Telangana formation day
-
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ కెనడా అసోసియేషన్ 2024
-
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ కెనడా అసోసియేషన్ 2024
-
జై తెలంగాణ ఎక్కడ?.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక అని తెలిపారు. సోమవారం హరీశ్‌రావు మీడియాతో మట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కాపాడాలంటే మాజీ సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష. ప్రభుత్వం ఇచ్చిన యాడ్‌లో జై తెలంగాణ పదం లేదు. తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ఉద్యమ కారుడు కాలేడు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అవుతాడు తప్ప ఉద్యమ కారుడు కాదు. ఉద్యమం కోసం ఎన్నిసార్లు అయినా మేం జైలుకి వెళ్ళాం’ అని అన్నారు. -
ఆరోగ్యశ్రీని మళ్లీ YSR తరహాలో అమలు చేస్తాం: రేవంత్
-
TG : ట్యాంక్‌బండ్‌పై ఘనంగా అవతరణ వేడుకలు (ఫొటోలు)
-
ఇక ప్రపంచంతోనే పోటీ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి తెలంగాణ ఒక దిక్సూచి కావాలని.. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాల్లో సగర్వంగా ఎగరాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ పల్లెలు పాడి పంటలతో వెలగాలని.. ఒకనాడు పొట్ట చేతపట్టుకుని పట్నాలకు వెళ్లిన యువత రేపటి రోజున ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో కాదు ఏకంగా ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను సమున్నతంగా నిలపాలని.. ఆ శక్తి, సత్తువ, తెలివి మనకు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ మన బ్రాండ్, ప్రపంచ నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆ దిశలో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, వ్యవస్థల సహకారం కావాలని కోరారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళి అర్పిస్తున్నా. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాం«దీలకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రత్యేక శ్రద్ధతో మన చిరకాల వాంఛను నెరవేర్చిన సోనియా గాందీ, నాటి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, నాటి బీజేపీ ముఖ్య నేత సుష్మా స్వరాజ్ ఈ ముగ్గురు తల్లులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. దశాబ్ది ఉత్సవానికి సోనియా గాం«దీని ఏ హోదాలో ఆహ్వానించారని కొందరు ప్రశ్నించారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాగాం«దీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ ఊరుకోదు.. పెత్తనాన్ని ప్రశ్నిస్తాం, ప్రేమను పంచుతాం, ఆకలిని తట్టుకుంటాం.. కానీ స్వేచ్ఛను హరిస్తే భరించలేం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం దాని సొంతం. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం’ అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. రాష్ట్రంలో ప్రజాపాలన తెచ్చాం.. డిసెంబరు 7 నుంచి రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. ప్రగతిభవన్‌ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సచివాలయంలోకి సామాన్యుడు కూడా రాగలిగేలా చేశాం. ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు లేవు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలను సాధించినప్పుడే తెలంగాణ సాధనకు సార్థకత. రాజకీయ విమర్శల జోలికి పోవడం లేదు.. కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలం. గత పదేళ్లలో స్వేచ్ఛపై దాడి పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపైనా దాడి జరిగింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. సంస్కతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. అది గతం.. ఇప్పుడు ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం వచ్చింది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకొంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే దీనికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. సంక్షేమం దిశగా ముందడుగు.. అభయ హస్తం గ్యారంటీలకు కోటి తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది. మేం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెచ్చాం. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్. దీనికింద చికిత్సల పరిమితిని రూ.పది లక్షలకు పెంచాం. 70 రోజుల్లోనే 30వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్–1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చాం. తొలిదశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి పేద మహిళలకు బాసటగా నిలుస్తున్నాం. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుని.. అవి కార్యరూపం దాల్చేలా కార్యచరణ మొదలుపెట్టాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుంటాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి కాలం చెల్లింది. ఏపీతో ఆస్తుల విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరం.. అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చేందుకు రాష్ట్రం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. భావి తెలంగాణ నిర్మాణానికి ఈ రెండు ఇప్పుడు కీలక అంశాలు. బోనం నుంచి బతుకమ్మ వరకు.. సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు.. సమ్మక్క–సారలమ్మ నుంచి జోగులాంబ వరకు.. భద్రాద్రి రాముడి నుంచి కొమురం భీం వరకు మన సంస్కృతి, చరిత్ర గొప్పవి. వీటి పునరుజ్జీవనం జరగాలి. – పదేళ్ల తెలంగాణకు రాష్ట్ర గీతం లేకపోవటం దారుణం. ఉద్యమకాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తినిచ్చిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..’ గేయం ఇక నుంచి మన రాష్ట్ర అధికార గీతం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు. – తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అవి ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. అందుకోసం వివిధ వర్గాల సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం. – ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్‌లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా టీజీ ఉండాలన్న ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూ ఆ మేరకు చర్యలు తీసుకున్నాం. – నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండేలా తెలంగాణ తల్లి రూపాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో పునరుజ్జీవనం జరగాల్సి ఉంది. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే. ఆర్థిక పునరుజ్జీవానికి చర్యలిలా.. గత పదేళ్ల ఇష్టారాజ్య పాలనతో రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుంది. మా పాలనలో ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్‌కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ–2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నాం. – ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబర్బన్ తెలంగాణ.. రీజనల్ రింగ్ రోడ్డు అవతల రాష్ట్ర సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం. – మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నాం. దీనికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. రీజనల్ రింగ్ రోడ్డును వీలైనంత తొందరలో పూర్తి చేసేలా ప్రయతి్నస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. – ఉద్యమకాలంలో పోరాటపంథాలో ఉన్న యువకుల్లో కొందరు ఇప్పుడు డ్రగ్స్‌కు బానిసయ్యారు. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేకుండా చేస్తాం. ఈ విషయంలో తప్పు చేసేవారు ఏస్థాయి వారైనా ఉపేక్షించం. -
జాక్‌పాట్ సీఎంకు ఉద్యమ చరిత్ర తెలియదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా జై తెలంగాణ అనలేని మూర్ఖుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. శుభాకాంక్షల సందేశంలోనూ జై తెలంగాణ అనలేదని, జాక్‌పాట్ ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమ చరిత్ర తెలియదని అన్నారు. తె లంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షకు పురుడు పోసింది కేసీఆర్ ‘సీఎం రేవంత్ మూర్ఖుడు.. దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే నెల రోజుల పాటు సంబురాలు నిర్వహించే వాళ్లం. మలిదశ ఉద్యమంతో 2001లో టీఆర్ఎస్తో కొత్త విప్లవాన్ని çసృష్టించి చరిత్రను మలుపు తిప్పి తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ పురుడు పోశారు. ఆధునిక భారత దేశం కళ్లారా చూసిన మరో స్వాతంత్య్ర పోరాటం తెలంగాణ ఉద్యమం. సబ్బండ వర్గాలు కొట్లాడి, పోట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం మనది. అమరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భమిది. 60 ఏళ్ల విధ్వంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పుకున్న ఘనకీర్తి తెలంగాణ సొంతం. తెలంగాణ మరింతగా అభివృద్ది చెంది దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా.. ’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఘనంగా వేడుకలు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు అమరులకు నివాళి అర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగురవేశారు.తర్వాత ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ యాది’ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి, కూతురు ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభించారు. ఉద్యమ ఘట్టాలతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన ఈ ఫోటో గ్యాలరీని కేటీఆర్ నేతలతో కలిసి సందర్శించారు. అమరులకు నివాళులర్పించిన కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 11.30కు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు గులాబీలతో స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్ అమరులకు నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో గంట 20 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను మననం చేసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించే పంథాను వివరించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆట పాటలతో హోరెత్తించారు. సమావేశం ముగిసిన తర్వాత కళింగ భవన్లో కేటీఆర్ నేతలతో కలసి భోజనం చేశారు. -
భారతీయ సంస్కృతి ఎంతో ఇష్టం
సాక్షి, హైదరాబాద్: భారతదేశాన్ని ఎన్నోసార్లు సందర్శించానని, భారతీయ సంస్కృతి తనకెంతో ఇష్టమని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ చెప్పారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు జరిపిన వేడుకల్లో న్యూజిలాండ్ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రిస్టోఫర్ మాట్లాడుతూ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మసీ రంగాల్లో దూసుకుపోతోందని ప్రశంసించారు. ఈ ఏడాది భారత్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సందర్శిస్తానని వెల్లడించారు. ఈ సంఘ అధ్యక్షుడు మాల్గారి శైలేంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఒక ప్రధాన మంత్రి పాల్గొనడం ఇదే తొలిసారని సభ్యులు తెలిపారు. -
కనుల పండువగా సాంస్కృతిక మహోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముగింపుగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం కనుల పండువగా జరిగింది. వైవిధ్యభరితమైన తెలంగాణ సంస్కృతిని సమున్నతంగా చాటే కళాకారుల ప్రదర్శనలు.. ‘జయజయహే తెలంగాణ’పూర్తి గీతం నేపథ్యంగా ఐదు వేల మందితో జరిగిన ఫ్లాగ్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, తెలంగాణ ఉద్యమకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్, సీఎం సందర్శించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు తెలంగాణ అస్తిత్వాన్ని, వివిధ జిల్లాల వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు కార్నివాల్ నిర్వహించారు. మహిళా కళాకారుల డప్పుదరువు, ఒగ్గుడోలు ప్రదర్శన, బోనాలు, పోతురాజులు, ఘట విన్యాసం, బైండ్ల జమిడికలు, చిందు యక్షగానం, బతుకమ్మలు, గుస్సాడీ, థింసా, శివసత్తులు, మాధురి, లంబాడా నృత్య ప్రదర్శనలతో కార్నివాల్ సాగింది. ప్రముఖ నృత్యకారిణి అలేఖ్య పుంజుల బృందం ప్రదర్శించిన తెలంగాణ నృత్య నీరాజనం ఆకట్టుకుంది. ఉద్వేగ భరితం ‘జయ జయహే’గీతం 13.5 నిమిషాల నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’పూర్తి గీతాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. దీనిని వినిపిస్తున్న సమయంలో 5 వేల మంది పోలీసు శిక్షణ అభ్యర్థులు జాతీయ జెండాలతో ‘ఫ్లాగ్ వాక్’చేశారు. అప్పటికే వర్షం మొదలైనా కవాతు విజయవంతంగా సాగింది. ఈ సమయంలో వేదికపై గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సీఎం సన్మానించారు. ఆటంకం కలిగించిన వర్షం ట్యాంక్‌బండ్‌పై వేడుకలు మొదలైన కొంతసేపటికే వర్షం మొదలైంది. దీంతో వేడుకలకు వచ్చిన జనం ఇబ్బందిపడ్డారు. ఫ్లాగ్‌వాక్ సమయానికి వాన తీవ్రత మరింత పెరగడంతో ఇతర కార్యక్రమాలను హడావుడిగా ముగించాల్సి వచ్చింది. చివరిలో పది నిమిషాల పాటు బాణాసంచా పేల్చేందుకు ఏర్పాట్లు చేసినా.. వాన కారణంగా కొన్ని నిమిషాలకే పరిమితం చేశారు. మరోవైపు తమకు ఆహ్వనం ఉన్నప్పటికీ వేడుకల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పాస్‌లు లేనివారిని అనుమతించలేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆదివారం అమర వీరుల స్తూపానికి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. పదేళ్లుగా తెలంగాణ ఎన్నో సవా ళ్లు, చిక్కుముడులు ఎదురైనా సమష్టిగా ఎదుర్కొని అనేక రంగాలలో ప్రగతి పథంలో నిలిచిందని తెలిపారు. వేడుకల్లో తెలంగాణ భవన్ మాజీ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9.30 గంటల సమయంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నివాళులు అర్పించారు. 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అధికారిక గేయంగా ఖరారు చేసిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ..’సంక్షిప్త రూపాన్ని ఆవిష్కరించారు. ఈ గేయాన్ని వినిపిస్తున్న సమయంలో కవి అందెశ్రీ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవడం కనిపించింది. కేసీఆర్ కోసం ప్రత్కేకంగా సోఫా..: రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలకు రావాలంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వనం పంపిన విషయం తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ సభలో ముందు వరసలో కేసీఆర్ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పా టు చేశారు. కేసీఆర్‌కు కేటాయించిన స్థానం అంటూ కాగితంపై రాసి ఉంచారు.సోనియాగాంధీ వీడియో సందేశం వేడుకలకు ముఖ్య అతి థిగా సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించినా.. అనివార్య కారణాలతో రాలేకపోయారు. అయితే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా ఒక వీడియో సందేశం పంపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్ తెరలపై ఈ సందేశం వీడియోను ప్రదర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలం. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాను.తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి 2004 లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాను. అది సొంత పార్టీలో అసమ్మతి స్వరాలకు కారణమైంది. కొందరు నేతలు మా నిర్ణయంతో విభేదించారు. అయినా మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ హామీలు నెరవేరుస్తుంది. ప్రజలకు శుభం జరగాలి. జైహింద్.. జై తెలంగాణ’’అని వీడియో సందేశంలో సోనియా పేర్కొన్నారు. -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)
-
చిల్లర రాజకీయాల కోసం కొందరు ఉద్యమాన్ని వాడుకున్నారు: కేసీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమన్నారు. కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఖతమైంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు. మనకు మనమే కాదు, ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. కొన్ని క్షణాల గొప్పగా ఉంటాయి, కొన్ని క్షణాలు బాధగా ఉంటాయి. ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉంది. అన్ని పదవుల్లో నేను అనేక రోజులు చేశాను.1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మంచైనా చెడైనా మీతోనే ఉంటాము అని పనిచేసింది టీఎన్జీవో సంఘం. మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఉండేది ఆనాడు. వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితేనే చేస్తా అని ఉద్యమంలోకి వచ్చాను. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది. జయశంకర్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.మళ్ళీ ఉద్యమం నేను మొదలు పెట్టాను. చావనైనా చావాలి లేదంటే చంపాలి అని నేను ముందున్నాను. పాతాళంలో ఉన్న తెలంగాణపైకి తీసుకొచ్చాం. పాటతో మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలువాలే. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది. 25ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నాడు. ఖతం అయితదా?. మళ్ళీ నేను బస్సెక్కితే చూసారు కదా నా వెంట వచ్చారు మొత్తం. వందకు వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మొన్న నాదగ్గరికి ఒకరు వచ్చి చెప్పాడు ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 105 స్థానాలు వస్తాయని చెప్పారు.రైతు బంధు అనేది ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గు చూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు, వెర్రిమొర్రి వేషాలు అన్ని కనిపిస్తున్నాయి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. కరెంట్ లేక జనం చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎక్కువ రోజులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్ డౌన్ అవుతుంది. గత పదేళల్లో రైతులకు విత్తనాలను సక్రమంగా ఇచ్చాం. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి లైన్లో నిల్చోవాలన్సిన పరిస్థితి వచ్చింది.మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం గెలిచాం. వరంగల్‌లో హీరో రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నాడు. పార్లమెంట్లో ఎన్నైనా రావొచ్చు. ఎక్కువ సీట్లు వస్తే పొంగి పోయేది లేదు. తక్కువ వస్తే కుంగి పోయేది లేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్టీ ప్లీనరీ సమావేశం చేసుకోలేదు. పార్టీ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు ఘనంగా అద్భుతంగా చేసుకుందాం’ అని కామెంట్స్ చేశారు. -
కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు
-
తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
-
తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం
-
పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం
-
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి: సీఎం రేవంత్
Live Updates..👉 పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్చపై దాడి జరిగింది.పాలనను ప్రజల వద్దకు తెచ్చాం.మన సంస్కృతి, చరిత్ర గొప్పది.ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం.తల్లిని ఆహ్వానించేందుకు అనుమతి కావాలా.తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా, మన్మోహన్‌కు కృతజ్ఞతలు.ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది.బానిసత్వాన్ని తెలంగాణ భరించదు.ముళ్ల కంచెలు, ఇనుప గోడలను తొలగించాం.సచివాలయానికి సామాన్యుడు వచ్చేలా చేశాం.గత పదేళ్లలో స్వేచ్చపై దాడి జరిగింది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. తెలంగాణ వచ్చి పదేళ్ల అయినా ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేదు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నాను.రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి.చిహ్నం ఓ జాతి చరిత్రకు అద్దం పడుతుంది. రాష్ట్ర అధికారిక చిహ్నన్ని రూపొందించే పనిలో ఉన్నాం. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాం.ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చాం.ఆరోగ్యశ్రీని వైఎస్సార్ తరహాలో అమలు చేస్తాం. 👉నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.👉స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు."ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం" అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు.👉డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి... ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్‌ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 👉 ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నాం. సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరాపార్కులో ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత.👉జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యాన్ని చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ, చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలం. తప్పొప్పులను గుర్తించి, దిద్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణం.👉 పదేండ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. భౌతిక విధ్వసం మాత్రమే కాదు. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సినరాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. ఇది గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.👉 తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియాగాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఏ హెూదాలో సోనియాగాంధీ గారిని ఆహ్వానించారని అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హెూదా కావాలా?! తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా?! ఏ హెదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం?! తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతం.👉 దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో... అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.1. సాంస్కృతిక పునరుజ్జీవనం2. ఆర్థిక పునరుజ్జీవనంఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలకాంశాలు. ఆ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది.👉ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుండి బతుకమ్మ వరకు... సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు... భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి.👉తెలంగాణ వచ్చి పదేండ్లైన ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన.. "జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..." గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆ నాడు ఆశించాం. సహజ కవి అందెశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన "జయ జయహే తెలంగాణ..." గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు.👉 చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం.👉 అదే విధంగా.. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా TG ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యమ సమయంలో TG నే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నారు. యువత తమ గుండెలపై TG అక్షరాలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు TS స్థానంలో TG ని పునరుద్ధరిస్తు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.👉జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ... అంటే, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే... మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే... తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి... కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం.ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.👉ఆర్థిక పునరుజ్జీవనం :రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉంది. మేం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉంది. శాసనసభలో శ్వేత పత్రం పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నాం..👉గ్రీన్ తెలంగాణ 2050 స్వల్పకాలిక ఆలోచనలు కాదు... దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు "గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్” తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి... ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం.👉 మూసీ సుందరీకరణ..మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నాం. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించాం. రీజినల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.👉 డ్రగ్స్ పై ఉక్కు పాదం...తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. టీ న్యాబ్ కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను. ఇది మన యువత భవిష్యత్ కు సంబంధించిన అంశం. అందుకే ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పించాం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు... వ్యక్తిగతంగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను.👉ఇది ప్రజా పాలన..పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన. ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాం. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం ఒక కోటీ 28 లక్షల మంది ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మది వేల దరఖాస్తులు మిగిలాయి. ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది.👉48 గంటల్లో రెండు గ్యారెంటీలు..అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాం.రాజీవ్ ఆరోగ్య శ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్. ఈ పథకం ద్వారా తొలి సారి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పథకం లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఐదు లక్షలు ఉన్న పరిధిని డిసెంబర్ 9, 2023 నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తాం.ఇందిరమ్మ ఇళ్లు..రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది... పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం.విద్యారంగ ప్రక్షాళనతెలంగాణను ఎడ్యూకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసింది.అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీని కోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించాం. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నాం.👉రైతును రాజును చేయడం మా సంకల్పంరైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం ఇది. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ధరణి పోర్టల్ పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాం.👉విద్యుత్ సరఫరాలో రికార్డు బ్రేక్రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6 న అత్యధికంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. రికార్డు సృష్టించాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం.👉 తెలంగాణకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు..తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీతెలంగాణ అమరవీరులకు నివాళులుపదేళ్ల కిందట మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ కల నిజమైందిప్రజా తెలంగాణ సాధనకు కట్టుబడి ఉన్నాంఅందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత సాధించడమే లక్ష్యం 👉 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా సందేశం..సోనియా గాంధీ వీడియో సందేశం విడుదల చేసిన ప్రభుత్వం.సోనియా గాంధీ కామెంట్స్..తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంత రాష్ట్రం తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది.తెలంగాణ ప్రజల కళలు నెరవేర్చడం తక్షణ కర్తవ్యం.తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో వెనుకడుగు వేయదు. 👉పరేడ్ గ్రౌండ్లో కోలాహలం..పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.పరేడ్ గ్రౌండ్లో ప్రారంభమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుపాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులుహాజరైన సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల నేతలువేడుకలకు అమరుల కుటుంబ సభ్యులను పిలిచిన ప్రభుత్వంపరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిస్వాగతం పలికిన సీఎస్, డీజీపీ అధికారులుపరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి 👉అమరులకు సీఎం రేవంత్ నివాళులు..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు.👉తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులుకేటీఆర్ కామెంట్స్..తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయి.సీఎం రేవంత్‌కు అవగాహన, పరిపక్వత లేదు.ఛత్తీస్‌గఢ్ అవతరణ సందర్భంగా అక్కడ మూడు రోజులు నిర్వహించారు అక్కడి ముఖ్యమంత్రికానీ పది సంవత్సరాల తెలంగాణను ఒక్క రోజుకు పరిమితం చేశారు ఇక్కడి సీఎం రేవంత్.తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు.రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ ముఖ్యమంత్రిఈ రోజు ఉదయం సీఎం రేవంత్ పెట్టిన మెసేజ్‌లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ… ఆ పిడికిలి విప్పిచూస్తే… త్యాగం… ధిక్కారం… పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో… ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ… “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం… ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని… విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని… అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ…ఆ పిడికిలి విప్పిచూస్తే…త్యాగం…ధిక్కారం…పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో…ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ…“పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం…ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని…విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని…అందరికి… pic.twitter.com/09sJMwlyFN— Revanth Reddy (@revanth_anumula) June 2, 2024 తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులుఅసెంబ్లీ కౌన్సిల్లో జాతీయ జెండా ఆవిష్కరణ 👉 తెలంగాణ సెక్రటేరియట్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలుజాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ శాంతకుమారి,పాల్గొన్న ముఖ్య కార్యదర్శిలు కార్యదర్శిలు అధికారులు సిబ్బంది గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు..హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్.జాతీయ జెండా ఎగరేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు.కాసేపట్లో గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లనున్న కాంగ్రెస్ శ్రేణులు..గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అరిపించనున్న కాంగ్రెస్ నేతలు.. 👉 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ 13 ఏండ్ల ఉద్యమంతో స్వప్నం సాకారం.. 10 ఏండ్ల కేసీఆర్ పాలనతో ప్రగతి వికాసం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయోజనాలను, పదేండ్ల ప్రగతి పాలన ఫలాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమ పంథాకు సిద్ధమవుదాంరాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.జై తెలంగాణ ✊… pic.twitter.com/WAmTHKgCEe— BRS Party (@BRSparty) June 2, 2024 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.👉 ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. 👉 ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.👉 అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఉండనుంది. -
ఉత్సవాలకు అన్ని పార్టీలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉద్యమకారులకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వా నం అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే ఉత్సవ కార్యక్రమాన్ని పరిమితంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే వేడుకలకు ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. ఉద్యమకారులను ఆ హ్వానించామని, ఉద్యమకారులే ముఖ్యు లుగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నా మని చెప్పారు. అనేకమంది ఉద్యమ కారులు ఎఫ్ఐఆర్ కాపీలు పంపించారని, హైదరాబాద్‌కు రాలేని వారు ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనాలని కోరారు. -
హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.మరోవైపు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. -
TG: గవర్నర్‌కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్లింది. శనివారం ఉదయం రాజ్‌భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ఆహ్వానం గవర్నర్‌కు అందించారు. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు, పలువురు నేతలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.సోనియా రాక అనుమానమే!ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం వెళ్లింది. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం రేవంత్‌రెడ్డి సోనియాకు ఆహ్వానం అందించారు. ఈలోపు రేపటి వేడుకల కార్యక్రమాల్లోనూ ఆమె ఐదు నిమిషాలు ప్రసంగిస్తారని ఉంది. దీంతో ఆమె రాక ఖరారైందని అంతా అనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం.. పైగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే సోనియా కార్యాలయం తెలంగాణ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
కేసీఆర్ వెళ్తారా.. లేదా..?
-
కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ శుక్రవారం కేసీఆర్‌ను కలిశారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి జీఏడీ అధికారులతో కలిసి వెళ్లిన వేణుగోపాల్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను ఇవ్వడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌కు రాసిన లేఖను అందజేశారు.అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవం అందరికీ పండుగ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని కేసీఆర్‌ను కోరాం. ఆయన మా ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు’అని వెల్లడించారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఈ వేడుకల్లో పాల్గొనేదీ లేనిదీ తెలియదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
బీఆర్ఎస్ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారత్ రాష్ట్ర సమితి సన్నాహాలు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు. గతేడాది ప్రభుత్వపరంగా దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకలను జరిపిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ పరంగా ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్రకు అద్దం పట్టేలా వేడుకల నిర్వహణకు పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా కేసీఆర్ శుక్రవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కార్యక్రమాలకు సన్నాహాలపై పార్టీ నేతలతో సమీక్షించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఏర్పాట్ల తీరుతెన్నులను ఆయనకు వివరించారు. నేడు ర్యాలీ ప్రారంభించనున్న కేసీఆర్ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు, జిల్లాల నుంచి కూడా నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు కేసీఆర్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళి అరి్పస్తారు. అనంతరం గన్‌పార్కు నుంచి క్యాండిల్ ర్యాలీని ప్రారంభిస్తారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, ఇతర తెలంగాణ కళారూపాలతో వేయి మందికి పైగా కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొంటారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు పార్టీ కీలక నేతలు ఈ ర్యాలీకి నేతృత్వం వహిస్తారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన న్యాయవాదులు, డాక్టర్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా పాల్గొంటారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్ కాలునొప్పి ఉన్నందున ఊరేగింపు ప్రారంభ కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారు.రవీంద్రభారతి, రిజర్వు బ్యాంకు కార్యాలయం మీదుగా సాగే ఈ ర్యాలీ ట్యాంకుబండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమరజ్యోతి వద్దకు చేరుకుంటుంది. అక్కడ జరిగే ముగింపు కార్యక్రమంలో వందలాది మంది కవి గాయకులు అమరులకు నివాళి అరి్పస్తూ బృందగానం చేస్తారు. రేపు తెలంగాణ భవన్లో జెండాల ఆవిష్కరణ ఉత్సవాల రెండో రోజు ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2వ తేదీ ఉదయం 9 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తారు. 9.30కు తెలంగాణ భవన్ సమావేశ మందిరంలో ‘తెలంగాణ యాది’పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను అమరుల కుటుంబాల చేతుల మీదుగా ప్రారంభిస్తారు.అనంతరం 11 గంటలకు తెలంగాణ భవన్లో నాయకులు, కార్యకర్తలతో జరిగే సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి వచ్చే నాయకులు, కేడర్ కోసం మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉత్సవాల చివరి రోజు 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలు మినీ తెలంగాణ భవన్లలో పార్టీ జిల్లా అధ్యక్షులు జాతీయ పతాకం, పార్టీ జెండాను ఎగురవేస్తారు. స్థానికంగా పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
కేసీఆర్‌కు రేవంత్ ప్రత్యేక ఆహ్వానం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమానికి హాజరుకావా ల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ వ్యక్తిగత ఆహ్వాన లేఖను, ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లను సీఎం ఆదేశించారు.ఈ మేరకు కేసీఆర్‌ను కలసి ఆహ్వాన లేఖ, పత్రికను అందించేందుకు వారిద్దరూ కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరిపారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నారని సిబ్బంది వెల్లడించడంతో.. ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు వేణుగోపాల్, అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారని సీఎం కార్యాలయం తెలిపింది.చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ.. వేడుకలకు ఆహ్వానం..సాక్షి, హైదరాబాద్: కొంతకాలం నుంచి అనారో గ్యంతో బాధపడుతున్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గురువారం నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి సీఎం వెళ్లారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలంటూ రామయ్యను ఆహ్వానించారు. -
ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్ 2న అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యూల్ ఇదీ..అమరవీరులకు నివాళులతో మొదలుజూన్ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరి స్తారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకగా..2న సాయంత్రం ట్యాంక్‌బండ్ మీద వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణకు సంబంధించిన హస్తక ళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారూ పాలకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్బండ్ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహి స్తారు. ఈ ఫ్లాగ్‌వాక్ జరుగుతున్న సమయంలో ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం ఫుల్‌వెర్షన్ (13.30 నిమిషాల)ను విడుదల చేస్తారు. గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న ఏర్పాట్లుతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్‌లు సిద్ధం చేస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భారీ టెంట్లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్ షోలు ఉన్నాయి. కార్నివాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. -
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను అధికారికంగా, ఘనంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను వేదికగా ఎంచుకుంది. అయితే.. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా పలువురు లీడర్లను భాగం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆహ్వానం పంపారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఓ లేఖ సైతం రాశారు. ఈ మేరకు ఆ లేఖను మాజీ సీఎంకు అందజేసే బాధ్యతల్ని తన ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు సీఎం రేవంత్ సూచించారు. కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆ లేఖను అందించేందుకు గజ్వేల్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు సీఎంవో అధికారులు. స్వయంగా కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను, సీఎం రాసిన లేఖను అందజేసే యత్నం చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు మరికొందరు నేతలకు సైతం ఆహ్వానాలు పంపాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. -
తెలంగాణ పదేళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల హడావుడి
-
తెలంగాణ పదేళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల హడావుడి 'దశాబ్ది దంగల్'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ ప్రారంభమైంది. దశాబ్ది ఉత్సవాలపై తమ ముద్ర వేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హడావుడి చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పూర్తిగా తమ మార్క్ కనిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. మరోవైపు అధికారంలో ఉండగానే (గత ఏడాది జూన్‌లోనే) దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వపరంగా నిర్వహించిన బీఆర్ఎస్.. ఇప్పుడు పార్టీపరంగా దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతోంది. మరోవైపు దశాబ్ది ఉత్సవాలకు కొనసాగింపుగా పలు అంశాలపై కసరత్తు చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అధికారిక గేయాన్ని ఖరారు చేశారు. అధికారిక చిహ్నంలోనూ మార్పులపై దృష్టిపెట్టారు. ఈ మార్పులను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. గన్ పార్క్ నుంచి మొదలు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సోనియా గాం«దీని ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా ఆమెను సత్కరించాలని నిర్ణయించింది. 2న అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అరి్పంచడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కారి్నవాల్, లేజర్ షో, శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అధికారిక గేయమైన ‘జయజయహే తెలంగాణ’కు జాతీయ జెండాలతో మార్చ్ఫాస్ట్ నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌లోనే ఉత్సవాలు చేపట్టి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంలోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ప్రారంభ ఉత్సవాలను చేపట్టింది. 2023 జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు గ్రామగ్రామాన ఈ వేడుకలను నిర్వహించింది. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పోరాటంతోనే రాష్ట్ర సాధన జరిగిందని చెప్పుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు దశాబ్ది ముగింపు ఉత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. జూన్ 1వ తేదీనే గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అమరజ్యోతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2న కేసీఆర్ అధ్యక్షతన సభ నిర్వహించనున్నారు. 3వ తేదీన జిల్లాల్లో బీఆర్ఎస్ జెండా, జాతీయ పతాకం ఆవిష్కరణ, హాస్పిటళ్లు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. అధికార చిహ్నం మార్పులపై విమర్శలు దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రం ఇచ్చిన దేవతగా సోనియా ఈ కార్యక్రమానికి వస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిస్పందిస్తుండటంతో.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గేయంగా ప్రకటించిన ప్రభుత్వం.. దానికి తుదిరూపునిచ్చే క్రమంలో ఏపీకి చెందిన సంగీత దర్శకుడు కీరవాణిని ఎంచుకోవడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కళాకారులకు ప్రాంతీయ హద్దులేమిటని.. అయినా బీఆర్ఎస్ హయాంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారికి లభించిన గౌరవం మాటేమిటంటూ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. మొత్తంగా దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్రంలో రాజకీయ దంగల్ జరుగుతోంది. -
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు.. పోలీసుల రిహార్సల్స్ (ఫొటోలు)
-
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష
-
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈసీ అనుమతి లభించిన నేపథ్యంలో వేడకులకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.అదే రోజు ముందుగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. -
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
కెనడా ప్రముఖ నగరం టోరంటోలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది జూన్‌కి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో కెనడాలో స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. టోరంటోలోని మిసిసాగ ఈ వేడుకలకు వేదిక అయింది. ఈమేరకు తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరూ ఒక్క చోట చేరి తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహుతులు ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్, ప్రొఫెసర్ కోదండ రామ్, ప్రముఖ కవి రచయిత అందెశ్రీ, ఇతర ప్రముఖులు టీడీఎఫ్ చొరవకు అభినందనల సందేశాలు పంపారు.ప్రొఫెసర్ జయ శంకర్ స్ఫూర్తి, మార్గదర్శకత్వంలో 2005లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ఏర్పాటు చేశామని, ఉద్యమకాలంలో సొంత రాష్ట్రం కోసం ఎంత ఆరాట పడ్డామో, సాధించుకున్న తెలంగాణ అభివృద్ది, సంక్షేమం వైపు పయనించేలా తమ వంతు పాత్ర ఇప్పటికీ తెలంగాణ ఎన్నారైలు పోషిస్తున్నారని టీడీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్ రెడ్డి పెద్ది తెలిపారు.తెలంగాణ ఎన్ఆర్ఐలు అంటే బతికేందుకు బయటి దేశం పోయినోళ్లు కాదు. రాష్ట్ర సాధనతో పాటు, నిర్మాణంలోనూ పాటు పడుతున్నామనే ఆదర్శంతో ఈ టీడీఎఫ్ పనిచేస్తుందని అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి అన్నారు. తెలంగాణ అస్థిత్వానికి కృషి చేసిన కవులు, కళాకారులను స్మరించి గౌరవిస్తూ, సన్మానించుకోవటం, అమరుల కుటుంబాలను తోచినంతలో ఆదుకోవటం తెలంగాణ డెవలప్ మెంట్ ద్వారా చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.ఇక కెనడాలో స్థిరపడాలని వచ్చే వృత్తి నిపుణులను అవసరమైన సలహాలు, సూచనలతో పాటు ఏటా కెనడాకు వస్తున్న తెలుగు విద్యార్థులకు అండగా టీడీఎఫ్ నిలుస్తోంది. అంతూగార నిత్య జీవిత ఒత్తిడులను జయించేందుకు ఆటపాటలే మార్గం అని భావించి స్పోర్ట్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసి క్రికెట్‌తో సహా వివిధ రకాల టోర్నమెంట్ల నిర్వహణ కూడా డెవలప్ మెంట్ ఫోరం చేస్తోంది. తెలంగాణకు భౌతికంగా దూరంగా ఉంటున్నా, అక్కడ సంప్రదాయాలు, ఆచారాలు, పండగలకు దూరం కాకుండా టీడీఎఫ్ గొడుగు కింద కెనడాలో అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. తంగేడు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి యేటా బతుకమ్మ ఉత్సవాలతో పాటు, వివిధ సందర్భాల్లొ కమ్యూనిటీ ఈవెంట్ లను నిర్వహిస్తూ అందరం కలుస్తున్నామని చెప్పారు.కెనడాలో పుట్టి పెరిగిన పిల్లలకు వారి మూలమైన తెలంగాణతో బంధం కొనసాగేలా చూసుకుంటున్నామని తెలంగాణ నైట్ నిర్వాహకులు అన్నారు. టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యుడైనటువంటి కీర్తిశేషులు గంటారెడ్డి మాణిక్ రెడ్డి పేరు మీద ఏర్పాటుచేసిన విశేష సమాజసేవ పురస్కారాన్ని పవన్ కుమార్ రెడ్డి కొండం దంపతులకు నిర్వాహకులు అందించారు. ఈ కార్యక్రమంలో విశేష అతిథిగా అమెరికా నుంచి వాణి గడ్డం, భారత దేశం నుంచి సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ బందు హాజరయ్యారు. కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నెరవెట్ల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రమోద్ కుమార్ ధర్మపురి, టీడీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రోగ్రామ్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!) -
మన స్మారకం.. ఘన నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణను సాకారం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం గురువారం ప్రారంభం కానుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో గతంలో ఉన్న లుంబినీపార్కు స్థలంలో సచివాలయ భవనానికి ఎదురుగా నిర్మించిన ఈ స్మారకాన్ని గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అతుకుల్లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించిన ఈ కట్టడం నగరంలో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అద్దంతో నిర్మించినట్టుండే ఈ కట్టడం ప్రపంచంలోనే నాలుగోది కావటం విశేషం. జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్‌ను దుబాయ్‌లో నిపుణులు ప్రీఫ్యాబ్రికేటెడ్ చేసి నగరానికి తరలించి అతికించి రూపొందించారు. కేవలం జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్‌కే దాదాపు రూ.50కోట్లు వ్యయం చేశారు. రూ.177 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం 26,800చ.మీ.ల విస్తీర్ణంలో రూపొందింది. 45 మీటర్ల ఎత్తుతో దీపం జ్వలిస్తున్నట్టు ప్రమిద ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఆకట్టుకుంటోంది. క్లౌడ్ గేట్: ఇది అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన చికాగోలో ఉంది. అక్కడి సముద్రం ఒడ్డున భారీ ఆకాశహర్మ్యాల ప్రతిబింబాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. ఎత్తయిన భవనాలు మేఘాలను తాకేలా ఉంటాయని ‘క్లౌడ్ గేట్’పేరుతో దీన్ని మిలీనియం పార్కులో ఏర్పాటు చేశారు. భారత్‌లో పుట్టి బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌గా స్ధిరపడ్డ అనీశ్కపూర్ దీన్ని డిజైన్ చేశారు. లిక్విడ్ మెర్క్యురీ ఇతి వృత్తంగా రూపకల్పన చేసినప్పటికీ అది చిక్కుడు గింజ ఆకారంలో ఉండటంతో ‘ది బీన్’గా ఖ్యాతి పొందింది. ఇందుకు 168 భారీ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ఇది 66 అడుగుల పొడవు 33 అడుగుల ఎత్తు ఉంది. 2004లో నిర్మాణం మొదలై 2006లో ప్రారంభమైంది. ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలివి.. బిగ్ ఆయిల్ బబూల్: ఇది చైనాలోని కార్మే నగరంలో కొలువు దీరింది. ఆధునిక చైనా రూపకల్పనలో అక్కడి ప్రభుత్వం 1955 ప్రాంతంలో కార్మేలో చమురు బావుల తవ్వకం చేపట్టింది. తొలి బావి 1956లోఅందు బాటులోకి వచ్చింది. ఆ నగరం చమురు కేంద్రం అన్న భావన వచ్చేలా ‘బిగ్ ఆయిల్ బబూల్’పేరుతో స్థానికంగా దీన్ని నిర్మించారు. చికాగోలోని క్లౌడ్ గేట్‌కు నకలుగా ఉన్నా.. చైనా మాత్రం కాదంటోంది. దాదాపు 250 స్టెయిన్లెస్ స్టీల్ షీట్లతో దీన్ని 2013లో రూపొందించారు. కానీ ఇది చికాగో నిర్మాణం తరహాలో లేదన్న విమర్శలు మాత్రం వినిపించాయి. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం: భారీ స్టెయిన్లెస్ స్టీల్ షీట్లతో నిర్మించిన మూడో కట్టడం ఇది. ఆధునిక నిర్మాణాలకు కేంద్రంగా దుబాయ్ నిలుస్తోందని చెప్పే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం నిర్మించింది. నాలుగు అంతస్తులుగా ఉండేలా 225 అడుగుల ఎత్తు, 17600 చదరపు మీటర్ల వైశాల్యంతో దీన్ని నిర్మించారు. ఇందులో ఎగ్జిబిషన్లు, ఇతర ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. ఆధునిక దుబాయ్ లక్ష్యాన్ని అరబ్బీ అక్షరాల్లో తీర్చిదిద్దారు. మనం వందల ఏళ్లు బతకలేకపోయినా, మన ఆధునిక ఆవిష్కరణలు వందల ఏళ్లు మనుగడ సాగిస్తాయన్న ప్రారంభంతో ఆ పద్యం ఉంటుంది. దీన్ని 2016లోనే నిర్మించినా, 2022లో పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించారు. -
దశాబ్ది వేడుకల వేళనైనా.. కనికరించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేళనైనా తమపై కనికరించి బదిలీలకు మోక్షం కలిగించాలని 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల స్పౌజ్ బదిలీలు జరిగినా, మిగతా జిల్లాలకు సంబంధించి పెండింగ్‌లో పెట్టారు. 18 నెలలు కావస్తున్నా అతీగతీ లేకపోవడంతో దశాబ్ది ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలోనైనా ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు బదిలీల కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మంత్రులను కలుస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు గోడు వివరిస్తున్నప్పటికీ 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు మాత్రం మార్గం సుగమం కావడం లేదు. జిల్లాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ... దాదాపు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడానికి అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో 21 మంది ఎస్జీటీలు స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ జిల్లాలో సుమారు 300 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో కేవలం 5గురు మాత్రమ స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ అక్కడ వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. స్పౌజ్ బదిలీలు జరగని మిగతా జిల్లాలైన వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. మిగిలిపోయిన 13 జిల్లాల్లోని స్పౌజ్ ఖాళీలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు. భర్త ఓ చోట... పిల్లలు మరోచోట స్పౌజ్ బదిలీలు జరగకపోవడంతో మహిళా ఉపాధ్యాయుల బాధలు వర్ణణాతీతం. భర్త ఒకచోట, భార్య మరో చోట.. చదువుల కోసం పిల్లలు హైదరాబాద్‌లోనో.. ఉండాల్సి రావడంతో ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 18 నెలలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారు కనీసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా తీపి కబురు అందుతుందని ఆశిస్తున్నారు. -
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ లేజర్ షో అదుర్స్ (ఫొటోలు)
-
కేసీఆర్‌కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..!
తెలంగాణలోని రాజకీయ పక్షాలు మరికొద్ది నెలల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధం అవడానికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఒక అవకాశంగా వినియోగించుకున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ ప్రగతికి తాము ఎంత కృషి చేసింది వివరిస్తూ, త్వరలో ఆయా వర్గాలకు ఇవ్వదలచిన కొత్త వరాలను ప్రకటించింది. తెలంగాణ మోడల్ దేశానికి మార్గదర్శి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విశేషం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వారు తెలంగాణ సాధన కాంగ్రెస్ వల్లే అయిందన్న విషయాన్ని గుర్తు చేయడానికి, తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో సహకరించిన ఆనాటి స్పీకర్ మీరా కుమార్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే అవకాశమా? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పోటీగా ఉత్సవాలు జరపడమేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంది.. ఇందులో గవర్నర్ తమిళసై కూడా భాగస్వామి అవడం విశేషం. వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల తదితర రాజకీయ పక్షాల వారు కూడా తెలంగాణ ఉత్సవాలను తమదైన శైలిలో నిర్వహించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కొత్త సచివాలయ ప్రాంగణంలో అట్టహాసంగా ఉత్సవం నిర్వహించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. అదంతా శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లే అనిపిస్తుంది. అయితే అదే సమయంలో.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కొత్త హామీలు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్, మిషన్ భగీరధ, దళిత బంధు, హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ది, రైతు బంధు, కొత్త నీటి ప్రాజెక్టులు మొదలైనవాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, యాదాద్రి అభివృద్ది తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు ఆయన స్పీచ్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్ష్యం నెరవేరినట్లే అన్న భావం స్పురించింది. అయితే అదే సమయంలో కొత్తగా బీసీల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం గమనించదగ్గ అంశమే. ఆత్మ విశ్వాసం కనిపించినప్పటికి.. దళిత బంధు కింద దళితులకు పది లక్షల ఇస్తుండడంపై మిగిలిన వర్గాలలో ఏర్పడిన కొంత అసంతృప్తిని చల్లార్చడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. మరో వైపు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూడా ఆయన తెలిపారు. స్థూలంగా చూస్తే కేసీఆర్‌లో మళ్లీ గెలుస్తామన్న ఆత్మ విశ్వాసం కనిపించినప్పటికి, ఎక్కడో ఏదో తేడా వస్తుందో అన్న సంశయం కూడా ఉందనిపిస్తుంది. అందుకే కొత్త హామీలను ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలలో వ్యతిరేకతను పొగొట్టడానికి తెలంగాణ ఉత్సవాలను ఆయన ఉపయోగించుకున్నారని భావించవచ్చు. ఇరవై ఒక్క రోజులు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వీరికి పోటీగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గోల్కండలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాని , బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లు తెలంగాణ ఏర్పాటువల్ల కేవలం కెసిఆర్ కుటుంబమే బాగుపడిందన్న సందేశం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంజయ్ మాత్రం యధా ప్రకారం ఎమ్.ఐ.ఎమ్ ఆఫీస్ దారుసలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇస్తామని అనడం అతిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాగా, గవర్నర్ తమిళసై కూడా రాజ్ భవన్ లో ఉత్సవం జరిపి కొందరి అభివృద్ది అందరి అభివృద్ది కాదని ఎద్దేవా చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం జరిపే కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానించడం లేదు. అది అసంతృప్తిగానే ఉన్నా, తమిళసై స్వయంగా సందర్భానుసారం కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకత నిలబెట్టుకునే యత్నం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ముఖ్య అతిధిగా పిలిచి తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను ప్రజలకు మరోసారి వివరించే యత్నం చేసింది. చదవండి: రాహుల్ ‘తుడిచివేత’ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో..? లక్ష్యం నెరవేరిందా? తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుందని ఆమె అన్నారు. మీరాకుమార్ తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో తీసుకున్న చొరవను ఆయా నేతలు వివరించారు.బిల్లు పాస్ అయినప్పుడు కెసిఆర్ లోక్ సభలో లేరని కాంగ్రెస్ ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డి గుర్తు చేశారు. సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని కేసిఆర్ చెప్పారని పేర్కొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బాగా నష్టం జరిగిందని ఆయన వెల్లడించడం విశేషం. ఎన్నికల ప్రచారానికి రిహార్సల్ తెలంగాణకు ఒక్క పైసా నిధులు ఇవ్వబోమని కిరణ్ అనడం వల్ల డామేజీ అయిందని హనుమంతరావు చెప్పారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట అనలేదు. కాకపోతే హరీష్ రావుతో వాదోపవాదాలలో సిద్దిపేటకు నిధులు ఇవ్వబోనన్న మాటను మొత్తం తెలంగాణకు వర్తింప చేసి తెలంగాణవాదులు ప్రచారం చేశారు. అయినా అదంతా చరిత్ర. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందన్నదానిపై ఆత్మ విమర్శ చేసుకుంటే ఉపయోగం తప్ప, ఇప్పుడు అయిపోయినదాని గురించి నిందించుకుంటే ఏమి ప్రయోజనం? ఏది ఏమైనా శాసనసభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు రిహార్సల్ అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’.. పోలీసుల ర్యాలీ (ఫోటోలు)
-
రైతు దినోత్సవం రసాభాస!
సాక్షి నెట్వర్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన రైతు దినోత్సవ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మా రింది. ధాన్యం కొనుగోళ్లు సరిగా చేపట్టక ఇబ్బందుల పాలయ్యామని.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ఇస్తామన్న పరిహారం ఏమైపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా రైతు దినోత్సవ కార్యక్రమాల వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని.. రూ.లక్ష రుణమాఫీ చేయలేదేమని నిలదీశారు. రైతు వేదికపై వడ్లు కుమ్మరించి.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో రైతువేదికపై భిక్షపతి అనే రైతు మొలకెత్తిన వడ్లను కుమ్మరించి నిరసన వ్యక్తం చేశారు. తన ధాన్యాన్ని సమీపంలోని సర్దార్‌నగర్ మార్కెట్‌కు తీసుకెళ్లినా.. కొనుగోలు కేంద్రం తెరుచుకోలేదని, వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని వాపోయారు. మరికొందరు రైతులు కూడా అకాల వర్షాలకు పంట నష్టం, పరిహారం అందని తీరు, కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై నిలదీశారు. మంత్రి క్యాంపు ఆఫీసు ఎదుట ధాన్యం పోసి.. తేమ, తాలు పేరిట ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు దోచుకుంటున్నారన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా కమలాపూర్‌కు చెందిన రైతు సట్టంశెట్టి రాజన్న ధర్మపురిలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం కుప్పపోసి నిరసన తెలిపాడు. రైతులకు ఏం చేశారని సంబురాలు? యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నేతలు, రైతులు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా.. ఏం చేశారని రైతు సంబరాలు జరుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగాయి. ఎంపీ కవితను నిలదీసిన రైతులు మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవితను పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లపై నిలదీశారు. ఎంపీ ప్రసంగిస్తుండగా లేచి.. కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, కొన్నా లారీలు రాక బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని.. వానలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేదెప్పుడు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని రుణమాఫీపై రైతులు నిలదీశారు. ‘రైతుబంధు వస్తోంది కదా..’అని ఎమ్మెల్యే పేర్కొనగా రుణాలపై తాము కట్టే వడ్డీకే ఆ డబ్బులు సరిపోవడం లేదని రైతులు మండిపడ్డారు. ధాన్యం కొ నుగోళ్లలో అక్రమాలనూ ప్రస్తావించారు. దీనితో ఎ మ్మెల్యే అసహనంతో వెళ్లిపోయారు. కార్యక్రమాలను బహిష్కరించి నిరసన ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, పంట నష్టపరిహారం అందకపోవడానికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు నిరసనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సభను బహిష్కరించగా, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతువేదికకు తాళం వేశారు. చందుర్తి మండల వ్యాప్తంగా రైతు సభలను బహిష్కరించారు. నష్టపరిహారం అందేదెప్పుడు? వరంగల్ తూర్పుకోటలో జరిగిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రసంగిస్తుండగా.. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టంపై పరిహారం ఏదంటూ నిలదీశారు. రైతుబంధు రావట్లేదా? సిగ్గు లేదా? రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అబాది జమ్మికుంట రైతు దినోత్సవ కార్యక్రమంలో ఓ రైతుపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇస్తామని మూడు నెలలైనా.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని బుర్ర కుమార్ అనే రైతు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలు కోత పెడుతున్నారని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కౌశిక్‌రెడ్డి.. ‘నీకు రైతుబంధు రావడం లేదా? నీకు సిగ్గు, శరం లేదా?’అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
‘తెలంగాణ’ ఏర్పాటులో టీడీపీది కీలకపాత్ర: కాసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరికొత్త చరిత్ర అని, అందులో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర కీలకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. టీటీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన కాసాని మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లనే కొత్త రాష్ట్రం కల నెరవేరిందన్నారు. -
కొందరి అభివృద్ధి కాదు.. అందరి అభివృద్ధి కావాలి
సాక్షి, హైదరాబాద్: కేవలం కొంత మంది అభివృద్ధి కాకుండా, రాష్ట్రం మొత్తం జరిగితేనే అది నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. అప్పుడే తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ సార్థకత సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇక్కడివారితోపాటు అంతర్జాతీయంగా ఉన్న తెలంగాణ వాసులంతా ఉద్యమ స్ఫూర్తితో మరింత చురుకైన పాత్ర పోషించాలని.. అంతా కలసి సరికొత్త తెలంగాణకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 30 మందిని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారందరినీ గవర్నర్ తమిళిసై శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలంటూ.. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్, ప్రసంగం ఆ సాంతం తెలుగులోనే కొనసాగించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ అన్నది కేవలం ఒక నినాదం కాదు. ఆత్మగౌరవ నినాదం. నా జీవితంలో ప్రతి క్షణం ప్రజాసేవకే అంకితం. నేను తెలంగాణ ప్రజలతో ఉన్నాను. తెలంగాణ ప్రజలు నాతో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నా పాత్ర కచ్చితంగా ఉంటుంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుదాం. తెలంగాణ సాధనలో 1969 ఉద్యమంలో పాల్గొన్న 30 మంది పోరాట యోధులను ఈ సందర్భంగా సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనేక రంగాల్లో ఈ పదేండ్లలో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా పేరు సాధించింది. అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని మారుమూల పల్లెలకు అభివృద్ధి ఫలాలు చెందాలి’అని గవర్నర్ ఆకాంక్షించారు. కేక్ కట్ చేసిన గవర్నర్.. శుక్రవారం గవర్నర్ పుట్టినరోజు కూడా అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె తెలంగాణ తొలి దశ ఉద్యమకారుల దగ్గరకు స్వయంగా వెళ్లి కేక్ తినిపించారు. ‘రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను అన్ని రాష్ట్రాల రాజ్భవన్లలో చేయాలని ప్రధాని మోదీ సూచించడం ఎంతో సంతోషించే అంశం. శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నా’అని అన్నారు. గవర్నర్ వ్యవస్థ అలంకారప్రాయమైనదని, దాన్ని రద్దు చేయాలని ఇటీవల కేసీఆర్.. కేజ్రీవాల్, భగవంత్సింగ్మాన్లతో కలసి చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా..గవర్నర్ అలంకారప్రాయమన్న వ్యాఖ్యలకు ఈ రోజు రాజ్‌భవన్‌లో జరుగుతున్న వేడుకలే సమాధానమన్నారు. అవతరణ వేడుకలకు ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందా..లేదా అన్నది సమస్య కాదని, దానిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదన్నారు. తానెప్పుడూ ప్రజలతోనే ఉన్నానని, వారు కూడా తనతో ఉన్నారని మరోమారు స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గవర్నర్ తమిళిసై చిన్నారులతో కలసి ఉత్సాహంగా కాసేపు కాలు కదిపారు. అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
ఉద్యమంతో మొదలై... ఉజ్వలమై..
త్వరలో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ అర్హులైన పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించాం. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తాం. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉద్యమ ప్రస్థానంతో మొదలై.. ఉజ్వల ప్రగతి వైపు తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని.. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగిడుతున్న రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే తక్కువ వయసున్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి పరుగులో ముందు వరుసలో నిలబడిందని.. తొమ్మిదేళ్లలోనే ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధించి, పదో సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఒక మైలురాయి అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెబుదామని పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాలకు కొత్త పథకాలను ప్రకటించారు. కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రిగా నేను వాగ్దానం చేశాను. తెలంగాణను దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ తొమ్మిదేళ్లలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ల కాలం వృధాగా పోయింది. మిగతా ఆరేళ్లలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మారుమోగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలు అందుకుంటోంది. అనేక సవాళ్లు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. ఇప్పుడు పరుగులు తీస్తోందంటే అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజల సహకారమే కారణం. బీసీల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా గొల్ల, కురుమలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం. ఈ నెల 24 నుంచి పోడు పట్టాలు రాష్ట్రంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం తీరుస్తోంది. ఈ నెల జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. అటవీ భూములపై ఆధారపడిన 15 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కలి్పంచనున్నాం. అదేవిధంగా వారికి రైతుబంధు పథకాన్ని కూడా వర్తింపజేస్తాం. అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పేదల ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని 9 జిల్లాల్లో ప్రారంభించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభిస్తాం. ఉద్యమంలా దళితబంధు దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30లక్షల మందికి దళిత బంధు అందించనున్నాం. రైతు బంధువులకు రూ.65 వేల కోట్ల సాయం రాష్ట్రంలో రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై వచి్చన స్పష్టత ఆధారంగా.. నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదు. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం. నూతన సచివాలయం.. భారీ అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయ సౌధం రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. గతంలో ముఖ్యమంత్రి కూర్చునే చాంబర్‌కు వెళ్లేదారి ఒక చీకటి గుహలోకి ప్రవేశించినట్టుగా ఉండేది. ఉద్యోగులు ఆఫీసు టేబుళ్ల మీదనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి ఇక్కట్లేవీ లేకుండా అధునాతన హంగులతో, అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ, వాస్తు నిర్మాణ కౌశలం ఉట్టిపడేలా కొత్త సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. బాబాసాహెబ్ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టుకోవడంతోపాటు.. సచివాలయం సమీపంలోనే 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. సచివాలయానికి మరోవైపు అమరవీరుల స్మారకం నిర్మించుకున్నాం. ఒకవైపు భారీ అంబేడ్కర్ విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుని విగ్రహం, నభూతో న భవిష్యతి అన్నరీతిన నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరులను ప్రతిరోజూ స్మరణకు తెచ్చే అమరజ్యోతి.. ఇవన్నీ మనకు నిత్యం కర్తవ్య బోధ చేస్తుంటాయి. సచివాలయం ఎదురుగా ఉన్న విశాలస్థలంలో తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. నిరంతర ప్రక్రియగా పేదలకు గృహ నిర్మాణం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల సముదాయం ఓ టౌన్íÙప్ను తలపించేలా ఉంది. అక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించాం. ఇదో ఉదాహరణ మాత్రమే. పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగిస్తునే ఉంటాం. సురక్షిత జలాల మిషన్ భగీరథ మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం ఇళ్లకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే.. ప్రజలను ఓట్లు అడగబోనని రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉంది. తెలంగాణ ప్రారంభించిన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్ యోజన’ పేరిట పథకాన్ని అమల్లోకి తెచ్చింది. విద్యుత్ విజయం తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుకాగా.. ఇప్పుడు 18,453 మెగావాట్లకు పెంచుకున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లే ఉండగా.. ఇప్పుడు 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. సాగునీటి రంగంలో స్వర్ణయుగం సమైక్య రాష్ట్రంలో మూలనపడ్డ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయడంతో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. వలసల జిల్లా ఉమ్మడి పాలమూరు ఈరోజు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతోంది. వలస వెళ్లిన జనం సొంతూర్లకు తిరిగి వచి్చ.. పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దంపడుతూ ‘‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసి, చెరువులన్ని నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది..’’ అని నేనే స్వయంగా పాట రాశాను. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతానికిపైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీక అయిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని యావన్మందీ కొనియాడుతున్నారు. అలాగే కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఇటీవల నేను స్వయంగా ఆ ఆలయానికి వెళ్లి పరిశీలించి, దేశంలో కెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల చొప్పున కేటాయించాం. పనులు పురోగతిలో ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయం సైతం ఇదేవిధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మన రాష్ట్రంలో కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉంది. రైతుబంధుకు రూ. 65 వేల కోట్ల సాయం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు పది విడతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించాం. భూరికార్డుల డిజిటలైజేషన్‌తో రైతుల భూముల వివరాలపై స్పష్టత ఆధారంగా.. నగదును రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందట్లేదు. ఒకవేళ రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టాం. రైతు మరణించిన 10 రోజుల్లోపే రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నాం. బీసీల్లోని కులవృత్తిదారులకు రూ. లక్ష సాయం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాలకు ఈ పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. గొల్ల, కురుమలకు భారీగా గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ప్రస్తుతం రెండో విడతలో రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీని దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభిస్తాం. ఉద్యమంలా దళితబంధు దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దళితులు తమకు నచి్చన ఉపాధిని ఎంచుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి అండదండగా నిలుస్తోంది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50వేల మంది లబి్ధదారులకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కో ట్లు కేటాయించాం. రెండో విడతలో భాగంగా 1.30 లక్షల మందికి దళితబంధు అందించనున్నాం. కాశీ, శబరిమలలో వసతిగృహాలు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ నుంచి కాశీకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహం నిర్మించబోతున్నాం. అదేవిధంగా శబరిమలకు వెళ్లే తెలంగాణ భక్తుల కోసం అక్కడ వసతి గృహం నిర్మిస్తున్నాం. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చివరిగా ‘ధర్మస్య విజయోస్తు.. అధర్మస్య నాశోస్తు.. ప్రాణిషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు..’ అని శ్లోకంతో ప్రసంగం ముగించారు. -
Congress Party: తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మాదే..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మరోసారి గుర్తు చేసేలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన వేడుకలకు మాజీ లోక్‌సబ స్పీకర్ మీరాకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెసేనని హస్తం నేతలు గట్టిగా నినదించారు. కాంగ్రెస్ లేకుంటే ,తెలంగాణ వచ్చేది కాదని.. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని టీ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తరువాత టీ కాంగ్రెస్ నేతలతో పాటు మీరా కుమార్ తెలంగాణ ఏర్పాటును గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆశయాలు నెరవేరలేదని, తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని మీరా కుమార్ తెలంగాణ ప్రజలను కోరారు. "తెలంగాణ ఆశయాలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కోట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలంటే తెలంగాణ ఆశయాలు తెలిసిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసు" - మీరా కుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్ "ఉద్యోగాల విషయంలో మనకు అన్యాయం జరుగుతోందని నాడు 1200మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అప్పటి హోంమంత్రి చిదంబరం తో రెండు సార్లు చర్చించా.. అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. మీరాకుమార్ ఎంతో ధైర్యంతో తెలంగాణ బిల్లును పాస్ చేసారు. మీరాకుమార్ ధైర్యం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు ఏలుతున్న వారు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారు. పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని పార్లమెంట్లో మోదీఆరోపిస్తున్నారు. బీజేపీ వాళ్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చదవండి: Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్ తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కేసీఆర్ పార్లమెంట్లో లేరు. మీరాకుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్ వస్తే..మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కు ఫోన్ చేసినా మాట్లాడలేదు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మీరాకుమార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ ఓటు వేశారు. నేరేళ్ళ బాధితులను పరామర్శించేందుకు మీరాకుమార్ వస్తే.. కేసీఆర్ అవహేళన చేసారు. 9 ఏళ్ళు పూర్తయితే.. ఎన్నికల కోసం ఓక సంవత్సరం ముందుగానే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలి." - ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి "తెలంగాణలో యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతులు సమస్యలతో సతమతమవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చకుందాం." -మాణ్క్ రావ్ ఠాక్రే "అసమానతలు ఉన్న ప్రాంతాల్లో తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. చారిత్రక నిర్ణయం వెనక సోనియా గాంధీ కృషి ఎంతో ఉంది. ఆనాటి తెలంగాణలో రాష్ట్రానికి ఉన్న గౌరవం, ఇప్పుడు ఉన్న గౌరవం ఎలా ఉందో అందరూ గమనిస్తున్నారు. రెండు సార్లు ఒకే కుటుంబ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అవసరం గురించి నాడు గంట పాటు సోనియా గాంధీ కి వివరించా." -దామోదర రాజనర్సింహ "తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ వచ్చింది. ఇప్పటికీ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబం తప్ప సామాన్యుడికి ఒరిగిందేమి లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది.. ఉద్యోగాలు ఏమయ్యాయి. మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా..? మళ్ళీ గడీల పాలన నడుస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ తో కలిసి బిఆరెస్ చేస్తుంది. కవిత విషయంలో అది నిరూపితమైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జలు పట్టం గడుతారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలి. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం." -మహేష్ గౌడ్ పార్టీలో అందరికంటే సీనియర్ ను నేనే. కడుపు చించుకుంటే పేగులు బయటపడుతాయని చెప్పడం లేదు. తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా అని కేసీఆర్ చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం వల్లే నష్టం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను అనడం తో కాంగ్రెస్‌కు భారీ నష్టం జరిగింది. కొట్లాడింది, తెచ్చింది మేము. -వి.హనుమంతరావు -
తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్ తమిళిసై డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రముఖుల మధ్య గవర్నర్ కేక్ కట్ చేశారు. వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ డ్యాన్స్ వేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. గవర్నర్ తమిళిసైకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనంతరం గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు. 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు తమిళిసై పాదాభివందనం చేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మందికిపైగా ప్రాణ త్యాగం చేయడం తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ఆనాడో తెలియజేస్తుందన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని, ప్రజల ఆత్మగౌరవ నినాదామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం -
మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
తెలంగాణ దశాబ్దిఉత్సవాలపై రామ్ చరణ్ ట్వీట్
నేటితో(జూన్ 2) తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు రోజుకో రంగం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా దశాబ్ది ఉత్సవాలను జరుపుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు… — Ram Charan (@AlwaysRamCharan) June 2, 2023 -
పదేళ్ల తెలంగాణ.. ఆవిర్భావ వేడుకల ఫోటోలు
-
దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది
-
Live: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం: కేటీఆర్
-
బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
‘తెలంగాణ ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి వైభవానికి ఎంతో గుర్తింపు’
సాక్షి, ఢిల్లీ: తెలంగాణవ్యాప్తంగా నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాత్యం కోసం ప్రార్థిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2023 ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజ్‌భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను గవర్నర్ సన్మానించారు. అనంతరం, తమిళిసై మాట్లాడుతూ.. ‘అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదం. ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు. స్వరాష్ట్ర ఏర్పాటులో బాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం నా అదృష్టం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ 1969లో రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను కలిశాను. హైదరాబాద్ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. కేవలం ఒక్క చోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృధి జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. తెలంగాణ అంటే స్లోగన్ కాదు. అది ఆత్మ గౌరవ నినాదం. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. కేంద్రం సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం జరిగింది. కానీ, నేటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు’ అని అన్నారు. మరోవైపు, బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసులో బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ నమ్మింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీది ప్రధాన పాత్ర. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం సహకరిస్తుంది. తెలంగాణలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతుంది. కేవలం నలుగురి కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుంది’ అంటూ విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ పోరాడారు: కిషన్ రెడ్డి -
ఆ అవకాశం నాకు దక్కింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. గన్‌పార్క్‌లో స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. సచివాలయం వద్ద జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించి.. అక్కడి సభా వేదిక నుంచి ప్రసంగించారాయన. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానానికి పదేళ్లు పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం రక్తసిక్తమైంది. శాంతియుతంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయి. మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర సాధనలో అమరులైనవారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అరవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 🎤 తెలంగాణపథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మన సంక్షేమ మోడల్‌ను కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఏ పథకం తెచ్చినా అందులో మానవీయ కోణమే ఉంటుంది. 🎤 రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవా కానుకగా.. బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం. 🎤 పోడు భూముల శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నాం. పోడు భూములకు రైతు బంధు వర్తించేలా చర్యలు చేపట్టబోతున్నాం. 🎤 గొల్ల, కుర్మలకు భారీ ఎత్తున్న గొర్రెలను పంపిణీ చేయబోతున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో విడుత పంపిణీ చేయబోతున్నాం. 🎤 గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అర్హులైన వాళ్లకు ఇళ్ల స్థలాలు అందిస్తాం. గృహలక్ష్మి పథకం ఒక్కో ఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. 🎤 దళిత బంధు ద్వారా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇస్తున్నాం. హుజూరాబాద్‌లో వందకు వంద శాతం ఈ పథకం అమలు అయ్యింది. ఇప్పటివరకు మొత్తం 50 వేలమందికి దళిత బంధు లబ్ధి చేకూరింది. 🎤 మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించాం. చెరువుల కింద పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. 🎤 ఇవాళ తెలంగాణలో కరెంట్ కోతలు లేవు.. అన్నీ వరి కోతలే 🎤 గ్రామీణఆర్థిక వ్యవస్థను బలపరిచాం. మన పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డు వస్తున్నాయి. 🎤 ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్నో అవార్డులు మిషన్ భగీరథకు వచ్చాయి.స్వరాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ సమస్యలు లేవు. 🎤 నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశాం. కాళేశ్వరంను అతితక్కువ కాలంలో పూర్తి చేశాం. 🎤 రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా కళ్లు తెరిపించింది. 🎤 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. 🎤 పవర్ హాలీడేతో పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. మోదీ స్వరాష్ట్రంలోనూ పవర్ హాలీడే అమలు అవుతోంది. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు
-
పదేళ్ల ప్రస్థానం ఎలా సాగింది..?
-
గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
-
ప్రజాకాంక్షలను ప్రతిఫలిస్తూ...
ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి, మలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జనరంజక పాలన అందిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో సంక్షేమా నికీ, అభివృద్ధికీ సమాన ప్రాధాన్యమిచ్చి, పదో వసంతంలోకి అడుగిడుతూ దేశవ్యాప్తంగా తన పాలనా మోడల్‌పై ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు, పేదలకు ఉద్దేశించిన అనేక పథకాలు ఆత్మగౌరవంతో ఆయా వర్గాలు నిలబడేలా చేస్తున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి తెలంగాణను పచ్చబార్చాయి. ఇది సంక్షేమ దశాబ్ది! ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత గడిచిన పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించుకుని దేశంలోనే అగ్రగామిగా తులతూగుతోంది. అందుకు గాను అహర్నిశలు కృషి చేస్తున్న నాటి ఉద్యమ సారథి, నేటి తెలంగాణ స్వరాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నిజంగా గొప్పవారు. పదేండ్ల నుండి సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు కీలక పథకాల గురించి... ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఒకసారి సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలోని సుమారు 1.60 లక్షల దళిత కుటుంబాలకు లక్షలాది రూపాయలను అందించే ‘దళితబంధు’ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం యావత్ దేశాన్ని నివ్వెర పరిచింది. దళితబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూ. 17,700 కోట్లు ప్రతిపాదించ డమైనది. ‘అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్’ కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. నూతనంగా ఏర్పడ్డ ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి భవన నిర్మాణం కోసం 20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మద్యం షాపుల లెసైన్సుల కేటాయింపులో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది. ప్రస్తుత బడ్జెట్లో ‘షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి’ కింద రూ. 15,233 కోట్లు ప్రతిపా దించడమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు రేషన్‌బియ్యం పంపిణీపై గత ప్రభుత్వాలు విధించిన పరిమితులను ఎత్తివేసింది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా పింఛన్లు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా’ పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచింది. దివ్యాంగుల పింఛన్‌ను 3,016 రూపాయలకు పెంచింది. ప్రజల కష్టాలెరిగిన ప్రభుత్వం గనుక మేని ఫెస్టోలో పేర్కొనక పోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మి కులకు, ఒంటరి మహిళలకు, ఫైలేరియా బాధితులకు, డయాల సిస్ పేషంట్లకు సైతం 2,016 రూపాయలపింఛన్ నెలనెలా అందజేస్తున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది. దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది. వారి వృత్తికి భరోసా, భద్రత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత, పవర్లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తున్నది. దీంతో సంవత్సరమంతా చేతి నిండా పని దొరుకుతున్నది. ప్రభుత్వం ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా నూలు, రసాయనాల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని అంది స్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 20,501 మంది చేనేత కార్మికులకు 33.17 కోట్లు సబ్సిడీ లభించింది. చేనేత కార్మికులకు ఆసరా పింఛన్ అందించడమే కాకుండా, నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షల బీమానూ అందిస్తున్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11 వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రంలోని గొల్ల కురుమల వద్ద దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో గొర్రెలున్నాయి. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్నది. చెట్ల రఖం బకాయిలు రద్దు చేయడమే కాక, తాటి, ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్‌డ్రింక్‌గా మార్చి అందించే ప్రాజె క్టును చేపట్టింది. ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లను కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా 2021– 22లో 51 కోట్లు ఖర్చు చేసింది. ఈ పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణు లకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధిని సమకూర్చింది. బీసీ వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి వారికి అండగా నిలిచింది. తెలంగాణ ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. క్రిస్మస్ సందర్భంగా దాదాపు 3 లక్షల మంది క్రైస్తవులకు కొత్త బట్టలతో కూడిన ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కొత్త చీరలను పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర, ముదిరాజ్ సోదరులకు అవ కాశం కల్పించింది. ఈ ప్రభుత్వ సహాయంవల్ల కులవృత్తుల వాళ్లు ఎంతగానో లాభపడ్డారు. ఇలా సంక్షేమ రంగంలో గడచిన తొమ్మి దేళ్ళ కాలంలో తెలంగాణ ప్రభుత్వం తిరుగులేని పనితీరును ప్రదర్శిస్తూ యావత్ భారతా వని దృష్టిని ఆకర్షించడం హర్షణీయం. వద్దిరాజు రవిచంద్ర వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు, తెలంగాణ అభివృద్ధి సంబురాలు! అభివృద్ధి అంటే నిర్దే శించుకున్న లక్ష్యాల ప్రకారం మనుగడ సాగించగలగడం. అభి వృద్ధిని పెరుగుతున్న ప్రజల జీవన ప్రమా ణాలను బట్టి కొలు స్తారు. ప్రధాన వనరు లను ఉపయోగించు కొని ఉత్పత్తులను ఏ మేరకు గణనీయంగా పెంచుకున్నామన్న దానినే ఆచరణాత్మక ప్రగ తిగా చూస్తారు. అభివృద్ధి అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమున్నతంగా ఎదగటం. మనం జీవిస్తున్న కాలంలో మానవ వనరు లను ఏ రకంగా ఉపయోగించుకోగలుగు తున్నాం, ఉన్న వనరులను సంపద సృష్టి కేంద్రాలుగా ఏ మేరకు మార్చుకోగలిగాం అనే వాటి మీద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి అభివృద్ధికి సంబంధించిన అంశాన్నీ తెలంగాణ రాష్ట్ర్రంలో స్పష్టంగా చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ఒక శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధి కేవలం ఓ దశా బ్దంలో జరగడం విస్మయం కలిగించే అంశం. ఇవ్వాళ దేశమంతా తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో అడుగులు వేసుకుంటూ తెలంగాణ పథకాల నమూనాను కేంద్ర ప్రభుత్వమే అమలు జరిపే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎది గింది. మన దగ్గర ప్రారంభమైన ‘రైతు బంధు’ పథకం దేశంలోని మొత్తం రైతాంగాన్ని పరవ శింపజేసింది. ఇతర రాష్ట్రాల రైతులు తమ రాష్ట్రాల్లో కూడా ‘రైతు బంధు’ పథకాన్ని పెట్ట మని డిమాండ్ చేస్తున్నారు. దళిత సమాజానికి అండగా ‘దళిత బంధు’ పెట్టడం మొత్తం భారతదేశంలోనే పెను విప్లవంగా నిలిచింది. ఊరుకూ, వాడకూ మధ్య ఉన్న బెర్రల్ని చెరిపేసి వాడ దగ్గరికే ఊరు పోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. అందరూ సల్లంగుండాలి, అందరూ సుఖపడాలి. అందుకు ‘అందరూ కలిసి కష్టపడాలి, సంపద పెంచాలి, సంపద పంచాలి’ అన్న దార్శనిక ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటోంది. చీకటి కాలాన్ని పారదోలి విద్యుత్ వెలు గుల వెన్నెలను పంచే తెలంగాణగా విలసిల్లు తోంది. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారం అయ్యింది. రాష్ట్రంలో 1,072 గురుకుల విద్యా లయాల్ని కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో నిర్మించారు. ఇవన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీ బిడ్డలు చదువుకునే సర్కారు కార్పొరేట్ స్కూళ్ళుగా విలసిల్లుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం జల ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లను అబ్బు రపరుస్తోంది. వైద్యరంగానికి సంబంధించి పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు విస్తృత మయ్యాయి. వైద్యాన్ని పేదవాళ్లు కొనుక్కో వలసిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళింది ప్రభుత్వం. తాజ్ మహల్ లాంటి సచివాలయం నిర్మించుకొని దానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడు గుల అంబేడ్కర్ విగ్రహం నిర్మించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సమ రంలో అసువులు బాసిన యోధుల్ని గుర్తు చేసు కుంటూ అమరజ్యోతిని నిర్మించుకున్నాం. నెర్రెలు బాసిన నేలపైన పసిడి పంటలు తులతూగే విధంగా చేసుకోగలిగాం. నల్లగొండకు పట్టిన ఫ్లోరోసిస్ పీడను ‘మిషన్ భగీరథ’ లాంటి ప్రాజెక్టు ద్వారా వదిలించుకోగలిగాం. ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు నిండు కుండలయ్యాయి. ఉపాధి అవకాశాలు పెంచ గలిగాం. హైదరాబాదులోని పటాన్ చెరువుకే పరిమితమైన పరిశ్రమలు, ఫార్మాసిటీలు ఇప్పుడు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటుగా తెలంగాణ అంతటా విస్తరిస్తు న్నాయి. ‘ఈ–పాసుల’ ద్వారా సులభంగా ఇచ్చే అనుమతులతో పారిశ్రామిక రంగం ఊపందుకుంది. ఐటీ రంగం తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల వద్దకు పాలనను తీసుకుపోయేటందుకు 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని రంగాలూ అభివృద్ధి చెందా లంటే మానవ వనరుల అభివృద్ధి అత్యంత ముఖ్యం. నైపుణ్యాలు పెంపొందాలంటే ఆరో గ్యవంతమైన సమాజం అవసరం. ఇప్పుడు ప్రతి జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించే స్థితికి రాష్ట్రం ఎదిగింది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల వరకు టాబ్లెట్ ఇచ్చే స్థితి నుంచి డయాలసిస్ సైతం చేసే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ‘కల్యాణ లక్ష్మి’, ‘కేసీఆర్ కిట్’, ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’, బీసీ ఆత్మగౌరవ భవనాలు, ఇతర సంక్షేమ పథకాలు అన్నీ కేసీఆర్ మార్కు తెలంగాణ మోడల్‌కు నిదర్శనాలు.అభివృద్ధి అంటే ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో చేసే వాగ్దానం కాదు. కేసీఆర్ దార్శ నిక ఆలోచనలతో అభివృద్ధిని తెలంగాణ నేలపై ప్రవహింపజేసి చూపారు. జరిగిన అభి వృద్ధి ఊహకు అందనిది. తక్కువ కాలంలో సాధించిన ఈ ప్రగతి భవిష్యత్తును మరింత పటిష్ఠంగా నిర్మించుకుంటూ పోవడానికి భరోసా ఇస్తోంది. అందుకే తెలంగాణ ‘దశాబ్ది సంబురాలు’ ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటోంది. ఊరూరా, వాడవాడలా ప్రభుత్వం సాధించిన ప్రగతిని చాటి చెçప్పుకుంటూ, సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ఈ సంబురాలను వాడుకుంటోంది. వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడెమీ ఛైర్మన్ (నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం; దశాబ్ది ఉత్సవాల ప్రారంభం) జూలూరి గౌరీశంకర్ -
Telangana Formation Day: పండుగ వాతావ‘రణం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం శుక్రవారం పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇటు పార్టీ తరఫున, అటు సర్కారు తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తరఫున గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణను ఇచ్చింది తమ పార్టీయేనంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేదిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. వామపక్షాలతోపాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. సెంటర్: గోల్కొండలో కొత్త సచివాలయంలో బీఆర్ఎస్ సర్కారు నూతన సచివాలయం వేదికగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది. శుక్రవారం సీఎం కేసీఆర్ సచివాలయంలో జాతీయజెండాను ఎగురవేసి.. గత తొమ్మిదేళ్ల ప్రగతి వివరించనున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలు ఆవిష్కరిస్తారు. గోల్కొండలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో గోల్కొండ కోటపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. గతేడాది ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహించిన కేంద్రం తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ‘‘ఎందరో అమరవీరుల బలిదానాలు, మరెందరో పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ఈ పోరాటాలు, త్యాగాలను స్మరించుకుందాం. మా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఒక వేడుకగా నిర్వహిస్తున్నాం’’ అని కేంద్ర సాంస్కృతికశాఖ ప్రకటించడం గమనార్హం. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై.. మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో రాజ్‌భవన్‌లో జాతీ య పతాకాన్ని ఎగురవేసి అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు. అనంతరం ప్రజలతో గవర్నర్ మాట్లాడుతారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాజ్‌భవన్ వేడుకల్లో గవర్నర్ ప్రసంగం ఏవిధంగా ఉండబోతున్నదన్నది ఆసక్తికరంగా మారింది. గాంధీభవన్‌లో కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్ అయిన సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్ రా ష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో తళుకులీనుతున్న హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనం, ఖమ్మంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎన్నికలతో.. ఏడాది చివరిదాకా.. ► కేంద్రంలో మోదీ ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్ తొమ్మిదేళ్ల పాలనను ముగించుకుని పదో ఏడాదిలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏప్రిల్‌లో లోక్‌సభ జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అత్యంత ప్రాధాన్యత లభిస్తోందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ సాధనలో ప్రధాన పార్టీలన్నీ తమ భాగస్వామ్యం, పాత్ర, ప్రాధాన్యతను చాటుకునేందుకు ఈ ఉత్సవాలను వేదికగా చేసుకున్నాయి. ఇందుకోసం రాష్ట్ర అవతరణ దినోత్సవంతోనే ఆపేయకుండా.. ఆ తర్వాతా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. ► తొమ్మిదేళ్ల పాలనలో వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేలా ‘ద శాబ్ది ఉత్సవాల’ పేరిట 21 రోజుల కార్యక్రమాలకు బీఆర్ఎస్ సర్కారు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వాములను చేసి పకడ్బందీ ప్రణాళికలు అమలుచేస్తోంది. ► కేంద్రంలోని మోదీ సర్కారు 9 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై, వివిధ వర్గాల ప్రజలకు చేకూరిన ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా మే 30 నుంచి జూన్ 30దాకా ‘మహాజన సంపర్క్ అభియాన్’ పేరిట ప్రచార కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలో మోదీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతోపాటు.. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించింది. గోల్కొండ ఖిల్లా కార్యక్రమమిదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గోల్కొండ కోటపై శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేస్తారు. తర్వాత సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో– పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు భారత సాంస్కృతిక వైభవం, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు అంశాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుంది. తర్వాత కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డా.ఆనంద శంకర్ బృందం, మంజుల రామస్వామి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, మంగ్లి, మధుప్రియల గానం, ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ దేశభక్తి గీతాల ఆలాపన ఉంటాయి. -
పదో వసంతంలోకి తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం పదో వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి మూడు వారాల పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అన్ని శాఖల పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉదయం 7.30గంటలకే జాతీయ జెండా ఆవిష్కరించాలని.. తర్వాత సచివాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని హెచ్ఓడీల అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయానికి హెచ్ఓడీల కార్యాలయాల నుంచి ఉద్యోగులను తరలించడానికి ప్రత్యేకంగా 278 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. వివిధ హెచ్వోడీల్లో పనిచేస్తున్న దాదాపు 13,510 మంది అధికారులు, ఉద్యోగులను ఈ వేడుకలలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శాఖలు, విభాగాల వారీగా ఉద్యోగులను తీసుకుని వచ్చే బస్సుల కోసం పార్కింగ్ స్థలంతోపాటు, వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు లాన్లో ఎక్కడెక్కడ ఆసీనులు కావాలో తెలియచేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెచ్ఓడీల ఉద్యోగుల్లో కనీసం 60శాతం మంది సచివాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. రోజుకో కార్యక్రమంతో.. ఇక దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రోజు ఒక్కో రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు శుక్రవారం జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. నియోజకవర్గ, మండల స్థాయిల్లో సైతం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
గోల్కొండలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
కేంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించామని, ఈసారి గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రేపు గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడంతోపాటు సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్ బృందం, మంజులా రామస్వామి బృందం ప్రదర్శనలు ఉంటాయన్నారు అలాగే, మంగ్లీ, మధుప్రియలు తెలంగాణ సంప్రదాయాన్ని, ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటలు పాడతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాజ్భవన్లలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కుటుంబపాలనకు చరమగీతం రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడితే తమకు నష్టమని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. అయితే, అవినీతి, నియంతృత్వ, కుటుంబపాలనకు చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతల మధ్య విభేదాల్లేవని, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాలను సృష్టిస్తున్నారన్నారు. బీజేపీలో చేరిన నాయకులు బీజేపీలోనే ఉంటారని, పార్టీ కోసమే రోజూ పోరాడుతున్నారని స్పష్టత ఇచ్చారు. రాబోయే రోజుల్లో అనేక మంది నాయకులు తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సహకారాన్ని వివరిస్తూ త్వరలోనే ప్రజలముందు పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని.. ఈ విషయంలో విభేదాలకు తావిచ్చేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఎవరూ వ్యాఖ్యానించవద్దని హితవు పలికారు. దక్షిణ భారతం–ఉత్తర భారతం అంటూ విభేదాలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న వారికి.. కేంద్ర ప్రభుత్వం ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు కనిపించడం లేదా? అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాగా, ఇటీవల పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిష్టించిన పవిత్ర రాజదండం ‘సెంగోల్’రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనానికి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ అంబలవాన పండారా సన్నిధి స్వామి కిషన్‌రెడ్డిని కలిసి ఆశీర్వదించారు. -
కేసీఆర్ నిర్ణయం.. నూతన సచివాలయం సమీపంలో ట్విన్ టవర్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన నూతన సచివాలయం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్రస్థాయిలో కీలకమైన పనులన్నీ ఒకే చోట జరిగేందుకు మార్గం పడింది. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాధిపతుల (హెచ్ఓడీల) కార్యాలయాలను ఒకే గొడుగు కిందికి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం కొత్త సచివాలయానికి సమీపంలో ట్విన్ (జంట) టవర్లు నిర్మించాలని.. దీనికి సంబంధించి స్థలాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. హెచ్ఓడీల వివరాలపై ఆరా.. దేశం గర్వించేలా నిర్మించుకున్న కొత్త సచివాలయం ఉద్యోగుల విధి నిర్వహణకు అత్యంత అనువుగా ఉందని.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారని సమీక్షలో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో.. మౌలిక వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్విన్ టవర్లను నిర్మించే అంశంపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల పరిధిలోని హెచ్ఓడీల వివరాలు, మొత్తం ఉద్యోగుల సంఖ్య, అవసరమైన స్థలం, సదుపాయాలు తదితర అంశాలపై ఆరా తీశారు. సచివాలయానికి సమీపంలో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మంచి స్థలాలను అన్వేషించాలని.. హెచ్ఓడీల అధికారులు, సిబ్బంది తరచూ సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. సమీపంలోనే ట్విన్ టవర్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. స్థలం ఎంపిక పూర్తయిన వెంటనే ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరగాలని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూన్ 2 నుంచి రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాల విషయంలో.. సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎం కేసీఆర్‌కు వివరించారు. జూన్ 9 నుంచి కుల వృత్తులకు ఆర్థిక సాయం కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎంబీసీ కులాలు, రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతుల ప్రజలకు దశల వారీగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ గంగుల కమలాకర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 9న నిర్వహించ తలపెట్టిన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. అమరుల స్మారకం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ లుంబినీ పార్కు స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారకం వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ ఈఈ శశిధర్‌కు సూచించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బీఆర్కేఆర్ భవన్ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలంలో ట్వీన్ టవర్స్? ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్వీన్ టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కార్యాలయాల కోసం 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అవసర మని అంచనా వేసినట్టు సమాచారం. అంతమేర భవనాల నిర్మాణానికి ఆదర్శ్‌నగర్ స్థలం అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
జూన్ 2 నుంచి 22 వరకు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ఖరారు చేశారు. సచివాలయంలోని తన చాంబర్లో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. జూన్ 2న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, జూన్ 3 నుంచి ఒక్కోరోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. ఉత్సవాల రోజువారీ షెడ్యూల్... జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు వంటి కార్యక్రమాలుంటాయి. ► జూన్ 3న ‘తెలంగాణ రైతు దినోత్సవం’గా జరుపుతారు. రాష్ట్రంలోని అన్ని రైతువేదికల వద్ద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాల విశిష్టతను తెలియజేసేలా కార్య క్రమాలుంటాయి. రైతులందరితో కలిసి ప్రజా ప్రతినిధులు, అధికారులు భోజనాలు చేస్తారు. ► జూన్ 4న పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యక్రమాలుంటాయి. ► జూన్ 5వ తేదీన ‘తెలంగాణ విద్యుత్ విజయోత్సవం’జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబరాలు సైతం జరుపుతారు. ► జూన్ 6న ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’జరుగుతుంది. ఈ రోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో ప్రగతిని వివరిస్తారు. ► జూన్ 7న ‘సాగునీటి దినోత్సవం’నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో సాధించిన విజయాలపై హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే సమావేశానికి సీఎం హాజరవుతారు. ► జూన్ 8న ‘ఊరూరా చెరువుల పండుగ’నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. కవి గోరటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువు మీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారులు వలల ఊరేగింపులు నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు, చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. ► జూన్ 9న ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’పేరుతో ఉత్సవాలు ఉంటాయి. నియోజకవర్గాల వారీ ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. సంక్షేమంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ రవీంద్రభారతిలో సభ ఉంటుంది. ► జూన్ 10న ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’నిర్వహిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పాలన సంస్కరణలతో ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు చేరువ చేయడం, దానివల్ల కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయి. ► జూన్ 11న ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’ఉంటుంది. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం, రాష్ట్ర ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తారు. ► జూన్ 12న ‘తెలంగాణ రన్’ఉంటుంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ నిర్వహిస్తారు. ► జూన్ 13న ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’నిర్వహిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు. ► జూన్ 14వ తేదీన ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం’జరుపుతారు. ప్రభుత్వం వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరిస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ► జూన్ 15న ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’జరుపుతారు. పల్లెలు సాధించిన ప్రగతిని తెలి పే పలు కార్యక్రమాలుంటాయి. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు. ► జూన్ 16న ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని,ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి. ► జూన్ 17న ‘తెలంగాణ గిరిజన దినోత్సవం’జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. ► జూన్ 18న ‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి. ► జూన్ 19వ తేదీన ‘తెలంగాణ హరితోత్సవం’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి జరిగిన కృషిని, అడవులు పెరిగిన తీరును వివరిస్తారు. ► జూన్ 20న ‘తెలంగాణ విద్యాదినోత్సవం’నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో సభలు నిర్వహించి, విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. నిర్మాణాలు పూర్తయిన ‘మన ఊరు– మన బడి’పాఠశాలలను ప్రారంభిస్తారు. సిద్ధంగా ఉన్న 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభిస్తారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు. ► జూన్ 21న ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చి లు, ఇతర ప్రార్థనా మందిరాల్లో కార్యక్రమాలు ఉంటాయి. ► జూన్ 22వ తేదీ గురువారం ‘అమరుల సంస్మరణ’కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలతో పాటు విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. -
తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా...
సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తూ పదో వసంతంలోకి అడుగిడుతున్న వేళ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణపై శనివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు, రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2 నుంచి 21 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సచివాలయంలో తొలిరోజు ఉత్సవాలు ప్రారంభం కానుండగా మంత్రులు వారివారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆశ్చర్యపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు ‘తెలంగాణ సాధించుకొని 2023 జూన్ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుత ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దేశానికే రోల్ మోడల్‌గా మారింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటున్నం’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలకు కొరవడిన కార్యాచరణ.. అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన ఫలితాలను ప్రజలకు అందేలా చూడటంలో దార్శనికతను ప్రదర్శించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణపట్ల దూరదృష్టి కొరవడిందని విమర్శించారు. 9 ఏళ్లు కాదు.. కేవలం ఆరేళ్లే! రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని చూస్తే వాస్తానికి అందుకు ఇంకా చాలా తక్కువ సమయమే పట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు. పేరుకు తొమ్మిదేళ్లు అయినా తొలి ఏడాదితోపాటు కరోనా రెండేళ్ల పీడ వల్ల దాదాపు మూడేళ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమన్నారు. వేడుకల షెడ్యూల్ ఇలా... ► జూన్ 2న తొలిరోజు కార్యక్రమాలను సచివాలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు. సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్వోడీలు ఉద్యోగులు హాజరవుతారు. ► అమరవీరులను స్మరించుకునేందుకు ప్రత్యేకంగా ఒక రోజును ‘మార్టియర్స్ డే’గా జరుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అమరుల స్థూపాలను అలంకరించి గ్రామగ్రామాన నివాళులు అర్పించాలి. జాతీయ జండాను ఎగరేసి వందన సమర్పణ చేయాలి. వారి త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేయాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డేలో పాల్గొనాలి. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొనాలి. ► వివిధ శాఖలు సాధించిన ప్రగతిని (ఆయా శాఖలకు కేటాయించిన రోజున) రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి. ► విద్యుత్ శాఖకు కేటాయించిన రోజును పవర్ డే’గా, తాగునీరు సాగునీటి సరçఫరాకు సంబంధించిన రోజును ‘వాటర్ డే’గా నిర్వహించాలి. ► అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి వెల్పేర్ డేను ప్రత్యేకంగా ఒకరోజు నిర్వహించాలి. దళితబంధు అమలు, 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టడం మొదలు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, మహిళలు సహా పేద వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యాచరణ సమాచారాన్ని మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిపేలా కార్యక్రమాలుండాలి. ► అగ్రికలర్చర్ డే, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డే, రెవెన్యూ డే, పరిపాలనా సంస్కరణలు, పోలీసు సంస్కరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపేలా ‘విమెన్స్ డే, ఇండస్ట్రీస్–ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టిజన్స్ డే (వృత్తిపనులు), గ్రీన్ డే, హ్యాండ్లూమ్ డే, ఆర్థిక ప్రగతి గురించి, మౌలిక వసతుల అభివృధ్ధి.. ఇలా ఒక్కో శాఖకు ఒక్కోరోజును కేటాయించి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలు చేపట్టాలి. ► స్వతంత్ర భారతంలో, తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీని రూపొందించి ప్రదర్శించాలి. ► స్వయం పాలనలో తెలంగాణలో సాగిన సుపరిపాలన, ప్రగతి గురించి మరో డాక్యుమెంటరీని రూపొందించాలి. ► 21 రోజుల సంబురాల సందర్భంగా పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ► గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి చారిత్రక కట్టడాలను, రామప్ప సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలను విద్యుత్ కాంతులతో అలంకరించాలి. ► హుస్సేన్ సాగర్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలి. ► విధుల్లో ప్రతిభ కనబరిచిన అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి అవార్డులు అందజేయాలి. ► రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 5–6 వేల మంది కళాకారులతో హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, ధూం ధాం, ర్యాలీ నిర్వహించాలి. -
TS: రాష్ట్రానికి పదేళ్ల పండుగ! సంవత్సరమంతా దశాబ్ది ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ‘దశాబ్ది ఉత్సవాల’ నిర్వహిణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడగా.. 2023 జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో గత తొమ్మిదేళ్ల అవలోకనాన్ని గుర్తుచేసుకుంటూ.. ఉత్సవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన రోజున వివిధ రంగాల్లో తెలంగాణ పరిస్థితి, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గణాంకాలతో సహా ప్రజల ముందుంచాలని భావిస్తోంది. ఎన్నికల ఏడాదికావడంతో.. క్షేత్రస్థాయిలో ఉత్సవాలతో ప్రజల మన్ననలు పొందాలనే ఆలోచనకు వచ్చింది. ఈ కార్యక్రమానికి జూన్ 1వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అప్పుడు.. ఇప్పుడు.. వివరాలివ్వండి! ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ ఏడాదిలో సాధించిన పురోగతికి సంబంధించిన వివరాలను అన్ని శాఖలు ప్రభుత్వానికి అందజేసేవి. ఈసారి కూడా అలా వివరాల సేకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. అయితే ఒక్క ఏడాది కాకుండా.. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో జరిగిన పురోగతి వివరాలను సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రతి శాఖ నుంచి పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్నారు. రెండు రోజుల్లో డేటా పంపాలని ఆర్థిక శాఖ నుంచి అన్ని శాఖలకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా ఈ పనిని పర్యవేక్షిస్తున్నారు. సేకరించిన వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరించనున్నారు. సీఎస్ సూచనల మేరకు ప్రతి శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన సావనీర్లను రూపొందించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ఈ సావనీర్లు, కాఫీ టేబుల్ కేలండర్లలో ఆయా శాఖల్లో 2014 నాటి పరిస్థితి ఏమిటి? ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న వివరాలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే కసరత్తు జరుగుతోంది. ప్రతిష్టాత్మక పథకాలపై ఫోకస్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, ధాన్యం ఉత్పత్తిలో రికార్డు, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, బీసీ గురుకులాల ఏర్పాటు వంటివి.. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకువచ్చాయి. ఈ పథకాలకు సంబంధించిన గణాంకాలతోపాటు.. వాటి అమలు ద్వారా వచి్చన మార్పును కళ్లకు కట్టినట్టు ప్రజలకు వివరించేలా ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల మనన్నలు పొందేలా.. ప్రజల మనన్నలు పొందేలా.. ఎన్నికల ఏడాది కావడంతో గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా వారి మన్ననలు పొందడమే ఈ దశాబ్ది ఉత్సవాల ఉద్దేశమని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏ పథకం అమలు చేసినా గణంకాలు మారుతుంటాయని.. కానీ ఆయా పథకాలు, ప్రాజెక్టుల ద్వారా సమాజంలో వచి్చన మార్పును వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు పాలనను చేరువగా తీసుకువచ్చామని.. ప్రతీ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల ద్వారా జిల్లా అధికార యంత్రాంగమంతా ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించనున్నట్టు సమాచారం. అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం, తెలంగాణ ఏర్పాటుకు స్ఫూర్తి నిచి్చన బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ స్థాపన, తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేలా అమరవీరుల స్మారకం, అమరజ్యోతి వంటి వాటిని సగర్వంగా చాటాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది పాటు ఉత్సవాలు.. దశాబ్ధి ఉత్సవాలను ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ వరకు నిర్వహించాలని.. చివరి రోజున ప్రత్యేకంగా వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మధ్యలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తొలుత ఈ ఏడాది జూన్ 1 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ వారం రోజుల పాటు గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ దాకా వివిధ దశల్లో ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ప్రభుత్వ వర్గాలు త్వరలో ఖరారు చేయనున్నాయి. చదవండి: వైద్యంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేయాలి -
నయా నిజాం చేతిలో రాష్ట్రం బందీ
సాక్షి, హైదరాబాద్: ‘ఎందరో ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు నయా నిజాం చేతిలో బందీ అయింది. వారి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం చారిత్రక అవసరం. దీనికోసం మీ గ్రామాల్లో, మండలాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేయండి. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే మహాయజ్ఞంలో భాగస్వాములు కండి’అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రవాస తెలంగాణవాసులకు విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి శుక్రవారం డల్లాస్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ కలను సాకారం చేశారు.. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారు. రాజకీయంగా ఒడిదుడుకులు ఎదురవుతాయని తెలిసినా తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే ఎందుకు వచ్చిందా తెలంగాణ అనే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని చూసుకుంటూ కూర్చోవద్దు. అధికార పక్షం 120 కేసులు పెట్టి జైల్లో పెట్టినా తెలంగాణ ప్ర జల మీద ఉన్న బాధ్యతతో నిలబడి పని చేస్తున్నా. జైల్లో చిప్పకూడు తిన్న తర్వాతే నా లో గుండె ధైర్యం పెరిగింది. ఆ చిప్ప కూడు మీద ఒట్టేసి చెపుతున్నా. కేసీఆర్‌ను పాతాళానికి తొక్కే బాధ్యత తీసుకుంటా. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల దాకా తరిమే వరకు పోరాటం చేస్తా. నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు’ అని చెప్పారు. తెలంగాణను సర్వనాశనం చేశారు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు రూ.5 లక్షల కోట్ల అప్పు ఉంది. కేసీఆర్ హిట్లర్‌కా బాప్ అయ్యారు. సోనియా రుణం తీర్చుకునే సమయం వచ్చిందని ఎన్నారైలు గుర్తించాలి. ఎన్నారైలకు 2–3 ఎంపీ సీట్లు, 5–6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేలా అధిష్టానాన్ని ఒప్పిస్తాం’ అని వివరించారు. ‘ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్సను తెలంగాణ సర్కార్ చేయించలేకపోయింది. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1000 దాటితే కరోనాతో పాటు 1,500 రకాల జబ్బులకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తోంది. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను తయారు చేస్తోంది’ అని ప్రశంసించారు. సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
ఎనిమిదేళ్లలో ఎన్నెన్నో విజయాలు
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే ఘన విజయాలెన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయని, 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. రాష్ట్రం సాధించిన అభివృద్ధిపై ప్రసంగించారు. అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు. సత్ఫలితాలిస్తున్న పథకాలు కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల సరఫరా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, రైతు రుణమాఫీ, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, చేపపిల్లల పెంపకం, గొర్రెల పంపిణీ, సెలూన్లు.. దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్, గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు, పల్లె/పట్టణ ప్రగతి, టీఎస్–ఐపాస్, భూరికార్డుల ప్రక్షాళన, ధరణి వంటివి కూడా మంచి ఫలితాల్నిచ్చా యని అన్నారు. ఎనిమిదేళ్ళలో లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుపొందిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్‌కు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రూ.2 కోట్ల నగదు బహుమతికి సంబంధించిన చెక్కును సీఎం అందజేసి సత్కరిం చారు. జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన ఇషా సింగ్‌కు కూడా రూ.2 కోట్ల చెక్కును, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి చెక్కును అందజేశారు. -
ఘనంగా రాష్ట్రావిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావిర్భావ వేడుకలు నగరంలోని వివిధ ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయగీతం ఆలపించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యుత్‌సౌధలో తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరులస్తూపం వద్ద నివాళులర్పిస్తున్న పొన్నాల, గీతారెడ్డి, భట్టి, అంజన్ తదితరులు గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లో ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్యంఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
రాష్ట్రానికి సేవలు చేస్తూ.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా..!
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఈ రాష్ట్రానికి సేవలు చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. కానీ బాధపడడం లేదు. నా సేవలను తెలంగాణ ప్రజలకు అందిస్తూనే ఉంటాను’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘నేను ఎవరు ఆపినా... ఆగను కలుస్తాను.. కలుస్తూనే ఉంటాను’అని స్పష్టం చేశారు. గురువారం రాజ్‌భవన్ దర్బార్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో వేడుకలకు వచి్చన ప్రముఖులు, రాజ్‌భవన్ అధికారులు రెండు వేడుకలను ఒకే వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు కళాకారులను గవర్నర్ సన్మానించారు. అనంతరం ఆమె పూర్తిగా తెలుగులో మాట్లాడారు. ‘అందరికీ నమస్కారం.. ఈ రాష్ట్రం నాది. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు. ఈ రాష్ట్రానికి సహోదరిని’అని ప్రసంగం ప్రారంభించారు. ‘రాష్ట్రపతి, ప్రధాని నాకు ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. నేను కూడా ఆ అవకాశాన్ని చక్కగా సది్వనియోగం చేస్తున్నాను. రాజ్‌భవన్ తరపున చాలా కార్యక్రమాలు చేపట్టాము. రాజ్‌భవన్ స్కూల్లో భోజన కార్యక్రమం చేపట్టి, కరోనా కాలంలో నిరి్వరామంగా పర్యవేక్షించాం. భద్రాచలం, ఆదిలాబాద్‌లలో ఆదివాసీ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశాం. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాం’అని చెప్పారు. ఎందరో త్యాగశీలుల ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ అని, తెలగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అంతకుముందు వేడుకలను పురస్కరించుకొని గవర్నర్ కేక్ కట్ చేశారు. -
కుతంత్రాల కేంద్రం.. అంక్షలు.. వివక్ష..!
సాక్షి, హైదరాబాద్: ‘కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతోంది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన రూ.లక్షల కోట్లను నిస్సిగ్గుగా హరిస్తోంది. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ, నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తోంది..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అంతకు ముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రోత్సాహం లేదు..నిధుల్లేవు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రం వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా వ్యవహరిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. దీనితో లోయర్ సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కోల్పోయాం. కేంద్ర వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. ఆనాటి నుంచి నేటివరకూ రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధానమంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనా క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా రావల్సిన నిధులపై కోత విధించింది. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి, వీటికి రావాల్సిన నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా కేంద్రం తాత్సారం చేసింది. పునర్విభజన హామీలు బుట్టదాఖలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పునర్విభజన జరపాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉన్నా, కేంద్రం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేస్తోంది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఈ చట్టం పేర్కొంది. కానీ చెప్పుకోదగ్గ ప్రోత్సాహకా లు ఏవీ ఇవ్వలేదు. హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటులో అతీగతీ లేదు. రాష్ట్రంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా అన్యాయం చేసింది. ఇది అమలు చేసి ఉంటే ఐటీ రంగం మరింతగా పురోగమించి, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. బధిర శంఖారావంగా రాష్ట్ర విన్నపం ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులు మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించేలా వీలు కల్పించాలని మోదీకి లేఖ రాశా. రాష్ట్ర విద్యార్థుల చదువులకయ్యే ఖర్చులను భరించడానికి సిద్ధమని తెలియజేశా. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదకరం. రాష్ట్రమే ధాన్యం కొంటోంది తెలంగాణ రైతుల పంటల కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అసమర్థతతో చేతులెత్తేసింది. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు, దీక్షలు చేశాం. అయినా స్పందన లేదు. ఆ విధంగా కేంద్రం మొండి చెయ్యి చూపినా, ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి భరోసా ఇస్తున్నా. విద్యుత్ సంస్కరణలకు నో రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదు. కేంద్రానికి తలొగ్గి ఈ సంస్కరణలు అమలు చేయనందుకు రాష్ట్రం ఏటా రూ.5 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల రుణాలను నష్టపోవాల్సి వస్తోంది. వీటి కోసం రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టి వారి నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి. కానీ, రైతులపై భారం మోపేందుకు సిద్ధంగా లేము. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి ఏదీ.. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశ ప్రజా స్వామ్యం పరిణితి చెంది అధికారాల వికేం ద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తి కుంచించుకుపోతోంది. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. కా లం గడిచేకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతూ, రాష్ట్రజాబితా తరుగుతోంది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నామావశిష్టమైపోతోంది. విద్వేషపూరిత రాజకీయాలతో ప్రమాదం దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి విలవిల్లాడుతోంది. మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. మత ఘర్షణలతో రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెం డా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పేట్రేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం. అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశా ల్లో ఉపాధి పొందుతున్న కోట్లమంది ప్రవా సభారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషపూరిత వాతావరణం దేశాన్ని వందేళ్లు వెనుకకు తీసుకపోవ డం ఖాయం. నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా విధి. విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టి రాజీపడే ప్రసక్తే లేదు. రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లమా? మృత్యువు నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్లమా? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’ అనే కుట్రపూరిత, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుంది. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకుంది. కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాలరాశాయి. దేశ సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారత నిర్మాణానికి జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలి. నూతన విధానాలకు తగు వేదికలు రావాలి దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకుపోతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశాన్ని దారిద్ర్యం ఎందుకు పీడిస్తోంది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టం చేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపై గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రజల జీవితాల్లో మౌలిక పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. దేశ ప్రజలకు కావల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే శక్తియుక్తులను భగవంతుడు మనందరికీ ప్రసాదించాలి. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం కేసీఆర్.. (ఫొటోలు)
-
తెలంగాణ సహకరిస్తే మరో లక్ష కోట్లు వచ్చేవి: అమిత్ షా
-
ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అమిత్ షా ఏమన్నారంటే?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి బీజేపీ మద్దతు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ కోసం చాలా మంది యువకులు ప్రాణ త్యాగం చేశారన్నారు. గురువారం.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తొలిసారిగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కిషన్‌రెడ్డి, మురళీధరన్ హాజరయ్యారు. చదవండి: దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది: సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ వచ్చిందని.. 2004 నుంచి 2014 వరకు డిమాండ్‌ను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతో 2014లో తెలంగాణ ప్రకటించారని అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతూ భారత్‌మాత నుదిటి బొట్టులా మెరిసిపోవాలన్నారు. ‘‘భద్రాచలం, సంగమేశ్వరం లాంటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుండాలని కోరుకుంటాం. ఏ రాష్ట్రంపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా గౌరవం ఇస్తాం. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం తెలంగాణకు రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చింది. కేంద్రానికి తెలంగాణ సహకరిస్తే మరో లక్ష కోట్లు రాష్ట్రానికి వచ్చేవని’’ అమిత్ షా పేర్కొన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా గౌరవం ఇస్తాం. కేంద్రం ఇచ్చిన నిధుల లిస్ట్ చదువుతూ వెళ్తే ఎన్నికలు వచ్చేస్తాయి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అని మోదీ నమ్ముతారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలకు తెలంగాణ సర్కార్ సహకరించలేదు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అమిత్‌షా అన్నారు. -
తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్ శుభాకాంక్షలు
సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.‘సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వంతో తెలంగాణ అభివృద్ధి సూచికల్లో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. పరిశ్రమలకు కేంద్రంగా ఉద్భవించింది. ఇది నిరంతరం అభివృద్ధి చెందాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని ట్వీట్ చేశారు. తెలుగులోనే రాష్ట్రావతరణ శుభాకాంక్షలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా /ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరకు అందరూ తెలుగులోనే శుభాకాంక్షలు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రతీ రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్తూ చేసిన ట్వీట్లకు ఆయా పార్టీ కార్యకర్తలు భారీగా ప్రతిస్పందించారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పనిచేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడటంలో పేరుపొందిన వా రు తెలంగాణ ప్రజలు. ప్రపంచ ప్రఖ్యా తి పొందినది తెలంగాణ సంస్కృతి. తెలంగా ణ ప్రజల శ్రేయస్సుకై నేను ప్రారి్థస్తున్నాను.’ –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.— Narendra Modi (@narendramodi) June 2, 2022 ‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ దారుణమైన టీఆర్ఎస్ పాలనను చూసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన రైతులు, కార్మికులు,పేదలు, సామాన్య ప్రజలకు శ్రేయస్సును అందించడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా నిర్మించాలనే కాంగ్రెస్ నిబద్ధతను మరోమారు పునరుద్ఘాటిస్తున్నాను. మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుంచి తెలంగాణ పుట్టింది. ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్, సోనియాగాంధీ నిస్వార్ధంగా పనిచేయడం పట్ల గర్వంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, ఈ చరిత్రాత్మకమైన రోజున అమరవీరులు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుందాం’ –రాహుల్ గాందీ, కాంగ్రెస్ నేత తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలుఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022 ‘సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటా న్ని గుర్తిస్తూ వారి చిరకాల స్వప్నం నిజం చేసిన రోజు ఇది. అమరవీరులను తలచుకుంటూ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. జై తెలంగాణ! జై కాంగ్రెస్!’ –ప్రియాంకా గాందీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ‘తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. అమర వీరులకు జోహార్ జోహార్... జై తెలంగాణ జై జై తెలం గాణ.’ –అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం ఇది కూడా చదవండి: దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ -
దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని, దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. గురువారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జెండా ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పుడు దేశం ప్రమాదకరస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది. దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదు. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే.. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇలాగే ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. దేశ ప్రజలకు కావాల్సింది.. కరెంట్, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి. ప్రగతి పథంలో దేశం పరుగులు పెట్టాలంటే.. నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది?. కాఐదేళ్లకొకసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్నినిర్వహించాలి.. గుణాత్మక మార్పు రావాలి అని ఉద్ఘాటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణకు వివక్ష తప్పడం లేదు! రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ప్రగతి శీల రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదు. నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని కోరినా ప్రయోజనం శూన్యం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వడం లేదు. పన్ను మినహాయింపు లాంటి ప్రోత్సహాకాలు కూడా ఇవ్వడం లేదని అన్నారాయన. ఆఖరికి అత్యంత క్లిష్టమైన కరోనా సమయంలోనూ రాష్ట్రానికి కేంద్రం నయా పైసా సాయం అందించలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలను బుట్ట దాఖలు చేయడంతో పాటు ఐటిఐఆర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు సీఎం కేసీఆర్. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కేంద్రం కోత విధించిందని, ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో నిరసన దీక్ష చేశాం. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవహేళన చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. రైతులను నిర్లక్ష్యం చేస్తే.. రోడ్డుపైకి వస్తారు. దేశవ్యాప్తంగా ఒకేవిధమైన కొనుగోలు విధానం ఉండాలి. రైతులతో చెలగాటమాడొద్దని కేంద్రానికి హితవు పలుకుతున్నా అన్నారు సీఎం కేసీఆర్. చదవండి: అటు తమిళసై.. ఇటు కేసీఆర్!! -
Telangana Formation Day: ఆవిర్భావం నాడూ అటు-ఇటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగుతున్నాయి. రాజధాని సహా ప్రతీ జిల్లాలోనూ పార్టీలన్నీ సంబురాలను నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు జెండావిష్కరణ వేడుకల్లో పాల్గొంటున్నాయి. అయితే ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలంగాణ గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ మరోసారి బయటపడింది. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కొద్దిపాటి అధికార గణం.. కళాకారుల సమక్షంలో వేడుకలను నిర్వహించింది రాజ్‌భవన్. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. ఒక సహోదరిని కూడా. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా. నా సేవ తెలంగాణ ప్రజలకి అందిస్తూనే ఉంటా. ఎంతో మంది త్యాగ శీలుల ఫలితం తెలంగాణా రాష్ట్రం అని పేర్కొన్నారు ఆమె. అలాగే ఇదే వేదికగా గవర్నర్ తమిళిసై పుట్టిన రోజు వేడుకలు కూడా జరిగాయి. కేక్ కట్ చేసిన సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆపై కళాకారులను సత్కరించారామె. ఆమె ప్రసంగంలో ఎక్కడా ప్రభుత్వ ప్రస్తావన లేకపోవడం విశేషం. మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉదయం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి.. ఆపై పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వనరులను అభివృద్ధి చేసుకున్నామని, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలే తమ ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శమన్నారు. తలసరి ఆదాయంలో రికార్డు సాధించామని, మౌలిక వసతుల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ‘‘ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను అధిగమించాం. ఇతర రాష్ట్రాలకు మిషన్ భగీరథ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతుల సంక్షేమ కోసం అనేక సంస్కరణలు, పథకాలు అమలు చేశాం అని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేస్తున్నాం. రైతు బంధు అందిస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. ఇతర రాష్ట్రాల మన పథకాలను ఆదర్భంగా తీసుకుంటున్నాయారు. 50 వేల కోట్లను రైతులకు పెట్టుబడులుగా అందజేసినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. -
వెలుగులతో ముస్తాబైన హైదరాబాద్ (ఫొటోలు)
-
పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్–19 మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ .. ఢిల్లీలో కేంద్ర సర్కారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించిన 12 మంది తెలంగాణ బిడ్డలను గవర్నర్ సన్మానించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు దర్బార్ హాల్లో అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు, వివిధ రంగాల ముఖ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకోనున్నారు. ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం అధికారికంగా నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. -
కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో..!
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా అన్నివిధాలా ఆటంకం కలిగిస్తోందని.. అయినా మొక్కవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధనదిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో పునర్నిర్మించుకుంటున్నామని.. నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోషపడాల్సిన సందర్భమని ప్రకటించారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజురోజుకూ గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటోందన్నారు. కేంద్రం సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు, రివార్డులు, ప్రశంసలే దీనికి సాక్ష్యమని తెలిపారు. పలు విధాలుగా పథకాలను అమలుచేస్తూ ఎనిమిదేళ్లలోనే ఊహించనంత సంక్షేమం, అభివృద్ధిని సాధించామన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్నిరంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతోందని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రజాసంక్షేమ పాలనను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. -
ఎనిమిదేళ్లలో చేసిందీ, చేయాల్సిందీ!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. అరవై ఏళ్లలో రెండు ఉత్తుంగ తరంగాల్లా సాగిన ఉద్యమం ఫలితంగా... ఎట్టకేలకు సకల జనుల కలను సాకారం చేస్తూ ‘తెలంగాణ’ ఆవిర్భవించింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జనం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు ఉద్యమపార్టీ హోదాలో అధికారాన్ని కట్టబెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉరికించామని ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదనీ, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కన్న కల నిజమయింది! తెలంగాణకు సంబంధించి 2014 జూన్ 2 ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజు తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నిర్మాత కె. చంద్రశేఖర్‌రావు స్వప్నం సాకా రమైన రోజు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు! కొత్త రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు. తమ భవిష్యత్తు మీద ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్న రోజు!! ఎనిమిదేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసు కుంటే... తెలంగాణ ప్రజల ఆశలు చాలా వరకు నెరవేరినట్లే అనిపిస్తుంది. ఏవో కొద్ది ప్రాంతాల్లో తప్ప తెలంగాణ అంతటా సాగునీటికీ, తాగునీటికీ ఇబ్బందులు తొలగాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజా బ్‌ను పక్కకు నెట్టేసి మనం ముందుకుపోతామని ఏ తెలంగాణ బిడ్డ అయినా అనుకున్నాడా! పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా వేల రూపాయలు అంది స్తారని ఏ రైతైనా ఊహించాడా? రైతు చనిపోతే కుటుంబం వీధినపడే పరిస్థితి నుంచి రూ. 5 లక్షల బీమా సొమ్ముతో ప్రభుత్వమే కుటుంబాన్ని నిల బెడుతుందని అనుకున్నామా? 24 గంటల కరెంటు సరఫరాను ఊహించామా! ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం ప్రభుత్వమే చేస్తుందనీ, మంచినీళ్ల కోసం బిందెలు భుజాన పెట్టుకొని ఫర్లాంగ్ల కొద్దీ నడి చిన ఆడపడుచులకు ఇంటి ముంగిట నల్లా తిప్పు కుంటే నీళ్లు వచ్చే రోజులు వస్తాయనీ భావించారా! గాంధీ, ఉస్మానియా తప్ప.. మరో ఆస్పత్రి దిక్కులేని పరిస్థితుల నుంచీ... ప్రతి ఒక్కరికీ అందు బాటులో ఆస్పత్రి ఉంటుందని కలలోనైనా అను కున్నారా? చదువుకు గతిలేని పరిస్థితుల నుంచి దేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఏ పండితు డైనా భాష్యం చెప్పాడా? చేనేత కార్మికులకు నూలే ఉరితాడయ్యే దశ నుంచి... ‘బతుకమ్మ చీరల’తో భవిష్యత్తుకు భద్రత లభిస్తుందని ఎవరైనా భరోసా ఇచ్చారా? ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక బక్కాయన అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చేశాడు. ఇందుకు ఆయన ప్లానింగ్, దార్శనికత, ముందుచూపు, విషయ పరిజ్ఞానం, కృషి, పట్టుదలలే కారణం. ఇవే ఆయననూ, తెలం గాణ రాష్ట్రాన్నీ ముందుకు నడిపించాయి. తెలం గాణ అస్తిత్వ, ఆత్మగౌరవాలకు ప్రతీక కేసీఆర్!! – డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సాధించాల్సింది ఎంతో..! తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా అవ లంబిస్తున్న విధానాలు, చేపట్టిన ప్రాజెక్ట్‌లు, పథ కాలు; పదవుల పంపకాలు, పైరవీలు, పంచాయి తీలు వంటి అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వచ్చిందని అడి గితే... ఆత్మ స్థైర్యం వచ్చిందనీ, ఆత్మ గౌరవం పెరిగిందనీ,‘మాది తెలంగాణ ’ అని సగర్వంగా చెప్పుకునే సాధికారికత సిద్ధించిందనీ చెప్పుకోగలి గిన స్థితిలో ఉన్నాం. మన పండుగలు, మన భాష యాస, మన పాటలు, పాఠాలతో తలెత్తుకొని నిల బడి గెలిచి నిలుస్తోంది తెలంగాణ.. ‘మా నిధులు మాకే’ అన్న కల నిజమైన వాస్తవాన్ని హర్షించ కుండా ఉండలేం. రాష్ట్రం తన నిర్ణయాలను తానే తీసుకుంటూ, తన తప్పుల్ని తానే సరిదిద్దుకుని, తన ముద్రను బలంగా వేస్తూ... జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తున్న నేప థ్యంలో ‘తెలంగాణ నాది’ అని సగర్వంగా చెప్ప కుండా ఉండలేం. అయినా అందుకోవాల్సిన లక్ష్యాలూ, నెరవేర్చాల్సిన ఆకాంక్షలూ ఉన్నాయి. ఆరు దశాబ్దాలుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలకు మరింత చేయూతను అందిం చాల్సిన అవసరం కనబడుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఆంధ్ర హవా పెరిగిపోవడం, రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారే పరిపాలనలో కీలక స్థానాల్లో కొనసాగడం బాధ కల్గించే విషయం. ప్రతి రంగంలో ఇక్కడి భూమి పుత్రులకే అవకాశాలు దక్కేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ఏ రాష్ట్రం పోటీ పడలేని విధంగా కొద్దికాలంలోనే 426 పథ కాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటి స్తోంది. సంతోషమే! కానీ, రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ ప్లీనరీలలో, బహిరంగ సభల్లో; తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో లలో పేర్కొన్న అనేక అంశాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. సమర్థ నాయకత్వం సమాజానికి లభించినప్పుడు సక్రమ మైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజానికి ప్రశ్నించేతత్వం ఉన్నప్పుడు నాయకత్వం మరిం తగా సమర్థమంతమవుతుంది. అప్పుడే సకల జనుల అభివృద్ధీ సాధ్యమవుతుంది. – సురేష్ కాలేరు, తెలంగాణ ఉద్యోగుల సంఘం సహాధ్యక్షులు, మొబైల్: 98661 74474 అమరవీరుల కుటుంబాల సంగతేమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లయింది. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి అమరులయ్యారు. అయితే రాష్ట్రం సిద్ధించినా అమరుల కుటుంబాల పరిస్థితి ఇంకా మారలేదు అనేది వాస్తవం. దాదాపు 1,200 మంది తెలంగాణ వాదులు మలి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పో యారు. కేసీఆర్ అమరుల కుటుంబాలను ఆదు కుంటామని చెప్తూ మొదటి అసెంబ్లీ సమావేశం లోనే బిల్లు పెట్టారు. ఆ తర్వాత జీఓ నంబర్ 80 విడుదలయింది. దీనిలో అమరుల కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వడం, రూ. 10 లక్షలు ధనసహాయం చేయడం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం, ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల కుటుంబాలకు గృహసముదాయం నిర్మించడం, అలాగే ప్రతి కుటుంబానికీ మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయడం, రాజధాని హైదరాబాద్‌లో పెద్ద స్మారక స్తూపాన్ని నిర్మించడం వంటి విషయాలను ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు 576 మందికి మాత్రమే ఉద్యోగం, పది లక్షల రూపాయల ధన సహాయం లభించింది. మిగతా అమర వీరుల కుటుంబాలకు ఏ ప్రయోజనాలూ అందలేదు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా కేసీఆర్ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాలని కోరు తున్నాం. అలాగే అమర వీరుల కుటుంబాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ, ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్మారక నిర్మాణంలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి అందులో అమర వీరుల చరిత్రను ఫొటోలతో సహా నిక్షిప్తం చేయాలనీ కోరుతున్నాం. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోనూ అమర వీరుల స్తూపాలను నిర్మిస్తారని ఆశిస్తున్నాం. – నరేశ్ నాయక్ జర్పుల, తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ‘ 85005 85982 -
తొలిసారి కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర సాంçస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం సా యంత్రం ఆరున్నర గంటల నుంచి డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే వేడుకల్లో గాయకులు మంగ్లీ, హేమచంద్ర సహా తెలంగాణకు చెందిన జానపద కళాకారులు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించనున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌లో భాగంగా హరియాణా రాష్ట్ర పాఠశాల విద్యార్థులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది మార్చి 12న 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు 75 వారాల కౌంట్‌డౌన్‌తో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు 2023 ఆగస్టు 15న ముగుస్తాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఇంటికో ఉద్యోగం ఏమైంది? : వైఎస్ షర్మిల
మెదక్ జోన్/వెల్దుర్తి/తూప్రాన్ (మెదక్): పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మళ్లీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామానికి చెందిన కొట్టమొల్ల వెంకటేశ్ (23) కుటుంబాన్ని ఆమె బుధవారం పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు సన్నగిల్లి వెంకటేశ్‌లాంటి నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని షర్మిల అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఖాళీ ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రైతుల సమస్యల సాధనలకు కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం పాటుపడదామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, రాంరెడ్డి, ఇందిరా శోభన్, రాజగోపాల్ పాల్గొన్నారు. -
నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు ఆయన గన్‌పార్క్‌లోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. ప్రగతిభవన్‌లో జరిగిన వేడుకల్లో సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉజ్వల భవిష్యత్తు ఉండాలి: రాష్ట్రపతి తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయాలన్న జాతీయ లక్ష్యాన్ని ఇప్పటికే తెలంగాణ నెరవేర్చిందని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగతి మరింతగా విస్తరించాలని కోరుకున్నారు. ఘనమైన చరిత్రకు నిలయం: ఉప రాష్ట్రపతి ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని ఉప రాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. సహజ వనరులతో, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల కోసం ప్రార్థిస్తున్నా: ప్రధాని విభిన్న సంస్కృతులతో పాటు ఎన్నో రంగాల్లో విశేషంగా రాణించినటువంటిæ కష్టపడి పనిచేసే వ్యక్తులను కలిగి ఉండడం తెలంగాణకు వరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలి పారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తాను ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. -
Photo Feature: అవతరణ సందడి.. అవగాహన తప్పదు మరి
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోయింది. మరోవైపు లాక్డౌన్ సడలింపు సమయంలో హైదరాబాద్ నగర రోడ్లపై వాహనాలు పోటెత్తుతున్నాయి. కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్రను మరోసారి భారీ వర్షం వణికించింది. -
Telangana Formation Day: అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకలు నిరాడంబరంగా జరిగాయి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్ రాజన్నసిరిసిల్ల: జిల్లాలో తెలంగాణ అవతరణ వేడుకలల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సిద్దిపేట దేవాలయాలు, ప్రాజెక్టులకు ఖిల్లా.. సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకల్లో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ను జూన్ 2వ వారంలో ప్రారంభించుకున్నామని చెప్పారు. ఇవ్వాళ సిద్దిపేట జిల్లా.. దేవాలయాలు, ప్రాజెక్టులకు ఖిల్లాగా మారిందన్నారు. ఒకప్పుడు బీడులువారిన పొలాలు ఉండేవని కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువుల మత్తడి దుంకుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఫారెస్ట్ కాలేజీ, మెడికల్ కాలేజీ, ఔటర్ రింగ్‌రోడ్డు, కేంద్రీయ విద్యాలయంతో అభివృద్ధి చెందిన జిల్లాగా మారిందని అన్నారు. 127 రైతు వేదికలు జిల్లాలో నిర్మించుకున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఉందని తెలిపారు. జిల్లాకు గోదావరి జలాలు రావడంతో మంచి పంటలు పండించుకొని ఎంతో రుచికరమైన ఆహారాన్ని ప్రజలు తీసుకొని రోగాల బారిన పడకుండా ఉంటున్నారని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టడం ఓ కళ అని ఎద్దేవా చేశారు. కానీ రానున్న నెల, రెండు నెలల్లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుండి వచ్చే నీటిని రైతులకు అందిస్తామని తెలిపారు. చదవండి: Telangana: సంక్షేమం.. ‘సప్త’పథం -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
-
Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విశిష్ట సంస్కృతికి నిలయం. కష్టపడి పనిచేసే తత్వమున్న తెలంగాణ ప్రజలు అనేక రంగాలలో రాణించారు. వారికి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. చదవండి: బ్లాక్‌ఫంగస్ బాధితుడికి కేటీఆర్ అండ.. Best wishes to the people of Telangana on the state’s Formation Day. The state is blessed with a unique culture and hardworking people who have excelled in many areas. Praying for the good health and well-being of the people of Telangana. — Narendra Modi (@narendramodi) June 2, 2021 -
Telangana: సంక్షేమం.. ‘సప్త’పథం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ.. ఏర్పాటైన ఏడేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోయింది. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, పరిశ్రమలు, వైద్యారోగ్య రంగం, విద్య, ఉద్యోగాలు.. ఇలా ప్రతి రంగంలో దేశంలో ఏ రాష్ట్రానికీ తీసిపోని విధంగా ఏడేళ్ల అభివృద్ధి ప్రస్థానం కొనసాగింది. 2014–15తో పోలిస్తే 2021–22 నాటికి అన్ని రంగాల్లోనూ పురోగతి కనిపిస్తోంది. ఇదంతా ఏడేండ్ల స్వతంత్ర పాలన.. రాష్ట్రం విషయంలో చిత్తశుద్ధి ఇచ్చిన ఆలంబన’.. అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి, విజయాలపై సోమవారం ప్రగతి నివేదన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని ప్రధాన అంశాలివీ.. సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్రంలో 39,07,818 మందికి ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ప్రభుత్వం నెలకు రూ.855 కోట్ల చొప్పున ఏటా రూ.10,266 కోట్ల మేర వారికి చెల్లిస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల్లో అమ్మాయిల వివాహాలకు సాయం కింద ఇప్పటివరకు రూ.5,556 కోట్లు అందించింది. రాష్ట్రంలో 87 లక్షలకుపైగా కుటుంబాల్లోని 2.83 కోట్ల మందికి ఏటా 1,78,754 టన్నుల బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 3,854 సంక్షేమ హాస్టళ్లు, 28,623 ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు 12 వేల టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 2014 నుంచి ఇప్పటివరకు రూ.41,253.66 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యానికి చేయూత ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. పీహెచ్‌సీల నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు వసతులు పెంచింది. ల్యాబ్‌లు, పరికరాలు, ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించింది. తెలంగాణ వచ్చే నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేల వరకు బెడ్స్ ఉండేవి. ఇప్పుడు మరో 5,000 పడకలు, వసతులు అదనంగా సమకూరాయి. తొలుత 5 మెడికల్ కాలేజీలే ఉండగా.. కొత్తగా 4 కాలేజీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్‌లో స్వయం సమృద్ధి రాష్ట్రంలో 13 వేల మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చినా ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేసిన ఘనతను తెలంగాణ విద్యుత్ సంస్థలు దక్కించుకున్నాయి. ఏర్పాటయ్యే నాటికి విద్యుత్ కొరతతో ఉన్న రాష్ట్రాన్ని.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ఏడేళ్లలో ఎన్నో ప్రణాళికలు అమలు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్లు స్థాపిత సామర్థ్యం ఉండగా.. ఇప్పుడు 16,245 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. వ్యవ ‘సాయం’ వ్యవసాయ రంగానికి 2013–14 బడ్జెట్లో మొత్తం ఉమ్మడి ఏపీకి కేటాయించింది కేవలం రూ.4,040 కోట్లు. అందులో తెలంగాణ వాటా 1,697 కోట్లు మాత్రమే. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఒక్క 2019–20 ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.33,125 కోట్లు కేటాయించింది. రాష్ట్రం పంటల ఉత్పత్తిలో 23.7 శాతం వృద్ధి సాధించింది. ప్రభుత్వం తొలిదశలో రూ.16,124.37 కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేసింది. తర్వాత 2018 డిసెంబర్లో మరో రూ.25,936 కోట్లు రుణమాఫీకి నిర్ణయించింది. పంట పెట్టుబడుల కోసం ఏటా రూ.10వేల కోట్లకుపైగా రైతు బంధు సాయం అందిస్తోంది. ఇప్పటివరకు రూ.35,676.22 కోట్లను రైతులకు అందజేసింది. కోటి ఎకరాల మాగాణి దిశగా.. కృష్ణా, గోదావరి నీటిని సమర్ధంగా వినియోగించుకుంటూ కోటి ఎకరాల మాగాణ దిశగా తెలంగాణ అడుగులు వేసింది. ఇప్పటికే ప్రాజెక్టుల కింద 72.55 లక్షల ఎకరాలు సాగవుతుండగా.. వచ్చే రెండు, మూడేళ్లలో మరో 52.11 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చేలా ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. కాళేశ్వరం దాదాపు పూర్తికాగా.. పాలమూరు– రంగారెడ్డి, డిండి, సీతమ్మసాగర్, సమ్మక్క సాగర్, చనాకా–కోరాట బ్యారేజీ, సదర్మాట్ బ్యారేజీ పనుల పూర్తికి చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు అందుతున్నాయి. విద్యా రంగంలో ప్రగతి రాష్ట్రంలో కొత్తగా 618 రెసిడెన్షియల్ పాఠశాలలు, 53 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన, హైదరాబాద్‌లో ఏరో యూనివర్సిటీ, కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు, నిజామాబాద్‌లో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ, వరంగల్‌లో సైనిక్ స్కూల్, ములుగులో ట్రైబల్ వర్సిటీ వంటివి రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. కొత్తగా 11 పాలిటెక్నిక్ లు ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీపై దృష్టి రాష్ట్రంలో 2014 నుంచి 2021 మార్చి వరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 128.37 శాతం పెరిగాయి. మొత్తం 6,48,560 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. వారి జీతాలకే ఏటా రూ.39,121 కోట్లు ఖర్చు చేస్తోంది. 2013–14లో జీతాల ఖర్చు రూ.17,130 కోట్లు మాత్రమే. 2,27,782 మంది తాత్కాలిక ఉద్యోగుల వేతనాలకు ఏటా రూ.1,023.43 కోట్ల ఖర్చు అవుతోంది. పరిశ్రమలకు ఊతం రాష్ట్రంలో 2019–20 నాటికి కొత్తగా 250 ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. 2013–14లో రూ.57,258 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు (8 శాతం వృద్ధి రేటుతో) జరగ్గా.. 2019–20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు (17.93 శాతం వృద్ధితో) జరిగాయి. అమెజాన్ భారీ పెట్టుబడి, టీ–హబ్, వీ–హబ్, టీ–ఫైబర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు, వరంగల్‌లో సైయంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లు, ఈ గవర్నెన్స్ సేవల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడం, జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్ వంటివి పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. టీఎస్ ఐపాస్ ద్వారా 2021 మే నాటికి రూ.2,15,450 కోట్ల పెట్టుబడులతో.. 15,64,804 మంది ఉపాధి అందించే 16,129 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. రెవెన్యూలో సంస్కరణలు రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. ధరణి పోర్టల్ రూపొందించి.. భూరికార్డులు ఎవరూ మార్చలేని విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలోనూ మార్పులు తెచ్చింది. గ్రామీణాభివృద్ధిలో ముందంజ! తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం గ్రామాలకు నిధులు ఇవ్వడంతోపాటు పల్లె ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే మూడు విడతలుగా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలను మార్చగలిగింది. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి, సంరక్షించడం, ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయడం, నర్సరీలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం, సురక్షిత తాగునీటి సరఫరా వంటివి చేపట్టింది. ఊరికో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ సమకూరింది. 2014–15 బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.13,877 కోట్లు కేటాయిస్తే.. 2021–22లో ఏకంగా రూ.29,291 కోట్లు కేటాయించింది. ప్రతి నెలా పంచాయతీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేస్తోంది. ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో 15.05 కోట్ల పనిదినాలు కల్పించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.463 కోట్లతో 2,601 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారు. రూ.743 కోట్ల వ్యయంతో 93,328 కల్లాలను మంజూరు చేశారు. -
KCR: బంగారు తెలంగాణ వచ్చేదాకా విశ్రమించను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యమని.. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంత వరకు తాను విశ్రమించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సమైక్యరాష్ట్రంలో విస్మరించిన రంగాలను ఒక్కొక్కటిగా ఓపిక, దార్శనికతతో అవాంతరాలు ఎదురైనా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. "అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశం గర్వించే రీతిలో నిలబెట్టుకున్నం. ఏడేండ్లలోనే దృఢమైన పునాదులతో సుస్థిరత చేకూరడం సంతోషంగా ఉంది. ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం రోడ్లు తదితర మౌలిక వసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో చేస్తున్నం. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైనా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. తెలంగాణలో 90శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉండటంతో వారి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నం. ప్రజల ఆకాంక్షలకు కార్యరూపమిచ్చి, అభివృద్ధి ద్వారా అమరుల త్యాగాలకు నివాళి అర్పించాలనే స్ఫూర్తి ఉంది. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, ఇతర కులవృత్తులతో పాటు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలబడింది. తెలంగాణ రైతాంగాన్ని కాపాడి సాగుకు పునరుజ్జీవం కల్పించి.. దేశానికే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయాన్ని స్థిరీకరించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశాం." -
కలలు కన్న కండ్లు సాకారంలో ఏడేండ్లు
ఇవి ఉద్యమాలను చూసిన కళ్లు. ఉద్యమం కడదాకా నిలిచి ఉద్యమం భుజం భుజం కలిపి విజయం అంచుల దాక చేరి, ఉద్యమ సాఫల్యతను చూసి విజయోత్సవాలను వీక్షించిన కళ్లు. ఒక సుదీర్ఘ ఉద్యమం చివరన నిలిచి గెలుపును కౌగిలించుకున్న మహా సందర్భాలను కనుగుడ్లలో దాచుకున్న కళ్లు. మట్టి మనుషుల మహాసంగ్రామపు సకల జనాగ్రహాన్ని కళ్లారా చూసిన కళ్లు. బక్క మనుషులంతా కలిసి ఆధిపత్యపు గోడల్ని కూల్చివేస్తున్న దృశ్యాలను కాంచిన కళ్ళు. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’’ అన్న కవిత్వపాదమై గర్జించిన కంఠాల కళ్లు. నీళ్లు లేని ఊళ్లో తుమ్మముళ్ళ సాచ్చికంగా నెర్రెలు బాసిన నేలల గళగర్జనల కళ్లు. నీళ్లు లేని వూర్లుంటాయని, వూరంతా ఖాళీ అయ్యాక గాజుకళ్ల ముసలవ్వలు మాత్రమే మిగిలివున్న కుక్కి మంచాల దృశ్యాలు. వలసల కడగండ్లను మాత్రమే చూసి దుఃఖించిన ‘‘పంచమవేదాల’’ కళ్లు. మహాజన జాతరల కళ్లను చూసి దేశమే మద్దతు తెలిపి, గద్దెలు కదిలి, ఆధిపత్యాలు కూలి అవతరించిన 2014 జూన్ 2ను కళ్లారా చూసిన తెలంగాణ తల్లి కళ్లు. పరవశించిన బిడ్డల విజయోత్సవాల ఉత్సవాల అస్తిత్వ గెలుపుల విజయాలు చూసిన కళ్లన్నీ ధన్యమైనవి. కలలన్నీ కళ్ళు చేసుకుని స్వరాష్ట్ర అవతరణను కౌగిలించుకున్నాయ్. గాయాల తెలంగాణ విజయగేయాల, విజయోత్సవాలు విరబూసిన గెలుపు కావ్యమైంది. కలలుగన్న కాలం కలలన్నీ కళ్ళలో నింపుకున్న తెలంగాణ దీర్ఘ కావ్య కార్యాచరణ అయింది. కన్నీళ్లు కాళేశ్వర మహాకావ్యాలయ్యాయి. పూడిపోయిన చెరువులు జలకళతో నిండి పోయాయి. తెగించి తెచ్చుకున్న తెలంగాణ బక్క మనషుల బడుగు జీవుల వెతలకతల తెలంగాణ తన పునర్నిర్మాణానికి పునర్నిర్మితికి తిరిగి కేసీఆర్‌నే ఎన్నుకుంది, ఎంచుకుంది. పాలనా పగ్గాలనందించి ఉద్యమ సాహసి స్వాప్నికునికే భవిష్యత్ నిర్మాణం పనిని సగర్వంగా అప్పగించింది. ఒకసారి గడిచిన కాలాన్ని లెక్కలతో కొలిస్తే ఏడేళ్లు గడిచాయి. ఒక సుదీర్ఘకాలం కలలు కళ్లముందే నిర్మిత ఛందస్సుగా ఆచరణాత్మక అలంకారాలతో ఒక్కొక్కటి సాధించుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ కరువులు కరిగిపోయి సస్యశ్యామల క్షేత్ర కావ్యాలవుతున్నాయి. ఏడుతరాల కష్టాలను తొలగించుకుంటూ పోతున్న ఏడేళ్ల బిడ్డ తెలంగాణ. ఎన్నెన్నో తీర్లుగా చిక్కుబడిపోయిన దార్లను సరిచేసుకుంటూ రహదారులను నిర్మించుకోవాలి. ఇది చీకటినేలవుతుందని కిరణ వెలుగులు తెలియని మనిషి ఉమ్మడి అసెంబ్లీ సాక్షిగా చెబితే మనం ఏడెనిమిది నెలల్లోనే తెలంగాణ బిడ్డ ఎంత శక్తివంతమైన ప్రకాశమో చెబుతూ, దేశానికే విద్యుత్ వెలుగుల వెన్నెలను ప్రసరింపచేసుకున్నాం. తెలంగాణ చీకట్లు లేని పండు వెన్నెల జాబిలి. పల్లె వెలుగులకు కాంతి దీపాలయ్యాయి. చేతి వృత్తుల చేతుల దాకా విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఒకనాటి కరువు నేల నేడు పచ్చటి పంటల పసిడి నేలగా విలసిల్లుతోంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాల్లోని పేద పిల్లల చదువుకు వేయి గురుకులాలు వెలిసి లక్షల మంది పేదల పిల్లలు చదువుకుంటున్నారు. సంచారజాతుల పిల్లలు రేపటి శాస్త్ర సాంకేతిక రంగాలకు గాడిలో పెట్టే శాస్త్రవేత్తలుగా వెలుగొందితీరుతారు. వైద్యం పేదల గడపదాకా పోవడానికి మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీలు, వైద్య సేవకులు కదిలిపోతున్నారు. కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు కదిలిపోతుంది. బిరబిరా ప్రవహించే గోదావరి పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మను కలిసింది. ప్రభుత్వ బడులన్నీ రేపటి కాలానికి అన్నివర్గాల బిడ్డల జ్ఞాన కేంద్రాలుగా ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను అందించి తీరుతాయన్న విశ్వాసాన్నిస్తున్నాయి. గత ఏడేళ్ల కాలం అభివృద్ధిపరంగా మామూలుది కాదు. ఇక్కడి రైతుబంధు పథకాన్ని కేంద్రం అవలంబిస్తోంది. తెలంగాణ ఉద్యమాలు ఇపుడు ఈ నేలంతా పరుచుకున్న సంక్షేమ పథకాలుగా, నిర్మిత రంగాల, మౌలిక వసతులు సమకూర్చుకొని నిలుస్తున్న శక్తులుగా, బహుజన వర్గాల సౌఖ్యాల కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రమిస్తుంది. రాష్ట్రం వచ్చి ఏడేండ్లు గడుస్తున్నప్పటికీ ప్రతి ప్రగతి మలుపులో ఉద్యమ ఉత్తేజం కనిపిస్తుంది. ఇదే స్ఫూర్తితో సర్వరంగాలను శక్తివంతం చేసుకుని పునర్నిర్మించుకోవాలి. ఇది పునర్నిర్మాణ కాలం. పునర్నిర్మాణ చారిత్రక సందర్భం. గ్రామీణ తెలంగాణను సస్యశ్యామలం చేసేదిశగా పల్లెల్లో విస్తృత ప్రగతి పనులు జరుగుతున్నాయి. ఐటీ రంగంలో దేశంలోనే అతి కీలక కేంద్రంగా హైదరాబాద్ మహానగరం ఇప్పటికే నిలిచింది. ఐటీ రంగం కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల వరకు నిర్మించబడుతుంది. గ్రామ పంచాయతీల ఆడిట్ అంతా ఐటీ రంగంలోనే జరగడం దేశానికి నమూనాగా నిలిచింది. ఇప్పుడు హీరోలంతా తెలంగాణ భాషనే మాట్లాడుతున్నారు. సినిమా కథలన్నీ పద్మశాలీల మరమగ్గాల చింతకింది మల్లేశాలవుతున్నాయి. తెలంగాణమనే దివిటీ సాహిత్య సాంస్కృతిక సినిమా కళా రంగాలలో విలసిల్లుతుంది. ఇది ఏడేండ్ల తెలంగాణలో భాషా శాస్త్రాల దగ్గర్నుంచి ప్రగతి రథ చక్రాల వరకు అన్ని రంగాల్లో కనిపిస్తుంది. ఉద్యమ ఉద్వేగపూరిత క్షణాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. వాటన్నింటినీ ఈ ఏడేళ్ల అభివద్ధి, పునర్నిర్మాణ పురోగమనంతో చూస్తే అవన్నీ ఉద్యమ ప్రతిఫలాలుగానే నిలుస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 85 శాతంగా ఉన్న రాష్ట్రంలో సంపదలు పెంచాలి. ఏడేండ్ల తన ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఒక స్వయం పాలిత రాష్ట్రంగా అనేక మెట్లను నిర్మించుకుంది. తెలంగాణ ఇప్పుడు అభివృద్ధికి నమూనా. వలస కార్మికులను రాష్ట్ర నిర్మాణ భాగస్వాములుగా సంలీన పరుచుకున్న మానవత్వపు పరిమళాల నజరానా. ఈ దశ దిశ నిరంతరం కొనసాగాలి. వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు -
ఐసోలేషన్ ఆవరణలో వైద్యుల చిందులు
బెల్లంపల్లి: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొందరు వైద్యులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఏకంగా ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరీ చిందులేశారు. వివరాలు.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని కరోనా వైరస్ అనుమానితులను అబ్జర్వేషన్లో ఉంచడానికి ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఏరియా ఆస్పత్రి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ వ్యవహారాన్ని కొందరు సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మనస్పర్ధలే కారణమా?: సింగరేణి ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నృత్యాలు చేసిన విషయాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగానే సెల్ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక కుట్ర దాగి ఉన్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. ఇటీవల నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో కేక్ కట్ చేయడానికి ఓ ప్రజా ప్రతినిధి వెళ్లినట్లు సమాచారం. ఐసోలేషన్ వార్డు ఏర్పా టు చేసినందువల్ల వేడుకలు నిర్వహించరాదని ఓ వైద్యుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి నర్సుల వేడుకల్లో పాల్గొనకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. దీన్ని కొందరు సిబ్బంది అవమానకరంగా భావించడంతోనే వైద్యులు, సిబ్బందిలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. -
ఆరేళ్లయినా ఆమడదూరంలో అభివృద్ధి
తెలంగాణ ఆవిర్భవించి జూన్ 2 నాటికి ఆరేండ్లు పూర్త వుతున్నాయి. ప్రజలు పోరాడి, అనేక మంది యువ కులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొచ్చి కూడా ఆరు సంవత్సరాలు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలకు ఎన్నో భ్రమలు కల్పిం చబడ్డాయి. రాష్ట్రం ఏర్పడితే ‘బంగారు తెలంగాణ’గా మారుతుందని చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఏ ఒక్క రైతు వ్యవసాయం వల్ల నష్టపోకుండా లాభసాటిగా చేస్తానని’ ప్రకటించారు. రాష్ట్రంలో 59.48 లక్షల భూకమతాలుండగా, వీటి కింద 147.50 లక్షల ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఐదెకరాల్లోపు కల్గిన వారు 52.49 లక్షల కమతాలు కాగా, వీరి చేతిలో 90.97 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరిలో ఐదెక రాల్లోపు ఉన్న వారిలో 12 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇప్పటికీ రాలేదు. వీరికి రైతుబంధు ప్రారం భమైనప్పటి నుంచి ఒక్క రూపాయి సాయం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. అలాగే ప్రభుత్వం చెప్పిన పంటలు వేయనిచో రైతుబంధు నిలిపివేస్తా మని ముఖ్యమంత్రి స్వయంగా రైతులను బెదిరిస్తుం డటం సిగ్గుచేటు. రాష్ట్రంలో కౌలు రైతులు సుమారు 20 లక్షల మంది వరకూ ఉంటారు. ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా కౌలురైతులను గుర్తించమనీ, గుర్తింపు కార్డులు ఇవ్వమనీ కరాఖండిగా తేల్చి చెప్పారు. కౌలు చట్టాలు అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండివైఖరి విడనాడటం లేదు. రాష్ట్రంలో 1.63 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 25, 30 లక్షల ఎకరాలు నీరందక ప్రతి ఏటా బీడు భూములుగా ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్, వ్యవసాయేతర అవసరాలకు భూములు పెద్ద ఎత్తున సేకరించడంతో సాగు భూమి విస్తీర్ణం ప్రతి ఏటా తగ్గుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 230–320 మండలాల వరకూ అనావృష్టి వల్ల కరువుకు గురవు తున్నాయి. వాటికి పరిహారం ఏమాత్రం ఇవ్వడం లేదు. ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ కింద పేద, మధ్యతరగతి రైతుల నుంచి భూములు బలవం తంగా తీసుకొని, న్యాయమైన పరిహారం ఇవ్వక పోవడం విచారకరం. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని, అనేక ప్రాజెక్టులకు రీడిజైన్, రీఎస్టిమేట్స్ చేసి ఇప్పటికీ సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి, మరో రూ.20 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. అయితే ఏయే ప్రాజెక్టులపైన ఎంత ఖర్చు పెట్టారు? ఏ ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకు నీరందిస్తుంది? వీటిపై ప్రాజెక్టుల వారీగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు తెలియజేయాలి. దళిత, గిరిజనులకు భూపంపిణీ పథకం ఆర్భా టంగా ప్రకటించి అమలులో మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది భూమి లేని దళితులుండగా, ఈ ఆరేళ్లలో కేవలం 6,104 కుటుంబాలకు 15,447.74 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూవ్ు ఇండ్లు ఇస్తామని కల్పించిన ఆశ నిరాశగా మారింది. అక్కడక్కడ కొన్ని మోడల్ హౌజ్‌లు మాత్రమే నిర్మాణం చేసి వాటినే చూపిస్తూ అందరికీ ఇండ్లు ఇస్తున్నామని భ్రమలకు గురిచేస్తున్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో ఏండ్ల తరబడి పని చేస్తున్నా, వారిని పర్మనెంట్ చేయకుండా చాలీచాలని వేతనాలతో పని చేయించుకుంటూ అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేయమని పోరాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె, అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్స్, ఆయాలు చేసిన సమ్మెలపై ఉక్కుపాదం మోపి లొంగదీసుకున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధిం చుకున్న కార్మిక హక్కులను హరిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు చెప్పే విషయాలను పెడ చెవిన పెడుతూ, తమకు నచ్చిందే సరైందన్న నియంతృత్వ పోకడలను మానుకోవాలి. ఈ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, లోపాలను సమీక్షించి నిర్లక్ష్యం చేయబడిన సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరి ష్కారానికి తగిన ప్రణాళికను రూపొందించి పూర్తి చేయాలి. వ్యాసకర్త : జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
టీఆర్ఎస్ మలేషియా: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
టీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
కౌలాలంపూర్: టీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. కోవిడ్ -19 కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెరాస మలేషియా కమిటీ సభ్యులు, మలేషియా లో ఉంటున్న ప్రవాస తెలంగాణ ప్రజలు ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల, గౌరవ అతిథిగా తెలంగాణ జానపద గాయని రేలారే గంగ తర సభ్యులతో కలిసి కాన్ఫరెన్స్ కాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొన్నారు. ముందుగా అధ్యక్షులు చిట్టిబాబు తెలంగాణ తల్లి పటానికి పుష్పాలంకరణ చేసి జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సభ్యులందరు అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేసుకొని వారికి నివాళులర్పించి 2 నిముషాలు మౌనం పాటించారు. ముఖ్య అతిథి మహేష్ బిగాల మాట్లాడుతూ సభ్యులకు మరియు యావత్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షాలు తెలియజేసారు. లాక్డౌన్సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న ప్రణాళికలు, కార్యక్రమాలను గురించి వివరించారు. టీఆర్ఎస్ మలేషియా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీవిషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. సభ్యులకు, ప్రవాస తెలంగాణ వాసులకు అధ్యక్షులు చిట్టిబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసారు. ఇతర దేశాల నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్న వారిని ప్రభుత్వం ఆదరిస్తున్న తీరును, కల్పిస్తున్న సదుపాయాలను ప్రశంసించారు. దుబాయ్ నుంచి వచ్చిన 25 మంది బాధితులకు వారి ఆర్ధిక స్థితిని తెలుసుకొని తన సొంత ఖర్చులతో వారికి క్వారంటైన్ శిభిరంలో చేర్చిన మహేష్ బిగాలను అభినందించారు. రేలారే గంగ మాట్లాడుతూ ఒక కొత్త తీరుగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో తనని బాగస్వామ్యురాలిని చేసినందుకు ఉపాధ్యక్షులు మారుతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమ సమయంలో పాడిన పాటలను పాడుతూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమ వివరాలను, మలేషియాలో చిక్కుకున్న బాధితుల వివరాలను, వారికి అందించిన సహాయాన్ని గురించి మహేష్ బిగాలకి వివరించారు. కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు రమేష్, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రవిందర్ రెడ్డిలు పాల్గొన్నారు. -
ఒక్క క్షణం..కలకలం
సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి రాక కోసం..కట్టుదిట్టమైన భారీ భద్రత. చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలిసేలా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. అడుగడుగునా పోలీసుల మోహరింపు.అయినా..మంగళవారం గన్‌పార్క్ వద్ద.. ఒక్క సారిగా కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి తిరిగి వెళుతున్న సీఎం కేసీఆర్ వాహనాన్ని జీహెచ్ఎంసీ ఉద్యోగి రూపంలో వేచి ఉన్న హన్మంతునాయక్ అనే యువకుడు అడ్డుకున్న తీరు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని చింతచెట్టుతండాకు చెందిన హన్మంతునాయక్(28) డిగ్రీ పూర్తి చేసి ఒకసారి ఎస్ఐ పరీక్షలకు కూడా హాజరయ్యాడు. (సీఎంకు కానుకగా తెలంగాణ యాపిల్ తొలి కాత.. ) గత మూడునెలలుగా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో ఔట్సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా కారణంగా చాలాకాలంగా సెలవులో ఉన్న హన్మంతు వారం క్రితమే విధుల్లో చేరి, ఈ రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లి సంతకం పెట్టి అధికారులకు తెలియకుండానే గన్‌పార్క్‌కు చేరుకున్నాడు. అయితే సీఎం రాక సందర్భంలో వర్షం వస్తే ఆయనకు గొడుకుపట్టే నిమిత్తం ఇద్దరు జీహెచ్ఎంసీ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచటంతో వారి పక్కనే హన్మంతు వెళ్లి నిల్చుని సీఎం కోసం వెయిట్ చేశాడు. సీఎం నివాళి అర్పించి వాహనంలో ఎక్కి కూర్చున్న తర్వాత వాహనం పది మీటర్ల దూరం ప్రయాణించి అసెంబ్లీ వైపు మళుతున్న సమయంలో హఠాత్తుగా ‘ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కావాలి’ అంటూ అరుస్తూ ...వాహనానికి అడ్డంపడిపోయాడు. ఊహించని పరిణామంతో క్షణం పాటు తత్తరపాటుకు గురైన సిబ్బంది హన్మంతును పక్కకు లాగి సీఎం వాహనాన్ని ముందుకు పంపారు. స్వగ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తే... ఎల్బీనగర్లోని బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న హన్మంతుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. స్వగ్రామంలో ఆయన టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇళ్లు కావాలంటూ హన్మంతు ఏకంగా సీఎం కాన్వాయ్‌నే అడ్డుకోవటంతో ఉన్న ఉద్యోగం కూడా ఊడే పరిస్థితి నెలకొంది. హన్మంతును అదుపులోకి తీసుకున్న పోలీస్‌లు అతన్ని సుదీర్ఘంగా ప్రశిస్తున్నారు. రాత్రి వరకూ కేసు నమోదు చేయలేదు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం అతన్ని తొలగిస్తున్నట్లు కూడా ప్రకటన చేయకుండా ఉన్నత స్థాయి నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా మంగళవారం యంత్రాంగాన్ని కలవరపాటుకు గురి చేసిన ఈ ఘటనలో పోలీస్‌ల భద్రతా వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపించింది. -
సీఎంకు కానుకగా తెలంగాణ యాపిల్ తొలి కాత..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో తొలిసారి యాపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ తొలి కాతను మంగళవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు యాపిల్ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్ఆర్–99 రకం యాపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో యాపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బాలాజీని సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పడానికి ఇక్కడి నేలల్లో యాపిల్ పండ్లు పండటమే ఉదాహరణ అన్నారు. -
ఎంతో ప్రగతి సాధించాం : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేవని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారమైందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో జెండా ఎగురవేస్తున్న సీఎం ప్రజాసంక్షేమానికి పునరంకితమవుతాం... తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడేందుకు ప్రభుత్వం పునరంకితం అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. జెండావిష్కరణ అనంతరం సెల్యూట్ చేస్తున్న సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్లో రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన సీఎం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీనటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. కోవింద్, మోదీ, అమిత్ షా, చిరంజీవి తెలుగులో శుభాకాంక్షల ట్వీట్లు చేయగా వెంకయ్య నాయుడు ఉర్దూలో ట్వీట్ చేశారు. వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు’అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణపై ప్రముఖుల శుభాకాంక్షల ట్వీట్లు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. దేశ ప్రగ తిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్థిస్తున్నాను. – ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. పుష్కలంగా సహజ వనరులు, గర్వించదగిన చరిత్ర కలిగిన విభిన్న భాషలు, సంస్కృతుల సమ్మేళనం. భారతీయ గంగా–జము నా తెహజిబ్కి తెలంగాణ ప్రతీక. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నా. – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. – కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత కేసీఆర్‌కు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. – సినీనటుడు చిరంజీవి -
సస్పెన్స్ లవ్‌స్టోరీ
‘రోజూపూలు, ఒకరికి ఒకరు’ ఫేమ్ శ్రీరామ్ హీరోగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఇందులో కన్నడ భామ సంచితా పదుకునే కథానాయికగా నటించారు. ఎక్స్‌డస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామేన్ ఎన్వీఆర్ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం ఇది’’ అని శ్రీరామ్ అన్నారు. ఈ సినిమాలోని పాటల జ్యూక్ బాక్స్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ‘‘తెలంగాణలో చిత్రీకరించిన ఈ చిత్రం పాటలను తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ సస్పెన్స్ లవ్‌స్టోరీ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. డా. చల్లా భాగ్యలక్ష్మి, చిర్రావూరి విజయ్‌కుమార్, వెంకటేష్ తదితరులు రచించిన ఈ చిత్రం పాటలను విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవికలు ఆలపించారు. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
ఆరేళ్లలో అద్భుత ప్రగతి సాధించాం
-
‘దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్’
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల కాలంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓస్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, ఎమ్మెల్యే వీజీ గౌడ్, కలెక్టర్ సి. నారాయణరెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రక్తాదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. టీఎన్జీఓలు కూడా ప్రభుత్వంలో భాగస్వామలేనని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్యతికి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అతి తక్కువ కాలంలో అతి పెద్ద సంక్షేమ ఫలాలు తెలంగాణలో అందుతూ దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. గత ఆరేళ్ల కేసీఆర్ పాలన జనరంజకమన్నారు. రైతులు, పేదలను రెండు కళ్లుగా భావిస్తున్నారన్నారు. డబుల్ బెడరూం పథకం దేశంలోనే అద్భుత పథకమన్నారు. 24 గంటల ఉచిత కరెంటును సీంఎ రైతులకు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ధీమాగా రూ. 5 లక్షల భీమా అందిస్తున్నారన్నారు. కేవలం ఆరేళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇకపై కూడా బంగారు తెలంగాణ ఆవిష్కారం కావాలన్నారు. చివరగా తెలంగాణ ప్రజలకు మంత్రి రాష్ట్ర ఆవిర్భవ శుభాకాంక్షలు తెలిపారు. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశృతి
-
జెండాను ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు
-
ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్‌కి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ భర్త అశోక్ విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటనలో అంగన్వాడీ ఆయా కలవ్వకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంగన్వాడీ కేంద్రంలో ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్పందించిన మంత్రి హరీష్ రావు కాగా.. దొమ్మట ఘటనపై స్పందించిన మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించిన మంత్రి.. అశోక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కలవ్వను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చదవండి: ‘కింగ్‌కోఠి’లో 19 మందికి పాజిటివ్ -
తెలంగాణ గవర్నర్ బర్త్‌డే: చిరంజీవి విషెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విటర్ వేదికగా రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ కేసీఆర్ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు చిరంజీవి బర్త్‌డే విషెస్ తెలిపారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి) ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా,దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ KCR గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.💐 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 2, 2020 Wishing honorable Dr.Tamilisai Soundararajan Avargal @DrTamilisaiGuv a wonderful birthday and many many more fulfilling years in the service of our great nation. பிறந்தநாள் வாழ்த்துக்கள் pic.twitter.com/hRcEJWGmfR — Chiranjeevi Konidela (@KChiruTweets) June 2, 2020 -
‘సీఎం కేసీఆర్ కొత్త కుట్ర ప్రారంభించారు’
సాక్షి, హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ.. గత ఆరేళ్లలో దగాకు గురయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. అబద్ధాలు, మోసాలతో కాలం గడుపుతున్నారని, అమరుల ఆకాంక్ష నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, రైతుబంధు ఎగ్గొట్టేందుకు సీఎం కేసీఆర్ కొత్తకుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూసార పరీక్షలు చేయకుండా, ఆయనకు ఇష్టమొచ్చిన పంటలు వేయమంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడానికి బీజేపీ కంకణం కట్టుకుందని, ప్రజలందరూ బీజేపీకి అండగా ఉన్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. (‘తెలంగాణ రాష్ట్ర సోదరసోదరీమణులకు నమస్కారం’) -
‘ఆ రోజు చెప్పాం.. ఈ రోజు సాధించుకున్నాం’
సాక్షి, సిద్ధిపేట : అమరుల త్యాగాల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రం సాధించుకున్న ఫలితాలు, ఫలాలు ఈ రోజు సిద్ధిపేటకు అందాయన్నారు. గోదావరి జలాలు సిద్ధిపేటకు అందుతాయని చెప్పినట్లే ఇప్పుడు సాధించుకున్నామన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయన్నారు. (తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షల వెల్లువ) ఈ రోజు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని హరీష్ రావు అభివర్ణించారు. దేశంలో ఎవరు ఏ పథకాన్ని చేపట్టాలన్నా తెలంగాణ వైపే చూస్తున్నాయని, గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారతాన్ని ఈ రోజు పల్లె ప్రగతి ద్వారా సాధించామని పేర్కొన్నారు. పథకాలను చేపట్టడం, వాటికి నిధులు ఇవ్వడం, అమలు చేయడం జరిగిందన్నారు. కరోనాలాంటి విపత్తులు వచ్చినా అభివృద్ధిని కొనసాగిస్తూ, సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. (‘అన్ని వర్గాల ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టారు’) ఉద్యమ సందర్భంలో ఏ విదంగా కృషి చేశామో అదే విదంగా రాష్ట్ర అభివృద్ధిలోనూ పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదే అంకిత భావంతో రాబోయే రోజుల్లోనూ పనిచేస్తూ బంగారు తెలంగాణాకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తమ్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లు పాల్గొన్నారు. -
గులాబీ పాలనకు ఆరేళ్లు
-
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చే నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా మంగళవారం కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ దామోదర్ రాజా నర్సింహ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక దినం అన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కోరికను సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేరవేర్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయని చెప్పిన నాయకులు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనతో అన్ని వర్గాలు కష్టాలు పడుతున్నారని దుయ్యబట్టారు. (రాష్టంలో దుర్మార్గమైన పాలన సాగుతోంది) యువతకు ఉద్యోగాలు రావడం లేదని, తెలంగాణ వచ్చిన రోజు 12 లక్షల నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 24 లక్షలకు చేరిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు అన్ని పెండింగులో ఉన్నాయని ఉత్తమ్ మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్టు దగ్గర తట్టెడు మట్టి పోయలేదు కానీ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని విమర్శించారు. ఏటా రూ. 36 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామంటే ఎన్ని అప్పులు చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. (తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ) ఈ రోజు కృష్ణ నది ప్రాజెక్టుల సందర్శనకు కాంగ్రెస్ నాయకులు పోతామంటే పొద్దున్నే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 2014 నాటి నుంచి కృష్ణ ప్రాజెక్టులు పెండింగులో పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ సాధన ఏ లక్ష్యాలతో సాధించామో వాటన్నింటిపైనా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా కోట్లాది ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు తెలిపారు. చివరగా తెలంగాణ అమరవీరులకు సంతాప సూచికంగా 2 నిమిషాలు కాంగ్రెస్ నేతలంతా మౌనం పాటించారు. -
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి) రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల్లో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. (కేసీఆరే స్టార్) ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’అంటూ మరో ట్వీట్లో ఏపీ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకంక్షలు!! కేసీఆర్ గారి బాటలొ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం!! ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లు !!జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!’ అంటూ మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. (కలలు నెరవేరుతున్న కాలం) తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. — President of India (@rashtrapatibhvn) June 2, 2020 తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. #Telangana pic.twitter.com/zsTM3HemRF — Vice President of India (@VPSecretariat) June 2, 2020 -
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ప్రగతిభవన్ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. (కేసీఆరే స్టార్) అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేశారు. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) -
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
-
కేసీఆరే స్టార్
సాక్షి, హైదరాబాద్ : దశాబ్దాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి సరిగ్గా ఆరేళ్లు. నవజాత రాష్ట్రంగా 2014 జూన్ 2న ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆరేళ్ల వ్యవధిలోనే దేశ యవనికపై తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కారు ఈ ఆరేళ్లలో వ్యవసాయం మొదలుకొని ఐటీ, పారిశ్రామిక రంగం దాకా, ఆరోగ్యం, విద్య నుంచి సంక్షేమం దాకా, సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని విద్యుత్ ఉత్పత్తి దాకా అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. సాహసోపేత పాలనా సంస్కరణలు, సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పథకాలకు చిరునామాగా నిలుస్తోంది. మిషన్ భగీరథ, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకెళ్తోంది. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పచ్చదనం, పరిశుభ్రత పెంచడం దిశగా అడుగులు వేస్తోంది. ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాగించిన ప్రస్థానంపై అవలోకనం... వేగంగా పాలనా సంస్కరణలు.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనను పరుగులు పెట్టించే లక్ష్యంతో 2016లో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో 33 జిల్లాలుగా తెలంగాణ స్వరూపం మార్చుకుంది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 76 మున్సిపాలిటీలు, 30 రెవెన్యూ డివిజన్లు, 131 మండలాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 4,383 గ్రామ పంచాయతీలతో కలుపుకొని మొత్తంగా పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది. తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018 మార్చి 28న చేసిన చట్టంతో కొత్తగా 1,777 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. షెడ్యూల్ ఏరియాలో ఉన్న 1,281 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు కాగా జనాభా ప్రాతిపదికన మరో 688 గ్రామ పంచాయతీలు వారికే రిజర్వు అయ్యాయి. సుదీర్ఘకాలంగా ఉన్న హైకోర్టు విభజన జరగడంతో 2019 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త హైకోర్టు మనుగడలోకి వచ్చింది. శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీగా పోలీసు సిబ్బంది నియామకాన్ని చేపట్టడంతోపాటు పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరించింది. దీంతో కొత్తగా ఏడు కమిషనరేట్లతోపాటు 25 పోలీసు సబ్ డివిజన్లు, 31 సర్కిళ్లు, 103 పోలీసుస్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముస్తాబైన అసెంబ్లీ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత.. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు మాతా, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు 25 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవజాత శిశువుల కోసం సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)ల సంఖ్యను 18 నుంచి 42కు పెంచడంతోపాటు గర్భిణులు, బాలింతలకు అత్యవసర సేవల కోసం మెటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఎంఐసీయూ) ఏర్పాటు చేసింది. అంధత్వ రహిత తెలంగాణ నినాదంతో కంటి వెలుగు పథకం ప్రవేశపెట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.54 కోట్ల మందికి నేత్ర పరీక్షలు జరిపింది. వారిలో 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో డియాగ్నస్టిక్ హబ్‌ల ఏర్పాటు ద్వారా పేదలు 58 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకొనే వెసులుబాటు కల్పించింది. అమ్మ ఒడి పథకం కింద 102 వాహన సేవలతో గర్భిణులను సురక్షితంగా చేర్చడంతోపాటు 104 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలను అందిస్తోంది. బాలికా విద్యకు ప్రోత్సాహం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 661 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సగం స్కూళ్లను వారికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. వరంగల్‌లో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు, బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటైంది. వరంగల్‌లో సైనిక్ స్కూల్‌తోపాటు కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రగతికి రెండు కళ్లుగా ఐటీ, పరిశ్రమలు తెలంగాణ ఏర్పాటు నాటికి రూ. 66,276 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2019–20 నాటికి రూ. 1.28 లక్షల కోట్లకు చేరడం రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అద్దం పడుతోంది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీని విడుదల చేయగా ప్రపంచంలోనే ఐదు అగ్రశ్రేణి కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, సేల్స్‌ఫోర్స్ హైదరాబాద్‌లో వాటి రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ రంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓవైపు ఫలితాన్ని ఇస్తుండగా టైర్–2, టైర్–3 పట్టణాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను నిర్మిస్తోంది. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు 65 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన ఇంక్యుబేషన్ సెంటర్ ‘టీ–హబ్’, ‘వీ–హబ్’ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తోంది. 2014 నూతన పారిశ్రామిక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన టీఎస్–ఐపాస్ ద్వారా జనవరి 2020 నాటికి రూ. 2,04,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్లైన్ విధానం ద్వారా 12,427 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్ర పారిశ్రామిక రంగం జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించింది. టీఎస్–ఐపాస్ ద్వారా పరిశ్రమలు హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8% కాగా తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది. సాంస్కృతిక రంగంపై ప్రత్యేక శ్రద్ధ సాంస్కృతిక, క్రీడా, పర్యాటక రంగాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలుగు ప్రపంచ మహాసభల నిర్వహణ, అన్ని విద్యాసంస్థల్లో ఒక సబ్జెక్టుగా తెలుగు బోధన వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ స్వీయ ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పలు ఆలయాల పునరుద్ధరణ ప్రారంభమవగా యాదగిరిగుట్టను (యాదాద్రి) ప్రభుత్వం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. అలాగే వేములవాడ, భద్రాద్రి, కొమురవెల్లి మల్లన్న, కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు, నాగార్జునకొండ వంటి బౌద్ధారామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారిక హోదా కల్పించింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ హుస్సేన్‌సాగర్ తీరాన 12 ఎకరాల స్థలంలో నిర్మించే అమరవీరుల స్తూపం, స్మృతివనం నిర్మాణ దశలో ఉన్నాయి. మౌలిక వసతుల మెరుగు... రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి నాలుగు లేన్ల రోడ్లు, జిల్లా కేందం నుంచి మండల కేంద్రానికి డబుల్ లేన్, మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆవిర్భావం నుంచి సర్కారు నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఇప్పటివరకు 3,150 కి.మీ. జాతీయ రహదారుల మంజూరుతో తెలంగాణలో మొత్తం 5,677 కి.మీ. మేర జాతీయ రహదారుల నెట్వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. మిషన్ భగీరథ పథకాన్ని రూ. 43,791 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి లక్షా 40 వేల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా 2019 జనవరి నాటికి రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు తాగునీటిని అందించింది. నిరుపేదలకు గూడు కల్పించేందుకు 2,72,763 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడంతోపాటు వార్డులవారీగా అవసరాలను గుర్తించి అభివృద్ధికి అవసరమైన వార్షిక, పంచవర్ష ప్రణాళికల కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు చేపట్టిన హరితహారం ద్వారా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ సంక్షేమానికి పెద్దపీట.. నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళా కారులు తదితరులు సుమారు 32 లక్షల మందికి ప్రతి నెలా ‘ఆసరా’పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అందజేస్తోంది. వికలాంగులకు రూ. 3,016, ఇతరులకు ప్రతి నెలా రూ. 2,016 చొప్పున సామాజిక పెన్షన్లు చెల్లిస్తోంది. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగి రీలకు చెందిన వారికి కల్యాణ లక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. లక్షా పదహారు వేల చొప్పున అందిస్తోంది. ఆహార భద్రతలో భాగంగా తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి వ్యక్తికీ నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని 17 వేలకుపైగా చౌక ధరల దుకాణాల ద్వారా 87.56 లక్షల కుటుంబా ల్లోని 2.80 కోట్ల మందికి పంపిణీ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల సామాజిక అభివృద్ధి కోసం జనాభా నిష్పత్తి మేరకు నిధుల కేటాయింపు, ఖర్చు కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం–2017 రూపొందించి వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. అన్నదాతకు అండ రైతు సంక్షేమం లక్ష్యంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తున్న ప్రభుత్వం ప్ర తి రైతుకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తోంది. జీవిత బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వ మే చెల్లిస్తోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, నీటి తీరువా రద్దు వంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. రైతులను సంఘటిత రంగంలోకి తెస్తూ రైతుబంధు సమితులు ఏర్పాటు చేసింది. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తోంది. నియంత్రిత పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
కలలు నెరవేరుతున్న కాలం
2014 జూన్ 2 ఈ నేల కన్న కలలు నెరవేరిన రోజు. ప్రజల సామూహిక ఆశయం గెలిచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు. ఇది తెలం గాణ మరిచిపోలేని రోజు. కలాలు, గళాలు, గర్జించిన కంఠాలు, గెలుచు కొచ్చినరోజు. మిలియన్ మార్చులు, సకలజనుల సమ్మెలు, సాగర హారాలు, సడక్ బందులు సామూ హికంగా గెలిచివచ్చిన రోజు. వీటన్నింటిని గెలిపించు కుంటూ తెలంగాణ కోసం తనను తాను ఆత్మబలిదానం చేసుకునేందుకు ఆమరణ నిరాహార దీక్షకు దిగి పార్ల మెంటును, దేశాన్ని కదిలించిన ఒక సత్యాగ్రహి సాహస యాత్ర గెలిచివచ్చిన రోజు. రాష్ట్రం సాధించుకున్నాక పునర్నిర్మాణ సమరం మొద లైంది. ఉద్యమస్ఫూర్తిని అట్లనే కొనసాగిస్తూ తెలంగాణ కొత్త నిర్మాణాలకు సూత్రధారిగా మారింది. భౌగోళిక బెర్రలు గీసుకున్నాం బాగుంది. మరి ఈ కన్నీళ్లను తుడిచే నీళ్లెట్లా రావాలి? దిగువకు పోయే నీళ్లు ఎగువకు ఎట్లెక్కాలి? బీడు భూములు పచ్చటి పంటపైర్లుగా మారటానికి నడుం కట్టింది. ఇది పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. బడుగు బల హీన దళిత మైనార్టీ గిరిజన ఆదివాసీలు 90 శాతంగా వున్న రాష్ట్రం. ప్రతిఒక్కరూ తమకు తాము స్వతంత్రంగా స్వేచ్ఛగా నిలువగలగాలి. శివుని తలపైన గంగమ్మను తేవటం లోకా నికి తెలిసిన భగీరథ పాఠం. పల్లానికి పోయే నీళ్లను ఎదు రెక్కించే విద్య తెలిసిన జలసూత్రధారి మాత్రమే కొండ పోచమ్మ సాక్షిగా గోదారి గంగమ్మను కాళేశ్వరం నుంచి వేము లవాడ మీదుగా వందల కిలోమీటర్లు నడిపించి కరువు నేలపై అభిషేకం చేయించటం అపూర్వ సృష్టి. నీటిశాస్త్రాల చరిత్రలో ఇది నూతన అధ్యాయం. తడారిన ఎండిన భూముల గొంతు తడుపుతున్నప్పుడు పొందిన ఆనందపు పొంగులు ఈ నేలంతా అలలు అలలుగా ఎగిసి పడుతు న్నాయి. ఇపుడు తెలంగాణ పసిడి పంటల పచ్చటి పైరుతల్లి. విడిపోతే భూమి బద్దలైపోతదన్న వాదనలు వీడి పోయాయి. పుకార్లన్నీ తేలిపోయి భాగ్యనగరం దేశానికే మత సామరస్య కేంద్రమయ్యింది. మందిర్, మసీద్, చర్చీలన్నీ మనమంతా ఒకటే అనే మానవీయ గంటలు మోగిస్తున్న నగార తెలంగాణ. ఎన్నెన్నో కోసులు నడిచిపోయి బిందెడు నీళ్లు తెచ్చుకునే స్థితినుంచి ఇంటింటికి నల్లా నీళ్లొచ్చాయి. చితికిపోయిన వూర్లను చిగురింపచేయటానికి చెరువుల పూడికలు తీశారు. ఎండకాలంలో కూడా చెరువుల నిండా నీళ్లు మత్తడి దుంకే దృశ్యం నేటి తెలంగాణ! మిషన్ భగీ రథలు ఇంటింటికి నీళ్లిస్తే, మిషన్ కాకతీయలు చెరువులకు జలకళనిచ్చాయి. ఏ నేలలో ఏ పంట బాగా పండుతుందో, ఏ పంటవేస్తే రైతుకు లాభదాయకమో ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం పంటసూచికగా మారింది. వూరూరా మట్టిని చూసి పంటల పట్టికలు తయారవుతున్నాయి. వ్యవసాయం దిక్కుమాలినదైందని దుఃఖిస్తున్న రైతు కూలీలను గుండె లకు హత్తుకుని వాళ్లకు నీళ్లనిచ్చి, ధైర్యాన్నిచ్చి, రైతుబంధు పథకాన్నిచ్చి కొండంత అండగా నిలిచింది ఈ ఆరేళ్ల తెలం గాణ. రైతును రాజును చేస్తానని దీక్షబూనింది తెలంగాణ. దేశానికి ధాన్యాగారంగా నిలిచింది తెలంగాణ. 60 ఏళ్లలో చివికిపోయిన గ్రామం క్రమంగా నిలబడ గలుగుతున్నది. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు చితికిన దశనుంచి లేచి నిలబడే దశకు చేరుకునే ప్రక్రియ మొద లైంది. వ్యవసాయం వర్ధిల్లటం వల్ల గ్రామం నిలదొక్కుకునే స్థితికి వచ్చింది. ఆ గ్రామం బడుగు బలహీన వర్గాలకు చేయుతగా నిలవాలి. సాంప్రదాయ వృత్తులను ఆధునీకరిం చుకోవాలి. చిన్నపరిశ్రమలు విస్తృతం కావాలి. ప్రధానంగా వ్యవసాయాధారిత పరిశ్రమలతో గ్రామాల ముఖచిత్రాన్నే మార్చేస్థితికి తెలంగాణ చేరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఎవరూ చేయలేనిది, ఎవరూ రాయలేని కొత్త చరిత్ర. తెలం గాణ తన నూతన చరిత్రను తనే రాసుకుంటూ ముందుకు సాగుతోంది. గ్రామం ఆర్థిక స్థిరత్వంతో ఆత్మగౌరవంతో నిల బడుతుందంటే గెలిచి నిలిచేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలేనన్న బలమైన నమ్మకం కలుగుతోంది. అట్ట డుగు వర్గాలు ఉత్పత్తి శక్తులుగా మారాలి. ఈ ఉత్పత్తి శక్తులు తయారుచేసే వస్తువులు మేడిన్ తెలంగాణగా మారి ప్రపం చం చేతుల్లోకి పోవాలి. ఆ దిశగా తెలంగాణ సన్నద్ధమవు తుంది. ఇది తెలంగాణ అనంతర అభివృద్ధి దృశ్యం. తెలంగాణలో సంచారజాతుల బిడ్డలు గురుకులాలకు పోయి ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణలో ఇది జరుగలేదు. పాలనను ఇంటి గడపల దాకా తేవటానికి రాష్ట్ర సెక్రటేరియట్‌ను గ్రామ సెక్రటేరి యట్ దాకా తేవటానికి ముప్పయి మూడు జిల్లాలుగా విభ జింపబడింది. దీనివల్ల అన్ని శాఖలు మారుమూల గ్రామం దాకా ఎప్పుడంటే అప్పుడు ఆకస్మికంగా వెళ్లి సమస్యల పరి ష్కారాలు చేయగలవు. రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖల సంస్కరణలు కూడా త్వరలో కొలిక్కివస్తే తెలంగాణ పాలనా రంగంలోనే వినూత్న మార్పులకు దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో నినదించిన నినాదా లన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరింపబడుతూ ఆరు సంవత్స రాల అభివృద్ధి మైలురాళ్ళను దాటుతున్నది తెలంగాణ ప్రభుత్వం. గత అరవయ్యేళ్ల కాలం చేయలేని పనిని ఈ ఆరేళ్ల కాలం చేసింది. దీన్ని సమస్త తెలంగాణ చూసింది. ఇంకా గంపెడాశతో చూస్తుంది. ఇది నిజం. రాష్ట్రం తెచ్చుకుని తెలంగాణ గెలిచింది. ఈ నేలమీద ప్రజలు గెలిచారు. ఎటు చూసినా నీళ్లు కన్పిస్తున్నాయి. నేలలు పచ్చబడ్డాయి. నగర తెలంగాణ నగరీకరించబడు తుంటే గ్రామీణ తెలంగాణ హరితీకరించబడుతున్నది. విప్లవాలు విరబూసిన నేలమీద వ్యవసాయం వర్ధిల్లుతు న్నది. ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క వ్యవసాయ పరిశోధనా క్షేత్రంగా మారబోతున్నది. ఈ నేలమీద వున్న ప్రతి సాంకేతిక కళాశాల ఆ ప్రాంత ప్రజల భౌగోళిక సామాజిక పరిస్థితు లపై అధ్యయనం చేసి పరిష్కారాల పరిశోధనలు చేయాలి. విశ్వవిద్యాలయాలు ఆ ప్రాంతాల అభివృద్ధి లైట్లుగా వెలు గొందాలి. ఇక్కడ తయారయ్యే వైద్య, సాంకేతిక, వ్యవ సాయ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఈ నేల రుణం తీర్చుకునే శక్తులుగానేగాక దేశదేశాలకు ఇక్కడి జ్ఞానాన్ని పంచే జ్ఞాన సేవకులుగా తయారయ్యే దశకు తెలంగాణ ఎదగాలి. పొందిన విజయాల నుంచి చేరాల్సిన లక్ష్యాల వైపునకు నడుచుకుంటూ పోవటమే పరిణామ క్రమం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి మాత్రమే కాదు. తెలంగాణ ఆశల, ఆకాంక్షల, ఆశయాల నిలువెత్తు జెండా. ఆయన జూన్ 2 తెలంగాణ అవతరణ సాక్షిగా రాష్ట్రసాధన ఉద్యమాన్ని అలుపెరగకుండా కొనసాగించిన ఉద్యమకారుడు. ఉద్యమ కారుడే పాలకుడై ఆరేళ్లుగా అప్రతిహతంగా అభివృద్ధిని కొన సాగిస్తున్న పునర్నిర్మాణ సూత్రధారి, పాత్రధారి. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, కవి, విమర్శకులు మొబైల్ : 94401 69896 -
గేట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సోసైటీ(గేట్స్) ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 23న ఆదివారం నాడు కుమ్మింగ్‌లోని లేనియర్ టెక్నికల్ కాలేజీలో ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 1000 మందిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. స్థానిక నేతలతో పాటు పలువరు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గేట్స్ బోర్డు ఛైర్మన్ అనిల్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి పిట్ట సారథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నృత్యాలు, బుర్రకథలు, కాకతీయ చరిత్రను వివరిస్తూ నృత్య ప్రదర్శన, పేరిణీ తాండవం, బోనాలు, బతుకమ్మ, గుస్సాది, లంబాడీ, గిరిజన నృత్యాలు, తెలంగాణ సమరయోధుల నాట్య రూపకం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భువనేష్ బుజాల(ఆటా), ఆల రామక్రిష్ణారెడ్డి(ఆటా,బోట్), అంజయ్య చౌదరి లావు (తానా), భరత్ మాదాది(టాటా), డా.శ్రీని గంగసాని, సునీల్ సావిలి, శ్రీనివాసరెడ్డి పెద్ది( ఐఎఫ్ఏ), సత్యనారాయణరెడ్డి తంగిరాల(గాటా), వెంకీ గద్దె, వినయ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో ఛైర్మన్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమలరెడ్డి పిట్ట, వైఎస్ ప్రెసిడెంట్ రాహుల్ చిక్యాల, జనరల్ సెక్రటరీ కిషన్ తాళ్లపల్లి, ట్రెజరర్ అనితా నెల్లుట్ల, జనార్థన్ పన్నెల(యూత్ అండ్ స్పోర్ట్స్), సునీల్ గోతూర్( ఈవెంట్ సెక్రటరీ), శ్రీనివాస్ పర్సా (కల్చరల్ సెక్రటరీ), శ్రీధర్ నెల్వల్లి, రఘు బండ, చిట్టారి ప్రభా, రమాచారి, గణేశ్ కాశం, వెన్నెమనేని చలపతి, సతీష్ నందాల, గేట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు కరుణ్ ఆశిరెడ్డి, గౌతమ్గోలి, ప్రభాకర్ బోయపల్లి, శ్రీధర్ జూలపల్లి, సతీష్ చెటిల కృషి అమోఘమని పలువురు కొనియాడారు. -
బంగారు తెలంగాణ సాధనకు భాగస్వాములు కావాలి
సాక్షి, సంగారెడ్డి: ఐదేళ్లలో రాష్ట్రంతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధి సాధించిందని, బంగారు తెలంగాణ సాధనకు అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ రాష్ట్రం ముందడుగు వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోమంత్రి మహమూద్ అలి ఉదయం 9 గంటలకు పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరవ వసంతంలోకి అడుగిడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళులి అర్పిస్తున్నానని, వారి త్యాగం వృథా పోదని చెప్పారు. రాష్ట్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు చేయిచేయి కలిపి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని, ఆ ప్రజా ఉద్యమ ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యార్థులకు సన్నబియ్యం, గురుకుల పాఠశాలల ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా, తదితర ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి వివిధ పథకాలతో తోడ్పాటునందిస్తున్నదని వివరించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీటి సరఫరా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో జిల్లాలోని 949 ఆవాసాలకు సరఫరా చేస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఐదవ విడత హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 2.60 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో 538 నర్సరీల ద్వారా సుమారుగా 2.64 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద సంగారెడ్డి జిల్లాకు 5,555 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 4,606 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. వీటి నిర్మాణాలకు ఇప్పటివరకు రూ.102 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 28,153 మందికి కేసీఆర్ కిట్లను అందజేశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా అర్హులైన 1.39 లక్షల మందికి ప్రతి నెలా రూ.15.52 కోట్లు ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 182 స్వయం సహాయక సంఘాలకు రూ.7.28 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణం మంజూరు చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 60,817 కుటుంబాల్లోని 16.93 లక్షల మందికి పనిదినాలు కల్పించినట్లు చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. విద్యాభివృద్ధికి ప్రాధాన్యం జిల్లాలోని 1,288 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,22,626 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో భోజనాన్ని అందిస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 98.2 ఉత్తీర్ణతా శాతంతో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచిందన్నారు. గిరిజన సంక్షేమంలో భాగంగా 2018–19 సంవత్సరంలో 2,532 మంది విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద రూ.3.76 కోట్లు మంజూరు చేశామన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల కింద 2018–19 సంవత్సరంలో 9,653 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.11.40 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా వ్యక్తిగత స్వయం ఉపాధి పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో వంద శాతం సబ్సిడీతో 768 యూనిట్లకు రూ.3.84 కోట్లు అందిస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి కింద 24,807 మంది బీసీ విద్యార్థులకు రూ.18.03 కోట్లు, 2,673 మంది ఈబీసీ విద్యార్థులకు రూ.6.53 కోట్లు రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మంజూరు చేశామని వివరించారు. అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కింద జిల్లాలో మైనారిటీ విద్యార్థుల కోసం 12 రెసిడెన్సియల్ పాఠశాలలు, 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పాఠశాలల్లో 3,314 మంది, జూనియర్ కళాశాలల్లో 144 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకం ద్వారా జిల్లాలో 72 మంది పిల్లలకు రూ.8.64 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. గృహ హింస రక్షణ చట్టం కింద 694 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1,382 పరిశ్రమలకు అనుమతి నిచ్చామన్నారు. రూ.10,630 కోట్ల పెట్టుబడితో 909 పరిశ్రమలు స్థాపించి 91,665 మందికి ఉపాధి కల్పించనున్నామని ఆయన వివరించారు. జిల్లాలో 2018–19 సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద 7,571 మంది పేద మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందజేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిషలు శ్రమిస్తూ జిల్లా ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం.హనుమంతరావు, ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, జేసీ నిఖిల, ట్రైనీ ఐఏఎస్ జితేష్ వి.పాటిల్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నారాయణఖేడ్, అందోల్ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, çజిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మెజారిటీ ప్రజలు ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. జిల్లాలో రైతుబంధు పథకం కింద ఖరీఫ్‌లో 2,69,318 మంది రైతులకు రూ.284.33 కోట్లు, రబీలో 2,41,792 మంది రైతులకు రూ.264.23 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతు బీమా పథకం కింద ఇప్పటివరకు 695 మందికి రూ.33.75 కోట్లు మృతిచెందిన రైతుల నామినీల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. జిల్లాలో 3,15,673 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ఆపద్బంధు పథకం కింద 143 మందికి రూ.71.50 లక్షల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2,51,710 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయడానికి అంచనా వేసినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 30,713 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని రైతులకు ఇవ్వడానికి సిద్ధం చేశామన్నారు. తెలంగాణ ‘మినీ మిషన్ మిల్లెట్’ కార్యక్రమాన్ని జిల్లాలో 6 మండలాల్లోని 712 ఎకరాల్లో అమలు చేస్తున్నామని వివరించారు. రబీ సీజన్లో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 60 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 6,975 మంది రైతుల నుంచి 3,04,341 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా జిల్లాలో 91,232 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల 36 గోదాంలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. జిల్లాలోని జోగిపేట్, జహీరాబాద్, సదాశివపేట్, వట్పల్లి వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్ జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద జిల్లాలో రెండు విడతల్లో రూ.210.34 కోట్లతో 16,827 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,671 పాడి గేదెలను రైతులకు అందించినట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపల పెంపకాన్ని చేపట్టామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐఎఫ్‌డీఎస్ పథకం ద్వారా వందశాతం రాయితీపై జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో సుమారు 1.13 కోట్ల విలువైన 1.26 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. సింగూరు జలాశయంలో రూ.57.42 లక్షల విలువగల 29 లక్షల నీలకంఠ రొయ్య పిల్లలను వదిలామని ఆయన పేర్కొన్నారు. -
ప్రజల ఆకాంక్షలకు పట్టం
సాక్షి, వికారాబాద్: సంక్షేమం, అభివృద్ధితో పాటు వ్యవసాయ, సాగునీటి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. వికారాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా, ఎస్పీ నారాయణ, జేసీ అరుణకుమారి, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం లక్ష రూపాయల పంట రుణమాఫీతోపాటు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందజేస్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్‌భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కంటి వెలుగు వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పెద్ద ఎత్తున నిధులు... గత ఐదేళ్లుగా జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని సునీతారెడ్డి తెలిపారు. గత ఏడాది జెడ్పీ నిధులతో జిల్లా వ్యాప్తంగా రూ.33.91 కోట్లతో 1,026 అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ.1,187 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా 971 గ్రామాల్లోని ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయ పథకం కింద రూ.233 కోట్లతో 733 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేశామన్నారు. ఈజీఎస్ ద్వారా జిల్లాలో రూ.54 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. రూర్బన్ పథకం ద్వారా రూ.9.24 కోట్లతో అంగన్వాడీలు, పాఠశాలలకు మరమ్మతు పనులు చేపట్టినట్లు వివరించారు. మినరల్ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా రూ.13.9 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.1.70 కోట్లతో వికారాబాద్, తాండూరు, పరిగిలో రైతుబజార్లు నిర్మించినట్లు చెప్పారు. రూ.6.25 కోట్లతో ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. రూ.600 కోట్లతో జిల్లాలో రహదారుల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మన్నెగూడ నుంచి రావులపల్లి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతు, ప్రజాసంక్షేమానికి పెద్దపీట జిల్లాలోని రైతులు, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రెండు లక్షల మందికిపైగా రైతులకు రూ.459 కోట్ల పెట్టబడి సహాయం అందజేసినట్లు చెప్పారు. రైతు బీమా ద్వారా 1.16 లక్షల మందికి ఇన్సూరెన్స్ వర్తింపజేశామన్నారు. భూ పంపిణీ పథకం ద్వారా 42 మంది షెడ్యూల్ కులాల రైతులకు రూ.4.34 కోట్ల వ్యయంతో 77 ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. కంటి వెలుగు పథకం ద్వారా 3.88 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 91,584 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు రూ.8 కోట్ల విలువ చేసే వాహనాలు, సామగ్రి అందజేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కళ్యాణలక్ష్మి ద్వారా 415, షాదీముబారక్ ద్వారా 123 మంది లబ్ధిపొందినట్లు వివరించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.3.71 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆరు బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలోని భరోసా కేంద్రం ద్వారా 60 మంది మహిళలకు ఉపాధి కల్పించినట్లు చెప్పారు. జిల్లాలో నేరాల అదుపుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతోపాటు వికారాబాద్ కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలు, అధికారులు అన్నివర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అవతరణ వేడుకల్లో భాగంగా కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబ సభ్యులను జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ సన్మానించారు. అవతరణ వేడుకలసందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. -
ఉజ్వల భవిష్యత్‌కు బాటలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఐదేళ్ల స్వపరిపాలనలో రాష్ట్రం ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేసిందని శాసనసభ ఉప సభాపతి టి.పద్మారావు అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియం మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప సభాపతి.. జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం వేదిక వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి రాచకొండ కమిషనరేట్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పద్మారావు మాట్లాడుతూ... అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా కూడా సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలియజేశారు. మరింత అంకితభావం, నీతి నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తే అమరవీరుల త్యాగాలకు ఫలితం ఉంటుందన్నారు. ప్రజలందరూ సుఖః శాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సామాజిక భరోసా సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పథకం కింద జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు ప్రతినెలా పింఛన్లు అందజేస్తున్నామని, 1.73 లక్షల మందికి ప్రతినెలా రూ.20.20 కోట్లు ఖర్చుచేస్తున్నామని పద్మారావు చెప్పారు. . కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా గతేడాది ఆరు వేల పేద కుటుంబాలకు రూ.44 కోట్లు అందజేశాం, ప్రతిపేదవాడూ కడుపు నిండా భోజనం చేసేందుకు రూపాయికి కిలో చొప్పున జిల్లాలో 5.24 లక్షల మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొన్నటి విద్యాసంవత్సరంలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, శంకర్పల్లి, ఫరూఖ్‌నగర్‌లో ఒకటి చొప్పున కేజీబీవీలను వినియోగంలోకి తెచ్చాం, 243 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 75 వేల మంది విద్యార్థులకు డిజిటల్ విధానంలో విద్యాబోధన చేస్తున్నాం. ఫలితంగా బడుల్లో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా మెరుగుపడిందన్నారు. వసతిగృహాలు, బడుల్లో చదువుతున్న 1.04 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.181 కోట్ల ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందించాం. 16 ఎస్సీ, 9 చొప్పున బీసీ, మైనారిటీ, గిరిజన గురు కులం ద్వారా 11,400 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని పద్మారావు పేర్కొన్నారు. రైతులకు అండగా.. రైతుబంధు పథకం కింద తొలి విడతగా 2.47 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.257 కోట్లు అందజేశాం. రబీ సీజన్లో 2.18 లక్షల మందికి రూ.237 కోట్లను పెట్టుబడి సాయం కోసం ఖర్చుచేశాం. అలాగే రైతు బీమా పథకం కింద 489 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించి బాసటగా నిలిచాం. రూ.35,200 కోట్ల వ్యయంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 350 గ్రామాల పరిధిలోని 3.77 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా ద్వారా 1.14 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ‘రికార్డు’ ప్రక్షాళన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వంద రోజుల్లోనే జిల్లాలోని 2.42 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాం. 81 రోడ్ల మరమ్మతుల పనులు రూ.1,186 కోట్ల వ్యయంతో చేపట్టాం. ముచ్చర్లలోని ఫార్మాసిటీ అనుసంధానం కోసం కందుకూరు నుంచి యాచారం వరకు రూ.146 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు జోరుగా సాగుతున్నా యి. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యం తో 191 గ్రామ పంచా యతీలు, ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశాం. 60 గిరిజన తండాలు గ్రామ జీపీలుగా అవతరించాయి. 418 జీపీలను ఓడీఎఫ్‌గా ప్రకటించాం. రూ.30 కోట్ల జిల్లా పరిషత్ సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డ్వాక్రా, అంగన్వాడీ భవనాలు, తాగునీటికి సంబంధించిన పనులు చేపట్టినట్లు సభాపతి వివరించారు. ఆర్థిక చేయూత గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో తొలివిడతగా జిల్లాలోని 11,277 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాం. గంగపుత్రులు, ముదిరాజ్‌ల స్వాలంబన కోసం 534 చెరువుల్లో సుమారు కోటి చేప విత్తనాలు వేశాం. మహిళా సాధికారిత కింద ఈ ఏడాది 6,930 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.282 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందించాం. ఉపాధి హామీ పథకం కింద రూ.112 కోట్లు ఖర్చు చేసి 46 లక్షల పనిదినాలు కల్పించాం. 797 మంది నిరుద్యోగ యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు పద్మారావు పేర్కొన్నారు. లబ్ధిదారులకు అందజేత రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 9 ప్రభుత్వ శాఖల పరిధిలోని లబ్ధిదారులకు ఉపసభాపతి చేతుల మీదుగా ఆస్తుల పంపిణీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 20 స్వయం సహాయక సంఘాలకు, జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా 13 మందికి ట్రాన్స్పోర్ట్ హైరింగ్ వాహనాలు, హాజింగ్ శాఖ తరఫున ఐదుగురికి ఇళ్ల పట్టాలు, మత్స్య శాఖ ఆధ్వర్యంలో ముగ్గురికి వెండింగ్ వాహనాలు, ఉద్యానశాఖ ద్వారా ఆరుగురికి డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 20 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, హియరింగ్ ఎయిడ్స్, గిరిజన అభివృద్ధి శాఖ తరఫున ఆటోలు, ఫొటో అండ్ వీడియోగ్రాఫ్ యూనిట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా సీఎం ఓవర్సీస్ నిధిని అందజేశారు. అమరవీరుల కుటుంబాలకు సన్మానం.. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ఉప సభాపతి పద్మారావు ఓదార్చారు. బిడ్డల త్యాగం ఊరికే పోదని.. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబసభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరీష్, డీఆర్ఓ ఉషారాణి, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదనపు సీపీ సుధీర్‌బాబు, డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్, డీఈఓ సత్యనారాయణ రెడ్డి ప్రజాప్రతనిధులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి పెద్దపీట కేసీఆర్ కిట్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పథకంలో భాగంగా రూ.20.58 లక్షలను అందజేశాం. కంటి వెలుగు కార్యక్రమం కింద 8.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం. 2.52 లక్షల మందికి కంటి అద్దాలు అందజేశామన్నారు. -
సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఆత్మబలిదానాలు, అలుపెరగని ఉద్యమంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో దూసుకెళ్తోందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎర్రగొల్ల రాజమణి మురళీయాదవ్ అన్నారు. మెదక్‌పై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని.. ఆయన ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలతోపాటు పలు కూడళ్లలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మెదక్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సాక్షి, మెదక్ : ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే నాటికి తెలంగాణ అన్ని రంగాల్లో వెనుబడి ఉందని.. తీవ్రమైన విద్యుత్ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలైందని రాజమణి మురళీయాదవ్ అన్నారు. సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయంతో తెలంగాణ పంట పొలాలు పడావు పడ్డాయని.. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో పనుర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మరింత బాధ్యత పెరిగింది.. ఐదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుసని.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారనడానికి ఇటీవల ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు అఖండ విజయాన్ని అందించి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారన్నారు. పంచాయతీ నుంచి ఎంపీ ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తూ తమపై ప్రజలు అచెంచల విశ్వాసం ప్రకటించారని గుర్తు చేశారు. ప్రతి విజయం తమపై మరింత బాధ్యతను పెంచిం దని.. అందరం కలిసి అభివృద్ధిలో జిల్లాను ముందంజలో నిలుపుతామన్నారు. ఆ తర్వాత జిల్లా ప్రగతిని వివరించారు. అనారోగ్యం కారణంగా ప్రసంగ పాఠాన్ని జేసీ నగేష్‌తో చదివిం చారు. ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే.. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు వ్యవసాయకోసం ఏడాదికి పెట్టుబడి సాయంగా జిల్లాలోని 2,17,533 మందికి ఖరీఫ్ సీజన్లో రూ.142.67 కోట్లు, రబీ సీజన్‌కు రూ.139.33 కోట్లు పంపిణీ చేశాం. జిల్లాలో 1,68,958 మంది రైతులకు బీమా చేయించాం. ఇప్పటికీ జిల్లాలో 491 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా 441 మందికి ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమయ్యాయి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10.91 కోట్లతో జిల్లాలోని రైతులకు వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, రోటివేటర్లు, వరినాటు యంత్రాలతోపాటు ఇతర సామగ్రి పంపిణీ చేశాం. జిల్లాలో సూక్ష్మ సేద్య పథకం ద్వారా 690 మంది లబ్ధిదారులకు రూ.4.90 కోట్లతో సామగ్రిని అందించాం. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పండ్ల తోటల ఉత్పత్తిలో నాణ్యత పెంచేందుకు 89 మంది లబ్ధిదారులకు రూ.7.73 లక్షలు ఖర్చు చేశాం. పాలీహౌస్ నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ.107.61 లక్షల సబ్సిడీని అందించాం. పట్టు పరిశ్రమను ప్రోత్సహించేం దుకు 100 ఎకరాలకు రూ.16.66 లక్షలు కేటాయించాం. గొర్రెల ప్రత్యేక అభివృద్ధి పథకం కింది ఇప్పటి వరకు 12.067 గొర్రెల యూనిట్లను రూ.113.12 కోట్ల వ్యయంతో పంపిణీ చేశాం. వీటి ద్వారా రూ.26.24 కోట్ల విలువైన 58,317 గొర్రె పిల్ల ఉత్పత్తి జరిగింది. పాడి రైతుల ఆర్థిక ప్రగతికి జిల్లాలో రూ.13 కోట్ల సబ్సిడీతో 3,044 మంది లబ్ధిదారులకు పాడిగేదెలను అందజేశాం. జిల్లాలో మిషన్ కాకతీయ పథకం ద్వారా నాలుగు విడతల్లో 1,893 చెరువుల అభివృద్ధికి రూ.447.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ చెరువుల కింద 1,06,590 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇప్పటికీ 1,701 చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యియి. రూ.66.82 కోట్లతో ఘనపురం ప్రాజెక్ట్ ఎత్తు పెంపుతోపాటు పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.20.33 కోట్లతో నర్సాపూర్, మెదక్ ప్రధాన రహదారి నుంచి ఏడుపాయల దుర్గాభవాని ఆలయం వరకు చేరుకునేందుకు నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు సైతం పురోగతిలో ఉన్నాయి. మత్స్యశాఖ ద్వారా జిల్లాలోని 100 చెరువుల్లో రూ.65లక్షల ఖర్చుతో 68.76లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. తద్వారా దాదాపు 1,600 టన్నుల చేపలు ఉత్పత్తి జరిగి చేపల పరిశ్రమపై ఆధారపడిన 10.815 కుటుంబాలకు జీవనోపాధి లభించనుంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రొయ్యల పెంపకం సాగుపై దృష్టి సారించాం. పోచారం ప్రాజెక్ట్‌లో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు రూ.6,20 వేల రొయ్య పిల్లలను వేసి పెంచుతున్నాం. సుమారు 30 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మానస పుత్రిక వాటర్ గ్రిడ్ పనులు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జిల్లాలో రూ.1,500 కోట్లతో 958 గ్రామాల్లో 1,96,232 ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రత్యేక నిధులతో రానున్న మూడు నెలల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతుంది. ఈ సంవత్సరం జిల్లాలో 438 నర్సరీల ద్వారా రూ.4.24 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా నిర్ణయించాం. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 322 నర్సరీల ఏర్పాటుతో పాటు 2.99 కోట్ల మొక్కలను నాటేందుకు, అటవీశాఖ ఆధ్వర్యంలో 112 నర్సరీల ద్వారా 1.25కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. లబ్ధిదారునికి ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇంటిస్థలం, ఇతర మౌలిక సదుపాయాలతో జిల్లాలో 514 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా.. ఇందులో 3,623 నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామంలో నిర్మించిన 30, వెల్దుర్తి మండల కేంద్రంలో 36, చేగుంట మండలం బి.కొండాపూర్‌లో 30 డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 2,14లక్షల కుటుంబాలకు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి ఆరుకిలోల చొప్పు న నెలకు 4,099 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 521 చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. 13.013 కుటుంబాలకు అంత్యోదయ కార్డుల ద్వారా 419 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో ఉజ్వల పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు 18,045 గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. జిల్లాలో 139 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాం. 171 పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభించాం. దీని ద్వారా హాజరు శాతం గణనీయంగా పెరిగింది. రూ.3.15 కోట్లతో 42 పాఠశాలల్లో అదనపు గదులను నిర్మించుకుంటున్నాం. మూడు కస్తూర్బా పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను సైతం ప్రారంభించుకున్నాం. రాష్ట్ర స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుత ప్రదర్శన కనబర్చి దక్షిణ భారతదేశ ప్రదర్శనలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నాం. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 372 గ్రామాల్లో 4.37 లక్షల మందికి దృష్టి పరీక్షలు నిర్వహించి 69.430 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశాం. 1.10లక్షల మందికి సాధారణ వైద్య సేవలను అందించాం. మాతాశిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా కేసీఆర్ కిట్లను ఇప్పటివరకు జిల్లాలో 9,428 మందికి పంపిణీ చేశాం. వ్యవసాయ రంగానికి జూలై 2017 నుంచి 24గంటల విద్యుత్ సౌకర్యాన్ని రైతులకు ఉచితం గా అందిస్తున్నాం. దీన్‌దయాల్ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 32,697 కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చాం. జిల్లాలో మెగా, భారీ, మధ్య తరహా పరిశ్రమలు, 288 చిన్న తరహా పరిశ్రమలు.. మొత్తం రూ. 29.98 కోట్ల పెట్టుబడితో స్థాపించాం. వీటిలో దాదాపు 2,264 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రూ.282.54 కోట్ల పెట్టుబడితో 81 పరిశ్రమలకు 192 అనుమతులకు దరఖాస్తులు వచ్చాయి. 171 అనుమతులను వివిధ శాఖల నుంచి జారీ చేశాం. ఇందులో ఇప్పటి వరకు 40 పరిశ్రమలు ప్రారంభించడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ యువతకు సేవారంగంలో 151 పరిశ్రమలకు రూ.9.60 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ మంజూరు చేశాం. ఆసరా పింఛన్ల పథకం కింద ప్రతినెల రూ.1000 చొప్పున జిల్లాలోని 1,3,514 మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.11.20 కోట్లు అందించాం. వీటితో పాటు పలు రకాలు పథకాలు జిల్లాలో అమలవుతున్నాయి. -
అభివృద్ధి వైపు అడుగులు..
సాక్షి, వరంగల్ రూరల్: అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం.. దేశ సాగునీటి రంగానికే దిక్సూచిలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. మొదటి దశలోనే జిల్లా సస్యశ్యామలం కాబోతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణం సందర్భంగా రూరల్ జిల్లా వేడుకలను ఆదివారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపి మూడు పంటలకు నీరందిస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలతో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుందని తెలిపారు. సంపూర్ణ వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన వరంగల్ రూరల్‌లోని రైతాంగానికి ఖరీఫ్‌లో 10,428 క్వింటాళ్ల విత్తనాలను రబీలో 9,490 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రాయితీపై సరఫరా చేశామని పేర్కొన్నారు. రైతు బంధు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 1లక్ష 49 వేల మంది రైతులకు రూ.240 కోట్లను గత సంవత్సరం అందించామని, ఈ సంవత్సరం నుంచి ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. రైతులు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు వీధిన పడకుండా వారిని ఆర్థికంగా అదుకునేందుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా చేస్తుందని చెప్పారు. రైతు బీమా పథకంలో భాగంగా జిల్లాలో 241 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.12.05 కోట్లను చెల్లించామని వివరించారు. పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్నిరకాల పెన్షన్లను రూ.1000 నుంచి రూ.2016లకు, వికలాంగులకు ఇచ్చే రూ.1500లను రూ.3016లకు పెంచినట్లు చెప్పారు. ఈ నెల నుంచే పెంచిన పెన్షన్లు ఇస్తామన్నారు. తండాలు గ్రామ పంచాయతీలుగా.. గిరిజన ప్రజల కలలను సాకారం చేస్తూ మిగిలిన ప్రాంతాలతో ధీటుగా తండాలు, గూడెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జిల్లాలో 132 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 401కి చేరిందని తెలిపారు. వీటికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 30.45 కోట్లు కేటాయించి వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటికీ తాగు నీరు.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే సంకల్పంలో భాగంగా జిల్లాలోని 16 మండలాల్లోని 776 అవాసాలకు తాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ తెలంగాణకు హరిహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి రాష్ట్రంలోని అటవీ సంపదను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 2018–19 హరితహారం కార్యక్రమం కింద 1 కోటి 12 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, 16 కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి ప్లాంటేషన్ చేశామన్నారు. ఏ గ్రామానికి అవసరమైన మొక్కలను అదే గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి పెంచి ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 401 గ్రామ పంచాయతీల్లో 411 నర్సరీలను ఏర్పాటు చేసి 2 కోట్ల 54 లక్షల మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు అండగా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలని, వారి పెళ్లి చేయడానికి ఏ ఒక్క నిరుపేద కుటుంబం కూడా అప్పులు చేయకుండా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3707 మంది లబ్ధిదారులకు, షాదీముబారక్ ద్వారా 144 కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాన్ని అందించామని స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్, సిటీస్కాన్, ఎమ్మారై, డిజిటల్ రేడియాలజీ, టుడీ లాంటి అత్యాధునిక పరికరాలను ప్రభ్వుం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలో 1.10 లక్షల మంది బాలబాలికలకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వేగంగా టెక్స్టైల్ పార్కు పనులు దేశం గర్వించదగ్గ మెగా టెక్స్టైల్ పార్క్ రూరల్ జిల్లాలో ఉండడం గర్వకారణమని ఆయన అన్నారు. 1200 ఎకరాలలో రూ.11 వేల కోట్ల పెట్టుబడితో పార్కు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అన్ని రకాల వస్త్రాల తయారి, మార్కెటింగ్, ఎగుమతులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 224 పరిశ్రమలు ఇప్పటికే అనుమతి పొందాయని, టీ–ప్రైడ్ కింద 249 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు క్యాబ్, గూడ్స్ వాహనాలకు పెట్టుబడి రాయితీ కింద రూ.652 లక్షల మంజూరు చేయడం జరిగిందన్నారు. గొర్రెల పంపిణీ వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. దీనిలో భాగంగా యాదవ, గొల్ల, కురుమ కుటుంబాలకు 75 శాతం సబ్సిడీతో 12909 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. పాడి రైతుల ఆర్థిక ప్రగతి చెందాలని జిల్లాలో ఇప్పటి వరకు 217 ఎస్సీ, 240 ఎస్టీ, 640 ఇతర వర్గాల కుటుంబాలకు పాడి పశువులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గర్బిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలోని 908 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలలు నుంచి 3 సంవత్సరాలు గల 15,349 మంది పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు, 3 నుంచి 6 సంవత్సరాలు గల 8,874 మంది పిల్లలకు ఒకపూట భోజనంతో పాటు ఉడికంచిన గుడ్లు, స్నాక్స్ ఇస్తున్నామని చెప్పారు. 7614 మంది గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒకపూట భోజనం, 200 మిల్లీ గ్రాములు పాలు, ఉడికించిన గుడ్లను ప్రతి రోజు ఇస్తున్నామన్నామని తెలిపారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న 39 మందికి వివాహ ప్రోత్సాహం కింద రూ.50 వేల చొప్పున రూ.19.50 లక్షలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. 17 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.24.60 లక్షల ప్రభుత్వ సబ్సిడీ అందించడం జరిగిందన్నారు. అనంతరం పలువురికి ప్రశంస పత్రాలు అందించారు. 7646 మందికి కేసీఆర్ కిట్లు.. మహిళలు, శిశువుల ఆరోగ్యం, వారి భద్రత కోసం ప్రారంభించిన కేసీఆర్ కిట్ గర్భిణులకు వరంగా మారిందని, దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. గర్భిణులుగా నమోదు చేసుకున్న నాటి నుంచి నాలుగు విడతల్లో ఆడశిశువు అయితే రూ13 వేలు, మగ శిశువు అయితే రూ12 వేలు నేరుగా ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో నవజాత శిశువులకు, బాలింతలకు అవసరమయ్యే 16 రకాల వస్తువులతో కూడిన 7646 కేసీఆర్ కిట్లను ఇప్పటి వరకు అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి జబ్బులతో బాధపడకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. 52709 మందికి కళ్లద్దాలు, 25817 మంది ప్రిస్కిప్షన్ గ్లాసులు అందజేయడం జరిగిందన్నారు. 14 మందికి 10/10 మార్కులు 2019 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 14 మంది విద్యార్థులు 10 జీపీఏ, 60 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. 16 మండల్లాలోని 684 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 38274 మంది విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి కస్తూర్భా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. పట్టణ, వీధి బాలల కోసం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పాఠశాలలో 65 మంది విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్.. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించేందుకు ఇప్పటి వరకు రూ.12.96 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకంలో భాగంగా 15897 సర్వీసులు విద్యుదీకరించబడ్డాయని, 101 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. 32.04లక్షల ఉపాధి పని దినాలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని 1, 29496 మంది కూలీలకు 32.04 లక్షల పని దినాలు కల్పించి రూ.46.33 కోట్లను వేతనంగా చెల్లించడం జరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా అవార్డు, రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర అవార్డు, రాష్ట్ర ఎక్సలెన్సీ అవార్డు పాందడం జరిగిందని వివరించారు. 3.17లక్షల ఎకరాలకు పట్టాల పంపిణీ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం భూ రికార్డులను ప్రక్షాళన చేశామని, రికార్డుల నిర్వాహణ పారదర్శకంగా, సరళంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో 3 లక్షల 17 వేల 852 ఎకరాలను చేసి ఇప్పటి వరకు 1లక్ష 64 వేల 648 మంది రైతులకు పట్టా పాసుబుక్కులు ఇచ్చామన్నారు. -
ప్రగతి పరవళ్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీ సుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దాశరథి అన్నట్లుగా ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పేర్కొన్నారు. ఎన్నో వనరులు, ఎంతో చారిత్రక సంపద మన వారసత్వమన్నారు. స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. ఎందరో అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ.. సాధన ఘనత అమరులదేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి దేశం తెలంగాణ వైపు చూసే విధంగా చేసిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అప్పుడే మనం కలలుకంటున్న బంగారు తెలంగాణ సాధ్యం చేసుకోగలుగుతామని చెప్పారు. జిల్లాలో చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిదే కీలక పాత్ర జిల్లాలో 80శాతం ప్రజలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. అందుకే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. గత ఖరీఫ్‌లో 3,81,482 మంది రైతులకు చెక్కులద్వారా రూ.421.20 కోట్లు అందించిందని తెలిపారు. రబీలో కూడా 3,60,827 మంది రైతుల ఖాతాల్లో రూ.421 కోట్ల జమ చేసిందని వివరించారు. రైతు బీమాతో మరణించిన రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తోందన్నారు. ఇప్పటికే జల్లాలో 859 మంది రైతులు మరణించగా 793.. కుటుంబాలకు రైతుబీమా అందిందని పేర్కొన్నారు. పట్టు పరిశ్రమ జిల్లాలో సూక్ష్మ నీటి పారుదల పథకం ద్వారా డ్రిప్స్ పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, సన్నకారు రైతులకు 90శాతం, పెద్ద రైతులకు 80శాతం రాయితీతో స్పింక్లర్లు ఇస్తోందన్నారు. ఉద్యాన యాంత్రీకరణ కింద 50 శాతం రాయితీపై ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రూ.6.83 కోట్లతో యూనిట్లను గ్రౌండింగ్ చేశామని చెప్పారు. గొర్రెల పంపిణీ పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నామని.. ఇందులో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇప్పటికే 26,132 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. పాడి పశువుల పంపిణీ కింద 3,618 పశువులను పంపిణీ చేయడం చేశామమని.. అందుకు రూ.29 కోట్ల వరకు ఖర్చు చేశామని తెలిపారు. 195 చెరువుల్లో చేప పిల్లల పెంపకం మత్స్యకారులను ఆదుకునేందుకు 195 చెరువుల్లో 100 రాయితీతో 3 కోట్ల చేపపిల్లలను వదిలామ ని.. ఇప్పుడు వాటి విలువ రూ.3.41 కోట్లని పేర్కొన్నా రు. చేపలను విక్రయించేందుకు కూడా రాయితీపై వాహనాల ను అందించడంతో పాటు పరికరాలను కూడాఇచ్చామన్నారు. పురోగతిలో డబుల్ బెడ్రూం ఇళ్లు డబుల్ బెడ్రూం ఇళ్లు జిల్లాలో పురోగతిలో ఉన్నాయని ప్రతి నియోజకవర్గానికి 1,400 చొప్పున జిల్లాలో 8,155 ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.375 కోట్లతో పనులు సాగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ చెరువుల సంరక్షణ, పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ పనులు నాలుగు దశల్లో 1360 చెరువుల్లో పూడిక తీశామని.. ఇందు కోసం రూ.530 కోట్లు పరిపాలన ఆమోదం పొంది రూ.266 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చేపడుతున్న మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరాయని.. ప్రతి మనిషికి రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 100, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు సరఫరా చేయనున్నామని తెలిపారు. అందుకోసం రూ.571కోట్లు కేటాయించామని.. ఇప్పటికే 1,467 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందుతోందని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతి తెలంగాణ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టి వెనువెంటనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే 224 అనుమతులు ఇప్పించామని తెలిపారు. వీటి ద్వారా రూ.165 కోట్ల పెట్టుబడులు లభించి 1,650 మందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. ఏఎమ్మార్పీ ఏఎమ్మార్పీ కింద జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఆవాసాలకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే దాదాపు 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పథకానికి సంబంధించి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ జలాశయ నిర్మాణం, ఓపెన్ కెనాల్, డిండి బ్యాలెన్సింగ్ జలాశయం, ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం రూ.1177 కోట్ల అంచనా వేయగా రూ.694 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. డిండి ఎత్తిపోతల ఈ పథకం ద్వారా జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని సాగు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందుకోసం 7800 ఎకరాలు భూసేకరణ పూర్తయిందని.. రూ.3,930 కోట్లకు టెండర్లు పిలిచామని.. ఇప్పటికే రూ.910 కోట్లు ఖర్చు చేసి పనులను ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పేదలకు కంటి పరీక్షలు ఉచితంగా చేసి అద్దాలు కూడా అందజేస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ఇప్పటికే రూ.19 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 17,917 మందికి వైద్య చికిత్స నిర్వహించడానికి రూ.44 కోట్లు ఖర్చు చేశానమి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ. 275 కోట్లు మంజూరయ్యాయని.. మెడికల్ కళాశాల త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. శాంతి భద్రతలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో.. జనమైత్రి అమలు చేయడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, తదితర వా టిపై చర్యలు చేపట్టడంతో నేరాల నిరో«ధానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పెంచామన్నా రు. అంతకు ముందు గడియారం సెంటర్ వద్ద అ మరవీరుల స్తూపం వద్ద శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కలెక్టర్, ఎస్పీ, ఇతర నా యకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎ మ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగ య్య, భాస్కర్‌రావు, ఎస్పీ రంగనాథ్, జేసీ వి.చంద్రశేఖర్, బండా నరేందర్‌రెడ్డి, డీఆర్ఓ రవీంద్రనా థ్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మార్కెటింగ్ జిల్లాలోని నకిరేకల్‌లో రూ.3.58 కోట్లతో నిమ్మ మార్కెట్ నిర్మాణం పూర్తయిందన్నారు. నల్లగొండ గంధవారిగూడెంలో బత్తాయి మార్కెట్ చేపట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ధాన్యానికి మద్దతు ధర వచ్చే విధంగా పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు. జిల్లాలో రోడ్ల నిర్మాణానికి రూ.280 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 233 కిలోమీటర్ల రహదారి కూడా పూర్తయిందని తెలిపారు. కల్యాణలక్ష్మి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆడపిల్ల పెళ్లి చేసిన పేద కుటుంబానికి రూ.1,00,116 చొప్పున 7574 మందికి రూ.75.82 కోట్లు అందించామని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ఏర్పాటు చేయడానికి వీర్లపాలెం ఫారెస్ట్‌బ్లాక్‌లో భూసేకరణ చేసి పనులు చేపట్టామన్నారు. అందుకోసం ఇప్పటికే 1583 ఎకరాలు భూసేకరణ చేసి రూ.104 కోట్లు నష్ట పరిహారం చెల్లించామని తెలిపారు. -
సమగ్ర అభివృద్ధే ధ్యేయం
కరీంనగర్: తెలంగాణ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల ఆకాంక్షలన్నీ నెరవేర్చడంతోపాటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేదందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఈటల రాజేందర్ సందేశమిచ్చారు. ఐదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న పథకాలను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. కరీంనగర్‌ను త్వరలో వాటర్ హబ్‌గా, రైస్ బౌల్ జిల్లాగా చూడబోనున్నామని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి అందరి మోములో చిరునవ్వును చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బాసటగా నిలువాలని కోరారు. అభివృద్ది, సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకుని బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలన్నారు. రైతు దేశానికే వెన్నెముక.. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. రైతుబం«ధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద 2018–19 సంవత్సరంలో 1,66,270 మంది రైతులకు రూ.231.46 కోట్లు అందించామన్నారు. ఈ సంవత్సరం నుంచి ఎకరాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతు కుటుంబాలకు ధీమాగా ఉండేందుకు రూ.5 లక్షల రైతుబీమా పథకం పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న 18 నుంచి 60 సంవత్సరాలలోపు రైతులందరికీ వర్తింపజేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టామని తెలిపారు. వ్యవసాయానికి కావల్సిన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, సకాలంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని వివరించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. అధిక దిగుబడులు వచ్చే విధంగా బిందు, తుంపర్ల సేద్యానికి రైతులు మొగ్గు చూపారని సూచించారు. పండ్లు, పూల తోటలు పెంచేందుకు 80 శాతం రాయితీ ఇస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకుని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుందని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు చేసి అమలు చేస్తున్నదని, దశల వారీగా వివిధ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. వాతావరణం, భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందో, ఏ పంటల సాగు ద్వారా రైతాంగానికి అధిక లాభాలు వస్తాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భూసార పరీక్షలు, యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై అందిస్తున్నామని, వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. తెలంగాణకు హరితహారం.. తెలంగాణకు హరితహరం పథకం ద్వారా ఈ సంవత్సరంలో జిల్లాలో 2.35 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అందుకు కావల్సిన మొక్కలను నర్సరీలలో అటవీ గ్రామీణాభివృద్ది, ఉద్యానవన శాఖ ద్వారా 2.80 కోట్ల మొక్కలు పెంచుతున్నామని వివరించారు. జిల్లాలో హరితహరం కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 20.88 లక్షలు, రెండవ విడతలో 75.50 లక్షలు, మూడవ విడతలో 79.71 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ‘మిషన్’తో సత్ఫలితాలు.. చెరువులను పునరుద్ధరించి గ్రామాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. జిల్లాలో నాలుగు దశల్లో రూ.318 కోట్లతో 958 చెరువుల çపనులు మంజూరు చేశామని, మిగిలిన చెరువుల పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 11 చెక్ డ్యాంలు, కరీంనగర్ నియోజకవర్గంలో ఒక చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం రూ.45.43 కోట్లు మంజూరు చేసిందని, పనులు ప్రగతిలో ఉన్నాయని వెల్లడించారు. పేద కుటుంబాలకు ‘ఆహార భద్రత’ జిల్లాలో ఇంత వరకు 2,59,320 కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. 15,944 కుటుంబాలకు అంత్యోదయ ఆహార భద్రత కార్డులు మంజూరు చేశామని, ఆహార భద్రత పథకంలో ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలలో, పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 66,576 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రతినెలా 438.628 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వైద్యంలో మెరుగు.. ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో అభివృద్ధి చేసి పేద రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. పేద రోగులెవరూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ వైద్య సేవలందించేలా డాక్టర్లను, సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో 20 కోట్లతో నిర్మించిన 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకుని 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. తద్వారా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య నెలకు 300 నుంచి 1000కిపైగా జరుగుతున్నాయని వెల్లడించారు. మాతాశిశు కేంద్రంలో మిడ్ వైఫరీ నర్సింగ్ కోర్సు దేశంలో మొట్టమొదటి సారిగా ప్రారంభించుకున్నామని, ఇందులో చదువుకునే విద్యార్థులు కూడా గర్భిణులకు వైద్య సేలందిస్తారని తెలిపారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్, వెల్నెస్ సెంటర్ ప్రారంభించుకున్నామని, 10 పడకలతో ఐసీయు యూనిట్ వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించామని, త్వరలో మరో రెండు ప్రారంభిస్తామని తెలిపారు. హుజూరాబాద్‌లో రూ.10 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, జమ్మికుంటలో రూ.5 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మించామని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.10 కోట్లతో మౌలిక వసతులు కల్పించి మరమ్మతులు చేయించామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన బాలింతలకు కేసీటర్ కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఇంత వరకు 16,231 కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించిన ఆడపిల్ల తల్లులకు 13 వేలు, మగబిడ్డ తల్లులకు 12 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం.. రోడ్లు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో సింగల్ రోడ్లను డబుల్ రోడ్లుగా , డబుల్ రోడ్లను ఫోర్‌లైన్ రోడ్లుగా అభివృద్ధి చేశామని, లింకు రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులకు జిల్లాకు 148.30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. పనులన్నీ ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. కమాన్ నుంచి సదాశివపల్లి మానేరు నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.183 కోట్లు మంజూరు చేయగా పనులు ప్రగతిలో ఉన్నట్లు వెల్లడించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.73.38 కోట్లు మంజూరయ్యాయని, పనులు నడుస్తున్నాయని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖకు నిధులు.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా జిల్లాలో 2,213 రోడ్ల పనులు, కొత్త తారు రోడ్ల నిర్మాణం, తారు రోడ్ల మరమ్మతు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.247.66 కోట్లు మంజూరు చేసిందని ఈటల వివరించారు. జిల్లాలో 17 వంతెనల నిర్మాణానికి రూ.31.53 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 12 వ్యవసాయ గోదాముల నిర్మాణానికి రూ.4.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ.9 కోట్లతో 69 కొత్త గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు మంజూరు చేయగా 20 గ్రామపంచాయతీ భవనాలు పూర్తయ్యాయని, మిగతా పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో రూ.7.67 కోట్లతో 8 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అవతరణ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ వీబీ.కమలాసన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్వో భిక్షానాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, సీఈవో వెంకటమాధవరావు, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్, పర్యాటక కళ... కరీంనగర్ స్మార్ట్, పర్యాటక శోభ సంతరించుకోనుందని మంత్రి తెలిపారు. అందమైన సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఉజ్వల పార్కు వద్ద రూ.25 కోట్లతో ఐటీ పార్కును, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. ఎల్ఎండీ దిగువన మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. నగరంలోని కూడళ్లను అభివృద్ధి పరిచి కరీంనగర్ నగరాన్ని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ‘ఆసరా’ రెట్టింపు .. ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకం ప్రవేశపెట్టిందని ఈటల అన్నారు. జిల్లాలో 1,21,851 మందికి ఆసరా ఫించన్లను మంజూరు చేశామని తెలిపారు. ఇందులో 48,331 మందికి వృద్ధాప్య, 20,277 వికలాంగుల, 34,087 వితంతువులకు, 3,748 గీత కార్మికులకు, 2,806 చేనేత కార్మికులకు, 3,265 ఒంటరి మహిళలకు, 9,337 బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. ఇంతవరకు దివ్యాంగులకు నెలకు రూ.1500 చొప్పున, ఇతరులకు రూ.1000 చొప్పున ఇస్తున్న పింఛన్లను ఈ నెల నుంచి రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు. -
అభివృద్ధి పథం...
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వల్లకొండ శోభరాణి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఆదివారం జరిగిన సంబరాల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకోవడానికి అనువుగా ప్రాజెక్టుల నిర్మాణం గతంలో జరగలేదని, ఈ నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రంలో కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలే మారిపోనున్నాయని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతులకు మరోమారు రూ.లక్ష వరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలిపారు. పంట కాలంలో పెట్టుబడి కోసం రైతులు ఎవరి వద్ద చేయి చాచకుండా ఉండేందుకు అందిస్తున్న రైతుబంధు పథకం, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న రైతు బీమా పథకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని అన్నారు. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు ఎకరానికి ఏడాదికి రెండు దఫాలుగా అందిస్తున్న రూ.8వేల మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 6వేల కుటుంబాలకు రైతుబీమా పథకం కింద సహాయం అందించినట్లు తెలిపారు. మైక్రో ఇరిగేషన్, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీలు అందిస్తుందన్నారు. సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్లు వివరించారు. అన్నిరకాల పింఛన్లను రూ.2016కు పెంచుతున్నట్లు తెలిపారు. వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ.3016కు పెంచడం జరిగిందని, వృద్ధాప్య పింఛన్ కనీస అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా అనేక మంది అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. జూలై 1 నుంచి పింఛన్ల పెంపు.. పెంచిన పింఛన్లను జూలై 1 నుంచి లబ్దిదారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. 1281 ఆవాస ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ ఏరియాలను, జనాభా ఆధారంగా మరో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్‌గా చేసి మొత్తంగా 3146 మంది ఎస్టీలను సర్పంచులను చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. తద్వారా అట్టడుగు వర్గాలను పాలనలో భాగస్వాములను చేసి దేశ చరిత్రలో ఆదర్శంగా నిలుస్తున్నామని వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు మరో 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్య కోసం వెళ్లే అన్నివర్గాల వారికి రూ.20లక్షల వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని అమలులోకి తెచ్చే వ్యూహంలో భాగంగా అమలుపరుస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకంగానే కాకుండా మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. టీఎస్ ఐపాస్ సింగల్‌విండో విధానం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అన్నిరకాల అనుమతులు లభిస్తుండడంతో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని తెలిపారు. దీంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చి, వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12086 మంది గర్భిణీలు ప్రసవించగా, అందులో అర్హులైన 7,314 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య పెరగడంతో పాటు శిశు మరణాల రేటు కూడా తగ్గించగలిగామని వివరించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 18 బృందాలచే 3,49,373 మందికి పరీక్షలు నిర్వహించి 54,379 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 36,472 మందికి ప్రత్యేక కంటి శస్త్ర చికిత్సల కోసం సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. దేశానికి ఆదర్శం మన పథకాలు.. దేశానికే మన రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ, నిరుపేదలకు ఉచితంగా నిల్వ నీడ కల్పించే డబుల్బెడ్రూం ఇల్లు, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు తదితర పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. గ్రామపంచాయతీలను క్రియాశీలం చేసేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిర్దిష్టమైన విధులు, బాధ్యతలను నిర్దేశిస్తూ కావాల్సిన నిధులను క్రమంతప్పకుండా ప్రభుత్వం సమకూర్చుతుందని వివరించారు. జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.1594 కోట్ల వ్యయంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు కోర్టా–చనాఖా బ్యారేజీ పైపులైన్లు, పంప్‌హౌజ్ వంటి పనులు రూ.438 కోట్ల వ్యయంతో చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి 51వేల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో మొదటి మూడు దశలో ఇప్పటివరకు 288 చెరువు పనులు చేపట్టి రూ.94కోట్లతో 32,576 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి పర్చడం జరిగిందన్నారు. నాలుగో దశలో 22 చెరువు పనులు ప్రారంభించామని అన్నారు. జిల్లా ఉద్యాన కార్యక్రమాల కింద 3093 మంది లబ్ధిదారులకు రూ.835 లక్షలతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి సూక్ష్మసేద్యం, ఆదివాసీలకు బిందుసేద్యం పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. రహదారుల అభివృద్ధి రహదారులు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో రూ.350 కోట్లతో ఒక వరుస రహదారులను రెండు వరుస రహదారులుగా మార్చేందుకు నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయని అన్నారు. రూ.30కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు, రూ.66 కోట్లతో వంతెనల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పథకాల కింద 177 పనులకు గాను రూ.166 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. 5 మండల పరిషత్ భవనాలకు గాను రూ.5కోట్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి రూ.156 లక్షలతో 24 అంతర్గత రోడ్లు, తాగునీటి వసతి, మురుగు నీటి కాల్వలు, కల్వర్టుల నిర్మాణాలు, మరమ్మతులకు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి 82 పనులకు రూ.170లక్షలతో గ్రామీణ రోడ్లు, జిల్లా పరిషత్ పాఠశాల భవనాల నిర్వహణ పనులకు చేపట్టేందుకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడం, ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ విభాగాల్లో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల కారణంగా 420 మంది విద్యావాలంటీర్లను నియమించామన్నారు. జిల్లాకు మొదటి విడతలో 6 ఆదర్శ పాఠశాలలు, 17 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 13 భవిత విలీన విద్యా కేంద్రాలు పనిచేస్తున్నట్లు వివరించారు. 275 మంది విద్యార్థులు ప్రత్యేక అవసరాలు గల వివిధ రకాల వైకల్యం గల పిల్లలుఇందులో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఆదిమ గిరిజనుల అభ్యున్నతి.. ఆదిమ గిరిజనుల అభివృద్ధికి సీసీడీపీ కింద 2013–14 నుంచి 2016–17 సంవత్సరం వరకు సుమారు రూ.27కోట్లు మంజూరు కాగా, వివిధ పనులు ఎంపిక చేసి 12 గిరిజన గ్రామాల్లో అమలుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. 6,342 మంది గిరిజన విద్యార్థులకు రూ.1248 లక్షల పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఇప్పటివరకు 430 పనులు పూర్తి చేసి సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. 2018–19 సంవత్సరానికి 1545 యూనిట్ల స్థాపనకు రూ.27.38 కోట్ల విలువ గల ప్రతిపాదనలు ట్రైకార్ ఎండీ ఆమోదం కోసం పంపించడం జరిగిందన్నారు. 756 మంది గిరిజన యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. కోటి 63 లక్షల మొక్కలు.. జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కోటి 63లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక చేసినట్లు పేర్కొన్నారు. నర్సరీల్లో డిమాండ్‌కు అనుగుణంగా పువ్వులు, పండ్లు, ఇతర జాతుల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ హరితవనంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఆదిలాబాద్ సరిహద్దు మహరాష్ట్ర బార్డర్ నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దు వరకు జాతీయ రహదారి నం.44కు ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు అగ్రో ఫారెస్ట్రిని పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రణాళిక తయారు చేయడం జరిగిందన్నారు. మొదట జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారి కవాతు ఆకట్టుకుంది. అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పాల్గొన్నారు. -
పాలమూరు పచ్చబడాలి
మహబూబ్‌నగర్: పాలమూరు పచ్చబడాలి.. పాత రోజులు మళ్లీ రావాలి.. రాబోయే అతి తక్కువ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. ఆ నీటితో కళతప్పిన పాలమూరు పంటలతో కళకళలాడేలా చేస్తాం.. అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కరువు కాటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించే రోజులు త్వరలోనే రానున్నాయి అని భరోసా కల్పించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు జవాన్లతో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐదేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనను తీసుకువచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిపాలనలో క్రమబద్ధతను, జవాబుదారీ తనాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని రూపొందిస్తుందన్నారు. అగ్రగామిగా నిలబెడతా.. ఐదేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, అదేస్థాయిలో జిల్లాను కూడా ప్రగతి పథంలో నడిపించి జిల్లాను అగ్రగామిగా నిలబెడతానని మంత్రి అన్నారు. పరాయిపాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి వెనకబడిందని, విద్యుత్ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలయిందని, సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వల్ల తెలంగాణ పంట పొలాలు పడావు పడిన దుస్థితి నెలకొందని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఈ దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించిందని, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు.. రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్ల కాలంలోనే బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు పడ్డాయని, దేశ ప్రజల దృష్టి అంతా రాష్ట్రం వైపు ఉందని తెలిపారు. కరువు, కాటకాలతో అల్లాడుతూ నిత్య వలసలతో జీవకళ కోల్పోయిన పాలమూరు జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో పంటలు పండించడానికి సాగునీరు, తాగునీరు అందించడానికి రూ.35,200 కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, 11 మండలాల్లో 2 లక్షల 17 వేల 240 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చిన్ననీటి వనరుల పునరుద్ధరణపై మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులను నీటి నిల్వ సామర్ధ్యం పెంచడానికి ఒండ్రుమట్టి పూడిక తీయుట, చెరువు కట్టలను పటిష్టం చేయడం జరిగిందని, జిల్లాలో ఇప్పటివరకు 638 పనులు పూర్తిచేసి రూ.123 కోట్లు ఖర్చుచేయించామని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ కింద ఖరీఫ్, రబీ పంటలకు 19,619 ఎకరాలకు నీళ్లివ్వడం జరిగిందని, దీంతో పాటు 42 చిన్ననీటి పారుదల సంస్థ చెరువులను నింపి అదనంగా 8 చెరువులు నింపడం కోసం 5 తూములు నిర్మాణాల పనులు మొదలెట్టామని వివరించారు. జిల్లాలో ధాన్యం నిలువ చేయడానికి గోదాములు నిర్మాణం కోసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో భాగంగా 1,01,723 మంది రైతుల నుంచి సమాచారం సేకరించామని తెలిపారు. రైతాంగం ఆనందం.. రైతుబంధు పథకం కింద జిల్లాలో ఏడాదికి రెండు దఫాలుగా రూ.8వేల చొప్పున సాయం అందించామని, ఈ ఏడాది నుంచి రూ.10వేల చొప్పున పెంచి అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు కింద జిల్లాలో 2018–19 రబీలో 152.30 కోట్లను, లక్షా 43 వేల 937 మంది రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. రైతుబీమా పథకం కింద జిల్లాలో 93,850 రైతులను అర్హులుగా గుర్తించడం జరిగిందని, 450 మంది రైతులు మరణించగా 443 రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.22.15 కోట్లు ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు. పరుగు పెడుతున్న అభివృద్ధి మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారిని నాలుగులైన్ల కోసం రూ.193 కోట్లతో 29 మే 2019లో పనులు ప్రారంభించామని, అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.96.70కోట్లు విడుదల చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం రూ.43.83 కోట్లు మంజూరయ్యాయని, రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రూ.377.98 కోట్లతో 27 పనులు మంజూరి చేయగా దీంట్లో 5 పనులు పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. ఇందిర జలప్రభ కింద విద్యుత్ పనుల కోసం 280 కనెక్షన్ దరఖాస్తులు స్వీకరించి 260 వ్యవసాయ కనెక్షన్లు రూ.3.89 కోట్లతో ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ కోసం 9 సబ్స్టేషన్లలో పీటీఆర్ స్థాయిని పెంచడానికి రూ.5.35 కోట్ల నిధులు మంజూరు చేయగా, 7 సబ్స్టేషన్లలో రూ.4.45 కోట్ల పనులు పూర్తికాగా మిగిలిన 2 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. వృద్ధులకు ఆసరా పింఛన్లను పెంచి పంపిణీ చేస్తుండటంతో పేదలు ఆనందంగా జీవనం గడుపుతున్నారని, వీరితో పాటు దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులకు, ఎయిడ్స్ బాధితులకు కూడా ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించామని, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నవాబుపేట కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగుతులు నిర్వహించి అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 20,268 లబ్ధిదారులకు రూ.48.03 కోట్లతో ఉచిత ఆపరేషన్లు చేయించామన్నారు. జిల్లాకు 10,549 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాగా వాటిలో 1855 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఐకేపీ మహిళా సంఘాల సభ్యులతో 43 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వాటి ద్వారా 8,625 రైతుల నుంచి 41,948 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 22 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. జిల్లాలో కల్యాణలక్ష్మి ద్వారా 2018–19 సంవత్సరానికి గాను 3,505 లబ్ధిదారులకు రూ.28.94 కోట్లు అందించామని, షాదిముబారక్ పథకం కింద జిల్లాలో 753 లబ్ధిదారులకు రూ.5.75 కోట్లు అందించామన్నారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద 32,263 మంది అర్హులైన వారికి రూ.142.85 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని అందించామని, 163 మత్స్య పారి్ర/æశామిక సహకార సంఘాలను బలోపేతం చేయడానికి 185 ఇరిగేషన్ చెరువులు, రిజర్వాయర్లలో రూ.కోటి 15 లక్షల మేలు రకం చేపల విత్తనాలు అందించామని, చేపల పెట్టుబడి, మార్కెటింగ్ కోసం 2563 ద్విచక్ర వాహనాలు 204 నాలుగు చక్రాల వాహనాలు అర్హులకే అందించామన్నారు. జిల్లాలో 154 మంది పారిశ్రామిక వేత్తలు పలు రకాల పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకోగా 501 మందికి అనుమతులు ఇచ్చామని, జిల్లాలో ఇప్పటివరకు 17,409 మందికి 438 సూక్ష్మ, చిన్న మధ్యతరహా, భారీ పరిశ్రమల కోసం రూ.2924 కోట్ల పెట్టుబడితో ఉపాధి కల్పించడం జరిగిందని వివరించారు. జిల్లాలో 65,374 మంది గర్బిణులను గుర్తించి 29,810 మందికి వారిలో అర్హులైన 25,321 మందికి కేసీఆర్ కిట్ అందించామని తెలిపారు. అప్పన్నపల్లి రిజర్వు ఫారెస్టులో ఏర్పాటుచేసిన మయూరి ఏకో పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.80 లక్షలు ఖర్చుచేశామని, ఈ పార్కు అభివృద్ధి నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.3 కోట్లతో పనులు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వారు చేనేత కార్మికులకు నూలును 40 శాతం రాయితీతో అందించాలనే ఉద్దేశ్యంతో ‘చేనేత మిత్ర’ అనే పథకాన్ని తీసుకరాగా ఇప్పటివరకు ఈ పథకము కింద జిల్లాలో 37 మగ్గాలు రిజిస్టర్ కాబడి సుమారుగా 52 మంది చేనేత కార్మికులకు రూ.2,42,450లు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమచేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. -
సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు రూ.10వేల కోట్లతో శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఐదేళ్లలో బలమైన అడుగులు వేయగలిగామని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హుల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఐదేళ్లలో బలమైన పునాదులు పడ్డాయన్నారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉండేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. గతంలో నెలకొన్న సమస్యల వలయం నుంచి బయటపడడమే కాకుండా.. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడకు వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి.. తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయత్తమవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సృష్టించిన సంపద అంతా సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికన సమస్త ప్రజానీకానికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనలతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. ‘రైతుబంధు’ ఆనందాన్ని నింపింది.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి.. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని, దీంతో రైతుల మోములో ఆనందాన్ని చూడగలుగుతున్నామన్నారు. రైతులకు రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి కింద తొలకరికి ముందే ఏడాదికి ఎకరానికి రూ.8వేల చొప్పున రైతులకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. జిల్లాలో 2,67,202 మంది రైతులకు మొదటి విడతగా.. రూ.257.75కోట్లు అందించినట్లు తెలిపారు. రబీకి సంబంధించి ఇప్పటివరకు 2,47,835 మంది రైతులకు.. రూ.250.53కోట్లు అందించామన్నారు. భూ రికార్డుల నవీకరణలో భాగంగా జిల్లాలో 9.57 లక్షల ఎకరాల భూముల రికార్డులు ఆధునికీకరించారని చెప్పారు. 380 రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా నిర్వహించారని, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా రెండు విడతల్లో 2,71,574 పాస్ పుస్తకాలను రైతులకు అందించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో చాలామంది సన్న, చిన్నకారు రైతులు ఉన్నారని, పేద రైతులు చనిపోతే ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి.. రైతుకు బీమా పట్టా అందిస్తున్నట్లు తెలిపారు. రైతుకు రూ.5లక్షల బీమా కల్పించి.. వారు కోరుకున్న వారినే నామినీలుగా చేర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు వివరించారు. 2,464 ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి.. డబుల్ బెడ్రూం పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాకు 14,560 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటివరకు 6,397 గృహాల పనులు చేపట్టి.. 2,464 గృహాల సముదాయాలను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 750 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక రోడ్ల నిర్మాణం, విస్తరణ కోసం సమగ్ర విధానంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో రూ.43కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు రోడ్లను రెండు వరుసల రహదారులుగా విస్తరింపజేశామన్నారు. అలాగే రెండు వరుసల రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకుగాను.. రూ.165కోట్లు ఖర్చు చేశామని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.213కోట్లతో 58 పనులు చేపట్టామన్నారు. జిల్లాలో రూ.120కోట్లతో 17 వంతెనలు, చెక్‌డ్యాంలు, రూ.77కోట్లతో ధంసలాపురం వంతెన పనులు పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. సీఆర్ఎఫ్, ఎస్సీఎస్డీఎఫ్, ఎస్టీఎస్డీఎఫ్కు సంబంధించిన పనుల్లో భాగంగా జిల్లాలో రూ.438కోట్లతో 127 పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అధునాతన వైద్య సేవలు.. ప్రజలకు ఆధునిక పరిజ్ఞానంతో అధునాతనమైన వైద్య విధానంతో మెరుగైన వైద్య సేవలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆస్పత్రుల్లో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రతకుగాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి మన జిల్లా పెద్దాస్పత్రికి రెండుసార్లు కాయకల్ప అవార్డు లభించిన విషయం అందరికీ తెలుసన్నారు. మహిళ గర్భవతి అయినప్పటి నుంచి ప్రసవం జరిగి.. తల్లీ–బిడ్డను ఇంటికి చేర్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల ద్వారా ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 8,863 కేసీఆర్ కిట్లను అందించినట్లు వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో నూతన ఒరవడిని సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇంగ్లిష్ మాధ్యమంలో నాణ్యమైన బోధనతోపాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా 2019 మార్చి వార్షిక పరీక్షల్లో 92.43 శాతం ఫలితాలను సాధించినట్లు గుర్తు చేశారు. వయోజన విద్యలో భాగంగా జిల్లాలో 15 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న 2వేల మందిని నిరక్షరాస్యులుగా గుర్తించి.. వీరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రగతి.. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్య ప్రగతి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.29కోట్లతో 13 (33/11కేవీ) సబ్స్టేషన్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.17.58కోట్లు విడుదల చేశామన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి కోసం రూ.125లకే విద్యుత్ కనెక్షన్లు అందించామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. 2018–19లో రూ.137కోట్లతో 71 నూతన పరిశ్రమలను స్థాపించామని, తద్వారా 1,235 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 332 గొర్రెల పెంపకం సహకార సంఘాలను ఏర్పాటు చేసి.. 34,258 మంది సభ్యులను నమోదు చేశారని తెలిపారు. ఇప్పటివరకు 15,357 మంది లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై రూ.143.97కోట్లతో గొర్రెల యూనిట్లను అందించినట్లు తెలిపారు. వీటితోపాటు ఉద్యానవన,, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చి.. పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక ఖమ్మం నగర ప్రజల అవసరాలకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, 2017–18లో నగరంలో దాదాపు రూ.17.65కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో రూ.101.44కోట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. నగరంలోని లకారం చెరువును రూ.4కోట్లతో సుందరంగా తీర్చిదిద్ది.. ప్రజలకు ఆహ్లాద వాతావరణం కలిగించే ప్రాంతంగా మార్చామన్నారు. రూ.56కోట్లతో గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. తొలుత నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి, బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఖమ్మం, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, నగర పాలక సంస్థ మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జేసీ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్లు హన్మంతు కొడింబా, ఆదర్శ్ సురభి, జెడ్పీ సీఈఓ ప్రియాంక, కార్పొరేషన్ కమిషనర్ జె.శ్రీనివాసరావు, డీఆర్వో శిరీష, కలెక్టరేట్ ఏఓ మదన్‌గోపాల్, డీఆర్డీఓ బి.ఇందుమతి, ఖమ్మం రూరల్ తహసీల్దార్ అశోక్ చక్రవర్తి, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ పోరాటయోధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
స్వపరిపాలనలో పునాది పడిన రోజు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంసం దర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయజెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు పూ లతో నివాళులర్పించారు. ‘60 ఏళ్ల తెలం గాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు, స్వపరిపాలనలో బంగారుతెలంగాణకు పునాది పడిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులందరూ పునరంకితం కావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం హైకోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలవద్దకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రయ్య, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందడుగు వేయాలి: గట్టు హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ముందడుగువేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, కొండా రాఘవరెడ్డి, బి.సంజీవరావు, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో .. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్నట్లు కాకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తుండడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్యనేతలు కె. దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం శాసనసభ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతోందని, కుటుంబ కబంద హస్తాల్లో, అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఒత్తిడితో నిర్వహించడం లేదని ఆరోపించారు. డీజీపీ కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ సుమతి, డీఎస్పీ వేణుగోపాల్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వర్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ దశ, దిశ మార్చే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి వచ్చే నెలాఖరు నాటికి నిత్యం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ద్వారా నీటిని ఎత్తిపోస్తామని, వచ్చే ఏడాది నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసేందుకు వీలుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండేందుకు చాలినంత సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోందన్నారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు దాకా నీళ్లను ఎత్తిపోసే ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు నీటిపారుదలశాఖ సన్నద్ధంగా ఉందన్నారు. భూగర్భాన్ని తొలచి నిర్మించిన సొరంగాల గుండా ప్రవహించే గోదావరి జలాలు తెలంగాణ పొలాలను తడుపుతుంటే రైతుల బతుకులు బాగుపడే రోజు దగ్గరలోనే ఉందని కేసీఆర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఎన్నికల్లో విజయం తర్వాత ప్రణాళికాబద్ధ పనితీరు వల్ల ఎన్నో విజయాలు సాధించామని, వాటిని గమనించి రెండో ఎన్నికల్లో మరింత అద్భుత విజయాన్ని ప్రజలు అందించారని, వారి ఆశలకు తగ్గట్టుగా పనిచేసి తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకు పనిచేస్తామని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాలు ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అమరవీరుల స్థూపం ముందు నివాళులర్పించిన అనంతరం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, పురోగతి, భవిష్యత్తు తెలంగాణ వంటి అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... ప్రగతి బాటలో దూసుకెళ్తున్నాం... రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు ఐదేళ్ల క్రితం తెలంగాణ వారికి పాలించుకోవటం తెలియదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకటి తెలంగాణగా మారుతుందని, అసలు ఒక రాష్ట్రంగా ఉండలేదు, మళ్లీ ఆంధ్రతో కలవాల్సిందేనని జోకులు వేసుకున్నారు. కానీ వారి అపనమ్మకాలను తిప్పికొడుతూ ఎక్కడా చిన్న తొట్రుపాటు, తడబాటు లేకుండా అద్భుత పురోగతి దిశలో వేగంగా దూసుకుపోతోందని నిరూపితమైంది. ఈ అద్భుత ప్రగతి తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి, పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమష్టి విజయం. ప్రజల దీవెనలే అండ... రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే నూతన రాష్ట్రాన్ని ప్రగతి దారుల్లో నడిపిస్తారని తెలంగాణ ప్రజలు నమ్మి మాకు అధికారం కట్టబెట్టారు. దాన్ని మేం నిజం చేసి చూపుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం... ఈ రెంటికి సమ ప్రాధాన్యం ఇస్తూ పునర్నిర్మాణానికి నడుం బిగించాం. మా పనితీరు మెచ్చి ప్రజలు వారి హృదయంలో మాకెంతటి స్థానం ఇచ్చారో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా... అన్నింటా విజయాన్ని కట్టబెడుతూ మాకు తిరుగులేని బలాన్ని అందిస్తున్నారు. ప్రజల దీవెనలే కొండంత అండగా భావిస్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నాం. తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం కేసీఆర్ బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ... తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు, సమర్థవంతమైన ఆర్థిక విధానాలు, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా చేయడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా, పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకుంది. మన రాష్ట్రం గత ఐదేళ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వృద్ధిరేటు సాధించింది. ఈ ధోరణి ఇదే విధంగా కొనసాగి భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం మరిన్ని రెట్లు పెరిగే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. రాష్ట అభివృద్ధిని విçస్తృతం చేసేందుకు ఇది సానుకూల పరిణామం. విద్యుత్ సమస్యను సంపూర్ణంగా అధిగమించాం... అర్ధ శతాబ్దంగా తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక జటిల సమస్యలకు ఈ ఐదేళ్లలో శాశ్వత పరిష్కరాలను చూపగలిగాం. అతితక్కువ కాలంలో కరెంటు సమస్యను సంపూర్ణంగా అధిగమించినం. విద్యుత్ వ్యవస్థను అధ్వాన స్థితి నుంచి అద్భుతం అనే స్థాయికి తీసుకురాగలిగినం. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయ నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇది ఇటు వ్యవసాయం, అటు పరిశ్రమలకు నూతనోత్తేజాన్ని కలిగించింది. ఎండాకాలంలో తాగునీటి కష్టాలను మిషన్ భగీరథ దూరం చేసింది. ఇప్పటికే 97 శాతం పనులు పూర్తి చేసుకున్న గ్రామీణ మిషన్ భగీరథ పనులు జూలై చివరి నాటికి వంద శాతం పూర్తవుతాయి. పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయబోతున్నాం. నిరుపేద వర్గాలకు చేయూత... నిరుపేద వర్గాలకు నిజమైన చేయూత అందించడమే ప్రథమ ప్రాధాన్యతగా నిర్ణయించుకొని ఆసరా పింఛన్లను పెంచి అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆసరాగా నిలుస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన వెంటనే రూ. 200 నుంచి రూ. వెయ్యికి పెంచిన పింఛన్లను మళ్లీ ఇప్పుడు పెంచి అందించనున్నాం. రూ. వెయ్యిగా ఉన్న పింఛన్లను రూ. 2,016కు, వికలాంగుల పింఛన్‌ను రూ. 1,500 నుంచి రూ. 3,016కు, వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్నాం. కొత్తగా మరో 6–7 లక్షల మందికి లబ్ధి చేకూర్చబోతున్నాం. కొత్త పింఛన్లు జూలై 1 నుంచి అందుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అడుగులు... గ్రామీణ జీవితంలో మెరుగైన మార్పులు రావాలని ఆశించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేయగలిగాం. శిథిలమైన చెరువులను పునరుజ్జీవింపచేసేందుకు ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిచ్చింది. గొర్రెల పంపిణీ, చేపల పెంపకం విస్తరణ వాటిపై ఆధారపడ్డ ప్రజల జీవన స్థితిగతులు పెంచేందుకు బాగా దోహదపడ్డాయి. బతుకమ్మ చీరల తయారీని చేనేత కార్మికులకు అప్పగించి వారికి నిరంతరం పని దొరికేలా చేశాం. ఆలయాల అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే వేతనాలు అందేలా ఏర్పాటు చేశాం. అట్టడుగు వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందేలా నూతనంగా 608 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశాం. అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను అందించాం. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి తెలంగాణ ఆరోగ్య సూచిక (హెల్త్ ప్రొఫైల్) రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆకుపచ్చ తెలంగాణ దిశగా వేగంగా అడుగులు... ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తుండటంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. కోటికి పైచిలుకు ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు గోదావరి, కృష్ణా నదులపై ఏకకాలంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నాం. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతోపాటు నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలను పచ్చగా మార్చే దిశగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటున్నాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మొత్తం, మహబూబాబాద్ జిల్లాలో కొంత భాగానికి పుష్కలంగా> సాగునీరు లభించే విధంగా సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ధప్రాతిపదికన సిద్ధమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీర్చేందుకు వీలుగా దేవాదుల ప్రాజెక్టు స్థాయిని మరింత పెంచి నిర్మించుకుంటున్నాం. ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత తెలంగాణలో ఏటా రెండు పంటలు పండి, ధాన్యపు రాశులతో రాష్ట్రం అన్నపూర్ణగా అవతరిస్తుంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో జెండా వందనం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి మరోసారి రూ. లక్ష రుణమాఫీ... రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఊరటనివ్వగలిగాం. ఇప్పుడు మరోసారి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయబోతున్నాం. ఎరువులు, విత్తనాల కోసం గతంలో మాదిరిగా రైతులు అగచాట్ల పాలుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సకాలంలో అందించగలుగుతున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతాంగంలో కొత్త ఆశల్ని కల్పించగలిగాం. రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరానికి ఏటా రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచి ఈ సంవత్సరం నుంచే అందించనున్నాం. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే, అతని కుటుంబం అనాథగా మారకూడదని ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. బీమా ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా మొత్తాన్ని సత్వరమే అందిస్తోంది. త్వరలో క్రాప్ కాలనీలు... వ్యవసాయ కేంద్రిత పథకాల వల్ల పంటలు బాగా పండి భవిష్యత్తులో దిగుబడి పెరిగి కొత్త సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఆ పంటలకు మంచి ధర వచ్చేలా అవసరమైన సమగ్ర విధాన రూపకల్పన చేపట్టాం. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల డిమాండ్ తగ్గి గిట్టుబాటు ధర రాకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేలల రకాలు, వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలు వేయించి వాటిని నియంత్రిత పద్ధతిలో మార్కెట్‌కు తరలించేలా సంస్కరణలు తీసుకురాబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి రైతాంగానికి గిట్టుబాట ధర లభించేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి గ్రామానికీ రూ. 8 లక్షలు... స్థానిక సంస్థల పనితీరును పునర్నిర్వచిస్తూ నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసిన ఫలితంగా ఊళ్ల తీరు మారనుంది. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1,229 కోట్లు కేటాయించింది. దానికి సమాన స్థాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించనున్నందున గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు ఏటా రూ. 2,458 కోట్ల నిధులు అందుతాయి. 500 జనాభాగల చిన్న గ్రామ పంచాయతీకి కూడా ఏటా రూ. 8 లక్షల నిధులు అంది వాటి రూపురేఖలే మారిపోతాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే ప్రజాప్రతినిధులు, అధికారులు విధి నిర్వహణలో విఫలమైతే ఈ చట్టం ఉపేక్షించదు, కఠిన శిక్షలు విధిస్తుంది. పదవుల నుంచి తొలగిస్తుంది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు పరచడం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రతకు, పచ్చదనానికి పట్టుగొమ్మలుగా మారి కళకళలాడేలా చేయాలన్నది ప్రభుత్వ ఆశయం. నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏటా సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదిక అవుతుండగా ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో ఈసారి వేదికను నాంపల్లికి మార్చారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసు కవాతు, విద్యార్థులతో కార్యక్రమాలు లేకుండా ఉదయాన్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తంమీద ఈసారి ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి దాదాపు 750 మంది రైతు సమన్వయ కమిటీ సభ్యులు, చైర్మన్లు హాజరయ్యారు. అయితే వేడుకను చూసేందుకు ప్రజలు పబ్లిక్ గార్డెన్‌కు వచ్చినప్పటికీ పాస్‌లు ఉన్న వారినే పోలీసులు లోనికి అనుమతించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మడిపల్లి దక్షిణామూర్తి వ్యవహరించారు. -
వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రావరతరణ వేడుకలు
-
తెలంగాణ భవన్లో రాష్ట్రావరతరణ వేడుకలు
-
అప్పులకు తగిన అభివృద్ధి జరగలేదు
సాక్షి, హైదరాబాద్ : స్వరాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్లలో రూ.2.60 లక్షల కోట్లు అప్పు అయిందని, అందుకు తగిన అభివృద్ధి మాత్రం జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఎడాపెడా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడంలో మాత్రం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ఐదో ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ చలువ, కాంగ్రెస్ ఎంపీల పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. గత 60 ఏళ్లలో రాష్ట్రానికి రూ.69 వేల కోట్ల అప్పు అయితే, తెలంగాణ ఏర్పడిన ఐదేళ్లలో అది రూ.2.60 లక్షల కోట్లకు చేరిందన్నారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టం లోని హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు రూపొందించలేదన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలు గమనించినందునే లోక్‌సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు. -
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
సాక్షి, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
తెలంగాణ ప్రజల ఆశ ఆవిరైంది!
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆశ ఆవిరైపోయిందని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు అవుతున్నా.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కే లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లు ఇంద్ర సేనరెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజాం తరహా నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ కుటుంబ కబంధహస్తాల నుంచి తెలంగాణను కాపాడేందుకు బీజేపీ మరో పోరాటానికి సిద్ధమవుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల కోట్లపైనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలని వమ్ము చేసిందని, ఇంటికో ఉద్యోగం అన్నారు ఏ ఇంటికి ఉద్యోగం రాలేదని, కానీ కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని, ఇంటర్ పరీక్షల ఫలితాలో తప్పిదాల వల్ల 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేసిందన్నారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం
-
వాళ్లు అవాక్కవుతున్నారు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : గడిచిన ఐదేళ్లలో ఎన్నో అవరోధాలను అధిగమించామని, ఎన్నో విజయాలు సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణపై జోకులు వేసిన వారు అవాక్కవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం పబ్లిక్ గార్డన్స్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలు టీఆర్ఎస్కు పట్టం గడుతున్నారని అన్నారు. తెలంగాణ బలమైన ఆర్ధిక శక్తిగా మారిందని, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. మంచినీటి సమస్య తీర్చుకున్నామని, మిషన్ భగీరథ ప్రజల బాధలను తీర్చిందని తెలిపారు. మిషన్ భగీరథ పనులు 97 శాతం పూర్తి అయ్యాయన్నారు. పేదలకు కనీస భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వృధ్యాప్య పింఛన్ రూ. 2016కి పెంచామని, వికలాంగులకు పింఛన్ రూ.3016కి పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన ఆసరా ఫించన్లు జులై ఒకటో తేదీన అందుతాయని వెల్లడించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు పురోగతి సాధించాయన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. కంటి వెలుగు పథకం చాలా మందికి వెలుగునిచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
-
వడివడిగా ప్రాజెక్టులు
ఈ ఏడాది సాగులోకి మరో 12 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచీ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఐదేళ్ల కాలంలో 10 ప్రాజెక్టులను పూర్తి చేయగా మరో 13 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణగా మారుస్తామన్న ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని 1.25 కోట్ల ఎకరాల మాగాణంగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు, పథకాల కింద 70.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 2004లో మొదలైన జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలతో ప్రభుత్వం ఇప్పటివరకు 16.65 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చింది. ఇందులో రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం విశేషం. ప్రధానంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, దేవాదుల, సింగూరు వంటి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కిందే 10.94 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 54.05 లక్షల ఎకరాలను వృధ్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది ఖరీఫ్ నాటికి కనిష్టంగా దాదాపు 12 లక్షల ఎకరాలకైనా కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్లలో రూ. 81 వేల కోట్లు... రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 80వేల కోట్ల మేర సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 23 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ. 30,588 కోట్లు ఖర్చు చేసింది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. 18 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయగా వాటి ద్వారా మరో రూ. 5 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. మొత్తంగా కార్పొరేషన్ రుణాల ద్వారా ఇంతవరకు రూ. 33,664 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్ కిందే మొత్తంగా రూ. 28,661 కోట్ల మేర ఖర్చు జరిగింది. మొదలుకానున్న కాళేశ్వర శకం... రాష్ట్ర సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల శకం మొదలు కానుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటిని పంట పొలాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది జూలై చివరి నుంచి కాళేశ్వరం ద్వారా కనీసం 150 టీఎంసీల నుంచి గరిష్టంగా 200 టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు పూర్తవగా పంప్‌హౌస్‌లలో ఈ నెల మొదటి లేదా రెండో వారం నుంచి డ్రై రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో ఇప్పటికే 4 మోటార్ల డ్రై రన్ పూర్తయింది. ప్యాకేజీ–7లో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–8లో మోటార్లన్నీ సిద్ధమయ్యాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు జరగకున్నా ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే పనులు చివరికొచ్చాయి. మొత్తంగా ఈ ఖరీఫ్‌లోనే 10 లక్షల ఎకరాల స్థిరీకరణ, మరో 90 వేల ఎకరాల మేర కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు చేస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ సక్సెస్.. ఇక చెక్‌డ్యామ్‌లపై దృష్టి తెలంగాణ తొలి ప్రభుత్వం చిన్న నీటివనరుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. నాలుగు విడతల్లో 26,926 చెరువులను పునరుద్ధరించింది. ఇందుకోసం రూ. 3,979.53 కోట్లు ఖర్చు చేసింది. ఈ పనులతో 8.53 టీఎంసీల నీటి నిల్వ పెరగడంతోపాటు 13.57 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇక ఇప్పుడు ఎక్కడి నీటిని అక్కడే కట్టడి చేసేలా గొలుసుకట్టు చెరువుల వద్ద చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సర్కారు సిద్ధమైంది. మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు, 3 వేల తూముల నిర్మాణం చేయాలని భావిస్తోంది. తూముల నిర్మాణం ద్వారా 8,350 చెరువులను నింపేలా పనులు మొదలుపెట్టింది. ఇందుకోసం రూ. 4,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే తూముల టెండర్ల పనులు మొదలవగా చెక్‌డ్యామ్‌లకు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నిర్జీవంగా మారిన భూములన్నీ ఇప్పుడు నిండు సత్తువను సంతరించుకుంటున్నాయి. నీటి జాడ లేక వట్టిపోయిన చెరువులన్నీ నేడు నీటితో కళకళలాడుతున్నాయి. పడావు భూములు కాస్తా పచ్చని పంట పొలాలుగా మారుతున్నాయి. అరవై ఏళ్లుగా సాగునీటి కోసం పడ్డ అరిగోస.. ఐదేళ్ల కాలంలోనే కోటి ఎకరాల మాగాణం దిశగా వడివడిగా పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంలో ఇప్పటికే 71 లక్షల ఎకరాల మార్కును దాటింది. తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్న ఐదేళ్ల కాలంలోనే ఏకంగా కొత్తగా 12.77 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా మరో 14.78 లక్షల ఎకరాల స్థిరీకరణ పూర్తయింది. ప్రాజెక్టులపై మొత్తంగా 2004 నుంచి ఇప్పటివరకు రూ. 1.11 లక్షల కోట్ల మేర ఖర్చవగా గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ. 81 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. నాలుగేళ్లలో మరో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కోటి ఎకరాల మాగాణ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. – సాక్షి, హైదరాబాద్ -
తెలంగాణా ప్రజలకు సీఎం రాష్ట్రావతరణ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్, 6వ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఐదు ప్రగతి వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, ఉత్సాహపూరిత వాతావరణంలో ఆరో వసంతంలోకి అడుగుపెడుతోందని అన్నారు. అపూర్వ మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం అయినా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. అత్యంత కీలకమైన తొలి ఐదు సంవత్సరాల కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన, సరైన అడుగులు పడ్డాయని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తోన్న ప్రయత్నాలలో ప్రజలు భాగస్వాములు కావాలని అభిలషించారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన అమరవీరులకు హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు వెల్లడించారు. -
ఖతర్‌లో 7న.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
గల్ఫ్ డెస్క్ : ఖతార్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జూన్ 7న తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో పాటు ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలలో రాష్ట్ర ఉత్తమ జానపద అవార్డు గ్రహీత రేలారే రేలా ఫేం గంగ పాల్గొననున్నారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ అశోకా హాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలనుకునే ఖతార్‌లోని తెలంగాణ వాసులు ఎంట్రీ పాసుల కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు. దోహా: 33625731, 70691202, 55883866, 66517476, వక్రా: 33473690, 30201243, సాన్యా: 70926360, 66732459, 70024431, లేబర్సిటీ: 55756964, 33241860, సాల్వా రిసార్ట్: 50370906. -
నగరం జిగేల్
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు నగరం సిద్ధమైంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని వారసత్వ భవనాలు, ముఖ్య కూడళ్లు, ఫ్లై ఓవర్లు, పార్కులు, జాతీయ నేతల విగ్రహాలు, సెంట్రల్ మీడియన్లను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. గన్‌పార్క్, దాని పరిసర ప్రాంతాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 191 ప్రదేశాల్లో విద్యుత్ దీప కాంతులకు దాదాపు రూ.1.32 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలను కూడా అలంకరించనున్నారు. వివిధ జంక్షన్లలో 400 వాట్స్ 217 కలర్ లైట్లు, వెయ్యి వాట్స్ 204 హాలోజెన్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు 38/ 64/120 వాట్స్ 3,207 ఎల్ఈడీ పార్‌క్యాన్స్‌తో ప్రత్యేక రంగులు ప్రసరింపచేయనున్నారు. పార్ క్యాన్స్‌ను పార్కులు, ట్రాఫిక్ ఐలాండ్లు తదితర ప్రాంతాల్లో మొక్కల దిగువన ఏర్పాటు చేయడంతో రంగుల వెలుతురు పైకి ప్రసరించి ప్రత్యేకంగా కనిపిస్తుందని జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుమాధవ్ తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి 3వ తేదీ వరకు దీపకాంతులతో నగరం ప్రత్యేకంగా కనిపించనుంది. బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో.. బయో డైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో గన్‌పార్కులో పూలతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ఈ సీజన్లో లభించే బంతి, వింకారోజియా, కాశ్మీర్ రోజెస్‌తో అమరవీరుల స్తూపాన్ని తీర్చిదిద్దనున్నట్లు బయోడైవర్సిటీ విభాగం అడిషనల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. -
మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవానికి ముందే విస్తరణ జరపాలని టీఆర్ఎస్ ఇన్నాళ్లూ భావించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పార్టీ ఆశించిన స్థాయిలో లభించని నేపథ్యంలో దీనిపై పునరాలోచించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను జూన్ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు టీఆర్ఎస్ కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? సంస్థాగత ఎన్నికల తర్వాత జరుగుతుందా అనే చర్చ మొదలైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా ల్లో నిర్వహించే కార్యక్రమాల కోసం మంత్రివర్గ విస్తరణతోపాటు మిగిలిన ప్రభుత్వ పదవులను భర్తీ చేస్తారని ఆశావహులు భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ మదిలో ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. విస్తరణపై టీఆర్ఎస్ అధిష్టానం వద్ద మాత్రం ఇప్పుడు ఎలాంటి చర్చ జరగడంలేదు. కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాల ఆమోదం కోసం ఈ నెలాఖరులోగానీ లేదా జూన్ మొదటి వారంలోగానీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోపే విస్తరణ ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కాకుండా 17 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌తోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించాల్సి ఉంది. త్వరలో జరపనున్న విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ విస్తరణ మాత్రమే ఉంటుం దా? ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో మార్పులు ఉంటాయా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు మం త్రుల సొంత సెగ్మెంట్లలో ప్రత్యర్థి పార్టీలకు ఆధిక్యం వచ్చింది. దేవాదాయశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ సెగ్మెంట్లో బీజేపీకి 14,555 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానం లో నిలిచింది. టీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. రవాణా మంత్రి ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గం సొంత సెగ్మెంట్ బాల్కొండలో బీజేపీకి 11,562 ఓట్ల మెజారిటీ వచ్చింది. పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (సికింద్రాబాద్) సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి 14,832 ఓట్ల మెజారిటీ దక్కింది. ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్‌లో బీజేపీకి 4,555 ఓట్ల మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో మంత్రులుగా ఉంటూ సొంత నియోజకవర్గాల్లో పట్టు దక్కించుకోలేని ఈ నలుగురి విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచన చేసే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల్లో మరొకరికి కీలకమైన పదవులు ఇవ్వడమా లేదా వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించడమా అనే విషయంలో టీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటే ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. మరో ఆరుగురు... మంత్రివర్గ విస్తరణకు మాత్రమే పరిమితమైతే మరో ఆరుగురికి పదవులు దక్కనున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈసారి పదవి ఖాయం కానుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరూ మంత్రులుగా లేరు. టీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్‌రావుకు విస్తరణలో అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ ఇతర పార్టీల నుంచి చేరిన వారిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎస్టీలు, మహిళలు మంత్రివర్గంలో లేరు. ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పట్లోళ్ల సబితారెడ్డిలలో ఒకరికి మంత్రిగా అవకాశం వస్తుందని తెలు స్తోంది. ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. ఈ కోటాలో సండ్ర వెంకట వీరయ్య, అరూరి రమేశ్‌లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండనుంది. -
అవతరణ వేడుక ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: జూన్ 2వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక ఏర్పాట్లను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం పరిశీలించారు. పబ్లిక్ గార్డెన్‌లోని సెంట్రల్ పార్కులో జరుగుతున్న పచ్చిక పనులు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కుకు ప్రతిరోజూ సుమారు 15వేల నుంచి 20వేల మంది మార్నింగ్ వాక్కు వస్తున్నారని, మరో 6వేల మంది సందర్శకులు వస్తున్నట్లు అధికారులు వివరించారు. పబ్లిక్ గార్డెన్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పచ్చదనం పెంచేందుకు ఉద్యానవన శాఖ చేస్తున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిజాం హయాంలో నిర్మించిన ముఖద్వారం సుందరీకరణ, పోకిరీలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు తదితరాలను పరిశీలించారు. పార్కు సందర్శకులపై నియంత్రణ, ఇతర పనుల కోసం నిధులు తదితరాల కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను పార్థసారథి ఆదేశించారు. ఉద్యానవన శాఖ సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి, ఇతర అధికారులు అవతరణ దినోత్సవ వేడుకలను పరిశీలించారు. -
‘హరీష్ వ్యాఖ్యలు డ్రామాలో భాగమే’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాం గ్రెస్ పాత్ర లేదని అంటే టీఆర్ఎస్ నేతలు పురుగులు పడి చస్తారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. వినోద్ అనే పేరు పెట్టుకుని విజ్ఞత లేకుండా, సొల్లు కబుర్లు చెపుతున్న ఎంపీ వినోద్‌కుమార్‌కు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎంపీల పాత్ర గురించి చర్చించేందుకు ముందుకు రావాలని సవాల్ చేశారు. స్థలం, సమయం చెబితే చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆకాం క్ష, అమరవీరు ల త్యాగాలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని సోనియా 2009లో భువనగిరి సభలో చెప్పిన మేరకే తెలంగాణను ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు రాజకీయంగా బొందపెట్టబోతున్నారన్నారు. పాతరోజులు మరిచిపోయారు తెలంగాణ పేరుతో ఆజాద్, జైరాం రమేశ్‌ల ఇళ్ల చుట్టూ టీఆర్ఎస్ నేతలు తిరిగిన పాతరోజుల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని మధుయాష్కీ అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కేటీఆర్, కవిత తన ఇంటికి వచ్చి బతిమిలాడారని గుర్తుచేశారు. ఎంపీ వినోద్, తన తమ్ముడు, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌ల ఆస్తులు 2001లో ఎంతో, ఇప్పుడు ఎంతో తెలిస్తేనే వీళ్లు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అర్థమవుతుందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాననే హరీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అది మామాఅల్లుళ్ల డ్రామా అని యాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతిని బయటపెట్టి జైల్లో పెడుతుందనే భయంతోనే కూడగట్టుకుంది తీసుకుని వెళ్లిపోదామని హరీశ్ అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. -
కొలంబస్లో తెలంగాణ సంబరాలు
వాషింగ్టన్ : కొలంబస్ నగరానికి చెందిన కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ఆధ్వర్యములో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అనంతరం ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆటలు , బోనాల నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. నేతన్నలు తయారుచేసిన కాటన్ దుస్తువులతో చేసిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. ఈ సంబరాలలో ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్ , సింగర్ కౌసల్య , మిమిక్రి రమేష్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. CTA అధ్యక్షుడు మనోజ్ పోకల మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి లో NRI లు భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు , కళలు సాకారం కావడానికి NRIలు ముఖ్య భూమిక పోషించాలని కోరారు. డబ్లిన్ మేయర్ స్టువర్ట్ హారిస్, వరంగల్ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. రాజేశ్వర్ రావు గారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సాధించడంలో NRI ముఖ్యమైన పాత్రా పోషించారని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదని కొనియాడారు. ఈ కార్యక్రమములో మనోజ్ పోకల , శ్రీధర్ బిల్లకంటి, అమర్ మూలమళ్ళ ,అశోక్ ఇల్లందుల , శ్రీకాంత్ గడ్డం, అనిల్ వాది, సజిత్ దేశినేని , శ్రవణ్ చిదురుప్పా , శ్రీనివాస్ సలాన్ద్రి , అనిల్ దండపనేని ,బాల లబ్బిశెట్టి , శ్రీనివాస్ కొంపల్లి, రమేష్ మధు వెంకట్ తాళ్లపల్లి , శ్రీనివాస్ ఆకుల రామకృష్ణ ,విక్రమ్ ,శ్రావణి , మహేష్ పోకల , వేణు కంజర్ల రోహిత్, కమల్ , రజినీకాంత్ ,వంశీ , రాధాకృష్ణ ,భాస్కర్, ,వేణు పాల్గొన్నారు. -
చికాగోలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
చికాగో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చికాగోలోని సౌత్ బారింగ్టన్లోని అమెరికా తెలంగాణ సంస్థ (ఆటా) ఆధ్వర్యంలో ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను ఈ సంస్థ ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి లెంకల స్వాగత చిరునామాతో ఆరంభించగా, సత్య నారాయణ కండిమల్ల, కరుణాకర్ మాధవరం, శ్రీనివాస్ రెడ్డి చాడ, నరేందర్ రెడ్డి చిమర్ల, కళ్యాణ్ ఆనందుల, శ్రీనివాస రెడ్డి గజ్జి జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్నారి శ్లోక అనందుల గణేష్ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అర్పించిన అమరులకు నివాళిగా నిశ్శబ్దం పాటించారు. అమెరికా తెలంగాణ సంస్థ అధ్యక్షుడు సత్య కందిమళ్ల.. వేడుకకు హాజరైన అథితులకు మరియు తెలంగాణ వాసులకు రాష్ట్ర ఆవిర్భావ శుభకాంక్షలు తెలిపారు. ఈ నెల 29, 30, జూలై 1 న హూస్టన్‌లో మహా నగరములోజరుపుకొంటున్న 2వ ప్రపంచ తెలంగాణ సమావేశానికి హాజరు కావాలని కోరారు. చైర్మన్ కరుణాకర్ మాట్లాడుతూ.. సంస్థ ఆవిర్భావ ప్రాముఖ్యత , రాష్ట్ర ఆవిర్భావానికి సంస్థ పాలుపంచుకున్న పలు కార్యక్రమాలు, రాష్ట్ర ఆవిర్భావం తరువాత బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యముతో సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాలను, తెలంగాణ ప్రవాసీ విధి విధానాలు, విద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ప్రత్యేక సలహా కమిటీ సభ్యులు కళ్యాణ్ ఆనందుల, శ్రీనివాస్ చాడ, నరేందర్ చీమర్లా ప్రసంగిస్తూ... ప్రపంచ తెలంగాణ మహాసభల ద్వారా మన సంస్క్రతి, కట్టుబాట్లను, మన కళ, భాషా మన భావి తరాలకు అందిస్తున్నామ్మని, ఈ 2వ ప్రపంచ తెలంగాణ సమావేశాలలో ప్రత్యేక ఆకర్షణీయమైన శ్రీ సీతారామ కళ్యాణం, మన రాష్ట్ర రాజకీయలు మన పాత్ర వేదిక, వాణిజ్య వేదికలు, ఉత్సవ అంగడుల (ఎక్జిబిట్స్) వంటి అంశాల గురించి వివరించారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకులు పార్థు మాని నేతృత్వంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పాటల కచేరి కార్యక్రమం అతిథులను అలరించింది. చివరిగా నరేంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక విభాగాలు, అమెరికా తెలంగాణ సంస్థకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రచార భాగస్వాములకు, హాజరైన అతిథులకు, ఈ కార్యక్రమానికి కష్టపడి పని చేసిన వాలంటీర్లుకి, ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచి, పక్కా ప్రణాళికతో విజయవంతం చేసిన అమెరికా తెలంగాణ సంస్థ ప్రచార కమిటీ చైర్మన్, రామచంద్ర రెడ్డి, ఏడేలకు ధన్యవాదాలు’ అంటూ కార్యక్రమాన్ని ముగించారు. -
కళా కాంతులు... కమ్మని రుచులు
-
కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు
చిగురుమామిడి(హుస్నాబాద్) : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిగురుమామిడిలో సోనియాగాంధీ చిత్రపటానికి కార్యకర్తలతో కలసి క్షీరాభిషేకం చేశారు. ఈ పథకాలు, ఆ పథకాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నేటికి నెరవేరలేదని, మళ్లీ కొత్త వాగ్దానాలతో రైతులు, ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. రైతుబంధు పథకం ఉన్నవాడికే లాభదాయకమన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేం లేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు తప్పనిసరిగా 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వంగర మల్లేశం, డీసీసీ కార్యదర్శి చిటుమల్ల రవీందర్, ఎస్సీ, ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ బోయిని సురేశ్, మాజీ దేవస్థానం చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాబుమియా, నాయకులు కాటం సంపత్‌రెడ్డి, గజ్జేల రాములు, కూతురు మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పచ్చిమట్ల లక్ష్మి, గాజుల అంజారెడ్డి, పోటు మల్లారెడ్డి పాల్గొన్నారు.