లారీ - కారు ఢీ: ఇద్దరు మృతి | 2 people killed in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ - కారు ఢీ: ఇద్దరు మృతి

Published Thu, Sep 12 2013 9:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

2 people killed in lorry accident

గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు.

 

ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మరణించిన ఆ రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని గుంటురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం వద్ద స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఆ ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలపాలైయ్యారు. దాంతో ఆ విద్యార్థులను అత్యవసర ప్రాధమిక చికిత్స నిమిత్తం కోవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement