Samaikandhra strike
-
కేంద్ర కార్యాలయాలకు సమైక్య సెగ
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్ర ం ఒంగోలు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లకు వ రుసగా రెండో రోజూ సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌ల కార్యకలాపాలను అడ్డుకున్నారు. శుక్రవారం కూడా అన్ని కార్యాలయాలు, బ్యాంక్‌ల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. ప్రధానంగా బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ వంటి కార్యాలయాలతో పాటు, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, గ్రామీణ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్ బ్యాంక్‌లతో పాటు దాదాపు 60 బ్యాంక్ శాఖలు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు స్తంభించి పోయాయి. దీంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పలేదు. మరోపక్క బ్యాంక్‌ల కార్యకలాపాలు నిలిచిపోవడంతో నగరంలో పలు ఏటీఎంలలో నగదు లేని పరిస్థితి ఏర్పడింది. పనబాక దిష్టిబొమ్మతో శవయాత్ర కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఆమె దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు. స్థానిక కలెక్టరేట్ నుంచి చర్చి సెంటర్ వరకు యాత్ర నిర్వహించారు. ఏడుపులతో వినూత్న నిరసన తెలిపారు. పనబాక వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెకు శాపనార్థాలు పెట్టారు. రాజీనామా చేయకపోతే రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మంత్రిని జిల్లాలో తిరగనిచ్చే పరిస్థితి లేదన్నారు. పోలీసుల సహాయంతో కాకుండా మామూలుగా ప్రజల్లోకి రావాలని, ప్రజల్లోకి వస్తే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఉద్యోగులు హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్‌బషీర్, బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, కేఎల్ నరసింహారావు, శరత్, స్వాములు, ప్రకాశ్,కృష్ణారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళన రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక హెచ్ సీఎం సెంటర్లో వినూత్న నిరసన తెలిపారు. రోడ్డుపై పొయ్యిలు ఉంచి వాటిపై బాండీలు ఏర్పాటు చేసి మంట పెట్టారు. కాగుతున్న బాండీల్లో విద్యార్థులు కూర్చుని నిరసన తెలిపారు. ఉద్యమాలతో సీమాంధ్ర ప్రజలు ఉడుకుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చే యాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు నాగరాజు, రాజశేఖర్, చైతన్య వినోద్ పాల్గొన్నారు. జాతీయ జెండాతో ప్రదర్శన సమైక్యాంధ్రకు మద్దతుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు జాతీయ జెండాతో నిరసన తెలిపారు. మార్కెట్ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్, మార్కెట్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా 364 అడుగుల జాతీయ జెండాతో చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినదించారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంగీకరించేది లేదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
వైదొలగాల్సిందే
సాక్షి ప్రతినిధి, కడప: సమైక్యరాష్ట్రం కోసం అలుపెరగని ఉద్యమం నడుస్తోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం విషయంలో పాలకపక్షం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సీమాంధ్రలో సకల జనం సమైక్యాంధ్రప్రదేశ్ సాధనే అజెండాగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రాజకీయ సంక్షోభమే ఏకైక లక్ష్యంగా ఉద్యమించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ 48 రోజులుగా జిల్లాలో అలుపెరగని పోరాటాన్ని సమైక్యవాదులు చేస్తున్నారు. ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉద్యమకారులు భావిస్తున్నారు. పదవుల్లో ఉంటేనే ప్రాంతం కోసం ఉద్యమించేందుకు వీలుంటుందని, అందుకోసమే కొనసాగుతున్నామని నమ్మబలుకుతూ హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. అయితే ప్రాంతం కోసం, ప్రజానీకం కోసం పదవుల నుంచి వైదొలగాల్సిందేనని మంత్రులు, ఎంపీలకు సమైక్యవాదులు ఆల్టిమేటం జారీ చేస్తున్నారు. రాజకీయ సంక్షోభం సృష్టించాలని తద్వారా యూపీఏ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అరే ఇష్కీ.. రాజీనామా చేశానన్నా వినరే.. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్యమకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు 18 వతేదీ లోగా రాజీనామాలు చేసి, వాటిని ఆమోదింపజేసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆతర్వాత చోటుచేసుకునే ఘటనలకు తాము బాధ్యులం కాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రుల ఇళ్లకు హెచ్చరిక నోటీసులు అంటించారు. మంత్రులు అహ్మదుల్లా, రామచంద్రయ్య, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ ఇళ్లకు సోమవారం హెచ్చరిక నోటీసులు అంటించారు. ఈవిషయాన్ని తెలుసుకున్న ఓమంత్రి ‘అరే ఇష్కీ... రాజీనామా చేశామన్నా విన్పించుకోరే’ అంటూ తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం ఉదృతమవుతున్నా ఆశించిన మేరకు ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకే ఓమారు మంత్రి అహ్మదుల్లా, 20సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసీరెడ్డిలపై చెప్పులు విసిరిన చరిత్ర ఉత్పన్నమైంది. 48 రోజులుగా ఉద్యమం చేస్తుంటే మంత్రులు కేవలం రెండు రోజులు మాత్రమే జిల్లాకు వచ్చి వెళ్లారని పలువురు పేర్కొంటున్నారు. రామ...రామ నోరు మెదపరే...! కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై సమైక్యవాదులు ఆగ్రహం ప్రదర్శించడం వెనుక అర్థం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ఉద్యమం బలపడే కొద్ది కాంగ్రెస్ నేతలపై సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే కమలమ్మ సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన చవిచూశారు. సమైక్య ఉద్యమం పట్ల, ఈ ప్రాంత పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న మంత్రి రాయచంద్రయ్య ఆశించిన మేరకు ఉద్యమానికి దన్నుగా నిలవలేదని సమైక్యవాదులు విశ్వసిస్తున్నారు. రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టెందుకు చూపిన ఉత్సాహం సమైక్యరాష్ట్రం కోసం చూపించలేదనే ఆరోపణలను రామచంద్రయ్య ఎదుర్కొంటున్నారు. తెలుగుతమ్ముళ్లలో కొరవడిన చిత్తశుద్ధి రాష్ట్ర విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే, మలిముద్దాయి తెలుగుదేశం పార్టీనే అని సమైక్యవాదులు భావిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన తెలుగుతమ్ముళ్లు రాజకీయాలే ధ్యేయంగా వ్యవహరిస్తుండటంపై సమైక్యవాదులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ సంక్షోభం కోసం ముందుగా మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి తేవాలని భావిస్తున్న సమైక్యవాదులు మలిదశలో విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలపై దృష్టి సారించేందుకు సమాయత్తం కానున్నట్లు సమాచారం. సమైక్య రాష్ట్రం సాధన కోసం ఏమాత్రం చిత్తశుద్ధి చూపకుండా ఇతరులపై ఆరోపణలు చేస్తూ రాజకీయాలకే పరిమితం కావడాన్ని సమైక్యవాదులు ఆక్షేపిస్తున్నారు. వైఎస్సార్సీపీలాగా సమైక్యమే అజెండాగా సమైక్యశంఖారావం పూరించాలని కాంగ్రెస్, టీడీపీలపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. జనాగ్రహంకు గురి కాకమునుపే రాజకీయ నేతలు ప్రజానీకానికి దన్నుగా నిలవాలని సమైక్యవాదులు కోరుతున్నారు. -
కదం తొక్కుతున్న సమైక్యవాదులు
సాక్షి, అనంతపురం : సమైక్యవాదులు అవిశ్రాంతంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. లక్ష్యం చేరే వరకు పోరుబాటను వీడేది లేదని ఎలుగెత్తి చాటుతున్నారు. 48వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగాఉద్యమాన్ని హోరెత్తించారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోనూ బలోపేతం చేయాలని సమైక్యాంధ్ర సంయుక్త జేఏసీ కన్వీనర్, డీఆర్ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, తహశీల్దార్లు, ఆర్ఐలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. నగరంలో మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ప్లకార్డులు మెడలో వేసుకుని భిక్షాటన చేశారు. జాక్టో, నీటి పారుదల, పీఏసీఎస్, పంచాయతీరాజ్, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంలోని ఉపాధ్యాయులు తపోవనం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్లపైనే విద్యాబోధన చేసి నిరసన తెలిపారు. 48 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులకు జర్నలిస్టు జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఎస్కేయూలో విద్యార్థుల రిలే దీక్షలు 48వ రోజూ కొనసాగాయి. ఆకుతోటపల్లికి చెందిన వందలాది మంది మహిళలు గ్రామం నుంచి ఎస్కేయూ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ రాస్తారోకో చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు సైతం ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామాంజినేయులు డిమాండ్ చేశారు. ఊరూ వాడ తగ్గని జోరు ధర్మవరంలో ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో సమైక్యాంధ్ర జేఏసీ కో-కన్వీనర్ డాక్టర్ సుమంత్‌కుమార్ గుండెపోటుతో మరణించారు. సమంత్ కుమార్ మృతదేహాన్ని పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉంచి సమైక్యవాదులు నివాళులర్పించారు. పట్టణంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జేఏసీ నాయకులు రోడ్డుపై టీ అమ్ముతూ నిరసన తెలిపారు. గిరిజన మహిళలు రోడ్లపై నృత్యాలు చేశారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించి... వాహనాలను అడ్డుకున్నారు. గుత్తిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. రూ.28,402 వసూలైంది. జేఏసీ ఆధ్వర్యంలో కరిడికొండ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. న్యాయవాదులు జాతీయ రహదారిపై మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ నాయకుల వాహనాలకు దారి ఇవ్వలేదన్న ఉద్దేశంతో వారు.. జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికులు పొర్లుదండాలు పెట్టారు. పామిడిలో సమైక్యవాదులు రోడ్డుపైనే ఆసనాలు వేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు జలదీక్ష చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు రహదారిపై ఆందోళన చేశారు. కదిరిలో చర్చి ఫాదర్లు, క్రెస్తవులు రిలే దీక్షలు చేపట్టారు. రోడ్డుపైనే ఆటా పాట నిర్వహించారు. కదిరి చెరువులో సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు. తలుపులలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు ‘సమైక్యాంధ్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అమరాపురంలో ఉపాధ్యాయులు గడ్డి తింటూ, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఎద్దులబండి లాగి నిరసన తెలిపారు. పెనుకొండలో స్కూటర్ ర్యాలీ, గోరంట్ల, సోమందేపల్లిలో ర్యాలీలు చేపట్టారు. రాయదుర్గంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు.‘కేసీఆర్ వికృతరూపం’ నాటికను ప్రదర్శించారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. కణేకల్లులో ఎన్జీవోలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. రాప్తాడులో ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కల్లూరు, గార్లదిన్నెలో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, మునిసిపల్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య సంఘీభావం తెలిపారు. పెద్దవడుగూరులో జేఏసీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉరవకొండలో విద్యార్థులు రోడ్లపైనే చదువుతూ నిరసన తెలిపారు. గడేహోతూరు, చిన్నహోతూరు గ్రామస్తులు ఉరవకొండకు చేరుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. సమైక్యవాదులు జేసీ దివాకరరెడ్డి బస్సులను అడ్డుకున్నారు. కొనకొండ్లలో పీహెచ్సీ వైద్యులు రోడ్డుపైనే వైద్య పరీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. జీడీపల్లిలో జేఏసీ నాయకులు జలదీక్ష చేశారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. -
23 నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల బంద్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు బంద్ పాటిస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ కార్యదర్శి శేఖర్ ప్రకటించారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు వారం రోజుల పాటు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో పాఠశాలలన్నింటినీ బంద్ చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో వారంలో తొలి మూడు రోజులు పాఠశాలలు బంద్ చేసి మిగిలిన రోజుల్లో పాఠశాలలు నిర్వహించాలని కోరినప్పటికీ రాష్ట్ర జేఏసీ అంగీకరించలేదన్నారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు ఈ నెల 23వ తేదీ వరకు ప్రైవేట్ పాఠశాలలన్నీ యథావిధిగా నడుస్తాయని తెలిపారు. సమైక్య ఉద్యమంలో తాము కూడా కీలక భాగస్వామ్యం పోషిస్తున్నామని ఈ నేపథ్యంలో రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు చేపడుతున్న ఈ బంద్‌కు యాజమాన్యాలు, విద్యార్థులు , ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన కోరారు. -
చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు
-
చైతన్య దీప్తి
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 42వ రోజుకు చేరినా అదేవాడి.. వేడితో సాగింది. సందేశాత్మక ప్రదర్శనలతో వివిధ వర్గాల సమైక్యవాదులు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి రగిలించారు. మాక్ పార్లమెంట్, ఓటింగ్ వంటి కార్యక్రమాలతో ఆలోచన రేకెత్తించారు. ‘తెలుగువారి ఐక్యతను విచ్ఛిన్నం చేసి, సీమాంధ్రుల నుంచి రాజధానిని లాక్కుని పారిపోతున్న కేసీఆర్‌ను ప్రజలు అడ్డుకుని దాడిచేసి గుణపాఠం చెప్పారు. ప్రజల దాడితో సొమ్మసిల్లిన కేసీఆర్‌ను తెలుగుతల్లి చేరదీని హైదరాబాద్ అందరిదీ అని హిత బోధ చేస్తుంది.’ ఇదీ పెద్దాపురంలో బార్ అసోసియేషన్, న్యాయశాఖ ఉద్యోగులు, జేఏసీ ప్రతి నిధులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రదర్శించిన వినూత్న రూపకం ఇతివృత్తం. తెలుగుతల్లి హైదరాబాద్ బొమ్మను పొదివి పట్టుకుని నిలుచుంటే కేసీఆర్ దాన్ని ఎత్తుకు పారిపోతాడు. దీంతో ప్రజలు తిరగబడి కేసీఆర్‌పై దాడి చేస్తారు. అపుడు సొమ్మసిల్లిన కేసీఆర్‌కు తెలుగుతల్లి తాగడానికి నీళ్లు ఇచ్చి, హైదరాబాద్‌ను లాక్కున్నందుకే ఈ గతి పట్టిందని హితబోధ చేస్తుంది. ఈ రూపకం పలువురిని విశేషంగా ఆకర్షించింది. మాక్ పార్లమెంట్, ఓటింగ్ రామచంద్రపురం పట్టణంలో ఉపాధ్యాయులు మాక్ పార్లమెంట్, ఎన్నికలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు, సోనియాకు మధ్య పోటీ పెట్టా రు. వెయ్యిమంది నుంచి ఓట్లు సేకరించగా అం దరూ సోనియాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. రాజమండ్రిలో.. కోటగుమ్మం సెంటర్లో వ్యాపార సంస్థల జేఏసీ దీక్షల్లో ముస్లింలు పాల్గొన్నారు. డీవైఈఓ కార్యాలయంలో హెచ్ఎంల సంఘం దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు, జేఏసీ ఫెడరేషన్ దీక్షలు, మున్సిపల్ ఉద్యోగులు, ఏపీఎన్జీఓలు, మున్సిపల్ కార్మికుల దీక్షలు కొనసాగు తున్నాయి. ఇంటర్మీడియెట్ బోర్డు ఉద్యోగులు ఇన్నీసుపేటలో జూనియర్ కళాశాల ఎదుట దీక్ష లు ప్రారంభించారు. ధవళేశ్వరంలో ఏపీఎన్జీఓలు, కడియంలో బాధ్యత స్వచ్ఛంద సంస్థ, వెలుగుబంటి చారిటబుల్ ట్రస్టు, పేపరుమిల్లు కార్మికుల దీక్షలు సాగుతున్నాయి. కాకినాడలో.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కలెక్టరేట్ వద్ద చేస్తున్న రిలే దీక్షల్లో మంగళవారం ఐడియల్ కళాశాల పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా దీక్షలో పాల్గొన్నారు. దండోరా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజననకు యత్నిస్తున్న దుష్టశక్తుల దిష్టిబొమ్మను కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయ, రిజిష్ట్రేషన్ శాఖల ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, విద్యార్థులు దీక్షలు చేస్తున్నా రు. మత్స్యశాఖ ఉద్యోగులు జగన్నాథపురంలో వంటావార్పు చేపట్టారు. అనుబంధ శాఖల ఉద్యోగులతో ర్యాలీ చేశారు. రమణయ్యపేట వద్ద వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం ఎదు ట జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోనసీమలో... అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బండారులంక అభ్యుదయ కళానికేతన్, అమలాపురం మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు కళారూపాలు ప్రదర్శించారు. వానపల్లిపాలెంలో పంచాయతీ పాలకవర్గం దీక్ష చేపట్టింది. మానవహారంగా ఏర్పడి సభ్యులు నినాదాలు చేశారు. ఎన్.కొత్తపల్లిలో జేఏసీ దీక్ష శిబిరంలో సర్పంచ్ లంకే రామకృష్ణవర్మ 24 గంటల దీక్ష ప్రారంభించా రు. గొల్లవిల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు, భీమనపల్లిలో విద్యార్థులు, అల్లవరం ఎంపీడీఓ కార్యాలయంలో గోడిలంక పంచాయతీ పాలకవర్గం దీక్ష చేసింది. అల్లవరంలో వివిధ రాజకీ య పక్షాల సమావేశం చర్చించింది. ముమ్మిడివరంలో గౌడ సంఘం నిరసన ర్యాలీ జరిపి కేసీఆర్ దిష్టిబొమ్మ దహ నం చేసింది. కొత్తపేటలో జెడ్పీ హైస్కూల్ టీచర్లు, వానపల్లి పీహెచ్సీ వైద్యాధికారిణి సుమలత, మహిళా సిబ్బంది దీక్షల్లో పాల్గొన్నారు. రావులపాలెం, ఆలమూరుల్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ మహా ధర్నా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ మహాధర్నా చేసింది. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజక వర్గాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యం వహించగా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. హైవేపై వంటా వార్పూ నిర్వహించారు. ఆత్రేయపురంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో కళ్లకు గంతలతో 21 మంది సర్పంచ్‌లు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. గొర్రెలతో గొర్రెల కాపరులు నిరసన ప్రదర్శన చేశారు. అంబాజీపేట సెంటర్లో జర్నలిస్టులు దీక్షలు చేశారు. గాడిదకు వినతి పత్రాలు ఇచ్చారు. మామిడికుదురులో పీఈటీలు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై డ్రిల్. యోగాసనాలతో నిరసన తెలిపారు. మలికిపురంలో ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు సాగుతున్నాయి. రాజోలులో రైతులు ర్యాలీ చేశారు. రాజోలు, టేకిశెట్టిపాలెంలో ఉద్యోగ జేఏసీ, తాటిపాకలో పొలిటికల్ జేఏసీల దీక్షలు. మోరి పోడులో యూటీఎఫ్ దీక్షలు సాగుతున్నాయి. మెట్టసీమలో... పెద్దాపురం, సామర్లకోటల్లో తహసీల్దారు కార్యాలయాల వద్ద దీక్షలు కొనసాగుతున్నా యి. సామర్లకోటలో స్కూళ్లు బంద్ అయ్యాయి. అబ్కారీ డిపోకు తాళం వేశారు. పెద్దాపురంలో జేఏసీ, బార్ అసోసియేషన్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. తునిలో జేఏసీ దీక్షల్లో పాన్‌షాప్‌ల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి పాల్గొన్నారు. ఉత్తరాల ఉద్యమం ప్రారంభం రాష్ట్ర విభజన ఆపాలంటూ లక్ష ఉత్తరాలు రాసే కార్యక్రమం పిఠాపురం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యాన గొల్లప్రోలులో ప్రారంభమైంది. ఉపాధ్యాయ పోరాటసమితి నేతలు మహ్మద్ అబ్జలుల్లాఖాన్, మేడసాని సత్యనారాయణలు 72గంటల దీక్ష చేపట్టారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, కొత్తపల్లి, గొల్లప్రోలు సెంటర్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలేశ్వరంలో తొట్టి రిక్షాలు తొక్కుతూ నిరసన తెలిపారు. ఉద్యోగులు బాలాజీ చౌక్‌లో రాస్తారోకో చేశారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడిల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడిలో విద్యార్థులు, గండేపల్లిలో జర్నలిస్టులు, కేబుల్ ఆపరేటర్లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దీక్షల్లో పాల్గొన్నారు. జగ్గంపేట పొలిటికల్ జేఏసీ శిబిరంలో విశ్వబ్రాహ్మణులు, జేఏసీ శిబిరంలో పంచాయతీ కార్యదర్శులు దీక్షల్లో పాల్గొన్నారు. మంత్రి తోట నరసింహం సంఘీభావం తెలిపారు. గండేపల్లిలో దీక్షలను మంత్రి ప్రారంభించారు. జగ్గంపేటలో విశ్వబ్రాహ్మణులు పనిముట్లతో ర్యాలీ చేశారు. రాష్ట్రం ముక్కలైతే ఇంతే... రాష్ట్రం ముక్కలైతే ఉరితాళ్లే గతి ఉంటూ సీతానగరంలో సమైక్య వాదులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యం లో రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండల కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. రాజానగరంలో పంచాయతీ సిబ్బంది దీక్షల్లో పాల్గొన్నారు. అనపర్తి, రంగంపేట, బిక్కవోలు మండల కేంద్రాల్లో, మండపేటలో జేఏసీ దీక్ష లు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం డివిజన్ కాజులూరు, జగన్నాథగిరిల్లో చేసిన వంటావార్పుల్లో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. కె.గంగవరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. రంపచోడవరంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వంటా వార్పు, రాజవొమ్మంగిలో నాయీబాహ్మ్రణులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కోటగుమ్మం సెంటర్లో వాహనాలను కడిగి నిరసన తెలిపారు. బీసీ, ఎస్సీ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలోని దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గ కోఆర్డినేటర్ గొల్ల బాబూరావు, క్రమశిక్షణ సంఘం సభ్యులు బుచ్చిమహేశ్వరరావు, కోఆర్డినేటర్లు గుత్తుల సాయి సంఘీభావం తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై కుర్చీల్లో వినాయక విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. మామిడికుదురులో రిలే దీక్షలలో గెద్డాడ గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు విభాగం రాష్ట్ర సభ్యుడు జక్కంపూడి తాతాజీ, కోఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మత్తి జయప్రకాష్ హాజరయ్యారు. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద హొటళ్ల నిర్వాహకుల సంఘం వంటావార్పు లో వైఎస్సార్ కాంగ్రెస్ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ మద్దతుదారుడు ఐ.కుమార్ ఉప్పురాశిపై కూర్చుని రిలే దీక్ష చేయగా జగ్గిరెడ్డి సంఘీభావం తెలిపారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగున్నాయి. -
వాడవాడలా సమైక్యాంధ్ర ఆందోళనలు

కరెంటు పోతే.. ఇక అంతే!
సాక్షి, రాజమండ్రి : కరెంట్ పోయిందా? అయితే రావడం కష్టమే.. ఇంటి సర్వీసు వైరు ఊడిపోయిందా? ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌ను వెతుక్కోవలసిందే.. ఎందుకంటే బుధవారం అర్థరాత్రి నుంచి విద్యుత్తు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకూ వర్క్‌టు రూల్ ద్వారా నిరసన తెలిపిన ఉద్యోగులు ఇప్పుడిక ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. బుధవారం అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్తు ఉద్యోగులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ సమావేశమై రాష్ట్రనాయకులతో సమాలోచన జరిపింది. సమ్మెకు అన్ని విభాగాల సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ అత్యవసర సేవలు నిలిచిపోతే ప్రజలు ఇబ్బంది పడతారనే అంశంపై చర్చించింది. అధిక శాతం ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్లడంద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సమావేశం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో సమ్మెకు సిద్ధమని ఉద్యోగ సంఘాల జేఏసీ రాత్రి తన నిర్ణయాన్ని ప్రకటించింది. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన 3000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2200 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా 800 మంది కాంట్రాక్టు సిబ్బంది. ప్రస్తుతానికి రెగ్యులర్ సిబ్బంది అందరూ సమ్మె బాట పట్టనున్నారు. ప్రజలకు కష్టకాలం విద్యుత్తు ఉద్యోగుల సమ్మెతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలున్నా యి. విద్యుత్తు సరఫరాలో సమస్యలు వస్తే పునరుద్ధరణ కష్టమవుతుంది. తాగునీటి సరఫరా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. పురపాలక సిబ్బంది కూడా సమ్మెలో ఉండడం తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకూ అవ కాశం లేదు. గృహ విద్యుత్ కనెక్షన్లు పాడైతే బాగుచేసే వారే ఉండరు. సాంకేతిక లోపాలను పరిష్కరించే సిబ్బంది కూడా సమ్మెలో ఉంటారు. ఆస్పత్రుల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే మందుల శీతలీకరణ సమస్యలో పడుతుంది. జనరేటర్‌నే నమ్ముకోవలసి ఉంటుంది. 80 శాతం ఆస్పత్రుల్లో జనరేటర్ నిర్వహణకు నిధులు లేని పరిస్థితులు ఉన్నా యి. కాగా బుధవారం తమ డిపార్టమెంట్ సిమ్ కార్డులను హ్యాండోవర్ చేయాలని విద్యుత్ సిబ్బంది నిర్ణయంచారు. -
'హరికృష్ణకు ఉన్న జ్ఞానం చంద్రబాబుకు లేదు'
రాజంపేట, న్యూస్‌లైన్: టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు హరికృష్ణకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం సిగ్గుచేటని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బస్టాండులో ఆకేపాటి అనిల్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామానికి చెందిన క్షత్రియులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపి, మాట్లాడుతూ సీమాంధ్రలో ప్రజలు, ఉద్యోగులు, వైఎస్సార్ సీపీ నేతలు సమైక్యవాదం కోసం పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం రాజీనామా చేయకుండా, ప్రజలను మరోమారు మోసగించడానికి డ్రామా యాత్ర ఆలోచన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
మనోళ్లకే అండగా ఉందాం: సమైక్యవాదులు
సాక్షి, విజయవాడ: మనకోసం, రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం నిలిచిన వారికిఅండగా నిలబడాల్సిన అవసరం ఉందని, పార్లమెంట్లో తెలంగాణ కోసం బిల్లు పెట్టిన వారిని, సహకరించిన వారిని ఓడిద్దామని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌ను వదిలి వస్తే ఢిల్లీ పీఠం కదులుతుందన్నారు. ముఖ్యమంత్రి కూడా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏఎస్ రామారావు హాలులో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చావేదిక కార్యక్రమానికి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘వైఎస్ కుటుంబం మొత్తం ప్రజల కోసం పాటుపడుతోంది. ఈ వయసులో కూడా రాష్ట్ర సమైక్యం కోసం విజయమ్మ దీక్ష చేస్తున్నారు. వారికి కోటి వందనాలు’ అని చెప్పారు. మునిసిపల్ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ డి.ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి అని దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఆనాడు వైఎస్ అసెంబ్లీ సాక్షిగా ఒక సమస్య పరిష్కరించేటప్పుడు మరో కొత్త సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారని, దీన్ని ప్రభుత్వం ఎందుకు గమనంలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ.. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. హెల్త్ యూనివర్శిటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.నరసింహరావు మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ రాజధానిలోనే ఉన్నందున రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ కార్డులు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఎందుకూ పనికిరావన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు పి.వి.లక్ష్మణరావు మాట్లాడుతూ ఒకప్పుడు మనలో భాగంగా ఉండి, పాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో కలిసి, ఏ మాత్రం ఆదాయం రాని వెనుకబడిన భద్రాచలం ప్రాంతాన్నే వదులుకోవడానికి తెలంగాణవాదులు సిద్దంగా లేరని, అటువంటిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటామని ప్రశ్నించారు. ప్రముఖ న్యాయవాది జగదీశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్ణయాన్ని కేంద్రం ద్వారా ప్రజలపై రుద్దితే సహించబోమని హెచ్చరించారు. కృష్ణాజిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి కోటంరాజు మాట్లాడుతూ వ్యవసాయం చేసేది ఇక్కడైతే ఎన్జీ రంగా యూనివర్శిటీ హైదరాబాద్‌లో ఉందని, కోస్తా తీరం ఇక్కడ ఉంటే వాతావరణ కేంద్రం హైదరాబాద్‌లో ఉందని చెప్పారు. 240 ప్రభుత్వరంగ సంస్థలు, 21 యూనివర్శిటీలు రాజధానిలో ఉన్నాయని చెప్పారు. విభజనపై సోనియా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
ఎన్ని నెలలైనా సమ్మె కొనసాగిస్తాం
* ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టీకరణ * ‘ఆంధ్రుల పౌరుషం’ పేరిట హైదరాబాద్‌లో సమావేశం శ్రీకాకుళం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఎన్ని నెలలైనా సమ్మె కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన శ్రీకాకుళం వైఎస్ఆర్ కూడలిలో నిర్వహించిన ధర్నా, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలు చేస్తున్న ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందన్నారు. ఎన్ని నెలలైనా ఉద్యమం కొనసాగించడానికి ఎన్జీవోలు మానసికంగా సిద్ధమయ్యారని వెల్లడించారు. ‘ఆంధ్రుల పౌరుషం’ పేరుతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడంలేదని, రాజకీయ నాయకులు మాత్రమే స్వార్థం కోసం రాష్ట్రం కావాలంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల ప్రజలకు హైదరాబాద్‌తో విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘ఎస్మా’కు భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. సమైక్యవాదానికి మద్దతు ఇచ్చిన పార్టీలు, నాయకులనే వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపని రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అశోక్‌బాబు అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఏ ఉద్యమమైనా తొలుత ప్రారంభమయ్యేది శ్రీకాకుళం నుంచేనని పేర్కొన్నారు. ప్రపంచంలో, దేశంలో ప్రత్యేక స్థానమున్న ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చాలని చూడడం భావ్యం కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు తమ రక్తాన్ని ధారపోశారని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాకే విభజన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత దొంగ రాజీనామాలు, మీడియాలో ఫోజులివ్వటం వల్ల లక్ష్యం సాధించలేమని స్పష్టం చేశారు. మీడియా, తెలంగాణల్లో గుర్తింపు కోసమే ఎంపీ వి.హనుమంతరావు తిరుపతిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎన్జీవో సంఘం రాష్ర్ట సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, పలు సంఘాల ప్రతినిధులు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నేటి నుంచి విధులు బంద్ విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు స్పష్టంచేశారు. ఇందులో భాగంగా నేటి నుంచి పూర్తిగా విధులు బహిష్కరించనున్నట్టు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో మంగళవారం నుంచి జరగాల్సిన ఎంఎస్సీ మెడికల్ (ఫస్ట్, సెకండియర్) పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. యునానీ డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి, పారా మెడికల్ (నర్సింగ్, ఎంఎల్టీ, ఫిజియోథెరపీ) కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్, ఎంబీబీఎస్/బీడీఎస్ సెకండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ, ఆయుర్వేద, హోమియో, నేచురోపతి కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ మొదలైన వాటిని ఈ నెలాఖరు వరకు వాయిదా వేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్ ప్రాక్టికల్ పరీక్షల మెటీరియల్ ఇప్పటికే ఆయా కళాశాలలకు వెళ్లిన దృష్ట్యా స్థానికంగా ఇబ్బంది లేకపోతే ప్రాక్టికల్స్ జరుపుకోవడానికి ఉద్యోగ జేఏసీ అంగీకరించింది. -
అరెస్టులతో ఆగదు..
* సమైక్య సమ్మెపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు స్పష్టీకరణ * ఉద్యమానికి నాయకుల కొరత లేదు * అన్ని శాఖల్లో ఎస్మా పెట్టినా భయపడం * సీమాంధ్ర ఎంపీల రాజీనామాల కోసమే సమ్మె * ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ * నేటి నుంచి సమ్మెలోకి పశుసంవర్థక శాఖ అధికారులు * 21 అర్ధరాత్రి నుంచి టీచర్లు కూడా... * న్యాయశాఖ ఉద్యోగుల మద్దతు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేయడం లేదని, సీమాంధ్ర ఎంపీల రాజీనామాలే లక్ష్యంగా చేస్తున్నామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పునరుద్ఘాటించారు. 177 జీవో(నో వర్క్ నో పే), ఎస్మా వల్ల సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రత ఒక్క డిగ్రీ కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఎస్మా ప్రయోగించి సమ్మెకు నేతృత్వం వహిస్తున్న నేతలను అరెస్టు చేసినా ఉద్యమం ఆగిపోదన్నారు. ఉద్యమానికి నాయకుల కొరత లేదని చెప్పారు. భయపెట్టి ఉద్యోగుల సమ్మెను ఆపడం సాధ్యం కాదన్నారు. సమ్మె కాలానికి తాము జీతాలు అడిగే ప్రసక్తే లేదన్నారు. అన్ని శాఖల్లో ఎస్మా ప్రయోగించినా భయపడబోమన్నారు. దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, అందరినీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టినా ఉద్యమం ఆగదన్నారు. అంతమందిని పెట్టే జైళ్లు ఉంటే అరెస్టులు చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశం అనంతరం ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడి, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, న్యాయవాది జంద్యాల రవిశంకర్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే వరకు సమ్మె కొనసాగించి తీరుతామన్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సీమాంధ్ర విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికే కౌన్సెలింగ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం మీద రుద్దారంటూ పరోక్షంగా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 2 నెలల జాప్యం జరగడానికి ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. 21 అర్ధరాత్రి నుంచి టీచర్లు కూడా.. ఈనెల 21 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని టీచర్లు నిర్ణయించారని అశోక్‌బాబు తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులూ సమ్మెకు మద్దతు ప్రకటించారన్నారు. వేదిక సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచామన్నారు. కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి, టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, వైఎస్సార్సీపీ నుంచి చల్లా మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి హైదరాబాద్‌లో సభ ఎప్పుడు, ఎక్కడ పెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించడం హైదరాబాద్ సభ లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రతినిధిగా సమావేశానికి హాజరయ్యానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీమాంధ్ర ప్రతినిధే అయినా సమైక్యవాదానికి ఎందుకు మద్దతు ప్రకటించడం లేదు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈనెలాఖరులో హైదరాబాద్‌లో సభ నిర్వహించే అవకాశం ఉందని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మారెడ్డి చెప్పారు. ఈనెల 27న పాలకొల్లులో కళాకారులు, రచయితలకు ‘సమైక్య’ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయనున్నామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు కూడా విధులకు గైర్హాజరయ్యే దిశగా ఆలోచిస్తున్నారని బార్‌కౌన్సిల్ సభ్యుడు చిదంబరం తెలిపారు. ఈనెల 31 వరకు సీమాంధ్రలోని కోర్టుల్లో విధులకు హాజరుకాకూడదని న్యాయవాదులు ఇప్పటికే నిర్ణయించారన్నారు. మరోవైపు పశుసంవర్థకశాఖలో సీమాంధ్ర అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ డెరైక్టర్లు, డిప్యూటీ డెరైక్టర్లు, జాయింట్ డెరైక్టర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. బెదిరేది లేదు... ఏలూరు: తమ శాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించినా బెదిరేది లేదని, సమైక్యాంధ్ర కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొంటామని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.హరనాథ్ ఏలూరులో ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. అత్యవసర సేవలందించే శాఖ కూడా కాని పే అండ్ అకౌంట్స్‌పై సమైక్యవాది అయిన ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం బాధాకరమన్నారు. ఎస్మాకు భయపడం: సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఉద్ఘాటన విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలు ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తోందని, అయితే వాటికి భయపడేదే లేదని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం 3 లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని, ఎవరిపై చట్టం ప్రయోగిస్తారో ప్రభుత్వం నిర్ణయించుకోవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తాం కానీ వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలోని ఐలాపురం హోటల్లో 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 21 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేస్తామని కన్వీనర్ ఎం. కమలాకరరావు ప్రకటించారు. సమ్మెకు వెళ్లడానికి ముందు రిలే దీక్షలు చేపట్టాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు సూచించారు. ఒకటి రెండు సంఘాలు సమ్మెలోకి రాలేదని, వారిని కూడా ఒప్పించి సమ్మెలో పాల్గొనేలా చేస్తామన్నారు. తిరుపతిలో ఎంపీ వీహెచ్‌పై దాడి ఘటనను సమావేశం ఖండించింది. సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల పుల్లయ్య, సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వి.అప్పారావు, డి. ఈశ్వరరావు, డి. గోపీనాథ్, ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరరావు, మణి, జి.వి నారాయణరెడ్డి, గిరిప్రసాద్‌రెడ్డి, 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న నిరసనలు
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ తిరుపతిలో వివిధ రూపాల్లో నిరసన దృశ్యాలు. -
బహిరంగ మార్కెట్లో నింగినంటిన ఉల్లిధరలు
-
ఆకాశంలో ఉల్లి ధరలు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. నింగినంటిన ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. డిసెంబర్ వరకూ ఇలాగే ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ధరలు పెరుగుతూ కిలో రూ.100కు చేరుకునే ప్రమాదం ఉందంటున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉల్లి పంట సాధారణ విస్తీర్ణం 28 వేల హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు కేవలం 13,439 హెక్టార్లలోనే ఈ పంట సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీనిలో ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 10 వేల హెక్టార్లలో పంట సాగువుతోంది. ఉల్లి సాగులో రైతులు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతుండగా 40-60 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. కర్నూలు జిల్లాలో బావులు, బోర్ల కింద మూడు నెలల క్రితం సాగు చేసిన ఉల్లి 20 రోజులుగా మార్కెట్లోకి వస్తోంది. మొత్తం దిగుబడి 12,50,000 క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తుండగా వ్యాపారులు రోజుకు 3000 క్వింటాళ్ల చొప్పున రైతులనుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ సీజన్ లో కర్నూలు జిల్లాలో ఉల్లి వ్యాపారం ప్రస్తుతం ఉన్న రైతుధరల ప్రకారం చూస్తే ఆరుకోట్ల రూపాయలు దాటుతోంది. దేశంలో ఉల్లి అత్యధికంగా పండే మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో ఇక్కడ పండిన ఉల్లిని కొనేందుకు వ్యాపారులు గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర విభజన యోచన నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమ ప్రభావంతో మార్కెట్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో వ్యాపారులు నేరుగా రైతులవద్దకే వెళ్లి సరుకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు ఉల్లి ధర కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.4,760 ఉండగా,తాడేపల్లిగూడెంలో రూ.4,900వరకు ఉంది. అయితే,వ్యాపారులు మాత్రం రూ.4,200 కంటే తక్కువకే రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఉల్లి క్వింటాల్ ధర రూ.7 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీలలో ఉల్లికి డిమాండ్ ఏర్పడటంతో రైతుల నుంచి దళారులు పోటీపడి సరుకును కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన ఉల్లి ధరలు అటు రైతుకు, ఇటు వ్యాపారులకు కాసులపంట పండిస్తున్నాయి. నెల క్రితం క్వింటాలుకు రూ.1000 మాత్రమే ఉన్న ఉల్లి ధర నేడు రూ.4 వేలు దాటడంతో గతంలో ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్ర నష్టాలకు గురైన రైతులకు ఊరట లభిస్తోంది. అయితే, రైతుల నుంచి నేరుగా సరుకును కొనుగోలు చేసి, ప్రజలకు సరఫరా చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో సామాన్యుడి జేబు గుల్లవుతోంది. మార్కెటింగ్ సిబ్బంది సమైక్య సమ్మెలో పాల్గొంటున్న కారణంగా రైతుల నుంచి నేరుగా ఉల్లిని సేకరించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిండుకున్న నిల్వలు : దేశంలోని ప్రజల ఉల్లి అవసరాలను తీర్చడంలో మహా రాష్ట్ర రైతులదే అగ్రస్థానం. భారీవర్షాలతో మహారాష్ట్రలో ఉల్లి పంట తుడిచి పెట్టుకు పోయింది. ముందెన్నడూ లేని విధంగా డిమాండ్ పెరగడంతో ఏప్రిల్‌లోనే అక్కడ ఉల్లి నిల్వలు నిండుకున్నారుు. కర్ణాటకలోని హుబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉల్లి పంట అందుబాటులోకి రాకపోవడం ధరల పెరుగుదలకు మరో కారణం. మధ్యప్రదేశ్, ఇండోర్, రాజస్థాన్, గుజరాత్, పాట్నాలలో ఇంకా ఉల్లి పంట మార్కెట్లకు రాలేదు. ధార్వాడ, బెల్గాం, బీజాపూర్ వంటి ప్రాంతాల నుంచి సరుకు మార్కెట్లకు రావడం లేదు.ఢిల్లీ, పంజాబ్‌లలో డిమాండ్ పెరగడం ఉల్లి ధరల ఆకాశయానానికి దోహదం చేశాయి. డాలర్ ధర పెరగడం కూడా ఉల్లి ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది. దుబాయ్, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా దేశాలకు ఉల్లి ఎగుమతులు ఊపందుకోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కేరళ, తమిళనాడులలో దే శవాళీ రకాలైన తిరువూరు పాయలు, ఇతర నాటురకాలను ప్రపంచంలోని వివిధ దేశాలలో స్థిరపడిన తమిళులు, కేరళీయుల అవసరాలను తీర్చడానికి ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు దళారుల కృత్రిమ కొరత కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.