ఓ హోటల్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌కు చెందిన ఉద్యోగి ఎం.ఈశ్వర్ రావు మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
విశాఖపట్నం : ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌కు చెందిన ఉద్యోగి ఎం.ఈశ్వర్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల ప్రకారం.. సుభాని అనే పారిశుద్ధ్య కార్మికుడికి మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగం ఇపిస్తానని కొన్ని రోజుల ముందు శానిటరీ ఇన్స్‌పెక్టర్ కొంత నగదును తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా తన వెంట తిప్పించుకున్నాడు.
మరో రూ.10 వేలు తీసుకువస్తేనే పని జరుగుతుందని బాధితుడికి చెప్పాడు. దీంతో బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీకి అధికారులకు తెలియజేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఇన్స్‌పెక్టర్ ఈశ్వర్ రావు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.