
దడ పుట్టిస్తున్న హుదూద్
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ ప్రభావంతో శనివారం ఉదయం నుంచి జిల్లా అంతటా చెదురుమదురుగా వర్షాలుకురిశాయి. సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తీరప్రాంతంలో పెనుగాలులు ప్రారంభమయ్యాయి. తీర ప్రాంతంలో శనివారం వేకువ జాము నుంచే వర్షాలు ప్రారంభమయితే, జిల్లా మొత్తం శనివారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. విజయనగరంలో సాయంత్రం నుంచి వర్షం కురిసింది. ఎస్ కోట నియోజకవర్గంలో గాలులు వీస్తూ, చినుకు లు కురిశాయి. గజపతినగరంలో ఈదురుగాలులు వీచాయి. బొబ్బిలిలో ఉదయం నుంచి గాలులు వీస్తునే ఉన్నాయి. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పార్వతీపురంలో ఉదయం నుంచి గాలులు వీచాయి. తీరప్రాంతంలో సముద్రం అలలు ఎగసిపడుతూ, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు.