మొక్కల లెక్క చిక్కింది
► లాంటేషన్‌కు దూరం..
► స్పాన్సర్ల కోసం వెతుకులాట
► కానరాని ్రప్రూనింగ్
► చేతులెత్తేస్తున్న సర్కార్
విశాఖపట్నం: నగరంలో మొక్కలు నాటే అంశంపై సర్కారు తొలిరోజుల్లో చేసిన ప్రకటనకూ ఇప్పటి కార్యాచరణకూ పొంతన కుదరడం లేదు. లక్షల్లో మొక్కలు నాటుతామని పదేపదే చెప్పి తాజాగా అంకె కుదించింది. హుద్‌హుద్ తుపాను ఫలితంగా నగరంలో ఐదులక్షలకు పైగా వృక్షసంపద నేలమట్టమైన సంగతి తెలిసిందే. దీంతో పచ్చదనం పునరుద్ధరణకు 10లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టుగా సర్కార్ వెంటనే ప్రకటించింది. ప్రణాళికా బద్ధంగా నాటేందుకు గూగుల్ ఎర్త్‌ను ఉపయోగించుకుని పిన్‌పాయింట్స్‌ను గుర్తిస్తామని చెప్పింది. స్పాన్సర్లు ముందు కొస్తున్నారు.. సంతోషం..తాము చెప్పే వరకు ఏ ఒక్కరూ ఒక్క మొక్క కూడా నాటవద్దని కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి నోడల్‌అధికారిగా ఐఎఫ్‌ఎస్ అధికారి చంద్రమోహన్ రెడ్డిని నియమించారు. డివిజన్‌కొక అధికారికి బాధ్యతలు కూడా అప్పగించారు. మొక్కల ఎంపిక బాధ్యతను ఫారెస్ట్, హార్టికల్చర్ డిపార్టుమెంట్‌కు, వాటిని పరిరక్షించే బాధ్యతను జీవీఎంసీకి అప్పగించారు. ఈ సాముహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నవంబర్ 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర, రాష్ర్ట మంత్రులు ప్రారంభింస్తారంటూ ఆర్బాటంగా ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది.
ఇప్పుడు ఆచరణలోకి వచ్చేసరికి నిధులు లేమి సాకుతో సర్కార్ వెనుకడుగు వేస్తుంది. గుంత తవ్వకం, మొక్కనాటడం, ట్రీగార్డు ఏర్పాటుకు ఒక్కొక్క మొక్కకు రూ.వెయ్యి ఖర్చవుతుందని అటవీ శాఖ లెక్కలేసింది. ఈ లెక్కన 10లక్షల మొక్కలు నాటాలంటే వందకోట్లు కావాలి. పోనీ కనీసం మూడవ వంతుమొక్కలనాటే బాధ్యతను స్పాన్సర్లకు అప్పగించినా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కనీసం రూ.60కోట్ల విడుదలచేస్తే కానీ ముందుకు కదలని పరిస్థితి. పైసా ఇచ్చేదిలేదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. శాఖల వారీగా చూసుకోవాలని మెలిక పెట్టింది. ఇప్పటికే పునరావాస కార్యక్రమాల కోసం ఒక్కొక్క శాఖ కోటి నుంచి 2కోట్ల వరకు చేతి చమురువదిలిపోవడంతో ఎవరూ ఈ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. తొలుత 10లక్షల మొక్కలనిచెప్పుకొచ్చిన సర్కార్ ఆతర్వాత లక్షా80వేల మొక్కలని ప్రకటించారు. చివరకు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 62 వేల మొక్కలు, ప్రభుత్వ కార్యాలయలు,సంస్థల్లో మరో 1.18 లక్షల మొక్కలు నాటాలనినిర్ణయించారు.
స్పాన్సర్లు కోసం ఎదురుచూపులు
ఎవరైనా స్పాన్సర్లు ముందుకొస్తే ప్రోత్సహించడం తప్ప చేసేది ఏమీ లేదని ఇప్పటికే మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు. వనప్రేమికు లెవరైనా ముందుకొచ్చి విరాళాలు ఇస్తే ఈ మొక్కలను వారి పేరిటే పెంచుతామని ప్రకటించారు. ఇప్పుడు స్పాన్సర్లు కూడా ఇప్పుడు వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, స్వచ్చంద సంస్థలతో పాటు పర్యావరణ ప్రేమికులు ఇప్పటికే నగరంలో స్వచ్చందంగా పెద్దఎత్తునమొక్కలు నాటుతున్నా ప్రోత్సహించే వారుకరువయ్యారు.నేలకొరగగా మిగిలిన వృక్షాలు, చెట్లను బతికించుకునేందుకు ప్రూడింగ్ చేస్తామని..బ్యాక్టీరియాలను చంపేస్తామని..చిగురించే అవకాశం ఉన్న ప్రతీ చెట్టును బతికించుకుందామని సర్కారు చెబుతూ వచ్చింది. ప్రస్తుతం ఆదిశగాప్రయత్నం కన్పించలేదు.