చర్మవ్యాధి తగ్గే వరకు వైద్యశిబిరాలు
పెదబయలు: చర్మవ్యాధులు ప్రబలిన గ్రామాల్లో చిన్నారులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడంతోపాటు ఆయా గ్రామాల్లో నిరంతరం వైద్యశిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన లండూలు గ్రామంలో పర్యటించారు. తాగునీటి పథకం మంజూరు చేయాలని, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆయనను కోరారు. లండూలు గ్రామం నుంచి వలసల బంద వరకు రోడ్డు నిర్మించాలని వారు విన్నవించారు. గిన్నెలకోట పంచాయతీలో పదేళ్లలోపు చిన్నారులకు చర్మవ్యాధులు ప్రబలడంపై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా గ్రామాల్లో ఆహార అలవాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో సాధారణ పరిస్థితి వచ్చే వరకు ప్రతిరోజు వైద్యశిబిరాలు నిర్వహించాలని వైద్యసిబ్బందికి సూచించారు. పరిస్థితులు ఏమాత్రం బాగులేకపోయినా వెంటనే ఆస్పత్రికి తరలించాలని రూడకోట పీహెచ్‌సీ వైద్యాధికారి సత్యారావును కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
లండూలు గ్రామంలో పర్యటన
Comments
Please login to add a commentAdd a comment