గూడూరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద శుక్రవారం ఉదయం రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందిందించి 108కి ఫోన్ చేశారు. 108 హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన రెండు బస్సులను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. దాంతో ట్రాఫిక్ పునరుద్ధరించారు.