రైలులో ప్రయాణం అద్భుతం
అరకులోయకు రైలు ప్రయాణం అబ్బురపరుస్తుంది. విశాఖలో ఉద యం 7గంటల సమయంలో బయలుదేరే విశాఖ–కిరండోల్ పాసింజర్ విస్టోడోమా కోచ్‌లో ప్రయాణించేందుకు పర్యాటకులు ఇష్టపడతుంటారుు. కొండల నడుమ సాగే ఈ ఆహ్లాదకర ప్రయాణంతో పర్యాటకులు పరవశిస్తారు. బొడ్డవర ప్రాంతం నుంచి అరకులోయ సమీపంలోని కరకవలస వరకు రైలు ప్రయాణం ఎత్తయిన కొండల మధ్య సాగుతుంది. పట్టపగలు కూడా టన్నెల్స్ దాటే సమయంలో నెలకొన్న చీకటిలో రైలు ప్రయాణం పర్యాటకులను ఎంతో గానో ఆకట్టుకుంటోంది. ఈ మార్గంలో మొత్తం 52 టన్నెళ్లు ఉన్నాయి. బొర్రా–చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 900మీటర్ల పొడవున ఉన్న భారీ టన్నెల్‌ను రైలు దాటేందుకు సుమారు 20 నిమిషాలు పడుతుంది. మిగతా టన్నెల్స్ 200 మీటర్ల పొడవు లోపునే ఉంటాయి. బొర్రా గుహల మీదుగా రైలు పట్టాలు ఉండడం మరో ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment