ఆరిలోవ(విశాఖ): విశాఖ కేంద్ర కారాగారంలోని ఖైదీలను వేరే జైలుకు తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఇది వారం రోజులపాటు కొనసాగనుంది. ఇక్కడ సామర్థ్యానికిమించి ఖైదీలు ఉండటంతో పరిపాలన సౌలభ్యంలో భాగంగా 200 మందిని రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా విశాఖ పోలీసుల ఎస్కార్టుతో మంగళవారం 20 మంది ఖైదీలను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వ్యాన్‌లో తరలించినట్లు జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్.సాయిప్రవీణ్ తెలిపారు.
స్టీల్‌ప్లాంట్‌కు
కేంద్ర ఉక్కు మంత్రి రాక రేపు
ఉక్కునగరం: కేంద్ర ఉక్కుశాఖామంత్రి హెచ్డీకుమారస్వామి గురువారం స్టీల్‌ప్లాంట్‌కు రానున్నారు. ఆ రోజు ఉదయం తిరుపతి నుంచి విశాఖ వస్తారు. విశాఖలో సెయిల్, బీటీఎస్వో అధికారులతో సమావేశమవుతారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌కు చేరుకుని, వివిధ ఉత్పత్తి విభాగాలను సందర్శించనున్నారు. సాయంత్రం 4.30కు స్టీల్‌ప్లాంట్ నుంచి బయల్దేరి, ఢిల్లీకి పయనమవుతారని అధికార వర్గాల సమాచారం. అయితే ఈ పర్యటనలో స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాలు, అసోసియేషన్లతో సమావేశం పట్ల ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment