తూర్పుకనుమల్లో మాచ్‌ఖండ్ మొదలుకొని బలిమెల నుంచి సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయిన నీరు శబరి నదిలో కలిసి గోదావరి మీదుగా సముద్రంలో చేరుతుంది. ఈ నీరు వృధా కాకుండా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ద్వారా మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే లక్ష్యంతో ఏపీ జెన్కో చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రూ.13 వేల కోట్లతో సీలేరు సమీప పార్వతీనగర్ వద్ద 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా తొమ్మిది యూనిట్లతో ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.
● ఈ ప్రాజెక్టు నిర్మాణం పైభాగంలో మూడు కిలోమీటర్ల పొడవునా సొరంగమార్గం ఏర్పాటుచేసి గుంటవాడ డ్యామ్ నుంచి నీటిని తీసుకువచ్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అనంతరం విడుదలైన నీటిని మరో మూడు కిలోమీటర్ల పొడవైన సొరంగం మార్గం ద్వారా డొంకరాయి జలాశయంలోకి మళ్లిస్తారు. అవసరమైనప్పుడు ఆదే నీటిని రివర్స్ పంపింగ్ విధానంతో ఆదే సొరంగం ద్వారా గుంటవాడ డ్యాంలోకి మళ్లించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్ట్‌ను యాప్‌కో సంస్థ డిజైన్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment