Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court overturns High Court verdict on Mithun Reddy bail Issue1
ఆధారాలు లేకుండా అరెస్టులా..?

‘‘అరెస్ట్‌ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్‌ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’– సుప్రీంకోర్టు ధర్మాసనం..సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్‌లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్‌ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్ట్‌లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్‌ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్ధీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్‌రెడ్డి...గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్‌రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.దర్యాప్తునకు సహకరిస్తున్నారు...మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, రంజిత్‌ కుమార్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్‌ చేసింది.

BJP Minister Vijay Shah Comments On Colonel Sofiya Qureshi2
సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. హైకమాండ్‌ వార్నింగ్‌

భోపాల్‌: భారత సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని.. ఉగ్రవాదులను హతమార్చేందుకు పంపించి మోదీ గుణపాఠం చెప్పారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్‌పై పోరులో భాగంగా ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీ విజయ్‌ షా ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అని వ్యాఖ్యలు చేశారు.దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. అనంతరం, మధ్యప్రదేశ్‌ బీజేపీ హైకమాండ్‌.. విజయ్‌ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. దీంతో, మరోసారి స్పందిస్తూ.. ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని షా విలేకరులకు చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు.మరోవైపు.. మంత్రి విజయ్‌ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.Utterly derogatory, communal and sexist remark made by a BJP MP minister Kunwar Vijay Shah against Col Sofia Quereshi. . And it wasn’t off the cuff either (don’t miss the applause from his chamchas on stage) . Shocking beyond belief. What is the use of ‘nationalist’ flag waving… pic.twitter.com/pZ8VboyAoV— Rajdeep Sardesai (@sardesairajdeep) May 13, 2025

Pakistan Reacts On PM Modi Speech3
ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్‌ ఓవరాక్షన్‌.. హెచ్చరిక అంటూ..

ఇస్లామాబాద్‌: భారత్‌, పాక్‌ ఘర్షణల వేళ పాకిస్తాన్‌ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని ప్రధాని మోదీ (Modi) హెచ్చరించిన నేపథ్యంలో పాక్‌ స్పందించింది. మోదీ వ్యాఖ్యలు 'రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదమైనవి'గా ఉన్నాయని పేర్కొంటూ పాక్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.పాకిస్తాన్‌ యుద్ధం, కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై తాజాగా పాక్‌ విదేశాంగశాఖ స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో..‘భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్తాన్‌ తిరస్కరిస్తోంది. ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్‌ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. భారత్‌ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించదు. అణుబాంబు బెదిరింపుల్ని భారత్‌ సహించదని.. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్‌ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు.మంగళవారం కూడా పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్‌లో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్‌ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.

Pakistan High Commissioner Syed Ahmed Maroof honeytrap4
వివాదంలో పాకిస్తాన్‌ హైకమిషనర్‌.. యువతితో వీడియోలు లీక్‌

ఢాకా: పాకిస్తాన్‌ హైకమిషనర్‌ హనీట్రాప్‌ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.వివరాల ప్రకారం.. సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ పాకిస్తాన్‌ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్‌ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్‌ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్‌ వీడినట్టు చెప్పుకొచ్చింది.The Pakistani Ambassador to Bangladesh, Syed Ahmed Maroof, was in a relationship with a Bangladeshi Muslim girl. After some intimate details became public, he was sent on leave. There was a time when Pakistanis used to rape Bangladeshi Muslim women nowadays, some Bangladeshi… pic.twitter.com/p60WkJJslU— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) May 12, 2025అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.Pakistan Ambassador to Bangladesh Syed Ahmed Maroof is reportedly untraceable after his honey trapped videos emerged online.There's a leaked video too. pic.twitter.com/UfYmLYfKVl— Avinash K S🇮🇳 (@AvinashKS14) May 13, 2025ఇక, ఇటీవల మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆమెతో పాక్‌ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్‌ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ కార్యాలయ అధికారి ఒకరిని భారత్‌ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్‌గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉ‍న్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్‌ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Pakistan Army Announce Death On Operation SIndoor5
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్‌ ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యలో తమ సైనిక సిబ్బందిలో కేవలం 11 మంది చనిపోయారని పాకిస్తాన్‌ మంగళవారం ప్రకటించింది. వీరిలో స్క్వాడ్రాన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసుఫ్‌ సైతం ఉన్నట్లు పేర్కొంది. భారత వైమానిక, క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో సాయుధ బల గాలకు సంబంధించి 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా మే ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత భారత్‌ జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 121 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. చీఫ్‌ టెక్నీషియన్‌ ఔరంగజేబ్, సీనియర్‌ టెక్నీషియన్‌ నజీబ్, కార్పోరల్‌ టెక్నీషియన్‌ ఫరూఖ్, సీనియర్‌ టెక్నీషియన్‌ ముబాషిర్‌ సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీళ్లంతా ఏ పరిస్థితుల్లో మరణించారో, మరణానికి కారణాలను పాకిస్తాన్‌ బయటపెట్టలేదు. ఒక యుద్ధవిమానం పాక్షికంగా ధ్వంసమైందని తెలిపింది.అయితే అది ఏ సంస్థ తయారీ, ఏ రకానికి చెందినది అనే వివరాలనూ పాక్‌స్తాన్‌ వెల్లడించలేదు. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా ‘మర్కా–ఇ–హక్‌ (ఘన విజయం)’ లక్ష్యంగా ‘ఆపరేషన్‌ బుని యాన్‌ అల్‌ మర్సుస్‌’ను చేపట్టామని ఆ ప్రకటన తెలిపింది. గాయపడిన సైనికులు, పౌరులను పరామర్శించేందుకు సోమవారం పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ రావల్పిండిలోని కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రిని సందర్శించడం తెల్సిందే. గాయపడిన సైనికాధికారులు, జవాన్లను ఓదార్చేందుకు లాహోర్‌లోని కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రిని పంజాబ్‌ మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్‌ సందర్శించారు.

Sudigali Sudheer Brother Blessed With Baby Boy6
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు

'జబర్దస్త్' కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తొస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. సాధారణ కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. టీమ్ లీడర్ గా ఎదిగి.. ప్రస్తుతం రియాలిటీ షోలకు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు. వయసు దాటిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది.సుడిగాలి సుధీర్ తో పాటు అతడి కుటుంబం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే గతంలో తాను యాంకర్ గా చేస్తున్న టైంలో ఒకటి రెండుసార్లు కుటుంబ సభ్యులు.. షోలో కనిపించారు. అసలు విషయానికొస్తే గుడ్ న్యూస్ సుధీర్ పెళ్లి గురించి అయితే కాదు. వీళ్ల ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుధీర్ తమ్ముడు రోహన్-రమ్య దంపతులకు బాబు పుట్టాడు. ఈ మేరకు రోహన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్) సుధీర్ కి తమ్ముడు, చెల్లి ఉన్నారు. రోహన్ ఇక్కడే కుటుంబంతో కలిసి ఉండగా.. చెల్లి శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాల్లో ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. సుధీర్ తమ్ముడు రోహన్ కి రమ‍్యతో పెళ్లి కాగా కొన్నేళ్ల క్రితం పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. దీంతో సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. అంతా ఓకే కానీ మరి సుధీర్ పెళ్లెప్పుడు చేసుకుంటాడో?సుధీర్ సినిమాల విషయానికొస్తే.. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడ్, కాలింగ్ సహస్ర అని మూవీస్ చేశాడు. ప్రస్తుతం G.O.A.T అనే చిత్రంలో నటిస్తున్నాడు. చాలారోజుల క్రితం దీన్ని ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) View this post on Instagram A post shared by Rohan Bayana (@bayana.rohan)

YSRCP chief visits Murali Nayaks family7
మురళీ నాయక్‌ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్‌ జగన్‌

సాక్షి, పుట్టపర్తి: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మురళీ నాయక్‌ వయసులో చిన్నవాడే అయిన­ప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొని­యాడారు. యావత్‌ భారత్‌ గర్వపడేలా వీరోచితంగా పోరాడి.. దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు. మంగళవారం మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మురళీనాయక్‌ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీనాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్‌ సార్‌ వచ్చారు.. లేచి సెల్యూట్‌ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్‌ నాయక్‌ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్‌ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్‌ దేశం రుణపడి ఉంటుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.మురళీ కుటుంబానికి రూ.25 లక్షల సాయంకల్లి తండాలో వీర జవాన్‌ మురళీ నాయక్‌ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్‌ త్యాగానికి వెల కట్టలేమని చెప్పారు. దేశం కోసం పోరాడుతూ.. తన ప్రాణ త్యాగంతో మిగిలిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రక్షణ ఇచ్చార­న్నారు. యావత్‌ భారత్‌ దృష్టిని ఆకర్షించిన మురళీని మన మధ్యలోకి తేలేం కానీ.. ఆయన త్యాగానికి రుణపడి ఉంటామన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దేశం కోసం పోరాడుతూ.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడం పట్ల అభినందించారు.దారి పొడవునా స్వాగతంకర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ ప్లాజా నుంచి కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, పాల సముద్రం, గుమ్మయ్యగారిపల్లి, కల్లి తండా వరకు దారి పొడవునా ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ సరిహద్దులో వీరమరణం పొందిన మురళీనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. జాతీయ జెండాలతో చిన్నారులు మార్గం మధ్యలో స్వాగతం పలికారు. వాహనంపై నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Paytm block deal involving Ant Financial affiliate of Alibaba Group8
పేటీఎమ్‌లో రూ.2,104 కోట్ల బ్లాక్‌డీల్‌

ఫిన్‌టెక్‌ చైనా దిగ్గజం యాంట్‌ గ్రూప్‌ తాజాగా దేశీ డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో 4 శాతం వాటా విక్రయించింది. పేటీఎమ్‌ బ్రాండ్‌ కంపెనీలో వాటాను షేరుకి రూ. 823–826 ధరల శ్రేణిలో దాదాపు రూ. 2,104 కోట్లకు అమ్మివేసింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 2.55 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది.ఇదీ చదవండి: యాపిల్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరికలుబీఎస్‌ఈ బల్క్‌ డీల్‌ వివరాల ప్రకారం గోల్డ్‌మన్‌ శాక్స్‌(సింగపూర్‌) 37.35 లక్షల షేర్లు(0.59% వాటా) కొనుగోలు చేసింది. షేరుకి రూ. 823 సగటు ధరలో ఇందుకు రూ. 307.4 కోట్లు వెచ్చించింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీల తదుపరి పేటీఎమ్‌లో యాంట్‌ గ్రూప్‌ వాటా 9.85% నుంచి 5.85%కి తగ్గింది. బల్క్‌ డీల్స్‌ నేపథ్యంలో పేటీఎమ్‌ షేరు నిన్న బీఎస్‌ఈలో 1.1 శాతం నష్టంతో రూ. 857 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 864–823 మధ్య కదలాడింది.

Excitement over the return of foreign players in the IPL9
IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు?

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఇప్పుడు లీగ్‌లో జరగాల్సిన తర్వాతి మ్యాచ్‌లపై అందరి దృష్టీ నిలిచింది. ఆరు నగరాలు బెంగళూరు, ముంబై, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్‌లలో మిగిలిన 13 లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన గవర్నింగ్‌ కౌన్సిల్‌... ‘ప్లే ఆఫ్స్‌’ మ్యాచ్‌ల వేదికలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌ల వేదికలకంటే ఆయా జట్లకు ఎవరెవరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మే 9న ప్రకటించడంతోనే దాదాపు అందరు విదేశీ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నవారు కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మే 17 నుంచి ఐపీఎల్‌ మళ్లీ మొదలవుతున్నట్లుగా బీసీసీఐ సోమవారమే ప్రకటించింది. దాంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని కీలక ఆటగాళ్లను రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆటగాళ్ల ఇష్టానికి... యుద్ధం కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. అయితే విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్‌ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్‌ తేదీల ప్రకారమే తాము ఎన్‌ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధానంగా రెండు సిరీస్‌ల కారణంగా ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడే విషయంలో ఇబ్బంది ఎదురు కావచ్చు. ఇంగ్లండ్, వెస్టిండీస్‌ మధ్య వన్డే సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్‌లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్‌ కొత్త తేదీల్లోనే ఈ సిరీస్‌ ఉంది. మరో వైపు జూన్‌ 11 నుంచి ప్రతిష్టాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఉంది. ఇందులో ఆడే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో చాలా మంది కోసం ఐపీఎల్‌ టీమ్‌లు ఎదురు చూస్తున్నాయి. మే 31న ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టు టీమ్‌ ఒక చోటకు చేరాలని దక్షిణాఫ్రికా బోర్డు స్పష్టంగా ఆదేశించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులోంచి రబడ, ఎన్‌గిడి, స్టబ్స్, మార్క్‌రమ్, రికెల్టన్, బాష్, యాన్సెన్, ముల్డర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ జట్లలో ఉన్నారు.అహ్మదాబాద్‌లోనే ఫైనల్‌! ‘ప్లే ఆఫ్స్‌’ మ్యాచ్‌ల వేదికల విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పాత షెడ్యూల్‌ ప్రకారం రెండు మ్యాచ్‌లు హైదరాబాద్, మరో రెండు కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు నగరాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక ఏర్పాట్ల సమస్యను దృష్టిలో ఉంచుకొని ‘ప్లే ఆఫ్స్‌’ను ఇక్కడి నుంచి తరలించాలని బోర్డు యోచిస్తోంది. మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ను సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా కొత్త వేదికలో కష్టమని భావిస్తోంది. పైగా ‘ప్లే ఆఫ్స్‌’ తేదీల్లో హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో వర్ష సూచన ఉంది. అందుకే మిగిలిన లీగ్‌ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఆరు వేదికల నుంచి ఏవైనా రెండింటిలో ‘ప్లే ఆఫ్స్‌’ జరపాలనేది ఆలోచన. ఇదే కారణంగా చెన్నై, హైదరాబాద్‌ తమ హోం గ్రౌండ్‌లో ఆడాల్సిన చివరి లీగ్‌ మ్యాచ్‌లను కూడా ఫ్రాంచైజీలకు చెప్పి అక్కడి నుంచి తరలించారు. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఈ రెండు జట్ల చివరి మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికవుతోంది. బీసీసీఐ యోచన ప్రకారం క్వాలిఫయర్‌–1, ఎలిమినేటర్‌లను ముంబైలో నిర్వహించి... క్వాలిఫయర్‌–2, ఫైనల్‌ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహించవచ్చు.

India Wants additional S-400 missiles from Russia10
పాకిస్తాన్‌కు చుక్కలే.. రష్యాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టడంలో ఎస్‌–400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ వ్యవస్థలు ‘సుదర్శన చక్ర’గా భారతదేశ రక్షణ శాఖకు తురుపుముక్కగా మారాయి. శత్రుదేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు.ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అందజేయాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భారత్‌ వినతిని అతిత్వరలోనే రష్యా అంగీకరించే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్య వస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి ఐదు ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ 5.43 బిలియన్‌ డాలర్లు. 2021 నుంచి దశలవారీగా ఐదు వ్యవస్థలు రష్యా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ఎస్‌-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్‌ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్‌ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్‌, బాలిస్టిక్ మిసైల్స్‌ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్‌ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్‌ టైమ్‌ చేలా వేగంగా ఉంటుంది. ఎస్‌-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్‌ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ ఉంటుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement