Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Operation Sindoor: India Pakistan War Updates1
ఆపరేషన్ సిందూర్‌.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటన

India-Pakistan War Updates:👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్‌.. ఇండియా గేట్‌ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్‌, రాజస్థాన్‌ వెళ్లే వాహనాలు బంద్‌👉కాసేపట్లో సీడీఎస్‌, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీపాకిస్థాన్‌ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్‌ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్‌ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ భేటీ 👉ఆపరేషన్ సిందూర్‌.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్‌ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్‌ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్‌ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్‌👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్‌ దాడులు, భారత్‌ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్‌ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్‌ ఎటాక్‌ దిగిన భారత్‌లాహోర్‌, సియాల్‌కోట్‌, కరాచీపై భారత్‌ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్‌ చేసిన ఇండియన్‌ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్‌ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్‌ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్‌ ఫైటర్‌ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్‌ మొదలుకుని జమ్మూ కశ్మీర్‌ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్‌ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్‌ఎస్‌ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్‌’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్‌ యుద్ధ విమానాన్ని ఎస్‌–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్‌–17, ఒక ఎఫ్‌–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్‌ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్‌ తదితర నగరాల్లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్‌ వారి్నంగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్‌)ను తుత్తునియలు చేసింది. పాక్‌ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్‌ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) చీఫ్‌తో అమిత్‌ షా చర్చించారు. ఇండో–పాక్‌ సరిహద్దుసహా బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంట భద్రతను బీఎస్‌ఎఫ్‌ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్‌లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

Indiato Seek Checks On Imf Loans To Pak At Meet2
పాకిస్థాన్‌కు ఆర్థిక సంకెళ్లు?

ఢిల్లీ: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు (IMF) ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్‌ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది.పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్‌ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్‌ సమర్పించిన సంగతి తెలిసిందే.కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్‌ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్‌ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్‌ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్‌ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్‌ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్‌ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

Subham Movie Review And Rating In Telugu3
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ

స్టార్‌ హీరోయిన్‌ సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో సమంత పాల్గొనడం..వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో ‘శుభం’పై బజ్‌ క్రియేట్‌ అయింది. ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(మే 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్‌. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్‌ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్‌ అయిపోతాడు. ఫస్ట్‌నైట్‌ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్‌ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్‌ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్‌ చూస్తుంది. ఈ టైంలో సీరియల్‌ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసు​ంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్‌ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్‌గానే చెప్పాలా? లేదంటే ఇదిగో మేం ఈ మంచి మేసేజ్‌ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా? అలా చేయకుండా, నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది ‘శుభం’ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల. సీరియల్‌ పిచ్చి అనే కాన్సెప్ట్‌ని తీసుకొని.. అందులోనే పురుషాధిక్యత ఎత్తిచూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి, కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్‌-కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం ‘శుభ’ పరిణామం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే కామెడీ-హారర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్‌ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్‌ కానీ, కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఇంతకు మంచి కామెడీ-హారర్‌ కథలను మనం చూశాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైన ఉందంటే.. సీరియల్‌కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్‌ యాంగిల్‌లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్‌నైట్‌ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఫస్ట్‌నైట్‌ రోజు శ్రీవల్లీ ఇచ్చే ట్విస్ట్‌తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీనుబృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్‌ గురించి ప్రస్తావించకపోవడమే మంచింది. దర్శఖుడు తన ‘సినిమా బండి ’టీమ్‌ని ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్‌ సమస్యను క్లోజ్‌ చేసే సన్నివేశాలు కూడా సీరియల్‌గా సా..గడంతో కథ అక్కడడక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ బాగుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్‌ ఆపరేటర్‌గా హర్షిత్‌ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పేరీ బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లీగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది..సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది. సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయని చెప్పలేం కానీ.. సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

JD Vance Comments On India And Pakistan tensions4
భారత్‌, పాక్‌ యుద్ధం.. అమెరికా మద్ధతుపై జెడి వాన్స్‌ క్లారిటీ

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడి చేసింది. ఈ క్రమంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాన్స్ మాట్లాడుతూ.. నన్‌ ఆఫ్‌ అవర్‌ బిజినెస్‌ (అది ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు) అని అన్నారు.ఈ రెండు దేశాలను తాము నియంత్రించలేమని జెడి వాన్స్‌ అన్నారు. ఇరుదేశాలు దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు అందరికీ ఆందోళనకరమేనని అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని తాము కూడా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సాధరణ ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇండియా, పాకిస్థాన్‌ యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదని క్లారిటీ ఇచ్చారు. తమ సైన్యం ఎవరికి సాయం చేయదని ప్రకటించారు. ఆపై అటు భారత్‌కు గాని పాకిస్థాన్‌కు గాని యుద్ధం ఆపమని చెప్పలేమన్నారు. అలా అని అణ్వాయుధాల ఉపయోగం ఎట్టిపరిస్థితిల్లోనూ జరగదని ఆయన తేల్చి చెప్పారు. 🚨🇺🇸 ‘NONE OF OUR BUSINESS’: JD Vance on 🇮🇳Indo-🇵🇰Pak escalation pic.twitter.com/EgQuySKbLt— Sputnik India (@Sputnik_India) May 8, 2025

Miss world 2025:  72nd edition of the Miss World in May 10 At Gachibowli 5
Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..

ప్రస్తుతం ప్రపంచమంతా హైదరాబాద్‌ నగరం వైపే చూస్తోంది. దాదాపు 120 దేశాలకు పైగా ఆయా దేశ అధికార ప్రతినిథులు, ప్రముఖులు నగరానికి గగనతల ప్రయాణం చేస్తున్నారు. నగర వేదికగా ప్రతిష్టాత్మక 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన సుందరీమణులతో కళకళలాడుతోంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే 109 దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా మరికొన్ని దేశాలకు చెందిన వారు శుక్రవారం రానున్నారు. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్‌ ఘన వేదికగా మారిన విషయం విధితమే.. ఇందులో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే ప్రీ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెనా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్‌ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి తారలు మిస్‌ వరల్డ్‌ వేదిక పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్‌ వంటి చిన్న దేశాల నుంచి కూడా 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో అభ్యర్థులు పాల్గోనుండడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో వరల్డ్‌ టాప్‌ మోడల్స్‌తో పాటు విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, ఆరి్టస్టులు, విభిన్న రంగాలకు చెందిన ఉద్యమకారులు తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడుతుండటం మరో విశేషం. దేశవ్యాప్తంగా డిజిటల్‌ వెల్‌కమ్‌.. పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గతేడాది ముంబయిలో మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ జరగగా, ఈ ఏడాది మే 31న హైదరాబాద్, హైటెక్స్‌ వేదికగా గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. మిస్‌ వరల్డ్‌ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్‌లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ వెల్‌కమ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోటీలను తిలకించడానికి సామాన్యులకు సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో వివిధ నగరాల నుంచి ఫ్యాషన్‌ ఔత్సాహికులు నగరానికి రావడానికి సన్నద్ధమవుతున్నారు. (చదవండి: Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు')

PSL Moved To UAE Citing Player Well Being Amid Rising Indo Pak Tensions6
Operation Sindoor 2.0: భారత్‌ దెబ్బకు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ వేదిక మార్పు

ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 పేరిట భారత దళాలు పాక్‌పై దాడులు జరుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2025 వేదికను మార్చారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే కొనసాగుతున్న పీఎస్‌ఎల్‌ 10వ ఎడిషన్‌ను యూఏఈకి మార్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ లీగ్‌ మరో ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. నిన్న (మే 8) భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ వేదికను పాక్‌ నుంచి యూఏఈకి తరలించారు. పీఎస్‌ఎల్‌లో తదుపరి జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పీఎస్‌ఎల్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ ప్రకటించాడు.జనావాసాలపై పాక్‌ దళాల దాడులకు బదులిచ్చే క్రమంలో నిన్న రావ‌ల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత దళాలు డ్రోన్‌ దాడి చేశాయి. ఈ దాడి తర్వాత కొద్ది గంటల్లోనే పీఎస్‌ఎల్‌లో భాగంగా పెషావర్‌ జల్మీ, క‌రాచీ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. భారత్‌ దాడుల తీవ్రతను పెంచిందని గ్రహించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తక్షణమే స్పందించి, అప్పటికప్పుడు ఆ మ్యాచ్‌ను రద్దు చేసింది. తాజాగా లీగ్‌ మొత్తాన్నే యూఏఈకి తరలిస్తున్నట్లు ప్రకటించింది.కాగా, పీఎస్‌ఎల్‌లో దాదాపు 40 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వారి భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ క్రికెటర్ల జాబితాలో కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌ లాంటి ప్రముఖులు ఉన్నారు. పాక్‌ నుండి తమ స్వదేశాలను వెళ్లడం ప్రస్తుతం విదేశీ ఆటగాళ్లకు సవాలుగా మారింది. భారత దాడుల నేపథ్యంలో పాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి. విదేశీ క్రికెటర్లకు ఎక్కడ తల దాచుకోవాలో అర్దం కావడం లేదు. పాక్‌ ప్రభుత్వం విదేశీ క్రికెటర్ల భద్రతను గాలికొదిలేసింది. పీసీబీ అధికారులు, పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీ యజమానులు చేతులెత్తేశారు. ప్రస్తుతం పాక్‌లో విదేశీ క్రికెటర్లు బిక్కుబిక్కుమంటున్నారు.మరోవైపు పాక్‌ దాడుల దృష్ట్యా భారత్‌లో ఐపీఎల్‌ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. నిన్న ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌ అర్దంతరంగా రద్దైంది. ధర్మశాలలో బ్లాక్‌ అవుట్‌ ప్రకటించడంతో స్టేడియంలో ఫ్లడ్‌ లైట్లు ఆర్పేశారు. తొలుత ప్రేక్షకులను బయటకు పంపించిన అధికారులు, ఆతర్వాత పరిస్థితిని వివరించారు. ఐపీఎల్‌-2025 భవితవ్యంపై ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.కాగా, పహల్గామ్‌ ఉగ్రదాడికి బదులుగా భార‌త ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరిట పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియ‌న్ ఆర్మీ.. పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇందులో 100 మంది ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు.అనంత‌రం పాక్‌ దళాల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటంతో పాటు మిసైళ్లతో దాడికి దిగారు. జనావాసాలపై దాడికి దిగడంతో సహనం కోల్పోయిన భార‌త్ పాక్‌కు ధీటుగా బ‌దులిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌ 2.0ను మొదలుపెట్టింది. ఇప్పటికే భారత దళాలు పాక్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. రావల్పిండి, ఇస్లామాబాద్‌, ముల్తాన్‌, కరాచీ లాంటి నగరాలపై దాడులతో విరుచుకుపడ్డాయి.

Operation Sindoor: India has successfully shot down three Pakistani fighter jets7
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్‌

ఆపరేషన్‌ సిందూర్‌తో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు. పైపెచ్చు పనిగట్టుకుని యుద్ధ జ్వాలలను రగులుస్తోంది. భారత్‌పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. హమాస్‌ ఉగ్ర సంస్థను తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది. రాజస్తాన్‌ నుంచి కశ్మీర్‌ దాకా సరిహద్దుల వెంబడి దాడులకు పాక్‌ చేసిన యత్నాలను భారత్‌ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. భారీ ప్రతి దాడులతో ముచ్చెమటలు పట్టించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, రావల్పిండిలపై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు విరుచుకుపడి కీలక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తదితరాలను తుత్తునియలు చేసింది. దాడుల ధాటికి ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ బంకర్లో తలదాచుకున్నారు! కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి... న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్‌ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకుని అభాసుపాలైంది. బుధవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచీ భారత్‌పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్‌ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర, సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నింటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక మూడు పాక్‌ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇద్దరు పాక్‌ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కీలక పాక్‌ నగరాలపై ఒకే రోజు రెండుసార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తదితరాలను నేలమట్టం చేసింది. రెండు రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచిచూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. మరోవైపు నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టు సమాచారం. 1971 పాక్‌ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేగాక ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్‌ వైపు కదులుతున్నట్టు చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరువైపుల నుంచీ కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. పౌర లక్ష్యాలపై పాక్‌ సైన్యం విచక్షణారహిత కాల్పులకు తెగబడుతోంది. అందుకు మన సైన్యం దీటుగా బదులిస్తోంది. ఇరు దేశాల్లోనూ సరిహద్దు రాష్ట్రాలు ఎయిర్‌ సైరన్లు, బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా భద్రతా బలగాలను కేంద్రం ఆదేశించింది. సైనికులకు సెలవులు రద్దు చేశారు. కీలకమైన సైనిక తదితర మౌలిక వ్యవస్థల వద్ద రక్షణను కట్టుదిట్టం చేశారు. పాక్‌ అత్యంత అనాగరికంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రం మండిపడింది. పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగిస్తూ హమాస్‌ ఉగ్ర సంస్థను తలపిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు దుయ్యబట్టాయి. జమ్మూ, పఠాన్‌కోట్, ఉద్ధంపూర్‌ల్లో పాక్‌ క్షిపణి, డ్రోన్‌ దాడి యత్నాలను పూర్తిగా తిప్పికొట్టినట్టు సైన్యం ప్రకటించింది. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. సంయమనం పాటించాల్సిందిగా ఇరు దేశాలకూ సూచించింది.పేట్రేగిన పాక్‌ సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్‌ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్‌ ఫైటర్‌ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్‌ మొదలుకుని జమ్మూ కశ్మీర్‌ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి. శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్‌ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్‌ఎస్‌ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది. మన ‘ఆకాశ్‌’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్‌ యుద్ధ విమానాన్ని ఎస్‌–400 వ్యవస్థ నేలకూల్చింది. వాటిలో రెండు జేఎఫ్‌–17, ఒక ఎఫ్‌–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్‌ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, కరాచీ, రావల్పిండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్‌ తదితర నగరాల్లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్‌ వారి్నంగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్‌)ను తుత్తునియలు చేసింది. పాక్‌ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.పలుచోట్ల బ్లాకౌట్‌ పాక్‌ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, మొహాలీ, చండీగఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్‌ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి.

Sakshi Editor Dhananjaya Reddy Fires On Chandrababu Govt8
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్‌.ధనంజయరెడ్డి

సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్‌ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్‌ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్‌ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్‌ చేస్తాం.. ఇది ఓపెన్‌ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్‌ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్‌ ద్వారా ప్రాసిక్యూషన్‌ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్‌ స్పాట్‌ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్‌ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్‌ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్‌.. ఇన్‌ అండ్‌ అరౌండ్‌ సెర్చ్‌ చేస్తున్నాం.. జస్ట్‌ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్‌ నంబర్, నా ఫోన్‌ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్‌ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్‌ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది.

Board of Control for Cricket in India officials want to cancel IPL9
ఐపీఎల్‌ వాయిదా?

ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్‌ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్‌ సరఫరా (పవర్‌ బ్లాక్‌ అవుట్‌)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్‌ సేవల్ని నిలిపివేసింది. పాక్‌ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్‌ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్‌ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్‌ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్‌ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్‌ జెయింట్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ఐపీఎల్‌లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Elon Musk Starlink gets LOI for satcom licence10
స్టార్‌లింక్‌ శాట్‌కామ్‌ వచ్చేస్తోంది..!

న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ (శాట్‌కామ్‌) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్‌ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కు చెందిన స్టార్‌లింక్‌ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్‌) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌–ఎల్‌వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్‌ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్స్‌ బై శాటిలైట్‌ (జీఎంపీసీఎస్‌), ఐఎస్‌పీ, వీశాట్‌ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్‌వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్‌ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్‌.. ఇప్పటికే యూటెల్‌శాట్‌ వన్‌వెబ్, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్‌ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్‌ సర్వీస్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్‌ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్‌ ఆర్బిట్‌’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement