గిరిజన చట్టాలను హరిస్తే సహించం
పాడేరు : గిరిజన చట్టాలు, హక్కులను హరించేలా పాలకులు, కూటమి నేతలు వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు 1/70 చట్టానికి తూట్లు పొడిచేలా ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతూ చట్టాలను సవలించాలని మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. గిరిజన ప్రాంతంలో దాగి ఉన్న అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకే అయ్యన పాత్రుడు ఈ విధంగా మాట్లాడారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గిరిజన ప్రాంతం జోలికి ఎందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంత హక్కులు, చట్టాలు ఉల్లంఘించేలా మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గిరిజన చట్టాలు, హక్కులు నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం, నాయకులు చేసే ప్రతి చర్యను తాము అడ్డుకుంటామన్నారు. అవసరమైతే తన పదవులకు రాజీనామా చేసి స్థానిక ఆదివాసీలతో కలిసి ఉద్యమం చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో బినామీల రాజ్యం నడుస్తోందన్నారు. 1/70 చట్టానికి తూడ్లు పొడుస్తూ బినామీల ద్వారా యథేచ్ఛగా అక్రమ
మిగతా 8వ పేజీలో
1/70 చట్టానికి తూట్లు పొడిచేలా
స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు
గిరిజన ప్రాంత అభివృద్ధికి నిధులు
కేటాయించకుండా వివక్ష
ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు
కొత్త డ్రామా
బినామీల రాజ్యానికి
కూటమి నేతల సారథ్యం
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment