వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సీఎం పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ వరకు విభజనపై పోరాటం చేస్తానని చెప్పి చివరి క్షణం వరకు లక్షల సంతకాలు పెట్టి రూ. కోట్లు దండుకున్నారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేయడం ద్వారా సమైక్య సింహం ముసుగు తొలగిందన్నారు. తెలుగు జాతి విభజనలో ఏ1 ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి అని అభివర్ణించారు. మీ వ్యక్తిగత స్వార్థం కోసం తెలుగు ప్రజలను ఇంతలా మోసం చేయాలని అంటూ కిరణ్ను సూటిగా ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి నీతి, నిజాయితీలు లేవన్నారు. అవే ఉంటే వెంటనే రాజకీయాలకు స్వస్తి పలకాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం సోనియా, బీజేపీ, చంద్రబాబు, కిరణ్లు ఒకరికొకరు సహకరించుకున్నారని విమర్శించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా పిన్నమ్మ ఎందుకు మాట మార్చిందంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.