కర్నూలులో ఈ నెల 30న రాష్ట్రస్థాయి సమైక్య రాష్ట్ర పరిరక్షణ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి తెలిపారు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కర్నూలులో ఈ నెల 30న రాష్ట్రస్థాయి సమైక్య రాష్ట్ర పరిరక్షణ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ ఉద్యోగులు ఈ నెల 30న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఇందుకు దీటుగా కర్నూలులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ బహిరంగ సభ నిర్వహించాలని ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ నిర్ణయించిందన్నారు.
లక్షలాది ఉద్యోగులచే చేపట్టనున్న బహిరంగ సభలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, అన్ని ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎపీ ఎన్‌జీఓ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం, సోమవారం రాష్ట్ర జేఏసీ సమావేశం కొనసాగుతుందన్నారు. జిల్లా నుంచి తనతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశానికి హాజరవుతారన్నారు. 30న జరిగే బహిరంగ సభ విధివిధానాలు ఈ సమావేశంలో ఖరారవుతాయన్నారు.