
350 బస్తాల బియ్యం స్వాధీనం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తిలో శనివారం తెల్లవారుజామున 350 బస్తాల రేషన్‌బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుక్కలనిడిగల్లు మార్గంలోని ఓ గిడ్డంగిలో అక్రమంగా నిల్వ చేయగా పోలీసులు శనివారం తెల్లవారు జామున రహస్య సమాచారం మేరకు దాడిచేసి బియ్యా న్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 350 బస్తాలు ఉన్నాయని వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
ఇది షరామామూలే!
రేషన్ బియ్యం శ్రీకాళహస్తి మీదుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించడం షరామామూలుగా మారిం ది. కొందరు ముఠాలుగా ఏర్పడి లక్షల్లో వ్యాపారాలు సాగిస్తున్నారు. ఏడాది క్రితం రూరల్ ప్రాంతంలో ఇద్ద రు బియ్యం వ్యాపారులను పోలీసులు అదువులోకి తీ సుకుని కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పట్టణంలో మరో నలుగురు ముఠాగా ఏర్పడి మళ్లీ అక్రమవ్యాపారానికి తెరలేపారు. ఆరు నెలలుగా పలుప్రాంతాల నుం చి రేషన్‌బియ్యాన్ని కొనుగోలు చేసి రాజీవ్‌నగర్, నాయుడుపేటరోడ్డు, చుక్కలనిడిగల్లు రోడ్డు మార్గాల్లోని గిడ్డంగుల్లో నిల్వ చేసి ఇష్టారాజ్యంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనికి ఓ కానిస్టేబుల్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
ఆ పోలీస్‌స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు నెలవారీ మామూళ్లు అందించేలా ఒప్పం దం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా ఇటీవల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌బాసులను బదిలీచేశారు. ప్రస్తుతమున్న పోలీస్ ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌తో కమిట్‌మింట్ కాకపోవడం వల్లే అసలు విషయం బయటపడిందని సమాచారం.
గుట్టురట్టుచేస్తాం : సీఐ శ్రీనివాసులు
పేదల బియ్యంతో వ్యాపారాలు సాగిస్తున్న వారి గుట్టురట్టు చేస్తామని వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చుక్కలనిడిగల్లు మార్గంలో రేషన్‌బియ్యాన్ని మరో బ్యాగ్‌లోకి మార్పుచేస్తుండగా పట్టుకున్నామన్నారు. 350 బస్తాల బియ్యంతో పాటు వ్యాపారుడు తాజూద్దీన్‌నూ అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. త్వరలో అక్రమ వ్యాపారానికి చెందిన అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.