వెలుగుల దివ్వె
ప్రారంభించేందుకు ఏపీ జెన్‌కోసన్నాహాలు
మరో నెలరోజుల్లో సీలేరు నదిపై నిర్మాణ పనులు
సహజ సిద్ధంగా ప్రవహించే నీటితో తక్కువ ఖర్చుతో రూ.కోట్లలో ఆదాయం ఇచ్చేలా మరో జల విద్యుత్
కేంద్ర నిర్మాణం కార్యరూపం దాల్చనుంది. ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో సీలేరు విద్యుత్
కాంప్లెక్స్‌లో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు (ఎత్తిపోతల పథకం) నిర్మాణ పనులు మరో నెలరోజుల్లో
ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 845 మెగావాట్లు విద్యుత్
ఉత్పత్తి అవుతుండగా పొల్లూరులో రెండు యూనిట్లు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ పూర్తయితే
2,345 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేరాఫ్‌గా సీలేరు కాంప్లెక్స్ అవతరించనుంది.
1350 మెగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు
సీలేరు: తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒడిశా సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక్కొక్క నీటి బిందువు ప్రవాహంలా మారి ప్రవహించే సీలేరు నదికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సహజ సిద్ధంగా ప్రవహించే ఈ నదిపై ఇప్పటికే సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే నాలుగు కేంద్రాల ద్వారా 845 మెగావాట్ల ఉత్పత్తి
విద్యుత్ ఉత్పత్తిలో సీలేరు కాంప్లెక్స్‌లోని జలవిద్యుత్ కేంద్రాలు నిరంతరం ముందుంటాయి. మండు వేసవిలో సైతం ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి చేసేలా నీటి నిల్వలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు నాలుగు విద్యుత్ కేంద్రాల ద్వారా 845 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మాచ్‌ఖండ్‌లోని 6 యూనిట్ల ద్వారా 120 మెగావాట్లు, సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లలో 240 మెగావాట్లు, డొంకరాయిలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్లు, మోతుగూడెం (పొల్లూరు)లో 4 యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది. ఇవి కాకుండా 120 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం పొల్లూరు విద్యుత్ కేంద్రంలో శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో నిర్మించబోయే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ద్వారా మరో 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.
పొల్లూరులో చురుగ్గా రెండు యూనిట్ల నిర్మాణ పనులు
రూ.13 వేల కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్
నిరంతర ఉత్పత్తిలో..
Comments
Please login to add a commentAdd a comment