మేలు చేసే పోలీసులకు సహకరించాలి
ముంచంగిపుట్టు: మేలు చేసే పోలీసులకు గిరిజనులు అన్నివిధాలుగా సహకరించాలని అడ్రహల్ బీఎస్ఎఫ్ 180 బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్ పాండే అన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని అడ్రహల్ బీఎస్ఎఫ్ 180 బెటాలియన్ పోలీసు బలగాలు మంగళవారం ఖల్‌గూడ గ్రామంలో సివిల్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన రహదారి లేని ఈ గ్రామానికి సుమారు రెండు గంటల పాటు కాలినడకన కొండలు,గుట్టలు ఎక్కి సామగ్రిని మోసుకొని అతి కష్టం మీద పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, గిరిజన యువకులకు వాలీబాల్ కిట్లు, వంటపాత్రలు, రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. సింధిగూడ, హుందిపాడ, బల్లియపాడ, కొంటంగూడ గ్రామాలకు చెందిన 231 మంది వైద్య సేవలు అందించారు. మందులు పంపిణీ చేశారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడ్రహల్ బీఎస్ఎఫ్ 180 బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్ పాండే మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల్లో సివిల్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా గిరిజనులకు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. . ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ 180 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు సతేంద్రకుమార్పాత్రో, శైలేష్‌కుమార్, సునీల్‌కుమార్ యాదవ్, బీఎస్ఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
బీఎస్ఎఫ్ 180 బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్ పాండే
Comments
Please login to add a commentAdd a comment