Top Stories
ప్రధాన వార్తలు

DGMO press briefing LIVE: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ప్రారంభమైంది. ఉగ్రవాదులతోనే మా పోరాటంమనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాంఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందిఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోందిఅందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాంఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్దేవివిధ రకాల ఎయిర్ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాంపాక్ వివిధ రాకల డ్రోన్లను వినియోగించిందిమనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాంచైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్ భారత్‌పై దాడి చేసిందివాటిని మనం ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాంపాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసిందిఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైందిసైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసింది ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారులాంగ్ రేంజ్ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం9,10వ తేదీలలో పాకిస్తాన్ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్ చేసిందిపాకిస్తాన్కు సాధ్యం కాలేదుమనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాంమల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైందిఓ వైపు పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాంఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయిదేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు

ఆపరేషన్ సిందూర్‌పై డీజీఎంవోల వివరాల వెల్లడి
DGMO Meeting Updatesఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ఉగ్రవాదులతోనే మా పోరాటంమనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాంఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందిఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోందిఅందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాంఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్దేచర్చలు వాయిదా.. భారత్, పాకిస్తాన్ డీజీఎంవోల చర్చలు వాయిదా. ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్‌లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంవోలు చర్చలు జరపనున్నారు. చర్చలు ప్రారంభం..భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు ప్రారంభం,హాట్లైన్లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్ లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు.

రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
అనుకున్నదే జరిగింది.. ఊహాగానాలే నిజమయ్యాయి!.. అవును.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ మేరకు.. ‘‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించనే లేదు.ఈ ఫార్మాట్ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను.వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి.ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.. కానీ ఇందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది. నిజానికి నేను చేసిన దాని కంటే.. ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.టెస్టు కెరీర్ సంతృప్తికరం. నేనెప్పుడు దీని గురించి తలచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివిరిస్తుంది. #269.. ఇక సెలవు’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రంకాగా 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లి.. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో జమైకా వేదికగా టీమిండియా ఆడిన తొలి టెస్టులో క్యాప్ అందుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.చేదు అనుభవం తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో పది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొని 15 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, ఈ చేదు అనుభవం తర్వాత కోహ్లి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.టీమిండియా మేటి టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. కెప్టెన్‌గానూ సంప్రదాయ క్రికెట్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయం అందించాడు.తన కెరీర్లో మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 31 అర్ధ శతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254.రోహిత్‌తో పాటే..కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పిన ఆరు రోజులకే తానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాగా గత కొంతకాలంగా రోహిత్, కోహ్లి టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి చివరగా పెర్త్‌లో ఆస్ట్రేలియా మీద తన టెస్టు సెంచరీ సాధించాడు. ఇక రోహిత్, కోహ్లి వన్డేలలో మాత్రం కొనసాగనున్నారు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!

బిల్డప్ బాబాయ్ బడాయి!
అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తాజాగా మాట్లాడుతూ.. ‘భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అందరూ మాట్లాడుతున్నారు. అసలు యుద్ధం అంటే ఏం తెలుసా?. యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?. యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదు. యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయినా దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తాను. యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారు. తెలివితక్కువ వాళ్ల వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా.. దాన్ని నివారించేందుకే మనం మొగ్గు చూపాలి. ఇప్పుడు చాలామంది పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా.. చర్చలతోనే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటాను. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి పూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి పరిస్థితులు ఉంటాయి. ఇవేవీ మిగతా వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. కొన్నిసార్లు దాడుల కారణంగా పిల్లలు సైతం తీవ్రంగా గాయపడతారు. యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. యుద్ధమంటే ఖరీదైన వ్యాపారం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్‌పై తీవ్రమైన చర్చ జరిగింది.మరోవైపు.. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ ఒప్పందానికి భారత్ ఎందుకు ఒప్పుకుందని అటు ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా భారత్‌కు జరిగిన లాభమేంటి? అని కామెంట్స్ చేశారు.

కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారత టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli Retirement) సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు భారమైన హృదయంతో వెల్లడించాడు.బీసీసీఐ ట్వీట్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోహ్లికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ‘‘టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసిపోయింది.. కానీ వారసత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, టీమిండియాకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. థాంక్యూ విరాట్ కోహ్లి’’ అంటూ కోహ్లి ఫొటోలు పంచుకుంది.దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా?అయితే, బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో చేజార్చుకుంది.రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడాఈ రెండు సిరీస్‌లలోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా విఫలయ్యాడు. పెర్త్‌లో సెంచరీ బాదినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఒకే రీతిలో అవుటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగి.. అక్కడా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిల ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసేంత వరకు మాత్రం జట్టుతో ఉంటారని అంతా భావించారు. అంతలోనే బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు.కాగా రోహిత్‌ను వైదొలగాల్సిందిగా ముందుగానే సెలక్టర్లు కోరగా.. కోహ్లిని మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లి కెప్టెన్సీ చేపట్టాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇందుకు బీసీసీఐ నిరాకరించిందని బోర్డు సన్నిహిత వర్గాలు చెప్పడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారనిమరోవైపు.. కోచ్‌గా గౌతం గంభీర్ విఫలమైనా ఎలాంటి చర్యలు చేపట్టని బీసీసీఐ.. రోహిత్, కోహ్లిలను మాత్రం బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఇద్దరూ.. ముఖ్యంగా టెస్టుల్లో భారత్‌ను అగ్రపథంలో నిలిపిన కోహ్లికి మైదానంలో ఘనంగా వీడ్కోలు పలకాల్సింది పోయి... ఇలా సోషల్ మీడియాలో సాధారణ ఆటగాళ్లలా రిటైర్మెంట్ ప్రకటించే దుస్థితి కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పది వేల పరుగులు చేస్తానంటూఒకవేళ కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే సిడ్నీ టెస్టులోనే వీడ్కోలు ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటికిప్పుడు వీరిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని కనిపిస్తోందంటున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగులు చేస్తానంటూ కోహ్లి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. కాగా కోహ్లి తన టెస్టు కెరీర్లో 9230 పరుగులు చేశాడు. ఈ మైలురాయికి 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!

తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మేడ్చల్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్‌లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్‌స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను. డిస్‌స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇండియన్ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో భారత్ నాలుగు రోజుల పాటు పాక్‌ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత సైన్యం ధ్వంసం చేసింది. అలాగే పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది భారత్. గత శనివారమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేగాదు భారత్ ఉగ్రమూకల్ని మట్టుబెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అలాగే ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో దాయాది దేశానికి తెలిసి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి గస్తీ కాస్తూ.. ఆహర్నిశలు దేశాన్ని రక్షిస్తున్నా మన సైనికులు యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఎదురులేని ధైర్యసాహసాలకు గర్వకారణమైన మన భారత సైనికుల యూనిఫాం..చూడగానే ఎక్కడ లేని దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒక్కసారిగా మన అటెన్షన్ కూడా గౌరవంతో కూడిన బాధ్యతగా వ్యవహరించేలా మారిపోతుంది. అలాటి ఆర్మీ యూనిఫాం వలస పాలన నుంచి ఎలా రూపుదిద్దుకుంటూ..సరికొత్త మార్పులతో వచ్చింది..?. పైగా సైనికులకు సౌకర్యంగా ఉండేలా ఫ్యాబ్రిక్ తీసుకురావడమే గాక ఆ రంగులనే ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటో చూద్దాం..!.75 ఏళ్ల క్రితం..భారతీయ సాయుధ దళాల యూనిఫాంల మూలం వలసరాజ్యాల వారసత్వంగా వచ్చింది. మొదట్లో బ్రిటిష్ సైనిక సంప్రదాయం కొనసాగించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్‌ను తన బలమైన కోటగా మార్చుకున్న తర్వాత దేశాన్ని మూడు ప్రెసిడెన్సీలుగా విభజించింది. అవి బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పుడ మన భారతీయ సైనికులు బ్రిటిష్ సహచరుల మాదిరిగానే పాక్షికంగా ఎరుపు రంగు యూనిఫాంలు ధరించేవారు. అయితే ఈ ఎరుపు రంగు వల్ల యుద్ధభూమిలో చాలా స్పష్టంగా కనిపించేవారు. దాంతో విపరీతమైన ప్రాణనష్టం జరిగేదట. అప్పుడే యూనిఫాంలో మార్పు అవసరం అనేది గుర్తించారట. ఖాకీ ఎప్పుడు వచ్చిందంటే..1848లో, అధికారులు సర్ హ్యారీ బర్నెట్ లమ్స్‌డెన్, విలియం స్టీఫెన్ రైక్స్ హాడ్సన్ భారతదేశంలోని బ్రిటిష్ వలస దళాల కోసం ఖాకీ యూనిఫామ్‌లను ప్రవేశపెట్టారు. ఉర్దూలో దుమ్ము రంగు అని అర్థం వచ్చే "ఖాకీ",రంగు భారతీయ ప్రకృతి దృశ్యంతో బాగా కలిసిపోయింది. పైగా దీని కారణంగా ప్రాణ నష్టం తగ్గిందట కూడా. 1857 భారత తిరుగుబాటు సమయానికి, భారతదేశం అంతటా బ్రిటిష్ దళాలు ఖాకీని విస్తృతంగా స్వీకరించాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలను ప్రభావితం చేసి..క్రమంగా వరల్డ్ ఫీల్డ్ యూనిఫామ్‌ల రంగుగా మారింది.స్వేచ్ఛకు సంకేతంగా మార్పు..1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని కాస్తా ఇండియన్ ఆర్మీగా పేరు మార్చారు. అలాగే పాక్ నుంచి వేరై..దేశభక్తిని సూచించేలా ఆలివ ఆకుపచ్చ రంగుని ఎంచుకుంది.అలాగే బ్రిటిష్ యూనిట్ చిహ్నాలు, ర్యాంక్ బ్యాడ్జ్‌లను తీసేసి జాతీయ చిహ్నాలతో భర్తీ చేశారు. ఇక పాక్ సైన్యం నెలవంకను ఎంచుకుంటే..భారత్ తమ సైన్యం కోసం అశోక చిహ్నాన్ని తీసుకుంది. సైనిక సవాళ్లను అధిగమించడం కోసం..1980లు–1990ల సమయంలో భారత సైన్యం చాలా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుండేది. ముఖ్యంగా ఈశాన్య జమ్యూ కశ్మీర్ వంటి క్లిష్ట భూభాగాలలో సైనికులు యూనిఫాం కనిపంచకుండా ఉండేలా చేయాలసి వచ్చేది. అందుకోసం 1980లలో ఆర్మీ మట్టితో కూడిన ఆకుపచ్చ రంగులను, గోధుమ రంగులను ప్రవేశ పెట్టింది. ఇవి సైనికులను అడవులు, కొండప్రాంతా ప్రకృతి దృశ్యాలలో కలిసిపోయేందు ఉపకరించింది. 2000ల ప్రారంభంలో మరింతగా మార్పులు చేశారు..2000ల ప్రారంభం నాటికి, భారత సైన్యం PC DPM (డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ మెటీరియల్) యూనిఫామ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఫ్రెంచ్ సైన్యంలో ఉపయోగించిన నమూనాల నుంచి ప్రేరణ పొందింది. భారతీయ అవసరాలకు అనుగుణంగా, పిక్సెల్ లాంటి నమూనాతో ఆకర్షణీయమైన లుక్‌తో డిజైన్ చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో సహా సైనికుడు లుక్‌కి ఓ ప్రేరణగా నిలిచింది. అయితే ఇది అడవులు వంటి ఎత్తైన ప్రాంతాలలో బాగా పనిచేసినప్పటికీ..రాజస్థాన్ వంటి ఎడారి రాష్ట్రాల్లో ఇది సరైనది కాదని తేలింది. 2022: యూనిఫాంలో ఒక మైలురాయి మార్పుప్రస్తుతం భారత సైన్యం ధరిస్తున్న యూనిఫాం మార్పు 2022లో జరిగింది. ఆర్మీ దినోత్సవం నాడు భారత సైన్యం తన తాజా డిజిటల్ కామఫ్లాజ్ యూనిఫామ్‌ను ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది. తేలికగా, గాలిని పీల్చుకునేలా త్వరగా ఆరిపోయే కాటన్-పాలిస్టర్ మిశ్రమంతో తీసుకొచ్చింది. ఇది ఆధునిక సైనిక అవసరాలకు అనువగా ఉండటమే గాక అడవుల నుంచి ఎడారుల వరకు అన్ని భారతీయ భూభాగాలను అనుగుణంగా ఏకరీతిలో ఉండేలా డిజైన్ చేశారు.(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..)

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే
మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో గతవారం రిలీజైన సింగిల్, శుభం చిత్రాలే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గర మూవీస్ ఏం లేవు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) ఉన్నంతలో 8 సినిమాలు-సిరీసులు మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజులు ఉండొచ్చు. ఈ వారం చూడదగ్గ వాటిలో మరణమాస్, నెసిప్పయ, భోల్ చుక్ మాఫ్ చిత్రాలు ఉన్నంతలో చూడొచ్చని అనిపిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 12-18 వరకు)నెట్ ఫ్లిక్స్సీ4 సింటా (తమిళ సినిమా) - మే 12హాట్ స్టార్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 13హై జునూన్ (హిందీ సిరీస్) - మే 16వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17అమెజాన్ ప్రైమ్భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) - మే 16సోనీ లివ్మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15సన్ నెక్స్ట్ నెసిప్పయ (తమిళ సినిమా) - మే 16బుక్ మై షో స ల టే స ల న టే (మరాఠీ సినిమా) - మే 13మనోరమ మ్యాక్స్ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) - మే 12(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా)

ఐఫోన్ అంతరించనుందా..?
ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ క్యూ తెలిపారు.యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు‘వచ్చే తరం కంప్యూటింగ్‌లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్ అసిస్టెన్స్, రియల్-టైమ్ కాంటెక్స్ట్‌వల్ అవేర్నెస్, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్ సిద్ధంయాపిల్ విజన్‘ఐఫోన్ యాపిల్‌కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్‌లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు.
అప్పుల్లో టాప్ రాష్ట్రం ఇదే..
మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్
జూన్ 2న మహారాజు పల్లకీ మహాయాత్ర ప్రారంభం
DGMO press briefing LIVE: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తింటున్నారా..? అంబానీ, సచిన్‌ల హెల్త్ కోచ్ షాకింగ్ విషయాలు
10 వారాల్లో రూ.16,700 కోట్లు తెచ్చారు..
దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్! హ్యాట్సాఫ్.. కానీ ఎందుకిలా?
'టూరిస్ట్ ఫ్యామిలీ'లో లిటిల్ ఎమర్జింగ్ స్టార్ గురించి తెలుసా..?
కిట్టువల్లనే కుటుంబంలో కల్లోలం, సంధ్య చచ్చిపోయింది!
వెంటాడుతున్న తీవ్ర అనారోగ్యం..మారని జీవితం !
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
ముందుగానే నైరుతి రుతుపవనాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్‌లో జీరో...
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
అప్పుల్లో టాప్ రాష్ట్రం ఇదే..
మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్
జూన్ 2న మహారాజు పల్లకీ మహాయాత్ర ప్రారంభం
DGMO press briefing LIVE: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తింటున్నారా..? అంబానీ, సచిన్‌ల హెల్త్ కోచ్ షాకింగ్ విషయాలు
10 వారాల్లో రూ.16,700 కోట్లు తెచ్చారు..
దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్! హ్యాట్సాఫ్.. కానీ ఎందుకిలా?
'టూరిస్ట్ ఫ్యామిలీ'లో లిటిల్ ఎమర్జింగ్ స్టార్ గురించి తెలుసా..?
కిట్టువల్లనే కుటుంబంలో కల్లోలం, సంధ్య చచ్చిపోయింది!
వెంటాడుతున్న తీవ్ర అనారోగ్యం..మారని జీవితం !
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
ముందుగానే నైరుతి రుతుపవనాలు
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్‌లో జీరో...
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
సినిమా

అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్ డైరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్( Anurag Kashyap) నటుడిగానూ వెండితెరపై మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో పెరు తెచ్చిన మహారాజ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ రాని పేరు మహారాజ( Maharaja) సినిమాతో వచ్చిందన్నాడు. విజయ్ సేతుపతి( Vijay Sethupathi) చెప్పడం వల్లే తనకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత తనకు అవకాశాలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు వచ్చిందని, దాంతోనే తన కూమార్తె పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు.విజయ్ సేతుపతి గురించి అనురాగ్ కశ్యప్ ఇలా చెప్పారు. 'దక్షణాది నుంచి నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ, నాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో వాటిని వదులుకున్నాను. అయితే, నేను డైరెక్ట్ చేసిని కెన్నెడీ చిత్రం పనుల్లో భాగంగా విజయ్ సేతుపతిని కలిశాను. ఆ మూవీ గురించి ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే నా కుమార్తె పెళ్లి గురించి ఆయనతో చెబుతూ.. వివాహం కోసం కావాల్సినంత డబ్బులేదన్నాను. క్షణం ఆలస్యం లేకుండా సాయం చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడే మా ఇద్దరి మధ్య మహారాజు సినిమా గురించి చర్చ వచ్చింది. అందులోని రోల్ కోసం గతంలోనే నన్ను సంప్రదించాలని అనుకున్నట్లు తెలిపారు. మొదట ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. కానీ, విజయ్ సేతుపతి చెప్పడం వల్లే ఓకే అనేశాను. అలా వచ్చిన డబ్బుతోనే నా కూతురి పెళ్లి చేశాను. ఆ సమయంలో విజయ్ నాకెంతో సాయం చేశారు. మహారాజ తర్వాత నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. 2028 వరకు నా డేట్స్ ఖాళీగా లేవు. ఇదంతా విజయ్ సేతుపతి వల్లే అని' అనురాగ్ కశ్యప్ తెలిపారు.గతేడాదిలో విడుదలైన ‘మహారాజ’ చిత్రంలో నెగటివ్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించారు. నిథిలన్ స్వామినాథన్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్.. రైఫిల్ చిత్రంతో పాటు డకాయిట్ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్‌గా ఆయన చేతిలో ఐదు సౌత్ చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్గా బాలీవుడ్ వదిలేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాడు.

వై.వి.ఎస్. చౌదరి- తారక రామారావు సినిమా ప్రారంభం
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి (YVS Chowdary) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్గా నటిస్తోంది. కూచిపూడి డ్యాన్సర్ అయిన ఆమె తెలుగమ్మాయి కావడం విశేషం. హీరోహీరోయిన్లుగా వారిద్దరిని వై.వి.ఎస్.చౌదరి చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్’ చిత్రంతో సాయిధరమ్ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశారు. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.1980 నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం వంటి అంశాలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. ఆస్కార్ విజేతలు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ (Chandra Bose) సంగీత, సాహిత్యాలను అందిస్తున్నారు. ఆపై సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. నందమూరి తారకరామారావు నటించిన 'తోడు నీడ' సినిమా విడుదలై మే 12వ తేదీకి 60 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరగడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది.

విశాల్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వేదికపైనే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న నిర్వాహకులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు.తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్‌ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. దాంతో వెంటనే ఆయన టీమ్, మాజీ మంత్రి కే పొన్ముడితో పాటు కార్యక్రమం నిర్వాహకులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విశాల్‌కు ఇలా జరగడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి. ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్ చెతులు వనుకుతూ.. చాలా నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని తర్వాత తన టీమ్ చెప్పింది. కానీ, ఇప్పుడు ఆయన ఎందుకు స్పృహ తప్పి పడిపోయారనేది తెలియదు.கூட்டத்தில் மயங்கி விழுந்த விஷால்... விழுப்புரத்தில் பரபரப்பு#vishal | #thanthicinema | #villupuram pic.twitter.com/DgrXSOv9FU— Thanthi TV (@ThanthiTV) May 11, 2025

భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఎంపీ ఇళయరాజా భారత రక్షణశాఖకు తన ఒక్క రోజు పారితోషకాన్ని విరాళంగా ప్రకటించారు. దీని గురించి ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ పహల్గామ్లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడిచేసిందని, మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయం అని తెలిపారు. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకంతో,మన దేశ రక్షణ శాఖకు దేశ పౌరుడిగా, ఎంపీగా తన ఒక్క రోజు పొరితోషికాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్– పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో దేశం మొత్తం హై అలెర్ట్ ప్రకటించడం, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తెలిసిందే.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్?.. భద్రతే ముఖ్యం..
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పాకిస్తాన్ క్రికెట్ (Pakistan Cricket) మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ జట్టు ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. తరచూ కెప్టెన్లు, క్రికెట్ బోర్డు యాజమాన్యాన్ని మారుస్తూ ఒక దశ, దిశ లేకుండా కొట్టుమిట్టాడుతోంది.ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025)లోనూ రిజ్వాన్ బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. గ్రూప్-ఎలో భాగంగా న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడి.. కనీసం సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల అదీ రద్దై పోవడంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌కు అసలు గెలుపన్నదే లేకుండా పోయింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లోనైనా గెలవాలని..ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు భావిస్తోంది. అయితే, ఇప్పట్లో అదీ జరిగేలా లేదు. కాగా.. ఉగ్రదాడుల నేపథ్యంలో సుదీర్ఘకాలం సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లకు పాక్ జట్టు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితులే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.నాడు శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడికాగా 2009లో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అంతర్జాతీయ జట్లు ఆ దేశంలో పర్యటించడాన్ని దాదాపు నిషేధించగా... ఇటీవలే పరిస్థితులు తిరిగి మెరువడంతో కొన్ని జట్లు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్లో క్రికెట్‌కు పూర్వవైభవం రావడం ఖాయమే అనుకుంటున్న దశలో... మరోసారి దీనికి బ్రేక్ పడేలా కనిపిస్తోంది.ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గజగజజమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు బదులుగా పాకిస్తాన్ ప్రతిదాడులు ప్రారంభించగా... భారత సాయుధ బలగాలు వాటిని బలంగా తిప్పికొట్టాయి.5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసంఈ నేపథ్యంలో అతిత్వరలో పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉన్న బంగ్లాదేశ్ జట్టు... ఈ పర్యటనపై పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలించడంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో నిరంతరం చర్చిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి.ఆటగాళ్ల భద్రతే ముఖ్యం‘ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యం. పాకిస్తాన్ బోర్డుతో చర్చిస్తున్నాం. ఏ నిర్ణయమైనా త్వరలోనే వెల్లడిస్తాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 17 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మరోవైపు పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ నిలిచిపోగా... అందులో పాల్గొంటున్న రిషాద్ హుసేన్, నహీద్ రాణా ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!

మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!.. ఆటగాళ్లకు సర్ది చెప్పిన హెడ్ కోచ్
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025 (IPL 2025) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇప్పటికే స్వదేశాలకు చేరుకునే క్రమంలో దుబాయ్ వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు వారి హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!సొంత దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... పాంటింగ్ ఢిల్లీలోనే ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అప్పటికే అతడి లగేజీ విమానాశ్రయానికి చేరుకోగా... అతి కష్టం మీద దానిని తిరిగి తెప్పించుకున్నాడు. అప్పటికే భారత్ నుంచి స్వదేశాలకు తిరుగు పయనమైన విదేశీ ఆటగాళ్లతో పాటు మిగిలిన వారిలో పాంటింగ్ దైర్యం నింపాడు.ఈ విషయం గురించి పంజాబ్ కింగ్స్ జట్టు సీఈవో సతీశ్ మీనన్ మాట్లాడుతూ.. ‘స్వదేశానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పాంటింగ్ నిరాకరించాడు. అంతేగాకుండా విదేశీ ఆటగాళ్లలో ధైర్యం నింపాడు. వారంతా త్వరలో జట్టుతో చేరబోతున్నారు’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టొయినిస్, ఆరోన్ హార్డీ, జోష్ ఇన్‌గ్లిస్, జేవియర్ ఉన్నారు. కాగా భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే.వందే భారత్ రైలులోశత్రు దేశ వ్యూహాలకు చెక్ పెట్టే క్రమంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) చేయడంతో త్వరత్వరగా స్టేడియాన్ని ఖాళీ చేయించడంతో పాటు.. ఆటగాళ్లను కూడా బీసీసీఐ అక్కడి నుంచి తరలించింది. ఈ క్రమంలో ధర్మశాల నుంచి ఢిల్లీకి వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది.ఇందులో భాగంగా బస్సులు, ట్రైన్లు మారుతూ ప్రయాణించడంతో విదేశీ ఆటగాళ్లలో ఒకరకమైన భయాందోళన పెరిగిపోవడంతో... వారంతా తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆశించారు. ‘దాడుల వార్తలతో విదేశీ ఆటగాళ్లు కాస్త ఆందోళన చెందారు. వీలైనంత త్వరగా దేశం వీడి ఇళ్లకు చేరుకోవాలని భావించారు.వారి స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాంటింగ్ వారికి సర్దిచెప్పాడు’ అని ఓ అధికారి తెలిపారు. కాగా పంజాబ్ పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రం దుబాయ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావడంపై త్వరలో ప్రకటన రానుండగా... జట్లన్నీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఆదివారం ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా, శనివారం భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రాగా.. పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో తిరిగి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 16 లేదంటే 17న తిరిగి ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ మార్గదర్శనం, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ సీజన్లో పంజాబ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఢిల్లీతో గురువారం మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ మ్యాచ్ అక్కడి నుంచే కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇందులో గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికి శ్రేయస్ సేన ఖాతాలో పదిహేను పాయింట్లు ఉన్నాయి. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!

క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!
రావల్పిండి: ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో క్షిపణి దాడి నుంచి తప్పించుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, అందులో పాల్గొంటున్న పలువురు విదేశీ ఆటగాళ్లు పాక్‌లోని రావల్పిండి నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికి అక్కడ క్షిపణి దాడి జరిగింది.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి బదులుగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ముష్కరులను మట్టుపెట్టగా... దానికి పాక్ ప్రతిదాడి చేసింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం... పాకిస్తాన్‌లోని మూడు వైమానిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడి జరగడానికి కాసేపు ముందే అంతర్జాతీయ క్రికెటర్లు నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.ఈ ఘటనతో మరోసారిఆసీస్కు చెందిన సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, ఆస్టన్ టర్నర్, మిచ్ ఓవెన్ ఆ సమయంలో పాక్‌లో ఉన్నట్లు పేర్కొంది. పీఎస్ఎల్ వాయిదా పడటంతో శనివారం విదేశీ ఆటగాళ్లు చార్టర్ ఫ్లయిట్లో రావల్పిండి నుంచి బయలుదేరగా... గంటల వ్యవధిలోనే అక్కడ క్షిపణి దాడితో పరిస్థితి భయానకంగా మారిందని పేర్కొంది. పౌర విమాన రాకపోకలను కవచంగా వినియోగించుకుంటూ పాకిస్తాన్ దాడులకు పాల్పడిందనే అంశం ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.మరోవైపు పీఎస్ఎల్లోని మిగిలిన 8 మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. మిగిలిన టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించినా... అటువైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నిరవధికంగా వాయిదా వేసింది. ఇదీ చదవండి: బాబ్ కూపర్‌కు నివాళిమెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన టెస్టు క్రికెటర్ బాబ్ కూపర్ (84) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కూపర్ కన్నుమూసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదివారం వెల్లడించింది. ఆసీస్ క్రికెట్‌కు విశేష సేవలందించిన కూపర్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1964 నుంచి 1968 మధ్య జాతీయ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కూపర్ 27 టెస్టులాడి 2,061 పరుగులు చేశారు. తన ఆఫ్‌స్పిన్‌తో 36 వికెట్లు సైతం పడగొట్టాడు. 1966లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూపర్ 12 గంటల పాటు క్రీజులో నిలిచి 589 బంతుల్లో 307 పరుగులు చేశారు. 20వ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో నమోదైన ఏకైక త్రిశతకం ఇదే. 28 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం కూపర్ స్టాక్ బ్రోకర్‌గా మారడంతో పాటు ఐసీసీ మ్యాచ్ రిఫరీగానూ పనిచేశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ కూపర్‌కు 2023లో ‘మెడల్ ఆఫ్ ద ఆర్డర్’ అవార్డు దక్కింది. చదవండి: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!

IPL 2025: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్‌ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
బిజినెస్

ఐఫోన్ అంతరించనుందా..?
ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ క్యూ తెలిపారు.యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు‘వచ్చే తరం కంప్యూటింగ్‌లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్ అసిస్టెన్స్, రియల్-టైమ్ కాంటెక్స్ట్‌వల్ అవేర్నెస్, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్ సిద్ధంయాపిల్ విజన్‘ఐఫోన్ యాపిల్‌కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్‌లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు.

బంగారం జాక్‌పాట్! ఈరోజు కొంటే..
దేశంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు (Gold Prices) శుభవార్త చెప్పాయి. రూ.లక్షకు చేరువలో ఉన్న మేలిమి బంగారం తులం ధర నేడు (మే 12) భారీగా దిగివచ్చింది. ఆభరణాలకు వినియోగించే పసిడి లోహం కూడా రూ.90వేల దిగువకు వచ్చేసింది. మే 12 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,030- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.96,880- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,800బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1800, రూ.1650 చొప్పున పతనమయ్యాయి. వెండి ధరలు కూడా భారీగానే..దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ మీద ఏకంగా రూ.2000 మేర తగ్గి రూ.1,09,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలో రూ.1150 తగ్గి రూ. 97,900 వద్దకు దిగివచ్చింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

బస్సులో వస్తావా? ఉద్యోగం లేదు పో..
జాబ్ ఇంటర్వ్యూకు బస్సులో వచ్చిన యువతికి ఉద్యోగం లేదు.. ఏమీ లేదు పో.. అంటూ ఓ కంపెనీ వెనక్కి పంపేసింది. తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవాన్ని ఆ యువతి ప్రొఫెషనల్ సామాజిక వేదిక రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. తన అర్హతలు, నైపుణ్యాలు చూడకుండా కేవలం తాను ప్రజా రవాణాను ఉపయోగించినందుకు ఇంటర్వ్యూ నుంచి పంపించేశారని ఆమె వాపోయారు.యువతి రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. బస్సు దిగి కంపెనీ భవనంలోకి నడిచి వస్తున్న ఆమెను సెక్యూరిటీ కెమెరాల్లో గమనించిన హైరింగ్ మేనేజర్.. ఇంటర్వ్యూ మొదలవ్వగానే ఆమె అర్హతలు లేదా అనుభవం గురించి కాకుండా మొదట ఆమె బస్సులో రావడం గురించే అడిగాడు. ప్రజా రవాణాను ఉపయోగించినందుకు అసహనం వ్యక్తం చేసిన ఆయన అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగానూ కామెంట్ చేశాడు. ఎర్రగా ఉన్న ఆమె జుట్టును "అన్ ప్రొఫెషనల్" అని వ్యాఖ్యానించాడు.అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే.. "ఇప్పుడే ఇంటర్వ్యూకు వెళ్లొచ్చాను. నేను కంపెనీ భవనం వైపు నడిచిరావడం కెమెరాల్లో చూశానని బాస్ చెప్పారు. నీకు మంచి ట్రాన్స్పోర్ట్ లేదా అని అడిగారు. ప్రజా రవాణాను ఉపయోగించకూడదని చెప్పి కొన్ని నిమిషాలు మందలించాడు. నన్ను ఎవరూ నియమించుకోరని, తానైతే ఇలాంటి వారికి అస్సలు జాబివ్వనని చెప్పాడు. ఎందుకంటే వారు సమయానికి రారు. ఇక నా ఎర్రటి జుట్టు గురించి ఫిర్యాదు చేయడం కొనసాగించాడు. అది నన్ను అన్ ప్రొఫెషనల్ గా మార్చింది అన్నాడు. ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగలేదు. తమకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను పంపించేశారు."అయితే ఇంతకీ సదరు కంపెనీ ఏది.. అనుచితంగా ప్రవర్తించిన ఆ హైరింగ్ మేనేజర్ పేరేంటి అన్నది ఆమె వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు చాలా మంది యూజర్లు ప్రతిస్పందించారు. అలా ప్రవర్తించిన ఆ మేనేజర్ తీరును తప్పుబట్టారు. ఆమెకు మద్దుతుగా నిలిచారు.

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 598 పాయింట్లు పెరిగి 24,607కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1938 పాయింట్లు ఎగబాకి 81,389 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.07 శాతం లాభపడింది. నాస్డాక్ 0.01 శాతం ఎగబాకింది.భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశ్చిత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లను నిశితంగా పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

నైపుణ్యాలున్న యువతకు స్వర్గధామం భాగ్యనగరం
నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా హైదరాబాద్ నగరం మరోసారి తన సాంకేతిక ప్రావీణ్యాన్ని చాటుకుంటోంది. 1998లో భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ రోజును గుర్తుంచుకుంటారు. ఈ పరీక్షల ఫలితంగా భారతదేశం అణు ఆయుధాలు కలిగిన ఆరో దేశంగా రూపాంతరం చెందింది. ఈ అణు పరీక్షల విజయాన్ని గుర్తిస్తూ ప్రతి ఏడాది మే 11న ఈ రోజును టెక్నాలజీ డే గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ప్రముఖ శాస్త్ర, సాంకేతిక సంస్థలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు వివిధ కార్యక్రమాలు చేపట్టాయి. పని తగ్గించి ఉత్పత్తి పెంచే సాధనాలు.. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వేదికపై టెక్నాలజీ పరిణామక్రమంపై అవగాహనను కలిగి ఉన్నారు. క్రిటికల్ రివర్‌లో ఈ విజ్ఞానం అంతర్జాతీయ స్థాయి క్లయింట్లు ఆశించే నాణ్యతను అందించడానికి సహాయపడుతుంది. హైదరాబాద్ భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా ఎదుగుతోంది. మా హైదరాబాద్ బృందం ఆటో–రీకన్సిలియేషన్స్, ఆటోమేటెడ్ చెక్, డేటా విజిబిలిటీని అందించే డాష్‌బోర్డ్‌లు వంటి ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించే వినూత్న ఏఐ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తుంది. మేన్యువల్ పనిని తగ్గిస్తూ, ఉత్పత్తిని వేగవంతం చేసే ఆటోమేషన్ డేటా సాధనాలను అభివృద్ధి చేస్తున్నాము. డేటా ఖచ్ఛితత్వంతో ఫైనాన్స్ బృందాలకు సహాయపడే ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడంలో మా బృందం కీలక పాత్ర పోషించింది. ఈ సాధనాలను ఇప్పటికే ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఉపయోగిస్తున్నారు. – అంజి మారం, క్రిటికల్ రివర్ సీఈఓ, వ్యవస్థాపకులు. ఆధునిక యుద్ధ విధానాల్లో సాంకేతికత ఎలా విప్లవాత్మకంగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామంలో డ్రోన్ సాంకేతికత రక్షణ వ్యూహంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. భారత–పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఏర్పడిన ఇటీవలి ఉద్రిక్తతలు డ్రోన్ల అవసరాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ఇవి ఇకపై ఐచ్ఛికం కాదు, అత్యవసరం. నేడు డ్రోన్లు గగనతల గమనిక, పక్కాగా సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది మన దళాలకు వేగవంతమైన, సమర్థవంతమైన స్పందనను అందించడమే కాక, మనుషుల ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతోంది. భారత్‌లో స్థానిక డ్రోన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటం ‘ఆత్మనిర్భర్త’ అవసరాన్ని హైలైట్ చేస్తోంది. దేశాన్ని అధునాతన డ్రోన్ సాంకేతికత గ్లోబల్ హబ్‌గా దిశగా మలచడంలో ఇది కీలక అడుగు. –ప్రేం కుమార్ విశ్లావత్, మారుత్ డ్రోన్స్ సీఈఓ, సహ–వ్యవస్థాపకులు. (చదవండి:

Miss World 2025: హెరిటేజ్ వాక్కు సర్వం సిద్ధం..
చార్మినార్: పాతబస్తీలో మిస్ వరల్డ్ సుందరాంగులు సందడి చేయనున్నారు. నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్–2025లో పాల్గొంటున్న పోటీదారులతో ఈ నెల 13న చారి్మనార్‌లో హెరిటేజ్ వాక్ జరగనుంది. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గోనున్నారు. చారి్మనార్ నుంచి లాడ్ బజార్ వరకూ నిర్వహించే వాక్‌లో కంటెస్టెంట్స్ ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోనున్నారు. పాతబస్తీ చారిత్రక కట్టడాల విశేషాలతో పాటు లాడ్ బజార్‌లోని గాజుల తయారీ కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. హెరిటేజ్ వాక్ సందర్భంగా పాతబస్తీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే చారి్మనార్ కట్టడాన్ని మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు. పర్యాటకులు చారి్మనార్ వద్ద సెల్పీలు దిగుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, డివైడర్లకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అఫ్జల్‌గంజ్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించే నయాపూల్ బ్రిడ్జిపై కొత్తగా మొక్కలతో అలంకరించారు. రిహార్సల్స్ పూర్తి.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకూ హెరిటేజ్ వాక్ రిహార్సల్స్ జరిగాయి. పోలీసు, పర్యాటక, విద్యుత్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఆర్కియాలజీ, జలమండలి.. ఇలా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. తెలంగాణ జరూర్ ఆనా..అనే టైటిల్‌తో రూపొందించిన ఏసీ బస్సులో మిస్ వరల్డ్–2025 అభ్యర్థులను తరలించనున్నారు. శివారు ప్రాంతమైన ఆరంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించి బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ ద్వారా చారి్మనార్‌కు చేరుకోనుంది.

Vaishakh Purnima 2025 మానవాళికి మహాబోధకుడు
వైశాఖ పౌర్ణమి వైష్ణవులకు, శైవులకూ కూడా ఎంతో పర్వదినం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం, పన్నిద్దరు ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించినది కూడా వైశాఖ పున్నమినాడే కావడం విష్ణుభక్తులకు ఉల్లాసభరితమైతే, ఎనిమిది పాదాలతో, సువర్ణ సదృశమైన రెక్కలతో, సింహపుదేహంతో ఉన్న శివుని రూపమైన శరభేశ్వరుడి అవతరించినది ఈరోజే కావడం శైవులకు సంతోషకారణం. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమే! సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్రస్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం (పెరుగన్నం), గొడుగు, ఉదకుంభం లాంటివి దానం చేయడం పుణ్యప్రదం. (నేడు వైశాఖ పున్నమి) ఎల్లప్పుడూ రాగద్వేషాలతో, కామక్రోధాలతో, హింసతో, సతమతమవుతున్న మానవాళిని జాగృత పరచటానికి ఉద్భవించిన మహాపురుషుడు గౌతవుబుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతవుుడు. కపిలవస్తును ఏలే శుద్ధోధన చక్రవర్తికి, ఆయన పట్టపురాణి వుహావూయాదేవికి ౖవైశాఖ శుద్ధపూర్ణివునాడు జన్మించాడు. అతడు పుట్టిన ఏడోరోజునే తల్లి వురణించడంతో పినతల్లి గౌతమి, తానే తల్లి అయి పెంచింది.కొడుకు పుట్టగానే తండ్రి శుద్ధోధనుడు జాతకం చూపించాడు. జాతకం ప్రకారం అతడు వుహాచక్రవర్తి కాని, వుహాప్రవక్త కాని అవుతాడని పండితులు చెప్పారు. తన పుత్రుడు చక్రవర్తి కావాలని ఆశించిన తండ్రి, అతనికి కష్టాలు, బాధలు అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. అంతేకాదు, అతనికి పదహారవ ఏటనే అంతే ఈడుగల యశోధరతో వివాహం జరిపించాడు.కొంతకాలం గడిచిందిఒకనాడు నగర వ్యాహ్యాళికి రథంపై వెళ్లిన సిద్ధార్థునికి దారిలో నాలుగు దృశ్యాలు ఎదురయ్యాయి. అవి ఒక వుుసలివాడు, ఒక రోగి, ఒక శవం, ఒక శవుణుడు. అసలే ఆలోచనాపరుడైన అతని వునసులో ఇవి పెద్ద అలజడినే రేపాయి. వూనవ#లు ఎదుర్కొనే ఈ దుఃఖాన్ని ఎలాగైనా పరిష్కరించి తీరాలనుకున్నాడు. నాలుగో దృశ్యం సన్యాసి – అతనికి వూర్గాన్ని స్ఫురింపజేసింది. అప్పటికప్పుడే సన్యసించాలని, తపస్సు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.గౌతముడు బుద్ధుడయిన వేళ...అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. అప్పుడే ఆయనకు రాహులుడనే పుత్రుడు జన్మించాడు. ఆ రాత్రే అడవికి పయనవుయ్యాడు. ప్రపంచం అంతా మెుద్దు నిద్దరోతోంది. వూయనిద్రలో నుంచి సిద్ధార్థుడొక్కడే మేల్కొన్నాడు, ప్రపంచాన్ని నిద్ర లేపటానికి. అడవికి వెళ్లి ఆరు సంవత్సరాలు వూనవాళి దుఃఖం గురించి ఆలోచించాడు. చివరకు జ్ఞానోదయమైంది. అప్పటికాయన వయస్సు 35 సంవత్సరాలు.ఇదీ చదవండి: ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!జననం మరణం ఒకే రోజుతనకు జ్ఞానోదయం అయిన తరవాత తాను కనుగొన్న ధర్మాన్ని రాజు, పేద, ఉన్నత, దళిత, కుల, వర్గ, వుతభేదాలను పట్టించుకోకుండా 45 సంవత్సరాల పాటు నిరంత రాయంగా బోధించాడు ఆయన జన్మించినది, జ్ఞానోదయం కలిగింది. నిర్వాణం చెందిందీ కూడా వైశాఖ పున్నమినాడే. అందుకే ఈ పున్నమిని బుద్ధపున్నమి అని అంటారు.ప్రపంచాన్ని మేల్కొలిపిన ఆ బోధలు ఏమిటి?ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు నాలుగు సత్యాలను బోధించాడు. వీటిని ఆర్యసత్యాలంటారు. వీటిల్లో మెుదటిది... దుఃఖం. అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. రెండో సత్యం... దీనికి కారణం తృష్ణ. వుూడో సత్యం... దుఃఖాన్ని తొలగించే వీలుంది. నాలుగో సత్యం... దుఃఖాన్ని తొలగించే వూర్గం ఉంది. ఆ వూర్గమే ఆర్య అష్టాంగవూర్గం. ఈ నాలుగు సత్యాలను చెప్పడంలో బుద్ధుడు ఒక శాస్త్రీయ విధానాన్ని అనుసరించాడు. అదే కార్యకారణ సిద్ధాంతం. బుద్ధునికి వుుందే ఈ సిద్ధాంతం ఉన్నా దానికి ఒక శాస్త్రీయ ప్రాపదికను ఏర్పాటు చేసినది మాత్రం ఆయనే. బుద్ధుడు ప్రపంచానికి అందించిన ఆలోచనా విధానం పూర్తిగా శాస్త్రీయమైనది. హేతుబద్ధమైనది.దుఃఖం అంటే ఏమిటి? బుద్ధుడు ప్రపంచంలో దుఃఖం ఉందన్నాడు. ఆ దుఃఖ భావనను చాలావుంది అపార్థం చేసుకున్నారు. దుఃఖం అంటే వునం వూవుూలుగా శోకం, ఏడుపు, పెడబొబ్బలు అనుకుంటాం. శోకం దుఃఖంలో భాగమే అయినా, దుఃఖం అర్థం అది కాదు. ‘దుఃఖం’ అంటే తొలగించాల్సిన ఖాళీ. అంటే ప్రతి వునిషిలోనూ తొలగించవలసిన అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేని వూనవ#డు ఉండడు. ఇలా ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. ఈ విధమైన ఆ ‘ఖాళీ’నే ఆధునికులు దురవస్థ అంటున్నారు. దీనిని పరిష్కరించటానికి తృష్ణను తొలగించాలన్నాడు. ఆ తృష్ణ పోవాలంటే ‘స్వార్థం’ లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలంటే ‘నేను’ అనే భావన ఉండకూడదు. ‘నేను’ లేకుండా ఉండాలంటే, ‘ఆత్మ’ లేకుండా ఉండాలి. అందుకే ఆయన ‘అనాత్మ’వాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇది బుద్ధుడు మానవాళికి చేసిన వుహోపదేశం.మతాతీతమైన సత్యాలుమానవుడు మానవుడు మనగలగాలంటే ఏం చేయాలో బోధించాడు బుద్ధుడు. వాటికే పంచశీలాలని పేరు. 1)ప్రాణం తీయకు 2) దొంగతనం చేయకు 3) అబద్ధాలాడకు 4) కావుంతో చరించకు 5) వుద్యం సేవించకు– వీటిని ఏ వుతం కూడా కాదనలేదు. ఈ సత్యాలు వుతాతీతాలు. సవూజం సజావ#గా, కందెన వేసిన బండిచక్రంలా సాఫీగా సాగాలంటే పంచశీలాలను పాటించడం ఎంతో అవసరం. బుద్ధుడు తాత్విక చింతనలోనూ, వునోవిజ్ఞానశాస్త్రంలోనూ, సవూజ సంక్షేవుంలోనూ, వుూలాలకు వెళ్లి, అంతకువుుందు ఎవరూ చూడని, ఆలోచించని ఎన్నో విషయాలను వూనవ కల్యాణం కోసం అందించిన మహనీయుడు. వునిషికే మహనీయుడిగా పట్టంకట్టిన ఆ మానవతావాది ప్రతిపాదించిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు అర్పించే అసలైన నివాళి. బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి– డి.వి.ఆర్. భాస్కర్

వివాహం వినూత్నం.. ! సంఘ సంస్కర్తలే సాక్షిగా..
పెళ్లి అంటే పూజలు, వేదమంత్రాలు, తాళి, మేళతాళాలు ఉంటాయి. కానీ ఎటువంటి దేవుడి ఫొటోలు లేకుండా సంఘ సంస్కర్తలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, పెరియర్ రామస్వామి, సావిత్రి బాయి పూలే, గౌతమ బుద్ధుని ఫొటోలు పెట్టుకుని ఒకేసారి ఇద్దరు అన్నదమ్ముల వివాహాలు జరిగాయి. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తె ల అభిప్రాయాల మేరకు బౌద్ధ ఆచార ప్రకారం వివాహం జరిపించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాలకు కొరవంగి గ్రామం వేదిక అయింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములైన సలభంగి చిన్నారావు ఇదే మండలం బొండాపల్లి గ్రామానికి చెందిన శ్యామంతి, సలభంగి సునీల్‌కుమార్ పోయిపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీకుమారి వివాహాలను దమ్మ దీక్ష విశాఖపట్నం జిల్లా ప్రతినిధులు బి. గౌతమ్‌బాబు, ఎస్. సింహాద్రి జరిపించారు. అలాగే పాడేరు మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, బాంసెఫ్ గౌరవ అధ్యక్షుడు ఎం.చిట్టిదొర ధర్మ సందేశం వినిపించారు. అనంతరం వధూవరులు పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు. తాము చదువుకున్నప్పటి నుంచి బౌద్ధ ఆచార ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇదే విధంగా జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నదమ్ములైన పెళ్లికొడుకులు తెలిపారు. ఇందుకు బంధువులు కూడా సమ్మతించడం గొప్ప విషయమన్నారు. ఈ వివాహాలు వీవీ దుర్గారావు, కె, సత్యనారాయణ, ఎస్. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. బాంసెఫ్ ప్రతినిధులు చెండా భీమసుందర్, టీచర్లు కె. సత్యనారాయణ, ఎస్. మత్స్యలింగం పాల్గొన్నారు.(చదవండి: ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..)
ఫొటోలు
అంతర్జాతీయం

భారత్, పాక్‌పై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్.. ఈసారి కశ్మీర్ అంటూ..
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్-పాక్ అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్రుత్‌తో స్పందిస్తూ..‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్, పాకిస్తాన్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్.. భారత్‌పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది.

పాకిస్తాన్‌కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు.

భారత్‌పై పాక్ ప్రధాని ఓవరాక్షన్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
ఇస్లామాబాద్: సరిహద్దుల్లో మూడు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంటూ రెచ్చగొట్టే విధంగా సరిహద్దులో కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా.. పాక్ ప్రధాని విచిత్రంగా తమదే గెలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాక్‌ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణమైందని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని.. భారత్‌కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తే ఏదైనా చేయగలమని చూపించామంటూ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.JUST IN: 🇵🇰🇮🇳 Pakistani PM Shehbaz Sharif declares victory over India.pic.twitter.com/go5V3JsGN8— Whale Insider (@WhaleInsider) May 10, 2025 12 Pakistan air bases destroyed, many of their jets shot down by the Indian Army… hundreds of terrorists killed deep inside Pakistan territory.Yet this man, with zero iota of shame, Shehbaz Sharif, says we have won against India. 🤡🤡 pic.twitter.com/qoI7u7NKYY— BALA (@erbmjha) May 10, 2025 ఇక, ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పాక్ ప్రధాని తీరును ఎండగడుతున్నారు. అమెరికా మధ్యలోకి రాకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్ దాడులను తట్టుకోలేక తోక ముడిచి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇంత నష్టం జరిగినా మీది ఎలా గెలుపు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 🇵🇰Pakistan Prime Minister Shehbaz Sharif tweets, praises trump & declares victory over India: “We have won, this is victory.”Also, Pakistani people are celebrating victory all over the country.THIS IS SHAMELESS 🤮🤮 pic.twitter.com/1N9YhfGrya— Vaishnavi (@vaishu_z) May 10, 2025 Shehbaz Sharif won the war in twitter 😂 pic.twitter.com/TTGaMKN86t— Mr. Nice Guy (@Mr__Nice__Guyy) May 10, 2025 ఇదిలా ఉండగా.. ఒకవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలకు పాక్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా స్వాగతించాయి. ఉద్రిక్తతల నివారణకు ఇది కీలకమైన ముందడుగు అని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా అన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. Shehbaz Sharif knows the nation is uneducated and will believe whatever they're told, so he quickly declared victory. He's totally an army puppet. It's honestly laughable to watch him.🤣🤣🤣 #ceasefire #PakistanIndianWar pic.twitter.com/dDUr5ONLhI— Sandeep Pathak⛳ (@iPandit_Pathak) May 10, 2025Pakistan PM Shahbaz Sharif, "we won the war against India. Our attack destroyed the enemy's Air Bases".- Welcome to comedy nights hosted by a country's PM in front of the media. pic.twitter.com/gbcaKX64En— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025

బంగ్లాదేశ్ షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్‌లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్‌హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025
జాతీయం

నేనూ సైన్యంలో చేరతా
ఝున్ఝును: పెద్దయిన తరువాత తానూ సైన్యంలో చేరతానని, తన తండ్రి ప్రాణాలు తీసిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు సురేంద్ర సింగ్ మోగా కూతురు వర్తిక ప్రతిజ్ఞ చేసింది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ శనివారం జరిపిన డ్రోన్ దాడుల్లో జమ్మూ కశ్మీర్‌లోని ఉద్ధంపూర్ వైమానిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన జవాను సురేంద్ర సింగ్ మోగాతోపాటు బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ డ్రోన్ శకలం ఢీకొని సురేంద్ర మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘శనివారం రాత్రి 9 గంటలకు కూడా నాన్నతో మాట్లాడా. ఆకాశంలో పాక్ డ్రోన్లు తిరుగుతున్నాయని, తాము బాగానే ఉన్నామని నాతో చెప్పాడు. అంతలోనే ఇలా జరిగింది’’ అంటూ 11 ఏళ్ల వర్తిక విలపించింది. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వంగా ఉందని చెప్పింది. పాక్ పేరు కూడా వినపడని రీతిలో అంతం కావాలని ఆకాంక్షించింది. ‘‘నా తండ్రి ప్రాణా లు తీసిన పాక్‌ను వదలను. సైన్యంలో చేరి వాళ్లను ఒకరి తర్వాత ఒకరిగా ఖతం చేస్తా’’ అని చెప్పింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రకు నాలుగు రోజుల కిందట సరిహద్దుకు రావాలని పిలుపు వచి్చంది. దీంతో తన భార్య, 11 ఏళ్ల వర్తిక, 7 ఏళ్ల కొడుకు ద„Š ను స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా మెహ్రదాసికి పంపించాడు. అంనతరం తాను ఉద్ధంపూర్కు బయల్దేరి వెళ్లాడు. అయితే ఊర్లోని కొత్త ఇల్లు గృహప్రవేశానికి వస్తాడనుకున్న కొడుకు.. త్రివర్ణ పతకాన్ని కప్పుకొని నిర్జీవంగా రావడంతో సురేంద్ర తల్లి కుప్పకూలిపోయింది. ధైర్యవంతుడైన సురేంద్రకు వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గ్రామంలో నెలకొన్న ఉద్విగ్నభరిత వాతావరణంలో, ఆదివారం అధికారిక లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి.

వీరులారా వందనం
జమ్మూ/ముజఫర్‌నగర్: దేశంకోసం ప్రాణాలర్పించారన్న గర్వం ఓవైపు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న బాధ మరోవైపు.. సరిహద్దు వెంబడి పాక్ కాల్పుల్లో మృతి చెందిన సైనికుల అంత్యక్రియల సందర్భంగా స్వగ్రామాల్లో కనిపించిన ఉద్విగ్నభరిత దృశ్యమది. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, కన్న తల్లిదండ్రులే కాదు.. గ్రామాలకు గ్రామాలు దుఃఖ నదులయ్యాయి. వేలాది మంది అమర జవాన్లకు కన్నీటి నివాళులర్పించారు. ‘అమర్ రహే’ అంటూ నినదించారు. కాల్పుల్లో ఆరి్నయా సెక్టార్‌లోని త్రివా గ్రామానికి చెందిన రైఫిల్‌మెన్ సునీల్ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. 4జేకే లైట్ ఇన్ఫాంటరీ రెజిమెంట్‌లో సేవలందిస్తున్న సునీల్.. ఆర్ఎస్పుర సెక్టార్లో ఉండగా శనివారం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. 25 ఏళ్ల సునీల్ కుటుంబానిది మిలిటరీ నేపథ్యం. తండ్రి గతంలో పనిచేశారు. ప్రస్తుతం ఇద్దరన్నలు సాయుధ దళాల్లో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో దేశంకోసం ఆర్మీలో పనిచేయాలని చిన్నతనం నుంచే స్ఫూర్తిని పెంచుకున్న సునీల్.. దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్‌కు అతని స్వగ్రామంలో కన్నీటి వీడ్కోలు పలికారు. పవన్.. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో షెల్లింగ్‌లో గాయపడి మృతి చెందారు. అతని కొడుకు చితికి నిప్పటించగా.. వేలాది మంది ‘సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమర్ రహే’, ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినాదాలు చేశారు. కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న సర్జెంట్ సురేంద్రకు రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లాలోని స్వగ్రామంలో, ఆంధప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ముడావత్ మురళీనాయక్‌కు అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అర్ఎస్పురా సెక్టార్‌పై డ్రోన్ దాడిలో మరణించిన బీఎస్ఎఫ్ ఎస్ఐ మహమ్మద్ ఇంతియాజ్‌కు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరీ నివాళులర్పించారు. అనంతరం పారి్థవ దేహాన్ని స్వస్థలం బీహార్‌కు తరలించారు. అధికారులు, సామాన్యులు సైతం.. పాక్ శనివారం జరిపిన షెల్లింగ్‌లో సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. తన ఇంట్లో షెల్ పడటంతో రాజౌరీ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్‌కుమార్ థప మృతి చెందారు. జమ్మూ శివార్లలోని రూప్‌నగర్‌లో ఉన్న అతని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజౌరీ జిల్లాలో జరిగిన షెల్లింగ్‌లో 35 ఏళ్ల మహమ్మద్ సాహిబ్, అతని మేనకోడలు రెండేళ్ల అయేషా మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారి స్వగ్రామం ఖాయ్ఖేడిలో వందలాది మంది కన్నీటివీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

అన్నివిధాలా పైచేయి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశీ్మర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది.

‘బ్రహ్మోస్’ దెబ్బకే... పాక్ దిగొచ్చిందా?!
జైపూర్/ లఖ్‌నవూ/ న్యూఢిల్లీ: సరిహద్దులపై ఎడాపెడా దాడులకు తెగబడ్డ పాక్ బ్రహ్మాస్త్రం దెబ్బకు దిగొచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను పాక్ మీదికి భారత్ ప్రయోగించినట్టు వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్‌లోని బికనీర్‌లో పాక్ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మోస్ బూస్టర్, నోస్‌క్యాప్ లభించడం దీన్ని ధ్రువీకరిస్తోంది. ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మూలాలను పెకలిస్తూ పాక్‌లోని బహావల్పూర్లో ఉన్న దాని ప్రధాన స్థావరంపై మే 7 అర్ధరాత్రి దాటాక భారత క్షిపణులు విరుచుకుపడటం తెలిసిందే. బ్రహ్మోస్ బూస్టర్, నోస్ క్యాప్ దొరికింది బహావల్పూర్ ఉన్న దిశలోనే. బ్రహ్మోస్‌ను ప్రయోగించాక దాన్నుంచి విడివడే అనుబంధ భాగాల శకలాలతో అవి దాదాపుగా పోలుతున్నాయి. కనుక ఆ గగనతలం గుండానే బ్రహ్మోస్ దూసుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. బహావల్పూర్లోని జైషే భవనాలను కూల్చేందుకు శక్తిమతమైన క్షిపణులను ప్రయోగించినట్లు భారత్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. వాటిలో బ్రహ్మోస్ కూడా ఉందన్న వార్తలకు ఇది కూడా బలం చేకూరుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యుద్ధంలో బ్రహ్మోస్‌ను వాడటం ఇదే తొలిసారి. అయితే దాని వినియోగాన్ని కేంద్రం ధుృవీకరించడం లేదు.బ్రహ్మోస్ దెబ్బ పాక్‌కు తెలుసు: యోగి ‘‘బ్రహ్మోస్ క్షిపణి సత్తా ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంకా ఎవరికైనా తెలియాలంటే తాజాగా ఆ దెబ్బను రుచిచూసిన పాక్‌ను అడిగి తెలుసుకోవచ్చు’’ అని యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖ్‌నవూలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ కేంద్రం ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘ఉగ్రవాదాన్ని అంతంచేయనంత వరకు ఆ సమస్యకు పరిష్కారం లభించదు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణచివేయాల్సిన తరుణమొచ్చింది. ఉగ్రవాదం కుక్కతోక వంటిది. దాన్నెప్పటికీ సరిచేయలేం. ఉగ్రవాదులకు వాళ్ల బాషలోనే బుద్ధిచెప్పాలి’’ అన్నారు. సైనిక సందేశం బ్రహ్మోస్: రాజ్‌నాథ్ భారత సాయుధ బలగాల సామర్థ్యానికి బ్రహ్మోస్ నిలువెత్తు నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఆదివారం లఖ్‌నవూలో నూతన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేటెడ్ అండ్ టెస్టింగ్ కేంద్రాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘నేషనల్ టెక్నాలజీ డే (ఆదివారం) రోజే బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది శక్తిమంతమైన ఆయుధం మాత్రమే కాదు, మన సాయుధ బలగాల అమేయ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే ఒక సందేశం. శత్రువులకు సింహస్వప్నం. సరిహద్దుల పరిరక్షణలో మన అంకితభావాన్ని ఈ క్షిపణి చాటిచెబుతుంది’’ అన్నారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ తయారీ కేంద్రంలో మ్యాక్ 2.8 వేగంతో 290 నుంచి 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణుల తయారు చేయనున్నారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన సిద్దిక్ మేడ్చల్‌లో నివాసం ఉంటూ వారాంతపు మార్కెట్లో బ్యాటరీ లైట్లు సప్లై చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంపల్లి మున్సిపల్ పరిధిలోని సెంట్రల్ పార్క్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మార్కెట్లో బ్యాటరీ లైట్లు సాయంత్రం ఇచ్చి.. తిరిగి రాత్రి తీసుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. గతంలో సిద్దిక్ బొల్లారం ప్రాంతంలో బ్యాటరీ లైట్లు ఏర్పాటు విషయంలో మరో వర్గంతో గొడవ పడ్డాడని... అది మనసులో పెట్టుకొని కక్షగట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం.. అంటూ పిలిచి విచక్షణారహితంగా పొట్ట, ఛాతీ భాగాల్లో కత్తులతో పొడిచారు. ఇంతటితో ఆగకుండా నిందితుల్లో ఒకరు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సిద్దిక్ మెడను కోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించారు. సిద్దిక్‌తో ఇటీవల జరిగిన గొడవలపై ఆరాతీశారు. ముగ్గురు నిందితులు వచి్చనట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాములు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ విజయ్‌వర్ధన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్ పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని...
సాక్షి, హైదరాబాద్:: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచి్చన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన ‘పోలీసు మార్కు’ విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్‌లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం. ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులను కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు. ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారు. దెబ్బలు తట్టుకోలేకే.. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీసు శాఖకు చెందిన శిక్షణ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆ అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ అనుమానితుడు మృతి చెందాడు. దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు.మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. వారికి కొంత మొత్తం ముట్టచెప్పి గుట్టు చప్పుడు కాకుండా మృతునికి అంత్యక్రియలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా జరిపించేసినట్లు సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారే బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవర్ని కలుస్తున్నారు, వారి ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారి నివాసం వద్ద పోలీసు నిఘా కూడా పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ముఖ్య నేత మద్దతుతోనే ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అంతగా చెలరేగిపోతున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం
నిర్మల్/ఆదిలాబాద్‌టౌన్: ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొట్టగా తండ్రీకూతురు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. మాతృదినోత్సవం రోజున తల్లికి గర్భశోకంతోపాటు సౌభాగ్యమూ దూరం చేసింది. తనతో కలిసి పుట్టిన కవల సోదరిని ఒంటరి చేసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తండ్రీకూతురు శంకర్(50), కృతిక(20) హైదరాబాద్ నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సొంతూరైన ఆదిలాబాద్‌కు కారులో బయల్దేరారు. నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేట సమీపంలో ఎన్‌హెచ్–44 బైపాస్ రోడ్డు వద్దకు ఆదివారం వేకువజామున చేరుకున్నారు.ఈ క్రమంలో రోడ్డుపై ఎలాంటి సూచికలు లేకుండా నిలిపి ఉంచిన ఐషర్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకర్, కృతిక తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. డ్రైవర్ విలాస్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మహారాష్ట్రలోని యవత్మాల్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో విలాస్ డ్రైవింగ్ చేస్తుండగా, ముందు సీట్లో శంకర్, వెనుక సీట్లో కతిక ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్ ఐషర్ వాహనాన్ని నిలిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.