
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రికి రాష్ట్రంలో 111 పాజిటివ్ కేసులు ఉండగా ఆ సంఖ్య గురువారానికి 149కు చేరింది. గురువారం ఒక్కరోజే 38 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన వారివే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసులు నమోదైన వారి ఇళ్ల చుట్టుపక్కల 2 కి.మీ. ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని కరోనా లక్షణాలున్న వారిని జల్లెడ పడుతున్నారు. నెల్లూరులో బుధవారం రాత్రి వరకు 3 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండగా ఇప్పుడా సంఖ్య 24కు చేరింది. ఇప్పటివరకు తీసుకున్న నమూనాల్లో 1,321 నెగిటివ్ అని తేలాయని, మరో 409 కేసులకు సంబంధించి వైద్య నివేదికల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment