యాన్ని నింపుతూ, వారి హక్కుల గురించి గానీ, వారికి ప్రభుత్వం అందించే సదుపాయాలు, పథకాల గురించి తెలుసుకునేందుకు, కష్టసుఖాలు పంచుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు ఏర్పాటు చేసిందే ఈ కేంద్రం. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ప్రతీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఫిజియో థెరపీ అవసరం ఉన్న వారికి సైతం ప్రత్యేకంగా ఒక బెడ్డు, సైక్లింగ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల దిన పత్రికలు, వినోదాన్ని పంచేందుకు టీవీ, ఇండోర్ గేమ్స్‌తో కాలక్షేపం చేసేందుకు చెస్, క్యారంబోర్డు ఉన్నాయి. షటిల్‌కోర్టు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచి వేదిక అన్ని హంగులతో రూపొందించిన డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయ డం గొప్ప వరం. ఎక్కడా లేనివిధంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞతలు. వృద్ధులు అనేక విషయాలు పంచుకునేందుకు ఇదో వేదిక. 2007లో ఏర్పాటు చేసిన మెయిం టెనెన్సు సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కల్పిస్తాం. – బొలిశెట్టి రాజలింగు, జిల్లా సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షుడు మరో పదేళ్లు బతకొచ్చు.. వృద్ధులైన తర్వాత ఏం తోచక సమయాన్ని వృథా చేసుకుంటూ, ఆరోగ్యపరంగా, మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఈ డే కేర్ సెంటర్‌కు రావడం వల్ల కొత్త పరిచయాలు, కొత్త విషయాలను తెలుసుకోవడం, రోజంతా నవ్వుతూ, బాధలు, సంతోషాలను పంచుకుంటుండడం వల్ల మరో పదేళ్ల ఆయుష్షు పెరుగుతుంది. – ఎన్. వెంకటేశ్వర్రావు, సీనియర్ సిటిజన్ అసోసియేట్ అధ్యక్షుడు -
చట్టమున్నా.. చట్టుబండలే!
సాక్షి, హైదరాబాద్: వృద్ధులపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నవారేకాక, పదవీ విరమణ తర్వాత ఇంటి పట్టునే ఉంటున్న వృద్ధులు పలు రకాల మోసాలు, దాడులకు గురవుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిఘటించే శక్తిలేక నిస్సహాయ స్థితిలో ఉండే పండుటాకులు సులభంగా దాడులకు గురవుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ‘క్రైమ్ ఇన్ ఇండి యా’ నివేదికలో సీనియర్ సిటిజన్స్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను పొందుపరిచింది. ఏటా వృద్ధులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలోనూ మూడేళ్లుగా వృద్ధులపై జరిగిన దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న దాడులు.. రాష్ట్రంలో 2014 సంవత్సరానికి సంబంధించి సీనియర్ సిటిజన్స్పై జరిగిన దాడులు, మోసాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన ఘటనలపై 422 కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ కేసుల సంఖ్య 1,519కి చేరింది. అంటే దాదాపు 200 శాతం దాటిపోయింది. 2016 సంవత్సరంలో 1,382 కేసులు నమోదయినట్టు నివేదికలో తెలిపింది. 2011లో ప్రత్యేక చట్టం.. సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2011లోనే అప్పటి ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్ యాక్ట్ (2011) కింద ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎంత మంది సీనియర్ సిటిజన్లున్నారు? వారు నివసిస్తున్న ప్రాంతం, వారికి సహాయకులుగా ఉంటున్న వారెవరు? తదితర వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో పొందుపరచాలి. అలాగే స్థానిక కాలనీల అసోసియేషన్ల ఆధ్వర్యంలో యువకుల సహాయంతో వాలంటీర్ కమిటీని ఏర్పాటుచేసి సీనియర్ సిటిజన్లకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలో ఒక ప్రభుత్వ అధికారి, యూనిఫాం సర్వీస్‌లో పనిచేసి రిటైర్ అయిన అధికారి ఉండేలా చర్యలు చేపట్టాలి. సీనియర్ సిటిజన్స్ ఎలాంటి ఫిర్యాదుచేసినా వారి ఇంటికి వెళ్లి వివరాలు తీసుకొని న్యాయం చేసేందుకు కృషిచేయాలని ఆ చట్టంలో పొందుపరిచారు. అసలు ఈ చట్ట ప్రకారం ఎన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు ఇలాంటి చట్టం ఉందన్న విషయం కూడా చాలా మంది తెలియదని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు ఇటీవల డీజీపీని కలసి తమ ఆందోళనను తెలిపాయి. పోలీసు శాఖతోపాటు, వివిధ ప్రభుత్వ విభాగాలు తమ సమస్యలపై తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ల ప్రతినిధులు కోరుతున్నారు. పెండింగ్‌లో 2,012 కేసులు.. మూడేళ్లుగా సీనియర్ సిటిజన్స్పై జరిగిన దాడులు, మోసాలు, తదితర కేసుల్లో పోలీస్ శాఖ పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ మూడేళ్లలో 2,012 కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండటం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. వృద్ధులకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే వారిని గుర్తించి కూడా అరెస్ట్ చేయని సంఘటనలు చాలా ఉన్నాయని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అలాగే హత్య వంటి తీవ్రమైన కేసుల్లోనూ తాము డీజీపీ, హోంశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి కేసులు వేస్తే తప్ప న్యాయం జరగడం లేదని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేశాయి. జీవితంలో చివరి మజిలీలో ఉన్న తమ రక్షణకు ప్రత్యేకమైన చట్టం ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
ఇక నో క్యూ: ఇంటి వద్దకే డబ్బులు
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చునే అవసరం లేకుండా వారి ఇంటి వద్దనే బ్యాంకులను ప్రాథమిక సర్వీసులు అందజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ చర్యలను అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. నగదు స్వీకరించడం, డెలివరీ చేయడం, చెక్ బుక్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం, లైఫ్ సర్టిఫికేట్లు అందించడం వంటి సర్వీసులను సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని తెలిపింది. ఈ ప్రొగ్రామ్ అమలు కోసం బ్యాంకులు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటుచేయాలని, సమస్యలను ఎప్పడికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని పేర్కొంది. అయితే ఈ సేవలందించినందుకు గాను ఎంత మొత్తంలో ఛార్జీలు విధించనుందో మాత్రం ఆర్బీఐ ఇంకా స్పష్టంచేయలేదు. ఇప్పటి నుంచి పెన్షనర్లు తమ ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ పేయింగ్ బ్యాంకు బ్రాంచుల వద్ద సమర్పించాల్సి ఉంది. పెన్షనర్లు సమర్పించిన ఈ సర్టిఫికేట్లను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చెక్ బుక్‌లను అందుకోవడానికి కూడా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇక బ్యాంకులకు రావాల్సినవసరం లేదు. -
వృద్ధుల పింఛన్లపై ‘అధికార’ ప్రతాపం
నంద్యాలరూరల్: మండల పరిధిలోని మునగాల గ్రామ వృద్ధాప్య పింఛన్లపై తెలుగు తమ్ముళ్లు ప్రతాపం చూపించారు. వైఎస్సార్సీపీ వెంట ఉన్నారనే అక్కసుతో అధికార పార్టీ నాయకులు తమ పింఛన్లు తొలగించారని బాధిత వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మునగాల గ్రామానికి చెందిన బాధిత వృద్ధులు దాయాది సుబ్బన్న, తూము చిన్న శివారెడ్డి, చింతమాను సంజమ్మ, సంటి ఒబులమ్మ, సంటి భాగ్యమ్మ, దాయాది లక్ష్మమ్మ తదితరులు గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 2016 డిసెంబర్ వరకు పింఛన్ ఇచ్చి తర్వాత తొలగించారని తెలిపారు. గ్రామంలో 111 సామాజిక పింఛన్లుండగా 41 వృద్ధాప్య, 29 వితంతు, 13 వికలాంగ, 28 అభయాస్తం పింఛన్లున్నాయి. ఇందుకోసం ప్రతి నెలా రూ.1.16 లక్షలు అందజేస్తున్నారు. 67 సంవత్సరాలు పైబడిన తమపై అధికార పార్టీ గ్రామ నాయకుడు కక్ష కట్టి రద్దు చేయించారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఎంపీడీఓ స్వర్ణలతను వివరణ కోరగా సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని, విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పూర్తిస్థాయిలో విచారించి కుమారులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నట్లు తేలిన వారి పింఛన్లు తొలగించామని తెలిపారు. -
ఎండుటాకులు!
మండుటెండలో పింఛన్ల పంపిణీ - పడిగాపులు కాస్తే తప్ప అందని సొమ్ము - వేళాపాళా పాటించని అధికారులు - ఇళ్ల వద్ద పంపిణీ ఒట్టిదే.. - నీళ్లు, నీడ కూడా ఏర్పాటు చేయని వైనం డోన్ పట్టణంలో గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. శుక్రవారం కూడా అలాగే ఇస్తారని భావించి చాలా మంది పండుటాకులు, దివ్యాంగులు ఉదయం 6 గంటలకే కనీసం టీ కూడా తాగకుండా పింఛన్ కోసం చేరుకున్నారు. ఉదయం 10 గంటలైనా పింఛన్ ఇచ్చేవారు రాలేదు. ఎందుకు రాలేదంటే.. నవ నిర్మాణ దీక్షకు వెళ్లారని సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కొందరు విలేకరులు స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఆయన పింఛన్ పంపిణీ అధికారులను కార్యాలయానికి పంపించారు. ఆలూరులోని ఎస్సీ కాలనీలో ఉన్న మార్కెమ్మ దేవాలయం వద్ద సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉదయం 7 గంటలకే వచ్చి కూర్చున్నారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 12 గంటలైనా అధికారులు రాలేదు. కనీసం టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన లబ్ధిదారులు ఇంటికి వెళ్దామంటే అధికారులు వస్తారేమోనని అలాగే కూర్చున్నారు. కొందరైతే సొమ్మసిల్లి అక్కడే కూలబడిపోయారు. సాయంత్రం 5 గంటలైనా అధికారులు ఎవ్వరూ రాకపోవడంతో ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు. మొత్తం పింఛన్లు : 3,30,607 వృద్ధాప్య : 1,26,288 వితంతు : 1,37,745 దివ్యాంగులు : 43,114 చేనేత : 3,712 కల్లుగీత : 220 అభయహస్తం : 19,528 కర్నూలు(హాస్పిటల్)/డోన్/ఆలూరు: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ తీరు లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉద్యోగులు తమ వీలు చూసుకుని చేపడుతున్న పంపిణీతో వృద్ధులు, వికలాంగులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నం కనిపించని పరిస్థితి. లబ్ధిదారులను ఒక చోటకు పిలిపించి పంపిణీ చేపడుతున్నారు. ఇదేమంటే.. వారే వస్తున్నారని బుకాయిస్తున్నారు. తామే ఇంటికి వస్తామంటే ఇంతటి అవస్థలు పడు ఎందుకు వస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం కరువవుతోంది. పింఛన్ల కోసం రెండు మూడు రోజులు తిరిగితే కానీ చేతికందడం లేదు. పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుండటంతో ఎండ తీవ్రతతో సొమ్మసిల్లి పడిపోతున్నారు. వేసవి నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా పింఛన్లు పంపిణీ చేసే ప్రాంతాల్లో షామియానాలు, షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు మంచినీళ్లు అందివ్వాల్సి ఉంది. ఈ బాధ్యతను స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. కానీ జిల్లాలో ఎక్కడా ఇలాంటి సదుపాయాలు కల్పించిన దాఖలాల్లేవు. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీనికి తోడు ఉక్కపోత అధికమైంది. ఫలితంగా పింఛను కోసం వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థలను చూసి పలుచోట్ల పింఛను పంపిణీ ఉద్యోగులే సొంత డబ్బుతో నీటి వసతి కల్పిస్తున్నారు. పొద్దున్నే టీ తాగకుండా వచ్చిన గురువారం పొద్దున 6గంటల నుంచే పింఛన్లు ఇచ్చారంట. ఈ ఇసయం తెల్సుకుని ఈ రోజు(శుక్రవారం) నేను కూడా ఆరు గంటలకే వచ్చిన. పది గంటలైనా పింఛన్ ఇచ్చే వాళ్లెవ్వరూ రాలేదు. అదేదో దీక్షకు పోయినారంట. ఆ ఇసయం మాకు ముందే సెబితే లేటుగా వచ్చేవాళ్లం కదా నాయనా. పొద్దున్నుంచి కనీసం టీ కూడా తాగకుండా ఈడకు వచ్చినం. – హనుమక్క, డోన్ ఇండ్ల కాడికి రానేరారు మా లాంటి చేతగానోళ్లకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇయ్యాలంట. కానీ ఎవరొస్తున్నారు. యానాడూ ఇండ్లకాడికి వచ్చిందే లేదు. ఈడికి వచ్చినా రెండు, మూడు రోజులు తిప్పుకుంటున్నారు. వచ్చినా కూడా గంటల తరబడి ఎదురుసూడాల. దాహం వేసినా నీళ్లిచ్చేటోళ్లు లేరు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాల. – గోవిందమ్మ, డోన్ -
60 ఏళ్ల నుంచే వృద్ధాప్య ప్రయోజనాలు: కేంద్రం
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల నిర్వచనానికి 60 ఏళ్ల వయసునే ఏకరూప ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను కోరింది. వృద్ధులకు కల్పించే ప్రయోజనాల విషయంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం–2007లో సవరణ చేయాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి త్వ శాఖ యోచిస్తోంది. ఈ చట్టం ప్రకారం 60 ఏళ్లు లేదా ఆపైనున్న భారతీయులను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ‘ఆపైన’ అనే పదం అర్థాన్ని మార్చి పలు సంస్థలు వారికి కల్పించాల్సిన సేవలను నిరాకరిస్తున్నాయని ప్రభుత్వ సీని యర్ అధికారి ఒకరు తెలిపారు. రైళ్లలో మహిళలకు 58 ఏళ్లు లేదా ఆపైననున్న వారికి, పురుషులకు 60 ఏళ్లు లేదా ఆపైనున్న వారికి రాయితీ అమలుచేస్తున్నారు. ఎయిరిండియా ఇటీవలే ఈ వయసును 63 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించింది. -
ఎయిర్ ఇండియా వారికి మూడేళ్లు తగ్గించింది
-
ఎయిర్ ఇండియా వారికి మూడేళ్లు తగ్గించింది
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు శుభవార్తం అందించింది. ప్రయాణం రాయితీ పొందేందుకు ఉద్దేశించిన వయసు పరిమితిని మూడు సంవత్సరాలు తగ్గించింది. సీనియర్ సిటిజెన్స్ ట్రావెల్ కన్సెషన్ పొందే పథకానికి వయసు పరిమితిని 60 సం.రాలుగా నిర్ణయించింది ఎయిర్ ఇండియా సీనియర్ పౌరులుగా పరిగణించే వయసును 60 ఏళ్లకు తగ్గించింది. ఇప్పటిదాకా ఈ పరిమితి 63 ఏళ్లు. ఈ పథకం ప్రకారం, 60 రోజుల వయసున్న భారతీయ పౌరుడికి ఎయిర్ ఇండియా ఎకానమీ విమానంలో మూల రేటులో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గతంలో 63 సం.రాలు ఉన్న ఈ పరిమితిని 60కి తగ్గించినట్టుగా ఎయిర్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే, ఈ ఆఫర్ దేశీయ ప్రయాణంలో మాత్రమే చెల్లుతుంది. ఈ డిస్కౌంట్ పొందేందుకుగాను ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎయిర్ ఇండియా జారీ చేసిన సీనియర్ సిటిజెంట్ కార్డు లాంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపును కార్డును చూపించాల్సి ఉంటుంది. -
ఓల్డ్.. గోల్డే..
లేటు వయసులో లేటెస్టు జాబ్ - అరవై దాటినా.. రెస్ట్‌కు నో చెబుతున్న సీనియర్ సిటిజన్స్ - యువతకు పోటాపోటీగా ఉద్యోగాల వేట - గ్రేటర్ హైదరాబాద్‌లో నయా ట్రెండ్ మొదటిసారి ఉద్యోగంలో చేరడం ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే.. రెండోసారి ఉద్యోగంలో చేరడం.. అది కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత చేరడాన్ని సెకండ్ ఇన్నింగ్స్ అనాల్సిందే కదా. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నడుస్తున్న నయా ట్రెండ్ ఈ మాటలకు ఊతమిస్తోంది. పనిలోనే తమకు అంతులేని ఆనందం ఉందంటున్నారు గ్రేటర్‌లోని సీనియర్ సిటిజన్స్. అరవయ్యో వడిలోనూ క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమవడం ఎంతో సంతృప్తినిస్తోందని చాటి చెబుతున్నారు. ఇలాంటి వారికి ఉద్యోగాలు వెదికిపెట్టడానికి బోలెడన్ని వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య సుమారు 60 వేల మంది ఆయా సైట్లలో పేర్లు నమోదు చేసుకుని ఉద్యోగాల వేటలో యూత్‌కు తీసిపోమని సవాల్ విసురుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ భారం కాదు.. వరం.. దేశంలో ప్రస్తుతం 60 ఏళ్లకు మించి వయస్సున్నవారు సుమారు 10.3 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. వీరి సంఖ్య 2021 నాటికి 17 కోట్లకు చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుత తరుణంలో వైద్యపరీక్షలు, ఆరోగ్య పరిరక్షణ చర్యలు, ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రావడంతో సగటు జీవనకాలం 65 ఏళ్లకు పెరిగింది. దీంతో వయో వృద్ధులు పనిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌పై మక్కువతో పనిచేస్తున్నా.. రాష్ట్ర భవిష్యత్‌కు నా వంతుగా చేయూతనందించేందుకు పదవీ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నా. సమాజం కోసం పని చేయాలన్న ఆలోచనే నన్ను ముందుకు నడిపిస్తోంది. చదువుకునే రోజుల్లో విద్యార్థి నేతగా తెలంగాణ కోసం ఉద్యమించా. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్నా. – డాక్టర్ కేవీ రమణాచారి,రిటైర్డ్ ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసమే.. శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేందుకే పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పనిచేస్తున్నా. నాకున్న అనుభవంతో కంపెనీ లాభాల బాటలో పయనించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నా. నిరంతరం పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. – ఆనంద్‌రెడ్డి,జలమండలి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎవరికీ భారం కాకూడదనే.. కొడుకు, కూతురుకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరా. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడం సంతృప్తినిస్తోంది. – మల్లారెడ్డి, రిటైర్డ్ అకౌంట్స్ అధికారి, ఆర్టీసీ పనిలోనే ఆనందం.. ఖాళీగా కూర్చుంటే మెదడు చెత్త ఆలోచనలకు నిలయంగా మారుతుందన్న ఫిలాసఫీని గ్రేటర్ సీనియర్ సిటిజన్లు వంటబట్టించుకున్నారు. దీంతో పదవీ విరమణ పొందిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటికి పరిమితమైపోకుండా.. వీలైతే పదవీ విరమణ పొందిన సంస్థలోనో.. లేదా మరోచోట తక్కువ వేతనానికైనా పని చేసేందుకు సై అంటున్నారు. వీరికి ఉద్యోగాలను వెదికిపెట్టేందుకు ‘నాట్ రిటైర్డ్.ఇన్’, మనీక్రాషర్స్.కామ్, న్యూరిటైర్మెంట్.కామ్, మాన్స్టర్.కామ్ తదితర సైట్లు ముందుకొస్తున్నాయి. ఒకసారి నిర్ణీత ఫీజు చెల్లించి నమోదు చేసుకుంటే.. ఉద్యోగం వచ్చేవరకు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇలాంటి వారు తమ అనుభవం, అర్హతలను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు పొందుతున్నారు. 30 శాతం మంది నో రి‘టైర్డ్’.. పదవీ విమరణ పొందినవారంతా ఇలా ఉద్యోగాల వేటలో ఉన్నారనుకుంటే పొరబాటే. 30 శాతం మంది ఉద్యోగాల అన్వేషణలో ఉంటే.. మరో 60 శాతం మంది సామాజిక సేవ, గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయం, కళారంగం తదితర వ్యాపకాల్లో కాలక్షేపం చేస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. మరికొందరు ఆరోగ్య రీత్యా విశ్రాంతికి.. మరికొందరు మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తేలింది. సెకండ్ ఇన్నింగ్స్.. ఎందుకంటే.. ► పనిచేస్తూ ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందన్న నమ్మకం. ► కొడుకులు, కూతుళ్లకు భారం కాకుండా.. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మనస్తత్వం. ► కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పనిచేయాల్సి రావడం. ► విదేశాల్లో ఉంటున్న సంతానం వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఇమడలేకపోవడం. ► తమ అనుభవం, విజ్ఞానంతో అద్భుతాలు సృష్టించవచ్చన్న విశ్వాసం. ► పలువురికి స్ఫూర్తినిచ్చి ఆదర్శంగా నిలవాలనుకునే వ్యక్తిత్వం. -
అందని పింఛన్ డబ్బులు..!
దేవనకొండ: మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు శుక్రవారం పింఛన్ డబ్బులు రాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని చెల్లిచెలిమల, వెలమకూరు, నల్లచెలిమల, కప్పట్రాళ్ల, దేవనకొండతో పాటు మరో 7 పంచాయతీలకు మార్చి నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు బ్యాంకులో జమ కాలేదు. దీంతో 3 వేల మంది పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందలేదు. ఉదయాన్నే పంచాయతీ కార్యాలయాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ డబ్బులు రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా పాలసీలు
మా అమ్మా,నాన్నల కోసం ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలనుకుంటున్నాను. అందుబాటులో ఉన్న సీనియర్ సిటిజన్లకు సంబంధించిన మంచి ఆరోగ్య బీమా పాలసీలను సూచించండి. –రవి కుమార్, విశాఖపట్టణం సీనియర్ సిటిజన్లకు పలు సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. అపోలో మ్యూనిచ్ ఆప్టిమ సీనియర్, రెలిగేర్ హెల్త్‌కేర్, స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్.. ఈ సంస్థల çపాలసీలను పరిశీలించవచ్చు. సీనియర్ సిటిజన్ అవసరాలను తీర్చేలా ఈ పాలసీలను రూపొందించారు. హాస్పిటల్లో చేరినా, డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ (మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఇంటి దగ్గరే చికిత్స పొందే)లను కవర్ చేసేలా ఈ పాలసీలున్నాయి. ఈ పాలసీల ప్రీమియమ్‌లు కూడా అధికంగానే ఉంటాయి. ఈ పాలసీల ప్రీమియమ్‌లు, ఫీచర్లు, మినçహాయింపులు, పాలసీ తీసుకునేటçప్పటికే ఉన్న జబ్బులకు కవరేజ్ తదితర పలు అంశాలను పరిశీలించి మీకు తగిన పాలసీని ఎంచుకోండి. నగదు రహిత వైద్యం అందించడమే వైద్య బీమా పాలసీల ముఖ్య లక్షణంగా ఉండాలి. అందుకని మీరు తీసుకునే పాలసీలో నగదు రహిత వైద్యమందించే నెట్వర్క్ హాస్పిటల్స్‌ను చెక్ చేసుకోవాలి. మీరు ఉండే నగరంలో గానీ, మీ నగరానికి సమీపంలో ఉండే ఇతర నగరాల్లో కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేలా చూసుకోవాలి. నేను ప్రవాస భారతీయుడిని. చాలా ఏళ్ల క్రితమే కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డాను. నేను భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? –సాగర్, ఈ మెయిల్ ద్వారా అమెరికా, కెనడాల్లోని ప్రవాస భారతీయుల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ స్వీకరించే కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలు.., బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా మ్యూచువల్ ఫండ్, ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్, సుందరమ్ మ్యూచువల్ ఫండ్.. వీటిల్లో మీ ఇన్వెస్ట్మెంట్ అవసరాలకు తగిన ఫండ్‌ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇటీవల కాలంలో ఫార్మా, ఐటీ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు సరిగ్గా లేదు. భవిష్యత్తులో వీటి పనితీరు బాగా ఉంటుందనే అంచనాలతో ఫా ర్మా, ఐటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో కనీసం ఐదేళ్ల పాటు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. నా నిర్ణయం సరైనదేనా? –జాకబ్, కరీంనగర్ ఫార్మా, ఐటీ, ఇలా ఒకే రంగంపై దృష్టి సారించే సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్క్‌తో కూడిన వ్యవహారమే. సంబంధిత రంగంలో ఏర్పడే ప్రతికూలతల కారణంగా ఇలాంటి సెక్టోరియల్ ఫండ్స్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్చేసేవారు ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాల పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులు తలెత్తబోతాయని అంచనా వేసినప్పుడు తక్షణం ఆ ఫండ్ల నుంచి వైదొలగాలి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగాలి. సాధారణ ఇన్వెస్టర్లకు ఈ అవగాహన ఉండదు. అందుకని ఈ తరహా ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. కాదు కూడదు తప్పనిసరిగా సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ పోర్ట్‌ఫోలియోలో స్వల్పమొత్తంలోనే పెట్టుబడులను ఈ సెక్టోరియల్ ఫండ్స్‌కు కేటాయించాలి. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్ అవసరాలను ఇప్పుడు పలు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ తీరుస్తున్నాయి. ఈ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాల్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిని నిర్వహించే ఫండ్ మేనేజర్లు ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు. ఏ రంగం భవిష్యత్తు ఎలా ఉంటుందో, వివిధ పరిణామాల కారణంగా ఏ రంగం ఎంత తీవ్రంగా ప్రభావితమవుతుందో తదితర అంశాలపై అవగాహన సాధారణ ఇన్వెస్టర్ కన్నా ఇలాంటి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లకు అధికంగా ఉంటుంది. అందుకని సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మంచి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రాబడులు పొందుతారు. అందుకని మంచి రేటింగ్ ఉన్న ఒకటి, లేదా రెండు ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. నేను చాలా సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్లి, అక్కడే సెటిల్ అయ్యాను. నా కూతురు అమెరికాలోనే పుట్టింది. అమెకు ఇప్పుడు 9 సంవత్సరాలు. పీఐఓ (పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్–పీఐఓ) హోదా ఉన్న నా కూతురు పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవ వచ్చా? –ప్రకాశ్ జైన్, ఈ మెయిల్ మీ కూతురు భారత్‌లో జన్మించనందున సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌కు ఆమె అర్హురాలు కాదు. ప్రవాస భారతీయులు, పీఐఓ, ఓసీఐ హోదా ఉన్నవారికి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరడానికి అర్హత ఉండదు. భారత్‌లోనే పుట్టి, భారత్‌లోనే పెరిగే బాలికలకే ఈ స్కీమ్ కింద ఖాతా ప్రారంభించే అర్హత ఉంటుంది. -
వృద్ధుల రాయితీకి ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వృద్ధులు ఎవరైతే తమ రైలు ప్రయాణాల్లో రాయితీ కావాలనుకుంటారో వారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. రైల్వే కౌంటర్లు, ఈ-టికెట్ బుకింగ్ సమయంలోనూ ఆధార్ కార్డు వివరాలను సమర్పించిన సీనియర్ సిటిజెన్స్‌కు మాత్రమే రాయితీ వర్తిస్తుందని సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిర్ణయం 2017 ఎప్రిల్ నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆధార్ ఆధారిత టికెట్ సిస్టమ్‌ను రెండు దశల్లో అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. తొలుత 2017 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు రైలు టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారు. అనంతరం ఎప్రిల్ నుంచి మాత్రం ఆధార్ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే రాయితీ ఇస్తారు. ఇప్పటికే డిసెంబర్ 1 నుంచి ఆధార్ నెంబర్ ద్వారా సీనియర్ సిటిజన్స్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారభించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రిజర్వేషన్ కౌంటర్లలో తమ ఆధార్ వివరాలను అందించాల్సిందిగా సీనియర్ సిటిజన్స్‌ను రైల్వే శాఖ కోరింది. చాలా మంది నకిలీ ఏజెంట్లు సీనియర్ సిటిజన్ల పేరుమీద టికెట్లు బుక్ చేసి బ్లాక్‌లో విక్రయిస్తుండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆధార్ ఉంటేనే రాయితీ టికెట్: రైల్వే
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రైల్వే టికెట్ ధర రాయితీకి ఏప్రిల్ 1, 2017 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. వయోవృద్ధులమంటూ రైల్వే టికెటింగ్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా తెలిపారు. ఆధార్ లింకును రెండు విడతల్లో అమలు చేయనున్నారు. మొదటి విడతలో 2017 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు స్వచ్ఛందంగా వయోవృద్ధులు తమ వివరాలను ఇవ్వాలని.. రెండో విడతలో ఏప్రిల్ 1 తర్వాత ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. కౌంటర్లతోపాటు ఐఆర్సీటీసీ వెబ్సైట్లోనూ ఆధార్‌తో రాయితీ టికెట్లు పొందవచ్చని సూచించారు. -
పెన్షన్ల కోసం సీనియర్ సిటిజన్స్ పాట్లు
-
సీనియర్ సిటిజన్లకే బ్యాంకు సేవలు
-
వయో వృద్ధులకే బ్యాంకు సేవలు
శనివారం నాడు పాతనోట్లు మార్చుకుందామని గానీ, ఖాతాలోంచి నగదు విత్‌డ్రా చేసుకుందామని గానీ బ్యాంకులకు వెళ్దామని అనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి. ఈనెల 19వ తేదీ శనివారం బ్యాంకులు మామూలు సమయాల్లోనే పనిచేస్తాయి గానీ, వాటిలో కేవలం వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు) మాత్రమే సేవలు అందిస్తారు. ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ రిషి తెలిపారు. రెండో శని, ఆది వారాల్లో కూడా పనిచేసిన బ్యాంకులు.. ఈసారి మూడో శనివారం అయినా సెలవు ప్రకటిస్తాయని తొలుత కొందరు భావించారు. కానీ, ఎప్పటిలాగే మామూలు పనివేళల్లోనే శనివారం పనిచేస్తాయని తెలిపారు. దేశంలోని అన్ని బ్యాంకులకూ ఈ నిబంధన వర్తిస్తుందని రాజీవ్ రిషి చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని.. ప్రతిరోజూ బ్యాంకుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. అందుకే ఈ శనివారం తాము నోట్ల మార్పిడి పని చేయబోమని.. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే మారుస్తామని అన్నారు. ఇన్నాళ్లుగా పెండింగులో పడిపోయిన మిగిలిన పనిని పూర్తిచేయడానికి శనివారాన్ని ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. -
క్యూ బాధ నుంచి పలు వర్గాలకు ఊరట
న్యూఢిల్లీ: వయోవృద్ధులకు, దివ్యాంగులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత కరెన్సీ మార్పిడి కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చొలేక వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వయోవృద్ధులు, దివ్యాంగులు ప్రత్యేక క్యూ ద్వారా బ్యాంకులో నగదు మార్పిడి చేసుకోవచ్చు. దీంతో పాటు పెన్షనర్లు ఏటా ప్రభుత్వానికి ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ గడువును వచ్చే ఏడాది జనవరి 15కు పెంచినట్లు ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగదును ప్రజల వద్దకు చేర్చే వివిధ మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. నాలుగైదు రోజులుగా బ్యాంకు ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వారందరికి తమ అభినందనలు తెలిపారు. ఏటీఎంలలో నగదు లావాదేవీలను రోజుకు రూ.2,500లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, రూ.2000 నోటును ఇవ్వగల ఏటీఎంలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. -
సీనియర్ సిటిజన్లుంటే పన్ను ఆదానే..!
ఆదాయ పన్ను చట్టం సీనియర్ సిటిజన్ల వయసును, సంపాదించే పరిస్థితి తగ్గిపోవటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రారుుతీలిచ్చిం ది. వీరిని 2 రకాలుగా చూడొచ్చు. 60 సంవత్సరాలు దాటి.. 80 ఏళ్లలోపు వారు ఒక రకం. వీరిని సిటిజన్లు అని పిలుస్తున్నాం. ఇక 80 ఏళ్లు దాటిన వారు సూపర్ సిటిజన్లు. ఇక్కడ లింగ బేధం లేదు. అలాగే రెసిడెంట్లకే ఈ వెసులుబాట్లు వర్తిస్తారుు. సీనియర్ సిటిజన్లు ⇔ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 60 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. 60లో అడుగుపెట్టడం కాదు. 60 సంవత్సరాలు నిండి ఉండాలి. ⇔ వీరికి సంవత్సరపు నికర ఆదాయం/ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.3లక్షల వరకు మినహారుుంపు ఉంది. ⇔ మిగతా వారు అంటే.. 60 సంవత్సరాల లోపల వారికి మినహారుుంపు రూ.2,50,000గా ఉంది. అంటే సిటిజన్లకు అదనంగా రూ.50,000 పన్ను మినహారుుంపు ఉంది. ⇔ రిటర్నులు ఈ-ఫైలింగ్ ద్వారా వేయాలి. నికర ఆదాయం రూ.5,00,000 దాటకపోతే కౌంటర్లో దాఖలు చేయవచ్చు. ⇔ వీరి ఆదాయంలో వ్యాపారం/వృత్తి మీద రాబడి లేకపోతే అడ్వాన్స ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ⇔ 80డి కింద పొందే ప్రయోజనాలన్నింటితోపాటు అదనంగా రూ.5,000 మేర ప్రయోజనం పొందొచ్చు. ఇది మెడిక్లెరుుమ్. ⇔ 80డిడిబి కింద వైద్య చికిత్సకి మినహారుుంపులు ఉన్నారుు. ⇔ ఫారం 15 హెచ్ అందజేస్తే బ్యాంకు వారు మీకొచ్చే వడ్డీ ఆదాయంలో పన్నుకోత (టీడీఎస్) చేయరు. సూపర్ సీనియర్ సిటిజన్లు ⇔ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 80 ఏళ్లు పూర్తి అవ్వాలి. 80లోకి అడుగుపెట్టడం కాదు. ⇔ ఈ వర్గం వారికి నికర ఆదాయం/ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.5,00,000. పన్ను భారం లేదు. ఇది పెద్ద ఉపశమనం. దీని వల్ల రూ.2,50,000 పన్ను భారం తగ్గుతుంది. ⇔ రిటర్నులు, ఈ-ఫైలింగ్ తప్పనిసరి కాదు. ⇔ ఐటీఆర్-1, 2, 2ఏ దాఖలు చేసేవారు కౌంటర్లో (మాన్యువల్‌గా) దాఖలు చేయవచ్చు. డిజిటల్ సంతకం అక్కర్లేదు. ఈ-ఫైలింగ్‌తో పని లేదు. ⇔ వీరికి కూడా వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే ముందుగా అడ్వాన్స ట్యాక్స్ చెల్లించనవసరం లేదు. ⇔ సెక్షన్ 80 డి ప్రకారం.. మెడిక్లెరుుమ్ అదనంగా రూ.5,000 మేర క్లెరుుమ్ చేసుకోవచ్చు. ⇔ అలాగే వైద్య చికిత్సల నిమిత్తం అదనంగా రూ.20,000లు మినహారుుంపు పొందొచ్చు. ⇔ ఫారమ్ 15 హెచ్తోబ్యాంకులు టీడీఎస్ చేయరు. ⇔ ఇవన్నీ కాకుండా ట్యాక్స్ప్లానింగ్లో సీనియర్ సిటిజన్ల ప్రమేయం ఎంతో ఫలితాన్నిస్తుంది. ఇంట్లో సీనియర్ సిటిజన్లు ఉంటే వారి రాయితీల వల్ల ప్రతి ఒక్కరూ ఏదో వ్యాపారం చేయవచ్చు. -
వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం
వడోదరా: దేశంలోని వయోధికులకు ఆరోగ్య సేవలు, వసతి సౌకర్యం కల్పించేలా త్వరలో నూతన జాతీయ విధానాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ముందు పెట్టినట్టు సోమవారం వడోదరలో తెలిపారు. -
అత్యంత సురక్షితంకాని నగరం ఇదే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహిళలకే కాదు సీనియర్ సిటిజెన్లకు కూడా సురక్షితం కాదట. దేశంలో సీనియర్ సిటిజెన్లకు సురక్షితంకాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. వరుసగా రెండో ఏడాది కూడా ఢిల్లీ అత్యంత సురక్షితంకాని నగరంగా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఎన్సీఆర్బీ ప్రకారం.. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలో సీనియర్ సిటిజెన్లపై జరిగే నేరాలు ఐదురెట్లు అధికం. ప్రతి లక్షమందిలో 108.8 మందిపై నేరాలు జరుగుతున్నాయి. గతేడాది ఢిల్లీలో సీనియర్ సిటిజెన్లపై జరిగిన నేరాల్లో 145 దొంగతనం కేసులు, 123 ఛీటింగ్, 14 హత్య కేసులు, 2 హత్యాయత్నం కేసులు, ఓ అత్యాచారం కేసు ఉన్నాయి. గతేడాది మొత్తం 1248 కేసులు నమోదయ్యాయి. 2014తో పోలిస్తే గతేడాది 19 శాతం నేరాలు పెరిగాయి. ఇక 2014లో దేశవ్యాప్తంగా 18714 కేసులు నమోదైతే, గతేడాది 20532 కేసులు నమోదయ్యాయి. సీనియర్ సిటిజెన్ల కోసం 1291 హెల్ప్ లైన్ నెంబర్ ఉందని, వారు ఆపదలో ఉంటే ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేయవచ్చని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. -
వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
దామరచర్ల : కృష్ణా పుష్కరాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నదిలో స్నానమాచరించడానికి ఘాట్ పక్కనే ఉన్న కొంత భాగాన్ని ప్రత్యేకంగా వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. దీంతో పాటుగా పార్కింగ్ స్థలాల నుంచి ఘాట్ల వరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఆటోలను గుర్తించి పాస్‌లు ఇస్తున్నారు. ఆయా ఆటోలు తక్కువ చార్జీకే వారిని ఘాట్లకు వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. -
వృద్ధులు రైల్వే రాయితీ వదులుకోవచ్చు
న్యూఢిల్లీ: రాయితీల భారం తగ్గించుకోవడానికి రైల్వే.. సీనియర్ సిటిజన్లు రైల్వే ప్రయాణ చార్జీల్లో రాయితీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ఆప్షన్‌ను తెస్తోంది. అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. పూర్తి చార్జీని చెల్లించే స్థోమత కలిగిన వృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వయో వృద్ధులకు రూ. 1,100 కోట్ల రాయితీ ఇచ్చామన్నారు. -
ఆదాయం లేదు.. రిటర్న్ వేయలా?
నేనొక సీనియర్ సిటిజన్‌ను. పన్ను చెల్లించేంత ఆదాయం నేను ఆర్జించడం లేదు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా రూ.3.20 లక్షల దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. మూలధన లాభాలు రూ.3 లక్షలు మించినందున నేను ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలా? - నారాయణరావు, విజయవాడ రూ.3 లక్షల ఆదాయన్ని మించి ఆర్జించినట్లయితే సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ రిటర్న్‌లు సమర్పించాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా మీకు రూ.3.2 లక్షల దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఏమీ లేదు. అందుకని మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయినప్పటికీ మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తేనే మంచిది. మీరు ఐటీఆర్-2 రిటర్న్‌ను సమర్పిస్తే సరిపోతుంది. నేను ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్)లో 2012, జూలై నుంచి పెట్టుబడులు పెడుతున్నాను. ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లో 2014 అక్టోబర్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ పెట్టుబడులపై నాకు ఎంత వడ్డీ వస్తుంది? నేను పెట్టుబడులు పెట్టినప్పటి నుంచి వడ్డీ లెక్కిస్తారా ? లేకుంటే 2016లో సవరించిన వడ్డీరేట్లు చొప్పున లెక్కిస్తారా ? - నవీన, హైదరాబాద్ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) వడ్డీరేట్లను ప్రతి మూడు నెలలకొకసారి సవరిస్తున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్‌లకు అనుగుణంగా ఈ సవరింపు ఉంటుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి (ఏప్రిల్-జూన్, 2016) వడ్డీరేట్లు 8.10 శాతం(ఏడాదికి)గా ఉంది. మీరు 2012 నుంచి పెట్టుబడి చేస్తున్నారు, కనుక ఈ ఏడాది మార్చి వరకూ అప్పటి వడ్డీ రేట్లను మీరు పొందివుంటారు. అలా వడ్డీ, అసలు కలిపి మీ ఖాతాలో వున్న మొత్తంపై తాజాగా సవరించిన వడ్డీ రేటు ప్రకారం మీకు వడ్డీ వస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ విషయానికొస్తే, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత రేటు ఉందో అంతే వడ్డీరేటు వర్తిస్తుంది. ఆర్డీ రేట్లలో వచ్చే మూడు నెలల వారీ మార్పులు మీ ప్రస్తుత ఆర్డీ ఖాతాపై ఎలాంటి ప్రభావం చూపవు. నేను గత ఏడాది జూలై నుంచి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్ ప్లాన్‌కు సంబంధించి రెండు పాలసీలు తీసుకున్నాను. ఒకో దానికి రూ.3 లక్షలు చొప్పున మొత్తం ఆరు లక్షలు ప్రీమియమ్గా చెల్లించాను. ఈ ప్లాన్ విలువ ఇప్పుడు తగ్గిపోయింది. ఈ ప్లాన్‌కు ఐదేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించాలనుకోవడం లేదు. అందుకు గాను రూ.12,000 జరిమానా భరించడానికి సిద్ధంగానే ఉన్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - కిశోర్, విశాఖపట్టణం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్మార్ట్ వెల్త్ బిల్డర్ పేరుతో సంప్రదాయ యులిప్ ప్లాన్లను అందిస్తోంది. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించే ప్రీమియమ్‌ల నుంచి మొరాలిటీ చార్జీలను, నిర్వహణ వ్యయాలను, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఈ చార్జీల భారం కారణంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో తరుగు ఏర్పడుతుంది. అందువల్ల మార్కెట్ పనితీరు బాగా ఉన్నప్పటికీ, మీకు తక్కువ స్థాయిలోనే రిటర్న్‌లు వస్తాయి. కమిషన్ అధికంగా వస్తున్నందున ఏజెంట్లు ఈ ప్లాన్లను విక్రయించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. లేనిపోని ఆశలు కల్పిస్తారు. అందుకని ఏ పాలసీ తీసుకునేముందైనా ఆ పాలసీ బ్రోచర్‌ను, సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఈ పాలసీకు లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఈ పాలసీలను మీరు ఇప్పుడు సరెండర్ చేసినట్లయితే, ఈ ఫండ్ విలువ మొత్తాన్ని డిస్కంటిన్యూడ్ పాలసీ ఫండ్‌కు బదిలీ చేస్తారు. డిస్కంటిన్యూయస్ చార్జీ(ఫండ్ విలువలో 1% కంటే తక్కువగానూ, గరిష్టంగా రూ.6,000) మినహాయించుకుంటారు. ఐదు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మీకు ఈ సొమ్ము అందుతుంది. బీమాకు, ఇన్వెస్ట్మెంట్స్ కలగలపి ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమాకోసం ఆన్లైన్ టర్మ్ ప్లాన్ తీసుకోండి. వీటి ప్రీమియమ్‌లు చౌకగా ఉంటాయి. తగిన బీమాను ఇస్తాయి. ఇక ఇల్లు కొనడం, పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, తదితర దీర్ఘకాల లక్ష్యాలకు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందుతారు. నేను బీఎస్ఎల్ ఎంపవర్ పెన్షన్ ప్లాన్‌ను 2013 డిసెంబర్లో తీసుకున్నాను. ఏడాదికి రూ.2.5 లక్షల చొప్పున మూడేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాను. ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటున్నాను. ఈ పాలసీ సరెండర్ చేసినప్పుడు నాకు వచ్చే సరెండర్ విలువపై నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? - రాజగోపాల్, రాజమండ్రి బిర్లా సన్ లైఫ్ ఎంపవర్ పెన్షన్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ) ఐదేళ్ల తర్వాత మీరు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయవచ్చు. మీరు సరెండర్ చేసేటప్పుడు సదరు ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే మీకు సరెండర్ విలువగా లభిస్తుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఈ సరెండర్ వేల్యూపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
సీనియర్ల ప్రపంచంలోకి ఈజీ ఫోన్
మార్కెట్లోకి విడుదలచేసే రకరకాల ఫీచర్ ఫోన్లన్నీ కేవలం యువతకేనా.. సీనియర్ సిటిజన్ల కోసం అవసరం లేదా..? అంటే వారికోసం ఓ కొత్తరకం మొబైల్ ఫోన్ ను తయారు చేశామంటున్నది సీనియర్ వరల్డ్ కంపెనీ. సీనియర్ల ప్రపంచంలోకి ఓ కొత్తరకం ఫీచర్ ఫోన్ ను కంపెనీ విడుదల చేసింది. ఈజీ ఫోన్ గా పిలుచుకునే ఈ ఫోన్ ను సీనియర్లకు అనుకూలంగా రూపొందించామని వెల్లడించింది. కేవలం రూ. 3,375 లకే ఈ ఈజీఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించామని చెప్పింది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని కంపెనీ ఆవిష్కరణ అనంతరం తెలిపింది. ఎస్ఓఎస్ బటన్ తో కూడిన ఈ ఫోన్, నాలుగు ఆటోమేటెడ్ పనులను చేసేటట్టు రూపొందించామని తెలిపింది. క్లిష్టమైన వివరాలతో ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్ గా ఈ ఫోన్లో పొందుపరిచామని పేర్కొంది. సీనియర్లు ప్రత్యేక అవసరాలకే ఫోన్లను వాడుతుంటారని, వారికి కచ్చితంగా ఈ ఫోను ఉపయోగపడుతుందని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా తెలిపారు. కేవలం కమ్యూనికేషన్ డివైజ్ లాగానే కాక, సీనియర్ల మనస్సులో స్వేచ్ఛ, శాంతిని నెలకొల్పేలా దీన్ని తయారుచేశామని పేర్కొన్నారు. సులభం, సరళత, భద్రతకు మధ్య తేడాను ఈజీఫోన్ భర్తీ చేస్తుందని చెప్పారు. డెలివరీ సర్వీసులు, పాడు అయినప్పుడు బాగు చేయడం వంటి ఉచిత సర్వీసులు ఈ కంపెనీ కల్పించనున్నట్టు రాహుల్ గుప్తా చెప్పారు. -
ఆ విషయంలో తాతయ్యలూ ఫాస్టే!
సుబ్బారావు వయస్సు 80 ఏళ్లకు పైచిలుకు ఉంటుంది. ఆయనకు తనకాలం సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ వరకు ఆనాటి సినిమా పోస్టర్లను పోస్టు చేస్తూ.. కన్నాంబ నుంచి సావిత్రి వరకు వారి అందాలను పొగుడుతూ.. తన యవ్వన జ్ఞాపకాల్లోకి జారుకుంటారు ఆయన. సహజంగానే ఆ పాత మాధుర్యాన్ని గుర్తుచేసే ఆయన పోస్టులు ఫేస్బుక్లో చాలా ఫేమస్. బాపు బొమ్మల నుంచి జోకుల వరకు ఆయన ఏది పెట్టినా తెగ లైకులు, కామెంట్లు వచ్చేస్తాయి. తాతాగారికీ ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇలా చాలామంది తాతయ్యలు, బామ్మలు ఇప్పుడు ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నారు. ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడి.. తల్లిదండ్రులు స్వదేశంలో ఒంటరిగా జీవిస్తున్న నేపథ్యంలో ముదిమిప్రాయంలో వారికొక తోడుగా సోషల్ మీడియా మారిపోయింది. ఫేస్బుక్ వాళ్లకు బెస్ట్ ఫ్రెండ్‌గా మారింది. యువత మాత్రమే కాదు వృద్ధులు కూడా ఇప్పుడు ఫేస్‌బుక్‌ను అత్యధికంగా వాడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. పదేళ్ల కిందట స్నేహితుల కోసం, కాలక్షేపం కోసం యువత ఫేస్‌బుక్‌ను ఆశ్రయించగా.. ఇప్పుడు ఇదే కారణంతో సోషల్ మీడియాలో ఖాతా తెరుస్తున్నారట. పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత సంతతికి చెందిన ఎస్ శ్యాం సుందర్ ఈ అధ్యయనం నిర్వహించారు. సమాజంలో నిత్యం ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస.. సామాజిక సంబంధాలను పెంచుకోవాలన్న ఆలోచనతో వృద్ధులు ఫేస్బుక్ వాడుతున్నారని ఆయన తెలిపారు. తమ పిల్లలు, ముఖ్యంగా తమ మనవలు ఏం చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు.. తెలుసుకోవడానికి చాలామంది తాతయ్య, బామ్మలు ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారని, మానవ సంబంధాలకు వారధిగా ఉంటూ సానుకూల ప్రభావాన్ని ఇది చూపుతుందని ఆయన వివరించారు. -
అన్క్లెయిమ్డ్ మొత్తం...ఇక వృద్ధుల సంక్షేమానికి!
ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు ♦ చిన్న పొదుపు, ఈపీఎఫ్‌లో రూ.9వేల కోట్లున్నట్లు అంచనా న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత సదుపాయాలు, పెన్షన్ సౌలభ్యం కోసం కేంద్రం వినూత్న నిర్ణయం తీసుకుంది. చిన్న పొదుపు పథకాలు, ఈపీఎఫ్, పీపీఎఫ్‌లలో ఉన్న అన్క్లెయిమ్డ్ (ఎవ్వరూ క్లెయిమ్ చెయ్యనివి) మొత్తాన్ని వీరి సంక్షేమానికి వినియోగించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఇలాంటి అన్క్లెయిమ్డ్ మొత్తాలు దాదాపు రూ.9,000 కోట్లు ఉన్నట్లు అంచనా. ఈ నిధుల వినియోగం విషయమై తాజాగా కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం పోస్టాఫీసులు, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు- ఏటా మార్చి 1వ తేదీలోపు అన్క్లెయిమ్డ్ మొత్తాలను లెక్కించి, ‘సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్’కు జమ చేయాల్సి ఉంటుంది. వీటిని సీనియర్ సిటిజన్ల ఆర్థిక భద్రత, వృద్ధాప్య పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా సంబంధిత సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తారు. వృద్ధాశ్రమాలు, వృద్ధుల రోజూవారీ సంరక్షణ, వారికి సంబంధించి పరిశోధనా కార్యకలాపాలపై సైతం సంక్షేమ నిధి దృష్టి సారిస్తుంది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.... ♦ దేశంలో దాదాపు 10.5 కోట్ల మందికి పైగా వృద్ధులున్నట్లు అంచనా. వీరిలో కోటి మందికి పైగా 80 యేళ్ల వయస్సు పైబడినవారే. 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ♦ అన్క్లెయిమ్డ్ నిధులను సంక్షేమ నిధికి బదలాయించే ముందు ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థలు... అన్క్లెయిమ్డ్ డబ్బుకు సంబంధించిన అకౌంట్ హోల్డర్లను గుర్తించడానికి తగిన ప్రయత్నాలన్నీ చేయాలి. లిఖితపూర్వక నోటీసులు, ఈ మెయిల్, టెలిఫోన్ మెసేజ్‌లు ఇతరత్రా మార్గాల ద్వారా ఈ ప్రయత్నాలు జరగాలి. -
‘పొదుపు’పై పిడుగు..!
సామాన్యుడికి కేంద్రం షాక్.. ♦ పీపీఎఫ్‌పై వడ్డీరేటు 8.7% నుంచి 8.1%కి తగ్గింపు ♦ సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్, ♦ కిసాన్ వికాస్ పత్ర యోజనలపై సైతం రేటు కోత ♦ మరికొన్ని చిన్నమొత్తాల పొదుపులపై కూడా... ♦ ఏప్రిల్ 1 నుంచీ కొత్త రేట్లు అమలు న్యూఢిల్లీ: సామాన్యుడి పొదుపుపై మళ్లీ దెబ్బపడింది. బ్యాంకు డిపాజిట్లకంటే కాస్త మెరుగైన రాబడికి, విశ్వసనీయతకు తగిన పొదుపు సాధనాలుగా ప్రజలు ఎంచుకునే చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లపై ప్రభుత్వం బాగా కోత విధించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)సహా చిన్న పొదుపులపై చెల్లించే వడ్డీరేటును శుక్రవారం మరోసారి కేంద్రం తగ్గించింది. మార్కెట్ రేటుకు అనుసంధానం చేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలని ఫిబ్రవరి 16న తీసుకున్న నిర్ణయంలో భాగంగా... తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత సమీక్ష సందర్భంలో సామాజిక భద్రతా పథకాలుగా పేర్కొన్న సుకన్యా సమృద్ధి యోజన, ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి ప్రజాదరణ పథకాలపై సైతం ఈ దఫా వడ్డీరేటు కోత వేటు పడ్డం గమనార్హం. ఈ పథకాల వడ్డీ రేట్లను ముట్టుకోబోమంటూ చెప్పిన ప్రభుత్వం వాటి వడ్డీ రేట్లను సైతం దించేయడం సామాన్యుని పొదుపు రేటుపై మరో శరాఘాతమేనన్న విమర్శలు తలెత్తుతున్నాయి. తాజా రేటు ఏప్రిల్ 1-జూన్ 30 వరకూ అమలవుతుంది. వివిధ పథకాలపై తాజా రేట్లు ఇవి... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. ♦ కిసాన్ వికాస్ పత్రపై రేటు 8.7 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. కిసాన్ వికాస పత్రలో మదుపులు ప్రస్తుతం 100 నెలలకు (ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు) రెట్టింపు అవుతుండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ కాలం 110 (తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు) నెలలకు పెరిగింది. ♦ తపాలా సేవింగ్స్‌పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది. ప్రజాదరణ కలిగిన ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. ఐదేళ్ల ప్రస్తుత మంత్లీ ఇన్కమ్ అకౌంట్ రేటు సైతం 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది. పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై సైతం రేటు తగ్గింది. ప్రస్తుతం వీటిపై 8.4 శాతం వడ్డీ వస్తుండగా... ఏప్రిల్ 1 నుంచి ఏడాది టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.4 శాతం వడ్డీ అందుతుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ♦ సామాజిక అభివృద్ధి పథకంగా పేర్కొని, గత సమీక్ష సందర్భంగా మినహాయించిన కీలక సుకన్యా సమృద్ధి యోజనపై సైతం రేటు కోత పడింది. ఈ రేటు 9.2 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది. ♦ గత సమీక్ష సందర్భంగా మినహాయింపు పొందిన ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌దీ ఇదే పరిస్థితి. ఈ రేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గించింది. ♦ ఒకటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్రాలు, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై ఇప్పటి వరకూ... ఇదే కాలాలకు సంబంధించి ప్రభుత్వ బాండ్లకన్నా అదనంగా పావుశాతం రేటు అందుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ప్రయోజనం ఏప్రిల్ 1 నుంచి మదుపుదారుకు అందదు. ♦ ఫిబ్రవరి 16 ‘త్రైమాసిక సమీక్ష’ నిర్ణయం సందర్భంగా షార్ట్ టర్మ్ పోస్టాఫీస్ డిపాజిట్లపై 0.25 శాతం రేటు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం, సామాజిక భద్రతా పథకాల పేరుతో దీర్ఘకాల పథకాలు బాలికా, సీనియర్ సిటిజన్, ఎంఐఎల్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పీపీఎఫ్‌లపై మాత్రం వడ్డీరేటు కోత నిర్ణయాన్ని తీసుకోలేదు. క్వార్టర్‌కు దాదాపు 15 రోజుల ముందు ఈ రేట్ల సమీక్ష జరుగుతుందని ఫిబ్రవరి 16న ప్రభుత్వం ప్రకటించింది. రేట్ల తాజా నిర్ణయానికి క్రితం 3 నెలల ప్రభుత్వ బాండ్ రేట్ల ప్రాతిపదికన (ఉదాహరణకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) ఈ సమీక్ష జరుగుతుంది. ♦ చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌ల ద్వారా రానున్న ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ. 4 లక్షల కోట్లు సేకరించగలుగుతుందని అంచనా. వీటిపై చెల్లించే వడ్డీరేట్ల తాజా తగ్గింపు వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 4 వేల కోట్లు ఆదా అవుతుందని అంచనా. -
ఇదీ మా అజెండా..
⇒ తమను గుర్తించేవారికే ఓటు అంటున్న సీనియర్ సిటిజన్స్ ⇒ జగమంత కుటుంబం నాది.. ⇒ ఏకాకి జీవితం నాది.. ⇒ సంసార సాగరం నాదే.. ⇒ సన్యాసం శూన్యం నాదే.. నాదే.. గ్రేటర్ జనాభా 80లక్షలు వృద్ధులు 8 లక్షలు ఓ రచయిత రాసిన గొప్ప పాట. వృద్ధుల కన్నీటి కష్టం. ఇది చాలదూ వృద్ధుల కన్నీటి కష్టాల కడలిని తడిమేందుకు.. ‘ఆసరా’ లేనిదే అడుగు వేయలేని పరిస్థితి. అందరూ ఉన్నా ఆదరణ లేని జీవితం.. భద్రత లేని బతుకులు.. కుంగదీసే ఒంటరితనం.. ఎటూ వెళ్లలేని దుస్థితి.. ఏమీ చేయలేని నిస్సహాయత.. ఓ వైపు వయోభారం.. మరోవైపు అనారోగ్యం.. ఎన్ననీ చెప్పేది.. ఏమనీ చెప్పేది వయోవృద్ధుల కష్టాలు. గ్రేటర్ ఎన్నికల వేళ తమ సంక్షేమం పట్టని పాలకుల నిర్లక్ష్యంపై సీనియర్ సిటిజన్లు గళమెత్తుతున్నారు. తమ బతుకులకు భరోసానిస్తూ.. సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీకే పట్టం కడతామంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో, సనత్‌నగర్ నగరంలో సీనియర్ సిటిజన్లకు రక్షణ కరవైంది. సామాజిక భద్రత కొరవడి.. దొంగతనాలు, మోసాలు.. చివరకు హత్యలు సిటీలో నిత్యకృత్యంగా మారింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. అందరూ ఉన్నా వయోవృద్ధులు ఒంటరి జీవితం గడుపుతున్నారు. దీనికి తోడు అనారోగ్యం.. సమాజంలోనూ చులకన భావం, వివక్ష. వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం విస్మరిస్తోంది. భద్రత కరవు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కారణంగా వివిధ ప్రాంతాలకు వలసలు అనివార్యమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు వేరే చోటుకు వెళ్లినవారి తల్లిదండ్రులు రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలిపోతున్నారు. దీంతో వారి రక్షణ గాలిలో దీపంగా మారుతోంది. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ యోగక్షేమాలు చూసుకొనేవారు లేక అనాథల్లా బతుకుతున్నారు. గ్రేటర్లో 8 లక్షలకు పైగా వృద్ధులుంటే.. వీరిలో సగం మంది పరిస్థితి ఇదే. సంక్షేమం.. ఓ ప్రహసనం.. సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టాలూ మొక్కుబడిగానే అమలవుతున్నాయి. వృద్ధాశ్రమాలు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. వీటిలో కనీస వైద్య సదుపాయాలు కూడా ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో చిన్నవి, పెద్దవి కలిపి 500 వరకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వీటిలో సుమారు 10 వేల మంది వృద్ధులు ఉంటున్నారు. డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనుమతితో ఏర్పడిన కొన్ని ఆశ్రమాల్లో మినహా చాలా చోట్ల వృద్ధాశ్రమాల నిర్వహణ కమర్షియల్‌గా మారింది. వారిని ఆదాయ వనరుగా పరిగణిస్తున్నారే తప్ప.. సేవలు అందించడం లేదు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వృద్ధుల సంక్షేమార్థం ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభిస్తే ప్రస్తుతం ఇది నామమాత్రమైంది. వృద్ధుల కోసం ప్రారంభించిన హెల్ప్‌లైన్ (1253) పనిచేయడం లేదు. డేకేర్ సెంటర్లు మెరుగుపర్చాలి సీనియర్ సిటిజన్స్ కోసం నెలకొల్పిన డేకేర్ సెంటర్ల నిర్వహణ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల పేపర్ కూడా రావడం లేదు. నిర్వహణకు నెలకు రూ.3 వేల ఇచ్చేవారు. గత ఏప్రిల్ నుంచి నిలిపేశారు. సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసే వారికే నా ఓటు. - జేఎస్టీ సాయి, మోడల్ కాలనీ ఉచిత వైద్యం అందజేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నారు. కానీ అనేక రంగాల్లో ఉన్నతమైన సేవలందించిన సీనియర్ సిటిజన్లను మాత్రం విస్మరిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన గౌరవ ం ఇవ్వడం లేదు. వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీకే నా ఓటు. - రామ్మోహనరావు, సనత్‌నగర్ బస్సుల్లో రెండు సీట్లేనా..? సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో కేవలం రెండే సీట్లు కేటాయించారు. అవి కూడా పూర్తి స్థాయిలో వారికి దక్కడం లేదు. బస్సుల్లో సీట్ల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచాలి. వృద్ధులే కూర్చునేలా చూడాలి. ఇండోర్‌గేమ్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకునే వారికే నా ప్రాధాన్యం. - మురళి, సనత్‌నగర్ రైల్వేలో రాయితీ తగ్గిస్తే ఊరుకోం.. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలో కోత విధించే ఆలోచనను విరమించుకోవాలి. ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 50 శాతం రాయితీని మరింత పెంచాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మా సమస్యలు పరిష్కరించే పార్టీకే పట్టం కడతాం. - ప్రసాద్‌రావు, సనత్‌నగర్ ఇవి అవసరం.. ►సీనియర్ల కోసం సిటీలో 50 డేకేర్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలి. ►డేకేర్ సెంటర్లలో క్రీడా వస్తువులు, పత్రికలు, ఫిజియో థెరపీ సదుపాయం ఉండాలి. ►వైద్య పరీక్షల నిమిత్తం వృద్ధుల నుంచి స్థానికంగా నమూనాలు సేకరించి లేబోరేటరీలకు తరలించే అవకాశం, అంబులెన్స్ అందుబాటులో ఉండాలి. ►అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రాయితీపై వైద్య సేవలు చేయాలి. ►పిల్లలు, బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సత్వరమే న్యాయం జరిగేలా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ►నడవలేని వారికి చక్రాల కుర్చీలు, ఇతర పరికరాలు అందజేయాలి. -
నా పాత్ర బాధపడినా... నాకు కన్నీళ్లొస్తాయి!!
గోదావరి తీరాన రాజమండ్రిలో పుట్టి పెరిగిన అమ్మాయి మధు. అందుకేనేమో ఆమె ముఖంలో, నవ్వులో, పలుకులో అచ్చమైన తెలుగుదనం ఉట్టి పడుతుంటుంది. టీవీ సీరియల్స్‌లో ఆమెను చూస్తుండే సీనియర్ సిటిజన్లు ఆమెలో తమ మనవరాలిని చూసుకుంటారు. ‘‘షాపింగ్‌మాల్స్‌లో కనిపించినా, బయట మరెక్కడ కనిపించినా పెద్దవాళ్లు నన్ను గుర్తుపట్టి ‘ఎంత నటన అయితే మాత్రం ఎందుకమ్మా! నిన్ను మరీ అంత ఏడిపిస్తారు’ అని బాధపడేవాళ్లు. నన్ను, నా పాత్రను అంతగా ఆదరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది’’ అంటారు మధు. తృప్తినిచ్చిన సన్నివేశం! నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన సన్నివేశం ‘మిస్సమ్మ’లో వచ్చింది. అందులో ఇంటికి పెద్ద కూతుర్ని. చెల్లెలు పెళ్లి చేసుకుని హనీమూన్‌కెళ్లి ఉంటుంది. ప్రతి సంఘటననూ ఫోన్లో చెబుతూ ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో తండ్రి ప్రాణాలు పోతాయి. చెల్లి అక్కడ షాపింగ్ చేస్తూ నాన్న కోసం శాలువా కొంటున్నాను, నాన్నకు చాలా బాగుంటుంది అని సంతోషంగా చెబుతూ ఉంటే, ఇక్కడ తండ్రి పార్థివ దేహం మీద శాలువా కప్పుతుంటారు. తండ్రి పోయిన విషయం చెప్పకుండా మేనేజ్ చేయాల్సిన సీన్ అన్న మాట. గొంతులో, ముఖంలో బాధ పొంగుకొస్తుండాలి, చెల్లికి అనుమానం రాకుండా సంతోషం ధ్వనింపచేయాలి. సావిత్రి... సౌందర్య! సావిత్రి నటన, సౌందర్య కట్టుబొట్టు నాకు చాలా ఇష్టం. నేను నటిని కాక ముందు కూడా వాళ్ల నటనను బాగా ఇన్వాల్వ్ అయి చూసేదాన్ని. ఇప్పుడైతే ఈ పాత్రను వాళ్లయితే ఎలా చేసేవాళ్లు అనే కోణంలో సాధన చేస్తున్నాను. అది నాకు చాలా ప్లస్ అవుతోంది. ఏ రోజు ఏ సీన్ నటించాల్సి ఉంటే ఆ తరహా మేకప్, డ్రస్‌తో వెళ్లి పోతాను. పాత్రలో అంతగా ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి గ్లిజరిన్ పెట్టకుండానే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంతా సహజంగా ఉంటుందని డెరైక్టర్, మిగిలిన నటులు మెచ్చుకుంటారు కూడా. తీరాల్సిన కోరిక! ఇప్పటి వరకు నాకు డబ్బింగ్ చెప్పే అవకాశం రాలేదు. నా పాత్రకు సొంత గొంతుతో నటించాలని ఉంది. అలాగే పవిత్రబంధం సినిమాలో సౌందర్య చేసినటువంటి పాత్రలో నటించాలని ఉంది. ఇక కుటుంబం అంటే అక్కకు పెళ్లయింది. రాజమండ్రిలో ఉంటుంది. అమ్మానాన్న, నేను హైదరాబాద్‌లో ఉంటున్నాం. దేవుడు మంచి అమ్మానాన్నలను ఇచ్చాడు. ఆదరించే బంధువులను ఇచ్చాడు. అడక్కుండానే నటిని చేశాడు. అలాగే మంచి అబ్బాయితో పెళ్లి చేయిస్తాడనే నమ్మకం ఉంది. -
పలకరిస్తే చాలు.. అదే పదివేలు
పండుటాకుల పండగ జీవన సాగరంలో ఎన్నో సుడిగుండాలను దాటివచ్చారు... మలిసంధ్యలో అడుగు పెట్టారు.. వారికి సిరి సంపదలు అక్కర్లేదు.. రాజభోగాలు అవసరం లేదు.. పలకరిస్తే చాలు పులకరించిపోతారు.. ఆత్మీయులను చూడగానే పసిపిల్లలై పోతారు. నిండైన ఆప్యాయతను స్వచ్ఛమైన ప్రేమను పంచుతారు. అలాంటి వృద్ధులందరికీ నేడు పండుగ రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. అనంతపురం కల్చరల్: కొమ్మకు పూసిన పూలు వాడక తప్పవు. చెట్టుకు కాసిన కాయలు రాలకా మానవు. అలాగే పుట్టిన ప్రతి మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సృష్టి వైచిత్రి. జననం, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం.. ఇదే జీవిత క్రమం. జీవన సత్యం. వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. చిన్న పలకరింపులు కోరుకునే వయసు, ఆత్మీయుల కోసం ఎదురు చూసే మనసు వారి సొంతం. 60 ఏళ్లు దాటిన వారిని సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికంటూ చరిత్రలో ఓ రోజును కేటాయించారు. ఆగస్టు 21న ‘సీనియర్ సిటిజన్ల దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. మలిసంధ్యకు చేరుకున్న ఈ సీనియర్ సిటిజన్లు భయపడుతూ రాలిపోకుండా.. శేష జీవితాన్ని ఆనందంగా గడపాలన్నది ఈ దినోత్సవం అందించే సందేశం. అందుకనుగుణంగానే ఆరు సంవత్సరాల కిందట నగరంలో జిల్లా సీనియర్ సిటీజన్ కార్యాలయం ఏర్పాటైంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటి గురించి పోరాడుతున్నారు. దాదాపు ఇందులో 700 మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో చాలా మంది క్రమం తప్పకుండా కలుస్తూ సాధక బాధకాలు పంచుకుంటున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఆత్మనూన్యతా భావం విడనాడాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది హాయిగా సంతోషంగా గడుపుతున్నారు. ఈనెల 23న జిల్లా సీనియర్ సిటిజన్ల గెట్ టు గెదర్ నిర్విహించనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఓవర్ బ్రిడ్జి సమీపంలోని జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి అందరూ తప్పక హాజరై సీనియర్ సిటీజన్ల సమస్యలపై చర్చించాలని కోరారు. భయం వీడాలి చాలా మంది వృద్ధాప్యం వస్తోందంటే ఎక్కువగా భయపడుతుంటారు. బతికనన్ని రోజులు ఆనందంగా ఉల్లాసంగా గడిపితే ఎలాంటి అనారోగ్యం దరి చేరదు. అలా ఉండాలనే మేమంతా ప్రతిరోజు కలుస్తూ ఎలాంటి కష్టసుఖాన్నైనా పంచుకుంటాము. పిల్లలు కూడా బాధ్యతలను గుర్తెరిగి వారిని పలకరిస్తుంటే చాలు. - నంబియార్, తపోవనం ప్రభుత్వాలు ఆదుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే హెల్త్ అసిస్టెన్స్ వృద్ధులకు కూడా ఇవ్వాలి. బస్సు చార్జీల్లో రాయితీ ఇవ్వాలి. అనంత జనాభాలో పాతిక శాతం సీనియర్ సిటీజన్లున్నారు. వారికి మేమే స్వయంగా వృద్ధాశ్రమాన్ని కట్టించాలని ప్రయత్నిస్తున్నాము. సీనియర్ సిటిజన్లు సాహిత్యంలోనే, కళా రంగంలోనో ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. - ముడార్ వేణుగోపాల్, సభ్యుడు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ యంగ్‌గా ఉండాలనుకుంటా వయసు మీద పడుతున్న భావనను దగ్గరికి రానీయకపోతే చాలా మటుకు వృద్ధాప్యపు బాధలు తొలగిపోతాయి. నా వరకు నేను నిత్యం యంగ్‌గా ఉండాలని కోరుకుంటాను. నాకిప్పుడు 68 ఏళ్లంటే చాలా మంది నమ్మరు. మేమంతా ఎన్జీవో హోమ్ వద్ద కలిసి కష్టాసుఖాలు పంచుకుని ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతుంటాం. - ఎంఏ అలీమ్, విశ్రాంత ఇంజనీరు. -
బస్ స్టాప్ -సీనియర్ సిటిజన్స్ అడ్డా
ఇక్కడ బస్టాపు దగ్గర కూర్చుని ఉన్న పెద్దల్ని చూస్తే... అందరూ ఏదో ఊరికి పయనమయ్యారనిపిస్తుంది కదా! అయితే మీరుపొరబడ్డట్టే! ఇంట్లో టీ, టిఫిన్స్ ముగించుకుని మనవళ్లు, మనవరాళ్లను స్కూళ్ల బస్సులెక్కించి... అంతే వీరు కూడా నాలుగడుగులేసి వీధిలోకి వచ్చేస్తారు. ఇలా బస్టాపులో ఓ రెండు మూడు గంటలు కూర్చుని మళ్లీ ఇంటికి పయనమవుతారు. సాయంత్రం నాలుగింటికి మళ్లీ ఇదే బస్టాప్‌కి చేరుకుంటారు. మళ్లీ భోజనాల వేళకు ఇళ్లకు మళ్లుతారు. ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీగా అందిరికీ తెలిసిన వసంతనగర్ కాలనీ బస్టాపునే అడ్డాగా చేసుకున్న ఈ సీనియర్ సిటిజన్స్‌ని పలకరిస్తే... మీకూ అక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ..:: భువనేశ్వరి సమయం... ఉదయం 11 గంటలు. ఓ నలుగురు పెద్దవాళ్లు ‘మాకు తినే వేళయింది’ అంటూ లేచారు. మిగతావాళ్లు ఎవరి కబుర్లలో వారు మునిగిపోయారు. ఇంతలో ఒకమ్మాయి వచ్చి ‘తాత సికింద్రాబాద్ బస్సు వెళ్లిపోయిందా?’ అని అడిగింది. ‘అయ్యో... ఇప్పుడు పోయింది తల్లీ...’ అన్నాడు నిట్టూర్పుగా ఓ పెద్దాయన. ‘ఉండు తల్లీ... రెండో బస్సు వచ్చే వేళయింది...ఆడ కూసో’ అన్నాడు ఆప్యాయంగా. కొందరు రాష్ట్ర రాజకీయాల గురించి.. ఇంకొందరు రాబోయే ఎండలపై మాట్లాడుతున్నారు. అందరికన్నా వయసులో పెద్దగా అనిపించినవ్యక్తి దగ్గరికి వెళ్లి... ‘మీరు రోజూ ఇక్కడే కూర్చుంటారా?’ అని అడిగితే... ‘ఈ రోజు... ఆ రోజు అని ఏముండదు. ఒక్క ఆదివారం తప్ప.. అన్ని రోజుల్లో మాకు ఈ బస్టాపే కాలక్షేపం. ఓ యాభైమందిమి ఉంటాం. ఉదయం తొమ్మిది, పది దాటిందంటే అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. తోచిన కబుర్లు, కాలనీ విశేషాలు, రాబోయే పండుగలు, ఇంట్లో చేసుకునే వేడుకలు, రోడ్డుపైన జరిగే గొడవలు... ఇలా ఒకటేమిటీ.. అన్నీ మాట్లాడుకుంటాం. రెండు, మూడు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి’అని చెప్పారు విశ్రాంత ఉద్యోగి అయిన సూర్యదేవర కృష్ణమూర్తి. ఇక్కడే ఎందుకు... వసంతనగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఒక భవనం ఉంది. అది వదిలి ఇలా బస్టాప్‌ను అడ్డాగా మార్చుకున్నారెందుకంటే... ‘ఒక భవనంలో కూర్చుని కాలక్షేపం చేసేదేముంటుంది, పైగా కాలనీ సంక్షేమం గురించి తెలియాలంటే నలుగురి మధ్యలో తిరగాలి. కొత్తవారితో మాట్లాడాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నాయి? ఎలాంటి అవసరాలున్నాయి? అన్నది ఎలా తెలుస్తుంది. బస్టాపంటే దుమ్ము, ధూళితో రద్దీగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడైనా అంతే. కానీ మా బస్టాపు అలా కాదు. చుట్టూ చెట్లతో ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంటుంది. దాంతో మాకు ఇక్కడికి ఎప్పుడెప్పుడు రావాలా అనిపిస్తుంటుంది’ అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చిన రాజారావ్తో మాటకలిపారు కోటేశ్వరరావు. ‘మా బస్టాపు అంత శుభ్రంగా, ప్రశాంతంగా ఉండడానికి మా కాలనీవాసులే కారణం. ముఖ్యంగా పండుగల సమయంలో మా హడావిడి అంతాఇంతా కాదు. పేరుకే వృద్ధులం కానీ.. అందరం చిన్న పిల్లలుగా మారిపోతాం. ముఖ్యంగా వినాయక చవితి, శ్రీరామనవమి సమయంలో బోలెడంత సందడి. మాకు చేతనైనంత పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారాయన. అమ్మాయిలకు రక్షణ... వీళ్ల కాలక్షేపం... ఈ బస్స్టాప్కొచ్చే అమ్మాయిల రక్షణ కవచంగా మారింది. ‘రోజూ బస్టాపుకొచ్చేసరికి అందరూ పెద్దవాళ్లు చక్కగా పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూస్తే భలే ముచ్చటేస్తుంది. మాకు చాలా ధైర్యంగా కూడా ఉంటుంది!’ అని ధీమాగా చెబుతోంది బస్టాప్‌లో ఓ అమ్మాయి. ‘మేం నలుగురం ఉన్నాం కాబట్టి ఏ కుర్రాడైనా ఏదైనా అంటే అడ్డుపడతాం.. బుద్ది చెబుతాం. అదే ఒక్కరం చెబితే... ‘పోరా ముసలోడా... నువ్వేంటి నాకు చెప్పేది’ అంటూ రెండు దెబ్బలేసినా వేస్తారు’ అని నవ్వుతూ చెప్పారు రిటైర్డ్ ఎంప్లాయ్ శివరామ్‌ప్రసాద్. ‘ఈ కాలం పిల్లలకు ఇది మంచి, ఇది చెడు అనే చెప్పే పరిస్థితి లేదు. మాట మొదలవ్వకముందే నీకెందుకు? నువ్వెవరూ? అని ఎదురుతిరుగుతున్నారు’ అంటూ వాపోయారు రాజారావ్. మహిళలకు వరం... ఇలా నలుగురు వృద్ధులు ఒకచోట కూడి నాలుగు మంచి విషయాలు మాట్లాడుకోవడంలో వింతేమీ కాకపోవచ్చు... పిచ్చాపాటీ కబుర్లతో వచ్చేదేమీ లేకపోవచ్చు. కానీ... వీళ్లు కూర్చున్న కారణంగా అక్కడ బస్టాపు పరిసరాల్లో చిన్న దొంగతనంగానీ, ఒకరిపై దాడి జరిగిన దాఖలా కానీ లేదు. సాయంత్రం వేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్లమీద వెళుతున్న మహిళలపై చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయని తెలిసి... ఆయా ప్రాంతాల్లో వీరు గుంపులుగా చేస్తున్న వాకింగ్లు కూడా అక్కడ మహిళల పాలిట వరంగా మారాయి. ‘ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే ఎద్దుతలకాయ తెచ్చిపెట్టుకోవాలి’ అని పెద్దలు చెప్పిన సామెత ప్రయోజనం ఏంటో ఈ కాలనీ వీధుల్లో కళకళలాడుతూ తిరిగే వృద్ధుల్ని చూస్తే తెలుస్తుంది. మీరూ పంపండి.. యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న అటువంటి వారికి విజ్ఞప్తి.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి. మీ ఎక్స్పీరియన్స్ మరెందరికో ఇన్స్పిరేషన్. మెయిల్: sakshicityplus@gmail.com -
జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఓటు నమోదు చేయించుకున్నవారిని సీనియర్ సిటిజన్స్ సన్మానించారు. అనంతరం వారికి ఓటరు గుర్తింపుకార్డులు అందజేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్‌చైర్మన్ రాజు, తహశీల్దార్లు శ్రీదేవి, సునీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులు, వికలాంగులకే టాక్సీ ప్రయాణం
ఎవరు పడితే వాళ్లు టాక్సీలు ఎక్కడానికి అనుమతించేది లేదంటూ హిమాచల్ ప్రదేశ్ సర్కారు ఉత్తర్వులిచ్చింది. కేవలం వృద్ధులు, వికలాంగులను మాత్రమే అక్కడి టాక్సీలు ఎక్కేందుకు అనుమతిస్తారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిబంధనలు ఉన్న రోడ్లలో ఈ నియమాలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ రోడ్డురవాణా కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) టాక్సీల విషయంలో ఈ నిబంధన అమలవుతుంది. నిషిద్ధ ప్రాంతాల్లో హెచ్ఆర్టీసీ టాక్సీలు కూడా మామూలు టాక్సీల్లా ఎలా పడితే అలా తిరుగుతున్నాయంటూ హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్ మీర్, జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్-లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు, పదేళ్లలోపు పిల్లలు మాత్రమే హెచ్ఆర్టీసీ టాక్సీలు ఎక్కేందుకు వీలుంటుందని తెలిపింది. పర్యావరణ సమస్యల దృష్ట్యా కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
సిన్సియర్ సిటిజన్స్
శేషజీవితాన్ని హాయిగా గడపాలనుకునే వారికి.. పదవీ విరవుణ ఓ వరం ! బ్యాలెన్స్ లైఫ్‌ను ఎలా నెట్టుకురావాలో అని టెన్షన్ పడే వారికి రిటైర్మెంట్ ఒక శాపం ! కానీ ఈ పెద్దోళ్లకు మాత్రం రిటైర్మెంట్ ఒక బాధ్యత.. సమాజానికి సాయం చేసే తీరిక ఇలా దొరకడం ఓ అదృష్టంగా భావిస్తున్నారు. వీళ్ల కాలక్షేపం కూడా లోకాభిరామమే. కాకపోతే అది కాస్త సందడిగా, డిఫరెంట్‌గా, రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. సరదా సరదా ముచ్చట్లకు ఎంత టైం కేటాయిస్తారో.. సంఘానికీ అంతే సమయం ఇస్తారు. వానప్రస్థాశ్రమంలో రామా కృష్ణా అనుకోవాల్సిన ఈ పెద్దోళ్లు.. సమాజ హితం కోసం నడుం బిగించారు. జీవితానుభవాలే పెట్టుబడిగా.. ఈ సీనియర్లు తమ పెద్దరికాన్ని కాపాడుకుంటున్నారు. - భువనేశ్వరి ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్.. కమలానగర్ సీనియర్ సిటిజన్ క్లబ్లో పొద్దున పదింటికల్లా సందడి మొదలవుతుంది. ఒకరు మనవడ్ని స్కూల్లో దింపి, ఇంకొకరు మనవరాలిని కాలేజీలో దింపి.. ఒక్కొక్కరుగా ఈ క్లబ్లో వాలిపోతుంటారు. రాగానే న్యూస్‌పేపర్లు ముందేసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. సినివూల నుంచి రాజకీయూల వరకు.. సరదాగా ముచ్చటించుకుంటారు. ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్‌తో రీఫ్రెష్ అవుతారు. ఇలా నాలుగైదు గంటలు టైంపాస్ చేసి ఇళ్లకు చేరుకుంటారు. మళ్లీ సాయంత్రం.. కాలేజీలు మూసే సవుయూనికి రోడ్డెక్కుతారు. ఈ సమయంలో వీరికేం పని అనుకుంటున్నారా..? ఈ సీనియర్ల అసలు ట్రీట్మెంట్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. దారితప్పితే కౌన్సెలింగ్ ఈ సీనియుర్ సిటిజన్స్‌లో ఓ బృందం.. ఓ కాలేజీ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన బస్టాప్‌లో కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఇద్దరమ్మాయిలను.. వెనుక నుంచి ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగకుండా ఏదో కామెంట్ చేశారు. అప్పటికే బస్టాప్‌లో ఉన్న ఈ పెద్దోళ్లకు సీన్ అర్థమైంది. వారిని ఆపి విషయుం ఏంటని ఆరా తీశారు. ఆ నలుగురిలో ఓ అబ్బాయి.. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలాగా అంటూ వారిని సీనియుర్స్ క్లబ్‌కు తీసుకెళ్లారు. నిజమైన ప్రేమ గురించి.. ఒకరి తర్వాత ఒకరు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే అమ్మాయిలు థ్యాంక్స్ చెబితే.. అబ్బాయిలు తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘మా క్లబ్ స్థాపించి రెండేళ్లవుతుంది. ఎందరికో ఉపయోగపడే పనులు చేయగలిగాం’ అని అంటారు క్లబ్ ప్రెసిడెంట్ పెద్ది నర్సింహ. తోటివారికి తోడుగా ఓ నెల కిందట తమకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ జంట ఈ క్లబ్ తలుపు తట్టారు. సవుస్యను సున్నితంగా పరిష్కరించి వారి కళ్లలో ఆనందం నింపారు ఈ క్లబ్ సభ్యులు. ‘మా కళ్లముందే అల్లంవెల్లుల్లి అమ్ముకుని కష్టపడి రెండు వందల గజాల ఇంటి స్థలం కొనుక్కున్నాడు. కొడుక్కి ఉద్యోగం వచ్చాక అతని పేరిట లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కొడుకు పెళ్లయ్యూక.. ఈ ఇంటితో మీకు సంబంధం లేదంటూ ఆ కొడుకు కన్నవారిని బయుటకు నెట్టేశాడు. మా క్లబ్ సభ్యుల్లో ఓ నలుగురు ఆ కొడుకు, కోడలికి నచ్చజెప్పాం. నాలుగైదు కౌన్సెలింగ్‌ల తర్వాత దిగొచ్చారు. ఆ పెద్దవునుషులకు ఇంటి మీద ప్రత్యేకంగా ఓ రూమ్ కూడా కట్టిచ్చారు. ఆయునే కాదు.. ఇలాంటి సవుస్యలు ఎవరికున్నా వాటి పరిష్కారానికి మేమందరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం..’ అని క్లబ్ సెక్రటరీ శత్రుఘ్నచారి వివరించారు. మేం ముసలివాళ్లమేంటి..? అరవై ఏళ్లు పైబడిన ఆ పెద్దోళ్లు.. కాలక్షేపంతో పాటు సవూజం గురించి ఆలోచిస్తున్నారు. ‘ఇన్నాళ్లు ఇల్లు, పిల్లలు, ఉద్యోగం అంటూ చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోకుండానే గడిపేశాం. ఇప్పుడు మా పిల్లలకు మా ఆసరా అక్కర్లేదు, ఉద్యోగానికి ఓ నమస్కారం పెట్టేశాం. మాకున్న ఓపిక, తెలివితేటలు, అనుభవం.. తోటివారికి ఉపయోగపడాలన్నదే వూ ఉద్దేశం’ అని చెబుతారు ఆ సీనియుర్ సిటిజన్స్. ‘వయుసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో ఒక్కో పార్ట్ రిపేర్కొస్తుంటుంది. వచ్చిన రోగాలకు భయుపడి ఇంట్లో కూర్చుంటే జబ్బులు తగ్గుతాయూ? ఈ క్లబ్ మా మనసును సేదతీరుస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మేవుూ పిల్లలమైపోతాం. ఇండోర్ గేమ్స్‌తో అదరగొడతాం. నేను ముసలాడ్ని ఏంటి అనుకునేవారంతా అవుట్‌డోర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. వూ వునవలు, వునవరాళ్లు కూడా మాతో జాయిన్ అవుతుంటారు’ అని క్లబ్ విశేషాలు పంచుకున్నారు జేజే రెడ్డి. సమాజం కోసం ఉదయం నుంచి ఎన్ని రకాల పనులు చేసినా.. అప్పుడప్పుడూ కాలేజీలకు వెళ్లి వురీ కౌన్సెలింగ్‌లు ఇస్తుంటారు. రోడ్లపై దవుు్మలాగుతున్న కాలేజీ కుర్రాళ్లకు క్లాసులిస్తారు, కౌన్సెలింగ్ చేస్తారు. సాయుంత్రం కాగానే అవ్మూరుులకు రక్షణగా రోడ్లపై గస్తీ కాస్తారు. ‘వూ పిల్లలు కాలేజీకి వెళ్లిన సవుయుంలో మేం చేయులేని పనులు ఇప్పుడు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇవన్నీ చేస్తున్న టైంలో మేం హీరోలుగా ఫీలవుతాం’ అంటూ తమ హీరోయిజాన్ని చాటుకున్నారు చంద్రశేఖర్‌రావు. ఇప్పటివరకూ మేం బతికింది మాకోసం, మా కుటుంబం కోసం. ఇక నుంచి సవూజం కోసం బతకాలనుకుంటున్నాం అంటున్న ఈ సిన్సియుర్ సిటిజన్స్‌ను వునం కూడా అభినందిద్దాం. మాతో పంచుకోండి రిటైర్మెంట్ లైఫ్ సేవాభావంతో వెళ్లదీస్తున్న సీనియుర్ సిటిజన్స్ మీరైతే.. మీ జీవితం పదివుందిలో స్ఫూర్తి నింపాలి. చుట్టూ ఉన్న సవూజం కోసం మీరు పడే తపన వురికొందరికి వూర్గనిర్దేశం చేయూలనుకుంటున్నారా.. అరుుతే మీ సావూజిక బాధ్యతను ‘సిటీప్లస్’తో పంచుకోండి. మీరు చేస్తున్న కార్యక్రవూల వివరాలు sakshicityplus@gmail.com కు పంపండి. -
సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే గౌరవం ఇదా??
-
క్షమాభిక్షకు నోచుకోని 'జైలు పక్షులు'
ఈమె గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రుక్మిణమ్మ. వయస్సు 85 ఏళ్లు. మనమలు, మనమరాళ్లను ఆడిస్తూ హాయిగా శేషజీవితం గడపాల్సిన వయస్సది. కానీ క్షణికావేశంలో చేసిన తప్పునకు 15 ఏళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో మగ్గిపోతోంది. ఈమె కోడలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ఆమె కొడుకు ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నాన్నమ్మా...అమ్మమ్మ పిలుపులకు నోచుకోకుండా బాధను దిగమింగుతూ ప్రభుత్వ క్షమాభిక్ష కోసం ఆశగా రుక్మిణమ్మ ఎదురుచూస్తోంది. జైలుకొచ్చిన ప్రతి అధికారిని క్షమాభిక్ష పెట్టాలని వేడుకుంటున్నా కరికరించడం లేదు. రుక్మిణమ్మలాగే మరో నలుగురు మహిళలు, పురుషుల కారాగారంలో దాదాపు 60 మంది వరకూ ఇలాంటి కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. తెలిసో, తెలియకో తప్పుచేశాం... వృద్ధాప్యంలోనైనా కుటుంబ సభ్యులతో కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కోటగుమ్మం : ఖైదీల పాలిట 498(ఎ) శాపంగా మారుతోంది. మహిళలకు రక్షణగా ఉండాల్సిన చట్టం కొన్ని సందర్భాలలో దుర్వినియోగం అవుతోందని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహం చేసుకున్న మహిళను వేధింపులకు గురిచేసినా, వరకట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలలో భర్తతో పాటు అతని తరఫు వారిపై 498(ఎ) కేసులు నమోదు అవుతున్నాయి. ఏడు సంవత్సరాలు నిండకుండా భార్య అత్తవారింట్లో ఆత్మహత్యకు పాల్పడితే 498(ఎ) కేసుగా నమోదు చేస్తారు. దీనిలో అమ్మాయి తరఫు వారు, భర్తతో పాటు, అత్త,మామా, ఆడపడుచులు, మరుదులు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కేసులో నేరం రుజువైతే జీవిత ఖైదీ విధిస్తారు. అయితే జైల్ నిబంధనల ప్రకారం ఖైదీలు ఏడు సంవత్సరాలు కఠిన శిక్ష అనుభవిస్తే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మూడేళ్లు రెమ్యూషన్ కలిపి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించినట్టుగా పరిగణించి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. అయితే 498(ఏ) కేసుల్లో శిక్ష పడ్డ ఖైదీలకు ప్రభుత్వ క్షమా భిక్ష ప్రసాదించకపోవడం వలన ఏళ్ల తరబడి ఖైదీలు జైల్లోనే మగ్గిపోతున్నారు. రాజమండ్రి మహిళా కారాగారంలో వివిధ కేసుల్లో శిక్ష పడ్డవారికి ప్రభుత్వాలు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నప్పటికీ 498(ఏ) కేసుల్లో శిక్ష పొందుతున్నవారు క్షమాభిక్షకు నోచుకోవడం లేదు. కరుడు కట్టిన నేరస్తులను, బాంబ్ బ్లాస్టింగ్ కేసులలో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించే ప్రభుత్వం వరకట్నం వేధింపుల కేసులలో శిక్షపడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని పేర్కొంటున్నారు. జైల్లోనే మగ్గిపోతున్న కుటుంబాలు వరకట్నం వేధింపుల కేసులో మృతురాలి భర్తతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేయడంతో అందరూ జైల్లోనే మగ్గిపోతున్నారు. ఈ లాంటి కేసులలో శిక్ష పడిన ఖైదీలకు తిరిగి నేరం చేయడని నిర్ధారణకు వచ్చిన ఖైదీలకు, వృద్ధాప్యంలో ఉన్న ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించాలని మానవ హక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో వ్యాధులతో ఉన్న వారిని జైల్లోనే మృతి చెందేవరకూ ఉంచే కంటే మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్స్‌ను విడుదల చేయాలి ప్రభుత్వం రెండు దఫాలుగా ఖైదీల విడుదలలో నిబంధనలు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను హత్య చేసిన కేసులలోను, మహిళా వేధింపుల కేసులో శిక్షపడిన ఖైదీలను విడుదల చేయడంలేదు. మానసిక పరివర్తన చెందిన ఖైదీలను రూ.25 వేల బాండ్ తీసుకొని వదిలే ప్రభుత్వం మహిళా వేధింపుల కేసులలో కూడా వృద్ధులపై సానుభూతితో వ్యవహరించాలి. మానసిక పరివర్తన చెందిన సీనియర్ సిటిజన్స్ విడుదల చేయాలి. - ముప్పాళ్ల సుబ్బారావు, మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు. -
110 వారాల డిపాజిట్ స్కీమ్ పొడిగింపు: ఎస్బీహెచ్
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) 110 వారాల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని మే 31వ తేదీ వరకూ పొడిగించింది. 9.11 శాతం ఆకర్షణీయమైన వడ్డీరేటును ఈ స్కీమ్ కింద బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. డిపాజిటర్లకు రుణం, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా రూ.1,000 నుంచి రూ. 99 లక్షల వరకూ ఈ పథకం కింద డిపాజిట్ చేసుకోవచ్చు. అవసరమైతే డిపాజిట్ చేసిన 7 రోజుల తరువాత తమ డబ్బును కస్టమర్లు ఎటువంటి జరిమానా లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఎన్ఆర్ఐలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. -
ఓరి దేవుడా..ఇదేం పెన్షన్
దుర్గి, న్యూస్‌లైన్ :పెన్షన్ తీసుకునే వృద్ధులను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఇది ఏదో రకంగా పెన్షన్ ఎగ్గొట్టే ఎత్తుగడగా కనిపిస్తోంది. రెండు నెలల నుంచి పోస్టాఫీసుల్లో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. గతంలో పెన్షన్లు మ్యానువల్ పద్ధతిలో పంపిణీ చేయటం వల్ల ఒక నెలలో తీసుకోని వారికి మరో నెలలో ఇస్తుండే వారు. ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి ప్రవేశ పెట్టటంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ కనెక్ట్ కాలేదని చెబుతుండడంతో పలుమార్లు పోస్టాఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నారు. ప్రతీ నెలా మొదట్లో వందల సంఖ్యలో వృద్ధులు పోస్టాఫీసుకు వస్తున్నారు. ఆన్లైన్ కనికరిస్తేనే పెన్షన్ అందుతుంది. ఆన్లైన్లో లబ్ధిదారుడి కార్డు నంబర్ ఫీడ్ చేసినప్పటికీ ఆధార్ కార్డు నంబర్ లేకపోయినా, వేలిముద్రలను బయోమెట్రిక్ మిషన్ సరిగ్గా తీసుకోకపోయినా పెన్షన్ రావడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల కొద్దీ తిరిగినా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఇంటి ముఖం పడుతున్నారు. అంతేకాక కొన్ని పోస్టాఫీసుల్లో రోజువారీ పనిభారం కారణంగా వృద్ధుల పెన్షన్ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటుంది.సిబ్బంది ఉంటే మరింత స్పీడ్‌గా... మండల కేంద్రం దుర్గిలో వున్న పోస్టాఫీసుకు 11 గ్రామీణ సబ్ పోస్టాఫీసులు అనుసంధానమై ఉన్నాయి. వీటికి తోడు మరో నాలుగు శివారు గ్రామాల్లో పనుల కూడా ఈ పోస్టాఫీసులోనే చూడాలి. ఇక్కడ ప్రస్తుతం పోస్టుమాస్టర్‌గా ప్రసన్నాంజనేయ రాజు విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ విధులతోపాటు నెల మొదటి వారంలో పెన్షన్ల పంపిణీ చూస్తున్నారు.సిబ్బందిని కేటాయిస్తే ఇక్కడకు వచ్చే వృద్ధులకు మరింత వేగంగా పెన్షన్లు అందించగలమంటున్నారు. - ప్రసన్నాంజనేయరాజు, పోస్టుమాస్టర్ మాకెందుకీ ఇబ్బందులు: నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు పోస్టాఫీసులోనే వుంటున్నాం. అదేదో ఆన్లైన్ అంటా దాని వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ మాకెందుకు ఎప్పటి లాగా పంచాయతీ కార్యాలయంలోనే ఇస్తే బాగుణ్ణు. - పగడాల మాధవరావు, వృద్ధుడు ముప్పు తిప్పలు పెడుతున్నారు... మూడు రోజులుగా పోస్టాఫీసుకు వస్తున్నా. ఆన్లైన్లో కలిస్తే కంప్యూటర్లో చీటీ వస్తుంది. వేలి ముద్రలు తీసుకోవటం లేదు. ఒక సారి ఆధార్ కార్డు, ఇంకోసారి బియ్యం కార్డులు అడుగుతున్నారు. ప్రతీ సారీ ముప్పు తిప్పలు పెడుతున్నారు. - కటకం సీతమ్మ, వృద్ధురాలు -
ముగిసిన వృద్ధులు, వితంతువుల దీక్షలు
పింఛన్ రూ.వెయ్యికి పెంచాలని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద వృద్ధులు, వితంతువులు చేపట్టిన దీక్షలు మంగళవారం ముగిసాయి. రిలే దీక్షలు మంగళవారం నాటికి వంద రోజులు పూర్తయ్యాయి. ముగింపు సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు వృద్ధులు, వితంతువులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు రేగుంట కేశవరావు మాదిగ మాట్లాడుతూ వృద్ధులు, వితంతువుల పింఛన్ రూ.వెయ్యికి పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వంద రోజులు రిలే దీక్షలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వృద్ధులకు చెల్లిస్తున్నట్లుగానే ఇక్కడా పింఛన్ పెంచాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై ఉన్న శ్రద్ధ వృద్ధులు, వితంతువుల పింఛన్‌పై లేదని విమర్శించారు. అనంతరం తహశీల్దార్ సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఇప్ప దాసు, నాగరాజు, సాగర్, రాజేశ్వర్, వృద్ధుల సంఘం అధ్యక్షురాలు సోమ గుండమ్మ, వితంతువుల సంఘం అధ్యక్షురాలు రాపర్తి ప్రేమల, వృద్ధులు, వితంతువులు పాల్గొన్నారు. కాగా, వృద్ధులు, వితంతువుల ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రి సత్యనారాయణ, జేఏసీ కన్వీనర్ గంధం శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి చెర్ల మురళి మద్దతు తెలిపారు. -
వృద్ధాప్య దంత సమస్యలు (జీరియోడాంటిక్స్)
బోసినోటికి బైబై... పంటిజబ్బులకు గుడ్‌బై..! ఒకనాడు యౌవనగర్వంతో విర్రవీగినవారు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంటారు. ఈ దశ ఎవరికైనా తప్పదు. ఆ యౌవన దశలో, పైలాపచ్చీసీలో తమ సమస్యలను తరిమినవారు పళ్ల మధ్య క్రిములను తరమలేరు. కష్టాలతో యుక్తితో పోరాడిన వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న దంతవ్యాధులతో పోరాడలేక అలసిపోతుంటారు. ఒకనాడు చురుగ్గా ఆదాయాలను సంపాదించినవారూ ఇప్పుడు తమ పళ్లకూ, చిగుళ్లకూ ఆరోగ్యాన్ని సంపాదించిపెట్టలేక ఇక్కట్లు పడుతుంటారు. ఎందుకీ పరిస్థితి? ఇందుకు కారణం వృద్ధాప్యం. ఒకరి సహాయం లేకుండా ఏమీ చేయలేరు కాబట్టే వృద్ధులూ, పిల్లలూ ఒకటే అంటారు మనవాళ్లు. ఇద్దరికీ ఉండేది బోసినోరే కాబట్టి. పిల్లల కంటే పోనుపోనూ పళ్లు వచ్చేస్తాయి. కానీ వృద్ధుల మాటో? వారు పళ్లు పోగొట్టుకోకుండా, కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పేందుకే ఈ కథనం. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్యసమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలుంటాయి. వృద్ధాప్యంలో కనిపించే సాధారణ పంటి సమస్యలు/కారణాలు వయసు పెరుగుతున్నకొద్దీ సాధారణంగా పళ్లు కూడా వదులైపోతాయని చాలామంది అపోహపడుతుంటారు. ఇక ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే వాటంతట అవే పళ్లూడిపోతాయని ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు సంబంధించిన లేదా చిగుర్లకు సంబంధించిన జబ్బులు వస్తేనే పళ్లు ఊడిపోవడమో లేదా వదులైపోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి రావడమో జరుగుతుంది. నోటిజబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంతసమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్కేరిస్), పళ్లు ఊడిపోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడో పన్ను, ఇక్కడో పన్ను కోల్పోవడంతో వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి. కొన్ని సమస్యలు యౌవనదశలో మనం చేజేతులా తెచ్చిపెట్టుకున్నవే. ఉదాహరణకు మనం వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్‌పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి అలవాట్లు. వీటిని మానకుండా ఆ సమయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు ప్రభావితమవుతాయి. వృద్ధాప్యంలో... యౌవనంలో కంటే వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యంలో కొందరికి ఆదాయవనరులు తగ్గిపోతాయి. పైగా కుటుంబ సభ్యులనుంచి అందవలసినంత ప్రోత్సాహం ఉండదు. ఇదీ దంత సమస్యలకు ఒక కారణమే. పై సమస్యలతో పళ్లు వదులైపోయి వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడం లో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు.. పళ్లు మన ఉచ్చారణకూ తోడ్పడతాయి కాబట్టి భాషలో స్పష్టత లోపించి కమ్యూనికేషన్‌కు ఇబ్బంది కలుగుతుంది. వృద్ధాప్య రుగ్మతలు... పళ్లపై వాటి ప్రభావం... డయాబెటిస్... పళ్లసమస్యలు: డయాబెటిస్... పళ్ల సమస్యలు... ఈ రెండూ పరస్పరాధారితాలు. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్ల, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే ఇక పళ్లు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో అవి రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్‌కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారు పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్ రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంథులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లెకైన్ప్లానస్, లెకైనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. జాగ్రత్తలు: పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆరునెలలకు ఒకసారి దంతవైద్యుడితో క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ పాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండి, డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహారాన్ని తీసుకోవాలి. హైబీపీ - పంటి సమస్యలు : బీపీ ఉన్నవారికి అది గుండెజబ్బులకు, గుండెపోటుకు దారితీయకుండా మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎన్ఏఐడి) వల్ల... బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల ప్రభావం తగ్గుతుంది. బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్‌కు దారితీస్తుంది. ఇది కూడా పంటి సమస్యలను పెంచడమే కాదు... పంటిలో కృత్రిమంగా అమర్చిన దంతాలకు, స్క్రూల వంటి అనుబంధ అంశాలకు, నోటిలోని మృదుకండరాలకు మధ్య ఘర్షణను పెంచి మరిన్ని పంటిసమస్యలకు దారితీసేలా చేస్తుంది. ఇక క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని సైడ్‌ఎఫెక్ట్‌గా జింజివల్ హైపర్‌ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి... మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే కనిపించడం విశేషం. జాగ్రత్తలు: హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్కు వివరించి, దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్‌ను నివారించుకుంటూ ఉండటం మేలు. పక్షవాతం - పంటిజబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకు నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకున్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి వంటివి, పంటిజబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో పాచిపేరుకుని రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడటం జరుగుతుందని తెలిసిందే. ఇదే గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే గుండెపోటుకు దారితీసినట్లే, మెదడుకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే పక్షవాతానికి దారితీయవచ్చు. జాగ్రత్తలు: పంటి జబ్బులను నిరోధించుకోవడం, పంటిసమస్యలను దూరం చేసుకోవడం, పంటి శుభ్రతను పాటించడం... ఇవన్నీ గుండెజబ్బులతో పాటు, పక్షవాతాన్ని కూడా నివారించుకోవడం అని గుర్తుంచుకోవాలి. ఆర్థరైటిస్... పంటి సమస్యలు: దాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ జబ్బు విషయంలోనూ ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) వాడటం సాధారణం. ఈ జబ్బు ఉన్నవారికి మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందుల వల్ల నోటిలో పుండ్లు (అల్సర్స్) వస్తాయి. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇకపై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్లెట్స్కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలు ఉంటాయి. వాటి ఫలితంగా పూర్తిగా రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ ఎదురుకావచ్చు. లాలాజల గ్రంథులు... నోటి సమస్యలు: నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ రోగులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుళ్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి. జాగ్రత్తలు: లాలాజలం తగ్గి నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్) గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. ఇక కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్‌ను పూర్తిగా మానివేయడం మేలు. పైవన్నీ నివారణ చర్యలు. ఒకవేళ నివారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, పళ్లు కోల్పోయినా, ఇప్పుడు దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నా, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మనకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో వాటిని అమర్చడం పూర్తిగా సాధ్యం. - నిర్వహణ: యాసీన్ వృద్ధాప్యం మొదటిదశలో ఉన్న అత్యధికుల్లో ఉండే సమస్య పంటి పైపొర అరుగుదల. అప్పుడు కాస్తంత చల్లగా, వేడిగా ఉండే పదార్థాలు పంటిని అవి తాకితే జివ్వుమంటాయి. దీనికి చికిత్స చాలా సులభం. పన్ను అరుగుదలకు గురైన క్యాప్ వేయించడం లాంటి చికిత్సతో ఈ సాధారణ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించవచ్చు. గుండెజబ్బులు... చిగుర్ల వ్యాధులు: ఇటీవలి పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికి, గుండెజబ్బులకు సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవారికి నొప్పి తెలియకుండా పంటి కింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా తగ్గుతూ పోతుంటుంది. కానీ పంటి కింది ఎముక భాగం నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి గుండెకండరాన్నిసైతం దెబ్బతీసి, గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం ఉందన్నది ఇటీవల పరిశోధనల సారాంశం. ఇక పంటిమీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి, రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) వ్యాధులు రావచ్చు. మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా గుండెపోటు కూడా రావచ్చు. జాగ్రత్తలు: సరైన రీతిలో బ్రషింగ్, ఆహారాన్ని బాగా నమిలి మింగడం... -
సీనియర్ సిటిజన్లు జాతికి సంపద
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీనియర్ సిటిజన్స్ మానవ జాతికే ఎనలేని సంపద అని, వారిని ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. సర్వోదయ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని హస్తినాపురం సెంట్రల్ కాలనీ మేజర్ పద్మపాణి ఆచార్య మెమోరియల్ హాల్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సలహాలు, సూచనలు పాటించాలన్నారు. సీనియర్ సిటిజన్స్ అనుభవాలు ఎంతో అమూల్యమైనవని, వారిని ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుందన్నారు.