వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు
అరకులోయ టౌన్: రోగులకు వైద్యసేవలందించడంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యుల సేవలు అభినందనీయమని, వైద్య సిబ్బంది సేవలు సక్రమంగా అందడం లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలు అంతంతమాత్రంగా ఉన్నాయన్నారు. మీరంతా గిరిజన ప్రాంత రోగులకు మెరుగైన సేవలు అందించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడు రోగులకు మెరుగైన వైద్యం, స్నేహపూర్వకంగా వ్యవహరించినప్పుడే వారికి రోగం నయం అవుతుందన్నారు. ప్రభుత్వం అందించే సేవలను ప్రజలకు చేరువ చేయాలని, ఆస్పత్రికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యో గుల సమస్యలు తన దృష్టికి లేదా ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతీ దానికి పోరాటం చేస్తే పరిష్కారం కాదన్నారు. వైద్య సిబ్బంది ఆస్పత్రి సూపరింటిండెంట్ సలహాలు సూచనలు పాటించి విధులు నిర్వర్తించాలన్నారు. వ్యక్తిగత నిర్ణయాలతో రోగులకు ఇబ్బందులు కలిగించవద్దని వారికి ఎమ్మెల్యే సూచించారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకు ఏరియా ఆస్పత్రి సిబ్బందికి సూచన
Comments
Please login to add a commentAdd a comment