23 నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల బంద్
Published Tue, Sep 17 2013 3:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు బంద్ పాటిస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ కార్యదర్శి శేఖర్ ప్రకటించారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు వారం రోజుల పాటు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో పాఠశాలలన్నింటినీ బంద్ చేయాలని పిలుపు నిచ్చారు.
జిల్లా ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో వారంలో తొలి మూడు రోజులు పాఠశాలలు బంద్ చేసి మిగిలిన రోజుల్లో పాఠశాలలు నిర్వహించాలని కోరినప్పటికీ రాష్ట్ర జేఏసీ అంగీకరించలేదన్నారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు ఈ నెల 23వ తేదీ వరకు ప్రైవేట్ పాఠశాలలన్నీ యథావిధిగా నడుస్తాయని తెలిపారు. సమైక్య ఉద్యమంలో తాము కూడా కీలక భాగస్వామ్యం పోషిస్తున్నామని ఈ నేపథ్యంలో రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు చేపడుతున్న ఈ బంద్‌కు యాజమాన్యాలు, విద్యార్థులు , ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement