సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడారు. ' రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ఆరాట పడుతున్నారు. ఎక్కడ టాప్ ర్యాంకులు వస్తాయో అక్కడే చేర్పిస్తున్నారు. పిల్లలను రోబోల మాదిరిగా చేస్తున్నారు. విద్యార్థులకు శారీరక వ్యాయామం అసలు లేకపోవడం వల్ల ఒత్తిడి ఎక్కువైపోతోంది.
వారిని యంత్రాల్లాగా మార్చవద్దు. ఒత్తిడి తగ్గించాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించాము. చదువు చెప్పమంటే పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. అసెంబ్లీ ద్వారా కాలేజీల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నాను. ఎక్కడ విద్యార్థుల ఆత్మహత్య జరిగినా సీరియస్ గా తీసుకుంటా.. ఇలాంటి విషయాల్లో కాలేజ్ మేనేజ్‌మెంట్ తప్పుంటే కఠినంగా శిక్షిస్తా' మని చంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment