సాక్షి, అమరావతి : నీటి బొట్టులేకుండా.. నీడ చెట్టు లేకుండా.. నీరు చెట్టులో రూ. 18 వేల కోట్లు దోచేసిన ఘన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైఫ్‌లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ. 16వేల కోట్ల నుంచి రూ.56 వేల కోట్లకు పెంచేసిన ఘనత టీడీపీది కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నారన్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో 500 కోట్ల రూపాయలు తినేశారని మండిపడ్డారు. ఆలీ బాబా 40 దొంగల్లాగా.. ఆలీ బాబు చోర్ అని 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారు కాబట్టే.. ఆలీ బాబు గారికి 23(ఎమ్మెల్యేలను) మందినే భగవంతుడు ఇచ్చాడని ఎద్దేవా చేశారు.
ఆ ఘనత వైఎస్సార్‌దే
పోలవరానికి 24 పర్మీషన్లు అవసరమైతే 23 పర్మీషన్లను తీసుకొచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు కొనసాగడానికి కారణం కూడా వైఎస్సారేనని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ఏమీ మారలేదని, ఇప్పటికైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. గుంటూరు హాస్పిటల్‌లో ఓ బాలుడు ఎలుకలు కొరికి చనిపోతే ఆ ఎలుకలను పట్టుకోవటానికి ఒక్కో ఎలుకకు లక్షల రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు. 300 ఎలుకలను పట్టుకోవటానికి దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారంటూ మండిపడ్డారు. పోలవరాన్ని సోమవారంగా మార్చి ప్రతి సోమవారం ఓ ఇటుక పేర్చుతూ జాతికి అంకితమివ్వటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment