చర్మ వ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం | - | Sakshi
Sakshi News home page

చర్మ వ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం

Published Tue, Jan 28 2025 1:01 AM | Last Updated on Tue, Jan 28 2025 1:01 AM

చర్మ

చర్మ వ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం

● రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మావతి ● గిన్నెలకోట పంచాయతీలోని ఐదు గ్రామాల్లో పర్యటన

పెదబయలు: గిన్నెలకోట పంచాయతీలోని ఐదు గ్రామాల్లో చర్మవ్యాధి సోకిన చిన్నారులకు పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మావతి అన్నారు. సోమవారం ఆమె గిన్నెలకోట, లండూలు, ఇనుపతీగల, మెట్టగుడ, గొచ్చంగి గ్రామాల్లో పర్యటించారు. చర్మవ్యాధి ప్రబలిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో వారు తీసుకుంటున్న ఆహారం, తాగునీటిని పరిశీలించారు. చిన్నారులు మందులు సరిగ్గా వాడేలా ప్రతిరోజూ ఆశా కార్యకర్తలు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం పెదబయలులో విలేకరులతో మాట్లాడారు. ఐదు గ్రామాల్లో చర్మవ్యాధి బారిన పడిన 15 మంది పిల్లలకు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని చెప్పారు. వీరిలో ఒకరిని వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నట్టు చెప్పారు. శరీరంపై దద్దుర్లు, జ్వరంతో బాధపడుతున్న మరో చిన్నారిని పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఆమె పేర్కొన్నారు. గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో వారం రోజులపాటు వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి, ప్రతిరోజు మందులు వేయించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా నయం అయ్యేవరకు

మిగతా 8వ పేజీలో

No comments yet. Be the first to comment!
Add a comment
చర్మ వ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం 1
1/1

చర్మ వ్యాధి సోకిన పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement