రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
● ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం ఆదేశించారు. నర్సాపురం పీహెచ్సీని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎంతమంది వైద్యాధికారులు,సిబ్బంది ఉన్నారు, ప్రతిరోజు ఎంతమంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారో అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. అనంతరం కె.ఎర్రంపాలెం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలికల పాఠశాలను పీవో సందర్శించారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజు మెనూ అమలు చేయాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పోక్స్ పేట గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) జమున విధులకు గైర్హాజరు కావడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment