మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్చని అందాలు.. జలపాతాల గలగలలు.. కొండ కోనల్లో సాగే ప్రయాణాలు.. పలకరించే కాఫీతోటలు.. ఆకట్టుకునే గిరిజనుల సంప్రదాయాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో అందాల సమాహారం. అందుకే అరకులోయ ఆంధ్రా ఊటీగా ఖ్యాతిగాంచింది. ప్రపం | - | Sakshi
Sakshi News home page

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్చని అందాలు.. జలపాతాల గలగలలు.. కొండ కోనల్లో సాగే ప్రయాణాలు.. పలకరించే కాఫీతోటలు.. ఆకట్టుకునే గిరిజనుల సంప్రదాయాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో అందాల సమాహారం. అందుకే అరకులోయ ఆంధ్రా ఊటీగా ఖ్యాతిగాంచింది. ప్రపం

Published Thu, Jan 30 2025 2:16 AM | Last Updated on Thu, Jan 30 2025 2:16 AM

మన్యం

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్

పద్మాపురం గార్డెన్‌ ముఖద్వారం వద్ద అలంకరణ

అరకులోయలో రేపటి నుంచి అరకు

చలి ఉత్సవాలు

మూడు రోజులపాటు నిర్వహణ

ముస్తాబు అవుతున్న పర్యాటక

ప్రాంతాలు

ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

సాక్షి, పాడేరు: అరకు.. ఎన్నెన్నో అందాలకు పెట్టింది పేరు. సీజన్‌ ఏదైనా ఇక్కడికి వచ్చే సందర్శకులు మంత్ర ముగ్ధులవుతుంటారు. ఇటువంటి ప్రకృతి దృశ్యాలను చూడడం ఒక లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటుంటారు పర్యాటకులు. గిరిజన ఆచార, సంప్రదాయలకు వేదికగా పండగ వాతావరణంలో అరకు చలి ఉత్సవాలు నిర్వహించేందుకు ఈ ప్రాంతం ముస్తాబు అవుతోంది.

గాలిలో తేలిపోయేలా పారా గ్లైడింగ్‌..

ఐటీడీఏ ఆధ్వర్యంలో పారా గ్లైడింగ్‌ అందుబాటులోకి తెస్తున్నారు. మాడగడ వ్యూపాయింట్‌ ప్రత్యేకతను పర్యాటకులకు చూపిస్తూ ఈ పారా గ్లైడింగ్‌ ఏర్పాటుతో అరకు చలి ఉత్సవాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

భూతల స్వర్గం..

అరకులోయకు పూర్వం నుంచి ఆంధ్రా ఊటీగా పేరుంది. పర్యాటక ప్రాంతం అరకులోయ ప్రపంచ దేశాల పర్యాటకులను కూడా ఆకర్శిస్తుంది.భారతదేశాన్ని పర్యటించే అనేక దేశాల పర్యాటకులు అరకులోయను మరచి పోకుండా సందర్శిస్తుండటం విశేషం.

రోడ్డు మార్గంలోనూ అందాలే

విశాఖపట్నం నుంచి అరకులోయ రోడ్డు మార్గంలో కూడా ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొండల నడుమ ఘాట్‌రోడ్డులో ప్రయా ణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తయిన గాలికొండ మరింత ఆకర్షిస్తుంది. డముకు వ్యూపాయింట్‌ల వద్ద పర్యాటకులు సందడి ఉంటుంది. సుంకరమెట్ట సమీపంలోని కాఫీతోటలను అటవీ పర్యాటకంలో భాగంగా అభివృద్ధి చేశారు.

గిరిజన మ్యూజియం...

పద్మాపురం గార్డెన్‌

గిరిజన మ్యూజియంలో గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులు ప్రత్యేక ఆకర్షణ. గిరిజన మ్యూజియంలో బోటుషికారు ఉంది. పలు సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. పద్మాపురం బొటానికల్‌ గార్డెన్‌లో పూలజాతుల మొక్కలతో పాటు, ఔషధ, పండ్ల జాతుల చెట్లు కూడా ఉన్నాయి.ఇక్కడ టాయ్‌ట్రైన్‌లో ప్రయాణం చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటుంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.30 లక్షలతో గార్డెన్‌లో అనేక సౌకర్యాలను కల్పించారు.ఇటీవల ఐటీడీఏ కూడా మరో రూ.70లక్షలతో గార్డెన్‌ను ఆధునికీకరించింది. ట్రీహట్స్‌ ప్రత్యేక ఆకర్షణ.

లేలేత కిరణాలతో..

అరకులోయ సమీపంలోని మాడగడ వ్యూపాయింట్‌ పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఎత్తయిన ఈ కొండపై వేకువజామున పొగ మంచు, సూర్యోదయం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు.

కళాకారులకు వసతి ఏర్పాట్లు..

అరకు ఉత్సవ్‌ కోసం వచ్చే కళాకారులకు వసతి, భోజన, రవాణా తదితర అవసరాలను పూర్తి చేయాలని, ఈ మేరకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసి అధికారులకు విధులు, బాధ్యతలను స్పష్టం చేయాలని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశించారు.అలాగే, ఉత్సవాలకు అయ్యే ఖర్చులపై బడ్జెట్‌ అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు.

రూ.కోటి నిధులు మంజూరు

పర్యాటక ప్రాంతం అరకులోయలో చలి అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.ర ాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులను మంజూరు చేసింది. వీటిని పారదర్శకంగా వినియోగిస్తాం. మూడు రోజుల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం.

– ఏఎస్‌ దినేష్‌కుమార్‌, కలెక్టర్‌, పాడేరు

ప్రపంచ ఖ్యాతి బొర్రాగుహలు

నంతగిరి మండలంలోని బొర్రాగుహలు ప్రపంచ ఖ్యాతి పొందాయి. విదేశాలలో కూడా బొర్రాగుహలను పర్యాటకులు గొప్పగా చెప్పుకుంటారు. వీటిలో పలు ఆకృతులలో శిలాసంపద కనువిందు చేస్తుంది. సందర్శకులను ఆకట్టుకునే పర్యాటకశాఖ విద్యుత్‌ వెలుగులతో సుందరీకరించింది.

హెలికాప్టర్‌లో

అందాలు తిలకించేలా..

అరకు చలి ఉత్సవానికి వచ్చే పర్యాటకులు ఆకాశంలో విహరిస్తూ మన్యం అందాలను తిలకించేలా అధికార యంత్రాంగం హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉత్సవాల మూడు రోజులు ఇది ఉంటుంది. దీనిలో విహరించే వారు రూ.3,500లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. హెలిప్యాడ్‌ వద్ద స్పాట్‌ బుకింగ్‌ సౌకర్యం ఉందని ప్రైవేట్‌ అడ్వెంచర్‌ సంస్థ నిర్వాహకుడు శివ తెలిపారు.

డిగ్రీ కళాశాలలో వేదిక

అరకులోయ టౌన్‌: అరకు చలి ఉత్సవం–2025 గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేదిక ఏర్పాటుచేస్తున్నారు. పద్మాపురం ఉద్యానవనంలో ఫ్లవర్‌ షో వివిధ రకాల పూలతో ఆకర్షణీయంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెల 31వ తేదీ ఉదయం 7.30 గంటలకు పద్మాపురం ఉద్యానవనం నుంచి స్థానిక డిగ్రీ కళాశాల మైదానం వరకు అరకు మారథాన్‌ పేరుతో 5కె రన్‌తో ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఉత్సవాలు నిర్వహించే మూడు రోజులు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, పారా గ్‌లైడింగ్‌ను ఏర్పాట్లు చేస్తున్నారు.

అరకు డిగ్రీ కళాశాల మైదానంలో ఉత్పవ ఏర్పాట్లు

మాడగడ వ్యూపాయింట్‌ వద్ద ఆకట్టుకుంటున్న ఉదయభానుడి అందాలు

No comments yet. Be the first to comment!
Add a comment
మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్1
1/6

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్2
2/6

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్3
3/6

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్4
4/6

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్5
5/6

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్6
6/6

మన్యం ప్రకృతి సొగసుల నిలయం. ఎటుచూసినా కనువిందు చేసే పచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement