15 నుంచే మీసేవలో ‘పాస్‌పోర్టు’!
విశాఖపట్నం: పాస్‌పోర్టు సేవలు మరింత చేరువ చేసేం దుకు వీలుగా ఆగస్టు 15 నుంచి ‘మీసేవ’ కేంద్రా ల్లో అందుబాటులో తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రజలకు ఈ సేవలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతగా ఈనెల 19న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ‘కస్టమర్ సర్వీస్ సెంటర్ల’ (మీసేవ కేంద్రాల) ప్రతి నిధులతో అవగాహన శిబిరం నిర్వహించారు.
ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ స్లాట్ బుకింగ్, ఫీజుల చెల్లింపు ఇతరత్రా సేవల గురించి వారికి తెలియజేశారు. పవర్ పాయింట్ ప్రదర్శనతో అవగాహన కల్పించారు. కేంద్రా ల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. విశాఖ పాస్‌పోర్ట్ కేంద్రం పరిధిలో గల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ‘మీసేవ’ కేంద్రాల ప్రతినిధులను సేవలకు సిద్ధం చేశారు. విశాఖకు అనుసంధానంగా పనిచేస్తున్న విజయవాడ కేంద్రంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధులకు అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు.
ఇ-గవర్నెన్స్ టెక్నాలజీతో విదేశాంగ శాఖకు అనుసంధాన బాధ్యతలు అప్పగించారు. ‘మీసేవ’లో రాష్ట్ర ప్రభుత్వ సేవలతో సంబంధం లేకుండా పాస్‌పోర్ట్ సేవలు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ అనుసంధానంలో ఇబ్బందులు తలెత్తకుండా పాస్‌పోర్ట్ సేవలు అందించాలని ఇప్పటికే పాస్‌పోర్ట్ విభాగ ఉన్నతాధికారులు ఆదేశించా రు. మీసేవ కేంద్రాల్లో చెల్లించే రుసు ంకు తగ్గట్టుగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
ఆగస్టు తొలి వారంలో ప్రయోగాత్మకంగా మీసేవ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభిస్తారు. ప్రతి జిల్లాలో పాస్‌పోర్ట్ అధికారులు, సీఎస్‌సీ ప్రతినిధు లు పనితీరు పర్యవేక్షిస్తారని తెలిసిం ది. సాంకేతిక లోపాలు, సమస్యలను పరిశీలిస్తారు. అంతా సక్రమంగా ఉంటే ఆగస్టు 15 నుంచి సేవలు లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. మీసేవ కేంద్రాల్లో పాస్‌పోర్ట్ సేవల ప్రారంభ తేదీ గురించి కార్యాలయ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే తేదీ ప్రకటిస్తామని చెబుతున్నారు.