జన్మన్ ఇళ్లు వేగవంతం చేయాలి
● లబ్ధిదారులకు హౌసింగ్ పీడీ
బాబు సూచన
ముంచంగిపుట్టు: ప్రధానమంత్రి జన్మన్ గృహాలు త్వరితగతిన పూర్తిచేయాలని హౌసింగ్ పీడీ బి.బాబు సూచించారు. బుధవారం మండలంలోని కిలగాడ పంచాయితీ తరిగెడలో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గృహాల మంజూరు, నిర్మాణాల్లో పాటించాల్సిన నిబంధనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి పీఎం జన్మన్లో 3,400 ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పీఎంఏవై ద్వారా గ్రామాల్లో ఇళ్ల మంజూరుకు సర్వే చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటికి అర్హులైన ప్రతి ఒక్కరు వారి ఆధార్ కార్డును ఆప్డేట్ చేసుకొని ఈకేవైసీ చేసుకోవాలని ఆయన కోరారు. మండల హౌసింగ్ ఏఈ కృష్ణారావు,హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment